teachers
-
ఇంతకన్నా అవమానం ఉపాధ్యాయ లోకానికి ఏమన్నా ఉంటుందా?
ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు ఉపాధ్యాయుల ప్రవర్తన మొత్తం ఉపాధ్యాయ లోకాన్ని తలదించు కునేలా చేసింది. ఈ ఎన్నికల్లో డబ్బు తీసుకుని కొందరు ఉపాధ్యాయులు ఓటు వేయడం ద్వారా పవిత్రమైన వృత్తినే కాక ప్రజాస్వామ్యాన్ని కూడా పరిహాసం చేశారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఒక జాతీయ రాజకీయ పార్టీ తరఫున పోటీచేసిన అభ్యర్థి ఓటుకు 5 వేల చొప్పున ఒక్కొక్క టీచర్‌కు పంచారనే ఆరోపణ బలంగా వ్యాప్తి చెందింది.నిజంగా ఈ డబ్బు తీసుకుని ఉపాధ్యాయులు (Teachers) ఓటు వేసి ఉంటే వారిలో ఏ స్థాయిలో నైతిక విలువలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి టీచర్లు రేపటి భావిసమాజాన్ని ఎలా తయారు చేస్తారు? డబ్బులు ఇస్తే తీసుకోవడమే తలవంపులైతే... ఏకంగా ‘మాకు ఐదు వేలు కావాలి, రెండు వేలైతే ఓటు వెయ్యం’ అని బేరసారాలకు టీచర్లు దిగారంటూ వార్తలు వచ్చాయి. ఇంతకన్నా అవమానం ఉపాధ్యాయ లోకానికి ఏమన్నా ఉంటుందా?గత దశాబ్ద కాలంగా తెలంగాణ (Telangana)లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఉన్నవారు కూడా కొందరు రాజకీయ నాయకుల్లాగానే డబ్బులు వసూలు చేయడం, పైరవీలు చేయడం లాంటి పనులతో కోట్లకు పడగెత్తారనే ఆరోపణలూ ఉన్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంతో హుందాతో, ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసేవారన్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.భారత సమాజంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ఉన్నత మైనదీ, గౌరవప్రదమైనదీ! జ్యోతిబా ఫూలే – సావిత్రీబాయి ఫూలే దంపతులు సమాజంలోని మూఢ నమ్మకాలను పారదోలి వెలుగును నింపడానికి ఉపాధ్యాయ వృత్తినే ఆయుధంగా చేసుకున్నారు. కందు కూరి వీరేశలింగం పంతులు వంటివారు సంఘసంస్కర్తగా, విద్యావ్యాపకునిగా చేసిన సేవ ఉపాధ్యాయుని విలువను తెలియచేస్తోంది. సమాజాన్ని మార్చే అద్భుత అవకాశం ఉన్న విద్యారంగంలో నాటి విలువలు అడుగంటాయి. దీనికి కారణం ఒక విధంగా కార్పొరేట్ శక్తులు విద్యారంగంలోకి ప్రవేశించడమే కావచ్చు. విద్యావ్యాపారంలో కోట్లు సంపాదించినవారు రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసి డబ్బును వెదజల్లి గెలవడం ఇప్పుడు కనిపిస్తున్న దృశ్యం.గత సంవత్సరం జరిగిన హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసిన ఓ వ్యక్తి కోట్లు ఖర్చుపెట్టి, టీచర్లను ఆర్థిక ప్రలోభాలకు గురిచేశారనే ప్రచారం ఇందుకు ఒక ఉదాహరణ మాత్రమే!చదవండి: సమ సమాజమా? సంక్షేమ రాజ్యామా?ఈ పరిస్థితులను గమనిస్తుంటే రానున్న కాలాన్ని ఊహించడానికే భయమేస్తోంది. మేధా సంపత్తి, సేవా గుణం, వాక్చాతుర్యం ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలకు బదులు ఇక డబ్బున్న కార్పొరేట్ విద్యాలయాల మేనేజ్మెంట్లకు చెందినవారే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా గెలుస్తారు కాబోలు! అలా వీరు గెలవకుండా ఉండాలంటే లక్షల రూపాయలు జీతంగా పొందే టీచర్లు... ఐదు, పదివేలకు కక్కుర్తిపడి ఓటును అమ్ముకోకుండా ఓటు వేయడమే మార్గం.– డాక్టర్ కొండి సుధాకర్ రెడ్డి, రిటైర్డ్ సీనియర్ లెక్చరర్ -
పిల్లలు ఫిర్యాదు చేయగానే... టీచర్ల అరెస్టు కూడదు
కొచ్చి: ఉపాధ్యాయులు, ఇతర బోధన సిబ్బందిపై ఫిర్యాదుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగానే నేరుగా టీచర్ల అరెస్టు వంటి చర్యలకు దిగొద్దు. ప్రాథమికంగా దర్యాప్తు చేసి, నేరం జరిగినట్టు రుజువయ్యాకే చర్యలు తీసుకోవాలి’’ అని పోలీసులను ఆదేశించింది. ఈ దిశగా తక్షణం సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డీజీపీకి ఆదేశాలు జారీచేసింది. విద్యార్థులు స్కూళ్లలోకి ఆయుధాలు, మద్యం, డ్రగ్స్ తదితరాలను యథేచ్ఛగా తీసుకెళ్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్పనిసరని న్యాయమూర్తి జస్టిస్ పి.వి.కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు. విద్యార్థిని బెత్తంతో కొట్టిన కేసులో ఓ టీచరుకు ఆయన ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. కేరళలో విద్యార్థులు, యువత ప్రవర్తన చాలా ఆందోళనకరంగా ఉందని ఈ సందర్భంగా ఆవేదన వెలిబుచ్చారు. ‘‘వారు తీవ్ర నేరాలకు కూడా పాల్పడుతున్నారు. టీచర్లనే బెదిరిస్తున్నారు. వారిని ఘెరావ్ చేస్తున్నారు. భౌతిక దాడులకు దిగుతున్నారు. దీనికి తక్షణం అడ్డుకట్ట వేయాల్సిన అవసరముంది’’ అన్నారు. క్లాసురూముల్లో బెత్తం పట్టుకునేందుకు టీచర్లను అనుమతించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతిసారీ బెత్తం వాడాలని కాదు. అది టీచర్ల చేతిలో ఉంటే చాలు, తప్పు చేసేందుకు విద్యార్థులు జంకుతారు. తప్పు చేసిన విద్యార్థులకు టీచర్లు చిన్నపాటి శిక్ష విధించాలి. అది నేరమేమీ కాదు. పైగా అంతిమంగా మన విద్యావ్యవస్థ మరింత బలోపేతమయ్యేందుకు తోడ్పడుతుంది. కానీ బాగుపడాలనే సదుద్దేశంతో గిల్లినా, గిచ్చినా, మందలించినా టీచర్లపై క్రిమినల్ కేసులు పెడుతున్నారు. దీన్నుంచి వారికి రక్షణ కల్పించాలి. లేదంటే పని చేయలేరు’’ అన్నారు. ‘‘టీచర్లంతా సాధుసత్తములని చెప్పడం లేదు. వాళ్లలోనూ కొందరు చెడ్డవాళ్లు ఉండవచ్చు. కానీ విద్యార్థిని మనిషిగా తీర్చిదిద్దడంలో టీచర్లది కీలక పాత్ర అని మర్చిపోవద్దు’’ అన్నారు. -
ఆదాయం పెరిగితేనే పథకాలు నడపగలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రతినెలా రూ.22 వేల కోట్ల ఆదాయం అవసరమని, అంత ఉంటేనే సంక్షేమ పథకాలను ఓ మోస్తరుగా నడపగలమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇప్పుడొస్తున్న ఆదాయంలో ఉద్యోగుల వేతనాలు, అప్పులకే రూ.13 వేల కోట్లు పోతున్నాయన్నారు. ఆర్థిక పరిస్థితి క్యాన్సర్‌లా మారిందని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో ఏం చేయాలో ఉద్యోగులు చెప్పాలని కోరారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన 1,292 మంది జూనియర్ కాలేజీ లెక్చరర్లు, 400 మంది పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకులకు బుధవారం రవీంద్రభారతి వేదికగా ఆయన నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రభుత్వం రొటేషన్ మాత్రమే చేస్తోంది.. ‘ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.18 వేల కోట్ల నుంచి రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోంది. ఇందులో రూ.6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సి వస్తోంది. రూ.6,500 కోట్లు అప్పులు తిరిగి చెల్లించేందుకు కడుతున్నాం. మిగిలిన రూ.5 వేల కోట్ల నుంచి రూ.5.5 వేల కోట్లల్లోనే 25 నుంచి 30 సంక్షేమ పథకాలకు చెల్లించాలి. ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, ఏ అభివృద్ధి చేయాలన్నా ఈ నిధులే వాడుకోవాలి. ఈ ఇబ్బంది ఉంది కాబట్టే ఒక్కో నెలలో ఒక్కో పథకానికి చెల్లింపు పెండింగ్‌లో పెడుతున్నాం. మా ప్రభుత్వం రొటేషన్ చేసే పని మాత్రమే చేస్తోంది. గత సీఎం క్యాన్సర్ ఇచ్చిపోయాడు గత ముఖ్యమంత్రి రాష్ట్రానికి క్యాన్సర్ ఇచ్చి పోయాడు. దీన్ని నయం చేసే ప్రయత్నం చేస్తుంటే పది నెలలకే దిగిపొమ్మంటున్నారు. తల తాకట్టు పెట్టి ఉద్యోగులకు ప్రతి నెలా మొదటి రోజు వేతనాలు ఇస్తున్నాం. ఉద్యోగులు విపక్షాల మాటలకు ప్రభావితం కావొద్దు. స్టేచర్ ఉందనుకునే నాయకులు స్ట్రెచ్చర్ మీదకు వెళ్ళారు. అక్కడి నుంచి మార్చురీకి కూడా నేను ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇంటికి తీసుకెళ్లను. నా కాళ్లు, చేతులు బాగానే ఉన్నాయి. పనిచేసి జీవిస్తా..’అని సీఎం అన్నారు. అధ్యాపకులు భవిష్యత్తుకు బాటలు వేయాలి ‘ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్న వారిలో భావోద్వేగం కన్పిస్తోంది. పరీక్షలు రాసి 12 ఏళ్ళు నిరీక్షించారు. గత ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేమి కాలయాపనకు కారణం. న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంపై నేను ప్రత్యేక శ్రద్ధ చూపా. ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 57,946 ప్రభుత్వ నియామకాలు చేపట్టాం. దేశ చరిత్రలోనే ఇది ఎక్కడా లేదు. గత పాలకుల ఉద్యోగాలు తీసి వేయడం వల్లే ఇన్ని ఉద్యోగాలొచ్చాయి. తెలంగాణ భవిష్యత్‌కు అధ్యాపకులు బాటలు వేయాలి. అంకిత భావంతో పనిచేయాలి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలు ఖర్చు చేస్తున్నాం.. రాష్ట్ర విద్యారంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి. ప్రభు త్వ స్కూళ్ళల్లో ప్రవేశాలు ప్రతి ఏటా తగ్గుతున్నాయి. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. విద్యార్థులు ఎక్కువగా ప్రైవేటు స్కూళ్ళల్లో ఎందుకు చేరుతున్నారో క్షేత్రస్థాయిలో పరిశీలించాలి. నిజానికి ప్రైవేటు కన్నా ప్రభుత్వ స్కూళ్ళలోనే నాణ్యమైన టీచర్లు ఉన్నారు. అయినా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? సర్కారీ స్కూళ్ళల్లో పోటీ తత్వం పెరగాలి. ఇందుకు తగ్గ ప్రణాళికలు రూపొందిస్తాం..’అని రేవంత్ చెప్పారు. ఇంజనీరింగ్‌లో నాణ్యత ఉండటం లేదు..‘రాష్ట్రంలో ఏటా 1.10 లక్షల మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. ఇందులో 10 శాతం మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. ప్రతి ఒక్కరూ కంప్యూటర్ కోర్సు కోసం ఆరాటపడుతున్నా, వారికి బేసిక్స్ కూడా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో విద్యతో పాటు నైపుణ్యం పెంచడమే లక్ష్యంగా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. క్రీడా రంగంలో వెనుకబాటును అధిగమించడమే లక్ష్యంగా క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు చేశాం..’అని సీఎం వివరించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, సీఎస్ శాంతికుమారి, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన, పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విలీనంపై ‘ఎస్’ అనాల్సిందే!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల మూసివేత వైపే ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎంతో శ్రమకోర్చి తెచ్చుకున్న బడులను సర్కారు విలీనం వైపు నడిపిస్తోంది. ఇందుకు గ్రామస్తులు అంగీకరించకపోయినా.. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు ‘నో’ అని చెప్పినా ‘ఎస్’ అనిపించాల్సిన బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులదేనని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు సమాచారం. ప్రతి గ్రామ పంచాయతీకి ఒకమోడల్ ప్రైమరీ స్కూల్ ఏర్పాటులో భాగంగా తక్కువ ఎన్రోల్ ఉన్న బడుల్లోని విద్యార్థులను ఒక్కచోటకు చేర్చే ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలో దూరం వెళుతున్న విద్యార్థులకు రవాణా చార్జీలను ఇస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. గత ప్రభుత్వం జీవో నం.117 తీసుకొచ్చి పాఠశాలలను విచ్ఛిన్నం చేసిందని ఓపక్క విషం చిమ్ముతూనే.. మరోపక్క ఉన్న బడులను మూసివేసే ప్రక్రియ ప్రారంభించింది. మండల స్థాయిలో ఎంఈవోలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలకు విలీన ప్రక్రియను వివరించి ఒప్పించాలని, మండలంలోని ఏ క్లస్టర్లో ఏ పాఠశాలను ఎలా మార్పు చేశారో చెప్పాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎంఈవోలు కాంప్లెక్స్ చైర్మన్లతో సమన్వయం చేసుకుంటూ క్లస్టర్లో ఉన్న ప్రధానోపాధ్యాయులతో కలిసి ఆ గ్రామంలోని పాఠశాలలను ఎలా మార్పు చేస్తున్నారో సంబంధిత గ్రామ పెద్దలు, స్కూల్ మెనేజ్మెంట్ కమిటీలకు తెలియజేయాలని ఆదేశించారు. ఆయా పాఠశాలలను ఫౌండేషన్ స్కూల్‌గా మార్చారా? బేసిక్ ప్రైమరీ స్కూల్‌గా మార్చారా? లేదా మోడల్ ప్రైమరీ స్కూల్‌గా మార్చారా? అనేది వారికి వివరించి వారి నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే, ఈ క్రమంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ‘నో’ అని చెప్పకుండా చూడాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. గ్రామాల సెంటిమెంట్‌పై కన్నెర్ర గ్రామ స్థాయిలో ప్రభుత్వ పాఠశాల, గుడి అనేవి స్థానికుల సెంటిమెంట్‌తో ముడిపడిన అంశాలు. వీటిని మూసివేసేందుకు, తరలించేందుకు స్థానికులు అంగీకరించరు. అయినప్పటికీ స్థానికుల అంగీకారంతో పనిలేకుండా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం కృష్ణాపురంలో ఉన్న బాబు జగ్జీవన్‌రామ్ ఎంపీపీ స్కూల్‌ను విద్యార్థులు తక్కువగా ఉన్నారన్న సాకుతో 2016లో నాటి టీడీపీ ప్రభుత్వం మూసివేసింది.స్థానికులు ఎంతగా ప్రాథేయపడినా పట్టించుకోలేదు. పిల్లలు చదువుకు దూరం అవుతున్నారని గత వైఎస్సాÆŠసీపీ ప్రభుత్వంలో గ్రామస్తులు విజ్ఞప్తి చేయగా తిరిగి తెరిపించారు. ఇప్పుడు ఈ పాఠశాలలోని విద్యార్థులను మరో బడిలో విలీనం చేసేందుకు చర్యలు ప్రారంభించారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్రవ్యాప్తంగా 12 వేల వరకు ఉన్నట్టు అంచనా. గత ప్రభుత్వంలో జీవో నం.117 ద్వారా హైసూ్కళ్లకు కిలోమీటరు లోపు దూరం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతుల విద్యార్థులు సబ్జెక్టు టీచర్ బోధన కోసం హైస్కూళ్లలో విలీనం చేశారు. మిగిలిన తరగతులను అదే ప్రాథమిక పాఠశాలలో కొనసాగించారు. ప్రస్తుతం 65 మంది ఎన్రోల్ ఉన్న పాఠశాలలను మోడల్ ప్రైమరీ స్కూళ్లుగా మారుస్తామని, అంతమంది విద్యార్థులు లేకుంటే సమీపంలోని ఇతర ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థులను తరలించాలని ఎంఈవోలకు మౌఖిక ఆదేశాలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 3–5 కి.మీ. పైగా దూరం వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. విలీన ఒత్తిడి భరించలేమంటున్న ఉపాధ్యాయులు ఆదర్శ పాఠశాలల ఏర్పాటు క్రమంలో ఓ పాఠశాలను కేంద్రంగా చేసి చుట్టూ ఉన్న పాఠశాలలను విలీనం చేయడం, లేదా 3–5 తరగతులను తీసుకొచ్చి ఎంపిక చేసిన పాఠశాలలో కలపడాన్ని ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన బాధ్యతను అదే ఉపాధ్యాయులకు అప్పగించడం, కాదన్న వారిని ఉన్నతాధికారులు బెదిరించడం తట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో ప్రతి పాఠశాలలో మన బడి నాడు–నేడు పథకం కింద రూ.లక్షలు ఖర్చు చేసి సదుపాయాలు కల్పిస్తే వాటిని వినియోగించుకోకుండా విలీనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం పెట్టిన ఖర్చు వృథా అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే రెండేళ్లలోనే ప్రాథమిక పాఠశాలలు శాశ్వతంగా కనుమరుగవుతాయని.. ఇదంతా ప్రైవేటు స్కూళ్లను ప్రోత్సహించేందుకే అన్నట్లు ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి బదులు 40 లేదా 45 మంది పైగా ఎన్రోల్ ఉన్న స్కూళ్లను మోడల్ స్కూళ్లుగా మార్చి, మిగిలిన పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. -
డీఎస్సీపై సర్కారు డ్రామాలు..
మేం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టు లను భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే చేస్తా..!– ఎన్నికల సభల్లో టీచర్ పోస్టుల ఆశావహులకు చంద్రబాబు హామీ16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం..– గతేడాది జూన్‌లో సీఎంగా చంద్రబాబు ప్రకటన!మెగా డీఎస్సీకి మేం కట్టుబడి ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం..– తాజాగా శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల మాట! గతేడాది అసెంబ్లీ సమావేశాల్లోనూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇదే మాట చెప్పారు!సాక్షి, అమరావతి: ఎప్పటి మాదిరిగానే సీఎం చంద్రబాబు ఇచ్చిన మరో హామీ నీరుగారింది! అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని నమ్మబలికారు. తీరా అధికారంలోకి వచ్చాక.. త్వరలో.. త్వరలో... అంటూ తొమ్మిది నెలలు గడిచిపోయినా డీఎస్సీపై అతీగతీ లేకుండా ఉపాధ్యాయ అభ్యర్థులను వంచించిన టీడీపీ కూటమి సర్కారు టీచర్ పోస్టుల సంఖ్యలోనూ భారీగా కోత పెట్టింది! ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను దాచిపెట్టి నిరుద్యోగులతో ఆడుకుంటోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం చేసిన డీఎస్సీ ఫైలుకు ఇప్పటికీ మోక్షం కలగకపోవడం ఒక ఎత్తయితే.. టీచర్ పోస్టుల ఖాళీలకు తూట్లు పొడవడం మరోఎత్తు! రాష్ట్రంలో మొత్తం 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు స్వయంగా విద్యాశాఖే వెల్లడించగా.. కేవలం 16,347 మాత్రమే భర్తీ చేస్తామని చెప్పుకొస్తూ నెలల తరబడి కాలయాపన చేయడం గమనార్హం. డీఎస్సీ నిర్వహణ, ఉపాధ్యాయ ఖాళీలపై టీడీపీ కూటమి సర్కారు డ్రామాలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఖాళీలపై విద్యాశాఖ వివరాలు.. రాష్ట్రంలోని పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని ‘హెల్ప్ ద పీపుల్’ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గురుతేజ ఇటీవల సమాచార హక్కు చట్టం ద్వారా పాఠశాల విద్యాశాఖను కోరారు. దీనిపై విద్యాశాఖ స్పందిస్తూ.. రాష్ట్రంలో 34,245 ప్రాథమిక పాఠశాలలు, 3,206 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని తెలిపింది. వీటితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మేనేజ్మెంట్ పాఠశాలల్లో 2,06,393 టీచర్ పోస్టులు మంజూరైనట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం 1,78,984 మంది మాత్రమే పనిచేస్తున్నారని, 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. ఈ వివరాలతో హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్)ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తోందని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ పాఠశాల విద్యాశాఖ అందచేసిన వివరాలను సమర్పించారు. దీనిపై స్పందించిన ఎన్సీపీసీఆర్.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. నోటిఫికేషనే లేకుండా భర్తీపై హామీలా? రాష్ట్రంలో 25 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని ఖాళీలను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని ప్రకటించారు. పైగా గత ప్రభుత్వం 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. మెగా డీఎస్సీ ఇస్తామంటూ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో ఆశలు రేకెత్తించారు. అధికారం చేపట్టాక 16,347 డీఎస్సీ పోస్టుల భర్తీ ఫైల్‌పై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతేడాది డిసెంబర్ నాటికే పోస్టుల భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తొమ్మిది నెలలు గడిచినా నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. తాజాగా శాసన సభలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అసలు ఇంతవరకూ నోటిఫికేషన్ ప్రక్రియే చేపట్టకుండా భర్తీపై మాట్లాడడం ఏమిటని ఉపాధ్యాయ అభ్యర్థులు వాపోతున్నారు. రాష్ట్రంలో 13.28 శాతం టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటం విద్యాహక్కు చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని హెచ్చరిస్తూ ఫిబ్రవరి 19వ తేదీన పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఎన్సీపీసీఆర్ రాసిన లేఖ నోరు విప్పని సర్కారు ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యారంగాన్ని నాశనం చేస్తోంది. టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. పాఠశాలల్లో 25 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. మేం అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తాం. 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తాం’ అని ఎన్నికల వేళ చంద్రబాబుతో పాటు కూటమి నేతలు నమ్మబలికారు. తీరా అధికారంలోకి రాగానే 25 వేల ఖాళీలు కాదు.. 16,347 పోస్టులే అంటూ మాట మార్చి కనీసం వాటిని కూడా భర్తీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సీపీ హయాంలో 6,100 పోస్టుతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను సైతం సరిగ్గా పరీక్షల ముందు రద్దు చేశారు. కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పిస్తామంటూ గతేడాది జూలై 2న టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టులో ఆ పరీక్షలంటూ ప్రచారం చేశారు. అనంతరం టెట్, డీఎస్సీకి మధ్య 90 రోజులు గడువు ఉండాలంటూ టెట్ షెడ్యూల్‌ను తొలుత సెప్టెంబర్‌కు తర్వాత అక్టోబర్‌కు మార్చారు. టెట్ ఫలితాలు వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా డీఎస్సీ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. జాతీయ బాలల హక్కుల కమిషన్ సీరియస్.. రాష్ట్రంలో వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం భర్తీ చేయకపోవడాన్ని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్సీపీసీఆర్) తీవ్రంగా పరిగణిస్తోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ రాష్ట్రంలోనూ 10 శాతానికి మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఉండకూడదని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏకంగా 27,409 టీచర్ పోస్టులు (13.28 శాతం) ఖాళీగా ఉన్నాయని, వీటిని ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీసింది. ఇన్ని ఖాళీలు ఉన్నా డీఎస్సీ నోటిఫికేషన్ ఎందుకు ఇవ్వలేదో వెల్లడించాలని పేర్కొంటూ పాఠశాల విద్య డైరెక్టర్‌కు లేఖ రాసింది. ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టానికి విరుద్ధంగా... మంజూరైన ఉపాధ్యాయ పోస్టుల్లో 10 శాతానికి మించి ఖాళీలు ఉండడం పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పాఠశాల విద్య డైరెక్టర్‌కు సూచించింది. పది లక్షల మంది పడిగాపులు..దాదాపు 10 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులు ఆర్ధికంగా నలిగిపోతూ డీఎస్సీ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా విద్యాశాఖ మంత్రి కనీసం ఫలానా రోజు డీఎస్సీ షెడ్యూల్ ఇస్తామని చెప్పే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఏళ్ల తరబడి శిక్షణ పొందుతున్న అభ్యర్థులంతా డీఎస్సీపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత లేక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సాక్షాత్తూ పాఠశాల విద్యాశాఖే చెబుతుండగా ఏకంగా 11 వేలకుపైగా పోస్టులను కుదించడం.. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆటలాడటంపై రగిలిపోతున్నారు.10 లక్షల మంది పిల్లలపై ప్రభావం..రాష్ట్రంలోని 45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి 1 : 40 ప్రకారం బోధనకు 2,06,393 మంది టీచర్లు అవసరం కాగా, ప్రస్తుతం 1,78,984 మంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. అంటే 27,409 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో 10,96,360 మంది విద్యార్థుల బోధనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇంత భారీగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నా ప్రభుత్వం డీఎస్సీలో పోస్టులు తగ్గించి చూపడంతో పాటు అసలు నోటిఫికేషన్ ఎప్పుడిస్తుందో కూడా చెప్పడం లేదు. -
సరికొత్తగా బోధన
సాక్షి, హైదరాబాద్: మారుతున్న విద్యా విధానంతో కొత్త తరం టీచర్లు పోటీ పడాలని ప్రభుత్వం భావిస్తోంది. పూర్తి సాంకేతిక కోణంలో బోధన ఉండాలని సూచిస్తోంది. డీఎస్సీ–2024లో ఎంపికైన 10 వేల మంది టీచర్లకు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల శిక్షణ శుక్రవారం నుంచి మొదలైంది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ ఇది కొనసాగుతోంది. మార్చి 3వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్లకు.. 4, 5, 6 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లు, భాషా పండితులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.దీని తర్వాత మార్చి 10, 11, 12 తేదీల్లో స్పెషల్ ఎడ్యుకేషన్, పీఈటీలకు శిక్షణ ఇస్తారు. సీనియర్ అధ్యాపకులను రిసోర్స్ పర్సన్స్‌గా ఎంపిక చేసి రాష్ట్ర స్థాయిలో శిక్షణ ఇచ్చారు. వీళ్లంతా కొత్త టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఎంపికైన టీచర్లను కూడా శిక్షణకు రప్పించారు. వీరి స్థానంలో తాత్కాలికంగా ఇతర ఉపాధ్యాయులను నియమించారు. శిక్షణ విధానంపై రాష్ట్ర పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు కొన్ని సూచనలు చేసింది. ప్రధానంగా ప్రభుత్వ స్కూళ్లవైపు విద్యార్థులను మళ్లించేలా టీచర్లు తీసుకోవాల్సిన చొరవను సూచించింది. ఇవీ కీలకాంశాలు.. ⇒ ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకెళ్లేందుకు టీచర్లు నూతన బోధన విధానాలను ఆకళింపు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సర్కారు నిర్దేశించింది.⇒ ప్రభుత్వ స్కూళ్లపై ప్రజల్లో నమ్మకం కల్పించడం, స్కూళ్లల్లోని వసతులు, పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ సౌకర్యాల వివరాలను టీచర్లు జనంలోకి తీసుకెళ్లాలి. ⇒ పాఠ్య ప్రణాళికలు నూతన పద్ధతుల్లో రూపొందించడం, మూల్యాంకన విధానంలో మార్పులు, డిజిటల్ విధానంలో బోధన, తొలిమెట్టు, ఉన్నతి కార్యక్రమాల నిర్వహణ, యూడైస్‌లో డేటా ఎంట్రీ పద్ధతులను కొత్త టీచర్లకు వివరిస్తున్నారు. ⇒ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ బోధనలో కీలక పాత్ర పోషించబోతోంది. కొత్త తరం టీచర్లు నిరంతర అధ్యయనం, టెక్నాలజీతో పోటీపడి నేర్చుకునే పద్ధతులు అనుసరించాల్సి ఉంది. ఈ కోణంలో శిక్షణ ఇస్తున్నట్టు విద్యాశాఖ ఉన్నతాధికారులు తెలిపారు.⇒ ఇప్పటికే అనేక పాఠశాలల్లో ఏఐ టెక్నాలజీ బోధనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీని కన్నా ముందు ఉపాధ్యాయులు ఆన్లైన్ ద్వారా మరిన్ని మెళకువలు నేర్చుకోవాలని అధికారులు చెబుతున్నారు.⇒ ప్రాథమిక శిక్షణ పూర్తయిన తర్వాత టీచర్లు ఏఐపై సమగ్ర అవగాహన సంపాదిస్తారని చెబుతున్నారు. -
గ్రాడ్యుయేట్లను నమ్మలేం.. టీచర్లను ‘చూడండి’
సాక్షి, అమరావతి: మరో మూడ్రోజుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో టీడీపీ కూటమిలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రెండ్రోజుల క్రితం జరిగిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష సందర్భంగా చెలరేగిన నిరుద్యోగుల ఆగ్రహజ్వాల రాష్ట్రవ్యాప్తంగా ఎగసిపడుతుండడమే ఇందుకు కారణం. ఈ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు ఎన్డీఏ కూటమి నేతలు టీచర్లకు వల వేస్తున్నారు. ఉద్యోగులుగా ప్రభుత్వ పక్షాన ఉండాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా టీచర్ల ఓట్లతో గెలవాలని ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో.. కృష్ణా–గుంటూరు జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో కూటమి తరఫున పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం టీచర్లనే టార్గెట్ చేశారు. ఒక్కో కుటుంబంలో కనీసం ముగ్గురు గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారన్న అంచనాతో ముందుకెళ్తున్నారు. బాయ్‌కాట్ ఎలక్షన్.. బాయ్‌కాట్ కూటమి.. 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నాటి ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించలేదని, గ్రూప్–2 రోస్టర్‌లో తీవ్ర అన్యాయం చేసిందని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీనివల్ల అభ్యర్థులు నష్టపోతారని, తమ ప్రభుత్వం ఏర్పడగానే ఈ తప్పును సరిచేసి న్యాయం చేస్తామన్నారు. ఇదే అంశంపై టీడీపీ తరఫున ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేసిన వేపాడ చిరంజీవి తనకు ఓటువేసి గెలిపిస్తే ఈ సమస్యపై పోరాడతానంటూ యువతను ఆకట్టుకున్నారు. దీంతో ఉద్యోగార్థులంతా చిరంజీవిని గెలిపించారు.అయితే.. గెలిచాక అదే వ్యక్తి గ్రూప్–2 రోస్టర్‌లో తప్పుల్లేవని చెప్పడంతో గ్రాడ్యుయేట్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. గత మూడు వారాలుగా ఆందోళన బాట పట్టారు. ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేయరాదని నిరుద్యోగులు గట్టిగా నిర్ణయించుకుని ‘బాయ్‌కాట్ ఎలక్షన్.. బాయ్‌కాట్ కూటమి అభ్యర్థి’ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ల నుంచి ఓట్లుపడే ఛాన్స్లేదని భావించిన టీడీపీ కూటమి తాజాగా టీచర్లను టార్గెట్ చేసింది. ‘మా ప్రభుత్వం ఇంకా నాలుగేళ్లకు పైగా అధికారంలో ఉంటుంది. తర్వాత మీ ఇష్టం’ అంటూ వారిని భయపెడుతున్నట్లు సమాచారం. ఉపాధ్యాయ సంఘాలు ఈ బాధ్యత తీసుకుని టీచర్లతో ఓట్లు వేయించాలని చెబుతున్నట్లు తెలిసింది. ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్ల ఫైర్.. మరోవైపు.. టీడీపీ కూటమి ప్రభుత్వ వంచనపై గ్రాడ్యుయేట్స్‌లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గ్రూప్–2 మెయిన్స్ పరీక్ష వాయిదాపై చివరివరకు తమను తప్పుదోవ పట్టించి తమ జీవితాలతో ఆడుకున్న సర్కారుకు ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని మండిపడుతున్నారు. నిజానికి.. రోస్టర్‌పై గతేడాది వేపాడ చిరంజీవితో కొన్నాళ్లు డ్రామా ఆడించి ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ లాభపడింది.ఆ తర్వాత ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. అలాగే, గ్రాడ్యుయేట్లను పక్కదారి పట్టించేందుకు రెండుసార్లు మెయిన్స్ పరీక్షను వాయిదా వేశారు. కానీ, రోస్టర్ అంశం వారికే చుట్టుకుంది. రోస్టర్‌లో తప్పులున్నాయని చెప్పారు కాబట్టి, ఇప్పుడా తప్పులను సరిచేసి మెయిన్స్ నిర్వహించాలని అభ్యర్థులు పట్టుబట్టారు. దీంతో మంత్రులు పరీక్షకు ఒకరోజు ముందు వాయిదాపై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుచేశారు. కానీ, పరీక్ష వాయిదా లేదని ఏపీపీఎస్సీ ప్రకటించడంతో ప్రభుత్వం తమను మోసంచేసేందుకు డ్రామా ఆడుతోందని అభ్యర్థులు నిర్ణయానికొచ్చారు. టీడీపీ కూటమికి మా సత్తా చూపిస్తాం.. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వ నిర్ణయం తమను తీవ్రంగా కలచివేస్తోందని వారంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కూటమి నాయకుల మాటలు నమ్మి గతేడాది జూలైలో జరగాల్సిన పరీక్షను వాయిదా వేయించి, దాదాపు 8 నెలల కాలాన్ని వృధా చేశారని.. ఫలితంగా దాదాపు 72 వేల మంది గ్రాడ్యుయేట్లు వయసు దాటిపోయి ప్రభుత్వ ఉద్యోగావకాశం కోల్పోయారని వాపోతున్నారు. తమను నిలువునా ముంచిన టీడీపీ కూటమికి తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు.పైగా.. ‘ప్రభుత్వం మొదటి నుంచి చాలా క్లియర్‌గా ఉంది. మనమే గమనించలేకపోయాం. మన టైం మొత్తం వృధా చేయించి పరీక్ష అంశాన్ని ఏపీపీఎస్సీ చైర్మన్‌పైకి నెట్టేశారు. చంద్రబాబు తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఇక్కడ వాడారు. అంతే..’ అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘ఒక ఎగ్జామ్‌ను కంట్రోల్ చేయలేకపోయారు. వీరు మన జీవితాలను బాగుచేస్తారా? స్వర్ణాంధ్రను సృష్టిస్తారా?’ అంటూ మరొకరు పోస్టు చేశారు. ‘మా ఆశలను, కలలని, మా భవిష్యత్తును చంపుతున్నారు. మేమూ మీ ఆశలను, కలలను, భవిష్యత్తును చంపగలం. ఆట మీరు మొదలుపెట్టారు. మేము ముగిస్తాం’.. అంటూ మరొకరు టీడీపీ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. -
పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు
గౌహతి: పరీక్షల్లో అక్రమాలకు ఊతమిచ్చారన్న ఆరోపణలపై యూనివర్సిటీ ఆప్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మేఘాలయ(యూఎస్‌టీఎం) చాన్స్‌లర్ మహబూబుల్ హక్ అరెస్టయ్యారు. అస్సాంలోని షిభుమి జిల్లాకు చెందిన ఓ కోర్టు శనివారం రాత్రి హక్‌తోపాటు, కరీమ్గంజ్ జిల్లా పత్తర్‌కండిలోని ఓ పాఠశాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయులను కూడా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు గౌహతిలోని నివాసంలో ఉన్న హక్‌ను శనివారం అదుపులోకి తీసుకుని షిభుమికి తరలించారు. యూఎస్‌టీఎం చాన్స్‌లర్‌గా ఉన్న హక్ ఈఆర్డీ అనే ఫౌండేషన్ ద్వారా ఎన్నో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. ఇందులో పత్తర్‌కండిలోని స్కూలు కూడా ఉంది. ఇతర జిల్లాలకు చెందిన సీబీఎస్ఈ విద్యార్థులను ఎక్కువ మార్కులు వచ్చేలా ప్రిపేర్ చేస్తామంటూ ఈ స్కూలుకు తీసుకువచ్చారు. వీరు పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేందుకు పథకం వేశారంటూ శుక్రవారం నుంచి అక్కడ వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లతోపాటు చాన్స్‌లర్ హక్ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. ఘటనపై సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ..దీని వెనుక పెద్ద నెట్ వర్క్ ఉందన్నారు. సీబీఎస్ఈలోనే కాకుండా, మెడికల్ ఎంట్రన్స్‌లోనూ ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ‘యూఎస్‌టీఎం చాన్స్‌లర్ హక్ పెద్ద ఫ్రాడ్, ఆయన జీవితమే ఫ్రాడ్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హక్ దొడ్డిదారిన పొందిన ఓబీసీ సరి్టఫికెట్ తర్వాత రద్దయిందని చెప్పారు. అస్సాం–మేఘాలయ సరిహద్దుల్లో ఉన్న యూఎస్‌టీఎం క్యాంపస్ కారణంగా గౌహతి నగరానికి వరద ముప్పు పెరిగిందంటూ సీఎం శర్మ గతంలోనే ఆరోపణలు చేయడం తెల్సిందే. -
తెలంగాణలో కొలువుల జాతర.. భారీ నోటిఫికేషన్లకు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫైల్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేసింది. 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్నికల కోడ్ ముగియగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.ఆయా జిల్లా కలెక్టర్లు.. నోటిఫికేషన్లను జారీ చేయనున్నారు. మొత్తం 14,236 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులను భర్తీ చేయడం ఇదే తొలిసారి. ఖాళీల భర్తీ ప్రక్రియతో మరింత పటిష్టంగా అంగన్వాడీలు పనిచేయనున్నారు. -
పాఠాలు చెబుదామన్నా.. పిల్లలు లేరు..
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని మూడు ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు రాక పోవడంతో ఉపాధ్యాయులు విధులకు హాజరై ఖాళీగా కూర్చొని వెళ్లిపోతున్నారు.వెంకటాపురం తండా, సర్వన్ తండా, కేళోత్ తండాలోని ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలలను గురువారం ‘సాక్షి’ సందర్శించింది. మూడింటి లోనూ ఒక్క విద్యార్థి కూడా పాఠశాలకు రాలేదు. తండాల్లోని ఇంటింటికీ తిరిగి తమ పిల్ల లను పంపాలని కోరు తున్నా.. తల్లిదండ్రులు మాత్రం గార్లలోని ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారని ఉపా ధ్యాయులు పేర్కొన్నారు. -
Telangana: రూ. 50 వేలకు మించి తీసుకెళ్లొద్దు
నిజామాబాద్: పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల(mlc elections) నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అభ్యర్థుల ప్రచారాలు, హడావుడి అంతగా లేకపోవడంతో ఎన్నికల కోడ్(Election Code) విషయం చాలా మందికి తెలియడం లేదు. చాలా చోట్ల సాధారణ రోజుల మాదిరిగానే నగదును తీసుకొని ప్రయాణిస్తున్నారు. ప్రజలు రూ.50వేలకు మించి నగదుతో ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా ఆధారాలు ఉండాలని, లేకపోతే సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, (Nizamabad)మెదక్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 56, టీచర్ ఎమ్మెల్సీకి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతుండటంతో ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీసినట్లు తెలిసింది. దీంతో ఎన్నికల అధికారులు నగదు తరలింపు, ఇతర వ్యవహారాలు జరగకుండా అడ్డుకట్ట వేసేందుకు దృష్టి సారించారు.ఆధారాలు లేకపోతే సీజ్ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే సంబంధిత ఆధారాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. లేకుంటే వాటిని సీజ్ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన నగదు, అప్పుగా, పంటలు అమ్మిన వచ్చిన డబ్బులతోపాటు బంగారం, వెండి కొనుగోలు చేసినా వాటికి ఇచ్చే రసీదులను వెంట ఉంచుకోవాల్సిందే. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం, వెండి, చీరలు ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేసినా వాటికి సంబంధించిన రసీదులను వెంట పెట్టుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.సరిహద్దుల్లో కట్టుదిట్టంజిల్లాకు సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర నుంచి నిత్యం వేలాది మంది నిజామాబాద్‌తోపాటు కామారెడ్డి, హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, కార్లు, వాహనాలను చెక్‌పోస్టుల వద్ద పోలీసులు, ఎన్నికల అధికారులు తనిఖీ చేస్తున్నారు. సరైన ఆధారాలు చూపని నగదు, సామగ్రిని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగదు తీసుకెళ్లే వారు ఏమరుపాటుగా ఉండకుండా జాగ్రత్త వహిస్తూ ఆధారాలు దగ్గర ఉంచుకోవాలని, లేకపోతే నగదు సీజ్ అయ్యే ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.సరైన ఆధారాలు ఉండాలికోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల సిబ్బందితో కలిసి తనిఖీలు ముమ్మరం చేశాం. పెళ్లిళ్లు, పంట విక్రయాలు చేసేవారు నగదు తీసుకువెళ్లేటప్పుడు తప్పనిసరిగా రసీదులు, ఆధార పత్రాలను వెంట ఉంచుకోవాలి. రూ.50 వేల నుంచి రూ.10 లక్షల లోపు నగదును పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. సరైన ఆధారాలు చూపిస్తే ఎన్నికల అధికారుల ద్వారా తిరిగి అందజేస్తాం.– రాజావెంకట్‌రెడ్డి, ఏసీపీ, నిజామాబాద్ -
డమ్మీగా క్లస్టర్ కాంప్లెక్స్‌లు!
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో మార్పుల పేరిట కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల(government schools) విలీనంపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రాగా.. తాజాగా క్లస్టర్ కాంప్లెక్స్‌ల నిర్వహణ తీరుపై ఉపాధ్యాయులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పాఠ్యాంశాలపై చర్చలు లేకుండా కేవలం ఆన్ౖలెన్ లింక్ ద్వారా టీచర్లు పాఠ్యాంశాలు వినేందుకే పరిమితం చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,809 కాంప్లెక్స్ క్లస్టర్లలో శనివారం మధ్యాహ్నం నుంచి కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.ఇవి గతానికి భిన్నంగా కొనసాగడంపై ఉపాధ్యాయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా, సాయంత్రం 5 గంటల వరకే సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ 6 గంటల వరకు నిర్వహించారు. అటెండెన్స్ మాత్రం 5 గంటలకే క్లోజ్ చేశారని, ఆ తర్వాత ముఖ ఆధారిత హాజరు పనిచేయలేదని, ఇది టీచర్లను వేధించడమేనని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యా శాఖలో కీలకమైన స్కూల్ కాంప్లెక్స్‌ల స్థానంలో క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. 4,034 కాంప్లెక్స్‌లను 2,809కి తగ్గించి క్లస్టర్ కాంప్లెక్స్‌లుగా మార్చారు. వీటిలోనే ఉపాధ్యాయ సమావేశాలకు అనుమతించారు. మరో 1,225 కాంప్లెక్స్‌లను డమ్మీలుగా మాత్రమే ఉంచారు.ప్రతి క్లస్టర్‌కి గ్రామీణ ప్రాంతాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని 10 నుండి 15 పాఠశాలలు, పట్టణ ప్రాంతాల్లో 5 నుంచి 10 కి.మీ పరిధిలోని 8 నుంచి 10 పాఠశాలలు అనుసంధానం చేశారు. ప్రతి క్లస్టర్లో 40 నుంచి 50 మంది ఉపాధ్యాయులతో కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించారు.ఇందులో ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ, పాఠశాలల మధ్య విద్య అనుసంధానం, విద్యా వనరుల సామగ్రి తయారీ, తనిఖీలు, విద్యా వ్యవస్థ పర్యవేక్షణ తదితర కార్యక్రమాలు ప్రత్యక్షంగా నిర్వహించాల్సి ఉంది. కానీ తొలి సమావేశం కేవలం ఉపాధ్యాయులు ఆన్లైన్లో పాఠాలు వినేందుకే పరిమితం చేశారు. గతంలో ఓ సబ్జెక్టుపై ఉపాధ్యాయుల మధ్య లోతైన చర్చ జరిగి, విద్యార్థులకు సరికొత్త బోధన విధానాలను అందించేవారు. నేడు అదే ఉపాధ్యాయ వర్గాన్ని కేవలం కొందరు చెబితే వినేందుకే పరిమితం చేశారు. ఉపాధ్యాయులపై ఒత్తిడిప్రతి నెలా మూడో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని, ప్రతి ఉపాధ్యాయుడు హాజరుకావాలని పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం మధ్యాహ్నం 2,809 కస్లర్లలో మధ్యాహ్నం ఒంటి పూట స్కూల్ కాంప్లెక్స్ విధానం అమలుల్లోకి వచ్చింది.ప్రాథమిక, సెకండరీ ఉపాధ్యాయులకు వేర్వేరు అజెండా విడుదల చేశారు. అయితే, శనివారమే 10వ తరగతి ప్రీఫైనల్ గణిత పరీక్ష ఉండటం, ఉదయంపూట మధ్యాహ్న భోజనం విధులు ఉండటంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి పెరిగింది. ఉదయం 8.45 నుంచి 12 వరకు పాఠశాలల్లో పనిచేసిన టీచర్లు మధ్యాహ్నం 15 కిలోమీటర్ల దూరంలోని క్లస్టర్‌కు పరుగులు పెట్టాల్సి వచ్చింది.నీరుగారిన లక్ష్యంప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలల స్కూల్ అసిస్టెంట్లకు కలిపి కొద్దిసేపు, వేర్వేరుగా మరికొద్దిసేపు సమావేశం నిర్వహించడంతో అసలు లక్ష్యం నీరుగారింది. ఒకటి, రెండు తరగతుల టీచర్లకు ప్రత్యేక సమావేశం పెట్టారు. 3, 4, 5 తరగతుల టీచర్లకు వేరొక గదిలో, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు మరొక గదిలో సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్న సమయం ఊపిరి తీశారు. చర్చలకంటే లింకులతోనే సమావేశం మొత్తం పూర్తి చేశారు. గతంలో సబ్జెక్టు టీచర్లకు నియోజకవర్గం స్థాయిలో ఒక్కో సబ్జెక్టుకు ఒక స్కూల్లో సమావేశం జరిగేది. 40 మందికి పైగా స్కూల్ అసిస్టెంట్లు వీటికి హాజరై సబ్జెక్టుపై లోతైన చర్చ చేసేవారు.ప్రస్తుత సమావేశాలకు సబ్జెక్టు టీచర్లు నలుగురికి మించకపోవడంతో చర్చలకు ఆస్కారమే లేకుండా పోయింది. పైగా నాలుగు గంటల సమావేశంలో ఉన్నతాధికారుల సందేశాలకు గంట ఇచ్చారు. ఉపాధ్యాయుల బోధనాంశాలపై 30 నుంచి 45 నిమిషాలే కేటాయించారు. బోధనాంశాలపై ఐఎఫ్‌పీలపై క్లిప్పింగ్‌లు చూపించారేగాని, విషయ పరిజ్ఞానంపై లోతైన చర్చకు అవకాశం ఇవ్వలేదు. కొన్ని చోట్ల నెట్ పనిచేయక ఫోన్లలో చూడాల్సిన పరిస్థితి. మోడల్ లెసన్ ప్లాన్స్, టీఎల్ఎం, కొత్త పద్ధతులపై చర్చలే లేవు. ఇలా స్కూల్ కాంప్లెక్స్‌లకు నిర్దేశించిన ఆరు సెషన్లు మొక్కుబడిగా ముగిసినట్టు సమాచారం.ఇంత నిర్బంధమా?స్కూల్ కాంప్లెక్స్‌లు అంటే ఉపాధ్యాయులు నిర్బంధ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తోంది. పెళ్లిళ్లు, వివిధ కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉన్నా విద్యా శాఖ సెలవు ఇవ్వకపోవడం దుర్మార్గం. ఉపాధ్యాయులు అంటే ఇంత అలుసా? ఉత్తర్వుల ప్రకారం సాయంత్రం 5 గంటలకు ముగించాల్సిన సమావేశాలు 6 గంటల వరకు కూడా కొనసాగించారు.టీచర్లు హాజరు వేసుకునేందుకు మాత్రం 5 గంటల వరకే అవకాశం కల్పించారు, ఇదేం విధానం? మధ్యాహ్నం వరకు పాఠశాలలో ఉండి వెంటనే క్లస్టర్ స్కూల్స్ కాంప్లెక్స్‌కు వెళ్లాల్సిరావడంతో టీచర్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యారు. ఇది ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేయడమే. – లెక్కల జమాల్‌రెడ్డి, ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇవేం కాంప్లెక్స్ సమావేశాలు?మధ్యాహ్నం వరకు పాఠశాలలో పనిచేసి, మధ్యాహ్న భోజనం తర్వాత సమావేశాలకు హాజరు కావడం ఇబ్బందిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరగాల్సిన సమావేశాలను రోజులో సగమే నిర్వహించడం ఏమిటి? క్లస్టర్ పరిధిలో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండే ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల సబ్జెక్టు టీచర్లకు ఏవిధంగా ఉపయోగకరమో అధికారులు చెప్పాలి. ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేసే ఇలాంటి చర్యలను వ్యతిరేకిస్తున్నాం. – కె.శ్రీనివాసులు, టి.చందనరావు స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టొద్దు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాల క్లోజింగ్ టైమ్ సాయంత్రం 5 గంటలకే అన్నా 6 గంటల వరకు నిర్వహించారు. అయినా అటెండెన్స్ పడకుండా టీచర్లను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 6 వరకు దాదావు 10 గంటల పాటు విరామం లేకుండా షెడ్యూల్ ఇచ్చి, పాఠశాలలు, క్లస్టర్ సమావేశాలు నిర్వహించాలనడం దారుణం. రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో ఎంతో ఇబ్బంది తలెత్తింది. – మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు, టీఎన్‌యూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
టీచర్లు ఖాళీ.. మంత్రి కంగాళి!
సాక్షి, అమరావతి: నిబంధనలు తెలుసుకోకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్లో ఉన్న టీచర్లలో 50 శాతం వరకు సెలవు తీసుకొనే వెసులుబాటు ఉన్నా, అయినా తక్కువ మందే సెలవులో ఉన్నప్పటికీ, వారందరికీ మెమోలు జారీ చేయాలంటూ ఎంఈవోను ఆదేశించడంపై ఉపాధ్యాయవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విషయానికి వస్తే.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ పురపాలక ఉన్నత పాఠశాలను మంత్రి మనోహర్ సోమవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఉపాధ్యాయ, విద్యార్థుల రికార్డులను పరిశీలించారు. 24 మంది టీచర్లలో ఐదుగురు సాధారణ సెలవు, మరో ఇద్దరు హాఫ్‌డే సెలవు తీసుకున్నట్టు తెలుసుకున్నారు. ‘ఒకేసారి ఏడుగురు టీచర్లు ఎలా సెలవు తీసుకుంటారు? మీరెలా ఇచ్చారు’ అంటూ ప్రధానోపాధ్యాయురాలు (హెచ్ఎం)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాకుండా సెలవు పెట్టిన ఉపాధ్యాయులకు మెమోలు జారీచేయాలని ఎంఈవోను ఆదేశించారు. ఈ విషయంపై మంగళవారం డీఆర్సీ సమావేశంలో కలెక్టర్, డీఈవోలతో చర్చిస్తానన్నారు. మొత్తం 399 మంది విద్యార్థుల్లో 80 మంది హాజరు కాకపోవడంపై మంత్రి హెచ్ఎంని ప్రశ్నించారు. మంత్రి మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి తీరుపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా మెమోలు ఇవ్వాలని మంత్రి ఆదేశిస్తే తాము ఎలా పనిచేయగలమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు అడగకుండా మంత్రి హడావుడి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి మార్గం చూపాల్సిన మంత్రే టీచర్లను బెదిరించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. వాస్తవానికి శ్రీ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ పురపాలక ఉన్నత పాఠశాలలో 46 ఉపాధ్యాయ పోస్టులకు గాను, 36 మందే టీచర్లున్నారు. వీరిలో 12 మందిని ఇటీవల డెప్యుటేషన్‌పై ఇతర పాఠశాలలకు పంపించారు. మిగిలిన 24 మందిలో సోమవారం ఐదుగురు సీఎల్ తీసుకోగా, ఇద్దరు మధ్యాహ్నం నుంచి హాఫ్ డే సెలవు పెట్టారు. అయితే, మంత్రి మనోహర్ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై మాట్లాడకుండా, బోధనాపరమైన సమస్యలు తెలుసుకోకుండా టీచర్ల సెలవుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఉపాధ్యాయుల్లో 50 శాతం తగ్గకుండా విధులకు హాజరు కావాలి. దీనిప్రకారం ఈ స్కూల్లో 11 మంది వరకు సెలవు తీసుకోవచ్చు. కానీ ఐదుగురే సెలవు పెట్టినా మంత్రి హడావుడి చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
సర్కారు బడులపై కర్ర పెత్తనం!
