
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరోసారి ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రియల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులగా పనిచేస్తూ అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురిని క్రమబద్దీకరణ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ క్రమబద్దీకరణ పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: బాబు, పవన్ పేరు చెబితే గుర్తుకొచ్చేవి ఇవే..: సీఎం జగన్