deo office
-
ప్రభుత్వ పాఠశాలల్లోనే కొనసాగుతాం..
గుంటూరు ఎడ్యుకేషన్: ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన ఎయిడెడ్ ఉపాధ్యాయులు తమను తిరిగి ఎయిడెడ్‌కు పంపొద్దని డిమాండ్ చేస్తూ శనివారం డీఈవో కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. జిల్లాలోని ఆర్సీఎం యాజమాన్యంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సారథ్యం వహించిన మైఖేల్, రాజేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలోని ఆర్సీఎం యాజమాన్యంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న తమను ప్రభుత్వానికి అప్పగిస్తూ లిఖిత పూర్వకంగా తెలియపర్చారని, అయితే మళ్లీ వెనక్కు తీసుకుంటామంటూ యాజమాన్యం వేధిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. యాజమాన్యాల నిరంకుశ పోకడలతో బానిస జీవితాన్ని గడుపుతున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చేందుకు అంగీకరించిన తమను తిరిగి వెనక్కు పంపొద్దంటూ డీఈవో ఆర్ఎస్ గంగాభవానీకి వినతిపత్రం ఇచ్చారు. -
డీఈవో కార్యాలయంలో సిబ్బంది లేరా?
మంచిర్యాలటౌన్ : నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు రోజులు దాటినా మంచిర్యాల జిల్లా డీఈవో కార్యాలయంలో అధికా రులు లేక వెలవెల బోవడాన్ని నిరసిస్తూ ఐక్య విద్యార్థి సంఘాల నేతలు సోమవారం మూసి ఉన్న డీఈవో కార్యాలయానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభించి ఇప్పటికి మూడు రోజులు దాటినా, కార్యాలయంలో ఒక్క అధికారి, సూపరింటెండెంట్ లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన రెగ్యులర్ డీఈవోను సిద్దిపేటకు బదిలీ చేసి, పెద్దపల్లి డీఈవో వెంకటేశ్వర్రావుకు ఇన్చార్జి ఇచ్చారన్నారు. రెండు జిల్లాలకు పనిచేస్తున్న డీఈవో మంచిర్యాల జిల్లాకు సక్రమంగా రాకపోవడంతో, జిల్లాలోని పాఠశాలలు కనీస వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. విద్యాహక్కు చట్టం అమలు చేసేలా, రెగ్యులర్ డీఈవోను ఇచ్చి, సిబ్బంది సరైన సమయానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట రాజేశ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జాగిరి రాజేశ్, ఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జుమ్మిడి గోపాల్, ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మెట్పల్లి రంజిత్‌రావు, ఆప్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నల్ల నాగేంద్రప్రసాద్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మామిడాల ప్రవీణ్, ఆప్ విద్యార్థి సంఘం నాయకులు సతీశ్ పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన ఈఈ
విద్యారణ్యపురి/ వరంగల్ క్రైం: రాష్ట్ర విద్యామౌలిక సదుపాయాల సంస్థ ఈఈగా పనిచేస్తున్న రవీందర్రావు ఏసీబీకి చిక్కాడు. హన్మకొండలోని రూరల్ డీఈఓ కార్యాలయంలో తన చాంబర్లో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను వలపన్ని పట్టుకున్నారు. వరంగల్ జోన్ ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్ సుదర్శన్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. సీఎంఏ ఫండ్ కింద డ్యూయల్ డెస్క్‌ల సరఫరాకు సంబంధించి రూ.5 లక్షలు లంచం ఇస్తేనే బిల్లు ఇస్తామని కాంట్రాక్టర్ వన్నాల కన్నాకు ఈఈ స్పష్టం చేశాడు. దీంతో సదరు కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈఈ రవీందర్‌రావుకు అతని చాంబర్లో వన్నాల కన్నా రూ.3 లక్షలు ఇచ్చారు. ఈ సమయంలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ఈఈ రవీందర్‌రావుపై పలు ఆవినీతి ఆరోపణలు ఉన్నాయని.. వాటన్నింటిపైనా సమగ్ర విచారణ చేపడతామని వెల్లడించారు. -
రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన డీఈఓ సూపరింటెండెంట్
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని జిల్లా విద్యాశాఖాధికారి(డీఈఓ) కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. డీఎస్పీ కె.రాజేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో ఆఫీస్ పర్యవేక్షకుడు ఎ.వి.ప్రసాదరావు రూ.20 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. పాతపట్నంకు చెందిన జమ్మయ్య అనే ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఏసీబీ ఈ దాడులు నిర్వహించింది. -
డీఈవో కార్యాలయంలో స్టేషనరీ మాయం
జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు గుట్టు చప్పుడు కాకుండా స్టేషనరీని అమ్ముకోగా, మరో అటెండర్ ఏకంగా ఎస్సెస్సీ ఆన్సర్ షీట్లనే చిత్తుకాగితాల కింద అమ్మేశాడు. పంపకాల విషయంలో తేడాలు రావడంతో ముగ్గురి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో దాచిన ఆన్సర్ షీట్లను అమ్ముకున్న ఉద్యోగిని సంబంధిత ఉపాధ్యాయుడు ఫొటోలు తీసి పట్టించారు. ♦ రద్దీకి అమ్ముకున్న సిబ్బంది ♦ అందులో మూడు సర్వీసు రికార్డులు ♦ ఎస్సెస్సీ ఆన్సర్ షీట్లనే అమ్మేసిన మరో అటెండర్ ♦ మొత్తం విలువ రూ.3 లక్షలు ♦ నెల తర్వాత వెలుగులోకి ♦ మెమోలు జారీ నిజామాబాద్ అర్బన్ : జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో పాత పేపర్లు, ఇతర విభాగాలకు చెందిన స్టేషనరీ మూడు సంవత్సరాలుగా పేరుకుపోయింది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో టెండర్ నిర్వహించి విక్రయించవల్సి ఉంది. అయితే రాత్రివేళ విధులు నిర్వర్తించే ఇద్దరు అటెండర్లు, మరో అటెండర్ కలిసి ఎవరికీ తెలియకుండా రాత్రివేళ అమ్ముకున్నట్లు తెలిసింది. రూ. లక్ష 50 వేల విలువ చేసే స్టేషనరీని సంచుల్లో నింపి విక్రయించారు. వచ్చిన డబ్బులను పంచుకున్నారు. ఈ పంపకాల్లో తేడాలు రావడంతో విక్రయించిన నెలరోజులకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. స్టేషనరీ విక్రయించారని డీఈవో దృష్టికి వెళ్లడంతో ఆయన ముగ్గురికి చార్జి మెమోలు జారీ చేశారు. ఈ స్టేషనరీలో రిటైర్డు ఉద్యోగులకు సంబంధించి ముగ్గురి సర్వీస్ రికార్డులు ఉన్నాయి. రిటైర్డు అయిన ఓ ప్రధానోపాధ్యాయుడు బిల్లుల కోసం సర్వీస్ రికార్డును గతంలోనే డీఈవో కార్యాలయం లో అందజేశారు. ప్రస్తుతం సర్వీస్ రికార్డు కావాలని ఇటీవల డీఈవో కార్యాలయానికి వచ్చారు. సర్వీస్ రికార్డు స్టేషనరీకి సంబంధించిన స్థలంలో ఉందని సంబంధిత క్లర్క్ అక్కడవెళ్లి పరిశీలించగా స్టేషనరీ కనిపించలేదు. దీనిపై ఆరా తీయగా స్టేషనరీని గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసిన విషయం తేలింది. ఆ స్టేషనరీలో మూడు సర్వీస్ రికార్డులు ఉన్నాయని కార్యాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత ప్రధానోపాధ్యాయుడికి ఈ విషయం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. దొంగచాటున స్టేషనరీని విక్రయించిన ఇద్దరు ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఎస్సెస్సీ ఆన్సర్ షీట్లు సైతం.. నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో పదో తరగతి జవాబు పత్రాలను భద్రపరిచారు. వీటిని ఇటీవల వాల్యుయేషన్ నిర్వహించి అక్కడ ఒక గదిలో ఉంచారు. డీఈవో కార్యాలయానికి చెందిన అటెండర్ జవాబుపత్రాలను చిత్తుకాగితాల కింద విక్రయించాడు. సుమారు రూ. లక్ష 50 వేలు స్టేషనరీ విక్రయించడం ద్వారా అటెండర్ లబ్ధిపొందినట్లు తెలిసింది. కాగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు స్టేషనరీని అటెండర్ విక్రయించేటప్పుడు ఫొటోలు తీసి జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో డీఈవో ఉద్యోగికి మెమో జారీ చేసి మరో ప్రాంతానికి బదిలీ చేశారు. స్టేషనరీ విక్రయించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవల్సింది పోయి మెమోజారీ జారీ చేయడంపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఘటన జరిగి నెలలు గడిచినా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యహవరిస్తున్నారని అంటున్నారు. -
రేపు డీఈఓ కార్యాలయ ముట్టడి
అనంతపురం ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన వెబ్‌కౌన్సెలింగ్, పర్ఫార్మెన్స్ పాయింట్లు, రేషలైజేషన్ కు వ్యతిరేకంగా రాష్ట్ర ఫ్యాప్టో, జాక్టో పిలుపుమేరకు ఈ బుధవారం తలపెట్టిన డీఈఓ ఆఫీస్ ముట్టడిని జయప్రదం చేయాలని నాయకులు ఓ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చారు. పర్ఫార్మెన్స్ పాయింట్లకు సంబంధించి చాలా అంశాల్లో స్పష్టత లేదని, ఇప్పటిదాకా ఖాళీల సంఖ్య, వివరాలపై ఉపాధ్యాయులకు అవగాహన రాలేదని పేర్కొన్నారు. ప్ర భుత్వ తీరుకు నిరసనగా బుధవారం 9 గంటలకు ఆర్ట్స్ కళాశాల నుంచి డీఈఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయాన్ని దిగ్భందిస్తామని వివరించారు. -
ముగ్గురు సూపరింటెండెంట్ల బదిలీ
అనంతపురం ఎడ్యుకేషన్ : విద్యాశాఖలో పని చేస్తున్న ముగ్గురు సూపరింటెండెంట్లు బదిలీ అయ్యారు. డీఈఓ కార్యాలయంలో పని చేస్తున్న ప్రసాద్‌బాబును కడప మోడల్ స్కూళ్ల విభాగానికి, సురేష్‌బాబును కడప ఆర్‌ఎంఎస్‌ఏ విభాగానికి బదిలీ చేశారు. పాఠ్యపుస్తకాల మేనేజర్‌గా పని చేస్తున్న సుకుమార్‌ను కడప జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్‌గా బదిలీ చేశారు. వీరి స్థానాల్లో కడప మోడల్ స్కూళ్ల విభాగంలో పని చేస్తున్న రంగస్వామిని, అనంతపురం ఆర్‌ఎంఎస్‌ఏ విభాగంలో పని చేస్తున్న సయ్యద్ హుసేన్‌ను నియమిస్తూ ఆర్జేడీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా బదిలీ అయిన ముగ్గురు సూపరింటెండెంట్లను సాయంత్రం డీఈఓ లక్ష్మీనారాయణ, ఇతర సిబ్బంది సన్మానించారు. -
డీఈఓ కార్యాలయాలకు తరలిన ఉద్యోగులు
విద్యారణ్యపురి : హన్మకొండలోని డీఈఓ కార్యాలయం నుంచి మహబూబాబాద్, భూపాలపల్లి జిల్లాల విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు కేటాయించిన పలువురు ఉద్యోగులు శుక్రవారం తరలివెళ్లారు. వారు ఆయా రెండు డీఈఓ కార్యాలయాలకు కేటాయించిన ఫర్నిచర్, ఫైళ్లు, బీరువాలు, కంప్యూటర్లు తీసుకొని వెళ్లారు. డీఈఓ కార్యాలయం, సర్వశిక్షాభియాన్ కార్యాలయంలోని ఉద్యోగులను కలిపి సీనియార్టీ ప్రకారం నూతన జిల్లాలకు ఇప్పటికే కేటాయించారు. ఈనెల 11వ తేదీ దసరా రోజున కార్యాలయాల్లో ఉద్యోగులు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, అందువల్ల నూతన జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అన్నీ సర్దుకునేందుకు ముందుగానే తరలివెళ్లారు. జనగామ జిల్లాకు ఒకటి రెండు రోజుల్లో ఉద్యోగులు, ఫైళ్లు, వస్తుసామగ్రిని తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జనగామ ఎమ్మార్సీ భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే అది సరిపోదని వేరేచోట చూడాలని అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. -
డీఈఓ ఆఫీస్ ఫైళ్ల విభజన ప్రారంభం
స్కానింగ్, జిరాక్స్ తీయాలని ఆదేశాలు తొలుత జిరాక్స్‌ల అందజేత విద్యారణ్యపురి : జిల్లా విద్యాశాఖాధికారి కా ర్యాలయంలోని ఫైళ్లను నూతనంగా ఏర్పడే నాలుగు జిల్లాలకు విభజించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈమేరకు డీఈఓ పి.రాజీవ్ గురువారం డీఈఓ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, తమ సెక్షన్లలోని పలు రకాల ఫైళ్లను నూతన జిల్లాలకు విభజించాలని ఆదేశించారు. ప్రస్తుతం డీఈఓ కా ర్యాలయంలో 28 సెక్షన్లు, 47 అంశాలతో కూ డిన వందల సంఖ్యలో ఫైళ్లు ఉన్నాయి. వాటి లో ప్రధానంగా ఉపాధ్యాయుల సర్వీస్, కోర్టు కేసులకు సంబంధించినవి, డీఎస్సీ ప్రక్రియ, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బడ్జెట్ల కేటాయింపులు, పరీక్షల నిర్వహణ, పెన్ష న్లు తదితర ఫైళ్లు విభజించే ప్రక్రియ ప్రారంభించారు. అంతేకాకుండా ఆయా ఫైళ్లను స్కాన్ చేయడంతోపాటు నాలుగు జిల్లాలకు ఫైళ్లను నాలుగు కాపీల జిరాక్స్‌లు తీసి పంపనున్నారు. భారీ సంఖ్యలో ఉన్న ఆయా ఫైళ్ల జిరాక్స్‌లను ఈనెల 6వ తేదీ వరకు తీయాల్సి ఉంది. ఈనెల 11వ తేదీకల్లా ఆయా జిల్లాలకు వాటిని అప్పగించాల్సి ఉంది. ఒరిజినల్ ఫైళ్లన్నీ ప్రస్తుతం హన్మకొండలోని డీఈఓ కార్యాలయంలోనే భద్రపరుస్తారు. నూతన జిల్లాల పరిపాలన అమలులోకి వచ్చిన తర్వాత అక్కడ విధులు నిర్వర్తించే అధికారులు, ఉద్యోగులు ఒరిజి నల్ ఫైళ్లు అప్పగిస్తారు. తొలుత ఫైళ్ల జిరాక్స్‌లను మాత్రమే ఇస్తారు. కాగా ప్రస్తుతం వరంగల్ జిల్లా డీఈవో కార్యాలయంలో కేడర్‌స్ట్రెంత్ ప్రకారం వివిధ కేటగి రీల్లో 60 పోస్టులు ఉండగా, అందులో 54మంది వివిధ కేటగిరీల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వరంగల్ డీఈవో కార్యాలయానికి 23 మంది ఉద్యోగులు, హన్మకొండ డీఈవో కార్యాలయానికి 17 మంది, జయశంకర్(భూపాలపల్లి) డీఈఓ కార్యాలయానికి 12 మంది, మహబూబాబాద్ డీఈఓ కార్యాలయానికి 10 మంది ఉద్యోగులను కేటాయించారు. -
డీఈవో కార్యాలయంలోని టీచర్ల డిప్యూటేషన్ రద్దు