సాక్షి, అమరావతి: విద్యార్థులకు అందించాల్సిన సంక్షేమ పథకాలకు ఎగనామం పెట్టేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం నెలకో కొత్త నాటకం ఆడుతోంది. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు సహా పలు హామీలిచ్చిన కూటమి పెద్దలు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటినా ఒక్క పథకం అమలు చేయకుండా కుంటి సాకులు వెదుకుతోంది. తాజాగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య వాస్తవంకంటే అధికంగా ఉందని, తప్పుడు ఎన్రోల్మెంట్పై చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను హెచ్చరిస్తోంది. అంతేగాక, విద్యార్థుల సంఖ్యపై లెక్కలంటూ ప్రభుత్వ పాఠశాలలపై రెవెన్యూ శాఖకు పెత్తనం అప్పగించింది. విద్యార్థుల లెక్క తీసేందుకు ఎమ్మార్వో, ఎండీవో, ఇతర రెవెన్యూ సిబ్బందిని ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తోంది. వాస్తవానికి ఆధార్ నంబర్ ఆధారంగా విద్యార్థులను బడుల్లో చేర్చుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు యూడైస్‌తో సరిపోవడంలేదని, డ్రాప్ బాక్స్‌లో కనిపిస్తున్న 2,02,791 మంది విద్యార్థులు వాస్తవానికి లేకున్నా అదనంగా నమోదు చేశారని చెబుతోంది. వారందరినీ తొలగించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వంలో బడి బయట పిల్లలను స్థానికంగా గ్రామ/వార్డు వలంటీర్లు, సచివాలయ విద్యా కార్యదర్శులు కలిసి గుర్తించేవారు. వారిని తిరిగి పాఠశాలల్లో చేరి్పంచే బాధ్యత తీసుకునేవారు. దీంతో డ్రాప్‌బాక్స్ ఖాళీగా ఉండేది. ప్రస్తుతం వలంటీర్లు, సచివాలయ కార్యదర్శులను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టడంతో బడిబయటి పిల్లలు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. డ్రాప్ బాక్స్ లెక్కలు బోగస్ అంటూ.. పాఠశాల విద్యా శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం 1 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 37 లక్షల మంది చదువుతున్నారు. విద్యార్థుల చేరికలు, వారి ఆధార్ వివరాలను యూడైస్‌తో అనుసంధానం చేశారు. దీంతో అందరి పిల్లల వివరాలు చిరునామాలతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ఓ విద్యార్థి వరుసగా 30 రోజులు బడికి హాజరు కాకపోతే ఆ వివరాలు పాఠశాల విద్య డేటా బేస్‌లోని ‘డ్రాప్‌బాక్స్’లోకి వెళ్లిపోతాయి. అంటే వారు డ్రాప్ అవుట్స్‌గా లెక్కించాలి. ఇలా ప్రతి పాఠశాలకు నెల రోజులకు మించి హాజరు కాని వారు 10 నుంచి 50 మంది వరకు ఉంటారని అంచనా.దాని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా డ్రాప్ బాక్స్‌లో నమోదైన విద్యార్థుల సంఖ్య గతేడాది అక్టోబర్ నాటికి 2,02,791 మందికి చేరింది. ఇప్పుడు ఈ వివరాలను బోగస్ ఎన్‌రోల్‌మెంట్‌గా గుర్తించనుంది. ఇలా బోగస్ ఎన్రోల్మెంట్ చేసినందుకు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని ఇటీవల ఒంగోలులో జరిగిన సమావేశంలో పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు తీవ్రంగా హెచ్చరించారు. టీచర్ పోస్టులు పోకుండా కాపాడుకునేందుకు నకిలీ ఎన్రోల్మెంట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్ఎంలను హెచ్చరించారు. బోగన్ హాజరు వేసే హెచ్‌ఎంలపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. బోగస్ హాజరును నిగ్గు తేల్చేందుకు రెవెన్యూ అధికారుల బృందాలు ప్రతి పాఠశాలను తనిఖీ చేసేలా ఆదేశాలిచ్చారు. ప్రభుత్వ పాఠశాలలపై తప్పుడు ముద్ర గత ప్రభుత్వంలో సర్కారు బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేది. అలాగే, ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేల చొప్పున నగదు తల్లుల ఖాతాల్లో జమయ్యేది. దీంతో నిరుపేదలు సైతం తమ పిల్లలను బడులకు పంపేవారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాప్ అవుట్స్ దాదాపు తగ్గిపోయాయి. ఒకవేళ ఎక్కడైనా డ్రాపవుట్స్ ఉంటే వలంటర్లు, సచివాలయ సిబ్బంది వారిని తిరిగి బడుల్లో చేర్చించేవారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక బడి బయట పిల్లలను గుర్తించే బాధ్యతను ఉపాధ్యాయులకే అప్పగించింది. పైగా తల్లికి వందనం కింద ఇస్తామన్న రూ.15 వేలు ఇవ్వనేలేదు.దీంతో చాలామంది నిరుపేదలు, కూలీలు పిల్లలను తీసుకుని ఉపాధి కోసం వలసపోయారు. పిల్లలు కూడా బాల కార్మికులుగా మారుతున్నారు. దీంతో బడుల్లో చేరిన విద్యార్థుల డ్రాప్ అవుట్స్ పెరిగాయి. 2024 అక్టోబర్ నాటికి 2,02,791 మంది విద్యార్థులు డ్రాప్ బాక్స్‌లోకి చేరగా, ఈ మూడు నెలల్లో మరో 50 వేల మందికి పైగా పెరిగి ఉండవచ్చని అంచనా. కానీ, ఈ లెక్కలను బోగస్ అంటూ రెవెన్యూ అధికారులు తనిఖీలకు వచ్చినప్పుడు లెక్క సరిపోవాలని, లేకుంటే కఠిచర్యలు తప్పవంటూ విద్యా శాఖ హెచ్చరించడంపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్ని విషయాలు ప్రభుత్వానికి తెలిసినప్పటికీ, తాము తప్పు చేశామని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పాఠశాలల హేతుబద్దీకరణకు రంగం సిద్ధం!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దికరణ(రేషనలైజేషన్)కు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జీవో నంబర్ 117 రద్దు చేసిన అనంతరం చేపట్టే చర్యల కోసం రూపొందించిన మార్గదర్శకాలపై జోనల్ స్థాయిలో అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాల వారీగా ఈ నెల 25వ తేదీ వరకు రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో జరిగే ఈ సమావేశాల్లో జిల్లా, మండల, క్లస్టర్ స్థాయి అధికారులు పాల్గొంటారు.ఇప్పటికే ఆయా జిల్లాల వారీగా తేదీలు, వేదికలను నిర్ణయిస్తూ పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. అయితే, ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ఉపాధ్యాయ సంఘాలకు అనుమతి ఇవ్వలేదు. కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాలపై తమకున్న అనేక అనుమానాలను నివృత్తి చేయకుండానే ప్రభుత్వం పాఠశాలల హేతుబద్దికరణ దిశగా ముందుకెళుతుండటంపై ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఉపాధ్యాయులకు నష్టం జరిగేలా ప్రభుత్వ చర్యలు ⇒ గత ప్రభుత్వం జీవో నంబర్ 117 ప్రకారం నాణ్యమైన బోధన కోసం ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలో మీటరు లోపు దూరంలో ఉన్న 3,348 ప్రాథమికోన్నత, హైస్కూళ్లల్లో విలీనం చేసింది. ఇలా 4,731 ప్రాథమిక పాఠశాలల్లోని 3–5 తరగతుల విద్యార్థులను కిలో మీటరు దూరంలోని ఆయా స్కూళ్లకు పంపింది. అలాగే దాదాపు 8 వేల మంది అర్హత గల ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించి ఉన్నత పాఠశాలల్లో నియమించింది. ⇒ అయితే, 2025–26 విద్యా సంవత్సరం నుంచి 3,348 ప్రాథమికోన్నత, హైస్కూళ్లల్లో ఉన్న 3–5 విద్యార్థులను వెనక్కి తీసుకువచ్చి మోడల్, ప్రైమరీ స్కూళ్లల్లో చేరుస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. కానీ, ఆయా హైస్కూళ్లల్లో పనిచేస్తున్న 8 వేల మంది స్కూల్ అసిస్టెంట్లను ఏం చేస్తారో తేల్చలేదు.⇒ గత ప్రభుత్వం మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఉండేలా హైస్కూల్ ప్లస్‌లను ఏర్పాటు చేసింది. దీనికోసం మండల స్థాయిలో ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉన్న ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్చి ఇంటర్ విద్యను ప్రారంభించింది. మొదటి విడతలో 292, రెండో విడతలో 218... మొత్తం 510 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌లుగా అప్‌గ్రేడ్ చేసింది. ఈ పాఠశాలల్లో ఇంటర్ సిలబస్ బోధన కోసం 1,850 సీనియర్ స్కూల్ అసిస్టెంట్లను పీజీటీలుగా నియమించింది.⇒ ప్రస్తుత చందబ్రాబు ప్రభుత్వం హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, అక్కడ చదువుతున్న విద్యార్థులను ఎక్కడ చేరుస్తారో చెప్పలేదు. అలాగే, 1,850 మంది హైస్కూల్ ప్లస్‌లలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్లను ఏం చేస్తారో కూడా వివరణ ఇవ్వలేదు. ⇒ జీవో నంబర్ 117 ప్రకారం 6, 7, 8 తరగతుల్లో ప్రస్తుతం 88 మంది విద్యార్థులు దాటితే మూడో సెక్షన్‌గా పరిగణిస్తున్నారు. కానీ, కొత్త మార్గదర్శకాల ప్రకారం 94 మంది విద్యార్థులు దాటితేనే మూడో సెక్షన్‌గా గుర్తిస్తారు. అంటే కేవలం ఆరుగురు విద్యార్థుల తేడాతో రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో మూడో సెక్షన్ తగ్గిపోయి వేలాది మంది స్కూల్ అసిస్టెంట్లు సర్‌ప్లస్‌గా మిగులుతారు. ⇒ జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను కూడా మండల విద్యాశాఖ అధికారులుగా నియమించాలని ఎన్నో దశాబ్దాలుగా ఆ విభాగం టీచర్లు ప్రభుత్వాలను అభ్యర్థిస్తున్నారు. వారి అభ్యర్థనను గౌరవించి గత ప్రభుత్వం కొత్తగా 680 ఎంఈవో–2 పోస్టులను మంజూరు చేసి జెడ్పీ ప్రధానోపాధ్యాయులను ఆ పోస్టుల్లో నియమించింది. ప్రస్తుత ప్రభుత్వం ఎంఈవో–2 పోస్టులను సైతం రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ క్రమంలో 680 మందిని తిరిగి హెచ్ఎంలుగా నియమిస్తే... మరో 680 మంది స్కూల్ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయ పదోన్నతులు ఉండవు. -
టీచర్ల లెక్క తేల్చండి
సాక్షి, అమరావతి: ప్రాథమిక పాఠశాలల్లో 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల బోధనతోపాటు మెరుగైన బోధనా విధానాలను అందుబాటులోకి తీసుకువస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 117ను రద్దు చేసేందుకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆ జీవో ఉపసంహరణ వల్ల కలిగే మార్పులను గుర్తించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ప్రతి పంచాయతీలోను మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల పునర్విభజన (మిగులు/అవసరం)పై లెక్కలు తేల్చాలని శనివారం ఆదేశాలు జారీ చేసింది.మోడల్, బేసిక్, ఫౌండేషనల్ ప్రాథమిక పాఠశాలలు, యూపీ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలుగా పునర్ నిర్మాణం చేసేందుకు అవసరమైన వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు వర్క్షీట్లు నింపి పూర్తి వివరాలతో ఈ నెల 20–25 వరకు జరిగే జోనల్ సమావేశాల్లో అందించాలని క్షేత్ర స్థాయి అధికారులకు విద్యాశాఖ అధికారులు సూచించారు. దీంతో ఆయా పాఠశాలల వారీగా మ్యాపింగ్‌కు ముందు, తర్వాత విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్యను వర్క్‌షీట్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. పాఠశాలల మ్యాపింగ్ తర్వాత ఏర్పడే ఫండమెంటల్, బేసిక్, మోడల్ ప్రైమరీ, యూపీ, హైస్కూళ్ల వివరాలను కూడా నివేదించాల్సి ఉంది. దీంతోపాటు 47 కేటగిరీలకు సంబంధించిన టీచింగ్ పోస్టుల ు... మంజూరైనవి, పనిచేస్తున్నవి, మిగులు, అవసరం, డీఎస్సీ కోటా.. పాఠశాల యాజమాన్యాల వారీగా వివరాలు సేకరించి పాత, కొత్త జిల్లాల వారీగా తయారు చేయాలని ఆదేశించారు. ఉన్నత పాఠశాలల్లో 6–10 తరగతుల విద్యార్థుల సంఖ్యను బట్టి స్టాఫ్ ప్యాట్రన్‌ను తాజా నిబంధనల ప్రకారం తయారు చేస్తారు. ఈ ప్రకారం పాఠశాలల పునర్విభజన చేస్తే హైస్కూళ్లలో 10వేల స్కూల్ అసిస్టెంట్(ఎస్ఏ) పోస్టులు మిగులు ఏర్పడే అవకాశం ఉందని టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సరైన ప్రత్యామ్నాయం లేకుండానే మార్పులు ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న 3–5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల బోధన అందించడంతోపాటు మెరుగైన బోధనా విధానాలను అందుబాటులోకి తీసుకొస్తూ గత ప్రభుత్వం జీవో నంబర్ 117 జారీ చేసింది. అయితే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ జీవోను రద్దు చేయాలని కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ఇటీవల ప్రత్యామ్నాయ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే, ఈ మార్గదర్శకాల్లో అనేక ఇబ్బందులు ఉండడంతో ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం ఆ మార్గదర్శకాలనే అమలు చేసేందుకు సిద్ధమైంది. కొత్త విధానం ప్రకారం స్టాఫ్ ప్యాట్రన్ లెక్కించలేదు. ఉన్నత పాఠశాలల్లో 75 మందికంటే తక్కువ విద్యార్థులు ఉంటే అక్కడ స్కూల్ అసిస్టెంట్లతో కాకుండా ఎస్జీటీలతో బోధన అందించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది. -
తరగతి గదిలో మొబైల్ నిషిద్ధం.. పూజలు, నమాజ్‌కు పర్మిషన్ నో!
భిల్వారా: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పాఠశాల విద్యావిధానంలో నూతన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. భిల్వారాలో జరుగుతున్న హరిత్ సంగం జాతర ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర విద్య పంచాయతీరాజ్ మంత్రి మదన్ దిలావర్ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి ఏ ఉపాధ్యాయుడు కూడా తరగతి గదిలోనికి మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదని, పాఠశాల సమయంలో ప్రార్థన లేదా నమాజ్ పేరుతో ఏ ఉపాధ్యాయుడు కూడా పాఠశాలను వదిలి వెళ్లకూడదని ఆయన ఆదేశించారు.రాష్ట్రంలో విద్యా రంగాభివృద్ధికి విద్యా శాఖ(Department of Education) జారీ చేసిన ఆదేశాలను అమలయ్యేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నామని మదన్ దిలావర్ పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలని, తరగతి గదిలో బోధించేటప్పుడు ఏ ఉపాధ్యాయుడు మొబైల్ ఫోన్ తీసుకెళ్లకూడదన్నారు. తరగతి గదిలో ఫోన్ మోగితే, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఫలితంగా చదువులకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.ఇదేవిధంగా పాఠశాల జరుగుతున్న సమయంలో మతపరమైన ప్రార్థనల పేరుతో ఏ ఉపాధ్యాయుడు పాఠశాల నుండి బయటకు వెళ్లకూడదని ఆదేశించారు. ఇటువంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు(Complaints) వచ్చిన దరిమిలా విద్యాశాఖ ఇటువంటి నిర్ణయం తీసుకున్నదన్నారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు.. విద్యార్థులకు 20కి 20 మార్కులు ఇస్తున్నారని, అలా ఇవ్వడం సరైనది కాదన్నారు. బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఐదు వ్యాన్లతో ఆప్‌పై కాంగ్రెస్ ప్రచార దాడి -
పాఠాలు తర్వాత.. రిపోర్టులు పంపండి!
సాక్షి, అమరావతి: ‘మీ పాఠశాలల్లో ఎస్సీ ఉపాధ్యాయులు ఎంత మంది ఉన్నారు? విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? 2014–15 నుంచి 2023–24 విద్యా సంవత్సరం వరకు ఈ వివరాలు అర్జెంటుగా పంపించండి’.. పాఠశాల విద్యా శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు అందిన ఆదేశం ఇది. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వెబెక్స్‌లో సమాచారం అందించి, సాయంత్రంలోగా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. గత వారం ఉపాధ్యాయుల సర్వీసు సమాచారం వెంటనే అప్లోడ్ చేయాలని ఆదేశించారు. అంతకు ముందు అపార్.. పెన్.. ఇలా రోజుకో అంశంపై ఉపాధ్యాయులకు ‘అర్జెంట్ ఫైల్’ అంటూ ఆదేశాలు అందుతున్నాయి. దీంతో స్కూళ్లలో పిల్లలకు పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులకు సమయం ఉండటంలేదు. అధికారులు అడిగే సమాచారం అందించేందుకే సమయం సరిపోవడం లేదని, పాఠాలు చెప్పే సమయం ఎక్కడిదని టీచర్లు వాపోతున్నారు.ఎప్పుడు ఏం అడుగుతారో తెలియడంలేదని, పైగా అర్జెంట్ అంటూ అప్పటికప్పుడు సమాచారం మొత్తం ఇచ్చేయాలని ఆదేశిస్తున్నారని, దీంతో టెన్షన్‌తో గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సెలవుల్లోనూ ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ వింత పోకడతో రాష్ట్రవ్యాప్తంగా విద్యా బోధన కుంటుపడింది. దీంతో మున్సిపల్ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల్లో సమస్యలు ఏర్పడ్డాయి. గత ప్రభుత్వంలో విద్యా శాఖలో చేపట్టే సంస్కరణలు, మార్పులపై అన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలతో చర్చించేవారని, కూటమి ప్రభుత్వంలో రిజిస్టర్డ్ సంఘాలకు అసలు ప్రాతినిధ్యమే లేకుండా చేశారని టీచర్లు వాపోతున్నారు. కొన్ని నెలలుగా సమావేశాలు జరగడమే గానీ సమస్యలు పరిష్కారం కాలేదని ఈ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ఆందోళనలు, ధర్నాలకు సిద్ధమవుతున్నాయి. దీంతో పాఠశాల విద్య డైరెక్టర్ తాజాగా వారితోనూ సమావేశానికి ఏర్పాట్లు చేశారు. అయితే, సమస్యలు విని పరిష్కరిస్తారా.. లేక ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తారా అనేది తేలాల్సి ఉంది. చర్చలకు గుర్తింపు సంఘాలకే అనుమతి కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత జూన్ నెలలో చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటు రసాభాసగా మారింది. నేతల రికమండేషన్లు, ఒత్తిళ్లతో బదిలీ ప్రక్రియని గందరగోళంగా మార్చేశారు. ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకత, పలుచోట్ల ఆందోళనల నేపథ్యంలో వారంలో పూర్తవ్వాల్సిన సర్దుబాటు రెండు నెలల పాటు సాగింది. అనంతరం ఉపాధ్యాయ సమస్యలపై కమిషనరేట్‌లో చర్చలకు శ్రీకారం చుట్టారు. జీవో 117 రద్దు, ఇంగ్లిష్ మీడియం రద్దు, 3–5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో విలీనం, టీచర్లకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాల చెల్లింపు వంటి అంశాలపై పాఠశాల విద్య డైరెక్టర్ అధ్యక్షతన చర్చలు జరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్న ఈ చర్చలకు అన్ని సంఘాలను పిలవడంలేదు. కేవలం 9 గుర్తింపు సంఘాల నేతలను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. 37 రిజిస్టర్డ్ సంఘాలను అస్సలు పట్టించుకోవడంలేదు. చివరకు గుర్తింపు సంఘాల సూచనలనూ పరిగణనలోకి తీసుకోవడంలేదు. దీంతో సమస్యలు కూడా పరిష్కారం కావడంలేదు. ముఖ్యంగా ఒకటో తేదీన వేతనాన్ని ఒక్క నెల మాత్రమే అమలు చేశారు. గత ఐదు నెలలుగా వారం తర్వాతే ఇస్తున్నారు. పురపాలక సంఘాల్లోని పాఠశాలల్లో ఉన్న 14 వేల మంది ఉపాధ్యాయులకు చర్చల్లో కనీస ప్రాధాన్యత ఇవ్వడంలేదు. ఇతర సంఘాల నిర్ణయాలనే తమపై రుద్దుతున్నారని, ఇదెక్కడి న్యాయమని మున్సిపల్ ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. -
బాబూ.. జీతాలెప్పుడిస్తారు?
సాక్షి, అమరావతి: కొత్త ఏడాది మొదటి నెలలో ఐదు రోజులు గడిచినా, వేతనాలు అందలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రతి నెల ఒకటవ తేదీనే వేతనాలు చెల్లిస్తామన్న కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన మొదటి నెల తప్ప, మరే నెలలోనూ ఒకటో తేదీన వేతనాలు చెల్లించలేదని గుర్తు చేస్తున్నారు. గతేడాది డిసెంబర్ 31నే బిల్లులు రెడీ అయిపోయాయని.. జనవరి 1న వేతనాలు జమ కావడం ఖాయమని ప్రభుత్వం లీకులు ఇచ్చిందని, తీరా 5వ తేదీ దాటినా వేతనాలు జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ప్రతినెలా చెల్లించాల్సిన ఈఎంఐల చెల్లింపులో జాప్యం జరగడంతో తాము డిఫాల్టర్లుగా మారుతున్నామని, చెక్కులు బౌన్స్ అవుతున్నాయని వాపోతున్నారు. సంక్రాంతి పండుగ నెలలో ఇలా జీతాల కోసం ఎదురు చూడటం ఇబ్బందిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు ఇస్తామని మేనిఫెస్టోలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం రూ.5 వేల కోట్లు అప్పు తెచ్చి కూడా జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. మంగళవారం (7వ తేదీ) వరకు జీతాలు పడే అవకాశం లేదని ట్రెజరీ వర్గాలు చెబుతున్నాయని, ఈ లెక్కన కూటమి ప్రభుత్వం చెప్పిన దానికి.. ఇచ్చిన హామీకి.. చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి జీతాలివ్వాలి : ఏపీటీఎఫ్ అమరావతి జీవో 58 ప్రకారం కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రతి నెలా 1నే ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి బడ్జెట్‌లోను వేతనాల కోసం వార్షిక నిధులను కేటాయించాలని కోరారు. వేతనాలు వెంటనే చెల్లించాలి: సీహెచ్‌వో సంఘం గ్రామీణ ప్రాంతాల్లో విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లో సేవలు అందించే తమకు డిసెంబర్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్(సీహెచ్‌వో) అసోసియేషన్ ఆదివారం ప్రభుత్వాన్ని కోరింది. పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్ బకాయిలనూ విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఒకే దేశం.. ఒకే జీతం అమలు చేయాలి: ఏఐపీటీఎఫ్ ఉపాధ్యాయులు అందరికీ ఒకే దేశం.. ఒకే జీతం విధానాన్ని అమలు చేయాలని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (ఏఐపీటీఎఫ్) తీర్మానించింది. ఆదివారం న్యూఢిల్లీలోని అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ భవన్లో తొలి జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ నుంచి ఆప్టా రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐపీటీఎఫ్ కార్యనిర్వహక కార్యదర్శి ఏజీఎస్ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. -
యాద్రాది: డ్యూటీలకు డుమ్మా.. టీచర్లపై వేటు
సాక్షి, యాద్రాది: దీర్ఘకాలంగా విధులకు హాజరుకాకుండా డుమ్మా కొడుతున్న టీచర్లపై వేటు పడింది. 2005, 2006 నుంచి విధులకు రాని 16 మంది టీచర్లను తొలగిస్తూ యాద్రాది భువనగిరి జిల్లా డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.యాద్రాది జిల్లాలో 18 మంది ఉపాధ్యాయులు విధులకు హాజరుకావడం లేదు. 2005 నుంచి ఇప్పటివరకు డుమ్మా కొడుతున్న వారుండగా.. గతంలో షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఇద్దరు డ్యూటీలో చేరారు. మిగిలిన 16 మంది స్పందించలేకపోవడంతో. గత మే నెలలో కూడా గెజిట్ నోటీసు విద్యాశాఖ జారీ చేసింది. అయినా టీచర్ల నుంచి స్పందన రాకపోవడంతో వారందరికీ సర్వీస్ నుంచి తొలగిస్తూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు. -
తెలుగు మాధ్యమంలో చెప్పేదెవరు?
సాక్షి, హైదరాబాద్: మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంటోంది. ఇటీవల అన్ని రాష్ట్రాలకు దీనిపై సూచనలు చేసింది. సాంకేతిక విద్య సహా అన్ని ఉన్నత విద్య కోర్సులకు స్థానిక భాషల్లో పుస్తకాలు అందించే ప్రక్రియను ఇప్పటికే చేపట్టింది. నూతన విద్యా విధానంలో భాగంగా ఈ మార్పులు చేస్తున్నట్టు చెబుతోంది. అయితే రాష్ట్రంలో తెలుగు మీడియం పరిస్థితిపై రెండు నెలల క్రితం రాష్ట్ర విద్యాశాఖ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా స్కూల్ స్థాయిలో తెలుగు మీడియం పరిస్థితి అంతంత మాత్రంగానే తేలింది. తెలుగు మీడియంలో బోధించడం ఉపాధ్యాయులకు కూడా ఇబ్బందిగానే ఉందని విద్యా శాఖ అధికారులు చెబుతున్నారు. ఇంగ్లిష్ వాడుక భాషగా మారడం, కొత్తతరం ఉపాధ్యాయ వృత్తిలోకి రావడంతో తెలుగు బోధనలోనూ ఇంగ్లిష్ పదాలు దొర్లుతున్నాయని పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉన్నత విద్యను తెలుగులో బోధించడంపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై నిపుణులతో కమిటీ వేసే యోచనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. చూపంతా ఆంగ్ల మాధ్యమం వైపే.. రాష్ట్రంలో తెలుగు మీడియం కన్నా ఇంగ్లిష్ మీడియం వైపే ప్రజలు మొగ్గుతున్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు మీడియం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కేవలం 0.6 శాతం మాత్రమే. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ఇది 6.7 శాతమే కావడం గమనార్హం. రాష్ట్రంలో 41,628 ప్రభుత్వ, ప్రైవేటు బడులు ఉండగా.. వాటిలో 59 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు.ప్రభుత్వ బడుల్లో ఒకటి పదో తరగతి వరకు చదివే విద్యార్థుల సంఖ్య 22,63,491 మందికాగా.. ఇందులో 4,08,662 మంది (18 శాతం) మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో 34,92,886 మంది చదువుతుంటే... అందులో 20,057 మంది (0.57 శాతం) మాత్రమే తెలుగు మీడియం విద్యార్థులు ఉండటం గమనార్హం. ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న 62,738 మందిలో 8,960 మంది మాత్రమే తెలుగు మీడియం వారు. ఇంగ్లిష్ ముక్కలొస్తే చాలంటూ.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదివించాలనే భావిస్తున్నారని విద్యాశాఖ పరిశీలనలో తేలింది. ప్రభుత్వ స్కూళ్లలో 2023 నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టినా... ప్రైవేటుకే మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇంగ్లిష్ నేర్చుకుని, మాట్లాడటం వస్తే చాలన్న భావన కనిపిస్తోందని అధికారులు అంటున్నారు. మరోవైపు టెన్త్, ఇంటర్ తర్వాత దొరికే చిన్నా చితక ఉద్యోగాలకూ ఆంగ్ల భాష ప్రామాణికంగా మారిందని.. దీనితో ప్రైవేటు బడుల్లో ఆంగ్ల మాధ్యమం కోసం పంపుతున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వ బడుల్లోనూ తెలుగు మీడియం కంటే ఆంగ్ల మాధ్యమంలో చేరడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మాతృభాషలో విద్యా బోధన ఉండాలన్న కేంద్ర సూచనలపై పీటముడి పడుతోంది. తెలుగు మీడియంలో చేరేవారెవరు, బోధించేవారెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ఈ మార్పు మంచికేనా?!
విద్య–సమాజం విడదీయలేనివి. అవి ఏకకాలంలో పరస్పరాశ్రితాలు, పరస్పర ప్రభావితాలు కూడా. ఒక సమాజంలో పిల్లలకు అందే విద్య ఆ సమాజ స్థాయికి ప్రతిబింబంగా ఉంటుంది. క్రమేపీ ఆ సమాజాన్ని మెరుగుపరుస్తుంది. తిరిగి ఆ ప్రభావంతో విద్య ఉచ్చస్థితికి వెళ్తుంటుంది. అందువల్లే సమాజ స్థితిగతుల అధ్యయనం ఆధారంగా విద్యావిధాన నిర్ణయాలుండాలంటారు. పాఠశాల విద్యలో ప్రస్తుతం అమలవుతున్న ‘నో డిటెన్షన్’ విధానాన్ని కేంద్రం రద్దు చేయటంపై లోతైన చర్చే సాగుతోంది. కేంద్రీయ విద్యాలయాలూ, నవోదయా విద్యాలయాలూ, సైనిక్ స్కూళ్లతోపాటు కేంద్రం నడిపే మరో 3,000 పాఠశాలల్లో తక్షణం ఈ విధానం అమల్లోకొచ్చింది. పర్యవసానంగా ఇకపై అయిదు, ఎనిమిది తరగతుల వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేనివారికి రెండు నెలల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండోసారి కూడా ఫెయిలైతే వారు తిరిగి అవే తరగతులు చదవాలి. వాస్తవానికి ఈ విధానం రద్దు కోసం 2019లోనే విద్యాహక్కు చట్టాన్ని కేంద్రం సవరించింది. విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది కనుక రద్దు నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అప్పట్లో 16 రాష్ట్రాలూ, 2 కేంద్రపాలిత ప్రాంతాలూ కేంద్ర విధానానికి అంగీకారం తెలిపాయి. కానీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం వ్యతిరేకించాయి. నిర్ణయం తీసుకున్న అయిదేళ్ల తర్వాత తాజాగా నోటిఫికేషన్ వెలువడింది. ‘నో డిటెన్షన్’ విధానంపై అనుకూల వాదనలు ఎన్ని వున్నాయో, ప్రతికూల వాదనలు కూడా అంతకు మించే ఉన్నాయి. అనుకూల వాదనలు తీసిపారేయదగ్గవి కాదు. ఈ విధానంవల్ల డ్రాపౌట్ల శాతం గణనీయంగా తగ్గిందని, ఉత్తీర్ణత సాధించలేమన్న భయాన్ని విడనాడటంవల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందుతున్నదని, అందరూ తమను చిన్నచూపు చూస్తారన్న ఆందోళన తగ్గిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక విద్యార్థిని ఫెయిల్ చేసినంత మాత్రాన నైపుణ్యం పెరుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని, పైగా తనతో చదివినవారంతా పై తరగతులకు పోవటంవల్ల ఆత్మ న్యూనతకు లోనై, ఒత్తిడి పెరిగి విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని కూడా ‘నో డిటెన్షన్’ సమర్థకులు చెబుతున్నారు. విద్యాహక్కు చట్టం ‘నో డిటెన్షన్’ విధానం పెట్టి ఊరుకోలేదు. అందులోని 29(2)(హెచ్) నిబంధన విద్యాబోధన తీరుతెన్నులనూ, పిల్లల అధ్యయన నైపుణ్యాలనూ మెరుగుపరిచేందుకు సమగ్ర, నిరంతర మూల్యాంకన(సీసీఈ) విధానం ఉండాలని సూచిస్తోంది. సంప్రదాయ పరీక్ష విధానానికి బదులుగా నిర్దేశించిన ఈ విధానం ఆచరణలో ఎలా అమలవుతున్నదో ఎవరైనా పరిశీలించారా? ఇది సక్రమంగా అమలైతే ఎప్పటికప్పుడు పిల్లల గ్రాహకశక్తిని అంచనా వేసి చదువుల్లో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటానికి అవకాశం ఉండేది. కానీ ఉపాధ్యాయులకు అప్పజెప్పే ఇతరేతర పనులవల్ల కావొచ్చు... వారిలోని అలసత్వం వల్ల కావొచ్చు– పిల్లలపై శ్రద్ధ తగ్గిందన్నది ‘నో డిటెన్షన్’ విధానం రద్దు అనుకూలుర మాట. ‘ఎలాగైనా’ ఉత్తీర్ణులమవుతామన్న ధైర్యంతో పిల్లలు చదవటం లేదని, అలాంటివారి విషయంలో ఉపాధ్యా యులు కూడా నిర్లిప్తంగా ఉండిపోతున్నారని, ఇందువల్ల ఇతర పిల్లలపై కూడా ఆ ప్రభావంపడి మొత్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని వారి వాదన. చాలా రాష్ట్రాల్లో పాలకులు పాఠశాల విద్యపై సమగ్ర దృష్టి సారించటం లేదు. ఈ విషయంలో కేరళ తర్వాత ఢిల్లీ చెప్పుకోదగ్గ ప్రగతి సాధించింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌లో విద్యారంగ ప్రక్షాళన ఒక యజ్ఞంలాగే నడిచింది. ఒకపక్క సకల సదుపాయాలతో పాఠశాల భవనాలను తీర్చిదిద్దటంతోపాటు పిల్లల చదువులను మెరుగుపరిచేందుకు వీలుగా తరగతి గదుల్లో ఎన్నో బోధనోపకరణాలు ప్రవేశపెట్టారు. విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేశారు. విద్యాబోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. సీబీఎస్ఈ, ఐబీ సిలబస్‌ల అమలుకు అంకురార్పణ చేశారు. ఈ తరహా సిలబస్‌లు ప్రవేశపెట్టిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వంటివి ట్యూషన్ ఫీజు కింద రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకూ వసూలు చేస్తున్నాయని ఈమధ్య మీడియా కథనాలు వెల్లడించాయి. ప్రభుత్వాలు పాఠశాల విద్యను నిరంతరం పర్యవేక్షించి తగినంతమంది టీచర్లను నియమిస్తే, సదుపాయాలు మెరుగుపరిస్తే, ప్రామాణికమైన సిలబస్‌లు ప్రవేశపెడితే పిల్లల నైపుణ్యాలు పెరుగు తాయి. ప్రైవేటు విద్యలో ఎల్కేజీ నుంచే పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంచే అనారోగ్యకర విధానాలు అమలవుతున్నాయి. కాన్సెప్ట్ స్కూళ్లు ఈ పోటీని మరింత పెంచాయి. ‘పిండికొద్దీ రొట్టె’ అన్నట్టు డబ్బు పారేస్తే తమ పిల్లలు అమాంతం ఎదుగుతారన్న భ్రమల్లో తల్లిదండ్రులున్నారు. మరి సర్కారీ బడుల్లో పిల్లల్ని చదివిస్తున్న పేద తల్లిదండ్రులు ఏం కావాలి... వారి పిల్లలకు మెరుగైన విద్య ఎలా అందాలి? గోరుచుట్టుపై రోకటి పోటులా ఇప్పుడున్న ‘నో డిటెన్షన్’ విధానం రద్దయితే పేద పిల్లలు ఎప్పటికి మెరుగుపడాలి? ఎదిగాక ఏం చేయాలి? కేంద్రం ఏ విధానం అమలు చేయదల్చుకున్నా దానికి ముందు బావురుమంటున్న ప్రభుత్వ బడులను ఉద్ధరించాలి. అక్కడి పిల్లలకు కడుపునిండా తిండి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే బోధన ఉంటున్నాయో లేదో గమనించాలి. ఉపాధ్యాయుల నైపుణ్యాలను ఎప్పటికప్పుడు పెంపొందించాలి. వారిని బోధనకే పరిమితం చేయాలి. ‘నాణ్యత అనేది యాదృచ్ఛికంగా ఊడిపడదు. అది నిరంతరం కొనసాగే వేనవేల బౌద్ధిక చర్యల సమాహారం’ అన్నారు ప్రముఖ శాస్త్రవేత్త ఐన్‌స్టీన్. పాలకులు దాన్ని గుర్తెరగాలి. -
ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు నినదించారు. తమ పోస్టులను డీఎస్సీ నుంచి మినహాయించి కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లు(సీఆర్టీ)గా మార్చాలని డిమాండ్ చేస్తూ గురుకుల టీచర్లు చేపట్టిన సమ్మె శనివారం 22వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం లెనిన్ సెంటర్లో మోకాళ్లపై మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనాయక్, మల్లిఖార్జున నాయక్ మాట్లాడుతూ 15ఏళ్లకు పైగా చాలీచాలని వేతనాలతో సేవలందిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన సంక్షేమశాఖ మంత్రి, అధికారులు సైతం తమ సమస్యలను పట్టించుకోవడంలేదని చెప్పారు. తమ డిమాండ్లపై సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయ వ్యవస్థ ఉందన్నారు. ఆ వ్యవస్థను రద్దు చేసి తమను సీఆర్టీలుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని లక్ష్మీనాయక్, మల్లిఖార్జున నాయక్ స్పష్టంచేశారు.విద్యార్థులు, తల్లిదండ్రుల నిరసన తూర్పు గోదావరి జిల్లా కూనవరంలో మెగా టీచర్స్–పేరెంట్స్ మీటింగ్‌లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సైతం నిరసన వ్యక్తంచేశారు. గిరిజన పిల్లల చదువులపై ప్రభావం చూపుతున్న ఔట్ సోర్సింగ్ టీచర్ల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని కోరుతూ కొందరు తల్లిదండ్రులు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేశారు.ఔట్ సోర్సింగ్ టీచర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో తమ పిల్లల చదువులకు ఇబ్బందికరంగా మారిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ బిడ్డలకు ఉపాధ్యాయులు కావాలని డిమాండ్ చేశారు. -
గురుకుల టీచర్లకు సర్కార్ బెదిరింపులు
సాక్షి, అమరావతి: న్యాయమైన తమ డిమాండ్లు తీర్చాలని శాంతియుతంగా సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయుల పొట్ట కొట్టేందుకు కూటమి ప్రభుత్వం షోకాజ్ నోటీసు పేరుతో మరో అస్త్రాన్ని ప్రయోగించింది. డీఎస్సీ నుంచి గురుకుల టీచర్ల పోస్టులు మినహాయించాలని, కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్లు (సీఆర్టీ)గా గుర్తించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలనే తదితర ప్రధాన డిమాండ్లతో గత నెల 16 వ తేదీ నుంచి రాష్ట్రంలోని 1,656 మంది గురుకుల టీచర్లు సమ్మె బాట పట్టారు. రాష్ట్రంలోని విజయవాడ ధర్నా చౌక్‌తోపాటు సీతంపేట, పార్వతీపురం, పాడేరు గిరిజన సమీకృత అభివృద్ధి (ఐటీడీఏ) కార్యాలయాల వద్ద శాంతియుత ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అయితే వారి డిమాండ్లను పరిశీలిస్తామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రితో సహా ఉన్నతాధికారులు రెండు దఫాలుగా ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 371 ఆశ్రమ పాఠశాలల నుంచి 550 మంది ఉపాధ్యాయులను గురుకులాల్లో బోధనకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. గురుకుల ఔట్ సోర్సింగ్ టీచర్లు గతంలో ఉన్న షరతులకు లోబడి మూడు రోజుల్లో విధుల్లో చేరాలని, లేదంటే విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు పరిగణించి తదుపరి చర్యలు తీసుకుంటామని తాజాగా గురువారం షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ బెదిరింపులకు దిగారు. ఆయా గురుకుల కాలేజీల ప్రిన్సిపాళ్లు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ సంస్థలో పనిచేసే ఔట్ సోర్సింగ్ టీచర్లకు నోటీసులు అందిస్తున్నారు. కాగా, గిరిజన గురుకులాల్లో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న జేఎల్, పీజీటీ, టీజీటీ, పీడీ, పీఈటీ, ఆర్ట్ క్రాఫ్ట్ టీచర్లు 11 నుంచి 20 రోజులుగా అనుమతి లేకుండా సమ్మె చేస్తున్నారని ఆ షోకాజ్ నోటీసులో పేర్కొనడం గమనార్హం. -
ఉపాధ్యాయుల్లో ‘పీటీఎం’ గుబులు
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వం తలపెట్టిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు (పీటీఎం) ఉపాధ్యాయుల్లో గుబులు రేపుతున్నాయి. ఎక్కడా ఏలోటూ రాకుండా నూరు శాతం తల్లిదండ్రుల హాజరు ఉండాలని ఒక పక్క.. స్థానిక రాజకీయ నాయకులను తప్పనిసరిగా ఆహా్వనించాలన్న ఆదేశాలు మరోపక్క టీచర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నో పేరెంట్స్–టీచర్స్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించిన ఉపాధ్యాయులు ఇప్పుడు మెగా పీటీఎం అంటే భయపడే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఒత్తిడి, అధికారుల రోజువారీ సమావేశాలు, ఆదేశాలతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. మరోపక్క ఈ నెల 9 నుంచి విద్యార్థులకు అర్ధ వార్షిక పరీక్షలు (సమ్మేటివ్–1) ఉండగా.. పీటీఎం పనుల్లో నిమగ్నమైన ఉపాధ్యాయులు ఇప్పటివరకు సిలబస్ పూర్తి చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో ఫలితాలు తగ్గితే తమపై చర్యలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి గతనెల 14న మెగా పీటీఎం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించి, ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్రంలోని 45,099 ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్స్– టీచర్స్ సమావేశాలు గొప్పగా నిర్వహించాలని, నిర్వహణకు టీచర్లు, తల్లిదండ్రులతో కమిటీలు వేయాలని సూచించింది. ఈ సమావేశాలపై ఉపాధ్యాయులకు ప్రతిరోజు జిల్లా కలెక్టర్లు, డీఈవోలు, ఇతర ఉన్నతాధికారుల రివ్యూలతో క్షణం తీరికలేకపోవడంతో రెండు వారాలుగా బడుల్లో బోధన అటకెక్కింది. టార్గెట్లతో ఉక్కిరిబిక్కిరి ప్రతి స్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులు 100 శాతం హాజరయ్యేలా చూసే బాధ్యత ఉపాధ్యాయులపై పెట్టారు. అంతేగాక సమావేశాల నిర్వహణకు ప్రతి స్కూల్లో ఆహ్వా న కమిటీ నుంచి మీడియా కవరేజీ కమిటీ వరకు 13 కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇందులో ఉపాధ్యాయులతో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఉండాలని సూచించారు. స్కూళ్లను సుందరంగా అలంకరించి తోరణాలు కట్టాలని, వచ్చే వారికి పూలతో ఆహ్వానం పలకాలనే నిబంధన విధించారు. పిల్లల తల్లులకు ముగ్గుల పోటీలు, తల్లిదండ్రులకు టగ్ ఆఫ్ వార్ ఆడించి బహుమతులు కూడా ఇవ్వాలని ఆదేశించారు. వీటితో పాటు ఇప్పటివరకు జరిగిన రెండు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షల ఫలితాలతో హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులు తల్లిదండ్రులకు ఇచ్చి, ఆయా సబ్జెక్టుల టీచర్లు వారికి విడిగా విద్యార్థుల ప్రగతిని వివరించాల్సి ఉంది. దీంతోపాటు మండలానికి 5 స్కూళ్లలో విద్యార్థుల హెల్త్ కార్డులను సైతం పంపిణీ చేయాలి. తర్వాత అందరు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి, స్థానిక నాయకులతో బడిలో తీసుకోవాల్సిన మార్పులపై ప్రసంగాలు చేయాలి. అయితే, స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఒక్కరినే ఆహ్వా నించాలని ఆదేశించడంతో ఎవరిని పిలవాలో తెలియక ఉపాధ్యాయులు మథనపడుతున్నారు. ఒకరిని పిలిచి మరొకరిని పిలవకపోతే తమపై ఎలాంటి ఫిర్యాదులు చేస్తారోనని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క ప్రస్తుత వ్యవసాయ పనుల సమయంలో సమావేశానికి పిలిచినా తల్లిదండ్రులు వచ్చే అవకాశం లేదని.. మరి నూరు శాతం హాజరు ఎలా చూపాలని వాపోతున్నారు. విందుపై వెనక్కి తగ్గిన సర్కారుమెగా పీటీఎం నిర్వహణ ఏర్పాట్లకు రాష్ట్ర సమగ్ర శిక్ష నుంచి రూ.9.06 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. బడిలో 10 మంది విద్యార్థులుంటే రూ.1,000, 25 మంది ఉంటే రూ.1,200, 2 వేల మంది ఉంటే రూ.13 వేలు, అంతకంటే ఎక్కువ ఉంటే రూ.14 వేల చొప్పున బడ్జెట్ కేటాయించింది. ఈ మొత్తం నిధులతోనే షామియానా, మైక్సెట్లు, అలంకరణ, బొకేలు తదితర సామగ్రి సమకూర్చాలి. ఈ డబ్బుతోనే తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇవ్వాలి. దీంతోపాటు మధ్యాహ్నం పిల్లలతోపాటు తల్లిదండ్రులకు, అతిథులకు విందు భోజనం పెట్టాలని, నిధులను ఉపాధ్యాయులు స్థానికంగా దాతల నుంచి చందాలు తీసుకోవాలని సూచించారు. అయితే, ఏ మూలకూ సరిపోని అరకొర బడ్జెట్‌తో సమావేశాలు నిర్వహించడం కష్టమని, భోజనం ఏర్పాట్లు తమవల్ల కాదని ఉపాధ్యాయులు తెగేసి చెప్పారు. దీంతో విందును మ«ద్యాహ్న భోజనం నుంచి ఏర్పాటు చేస్తామని అధికారులు తాజాగా హామీ ఇచ్చారు. బోధన పక్కనపెట్టి అపార్ నమోదులో నిమగ్నమైన ఉపాధ్యాయులు ఇప్పుడు మెగా పీటీఎం ఏర్పాట్లపై ఉన్నతాధికారుల వీడియో కాన్ఫరెన్సులతో బిజీగా మారారు. పీటీఎం పూర్తయ్యే వరకు ప్రతిరోజు ఏర్పాట్లపై జిల్లాస్థాయి అధికారులకు సమాచారం అందించాలి. కూటమి సర్కారు గొప్ప కోసం చేపట్టిన మెగా పీటీఎం ఇప్పుడు విద్యార్థుల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎన్నికల కోడ్ ఉన్నా ‘పీటీఎం’ హడావుడి ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాల్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ కారణంతోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల వేడుకకు ఆ జిల్లాల టీచర్లను ఆహ్వానించకపోగా అవార్డులను సైతం ప్రదానం చేయలేదు. అలాంటిది రాజకీయ రంగు పులుముకున్న మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు ఈనెల 7న ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎలా నిర్వహిస్తారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు సైతం పాల్గొంటారు. టీచర్లకు అవార్డులు ప్రదానం చేసేందుకు అడ్డొచి్చన కోడ్ ఈ సమావేశాలకు వర్తించదా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. -
గిరిజన టీచర్లపై కత్తిగట్టిన సర్కారు
సాక్షి, అమరావతి: బతుకుపై భరోసా కోసం సమ్మెబాట పట్టిన గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లపై కూటమి సర్కారు కత్తిగట్టింది. వారి సమస్యను అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించాల్నిన ప్రభుత్వం... కక్ష సాధింపునకు పాల్పడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీంతో గిరిజన టీచర్లు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. వారికి మద్దతుగా విద్యార్థులు సైతం ఆందోళనబాట పట్టారు. డీఎస్సీ నుంచి గురుకులాల్లోని ఔట్ సోర్సింగ్ పోస్టులను మినహాయించాలని, తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆరీ్ట)గా పరిగణించాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, మరికొన్ని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 15 రోజులుగా రాష్ట్రంలోని 199 గిరిజన సంక్షేమ గురుకులాలకు చెందిన 1,656 మంది ఔట్ సోర్సింగ్ గిరిజన టీచర్లు సమ్మె చేస్తున్నారు.వారితో చర్చలు జరిపి సానుకూల పరిష్కారమార్గం చూపించి సమ్మెను విరమింపజేయాల్నిన ప్రభుత్వం... ఇందుకు విరుద్ధంగా మరింత రెచ్చగొట్టే ధోరణిని అవలంబిస్తోంది. గిరిజన సంక్షేమ గురుకులాల్లో విధులు నిర్వర్తించాలని 371 గిరిజన ఆశ్రమ పాఠశాలలకు చెందిన 550 మందికిపైగా టీచర్లకు శనివారం తాత్కాలిక(డిప్యూటేషన్) బాధ్యతలు అప్పగించింది. వారు వచ్చి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే 15 రోజులుగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో బోధన నిలిచిపోయింది. తాత్కాలిక సర్దుబాటు వల్ల సుమారు 51వేల మంది ఉన్న గిరిజన గురుకులాల్లో పెద్దగా బోధన జరిగే అవకాశం లేదు. అదేసమయంలో ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో అక్కడి విద్యార్థులకు బోధన సక్రమంగా జరిగే అవకాశం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల గిరిజన సంక్షేమ గురుకులాలతోపాటు ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉంది.అమలుకు నోచుకోని హామీలు...సమ్మె చేస్తున్న గిరిజన గురుకుల విద్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ టీచర్లతో గతంలో ఒకసారి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి చర్యలు జరిపి పలు హామీలు ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం విద్యాశాఖ మంత్రి లోకేశ్ ఓఎస్డీ వరప్రసాద్ వచ్చి కొన్ని హామీలు ఇచ్చారు. అవేమీ అమల్లోకి రాకపోవడంతో ఔట్ సోర్సింగ్ టీచర్ల సమ్మె కొనసాగుతోంది. పాడేరు ఐటీడీఏ వద్ద వర్షంలోను రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. పార్వతీపురం ఐటీడీఏ వద్ద గిరిజన ఔట్ సోర్సింగ్ టీచర్లు భిక్షాటన చేసి నిరసన తెలిపారు.విజయవాడ ధర్నా చౌక్‌లోను ధర్నాను కొనసాగించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జాతీయ, రాష్ట్ర ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఔట్ సోర్సింగ్ టీచర్లకు మద్దతుగా పార్వతీపురం మన్యం జిల్లాలోని పి.కోనవలస గ్రామంలో శనివారం విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ‘తమ బడిలో ఉండే ఔట్ సోర్సింగ్ టీచర్లే తమకు కావాలి...’ అని ప్రభుత్వాన్ని విద్యార్థులు డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ పాఠశాలలో పదేళ్ల చిన్నారులతో పనులు
-
బంధించి, 6 నెలలకుపైగా రేప్
కాన్పూర్(యూపీ): విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కామపిశాచులుగా మారి టీనేజ్ విద్యార్థినితో అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. 2022 డిసెంబర్ చివర్లో జరిగిన ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. వైద్యవిద్యా కోర్సులో ప్రవేశాల కోసం నీట్ పరీక్ష రాసేందుకు సిద్ధమవుతున్న 17 ఏళ్ల బాలికను ఇద్దరు టీచర్లు బంధించి ఆరునెలలకుపైగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఇప్పుడు యూపీలో చర్చనీయాంశమైంది. కేసు వివరాలను కళ్యాణ్పూర్ అసిస్టెంట్ కమిషనర్ అభిõÙక్ పాండే శనివారం మీడియాకు వెల్లడించారు. ఫతేపూర్ పట్టణానికి చెందిన ఈ టీనేజీ అమ్మాయి నీట్ కోచింగ్ కోసం కాన్పూర్‌కు వచ్చి హాస్టల్లో ఉంటోంది. ఆమె నీట్ కోచింగ్ తీసుకుంటున్న చోటే సాహిల్ సిద్ధిఖీ జీవశాస్త్రం, వికాస్ పూర్వాల్ రసాయనశాస్త్రం బోధించేవారు. 2023 ఏడాది కొత్త ఏడాది వేడుకలు జరుగుతున్నాయి, విద్యార్థులంతా వస్తున్నారని చెప్పి ఈ టీనేజర్‌ను ఆమె ఫ్రెండ్ ఫ్లాట్‌కు టీచర్లు సాహిల్, వికాస్ రప్పించారు. మక్డీఖేరాలోని ప్లాట్‌కు వచ్చిన అమ్మాయికి టీచర్లుతప్ప విద్యార్థులెవరూ కనిపించలేదు. మత్తుమందు కలిపిన శీతలపానీయం తాగడంతో స్పృహకోల్పోయిన టీనేజర్‌ను సాహిల్ తన ఫ్లాట్‌కు తీసుకెళ్లి ఆరునెలలకుపైగా బంధించాడు. పలుమార్లు రేప్‌చేశాడు. తర్వాత వికాస్ సైతం అదే దారుణానికి పాల్పడ్డాడు. ఆరునెలల తర్వాత కాన్పూర్‌కు వచ్చిన తల్లి ఆ టీనేజర్‌ను తీసుకెళ్లింది. అయితే అత్యాచారాన్ని వీడియోలు తీసి బెదిరించడంతో కుటుంబపరువు పోతుందన్న భయంతో టీనేజర్ తనకు జరిగిన దారుణాన్ని బయటకు చెప్పలేదు. అయితే రెండు నెలల క్రితం మరో విద్యారి్థని పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో టీచర్ సాహిల్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇటీవల అతను బెయిల్‌పై బయటికొచ్చాడు. అయితే ఆ మరో విద్యారి్థనిని సాహిల్ లైంగికంగా వేధించిన వీడియో తాజాగా బయటకురావడంతో ధైర్యం తెచ్చుకున్న టీనేజర్ ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోక్సోసహా పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసి సాహిల్, వికాస్‌లను అరెస్ట్‌చేశారు. -
ఈ ‘శిక్ష’ణ మాకొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు ఇస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) రెసిడెన్షియల్ శిక్షణపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తమకు స్థానికంగా శిక్షణ ఇవ్వాలని చెప్పినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ఆగిరిపల్లిలో శిక్షణ కోసం వచ్చిన ఉపా«ద్యాయుడు మృతి చెందడం, చీరాలలో మరో ఉపాధ్యాయుడు అస్వస్తతకు గురవడంతో ఈ శిక్షణను పూర్తిగా బహిష్కరించాలని భావిస్తున్నాయి.ఉపాధ్యాయులపై ఉన్న భారాన్ని తొలగిస్తామని, యాప్స్, శిక్షణ అంశాలను తొలగిస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు హామీలు ఇచ్చారని, కానీ గతం కంటే ఇప్పుడు పని ఒత్తిడి అధికంగా పెంచారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలను తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారికి శిక్షణ నుంచి మినహాయించాలన్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో పాఠశాల విద్య డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేసి తమకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే శిక్షణను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. విద్యా ప్రమాణాల పెంపునకు శిక్షణవిద్యాబోధనలో ప్రమాణాలు పెంచాలంటే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఉండాలని జాతీయ విద్యా విధానానికి, నిపుణ్ భారత్ ప్రోగ్రామ్‌కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఎఫ్ఎల్ఎన్ శిక్షణను ప్రారంభించింది. ఈ శిక్షణ ద్వారా 1, 2 తరగతులపై దృష్టి సారించి, 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన విద్యను అందచడమే లక్ష్యంగా కోర్సుకు రూపకల్పన చేశారు. మొత్తం 34 వేల మంది గ్రేడ్–1, 2 కేటగిరీ ఉపాధ్యాయులకు 14 విడతల్లో ఈ శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాది కూడా ఇదే తరహా శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా 9 కేంద్రాల్లో దాదాపు 4 వేల మందికి, ఈ ఏడాది తొలివిడత 1,700 మందికి శిక్షణ ఇచ్చారు.అయితే, అప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. గతేడాది పిల్లలను బడిలో చేర్పించడం, బడి బయటి పిల్లలను సర్వే చేయడం, వారిని బడికి తీసుకొచ్చే బాధ్యతను వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల చేరికల కోసం ఇంటింటి సర్వే ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చింది. దీంతోపాటు పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సిద్ధం చేయడం, కొత్తగా అపార్ ఐడీల నమోదు వంటి అదనపు భారం తమపై పడిందని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
విద్యార్థిని తొడ కొరికిన కీచక టీచర్
కోడూరు: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నరసింహపురంలో చోటుచేసుకుంది. నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ టీచర్‌ను నియమించుకుని విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. బాధ్యత మొత్తం ఆ టీచర్ మీద వదిలేసి వేణుగోపాలరావు పాఠశాలలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థినితో నాలుగు రోజుల నుంచి అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. ఉపాధ్యాయుడు నాలుగు రోజుల నుంచి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడని చెప్పింది. తల్లిదండ్రులు విద్యార్థిని తొడపై పంటిగాట్లు గమనించారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
ఒక నెలతో సరి.. ఒకటో తేదీ జీతాల్లేవ్
సాక్షి, అమరావతి: తమది ఉద్యోగుల ప్రభుత్వమని, అందరికీ ప్రతినెల ఒకటో తేదీనే జీతాలు ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం వేతనాలివ్వడంలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చాక జూలై నెలలో మాత్రమే ఒకటో తేదీన జీతాలిచ్చారని, తర్వాత నెలల్లో ఐదు, ఆరు తేదీల్లోనే వేస్తున్నారని తెలిపారు. ప్రతినెలా మంగళవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు రెండులక్షల మంది ఉపాధ్యాయులకు అక్టోబర్ నెల వేతనాలను నవంబర్ ఒకటో తేదీన ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు జమ చేయలేదు. పెన్షన్లు కూడా అందరికీ అందలేదు. కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని, మొదటి నెలలో మాత్రం ఒకటో తేదీ జీతాలు చెల్లించి, తర్వాత ప్రతినెలా 4, 5, 6 తేదీల్లో జీతాలు ఇస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. పిల్లల ఫీజులు, ఇంటి ఖర్చులు, ఈఎంఐ వంటి అవసరాలతో ఇబ్బందిపడుతున్నామని పేర్కొంటున్నారు. ఒకటో తేదీన వేతనాలు ఇవ్వకపోవడంతో ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక డిఫాల్టర్లుగా మారుతున్నామని ఆవేదన చెందుతున్నారు. పెన్షన్ సొమ్ముతో జీవనం సాగిస్తున్నవారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలి? ఉపాధ్యాయులకు ఇప్పటివరకు పీఎఫ్ లోన్లు, ఏపీజేఎల్‌ఐ లోన్లు, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవులు జమచేయలేదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.అశోక్‌కుమార్‌రెడ్డి, గెడ్డం సుదీర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాము దాచుకున్న డబ్బును ఇవ్వకపోతే తమ పిల్లల చదువులు ఏం కావాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. డబ్బులు అప్పు తెచ్చి ఎంతకాలం వడ్డీలు చెల్లించాలని ప్రశ్నించారు. తమకు రావాల్సిన పీఎఫ్ లోను బకాయిలు, పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లించాలని, ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు అండగా ఉంటామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, ఇప్పుడు ఉద్యోగస్తులపై కేసులు పెట్టిన వారికి అండగా ఉంటామని మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక చర్యలు మానుకుని, వారి సంక్షేమం కోసం పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. -
జీతాల్లేవ్.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్
సాక్షి, విజయవాడ: చంద్రబాబు పాలనలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఎన్నికల ముందు ఉద్యోగులకు హామీల వర్షం కురిపించిన చంద్రబాబు సర్కార్.. హామీల సంగతి దేవుడెరుగు.. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంలో నానా ఇబ్బందులకు గురిచేస్తోంది.జీతాలు రాక ప్రభుత ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. 2 వ తేదీ వచ్చినా కానీ కూటమి ప్రభుత్వం.. టీచర్లకు జీతాలు వేయలేదు. 2 నెలలుగా కూడా ఒకటో తేదీన జీతాలు వేయలేదు. పెన్షనర్లకు కూడా ఇంకా పెన్షన్లు జమ కాలేదు.కాగా, చంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులకు వేధింపులే తప్ప ఎలాంటి మేలు జరగటం లేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఐఆర్, పీఆర్సీ సంగతి ప్రభుత్వం గాలికొదిలేసింది. అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్న హామీలు ఏమయ్యాయి? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.ఇంటి స్థలాలను వెంటనే మంజూరు చేయాలని, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పది శాతం ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని.. జాబ్ కేలండర్‌ను త్వరగా విడుదల చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబూ.. మరి అవన్నీ కుట్రలేనా?: రాచమల్లు -
ప్రభుత్వ పాఠశాలల్లో మార్గనిర్దేశకులు
సాక్షి, అమరావతి: విద్యార్థులను ఉన్నత చదువులు, ఉత్తమ భవిష్యత్ వైపు ప్రోత్సహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ప్రభుత్వ పాఠశాలలోను విద్యార్థుల కోసం కెరీర్ గైడెన్స్ నిపుణులను అందుబాటులో ఉంచేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనుంది.యునిసెఫ్ ప్రాజెక్టులో భాగంగా కెరీర్ గైడెన్స్ కంటెంట్ రూపకల్పనపై మొదటి విడత శిక్షణను సోమవారం నుంచి మూడు రోజులపాటు విజయవాడలో నిర్వహించనున్నట్టు సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుత తెలుగు వెర్షన్ శిక్షణ పూర్తయ్యాక, ఇంగ్లిష్ మీడియంలో కూడా అందిస్తామని, దీనిద్వారా ఉపాధ్యాయులు సమర్థంగా విద్యార్థులకు మార్గనిర్దేశం చేసేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. -
సమయం లేదు.. డీఎస్సీ–2024 ఉపాధ్యాయులు ఉరుకులు..పరుగులు (ఫొటోలు)
-
బెడిసికొట్టిన టీచర్ల సర్దుబాటు
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో సర్దుబాటు పేరిట ప్రభుత్వం చేపట్టిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ బెడిసికొట్టింది. పాఠశాలలు తెరిచిన తర్వాత దాదాపు 2 నెలల పాటు కసరత్తు చేసి, ఒక యూనిట్ పరీక్షలు పూర్తయ్యాక ప్రారంభించిన బదిలీలు ఇప్పటికీ కొలిక్కి రాలేదు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన నిబంధనలను మునిసిపల్, ఎయిడెడ్ స్కూళ్లలోనూ అమలు చేయడంతో అక్కడ ఒకటి, రెండు తరగతులకు బోధిస్తున్న జూనియర్ ఉపాధ్యాయులను పదో తరగతి సిలబస్ బోధించేందుకు బదిలీ చేయడం గమనార్హం.సర్దుబాటుకు ముందు ప్రాథమిక పాఠశాలల్లో సీనియర్లు, అర్హత గల ఉపాధ్యాయులను సబ్జెక్టు టీచర్లుగా నియమించడంతో గతేడాది పదో తరగతి ఫలితాల్లో 91 శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, ఈ సర్దుబాటు ప్రక్రియతో ప్రస్తుతం హైస్కూళ్లలో బోధిస్తున్న సీనియర్ ఎస్జీటీలను తిరిగి ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించి, వారి స్థానంలో ఎలిమెంటరీ స్కూళ్లలోని జూనియర్లను హైస్కూళ్లకు పంపించారు. సబ్జెక్టుపై అవగాహన లేనివారిని హైస్కూళ్లకు పంపడంతో పాటు కొన్ని సబ్జెక్టులకు అసలు టీచర్లనే నియమించలేదు. దీంతో ఉత్తమ ఫలితాల సాధన అటుంచి, విద్యార్థులను పాస్ కూడా చేయలేమని మునిసిపల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చేతులెత్తేస్తున్నారు. పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావం ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా సబ్జెక్టు నిపుణుల కొరత ఉన్నప్పుడు గత ప్రభుత్వం అర్హతలున్న దాదాపు 8 వేల మంది ఎస్జీటీలను సీనియారిటీ ఆధారంగా సబ్జెక్టు టీచర్లు (స్కూల్ అసిస్టెంట్)గా పదోన్నతి కలి్పంచింది. విద్యా సంవత్సరం మధ్యలో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్లు రిటైరైతే వారిస్థానంలో అర్హత గల సీనియర్ ఎస్జీటీని డిప్యుటేషన్‌పై నియమించింది. తద్వారా పదో తరగతిలో 91 శాతం ఉత్తీర్ణత సాధ్యమైంది. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్ స్కూళ్లకు ఇదే విధానం అనుసరించింది.మునిసిపల్ హైస్కూళ్లలో 8 ఏళ్లుగా పోస్టులను భర్తీ చేయకపోవడంతో దాదాపు 2,800 సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడింది. మునిసిపల్ ఉపాధ్యాయ సరీ్వస్ రూల్స్‌పై కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో సబ్జెక్టు టీచర్ల కొరతను తొలగించేందుకు ప్రాథమిక పాఠశాలల్లోని సీనియర్లు, సబ్జెక్టు నిపుణులను డిప్యుటేషన్‌పై నియమించి పదో తరగతి సిలబస్ బోధించేవారు. కానీ.. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన “సర్దుబాటు’ ప్రక్రియలో నిబంధనల ప్రకారం విద్యారి్థ, ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా అత్యంత జూనియర్ టీచర్లను మిగులుగా చూపి బదిలీ చేశారు. ఇదే నిబంధనను మునిసిపల్ స్కూళ్లకు వర్తింపజేయడంతో ప్రాథమిక పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల్లో అత్యంత జూనియర్‌ను హైస్కూళ్లలో సర్దుబాటు చేసి, ప్రస్తుతం ఇక్కడ డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న సీనియర్లను ఎలిమెంటరీ స్కూళ్లకు పంపించారు. మరోపక్క హిందీ, ఇంగ్లిష్ ఉపాధ్యాయుల కొరత ఉండటంతో ఈ ప్రభావం ఈ ఏడాది పదో తరగతి ఫలితాలపై తీవ్రంగా చూపనుంది. -
తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ కౌన్సిలింగ్ వాయిదా
-
TG: డీఎస్సీ టీచర్ పోస్టింగ్ కౌన్సెలింగ్ వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు(మంగళవారం) జరగాల్సిన డీఎస్సీ-2024 ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త కౌన్సిలింగ్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని విద్యాశాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా సాంకేతిక కారణాల వల్లే వాయిదా పడినట్లు అధికారులు వెల్లడించారు.డీఎస్సీ-2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన సంగతిత తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే.. డాటా రానందున కౌన్సెలింగ్‌ను వాయిదా వేస్తున్నట్లు విద్యా శాఖ తెలిపింది. రేపు(బుధవారం) కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
కొత్త గురువులకు సరికొత్త పాఠాలు
సాక్షి, హైదరాబాద్: మరికొన్ని నెలల్లో ప్రభుత్వ పాఠశాలల్లోకి కొత్త టీచర్లు రాబోతున్నారు. 11,062 మందిని డీఎస్సీ ద్వారా నియమించబోతున్నారు. వాస్తవానికి వీళ్లంతా ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన వాళ్లే. బోధనకు అవసరమైన బీఈడీ, డీఎడ్ వంటి కోర్సుల్లో ఉత్తీర్ణులైన వాళ్లే. అంతిమంగా డీఎస్సీ పరీక్షలోనూ ర్యాంకు కొట్టినోళ్లే. ఇన్ని ఉండీ వీళ్ళకు మళ్లీ శిక్షణ ఏంటి? అనే అనుమానం రావొచ్చు. కొత్తగా అడుగుపెట్టే టీచర్లకు సామాజిక, నైతిక విలువలపై ప్రత్యేక శిక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ శిక్షణ ముగిసిన తర్వాతే బోధనకు అర్హత ఇవ్వాలని విద్యాశాఖకు చెప్పింది. దీంతో కొత్త టీచర్ల కోసం ప్రత్యేక శిక్షణ సిలబస్‌ను రూపొందిస్తున్నారు. ఈ బాధ్యతను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) తీసుకుంటోంది. అవసరమైన పాఠ్యాంశాలను రూపొందిస్తోంది. టీచర్ల శిక్షణ కోసం ప్రత్యేకంగా రిసోర్స్ పర్సన్స్‌ను కూడా ఎంపిక చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 9న టీచర్లకు నియామక ఉత్తర్వులు ఇవ్వనుండగా, ఆ తర్వాత నెల రోజులపాటు స్వల్పకాలిక శిక్షణ ఇవ్వనున్నారు. విలువలే ముఖ్యం పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి కొన్నేళ్లుగా వక్రమార్గం పడుతోందన్న ఆరోపణలున్నాయి. విలువల్లేని టీచర్లపై విమర్శలొస్తున్నాయి. అనేక చోట్ల ఉపాధ్యాయుడే కీచకుడైన ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లకు వీటిపై పెద్దగా అవగాహన ఉండదని అధికారులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని బాలికల చట్టాలు, మహిళా చట్టాలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇటీవల కాలంలో వచ్చిన కొత్త చట్టాలను ఇందులో చేరుస్తున్నారు. అవసరమైతే మహిళా న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలతో క్లాసులు చెప్పించే యోచనలో ఉన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపునకు కృషి చేసేలా ప్రేరణపరమైన క్లాసులు ఇప్పించనున్నారు. టెక్నాలజీపై పట్టు విద్యా వ్యవస్థలో సాంకేతికత వేగంగా చొచ్చుకుపోతోంది. టీచర్ కన్నా విద్యార్థే ముందుగా గూగుల్ సెర్చ్ ద్వారా సవాలక్ష అంశాలను తెరమీదకు తెస్తున్నాడు. వీటి నివృత్తిలో సాంకేతిక పరిజ్ఞానం కొత్త టీచర్లకు అవసరం. టెక్నాలజీపై పట్టున్న యువత టీచర్లుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యాధునిక ఏఐ టెక్నాలజీ ద్వారా బోధన చేయడం వంటి మెళకువలను అందించేందుకు నిపుణుల చేత శిక్షణ ఇప్పించనున్నారు. బోధనలో త్రీడీ, వర్చువల్ రియాలిటీ, ఆగుమెంటేషన్ వంటి సరికొత్త విధానాలపైనా మెళకువలు నేరి్పంచనున్నారు. మార్పు దిశగా అడుగులు కొత్త టీచర్లలో చాలామంది కొన్నేళ్ల క్రితం బీఈడీ పూర్తి చేశారు. ఆ సమయంలో వారి బీఈడీ సిలబస్‌లో ఉన్న పాఠ్యాంశాలు వేరు. ఇప్పుడు బోధన విధానం, విద్యార్థి మానసిక ధోరణిలో అనేక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కరోనా తర్వాత ఊహించని ధోరణి కన్పిస్తోందనేది జాతీయ విద్యా సర్వే నివేదికల సారాంశం. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థి సైకాలజీ, టీచర్లకు విద్యార్ధికి మధ్య సమన్వయం, సరికొత్త మెళకువలతో బోధన వంటి టెక్నిక్స్‌పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ మంచిదే: పింగిళి శ్రీపాల్ రెడ్డి (పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు) నేటి విద్యావిధానంలో మార్పులను అందిపుచ్చుకునేందుకు కొత్త టీచర్లకు శిక్షణ అవసరం. చట్టాలను వారికి తెలియజెప్పాలి. ఎప్పుడో బీఈడీ చేసిన వారికి ఈ తరహా పునశ్చరణ మేలు చేస్తుంది. అయితే, వేగంగా మారుతున్న సమాజంలో ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు తరచూ చేపట్టాల్సిన అవసరం ఉంది. అంకిత భావం పెరుగుతుంది : సయ్యద్ ఫౌకత్ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) పోటీ పరీక్షల్లో విజయం సాధించి, టీచర్‌గా వచ్చే వ్యక్తికి ఉపాధ్యాయ వృత్తి ప్రాధాన్యత తెలియజేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల అంకిత భావం పెరుగుతుంది. కొత్త తరం ఉపాధ్యాయులకు సరైన మార్గనిర్దేశం ఉంటే అద్భుతాలు సృష్టిస్తారు. బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో మార్పులు తెస్తారు. -
టీచర్లకు జీతాల్లేవు..పెన్షనర్లకు పెన్షన్ లేదు
సాక్షి, అమరావతి: ప్రతీ నెలా ఒకటో∙తేదీనే ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు సర్కారు మాట తప్పింది. సెప్టెంబర్ నెల ఉద్యోగుల వేతనాలను మంగళవారం చెల్లించాల్సి ఉంది. అయితే రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు మినహా మిగతా ఉద్యోగులు, టీచర్లకు మంగళవారం వేతనాలు చెల్లించలేదు.మున్సిపల్ శాఖతోపాటు పలు శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు పెన్షన్ కూడా చెల్లించలేదు. మంగళవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా రూ.3,000 కోట్లు అప్పు చేసింది. ఆ డబ్బులు రాష్ట్ర ఖజానాకు చేరిన తరువాతే వేతనాలు, పెన్షన్ చెల్లింపులు జరుగుతాయని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. బుధవారం గాంధీ జయంతి సెలవు కారణంగా గురువారం రూ.3,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు చేరే అవకాశం ఉంది. దీంతో గురు, శుక్రవారం వరకు వేతనాలు, పెన్షన్‌కు ఎదురు చూడక తప్పదు. -
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల
సాక్షి ,హైదరాబాద్ : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. 11,062 పోస్టుల భర్తీకి జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్స్సీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 2.45లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. 👉తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి డీఎస్సీ ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తక్కువ సమయంలో ఫలితాలు ఇచ్చాం 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుంది దసరాలోపు ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు ఇస్తాం 56 రోజుల్లో డీఎస్సీ విడుదల చేశాం మేం అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం గత సర్కార్ విద్యా వ్యవస్థను నిర్విర్యం చేసింది 10ఏళ్లలో 7వేల టీచర్ పోస్ట్‌లు మాత్రమే భర్తీ చేశారు పోస్టుల వారీగా చూస్తే..పోస్టుల వారీగా చూస్తే.. 2,629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండగా, 727 భాషా పండితులు, 182 పీఈటీలు, 6,508 ఎస్జీటీలు, స్పెషల్ ఎడ్యుకేషన్ 220 స్కూల్ అసిస్టెంట్లు, 796 ఎస్జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. ఇక తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. దాదాపు 34,694 మంది అభ్యర్ధులు పరీక్షలు రాయలేదు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు. -
క్లాస్ రూమ్‌కు సెల్ తీసుకెళ్లొద్దు
సాక్షి, హైదరాబాద్: తరగతి గదిలోసెల్‌ఫోన్ వాడొద్దని ఉపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఫోన్ వాడే టీచర్లను ఓ కంట కనిపెట్టాలని అధికారులకు సూచించింది. క్లాస్ రూ మ్‌లోకి అసలు ఫోన్ లేకుండానే వెళ్ళాలని స్పష్టం చేసింది. అత్యవసరమైతేనే ఫోన్ తీసుకెళ్ళాలని, దానికీ ప్రధానోపాధ్యాయుడి అనుమతి తప్పనిసరి అని పేర్కొంది. వాస్తవానికి ఈ నిబంధన పాతదేనని ఉన్నతాధికారులు అంటుండగా, ఇకపై దీన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు డీఈవోలు చెబుతున్నారు. కొన్ని నెలల పాటు సెల్‌ఫోన్ వినియోగంపై నిఘా పెట్టాలని ఎంఈవోలకు ఆదేశాలిచ్చారు. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా యి. ఇది టీచర్లకు ఇబ్బందికరంగా మారుతుందని, హెచ్ఎంలు వేధించేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు. వాట్సాప్ చూస్తూ..ఫోన్ మాట్లాడుతూ..! ఇటీవల కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. అనేకమంది టీచర్లు సెల్ఫోన్లో వాట్సాప్, ఇతర సోషల్ మీడియా ఫాలో అవుతూ గడుపుతున్నారని గుర్తించారు. కొంతమంది ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్నారనే ఫిర్యాదులొచ్చాయి. దాదాపు 12 జిల్లాల నుంచి ఈ తరహా ఉదంతాలను జిల్లా అధికారులు గుర్తించారు. వీటిని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి పంపారు. సెల్‌ఫోన్‌పై క్లాస్‌రూంలో నిషేధం విధించాలని సూచించారు. పైగా టీచర్లు బోధనకు ముందుగా సన్నద్ధమవ్వడం లేదని, క్లాస్ రూంలో సెల్‌ఫోన్ ద్వారా సెర్చ్ చేసి పాఠాలు చెబుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. విద్యార్థులు క్లిష్టమైన ప్రశ్నలు వేసినప్పుడు సెల్ఫోన్లో సెర్చ్‌చేసి సమాధానమిస్తున్నారని ఉన్నతాధికారుల దృష్టికి వచి్చంది. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని సెల్‌ఫోన్‌పై నిషేధం విధించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఫోన్ లేకుండా స్కూల్ నడుస్తుందా? టీచర్లు వ్యక్తిగత ప్రయోజనాలకు సెల్ వాడుతున్నారని చెప్పడం అర్థం లేని మాట. అసలు సెల్‌ఫోన్ లేకుండా స్కూళ్ళు నడిచే అవకాశం ఉందా? విద్యార్థుల ముఖ హాజరు తీసుకోవాలంటే ఫోన్ కావాలి. ఉన్నతాధికారులకు పంపే అన్ని రిపోర్టులను సెల్ లేదా ట్యాబ్ ద్వారానే పంపాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ వాడమని ప్రభుత్వాలే చెబుతున్నాయి. సెల్‌ఫోన్‌తో పనులు చేయాలని చెప్పే అధికారులు ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) స్వీయ నియంత్రణ మంచిది తరగతి గదిలో సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం కన్నా.. టీచర్లు స్వీయ నియంత్రణ పాటించేలా చర్య లు తీసుకోవాలి. బోధనకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నిషేధాన్ని అడ్డం పెట్టుకుని కొంతమంది హెచ్ఎంలు అనవసరంగా టీచర్లను వేధించకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా స్కూల్లో ఫోన్ వినియోగానికి టీచర్లు దూరంగా ఉండాలి. – సయ్యద్ షౌకత్ అలీ (టీఎస్పీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు) -
ప్రైవేటుపై దృష్టి
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. అందులో పనిచేసే ఉపాధ్యాయుల సమగ్ర సమాచారం సేకరించాలని అధికారులను ఆదేశించింది. ఏయే విద్యార్హతలున్నాయో ఆరా తీయాలంటూ జిల్లా విద్యాశాఖాధికారులకు పాఠశాలవిద్య డైరెక్టరేట్ కార్యాలయం ఇప్పటికే అంతర్గత ఆదేశాలిచ్చినట్టు తెలిసింది. గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలల వివరాలను ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి..అందులో పొందుపర్చాలని అధికారులు భావిస్తున్నారు. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఉన్నత విద్య బోధించే ఉపాధ్యాయుల ధ్రువీకరణ పత్రాలు కూడా పరిశీలించే అవకాశం ఉందని చెప్పారు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుల సదస్సులో ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూళ్లలో అర్హత లేనివారు బోధిస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల నుంచి వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు ప్రజలకు వివరించాలని సీఎం భావించినట్టు అధికారులు చెబుతున్నారు. యూడైస్కూ అందించాలి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల డేటా ఏటా పొందుపర్చాల్సి ఉంటుంది. ఆయా పాఠశాలల్లో తరగతుల వారీగా విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, మౌలిక వసతులు ఏమున్నాయో ఇందులో పేర్కొనాలి. విద్యాశాఖ ఇప్పటివరకూ ప్రభుత్వ స్కూళ్లలోని వివరాలనే యూడైస్‌కు సమగ్రంగా ఇస్తోంది. ప్రైవేటు స్కూళ్ల నుంచి అన్ని వివరాలు అందడం లేదని అధికారులు చెబుతున్నారు. వివరాల కోసం ఎన్ని లేఖలు రాసినా ప్రైవేట్ స్కూళ్లు స్పందించడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని సమగ్ర వివరాలు తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రైవేట్‌లోనే టీచర్లు ఎక్కువ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 వేల స్కూళ్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు 29 వేలు, ప్రైవేట్ 11 వేల వరకూ ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 1.35 లక్షల మంది ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూళ్లలో 2 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. అయితే సర్కారీ స్కూళ్లలో 26 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేట్ స్కూళ్లలో 34 లక్షల మంది చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల ప్రవేశాలు తగ్గడంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కనీసం మౌలిక వసతులు కూడా లేని, ఏ అర్హత లేనివారు బోధిస్తున్నా విద్యార్థులు ఎందుకు ప్రైవేట్ బాట పడుతున్నారో నివేదిక ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పర్యవేక్షణ ఉంటేనే సాధ్యం ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా ఉపాధ్యాయుల అర్హతలను వెల్లడించే అవకాశమే లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. బీఈడీ అర్హతతో సబ్జెక్టుల వారీగా టీచర్లు ఉన్నారా అనేది తెలుసుకోవాలి. దీనికి మండల స్థాయిలోఎంఈఓ, జిల్లా స్థాయిలో డీఈఓలు దృష్టి పెట్టాలి. అయితే డీఈఓ, ఎంఈఓ పోస్టుల్లో మెజారిటీగా ఇన్చార్జ్లనే కొనసాగిస్తున్నారు. దీంతో పర్యవేక్షణ లోపాలు వెంటాడే అవకాశం ఉందని చెబుతున్నారు. -
సీఎం మమతా బెనర్జీ మేనల్లుడికి ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ : ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. టీచర్ రిక్రూట్మెంట్ కేసులో ఈడీ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ అభిషేక్ బెనర్జీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సోమవారం (సెప్టెంబర్9)న సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈడీ తీరును సమర్థించింది. అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిందిఅభిషేక్ బెనర్జీ దంపతులపై ఈడీ కేసు ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన సతీమణి రుజీరా బెనర్జీ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఆరోపిస్తుంది. టీచర్ కుంభణంలో ఎంపీ అభిషేక్ బెనర్జీ దంపతులకు పెద్దమొత్తంలో ముడుపులు అందాయని, కేసు విచారణ చేపట్టేందుకు ఢిల్లీకి రావాలని సమన్లు జారీ చేసింది. ఢిల్లీకి రాలేను.. మీరే కోల్‌కతాకు రండిఇదే అంశంపై ఈడీ జారీ చేసిన సమన్లపై అభిషేక్ బెనర్జీ స్పందించలేదు. కేసు దర్యాప్తు చేసేందుకు ఢిల్లీకి రావాలంటూ సమన్లు ఇవ్వడాన్ని అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణను కోల్‌కతాలోని తన నివాసంలోనే విచారించాలని, ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని..ఈడీని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా, విచారణ చేపట్టిన కోర్టు అభిషేక్ బెనర్జీ పిటిషన్‌ను కొట్టి వేసింది. దీంతో ఆయన ఢిల్లీలోనే ఈడీ విచారణను ఎదుర్కోనున్నారు.నిధులు మళ్లించే.. పశ్చిమ బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో గతేడాది ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో అభిషేక్ బెనర్జీ పేరును ప్రస్తావించింది. ఈడీ సమాచారం మేరకు.. ప్రభుత్వ పాఠశాలలో అక్రమ మార్గంలో ఉద్యోగం పొందేలా పలువురు అప్పటి అధికార టీఎంసీ నేతలకు డబ్బులు చెల్లించారు. ఆ నేతల్లో కుంతల్ ఘోష్ ఒకరు. కుంతల్ ఘోష్ తనకు అందిన ముడుపుల్ని అభిషేక్ బెనర్జీకి ఆర్థిక సంబంధిత వ్యవహారాలను నిర్వహించే సుజయ్ కృష్ణ భద్రకు అందించారు. ఆ డబ్బును ప్రైవేట్ కంపెనీలకు మళ్లించగా.. ఆ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్లలో ఎంపీ అభిషేక్ బెనర్జీ భార్య రుజీరా ఒకరని ఈడీ వెల్లడించింది. -
గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెబరు 5న మన దేశంలో టీచర్స్‌డే జరుపుకోవడం ఆనవాయితీ. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆసాధారణ ప్రజ్ఞాశాలి. రాజ నీతి కోవిదుడు, విద్యావేత్త. భారత తొలి ఉపరాష్ట్రపతిగా, రెండో రాష్ట్రపతిగా విశేషసేవంలందించి, భారత అత్యున్నత పురస్కారం ‘భారతరత్నం’ అందుకున్న గొప్ప వ్యక్తి.ఉధ్యాయ దినోత్సవం అనగానే విద్యార్థులకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.ఒక విధంగా చెప్పాలంటే ఇదొక అరుదైన సందర్భం అని చెప్పవచ్చు. టీచర్లు, విద్యార్థుల కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ గడిపే చక్కటి అవకాశం. తమ అభిమాన టీచర్ల వేషధారణలో సందడి చేస్తారు. వారిని అనుకరిస్తారు. భవిష్యత్తులోతామూ ఇలాగే కావాలని కలలు కంటారు. జీవితాంతా తమ అభిమాన టీచర్లను, వారి జ్ఞాపకాలను తమ గుండెల్లో పదిలంగా దాచుకుంటారు. అలాంటి వారిలో కొంతమంది సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం. ‘‘రాయిని వజ్రంలా మార్చగలిగే శక్తే ఉపాధ్యాయుడు’’గురువు అంటే మనల్ని అజ్ఞానంనుంచి జ్ఞానంవైపు నడిపించే అద్భత శక్తి. విద్యతో పాటు విచక్షణ కూడా నేర్పించేవాడే గురువు. గురువు లేనిదే ఏ మనిషికీ పురోగతి లేదు. గురువు అనేక రూపాలలో ఉంటాడు. గైడ్ అనే ఆంగ్ల పదం సంస్కృత పదం గురు నుండి ఉద్భవించింది. నిస్వార్థంగా తన విజ్ఞానమంతా శిష్యుడికి ధారపోస్తాడు గురువు. ఆ జ్ఞానంతో తన శిష్యుడు లోకానికి మేలు చేయాలని భావిస్తాడు.‘‘విద్యార్థులను తీర్చిదిద్దే క్రమంలో వెలకట్టలేని త్యాగాలు చేసిన ఉపాధ్యాయులందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు.’’అమితాబ్ బచ్చన్: బాలీవుడ్ స్టార్ యాక్టర్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్. గంభీరమైన ఆయన వాయిస్‌కు ఫిదా కాని వారు ఉండరు. ఆయన స్వరమే ఆయనకు కొండంత ఆస్తి. ఆయన స్వరంగా ఇంత గొప్ప ఖ్యాతి గడించినడానికి, పాపులర్ కావడానికి కారణం ఇంగ్లీష్ టీచర్ మార్టిన్. తప డిక్షన్‌ను అభివృద్ధి చేయడంలో మార్టిన్ ఎంతో సాయం చేశారని, తనను ఎంతో ప్రోత్సహించేవారని మార్టిన్ గురించి ఎపుడూ చెబుతూంటారు.ఏ.పీ. జే అబ్దుల్ కలాం: భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం చాలా మందికి స్ఫూర్తి. మరి ఆయనకు ప్రేరణ ఇచ్చిన టీచర్ ఎవరో తెలుసా? కలాం పాఠశాల ఉపాధ్యాయుడు ఇయాదురై సోలమన్. పెద్ద కలలు కనడం, ఆ కలల సాకారం కోసం కష్టపడి పనిచేసే లక్షణాలను ఆయన సోలమన్ నుంచే నేర్చుకున్నారట.ప్రియాంక చోప్రా: గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు ఒక మహిళా ఉపాధ్యాయురాలు ప్రేరణ. తన హైస్కూల్ టీచర్, ఓ'బ్రియన్ గురించి ప్రియాంక తరచూ ప్రస్తావిస్తూ ఉంటుంది. నిర్మాణం విషయంలో తనను ఎంతో ప్రోత్సహించేవారని చెప్పేవారు. వైఎస్ రాజశేఖర రెడ్డి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. వైఎస్ఆర్ గా ప్రసిద్ధి చెందిన వై.ఎస్.రాజశేఖర రెడ్డి కూడా ఉపాధ్యాయులనుచి బాగా ప్రభావితమయ్యారు. తనపై తన టీచర్లు ప్రభావం గణనీయంగా ఉంటుందని స్వయంగా ఆయన చెప్పేవారు. ముఖ్యంగా కేవీ సుబ్బారెడ్డి తన శక్తి సామర్థ్యాలను ఆదిలోనే గుర్తించి, ఉన్నత విద్యను అభ్యసించి, ప్రజా సేవలో కొనసాగాలని సూచించారట. ఆయన మార్గదర్శకత్వం, ప్రోత్సహంతోనే నిబద్ధతతో కూడిన ప్రజాపాలనలో, క్రమశిక్షణతో, ఉన్నతమైన ఆశయాలతో తాను రాణించినట్టు వైఎస్ఆర్ చెప్పేవారు. సచిన్ టెండుల్కర్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ సాధించిన విజయాలను, క్రమశిక్షణ గురించి ప్రత్యేక పరిచయం అవసం లేదు. తన కోచ్ రమకాంత్ అచ్రేకర్ శిక్షణే తనను లెజెండరీ క్రికెటర్, "మాస్టర్ బ్లాస్టర్", "ది గాడ్ ఆఫ్ క్రికెట్" గా క్రికెట్ చరిత్రలో నిలబెట్టింది. అతని క్రికెట్ ప్రయాణంలో కోచ్ రమాకాంత్ అచ్రేకర్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. ముంబైలోని దాదర్‌లోని శివాజీ పార్క్‌లో సచిన్‌కు శిక్షణ ఇచ్చాడు. వినోద్ కాంబ్లీ కూడా ఇతని శిష్యుడే. అచ్రేకర్ చెప్పిన స్ఫూర్తివంతమైన మాటలే తన జీవితాన్ని సమూలంగా మార్చేశాయని సచిన్ గుర్తు చేసుకున్నారు. -
Bangladesh: హిందూ టీచర్ల బలవంతపు రాజీనామాలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి, హిందూ ఉపాధ్యాయులు తమ ప్రభుత్వ ఉద్యోగాలకు రాజీనామా చేయవలసి వస్తోంది. నిరసనకారులు పాఠశాలలు, కళాశాలలకు వచ్చి పలు నినాదాలు చేస్తూ హిందూ ఉపాధ్యాయులు రాజీనామా చేయాలని కోరుతూ వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపధ్యంలో 50 మంది హిందూ ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టారు.బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో తెలిపిన వివరాల ప్రకారం ఆగష్టు 29న కొందరు విద్యార్థులు బరిషల్లోని బకర్గంజ్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ శుక్లా రాణి హల్డర్ కార్యాలయాన్ని ముట్టడించి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె కొద్దిసేపు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె ఖాళీ కాగితంపై నేను రాజీనామా చేస్తున్నాను అని అని రాసి, వారికి ఇచ్చారు.ఆగస్ట్ 18న అజింపూర్ ప్రభుత్వ బాలికల పాఠశాల, కళాశాలకు చెందిన 50 మంది బాలికలు ప్రిన్సిపాల్ గీతాంజలి బారువా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ గౌతమ్ చంద్ర పాల్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ షహనాజా అక్తర్లను రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డైలీ స్టార్ వార్తాపత్రికతో బారువా మాట్లాడుతూ 'ఆగస్టు 18కి ముందు వారు ఎప్పుడూ నా రాజీనామాను అడగలేదు. ఆ రోజు ఉదయం వారు నా కార్యాలయంలోకి చొరబడి నన్ను అవమానించారు’ అని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో ఉపాధ్యాయులను విద్యార్థులు చుట్టుముట్టడం, రాజీనామా లేఖలపై బలవంతంగా సంతకం చేయించడం కనిపిస్తుంది.కబీ నజ్రుల్ యూనివర్శిటీలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్ స్టడీస్ విభాగానికి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ షంజయ్ కుమార్ ముఖర్జీ మీడియాతో మాట్లాడుతూ తాను డిపార్ట్మెంట్ హెడ్ పదవికి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చింది. ఆ సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన రచయిత్రి తస్లీమా నస్రీన్ మైనారిటీ హిందువులకు మద్దతుగా మాట్లాడారు. బంగ్లాదేశ్‌లోని ఉపాధ్యాయులను బలవంతంగా రాజీనామా చేయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తాత్కాలిక అధ్యక్షుడు యూనస్ ఈ అంశంపై స్పందించడం లేదన్నారు. -
డిస్‌లొకేటెడ్ టీచర్లకు వార్నింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలో డిస్లొకేట్ అయిన టీచర్ల వైఖరిపై సొసైటీ యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేసింది. జోనల్ కేటాయింపుల్లో భాగంగా డిస్లొకేట్ చేసిన నేపథ్యంలో ఆయా ఉద్యో గులంతా ఈనెల 21న సొసైటీ కార్యాలయంలో ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. సొసైటీ కార్యాలయ పరిధిలో గుంపుగా అల్లరి చేయడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ధర్నా చేపట్టడం, కార్యా లయంలోకి బలవంతంగా ప్రవేశించడం, దురుసు ప్రవర్తన ఘటనలపై సొసైటీ అధికారులు మండిపడుతున్నారు.సమస్యలుంటే పలు వేదికల వద్ద నిబంధనలకు లోబడి విన్నవించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆందోళనపూరిత వాతావరణం సృష్టించడం నిబంధనలకు విరుద్ధమని టీజీ ఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ కార్యదర్శి అలగు వర్షిణి స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం వారంతా శిక్షార్హులని, అయినప్పటికీ చివరి అవకాశంగా భావిస్తూ వారికి లిఖితపూర్వక హెచ్చరికలు జారీ చేయాలని జోనల్ అధి కారులను ఆమె ఆదేశించారు. ఈమేరకు 142 మంది ఉద్యోగులతో కూడిన జాబితాను సంబంధిత జోనల్ అధికారులకు ఆమె పంపారు.మరో వైపు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి గురు కుల పాఠశాలకు చెందిన టీజీటీ కె.విజయనిర్మలను సొసైటీ కార్యా లయానికి హాజరై వివరణ సమర్పించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆమె శుక్రవారం ఉదయం 11గంటలకు కార్యదర్శి ఎదుట హాజరైనట్లు సమాచారం. మరోవైపు విజయనిర్మలను సస్పెండ్ చేస్తూ సొసైటీ కార్య దర్శి అలగు వర్షిణి 22వ తేదీనే ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ప్రజాభవన్‌లో వినతులు: ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో డిస్లొకేట్ అయిన ఉద్యోగులు పలువురు శుక్రవారం ప్రజాభవన్‌కు చేరుకుని ప్రజావాణిలో ప్రత్యేకాధికారి దివ్యకు వినతులు సమర్పించారు. స్థానికతను పరిగణించకుండా ఉద్యోగ కేటాయింపులు జరపడాన్ని తప్పుబట్టిన ఉద్యోగులు... తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరారు. దీనిపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డి జోక్యం చేసుకుని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. -
టీచర్ల సర్దుబాటు ప్రక్రియలో గందరగోళం
-
తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లోనే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే ఉందన్నారు. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుందని.. ఈ క్షణం తనను అడిగితే.. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానన్నారు.‘‘30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్‌ను మీ చేతుల్లో పెట్టారు. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం.. కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం.. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం.. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘ఈ బడ్జెట్లో విద్యకు 10 శాతం కేటాయించాలని భావించాం. కానీ హామీల అమలు దృష్ట్యా 7.3 శాతం అంటే రూ.21 వేల కోట్లకు పైగా కేటాయించాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30 వేల పాఠశాలల్లో.. 26 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు.. 10వేల ప్రయివేట్ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. ప్రైవేట్ పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా?. మౌళిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు’’ అంటూ రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.‘‘తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది... ఇది కఠోర నిజం. టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా.. అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం. టీచర్లంతా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు విద్యనందించాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.‘‘గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మ గౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘తెలంగాణ బలపడాలంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలి. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం. మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు. -
సీఎం సారూ... ఇక్కడ ఐదు తరగతులకు ఒక్కరే సారు!
బొంరాస్‌పేట: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వికారాబాద్ జిల్లా బొంరాస్‌పేట మండలం రేగడిమైలారం ఉన్నత పాఠశాలను ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. ఆరు నుంచి పదో తరగతి వరకు 146 మంది విద్యార్థులు ఉండగా ఒకే ఉపాధ్యాయుడు బోధన చేస్తున్నారు. అక్కడ పనిచేసేందుకు చాలా మంది స్కూల్ అసిస్టెంట్లు సుముఖంగా ఉన్నప్పటికీ పాఠశాలకు అధికారిక పోస్టులు మంజూరు కాకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. అప్‌గ్రేడ్ చేసి.. వదిలేశారు! రేగడిమైలారం ప్రాథమిక పాఠశాలను 2005–06లో ప్రాథమికోన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేశారు. అప్పట్లో స్కూల్‌కు ఫిజికల్ సైన్స్ టీచర్‌ను మాత్రమే నియమించారు. 2007లో ఎనిమిదో తరగతిని సైతం అందుబాటులోకి తెచి్చనా కొత్త పోస్టులు ఇవ్వలేదు. 2016 వరకు ప్రైమరీ సిబ్బందితోనే 8వ తరగతి వరకూ నెట్టుకొచ్చారు. 2017–18లో పదో తరగతి వరకు అప్‌గ్రేడ్ చేసినా కొత్త పోస్టులు మంజూరు చేయలేదు. దీంతో 2006లో వచి్చన ఒకే ఒక్క ఫిజికల్ సైన్స్ టీచర్‌తోనే 18 ఏళ్లుగా హైస్కూల్‌ను నడిపిస్తున్నారు.గతేడాది ఆరు నుంచి పదో తరగతి వరకు 154 మంది విద్యార్థులు చదివారు. వారిలో 28 మంది టెన్త్ విద్యార్థులు ఉండగా 9 మందే ఉత్తీర్ణులయ్యా రు. ఈసారి పాఠశాలలో మొత్తం 146 మంది ఉండగా వారిలో 19 మంది టెన్త్ చదువుతున్నారు. ఒకే ఆవరణలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు కొనసాగుతుండగా ప్రైమరీ స్కూల్లో ఏడుగురు ఎస్జీటీలు, హైసూ్కల్లో ఒకే ఒక్క స్కూల్ అసిస్టెంట్ విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో హైసూ్కల్ విద్యార్థులకూ ప్రైమరీ టీచర్లే పాఠాలు బోధిస్తున్నారు. సబ్జెక్ట్ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఈ స్కూల్ హైదరాబాద్– బీజాపూర్ హైవేను ఆనుకొని ఉండటంతోపాటు సీఎం సొంత నియోజకవర్గం కావడం గమనార్హం. కలుపు తీసేందుకు వెళ్తున్నా.. బడికి వెళ్లి చదువుకోవాలని ఉన్నా పాఠాలు చెప్పేవారు లేరు. ఎలాగూ క్లాసులు జరగడం లేదు. కనీసం అమ్మానాన్నలకు ఆసరాగా ఉందామని సమయం దొరికినప్పుడల్లా పత్తిలో కలుపు తీసేందుకు వెళ్తున్నా. – భూమిక, ఎనిమిదో తరగతి, రేగడిమైలారంఎవరికీ న్యాయం చేయలేకున్నాం పీఎస్, జెడ్పీహెచ్‌ఎస్‌లు ఒకే ఆవరణలో ఉన్నందునహైసూ్కల్ విద్యార్థులకు డిçప్యుటేషన్‌పై మేమే పాఠాలు చెబుతున్నాం. దీంతో అటు ప్రైమరీ, ఇటు హైసూ్కల్ విద్యార్థులకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికారులు, సీఎం స్పందించి పోస్టులు ఇవ్వాలి. – మల్లేశ్, పీఎస్ హెచ్ఎం, రేగడిమైలారం -
8,600 మంది కొత్త టీచర్లు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థలు కొత్త టీచర్లతో కళకళలాడనున్నాయి. వచ్చేవారంలో ఏకంగా 8,600 మంది విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే వీరంతా నియామక పత్రాలు అందుకుని దాదాపు 4 నెలలు కావొస్తోంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టింగ్ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరిగినా, ప్రస్తుతం ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను అన్ని గురుకుల సొసైటీలు పూర్తి చేశాయి. 2,3రోజుల్లో వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చేలా గురుకుల సొసైటీలు కార్యాచరణ రూపొందించాయి. ప్రస్తుతం ఎస్సీ గురుకుల సొసైటీ మినహా మిగతా సొసైటీల్లో బదిలీల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఈ నెల 20వ తేదీనాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డెడ్‌లైన్ విధించగా, ఆలోపు అన్ని కేటగిరీల్లో బదిలీల పూర్తికి చర్యలు వేగవంతం చేశాయి. బదిలీలు పూర్తి కాగానే... కొత్తగా రాబోయే గురుకుల టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించాలని గురుకుల సొసైటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఈ మేరకు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసి ఖాళీల జాబితాను సిద్ధం చేశాయి. ప్రస్తుతం అన్ని సొసైటీల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఎస్టీ, మైనారిటీ, జనరల్ గురుకుల సొసైటీల్లో రెండ్రోజుల్లో బదిలీలు పూర్తవుతాయి. బీసీ గురుకుల సొసైటీలో శనివారం నాటికి పూర్తయ్యే అవకాశముంది. ఎస్సీ గురుకుల సొసైటీలో పలు కేటగిరీలు పెండింగ్‌లో ఉండడంతో నిర్దేశించిన తేదీల్లోగా పూర్తయ్యే అవకాశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ గురుకుల సొసైటీలోరాత్రింబవళ్లు బదిలీల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇవి పూర్తయిన వెంటనే కొత్త టీచర్లకు వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నాయి. ఇప్పటికే ఆయా అభ్యర్థుల సరి్టఫికెట్ల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. వెబ్‌కౌన్సెలింగ్ ప్రారంభమైన వెంటనే వారికి లాగిన్ ద్వారా ఆప్షన్లు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు. అన్ని కేటగిరీల టీచర్లకు వెబ్‌ఆప్షన్లుకు గరిష్టంగా రెండ్రోజుల సమయం ఇవ్వాలని సొసైటీలు భావిస్తున్నాయి. ఆ తర్వాత ఆప్షన్ల ఫ్రీజింగ్ అనంతరం పోస్టింగ్ ఉత్తర్వులు కూడా ఆన్లైన్ ద్వారానే జారీ చేసేలా సాంకేతికను సిద్ధం చేశారు. పోస్టింగ్ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని, పూర్తిగా మెరిట్ ఆధారంగానే ప్రాధాన్యం ఇవ్వాలని సొసైటీలు నిర్ణయించి వెబ్ కౌన్సెలింగ్ విధానాన్ని ఎంపిక చేసుకున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
టీచర్లు లేక పేద విద్యార్థులకు ఇబ్బంది.. డీఎస్సీకి సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య సరిగా లేక పేద విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని.. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు డీఎస్సీ పరీక్ష రాసేందుకు సిద్ధం కావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రస్తుతం 11 వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నామని.. కొన్ని నెలల్లో మరిన్ని పోస్టులతో కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించారు.ఆదివారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేశ్‌రెడ్డి తదితరులతో కలసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాలను స్థానికులకే ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం గత పదేళ్లలో గ్రూప్స్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగులను గాలికి వదిలేసిందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉందని.. జాబ్ కేలండర్ విడుదల ప్రక్రియను వేగవంతం చేస్తామని చెప్పారు.తాము అధికారంలోకి వచి్చన మూడు నెలల్లోనే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశామన్నారు. గురుకుల పీఈటీలు, అసిస్టెంట్ ఇంజనీర్లు, డివిజనల్ అకౌంట్ ఆఫీసర్లు, లైబ్రేరియన్లు, జూనియర్ లెక్చరర్లు, మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ వంటి మరో 13,321 మంది ఉద్యోగుల నియామక ప్రక్రియ చివరి దశకు చేరుకుందని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం పరీక్షలు భర్తీ సాధ్యం కాదని తెలిసినా గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచి్చందని ఆరోపించారు. తాము వాటికి మరో 6వేల పోస్టులు కలిపి 11వేల టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తే.. 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. జూలై 18 నుంచి ఆగస్టు 5వరకు పరీక్షల షెడ్యూల్ ఉందని.. ఆ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు రాసేందుకు 2.05 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని తెలిపారు.ఈ పరీక్షకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండేలా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామన్నారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఖాళీగా ఉన్న మరో ఐదువేల టీచర్ పోస్టులతోపాటు మరికొన్ని పోస్టులు కలిపి త్వరలోనే మరో నోటిఫికేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులు డీఎస్సీని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గతంలో పరీక్ష పెట్టారు.. లీక్ చేశారు..! గత ప్రభుత్వం గ్రూప్–1 పరీక్షకు నోటిఫికేషన్ ఇచి్చందని.. ఆ పేపర్ లీక్ అయిందని భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నోటిఫికేషన్‌ను రీషెడ్యూల్ చేశామని.. ప్రిలిమ్స్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని, 31,382 మంది మెయిన్స్‌కు కూడా ఎంపికయ్యారని వివరించారు. గత ప్రభుత్వం గ్రూప్–2 పరీక్షలను మూడు సార్లు వాయిదా వేసిందని.. తాము అధికారంలోకి రాగానే ఆగస్టులో పరీక్షలు నిర్వహించేలా తేదీలు ఖరారు చేశామన్నారు.గత సర్కారు గ్రూప్–3 కోసం డిసెంబర్ 30, 2022న నోటిఫికేషన్ ఇచ్చినా పరీక్షలు నిర్వహించలేదని.. తాము నవంబర్‌లో ఆ పరీక్ష తేదీలు ఖరారు చేశామని చెప్పారు. తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు సాధించి జీవితాల్లో స్థిరపడాలన్నదే తమ ప్రభుత్వ ఆశ, ఆలోచన అని.. డీఎస్సీకి సిద్ధమవుతున్న నిరుద్యోగులు పరీక్షలు బాగా రాసి, త్వరగా పాఠశాలల్లో చేరి పేదబిడ్డలకు పాఠాలు చెప్పాలని కోరారు. -
చంద్రబాబు సర్కారుపై.. ఉపాధ్యాయుల ఆగ్రహజ్వాల
సాక్షి నెట్వర్క్: గ్యారంటీడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్)ను రద్దుచేసి ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేరుస్తామని మాటిచ్చి ఇప్పుడు నాలుక మడతేయడంపై ఆయా సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై అగ్గిమీద గుగ్గిలమవుతున్నాయి. ఎన్నికల ముందు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా వ్యవహరిస్తున్న టీడీపీ–జనసేన–బీజేపీ ప్రభుత్వంపై అవి తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దొడ్డిదారిన ఉత్తర్వులు జారీచేయడంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు రేగుతున్నాయి. జీపీఎస్ అమలుపై జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా జిల్లాల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శనివారం పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖ నగరంలోని ఎన్ఏడీ సెంటర్లో గెజిట్ ప్రతులను దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గత ప్రభుత్వాన్ని సీపీఎస్ రద్దుచేయాలని కోరితే జీపీఎస్ అమలుచేస్తామని చెప్పిందని, కానీ.. టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి పార్టీలు మాత్రం రద్దుచేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక జీపీఎస్‌ను అమలుచేస్తూ రాజపత్రాన్ని విడుదల చేయటం.. అది కూడా 2023 అక్టోబరు నుంచి అమలుచేస్తున్నట్లు పేర్కొనడం ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయడమేనని నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ గెజిట్‌ను తక్షణమే రద్దుచేయాలని, పాత పెన్షన్ విధానమే అమలుచేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. అల్లూరి జిల్లా చింతూరు, పాడేరుల్లోనూ ఉపాధ్యాయులు జీఓ కాపీని దగ్ధంచేశారు. » కూటమి ప్రభుత్వం గురువులను మోసం చేసిందని విజయనగరం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయులు ఆరోపించి గెజిట్ కాపీలను దగ్ధంచేశారు. పాత పెన్షన్ విధానాన్ని తమతో సమీక్షించి నిర్ణయం తీసుకుంటారని ఆశించామని.. బాబు ఎప్పటిలాగే మోసం చేశారని మండిపడ్డారు.» శ్రీకాకుళం జిల్లాలోనూ పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. సోంపేటలో గెజిట్ కాపీలు దగ్ధం చేశారు. రాజపత్రాన్ని విడుదల చేయటం దుర్మార్గమని నేతలన్నారు. » ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా కూడా ఆందోళనలు జరిగాయి. అమలాపురం, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జీపీఎస్ గెజిట్ కాపీలను దగ్ధం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే పోరాటం చేయాల్సి వస్తోందన్నారు.» ఏలూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతుంటే పాత తేదీతో జీఓ విడుదల చేయడం దుర్మార్గమన్నారు. » కృష్ణాజిల్లా అవనిగడ్డలోని యూటీఎఫ్ కార్యాలయం ముందు నేతలు గెటిజ్ పత్రాలను దగ్ధం చేశారు. కూటిమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ అమలుచేస్తామని చెప్పారని.. కానీ, ఇప్పుడిలా చేయడం చాలా దుర్మార్గమని నాయకులు ఫైర్ అయి పెద్దఎత్తున నినాదాలు చేశారు. » గుంటూరు యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు జీఓ జీవో ప్రతులను దగ్ధంచేశారు. జీపీఎస్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం. హనుమంతరావు ఇందులో పాల్గొన్నారు.» శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించి గెజిట్ ప్రతులను దగ్ధంచేశారు. కూటమి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని నేతలు డిమాండ్ చేశారు. హామీలు నెరవేర్చలేకుంటే ఇవ్వడం ఎందుకని వారు ప్రశ్నించారు.» కర్నూలు కలెక్టరేట్, మహత్మగాం«ధీ విగ్రహం దగ్గర జీపీఎస్ గెజిట్ పత్రాలను యూటీఎఫ్ నాయకులు దగ్ధంచేశారు. సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఉద్యోగుల కోసం మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటామని చెప్పిన వారు ఇప్పుడు మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. తక్షణమే జీపీఎస్ గెజిట్‌ను వెనక్కి తీసుకోవాలన్నారు. నంద్యాలలోనూ గెజిట్ పత్రాలను కాల్చివేశారు.» వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లోనూ పలుచోట్ల ఆందోళనలు చేశారు. కడపలోని కలెక్టరేట్ ఎదుట యూటీఎఫ్ నాయకులు జీపీఎస్ రాజపత్రాలను దగ్ధం చేశారు. జీపీఎస్ అమలును నిలిపివేయకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, ఇతర నేతలు హెచ్చరించారు.» జీపీఎస్ గెజిట్ విడుదల దుర్మార్గమని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ చిత్తూరులో ఆరోపించారు. ఇచ్చిన హామీలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. -
25 వేల మంది ఎస్జీటీల బదిలీ
