రేపు, ఎల్లుండి విశాఖ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ | YS Jagan Meetng With Visakha YSRCP Leaders On Aug 13 And 14th, Check Out The Details | Sakshi
Sakshi News home page

రేపు, ఎల్లుండి విశాఖ నేతలతో వైఎస్‌ జగన్‌ భేటీ

Published Mon, Aug 12 2024 4:28 PM | Last Updated on Mon, Aug 12 2024 6:25 PM

YS Jagan Meetng With Visakha YSRCP Leaders On Aug 13 and 14th

సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోకస్‌ పెట్టారు. ఈక్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్‌ జగన్‌ వరుసగా రేపు, ఎల్లుండి సమావేశం కాబోతున్నారు.

కాగా, విశాఖ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్‌ జగన్‌ దృష్టిసారించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల నేతలు ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నాయకులు జగన్‌ను కలిసేందుకు అవకాశంలేదని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు.

YSRCP కార్యకర్తలకు విజ్ఞప్తి

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement