bosta satyanarayana
-
ఫ్రీ బస్సు ఎక్కడ? నీకు 15, నీకు 15 ఎక్కడ ?
-
విజయం వైఎస్సార్సీపీదే.. విశాఖ ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం
సాక్షి, అమరావతి: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్నీ ఎన్నిక ఏకగ్రీవమైంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. కాగా, స్వతంత్ర అభ్యర్థి షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగీవ్రమైంది.కాగా, విశాఖ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రిట్నరింగ్ అధికారి ఎల్లుండి బొత్స పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.ఇదిలా ఉండగా.. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరి నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. బలం లేకపోవడం.. బలగానికీ ఇష్టంలేకపోవడంతో పోటీలో ఉంటే చిత్తుగా ఓడిపోవడం తప్పదని పార్టీ పెద్దలు గ్రహించారు. అయినా, కుతంత్రాలపై ఆశలు పెట్టుకున్నారు. చివరికి.. సామదానభేద దండోపాయాలను ఉపయోగించారు. డబ్బులతో అయినా ఓట్లు కొనాలని చివరి నిమిషం వరకూ చూశారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల్లో కించిత్తైనా నమ్మకం లేకపోవడంతో కూటమి చేతులెత్తేసి తోకముడిచింది. దీంతో.. ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరకపోవడంతో ఆ పార్టీ ఖాతాలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు చేరింది. బొత్స విజయం లాంఛనంగా మారింది. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఇది తొలిమెట్టుగా రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. -
వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా దుష్ప్రచారం.. ఖండించిన వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఖండించింది. గోబెల్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా? అన్ని ప్రశ్నించింది. బొత్స సత్యనారాయణ నామినేషన్ సందర్భంగా స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతోనే వైవీ సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదని స్పష్టం చేసింది.కాగా, వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా..‘నామినేషన్ వేసేటప్పుడు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రవేశం. స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సుబ్బారెడ్డి లోపలికి వెళ్లలేదు. నిజాలు ఇలా ఉంటే.. దానికి వక్రీకరణలు జోడించి ఎల్లో మీడియా అబద్ధాలు ప్రసారం చేసింది. గోబెల్స్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా?’ అని ప్రశ్నించింది.నామినేషన్ వేసేటప్పుడు నిబంధనల ప్రకారం కేవలం ఐదుగురికి మాత్రమే ప్రవేశం.స్థానిక నేతలకు అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో సుబ్బారెడ్డిగారు లోపలికి వెళ్లలేదు.నిజాలు ఇలా ఉంటే.. దానికి వక్రీకరణలు జోడించి ఎల్లో మీడియా అబద్ధాలు ప్రసారం చేసింది. గోబెల్స్ మీడియా ఎప్పుడైనా నిజాలు చెప్తుందా? pic.twitter.com/m8TrwbOfh3— YSR Congress Party (@YSRCParty) August 12, 2024 -
రేపు, ఎల్లుండి విశాఖ నేతలతో వైఎస్ జగన్ భేటీ
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈక్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లా నేతలతో వైఎస్ జగన్ వరుసగా రేపు, ఎల్లుండి సమావేశం కాబోతున్నారు.కాగా, విశాఖ ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికపై వైఎస్ జగన్ దృష్టిసారించారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఉమ్మడి విశాఖలో ఐదు నియోజకవర్గాలకు చెందిన జడ్పీటీసీ, ఎంపీటీసీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మిగిలిన నియోజకవర్గాల నేతలు ఆయన సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కారణంగా ఇతర నాయకులు జగన్‌ను కలిసేందుకు అవకాశంలేదని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్‌సీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలు.. నామినేషన్ వేసిన బొత్స సత్యనారాయణ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు వైఎస్సార్సీపీకి పూర్తిగా బలం ఉందన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అనైతికంగా కూటమి సర్కార్ ఎందుకు అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని ప్రశ్నించారు.కాగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోమవారం బొత్స సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈరోజు నామినేషన్ వేశాను. మాకు సంఖ్యా బలం ఉంది. వైఎస్సార్సీపీ తప్పకుండా విజయం సాధిస్తుంది. మాకు 530 మందికి పైగా ప్రజాప్రతినిధుల బలం ఉన్నప్పుడు కూటమి అభ్యర్థిని ఎందుకు బరిలో నిలుపుతోంది?. వైఎస్సార్సీపీకి బలం ఉన్నప్పుడు అనైతికంగా ఎందుకు అభ్యర్థిని పెడుతున్నారు.ఒకవేళ టీడీపీ కనుక అభ్యర్థిని నిలబెడితే అది దుశ్చర్య అవుతుంది. ఇదిమే వ్యాపారం కాదు. మోజార్టీ ఉంది కాబట్టే పోటీ చేస్తున్నాం. మాకు నివాదం అవసరం లేదు. రాజకీయాల్లో విలువలు అవసరం. సంఖ్య దగ్గరగా ఉంటే తప్పులేదు. మాకు మెజార్టీ ఉన్నప్పుడు టీడీపీ అభ్యర్థిని నిలబెడుతుందని నేను అనుకోవడం లేదు’ అంటూ కామెంట్స్ చేశారు. -
విజయం వైఎస్సార్సీపీదే.. టీడీపీ బలం 200 మాత్రమే: బొత్స సత్యనారాయణ