l ఆరుగురిని పాఠశాలల విధులకు రిలీవ్ చేసిన డీఈఓ విద్యారణ్యపురి : విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లు పాఠశాలల్లో విధుల్లో ఉండాలనేది ఇటీవలే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విధితమే. దీంతో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఎక్కడైతే డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో వారిని పాఠశాల విధులకు పంపుతున్నారు.అందులో భాగంగా జిల్లాలోని డీఈఓ కార్యాలయంలో గత కొనేళ్లుగా వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న ఆరుగురి ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను తాజాగా డీఈఓ పి.రాజీవ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటేషన్ రద్దు అయిన ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి. పి.తిరుపతి (ఎస్ఏ, వర్ధన్నపేట మండలం పెరుమాండ్ల గూడెం యూపీఎస్), పి.రమేష్‌బాబు (ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం, బచ్చన్నపేట మండలం బోనుకుల్లు ఎంపీపీఎస్), పి.తిరుపతి (ఎస్జీటీ, ఏయిడెడ్ పాఠశాల శారదా విద్యానికేతన్), ఎస్పి.శేషుబాబు (ఏయిడెడ్ పాఠశాల, శారదా విద్యానికేతన్), సయ్యద్ అజీమ్ ఖురేషి (ఎస్జీటీ, హన్మకొండలోని మచిలీబజార్ పాఠశాల,‡ఉర్దూ మీడియం), కె.రజనీ (ఎస్జీటీ, డోర్నకల్ మండలం చిలుకోడు పాఠశాల) ఉన్నారు. -
అలా వెళ్లి ఇలా వచ్చారు
డీఈఓ కార్యాలయంలో డెప్యుటేషన్ల మాయ అనంతపురం ఎడ్యుకేషన్ డెప్యుటేషన్ పేరుతో కొందరు టీచర్లు ఏళ్ల తరబడి జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో తిష్ట వేశారు. అధికారులు వారిని ఓవైపు రిలీవ్ చేశామని చెబుతూనే మరోవైపు ‘అవసరం’ పేరుతో తిరిగి తీసుకుంటున్నారు. డెప్యూటేషన్లపై పనిచేస్తున్న ఉపాధ్యాయులను ప్రతి సంవత్సరం ఏప్రిల్ 24న డెప్యూటేషన్లు రద్దు చేసి స్కూళ్లకు పంపాలనేది నిబంధన. ఇది డీఈఓ కార్యాలయంలో అమలుకావడం లేదు. పరీక్షల విభాగంలో పనిచేస్తున్న టీచరుతోపాటు ఆర్‌ఎంఎస్‌ఏలో పనిచేస్తున్న మరో టీచరును రిలీవ్ చేశారు. అయితే రెండు రోజుల తర్వాత మళ్లీ వారు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తూ వీరు కనిపించడంతో అక్కడి ఉద్యోగులు కంగుతిన్నారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు టీచర్లపై నవంబర్‌లో పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యా యి. దీనిపై స్పందించిన కలెక్టర్ కోన శశిధర్ డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న ఏ ఒక్క టీచరు డీఈఓ కార్యాలయంలో ఉండరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు కూడా బుట్టదాఖలా అయ్యాయి. ఆదాయ వనరుగా మారిన వైనం.. డీఈఓ కార్యాలయంలో పనిచేస్తున్న కొందరు టీచర్లు అధికారులకు మంచి ఆదాయ వనరుగా మారారు. ఈ కారణంగానే వారిని బయటుకు పం పేందుకు ఇష్టపడడం లేదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి. పరీక్షల విభాగంలో పనిచేస్తున్న ఓ టీచరు సుమారు 20 ఏళ్లుగా ఇదే విభాగంలో కొనసాగుతూ చక్రం తిప్పుతున్నారు. పరీక్షల విభాగం సిబ్బందితో పాటు ఉన్నతాధికారులు సైతం ఈయన చెప్పినట్లే వినాల్సిన పరిస్థితి. పరీక్ష సెంటర్ల కేటాయింపు, సీఎస్, డీఓలు, ఇన్విజిలేటర్ల కేటాయింపు ఇలా ప్రతిదీ ఆయన ద్వారానే సాగుతోంది. ముఖ్యంగా పదో తరగతి సెంటర్ల కేటాయింపు, మూల్యాంకనం సందర్భాల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. నోట్‌ఫైల్ లేకుండానే: ఒక టీచర్‌ను డెప్యుటేషన్‌పై తీసుకోవాలంటే కచ్చితంగా ఫైల్ రన్ చేసి తీసుకోవాలి. సంబంధిత సెక్షన్ సూపరిం టెండెంట్ ద్వారా నోట్‌ఫైల్ సిద్ధం చేసి నేరుగా ఏడీకి అక్కడి నుంచి డీఈఓకు పంపి తర్వాత కలెక్టర్ ఆమోదం పొందిన తర్వాతనే తీసుకోవాలి. పరీక్షల విభాగంలో పనిచేస్తున్న టీచరు విషయంలో ఎలాంటి నోటిఫైల్ లేకుండా నేరుగా ఓ అధికారి ఆమోదముద్ర వేసి తీసుకోవడం కోసమెరుపు. -
DEO కార్యలయం ఎదుట డీఎస్సీ అభ్యర్ధులు ధర్నా
-
రూ.వెయ్యిస్తే ఎస్సార్!
విద్యాశాఖ, ఎల్ఎఫ్ ఆడిట్ సిబ్బంది చేతివాటం రెండు నెలలుగా అందని పీఆర్సీ వేతనాలు ఎయిడెడ్ టీచర్ల ఆవేదన విశాఖపట్నం: పిల్లలు బడికి వచ్చారో లేదో తెలుసుకోవడానికి టీచరు హాజరు పట్టీలో పేర్లను వరసగా పిలుస్తారు. అలా పిలిచేటప్పుడు వచ్చిన వారు ‘ఎస్ సార్’ అంటారు. ఆ విద్యార్థి వచ్చాడని నిర్ధారించుకుని ఆ మాస్టారు పట్టీలో హాజరు వేస్తారు. ఇప్పుడు పీఆర్సీ జీతాల బకాయిల చెల్లింపులకు అవసరమైన ఎస్సార్ (సర్వీసు రిజిస్టర్)లో నమోదుకు ఇటు డీఈవో కార్యాలయ సిబ్బంది, అటు ఎల్ఎఫ్ ఆడిట్ సిబ్బంది చేతులు తడపనిదే పని జరగడం లేదని ఎయిడెడ్ టీచర్లు ఆరోపిస్తున్నారు. ఫలితంగా రెండు నెలలుగా కొత్త జీతాలకు నోచుకోలేదని వాపోతున్నారు. వాస్తవానికి రెండు నెలల క్రితం టీచర్లకు జీతాల పీఆర్సీ అమలయింది. వీటిని పొందాలంటే ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు సంబంధిత కరస్పాండెంట్ల నుంచి జిల్లాలో ఎంఈవోలు, అర్బన్ పరిధిలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ల (డీఐ)ల ద్వారా, హైస్కూళ్లయితే డిప్యూటీ డీఈవోల ద్వారా డీఈవో కార్యాలయానికి పీఆర్సీ ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. డీఈవో కార్యాలయంలో వీటిని పరిశీలించి ఎల్ఎఫ్ ఆడిట్‌కు పంపుతారు. అక్కడ అభ్యంతరాలుంటే రిమార్కులో ఉంచుతారు. లేదంటే ఎస్సార్‌లో నమోదు చేస్తారు. దీంతో అభ్యంతరాల్లేని ఉపాధ్యాయులు పీఆర్సీ జీతాలకు లైన్ క్లియర్ అవుతుంది. కానీ డీఈవో కార్యాలయంలో సంబంధిత సిబ్బంది ఒక్కో టీచరు నుంచి రూ.వెయ్యి, ఎల్ఎఫ్ ఆడిట్ ఆఫీసులో మరో రూ.వెయ్యి చొప్పున వసూలు చే స్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు ఉపాధ్యాయులు మధ్యవర్తిత్వం వహిస్తున్నారని చెబుతున్నారు. అలా చెల్లించిన వారికి ఎస్సార్‌లో నమోదు చేయడంతో పీఆర్సీ జీతాలు పొందారని, లేనివారికి ఆగిపోయాయని పేర్కొంటున్నారు. జిల్లాలోని 26 ఎయిడెడ్ హైస్కూళ్లలో 16, రెండు ఓరియంటల్ స్కూళ్లు (సింహాచలం ఎస్వీఎల్ఎన్ సంస్కృతోన్నత పాఠశాల, చోడవరం హిందీ మహావిద్యాలయ)లతో పాటు పలు ప్రాథమిక పాఠశాలలు పీఆర్సీకి నోచుకోలేదని తెలుస్తోంది. ఇతర జిల్లాల్లో ఇప్పటికే పీఆర్సీ జీతాలు అందుకోగా రెండు నెలలవుతున్నా తమకు మాత్రం సిబ్బంది చేతివాటంతో జాప్యం జరుగుతోందని ఈ ఎయిడెడ్ టీచర్లు అంటున్నారు. లంచం అడిగితే చర్యలు.. పీఆర్సీ నమోదులో డీఈవో కార్యాలయ సిబ్బంది అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. లంచం ఇచ్చిన టీచర్లపైనా చర్యలుంటాయి. ఎవరైనా ఇబ్బంది పెడితే నేరుగా నన్ను సంప్రదించవచ్చు. ఎయిడెడ్ ఎలిమెంటరీ, హైస్కూల్ టీచర్ల పీఆర్సీ ప్రతిపాదనలు వేగవంతం చేస్తాం. ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఈ విషయాన్ని స్పష్టం చేశాం. -ఎం.వి.కృష్ణారెడ్డి, డీఈవో -
ఇకనుంచి గురు సేవా దర్బార్
ఏలూరు సిటీ : సర్కారు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై జిల్లా విద్యా శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ‘గురు సేవా దర్బార్’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులు ముగిసే వరకు ప్రతి బుధవారం, ఆ తరువాత ప్రతినెలా రెండో బుధవారం రోజున ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై డీఈవో కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తారు. వాటిని సత్వరమే పరిష్కరి స్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఈవో డి.మధుసూదనరావు ఇలా వివరించారు. = గురు సేవా దర్బార్ దేనికోసం .. డీఈవో : ఉపాధ్యాయులు అనేక రకాల సేవల కోసం నిత్యం మా కార్యాలయానికి వస్తుంటారు. సిబ్బంది కొరత కారణంగా వారి పనులను సకాలంలో పూర్తి చేయలేని పరిస్థితి ఉంది. రోజూ వచ్చి తిరిగి వెళ్లేకంటే నిర్దేశిత సమయంలో పూర్తిస్థాయిలో సేవలు అందించాలనే లక్ష్యంతో గురు సేవా దర్బార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. = ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు డీఈవో : వేసవి సెలవులు ముగిసే వరకు ప్రతి బుధవారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గురుసేవా దర్బార్ నిర్వహించి ఆర్జీలను స్వీకరిస్తాం. విద్యాశాఖ పరిధిలో ఉండే అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం. దీర్ఘకాలిక సమస్యలను సైతం వెంటనే పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. సాయంత్రం 5 గంటల అనంతరం పరి ష్కరించి తగిన ఉత్తర్వులు ఇస్తాం. = నిబంధనలు, మార్గదర్శకాలు ఏమైనా ఉన్నాయా డీఈవో : ఉపాధ్యాయులు నేరుగా, స్వేచ్ఛగా తమ సమస్యల్ని పరిష్కరించుకునే వేదికగా దీనిని తీర్చిదిద్దుతున్నాం. ఒక ఉపాధ్యాయుడు ఒక ఆర్జీ మాత్రమే స్వయంగా తీసుకురావాలి. ఉపాధ్యాయ సంఘాల ద్వారా ఆర్జీలు తీసుకువస్తే స్వీకరించేది లేదు. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా కొత్త కేసులు తగ్గటంతోపాటు, ఉపాధ్యాయుల సమస్యలన్నీ సకాలంలో పరిష్కారం అవుతాయి. = జిల్లాలో ఎంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు డీఈవో : ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 15వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారు 8వేల మంది ఉన్నారు. వీరితోపాటు కార్యాలయాల్లో పనిచేసే బోధనేతర సిబ్బందికి సైతం జిల్లా విద్యాశాఖ కార్యాలయ సేవలు అందించాల్సి ఉంది. = ఏ ఏ సేవలు అందిస్తుంటారు డీఈవో : ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి సంబంధించి సుమారు 40 రకాల సేవలను అందిస్తున్నాం. సర్వీసు క్రమబద్దీకరణ, వృత్తి ధ్రువీకరణ, ఇంక్రిమెంట్ల మంజూరు, పాస్‌పోర్టుల కోసం ఎన్వోసీ, విదేశీ పర్యటనకు అనుమతులు, ప్రావిడెంట్ ఫండ్ మంజూరు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు, ప్రతిభా పురస్కారాలు, ప్రజావాణి కేసులు, సస్పెన్షన్ల ఎత్తివేత, పదోన్నతులు, ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలు, ఎఫ్ఏసీ అలవెన్సులు వంటి సేవలు అందిస్తాం. -
కట్టలు తెగిన ఆగ్రహం
విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన డీఈఓ కార్యాలయం ముట్టడి పిల్లలను పరీక్షల్లో పాస్ చేయాలని డిమాండ్ సిటీబ్యూరో/అఫ్జల్‌గంజ్: హైదరాబాద్ డీఈఓ కార్యాలయ పరిసరాలు మంగళవారం రణరంగాన్ని త లపించాయి. తమకు న్యాయం కావాలని వస్తే.. అధికారుల స్పందన సరిగా లేదని కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు కార్యాలయంపై దాడి చేశారు. తలుపులు, కిటికీల అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. పదో తరగతిలో తమ పిల్లలు తప్పడానికిఅధికారులే కారణమని ఆరోపించారు. తప్పులను సరిదిద్ది ఉత్తీర్ణులను చే యాలని డిమాండ్ చేస్తూ... గన్‌ఫౌండ్రీలోని డీఈఓ కార్యాలయాన్ని విద్యార్థులతో కలసి తల్లిదండ్రులు ముట్టడించారు. తమకు న్యాయం కావాలని కోరుతూ తొలుత బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యాలయానికి వెళ్లారు. విద్యార్థులను పాస్ చేయించడం తమ పరిధిలో లేదని... డీఈఓ కార్యాలయానికి వె ళ్లాలని అక్కడి ఉద్యోగులు వీరికి సూచించారు. దీంతో డీఈఓ కార్యాలయానికి చేరుకొని...దాదాపు గంట పాటు అక్కడే బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని బయటకు పంపించారు. కొద్దిసేపటి తర్వాత మళ్లీ వారంతా డీఈఓ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులకు, వారికి తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు డీఈఓ కార్యాలయంలోకి చొచ్చుకువెళ్లి పూల కుండీలు కిందపడేశారు. రాళ్లతో తలుపుల అద్దాలు పగులగొట్టారు. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. దాడికి దిగారన్న అనుమానంతో ఇద్దరు విద్యార్థులను, తల్లిదండ్రులను పోలీసులు అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డి, ఏసీపీ రాఘవేందర్ రెడ్డి డీఈఓ కార్యాలయానికి వెళ్లారు. సంఘటనపై ఆరా తీశారు. ఇదిలా ఉండగా... ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతుండగా... తాము ఎవరిపైనా ఫిర్యాదు చేయలేదని డీఈఓ కార్యాలయ అధికారులు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఈఓ అన్నారు. రీవాల్యూయేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మూల్యాంకన లోపాలే శాపం దోమలగూడ: గణితం జవాబు పత్రాల మూల్యాంకన సూత్రాల్లోని లోపాలే పదో తరగతిలో ఆ సబ్జెక్టులో ఎక్కువ మంది విద్యార్థులు తప్పడానికి కారణమని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి అభిప్రాయపడ్డారు. దోమలగూడలోని రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. సహజంగా చాయిస్ ఉన్న ప్రశ్నల్లో రాయాల్సిన కంటే ఎక్కువ వాటికి సమాధానాలు రాసినపుడు అత్యధిక మార్కులు పొందిన సమాధానాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. గణితంలో తొలుత రాసిన సమాధానాలను మాత్రమే (తక్కువ మార్కులు వచ్చినా) తీసుకొని మిగిలిన వాటిని దిద్దకుండా వదిలేయాలని మూల్యాంకన సూత్రాల్లో పేర్కొన్నారని వివరించారు. తెలుగు, హిందీ సబ్జెక్టుల్లో మాత్రం అన్ని సమాధానాలను దిద్ది... అత్యధిక మార్కులు వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టంగా చెప్పారన్నారు. ఇతర సబ్జెక్టుల్లో ఈ అంశాన్నే ప్రస్తావించలేదని తెలిపారు. ఈ కారణంగానే గణితంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయినట్లు అర్థమవుతోందన్నారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పరీక్ష తప్పే అవకాశం లేదు... మా అమ్మాయి జ్యోతి వైష్ణవ్ పరీక్ష బాగా రాసింది. ఎట్టి పరిస్థితుల్లో ఫెయిలయ్యే అవకాశమే లేదు. అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులు సంపాదించినా.. గణితంలో ఫెయిల్ చేశారు. న్యాయం కావాలని డీఈఓ ఆఫీస్‌కు వెళితే.. అక్కడదాడి జరగడంతో మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అద్దాలు ధ్వంసం చేసింది ఇతరులైతే.. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. - అనిత, మంగళ్‌హాట్ బాగా రాసినా... సైన్స్ మినహా అన్ని సబ్జెక్టుల్లో నాకు ఎ, బి గ్రేడ్లు వచ్చాయి. మిగతా వాటిలాగే సైన్స్ పరీక్ష బాగా రాశా. తీరా ఫలితాలు చూస్తే ఫెయిల్. అధికారులు సరిగా దిద్దకపోవడమే కారణం. డీఈఓ ఆఫీస్ దగ్గర గొడవైతే అన్యాయంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. - ఎండీ ఇక్బాల్, ఏసీ గార్డ్స్, లక్డీకపూల్ -
డీఈవో కార్యాలయంపై తల్లిదండ్రుల దాడి
హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్రలు ఆందోళన రెండోరోజు కూడా కొనసాగుతోంది. కావాలనే మార్కులు తక్కువగా వేసి విద్యార్థులు పరీక్షల్లో ఫెయిల్ అయ్యేందుకు కారణం అయ్యారంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మంగళవారం హైదరాబాద్ డీఈవో కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అన్ని సబ్జెక్ట్‌ల్లో పాసయిన తమ పిల్లలు మ్యాథ్స్, ఫిజిక్స్‌లోనే ఎందుకు తప్పారో చెప్పాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలపాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ఫెయిల్ అయిన పదో తరగతి విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పష్టం చేశారు. బట్టీ విధానంతో పాటు, కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా సీసీఈ విధానం అమలు చేశామన్నారు. అయితే విద్యార్థులు ఆ విధానాన్ని అలవాటు పడాల్సి ఉందన్నారు. -
డీఎస్సీ అభ్యర్థుల ఆందోళన
కడప ఎడ్యుకేషన్: దరఖాస్తులు తీసుకోవాలంటూ డీఎస్సీ అభ్యర్థులు డీఈఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెండో శనివారం డీఈఓ కార్యాలయానికి సెలవు. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించకుండా దరఖాస్తులతో ఉదయాన్నే కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కానీ సిబ్బంది ఎవరూ లేరు. కార్యాలయ ప్రధాన గేటుకు రెండో శనివారం, ఆదివారాలు సెలవని బోర్డును ఏర్పాటు చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చామని, తమను పట్టించుకోవటం లేదంటూ కార్యాలయం వద్ద ఆందోళన చేసి ఎదురుగా ఉన్న రోడ్డుపై బైఠాయించారు. దరఖాస్తులను స్వీరించాలని నినాదాలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న డీఈఓ ప్రతాప్‌రెడ్డి కార్యాలయ సిబ్బందిని పంపి అభ్యర్థుల దరఖాస్తులను స్వీరించి సమస్యను పరిష్కరించారు. ట్రాఫిక్‌కు అంతరాయం: డీఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు పైన డీఎస్సీ అభ్యర్థులు బైఠాయించి ఆందోళన చేయటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీనికి తోడు ఈ దారిలోనే రిమ్స్ హాస్పిటల్ ఉండటంతో అక్కడికి వెళ్లే చాలా మంది సిబ్బంది, రోగులు కూడా అసౌకర్యానికి గురయ్యారు. ఆ దారిన వెళ్లే కొంత మంది జనం డీఎస్సీ అభ్యర్థులతో వాగ్వాదానికి దిగారు. మీ సమస్య ఉంటే డీఈఓ కార్యాలయం వద్ద అందోళన చేసుకోవాలి కానీ రోడ్డుపై బైఠాయించటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో కార్యాలయ సిబ్బంది వచ్చి దరఖాస్తులను తీసుకుంటామని చెప్పటంతో అభ్యర్థులంతా వెళ్లిపోయారు. అభ్యర్థులు కూడా అర్థం చేసుకోవాలి: డీఈఓ ప్రభుత్వ సెలవు దినాల్లో దరఖాస్తులు స్వీకరించబోమని రెండు సార్లు పేపర్లలో ప్రకటనలు ఇచ్చాం. పైగా కార్యాలయ వద్ద ఉన్న గేటుకు కూడా బోర్డును ఏర్పాటు చేశాం. దరఖాస్తులకు గడువేం ముగియలేదు ఈ నెల చివరి వరకూ ఉంది కదా. ఇలా చేయటం సబబు కాదు. కార్యాలయానికి సెలవు కావటంతో సిబ్బంది పనులపై ఎక్కడెక్కడికో వెళ్లి ఉంటారు. అలాంటి వారిని కార్యాలయానికి రమ్మనటం భావ్యం కాదు కదా. డీఎస్సీ అభ్యర్థులు కూడా పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వారికి ఇబ్బంది కలుగకూడదనే సిబ్బందిని కార్యాలయానికి పిలిపించి దరఖాస్తులు తీసుకున్నాం. - ప్రతాప్‌రెడ్డి, డీఈఓ, వైఎస్ఆర్ జిల్లా -
జిల్లాలో 1530 ఉపాధ్యాయ ఖాళీలు
కరీంనగర్ ఎడ్యుకే షన్: విద్యాశాఖలో ఉపాధ్యాయుల ఖాళీల వివరాలపై నివేదికను డీఈవో కార్యాలయం నుంచి రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులకు సమర్పించారు. విదావ్యవస్థను గాడిలో పెట్టడానికి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల ఖాళీలను పరిగణలోకి తీసుకుంటే ఇప్పటికే 1530 ఖాళీలున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. దీనిలో సెకండ్ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ)లు 882 కాగా, స్కూల్ అసిస్టెంట్లు వివిధ సబ్జెక్టులకు కలిపి మొత్తం 322 ఉన్నాయి. ఇందులో గణితం 62, ఫిజికల్ సైన్స్ 28, బయోలజీ 55, సోషల్ 92, ఇంగ్లీష్ 27, తెలుగు 31, హిందీ 27 గా ఉన్నాయి. లాంగ్వేజ్ పండిట్స్ గ్రేడ్-2 తెలుగు 92, హిందీ 27, వ్యాయామ ఉపాధ్యాయులు 86 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జిల్లాలో ఉన్నత పాఠశాలల్లో 27 ప్రధానోపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉండ గా (ఫీమెయిల్ లిటరేచర్ ), ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు 47 ఖాళీలుగా ఉస్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారికంగా రాష్ట్ర శాఖకు నివేదికను సమర్పించింది. -
ఆన్లైన్లో ఆరా
* పాఠశాలల పనితీరు పరిశీలనకు కొత్త పద్ధతి * ప్రత్యేక ఫార్మాట్ రూపొందించిన విద్యా శాఖ * డీఈఓ కార్యాలయం నుంచే పర్యవేక్షణ ఖమ్మం : సర్కారు పాఠశాలల పనితీరును ఇక ఇట్టే పసిగట్టొచ్చు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విధులు, పాఠశాల ప్రగతి, సౌకర్యాలు, అవసరాలు తదితర అంశాలను తెలుసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు కొత్త విధానాన్ని అవలంబించనున్నారు. విద్యా శాఖ కార్యాలయం నుంచే అన్ని పాఠశాలల పరిస్థితులు ఆన్లైన్ ద్వారా తెలుసుకోనున్నారు. రాష్ట్రం లోనే మొదటిసారిగా జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. నమోదు చేసే అంశాలు ఇవే... ప్రతి పాఠశాల రిపోర్టును ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. ఇందుకు ఖమ్మం : సర్కారు పాఠశాలల పనితీరును ఇక ఇట్టే పసిగట్టొచ్చు. విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల విధులు, పాఠశాల ప్రగతి, సౌకర్యాలు, అవసరాలు తదితర అంశాలను తెలుసుకునేందుకు జిల్లా