sorting
-
కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మరోసారి ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిలబెట్టుకుంటున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రియల్ ఒకటి నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులగా పనిచేస్తూ అర్హులైన 2146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు జీవో జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ ఫేర్ విభాగంలో 2025 మంది వైద్య సిబ్బంది, డిఎంఈ పరిధిలో 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో నలుగురిని క్రమబద్దీకరణ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ క్రమబద్దీకరణ పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: బాబు, పవన్ పేరు చెబితే గుర్తుకొచ్చేవి ఇవే..: సీఎం జగన్ -
పారదర్శకతకు పాతరేస్తారా..?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో మధ్యవర్తుల వసూళ్ల పర్వంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ అంశాన్ని మానవీయ కోణంలో పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వారి సర్వీసును క్రమబద్ధీకరించనున్నట్లు అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఈ అంశాన్ని గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో సైతం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో క్రమబద్ధీకరణను పారదర్శకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొందరు మధ్యవర్తులు వసూళ్లకు తెగబడుతున్న తీరుపై గతనెల 24న ‘కొలువుల క్రమబద్ధీకరణలో కలెక్షన్ కింగ్‌లు’శీర్షికతో ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇది గురుకుల సొసైటీ వర్గాల్లోనే కాకుండా, సచివాలయంలోని కొన్ని విభాగాల్లో తీవ్ర దుమారం రేపింది. దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల సొసైటీ కార్యదర్శిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా మధ్యవర్తుల ప్రమేయం, వసూళ్ల తంతు ఏమిటంటూ మండిపడ్డారు. తక్షణమే ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మంత్రి ఆదేశించారు. తీగ లాగి.. హెచ్చరికలు చేసి.. టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్లో దాదాపు ఆరువందల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా.. అందులో 550 మంది ఉద్యోగులు క్రమబద్ధీకరణకు అర్హులుగా సొసైటీ గుర్తించింది. ఈ నేపథ్యంలో క్రమబద్ధీకరణను కొందరు సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగి రకరకాల అపోహలు సృష్టించారు. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.1లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేశారు. డబ్బులు ఇచ్చిన వారి కొలువే క్రమబద్ధీకరిస్తారని చెప్పడంతో మెజార్టీ ఉద్యోగులు మధ్యవర్తులు అడిగినంత మేర ఇచ్చినట్లు తెలిసింది. ఇలా దాదాపు రూ.8 కోట్లకు పైగా వసూలు చేశారని సమాచారం. దీనిపై టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి రోనాల్డ్‌రాస్ రంగంలోకి దిగి తీగ లాగినట్లు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు కాంట్రాక్టు ఉద్యోగులతో ఆయన వ్యక్తిగతంగా మాట్లాడి విచారణ జరిపారు. అలాగే ప్రతి జిల్లా నుంచి ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు ఆన్‌డ్యూటీ సౌకర్యం కల్పిస్తూ, వారం క్రితం సొసైటీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. మధ్యవర్తులు వసూళ్లు చేసిన తీరును, ఎవరెవరు ఎలా డబ్బులు ఇచ్చారని ఆరా తీసినట్లు వెల్లడైంది. ఈ సమావేశంలో కేవలం కాంట్రాక్టు ఉద్యోగులు, కార్యదర్శి మాత్రమే ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. వసూళ్ల తీరును తెలుసుకున్న తర్వాత ఆయన పలు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల్లో ఒకటైన కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కళంకం రాకుండా, వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. అప్పటిదాకా సొసైటీ ఉద్యోగుల ఫైలు కదలదని హెచ్చరించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. -
ఔట్సోర్సింగ్ క్రమబద్ధీకరణపై హైకోర్టు నోటీసులు
- 25వేల ఉద్యోగాల క్రమబద్ధీకరణను అడ్డుకోవాలన్న పిటిషనర్ - ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న సర్కార్ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించరాదన్న కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు విద్యుత్ సంస్థల ఉన్నతాధికారు లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 25 వేల ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు వీలుగా ఈనెల 1, 2 తేదీల్లో ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వరంగల్‌కు చెందిన ఇంజనీరింగ్ నిరుద్యోగి ఎం.శ్రావణ్‌కుమార్ పిల్ దాఖలు చేశారు. ఈ పిల్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి టి.రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. ‘‘ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించడం సుప్రీంకోర్టు ఆదేశాలకు వ్యతిరేకం. పైగా ఆ ఉద్యోగులు కాంట్రాక్టర్ అధీనంలో ఉంటారు. 