సాక్షి, అనకాపల్లి: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ మెజార్టీ ఉంది.. తప్పకుండా విజయం సాధిసస్తామన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. అలాగే, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదన్నారు.కాగా, వైఎస్సార్సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు శుక్రవారం అనకాపల్లిలోని ఎలమంచిలిలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉంది. టీడీపీ కంటే 400 ఓట్లు అధికంగా ఉన్నాయి. వైఎస్సార్సీపీకి 620 పైగా ఓట్లు ఉన్నాయి. టీడీపీకి 200 ఓట్లు బలం మాత్రమే ఉంది. గతంలో టీడీపీ కంటే 50 ఓట్లు తక్కువగా ఉంటే వైఎస్సార్సీపీ పోటీ నుంచి తప్పుకుంది. గత సాంప్రదాయానికి విరుద్ధంగా చంద్రబాబు పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల గౌరవాన్ని కాపాడే బాధ్యత మాది. పెన్షన్ తప్పితే ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదన్నారు.👉మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. టీడీపీకి బలం లేకపోయినా చంద్రబాబు ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో అభ్యర్థిని నిలబెడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.👉మాజీ ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ..‘బొత్స సత్యనారాయణ ఎన్నో గొప్ప పదవులు చేశారు. ఎమ్మెల్సీ అనేది ఆయనకు పెద్ద పదవి కాదు. చంద్రబాబు మోసాలను శాసన మండలిలో ఎండగట్టేందుకు మంచి అవకాశం. ఈ ఎమ్మెల్సీ ఫలితం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు ఎదురుచూస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదిరించడానికి కేఏ పాల్ తప్పితే అందరూ ఏకమయ్యారు. బొత్సను గెలిపిస్తే ఉత్తరాంధ్ర సమస్యల మీదనే కాదు రాష్ట్ర స్థాయి సమస్యల మీద కూడా పోరాటం చేస్తారు’ అని కామెంట్స్ చేశారు. -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం వైఎస్సార్సీపీదే: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: రాజకీయ నాయకులను, ప్రజలను ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటేనని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు.కాగా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులంతా వైఎస్సార్సీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయానికి కృషి చేయాలి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకే సంఖ్యా బలం ఉంది. ప్రలోభాలకు గురి చేయడం కూటమి నేతలకు అలవాటే. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు గురిచేశారు. మా ప్రజా ప్రతినిధులపై మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా అందరూ వైఎస్సార్సీపీకే అండగా ఉంటారు అని చెప్పారు.అంతకుముందు, అనకాపల్లిలోని చోడవరం మాడుగుల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, కరణం ధర్మశ్రీ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎంపీటీసీలు, జడ్పీటీసీలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ..‘ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలో వైఎస్సార్సీపీకి సంపూర్ణ బలం ఉంది. 600 మందికిపైగా సభ్యుల బలం వైఎస్సార్సీపీకి ఉంది. కేవలం 200 మంది సభ్యుల బలం మాత్రమే కూటమికి ఉంది. ప్రలోభాలతో గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. చంద్రబాబు మోసం ప్రజలకు తెలియాలి. దేశంలో రాష్ట్రం దివాళా తీసిందని మాట్లాడే వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. రాజకీయాల్లో 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియదా?. వైఎస్సార్సీపీ సభ్యులు తప్పు చేస్తే చర్యలు తీసుకోవచ్చు కదా?. చంద్రబాబు అబద్ధాలను ప్రజలు ఎన్నో రోజులు నమ్మరు అంటూ కామెంట్స్ చేశారు.ఇక, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్‌ను సోమవారం సాయంత్రం కలెక్టర్ విడుదల చేశారు.షెడ్యూల్ ఇలా.. ఈనెల 30 ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక.రేపటి నుంచి అమలులోకి నోటిఫికేషన్.ఈనెల 13వ తేదీ నామినేషన్లకు ఆఖరు తేదీ.14న నామినేషన్ల స్క్రూన్నీనామినేషన్ల ఉపసంహరణకు 16వ తేదీ వరకు గడువు.ఈనెల 30న ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్.సెప్టెంబర్ 3న కౌంటింగ్.రేపటి నుంచి సెప్టెంబర్ 6వ తేదీ వరకు ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలు.ఇప్పటికే తమ అభ్యర్థిని ప్రకటించి ఎన్నికలకు సిద్దమైన వైఎస్సార్సీపీ. -
బాబు.. విశాఖలో బ్రెజిల్ డ్రగ్స్ కంటైనర్ కేసు సంగతేంటి?: మాజీ మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సమయంలో విశాఖపోర్టుకు అక్రమంగా బ్రెజిల్ నుంచి వచ్చిన మాదకద్రవ్యాలతో కూడిన కంటెయినర్ కేసు ఏమైందో ప్రభుత్వం విచారణ చేపట్టాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. సుమారు 25 కిలోల చొప్పున వేయి బ్యాగులను కంటెయినర్లో మాదకద్రవ్యాలతో కూడి సరుకు విశాఖ పోర్టుకు రాగా... కేంద్ర దర్యాప్తుసంస్ధ సీబీఐతో పాటు ఇంటర్‌పోల్ పట్టుకున్న విషయాన్ని బొత్స గుర్తుచేశారు.గతంలో మేం అధికారంలో ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని.... ఆరోపణలు కూడా చేశారని... అధికార పక్షంతో పాటు విపక్షంలో ఉన్నవారు కూడా వీటిపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారన్నారు. ఈ వ్యవహరంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి బంధువులకు చెందిన సంధ్యా ఆక్వా ఎక్ట్స్పోర్ట్ లిమిటెడ్ సంస్ధ దిగుమతి చేసుకున్నారన్న ఆరోపణలు వచ్చిన విషయాన్ని బొత్స గుర్తుచేశారు.ఈ మొత్తం వ్యవహారంపై ఒకవైపు అధికారులు విచారణ చేపట్టడంతో పాటు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపధ్యంలో ఉత్తరాంధ్రాకు చెందిన ఎంపీలు దీనిపై పార్లమెంట్లో ప్రశ్నించాలని ఆయన డిమాండ్ చేసారు. రూ.25వేల కోట్లకు సంబంధించిన వ్యవహారంపై వాస్తవాలు ఏమిటి? ఇందులో ఎవరిపాత్ర ఉంది? నిందితులను ఎందుకు ఉపేక్షిస్తున్నారో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ విచారణలో ఆ ఆరోపణలు వాస్తవం కాకపోతే విశాఖపట్నం క్లీన్ ఇమేజ్ నిలబడుతుందన్నారు.దేశంలో ఎక్కువగా డ్రగ్స్ దిగుమతి అయిన చరిత్ర గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న పోర్టులకు ఉంద తప్ప.. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎప్పుడూ ఇలాంచి ఘటనలు జరగలేదన్నారు. దీన్ని రాజకీయ కోణంలో చూడరాదన్నారు. విశాఖలో తొలిసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నప్పుడు... అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్ధానికనాయకత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని, పార్లమంటు సభ్యులైతే పార్లమెంటులో ఈ అంశాన్ని లేవనెత్తి విచారణకు డిమాండ్ చేయాలని సూచించారు. ఈ విషయంలో ఏ పార్టీ మీద బురదజల్లడం లేదని... నిజంగా ఇక్కడి ప్రజాప్రతినిధులు విశాఖపట్నంతో పాటు రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా మాదకద్రవ్యాల దిగుమతిపై సమగ్రమైన విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.మరోవైపు ఎన్నికలు అయిన దగ్గర నుంచి భూఆక్రమణలు జరిగాయని కొందరు, మరికొందరైతే దసపల్లా భూముల గురించి దోపిడీకి గురయ్యాయంటూ వార్తలు వచ్చిన విషయాన్ని బొత్స ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో గతంలో హుద్‌హుద్ తుఫాను తర్వాత వచ్చిన భూకుంభకోణాన్ని ప్రస్తావించారు. హుథ్‌హుథ్ తుఫాను వచ్చిన తర్వాత ఆ రోజు ఉన్న అధికార తెలుగుదేశం పార్టీలో ఉన్నవారే భూ కుంభకోణంపై పరస్పర ఆరోపణలు చేసుకోగా.. అప్పటి టీడీపీ ప్రభుత్వం దానిపై సిట్ ఏర్పాటు చేసి ఏడాది పాటు దర్యాప్తు చేశారన్నారు. ఆ తర్వాత అనేకరకాల పరిణామాలు చోటుచేసుకుని.. దర్యాప్తునకు సంబంధించిన టెర్మ్స్ ఆఫ్ కండిషన్స్ మార్పు చేసి 2004 నుంచి కూడా విశాఖపట్నం ప్రాంతంలో జరిగిన భూ ఆక్రమణలు గురించి కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయించారని తెలిపారు. అంటే 2004 నుంచి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రులగా మేం ఉన్న నేపధ్యంలో ఆ అంశాన్ని కూడా తెరపైకి తెచ్చారన్నారు.అయితే ఇప్పుడు విశాఖలో భూఆక్రమణలు అంశం మరలా తెరపైకివచ్చిన నేపధ్యంలో.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో నియమించిన సిట్ దర్యాప్తును మరలా కొనసాగించాలన్నారు. అలా చేస్తే ఎవరు తప్పు చేశారో తేలిపోతుందని.. అప్పుడే ఉత్తరాంధ్రా ప్రజలకు దొర ఎవరో, దొంగెవరో తెలుస్తుందని బొత్స స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం దేనిమీదైనా విచారణ చేసుకోవచ్చన్నారు. అప్పుడు ఈ సందిగ్దతకు తావులేకుండా తప్పుచేసినవాళ్లెవరో తేలిపోతుందన్నారు. ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కాబట్టి... విచారణకు ఆదేశించుకోవచ్చన్నారు. తప్పుచేసినవారు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారని.. లేని పక్షంలో ఒకవేళ తప్పుడు అభియోగాలైతే కోర్చుల్లో తేల్చుకుంటారని స్పష్టం చేసారు. అలా కాకుండా పదే పదే మీడియా ముందుకు వచ్చి భూముల కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించడం సరికాదన్నారు. -
తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై బొత్స ఆసక్తికర ట్వీట్
సాక్షి, తాడేపల్లి: రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక సూచనలు చేశారు. ఈ భేటీపై పారదర్శత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి సీఎంల సమావేశం ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరారు.కాగా, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా..‘విభజన సమస్యల పరిష్కారానికి నేడు రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 1.విభజన సమస్యల పరిష్కారానికి ఇవాళ 2 రాష్ట్రాల CMల సమావేశం నేపథ్యంలో పోర్టుల్లో, టీటీడీ ఆస్తుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్టుగా వస్తున్న వార్తలు AP ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.— Botcha Satyanarayana (@BotchaBSN) July 6, 2024 ఈ నేపథ్యంలో పారదర్శకత కోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. 2.పారదర్శకతకోసం, ప్రజలకు వాస్తవాలు తెలియడానికి ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్షప్రసారం చేస్తే బాగుంటుందని నా సూచన. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నాను.— Botcha Satyanarayana (@BotchaBSN) July 6, 2024 -
ఏపీ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా కూటమి ప్రచారం
సాక్షి, విశాఖపట్నం: ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగిందన్నారు.కాగా, మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతిష్టను దెబ్బ తీసేలా కూటమి నేతలు ప్రచారం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారు. ఈసైన్ ద్వారా, ఆధార్ అతంటికేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మెమోలో ఉన్నది ఒక్కటైతే.. విపక్షాలు మరొకటి ప్రచారం చేస్తున్నారు.దేశమంతా ఈ చట్టం అమలు చేయాలని కేంద్రప్రభుత్వమే సూచించింది. వివాదాలకు తావులేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రూపకల్పన జరిగింది. దళారి వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నాము. భూమి పేపర్లకు జిరాక్స్ పేపర్లు ఇస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధం. ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోనే వాళ్లం. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రలకు సలహాలు సూచనలు ఇచ్చింది. ఇంకా యాక్ట్ రాలేదు, రాని యాక్ట్‌ను తొలగిస్తామని చంద్రబాబు చెబుతున్నాడు.యాక్ట్‌పై అమలు చేసే ముందు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తాము. చంద్రబాబు, పవన్, రామోజీరావు, రాధాకృష్ణ క్రిమినల్స్‌లాగా మాట్లాడుతున్నారు. ప్రజల ఆస్తులకు మరింత రక్షణ కల్పించాలనేది సీఎం జగన్ ఆలోచన. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై మూడు సార్లు అసెంబ్లీలో చర్చ జరిగింది.2014లో చంద్రబాబు 50 పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. సీఎం జగన్ నాలుగు పేజీలతో మేనిఫెస్టో విడుదల చేశారు. వైఎస్సార్సీపీ పథకాలను, మేనిఫెస్టో పేజీలను చంద్రబాబు కాఫీ కొట్టారు. టీడీపీ మేనిఫెస్టో చెత్త బుట్టలో వేయడానికి తప్ప దేనికి పనికి రాదు. టీడీపీ మేనిఫెస్టోపై మోదీ, పురంధేశ్వరి బొమ్మలు ఎక్కడ ఉన్నాయి. మంచి పని చేస్తున్న సీఎం జగన్ ఫోటో సర్వే రాళ్ళు మీద వేస్తే తప్పేంటి’ అని కామెంట్స్ చేశారు. -