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ చేపట్టిన టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. సోమవారం ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 25 వేల మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు (ఎస్జీటీలు) బదిలీ ఉత్తర్వులు అందాయి. వీరితో పాటు స్కూల్ అసిస్టెంట్లు, హెచ్ఎంలు.. అంతా కలిపి ఇప్పటివరకూ 40 వేల మందికి స్థానచలనం కలిగింది. కొత్తగా కేటాయించిన స్థానాల్లో వీలైనంత త్వరగా చేరాలని, విద్యార్థుల బోధనకు ఇబ్బంది లేకుండా చూడాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం టీచర్లకు సూచించింది. కాగా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరించేందుకు అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. వారంలో సమస్యలన్నీ పరిష్కరించాలని నిర్ణయించారు. ఎట్టకేలకు కొలిక్కి.. టీచర్ల బదిలీలు, పదోన్నతుల వ్యవహారం కోర్టు వివాదాలు, ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరాలతో కొన్నేళ్లుగా జటిలంగా మారింది. జిల్లాల పునర్విభజన తర్వాత 317 జీవో అమలు సందర్భంగానూ ఈ వ్యవహారం అనేక సమస్యలకు దారి తీసింది. సీనియారిటీ ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల జూనియర్లు దూర ప్రాంతాలకు వెళ్లారని, భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో పనిచేయాల్సి వస్తోందనే ఆందోళన వ్యక్తమైంది. కాగా ప్రస్తుతం ఇవన్నీ కొలిక్కి వచ్చినట్టేనని అధికారులు చెబుతుండగా, మరోవైపు బదిలీలు, పదోన్నతులపై ఉపాధ్యాయ వర్గాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. సమస్యలేంటి? స్కూల్ అసిస్టెంట్లు వివిధ సబ్జెక్టులకు బోధించే అర్హత ఉండటంతో అన్నింటికీ ఆప్షన్లు ఇచ్చారు. కానీ ఒక్కదాంట్లోనే ప్రమోట్ చేయాలి. ఉదాహర ణకు సైన్స్, మేథ్స్ రెండు ప్రమోషన్లు వచ్చిన వ్యక్తి ఏదో ఒక దాంట్లోనే చేరతారు. దీంతో ఒక పోస్టు ఖాళీ అవుతుంది. 18,942 మందికి ప్రమోషన్లు ఇస్తే ప్రస్తుతం 17 వేల మంది విధుల్లో చేరారు. దీంతో మిగతా దాదాపు 2 వేల మందికి పదోన్నతులు కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియను రెండు రోజుల్లో పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. వివిధ మండలాల్లో ఒకే ఊరు పేరుతో ఉన్న స్కూళ్ళు ఉండటంతో ఆన్లైన్లో సమస్యలు వచ్చాయి. వీటిని సరి చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద వారం రోజుల్లో సమస్యల పరిష్కార ప్రక్రియ పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఖాళీలపై దృష్టి అన్ని స్థాయిల్లోనూ ప్రమోషన్లు, బదిలీలు ముగియడంతో పాఠశాల విద్యాశాఖలో వాస్తవ ఖాళీలపై అధికారులు దృష్టి పెట్టారు. స్కూళ్ళల్లో విద్యార్థుల సంఖ్య, అవసరమైన టీచర్ల లెక్కతో హేతుబధ్దీకరణ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన మేరకు కొన్ని బదిలీలు చేసే ఆలోచనలో ఉంది. విద్యార్థులు లేని స్కూళ్ళల్లో ఎక్కువగా ఉన్న టీచర్లను.. విద్యార్థులు ఎక్కువ ఉన్న స్కూళ్ళకు బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే ఇందుకోసం క్షేత్రస్థాయిలో టీచర్ పోస్టుల ఖాళీలు గుర్తించాల్సి ఉంటుంది. మలీ్టజోన్–1, జోన్–2 పరిధిలో దాదాపు 11 వేల మంది ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చారు. దీంతో ఈ పోస్టులు ఖాళీ అయ్యాయి. అదే విధంగా 2 వేల మంది స్కూల్ అసిస్టెంట్లకు హెచ్ఎంలుగా పదోన్నతి కల్పించారు. హెచ్ఎంల పదోన్నతులతో కూడా కలుపుకుంటే మొత్తం 18,942 మందికి ప్రమోషన్లు దక్కాయి. ఈ ఏడాది చివరి నాటికి రిటైర్ అయ్యే టీచర్లను కలుపుకుంటే దాదాపు 21 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. -
ఔట్ సోర్సింగ్ టీచర్ల ఆందోళన
-
అంగన్వాడీల్లో రిటైర్మెంట్ లొల్లి!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణను రాష్ట్ర ప్రభుత్వం కఠినతరం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు, హెల్పర్లు తప్పకుండా రిటైరవ్వాలని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ సంచాలకులు నిర్మల కాంతి వెస్లీ తరఫున సంయుక్త సంచాలకులు కేఆర్ఎస్ లక్ష్మీదేవి మెమో విడుదల చేశారు. ఈ మెమోను రాష్ట్రవ్యాప్తంగా జిల్లా సంక్షేమాధికారులు, సీడీపీఓలు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఆదివారం పంపించారు. ప్యాకేజీపై పెదవి విరుపు.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రిటైర్మెంట్ ప్యాకేజీపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పెదవి విరుస్తున్నారు. పదవీ విరమణ ప్యాకేజీ కింద అంగన్వాడీ టీచర్లకు రూ. లక్ష, హెల్పర్లకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు గత ప్రభుత్వం జీఓ 10ని జారీ చేసింది. అయితే దీనిపై అప్పట్లో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్యాకేజీపై మార్పులు చేస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిరసన కార్యక్రమాలు సద్దుమనిగాయి. తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్యాకేజీ సవరణల ఊసు లేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పదవీవిరమణ ప్రక్రియ అమల్లోకి వచి్చంది.ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 65 ఏళ్లు నిండిన వారు విధుల నుంచి తప్పుకోవాలని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ సూచించింది. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన అంగన్వాడీ టీచర్, హెల్పర్ సమాచారాన్ని అంగన్వాడీల యాప్ (ఎన్‌హెచ్‌టీఎస్–ఈఎంఎస్) నుంచి కూడా తొలగించాలని ఆదేశించింది. దీనిపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్ ప్యాకేజీని మార్పు చేయాలని కోరుతూ ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు విధుల నుంచి తప్పుకోబోమని చెబుతున్నారు. ఈ అంశంపై త్వరలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు చెబుతున్నారు.టీచర్‌కు రూ.2లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇవ్వాలి అంగన్వాడీ టీచర్, హెల్పర్లు సగటున 30–40 ఏళ్లపాటు సేవలందించి 65 ఏళ్లకు పదవీ విరమణ పొందుతున్నారు. అంతకాలం సేవలందించే వారికి ప్రభుత్వం అత్తెసరు ఆర్థిక సాయం ఇవ్వాలనుకోవడం సరికాదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం ఇవ్వాల్సిన ఆర్థిక సాయంలో మార్పులు చేయాలి. కనీసం అంగన్వాడీ టీచర్‌కు రూ. 2 లక్షలు, హెల్పర్‌కు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాలి. అప్పటివరకు పదవీ విరమణ పొందకుండా విధులు నిర్వహించేందుకు అంగీకరించాలి. దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనకు దిగుతాం. – ఎం.సాయిశ్వరి, రాష్ట్ర అధ్యక్షురాలు, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నాటి హామీలు ఏమయ్యాయి? గౌరవవేతనం పెంపు కోసం గతేడాది మేం సమ్మె చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక గౌరవ వేతనాలు పెంచడంతోపాటు పదవీ విరమణ ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా వేతన పెంపు, రిటైర్మెంట్ ప్యాకేజీ మాటెత్తడం లేదు. – పి.రజిత, అంగన్వాడీ టీచర్, కరీంనగర్ప్రభుత్వం స్పందించకుంటే తదుపరి కార్యాచరణ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు మెరుగైన పదవీవిరమణ ప్యాకేజీ ఇస్తామని, వేతనాలు కూడా పెంచుతామని అప్పట్లో సమ్మె చేసిన చోటుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు పట్టించుకోవడం లేదు. టీచర్లకు రూ. 18 వేలు జీతం ఇస్తామని, రిటైర్మెంట్ ప్యాకేజీ రెట్టింపు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినప్పటికీ అమల్లోకి రాలేదు. – టేకుమల్ల సమ్మయ్య, రాష్ట్ర అధ్యక్షుడు, ఏఐటీయూసీ -
గిరిజన గురుకుల ఉపాధ్యాయుల పెన్‌డౌన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గిరిజన గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు పెన్‌డౌన్ చేపట్టి నిరసనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ కారణంగా తమ ఉద్యోగాలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే విషయమై శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసి విన్నవించిన గురుకుల ఉపాధ్యాయులు శనివారం మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసి తమ ఆవేదనను చెప్పుకున్నారు.గిరిజన ప్రాంతాలకు చెందిన సుమారు 300 మంది విధులను బహిష్కరించి విజయవాడకు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. గిరిజన గురుకులాల్లో సుమారు 1,650 మంది దాదాపు 10 నుంచి 15 ఏళ్లుగా కాంట్రాక్టు, ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించడంతో తమ ఉద్యోగాలు పోతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెగా డీఎస్సీలో గిరిజన ప్రాంతాల్లోని గురుకుల విద్యాలయాలకు సంబంధించిన 1,143 పోస్టులు ప్రతిపాదించారు.దీంతో ఏళ్ల తరబడి కాంట్రాక్టు, ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో సేవలందిస్తున్న తమకు అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని గిరిజన సంక్షేమ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పష్టమైన హామీ రాలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది గురుకుల ఉపాధ్యాయులు, అధ్యాపకులు విధులను బహిష్కరించి విజయవాడ చేరుకున్నారు. ఉద్యోగ భద్రత కల్పించి, సమాన పనికి సమాన వేతనం ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబును కోరినట్టు గురుకుల ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి లక్ష్మీనాయక్ తెలిపారు. -
తండ్రి లాంటి గురువు కోసం తల్లడిల్లిన పిల్లలు
-
టీచర్ పోస్టుల భర్తీపై మంత్రి గారి అబద్దాలు
-
నారాయణ... నారాయణ!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఆయనో మండల విద్యాధికారి. కీలకమైన కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నారు. పదవీ విరమణ సమయం ఆసన్నమైంది. అదే సాకు చూపెట్టి భారీ వసూళ్లకు తెరలేపారు. అందుకు ఉపాధ్యాయ యూనియన్ నేతలు నడుంబిగించారు. రిటైర్మెంట్ ఫంక్షన్ భారీగా నిర్వహించాలంటూ తెరపైకి వచ్చారు. టీచర్లను వ్యక్తిగతంగా కలుస్తూ రూ.2 వేలు తక్కువ లేకుండా ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. చందా పుస్తకాలు చేతబట్టుకొని మరీ అయ్యవార్ల వద్దకు వెళ్తున్నారు. ఇదేంటీ ఎంత ఇవ్వాలో కూడా మీరే నిర్ణయిస్తారా? అని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దూషణలకు దిగుతున్నారు. సుధీర్ఘకాలం పనిచేసి రిటైర్డ్ అవుతున్న అధికారిని సన్మానించుకోవడం సముచితమే. పదవీ విరమణ సందర్భంలో అప్పటివరకు అందించిన సేవలకు గుర్తుగా ఆ ఉద్యోగులు వ్యక్తిగతంగా గౌరవించుకోవడం అనవాయితీ. కాగా తద్భిన్నమైన పరిస్థితులను ఉపాధ్యాయ సంఘాల నేతలు తెరపైకి తెచ్చారు. ఎంఈఓగా రిటైర్డ్ అవుతున్న ఓ అధికారికి సన్మానం పేరిట వసూళ్లకు తెరలేపారు. దాదాపు 440 మంది ఉపాధ్యాయులుడగా అందరీతో చందా రాబట్టాలనే దిశగా గుంపుగా వెళ్తూ విడివిడిగా అయ్యవార్లను కలుస్తున్నారు. యూనియన్ నేతల్ని చూసి తలాడించేవారు కొందరైతే, అంతే ఇవ్వాలని డిమాండ్ చేయడం ఏమిటనీ మరి కొందరు నిలదీస్తున్నారు. అలాంటి వారితో గొడవలకు దిగడం యూనియన్ నేతల వంతైంది. మరోవైపు ప్రవేటు పాఠశాల యాజమాన్యాలను సైతం వదిలిపెట్టడం లేదు. జిల్లా విద్యాధికారి, పాఠశాల విద్యా రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఈవ్యవహారంపై దృష్టి సారించి చందాలు పేరిట టీచర్లను బెదిరిస్తున్న యూనియన్ నేతల్ని కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
అంగన్వాడీల్లో వేతన యాతన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు వేతన కష్టాలు తీరడం లేదు. ప్రస్తుతం రెండు నెలల నుంచి వారికి వేతనాల్లేవు. మరోవైపు సమ్మె కాలానికి సంబంధించిన బకాయిలు సైతం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయలేదు. దీంతో అంగన్వాడీ టీచ ర్లు, హెల్పర్లు క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా పదో తేదీలోపు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందేవి. కానీ ఏడాది కాలంగా ఈ చెల్లింపుల ప్రక్రియ గాడితప్పింది. రెండు, మూడు నెలలకోసారి వేతనాలు విడుదల కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 59వేల మంది అంగన్వాడీ సిబ్బంది రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక టీచర్, ఒక హెల్పర్ చొప్పున పోస్టులు మంజూరైనప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా 59వేల మంది టీచర్లు, హెల్పర్లు ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్నారు. అంగన్వాడీ టీచర్‌కు నెలకు రూ.13650 చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా... హెల్పర్‌కు రూ.7800 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం గౌరవవేతనం మంజూరు చేస్తోంది. ప్రతి నెలా జాప్యమే.. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతన చెల్లింపుల్లో ప్రతి నెలా జాప్యం జరుగుతోందని చెబుతున్నారు. సాంకేతిక సమస్యలో లేక ఇతరత్రా కారణాలతో వేతన చెల్లింపుల్లో కాస్త ఆలస్యం కావడం సహజమే అయినప్పటికీ.. ప్రతి నెలా ఇదే పరిస్థితి తలెత్తుతుండడం పట్ల వారు తీవ్ర ఆసహనం వ్యక్తం చేస్తున్నారు. గౌరవ వేతనంపైనే ఆధారపడి కుటుంబాన్ని పోషించే పరిస్థితుల్లో వేతన చెల్లింపుల జాప్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలకు ప్రతి నెలా రూ.70 కోట్లు అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల గౌరవవేతనానికి సంబంధించి ప్రతి నెలా సగటున రూ.70కోట్ల బడ్జెట్ అవసరం. ఈ లెక్కన ఏటా రూ.840 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. గత కొంత కాలంగా కేంద్రం నుంచి వచ్చే నిధుల రాక ఆలస్యం కావడంతో ఈ జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ సమస్యతో వేతన చెల్లింపులు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. కమిషనరేట్‌కు ఫిర్యాదులు వేతన చెల్లింపుల్లో జాప్యంపై అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నుంచి రాష్ట్రస్థాయి ఉ న్నతాధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ అంగన్వాడీ టీచర్లు, హె ల్పర్ల సంఘం ఇటీవల రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌కు వే ర్వేరుగా వినతి పత్రాలు సమరి్పంచింది. వేత న చెల్లింపుల్లో జాప్యాన్ని నివారించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరి ప్రతి నెలా క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరింది. -
తొలుత ఫెయిల్.. రీవాల్యుయేషన్లో 90% మార్కులు
దుండిగల్: పదవ తరగతి జవాబు పత్రాలను దిద్దడంలో టీచర్ల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మానసిక క్షోభకు గురతున్నారు. వా ల్యుయేషన్లో నిర్లక్ష్యం కారణంగా ఓ పదోతరగతి విద్యార్థిని తొలుత ఫెయిల్ అయినట్లు చూపించారు. రీవాల్యుయేషన్లో అదే విద్యార్థిని 90% మార్కులు సాధించడం విశేషం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం శివాలయనగర్‌కు చెందిన చెజెర్ల శ్రీనివాస్, శ్రీదేవిలు దంపతుల కుమార్తె లతశ్రీ రాజీవ్‌గాం«దీనగర్‌లోని గీతాంజలి స్కూల్లో 10వ తరగతి చదువుతోంది.ఇటీవల పరీక్షలను రాసింది. అయితే ఫలితాల్లో లతశ్రీ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్లుగా వచ్చింది. ఎంతో కష్డపడ్డానని, 9.5 గ్రేడ్ సా«ధిస్తానని నమ్మకముందని చెప్పిన విద్యార్థిని ఫలితం చూసుకుని తీవ్ర మానసిక క్షోభకు గురైంది. బాలిక పరిస్థితిని చూసి ఆవేదన చెందిన తల్లిదండ్రులు విషయాన్ని స్కూల్ ప్రిన్సిపాల్ మహిపాల్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన లతశ్రీకి కౌన్సిలింగ్ నిర్వహించి.. ధైర్యా న్ని నింపారు.తల్లిదండ్రులతో కలిసి ఆయన ఆంగ్లం సబ్జెక్ట్‌కు రీవ్యాలుయేషన్ పెట్టించారు. మొదట రాసిన పరీక్షల్లో అన్ని సబ్టెక్టుల్లో 9, 10 గ్రేడ్ పాయింట్లు రాగా ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో 80 మార్కులకు 26 మార్కులే వచ్చాయి, తిరిగి రీవాల్యుయేషన్ చేయించగా 80కి 74 మార్కు లు వచ్చాయి.9.3 గ్రేడ్‌తో ఉత్తీర్ణత సాధించింది. ఎగ్జామినర్లదే తప్పు..పదవ తరగతి జవాబు పత్రాలను ముగ్గురు అధికారులు దిద్దుతారు. ముందుగా విద్యార్థి జవాబు పత్రాన్ని అస్టిసెంట్ ఎగ్జామినర్ తప్పు ఒప్పులను పరిశీలించి సరైన సమాధానాలకు మార్కులు వేస్తారు. ఆ పత్రాలను చీఫ్ ఎగ్జామినర్ పరిశీలించిన అనంతరం స్పెషల్ అసిస్టెంట్ అధికారి మరోసారి విద్యార్థికి వచి్చన మార్కులను కూడి పునఃపరిశీలిస్తారు. కానీ ఇక్కడ లతశ్రీ పేపరును దిద్దిన ముగ్గురు అధికారులూ అజాగ్రత్తగా వ్యవహరించారు.రీ వ్యాలుయేషన్ చేసిన అనంతరం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి బోర్డు కార్యాలయానికి పిలిచారు. రీ కరెక్షన్లో మీ అమ్మాయి పాసైందని, ఎస్ఎస్íసీ సరి్టఫికెట్ తీసుకెళ్లండని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు, గీతాంజలి పాఠశాల ఉపాధ్యాయులు అధికారులను నిలదీశారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానీ బోర్డు అధికారులు సమాధానం చెప్పకుండా నీళ్లు నమిలారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎగ్జామినర్లపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఏపీలో టీచర్ల బదిలీలకు బ్రేక్
-
మన బడుల్లో చేరండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక క్రమంగా తగ్గుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చేరికలు కొంత ఆశాజనకంగానే ఉన్నా ఆ తర్వాత క్లాసుల్లో ఎన్రోల్మెంట్ పడిపోతోంది. ఆరో తరగతి నుంచి విద్యార్థులు ప్రైవేటు బాటపడుతున్నారు. దీన్ని సరిదిద్దేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.రాష్ట్రంలో ఎన్రోల్మెంట్ పెంచాల్సిన అవసరం ఉందని సూచించింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమాన్ని అధికారులు చేపట్టనున్నారు. ఏటా పాఠశాలలు తెరిచే ముందు ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టడం సాధరణమే అయినప్పటికీ ఈసారి విద్యార్థుల శాతాన్ని ఎక్కువగా పెంచాలని విద్యాశాఖకు స్పష్టమైన ఆదేశాలు అందాయి.సమస్యలు పరిష్కరిస్తేనే.. ఈ ఏడాది రూ. 1,907 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. ఈ నిధులతో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలతోపాటు భవనాల మరమ్మతులు, స్మార్ట్ క్లాస్రూంలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిబ్బంది జీతాలకు ఖర్చు చేయనుంది. గతంలో మన ఊరు–మన బడి కార్యక్రమం కింద స్కూళ్లలో మౌలికవసతులు కల్పించాలని నిర్ణయించగా ప్రభుత్వం మారడంతో ఈ కార్యక్రమం నత్తనడకన నడుస్తోంది. దీంతోపాటు టీచర్ల కొరత ప్రభుత్వ పాఠశాలలను వేధిస్తోంది. ప్రధానంగా ఈ రెండు సమస్యలను పరిష్కరిస్తే తప్ప ప్రభుత్వ బడుల్లో ఎన్రోల్మెంట్ పెరిగే అవకాశం లేదని అధ్యాపక వర్గాలు అంటున్నాయి.ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి ఇది..⇒ రాష్ట్రంలో 30,023 ప్రభుత్వ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,213 స్కూళ్లలో గతేడాది జీరో ఎన్రోల్మెంట్ నమోదైంది. 13,364 పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ సంఖ్య 50లోపే ఉంది. ⇒ రాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టుల ఖాళీలున్నాయి. 5,821 స్కూళ్లు ఒకే టీచర్‌తో నడుస్తున్నాయి. 80 శాతం స్కూళ్లలో సబ్జెక్టు లేదా భాషా పండితుల కొరత ఉంది. ⇒దివ్యాంగులకు టాయ్‌లెట్స్ లేని స్కూళ్లు 15.45 శాతం ఉన్నాయి. బాలికలకు టాయ్‌లెట్స్ లేని బడులు 9.44 శాతం ఉన్నాయి. ⇒ 18, 19 పాఠశాలల్లో సమీకృత సైన్స్ లే»ొరేటరీలు లేవు. ఐసీటీ ల్యాబ్‌లు లేని స్కూళ్లు 11.7 శాతం. స్కిల్ ఎడ్యుకేషన్ ల్యాబ్‌లు లేని బడులు 71 శాతం ఉన్నాయి. ⇒ ఎస్సీఈఆర్టీలో మంజూరైన పోస్టుల్లో 46.15 శాతం పోస్టులు, డైట్ కాలేజీల్లో 67.83 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కోవిడ్ కాలంలో పెరిగి.. మళ్లీ తగ్గి.. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు 60 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. వారిలో 28 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతుంటే మిగతా విద్యార్థులు ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెరిగింది. 2020 నుంచి 2022 వరకూ ఏటా 2.5 లక్షల మంది కొత్తగా ప్రభుత్వ బడుల్లో చేరారు. కానీ 2023 నుంచి మళ్లీ క్రమంగా ఏటా లక్ష మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి నిష్క్రమిస్తున్నారు. మెరుగైన విద్య లేనందుకేనా? రాష్ట్రంలోని స్కూళ్లలో విద్యార్థుల హాజరుపై సమగ్ర శిక్ష ప్రాజెక్టు ఇటీవల ఓ నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 44 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం 50 మంది విద్యార్థులు కూడా ఉండటం లేదు. ఐదో తరగతి వరకు ఒక్కో క్లాసులో 40 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ తర్వాత నుంచి విద్యార్థుల చేరికలు క్లాసుకు 46 నుంచి 35కు పడిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు సక్రమంగా నడవకపోవడం, ఉపాధ్యాయుల కొరత, సకాలంలో పుస్తకాలు అందకపోవడం వల్ల బోధన కుంటుపడుతోంది. దీంతో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు పట్టణాలకు తరలుతున్నాయని నివేదిక పేర్కొంది. విస్తృత ప్రచారం కల్పించేలా.. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, నాణ్యతా ప్రమాణాలు పెంచుతున్న తీరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని విద్యాశాఖ క్షేత్రస్థాయి టీచర్లకు సూచించింది. జూన్ ఒకటి నుంచి 11వ మధ్య చేపట్టే బడిబాట కార్యక్రమంలో స్కూళ్లను ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా తీర్చిదిద్దుతున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాలని, ఉపాధ్యాయ నియామకాలు చేపడుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొంది. -
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
అనంతపురం ఎడ్యుకేషన్: ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘింస్తూ ఓ రాజకీయ పార్టీకి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న టీచర్లకు చార్జ్ మెమోలు జారీ చేసి వారిచ్చే వివరణ బట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయంగా విద్యాశాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం కుర్లగుండ ప్రాథమిక పాఠశాల టీచరు రాఘవేంద్రగుప్తా, నాగిరెడ్డిపల్లి ప్రాథమికోన్నత పాఠశాల టీచరు వై.మంజునాథ్ ఇద్దరూ కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబుతో కలసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సమయంలో వీరికి బ్రహ్మసముద్రం మండల విద్యాశాఖ అధికారి హెచ్.ఓబుళపతి మండలంలోని ఇతర టీచర్ల పోస్టల్ బ్యాలెట్ ఆర్డర్లను అందజేశారు. ఈ ఆర్డర్ కాపీలు తమవద్ద అందుబాటులో ఉన్నట్లు సదరు టీచర్లు వాట్సాప్ గ్రూపుల్లోనూ మెసేజ్‌లు పెట్టారు. వీరి వ్యవహారంపై ‘సి’ విజిల్ యాప్ ద్వారా ఆధారాలతో సహ ఎన్నికల కమిషన్‌కు, రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై పత్రికల్లోనూ కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటి వరకూ వీరిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం చార్జ్‌మెమోలు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. అలాగే బ్రహ్మసముద్రం ఎంఈఓపై చర్యలకు ఆర్జేడీకి సిఫార్సు చేశామని చెబుతున్నా... ఆర్జేడీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులు జారీ కాకపోవడం గమనార్హం. ఈ ఇద్దరికంటే ఆ టీచరు పెద్ద తప్పు చేశాడా? వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌కుమార్‌రెడ్డి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడంటూ ఎలాంటి విచారణ లేకుండానే సస్పెండ్ చేశారు. ఆయన చేసిన నేరం ఏంటంటే...‘పదో తరగతి పరీక్షల నిర్వహణ, కోడింగ్ పనులు, స్పాట్ వాల్యూయేషన్ సిబ్బంది రెమ్యూనరేషన్‌ను ప్రభుత్వం గతేడాది పెంచిందని ఈ ఏడాది నుంచి అమలులోకి వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నిర్ణయానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ అంశంపై మార్చి 23న ‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై ఆయనకు ఎలాంటి నోటీసులు, చార్జ్ మెమోలు ఇవ్వకుండా ఏకంగా సస్పెండ్ చేశారు. అయితే టీడీపీకి కార్యకర్తల్లా పనిచేసిన ఇద్దరు టీచర్లపై చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. విద్యాశాఖ అధికారుల ‘పచ్చ’పాత ధోరణిపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా అశోక్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన పేపర్ ప్రకటనలో డీఈఓ, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. వారిని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం గమనార్హం. -
Fact check: చదువులపై విషం కక్కిన నారా వారి కూలీ..
సాక్షి, అమరావతి: తల్లిదండ్రుల తరువాత గురువుకు ప్రత్యేక స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆ సంస్కృతిని కొనసాగిస్తూ వారికి అత్యున్నత గౌరవం ఇస్తోంది. ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకున్న గురివింద రామోజీకి ఇది మింగుడు పడలేదు. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను కాపలా పెట్టింది.. వారిచేత మరుగుదొడ్లు ఊడ్పించిందని టీచర్లను అవమానించేలా కట్టుకథ అల్లేసింది. ఈ పనులు ఎక్కడ చేయించిందో మాత్రం ఆ పత్రిక రాయదు. గత ప్రభుత్వంలో పిల్లలకే కాదు.. టీచర్లకూ మరుగుదొడ్లు లేవన్న సత్యాన్ని మరుగున పరిచింది. ఈ ప్రభుత్వ హయాంలో ప్రతి స్కూల్లో స్టాఫ్‌కు ప్రత్యేక, ఆధునిక సదుపాయాల కల్పన ఆ పత్రికకు కనబడవు. ఒకేసారి 25 వేల మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించింది ఈ ప్రభుత్వమే. నాడు–నేడుతో 45 వేల ప్రభుత్వ బడులు అద్భుతంగా రూపురేఖలు మార్చుకున్నాయి. ఉపాధ్యాయులకు ట్యాబ్‌లు, బోధనకు ఐఎఫ్‌పీ స్క్రీన్ల ఏర్పాటు జరిగాయి. వీటిని కావాలనే విస్మరించి ఆధారాలు లేని రాతలతో ఎల్లో మీడియా రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. పాఠశాల అభివృద్ధిలో టీచర్లను భాగస్వామ్యం చేయడం తప్పేనా? ఒకప్పటి బ్లాక్ బోర్డుల స్థానంలో ఇప్పుడు డిజిటల్ బోధన సాగుతోంది. విద్యార్థులు నేర్చుకునేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు 2019–20 విద్యా సంవత్సరంలో ‘మనబడి నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. పాఠశాల విద్య, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక, బీసీ, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్, రెసిడెన్షియల్ పాఠశాలల ఆధ్వర్యంలో ఉన్న మొత్తం 44,512 స్కూళ్లను ఈ పథకం కిందకు తీసుకొచ్చింది. నిరంతర నీటి సరఫరాతో టాయిలెట్లు, శుద్ధి చేసిన తాగునీరు, ఫ్యాన్లు, లైట్లు, విద్యుదీకరణ, విద్యార్థులు, సిబ్బందికి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డులు, భవనాలకు పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, అదనపు తరగతి గదుల నిర్మాణం జరిగాయి. నాడు–నేడు మొదటి విడతలో రూ.3,669 కోట్లతో 15,715 పాఠశాలలు, రెండో దశలో రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలు బాగుపడ్డాయి. నాడు–నేడు పనులు చేపట్టిన అన్ని ఉన్నత పాఠశాలల్లోను ఇంటర్నెట్తో పాటు 62 వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లతో 3డీ డిజిటల్ పాఠాలు బోధిస్తున్నారు. ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో పాఠాలతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. నాలుగో తరగతి నుంచి ఇంటర్ వరకు బైజూస్ పాఠాలను ఉచితంగా అందిస్తున్నారు. 62 వేల డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం దేశ చరిత్రలో ఓ రికార్డు. ఇవన్నీ పూర్తి పారదర్శకత కొనసాగేందుకు తల్లిదండ్రులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ పాఠశాలకు ఏం అవసరమో వారే నిర్ణయించుకునే స్వేచ్ఛను ప్రభుత్వం ఉపాధ్యాయులకు అప్పగించింది. వీటిని తప్పంటోంది ఈనాడు పత్రిక. మీ రమాదేవి స్కూల్లో.. మీ నారాయణ స్కూళ్లల్లో ఇలాగే చేయిస్తున్నారా రామోజీ. జగన్ పాలనలో ► విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొత్త భవనాల నుంచి మరుగుదొడ్ల వరకు సమకూరాయి. ►గత నాలుగేళ్లలో అర్హత కలిగిన 25 వేల మంది టీచర్లు ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. ఇందులో నాలుగేళ్ల సర్వీసు ఉన్నవారికీ అవకాశం లభించింది. ►నాడు–నేడుతో ప్రతి బడిలోనూ 12 రకాల సదుపాయాలు. ►బోధనకు డిజిటల్ స్క్రీన్లు, స్మార్ట్ టీవీలు. ►బడుల్లోకి కొత్త ఫర్నిచర్. ►మన బడికి అంతర్జాతీయ కీర్తి. ►కోవిడ్ కష్ట కాలంలో నెలల తరబడి పాఠశాలలు మూతబడినా ప్రతి టీచర్‌కు ఠంచన్‌గా వేతనాలు. ►బడిలో పాఠాలు చెప్పడం, అభివృద్ధి పనులు పర్యవేక్షించడం తప్ప ఏ ఉపాధ్యాయుడికీ అదనపు పనులు అప్పగించలేదు. ►మరుగుదొడ్లను ప్రతిరోజు శుభ్రంగా ఉంచేందుకు సిబ్బంది ఉన్నారు. వారికి ప్రతినెలా వేతనాలు చెల్లించేందుకు ‘టాయిలెట్ మెయింటనెన్స్ ఫండ్’ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించే బాధ్యత స్థానిక ఉపాధ్యాయులు తీసుకున్నారు. చంద్రబాబు పాలనలో ► 2000 సంవత్సరంలో అనంతపురం జిల్లా నార్పల మండలం గూగూడులో చంద్రబాబు జన్మభూమి సమావేశం ఏర్పాటు చేసి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని స్టేజీ మీదకు పిలిచారు. నూరు శాతం ఫలితాలు తేవాలని ఆదేశించారు. సబ్జెక్టు టీచర్లు లేకపోవడంతో సాధ్యం కాదని ఆ ప్రధానోపాధ్యుడు ఉన్నది ఉన్నట్టు చెప్పారు. అంతే అదే వేదికపై ఆ హెచ్ఎంను సస్పెండ్ చేశారు. ► 2003లో మంత్రిగా చేసిన నిమ్మల కిష్టప్ప గోరంట్లలో నిర్వహించిన జన్మభూమి కమిటీ సమావేశంలో టీచర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టమని అనుచరులను రెచ్చగొట్టారు. ►మరుగుదొడ్లు లేక మహిళా టీచర్ల ఇబ్బందులు వర్ణనాతీతం. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఆ అవసరం తీర్చుకునేవారు. ►జన్మభూమి సభ్యులే పేరెంట్స్ కమిటీల్లో చేరిపోయి పప్పు, బియ్యం ఎత్తుకెళితే అడిగినందుకు ఉపాధ్యాయులపై దౌర్జన్యాలు చేశారు. ►ఉపాధ్యాయులను నియమించకుండా నూరు శాతం ఫలితాలు తేవాలని ఒత్తిడి చేశారు. సాధ్యం కాదని చెబితే వెంటనే సస్పెండ్ చేసేవారు. ఈ రాతలు టీచర్లను అవమానించడమే గతంలో పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక ఉపాధ్యాయినులు పట్టణాలకే గాని మండల స్థాయి పాఠశాలలకు వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. బ్లాక్ బోర్డులౖపె రాసేందుకు సుద్దముక్క కూడా ఉండేది కాదు. ఈ ప్రభుత్వంలో పిల్లలకు, స్టాఫ్‌కు అన్ని సదుపాయాలు కల్పించింది కళ్లకు కనిపిస్తున్నాయి. తప్పుడు రాతలు రాసి టీచర్ల మనోభావాలను కించపరచడం దుర్మార్గం. ఉపాధ్యాయుల విధులు, సిబ్బంది విధులు ప్రత్యేకంగా ఉంటాయి. రాష్ట్రంలో ఎక్కడా ఏ టీచర్ కూడా మరుగుదొడ్లు కడిగింది లేదు. గతంలో ఎన్నికల విధులకు వెళ్లే ఉపాధ్యాయులు స్థానిక బడుల్లో ఉండలేక కష్టాలు పడేవారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ పాఠశాలకైనా నిర్భయంగా వెళ్లే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించింది. – గోపీకృష్ణ, ఉపాధ్యాయుడు (వైఎస్సార్‌టీఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) -
బదిలీ అధికారం యజమానికి ఉంది
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీ విషయంలో రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వారిని బదిలీచేసే అధికారం సదరు యజమాని (ప్రభుత్వం)కి ఉందని స్పష్టంచేసింది. ఒప్పందంలో బదిలీ ప్రస్తావన ఉన్నప్పుడు ప్రభుత్వం వారిని బదిలీ చేయడం తప్పుకాదని తేల్చిచెప్పింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) పనిచేస్తున్న కాంట్రాక్టు టీచర్లను బదిలీచేస్తూ 2022లో ప్రభుత్వం జారీచేసిన జీఓ–103ను హైకోర్టు సమర్ధించింది. అలాగే, కాంట్రాక్టు ఉద్యోగులు కనీస వేతన స్కేల్‌కు అర్హులని స్పష్టంచేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకుని వారందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ సమగ్ర ఉత్తర్వులు జారీచేసిందని.. అందులో కేజీబీవీల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులు కూడా ఉన్నారని పేర్కొంది. సవరించిన కనీస వేతన స్కేల్‌ను కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 1–1–2022 నుంచి అమలుచేయాలని.. వారికి చెల్లించాల్సిన బకాయిలను 12 వారాల్లో చెల్లించాలని అధికారులకు తేలి్చచెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, డాక్టర్ జస్టిస్ వక్కలగడ్డ కృపాసాగర్లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీళ్లు.. రాష్ట్ర ప్రభుత్వం తమకు కనీస వేతన స్కేల్‌ను ఖరారుచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను అమలుచేసేలా అధికారులను ఆదేశించడంతో పాటు, తమను వివిధ ప్రాంతాలకు బదిలీచేస్తూ జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్దంగా ప్రకటించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీల్లోని కాంట్రాక్టు టీచర్లు 2022లో హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి డాక్టర్ జస్టిస్ కుంభజడల మన్మథరావు కాంట్రాక్టు టీచర్ల బదిలీల ఉత్తర్వుల విషయంలో జోక్యానికి నిరాకరించారు. ఇదే సమయంలో కోర్టుకొచ్చిన టీచర్లు ఎక్కడ పనిచేస్తున్నారో వారిని అక్కడే కొనసాగించాలని.. అంతేకాక.. వారికి కనీస వేతనాలు, తదనుగుణ బకాయిలు కూడా చెల్లించాలని చెప్పారు. బదిలీల విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ కాంట్రాక్టు టీచర్లు.. కనీస వేతనాలపై ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. బదిలీ అధికారం యజమానికి ఉంది ‘ఇక కాంట్రాక్టు టీచర్ల బదిలీ విషయానికొస్తే, వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేయడం సబబే. నిజానికి.. 2013 నాటి కాంట్రాక్టు ఒప్పందంలో బదిలీల విషయంలో ఎలాంటి నిబంధన లేదు. దీని ఆధారంగా కాంట్రాక్టు టీచర్లు తమను బదిలీ చేయడానికి వీల్లేదంటున్నారు. అయితే, 2022లో తీసుకొచ్చిన కొత్త ఒప్పందంలో బదిలీ నిబంధన ఉంది. అందువల్ల ప్రస్తుత కేసులో కాంట్రాక్టు టీచర్ల బదిలీ ఉత్తర్వులను ఎంతమాత్రం తప్పుపట్టలేం. బదిలీల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు సమర్థనీయమే’.. అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టంచేసింది. వారికిచ్చి వీరికివ్వకపోవడం వివక్షే.. వీటిపై జస్టిస్ దుర్గాప్రసాదరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కాంట్రాక్టు టీచర్ల తరఫు న్యాయవాది ఎన్వీ సుమంత్ వాదనలు వినిపిస్తూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు కాంట్రాక్టు, తాత్కాలిక, అడ్హాక్ తదితర ఉద్యోగులకు వర్తిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలను వర్తింపజేస్తూ జీఓ ఇచ్చిందని, అయితే అధికారులు వాటిని కాంట్రాక్టు టీచర్లకు వర్తింపచేయడం లేదన్నారు. పిటిషనర్లు కాంట్రాక్టు టీచర్లు మాత్రమేనని, వారికి ట్రాన్స్ఫర్లు వర్తింపజేయడానికి వీల్లేదని తెలిపారు. కనీస వేతనాలు వర్తింపజేయకుండా బదిలీలు చేయడానికి వీల్లేదన్నారు. సర్వశిక్షాభియాన్ తరఫు న్యాయవాది కేవీ రఘువీర్ వాదనలు వినిపిస్తూ.. కేజీబీవీ, యూనివర్సిటీలు, సొసైటీలు, మోడల్ పాఠశాలల్లో పనిచేసే కాంట్రాక్టు ఉద్యోగులందరికీ కనీస వేతన స్కేల్‌ను వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అయితే, ఈ ఉత్తర్వులు మంజూరు చేసిన ఖాళీల కింద నియమితులైన వారికి మాత్రమే వర్తిస్తాయన్నారు. అలాగే, బదిలీ చేయాలని పలువురు కాంట్రాక్టు టీచర్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు సమరి్పంచారని, ఆ మేరకు వారి బదిలీ జరిగిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కనీస వేతనాల విషయంలో ఎన్వీ సుమంత్ వాదనలతో ఏకీభవిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. అంతేకాక.. ‘తమకు కనీస వేతన స్కేల్ ఉత్తర్వులను వర్తింపజేయాలన్న కాంట్రాక్టు టీచర్ల అభ్యర్థన సబబైనదే. సమాన పనికి సమాన వేతనం చెల్లించకపోవడం అన్నది దోపిడీ, బానిసత్వం కిందకే వస్తుందని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తన సంక్షేమ విధానంలో భాగంగానే కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకునే వారికి కనీస వేతన స్కేల్‌ను అమలుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. అధికారులు ఆ స్కేల్‌ను వర్తింపజేయకపోవడం ఏకపక్షం. కనీస వేతనాల విషయంలో సింగిల్ జడ్జి తీర్పును ఏ రకంగానూ విమర్శించాల్సిన అవసరంలేదు’.. అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. -
టెట్.. టఫ్
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసినవారితోనే టెట్ రాసేందుకు సర్విస్‌లో ఉన్న టీచర్లు ససేమిరా అంటున్నారు. సర్వీస్ టీచర్లకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. దీంతో టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలకు జాప్యం జరుగుతోంది. డీఎస్సీకి ముందే టెట్ నిర్వహించడంపై బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరితోనే టెట్ రాయాలన్న నిబంధనను మాత్రం సర్వీస్‌లో ఉన్న టీచర్లు వ్యతిరేకిస్తున్నారు.ఈ పరిస్థితుల్లో టెట్ నిర్వహణపై గందరగోళం నెలకొంది. సర్విస్ టీచర్లు టెట్ రాసేందుకు అవసరమైన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఉపాధ్యాయుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఈ ప్రక్రియపై విద్యాశాఖ ఆచితూచి అడుగేస్తోంది. ఇప్పటి వరకూ టెట్ సిలబస్‌ను మాత్రమే ప్రకటించింది. సమగ్ర నోటిఫికేషన్‌ను విడుదల చేయలేదు. టెట్ దరఖాస్తులను ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకూ స్వీకరించాల్సి ఉంది. మే 20 నుంచి జూన్ 3 వరకూ టెట్ నిర్వహించాల్సి ఉంటుంది. నిబంధనల్లో మార్పు తప్పదా? టెట్ మార్గదర్శకాలు వెలువడితే తప్ప దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. సమగ్ర నోటిఫికేషన్లో ఫీజు, పరీక్ష విధానం, రిజర్వేషన్లు ఇతర అంశాలన్నీ పేర్కొంటారు. దీనికి ముందు సర్విస్‌లో ఉన్న ఉపాధ్యాయులూ కొత్తవారితో కలిసి టెట్ రాసేందు కు వీలుగా జీఓ వెలువడాలి. ఈ అంశాన్ని మార్గదర్శకాల్లో చేర్చాలి. అయితే, ప్రారంభంలోనే ఉపాధ్యాయ సంఘాలు టెట్‌పై అభ్యంతరాలు లేవనెత్తు తున్నాయి. సిలబస్ విడుదలైన వెంటనే అధికారులను ఉపాధ్యాయ సంఘాలు కలిసి అభ్యంతరాలు తెలియజేశాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఏదో ఒక సబ్జెక్టులో మాత్రమే నిష్ణాతుడై ఉంటారని, అన్ని సబ్జెక్టులతో కూడిన టెట్ రాయ డం అసాధ్యమంటున్నారు. భాషా పండితులకు వా రు చెప్పే లాంగ్వేజీలపై తప్ప మరే ఇతర సబ్జెక్టులపై పట్టు ఉండదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో బీఎడ్, డీఎడ్ అభ్యర్థులు తేలికగా టెట్ రాసే వీలుందని, కొన్నేళ్ల క్రితం ఈ కోర్సులు చేసిన టీచ ర్లు ఎలా రాస్తారనే వాదన లేవనెత్తుతున్నారు. దీని పై ప్రభుత్వం కూడా అధికారుల నుంచి వివరణ కోరింది. ఈ కారణంగానే టెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదలలో జాప్యం అవుతోందని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. టీచర్లను బలవంతంగా టెట్ రాసే జాబితాలో చేరిస్తే న్యాయ పోరాటానికి కొన్ని సంఘాలు సిద్ధమవుతున్నాయి. ఇదే జరిగితే టెట్ నిర్వహణకు బ్రేక్ పడుతుందన్న ఆందోళనలు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ అర్హత లేని ఉపాధ్యాయులు 80వేల మంది వరకూ ఉన్నారు. స్పెషల్ గ్రేడ్ ఉపాధ్యాయుల నుంచి సెకండరీ గ్రేడ్, ఎస్ఏల నుంచి హెచ్ఎంలకు పదోన్నతులు పొందాలంటే టెట్ అర్హత తప్పనిసరని కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో టెట్ రాయాల్సిన అవసరం ఏర్పడింది. టెట్ తర్వాతే పదోన్నతులు చేపడతారు. పదోన్నతులు కల్పిస్తేనే ఖాళీల సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేక టెట్ పెట్టి తీరాలి ప్రత్యేక టెట్ పెట్టకపోతే సర్వీస్‌లో ఉన్న టీచర్లకు అన్యాయం జరుగుతుంది. కొన్నేళ్లుగా టెట్ ఫలితాలు అతి తక్కువగా ఉంటున్నాయి. ఎప్పుడో బీఈడీ, టీటీసీ చేసిన టీచర్లు ఇప్పుడు టెట్ రాస్తే పాసయ్యే అవకాశం తక్కువ. కాబట్టి ప్రత్యేక సిలబస్‌తో టీచర్లకు టెట్ పెట్టాలి. భాషా పండితులకు కూడా ప్రత్యేకంగా ప్రశ్నపత్రం ఉండాలి. ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. అన్యాయం జరిగిందని భావిస్తే ఎవరో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే వీలుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్షణమే గైడ్‌లైన్స్ ఇవ్వాలి షెడ్యూల్ ప్రకారం టెట్ గైడ్‌లైన్స్ విడుదల చేయకపోవడం ఎంతమాత్రం సరికాదు. విధివిధానాలు వస్తే తప్ప నిర్ణయించిన తేదీల్లో దరఖాస్తుల స్వీకరణ సాధ్యం కాదు. లక్షల మంది అభ్యర్థులు టెట్ సమగ్ర నోటిఫికేషన్‌కు ఎదురుచూస్తున్నారు. టెట్ సకాలంలో జరిగి, ఫలితాలు వెలువడినా, డీఎస్సీ రాయడానికి తక్కువ సమయమే ఉంటుంది. ఈ అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి. – రావుల మనోహర్‌రెడ్డి తెలంగాణ బీఎడ్, డీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్
మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించింది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు ధరించి స్కూలుకు రాకూడదు. ఈ విషయమై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఉపాధ్యాయులు తమ వస్త్రధారణ విషయంలో హద్దులకు లోబడి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆ నోటిఫికేషన్లో వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులకు వేర్వేరు రకాల డ్రెస్ కోడ్లు అమలు చేయనున్నారు. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ , టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కుర్తా దుపట్టా, సల్వార్, చురీదార్, లేదా చీర ధరించాలని తెలిపారు. పురుష ఉపాధ్యాయులు, షర్టు, ప్యాంటు ధరించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. షర్టును ప్యాంట్‌లోకి టక్ ఇన్ చేయాలని సూచించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకే కాకుండా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాగా ఈ డ్రెస్ కోడ్‌పై పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఏమి ధరించాలి? ఏమి ధరించకూడదనేది వారి వ్యక్తిగత విషయమని, దానిపై వారికి ప్రత్యేక హక్కు ఉంటుందని వారంటున్నారు. ఉపాధ్యాయుల వస్త్రధారణ విద్యార్థులపై దుష్ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతోనే డ్రెస్‌కోడ్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
కొలువుదీరేది కొత్త విద్యా సంవత్సరంలోనే!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో కొత్తగా నియమితులైన టీచర్లు కొలువుదీరేందుకు మరి కొంతకాలం వేచి చూడాల్సిందే. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ), పోస్ట్రుగాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ (పిడీ), లైబ్రేరియన్, జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిగ్రీ లెక్చరర్ (డీఎల్) కేటగిరీల్లో దాదాపు 9వేల మంది కొత్తగా ఉద్యోగాలు సాధించారు. పీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ కేటగిరీల్లో ఎంపికైన దాదాపు 2 వేల మందికి గత నెలలో నియామక పత్రాలను సంబంధిత గురుకుల సొసైటీలు అందించాయి. అదేవిధంగా వారం క్రితం ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ కేటగిరీల్లో ఎంపికైన 5,193 మందికి నియామక పత్రాలు అందజేశారు. వాస్త వానికి ఈ మూడు కేటగిరీల్లో 6,600 మందికి నియామక పత్రాలు అందించాల్సి ఉండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆయా జిల్లాలకు చెందిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వలేదు. మరికొన్ని పోస్టులను సాంకేతిక సమస్యల కారణంగా పెండింగ్‌లో పెట్టారు. కాగా, కోడ్ తొలగిన వెంటనే పూర్తిస్థాయిలో నియామక పత్రాలు ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. కానీ మరో నాలుగైదు రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీంతో లోక్ సభ ఎన్నికలు ముగిసే వరకు గురుకుల టీచర్లు కొలువెక్కేందుకు అవకాశం లేకుండా పోతుంది. సీనియారిటీ తారుమారు కాకుండా.. గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న వారు 7 వేలకు పైగానే ఉన్నారు. నియామక పత్రాలు అందుకున్న వారికి నిర్దేశించి మల్టీ జోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టింగ్ ఇవ్వాలి. కానీ జిల్లా కేడర్ మినహా జోన్లు, మల్టీజోన్ కేడర్లకు చెందిన కేటగిరీల్లో పోస్టింగ్ ఇవ్వాలంటే ఆ పరిధిలోని ఉద్యోగులందరికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించాలి. జిల్లాస్థాయి కేడర్‌లో పోస్టింగ్ ఇస్తే ఇతర ఉద్యోగులకు పోస్టింగ్ పరంగా ఇబ్బంది లేనప్పటికీ సీనియార్టీలో భారీ వ్యత్యాసం వస్తుంది. విధుల్లో చేరిన తేదీతో సర్వీసును పరిగణిస్తుండగా.. ఎన్నికల కోడ్ తర్వాత పోస్టింగ్ తీసుకున్న వారు జూనియర్లుగా పరిగణనలోకి వస్తారు. దీంతో భవిష్య త్తులో ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సొసైటీలు పోస్టింగ్ ప్రక్రియను వాయిదా వేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈ నెలాఖరు వరకు ఉంటుంది. అంతలోపే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండగా.. ఆ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు నియామకపత్రాల అందజేతకు అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎన్నికలు ముగిసిన తర్వాత నియామక పత్రాలు పంపిణీ చేసి, తర్వాత కొత్తగా ఎంపికైన ఉద్యోగులందరికీ ఒకే దఫా కౌన్సెలింగ్ నిర్వహించేలా సొసైటీలు కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. వెబ్ ఆధారిత కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత మెరిట్ ఆధారంగా ఎంపిక చేసుకున్న పోస్టులు దక్కేలా సొసైటీలు సాంకేతిక ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యే సరికి మే నెలాఖరు సమీపిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత జూన్ నెల నుంచి 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో కొత్త విద్యా సంవత్సరంలోనే కొత్త టీచర్లు కొలువుదీరుతారని చెపుతున్నారు. -
నేడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ దేవసేన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఈ పోస్టులకు దాదాపు 1.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షను నిర్వహించాలనుకున్న తేదీల్లోనే అసెంబ్లీ ఎన్నికల తేదీలు రావడంతో డీఎస్సీ పరీక్షను వాయిదా వేశారు. కాగా కొత్త ప్రభుత్వం 11,062 పోస్టుల భర్తీ చేపట్టాలని నిర్ణయించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పాత నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. గత డీఎస్సీ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని బుధవారం నాటి ప్రకటనలో స్పష్టం చేసింది. -
గురుకులాల్లో పదోన్నతుల టెన్షన్
సాక్షి, హైదరాబాద్: కొత్త నియామకాలకు ముందే గురుకుల విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సీనియర్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఏళ్ల తరబడి వారంతా ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. గురుకుల పాఠశా లలు, కళాశాలల్లోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను తెలంగాణరాష్ట్ర గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఓ కొలిక్కి తీసుకొచ్చింది. వారంరోజుల్లో ఖాళీ లు భర్తీ చేసి అర్హులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.అయితే ఈ నియామకాల కంటే ముందుగా పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘా లు ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రతరం చేశాయి. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఉన్నతాధికారులకు వినతులు కూడా సమర్పించాయి. సీనియారిటీ జాబితాలు సిద్ధం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్)ల పరిధిలో దాదాపు వెయ్యి విద్యా సంస్థలున్నాయి. వీటి పరిధిలో 22వేలకుపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లలో సీని యర్లకు పదోన్నతులు కల్పించాలి. దీనికి సంబంధించి సొసైటీలు ఇప్పటికే సీనియారిటీ జాబితాలు సిద్ధం చేశాయి. ప్రభుత్వం అనుమతిస్తే రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసే వీలుందని సొసైటీ అధికారులు చెబుతున్నారు. ఇదే జరిగితే అన్ని కేటగిరీల్లో 3 వేల మందికి పదోన్నతులు దక్కుతాయి. ఆలస్యమైతే.. అంతే టీఆర్‌ఈఐఆర్‌బీ ద్వారా గురుకుల విద్యాసంస్థల్లో కొత్తగా 9వేల మంది ఉద్యోగులు చేరనుండగా, ఇప్పటికే గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్ ఉద్యోగాలతోపాటు పీజీటీ కేటగిరీల్లో 2వేల మంది నియామక పత్రాలు అందుకున్నారు. మిగిలిన వారికి కూడా ఈ నెలాఖరులోగా నియామక పత్రాలు, ఆ తర్వాత పోస్టింగ్ ఇచ్చే అవకాశముంది. అయితే కొత్తవారికి నియామక పత్రాలు ఇవ్వగానే వారి సర్విసు గణన ప్రారంభమవుతుంది. దీంతో అర్హత ఉండి పదోన్నతులు రాని వారంతా కొత్తగా నియమితులైన వారికంటే జూనియర్లుగా ఉండిపోతారు. ఇలా పీజీటీ, జేఎల్, డీఎల్ కేటగిరీల్లోని సీనియర్ల సీనియారిటీ క్రమం తారుమారు అవుతుందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు చాలా కేటగిరీల్లోని టీచర్లకు పదోన్నతులు రాలేదు. ఇటీవల సీఎంతోపాటు సీఎస్, ఇతర ఉన్నతాధికారులను కలిసి పరిస్థితిని వివరించాం. వారు సానుకూలంగా స్పందించారు. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు కల్పిస్తారనే నమ్మకం ఉంది. – మామిడి నారాయణ, గురుకుల ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధి సీనియర్లు నష్టపోతారు కొత్త నియామకాల తర్వాత పదోన్నతుల ప్రక్రియ చేపడితే సీనియర్లు తీవ్రంగా నష్టపోతారు. తదుపరి పదోన్నతుల సమయంలో జూనియర్లుగా మిగిలి పోయే ప్రమాదం ఉంది. దాదాపు ఆరేళ్లుగా గురు కులాల్లో పదోన్నతులు నిర్వహించలేదు. పదేళ్ల నుంచి ఒకే స్థానంలో పనిచేస్తున్న టీచర్ల సంఖ్య పెద్దగానే ఉంది. నూతన నియామకాలకంటే ముందే పదోన్నతులు, బదిలీలు నిర్వహిస్తే ప్రస్తుతం పనిచేస్తున్నవారికి లాభదాయకం. – సీహెచ్.బాలరాజు, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు -
AP: ‘ఐబీ’ సిలబస్ శిక్షణ ఇదిగో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్‌గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్‌ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి.. ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్‌వర్క్‌లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్‌లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్‌లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. రూ.73 వేల కోట్లతో సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది. అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే.. ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్‌ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్‌గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్‌ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్‌లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్‌లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. -
వాలెంటైన్స్ డే వేళ... కొన్ని సరదా సంగతులు!
ఫిబ్రవరి 14... వాలెంటైన్స్ డే.. అంటే ప్రేమికుల రోజు. ఆ రోజున ప్రేమికులంతా ఆనంద డోలికల్లో మునిగితేలుతుంటారు. ప్రేమ ఊసులు చెప్పుకుంటారు. అయితే వాలెంటైన్స్ డేకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులు చాలామందికి తెలియవు. వాటిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం. మొదటి వాలెంటైన్ డే వేడుక 15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో జరిగింది. మొదటి అధికారిక వాలెంటైన్స్ డే పారిస్‌లో జరిగిందని చెబుతారు. ఫిబ్రవరినాటి మధ్యస్థ రోజుల్లో పక్షుల సంభోగంలో పాల్గొంటాయట. అందుకే ఇది శృంగారాన్ని జరుపుకోవడానికి తగిన సమయమని అంటుంటారు. వాలెంటైన్స్ డే నాడు ప్రతి సంవత్సరం 145 మిలియన్ గ్రీటింగ్ కార్డ్‌లను పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటారు. యునైటెడ్ స్టేట్స్లో అత్యధిక వాలెంటైన్స్ గ్రీటింగ్ కార్డులు పంచుకుంటారట. పెంపుడు జంతువుల యజమానులలో 25 శాతం మంది వాలెంటైన్స్ డే సందర్భంగా తమ పెంపుడు జంతువులకు వాలెంటైన్స్ డే బహుమతులు ఇస్తారు. అంటే వాలెంటైన్స్ డే.. కేవలం మనుషులకే కాదు కుక్కలు, పిల్లులు,పక్షులు, ఇతర పెంపుడు జంతువులకు సంబంధించినది కూడా. హృదయాకార మిఠాయిలను 1800లో తయారుచేశారట. బోస్టన్ ఫార్మసిస్ట్ ఆలివర్ చేజ్ వీటిని తయారుచేసే ప్రక్రియను సులభతరం చేయడానికి ఒక యంత్రాన్ని కనుగొన్నాడు. ప్రతి సంవత్సరం ఎనిమిది బిలియన్ల హృదయ సంభాషణలు రూపొందిస్తారట. వివిధ రకాల క్యాండీలపై క్లాసిక్ రొమాంటిక్ పదబంధాలలో ‘బి మైన్’, ‘క్యూటీ పై’ ‘ఐ యామ్ యువర్స్’ అనే అక్షరాలను ముద్రిస్తారు. వాలెంటైన్స్ డే నాడుప్రేమికులు 58 మిలియన్ పౌండ్ల విలువైన చాక్లెట్లు, మిఠాయిలను కొనుగోలు చేస్తారట. వాలెంటైన్స్ డే మిఠాయి అమ్మకాలలో గుండె ఆకారంలో ఉండే చాక్లెట్ బాక్స్‌లు దాదాపు 10శాతం ఉంటాయి. 1850లో క్యాడ్బరీ కంపెనీ చాక్లెట్లతో కూడిన బాక్స్ రూపొందించింది. దశాబ్ధకాలం తరువాత మొదటి గుండె ఆకారపు చాక్లెట్ బాక్స్‌ను తయారయ్యింది. మొదటి వాలెంటైన్స్ డే గ్రీటింగ్ కార్డు జైలు నుండి పంపించారు. డ్యూక్ ఆఫ్ ఓర్లీన్స్ 15వ శతాబ్దం ప్రారంభంలో ఖైదీగా మారినప్పుడు మొదటి వాలెంటైన్ లేఖ రాశాడు. దానిలో ఒక కవిత రాసి, తన రెండవ భార్యకు పంపాడు. అయితే అతను జైలులో ఉన్నందున ఆ కవితకు ఆమె నుంచి వచ్చిన స్పందనను అతను చూడలేదు. అత్యధికంగా టీచర్లు వాలెంటైన్డే గ్రీటింగులను అందుకుంటారు. వాలెంటైన్స్ డే కోసం 250 మిలియన్ల గులాబీలను పండిస్తారు! రోమన్ ప్రేమ దేవత వీనస్‌కు ఇష్టమైనవి ఎరుపు రంగు గులాబీలు. ఇవి శృంగారాన్ని, ప్రేమను సూచిస్తాయి. -
విద్యా శాఖలోకి ‘పురపాలక’ టీచర్లు
సాక్షి, అమరావతి: ఎంతోకాలంగా నలుగుతున్న పురపాలక ఉపాధ్యాయుల సర్వీసు బదలాయింపు ఎట్టకేలకు పూర్తయింది. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీసును ప్రభుత్వం పాఠశాల విద్యా శాఖలో విలీనం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.7, నగరపాలక సంస్థల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు జీవో నం.8, జీవీఎంసీ ఉపాధ్యాయులకు జీవో నం.9, విజయవాడ నగరపాలక సంస్థ ఉపాద్యాయులకు జీవో నం.10 జారీ చేశారు. దీంతో పురపాలక ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశం పూర్తిగా విద్యా శాఖకు అప్పగించినట్టయింది. గతంలో నగర, పురపాలక సంఘాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేర్వేరు సర్వీసు నిబంధనలు ఉండేవి. దాంతో వారు ఆ సంస్థ పరిధిలోని పాఠశాలలకు మాత్రమే బదిలీ అయ్యేవారు. ఇకపై జిల్లా యూనిట్‌గా వారి నియామకాలు, బదిలీలు చేపడతారు. ఈ ప్రక్రియను కూడా పాఠశాల విద్యా శాఖ నిర్వహిస్తుంది. -
AP DSC Notification: 6,100 పోస్టులతో డీఎస్సీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6,100 పోస్టుల భర్తీకి డీఎస్సీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ), 2,299 స్కూల్ అసిస్టెంట్లు (ఎస్ఏ), 1,264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు (టీజీటీ), 215 పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), 42 ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)తో పాటు డీఎస్సీ–2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈనెల 12న ఇవ్వనుంది. టెట్, డీఎస్సీకి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ https://cse.ap.gov.in ద్వారా చేసుకోవాలి. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్ కుమార్ వివరాలు వెల్లడించారు. నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచే ఆయా పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తులు కూడా స్వీకరిస్తారు. మొత్తం ప్రక్రియను పూర్తిచేసి, ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థులకు పోస్టింగ్ ఇస్తామని, వారు వచ్చే విద్యా సంవత్సరంలో బోధన కూడా చేపడతారని మంత్రి బొత్స తెలిపారు. అందుకు అనుగుణంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహించామని తెలిపారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డీఈడీ పూర్తిచేసినవారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. వివిధ విద్యా సంస్థల పరిధిలో 6,100 పోస్టులు.. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6,100 పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహిస్తున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జిల్లా, మండల పరిషత్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (ఆశ్రం), ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థల్లో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లల్లో విద్యపై రూ.73 వేల కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. రాష్ట్రంలో పేదింటి పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తే వారు ఉజ్వల భవిష్యత్‌ను అందుకుంటారో సీఎం వైఎస్ జగన్‌కు బాగా తెలుసని చెప్పారు. అందుకే ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ, టోఫెల్‌ను అందుబాటులోకి తెచ్చారన్నారు. కొద్దిరోజుల క్రితం ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నామని గుర్తు చేశారు. విద్యార్థుల మేలు కోసం కొత్త నిర్ణయం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మేలు చేసే మరో మంచి నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యా సంవత్సరం మధ్యలో రిటైర్ అయితే విద్యార్థులకు బోధన సమస్య తలెత్తుతోందన్నారు. కొత్తవారిని నియమించినా విద్యార్థులు అలవాటు పడేందుకు సమయం పడుతోందని వివరించారు. ఈ ప్రభావం విద్యార్థుల ఫలితాలపై పడుతున్నట్టు గుర్తించామన్నారు. దీన్ని అధిగమించేందుకు విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయులు రిటైర్ అయితే, ఆ విద్యా సంవత్సరం మొత్తం వారినే కొనసాగించే యోచన చేస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరం మొత్తం ఒకే టీచర్ బోధన అందుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విధానం కేరళలో అమల్లో ఉందని, త్వరలో దీనిపై విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో టెట్, డీఎస్సీ.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ఏపీ టెట్, డీఎస్సీ పరీక్షలు రెండింటినీ ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ)గా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్లలో నిర్వహిస్తామన్నారు. మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుందని చెప్పారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 185 కేంద్రాలను ఎంపిక చేశామని తెలిపారు. రాష్ట్రం బయట ఉన్నవారి కోసం మరో 22 సెంటర్లను హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, బరంపురంల్లో ఏర్పాటు చేస్తామన్నారు. డీఎస్సీ రాయాలనుకునే జనరల్ అభ్యర్థులకు 44 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 49 ఏళ్ల వయోపరిమితి ఉంటుందని చెప్పారు. ఈసారి డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయులకు నాలుగు దశల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ), టెక్నాలజీ ట్రైనింగ్, టోఫెల్, బోధన సామర్థ్యంపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇందులో సర్టిఫికెట్లు సైతం ప్రదానం చేస్తామన్నారు. కమిషనర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మొత్తం 7 లక్షల మంది పరీక్ష రాసేలా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పి.భాస్కర్, విద్యాశాఖ జేడీలు మేరీ చంద్రిక, మొవ్వా రామలింగం, డాక్టర్ ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
టీచర్లు సిటీకి.. చదువులు గాలికి!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కొన్నిరోజులుగా కొత్త టీచర్లు కొలువుదీరుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలేమీ లేకున్నా.. కొత్త నియామకాలేవీ జరగకున్నా.. కొత్త టీచర్లు వస్తుండటంపై తోటి టీచర్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ కొత్త టీచర్లంతా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో పనిచేయాల్సిన వారు. కానీ డిçప్యుటేషన్లపై పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలకు వచ్చి తిష్టవేస్తున్నారు. తమకు పోస్టింగ్ ఇచ్చిన గ్రామీణ పాఠశాలలో పనిచేయడం ఇష్టం లేకనో, మరేదైనా కారణాలతోనో.. జిల్లా విద్యాశాఖ అధికారులు (డీఈఓలు), పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలోని అధికారులు, రాజకీయ నేతల సహకారంతో ఇలా పట్టణ ప్రాంత బడుల్లోకి మారుతున్నారు. ఈ జిల్లాల పరిధిలో వంద మందికిపైగా టీచర్లు ఇలా డిçప్యుటేషన్లపై ఇతర చోట్లకు వెళ్లినట్టు అంచనా. దీంతో ఇప్పటికే ఉపాధ్యాయుల కొరతతో సతమతం అవుతున్న గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో బోధనకు మరింతగా ఇబ్బంది ఎదురవుతోంది. రూ.3 లక్షల దాకా ముట్టజెప్పి.. కోరిన చోటికి డిప్యూటేషన్‌పై వెళ్లేందుకు కొందరు టీచర్లు.. స్థానిక ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు విద్యాశాఖ అధికారులను ఆశ్రయించి డిప్యుటేషన్ పొందుతున్నారు. ఈ క్రమంలో ఒక్కో టీచర్ రూ.3 లక్షల వరకు ముట్టజెప్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు డీఈఓలు అందినకాడికి వసూలు చేసి, ఇలా డిప్యుటేషన్లు ఇస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లోపల, శివార్లలోని దగ్గరి ప్రాంతాల స్కూళ్లకు వెళ్లేందుకు అంతకంటే ఎక్కువే చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 2న యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఓ టీచర్‌ను ఏకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగోల్ జెడ్పీ హైసూ్కల్‌కు డిప్యూటేషన్‌పై పంపుతూ యాదాద్రి జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి అంతర్ జిల్లా డిప్యూటేషన్ ఇచ్చే అధికారం డీఈఓలకు ఉండదు. అయినా ఇలాంటి ఆదేశాలు రావడం గమనార్హం. అయితే రాష్ట్రంలో ఎక్కడా డిప్యూటేషన్లు ఇవ్వలేదని, పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చెప్తుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొన్ని డిప్యూటేషన్లు ఇలా.. ► రంగారెడ్డి జిల్లా మంచాల మండలం రంగాపూర్ జెడ్పీ హైసూ్కల్ నుంచి ఓ ఉపాధ్యాయుడు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం రాగన్నగూడ జెడ్పీహెచ్‌ఎస్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ► మాడ్గుల మండలం అవురుపల్లి జెడ్పీహెచ్ఎస్లో పనిచేయాల్సిన ఓ టీచర్.. చంపాపేట్ జెడ్పీహెచ్ఎస్లో డిప్యూటేషన్‌పైన విధులు నిర్వహిస్తున్నారు. ► మాడ్గుల మండలం పుట్టగడ్డతండా ప్రాథమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఇదే మండలం అన్నబోయినపల్లి పాఠశాలకు చెందిన టీచర్.. శేరిలింగంపల్లి మండలం కొండాపూర్ పాఠశాలకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. ► ఇలా మాడ్గుల మండలానికి చెందిన సుమారు ఇరవై మంది టీచర్లు డిప్యూటేషన్లపైన ఇతర మండలాల్లో పనిచేస్తున్నట్టు సమాచారం. ► షాద్‌నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని దాదాపు 60 మంది టీచర్లు.. గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాలైన రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల్లో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో దాదాపు 12 పాఠశాలల్లో టీచర్లెవరూ లేరని సమాచారం. మానవతా దృక్పథంతో చేస్తున్నాం.. పక్షవాతం, కేన్సర్ తదితర వ్యాధుల బాధితులు, అఖిల భారత సర్వీసు ఉద్యోగుల జీవిత భాగస్వాములు వంటి వారి డిప్యూటేషన్లను అనుమతిస్తున్నాం. అలాంటి వారు ఎవరున్నా దరఖాస్తు చేసుకోవాలని కూడా చెప్తున్నాం. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఇలాంటి దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆమోదించి పోస్టింగ్‌లు ఇస్తున్నాం. విద్యాశాఖ కమిషనర్ నుంచి వస్తున్న ప్రతిపాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. – బుర్రా వెంకటేశం, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక్క డిప్యూటేషన్ కూడా ఇవ్వలేదు డిప్యూటేషన్లు, బదిలీలకు సంబంధించి నేను ఎక్కడా సంతకాలు చేయలేదు. నాకు ఎలాంటి సంబంధం లేదు. గత మూడున్నరేళ్లలో నేను ఒక్క ఆర్డర్‌పై కూడా సంతకం చేయలేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే అమలు చేస్తా. – దేవసేన, విద్యాశాఖ కమిషనర్ -
ప్రమోషన్లకు ఆటంకంగా 'టెట్' అలజడి!
నిర్మల్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఉత్తీర్ణత తప్పనిసరి అనే నిబంధన జిల్లాలోని సీనియర్ ఉపాధ్యాయుల్లో అలజడి రేపుతోంది. టెట్ ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన తప్పనిసరి అని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు తెలియడంతో ప్రమోషన్లకు ఆటంకంగా మారింది. జిల్లాలో గత అక్టోబర్‌లో ఉపాధ్యాయ ప్రమోషన్ల ప్రక్రియ నిలిచిపోగా తాజాగా ఈ వివాదం తెరపైకి వచ్చింది. 2011లో టెట్ నిర్వహణ మొదలు కాగా కొన్నేళ్లకు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ప్రతీ ఉపాధ్యాయుడికి తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులిచ్చింది. అయితే ఇది రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఫలితంగా 1996 నుంచి 2008 వరకు పలు దఫాలుగా నిర్వహించిన డీఎస్సీల్లో ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో చాలామందికి టెట్ అర్హత లేదు. ఇలాంటి వారందరి ప్రమోషన్ వ్యవహారం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాగా, మరోవైపు జూనియర్లు తమకు ప్రాధాన్యం లభించనుందని 2012, 2017 ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ అర్హత ద్వారా ఎంపికై న ఎస్జీటీ, ఎస్ఏ ఉపాధ్యాయ వర్గాల్లో కొత్త ఉత్సాహం వ్యక్తమవుతోంది. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ అర్హత నియమావళి కలిగి ఉన్నవారే నూతన నియామకాలకై నా, ప్రమోషన్లకై నా అర్హులవుతారని టెట్ క్వాలిఫైడ్ టీచర్స్ సంఘం జిల్లా నాయకులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలంటే ఉపాధ్యాయుడు నిత్య విద్యార్థిగా అర్హతలు పొందుతూనే ఉండాలన్నదే వారి అభిప్రాయంగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎన్సీటీఈ తీసుకున్న నిర్ణయంతో వాస్తవానికి ఉపాధ్యాయ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ అక్టోబర్‌లో జరగాల్సి ఉండగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో మధ్యంతరంగా నిలిచిపోయింది. తాజాగా ఎన్సీటీఈ ఇచ్చిన ఉత్తర్వులపై విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న దానిపై సీనియర్ ఉపాధ్యాయుల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ నెల 11న రాష్ట్రస్థాయి సమీక్షలో ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల కార్యదర్శులు ముఖ్యమంత్రితో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమీక్షలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుందోననే ఉత్కంఠ సీనియర్ ఉపాధ్యాయుల్లో కొనసాగుతోంది. టెట్ నిబంధన సరికాదు డీఎస్సీలు అమలు పరిచినప్పటినుంచి కాకుండా 2011 నుంచి ఈ టెట్ అర్హత పరీక్ష మొదలైంది. ఈ నిబంధన ప్రమోషన్లలో ప్రవేశపెట్టడం సరైంది కాదు. దీంతో సీనియర్ ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురవుతున్నారు. 25 ఏళ్లుగా ఒకే కేడర్‌లో పనిచేస్తున్న వారు ఉద్యోగోన్నతి వస్తుందని భావిస్తున్న తరుణంలో వారి ఆశలపై నీళ్లు చల్లే నిర్ణయమిది. ఈ నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి సడలింపు నిర్ణయం తీసుకోవాలి. – నరేంద్రబాబు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఆరేళ్ల సమయంతో సడలింపు ఇవ్వాలి ఎన్సీటీఈ నిబంధనల మేరకు ప్రాథమిక స్థాయిలో బోధించే వారు టెట్ పేపర్–1, ఉన్నత స్థాయిలో బోధించే వారికి పేపర్–2 పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలని నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ.. ఇదివరకే ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న వారికి ప్రమోషన్లలో దీన్ని వర్తింపజేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ వర్తింపజేయాలనుకున్నా కనీసం ఆరేళ్ల సడలింపునిస్తూ ప్రమోషన్లు చేపట్టాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. – విజయ్‌కుమార్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఇవి చదవండి: పంచాయతీ పోరుకు బ్రేక్..! పార్లమెంట్ ఎన్నికల తర్వాతే.. -
TS గవర్నమెంట్ కీలక నిర్ణయం! ఉపాధ్యాయుల్లో ఆందోళన..
ఖమ్మం: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విద్యాశాఖకు సంబంధించి ప్రతీ అంశాన్ని కీలకంగా పరిగణిస్తూ విద్యావిధానంలో సమూల మార్పులు తీసుకురావాలనే యత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయాన ఉపాధ్యాయుల పదోన్నతుల అంశంపై సైతం దృష్టి పెట్టింది. ఈక్రమంలోనే పదోన్నతుల కల్పనకు ముందు టెట్ నిర్వహించాలనే ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. పదోన్నతి కల్పించేందుకు టెట్ అర్హతను తప్పనిసరి చేయనున్నట్లు తెలుస్తుండగా, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 4,785మంది ఉపాధ్యాయులు జిల్లాలోని 1,232 ప్రభుత్వ పాఠశాలల్లో 4,785మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో టెట్ పూర్తయిన ఉపాధ్యాయులు సుమారు 300మంది ఉన్నట్లు తెలుస్తోంది. పదోన్నతుల కోసం టెట్ తప్పనిసరి చేయాలనే భావనలో ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో చర్చ మొదలైంది. 2012కు ముందు టెట్ లేకపోవడంతో జిల్లాలో సుమారు 4వేల మంది ఉపాధ్యాయులకు పదో న్నతులకు అర్హత కోల్పోతారనే ప్రచారం జరుగుతోంది. ఈమేరకు ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగ ణించి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్ నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేకంగా ఉండాలి.. ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అంటున్న ప్రభుత్వం... టీచర్ల కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. టెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా పదోన్నతులు కల్పిస్తేనే అర్హుల కు లబ్ధి జరుగుతుందని మరికొందరు చెబుతున్నారు. కాగా, ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు విద్యాశాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
ట్యాబ్‌లు దుర్వినియోగం అయ్యే అవకాశమే లేదు: టీచర్లు
-
టీచర్లను రెచ్చగొట్టేలా ఈనాడు దుర్మార్గపు రాతలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులను రెచ్చగొట్టేలా ఈనాడు కథనాలు రాస్తోందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. నెల్లూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాడులో ఉపాధ్యాయులపై రాసిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. ప్రభుత్వ టీచర్లు విద్యార్థుల స్థితిగతులపై డిక్లరేషన్ ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చారని శుక్రవారం ఈనాడు వార్త ప్రచురించిందని, కానీ ప్రభుత్వం ఎప్పుడూ మౌఖిక ఆదేశాలు ఇవ్వదని, అధికారికంగా పేపర్ పరంగా ఆదేశాలుంటాయనేది ఆ పత్రికకు తెలియదా అని ప్రశ్నించారు. ఎవరు మౌఖిక ఆదేశాలిచ్చారో రాయకుండా టీచర్లను రెచ్చగొట్టేలా రాయడం దుర్మార్గమన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలున్నా తక్షణమే సీఎం వైఎస్ జగన్ పరిష్కరిస్తున్నారని గుర్తుచేశారు. ఇకనైనా ఈనాడు ఇలాంటి అసత్య కథనాలు రాయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో బాబు ఎంతోమందిని అవమానించారు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో అనంతపురం ప్రాంతంలో ఒక పాఠశాలలో టీచర్ స్కూల్లోని సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకొస్తే.. ఆ టీచర్‌ను యూజ్లెస్ ఫెలో అంటూ తిట్టి సస్పెండ్ చేశారని, అదే జిల్లా శింగనమల ప్రాంతంలో పంచాయతీ అధికారి ఒకరిని జీపుపై ఎక్కించి అవమానించిన ఘనత బాబుదేనన్నారు. టీడీపీ నేత నిమ్మల కిష్టప్ప ఉపాధ్యాయులను చెట్టుకు కట్టేసి కొట్టండి అని గతంలో అన్నారని గుర్తుచేశారు. కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు విద్యావ్యవస్థపై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో వసతులు కల్పించి, ఉపాధ్యాయులకు గౌరవాన్ని పెంచిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. -
జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి సెలవులు రద్దు!
బీహార్ ప్రభుత్వ విద్యాశాఖ తాజాగా సెలవుల క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్ ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, శివరాత్రి, తీజ్, హొలీ, సెలవులను రద్దు చేశారు. అదే సమయంలో ఈద్-బక్రీద్‌కు మూడు రోజులు, ముహర్రం కోసం రెండు రోజుల చొప్పున సెలవులు కేటాయించారు. ఉపాధ్యాయులకు వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. విద్యార్థులకు యథావిధిగా వేసవి సెలవులు ఉంటాయి. కొత్త సెలవుల పట్టిక ప్రకారం 60 రోజుల సెలవుల్లో 38 రోజులు ఉపాధ్యాయులు పాఠశాలకు రావాల్సి ఉంటుంది. అంటే ఉపాధ్యాయులకు 22 రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు. మే ఒకటిన కార్మిక దినోత్సవం సెలవు కూడా రద్దు చేశారు. ప్రత్యేక రోజులలోనూ పాఠశాలలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఆ రోజులలో భోజన వేళకు ముందు ఆ ప్రత్యేకదినానికి సంబంధించిన విషయాలు విద్యార్థులకు తెలియజేయాల్సివుంటుంది. హిందూ పండుగలలో సెలవులు రద్దు చేయడంపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు! "तुष्टिकरण के सरदार-बिहार के कुर्सी कुमार" एकबार फिर चाचा-भतीजे की सरकार का हिंदू विरोधी चेहरा सामने आया। एक तरफ स्कूलों में मुस्लिम पर्व की छुट्टी बढ़ाई जा रही हैं,वहीं हिंदु त्योहारों में छुट्टियां खत्म की जा रही हैं। लानत है वोटबैंक के लिए सनातन से घृणा करने वाली सरकार को। pic.twitter.com/3yX6WAeGnx — Ashwini Kr. Choubey (@AshwiniKChoubey) November 27, 2023 -
ఉపాధ్యాయురాలు విధులు ముగించుకుని ఆటోలో వెళ్తుండగా ఘటన.. తీవ్ర విషాదం!
సాక్షి, మహబూబ్‌నగర్: కోయిలకొండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పద్మావతి (40), జాయింట్ మెర్సి, పద్మప్రియ, లక్ష్మీమానస, సయబాసుల్తానా విధులు ముగించుకుని ఆటోలో మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా, పారుపల్లి స్టేజీ వద్ద పంది అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదంలో పద్మావతి మృతి చెందగా, నలుగురు ఉపాధ్యాయులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని చికిత్స నిమిత్తం జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇవి చదవండి: పండుగ సెలవుల సరదాలో.. విషాదం! ఇయర్‌ఫోన్స్ ఆధారంగా.. -
కొత్త ఒర‘బడి’!
తూరంగి, తుని నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టిన విద్యా సంస్కరణలు ఫలితాలనిస్తున్నాయి. దశాబ్దాల తరబడి తగినంత మంది ఉపాధ్యాయలు లేక ఇబ్బందులు పడ్డ విద్యార్థులకు ఇప్పుడు సుశిక్షితులైన టీచర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో విద్యా సామర్థ్యాలు, పరీక్షల్లో మార్కులు పెరిగాయి. పేద పిల్లల చదువులు, ఆరోగ్య స్థితిగతులు గణనీయంగా మెరుగుపడ్డాయి. వసతుల కల్పనతో డ్రాపౌట్లు నిలిచిపోయాయి. ప్రతి నెలా పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు రక్తహీనత ఉన్న విద్యార్థులను గుర్తించి ప్రతి గురువారం స్కూళ్లలోనే ఐరన్ మాత్రలు పంపిణీ చేస్తూ భావి పౌరుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. యోగా, డ్రిల్ తప్పనిసరి చేయడంతో విద్యార్థుల ఫిట్‌నెస్‌లో మార్పు వచ్చింది. నిరంతర నీటి సదుపాయంతో కూడిన టాయిలెట్లు, ఆర్వో తాగు నీటితోపాటు మధ్యాహ్నం జగనన్న గోరుముద్దతో పోషకాహారం, రాగిజావ, చిక్కీ, వారానికి ఐదురోజులు కోడిగుడ్డు ఇవ్వడంతో విద్యార్థులు ఉత్సాహంగా చదువులపై దృష్టి సారిస్తున్నారు. బాలికలకు శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీతో పాటు రుతుక్రమ పరిస్థితులపై అవగాహన కల్పించడంతో మానసికంగా వారిలో మార్పు వచ్చింది. రాష్ట్రంలోని సర్కారు స్కూళ్లలో ఐదారేళ్ల క్రితం వరకు 40 నుంచి 60 శాతం దాటని హాజరు ఇప్పుడు సగటున 98 శాతానికి పైగా పెరిగింది. ప్రైవేట్ నుంచి ప్రభుత్వ స్కూళ్లల్లో తమ పిల్లలను చేర్పించిన తల్లిదండ్రులు ఫీజులు రూపంలో చెల్లించే మొత్తం మిగలడం, మెరుగైన బోధన అందడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తగినంత మంది టీచర్లు.. పీఈటీలు కాకినాడ జిల్లా తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 720 మంది విద్యార్థులుండగా వీరిలో 80 మంది ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇక్కడ చదువుకున్న వారిలో గత నాలుగేళ్లలో 15 మంది విద్యార్థులు ఐఐఐటీల్లో సీట్లు సాధించడం, ఆరుగురు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్లు అందుకోవడం గమనార్హం. ఆరు నుంచి 10వ తరగతి వరకు బోధనకు గతంలో 12 మంది మాత్రమే ఉపాధ్యాయులు ఉండగా ఇప్పుడు 29కి పెరిగింది. తునిలోని శ్రీరాజా ఉన్నత పాఠశాలలో 540 మంది విద్యార్థులు ఉండగా ఎన్నో ఏళ్ల పాటు ఉపాధ్యాయుల సంఖ్య 10 మందికి మించలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 17కి పెరిగింది. చాలా ఏళ్ల తర్వాత వ్యాయామ ఉపాధ్యాయుడి రాకతో విద్యార్థులు క్రీడల్లోనూ రాణిస్తున్నారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులు ఇంగ్లిష్ బోధనను సునాయాసంగా అర్థం చేసుకోవడం, పరీక్షలు రాయడంతో పాటు సగటు మార్కుల శాతాన్ని కూడా పెంచుకోవడం గమనార్హం. వ్యాయామ ఉపాధ్యాయులను అందించడంతో రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ, ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ బోధన, టోఫెల్ శిక్షణతో ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు క్యూ కడుతున్నారు. ప్రతినెలా తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశాలను నిర్వహించడం, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతిని విశ్లేషించడం, అవసరానికి తగట్టు బోధనతో పిల్లల్లో నేర్చుకునే సామర్థ్యాలు, నైపుణ్యాలు మెరుగుపడ్డాయి. నాలుగేళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థల్లో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పుల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తుని, తూరంగిలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ‘సాక్షి’ ప్రతినిధి వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆనందాన్ని పంచుకున్నారు. మారిన తలరాతలు.. వెలుగు నిండిన స్కూళ్లు తల్లిదండ్రులకు ఆర్థిక భారంగా మారిన పిల్లల చదువుల బాధ్యతను పూర్తిగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం పుస్తకాల నుంచి యూనిఫారం దాకా సర్వం సమకూరుస్తోంది. పిల్లలకు స్కూళ్లలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడంపై తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్చినా గతంలో ఒక్కో కుటుంబం పుస్తకాలు, యూనిఫారం కోసం ఏటా రూ.రెండు మూడు వేలు వెచ్చించాల్సి వచ్చేది. బెల్టు, బూట్లు, పుస్తకాల బ్యాగు ఖర్చు దీనికి అదనం. ఈ ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలోని దాదాపు 45 వేల పాఠశాలల్లో 42 లక్షల మంది పిల్లల తల్లిండ్రులకు చదువుల బెంగ తీరిపోయింది. బడికి పంపించినందుకు ఏటా రూ.15 వేలను జగనన్న అమ్మ ఒడి కింద ప్రభుత్వమే జమ చేస్తోంది. నాడు–నేడుతో ప్రభుత్వ స్కూళ్లు సమూలంగా మారిపోయాయి. ల్యాబ్స్, డిజిటల్ విద్య, ట్యాబ్స్, కొత్త తరగతి గదులు, ఆర్వో తాగునీరు, మరుగుదొడ్లు, బాలికలకు శానిటరీ ప్యాడ్స్ అన్నీ అందుబాటులో ఉండడంతో బాలికల చేరికలు పెరిగాయి. టెక్నాలజీ బోధన.. టోఫెల్ శిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధనను కలలో కూడా ఊహించలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసమే గతంలో అప్పులు చేసి ప్రైవేట్ స్కూళ్లల్లో చేర్చామని గుర్తు చేసుకుంటున్నారు. ఇద్దరు పిల్లలున్న తల్లిదండ్రులకు ప్రైవేట్ స్కూళ్లలో చదివించేందుకు ఏటా సగటున రూ.లక్ష వరకు ఖర్చయ్యేదని పేర్కొంటున్నారు. తెలుగు మీడియం నుంచి వచ్చిన వారికి అర్థమయ్యేలా బైలింగ్యువల్ పాఠ్య పుస్తకాలను ఇవ్వడం పిల్లలకు ఎంతో మేలు చేస్తోందని చెబుతున్నారు. ఇక మూడో తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 1,000 పాఠశాలల్లో పూర్తిగా సీబీఎస్ఈ బోధనను అందిస్తోంది. అన్ని స్థాయిల్లో పాఠ్య పుస్తకాలను డిజిటల్ పీడీఎఫ్ రూపంలో ఆన్లైన్లో ఉంచడంతో పాటు బైజూస్ కంటెంట్‌తో ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్‌లను ఉచితంగా ఇవ్వడంతో చదువుల్లో రాణిస్తున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. 6 నుంచి 10 వరకు తరగతి గదుల్లో 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లు (ఐఎఫ్‌పీ), ఎలిమెంటరీ పాఠశాలల్లో 10,038 స్మార్ట్ టీవీలతో డిజిటల్ బోధనను అందుబాటులోకి తేవడంతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ స్కూళ్లను మించిపోయాయి. సైన్స్ ల్యాబ్‌లు, అటల్ టింకరింగ్ ల్యాబ్‌లతో సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెరిగినట్లు విద్యార్థులు వెల్లడిస్తున్నారు. ఇక టోఫెల్ శిక్షణ పిల్లల భవిష్యత్‌కు ఎంతో ఉపయోగపడుతుందని, ఇవన్నీ ఎవరూ ఊహించని అద్భుతమైన సంస్కరణలని విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. ఆరోగ్య సంరక్షణ బాధ్యతలు కూడా.. ప్రతినెలా పాఠశాలలోనే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించడం, ప్రతి గురువారం రక్తహీనత గల పిల్లలకు ఫోలిక్ ఐరన్ మాత్రలు అందజేయడంతో గతంలో 30 శాతంగా ఉన్న రక్తహీనత బాధితులు ఇప్పుడు 10 శాతానికి తగ్గిపోయారు. కేవలం పిల్లల చదువులనే కాకుండా వారి ఆరోగ్య సంరక్షణ బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం గొప్ప విషయమని తల్లిదండ్రులు, విద్యావేత్తలు ప్రశంసిస్తున్నారు. విద్యా రంగ సంస్కరణల కోసం నాలుగున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.66,722.36 కోట్లు వ్యయం చేసింది. జగనన్న అమ్మ ఒడి, మనబడి: నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, పాఠ్యాంశాల సంస్కరణలు, విదేశీ విద్యాకానుక లాంటి పలు విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేసింది. పిల్లల అభ్యసన ఫలితాలను మెరుగుపరిచే లక్ష్యంతో సమగ్ర విద్యా, పరిపాలనా సంస్కరణలు తెచ్చింది. ప్రతి బడిలోనూ డబుల్ డెస్కు బెంచీలు, కుర్చీలు, బీరువాలు, టేబుళ్లు లాంటి ఫర్నిచర్, గ్రీన్ చాక్‌బోర్డులు, పాఠశాల మొత్తానికి పెయింటింగ్, ఇంగ్లిష్ ల్యాబ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం లాంటి వసతులు కల్పించింది. ఎంతో బాగుంది చాలామందికి ప్రభుత్వ స్కూళ్లంటే చిన్నచూపు. ఇన్నాళ్లూ మేమూ అలాగే అనుకున్నాం. మాది సొంతూరు విజయనగరం జిల్లా చీపురుపల్లి. గతంలో హైదరాబాద్‌లో మా బాబు నాగసాయి వంశీని ప్రైవేట్ స్కూల్లో చదివించాం. ఫీజుల మోతతోపాటు ఆటపాటలు ఉండేవి కాదు. రెండేళ్ల క్రితం ఉద్యోగ రీత్యా తుని వచ్చాం. కొద్దిగా సంకోచిస్తూనే మా బాబును శ్రీరాజా హైస్కూల్లో 9వ తరగతిలో చేర్చాం. ఏడాదిలోనే ఎంతో మార్పు కనిపించింది. గతేడాది టెన్త్‌లో 555 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచాడు. క్రీడల్లోను రాణించాడు. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లల్లో ఉన్న సదుపాయాలు కార్పొరేట్ స్కూళ్లల్లో కూడా లేవు. పుస్తకాలతో పాటు బ్యాగు, యూనిఫారం, బూట్లూ సమస్తం ఉచితంగా ఇచ్చారు. మధ్యాహ్నం చక్కటి భోజనం పెడుతున్నారు. ఇంట్లో కంటే బడిలోనే పిల్లలను బాగా చూసుకుంటున్నారు. – బసవరసు సంతోషి, తుని ఇంతకంటే ఏం కావాలి? నా భర్త వడ్రంగి పని చేస్తాడు. ప్రస్తుతం మా పాప తొమ్మిదో తరగతి, బాబు ఏడో తరగతి చదువుతున్నారు. ఖర్చులు తడిసి మోపెడైనా ఇంగ్లీష్ మీడియం ఉందనే ఆశతో ఇద్దరినీ ఐదో తరగతి దాకా ప్రైవేట్ స్కూళ్లలోనే చదివించాం. సీఎం జగన్ ప్రభుత్వం వచ్చాక సర్కారు స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని తెచ్చింది. దీంతో పిల్లలను రా>జా హైస్కూల్లో చేర్చాం. తల్లిదండ్రులతో సమావేశాలను నిర్వహిస్తూ ప్రతి నెలా పిల్లల పురోగతిని ఉపాధ్యాయులు తెలియచేస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. ఇక పుస్తకాల నుంచి యూనిఫారం వరకు అన్నీ ఉచితమే. సైన్స్ ప్రయోగాలు నేర్పిస్తున్నారు. రోజు ఇంగ్లిష్ పదాలను నేర్పిస్తున్నారు. ఆటలకూ ప్రాధాన్యం ఇస్తున్నారు. తల్లిదండ్రులకు ఇంతకంటే ఇంకేం కావాలి? – వేమవరపు హేమనాగలక్ష్మి. తుని ఏం జరుగుతోందో అంతా తెలుసు.. మా చిన్నమ్మాయి తేజస్విని తూరంగి జెడ్పీ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న మా పెద్దమ్మాయి కూడా ఇదే స్కూల్లో చదువుకుంది. గతంలో ఇలాంటి పథకాలే లేవు. అచ్చు పుస్తకాలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు బడి తెరిచిన రోజే అన్ని పుస్తకాలు, యూనిఫారం, బ్యాగుతో సహా ఇస్తున్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన అందుతోంది. మా ఇల్లు బడి పక్కనే ఉంది. అక్కడేం జరుగుతోందో నాకు బాగా తెలుసు. గత నాలుగేళ్లుగా చూస్తున్నా. ప్రభుత్వ బడి ఇంత చక్కగా మారుతుందని ఎప్పుడూ అనుకోలేదు. పేద పిల్లలకు ఇంగ్లిష్ చదువులు చెప్పించడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నా. – జక్కా యోగీశ్వరి, తూరంగి ఇక్కడే చదువుకున్నా.. 2007లో ఇదే జెడ్పీ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నా. మా అబ్బాయి కూడా ఇక్కడే టెన్త్ పూర్తి చేశాడు. మా అమ్మాయిలు రామతులసి, లక్ష్మి తులసి 9వ తరగతి చదువుతున్నారు. మా కాలానికి ఇప్పటికి బడి పూర్తిగా మారిపోయింది. అప్పట్లో కనీసం బాత్రూమ్ కూడా ఉండేది కాదు. పుస్తకాలకు ఇబ్బంది పడేవాళ్లం. ల్యాబ్ అంటే ఏమిటో తెలియదు. బెంచీలు కూడా పూర్తిగా ఉండేవి కావు. మధ్యాహ్నం భోజనం బదులు బియ్యం ఇచ్చేవారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ స్కూళ్లు పూర్తిగా మారిపోయాయి. ఐదు రోజులు పిల్లలకు గుడ్లు ఇస్తున్నారు. రోజుకో మెనూ చొప్పున పోషకాలు ఉన్న అన్నం వడ్డిస్తున్నారు. పుస్తకాలకు, యూనిఫారం కోసం ఇబ్బంది లేదు. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. మా ఇద్దరు పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చారు. అమ్మ ఒడి వస్తోంది. నేను చదువుకున్నప్పుడు కూడా ఇన్ని సదుపాయాలు ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. నిజంగా జగన్ సర్ గ్రేట్. – తంగిళ్ల నాలక్ష్మి, తూరంగి మరో ఐదేళ్లల్లో అద్భుతాలు దాదాపు 25 ఏళ్లకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత అద్భుతమైన మార్పులను చూస్తానని అనుకోలేదు. చదువులు పూర్తి స్నేహపూర్వక వాతావరణంలోకి మారిపోయాయి. నీటి సౌకర్యం ఉన్న బాత్రూమ్లు, శానిటరీ న్యాప్కిన్స్ పంపిణీతో ఆడపిల్లల డ్రాపౌట్లు ఆగిపోయాయి. మా స్కూల్లో 720 మంది పిల్లలు చదువుతున్నారు. 29 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్లో చదివే 80 మంది విద్యార్థులు ఈ ఏడాది ఇక్కడ చేరారు. గత నాలుగేళ్లుగా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు మరో ఐదేళ్లల్లో అద్భుతాలు సృష్టిస్తారనడంలో సందేహం లేదు. కార్పొరేట్ స్కూళ్లల్లో లేనన్ని సదుపాయాలు, బోధన ఇక్కడ అందుతున్నాయి. – కడలి లక్ష్మీదుర్గ, తూరంగి జెడ్పీ స్కూల్ హెచ్ఎం పూర్వ వైభవం తుని సమీపంలోని 40 గ్రామాల కోసం 1904లో ఈ హైస్కూల్ ఏర్పాటైంది. దాదాపు 50 ఏళ్ల పాటు ఎంతో ఉన్నతంగా నడిచింది. ప్రభుత్వంలో విలీనం అయ్యాక ఆ ప్రాభవం తగ్గిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు పూర్వ వైభవం వచ్చింది. ఇదే స్కూల్లో గతంలో టీచర్‌గా పనిచేశా. ఇప్పుడు హెచ్ఎంగా సేవలందిస్తున్నా. నాడు–నేడు కింద అదనపు గదులు నిర్మించారు. డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం సామాన్యులకు చేరువ కావాలని ఎన్నోసార్లు కోరుకున్నా. వాటితో పాటు టోఫెల్ శిక్షణను కూడా ప్రభుత్వం పేద పిల్లలకు చేరువ చేసింది. పూర్తిస్థాయిలో టీచర్లను ఇచ్చింది. విద్యార్థులు సైతం ఇంగ్లిష్ చదువుల్లో బాగా రాణిస్తున్నారు. ఇంత అద్భుతమైన మార్పులను చూస్తాననుకోలేదు. – టి.శేషగిరి శ్రీరాజా హైస్కూల్ హెచ్ఎం, తుని. ► ఎలక్ట్రికల్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకునే కాకినాడ జిల్లా తూరంగి వాసి పరమట శ్రీనుకు ముగ్గురు పిల్లలు. ఇంగ్లిష్ మీడియం కోసం వారిని ప్రైవేట్ స్కూళ్లలో చేర్చడంతో ఏటా రూ.90 వేలు ఖర్చయ్యేవి. ఇతర ఫీజులు పేరుతో మరో రూ.15 వేలు చెల్లించాల్సి వచ్చేది. రోజంతా కష్టపడితే రూ.500 సంపాదించే శ్రీను ఫీజులు కట్టడం ఆలస్యం కావడంతో ఆయన పిల్లలను బడి బయట నిలబెట్టిన సందర్భాలు ఎన్నో! ఇంటికొచ్చి పిల్లలు ఏడ్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇంత ఖర్చు చేసినా ప్రైవేట్ చదువులేమీ గొప్పగా లేవని శ్రీను గతాన్ని గుర్తు చేసుకున్నాడు. 2019 నుంచి ఆయన పిల్లల చదువుల భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ముగ్గురు పిల్లలను తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేర్చాడు. ఆయన పెద్ద కుమార్తెకు రెండేళ్లు జగనన్న అమ్మ ఒడి వచ్చింది. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతూ జగనన్న విద్యా దీవెన కింద ఉచిత విద్యను పొందడంతో పాటు వసతి దీవెన కింద రూ.20 వేలు అందుకుంటోంది. టెన్త్ చదివే రెండో పాపకు అమ్మ ఒడి అందుతోంది. ఉచితంగా, పుస్తకాలు, యూనిఫారంతో పాటు బూట్లు కూడా ఇచ్చారు. ఎనిమిదో తరగతి చదువుతున్న కుమారుడికి కూడా అన్ని సదుపాయాలు అందాయి. ఇంగ్లిష్ మీడియం చదువుల కోసం తపన పడ్డ ఈ తండ్రి ఆశలను ప్రభుత్వం నెరవేర్చింది. ట్యాబ్‌లు, డిజిటల్ బోధన లాంటి చక్కటి సదుపాయాలను కల్పించింది. ప్రైవేటు చదువులతో ఆర్థికంగా చితికిపోయిన శ్రీను గతంలో పిల్లల ప్రైవేటు చదువుల కారణంగా కొత్త దుస్తులు కూడా కొనుక్కోలేకపోయానని, నాలుగేళ్లుగా చదువుల ఖర్చు లేకపోవడంతో ఇప్పుడు సొంత ఇంటి నిర్మాణం చేపట్టినట్టు ఆనందంగా చెప్పాడు. ► కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తర కంచిలో ఇటుకల బట్టీని నిర్వహించే మొల్లేటి బేబి కుటుంబం గతంలో బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లింది. కుమారుడు ఆదిత్యవర్థన్‌ను రెండో తరగతి వరకు అక్కడే చదివించారు. ఫీజుల భారాన్ని తట్టుకోలేక తునిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఐదో తరగతి వరకు చదివించారు. ఇక్కడా అదే పరిస్థితి తలెత్తడంతో తునిలోనే శ్రీరాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతిలో చేర్చారు. ‘రెండేళ్ల నుంచి బాబులో మంచి మార్పు గమనిస్తున్నా. ప్రైవేట్ స్కూళ్లలో లేని ఎన్నో మంచి వసతులు ఇక్కడున్నాయి. ల్యాబ్‌ల్లో ప్రయోగాలు చేయిస్తున్నారు. చదువుల్లో, ఆటల్లో బాగా రాణిస్తున్నాడు. ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నారు. ప్రతి నెలా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి పిల్లల ప్రగతిని వివరిస్తున్నారు. మాలాంటి కుటుంబాలకు భారంగా మారిన పిల్లల చదువులను ప్రభుత్వమే తన బాధ్యతగా తీసుకోవడం ఎంతో గొప్ప విషయం. ప్రభుత్వ బడికి మారడంతో ఏటా ఫీజులు రూపంలో చెల్లించే రూ.50 వేల వరకు మిగులుతోంది. ఇంత గొప్ప సౌకర్యాలు, సదుపాయాలు, బోధన హైదరాబాద్‌లోని ప్రైవేట్ స్కూల్లో కూడా చూడలేదు’ అంటూ ఆమె సంతోషంగా చెబుతోంది. -
మాకు ఎన్నాళ్లీ శిక్ష?
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న తమను ఒకేచోటుకు బదిలీ చేయాలంటూ 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులు పిల్లలతో కలసి సోమవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన మౌనదీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉపాధ్యాయులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లు ఎక్కించడాన్ని ఉపాధ్యాయ దంపతులు తీవ్రంగా ప్రతి ఘటించారు. గాంధీ జయంతి సాక్షిగా ఈ తరహా పోలీసు దౌర్జన్యం సరికాదంటూ నినదించారు. 317 జీవో అమల్లో భాగంగా గతేడాది ఉపాధ్యాయ భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో కొన్ని జిల్లాల స్పౌజ్ కేసులను పరిష్కరించారు. కానీ ఇప్పటికీ 13 జిల్లాల స్పౌజ్‌ల బదిలీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి వారు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. తాము తీవ్ర మనోవేదనతో ఉన్నామని, కిలోమీటర్ల దూరంలో భార్య ఒకచోట, భర్త ఒకచోటపనిచేయడం సమస్యగా మారిందని, పిల్లల ఆలనాపాలన చూసే దిక్కులేకుండా పోయిందని ప్రభుత్వానికి విన్నవించారు. అయినప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మౌనదీక్షకు దిగారు. మాకెందుకీ అన్యాయం గత జనవరిలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు మాత్రమే చేపట్టారు. ఇంకా 1500 మంది బదిలీలకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను సానుభూతిలో పరిష్కరించాలి. – నరేశ్, స్పౌజ్ ఫోరంకో–కన్వీనర్ మానసిక క్షోభకు పరిష్కారం లేదా? గత 22 నెలలుగా ఉపాధ్యాయ దంపతులు బదిలీల్లేక మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారం లేదా అనే అనుమానం కలుగుతోంది. పెద్ద మనసుతో వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలి. – వివేక్, స్పౌజ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు -
అంగన్వాడీల సమ్మె యథాతథం
సాక్షి, హైదరాబాద్, ముషీరాబాద్: అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె య«థాతథంగా కొనసాగుతుందని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రానందువల్లే సమ్మెను కొనసాగిస్తున్నామని, సామాజిక మాధ్యమాల్లో సమ్మె విరమించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని పేర్కొంది. ఈ మేరకు జేఏసీ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఆయన వేతనాలను ఏమేరకు పెంచుతామనే అంశాన్ని స్పష్టం చేయలేదని పేర్కొంది. వేతనాల అంశాన్ని సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించినప్పుడు అంగన్వాడీలకు కూడా పెంచుతామని హామీ ఇచ్చారని వివరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్‌కు సంబంధించి టీచర్‌కు రూ.2 లక్షలు, హెల్పర్‌కు రూ.లక్ష ఇస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతిపాదనలు అమలు చేయాలని కోరితే మంత్రి హరీశ్‌రావు పరిశీలిస్తామని చెప్పారని, స్పష్టతనివ్వలేదని జేఏసీ నేతలు తెలిపారు. గ్రాట్యుటీ అంశాన్ని సాధ్యం కాదని మంత్రి తేల్చి చెప్పారని పేర్కొన్నారు. సమ్మె విరమించాలని మంత్రి హరీశ్‌రావు కోరారని, కానీ జేఏసీ మంత్రికి నిర్ణయాన్ని వెల్లడించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. ఈ నెల 4న ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంత్రి హరీశ్‌తో భేటీ అయిన వారిలో సీఐటీయూ నేతలు పి.జయలక్ష్మి, సునీత, ఏఐటీయూసీ నేతలు ఎన్.కరుణకుమారి, ఎం.సాయిశ్వరి, కె.చందన, జేఏసీ నేతలు భూపాల్, ఓ.ఈశ్వరరావు, ఏఐటీయూసీ కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య ఉన్నారు. మరింత పట్టుదలతో సమ్మె: ఏఐటీయూసీ నేత విజయలక్ష్మి అంగన్వాడీలు మరింత పట్టుదలతో సమ్మె కొనసాగించాలని ఏఐటీయూసీ జాతీయ నాయకురాలు బి.వి.విజయలక్ష్మి, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎం.డీ.యూసఫ్, ఎస్.బాలరాజులు పిలుపునిచ్చారు. వేతనాల పెంపుపై ప్రభుత్వం నుంచి సరిగ్గా హామీ రాకపోవడం, మిగిలిన డిమాండ్లపైనా స్పష్టత లేకపోవడంచో సమ్మె కొనసాగించాలని నిర్ణయించామని చెప్పారు. సోషల్ మీడియాలో సమ్మె విరమిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. -
అంగన్వాడీలకూ పీఆర్సీ ఫలాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాన్ని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా స్థిరీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటిస్తామని, ఇందులో భాగంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా వేతనాలు పెరుగుతాయన్నారు. ఆదివారం అంగన్వాడీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు, సీఐటీయూ, ఏఐటీయూసీ ప్రతినిధులు మంత్రి హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల డిమాండ్లు, ఇతర సమస్యలను మంత్రి ముందు ఉంచారు. దీనిపై హరీశ్ సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు త్వరలో ప్రభుత్వం ఇవ్వనున్న పీఆర్సీలో అంగన్వాడీలను చేర్చుతామని,ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలను కూడా పెంచుతామని భరోసానిచ్చారు. ఇతర డిమాండ్లపై సానుకూలంగా స్పందించి వాటిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని, ఈ డిమాండ్లపై నివేదికను సమర్పించాల్సిందిగా మహిళా శిశు సంక్షేమ కార్యదర్శి భారతి హోలికేరినీ ఆయన ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన పథకం బిల్లులను కూడా ప్రభుత్వం విడుదల చేసిందని, రెండు రోజుల్లో ఆయా ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి హరీశ్ వెల్లడించారు. -
టీచర్లకూ మూడేళ్లలో టెట్ అర్హత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్లకూ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై విద్యాశాఖ అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత సాధించి ఉండాలన్న నిబంధనపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు గడువు ఇస్తూ, పదోన్నతుల ప్రక్రియపై స్టే విధించింది. ఇప్పటికే మొదలైన పదోన్నతుల ప్రక్రియ కోర్టు ఉత్తర్వుల కారణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో సమస్యను ఎలా పరిష్కరించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. 2011 ముందు టెట్ అర్హత లేకుండా ఉపాధ్యాయులను ఇతర పరీక్షల ద్వారా నియమించారు. అలాంటప్పుడు టెట్ ఉత్తీర్ణత ఉండాలనే వాదన సరికాదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 2011కు ముందున్న టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2017లో టీచర్లుగా చేరిన వారు ఈ అంశంపై కోర్టులో సవాల్ చేశారు. తమిళనాడు కోర్టు కూడా టెట్ తప్పనిసరి అంటూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని రాష్ట్ర హైకోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో టీచర్ల పదోన్నతి అంశానికి టెట్ ముడిపడి ఉంది. అంతర్గత టెట్ నిర్వహణ రాష్ట్రంలో దాదాపు 1.03 లక్షల మంది టీచర్లున్నారు. వీరిలో 2017 తర్వాత నియమితులైన వారికే టెట్ అర్హత ఉంది. ఈ లెక్కన టెట్ అర్హత ఉన్నవాళ్లు 10 వేలకు మించి ఉండే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో టీచర్ల సంఘాలతో అధికారులు సంప్రదింపులు జరిపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేయాలని నిర్ణయించారు. మూడేళ్లలో ఉపాధ్యాయులంతా టెట్ అర్హత పొందేలా ప్రభుత్వపరంగా ఓ నిర్ణయం తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు. టీచర్లకు అంతర్గతంగా పరీక్షలు నిర్వహించి, టెట్ అర్హత పొందేలా చూడాలనే యోచనలో ఉన్నారు. ఇదే అంశాన్ని కోర్టుకూ విన్నవించాలని అధికారులు ఆలోచిస్తున్నారు. దీనిపై త్వర లో ఉన్నతస్థాయి సమావేశం జరిగే వీలుందని, అందులో నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. -
‘రంగారెడ్డి’లో నాన్‌లోకలే ఎక్కువ
సాక్షి, హైదరాబాద్: పదోన్నతులు.. ఉద్యోగ నియామకాల్లో కొన్నేళ్లుగా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరుగుతోందని ఆ జిల్లా ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలో భాగం కావడం వల్ల ఇతర జిల్లాల వారూ రంగారెడ్డి జిల్లాకే ప్రాధాన్యమిస్తున్నారు. ఉద్యోగరీత్యా దీర్ఘకాలం ఇక్కడే స్థిరపడడంతో వారి పిల్లలూ స్థానికులుగా గుర్తింపు పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ప్పుడు ఆంధ్ర, రాయలసీయ జిల్లాలకు చెందినవారు అప్పట్లో ఉద్యోగాలు పొంది ఇప్పటికీ ఇక్కడే కొనసాగుతున్నారు. తాతల కాలం నుంచి రంగారెడ్డి జిల్లాలో పుట్టి పెరిగిన స్థానికులకు నియామకాల్లో తీవ్ర అన్యాయం జరుగుతోందని నిరుద్యోగులు వాపోతున్నారు. తెలంగాణలో హెచ్ఆర్ఏ ఎక్కువ ఇచ్చే జిల్లాల్లో రంగారెడ్డి కూడా ఉంది. ఈ కారణంగా స్థానికేతరులు కూడా సీనియారిటీ ప్రాతిపదికన ఈ జిల్లానే ఎంచుకుంటున్నారు. గత ఏడాది అమలు చేసిన 317 జీఓ తర్వాత స్థానికులకు సరైన అవకాశాలే లేకుండాపోయామని ఆ జిల్లావాసులు చెబుతున్నారు. ఉదాహరణకు స్కూల్‌అసిస్టెంట్ బయోసైన్స్‌లో రంగారెడ్డికి, మహబూబ్‌నగర్‌లోని 64 మండలాల నుంచి కేడర్‌కు మించి కేటాయించారు. ఇతర సబ్జెక్టుల్లో కూడా కేడర్‌కు మించి టీచర్ల కేటాయింపులు జరిగాయి. ఇదిలా ఉంటే స్పౌజ్ కోటాతో సమస్య మరింత జటిలమైంది. భర్త, లేదా భార్య ఈ జిల్లాలో పనిచేస్తున్నట్టు చూపించి దాదాపు 400మంది ఇదే జిల్లాకు వచ్చారు. దీర్ఘకాలం వీరు కొనసాగడం వల్ల ఖాళీలు లేకుండా పోయాయి. దీంతో టెట్, జాతీయ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు పాసైన స్థానికులకు ఉద్యోగాలు పొందే అవకాశమే లేకుండా పోయింది. ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా నిరుద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
టీచర్లు, విద్యార్థులకు డిజిటల్ శిక్షణ అవసరం
సాక్షి, అమరావతి: డిజిటల్ పరికరాల వాడకంతో విద్యార్థుల సమయం దుర్వినియోగం కావడమే కాకుండా వ్యసనంలా మారే అవకాశం ఉందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), వలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థల ప్రతినిధులతో గురువారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సాంకేతిక యుగంలో డిజిటల్ వాడకానికి ప్రాధాన్యం పెరిగిందని, వాటిని సరైన రీతిలో వినియోగిస్తే ఎలాంటి హాని ఉండదని అన్నారు. సోషల్ మీడియా అతి వాడకం, తప్పుడు వార్తల ప్రభావం సైబర్ నేరాలకు పురిగొల్పుతాయని, స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ వంటి డిజిటల్ పరికరాలు, సోషల్ మీడియా వాడకం ప్రయోజనాలు, దు్రష్పయోజనాలపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయా అంశాలపై రూపొందించిన మాడ్యూళ్లు, పోస్టర్లను కమిషనర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాఠశాల విద్య డైరెక్టర్ పి.పార్వతి, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధులు డాక్టర్ ట్రాన్ మిన్హు ఎన్జెన్, సోఫియా భావన బి.ముఖోపాధ్యాయ్ డాక్టర్ నాన్సీ ప్రీత్ కౌర్, జేవీ మోహన్‌రావు, షేక్ ఇస్మాయిల్, ఆర్.మన్మోహన్ పాల్గొన్నారు. -
కలెక్టరేట్ల ముట్టడి ఉద్రిక్తం
సాక్షి, హైదరాబాద్/ కైలాస్‌నగర్ (ఆదిలాబాద్)/జగిత్యాల క్రైం/సుభాష్ నగర్ (నిజామాబాద్): అంగన్వాడీల్లోని టీచర్లు, హెల్పర్లు తలపెట్టిన సమ్మె పదోరోజూ ఉధృతంగా కొనసాగింది. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహించారు. టీచర్లు, హెల్పర్లు అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఈనెల 11వ తేదీ నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అంగన్వాడీ టీచర్ల కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీసు పెన్షన్, ఆరోగ్య పథకాలు వర్తింపజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో కలెక్టరేట్ల వద్ద ఆందోళనలకు దిగడంతో పోలీసులు వారిని నిలువరించి అరెస్టు చేశారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఉద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. ఆదిలాబాద్‌లో జుట్లు పట్టుకుని.. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వందలాదిగా తరలివచ్చిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తోపులాటలో పలువురు అంగన్వాడీలు, పోలీసులకు గాయాలయ్యాయి. అంగన్వాడీలను నిలువరించే క్రమంలో తలమడుగు ఎస్సై ధనశ్రీ ఓ అంగన్వాడీ జుట్టు పట్టుకుని నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీంతో పలువురు అంగన్వాడీలు ఎస్సై ధనశ్రీని జుట్టు పట్టుకుని లాక్కెళ్లారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నేతలు పలువురిని పోలీసులు అరెస్టు చేసి టూటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొంతమంది అంగన్వాడీలు స్టేషన్‌కు చేరుకుని బైఠాయించడంతో కొద్దిసేపటి తర్వాత వారిని విడుదల చేశారు. వారంతా తిరిగి కలెక్టరేట్ వద్దకు చేరుకుని నిరసన కొనసాగించడంతో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి వారి వద్దకు వచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కాగా సమ్మె శిబిరానికి చేరుకున్న తర్వాత బేల మండలం సదల్పూర్ అంగన్వాడీ టీచర్ ప్రగతి స్పృహ తప్పి పడిపోయింది. దీంతో ఆమెను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జగిత్యాలలో పోలీసులపై దాడి జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ముట్టడి కూడా ఉద్రిక్తతకు దారితీసింది. అంగన్వాడీలు లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు లు అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై దాడికి దిగడంతో పలువురు గాయపడ్డారు. బాధిత పోలీసుల ఫిర్యాదు మేరకు పలువురు అంగన్ వాడీలపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, సీఐటీయూ ఉపాధ్యక్షుడు ఈశ్వర్రావు తదితరులు అంగన్వాడీల ఆందో ళనకు సంఘీభావం తెలిపారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు కూడా అంగన్ వాడీ టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వారితో పాటు సీఐటీయూ నాయకులు గేట్లు ఎక్కి లోనికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి. -
బదిలీలకు 1,920 దరఖాస్తులు
నిర్మల్: జిల్లాలో ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతుల ప్రక్రియ వేగవంతమైంది. బదిలీ కోసం 1,920 మంది ఉపాధ్యాయులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గతంలో 1,780 మంది దరఖాస్తు చేసుకోగా తాజాగా 140 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఎంఈవోల ద్వారా తమ హార్డు కాపీలను డీఈఓ కార్యాలయానికి పంపించారు. ఆ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించేందుకు అధికారులు సీనియర్ పీజీ ప్రధానోపాధ్యాయులతోపా టు, ఉపాధ్యాయులను కమిటీగా నియమించారు. -
ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ఉపాధ్యాయులు
సాక్షి, హన్మకొండ: ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు.. మహా అయితే నలుగురు ఒకే వృత్తిని ఎంచుకోవడం సాధారణం. కానీ ఒకే కుటుంబం నుంచి ఏకంగా 78 మంది ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు. బెంజిమన్ అనే వ్యక్తికి చెందిన నాలుగు తరాలకు చెందిన 78మందికి బుధవారం హనుమకొండ కంచరకుంటలోని సెయింట్‌పాల్ హైస్కూల్ చైర్మన్ ఎం.ఆనంద్ ఆహ్వానం పంపగా 22మంది హాజరయ్యారు. వీరిని గురుపూజోత్సవం సందర్భంగా సన్మానించారు. బెంజిమన్ తండ్రి మోజెస్ బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. 1901లో బెంజిమన్ కుటుంబ సమేతంగా హనుమకొండలో స్థిరపడ్డారు. ఆయనకు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: చంటి బిడ్డను చేతులపై ఎత్తుకుని వాగు దాటించిన బాబాయి -
ఎల్లో మీడియా నా వ్యాఖ్యల్ని వక్రీకరించింది: మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: గురువులు కన్నా గూగుల్ మేలని తాను అనలేదని, తాను అలా అన్నట్టు వచ్చిన వార్తలను ఖండిస్తున్నానని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ఒంగోలులో ఉపాధ్యాయ దినోత్సవ సభలో తాను మాట్లాడింది ఒకటైతే.. మీడియా దానిని వక్రీకరించి ఉపాధ్యాయ లోకానికి తప్పుడు సంకేతాలు పంపి తనపై వ్యక్తిగత దాడికి దిగే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తాను ఉపాధ్యాయుడిగా ఉండాలని గర్వపడతానని అదే సభలో మాట్లాడింది వినిపించలేదా.. అని ప్రశ్నించారు. మారుతున్న కాలానికనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ఇంటర్నెట్ సౌలభ్యంతో సమాచారం అంతా దొరుకుతున్న ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులే అనే ఉద్దేశంలో తాను మాట్లాడినట్టు తెలిపారు. టెక్నాలజీ పెరిగిపోయి మారిన కాలానికి అనువుగా సమాచారాన్ని గూగుల్ తల్లిని అడిగి తెలుసుకున్నానన్నారు. గూగుల్‌ను సృష్టించింది కూడా గురువులే కదా.. అని ఆయన ప్రశ్నించారు. తాను గురువులను కించపరిచేలా మాట్లాడలేదని, తన తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం పైన, తనపైన.. మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా తనపై ఎల్లో మీడియా బురద జల్లుతోందని, దీనిని నమ్మొద్దని ఉపాధ్యాయులను కోరారు. అనని మాటలను వక్రీకరించి పత్రికల్లో ప్రచురించుకునే సంస్కృతి మంచిది కాదని మంత్రి సురేష్ హితవు పలికారు. చదవండి: ఐటీ నోటీసులు: అరెస్టు.. పదేళ్ల జైలు! -
సానపెడితే పిల్లలు జాతిరత్నాలే!
