Removal Of Five Year Rule For Regularization Of AP Contract Employees - Sakshi
Sakshi News home page

AP: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మరో శుభవార్త

Published Wed, Aug 16 2023 3:59 PM | Last Updated on Wed, Aug 16 2023 4:48 PM

Removal Of Five Year Rule For Regularization Of Ap Contract Employees - Sakshi

సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. క్రమబద్దీకరణకు ఐదేళ్ల నిబంధన తొలగించనుంది. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సీఎం జగన్‌ అంగీకరించారు. దీంతో కాంట్రాక్ట్‌ ఉద్యోగులందరినీ ప్రభుత్వం రెగ్యులర్‌ చేయనుంది. కొద్దిరోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి.

వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆలోచన.. సీఎం నిర్ణయంతో అదనంగా మరో 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి లబ్ది కలగనుందని ఏపీజీఈఏ ఛైర్మన్‌ వెంకట్రామిరెడ్డి అన్నారు.

కాగా, విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో విద్యుత్‌ శాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉ‍ద్యోగుల జీతాలు 37 శాతం పెంచింది ప్రభుత్వం. ఈ మేరకు విద్యుత్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: చంద్రబాబు కొత్త రాగం.. అదో దిక్కుమాలిన విజన్‌: పేర్ని నాని

ఈ నేపథ్యంలో 27వేల మంది విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. కాగా, సీఎం జగన్‌ సూచనలతో విద్యుత్‌ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు పెంచినట్టు ఆయన తెలిపారు. తాజాగా ప్రభుత్వం నిర్ణయంతో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతం రూ.21వేలు దాటింది.  అలాగే, గ్రూప్‌ ఇన్యూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం కాంట్రాక్ట్‌ ఏజెన్సీలను ఆదేశించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement