డీఈవో కార్యాలయంలోని టీచర్ల డిప్యూటేషన్ రద్దు
Published Wed, Jul 20 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM
l ఆరుగురిని పాఠశాలల విధులకు
రిలీవ్ చేసిన డీఈఓ
విద్యారణ్యపురి : విద్యాహక్కు చట్టం ప్రకారం టీచర్లు పాఠశాలల్లో విధుల్లో ఉండాలనేది ఇటీవలే సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం విధితమే. దీంతో పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా ఎక్కడైతే డిప్యూటేషన్ మీద ఉపాధ్యాయులు పనిచేస్తున్నారో వారిని పాఠశాల విధులకు పంపుతున్నారు.అందులో భాగంగా జిల్లాలోని డీఈఓ కార్యాలయంలో గత కొనేళ్లుగా వివిధ సెక్షన్లలో పనిచేస్తున్న ఆరుగురి ఉపాధ్యాయుల డిప్యూటేషన్‌ను తాజాగా డీఈఓ పి.రాజీవ్ రద్దు చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యూటేషన్ రద్దు అయిన ఉపాధ్యాయుల వివరాలు ఇలా ఉన్నాయి. పి.తిరుపతి (ఎస్‌ఏ, వర్ధన్నపేట మండలం పెరుమాండ్ల గూడెం యూపీఎస్), పి.రమేష్‌బాబు (ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం, బచ్చన్నపేట మండలం బోనుకుల్లు ఎంపీపీఎస్), పి.తిరుపతి (ఎస్‌జీటీ, ఏయిడెడ్ పాఠశాల శారదా విద్యానికేతన్), ఎస్‌పి.శేషుబాబు (ఏయిడెడ్ పాఠశాల, శారదా విద్యానికేతన్), సయ్యద్ అజీమ్ ఖురేషి (ఎస్‌జీటీ, హన్మకొండలోని మచిలీబజార్ పాఠశాల,‡ఉర్దూ మీడియం), కె.రజనీ (ఎస్‌జీటీ, డోర్నకల్ మండలం చిలుకోడు పాఠశాల) ఉన్నారు.
Advertisement