సాక్షి, హైదరాబాద్: సరైన రీతిలో సానబడితే ప్రతీ విద్యార్థి జాతిరత్నమేనని.. అది కేవలం ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో గురుపూజా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబిత మాట్లాడారు. లక్షల మంది విద్యార్థులు, లక్షకుపైగా టీచర్లున్న విద్యా శాఖ ఓ పెద్ద కుటుంబమని.. గురుపూజోత్సవం తమకు ఓ పెద్ద పండుగ అని పేర్కొన్నారు. ఎవరు, ఎంత ఎత్తుకు ఎదిగినా వారికి చదువు నేర్పిన మాస్టార్లు గుండెల్లో శాశ్వతంగా ముద్ర పడిపోతార న్నారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం ప్రతి టీచర్ అంకిత భావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నాం: కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద పీట వేస్తోందని హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మనఊరు మనబడి ఓ విప్లవాత్మక పథకమని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. కాగా సాంకేతికపరంగా విద్యా రంగంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే దిశగా అధ్యాపకులు అడు గులు వేయాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన 128 మంది టీచర్లను సత్కరించారు.ఎమ్మెల్సీలు కూర రఘో త్తమరెడ్డి, ఏవీఎన్ రెడ్డి, సురభివాణి, వర్సిటీల వీసీలు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
విద్యార్థులే ఊపిరిగా..
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మందమతులేం కాదు, తెలివైన, చురుకైన వారు. విద్యార్థులే కాదు టీచర్లు కూడా నిరంతరం నేర్చుకుంటూనే ఉంటారు’’ అంటోంది నేషనల్ గుడ్ టీచర్ అవార్డు గ్రహీత మాలతీ టీచర్. దేశవ్యాప్తంగా యాభైమంది ఈ అవార్డు అందుకోగా అందులో మాలతీ టీచర్ ఒకరు. తమిళనాడులోని సెంగోటై్టలో పుట్టి పెరిగిన మాలతి నల్లాసైతిరా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభాస్యం పూర్తిచేసింది. మనస్తత్వ, రసాయన శాస్త్రాల్లో మాస్టర్స్ చేసింది. రసాయనశాస్త్రంలో పీహెచ్డీ చేస్తూ టీచర్‌గా పనిచేస్తోంది. 2008లో తిరుపూర్ పెరుమతూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా చేరింది మాలతి. అక్కడ మూడేళ్లు పనిచేశాక బదిలీ అవ్వడంతో తెన్కాసి గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో టీచర్‌గా వెళ్లింది. ఇక్కడ ఏడాది పనిచేశాక ప్రమోషన్ రావడంతో వీరకేరళంబుదూర్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో పోస్టుగ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్‌గా చేరింది. గత పదేళ్లుగా ఇదే స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేస్తూ విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా పాఠాలు చెబుతూ వారి మనసులో సుస్థిరస్థానాన్ని సంపాదించుకుంది. ఆటపాటలతో... పాఠాలు విద్యార్థులు సైన్స్సబ్జెక్టుని ఇష్టపడాలని మాలతి కోరిక. అందుకే ఎంతో కష్టమైన చాప్టర్లను సైతం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధిస్తోంది. విలువిద్య, తోలుబొమ్మలాట, పాటలు పాడడం, నృత్యం, కథలు చెప్పడం ద్వారా సైన్స్ పాఠాలను వివరిస్తోంది. కరోనా సమయంలో ఇళ్లకే పరిమితమైన విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల ద్వారా బోధించింది. గ్రామాల్లో మొబైల్ ఫోన్స్ లేని అంధవిద్యార్థులకు సైతం ఆడియో పాఠాలను అందించింది. నూటపద్దెనిమిది మూలకాల పట్టికను సైతం కంఠస్థం చేయాలన్న ఆసక్తి ఉన్న వారికి చక్కగా నేర్చుకునేందుకు సాయపడుతోంది. మేధో వైకల్యాలున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వీరు కూడా మంచి ఉత్తీర్ణత సాధించేలా కృషిచేస్తోంది. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి వారి నైపుణ్యాలను మెరుగుపరుస్తోంది. ఇలా మాలతీ టీచర్ సాయంతో సైబుల్ ఇస్లాం అనే మేధోవైకల్య విద్యార్థి 25 సెకన్లలో 20 ద్రవాల పేర్లు టకటకా చెప్పి ‘చోళన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కించుకున్నాడు. ఇస్లాంకు మాలతీ ఆరునెలలపాటు శిక్షణ ఇచ్చింది. మహేశ్వరి, కరణ్, శక్తి ప్రభ వంటి విద్యార్థులు సైతం సెకన్ల వ్యవధిలో నూటపద్ధెనిమిది మూలకాల పీరియాడిక్ టేబుల్‌ను అప్పచెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్‌లో చోటు దక్కించుకున్నారు. అరవైశాతం మేధో వైకల్యం కారణంగా సరిగా మాట్లాడలేని వారితో సైతం మూలకాల పేర్లను కంఠస్థం చేయించి, గడగడా చెప్పించడం విశేషం. అవార్డులు రికార్డులు... విద్యార్థులను రికార్డుల బుక్‌లో చోటుదక్కించుకునేలా తయారు చేయడమేగాక మాలతీ కూడా కరోనా సమయంలో ఐదువందల రోజులు ఉచితంగా ఆన్లైన్ తరగతులు చెప్పి చోళన్ వరల్డ్ రికార్డు బుక్ లో చోటు దక్కించుకుంది. మాలతి కృషిని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2020–2021 సంవత్సరానికిగాను డాక్టర్ రాధాకృష్ణన్ అవార్డుతో సత్కరించింది. 2022లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఇరవై ఆరుగంటలపాటు నిరంతరాయంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఆరోతరగతి నుంచి పై తరగతులకు పాఠాలు బోధించే మాలతీ తనకు వచ్చిన నగదు బహుమతితో విద్యార్థులకు రోటోటిక్స్ కిట్స్ కొని ఇచ్చింది. గేమ్‌లకు బానిసలు కాకుండా... స్మార్ట్ఫోన్లు వచ్చాక విద్యార్థులంతా మొబైల్ గేమ్స్‌కు అంకితమైపోతున్నారు. వీరిని ఆడుకోనిస్తూనే పాఠాలు నేర్పించడానికి మాలతి క్విజ్గేమ్ వాయిస్ యాప్‌ను రూ΄÷ందించింది. ఈ యాప్‌ను స్టూడెంట్స్‌తోనే తయారు చేయించడం విశేషం. దీనిలో పీరియాడిక్ టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో విద్యార్థుల పేర్లు, ఇంగ్లిష్‌లోని కష్టమైన పదాలను వెతుకుతూ నేర్చుకోవచ్చు. విద్యార్థులకు నేర్పిస్తోన్న పాఠాలను వారి తల్లిదండ్రులు చూసేలా యూట్యూబ్‌లో పోస్టుచేస్తూ వారి ఉన్నతికి కృషిచేస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది మాలతి టీచర్. ‘‘బోధనే నా శ్వాస, విద్యార్థులే నా ఊపిరి. డాక్టర్లు, టీచర్లకు రిటైర్మెంట్ ఉండదు. అధికారికంగా రిటైర్ అయినప్పటికీ ఆ తరువాత కూడా స్టూడెంట్స్ కోసం పనిచేస్తాను. నేను సైకాలజీ చదవడం వల్ల విద్యార్థుల్ని, వారి వైకల్యాలను అర్థం చేసుకుని పాఠాలు చెప్పగలుగుతున్నాను. ప్రతి ఒక్క టీచర్ సైకాలజీ చదివితే మరింత చక్కగా బోధించగలుగుతారు. నేషనల్ గుడ్ టీచర్ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను నేర్చుకుంటూ, విద్యార్థులకు నేర్పించడమే నా జీవితాశయం’’ అని మాలతీ టీచర్ చెబుతోంది. -
గురువు ‘లఘువు’ కాకూడదు!
‘తరగతి గది ప్రపంచానికి అద్దం వంటిది. విద్యార్థి అభివృద్ధి అక్కడ నుంచే మొదలవుతుంది. నిజమైన ఉపాధ్యాయుడు ప్రపంచాన్ని తన తరగతి గదిలోకి తీసుకురాగలడు’ అంటాడు ఓ ప్రముఖ తత్వవేత్త. ఉపాధ్యాయుని ‘గురు’తర బాధ్యతనూ, వృత్తి గౌరవాన్నీ వ్యక్తం చేసేందుకు ఈ ఒక్కమాట చాలు. అయితే చదువుకు కేంద్ర బిందువు అయిన ‘గురువు’ మాత్రం ‘లఘువు’గా మారాడన్న అపవాదు మోస్తున్నాడు. గురు భావన వేద కాలం నుంచి ప్రస్తావనలో ఉంది. తమ గురించి తాము బాగా తెలిసిన గురువులు మంచి శిష్యుల కోసం చూసేవారట. శిష్యులు కూడా అటువంటి గురువునే ఆశ్రయించి శుశ్రూష చేస్తూ జ్ఞానార్జన చేసేవారట. ‘నిజమైన గురువు జ్ఞాన రంగంలో నిష్ణాతుడు కావాలి. వేదాలు అభ్యసించిన వాడ వ్వాలి. అసూయ లేనివాడు, యోగం తెలిసినవాడు, సరళమైన జీవితాన్ని గడిపేవాడు, ఆత్మజ్ఞానాన్ని పొందినవాడు అయివుండాలి’ అంటూ నాటి సమాజం గురు వుకు అత్యున్నత స్థానం కట్టబెట్టి గౌరవించింది. గురువు నైపుణ్యాల బోధకుడు. మానసిక విశ్లేషకుడు. విలువలు అలవర్చడం, అనుభవా లను వివరించడం అతని బాధ్యత. అన్ని విషయాలపై అవగాహనకల్పించి శిష్యుడిని సర్వసమగ్రంగా తీర్చేదిద్దే శిక్షకుడు గురువు. అక్షర జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక అంశాల వరకు, యుద్ధ కళల నుంచి సంగీత, సాహిత్య, చిత్రకళల వరకు గురుకులాల్లో బోధన జరిగేది. ఊహ తెలిసిన తర్వాత గురు కులంలోకి ప్రవేశించిన విద్యార్థి యుక్తవయసు నాటికి అన్ని కళల్లో ఆరితేరి తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరేవాడు. సూర్యు నిలా ప్రకాశించే గురువు అంతే ప్రకాశవంతంగా శిష్యుని తీర్చి దిద్దేవాడని వేదాలు చెప్పాయి.నేటి కాలానికి వస్తే – ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులు తమ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించడం, లక్ష్యం మేరకు విధులు నిర్వహించడంలో పలు సవాళ్లు ఎదుర్కోవాల్సి రావడం వాస్తవమే అయినా... ఉన్నంతలో తమ విధులు నిర్వ హించడంలో చాలామంది ఉపాధ్యాయులు విఫలమవుతూ చిన్న చూపుకు గురవుతున్నారు. చదువుకోవడం ఒకప్పుడు గౌరవ ప్రదమైన కార్యక్రమం. ఇప్పుడు ప్రాథమిక హక్కు. ఉచిత నిర్బంధ విద్యతో మొదలైన ప్రభుత్వాల కృషి నేడు ‘హక్కు’ అమలుకు పటిష్టంగా కొనసాగుతోంది. కనీస సదుపాయాలు లేవనో, ఉపకరణాలు అందుబాటులో ఉండడం లేదనో, సరిపడే సిబ్బందిని నియ మించడం లేదనో చెప్పి ఉపాధ్యాయులు నిందను ప్రభుత్వం మీదకు తోసేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సమ స్యలు లేవని చెప్పలేకున్నా గతకాలంతో పోల్చితే ఇప్పుడు విద్యపై ప్రభుత్వాల శ్రద్ధ పెరిగింది. నిధుల కేటాయింపు అధిక మయ్యింది. సదుపాయాలు, ఉపకరణాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిస్థితుల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకుకృషి చేయాలని ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. మొక్కుబడి ఫలితాలపై కాకుండా వాస్తవ అభివృద్ధి సాధించాలని కోరుతోంది. ఆధునిక విద్య అందరికీ అందించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. కానీ పెట్టుబడి పెట్టడం వరకే ప్రభుత్వం చేయగలదు. క్షేత్ర స్థాయిలో అమలు బాధ్యత ఉపాధ్యా యులదే. ఉన్న వనరులను సద్విని యోగం చేసుకుంటూ విద్యార్థులను తీర్చి దిద్దినప్పుడు వారికి ఆత్మసంతృప్తితోపాటు ప్రజల నుంచి హర్షామో దాలు వ్యక్తమవుతాయి. ఇందుకు ఆధునిక బోధనా విధానాలు, మూల్యాంకనా విధానాలతో పాటు జాతి నిర్మాణానికి ఉపయుక్తమయ్యే తాజా కరికులంపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పర్చుకుని లక్ష్య సాధనకు ఉపాధ్యా యులు సిద్ధపడాలి. ఉపాధ్యాయుడు నిరంతర అభ్యాసకుడు, పరిశోధకుడు అయినప్పుడు మాత్రమే మంచిఫలితాలు సాధ్యమవుతాయి. ఆధునిక అవసరాలు, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని తమను తాము అందుకు సన్నద్ధం చేసుకుంటూ భావి భారత పౌరులను తీర్చిదిద్దేందుకు సిద్ధం కావాలి. క్షేత్ర స్థాయిలో ఇది కనిపించినప్పుడే ఉపాధ్యాయులకు గౌరవం. – బి.వి. రమణమూర్తి, టీచర్, విశాఖపట్నం (నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి; ఉపాధ్యాయ దినోత్సవం) -
అభిమాన సంపన్నులు
విద్యావంతులైన వాళ్లు ఎవరైనా జీవితాంతం తమ గురువులను స్మరించుకుంటారు. మన దేశంలో గురుశిష్య పరంపర వేదకాలం నుంచి ఉంది. పాశ్చాత్య నాగరికతల్లో కూడా క్రీస్తుపూర్వం నుంచే గురుశిష్య పరంపర కొనసాగేది. విద్య నేర్పించే గురువులే లేకుంటే, ఈ ప్రపంచం ఇంకా అజ్ఞానాంధకార యుగంలోనే మిగిలి ఉండేదేమో! గురువులు లేని లోకాన్ని ఊహించుకోలేం. గురువులు ఊరకే పాఠాలను వల్లెవేయించడమే కాదు, భావితరాలను జ్ఞానసంపన్నులుగా తీర్చిదిద్దుతారు. పరోక్షంగా సమాజాన్ని మెరుగుపరుస్తారు. బడిలో చేరిన పిల్లల మీద తల్లిదండ్రుల కంటే గురువుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో గురువుల మీద అమితమైన గురి ఉంటుంది. ‘ఎలా ఆలోచించాలో తెలిసిన వాళ్లకు అధ్యాపకుల అవసరం లేదు’ అని మహాత్మాగాంధీ అన్నారు. అయితే, అమాయకపు బాల్యావస్థలో ఆలోచనను పదునెక్కించే గురువులు అత్యవసరం. జీవితాన్ని ప్రభావితం చేసే మానవ సంబంధాల్లో గురుశిష్య సంబంధం ప్రత్యేకమైనది. లోకంలో ఎందరో ఉత్తమ గురువులు, వారు తీర్చిదిద్దిన ఉత్తమ శిష్యులు ఉన్నారు. వారందరూ గతించిపోయినా, వారి చరిత్రను జనాలు చర్వితచర్వణంగా ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉంటారు. మన పురాణాల్లోనూ గురుశిష్యుల కథలు కొల్లలుగా కనిపిస్తాయి. పురాణాల్లో దేవతలకు బృహస్పతి, రాక్షసులకు శుక్రాచార్యుడు గురువులుగా వాసికెక్కారు. అవతార పురుషులైన రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు, బలరామకృష్ణులకు సాందీపని మహర్షి గురువులుగా ఉండేవారు. పురాణ గురువుల్లో మిగిలినవారిదంతా ఒక ఎత్తు అయితే, ప్రహ్లాదుడికి పాఠాలు చెప్పిన చండా మార్కుల వారిది మరో ఎత్తు. దండోపాయాన్ని సాధనంగా ఎంచుకున్న తొలిగురువు బహుశా ఆయనే! చండామార్క వారసులైన గురువులు అక్కడక్కడా తారసపడుతుంటారు. మనుషుల్లో ఉండే వైవిధ్య వైరుద్ధ్యాలు గురుశిష్యుల్లోనూ కనిపిస్తాయి. గురువులందరూ ఉత్తములేనని, శిష్యులందరూ ఆణిముత్యాలేనని చెప్పలేం. గురువుల్లో ఔదార్యమూ, ఉదాత్తతలతో పాటే స్వార్థ సంకుచిత లక్షణాలూ కనిపిస్తాయి. గురువులు కూడా మానవ మాత్రులే! ఏకలవ్యుడి బొటన వేలును గురుదక్షిణగా కోరిన ద్రోణుడు మనకు తెలుసు. గురువుకే పంగనామాలు పెట్టిన ఆషాఢభూతి కూడా మనకు తెలుసు. గురజాడవారి ‘కన్యాశుల్కం’లోని గిరీశం ఆషాఢభూతికి ఏమీ తీసిపోయే రకం కాదు. కాకుంటే, అతగాడు గురుత్వం వెలగబెట్టాడు. గిరీశం శిష్యరికంలో వెంక టేశానికి చుట్ట కాల్చడం పట్టుబడిందే గాని, చదువు ఒంటబట్టలేదు. అయితే, మన దేశంలో వివిధ రంగాల్లో రాణించిన గురువులు, గురువులకు గర్వకారణంగా నిలిచిన శిష్యులు ఎందరో ఉన్నారు. సాహితీరంగంలో తమదైన ముద్రవేసిన గురుశిష్యులు కొందరు ఇప్పటికీ ప్రస్తావనల్లోకి వస్తుంటారు. అటువంటి గురుశిష్యుల్లో మొదటగా చెప్పుకోవల సిన వారు – తిరుపతి వేంకట కవుల్లో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, ఆయన శిష్యుడు విశ్వనాథ సత్యనారాయణ. వారిద్దరూ అరుదైన గురుశిష్యులు. పాండితీ ప్రాభవంలోను, కవన శైలిలోనూ ఇద్దరూ ఇద్దరే! చెళ్లపిళ్లవారి గురించి విశ్వనాథ ఒక చమత్కార పద్యం చెప్పారు. అది: ‘అల నన్నయకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం డలఘుస్వాదు... బ్రాహ్మీమయమూర్తి శిష్యు డైనా డన్నట్టి దావ్యోమపే శలచాంద్రీ మృదుకీర్తి చెళ్లపిళవంశస్వామి కున్నట్లుగన్’. నన్నయకు, తిక్కనకు తన వంటి శిష్యులెవరూ లేరని, తన గురువైన చెళ్లపిళ్ల వారికే ఆ వైభోగం, కీర్తి దక్కాయని సగర్వంగా చెప్పుకున్నారు విశ్వనాథ. అధ్యాపక వృత్తిలో కొనసాగిన విశ్వనాథకు ఎందరో ప్రత్యక్ష శిష్యులే కాకుండా, మరెందరో పరోక్ష శిష్యులూ ఉన్నారు. విశ్వనాథను శ్రీశ్రీ ‘కవికుల గురువు’గా ప్రస్తుతించడమే కాదు, ‘తెలుగువాళ్ల గోల్డు నిబ్బు’గా అభివర్ణించారు. ఒకానొక సందర్భంలో ‘నా వంటి కవి మరో వెయ్యేళ్ల వరకు పుట్టడు’ అని విశ్వనాథ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా శ్రీశ్రీ ‘నిజమే! వారు పుట్టి వెయ్యేళ్లయింది’ అని వ్యాఖ్యానించడం ఒక వైచిత్రి. తొలినాళ్లలో శ్రీశ్రీపై విశ్వనాథ ప్రభావం ఉండేది. తర్వాతికాలంలో అబ్బూరి రామకృష్ణారావు శ్రీశ్రీపై ఎనలేని ప్రభావం చూపారు. అబ్బూరి వద్ద శ్రీశ్రీ నేరుగా తరగతిలో పాఠాలు నేర్చుకోకపోయినా, వారిద్దరిదీ గురుశిష్య సంబంధమే! సాహితీ లోకంలో మెరికల్లాంటి శిష్యులను తయారుచేసిన మరో గురువు పుట్టపర్తి నారాయణాచార్యులు. రాచమల్లు రామచంద్రారెడ్డి, నరాల రామారెడ్డి వంటి ఉద్దండులు ఆయన శిష్యులే! ఇక భద్రిరాజు కృష్ణమూర్తి భాషాశాస్త్ర ఆచార్యులుగా సుప్రసిద్ధులు. బూదరాజు రాధాకృష్ణ, చేకూరి రామారావు, తూమాటి దొణప్ప వంటి శిష్యులను ఆయన తీర్చిదిద్దారు. ఎందరో గురువులు ఉన్నా, శిష్యుల మనసుల్లో చెరగని ముద్రవేసే వారు కొందరే ఉంటారు. అలాంటి వారే ఉత్తమ గురువులుగా చరిత్రలో గుర్తుండిపోతారు. మన దేశానికి రెండో రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యాపకుడిగా ఎందరో శిష్యులను తయారు చేశారు. ఆయన మైసూరు విశ్వవిద్యాలయం నుంచి కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్లేటప్పుడు ఆయనను గుర్రపు బండిలో కూర్చోబెట్టి శిష్యులే స్వయంగా బండిని లాక్కుంటూ వెళ్లి మరీ మైసూరు రైల్వేస్టేషన్లో సాగనంపారు. అదీ రాధాకృష్ణన్ ఘనత! రేపు రాధాకృష్ణన్ పుట్టినరోజు. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. గురువుల ఘనతకు శిష్యుల అభిమానమే గీటురాయి! జీతంరాళ్ల కంటే శిష్యుల అభిమాన ధనమే అసలైన సిరిసంపదలుగా తలచే గురువులు ఉంటారు. అలాంటి వాళ్లే ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెస్తారు. -
ఆదర్శగురువులెందరో..వారందరికీ ప్రణామం!
పుట్టుకతో మనిషీ, మనసూ వేరువేరు. అవి అనివార్యంగా మిళితం కావాలన్నా.. ఒకదానితో ఒకటి మమేకమై, ముందుకు సాగాలన్నా..ఆదర్శవంతమైన మార్గదర్శి వెన్నంటే ఉండాలి. తొలి తొలిగా తల్లి వెచ్చని పొత్తిళ్లు ప్రేమానుబంధాలను వల్లెవేస్తాయి. ఆపై, తండ్రి గుండె చప్పుళ్లు నిశ్చింతగా బుడిబుడి నడకలను నేర్పిస్తాయి. కాస్త ఊహ తెలిసి, ఊసులెరిగి, ఉబలాటంతో ఊగిసలాడే పసిమనసుకి..కళ్లెం వేసినట్లు, కంచె కట్టినట్లు.. అప్పుడు ఎదురొస్తారు గురువులు. మొక్కను వంచి మానును చేస్తారు. ఈ లోకంలో కాలం మెచ్చిన ఆదర్శగురువులెందరో.. గురువును మించిన శిష్యులూ అందరే! అదే గురువు ఘనతకు ప్రతీతి. ఓం సహనావవతు, సహనౌభునక్తు, సహవీర్యం కరవావహై! తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై! భావం: గురుశిష్యుల మధ్య బంధాన్ని తెలిపే శ్లోకమిది. ఒకప్పటి గురువుల ఆశ్రమాల్లోనూ.. ఇప్పటికీ కొన్ని గురుకులాల్లో గురుశిష్యులు కలసి చెప్పుకునే శాంతి మంత్రమిది. ‘ఆ భగవంతుడు గురుశిష్యులమైన మనిద్దరినీ రక్షించును గాక.. మనిద్దరినీ వృద్ధి చేయును గాక.. మనిద్దరికీ ఈ అధ్యయనానికి అవసరమైన శక్తిని పెంపొందించు గాక.. మనం చదివేది, నేర్చుకునేది మనిద్దరికీ వెలుగుని ఆపాదించు గాక.. మన మధ్యలో విభేదాలు తలెత్తకుండా ఉండు గాక’ ఇదే ఈ శ్లోకతాత్పర్యం. దీన్ని బట్టి బోధన అనేది ఎంతటి పవిత్రతను ఆపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు!‘మనిషి తలరాతలను రాసేవాడు విధాత. తరాల తలరాతలను మార్చగలిగేవాడు విజ్ఞానదాత’ అనేది లోకోక్తి. ‘నీ కులమేదైనా, నీ మతమేదైనా నువ్వు చదువుకున్నవాడివైతే చాలు.. ఈ సమాజం నీకో కుర్చీ వేసి కూర్చోబెడుతుంది’ అంటారు సమాజోద్ధారకులు. ‘గురువు, దేవుడు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను. ఎందుకంటే, దేవుడ్ని నాకు పరిచయం చేసింది నా గురువే కనుక’ అన్నాడు రామభక్తుడైన కబీర్ దాస్. ఇవన్నీ కేవలం సూక్తులు కాదు గురుబోధలు. తరచి చూస్తే ఈ ప్రపంచం మొత్తం గురుకృపతోనే నిండి ఉంది. ప్రతి అణువూ జ్ఞానాన్నే పంచుతుంది. దాన్ని ఆస్వాదించే వినమ్రత మనలో ఉండాలంతే! గురుచరిత్ర మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునులను అసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. అరణ్యపర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలో యక్షుడు ‘మనిషి మనీషిగా ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తే ‘గురువు కారణంగా, అధ్యయనంతో మాత్రమే’ అని బదులిచ్చాడు. గురువు శక్తి అంత గొప్పది. పాశ్చాత్య నాగరిక చరిత్రను తిరగేస్తే.. గ్రీకు దేశానికి చెందిన సోక్రటీస్ తత్వబోధకు ఆద్యుడు. గురువుగా ఆయన ప్రభావం ప్లాటో మీదే కాదు.. ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్పైన కూడా ఎంతో ఉంది. ఈ గురుపరంపరలోని అరిస్టాటిల్ వద్ద జగజ్జేత అలెగ్జాండర్ చదువుకున్నాడు. భరతఖండంలో వేదాల వ్యాప్తి మొదలైనప్పటి నుంచి గురుబోధన కొనసాగింది కాబట్టే నాటి జ్ఞానం నేటికీ తార్కాణమైంది. హరప్పా నాగరికత బయటపడిన తర్వాత సింధు లిపి, శాసనాలు కూడా గురుప్రస్థానానికి నిదర్శనమేనని చెప్పుకోవాలి. శివాజీ అనే వీరుడ్ని సమర్థ రామదాసు చెక్కితే, ఆధ్యాత్మిక శిఖరమైన వివేకానందుడ్ని రామకృష్ణ పరమహంస మలచారు. అలా పుట్టుకొచ్చాయి పంచతంత్ర కథలు మౌర్యరాజ్య స్థాపకుడు చంద్రగుప్తుని గురువు చాణక్యుడు. ఆనాటి నలంద విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగానికి అధ్యక్షుడు. ఆ సమయంలోనే ఆయన చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన ‘అర్థాన్ని’ గురించి అర్థశాస్త్రాన్ని రచించాడు. మరోవైపు 5, 6 శతాబ్దాల్లో నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు బౌద్ధుల విజ్ఞాన కేంద్రాలుగా విరాజిల్లాయి. ఆ రెండు విశ్వవిద్యాలయాల్లో చదివినవాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధిగాంచారు. కొన్ని వేలమంది విదేశీ విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వచ్చేవారు. అమరశక్తి అనే దక్షిణ భారత రాజు.. తన పుత్రులకు విద్యాబుద్ధులు నేర్పించమని వృద్ధుడైన విష్ణుశర్మని కోరడంతోనే ‘పంచతంత్ర కథలు’ పుట్టుకొచ్చాయి. అవి ఎన్నో ప్రపంచ భాషలలోకి తర్జుమా అయి, ఎంతో ప్రాచుర్యం పొందాయి. బ్రిటిష్‌కాలంలో ఆధునిక విద్యాలయాలు మొదలైనా, ఆ కాలంలోనూ మన దేశంలో సంప్రదాయబద్ధమైన గురుకులాలు చాలానే నడిచేవి. నిజాం రాజ్యంలో ‘అఘోరనాథ ఛటోపాధ్యాయ’ నిజాం కాలేజ్ తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. దేశంలో స్త్రీ విద్య కోసం తప్పించిన తొలిగురువు సావిత్రిబాయ్ పూలే. ఆమె బోధన కృషిని తరతరాలూ స్మరించుకుని తీరాల్సిందే. కట్టమంచి రామలింగారెడ్డి నాటి విద్యావేత్తల్లో ప్రసిద్ధుడు. మైసూరు విశ్వవిద్యాలయ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్‌చాన్సలర్‌గా పనిచేశారు. రవీంద్రనాథ్ టాగోర్ స్థాపించిన శాంతినికేతన్ లోనే ఎందరో ప్రముఖులు ఆరితేరారు. భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో ఒకరైన మౌలానా అబుల్‌కలాం ఆజాద్ స్వయంగా కవి, పండితుడు. ఆయన అరబిక్, ఇంగ్లిష్, ఉర్దూ వంటి భాషలలో ప్రవీణుడు. భారత ప్రభుత్వంలో 11 సంవత్సరాల పాటు విద్యాశాఖమంత్రిగా పనిచేసి గుర్తింపు పొందారు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లంతా ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.సర్వేపల్లి ఘనత సర్వేపల్లి ఘనత డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టిన ఘనుడు. సెప్టెంబర్ 5న ఆయన పుట్టినరోజునే మనం టీచర్స్‌డేగా జరుపుకుంటున్నాం. భారతదేశపు అత్యంత క్లిష్టకాలమైన చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయాల్లో ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. చేపట్టిన పదవులు, పొందిన గౌరవాలు, రాసిన రచనలే సర్వేపల్లిని ఉన్నతంగా నిలబెట్టాయి. భారతరత్న పురష్కారం ఆయన్ని వరించింది. ‘తత్వం అనేది జీవితాన్ని అర్థం చేసుకునే ఒక మార్గం’ అంటారు ఈయన. ‘భారతదేశ మత, ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప పండితుడు సర్వేపల్లి.బోధకుడే కాదు, శిక్షకుడు కూడా.. బోధకుడే కాదు శిక్షకడు కూడా.. పురాణాల్లో అవతారపురుషుడైన పరశురాముడు.. కుంతీపుత్రుడైన కర్ణుడికి గురువు. అయితే తన దగ్గర సకల అస్త్రాల ప్రయోగాలు నేర్చుకున్న కర్ణుడు కౌరవుల పక్షాన, అధర్మం వైపు నిలబడ్డాడని తెలిసి శపించాడు. విద్యాబుద్ధులు నేర్పే సమయంలో కర్ణుడి తెలివికి, గుణానికి మెచ్చి.. బ్రహ్మాస్త్రాన్నీ గురువరంగా ఇచ్చిన పరశురాముడు.. కర్ణుడి తప్పిదాన్ని ముందుగానే భవిష్యత్ దర్శనంలో చూసి ఆగ్రహించాడు. మొదట దుర్యోధనుడితో స్నేహం వదులుకోమని హెచ్చరించాడు. కర్ణుడు వినకపోవడంతో.. అత్యవసర సమయాల్లో అస్త్ర ప్రయోగ మంత్రాలు గుర్తుకురావని శపించాడు. అలా అధర్మ పక్షం వహించిన కర్ణుడిని అదుపు చేయగలిగాడు. స్వార్థం లేకుండా తన జ్ఞానాన్ని పంచే గురువు.. తన శిష్యుడు దారి తప్పితే గుర్తించి శిక్షిస్తాడని, అవసరమైతే శపిస్తాడని చెప్పే గాథ ఇది. (చదవండి: సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు) -
‘టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు కోర్టు తీర్పుకు లోబడే ఉండాలి’
హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను కోర్టు తీర్పుకు లోబడి నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో గురువారం నడాఉ ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. ‘పూర్తి పారదర్శకతతో ఎలాంటి అపోహలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించాలని అధికారులకు సూచించారు. అర్హత కలిగిన ఉపాధ్యాయులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విద్యాశాఖ తరఫున వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపాలి. ఆన్లైన్ ప్రక్రియలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. జిల్లాల్లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్రస్థాయి అధికారాలను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరిగేలా చూడాలి’ అని మంత్రి సబితా ఆదేశించారు. -
విద్యలో తెలంగాణ వెనుకబాటు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): విద్య విషయంలో ఇతర అన్ని రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనుకబడి ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక, మదర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసామర్థ్యాలు అందించడం ప్రభుత్వ చట్టబద్ధత బాధ్యతగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, విద్యకు తెలంగాణ రాష్ట్రం బడ్జెట్లో అత్యంత తక్కువ ఖర్చు చేస్తోందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును విద్యపై పెడితే తెలంగాణలో ఉన్న స్కూల్స్ అన్నీ బాగుపడేవని చెప్పారు. కాంట్రాక్టర్లు కమీషన్లు ఇస్తారు కాబట్టే విద్యపై కాకుండా ప్రాజెక్టులపై ఖర్చు చేశారని విమర్శించారు. రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, సరిపడా టీచర్లు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ కమిషన్ ఫర్ చైల్డ్ రైట్స్ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ శాంతాసిన్హా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దిగజారిన విద్యా ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్య అందించకపోవడం రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘనగా భావించాల్సిన అవసరం ఉందన్నారు. ఎంవీ ఫౌండేషన్ జాతీయ కన్వినర్ ఆర్.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలల హక్కుల పరిరక్షణ వేదిక కన్వినర్ జి.వేణుగోపాల్, మదర్స్ అసోసియేషన్ కన్వినర్ జి.భాగ్యలక్ష్మి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరులు ప్రసంగించారు. -
స్థానికంగానే టీచర్ల మెడికల్ బిల్లుల డేటా పరిశీలన
సాక్షి, అమరావతి: మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల సమాచారం స్థానిక డీడీవోల లాగిన్‌లోనే అందుబాటులో ఉంటుందని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ తెలిపారు. వాటిని సరిగ్గా పరిశీలించి.. టీచర్లకు సరైన సమాచారం అందించాలని డీడీవోలను శనివారం కమిషనర్ ఆదేశించారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల స్థితిగతులను తెలుసుకునేందుకు, ప్రొసీడింగ్స్ కాపీల కోసం దూరప్రాంతాల నుంచి ఇబ్రహీంపట్నంలోని కమిషనరేట్‌కు వచ్చి ఇబ్బంది పడొద్దని సూచించారు. బిల్లుల మంజూరు ప్రక్రియను ఆన్లైన్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నామని చెప్పారు. కానీ డీడీవోలైన హెచ్ఎంలు, ఎంఈవోలు, డీవైఈవోల లాగిన్‌లో పరిశీలించకపోవడం వల్ల సమస్య వస్తున్నట్లు గుర్తించామన్నారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి స్క్రూటినీ రిపోర్టులు వచి్చన వెంటనే ఎలాంటి జాప్యం చేయకుండా మంజూరు ప్రొసీడింగ్స్ ఆమోదించి, సంబంధిత డీడీవోల లాగిన్లకు పంపిస్తున్నామన్నారు. కానీ డీడీవోలు తమ లాగిన్‌లో బిల్లుల స్థితిగతులను సరిగ్గా పరిశీలించకపోవడం వల్ల టీచర్లు వాటి కోసం దూరప్రాంతాల నుంచి తమ కార్యాలయానికి వస్తూన్నారని, టీచర్లు, ఉద్యోగులు వీటి కోసం కమిషనరేట్‌ను సంప్రదించే పరిస్థితి వస్తే.. డీఈవోలు, డీడీవోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బోధన, బోధనేతర సిబ్బందికి సంబంధించిన మెడికల్ రీయింబర్స్ బిల్లులను సంబంధిత డీడీవోలు ఆన్లైన్లోనే సమర్పించాలని.. లాగిన్ ఫిజికల్ బిల్లులు స్వీకరించేది లేదని కమిషనర్ స్పష్టం చేశారు. -
100 శాతం జీఈఆర్ సాధించాలి
సాక్షి, అమరావతి: దేశంలో విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఆకాంక్షించారు. సెప్టెంబర్ 2005 నుంచి ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారంతా రాష్ట్రంలోని ఏదో ఒక పాఠశాల/కాలేజీలో నమోదై ఉండాలన్నారు. ఇందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం విద్యాశాఖ అధికారులతో ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో చేరికలపై చర్చించారు. వచ్చే నెల సెప్టెంబర్ 4 నాటికి రాష్ట్రంలోని బడి ఈడు పిల్లలంతా ఏదో ఒక పాఠశాలలో చేరి ఉండాలన్నారు. వలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, జూనియర్ కాలేజీ లెక్చరర్లు, ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, జిల్లా అధికారులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేసి నూరుశాతం నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. నూరుశాతం జీఈఆర్ సాధన అంశాన్ని తాను సవాలుగా తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యార్థుల విషయంలో స్థానికంగా నమోదైన అంశాల్లో తప్పులు ఉంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చాలెంజ్ విసిరారు. జీఈఆర్ సాధించడంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని.. డేటా అంతా పూర్తి పారదర్శకంగా ఉండాలని కోరారు. జూలై రెండో వారంలో గుడివాడలో ఒక వలంటీర్ 100 శాతం జీఈఆర్ సాధించారని, ఇప్పుడు 63,993 మంది వలంటీర్లు తమ పరిధిలో 100 శాతం జీఈఆర్ సాధించారని గుర్తు చేశారు. -
డుమ్మా టీచర్లపై నజర్!
సాక్షి, హైదరాబాద్: ఫలానా పాఠశాలలో.. ఫలానా టీచర్.. రికార్డుల్లో వివరాలు ఉంటాయి. బడిలో చూస్తే ఆ టీచర్ ఉండరు. నెలలకు నెలలుగా బడి మొహమే చూడరు. ఏమయ్యారంటే.. ప్రధానోపాధ్యాయుడికీ తెలియదు, మండల విద్యాధికారికీ తెలియదు.. ఆపై అధికారులకు అసలు సమాచారమే ఉండదు. ఇలా ఒకరిద్దరు కాదు.. ఐదు వేల మందికిపైనే ప్రభుత్వ టీచర్లు సుదీర్ఘకాలం నుంచి పాఠశాలలకు రావడం లేదని అంచనా. లెక్కల్లో మాత్రం ఆయా స్కూళ్లలో సదరు టీచర్లు పనిచేస్తున్నట్టు ఉంటుంది. విద్యార్థులకు మాత్రం చదువు అందదు. ఇలాంటి టీచర్లు రాజీనామా చేస్తేనో, ప్రభుత్వమే తొలగిస్తేనో, మరోచోటికి బదిలీ చేస్తేనో తప్ప.. ఆ స్కూల్‌కు మరో టీచర్‌ను నియమించలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో దీర్ఘకాలం నుంచి విధులకు రాని ఉపాధ్యాయులపై విద్యాశాఖ దృష్టిపెట్టింది. ‘డుమ్మా’టీచర్ల వివరాలు ఇవ్వాలని తాజాగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. ప్రత్యేక వెబ్సైట్లో వివరాలు.. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల వరకు ప్రభుత్వ స్కూళ్లుండగా.. వాటిలో ప్రస్తుతం 1.05 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇందులో ఐదు వేల మందికిపైగా విధులకు రావడం లేదని పాఠశాల విద్య డైరెక్టరేట్ అధికారులు చెప్తున్నారు. వీరిలో చాలా మంది తొలుత సెలవు పెట్టి, ఆ గడువు ముగిసినా హాజరవడం లేదు. ఇంకొందరైతే సెలవులు కూడా పెట్టకుండానే గైర్హాజరు అవుతున్నారని అంటున్నారు. అలాంటివారి వివరాలన్నీ తక్షణమే ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రధానోపాధ్యాయులను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తాజాగా ఆదేశించింది. దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించింది. టీచర్లకు సంబంధించిన ఏడాది డేటాను ఈ వెబ్సైట్లో నమోదు చేయాలని సూచించింది. ఏదో ఓ కారణం చెప్తూ.. కొందరు టీచర్లు విదేశాల పర్యటనలకు వెళ్తున్నారు. కొందరు మహిళా టీచర్లు.. వారి భర్త, పిల్లలు ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేస్తుంటే వారి దగ్గరికి వెళ్లాలంటూ సెలవులు పెడుతున్నారు. కానీ ముందుగా తీసుకునే సెలవు నెలా రెండు నెలలు మాత్రమే అయితే.. గడువు తీరినా అక్కడే ఉండటమో, తిరిగి వచ్చినా.. బడులకు గైర్హాజరు కావడమో చేస్తున్నారు. ఇలాంటి వారు తొలుత పాఠశాల విద్య డైరెక్టరేట్ నుంచి అనుమతి తీసుకుంటున్నారని.. కానీ తర్వాత సెలవులు పొడిగించాలంటూ తమకు మెసేజీలు, మెయిల్స్ పెడుతున్నారని ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. కానీ నిబంధనల మేరకు వాటిని తాము అనుమతించలేక పోతున్నామని అంటున్నారు. అలాంటి టీచర్లంతా అనధికారికంగా గైర్హాజరైనట్టు రికార్డుల్లో నమోదవుతోంది. ఈ సమాచారం డైరెక్టరేట్, డీఈవో పరిధిలో ఉండటం లేదు. మరికొందరు టీచర్లు ప్రైవేటు కాలేజీల్లో లెక్చరర్లుగా పనిచేస్తున్నట్టు విద్యాశాఖ దృష్టికొచ్చింది. అలాంటి వారు అనారోగ్య కారణాలతో సెలవులు పెడుతున్నారని.. ఆ తర్వాత అయినా సరైన పత్రాలతో సెలవుల పొడిగింపునకు ప్రయత్నించడం లేదని అధికారులు చెప్తున్నారు. వారు కూడా అనధికారికంగా గైర్హాజరవుతున్న జాబితాలో చేరుతున్నారు. మరోవైపు మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పోస్టింగ్ ఉన్న పలువురు టీచర్లు.. వారికి బదులు ఎవరికో కొంత డబ్బులిచ్చి బడుల్లో బోధించేలా చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ‘డుమ్మా’మాస్టార్ల లెక్క ఎందుకు లేదు? రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లపై చాలా ఏళ్లుగా సరైన పర్యవేక్షణ లేదని.. డీఈవోలు, ఎంఈవోల కొరత దీనికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. సీనియర్ హెచ్ఎంలకు ఏడెనిమిది మండలాలను అప్పగించి.. ఇన్చార్జి ఎంఈవో బాధ్యతలు నిర్వర్తింపజేస్తున్న పరిస్థితి ఉంది. స్కూళ్లలో అటెండర్లు, క్లర్కుల కొరతతో హెచ్‌ఎంలపై పని ఒత్తిడి పెరిగింది. దీనికితోడు ఇప్పటివరకు ఆన్లైన్ హాజరు విధానం లేకపోవడంతో ఉపాధ్యాయుల అటెండెన్స్ రాష్ట్ర కార్యాలయం పరిధిలోకి రావడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ప్రత్యేక వెబ్సైట్ రూపొందిస్తున్నారు. టీచర్ల సెలవులు, ఎన్ని రోజులకు అనుమతి తీసుకున్నారు? ఎన్ని రోజుల నుంచి గైర్హాజరు అవుతున్నారు? అనే వివరాలను అందులో అప్లోడ్ చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా బడి ఎగ్గొట్టే టీచర్ల బండారం బయటపడుతుందని, వారిపై కఠిన చర్యలు తీసుకునే వీలుందని పాఠశాల విద్య డైరెక్టరేట్ వర్గాలు చెప్తున్నాయి. సెలవుల అనుమతి ఎలా..? ► సాధారణంగా ఉపాధ్యాయులు వివిధ రకాలుగా సెలవులు పెట్టే వీలుంది. క్యాజువల్ లీవ్ పెట్టేందుకు గరిష్టంగా 10 రోజులకు అనుమతి ఉంటుంది. అనారోగ్య సమస్యలతో మెడికల్ లీవ్ పెట్టడానికి ఎలాంటి కాలపరిమితి ఉండదు. తగిన ధ్రువపత్రాలు, వైద్యుల సిఫార్సులను చూపించాల్సి ఉంటుంది. ► ఇవి కాకుండా 180 వరకు ఈఎల్స్ (ఎర్న్డ్ లీవ్స్) ఉంటాయి. వీటిని పైఅధికారి అనుమతితో వాడుకోవచ్చు. ► సెలవుల మంజూరుకు సంబంధించి 2009లో తెచ్చిన జీవో 70యే ప్రస్తుతం అమల్లో ఉంది. దాని ప్రకారం టీచర్లకు నాలుగు నెలల వరకు సెలవు ఇచ్చేందుకు సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయుడికి అధికారం ఉంటుంది. 4–12 నెలల వరకూ డీఈవో అనుమతి తీసుకోవాలి. ఏడాది నుంచి 4 ఏళ్ల వరకూ లీవ్ తీసుకోవాలంటే పాఠశాల విద్య డైరెక్టర్ అనుమతి తీసుకోవాలి. అంతకు మించి సెలవు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. డుమ్మాలపై చర్యలు ఎలా? ► ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా అనుమతి లేకుండా సెలవును పొడిగిస్తే దాన్ని గైర్హాజరుగానే పరిగణిస్తారు. ఇలా చేసినప్పుడు నిబంధనల ప్రకారం.. సదరు ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోవచ్చు. ► ఉద్యోగి గైర్హాజరైన కాలాన్ని సర్వీస్ నుంచి తొలగించాలి. సస్పెండ్ చేయవచ్చు. అనధికార గైర్హాజరు ఎక్కువగా ఏళ్లకేళ్లు ఉంటే నోటీసు ఇచ్చి సర్వీసు నుంచి తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ► ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఐదేళ్లు దాటి గైర్హాజరైతే ఆ ఉద్యోగి రాజీనామా చేసినట్టుగానే భావించి చర్యలు తీసుకోవచ్చు. ► అనుమతి లేకుండా సెలవులను పొడిగించినా, గైర్హాజరైనా ఆ కాలానికి ఎలాంటి వేతనం ఇవ్వరు. పూర్తిగా లాస్ ఆఫ్ పే గానే పరిగణిస్తారు. సస్పెండ్ చేస్తే మాత్రం సగం వేతనం ఇవ్వాల్సి ఉంటుంది. ఏళ్లకేళ్లు రాకున్నా మళ్లీ విధుల్లోకి.. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా నిబంధనలు సరిగా అమలుకాని పరిస్థితి కనిపిస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏళ్లకేళ్లు విధులకు హాజరుకాని ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తిరిగి విధుల్లో చేర్చుకుంటున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. ► జగిత్యాల జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు ఏకంగా 12 ఏళ్లపాటు విధులకు రాకున్నా.. తిరిగి జాయిన్ చేసుకున్నారు. ► మరో జిల్లాలో మూడేళ్ల పాటు డుమ్మా కొట్టిన టీచర్‌ను విధుల్లోకి తీసుకున్నారు. అంతకాలం గైర్హాజరైనవారిని తిరిగి జాయిన్ చేసుకునే అధికారం డీఈవోకు లేకున్నా తీసుకోవడం విశేషం. పర్యవేక్షణ లోపమే అసలు కారణం డుమ్మా కొట్టే టీచర్ల వివరాలు ఇప్పటికీ డైరెక్టరేట్ కార్యాలయంలో అందుబాటులో లేవంటే పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎంఈవోలు 16 మంది మాత్రమే. డిప్యూటీ డీఈవోల ఖాళీలు భారీగా ఉన్నాయి. డీఈవోలు 16 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీ పోస్టులన్నింటినీ డైట్ కాలేజీల లెక్చరర్లు, ఇతర అధికారులను ఇన్చార్జులుగా పెట్టి నడిపిస్తున్నారు. దీంతో బడులపై పర్యవేక్షణ లోపించింది. టీచర్లు ఇష్టానుసారం అనుమతి లేకుండా డుమ్మా కొట్టడం సహించరాని నేరమే. దీనివల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. అలాంటి వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. – చావా రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ప్రతి నెలా 14న అంగన్వాడీ టీచర్లకు వేతనాలు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న టీచర్లు, హెల్పర్లకు ప్రతినెలా 14వ తేదీన వేతనాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అదేవిధంగా వీరికి ఇన్సూరెన్స్ సౌకర్యంతో పాటు హెల్త్ కార్డుల జారీపైనా దృష్టి సారించామని, ఇందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నామని మంత్రి వెల్లడించా రు. శుక్రవారం సచివాలయంలోని తన చాంబర్లో ఆమె అంగన్వాడీ యూనియన్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలో బ్రిడ్జికోర్సును ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింప చేసే విధంగా చర్య లు తీసుకుంటామన్నారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులు, ఇతర సమస్యలను త్వరలో పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలికెరి, జేడీ సునంద, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్ప ర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, టీఎన్జీవో ప్రతినిధి నిర్మల, మినీ అంగన్వాడీ అధ్యక్షురాలు వరలక్ష్మి ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సర్కారు బడి.. తల్లిదండ్రుల మమేకంతో..సరికొత్త ఒరవడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక వసతులు సమకూరుస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. బోధనలోనూ అత్యాధునిక పద్ధతులతో విద్యార్థులను అత్యున్నతంగా తీర్చిదిద్దుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకోవాలన్న లక్ష్యంతో స్కూళ్ల తీరుతెన్నులనే మార్చేసింది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతి, తరగతిలో వారి పరిస్థితిని తల్లిదండ్రులు తెసుకునేందుకు పేరెంట్ – టీచర్స్ సమావేశాలు ఏర్పాటు చేస్తోంది. పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పేరెంట్–టీచర్స్ సమావేశాలు విజయవంతమయ్యాయి. ఫార్మాటివ్ అసెస్మెంట్ అనంతరం పిల్లల ప్రగతిని తల్లిండ్రులకు వివరించేందుకు గురువారం 45,219 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమావేశాలు జరిగాయి. రెండురోజుల క్రితమే సమాచారం అందుకున్న తల్లిదండ్రులు పనులను సైతం పక్కనబెట్టి పాఠశాలలకు వచ్చారు. మొదటి సమావేశానికి రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం మంది తల్లిదండ్రులు హాజరై బడిలో వారి పిల్లల ప్రగతిని స్వయంగా తెలుసుకున్నారు. ప్రభుత్వం వారి పిల్లల కోసం చేస్తున్న మంచిని కొనియాడారు. ఏజెన్సీ ప్రాంతమైన చింతపల్లి మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు 30 కిలోమీటర్ల దూరంలోని గిరిజన గూడేల నుంచి తల్లిదండ్రులు హాజరవడం.. పిల్లల మేలు కోసం తల్లిదండ్రులు పడుతున్న తపనకు అద్దం పట్టింది. పూర్తి స్నేహపూరిత వాతావరణంలో జరిగిన ఈ సమావేశాల్లో విద్యార్థులు చదువులో రాణిస్తున్న వైనాన్ని, పాఠశాలల్లో కలి్పంచిన సౌకర్యాలను, విద్యా విషయక మార్పులను, సాధించిన పురోగతిని ఉపాధ్యాయులు తల్లిండ్రులకు వివరించారు. ఇంటి వద్ద పిల్లలు ఎలా మసలుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు. ఇకపై ఫార్మాటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్స్ అనంతరం పేరెంట్స్–టీచర్స్ సమావేశాలు ఉంటాయని పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ బడుల్లో ఇలాంటి సమావేశాలు గతంలో ఎప్పుడూ చూడలేదని, ఇవి తమ బాధ్యతను మరింత పెంచిందని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ బడుల్లో ఎన్ని మార్పులు వచ్చాయో స్వయంగా చూశామని, ఈ పథకాలు, సమావేశాలు కొనసాగించాలని కోరారు. ఇంత బాగుంటుందని అనుకోలేదు మా అమ్మాయి భవాని ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇక్కడ ఎలా ఉంటుందో, ఏం తింటుందో అని బెంగగా ఉండేది. మా ఊరు దూరమైనా బిడ్డ బాగుకోసం వచ్చాను. ఇక్కడ సౌకర్యాలన్నీ బాగున్నాయి. ఎలా చదువు చెబుతున్నారో చెప్పారు. పిల్లలను బాగా చూసుకుంటున్నారు. ఈ సమావేశం లేకపోతే ఈ విషయాలు తెలిసేది కాదు. ఇది చాలా మంచి కార్యక్రమం. – కొర్ర తిలో, నిమ్మపాడు, చింతపల్లి మండలం ఎలా చదువుతుందో తెలుసుకున్నా నాతవరం మండలం గునుపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మా అమ్మాయి ఆశ్రిత ఎనిమిదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల మీటింగ్‌లో ఫార్మెటివ్ పరీక్ష ఫలితాలను మాకు తెలియజేశారు. మా పిల్లలు ఎలా చదువుతున్నారో చెప్పారు. గతంలో ఎప్పుడూ ప్రభుత్వ స్కూల్లో ఇలాంటి సమావేశాలు జరగలేదు. ఇప్పుడు మా బాధ్యత ఏంటో తెలిసింది. పిల్లలు కూడా జాగ్రత్తగా చదువుతారు. ఈ సమావేశాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పి తీరాలి. – సాంబారు గోవింద, గునుపూడి, అనకాపల్లి జిల్లా -
200 ఏళ్ల నేలమాళిగలోకి దూరిన అమ్మాయిలు.. లోపల ఏముందో చూసి..
