- స్కానింగ్, జిరాక్స్ తీయాలని ఆదేశాలు
- తొలుత జిరాక్స్‌ల అందజేత
డీఈఓ ఆఫీస్ ఫైళ్ల విభజన ప్రారంభం
Published Fri, Sep 2 2016 12:04 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM
విద్యారణ్యపురి : జిల్లా విద్యాశాఖాధికారి కా ర్యాలయంలోని ఫైళ్లను నూతనంగా ఏర్పడే నాలుగు జిల్లాలకు విభజించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈమేరకు డీఈఓ పి.రాజీవ్ గురువారం డీఈఓ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, తమ సెక్షన్లలోని పలు రకాల ఫైళ్లను నూతన జిల్లాలకు విభజించాలని ఆదేశించారు.
ప్రస్తుతం డీఈఓ కా ర్యాలయంలో 28 సెక్షన్లు, 47 అంశాలతో కూ డిన వందల సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. వాటి లో ప్రధానంగా ఉపాధ్యాయుల సర్వీస్, కోర్టు కేసులకు సంబంధించినవి, డీఎస్సీ ప్రక్రియ, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బడ్జెట్‌ల కేటాయింపులు, పరీక్షల నిర్వహణ, పెన్ష న్లు తదితర ఫైళ్లు విభజించే ప్రక్రియ ప్రారంభించారు. అంతేకాకుండా ఆయా ఫైళ్లను స్కాన్ చేయడంతోపాటు నాలుగు జిల్లాలకు ఫైళ్లను నాలుగు కాపీల జిరాక్స్‌లు తీసి పంపనున్నారు. భారీ సంఖ్యలో ఉన్న ఆయా ఫైళ్ల జిరాక్స్‌లను ఈనెల 6వ తేదీ వరకు తీయాల్సి ఉంది. ఈనెల 11వ తేదీకల్లా ఆయా జిల్లాలకు వాటిని అప్పగించాల్సి ఉంది. ఒరిజినల్ ఫైళ్లన్నీ ప్రస్తుతం హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలోనే భద్రపరుస్తారు. నూతన జిల్లాల పరిపాలన అమలులోకి వచ్చిన తర్వాత అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు ఒరిజి నల్ ఫైళ్లు అప్పగిస్తారు. తొలుత ఫైళ్ల జిరాక్స్‌లను మాత్రమే ఇస్తారు. కాగా ప్రస్తుతం వరంగల్ జిల్లా డీఈవో కార్యాలయంలో కేడర్‌స్ట్రెంత్ ప్రకారం వివిధ కేటగి రీల్లో 60 పోస్టులు ఉండగా, అందులో 54మంది వివిధ కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వరంగల్ డీఈవో కార్యాలయానికి 23 మంది ఉద్యోగులు, హన్మకొండ డీఈవో కార్యాలయానికి 17 మంది, జయశంకర్(భూపాలపల్లి) డీఈఓ కార్యాలయానికి 12 మంది, మహబూబాబాద్ డీఈఓ కార్యాలయానికి 10 మంది ఉద్యోగులను కేటాయించారు.
Advertisement
Advertisement