మంత్రి బొత్స సత్యనారాయణ Vs కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
-
ఓటుకు నోటు కేసుపై బొత్స సంచలన వ్యాఖ్యలు
-
పేదవాళ్ల లబ్ధిపై టీడీపీ కుట్రల రాజకీయం: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: వలంటీర్లపై చంద్రబాబు కుట్రచేసి పేదలకు పెన్షన్ అందకుండా చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడి పొట్ట కొట్టడం ధర్మమేనా అని బొత్స ప్రశ్నించారు. పేదవాడికి వచ్చే లబ్దితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోందని ఫైరయ్యారు. కాగా, మంత్రి బొత్స ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు అనుచరులు వలంటీర్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు లబ్ధిదారులకు పెన్షన్ ఎవరు ఇస్తారు?. ఇప్పటికి ఇప్పుడు వారికి బ్యాంక్ ఖాతాలు తెరిచి పెన్షన్ వేయాలంటే వీలు అవుతుందా?. పేదవాడికి వచ్చే లబ్ధితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోంది. ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి డీఎస్సీ పరీక్షను కూడా అడ్డుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే డీఎస్పీని ప్రకటించాం. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలను ఫాలో అవుతాం. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం డీఎస్పీ పరీక్ష నిర్వహిస్తాం. ప్రతిపక్షం తీరు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకున్నారు. సామాజిక సాధికారత ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ మొదలైంది. ఉత్తరాంధ్రలో అన్ని ఎంపీ స్థానాల్లో బలహీన వర్గాలకే వైఎస్సార్సీపీ అవకాశం కల్పించింది. వారితో ఉత్తరాంధ్రతో ఏం సంబంధం.. బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఓసీలకు టీడీపీ కూటమి టికెట్లు ఇచ్చింది. ఒక్క వర్గం కిందనే ప్రజలంతా ఉండాలని చంద్రబాబు కోరుకుంటాడు. ఏ వర్గానికి చెందిన మేలు ఆ వర్గం వారే సాధించుకోవాలని సీఎం జగన్ ఆలోచన చేశారు. పవన్‌కు ఇచ్చిన రెండు ఎంపీ సీట్లు కూడా బీసీకి కేటాయించలేదు. బీజేపీ కూడా అదే పంధాలో వెళ్లింది. ఆయా పార్టీలకు ఉత్తరాంధ్ర ప్రజలపై చిన్నచూపు ఉంది కాబట్టే ఎక్కడో ఉన్న వారిని ఇక్కడ అభ్యర్థులుగా పెడుతున్నారు. ఎవరు ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు కాదనను. ఈ విషయంలో ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచన చేయాలి. వారికి ఈ ప్రాంతంలో సంబంధమే లేదు. ప్రశాంత ఉత్తరాంధ్ర వాతావరణాన్ని పాడు చేయడానికి లాభయిస్టులను తీసుకువచ్చి అభ్యుర్థులుగా పెడుతున్నారు’ అని వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్‌పై కూటమి ఏం చెబతుంది? స్టీల్ ప్లాంట్ అంశం కేంద్ర పరిధిలోనిది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న పార్టీతో ఇప్పుడు ఎవరు కలిశారు. నాడు పాచిపాయిన లడ్డులు ఇచ్చారని అన్న పవన్ ఇప్పుడు వారితో కలిశాడు. స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు కూటమి ఏం చెప్తుంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని బీజేపీ ప్రకటన చేయాలి.. ఇది మా డిమాండ్. స్టీల్ ప్లాంట్‌పై సమాధానం చెప్పకుండా వారు ఇక్కడ ప్రచారం చేయడానికి అర్హత లేదు. సెక్యూరిటీ కోసమే బీజేపీతో పొత్తు.. ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందోనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకుంది. చంద్రబాబు ఆయన కొడుకు భయపడి జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసుకున్నారు. ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారు. లోకేష్ కంటే నేను ఎక్కువ కాలం మంత్రిగా పని చేశాను. నాకెందుకు అంత సెక్యూరిటీ లేదు. బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు. -
మార్చి 15 నుంచి 30 వరకూ డీఎస్సీ పరీక్షలు
-
AP DSC Notification: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
-
రెడ్ బుక్ ఎందుకు.. లోకేష్‌కు మంత్రి బొత్స కౌంటర్
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ, జనసేన పార్టీ కలయికపై సెటైరికల్ కామెంట్స్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. జనసేన-టీడీపీ కలయిక చారిత్రాత్మక అవసరమన్నారు. 2014లో వీరిద్దరూ కలవలేదా?. అప్పుడు చారిత్రాత్మక అవసరం కాదా? అప్పుడు మూడు పార్టీలు కలిశాయి కదా.. అప్పుడేమైందని బొత్స ప్రశ్నించారు. కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ..‘నారా లోకేష్‌కు రెడ్ బుక్ ఎందుకు?. ప్రజాస్వామ్యంలో బ్లూ బుక్ ఉండాలి.. రెడ్ బుక్ కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వినాలి.. పరిష్కరించే ఆలోచన చేయాలి. ఇదేమీ రాచరికం కాదు. పుంగనూరు ఘటనలో బాధ్యులు ఎవరు.. చంద్రబాబు కాదా?. 2014 ఎన్నికల్లో వీరంతా పొత్తులు పెట్టుకున్నారు. కొంత కాలం విడాకులు ఇచ్చి మళ్లీ కలిశారా?. రాజకీయ అవసరం కోసం పార్టీలు కలవడం తప్పు కాదు. గతంలో ఈ కలయికతో ప్రజలను మోసం చేశారు. అందుకే ఇప్పుము మేము.. టీడీపీ-జనసేన కలయికను తప్పు పడుతున్నాం. యజ్ఞాన్ని మాంసం ముక్క వేసి చెడగొట్టినట్టు విశాఖ రాజధానిని అడ్డుకుంటున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు అథారిటీ టెండర్‌ను ఎవరు రద్దు చేశారు. అప్పటి మంత్రి కాదా?. కేసులను పరిష్కరించి భోగాపురం విమానాశ్రయం పనులను మా ప్రభుత్వం ప్రారంభించింది’ అని కామెంట్స్ చేశారు. -