ఒక యువతికి తమ ఇంటి కింది భాగంలో ఒక రహస్య గది కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు, అధ్యాపకులకు తెలిపింది. దీంతో వీరంతా ఆ గదిలోనికి వెళ్లి, లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశారు. ఆ గది 1800 శతాబ్దం నాటిదని గుర్తించారు. ఈ ఉదంతం బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్‌లో చోటుచేసుకుంది. ది సన్ రిపోర్టును అనుసరించి ఈ నేలమాళిగ 200 ఏళ్ల క్రితం నాటిది. అమ్మాయిలంతా దానిలోనికి వెళ్లి చూడగా వారికి అక్కడ ఒక ఫ్లోర్ కనిపించింది. అక్కడ నాలుగు మూలలా బెంచీలు కనిపించాయి. అలాగే పలు అల్మరాలు కూడా ఉన్నాయి. అది వారికి ఒక స్టోర్ రూమ్ మాదిరిగా కనిపించింది. ఆ యువతి కుటుంబం ఈ ఇంటిలోకి షిష్ట్ అయ్యే సమయంలో వారికి ఈ సంగతి తెలియదు. నాటింగ్‌హామ్ ట్రెంట్ యూనివర్శిటీ జర్నలిజం విద్యార్థి స్టెఫానీ బెన్నెట్.. కొద్దిపాటి భయాందోళనల వాతావరణం మధ్య తన ఈ నూతన ఆవిష్కరణ ఎలా జరిగిందో మీడియాకు తెలియజేసింది.. ‘అదేమీ పెద్ద గది కాదు. 6 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు కలిగివుంది. ఈ ఆవిష్కరణ ఎంతో ఆసక్తికరంగా సాగింది. లోపల ఏముందో చూడాలనే ఆసక్తితో తామంతా ఒకేసారి ఆ గదిలోనికి ప్రవేశించాం. అయితే ఆ గదిని ఎందుకు వినియోగించేవారో కనుగొనలేకపోయాం’ అని పేర్కొంది. ఈ యువతుల బృందం ఈ విషయాన్ని స్థానిక పురాతత్వ శాస్త్రవేత్తలకు తెలియజేసింది. వారు వెంటనే గుహను సందర్శించారు. అది రెండు శతాబ్ధాల క్రితం నిర్మితమయినదని తెలిపారు. నాటింగ్‌హామ్ సిటీ కౌన్సిల్ యాక్టింగ్ ఆర్కియాలజిస్ట్ స్కాట్ లోమాక్స్ మాట్లాడుతూ ఆ గుహ ఒక నేలమాళిగ అని తెలిపారు. దానిపైన భవనం నిర్మితమవడాన్ని గమనిస్తే అది 19వ శతాబ్దం నాటిదిగా తెలుస్తున్నదన్నారు. ఈ నేలమాళిక అనేక పురాతన విశేషాలను తెలియజేస్తుందన్నారు. ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్ మరో వింత వ్యాఖ్యానం! -
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్ లెర్కింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్ఈ, కాట్, ఐల్ట్సŠ, క్లాట్, టోపెల్, సాట్ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది. పట్టుసాధించేలా ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం మెలకువలు నేర్పుతున్నాం.. ఇంగ్లిష్ భాషలో మెలకువలు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశాఖాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. – ఫిలిప్, ట్రైనర్,ఐడియల్ లెర్కింగ్ సంస్థ, విశాఖపట్నం ఉపయోగకరంగా ఉంది.. నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది. – ఆర్.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం -
చెప్పులే ధరించాలి
సాక్షి, హైదరాబాద్: పరీక్షలకు హాజరయ్యేవారికి గురుకుల బోర్డు 28 రకాల నిబంధనలు విధించింది. ప్రధానంగా ఎగ్జామ్‌హాల్‌లోకి వచ్చే అభ్యర్థులు కేవలం చెప్పులు మాత్రమే వేసుకొని రావాలని, బూట్లు ధరించిన అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి అర్హత పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 23వ తేదీ వరకు వరుసగా(సెలవులు మినహా) పరీక్షల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇప్పటికే తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు(టీఆర్‌ఈఐఆర్‌బీ) విడుదల చేసింది. ఇప్పటివరకు 88 శాతం మంది అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోగా, పరీక్ష సమయానికి గంటముందు వరకు డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు టీఆర్‌ఈఐఆర్‌బీ కల్పించింది. ముందస్తుగా హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకుని నిబంధనలు పాటించాలని, పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించుకుంటే ఇబ్బందులు ఉండవని గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్యబట్టు తెలిపారు. అర్హత పరీక్షలు రోజుకు మూడు సెషన్లలో జరుగుతాయి. ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు మొదటి సెషన్, రెండోసెషన్ మధ్యాహ్నం 12.30గంటల నుంచి 2.30గంటల వరకు, మూడోసెషన్ సాయంత్రం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. పరీక్ష సమయంకంటే గంటన్నర ముందు నుంచే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తారు. పరీక్ష సమయం 15 నిమిషాల వరకు మాత్రమే గేట్లు తెరిచి ఉంచుతారు. ఆ తర్వాత గేట్లు మూసివేస్తారు. పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన అభ్యర్థిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను కేంద్రంలోకి అనుమతించరు. అధికారుల పరిశీలనలో సంతృప్తి చెందితేనే లోనికి పంపిస్తారు. అభ్యర్థులు తమ వెంట ఏదేని ఒక ఒరిజినల్ ఫొటో గుర్తింపుకార్డు (పాస్‌పోర్టు, ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్) వెంట తీసుకెళ్లాలి. ఎగ్జామ్‌హాల్‌లోకి వెళ్లిన తర్వాత అభ్యర్థి బయోమెట్రిక్ సమాచారం సేకరిస్తారు. ప్రతి పరీక్ష 120 నిమిషాల పాటు నిర్వహిస్తారు. నిర్దేశించిన గడువు తర్వాతే అభ్యర్థిని బయటకు పంపిస్తారు. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్ తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. హాల్‌టికెట్‌లో సాంకేతిక కారణాలతో ఫొటో ముద్రితం కాకుంటే ఒరిజినల్ ఫొటో అతికించి నిబంధనలకు అనుగుణంగా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి హాజరుకావాలి. బోర్డు కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళన పరీక్ష కేంద్రాల కేటాయింపు గందరగోళంగా జరిగిందంటూ కొందరు అభ్యర్థులు సోమవారం ఉదయం దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్‌లో ఆందోళనకు దిగారు. దాదాపు 50 మంది అభ్యర్థులు బోర్డు కార్యాలయ ఆవరణకు చేరుకుని అధికారులను నిలదీశారు. ఒక్కో పరీక్షకు ఒక్కోచోట కేంద్రం కేటాయించడం, సుదూర ప్రాంతాలకు తక్కువ సమయంలో ప్రయాణించడం కత్తిమీద సాముగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు ప్రశాంతంగా ఎలా రాయగలమని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్ష కేంద్రాల కేటాయింపులో అధికారులు, ఉద్యోగుల ప్రమేయం ఏమీ లేదని, అభ్యర్థులకు సర్దిచెప్పి పంపించారు. -
సీఎం జగన్‌తోనే విద్యాభివృద్ధి
పటమట(విజయవాడతూర్పు): సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాభివృద్ధికి కంకణం కట్టుకుని పేద విద్యార్థుల భవిష్యత్ కోసం అహరి్నశలు శ్రమిస్తున్నారని పలువురు వక్తలు ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన శనివారం విజయవాడలో రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ–1998 వారికి ఉద్యోగాలు, వేలాదిమంది ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు నాడు–నేడు, అమ్మఒడి వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి యోధుడిలా కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రామచంద్రరెడ్డి, చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థకు మరింత మేలు కలిగేందుకు ఉపాధ్యాయులందరూ సీఎం వైఎస్ జగన్‌కు అండగా నిలవాలని కోరారు. టీచర్ల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రణాళికను రూపొందిస్తున్నారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీలను ఉపాధ్యాయులు సన్మానించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించారు. వైఎస్సార్ టీఎఫ్ ప్రధాన కార్యదర్శి గడ్డెల సుదీర్, గౌరవ అధ్యక్షుడు జాలిరెడ్డి, వ్యవస్థాపకులు ఓబులాపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
టీచర్ల వల్లే విద్యార్థులకు మంచి భవిత
బాపట్ల అర్బన్: టీచర్ల వల్లే విద్యార్థులకు మంచి భవిష్యత్ లభిస్తుందని.. వారి కృషితోనే ఉత్తమ ఫలితాలు సాధ్యమని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీచర్లను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని.. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు మెరుగైన చదువులు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు. మంగళవారం బాపట్లలో పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ప్రధానోపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి బొత్స ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని వివరించారు. టీచర్లంతా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకుని.. విద్యార్థులకు మార్గ నిర్దేశం చేయాలని సూచించారు. విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెంపొందించేలా ఈ శిక్షణ కార్యక్రమాన్ని సది్వనియోగం చేసుకోవాలన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా నాడు–నేడు, అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక తదితర పథకాలను అమలు చేస్తోందన్నారు. కార్పొరేట్ స్కూళ్ల కంటే గొప్పగా ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ చదువులను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నామని పేర్కొన్నారు. వీటన్నింటినీ సద్వినియోగం చేసుకొని విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దాలని సూచించారు. పాఠశాలల విద్యుత్ బిల్లులను సమగ్ర శిక్షా కార్యాలయం నుంచే చెల్లిస్తారని.. విద్యుత్ విషయంలో ఇంకా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అధికారుల దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తారన్నారు. సమగ్ర శిక్షా ఎస్పీడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మొదటి బ్యాచ్‌లో 1,450 మంది హెచ్ఎంలకు నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు, బాపట్ల కలెక్టర్ పి.రంజిత్‌బాషా, జాయింట్ కలెక్టర్ శ్రీధర్, ఆర్డీవో జి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డిజిటల్ శిక్షణ
సాక్షి, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు 40 లక్షల మంది పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యా సంవత్సరం (2023–24) నుంచి డిజిటల్ బోధనను ప్రవేశపెట్టింది. ఇప్పటికే నాడు–నేడు: మనబడి కింద పాఠశాల భవనాలు, తరగతి గదులు, డబుల్ డెస్క్ బెంచీలు, విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలతో పాటు బైజూస్ కంటెంట్ ఉన్న ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. నాడు–నేడు పనులు పూర్తయిన 15,713 పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ప్లస్ 2 వరకు బోధించే 6,731 స్కూళ్లలో అత్యాధునిక టెక్నాలజీ గల 30,213 ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్లను ఏర్పాటు చేసింది. ఇలాంటి ప్యానెళ్లు దేశవ్యాప్తంగా సుమారు 25 వేలు మాత్రమే ఉండగా.. మనరాష్ట్రంలో 30 వేలకు పైగా అందుబాటులోకి తెచ్చింది. వీటి ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధన అందించడంపై 1,34,281 మంది ఉపాధ్యాయులకు శిక్షణనిస్తున్నారు. ఈ నెల 4 నుంచి ప్రారంభమైన డిజిటల్ శిక్షణ ఇప్పటికే లక్ష మందికిపైగా పూర్తయింది. మిగిలిన వారికి ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది. 11,455 పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు శిక్షణ రెండో దశ నాడు–నేడు పనులు 22 వేల పాఠశాలల్లో జరుగుతున్నాయి. వీటిలో దాదాపు పనులు పూర్తయినవి మొత్తం 11,455 పాఠశాలలు ఉన్నాయి. వీటి నుంచి 1,34,281 మంది ఉపాధ్యాయులను శిక్షణకు ఎంపిక చేశారు. వీరికి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగంపై ఇంజనీరింగ్ కాలేజీల్లో నిపుణులతో తర్ఫీదునిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో 144 ఇంజనీరింగ్ కాలేజీల్లో 40 మంది చొప్పున ఒక బ్యాచ్‌గా చేసి శిక్షణ క్యాంపులు నిర్వహిస్తున్నారు. గతంలో శిక్షణ పొందిన దాదాపు 600 మంది మాస్టర్ ట్రైనర్లతో రెండు లేదా మూడు మండలాలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు రెండు రోజుల చొప్పున శిక్షణ అందిస్తున్నారు. కాగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో గణితం, భౌతిక, జీవ, రసాయన శాస్త్రాలతో పాటు ఇంగ్లిష్ బోధించే 35 వేల మంది సబ్జెక్టు ఉపాధ్యాయులకు అక్టోబర్ నుంచి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ప్రొఫెసర్లతో శిక్షణ ఇవ్వనున్నారు. నిధులు చెల్లించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల శిక్షణకు, ప్యానెళ్లు బిగించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం గత నెలలోనే విడుదల చేసింది. 1,34,281 మంది టీచర్లకు రూ.5,79,12,000.. ఐఎఫ్‌పీ స్క్రీన్లు తరలింపు, శిక్షణ కేంద్రాల్లో బిగించేందుకు రూ.7.20 లక్షల నిధులను ప్రభుత్వం గత నెలలోనే చెల్లించింది. దీంతో పాటు ఐఎఫ్‌పీ స్క్రీన్లు మంజూరైన పాఠశాలల్లో వాటిని బిగించేందుకు, వైరింగ్, రంగులు వేసేందుకు కూడా నిధులను ఇచ్చింది. పద్యాలను బాగా నేర్పించొచ్చు గతంలో విద్యార్థులకు తెలుగు పద్యాలను నేర్పించేందుకు ఫోన్ ను ఉపయోగించేవాళ్లం. అయితే ఇలా ఎక్కువమంది పిల్లలకు చేరేది కాదు. ఇప్పుడు ఐఎఫ్‌పీల ద్వారా తెరపై అందరికీ వినిపించేలా చెప్పొచ్చు. చెప్పిన ప్రతి అంశాన్ని మరోసారి పునశ్చరణ చేసేందుకు వీలుంది. ఇంత మంచి శిక్షణ ప్రతి టీచర్‌కు అవసరం. – పి.రాణి, తెలుగు టీచర్, కొండపల్లి బాలికల హైసూ్కల్, ఎన్టీఆర్ జిల్లా శిక్షణ గొప్ప అవకాశం ఏ రంగంలోనైనా కాలానుగుణంగా మారకుంటే వెనుకబడిపోతాం, బోధనలో కూడా అంతే. ఉపాధ్యాయుడిగా నాకు 27 ఏళ్ల అనుభవం ఉంది. ఇన్నేళ్ల బోధన ఒక ఎత్తయితే.. డిజిటల్ బోధన మరో ఎత్తు. బ్లాక్ బోర్డుపై చెప్పే దానికన్నా ఐఎఫ్‌పీలపై 3డీలో విద్యార్థికి మరింత సమర్థవంతంగా చదువు చెప్పొచ్చు. బోధనా సామర్థ్యాలు పెంచుకోవడానికి ఇదో గొప్ప అవకాశం. – కె.హరిశరణ్, జెడ్పీ స్కూల్ హెచ్ఎం, సూరంపల్లి, కృష్ణా జిల్లా ప్రభుత్వ బడిలో ఇదో విప్లవం వేగంగా మారుతున్న ప్రపంచంలో కార్పొరేట్ స్కూళ్లు కూడా అందుకోలేని డిజిటల్ బోధనను ప్రభుత్వ స్కూళ్లల్లో అందుబాటులోకి తేవడం ఓ ఎత్తయితే.. ఉపాధ్యాయులకు వేగంగా శిక్షణనివ్వడం మరో ఎత్తు. ఈ శిక్షణలో ఉపాధ్యాయులు కొత్త టెక్నాలజీని నేర్చుకునేందుకు నూరుశాతం ఆసక్తి చూపించారు. పిల్లలకు మెరుగైన విద్యాబోధన అందించేందుకు ఇదో గొప్ప అవకాశం. ప్యానెళ్లను ఎలా వినియోగించాలి?, నోట్స్ సేవింగ్, 3డీ పాఠాలు ఎలా చెప్పాలి? వంటి సాంకేతిక అంశాలపై శిక్షణనిచ్చాం. – డాక్టర్ కె.శ్రీనివాసరావు (మాస్టర్ ట్రైనర్), బి.శ్రీనివాస్ (పెదపారుపూడి ఎంఈవో) బోధనా సమయం ఆదా బయాలజీ టీచర్‌గా బ్లాక్ బోర్డుపై విద్యార్థికి పాఠాలు అర్థమయ్యేలా చెప్పడం ఒక సవాల్. ఇప్పుడు ఐఎఫ్‌పీలపై తక్కువ సమయంలోనే ఎక్కువ ఉదాహరణలతో అర్థమయ్యేలా బోధించవచ్చు. స్క్రీన్‌పై 3డీ చిత్రాలతో ప్రతి అంశాన్ని విశదీకరించి చెప్పొచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. అంతేకాకుండా స్క్రీన్‌పైనే నోట్స్ రాసి సేవ్ చేయడంతో పాటు ఎక్కువ అంశాలను నేర్పించవచ్చు. – వి.అరుణశ్రీ, బయాలజీ టీచర్, పెనమలూరు జెడ్పీ స్కూల్, కృష్ణా జిల్లా -
జాబిలిపై అన్వేషణకు ఇస్రో చంద్రయాన్-3
-
మద్యం మత్తులో విద్యార్థులపై దాడి
వర్ని: వర్నిలోని జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానంలో క్రికెట్ ఆడుతున్న విద్యార్థులపై మోహన్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు. బుధవారం ఉదయం ఎస్సీ హాస్టల్లో భోజనం ముగించుకొని పక్కనే ఉన్న జిల్లా పరిషత్ బాలుర హై స్కూల్ క్రీడామైదానంలో క్రికెట్ విద్యార్థులు క్రికెట్ ఆడటానికి వెల్లారు. వడ్డేపల్లి గ్రామానికి చెందిన మోహన్ మద్యం మత్తులో విద్యార్థులతో గొడవపడి కర్రతో విద్యార్థులపై దాడికి పాల్పడ్డాడు. దాడిలో 12 మంది హాస్టల్ విద్యార్థులకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైస్కూల్ ఉపాధ్యాయులు గాయపడిన విద్యార్థులను వర్ని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మద్యం మత్తులో మోహన్ తాను క్రికెట్ ఆడుతానని గొడవపడినట్లు బాధిత విద్యార్థులు వెల్లడించారు. హాస్టల్ వార్డెన్ పోశెట్టి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రుద్రురు సీఐ జాన్‌రెడ్డి వెల్లడించారు. -
పకడ్బందీగా 50వేల మందికి పైగా ఉపాధ్యాయుల బదిలీలు!
సాక్షి, అమరావతి : కొత్త విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ముందే చెప్పినట్లుగా సమర్ధంగా చేపట్టింది. గతంలో మాదిరిగా ఎక్కడా గందరగోళం, గొడవలు లేకుండా, అక్షరాల 50 వేల మంది పైచిలుకు టీచర్ల బదిలీల ప్రక్రియను ప్రారంభించింది. రకరకాల కారణాలతో అయిదారేళ్లుగా ఆగిపోయిన ఈ బదిలీల కౌన్సెలింగ్ 15 రోజుల్లో పూర్తిచేసి, కొత్త స్కూళ్లలో కొత్త టీచర్లను బదిలీ చేసింది. గతంలో అర్థరాత్రి వరకు సాగే బదిలీ ప్రక్రియలో ఎంతో గందరగోళం నెలకొనేది. కానీ, ఈసారి టెక్నాలజీని ఉపయోగించి చేపట్టిన ఈ ప్రక్రియతో ఇంటి నుంచి లేదా ఇంటర్నెట్ పాయింట్ నుంచి బదిలీ ధ్రువపత్రం తీసుకుని కొత్త స్కూల్లో చేరుతున్నారని, వేలాది టీచర్ల ముఖాల్లో కొత్త ఆనందం కనిపిస్తోందని ఉపాధ్యాయ సంఘా లు తెలిపాయి. 45వేల ప్రభుత్వ స్కూళ్లలోని 41 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవుల్లో, ఎక్కడి వారు అక్కడే ఉంటూ, ఎవరి ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేకుండా పకడ్బందీగా నిర్వహించిన చారిత్రాత్మక కౌన్సిలింగ్ అని పేర్కొంటూ ప్రభుత్వాన్ని, పాఠశాల విద్యాశాఖకు ఆయా సంఘాలు కితాబిచ్చాయి. ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ లేదు సంఘాల మధ్య తరచూ చోటుచేసుకునే ఆధిపత్య ధోరణుల నేపథ్యంలో.. ‘అర్థరాత్రుళ్లు ఆగిపోయే కౌ న్సెలింగ్ లేదు.. ఎక్కడా డీఈఓ కార్యాలయాల ముందు ఉపాధ్యాయుల పడిగాపులు లేవు.. ఆమ్యామ్యా లు ఇస్తేనే ఆర్డర్లు ఇస్తామనే వేధింపుల్లేవు.. ఇంట్లో ఉండి దరఖాస్తు చేసుకుని, ఇంట్లో నుంచే బదిలీ ఆర్డర్ పుచ్చుకుని, కొత్త స్కూళ్లల్లో చేరిన వేలాది ఉపాధ్యాయులందరూ టెక్నాలజీకి మనసులోనే నమస్కరిస్తున్నారు. ఇంత ప్రశాంతంగా జరిగిన దాఖలాలు లేవు. ఈ ఘనత మన పాఠశాల విద్యాశాఖదే. బదిలీల ప్రక్రియను అద్భుతంగా నిర్వహించిన ప్ర భుత్వం.. ప్రభుత్వ పాఠశాలల విద్యా ర్థుల విద్యా ప్రయోజనాలకు కట్టుబడి ఉందన్న సంకేతాన్ని పంపించింది’ అంటూ డెమోక్రటిక్ పీఆరీ్టయూ ఏపీ టీచర్లు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చదవండి: తమ్ముళ్లు ఏరి?.. 21 లక్షలకు పడిపోయిన టీడీపీ సభ్యత్వం -
మొక్కు‘బడి బాట’..!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులను చేర్పించేందుకు విద్యాశాఖ చేపట్టిన ‘బడిబాట’కు స్పందన నామమాత్రంగానే ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు ఇందుకు సహకరించట్లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటుండగా..టీచర్ల నిర్లిప్తత ఇందుకు కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు స్కూళ్లు ఆకర్షించినట్టుగా విద్యార్థులను ప్రభుత్వ టీచర్లు ఆకర్షించడం లేదని ఉన్నతాధికారులు సైతం భావిస్తున్నట్టు సమాచారం. కాగా చాలాచోట్ల బడిబాట కార్యక్రమానికి వెళ్లేందుకు టీచర్లు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. రికార్డుల్లో వెళ్లినట్టుగా చూపిస్తూ, ఆన్లైన్లో ఉన్నతాధికారులకు జిల్లా అధికారులు పంపుతున్నారు. దీంతో కార్యక్రమం మొక్కుబడిగా మారింది. డీఈవోలు, ఎంఈవోల కొరతతో పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. బడి మానేసినవారు తిరిగి చేరేలా.. బడి మానేసిన వారిని బడికి తిరిగి రప్పించడమే కాకుండా, ప్రభుత్వ స్కూళ్లలోకి విద్యార్థులను మరలించేందుకు విద్యాశాఖ ఈ నెల 3 నుంచి ‘బడిబాట’చేపట్టింది. ప్రతి స్కూల్ పరిధిలో టీచర్లు గ్రామాల్లో ప్రతి ఇంటికీ వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి, పిల్లలు బడిలో చేరేలా చూడాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. గుర్తించింది 66 వేలు.. ఏటా ప్రభుత్వ స్కూళ్లలో 2 లక్షల మందిని కొత్తగా చేర్పిస్తున్నామని విద్యాశాఖ చెబుతోంది. కానీ ఇప్పటివరకు బడిలో చేర్పించాల్సిన విద్యార్థులు 66,847 మందిని మాత్రమే గుర్తించినట్టు విద్యాశాఖ వెల్లడించింది. వీరిలో ఒకటవ తరగతిలో చేర్చాల్సిన వారి సంఖ్య 16,038 ఉంది. ఇందులో 12,120 మందిని అంగన్వాడీల్లో చేరి్పంచేందుకు పేర్లు నమోదు చేశారు. ప్రైవేటు స్కూళ్లలో చేరేందుకు 1,181 మంది మొగ్గుచూపారు. ఇక 2,737 మంది బడిబాట బృందాలతో సంబంధం లేకుండానే స్కూళ్లలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు 2–7 తరగతుల మధ్య బడి మానేసిన పిల్లలు 8,966 మందిని కూడా గుర్తించారు. వీళ్లు ఇప్పటివరకు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఎక్కడ చేరారన్నది స్పష్టత ఇవ్వలేదు. రాజధాని పరిసరాల్లోనే ఎక్కువ బడి మానేస్తున్న వారిలో గ్రామీణ ప్రాంతాలకన్నా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువమంది ఉన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 4,137 మందిని గుర్తించారు. హైదరాబాద్‌లో 2,376 మంది బడి మానేసినట్టు తెలుసుకున్నారు. మెదక్‌లో 2,254 మంది, మేడ్చల్‌లో 1,457 మంది బడికి దూరమైనట్టు గుర్తించారు. ఇక ఖమ్మం జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో 3,371 మంది, నిజామాబాద్‌లో 4,107 మంది బడి మానేసిన పిల్లలున్నారు. హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో స్కూళ్లకెళ్లని విద్యార్థుల తల్లిదండ్రులంతా దినసరి కూలీలే కావడం గమనార్హం. ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు పిల్లలను కూడా రోజువారీ పనులకు పంపుతున్నట్టు తేలింది. వీళ్లను గుర్తించడమే తప్ప, వీరంతా స్కూళ్లలో చేరతారా? లేదా? అనేది మాత్రం స్పష్టం కావట్లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్లు ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏజెంట్లను రంగంలోకి దింపుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారికీ గాలమేస్తున్నాయి. గ్రామాల్లో కొంతమందికి కమీషన్లు ఇస్తూ పిల్లల్ని తమ స్కూళ్లలో చేర్పించేలా తల్లిదండ్రులను ఒప్పించాలని కోరుతున్నాయి. ఊరూరా ఫ్లెక్ల్సీలతో ప్రచారం చేస్తున్నాయి. టీచర్లకు టార్గెట్లు వి«ధించి మరీ విద్యార్థులను చేర్చేలా ఒత్తిడి చేస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల లెక్కల ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటివరకు రాష్ట్రం మొత్తమ్మీద లక్షమంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటు స్కూళ్లలో చేరినట్టు తెలుస్తోంది. -
AP: విద్యార్థుల కోసం మరో 6 లక్షల ట్యాబ్‌లు
సాక్షి, అమరావతి: కొత్త విద్యా సంవత్సరం (2023–24)లో 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థుల కోసం కొత్తగా 6 లక్షల ట్యాబ్‌లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులందరికీ ట్యాబ్‌లు ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్టు తెలిసింది. ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో 8వ తరగతి విద్యార్థులతోపాటు సుమారు 75 వేల మంది ఉపాధ్యాయులకు 5,18,740 ట్యాబ్‌లను ఉచితంగా అందించింది. 8, 9 తరగతుల విద్యార్థులకు అవసరమైన పాఠ్యాంశాలకు సంబంధించి సుమారు రూ.25 వేల ఖరీదు చేసే బైజూస్ కంటెంట్‌తో ట్యాబ్‌లను అందించింది. సమస్య వస్తే మూడు రోజుల్లో పరిష్కారం గత ఏడాది విద్యార్థులకు ఇచ్చి న ట్యాబ్‌ల నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని అందుబాటులోకి తెచ్చి ంది. ట్యాబ్‌లలో తలెత్తే సాంకేతిక సమస్యలను గరిష్టంగా మూడు రోజుల్లో పరిష్కరించేలా ఏర్పాట్లు చేసింది. ట్యాబ్‌ల వినియోగంలో తలెత్తే సాఫ్ట్వేర్ సమస్యలు పరిష్కరించేలా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చి ంది. అయితే, హార్డ్‌వేర్ సమస్యలు వస్తే ట్యాబ్‌లను స్థానిక వార్డు, గ్రామ సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ ద్వారా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యార్థి లేదా వారి తల్లిదండ్రులు ట్యాబ్‌ను డిజిటల్ అసిస్టెంట్‌కు అందజేసి సమస్యను వివరిస్తే ఫోన్ నంబర్, ట్యాబ్ ఈఎంఐఈ నంబర్ ఆధారంగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. అయితే, వివరాల నమోదు, ఆన్లైన్లో ఉండటంతో చదువుకోలేని తల్లిదండ్రులు రసీదులు పొందడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికోసం మాన్యువల్‌గా రశీదులు ఇవ్వనున్నారు. మరమ్మతుకు గురైన ట్యాబ్‌లను రాష్ట్రంలోని 145 శాంసంగ్ సర్వీస్ సెంటర్లలో గరిష్టంగా 3 రోజుల్లో మరమ్మతు చేయించి అందించనున్నారు. ట్యాంపర్ చేస్తే ఐటీ సెల్‌కు అలర్ట్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లు ప్రత్యేకంగా రూపొందించింది. ఈ ట్యాబ్‌ల్లో కంటెంట్ ఇంటర్నెట్ లేకుండానే వినియోగించుకోవచ్చు. సబ్జెక్టుల వారీగా ఉన్న పాఠ్యాంశాలను విద్యార్థి ఎన్ని గంటలు చూశారు, ఏ సబ్జెక్టు కోసం ఎక్కువ సమయం కేటాయించారో అందులో నమోదవుతుంది. ట్యాబ్స్‌ను నెట్(వైఫై)కు అనుసంధానం చేయగానే మొత్తం వివరాలు స్టేట్ ఐటీ సెల్‌కు చేరుతాయి. విద్యార్థులు ట్యాబ్‌లను ఎలా వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు విశాఖపట్నంలో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం గురువారం అందుబాటులోకి తెచ్చి ంది. ఇక్కడ ఉన్న సిబ్బంది ప్రతి విద్యార్థికి ఇచ్చి న ట్యాబ్‌ను ఎలా వాడుతున్నారో గుర్తిస్తారు. మరోవైపు ట్యాబ్‌లను ట్యాంపరింగ్ చేసే వీలు లేకుండా సాంకేతికపరంగా కట్టడి చేశారు. విద్యార్థికి ఇచ్చిన ట్యాబ్‌లోని కంటెంట్ తొలగించేందుకు యతి్నంచినా, కొత్తగా మార్పులు చేసినా ఆటోమేటిక్‌గా ట్యాబ్ లాక్ అయిపోతుంది. వెంటనే ఏ జిల్లాలో, ఏ పాఠశాలలోని విద్యార్థి ఈ పని చేశారో ఐడీ నంబర్‌తో సహా ఇబ్రహీంపట్నంలోని స్టేట్ ఐటీ సెల్‌కు, విశాఖలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఆ వివరాలు వెళ్లిపోతాయి. అనంతరం కారణం తెలుసుకుని, మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ (ఎండీఎం) సిస్టంతో పాటు గూగుల్ అథెంటికేషన్ ఓటీపీ ద్వారా జిల్లా నోడల్ అధికారి అన్‌లాక్ చేస్తారు. -
ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి ఫలితాల్లో 582 మార్కులు సాధించాను..!
-
‘ఆ టీచర్ల డ్యూటీ సర్టిఫికెట్లు ఫేక్?’
జగిత్యాల: జిల్లాలో ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు పర్యవేక్షకులుగా సారంగాపూర్ మండలంలోని 10 మంది ఉపాధ్యాయులను మార్చి 15 నుంచి ఏప్రిల్ 1 వరకు రిలీవ్ చేశారు. దీంతో వారు మార్చి 14న మధ్యాహ్నం 2 గంటలకు సదరు పరీక్ష కేంద్రాల్లో రిపోర్ట్ సైతం చేశారు. కానీ వీరిలో కొందరు టీచర్లు అటు ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షణకు, ఇటు పాఠశాలలకు వెళ్లలేదు. అన్నీ ప్రెజెంట్ అని వేసుకున్నారు.. ఇంటర్మీడియట్ పరీక్షల పర్యవేక్షణకు వెళ్లిన టీచర్లు తిరిగి పాఠశాలల్లో జాయిన్ అయ్యే సమయంలో హెచ్ఎంలకు, హెచ్ఎంలే అయితే ఎంఈవోలకు డ్యూటీ సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉంటుంది. కానీ అవి అందజేయకుండానే ఉపాధ్యాయులు తమ విధుల్లో చేరారు. 15 రోజులకు సంబంధించిన జీతం సైతం తీసుకున్నారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘ఇన్విజిలేషన్‌కు వెళ్లలేదు’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో సంబంధిత ఎంఈవో ఈ నెల 15వ తేదీలోపు డ్యూటీ సర్టిఫికెట్లు అందించాలని వారిని ఆదేశించారు. దీంతో కొందరు అందజేశారు. వీరిలో పర్యవేక్షకులుగా పనిచేయనప్పటికీ ఫేక్ సర్టిఫికెట్ సృష్టించి, ఎంఈవోకు అందించినట్లు తెలిసింది. రిలీజ్ ఆర్డర్లో ఇంటర్మీడియట్ అధికారులు కంప్యూటర్ షీట్లో అబ్సెంట్, ప్రెజెంట్ వేశారు. కానీ కొందరు టీచర్లు వాటిని జిరాక్స్ తీసుకొని, చేతితో అన్నీ ప్రెజెంట్ అని వేసుకున్నారు. కాగా, మార్చి 15 నుంచి వీరు విధుల్లో చేరుతున్నట్లు ఉండగా డ్యూటీ సర్టిఫికెట్లో మాత్రం 10 నుంచే వెళ్లినట్లు పెట్టారు. అలాగే పేర్లను అధికారులు పెన్నుతో రాయగా కొందరు కంప్యూటర్ షీట్లో టైప్ చేసుకున్నారు. ఎవరి ఇష్టానుసారంగా వారు డ్యూటీ సర్టిఫికెట్లు తయారు చేసి, అందజేశారు. ఇవి ఫేక్ డ్యూటీ సర్టిఫికెట్లు అని స్పష్టంగా తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ చేపడితే నిజానిజాలు బయటపడతాయన్న అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై సారంగాపూర్ ఎంఈవో భీమయ్యను వివరణ కోరగా డ్యూటీ సర్టిఫికెట్లు తీసుకొని, డీఈవోకు పంపించామని, ఆయన పరిశీలిస్తారని తెలిపారు. -
థాంక్యూ సీఎం సార్!
సాక్షి, అనకాపల్లి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగ పక్షపాతి అని, 25 ఏళ్ల నాటి కలను నిజం చేశారని ఉత్తరాంధ్ర జిల్లాల ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.వి.రమణమూర్తి కొనియాడారు. అనకాపల్లి జిల్లా సీఐటీయూ కార్యాలయంలో శుక్రవారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షనేత హోదాలో జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ‘డీఎస్సీ–1998’ అభ్యర్థులకు ఉద్యోగం కల్పించారని, ఇది 25 ఏళ్ల నాటి కల అన్నారు. గత ప్రభుత్వాల దృష్టికి అనేకమార్లు తమ సమస్యను తీసుకెళ్లామని.. తామిచ్చిన వినతులను చిత్తు బుట్టలకే పరిమితం చేశారని తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 4,072 మందిని గురువుల స్థానంలో నిలబెట్టిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. (చదవండి: నర్రెడ్డి సోదరులు చెప్పినట్టే చేశా: వివేకా పీఏ కృష్ణారెడ్డి) -
టీచర్లుగా బీటెక్‌బాబులు వద్దా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీటెక్ చదివి టీచర్లు అవుదామనుకున్న వారి కలలు నెరవేరేలా లేవు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన పలువురు అభ్యర్థులు తాజాగా గురుకులాల్లో టీచర్ల కోసం దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నించి విఫలమవుతున్నారు. కారణం.. ఓటీఆర్‌లో విద్యార్హతల వద్ద బీఎస్సీ, బీఏ, బీకామ్ వంటి డిగ్రీలు ఉంచిన వెబ్సైట్లో.. బీటెక్ అన్న కాలమ్ అసలు పొందుపరచనే లేదు. తాము ఎంతో కష్టపడి రెండేళ్ల బీఈడీ కోర్సు పూర్తి చేశామని, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పరీక్ష కూడా పాసయ్యామని, తీరా ఇపుడు తమకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించకపోవడం అన్యాయమంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019లో తెలంగాణ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో టీచర్ పోస్టులకు తమను అనుమతించడం లేదంటూ కొందరు బీటెక్‌తోపాటు, బీఈడీ చేసిన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అపుడు కూడా ఇదే తరహాలో దరఖాస్తులో తమకు బీటెక్ కాలమ్ కనిపించ లేదని చెప్పారు. దీనికి ప్రభుత్వం సమాధానమిస్తూ.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) 2010 మార్గదర్శకాల ప్రకారమే తాము నోటిఫికేషన్ జారీ చేశామని తేల్చిచెప్పింది. దీనిపై స్పందించిన హైకోర్టు ఎన్సీటీఈ–2014 మార్గదర్శకాల ప్రకారం.. బీటెక్‌తోపాటు బీఈడీ చేసినవారంతా టీజీటీ పోస్టులకు అర్హులేనని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖాధిపతులను ఆదేశించింది. మళ్లీ ఇప్పుడూ అదే సమస్య గతంలో ఇదే వ్యవహారంపై హైకోర్టు వరకూ వెళ్లిన నేపథ్యంలో ఈసారి టీచర్ పోస్టులకు సంబంధించి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. కానీ, తీరా దరఖాస్తు ఫారం ఓపెన్ చేసే సరికి తిరిగి అదే సమస్య పునరావృతమవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై పలువురు బీటెక్–బీఈడీ అభ్యర్థులు తొలుత గురుకుల కార్యాలయాలకు వరుసగా ఫోన్లు చేసినా.. ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. కొందరు అధికారులు అయితే.. బీటెక్ బీఈడీ వారికి అసలు అర్హతే లేదని, మీరు దరఖాస్తు చేసుకోవద్దని చెబుతున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
టెన్త్ స్పాట్‌కు తిప్పలు!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి జవాబుపత్రాల మూల్యాంకనానికి తిప్పలు తప్పడం లేదు. ఓవైపు ఇబ్బందులు, మరోవైపు టీచర్ల అనాసక్తి కారణంగా జవాబు పత్రాలను దిద్ది మార్కులు వేసే ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. కొందరు టీచర్లు అనారోగ్యమనో, మరో అత్యవసర కారణమో చూపుతూ స్పాట్ వ్యాల్యూయేషన్‌ను తప్పించుకుంటున్నారని.. మరికొందరు చెప్పకుండానే హాజరుకావడం లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి సౌకర్యాలూ ఉండటం లేదని, అసలే వేసవి కావడంతో తీవ్రంగా అవస్థలు పడుతున్నామని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ వేసినా కూడా.. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవలే టెన్త్ పరీక్షలు ముగిశాయి. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను గురువారం నుంచి మొదలు పెట్టారు. గతంలో మూల్యాంకన కేంద్రాలు 12 ఉంటే, ఈసారి 18కి పెంచారు. జిల్లా ల వారీగా సబ్జెక్టు, లాంగ్వేజ్ నిపుణులను మూ ల్యాంకన విధులకు తీసుకున్నారు. సాధారణంగా విద్యాశాఖ అధికారులు మూల్యాంకన ప్రక్రియ మొదలవడానికి కేవలం రెండు రోజుల ముందుగా టీచర్లకు విధులు వేస్తుంటారు. ఈసారి కూడా అలా గే చేశారు. అయితే డ్యూటీ వేశారని తెలియడంతోనే కొందరు టీచర్లు నేరుగా వైద్యులను సంప్రదించి, ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు మెడిక ల్ సర్టిఫికెట్ తీసుకొచ్చి.. మూల్యాంకనం విధుల నుంచి తప్పించాలని కోరారు. మరికొందరు తొలి రోజు విధులకు హాజరవ్వలేదు. కరీంనగర్, ఆదిలా బాద్ జిల్లాలో ఎక్కువ మంది ఇలా డుమ్మా కొట్టడంతో అధికారులు వారికి నోటీసులు జారీ చేశారు. కఠినంగా వ్యవహరించాల్సిందే.. మూల్యాంకన విధులకు హాజరవని టీచర్ల పట్ల కఠినంగా వ్యవహరించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించినట్టు తెలిసింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. బలమైన కారణాలుంటే తప్ప, మెడికల్ సర్టిఫికెట్లను అనుమతించకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే కొన్ని సంఘాల నేతలు తమ వారిని విధుల నుంచి తప్పించాలని ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆన్లైన్ మూల్యాంకన విధానం చేపడితే ఈ తిప్పలు ఉండవని.. విద్యాశాఖ ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. మొత్తంగా 30 లక్షలకుపైగా సమాధాన పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉండగా.. వివిధ సమస్యలతో ఈ ఏడాది స్పాట్ వాల్యూయేషన్ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది టెన్త్ ఫలితాల వెల్లడిపైనా ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఈ విషయమై పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేనను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె స్పందించలేదు. టీచర్లు చెప్తున్న ఇబ్బందులేమిటి? ♦ మూల్యాంకనం చేసే జవాబుపత్రాలకు ఒక్కోదానికి రూ.10 చెప్పున టీచర్లకు చెల్లిస్తారు. ఒక్కో టీచర్ రోజుకు 36 కన్నా ఎక్కువ సమాధాన పత్రాలను దిద్దలేరు. దూరప్రాంతాల నుంచి వచ్చే టీచర్లకు టీఏ, డీఏలేమీ ఇవ్వడం లేదు. పైగా మూల్యాంకన కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉండాలి. శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అని కొందరు టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ♦ మూల్యాంకన కేంద్రాలను ఎక్కువగా ప్రైవేటు స్కూళ్లలో ఏర్పాటు చేశారు. అక్కడ విద్యార్థు లు కూర్చునే చిన్న బల్లలు ఉన్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వాటిపై కూర్చుని పేపర్లు దిద్దడం కష్టంగా ఉంటోందని, వెన్నునొప్పి వస్తోందని టీచర్లు అంటున్నారు. ♦ ఈసారి ఆరు పేపర్లతోనే టెన్త్ పరీక్షలు నిర్వహించారు. గతంలో మొత్తంగా 11 పేపర్లు ఉండేవి. దీనితో ఎక్కువ పేపర్లు మూల్యాంకనం చేసే అవకాశం ఉండటం లేదని అంటున్నారు. ♦ స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాలకు టీచర్లు కచ్చితంగా ఉదయం 8.30 గంటలకు చేరుకోవాలి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా క్యాంపు ఆఫీసర్లు గేటు వద్దే ఆపేస్తున్నారు. దీన్ని టీచర్లు అవమానంగా భావిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న తమ కష్టాలు చూడకుండా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. -
ఇదేందయ్యా సారూ.. 20 ఏళ్లు విధులకు రాకున్నా పోస్టింగ్?
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో ఏళ్ళ తరబడి టీచర్లు స్కూళ్లు ఎగ్గొట్టినా, అసలు కన్పించకుండా పోయినా అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఓ ఉపాధ్యాయుడు 20 ఏళ్ళు ఉద్యోగమే చేయకపోయినా తిరిగి పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర వివాదాస్పదమైంది. ఇలా ఏళ్ళకు ఏళ్ళు స్కూల్ ముఖమే చూడని టీచర్లు ఒకరిద్దరు కాదు.. వంద మందికిపైగా ఉన్నారని అధికార వర్గాలే అంటున్నాయి. 2005 నుంచి ఇలాంటి వాళ్ళ కోసం జల్లెడ పడితే వంద మంది వరకూ గుర్తించామని చెబుతున్నారు. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపే ఉంటుందని తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు స్కూల్ ఎగ్గొడితేనే విద్యార్థిని పరీక్షలకు అనుమతించరు. అలాంటిది ఏళ్ళ తరబడి టీచర్ స్కూల్‌నే వదిలేస్తే కనీసంగా ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పత్తా లేని కాలంలో జీతాలు చెల్లించడం లేదు కదా అని సర్వీసులో ఉన్న మాస్టార్లను అలా ఎలా వదిలేస్తారన్న వాదనలు ఉత్పన్నమవుతున్నాయి. వాళ్ళేం చేస్తున్నట్టు? సాధారణంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు సెలవు పెట్టాలంటే ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే మళ్ళీ సెలవును పొడిగించుకోవాలి. లేదంటే గైర్హజరుగానే భావిస్తారు. నల్గొండ, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టీచర్లు మాత్రం సెలవు పెట్టిన దాఖలాల్లేవు. ఆ తర్వాత విద్యాశాఖకు తెలియజేసిన ఆనవాళ్ళూ లేవు. అసలా టీచర్లు స్కూల్‌కు రావడం లేదని మండల, జిల్లా స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు చెప్పిందీ లేదు. ఉపాధ్యాయ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు కొంతమంది టీచర్లు స్కూల్ మానేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో టీచర్లు ఏకంగా దుబాయ్ వంటి గల్ఫ్ దేశాలకు కూడా వెళ్ళినట్టు వెల్లడైంది. ఏడాది కన్పించకుండా పోతే సదరు టీచర్‌కు విద్యా శాఖ అధికారులు షోకాజ్ నోటీసు ఇవ్వాలి. కానీ ఐదేళ్ళు, పదేళ్ళు, ఏకంగా 20 ఏళ్ళు కన్పించకుండా పోయినా ఒక్క షోకాజ్ నోటీసు ఇవ్వలేదు. అసలు ఆ టీచర్ ఉన్నాడని తమకే తెలియదని మండల, జిల్లా అధికారులు అంటున్నారు. దీన్నిబట్టి విద్యాశాఖ నిర్లక్ష్యం ఏమేర ఉందో తెలుస్తోంది. 20 ఏళ్ళు గైర్హాజరైనా పోస్టింగా? జగిత్యాల జిల్లాలో ఓ సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) 2003 నుంచి విధులకు గైర్హాజరయ్యాడు. ఈ విషయాన్ని ఇటీవలే గుర్తించిన అధికారులు ఏ తరహా చర్యలు తీసుకోకపోగా, అతను తిరిగి విధుల్లో చేరతానని పెట్టుకున్న అర్జీని గుట్టు చప్పుడు కాకుండా ఆమోదించారు. ఓ హెచ్ఎంపై క్రమశిక్షణ చర్యలకు నోటీసు ఇవ్వడంతో ఈ విషయం బయటకొచ్చింది. 20 ఏళ్ళు విధుల్లోనే లేని వ్యక్తిని ఎలా తీసుకున్నారో అర్థం కావడం లేదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. జిల్లా అధికారులు మాత్రం రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు అతనిని తిరిగి విధుల్లోకి తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ విషయమై అధికారులు వింతగా స్పందించడం విశేషం. షోకాజ్ నోటీసు ఇచ్చామని, అతను విధుల్లో చేరతానని చెప్పాడని, చేరిన తర్వాత విచారణ జరిపి 20 ఏళ్ళు ఎందుకు గైర్హాజరైందీ తెలుసుకుని చర్యలు తీసుకుంటామని అధికారులు అంటున్నారు. దీనిపై వివరణ కోరేందుకు ప్రయత్నించగా పాఠశాల విద్య డైరెక్టర్ స్పందించలేదు. -
TS: ముగిసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్
ఎన్నికల పోలింగ్ అప్డేట్స్: ► మహాబూబ్ నగర్ ,రంగారెడ్డి ,హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 16వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ► మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ పొలింగ్ పర్సంటేజ్.. మధ్యాహ్నం 2:30 గంటల వరకు ( 77.11%), ఇబ్రహీంపట్నం మండలం పోలింగ్ 155 (76.32%), మంచాల మండలం పోలింగ్ 53 (85.48%), యాచారం మండలం పోలింగ్ 65 (77.64%) గా నమోదు అయ్యింది. ►మహబూబ్ నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పొలింగ్ ఉదయం 10 గంటల వరకు 19.54 శాతం నమోదైంది. ఇక జిల్లాల వారిగా చూస్తే.. మహబూబ్ నగర్ జిల్లా 19.30 శాతం, నాగర్ కర్నూల్ జిల్లా 19.20 శాతం, వనపర్తి జిల్లా 25.69 శాతం, గద్వాల్ జిల్లా 21.78 శాతం, నారాయణపేట్ జిల్లా 20.33 శాతం, రంగారెడ్డి జిల్లా 15.20 శాతం, వికారాబాద్ జిల్లా 16.19 శాతం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 17.21 శాతం, హైదరాబాద్ జిల్లా 21.00 శాతం నమోదైంది. హైదరాబాద్–రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 29,720 ఓటర్లు ఉండగా అందులో పురుషులు 15,472, మహిళలు 14,246, ఇతరులు ఇద్దరు ఓటర్లు ఉన్నారు. 137 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. టీచర్లు వివిధ ప్రాంతాలకు బదిలీ అవ్వడంతో కొంతమందికి రెండుచోట్ల ఓట్లున్నట్టు అభ్యర్థులు అభ్యంతరాలు లేవనెత్తడంతో అధికారులు వాటిని తొలగించారు. ► అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతోందని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికర పరిస్థితి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల అంశాలు ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. 317 జీవో వల్ల నష్టపోయిన టీచర్లు, బదిలీలు, పదోన్నతులపై ఆశలు సన్నగిల్లిన టీచర్లను సంతృప్తిపర్చడం ఉపాధ్యాయ సంఘాలకు ఇబ్బందికరంగా మారింది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి 2017 ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు పోటీపడగా ఈసారి 21 మంది బరిలో ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఆయన గత ఎన్నికల్లో పీఆర్టీయూటీఎస్ మద్దతుతో గెలవగా, ఈసారి పీఆర్టీయూ తెలంగాణ మద్దతుతో పోటీ చేస్తున్నారు. పీఆర్టీయూటీఎస్ ఈసారి గుర్రం చెన్నకేశవరెడ్డిని బరిలోకి దించింది. వీరిద్దరి మధ్య ఓట్ల విభజన ఎలా ఉంటుందనేది కీలకం. తెలంగాణ యూటీఎఫ్ అభ్యర్థిగా మాణిక్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఏవీఎన్ రెడ్డిని బీజేపీ అనుకూల సంఘాలు బలపరుస్తున్నా యి. సీపీఐ అనుబంధ సంఘం ఎస్టీయూటీఎస్ అభ్యర్థిగా బి.భుజంగరావు, టీపీటీఎఫ్, బీఎస్పీ మద్దతుతో ఆచార్య వినయ్‌బాబు, బీసీటీఏ నుంచి విజయకుమార్ పోటీచేస్తున్నారు. టీయూటీఎఫ్ మద్దతులో మల్లారెడ్డి, జీటీఏ సహకారంతో ప్రభాకర్, లోకల్ కేడర్ జీటీఏ మద్దతుతో రవీందర్ పోటీలో ఉన్నారు. కాటేపల్లి జనార్దన్ రెడ్డికి అప్పట్లో టీఆర్ఎస్ మద్దతు తోడైంది. ఈసారి అధికార పార్టీ తో సంబంధం లేకుండా ప్రచారం నిర్వహించారు. ఆఖరి వరకూ ప్రచారం: ప్రచారంలో అన్ని పక్షాలూ ఉపాధ్యాయ సంఘాలు ఓట్లున్న ప్రతీ స్కూల్, కాలేజీకి వెళ్లాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి నిమిషం వరకూ ప్రయత్నించాయి. మూడు నెలలుగా అభ్యర్థులు వారి వ్యూహాల్లో మునిగి తేలుతున్నా, ఆఖరి మూడురోజుల్లో మాత్రం పెద్దఎత్తున ప్రచారం నిర్వహించారు. ఓటర్లకు డబ్బులు కూడా పంచినట్టు కొందరు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. -
స్కూల్ టీచర్లకూ ‘ఇంటర్’ విధులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల పకడ్బందీ నిర్వ హణకు కసరత్తు మొదలైంది. ప్రైవేట్ కాలేజీలతో మిలాఖత్ అయ్యేవారికి చెక్ పెట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెల 15 నుంచి మొదలయ్యే ఈ పరీక్షల విధుల్లోకి స్కూల్ టీచర్లను కూడా తీసుకోవాలని ఇంటర్ బోర్డ్ నిర్ణయించింది. ఇంటర్ కాలేజీ అధ్యాపకుల కొరత ఉన్నచోట టీచర్ల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువుండే రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెకండరీ గ్రేడ్ టీచర్లను పరీక్షల విధులకు తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,473 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఇంటర్ బోర్డ్ తెలిపింది. ఈ ఏడాది ఫస్టియర్ ఇంటర్‌కు 4,82,619 మంది, సెకండియర్‌కు 4,65,391 మంది హాజరవుతున్నట్టు పేర్కొంది. ప్రైవేటు కాలేజీలతో మిలాఖత్ అయినట్టు ఆరోపణలున్న పరీక్షాకేంద్రాలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నారు. ఆయా కాలేజీల్లో వీలైనంత వరకూ క్లీన్ రికార్డు ఉన్నవారికే ఇన్విజిలేషన్ బాధ్యతలు అప్పగించనున్నారు. భద్రత మరింత పెంపు కొత్తగా ప్రవేశపెడుతున్న ఆన్లైన్ మూల్యాంకన విధానాన్ని అభాసుపాలు చేసేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారనే ఆందోళన అధికారుల్లో ఉంది. వారికి అనుకూలంగా ఉండే బోర్డ్ సిబ్బందితో కలిసి వ్యతిరేక కార్యకలాపాలు సాగించే వీలుందని ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో ప్రతీ పరీక్షకేంద్రం సమీపంలో విస్తృతంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ పుటేజీని ఇంటర్‌బోర్డ్‌లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బయటవ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటున్న వారిపై ఇంటర్ బోర్డ్ నిఘా పెట్టింది. క్షేత్రస్థాయిలోనూ సమీక్షిస్తున్నాం ఎక్కడా ఆరోపణలకు తావివ్వకుండా ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. క్షేత్రస్థాయిలో వాస్తవపరిస్థితులు, తీసు కోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షిస్తున్నాం. విద్యార్థులకు అసౌకర్యం లేకుండా చేయడమే కాదు. పరీక్షకేంద్రాల్లో ఎలాంటి పక్షపాతానికి తావివ్వని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నాం. అన్నివర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. – జయప్రదాబాయి, ఇంటర్ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రతీ విద్యార్థి స్వేచ్ఛగా రాసేలా చర్యలు ఇంటర్ పరీక్షలను మంచి వాతావరణంలో ప్రతీ వి ద్యార్థి రాయాలని కోరు కుంటున్నాం. ఈసారి తొలి దశలో కొన్ని పేపర్ల కు ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నాం. దీ నిపై విమర్శలు చేసే శక్తుల ప్రమేయం పరీక్ష లపై ఉండరాదని అధికారులను ఆదేశించాం. – నవీన్ మిత్తల్, ఇంటర్ బోర్డ్ కార్యదర్శి -
తెలంగాణలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.. మీకెందుకు ఓటెయ్యాలి..?