ఉన్నతాధికారులు కొత్త విధానాన్ని అవలంబించనున్నారు. విద్యా శాఖ కార్యాలయం నుంచే అన్ని పాఠశాలల పరిస్థితులు ఆన్లైన్ ద్వారా తెలుసుకోనున్నారు. రాష్ట్రం లోనే మొదటిసారిగా జిల్లాలో ఈ విధానానికి శ్రీకారం చుడుతున్నారు. నమోదు చేసే అంశాలు ఇవే... ప్రతి పాఠశాల రిపోర్టును ఆన్లైన్లో పొందుపర్చాల్సి ఉంటుంది. దీనిని జిల్లా విద్యాశాఖ అధికారి వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు. ఇందుకు ముఖ్యంగా పాఠశాలల్లో విద్యార్థులు, బడిబయట ఉన్న పిల్లలు, ఈ ఏడాది బడిలో చేరిన విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల వివరాలు, వారి అర్హత, వారు ఎంతకాలంగా పనిచేస్తున్నారు, పాఠశాల అభివృద్ధిలో యాజమాన్యం కమిటీ భాగస్వామ్యం ఎంత, పాఠశాలల్లో సమకూర్చాల్సిన సౌకర్యాలు, ఇప్పటి వరకు ఉన్న సౌకర్యాలు తదితర అంశాలను ఆన్లైన్లో పొందుపరుస్తారు. అదేవిధంగా విద్యార్థుల ప్రగతి నివేదిక, యూనిట్, సమ్మెట్ పరీక్షల్లో సాధించిన గ్రేడ్లు కూడా ఆన్లైన్లో ఉంచుతారు. ప్రయోజనమిలా... ప్రభుత్వ పాఠశాలల వివరాలు ఆన్లైన్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయుల సంఖ్య, వారి సర్వీస్ విషయంలో తలెత్తే పొరపాట్లు సవరించొచ్చని, పదోన్నతులు పాదర్శకంగా చేపట్టొచ్చని, ఉపాధాయులు పనితీరును కూడా పసిగట్టొచ్చని అంటున్నారు. విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తూ ప్రత్యేక కార్యాచరణతో బోధించొచ్చని పేర్కొంటున్నారు. సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక విద్యామిషన్, పాఠశాల అభివృద్ధి నిధులు, ఇతర గ్రాంట్స్ వినియోగం విషయాలను వెనువెంటనే తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. పాఠశాలల్లోని తాగునీరు, విద్యుత్, అదనపు తరగతి గదులు తదితర సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవడంతోపాటు మంజూరైన నిధులతో ప్రాధాన్యత క్రమంలో పనులు చేపట్టొచ్చని వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా.. మధ్యాహ్న భోజనం విద్యార్థులకు సరిగా అందుతోందా..? అనే విషయాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. బడికి సక్రమంగా వెళ్లని ఉపాధ్యాయులపై చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. అయితే.. కంప్యూటర్లు ఉన్న పాఠశాలల్లో ఈ విధానం సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది. కంప్యూటర్లు లేని పాఠశాలల వివరాలు ఎలా తెలుసుకోవాలన్నదే విద్యా శాఖ అధికారులకు అంతుపట్టడం లేదని తెలుస్తోంది. పర్యవేక్షణ ఇక సులభం: రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల వివరాలను ఆన్లైన్లో ఉంచబోతున్నాం. దీంతో పర్యవేక్షణ సులభతరం కానుంది. సమాచార హక్కు వివరాలు అడిగిన వారికి ఇచ్చేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది. ఆన్లైన్ ప్రక్రియ కోసం అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు, డివిజన్, మండల విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే ప్రత్యేక ఫార్మట్ తయారు చేసి పంపించాం. -
కదులుతున్న డొంక
* నకిలీ సర్టిఫికెట్లపై సీబీసీఐడీ విచారణ * ఇద్దరు టీచర్లు, అధికారుల నుంచి వివరాల సేకరణ కడప ఎడ్యుకేషన్: నకిలీ సర్టిఫికెట్లపైన కొందరు ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారనే విషయంపై డొంక కదులుతోంది. గురువారం తిరుపతికి చెందిన సీబీసీఐడీ అధికారులు డీఈఓ కార్యాలయం లో విచారణ చేపట్టారు. ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులతోపాటు అప్పట్లో వారికి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులను సైతం విచారించారు. 2009లో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు పొందారనే అరోపణలపై దుమారం చెలరేగింది. అప్పట్లో పాఠశాల విద్యా కమిషనర్ విచారణకు అదేశిస్తూ డీఈఓ కార్యాలయ ఏడీలతో రాష్ట్రవ్యాప్తంగా కేసులను నమోదు చేయించారు. దీంతో సర్టిఫికెట్లను పరి శీలించాలని ఆదేశిస్తూ సంబంధింత కేసును సీబీసీఐడీకి అప్పగించారు. ఈ మేరకు తిరుపతికి చెందిన సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ జి. కళావతి సిబ్బందితో గురువారం డీఈఓ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇందులో కదులుతున్న డొంక భాగంగా నకిలీ సర్టిఫికెట్లు పెట్టి ప్రమోషన్ పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వేంపల్లి మండలం తాళ్లపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ప్రకాషరాజ్(ఇంగ్లీష్)ను, అలాగే చాపాడు మండలం నక్కలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన మునెయ్య (సోషియల్)తో పాటు అప్పట్లో వారికి సంబంధించిన సర్టిఫికెట్లను పరిశీలించిన అధికారులను( ఎంఈఓలు, హెచ్ఎంలు) సైతం విచారించారు. సర్టిఫికెట్లను ఏ యూనివర్శిటీ నుంచి తెచ్చుకున్నారనే విషయాలపై కూలంకషంగా విచారణ చేశారు. నివేదిక సమర్పిస్తాః సీబీసీఐడీ సీఐ 2009లో నకిలీ సర్టిఫికెట్లతో ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు పొందారనే విషయంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణకు కడపకు వ చ్చినట్లు సీబీసీఐడీ ఇన్స్పెక్టర్ జి. కళావతి పేర్కొన్నారు. అప్పట్లో కడప జిల్లా నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ పొందారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. సంబంధిత ఇద్దరు టీచర్లను పిలిపించామన్నారు. సంబంధిత నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు. వారికి సర్టిఫికెట్లను జారీ చేసిన యూనివర్సిటీలకు గుర్తింపు ఉందా లేదా అనే విషయాలను కూడా విచారిస్తామన్నారు. వీరిలో ఒకరేమో సేలంలోని వినాయక మిషన్ యూనివర్సీటీ నుంచి సర్టిపికెట్ తేగా మరొకరు రాజస్తాన్‌లోని జేఆర్ఎం యూనివర్శిటీ నుంచి తెచ్చారన్నారు. వీరు సర్టిఫికెట్లు తెచ్చేనాటికి వాటికి యూజీసీ గుర్తింపు ఉన్నదా లేదా అనేది కూడా విచారిస్తామన్నారు. సంబంధిత సర్టిఫికెట్లు నకిలీవని తేలితే ఇద్దరు ఉపాధ్యాయులతోపాటు వారి సర్టిఫికేట్లను పరిశీలించిన వారిపై కూడా చర్యలు ఉంటాయన్నారు. విచారణలో సిబ్బంది గోపీనాధ్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, శివ తదితరులు కూడా పాల్గొన్నారు. నకిలీ సర్టిఫికెట్లు కావు: తమ ప్రమోషన్ల సమయంలో చూపిన సర్టిఫికెట్లు నకిలీవి కావని ఉపాధ్యాయులు మునెయ్య, ప్రకాష్‌రావు పేర్కొన్నారు. అప్పట్లో విద్యాశాఖాధికారులు కూడా పరిశీలించారన్నారు. తాము సర్టిఫికెట్లు పొందిన యూనివర్సిటీలు గుర్తింపు ఉన్నవేనని అన్నారు. -
ముడుపులిస్తే డిప్యూటేషన్లు!