25 వేల ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ స్టాఫ్‌తో భర్తీ చేస్తే లక్ష మంది నిరుద్యోగులపై దాని ప్రభావం పడుతుం ది. కాబట్టి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీ కరణను అడ్డుకుని, ప్రొసీడింగ్స్ అమలు కాకుండా స్టే ఆదేశాలివ్వాలి’’ అని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. కాగా, ఇది ప్రజాప్రయోజన వ్యాజ్యం కాబోదని, ఉద్యోగుల సర్వీసులకు సంబంధించిన కేసు అని, పిల్‌గా పరిగణించరాదని విద్యుత్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలనే నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదని, ఇప్పుడే ఏదో జరిగిపోతోందనే ఆందోళనతో ముందే పిటిషనర్ కోర్టుకు వచ్చారని అన్నారు. దీనిపై నిర్ణయం తీసుకునే ముందు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాల్సి వుంటుందని, దానికోసం కనీసం వారం సమయం పడుతుందని, నిర్ణయం తుది దశకు చేరుకోనేలేదని, కాబట్టి పిటిషన్ చెల్లుబాటు కాదని వాదించారు. వాదనల అనంతరం ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ అధికారులు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని, 29న విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది. -
డీఈఓ ఆఫీస్ ఫైళ్ల విభజన ప్రారంభం
స్కానింగ్, జిరాక్స్ తీయాలని ఆదేశాలు తొలుత జిరాక్స్‌ల అందజేత విద్యారణ్యపురి : జిల్లా విద్యాశాఖాధికారి కా ర్యాలయంలోని ఫైళ్లను నూతనంగా ఏర్పడే నాలుగు జిల్లాలకు విభజించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈమేరకు డీఈఓ పి.రాజీవ్ గురువారం డీఈఓ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, తమ సెక్షన్లలోని పలు రకాల ఫైళ్లను నూతన జిల్లాలకు విభజించాలని ఆదేశించారు. ప్రస్తుతం డీఈఓ కా ర్యాలయంలో 28 సెక్షన్లు, 47 అంశాలతో కూ డిన వందల సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. వాటి లో ప్రధానంగా ఉపాధ్యాయుల సర్వీస్, కోర్టు కేసులకు సంబంధించినవి, డీఎస్సీ ప్రక్రియ, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బడ్జెట్ల కేటాయింపులు, పరీక్షల నిర్వహణ, పెన్ష న్లు తదితర ఫైళ్లు విభజించే ప్రక్రియ ప్రారంభించారు. అంతేకాకుండా ఆయా ఫైళ్లను స్కాన్ చేయడంతోపాటు నాలుగు జిల్లాలకు ఫైళ్లను నాలుగు కాపీల జిరాక్స్‌లు తీసి పంపనున్నారు. భారీ సంఖ్యలో ఉన్న ఆయా ఫైళ్ల జిరాక్స్‌లను ఈనెల 6వ తేదీ వరకు తీయాల్సి ఉంది. ఈనెల 11వ తేదీకల్లా ఆయా జిల్లాలకు వాటిని అప్పగించాల్సి ఉంది. ఒరిజినల్ ఫైళ్లన్నీ ప్రస్తుతం హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలోనే భద్రపరుస్తారు. నూతన జిల్లాల పరిపాలన అమలులోకి వచ్చిన తర్వాత అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు ఒరిజి నల్ ఫైళ్లు అప్పగిస్తారు. తొలుత ఫైళ్ల జిరాక్స్‌లను మాత్రమే ఇస్తారు. కాగా ప్రస్తుతం వరంగల్ జిల్లా డీఈవో కార్యాలయంలో కేడర్‌స్ట్రెంత్ ప్రకారం వివిధ కేటగి రీల్లో 60 పోస్టులు ఉండగా, అందులో 54మంది వివిధ కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వరంగల్ డీఈవో కార్యాలయానికి 23 మంది ఉద్యోగులు, హన్మకొండ డీఈవో కార్యాలయానికి 17 మంది, జయశంకర్(భూపాలపల్లి) డీఈఓ కార్యాలయానికి 12 మంది, మహబూబాబాద్ డీఈఓ కార్యాలయానికి 10 మంది ఉద్యోగులను కేటాయించారు. -
రేషన్‌షాపుల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం
సాక్షి, విశాఖపట్నం : రేషన్ షాపుల క్రమబద్ధీకరణకు రంగం సిద్ధమైంది. జీవో నెం.35 ప్రకారం ఇందుకు చర్యలు తీసుకోవాలంటూ పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలొచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో జారీ అయిన ఈ జీవోను అనుసరించే రేషన్ షాపులను కార్డుల సంఖ్యకనుగుణంగా క్రమబద్ధీకరించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆధార్, ఐరిష్ అనుసంధానం చేసిన రేషన్ కార్డుల సంఖ్య ఆధారంగా ఈ క్రమబద్ధీరణ చేయనున్నారు. ప్రభుత్వాదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కోషాపు పరిధిలో 400 నుంచి 450 బీపీఎల్, 50 పింక్ కార్డులకు మించి ఉండకూడదు. పట్టణ ప్రాంతాల్లో ఒక్కోషాపు పరిధిలో 500 నుంచి 550 బీపీఎల్, 250 గులాబీ కార్డులకు మించి ఉండకూడదు. కార్పొరేషన్ పరిధిలో అయితే 600 నుంచి 650 బీపీఎల్, 400 గులాబీ కార్డులకు మించి ఉండకూదని జీవో పేర్కొంది. ప్రస్తుతం జిల్లాలో 2018 రేషన్ షాపులుండగా వాటి పరిధిలో 10.87 లక్షల రేషన్ కార్డులున్నాయి. 1500 నుంచి 2 వేలకు పైగా కార్డులున్న దుకాణాలు 10 వరకు ఉంటే, వెయ్యినుంచి 1500కుపైగా కార్డులున్న దుకాణాలు 20కుపైగా ఉన్నాయి. అలాగే 500 నుంచి వెయ్యి లోపు కార్డులు కలిగిన దుకాణాలు 200కుపైగా ఉంటాయని అంచనా. కార్డుల సంఖ్య ఆధారంగా రేషన్‌షాపులను క్రమబద్ధీకరిస్తే ప్రస్తుతం ఉన్న రేషన్ షాపుల సంఖ్యకు అదనంగా మరో రెండు మూడొందలు పెరిగే అవకాశం ఉందని సివిల్ సప్లయిస్ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల కనుగుణంగా జిల్లా స్థాయిలో గైడ్‌లైన్స్ రూపొందించుకొని క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.