‘పేదలకు ఇండ్లు ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదే’
సాక్షి, ఇచ్చాపురం: వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఇఛ్చాపురంలో జెండా ఊపి బస్సు యాత్రను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేరుగు నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు పాల్గొన్నారు. ఇక, బస్సు యాత్ర సందర్భంగా ఇచ్చాఫురం బహిరంగ సభలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ.. అవినీతి లేకుండా ప్రజలకు సంక్షేమ పలాలు డైరెక్ట్‌గా ఇస్తున్నాం. ప్రజలు అది గమనించాలి. ఒకేసారి 32 లక్షల మందికి ఇళ్లు ఇస్తే చిన్న స్థలం ఇచ్చారని చంద్రబాబు అనడం హాస్యాస్పదం. టీడీపీ నేతలకు మాట్లాడే అర్హత లేదు. అవినీతి లేకుండా చేసిన ఘనత మన ప్రభుత్వానిదే. ఏ ఒక్కరూ తలవంచకుండా ఆత్మగౌరవంతో పేద ప్రజలు ఉన్నారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే రాష్ట్రానికి చంద్రబాబు ఏం చేశాడు. రాష్ట్రం కోసం చంద్రబాబు కష్టపడుతున్నాడు అనడం హాస్యాస్పదంగా ఉంది. సిల్క్ కుంభకోణం కేసులో చంద్రబాబు అన్ని ఆధారాలతో దొరికిపోయాడు. ఈడీ, ఐటీల వద్ద స్కిల్ స్కామ్‌కు సంబంధించిన వివరాలున్నాయి. వెనుకబడిన ఈ ప్రాంతాన్ని అభివృద్ది చేయడంలో బాబు ఫెయిల్ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాకే ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఇటువంటి ప్రభుత్వం కొనసాగించాల్సిన బాధ్యత మీపై ఉంది. రాబోయే ఎన్నికలు మనకు ఓ సవాల్. ఇక్కడ ఇంకా చాలా మందికి మంచి మంచి పదవులు రాబోతున్నాయి. అన్ని కులాలను సమానంగా చూస్తున్నాం.. రాబోయే ఎన్నికల్లో ఇచ్ఛాపురంలో మనం గెలవాలి. పేదలకు ఇల్లు ఇచ్చిన ఘనత మాదే. మంచి భవిష్యత్తు ఉండాలని బడి, వైద్యం, విద్య అందించాం. స్వార్ధం కోసం వచ్చే వారిని దూరం పెట్టాలి అని పిలుపునిచ్చారు. ఇచ్చాపురం క్యాడర్ అందరూ పనిచేయాలని కోరారు. సభలో మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మత్స్యకార సోదరులారా మన సమస్య మీద చంద్రబాబునాయుడు వద్దకు వెళితే మీ డొక్కా తీస్తా, తోలుతీస్తా అని బెదిరించారు. గడిచిన ఎన్నికల్లో తొక్కతీసి ఇప్పుడు రాజమండ్రి జైల్లో చిప్పకూడు తినిపించాం. ఎస్సీ, ఎస్టీలో పుట్టడానికి మనం కోరుకుంటామా అని చంద్రబాబు అన్నారు. కానీ, మన ప్రభుత్వంలో దళితుడే ఉప ముఖ్యమంత్రి అయ్యారు. బీసీలు జడ్జీలుగా పనికిరారని చంద్రబాబు ఆనాడు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. అటువంటి చంద్రబాబుని క్షమించకూడదు. వైద్యం, విద్యను పూర్తిగా చంద్రబాబు నిర్వీర్యం చేశారు.. బహిరంగ సభలో మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. దళిత ద్రోహి చంద్రబాబు నాయుడు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు తలెత్తుకు ఉన్నారంటే మన సీఎం జగన్ వల్లే. పేదవాడు, దళితులు, మైనార్టీలు విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం జగన్ వచ్చాక స్థితి గతులు పెరిగి కార్పోరేట్ వైద్యం పేదలకు అందించారు. విద్యలో ఇంగ్లీష్ మీడియం పెడితే చంద్రబాబు కోర్టుకు వెళ్లి ఆపాలని చూశారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి కావడం వల్లే మన కులాలు మంచి స్థితిలో ఉన్నాయి. పేదల పక్షపాతి సీఎం జగన్.. పెత్తందార్ల పక్షపాతి చంద్రబాబు అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
అసత్య ప్రచారంపై ఏపీ మంత్రి బొత్స ఫైర్
సాక్షి, విజయవాడ: ఏపీలో విద్యా వ్యవస్థలో మార్పులపై అసత్య ప్రచారం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు . విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తున్నాం. ప్రభుత్వం మంచి చేస్తుంటే ప్రతిపక్ష నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘పేదవాళ్లు పేదవాళ్లుగానే ఉండాలనేది ప్రతిపక్షాల భావన. ఏపీ విద్యార్థులు ప్రపంచస్థాయిలో పోటీ పడాలనేదే మా లక్ష్యం. విద్యావ్యవస్థలో పెను మార్పులు తీసుకొస్తున్నాం. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు ఓపెన్ టెండర్ ద్వారానే తీసుకున్నాం. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కృషి చేస్తున్నాం’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘బాబు బాధలో ఉంటే బాలకృష్ణ మూవీ రిలీజ్ చేస్తారా’ -
‘బాబుకు అనారోగ్యమంటూ ఎందుకీ డ్రామాలు?: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలవి తప్పుడు ప్రచారాలంటూ కొట్టిపారేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. శనివారం ఆయన విజయనగరంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ అనుకూల మీడియాలో ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి బొత్స ఇంకా ఏమన్నారంటే ఆయన మాటల్లోనే.. పచ్చనేతల పైశాచికానందం: నాకు రోజూ చాలా మంది ఫోన్ చేస్తుంటారు. దాదాపు అన్ని కాల్స్ నేను అటెండ్ చేస్తాను. నిన్న రాత్రి 9.30కి వచ్చిన కాల్‌ను లిఫ్ట్ చేస్తే.. తాను చంద్రబాబు అభిమానినంటూ ఒకరు నాతో మాట్లాడారు. జైల్లో బాబు అనారోగ్యం పాలయ్యారని, కాబట్టి ఆయనను ఎలాగైనా బయటకు తీసుకురావాలంటూ.. ఏడుస్తూ మాట్లాడాడు. ఆ ప్రచారం అసత్యమని, జైల్లో బాబు ఆరోగ్యంగానే ఉన్నారని, అయినా ఆయన్ను బయటకు తీసుకురావడం తన చేతిలో లేదని చెప్పాను. ఒకవేళ బాబు నిజంగా జైల్లో అనారోగ్యం పాలైతే, వారు కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పాను. దాంతో ఆ వ్యక్తి సమాధానపడి ఫోన్ పెట్టేశాడు.. కానీ ఆ తర్వాత చూస్తే.. నా ఫోన్‌కాల్ మాటలు మీడియాలో ప్రసారం అయ్యాయి. అంటూ.. ఒక ఛానల్లో ప్రసారమైన తన ఫోన్ కాల్ మాటలను ఈ సందర్భంగా మంత్రి మీడియాకు చూపించారు. మరి ఆ కాల్ చేసింది ఎవరు? టీడీపీ నేతలా? లేక బాబు కుటుంబ సభ్యులా? ఎవరు చేయించినా.. నేను అటెండ్ చేసిన కాల్‌ను ఎలా రికార్డు చేశారు? ఆ హక్కు వారికెవరు ఇచ్చారు? ఇదేం పైశాచికం?. దిగజారిన రాజకీయం: రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు ఆరోగ్యంగానే ఉన్నారు. ఉక్కపోతతో ఒంటిపై కాస్త ర్యాష్ ఏర్పడింది. ఈ విషయాన్ని జైళ్ల శాఖ డీఐజీ నిన్న మీడియాకు స్వయంగా చెప్పారు. అంతే కాకుండా చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నట్లు.. ఎల్లో మీడియా అదే పనిగా ప్రసారం చేస్తున్నట్లు.. జైల్లో ఒకవేళ నిజంగా చంద్రబాబు అనారోగ్యం పాలైతే.. ఆయనను ఆస్పత్రికి తరలించాలంటూ టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించవచ్చు కదా? ఆ పని చేయకుండా అదేపనిగా మీడియా ముందు ఎందుకు మాట్లాడుతున్నారు? మాపై ఎందుకు నిందలు మోపుతున్నారు? టీడీపీ ఇంత దిగజారిన రాజకీయం చేయాలా?. ఆ పార్టీ నేతలు ఇంత దౌర్భాగ్యపు పనులకు పూనుకుంటారా?. జైల్లో చంద్రబాబుకు ఏదో జరిగిపోతుందని అదే పనిగా విష ప్రచారం చేస్తూ.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి.. ఎలాగైనా సానుభూతి పొందాలన్న కుయుక్తి టీడీపీ నేతల్లో కనిపిస్తోంది. భిన్న వాదనలతో.. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వ ఖజానాను అడ్డంగా దోచుకున్న చంద్రబాబు ఆధారాలతో సహా దొరికిపోయాడు. ఈ విషయం అందరికీ తెలుసు. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు ప్రమేయంపై ప్రాధమిక సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నాయి కాబట్టే, కోర్టు ఆయనను జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపించింది. ఈ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారంటున్న ఆయన కుటుంబ సభ్యులు, ఆ పార్టీ నాయకులు.. అదే విషయాన్ని కోర్టులో సవాల్ చేయడం లేదు. అంటే ఒకవైపు లోపాయకారిగా చంద్రబాబు అవినీతిని వారు అంగీకరిస్తున్నారు. కానీ అదే సమయంలో ఏసీబీ కోర్టు మొదలు, హైకోర్టు.. చివరకు సుప్రీంకోర్టు వరకు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కేసు లోపలకు వెళ్లకుండా, కేవలం చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్నే తప్పు పడుతూ వాదిస్తున్నారు. జిమ్మిక్స్‌తో లబ్ధికి డ్రామా: ఇది ఒక పర్వం కాగా.. గత రెండు మూడ్రోజులుగా చంద్రబాబు ఆరోగ్యంపై వారు కొత్త డ్రామా మొదలు పెట్టారు. వారు చేస్తున్న నానా హంగామా.. దానిపై పచ్చ మీడియాలో మితిమీరిన రాద్ధాంతం.. అన్నీ విడ్డూరంగా ఉన్నాయి. తప్పు చేసిన వ్యక్తికి కోర్టు రిమాండ్ చేశాక.. ఆ వ్యక్తికి జైల్లో జబ్బు చేసినా, ఆ వ్యక్తి అనారోగ్యం పాలైనా.. విషయాన్ని కోర్టుకు విన్నవించాలి. మెరుగైన వైద్యం కోరాలి. అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఆ వ్యక్తికి తగిన వైద్యం అందుతుంది. కానీ చంద్రబాబు కానీ, టీడీపీ నాయకులు కానీ ఆ పని చేయడం లేదు. టీడీపీ నేతలు అదే పనిగా పచ్చ మీడియాలో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌తో సానుభూతి పొందాలని చూస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లుతారా?: ఖజానాను అడ్డంగా దోచుకున్న చంద్రబాబు వంటి దొంగను సాక్ష్యాధారాలతో సహా పట్టుకుంటే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారు. ఒకవేళ చంద్రబాబు జైల్లో అనారోగ్యం పాలైతే.. అందులో ప్రభుత్వ బాధ్యత ఏముంటుంది? టీడీపీ నేతలు, ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించినంత మాత్రాన ప్రభుత్వం వెళ్లి రాజమండ్రి జైల్లో ప్రత్యేక వసతులు కల్పించలేదు కదా? ఏదైనా కోర్టు ద్వారా రావాల్సిందే కదా? ఇక్కడ ప్రభుత్వ పాత్ర ఏమీ ఉండదు కదా? లేక కోర్టు ఆదేశాలు లేకపోయినా, జైలు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని అన్నీ సమకూరుస్తారని ఆశపడుతున్నారా? రాష్ట్ర ఖజానాకు కన్నమేసి ప్రజాధనం రూ. 371 కోట్లు కొట్టేసిన దొంగగా అన్నీ సాక్ష్యాధారాలు సేకరించి చంద్రబాబును కోర్టు ముందు దోషిగా నిలబెట్టడమనేది ప్రభుత్వం చేసిన తప్పా? కేసు కోర్టు వరిధిలో ఉండగానే.. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని, ఆయన నిర్దోషి అని టీడీపీ నేతలు, బాబు కుటుంబ సభ్యులు ఎలా నిర్ధారిస్తారు? అలా ఎలా మాట్లాడతారు?. వారి వాదనలను ప్రజలూ అసహ్యించుకుంటున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి?: నేరానికి సంబంధించిన నింద పడ్డప్పుడు రైట్ రాయల్‌గా న్యాయవ్యవస్థలో పోరాటం చేసి నిజాయితీని నిరూపించుకోవడం ఒక ధీరుడి లక్షణం. చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు పంపితే.. లోకమంతా తిరగబడ్డట్టూ.. దైవాంశ సంభూతుడ్ని కటకటాల వెనక్కి నెట్టినట్లు ఊరంతా గోల చేయడమేంటి? దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? పరామర్శల పేరుతో పండగలు: రాజమండ్రిలో బస చేసిన అత్తా కోడళ్లు.. భువనేశ్వరి, బ్రాహ్మణిని పరామర్శ పేరుతో పూటకొకరు కలుస్తున్నారు. దీంతో అక్కడ పరామర్శల పేరిట పండగ చేసుకుంటున్నారు. అంటూ.. తమ పరామర్శకు వచ్చిన పార్టీ నేత అశోక్ గజపతిరాజును భువనేశ్వరి, బ్రాహ్మణి ఎంతగా నవ్వుకుంటూ పలకరిస్తున్నారో.. అప్పుడు వారు ఎంత ఉల్లాసంగా కనిపిస్తున్నారో చూడాలంటూ.. పచ్చమీడియాలో ప్రచురితమైన ఫోటోను మంత్రి చూపారు. అదే వారి కోరిక: చంద్రబాబు జైలు నుంచి బయటకు రావాలని ఆ కుటుంబ సభ్యులకు లేదు. ఆయనను బయటకు తెచ్చే ఆలోచన కూడా వారికి లేదు. అది వారి కోర్టుల్లో వాదనల ద్వారానే అర్ధమవుతోంది. చంద్రబాబు ఇప్పటికే నెల రోజులకు పైగా జైల్లో ఉంటే.. బెయిల్ ప్రయత్నాలు చేయకుండా.. ఆయన అరెస్టులో సాంకేతిక లోపాలున్నాయంటూ.. పదే పదే అవే కారణాలు చూపుతూ.. కేసు కొట్టేయాలని కోరుతున్నారు. ఇంకా చెప్పాలంటే సీఐడీని తప్పుబడుతూ భిన్న వాదనలు