సాక్షి, అమరావతి: ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2014 జూన్ 2వ తేదీ నాటికి అయిదేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
కాగా, మంత్రి బొత్స సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణపై త్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని అన్నారు. అలాగే, తర్వలోనే కొత్త పీఆర్సీ కమిటీ నియామకం ఉంటుందని వెల్లడించారు. కొత్త పెన్షన్ విధానంపై కేబినెట్‌లో చర్చించి మెరుగైన విధానం తీసుకొస్తాం. ఉద్యోగులకు ఖచ్చితంగా పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు నాలుగేళ్లలో 16 వాయిదాల్లో మొత్తం పీఆర్సీ బకాయిలు చెల్లించడానికి అంగీకరించినట్టు స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: రేపు సీఎం జగన్ పోలవరం పర్యటన..
Comments
Please login to add a commentAdd a comment