దళారులకు అడ్డాగా మారిన డీఈఓ కార్యాలయం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న ఇన్చార్జి కలెక్టర్ సంగారెడ్డి మున్సిపాలిటీ: ముడుపులు చెల్లించుకుంటే చాలు కొరుకున్న చోటుకు డిప్యూటేషన్‌పై పోస్టింగ్.. ఇందుకు డీఈఓ కార్యాలయం కేంద్రబిందువుగా మారింది. జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయ సంఘ నేతలు డీఈఓ కార్యాలయంలోని ఒక ముఖ్య అధికారి ద్వారా అక్రమ డిప్యుటేషన్లు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో వేల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఈ విషయంలో జిల్లా విద్యాశాఖాధికారి తీరుపై ఇన్చార్జి కలెక్టర్ పట్టీపట్టనట్లు వ్యవహరించడంతో విద్యాశాఖ కార్యాలయంలో అవినీతి పెరిగిపోతుంది. బుధవారం తాజాగా సిద్ధిపేట డివిజన్‌కు సంబంధించిన 9 మందిని వారు కోరుకున్న చోటుకు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. దీంతో ఇద్దరున్న పాఠశాలలో ఒక టీచరు వెళ్లిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉచిత విద్యనందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ప్రకటనలు చేస్తున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం విఫలమవుతోంది. ఇప్పటికే ఐదు తరగతులకు ఇద్దరు ఉపాధ్యాయులున్న పాఠశాలల నుంచి ఒకరిని డిప్యుటేషన్‌పై పంపి ఆయన స్థానంలో మరొకరిని నియమించకపోవడంతో ఐదు తరగతులకు ఒక్క ఉపాధ్యాయుడే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. నిబంధనల ప్రకారం వర్క్ అడ్జెస్ట్మెంట్ కింద ఎక్కువగా ఉన్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులను టీచర్లు లేని పాఠశాలలకు డిప్యుటేషన్‌పై పంపించాలని నిబంధనలు ఉన్నాయి. కాని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయ సంఘాల పైరవీలకు ప్రాధాన్యతనిస్తూ నిబంధనలు పాటించకుండానే డిప్యుటేషన్లు వేస్తున్నారు. దీంతో నిరుపేద విద్యార్థులు చదివే ప్రభుత్వ పాఠశాలలు మూతపడే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు ఉదాహరణగా అల్లాదుర్గ్ మండలం గొల్లకుంట తండాలో పనిచేస్తున్న శ్రీలతను నిబంధనలకు విరుద్ధంగా సంగారెడ్డికి డిప్యుటేషన్‌పై పంపారు. ఆమె పనిచేస్తున్న పాఠశాలలో 78 మంది విద్యార్థులు ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు. సిద్ధిపేట డివిజన్లో సైతం మంత్రి, ఎమ్మెల్సీలు సిఫార్సు చేశారంటూ డిప్యుటీ డీఈఓ నేరుగా డిప్యుటేషన్లపై బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఇదే అదునుగా తీసుకుని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలోని ముఖ్య అధికారి ఒకరు మంత్రులు సమర్పించిన జాబితాలో మామూళ్లు దండుకుని అదనంగా మరికొన్ని పేర్లు చేర్చి డిప్యుటేషన్లు వేస్తున్నారు. ఫలితంగా నిరుపేద విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. వీటిపై కలెక్టర్ దృష్టి సారించి అక్రమ డిప్యుటేషన్లను రద్దు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారిని వివరణ కోరగా నిబంధనల మేరకే డిప్యుటేషన్లు వేస్తున్నామని పొంతన లేని సమాధానం ఇచ్చారు. -
విద్యాశాఖలో వసూళ్లపర్వం
పైసా విదిలిస్తేనే పనులు - రికార్డు షీట్ బుక్కు అసలు రూ.125, కొసరు రూ.400 - టీసీ బుక్కు అసలు రూ.125, కొసరు రూ.500పైనే కరీంనగర్ ఎడ్యుకేషన్ : పాఠశాలల్లో అందించే టీసీ.. రికార్డు షీట్స్ బుక్కుల విలువ ఎంతో తెలుసా..? అధికారికంగా రూ.200 ఉంటే.. అనధికారికంగా మరో రూ.వెయ్యి చెల్లించాల్సిందే.. ఇక్కడ కొసరే అధికం. ప్రింట్ చేసిన రికార్డ్ షీట్ బుక్స్, టీసీ బుక్స్ ద్వారా డీసీఈబీ ఖజానాకు రూ.3.50 లక్షలు వస్తుండగా.. కొసరు రూపంలో అధికారులకు ముట్టేది ఏకంగా రూ.17 లక్షలు. నమ్మశక్యంగా లేకున్నా.. నమ్మాల్సిన నిజం. పాఠశాలలకు టీసీ, రికార్డ్ షీట్స్ బుక్కులను డీఈవో కార్యాలయం నుంచి తీసుకెళ్లేందుకు ఆయా పాఠశాలలు రూ. 200 డీసీఈబీలో చెల్లించాలి. కొసరుగా అనధికారికంగా రూ.వెయ్యి చెల్లిస్తేనే వాటిని పాఠశాలలకు అప్పగిస్తున్నారు డీఈవో కార్యాలయ అధికారులు. విద్యార్థులను చేర్చుకోవాలంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ), ప్రాథమిక స్థాయి విద్యార్థులకు రికార్డుషీట్ తప్పనిసరి. వీటిని విద్యార్థులకు ఇవ్వాలంటే విద్యార్థి గతంలో చదివిన పాఠశాల ప్రభుత్వ అనుమతి పొంది ఉండడంతోపాటు ఆ పాఠశాలకు జిల్లా విద్యాశాఖ నుంచి టీసీ, రికార్డు షీట్ బుక్ తప్పనిసరి. ఈ బుక్స్కోసం పాఠశాలల కరస్పాడెంట్లు, ప్రధానోపాధ్యాయులు డీఈవో కార్యాలయానికి రావాల్సిందే. టీసీ బుక్కు రూ.125, రికార్డు షీట్ బుక్కు రూ.75 డీసీఈబీలో చెల్లిస్తే సరిపోతుంది. కానీ.. జిల్లా విద్యాధికారి కార్యాలయంలో అధికారులు మాత్రం వాటిని ఆ రేటుకు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. తమకు ‘కొసరు’ ముట్టజెప్పితేనే షీట్లను ఇస్తామంటూ మొండికేస్తున్నారు. పాఠశాలలకు గుర్తింపు ఉన్నా.. వారు అడిగినంత ఇవ్వాల్సిందే.. లేకుంటే కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. వారు డిమాండ్ చేసే ‘కొసరు’ ఏకంగా రూ. వెయ్యి. అసలు కన్నా.. కొసరే అధికంగా ఉండడంతో పాఠశాలల యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి. వారు అడిగినంత ఇవ్వకుంటే పాఠశాలపై పగ పెంచుకుంటారని, అందుకే ఇచ్చుకోవాల్సి వస్తోందని పాఠశాలల నిర్వాహకులు వాపోతున్నారు. టీసీ, రికార్డు షీట్ తీసుకోవడమిలా.. ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి పొందిన పాఠశాలలు టీసీ బుక్ తీసుకోవడానికి జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డులోని కార్యదర్శికి ఆరో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు క్వశ్చన్ పేపర్స్‌కు రుసుం చెల్లించి బకాయిలు లేవని ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలి. అనంతరం టీసీ బుక్ కోసం మళ్లీ ప్రత్యేకంగా బ్యాంక్ ద్వారా చలానా రూపంలో రూ.125తోపాటు ఉప విద్యాధికారి ధ్రువీకరించిన పత్రాన్ని డీఈవో కార్యాలయంలో అందించాలి. దానిని సంబంధిత కార్యాలయం సెక్షన్ అధికారులు పరిశీలిం చి టీసీ బుక్ అందిస్తారు. ప్రాథమిక పాఠశాలలు రూ.75 చెల్లిస్తే సరిపోతుంది. ఈ ఏడు డీసీఈబీ మూడు వేల రికార్డు షీట్లు, వెయ్యి టీసీ బుక్‌లను ప్రింట్ చేయించింది. రికార్డు షీట్స్ బుక్స్‌కు అధికారికంగా డీసీఈబీకి వచ్చేది రూ.2.25 లక్షలు. టీసీ బుక్‌లకు రూ.1.25 లక్షలు. అధికారులకు ముట్టేది మాత్రం అక్షరాల రూ.17 లక్షలు. కొసరు మొత్తాన్ని కిందిస్థాయి ఉద్యోగులు వాటాలుగా పంచుకుంటున్నారని సమాచారం. టీసీలు అందించే విభాగాన్ని కార్యాలయంలోని ఓ ఉద్యోగికే ఏళ్ల తరబడిగా కేటాయించడంతో ఈ తంతుకు అంతులేకుండా పోతోందని గుసగుసలాడుకుంటున్నారు. వంద పేపర్లకు వేల రూపాయలా? ఒక బుక్‌లో వంద పేజీలుంటే.. దానికి జిల్లా విద్యాశాఖ అధికారులు వేలాది రూపాయలు వసూలు చేయడంపై హెచ్ఎంలు పెదవి విరుస్తున్నారు. ఇన్‌వార్డు, అవుట్‌వార్డు, స్టాంపింగ్ చేసే అటెండర్‌నుంచి విద్యాధికారి కార్యాలయంలోని అధికారి వరకు పైసలు ఇస్తేనే చేతికి బుక్స్ అనే తీరు సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే బుక్ ఇవ్వకపోగా మీ పాఠశాలలో అన్నీ సరిగా ఉన్నాయా? అంటూ దబాయించే స్థాయిలో ఉన్న వీరిని పై అధికారులే సరిచేయాలని కోరుతున్నారు. సూచనలిస్తాం - ప్రసాద్‌రావు, ఏడీ, డీఈవో కార్యాలయం -
రాజకీయ బది‘లీలలు’
జిల్లాలో 33 మంది టీచర్లకు గ్రీన్‌సిగ్నల్ డీఈవో కార్యాలయానికి చేరిన ఉత్తర్వులు నేతల ‘హస్తం’ సాక్షి, మచిలీపట్నం : కోరుకున్నచోటు ఉంటుందో లేదో అన్న ఆందోళన.. రోజులతరబడి మానసిక ఒత్తిడి.. గంటల తరబడి నిరీక్షణ.. ఇదీ టీచర్లకు నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియలో వారు అనుభవించే వేదన. ఇటువంటి కష్టాలకు చెల్లుచీటీ రాస్తూ.. రాజకీయ నేతల అభయహస్తం ఉంటే చాలు అడ్డదారిలో కావాల్సినచోటకు బదిలీ చేయిచుకోవచ్చని పలువురు గురువులు రుజువు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గురుకులం (టీచర్ల కమ్యూనిటీ)లో కాస్త పట్టు సాధించడంతో పాటు నాలుగు రాళ్లు వెనకేసుకోవచ్చని భావించిన అధికార పార్టీ నేతలు ఈ ప్రక్రియకు తెరతీశారు. దాదాపు మూడు నెలలుగా సాగిన ఉపాధ్యాయ బదిలీలకు సీఎం సోమవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అందుకు సంబంధించిన ఉత్తర్వులు మంగళవారం జిల్లాకు చేరాయి. రాష్ట్రంలో సుమారు 600 మంది ఉపాధ్యాయుల బదిలీలకు ఆమోదముద్ర వేయగా జిల్లాలో 33 మంది ఉన్నారు. కోరుకున్న ప్రాంతాలకు బదిలీ... జిల్లాలో 33 మంది ఉపాధ్యాయులను వారు కోరుకున్న ప్రాంతాలకు బదిలీ చేస్తూ వ్యక్తిగత ఉత్తర్వులు వచ్చాయి. జిల్లాలోని కాంగ్రెస్ నేతలు తమను ఆశ్రయించిన ఉపాధ్యాయులకు బదిలీలు చేయించుకున్నారు. జిల్లాలో బదిలీ అయిన 33 మంది టీచర్లలో స్కూల్ అసిస్టెంట్లు 20 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్డీటీ)లు ఐదుగురు, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలు ఐదుగురు, స్కూల్ అసిస్టెంట్లు (హిందీ) ముగ్గురు ఉన్నారు. ఉత్తర దక్షిణాలతో ప్రయత్నం సఫలం... అందరితో పోటీపడి కౌన్సెలింగ్‌కు వెళితే కావాల్సినచోటు ఉంటుందో లేదో అనుకునే ఉపాధ్యాయులు ఈసారి రాజకీయ అస్త్రాన్ని ఆశ్రయించారు. అందుకు వారు ఉత్తర దక్షిణా(సిఫారసు, డబ్బు)లను ప్రయోగించారు. కాంగ్రెస్ నేతల సిఫారసుతో పలువురు టీచర్లు తమకు కావాల్సినచోటుకు మార్పించుకునేందుకు ఒక్కొక్కరు రూ.1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు సమర్పించుకున్నట్టు సమాచారం. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో జరిగిన ఈ బదిలీలతో వేసవిలో జరిగే కౌన్సెలింగ్‌కు ఇబ్బందికరమేనని విద్యావేత్తలు అంటున్నారు. దీంతో వచ్చే వేసవిలో నిర్వహించే బదిలీల కౌన్సెలింగ్‌కు మిగిలే ఉపాధ్యాయులకు కనీస సౌకర్యాలు లేని, మారుమూల పాఠశాలలే దిక్కని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర్వులను అమలు చేస్తాం : డీఈవో జిల్లాలో 33 మంది ఉపాధ్యాయులను బదిలీ చేస్తూ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాణీమోహన్ ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తున్నట్టు డీఈవో డి.దేవానందరెడ్డి ‘సాక్షి’కి వివరణ ఇచ్చారు. ఉపాధ్యాయుల బదిలీలకు వ్యక్తిగత ఉత్తర్వులు ఇచ్చినందున వారికి అందజేస్తామని తెలిపారు. ప్రస్తుతం వారికి కేటాయించిన పాఠశాలల్లో ఒకవేళ ఇటీవల భర్తీ అయ్యి ఖాళీ లేకపోతే పక్క మండలాల్లో నియమించేలా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారని డీఈవో చెప్పారు. దీని ప్రకారం 33 మంది టీచర్లలో సుమారు నలుగురు వరకు వారు గతంలో కోరుకున్న పాఠశాలల్లో ఖాళీలు లేవని, వారికి పక్క మండలాల్లో కోరుకున్న పాఠశాలకు బదిలీ చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి హామీ
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండల (జాక్టో) నాయకులు గురువారం డీఈఓ మువ్వా రామలిం గంతో భేటీ అయ్యారు. దర్గామిట్టలోని డీఈఓ కార్యాలయంలో గురువారం డీఈఓ, జాక్టో నాయకుల మధ్య చర్చలు జరిగాయి. పలు సమస్యలపై డీఈఓ సానుకూలంగా స్పందించారు. ప్రధానోపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి ఈ నెల 15, 16వ తేదీల్లో అప్పీళ్లను స్వీకరించి, అర్హత గల జాబితాతో ఆర్జేడీ అనుమతి మేరకు ఈ నెల 27న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 29న స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులను చేపడతామని వివరించారు. మిగిలిన సమస్యలను నెలాఖరులోపు పరిష్కరిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆం దోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తామని వివరించారు. పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు నాగేంద్రకుమార్, బీటీఏ నాయకుడు మాల్యాద్రి, ఏపీటీఎఫ్ నాయకుడు సుబ్రహ్మణ్యం, ఇతరులు సుబ్బారావు, పద్మజ, కృష్ణారెడ్డి, ఆదినారాయణ పాల్గొన్నారు. -
నల్గొండ డీఈవో కార్యాలయంలో అగ్నిప్రమాదం