వినిపిస్తున్నారు. నిజానికి, స్కిల్స్కామ్తో పాటు, ఫైబర్‌నెట్, అమరావతిలో అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు స్కామ్‌ల్లో చంద్రబాబు పాత్ర ఉందనేది ఆయన పార్టీ నేతలు, కుటుంబ సభ్యులే నమ్ముతున్నారు. కనుకే, సాంకేతిక కారణాలంటూ ఢిల్లీ నుంచి గల్లీ వరకు న్యాయవాదుల్ని పెట్టుకుని కుస్తీ పడుతున్నారు. సీఎం రావాలి.. అదే మా కోరిక: ఉత్తరాంధ్రలో రాజధాని ఏర్పాటుకు ముహూర్తం దగ్గర పడింది. అందులో భాగంగానే సీఎం జగన్ త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతున్నారు. ఆయనతో పాటు మిగతా ప్రభుత్వ ఉన్నతాధికారుల సమీక్షలకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్ల కోసం కమిటీని నియమిస్తూ.. జీఓ జారీ చేశారు. అందుకే దొడ్డిదారి రాజధాని అంటూ పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పరిపాలనా వికేంద్రీకరణతో రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా సీఎం తీసుకున్న నిర్ణయం మూడు ప్రాంతాలకు ఆమోద యోగ్యం. ఇప్పటికే రాయలసీమకు సంబంధించి కడపలో సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండగా, కోస్తాలో తాడేపల్లి మాదిరిగా విశాఖలో ఒక క్యాంప్ కార్యాలయం కూడా ఉంటుంది. ఇది తప్పని పచ్చమీడియా అంటే సరిపోతుందా? ఎవరెన్ని అడ్డుకట్ట ప్రయత్నాలు చేసినా.. సీఎం జగన్.. పరిపాలనా రాజధానిని విశాఖకు మార్చడం ఖాయం. ఆయన ఇక్కడకు ఎంత త్వరగా మార్చితే అంత మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం. మీడియా ద్వారా ఇదే ఆయనను కోరుతున్నామని మంత్రి సత్యనారాయణ స్పష్టం చేశారు. చదవండి: బరువు తక్కువ డ్రామా! చంద్రబాబుకు అనారోగ్యమంటూ టీడీపీ హడావుడి -
స్కాంలో ఉన్నది ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుపై సెటైరికల్ పంచ్ వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. దొరికితే దింగ.. దొరక్కపోతే దొర అన్నట్టుగా చంద్రబాబు ఇన్నాళ్లు ప్రవర్తించారు. ఇన్నాళ్లు తప్పులు చేసినా దొరకలేదు.. ఇప్పటికి దొంగ దొరికిపోయి జైలుకు వెళ్లారని చురకలంటించారు. అలాగే, స్కిల్ స్కాంలో అధికారుల పాత్ర ఉంటే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. స్కిల్ స్కాం కేసులో ప్రేమ చంద్రారెడ్డి మీద మాకు ప్రత్యేక ప్రేమ ఏమీ లేదు. స్కాంలో ఎవరి పాత్ర ఉంటే వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అధికారులు అభ్యంతరం చెప్పిన తర్వాతే ఫైల్ సీఎం దగ్గరకు వెళ్తుంది. దానికి ముఖ్యమంత్రిదే బాధ్యత ఉంటుంది. రిమాండ్ కొనసాగింపు సందర్బంగా తానేం తప్పు చేయలేదని చంద్రబాబు అంటున్నారు. అందుకే ప్రజాజీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. అవినీతి చేయకుండా పరిపాలన సాగించాలి. సాఫ్ట్‌వేర్‌కు అన్ని వేల కోట్టా..? ఇన్నాళ్లూ తప్పులు చేసినా దొరకలేదు. దొరికితే దొంగ.. దొరకకపోతే దొర అన్నట్టు చంద్రబాబు ఇన్నాళ్లూ వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇచ్చాక.. సీమెన్స్ కంపెనీ తన వాటా ఎందుకివ్వలేదు. మధ్యలో డిజైన్ టెక్ ఎలా వచ్చింది?. చంద్రబాబు తెలిసే తప్పు చేశారు. సీమెన్స్ కంపెనీ మంచి కంపెనీనే. కానీ, ఒప్పందం ప్రకారం జరగలేదు. సాఫ్ట్ వేర్ రూ.2900 కోట్లా?. సీమెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన సాఫ్ట్ వేర్.. ఎక్విప్మెంట్ ఎందుకు రాలేదు?. రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని అన్యాక్రాంతం చేశారు. చంద్రబాబు చేసిన అవినీతిపై ఆధారాలు ఉన్నాయి. మా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. మా ప్రభుత్వం అవినీతిని సహించదు. ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తామంటే కుదరదు. అవినీతి చేసిన వారు ఎంతటివారైనా చర్యలు తప్పవు. ఈరోజు పెద్ద పెద్ద అక్షరాలతో వార్తలు రాసిన పేపర్లు.. చంద్రబాబు ఎందుకు అవినీతికి పాల్పడ్డారో ఆయనను అడగాలి అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: జడ్జి హిమబిందుపై టీడీపీ నేతలు పోస్టులు.. చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి భవన్ నుంచి లేఖ -
డిసెంబర్ కల్లా వర్సిటీల్లో పోస్టుల భర్తీ: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: నేడు(సెప్టెంబర్ 5న) జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య కోసం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. ఏపీలో ప్రైవేటు స్కూల్స్ కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ర్యాంకులు వచ్చాయన్నారు. కాగా, నేడు విశాఖలో గురుపూజోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. ‘విశాఖలో ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉంది. గతంలో ఇతర రాష్ట్రాల విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర విద్యా వ్యవస్థ గురించి మాట్లాడుకుంటున్నారు. విద్య కోసం రూ.12వేల కోట్లు సీఎం జగన్ ఖర్చు చేశారు. 60వేల క్లాస్ రూమ్స్‌లో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు మా కుటంబ సభ్యులే అని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కొన్ని పత్రికలు చూస్తున్నాయి. జీతాలు ఇవ్వలేదని అవాస్తవాలు రాస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ ర్యాంకులు వచ్చాయి. అన్ని యూనివర్సిటీల్లో పోస్టులన్నింటినీ డిసెంబర్‌కల్లా భర్తీ చేస్తాం’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: చంద్రబాబుకు షాక్.. టీడీపీ నేత అరెస్ట్ -
ఉద్యోగ సంఘాలతో ముగిసిన భేటీ.. బొత్స కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: ఉద్యోగ సంఘాలతో మంత్రివర్గ ఉప సంఘం భేటీ ముగిసింది. జీపీఎస్ విధానాలపై ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ చర్చించింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. భేటీ అనంతరం మంత్రి బొత్స మాట్లాడుతూ.. ఉద్యోగ సంఘాలతో చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయి. మరికొన్ని అంశాలు చేర్చాలని ఉద్యోగ సంఘాలు అడిగాయి. అధ్యయనం చేసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పాం అని అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి బొత్స సీరియస్ అయ్యారు. చంద్రబాబు ఢిల్లీలో బీజేపీ గేట్లు తెరవాలని తిరుగుతున్నాడు. బీజేపీ గేట్లు తెరిస్తే దూరాలని చూస్తున్నాడు. ఉగాది తర్వాత రాష్ట్రంలో టీడీపీ కనుచూపుమేరలో కనపడదు. చంద్రబాబు మతిపోయి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు ముసలి జిత్తులమారి నక్క. చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలి. మాజీ సీఎం అయి ఉండి ముఖ్యమంత్రి గురించి ఎలా మాట్లాడాలి. చంద్రబాబు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి. ఎన్నికల ప్రజాక్షేత్రంలో ఎవరి సత్తా ఏంటో తేలుతుంది. చంద్రబాబు వంటి దుష్టశక్తులు రాష్ట్ర అభివృద్ధిన అడ్డుకుంటున్నారు. ఒంటరిగా పోరాటం చేసి ప్రజలను మెప్పిస్తాం. చంద్రబాబు ఎవరితో కలుస్తారో మాకు అనవసరం. ఎన్టీఆర్ చావుకు కారణం చంద్రబాబు కాదా?. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సంక్షేమ పథకాల వల్లే ధైర్యంగా ఈ విషయం చెబుతున్నాం అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఉత్తరాంధ్రలో టీడీపీకి భారీ షాక్.. -
AP: ‘ఆగస్టులో మెగా డీఎస్సీ హర్షణీయం’
సాక్షి, అమరావతి: ఆగస్ట్‌లో మెగా డీఎస్సీ విడుదలతో పాటు త్వరలో అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు ఏపీ నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ చెప్పారు. శుక్రవారం విజయవాడలో మంత్రి బొత్సను కలిసి నిరుద్యోగుల సమస్యలపై వినతిపత్రమిచ్చారు. ఈ సందర్బంగా ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఇటీవల జరిగిన ప్రాథమిక పరీక్షలో తప్పుదొర్లిన ప్రతి ప్రశ్నకి ఒక మార్కు కేటాయించాలని కోరారు. జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, డిజిటల్ గ్రంథాలయ శాఖ, పోలీసు విభాగాల్లో పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. జనరల్ కేటగిరీల్లో వయోపరిమితిని ఏపీపీఎస్సీ, డీఎస్సీ అభ్యర్థులకు 47 ఏళ్లకు, కానిస్టేబుల్‌కు 27 ఏళ్లకు, ఎస్ఐ అభ్యర్థులకు 30 ఏళ్లకు, ఫైర్, జైలు వార్డెన్స్ అభ్యర్థులకు 32 ఏళ్లకు పెంచాలని కోరారు. హోంగార్డులకు జనరల్ అభ్యర్థులతో కాకుండా ప్రత్యేకంగా రాత పరీక్ష పెట్టాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఇది కూడా చదవండి: వైద్యవిద్య పీజీ సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం -
రామోజీ.. ముందు మీ మైండ్ సెట్ మార్చుకోండి: మంత్రి బొత్స
సాక్షి, విశాఖపట్నం: విద్యాకానుకపై ఈనాడు దుష్ప్రచారం చేస్తోంది. ప్రభుత్వంపై రామోజీరావు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రామోజీ ముందు తన మైండ్‌సెట్ మార్చుకోవాలని హితవు పలికారు. ఏపీలో ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యా శాఖకు సంబంధించి ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా కానుక ఇచ్చారు. విద్యార్థులకు ఇచ్చే ట్యాబ్స్ ఇంటర్నెట్ లేకున్నా పనిచేస్తాయి. ప్రతీ స్కూల్లో ఇంటర్నెట్ కోసం టెంబర్లు పిలిచాం. ప్రజా ధనాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయలేదు. అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఆడిట్ పూర్తి కాకుండా అక్రమాలు జరిగినట్టు రాయడం నిజమైన జర్నలిజం కాదు అని విమర్శించారు. ఇదే సమయంలో అమిత్ షా కామెంట్స్‌పై మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. కేంద్రం ఏపీకి ఏమైనా ఎక్కువ నిధులు ఇచ్చిందా?. బీజేపీకి నిజంగా ఏపీపై ప్రేమ ఉంటే విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదు అంటూ ప్రశ్నించారు. మరోవైపు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. డ్యాన్స్‌లు వేసుకునే పవన్ వంటి వ్యక్తి ఏపీకి అవసరమా? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన టీమిండియా క్రికెటర్ కేఎస్ భరత్ -
అమిత్ షాతో చంద్రబాబు భేటీపై మంత్రి బొత్స సెటైరికల్ పంచ్
సాక్షి, విజయవాడ: ఏపీలో ఎంత మంది ఎక్కడ తిరిగినా ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఎవరు ఎక్కడ తిరిగినా మాకు నష్టం లేదు అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కాగా, మంత్రి బొత్స గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయి. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. ముందస్తు అంటూ వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తారు. చంద్రబాబు ఎవరితో కలిసినా మాకు నష్టం లేదు. ప్రతిపక్షం ఉనికిని కాపాడుకోవడానికే టీడీపీ నేతలు గవర్నర్‌ని కలిశారు. చంద్రబాబు ఈరోజు అమిత్ షాని కలుస్తారు.. రేపు అబితాబ్ బచ్చన్‌ను కలుస్తారు. ఆయన ఎవరితో కలిస్తే మాకేంటి. రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం ఎక్కడ కలిగింది. తప్పుడు ఫిర్యాదులు చేయడం టీడీపీ దినచర్యలో భాగం. నాలుగుపక్కల నలుగురు తిరుగుతున్నారు. ఎవరెక్కడ తిరిగితే మాకేంటి. మేము అమలు చేస్తున్న సంక్షేమ పధకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇచ్చిన వాగ్దానాలు అన్నింటిని నెరవేర్చాం. 99 శాతం నెరవేర్చాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం. ఉద్యోగులకి జీపీఎస్ ద్వారా న్యాయం జరుగుతుంది. ఉద్యోగులకి ఆమోదయోగ్యమైన నిర్ణయాలే తీసుకున్నాం. సీపీఎస్ రద్దుపై ఇతర రాష్ట్రాలు మాటలకే పరిమితమయ్యారు. ఏ రాష్ట్రంలో అమలు చేశారు? అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ఏపీలో ఈనెల 12 నుంచి పాఠశాలలు పున:ప్రారంభం