సాక్షి, హైదరాబాద్: ‘మహబూబ్‌నగర్– హైదరాబాద్– రంగారెడ్డి’ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం ఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో ఆందోళన పెరుగుతోంది. విద్యాశాఖలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో.. ఓటర్లను ఆకట్టుకోవడం తలనొప్పిగా మారుతోంది. బదిలీలు, పదోన్నతులు పూర్తవకపోవడం, 317 జీవో ద్వారా టీచర్లు ఇష్టంలేని ప్రాంతాల్లో పనిచేయాల్సి రావడం, భాషా పండితుల వివాదం వంటివి ఎమ్మెల్సీ ఎన్నికపై ప్రభావం చూపుతున్నాయి. ఉపాధ్యాయులకు ఫలానా మేలు చేశామని నేతలు బలంగా చెప్పుకొని ఓట్లు అడిగే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. అభ్యర్థులు ఎక్కడికెళ్లినా.. ఓటెందుకు వేయాలని, సమస్యలు ఏం పరిష్కరించారని నిలదీస్తున్న పరిస్థితి ఎదురవుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. దీనికి తగిన సమాధానం చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. అంతేకాదు టీచర్ల అసంతృప్తికి ప్రభుత్వ నిర్ణయాలే కారణమని వివరించేందుకు అనుకూల సంఘాలు ముందుకురాని పరిస్థితి. సంఘాల నేతలతో కలసి వెళ్తే.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులను ఏదో ఒక సంఘం బలపరుస్తోంది. వారి మద్దతుతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు వెళ్లాల్సి వస్తోంది. ఇది కూడా తమకు సమస్యగా మారిందని అభ్యర్థులు చెప్తున్నారు. ఏళ్ల తరబడి బదిలీలు, పదోన్నతులు జరగలేదు. ఎన్నికల ముందు షెడ్యూల్ ఇచ్చినా రోజుకో వివాదం వెంటాడుతోంది. వేసవి సెలవుల వరకు ఈ ప్రక్రియ ముందుకు సాగేట్టు కన్పించడం లేదు. కొంతమందిని మాత్రం రాజకీయ పైరవీలతో బదిలీలు చేశారు. ఏ ఉపాధ్యాయ సంఘం కూడా ఈ పైరవీ బదిలీలను గట్టిగా వ్యతిరేకించిన దాఖలాల్లేవు. ఈ నేపథ్యంలో సంఘాల నేతలపై టీచర్లు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు కోర్టు వివాదాల నేపథ్యంలో బదిలీలు, పదోన్నతులకు నోచుకోని భాషా పండితుల్లో సంఘాల పట్ల తీవ్ర అసంతృప్తి ఉంది. స్పౌజ్‌లు, నాన్–స్పౌజ్, 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లు సంఘాల నేతలను నిలదీసేందుకు ఇదే అవకాశంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో సంఘాల నేతలను ప్రచారానికి తీసుకెళ్తే ప్రతికూలత తప్పడం లేదని అభ్యర్థులు చెప్తున్నారు. రకరకాల హామీలు ఇస్తున్నా.. పోటీ తీవ్రత ఎక్కువగా ఉండటంతో టీచర్ ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల నాటికే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ తెప్పించిన ఘనత తమదేనని ప్రభుత్వ సానుకూల టీచర్ సంఘాలు చెప్తున్నాయి. తాము మద్దతిస్తున్న అభ్యర్థులను గెలిపిస్తే ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే బాధ్యత తమదని అంటున్నాయి. మరోవైపు ప్రమోషన్లు, బదిలీల షెడ్యూల్ రావడానికి తమ పోరాటాలే కారణమని, ప్రతీ సమస్య పరిష్కారంలో తామే ముందుంటున్నామని మరికొన్ని సంఘాలు ఓటర్లకు వివరిస్తున్నాయి. ఇక స్వతంత్రంగా పోటీ చేస్తున్న అభ్యర్థులు మాత్రం.. ప్రభుత్వంపై, సంఘాలపై టీచర్లలో నెలకొన్న అసంతృప్తి తమకు కలసివస్తుందని భావిస్తున్నారు. పోటీ ఎక్కువగానే.. ‘మహబూబ్‌నగర్– హైదరాబాద్– రంగారెడ్డి’టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో 29,501 ఓట్లు ఉన్నాయి. ఇందులో 15,425 పురుష, 14074 మహిళా టీచర్లు ఉన్నారు. ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. సోమవారం నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పలువురి పేర్లను ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. టీఎస్ యూటీఎఫ్ అభ్యర్థిగా పాపన్నగారి మాణిక్ డ్డి, పీఆర్టీయూ టీఎస్ నుంచి గుర్రం చెన్నకేశవరెడ్డి, ఎస్టీయూటీఎస్ నుంచి బి.భుజంగరావు, పీఆర్టీయూ తెలంగాణ నుంచి కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, టీపీటీఎఫ్ నుంచి వినయబాబు, బీజేపీ మద్దతులో ఎవీఎన్ రెడ్డి, జీటీఏ నుంచి కాసం ప్రభాకర్, ఎల్సీ జీటీఏ నుంచి ఎస్.రవీందర్, బీసీటీఏ నుంచి విజయకుమార్, టీయూటీఎఫ్ నుంచి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. సాంకేతిక విద్యాసంస్థల్లోని అధ్యాపక ఓట్లనే నమ్ముకుని బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థిగా అయినేని సంతోష్ కుమార్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి బరిలోకి దిగుతున్నా.. సమర్థించే సంఘాలు కన్పించడం లేదు. -
AP: స్టూడెంట్-టీచర్ నిష్పత్తిలో ఉత్తమం
సాక్షి, అమరావతి: మూడున్నరేళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యారంగ సంస్కరణలు, అత్యుత్తమ బోధనా విధానాలు, శిక్షణా కార్యక్రమాలు, నాడు – నేడు ద్వారా పాఠశాలలను మౌలిక వసతులతో తీర్చిదిద్దడం సత్ఫలితాలనిస్తున్నట్లు మరోసారి తేటతెల్లమైంది. జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక తదితర ప్రోత్సాహాలతో ప్రభుత్వ పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల చేరికలు పెరగగా అందుకు తగ్గట్లుగా ఉపాధ్యాయులను సమకూర్చడంతో నాణ్యమైన బోధన అందుతోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి (పీపుల్, టీచర్ రేషియో)లో ఆంధ్రప్రదేశ్ మెరుగైన స్థితిలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇతర పెద్ద రాష్ట్రాల కన్నా ఏపీలో పరిస్థితి ఎంతో బాగున్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈమేరకు కేంద్ర విద్యా శాఖ ఈనెల 13వతేదీన పార్లమెంట్‌కు లిఖిత పూర్వకంగా తెలియచేసింది. రాష్ట్రాలవారీగా పీపుల్, టీచర్ రేషియో వివరాలను వెల్లడించాలని యూపీకి చెందిన బీజేపీ ఎంపీ అజయ్‌నిషాద్ కోరగా లోక్‌సభకు వివరాలను సమర్పించింది. ►2021–22 గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు – ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రైమరీ స్కూళ్లలో 24 : 1గా, అప్పర్ ప్రైమరీలో 17 : 1 చొప్పున ఉంది. అంటే ప్రైమరీ తరగతుల్లో 24 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండగా అప్పర్ ప్రైమరీలో 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున టీచర్ ఉన్నారు. ►పాఠశాల విద్యకు ఆయువు పట్టు లాంటి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని జాతీయ విద్యాహక్కు చట్టం 2009లో స్పష్టంగా నిర్దేశించారు. ఈ చట్టం ప్రకారం పీపుల్, టీచర్ రేషియో ప్రైమరీలో 30 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (30 : 1) ఉండాలి. అప్పర్ ప్రైమరీలో 35 మంది విద్యార్ధులకు ఒక టీచర్ (35 : 1) ప్రకారం ఉండాలని పేర్కొన్నారు. అయితే ఏపీలో అంతకంటే మెరుగ్గా టీచర్లు అందుబాటులో ఉండటం గమనార్హం. ►ఏపీలో పీపుల్, టీచర్ రేషియో జాతీయ సగటుకన్నా మెరుగ్గా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. విద్యార్ధులు – ఉపాధ్యాయుల నిష్పత్తి జాతీయ స్థాయిలో ప్రైమరీలో 28 : 1 కాగా అప్పర్ ప్రైమరీలో 24 : 1 చొప్పున ఉంది. పెద్ద రాష్ట్రాల కంటే మెరుగ్గా.. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ప్రమాణాలతో విద్యా బోధన జరుగుతున్నట్లు కేంద్రం విడుదల చేసిన సమాచారాన్ని విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. దశాబ్దాలుగా విద్యారంగంలో అగ్రస్థానంలో కొనసాగిన కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల కంటే ఏపీలో టీచర్ల నిష్పత్తి మెరుగైన స్థితిలో ఉన్నట్లు వెల్లడవుతోంది. విద్యాహక్కు చట్టం ప్రకారం అప్పర్ ప్రైమరీలో 35 : 1 నిష్పత్తిలో పీపుల్, టీచర్ రేషియో ఉండాలి. ఏపీలో అంతకంటే మెరుగ్గా 17 మంది విద్యార్ధులకు ఒకరు చొప్పున ప్రభుత్వం టీచర్లను నియమించింది. -
Telangana: అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి
తెలంగాణ ప్రభుత్వం దాదాపు 8 సంవత్సరాల తర్వాత ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు అనుమతి ఇచ్చింది. దాదాపు 25 వేల నుండి 30 వేల మంది ఉపాధ్యాయులు ఇప్పుడు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం గత సంవత్సరం 317 జీవో ద్వారా కొత్త జిల్లాలకి సీనియర్, జూనియర్ లిస్టుల పేరుతో ఉపాధ్యా యులను కేటాయించింది. మొత్తం లక్ష 5 వేల మందిలో 25 వేల మంది ఒక జిల్లా నుండి మరొక జిల్లాకి బదిలీ అయ్యారు. మిగతా 80 వేల మంది పని చేసే చోటే మళ్ళీ పోస్టింగ్ పోందినారు. ఇప్పుడు అందరు టీచర్లకు బదిలీ అవకాశం ఇవ్వాలి. నచ్చిన చోట ఖాళీ ఉంటే వెళ్ళే వెసులు బాటు ఇవ్వాలి. కొందరి లబ్ధి కోసం 317 జీవో అమలు చేసి మళ్ళీ ఇప్పడు వేరే జిల్లాలకి బదిలీ అయిన టీచర్లకు 2 సంవత్సరాల సర్వీస్ రూల్ ఉండాలనడం అర్థం లేని నిబంధన. ఇక 80 వేల ఉద్యోగాల్లో భాగంగా ఇప్పటికే వివిధ ఉద్యోగాలకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడం, నోటిఫికేషన్లు జారీ కావడం జరుగుతోంది. కానీ టెట్ ముగిసి 8 నెలలు అవుతున్నా ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి టీఆర్టీ నోటిఫికేషన్ జారీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వకపోవడం వల్ల 4 లక్షల మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. టెట్‌లో ఉత్తీర్ణత పొందనివారూ, కొత్తగా డీఎడ్, బీఎడ్ పూర్తి చేసిన బ్యాచులవారూ మరో టెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఖాళీల వివరాలు వెల్లడి అవుతాయి. సంవత్సరం క్రితం ఆర్థిక శాఖ అనుమతి కోసం 9,600 పోస్టులతో విద్యాశాఖ అధికారులు ఫైల్ పంపినారు. అది ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. ఇప్పుడు టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏర్పడే 10 వేల ఖాళీలను కూడా పాత ఖాళీల్లో కలిపి భారీ డీఎస్సీ విడుదల చేయాలని నిరుద్యోగులు కోరు కుంటున్నారు. – రావుల రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం అధ్యక్షులు -
ఆప్ Vs గవర్నర్ల మధ్య చిచ్చురేపిన టీచర్ల ఫిన్లాండ్ పర్యటన!
ఆప్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య మళ్లీ మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. దాదాపు 30 మంది ప్రైమరీ టీచర్లను ఫిన్లాండ్కి శిక్షణ నిమిత్తం పంపాలన్న ప్రణాళిక నేపథ్యంలో ఇరువురు మధ్య మాటల ఘటర్షణకు దారితీసింది. ఐతే లెఫ్టినెంట్ గర్నర్ టీచర్ల పర్యటనను రద్దు చేసేలా ప్రశ్నలు సంధించారంటూ డిప్యూటీ మంత్రి మనీష్ సిసోడియా పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ మేరకు సిసోడియా ట్విట్టర్లో..."ప్రైమరీ టీచర్ల శిక్షణ కోసం విదేశాలకు పంపించే తొలి ప్రభుత్వం ఇది. గవర్నర్ దేశంలోనే టీచర్లకు శిక్షణ ఎందుకు ఇవ్వకూడదంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా పిల్లల భవిష్యత్తుకు ఖరీదు కడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. బీజేపీని టార్గెట్ చేస్తూ..దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలకు వెళ్లే మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..కుటుంబాలతో సహా వెళ్లే మంత్రుల గురించి ప్రశ్నించారు. అప్పుడూ ఖర్చు, ప్రయోజనాల గురించి ఆలోచించారా! అని నిలదీశారు. పిల్లల ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యంగ విరుద్ధంగా భావిస్తున్నారు. మీకు ముకుళిత హస్తలతో జోడించి మరీ చెబుతున్న ఢిల్లీ విద్యాభివృద్ధి కోసం తీసుకుంటున్న నిర్ణయాలను అడ్డుకునే కుట్రలో ఒక లెఫ్టినెంట్ గవర్నర్‌గా బీజేపీకి సాయం చేయొద్దు" అని ట్విటర్లో విజ్ఞప్తి చేశారు సిసోడియా. ఐతే లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం మాత్రం ఆ ఆరోపణలను ఖండించింది. ఇది సరికాదని తాము ఫిన్లాండ్లో ప్రైమరీ టీచర్లకు శిక్షణా కార్యక్రమానికి సంబంధించిన ప్రతిపాదనను తిరస్కరించలేదని గవర్నర్ కార్యాలయం ట్వీట్ చేసింది. మరోవైపు బీజేపీ కూడా ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ...ఆప్ తన అహం కోసం ఏదిపడితే అది చేయడం మానుకోవాలి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఆ వివరాలు అడిగే హక్కు ఆయనకు ఉంది. అయినా ఖర్చుల వివరాల గురించి వివరణ ఇవ్వడంలో సమస్య ఏమిటి ?. ఉపాధ్యాయుల గురించి ఇంత ఆందోళన చెందుతున్నప్పుడూ..ఇంకా నలుగురు ఉపాధ్యాయులకు ఎందుకు జీతాలను చెల్లించలేకపోయారు అని బీజేపీ పార్టీ నాయకుడు హరీష్ ఖురానా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉండగా, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ప్రభత్వ సందేశాలుగా ఇచ్చే రాజకీయ ప్రకటనల కోసం ఖర్చు చేసిన సుమారు రూ. 163.62 కోట్లను దాదాపు 10 రోజుల్లో చెల్లించాలని ఆప్‌ని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేని పక్షంలో ఢిల్లీలోని దాని కార్యాలయం, ఇతర ఆస్తులను సీలు చేస్తామని గవర్నర్ కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది కూడా. (చదవండి: పాఠశాలల్లో ఉపాధ్యాయులను సార్! మేడమ్ అని పిలవకూడదు! విద్యాశాఖకు కీలక ఆదేశాలు) -
Telangana: ‘టెన్త్’కు కఠిన పరీక్ష!
‘పరీక్షల’పై ప్రశ్నలు, ఆందోళనలివీ.. ► టెన్త్ పరీక్షల్లో గతంలో ఇచ్చినట్టుగా ఈసారి రెండు, మూడు మార్కుల సూక్ష్మ ప్రశ్నలకు చాయిస్ ఇవ్వలేదు. ఆరు చొప్పున ప్రశ్నలిచ్చి అన్నీ రాయాలన్నారు. ఏ ఒక్క ప్రశ్న తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. అన్ని చాప్టర్లపై పట్టులేనప్పుడు దీనితో చాలా నష్టం. ► వ్యాసరూప ప్రశ్నల తీరును కఠినం చేశారు. సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపు మాదిరి చాయిస్ ఇవ్వడం విద్యార్థులకు ఇబ్బందేనని నిపుణులు చెప్తున్నారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలి. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి ఒక్కో గ్రూప్‌లో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ప్రశ్నలు ఇచ్చారు. ప్రతి గ్రూప్‌లోని రెండు ప్రశ్నల్లో ఒకదానికి సమాధానం రాయాలి. ఆ రెండింటికి సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు. ► పరీక్ష సమయం మొత్తం 3 గంటలు.. ఇందులో ఆరు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికే రెండు గంటల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు. ముందే మిగతా ప్రశ్నలకు జవాబులు రాస్తే.. వ్యాసరూప ప్రశ్నలకు సమయం సరిపోదని అంటున్నారు. అందువల్ల వ్యాసరూప ప్రశ్నలను నాలుగుకు తగ్గించాలని సూచిస్తున్నారు. ► సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్/కెమిస్ట్రీ ఒకటి.. బయాలజీ మరొకటిగా పేపర్లు ఉంటాయి. రెండింటి ప్రిపరేషన్ వేర్వేరుగా ఉంటుంది. వీటన్నింటినీ ఒకేరోజు, ఒకే సమయంలో పెట్టడం వల్ల విద్యార్థులకు ఇబ్బంది తప్పదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రశ్నపత్రంలో చాయిస్ పెంచాలి ప్రశ్నపత్రంలో జవాబుల చాయిస్ పెంచాలి. అన్ని విభాగాల్లో కనీసం 30 శాతమైనా ఇవ్వాలి. విరామం లేకుండా పరీక్షల నిర్వహణ అశాస్త్రీయం. తక్షణమే పరీక్షల తీరుపై అధికారులు సమీక్షించాలి. – రాజా భానుచంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: ఎస్సెస్సీ పరీక్షల చుట్టూ వివాదం ముసురుతోంది. పరీక్ష విధానం, నిర్వహణ, సిలబస్, చాయిస్‌లలో చేసిన మార్పులపై పునః సమీక్షించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. పరీక్షలకు సంబంధించిన మోడల్ పేపర్లను పరిశీలించిన ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ అభ్యంతరాలు తెలిపాయి. తమ సూచనలను పరిగణనలోకి తీసుకోకుంటే.. విద్యార్థులకు ఇబ్బంది తప్పదని, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. ఈ అంశాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుండటంతో.. విద్యాశాఖ ఉన్నతాధికారులు డోలాయమానంలో పడ్డారు. మోడల్ పేపర్లను చూసి.. ఇటీవల టెన్త్ పరీక్షల టైం టేబుల్ విడుదల చేసిన ఎస్సెస్సీ బోర్డు పరీక్షల మోడల్ పేపర్లనూ ఆన్లైన్లో పెట్టింది. ఈ మోడల్ పేపర్లను బట్టి పరీక్ష విధానం కఠినంగా ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు నిర్ధారణకు వచ్చాయి. అసలే కోవిడ్ వల్ల రెండేళ్లుగా అభ్యసన నష్టాలు ఉన్నప్పుడు పరీక్షను కఠినతరం చేస్తే విద్యార్థులకు నష్టమని అంటున్నాయి. టెన్త్ పరీక్షలు రాయబోయే దాదాపు 5 లక్షల మంది విద్యార్థుల్లో.. 2 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లవారు ఉంటారని.. వీరిలో 1.2 లక్షల మంది కనీస స్థాయిలో, మరో 45 వేల మంది అంతకన్నా తక్కువగా సబ్జెక్టు పరిజ్ఞానం ఉన్నట్టు ఇటీవలి అంచనాల్లో వెల్లడైందని పేర్కొంటున్నాయి. కోవిడ్ పరిణామాలతో ప్రైవేటు విద్యార్థుల్లోనూ ప్రమాణాలు తగ్గాయని.. ఇలాంటప్పుడు క్లిష్టమైన ప్రశ్నలు, సంక్లిష్టమైన సమాధాన రూపం ఉండటం సరికాదని స్పష్టం చేస్తున్నాయి. గ్యాప్ ఇవ్వాల్సిందే.. సీబీఎస్సీ సిలబస్‌తో కొనసాగే కేంద్ర విద్యాసంస్థల్లో ప్రతీ పరీక్షకు మధ్య సన్నద్ధతకు సెలవు ఉంటుంది. మన రాష్ట్ర ఎస్సెస్సీ బోర్డ్ మాత్రం ఈ విధానాన్ని పాటించ లేదు. ప్రభుత్వ సెలవు దినాలు మినహా ప్రతీ సబ్జెక్టు పరీక్షల మధ్య విరామం ఇవ్వలేదు. ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లుగా పరీక్షలు (40 మార్కుల చొప్పున) నిర్వహించినప్పుడు మధ్యలో ఒకరోజు విరామం ఇచ్చారు. ఇప్పుడు మొత్తం 80 మార్కులతో ఒకే పరీక్ష నిర్వహించనున్నా మధ్యలో విరామం ఇవ్వకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ విషయాన్ని విద్యామంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని.. కోవిడ్ నష్టాలున్న కాలం కాబట్టి విరామం, ఇతర వెసులుబాట్లు అమలు చేయాలని కోరినట్టు ఉపాధ్యాయ సంఘాల నేతలు చెప్తున్నారు. చాయిస్ పెంచాలి.. ఒకే పేపర్‌గా పరీక్ష నిర్వహిస్తుండటం వల్ల విద్యార్థులకు ఇబ్బంది లేకుండా.. ప్రశ్నపత్రంలోని ఒకటి, రెండు సెక్షన్లలో కూడా చాయిస్ ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 2 మార్కులు, 3 మార్కుల ప్రశ్నలకు కనీసం 30శాతం చాయిస్ ఇవ్వాలని అంటున్నారు. మూడో సెక్షన్లో వ్యాస రూప ప్రశ్నలను తగ్గించాలని.. ఫిజిక్స్/కెమిస్ట్రీ, బయాలజీ పరీక్షలు ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలని సూచిస్తున్నారు. ఎస్సెస్సీ బోర్డు ఈ సూచనలు పాటించకపోతే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ఉత్తీర్ణత శాతం దెబ్బతింటుందని స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ముందుగా బోధన ప్రారంభం కావడం, రివిజన్ రెండు సార్లు చేయడం వల్ల తేలికగా పరీక్షలు రాసే వీలు ఉందని అంటున్నారు. అదే ప్రభుత్వ స్కూళ్లలో ఇప్పటికీ సిలబస్ పూర్తి కాలేదని, ఉపాధ్యాయుల కొరత ఇబ్బందికరంగా మారిందని చెప్తున్నారు. పరీక్షల తీరులో మార్పులు చేయాలి రెండేళ్లుగా కోవిడ్ వల్ల తరగతులే సరిగా జరగలేదు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థుల ప్రమాణాలకు తగ్గట్టుగా ప్రశ్నపత్రాలు ఉంటే మంచిది. కానీ మోడల్ పేపర్లు చూస్తే చాలా కఠి నంగా ఉన్నాయి. పరీక్షలపై సంఘాల నేతలతో కలిసి చర్చించి, మార్పులు చేయాలి. – చావా రవి, టీఎస్ యూటీఎఫ్ వ్యాస రూప ప్రశ్నలు తగ్గించాలి మోడల్ పేపర్లను బట్టి చూస్తే వ్యాస రూప ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉంది. వాటిని తగ్గించాలి. భౌతిక, రసాయన శాస్త్రాలు.. జీవశాస్త్రం పేపర్లను ఒకేరోజు కాకుండా వేర్వేరు రోజుల్లో నిర్వహించాలి. – బీరెల్లి కమలాకర్‌రావు, పీఆర్టీయూటీఎస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
వర్ణమాల నేర్పడం ఓ ప్రయోగం!
చిన్నమెదళ్ళపై ఒక పెద్ద ప్రయోగమే వర్ణమాల! దగ్గర దగ్గర పోలికలు గల అక్షరాలు ఉండడం వల్ల అభ్యసన క్రమంలో గుర్తించటం... కొందరికి కష్టంగానూ, మరికొందరికి ఇష్టంగానూ, ఇంకొం దరికి గందరగోళంగానూ ఉంటుంది. నేర్చుకోవ డానికి కొందరికి 6 మాసాలు పడితే మరి కొందరికి ఒక ఏడాది కాలం పడుతుంది. ఇంకొం దరికైతే అది ఒక సాహసం లాంటిది. అక్షరాలను గుర్తుపట్టలేక పాఠశాలకు ఎగనామం పెట్టే విద్యా ర్థులు కూడా ఉంటారు, ఉన్నారు కూడా. ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో నమోదు అయిన విద్యార్థి ఏయే అంశాలు పూర్తిస్థాయిలో నేర్చుకున్నాడు, ఆ విద్యార్థి రెండవ తరగతికి అర్హుడా, కాదా అనేది ఆ తరగతి బోధిస్తున్న ఉపాధ్యాయుడి సలహాతో పని లేదా? ఒక ఏడాది కాలంలో ఒకటవ తరగతిలో విద్యార్థి నేర్చుకోవలసిన అంశాలు... వర్ణ మాల, ఒత్తులు, గుణింతాలు, పాఠ్య పుస్తకంలోని సంసిద్ధత పాఠాలు 7, నేర్చు కోవలసిన పాఠాలు 25. ఇది సులభమా? ఇదికాక విదేశీ బాష (ఆంగ్లం) నేర్పడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు, మూడవ తర గతి వచ్చేసరికి పరిసరాల విజ్ఞానం నేర్పడం... పై తరగతుల్లో హిందీ నేర్పడం... ఇవన్నీ కూడా ఉపాధ్యా యుడికి ఒక ప్రయోగం లాంటివే. ఉపాధ్యాయులకు ఏపీఈపీ, డీపీఈపీ, సీఎల్ఐపీ, సీఎల్ఏపీ, క్యూఐపీ, ఎన్‌ఐఎస్‌టీఏ, ఎఫ్ఎల్ఎన్ లాంటి శిక్షణలు ఎన్ని ఇచ్చినా నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే (ఎన్ఏఎస్) వంటివాటిల్లో వెల్లడైనట్లు... భాష సామర్థ్యాలలో ఎందుకు విద్యార్థులు వెనుకబడ్డారనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. విద్యార్థులు నేర్చుకోవలసిన అంశాలను పూర్తి స్థాయిలలో నేర్చు కోకుండా ‘నో డిటెన్షన్ పాలసీ’ (ఎన్డీపీ) ఒక అవరోధంగా మారింది. ఎన్డీపీ ఉద్దేశం 1 నుండి 8వ తరగతి వరకు విద్యార్థులందరినీ పై తర గతులకు ప్రమోట్ చేయడమే. విద్యార్థికి భాషా సామర్థ్యాలైన ఎల్ఎస్ ఆర్‌డబ్ల్యూపై అవగాహన ఉన్నదా లేదా అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇందు మూలంగా విద్యార్థులకు నష్టం జరుగు తోంది. అసలు ఎన్డీపీ ఉద్దేశమే అక్షరాస్యత శాతం పెంచడం. 1వ తరగతి పూర్తి స్థాయిలో అభ్యసనం జరిగిన తరువాతే, రెండవ తరగతికి, అలాగే 8వ తరగతి వరకు ప్రమోట్ చెయ్యాలి. ఈ విధంగా చేయడం వలన పై తరగతుల విద్యను సులభంగా నేర్చుకోగులుగు తారు. అభ్యసనం సులభంగా ఉంటుంది. నేర్చుకోవడంలో తృప్తి, ఆనందం లభిస్తుంది. అభ్యసనంలో మెళకువలు తెలుస్తాయి. అప్పుడు ప్రతి అంశం సులువు అనిపిస్తుంది. మన తెలుగు వర్ణమాలతో పోల్చుకున్నప్పుడు ఆంగ్ల అక్షరములు నేర్చుకోవడం సులువు. మన తెలుగు వర్ణమాలలో ఉన్న ఒకే పోలికలతో ఉన్న అక్షరాలూ, ఒకే శబ్దంతో ఉన్న అక్షరాలూ, భిన్న శబ్దాలతో ఉన్న అక్షరాలూ పిల్లలు అర్థం చేసుకోడానికి ఇబ్బందిగా ఉంటాయి. లక్ష్య సాధనలో విద్యార్థి స్థాయికెళ్లి ఆలోచన చేస్తే, ఇది ఒక ప్రయోగం లాంటిది. పౌరులకు నాణ్యమైన విద్య అందించకపోతే, సమాజం మను గడ దిగజారి పోతుంది. ఉన్నత ప్రమాణాలతో వైద్యవిద్య, నేర్చుకొన్న వైద్యుడు రోగులను ఆరోగ్య వంతులుగా మారుస్తాడు. అలాగే ఒక ఇంజనీర్ అనేకమైన అద్భు తమైన కళాఖండాలను నిర్మిస్తాడు. ఉన్నత విద్యావంతుల మూలంగా నూతన పురోగతి సాధిస్తాం. శాస్త్ర వేత్తలూ, మేధావులూ, నాయకులను తయారు చేయగల సామర్థ్యం ఒక విద్యకు మాత్రమే ఉన్నది. అందుకే ప్రాథమిక స్థాయి విద్యను పటిష్టం చేసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఉపాధ్యాయడికి నేర్పవలసిన బాధ్యత ఎంతైతే ఉన్నదో విద్యార్థికి కూడ నేర్చుకోవలసిన బాధ్యత కూడా అంతే ఉన్నది. పాఠశాలలు నిర్మించి వాటి నిర్వహించడానికీ, ఎప్పటికప్పుడు విద్యావ్యవస్థకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడానికీ ప్రభు త్వాలు చాలా ఖర్చు చేయవలసి ఉంటుంది. విద్యార్థి సర్వతోముఖా భివృద్ధికి తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు ఒక్కొక విద్యార్థిపై రూ. 1,50,000గా తేలింది. విద్యపై చేస్తున్న ఖర్చునూ, విద్యా ప్రమాణాలనూ దృష్టిలో పెట్టుకుని సమాజం, తల్లిదండ్రులు విద్యా వ్యవస్థలో తమ వంతు పాత్రను బాధ్యతతో నిర్వహించాలి. పిల్లలు నేర్చుకోవడానికి కావలసిన వాతావరణాన్ని సృష్టించాల్సిన బాధ్యత మనందరిదీ! ఉయ్యాల ప్రసాదరావు వ్యాసకర్త సీనియర్ ఉపాధ్యాయుడు మొబైల్ : 80082 87954 -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తాం
మన్సూరాబాద్: అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (ఎస్టీయూటీఎస్) వజ్రోత్సవాలను సహచర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డిలతో కలసి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతగల పౌరులను సమాజానికి అందించాల్సిన బాధ్య త ఉపాధ్యాయులపై ఉందని, విలువలతో కూడిన విద్య అందించడంలో కలసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధుల్లో కోతలతో కొంత మేర ఇబ్బందులు తలెత్తుతున్నాయని... అందుకే ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాల చెల్లింపులో కాస్త జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. చదువులపై భారీగా ఖర్చు... రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని కొందరు పసలేని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు విద్యారంగానికి కేటాయించిన నిధులతోపాటు తమ ప్రభుత్వం ఏర్పడ్డాక కేటాయిస్తున్న నిధుల వివరాలను గణాంకాలతో ఆయన వివరించారు. విద్యారంగానికి కేటాయిస్తున్న నిధులు బడ్జెట్లో 10 శాతానికి పైగానే ఉంటున్నాయని తెలిపారు. కేజీ టు పీజీ విద్యను పక్కా ప్రణాళికతో అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలోనే మొదట అటవీ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదేనన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదటిసారిగా 43 శాతం, తరువాత 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దేశంలో అత్యధికంగా జీతాలు పొందుతున్న ఉద్యోగులంటే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులని, అందులో ఉపాధ్యాయులే అత్యధికంగా ఉన్నారన్నారు. కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తొలి నుంచీ ప్రభుత్వానికి అండగా ఉపాధ్యాయులు: మంత్రి సబిత ఉపాధ్యాయులు మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వానికి అండగా ఉన్నారని, ఎస్టీయూటీఎస్ సంఘం శతాబ్ది ఉత్సవాలను జరుపుకోవాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు ఎన్ని సమస్యలున్నా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సమస్యలపై పోరాడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఉపాధ్యాయుల, ప్రమోషన్లు, బదిలీల విషయంలో సమస్యలు ఉత్పన్నం కాకుండా శాశ్వత పరిష్కారం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ దిశగా ప్రయత్నిస్తున్నామని వివరించారు. వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, మేధావులు నూతన విద్యావ్యవస్థ ఏర్పాటుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. అనంతరం వజ్రోత్సవ సావనీర్‌ను, డైరీని, వజ్రోత్సవ సీడీని, తెలంగాణ జాతిరత్నాలు పుస్తకాన్ని, నూతన సంవత్సర క్యాలెండర్‌ను మంత్రులు ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర అధ్య క్షుడు సదానందగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతరెడ్డి, ఎస్టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి భుజంగరావు, నరేంద్రారెడ్డి, బ్రహ్మచారి, నాగేశ్వర్రావు, ఏపీ సంఘం అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, తిమ్మన్న, కమలారెడ్డి, కరుణాకర్, శ్రీధర్, సుధాకర్, మధుసూధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
త్వరలోనే ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కరిస్తాం: మంత్రి హరీష్ రావు
-
టీచర్ల బదిలీల్లో మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీలకే పెద్దపీట
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని స్కూళ్లలోనూ తగినంత సంఖ్యలో టీచర్లు అందుబాటులో ఉండేలా పాఠశాల విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. తద్వారా విద్యార్థుల బోధనాభ్యసనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియను చేపట్టిన అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టారు. బదిలీల మేరకు రిలీవ్ అయిన టీచర్ల స్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే వారిని రిలీవ్ చేస్తున్నారు. ఒకే టీచర్ ఉన్న స్కూళ్లో ఆ టీచర్‌కు బదిలీ అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే వరకు ఆ టీచర్‌ను రిలీవ్ చేయరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఇద్దరు ఉన్న స్కూల్లో ఇద్దరికీ బదిలీ అయితే జూనియర్ టీచర్‌ను రిలీవ్ చేయరాదని పేర్కొంది. ముగ్గురున్న చోట బదిలీలుంటే జూనియర్లయిన ఇద్దరు టీచర్లను ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తయ్యేవరకు రిలీవ్ చేయరు. ముఖ్యంగా ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాల స్కూళ్లల్లో టీచర్లు లేరనే మాట రాకుండా.. ముందుగా మారుమూల ప్రాంతాల స్కూళ్లలో ఖాళీలు భర్తీ అయ్యేలా బదిలీల మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు అంశాలను చేర్చింది. జిల్లాల్లోని ప్రస్తుతం భర్తీ అయిన పోస్టులకు సమానంగా ఖాళీలను చూపించి బదిలీ ప్రక్రియను అధికారులు కొనసాగించనున్నారు. మిగిలిన ఖాళీ పోస్టులను అన్ని ప్రాంతాలకూ సమానంగా సర్దుబాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఉదాహరణకు ఒక జిల్లాలో 5వేల పోస్టులు ఉంటే.. అక్కడ 4,500 మంది టీచర్లు పనిచేస్తుంటే తక్కిన 500 ఖాళీలను ప్రాంతాల వారీగా మొదటి మూడు కేటగిరీలకూ సమానంగా బదలాయిస్తారు. దీనివల్ల ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల స్కూళ్లకు ప్రయోజనం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ మైదాన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్ల టీచర్లను కూడా బదిలీ చేస్తున్నా.. ఏజెన్సీ ప్రాంతాల స్కూళ్లలో ఒకేసారి ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గిరిజన సమీకృతాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాంతాల్లోని పాఠశాలల టీచర్లు.. నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చు. అలాంటి చోట్ల ఆయా స్కూళ్లలో టీచర్లు లేరన్న పరిస్థితి రాకుండా ప్రత్యామ్నాయ భర్తీ ఏర్పాట్లు చేశాకే బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేస్తారు. ఐటీడీఏ ప్రాంతాల్లో ఖాళీ టీచర్ పోస్టులు భర్తీకాని పక్షంలో ఐటీడీయేతర ప్రాంతాల్లో బాగా జూనియర్లయిన టీచర్లను ఆయా స్థానాల్లో తాత్కాలికంగా నియమించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గతంలో ఏజెన్సీ, మారుమూల ప్రాంతాలకు బదిలీ అయిన వారిలో ఎక్కువమంది అనధికారికంగా లేదా అధికారికంగా గైర్హాజరులో ఉంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వారి ఖాళీలను బదిలీల్లో చూపించడం ద్వారా అక్కడి పోస్టుల భర్తీకి ఆస్కారం ఉంటుంది. తప్పనిసరి బదిలీ అవ్వాల్సిన గ్రేడ్–2 హెచ్ఎంలు బదిలీ దరఖాస్తు చేయకున్నా వారిని కేటగిరీ–4లోని మిగులు పోస్టుల్లో నియమిస్తారు. అక్కడ ఖాళీ లేనిపక్షంలో కేటగిరీ–3లోని స్కూళ్ల ఖాళీల్లోకి పంపుతారు. కన్వర్షన్ కోరుకున్న సబ్జెక్టు టీచర్లకు.. కాగా ఇటీవల సబ్జెక్టు టీచర్ల కొరతను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆయా సబ్జెక్టులలో అర్హతలున్న వారిని మార్చుకోవడానికి (కన్వర్షన్) అనుమతించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది టీచర్లు ఇలా కన్వర్షన్‌కు లేఖలు ఇచ్చారు. ఇలా అంగీకారం తెలిపిన వారిని వెంటనే ఆయా సబ్జెక్టుల్లోకి మార్చడంతోపాటు బదిలీకి దరఖాస్తు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ బదిలీల ద్వారా సబ్జెక్టు టీచర్లు దాదాపు అన్ని పాఠశాలలకు అందుబాటులోకి వచ్చే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాల్లో మిగులు టీచర్లుగా గుర్తించిన వారందరినీ ప్రభుత్వం అవసరమైన స్కూళ్లలో తాత్కాలికంగా సర్దుబాటు చేసింది. ఇప్పుడు బదిలీల్లో ఆయా పోస్టుల్లో రెగ్యులర్ టీచర్లు నియమితులయ్యే అవకాశం ఉంది. గతంలో కన్నా మెరుగ్గా ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి.. రాష్టంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల నిష్పత్తి గతంలో కన్నా మెరుగ్గా ఉంది. విద్యాహక్కు చట్టం (ఆర్టీఈ) ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలన్న నిబంధన ఉంది. కానీ రాష్ట్రంలో అది 20 కన్నా తక్కువగానే ఉందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ (యూడైస్) ప్లస్ గణాంకాల ప్రకారం చూసినా గత ప్రభుత్వాల కన్నా మెరుగ్గా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. (చదవండి: ఏపీఏటీ సిబ్బందిని మరోచోటుకు పంపడమేంటి?) -
పేరెంట్స్ మీటింగ్‌కి బాయ్‌ఫ్రెండ్ ..బిత్తరపోయిన ఉపాధ్యాయులు
సాక్షి, బనశంకరి: ఇటీవల రోజుల్లో విద్యార్థుల ప్రవర్తనతో తల్లిదండ్రులు హడలిపోతున్నారు. ఓ బాలిక పేరెంట్స్ మీటింగ్‌కు తన బాయ్ ఫ్రెండ్‌ను తీసుకువచ్చి తన సోదరుడు అంటూ చెప్పిన ఘటన బెంగళూరు నగరంలో వెలుగులోకి వచ్చింది. మీటింగ్‌కు తల్లిదండ్రులకు బదులుగా విద్యార్థిని బాయ్‌ఫ్రెండ్‌ను తీసుకురావడంతో ఉపాధ్యాయులు బిత్తరపోయారు. ఇద్దరి వాలకాన్ని అనుమానించిన ఉపాధ్యాయులు వేర్వేరుగా విచారణ చేశారు. పదే పదే ప్రశ్నించగా తన కజిన్ బ్రదర్ అని, ఆ వ్యక్తిని అడగ్గా తన సిస్టర్ అంటూ చెప్పాడు. ఇద్దరి మాటలతో అయోమయానికి గురైన పాఠశాల పాలక మండలి విద్యార్థిని తల్లిదండ్రులకు విషయం తెలిపి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నగరంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని, తల్లిదండ్రులు పిల్లలపై దృష్టి సారించాలని క్యామ్స్ అధ్యక్షుడు శశికుమార్ తెలిపారు. (చదవండి: చికెన్ రోల్ లేదని.. హోటల్‌కు నిప్పు) -
ఉపాధ్యాయులు, ఉద్యోగుల ఆందోళన
పంజగుట్ట (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా తీసుకొచ్చిన జీవో నంబర్ 317 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆదివారం ప్రగతిభవన్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. దీంతో పోలీసులు 88 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ.. 317 జీవో వల్ల సుమారు 20 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగులు స్థానికత కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది సొంత జిల్లాలు వదిలి సుదూర ప్రాంత జిల్లాలకు వెళ్లాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది మనోవేదనకు గురై ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, తాము కూడా శాశ్వతంగా తమ స్థానికత కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే జీవోను రద్దు చేసి తమను సొంత జిల్లాకు పంపాలని, లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
Palasa: లక్ష్మీపురంలో ప్రతి ఇంటిలో ఒక ప్రభుత్వ ఉద్యోగి
పలాస: శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం.. పలాస మండలంలోని ఓ చిన్న గ్రామం. జాతీయ రహదారికి అతి సమీపంలోని పచ్చని పొలాల మధ్య కొలువుదీరి ఉంటుందీ ఊరు. 356 గడపలు ఉన్న ఈ పల్లెకు ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రతి ఇంటిలోనూ ఓ ప్రభుత్వ ఉద్యోగి కనిపిస్తాడు. అందులో అధిక శాతం మంది ఉపాధ్యాయులే. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో కూడా ఈ ఊరి వారు చక్కగా రాణించారు. ఈ గ్రామానికి చెందిన వ్యక్తులు ఒకసారి ఎమ్మెల్యేగా, సమితి అధ్యక్షులుగా కూడా పనిచేశారు. ఊరిలో 90 శాతం మంది అక్షరాస్యులు కావడం గమనార్హం. కేవలం అక్షరాస్యులుగానే కాకుండా చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉన్నత ఉద్యోగాలు సాధించడం విశేషం. ఒకరికి మించి ఒకరు ఉపాధ్యాయ రంగంలో అత్యధిక శాతం ఉద్యోగులు కాగా గ్రూప్ వన్ అధికారులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఎన్ఆర్ఐలు, ఆర్మీలోనూ ఈ ఊరి వారు ఉద్యోగులుగా ఉన్నారు. ఆర్డీవో స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఈ గ్రామంలో మొత్తం 1213 మంది జనాభా ఉన్నారు. 356 ఇళ్లు ఉన్నాయి. గ్రామంలో అన్నీ పక్కా భవనాలతో అన్ని వీధుల్లో కూడా సిమెంటు రోడ్లతో ఊరిని చూడచక్కగా తీర్చిదిద్దుకున్నారు. గతమెంతో ఘనం.. ఈ గ్రామానికి సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. పలాస మండలం తర్లాకోట జమిందారీ పాలనలో ఈ గ్రామంలోనే మస్తాదారు ఉండేవాడు. భూమి శిస్తు వసూలు చేసి జమిందారుకు ఇచ్చేవాడు. ఇక్కడ మస్తాదారు ఉండటంతో తరచుగా తర్లాకోట జమీందారు వచ్చి వెళ్తుండేవాడని గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్లు చెబుతున్నారు. అలా రాకపోకలు ఎక్కువగా సాగడంతో ఈ గ్రామంలోనే జమీందారు క్యాంపు కోర్టు కూడా నిర్వహించేవాడని స్థానికులు చెబుతున్నారు. ఈ గ్రామంలో ముందుగా సవర లక్ష్మయ్య అనే గిరిజన కుటుంబం ఉండేదని, అతని పేరు వల్లనే లక్ష్మీపురం అని నామకరణం చెందిందని ఇక్కడి వారు చెబుతుంటారు. ఈ గ్రామంలోని దువ్వాడ వంశానికి చెందిన ఒక ధనిక రైతు కుటుంబంతో తర్లాకోట జమీందారుకు మిత్తరికం కూడా ఉండేదని, తర్లాకోట జమీన్లో లక్ష్మీపురం గ్రామానికి ఈ విధంగా ఒక ప్రత్యేకత ఉండేదని గ్రామ పెద్దలు చెబుతున్నారు. మా ఇంటిలో ఇద్దరం ఉద్యోగస్తులమే మాకు వ్యవసాయ భూములు ఉన్నాయి. సుమారు 10 ఎకరా లు ఉంది. అయినా మా కుటుంబంలో ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. నేను ఉపాధ్యాయునిగా ఉద్యోగ విరమణ చేశాను. మా అన్నయ్య సత్యనారాయణ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం నేనే స్వయంగా వ్యవసాయం చేస్తున్నాను. – బమ్మిడి వాసుదేవరావు, రిటైర్డ్ టీచర్, లక్ష్మీపురం,పలాస మండలం ఉపాధ్యాయుల ఊరు మా గ్రామంలో అత్యధిక స్థాయిలో ఉపాధ్యాయులు ఉన్నారు. నేను కూడా ఉపాధ్యాయ కొలువు సంపాదించేవాడిని. ముందుగా వేరే రంగంలో స్థిర పడిపోవడం వల్ల అటువైపు వెళ్ల లేకపోయాను. ఇప్పుడు జనరేషన్ కూడా ప్రభుత్వ ఉద్యోగాలవైపే మక్కువ చూపుతున్నారు. పోటీ పడి చదువుతున్నారు. వ్యవసాయ భూములు ఉన్నా ఉద్యోగాలే చేస్తున్నారు. మా గ్రామంలో ఇంటికి ఒకరు, ఇద్దరు ఉద్యోగస్తులు ఉన్నారు. – అల్లు రమణ, ఎంఏబీపీఈడీ, లక్ష్మీపురం, పలాస మండలం స్వయం కృషితోనే ఉద్యోగాలు మా గ్రామంలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారంటే దానికి కారణం స్వయం కృషి, పట్టుదల, పోటీ తత్వం ప్రధాన కారణం. వివిధ ప్రభుత్వ శాఖల్లోని అన్ని రంగాల్లో కూడా మా గ్రామానికి చెందిన వారు ఉన్నారు. నేను కూడా ముందుగా గ్రూప్ వన్‌కి ఎంపికయ్యాను. అడిషనల్ ఎస్పీగా విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తున్నాను. క్రమ శిక్షణతో విద్యను అభ్యసిస్తే ప్రభుత్వ ఉద్యోగం చాలా సులభంగా వస్తుందని మా గ్రామమే దానికి ఒక ఉదాహరణ. – బమ్మిడి శ్రీనివాసరావు, అడిషనల్ ఎస్పీ (స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ డైరెక్టర్) విశాఖ -
జీతం సరిపోట్లేదు... సమ్మె బాటపట్టిన టీచర్లు, లెక్చరర్లు తపాలా సిబ్బంది..
లండన్: పెరుగుతున్న జీవన వ్యయానికి తగ్గట్లుగా వేతనాలను పెంచాలని కోరుతూ యూకేలో వేల సంఖ్యలో పోస్టల్ సిబ్బంది, యూనివర్సిటీ లెక్చరర్లు, స్కూల్ టీచర్లు గురువారం సమ్మెకు దిగారు. ఇప్పటికే వివిధ రంగాల సిబ్బంది సమ్మెల్లో పాల్గొనడంతో దేశంలో రవాణా వ్యవస్థ స్తంభించింది. వీధుల్లో చెత్తాచెదారం గుట్టలుగా పేరుకుపోయింది. ఇటీవల లాయర్లు, నర్సులు కూడా పలుమార్లు విధులను బహిష్కరించారు. గురువారం యూనివర్సిటీల్లో 70 వేల మంది లెక్చరర్లు బోధన విధులను బహిష్కరించారు. ఈ నెల 30వ తేదీన మరోసారి స్ట్రైక్ చేస్తామని తెలిపారు. సమ్మె ప్రభావం సుమారు 25 లక్షల మంది విద్యార్థులపై పడింది. స్కాట్లాండ్లో టీచర్ల సమ్మెతో దాదాపు సూళ్లన్నీ మూతబడ్డాయి. రాయల్ మెయిల్ ఉద్యోగులు గురు, శుక్రవారాలతోపాటు క్రిస్టమస్ రోజున కూడా సమ్మెకు దిగుతామన్నారు. చదవండి: మలేసియా నూతన ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. మద్ధతు ఇచ్చిన బద్ధ శత్రువు -
టీడీపీ దొంగాట!.. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో వక్రబుద్ధి
సాక్షి ప్రతినిధి, తిరుపతి: పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీకి చెందిన విద్యాసంస్థలు, కళాశాలలు ఉండడంతో రెచ్చిపోతున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి, ఫోర్జరీ సంతకాలతో నాన్‌టీచింగ్ సిబ్బందినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు కుయుక్తులు పన్నుతున్నారు. దీనికి తిరుపతి కేంద్రంగా వ్యవహారం నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారాన్ని బయటకు పొక్కనీయకుండా అత్యంత చాకచక్యంగా ముందుకు నడుపుతున్నట్టు సమాచారం. మార్ఫింగ్ చేసి.. నమోదు చేసి టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీ నేతలకు సంబంధించిన పాఠశాలలు, కళాశాలలను ఎమ్మెల్సీ ఓటు బ్యాంక్‌గా ఉపయోగించుకుంటున్నారు. యూజీసీ జాబితాలో లేని యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారిని ఎంచుకుంటున్నారు. వారికి ఎంతో కొంత డబ్బులిచ్చి నకిలీ సర్టిఫికెట్లను సృష్టిస్తున్నట్టు సమాచారం. అందులో టీడీపీ నేతలు తాము ఎంచుకున్న కళాశాలలు, పాఠశాలల సిబ్బంది ఫొటోలు మార్ఫింగ్ చేసి నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసేపనిలో నిమగ్నమైనట్టు ఇప్పటికే ఫిర్యాదులు వస్తున్నాయి. ఆపై వారికి అనుకూలంగా ఉన్న గెజిటెడ్ అర్హత లేని ప్రయివేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతోనే సంతకాలు చేయించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో బీఎల్వోలు, మండల స్థాయిలో విచారణాధికారులు అత్యంతపటిష్టంగా ఓటర్లను పరిశీలించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలోని ఓ విద్యాసంస్థలో 54 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 18 మంది మాత్రమే. మిగిలిన వారు నాన్ టీచింగ్ సిబ్బంది. వారందరికీ ఓటు హక్కు కల్పించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. నాన్ టీచింగ్ సిబ్బందిని ఉపాధ్యాయులుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో అనర్హులను ఓటర్లుగా నమోదు చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రగిరి పరిధిలోని ఓ కన్వెన్షన్ హాల్లో రెండు రోజుల క్రితం టీడీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మండల, గ్రామస్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటర్లను చేర్పించాలని కోరారు. ‘మీకెంత కావాలి?.. డబ్బులు కాకుండా ఇంకేమైనా కావాలా?’ అని అడిగారు. ఎక్కువ మంది డబ్బే డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం హాజరైన వారందరికీ మందు, విందు ఏర్పాటు చేశారు. టీడీపీ అడ్డదారులు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల నమోదు ప్రక్రియ సమయం దగ్గరపడుతుండడంతో టీడీపీలో హడావుడి మొదలైంది. తమకు అనుకూలంగా ఓట్లు వేయించే వారిని ఓటర్లుగా నమోదు చేసేందుకు ఆ పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. అందుకు పక్కాప్రణాళికలు రచించారు. అనర్హులను ఓటర్లుగా నమోదుచేసే ప్రక్రిను దిగ్విజయంగా పూర్తిచేసేపనిలో తలమునకలయ్యారు. చిత్తూరుకు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళా శాలలో దాదాపు 35మంది పనిచేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్నవారు 12 మంది మాత్రమే. కానీ మొత్తం మందిని ఓటర్లుగా చూపేందుకు అక్కడ టీడీపీ నేతలు వ్యూహాలు రచించి అమలు చేస్తున్నారు. పూతలపట్టుకు సమీపంలోని ఓ ప్రయివేటు కళాశాలలో 17 మంది సిబ్బంది దాకా పనిచేస్తున్నారు. ఇందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 8 మంది మాత్రమే. మిగిలిన వారు అనర్హులైనా ఓటర్లుగా చిత్రీకరించే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు. గూడూరులో ప్రముఖ విద్యాసంస్థలో మొత్తం 43 మంది వరకు పనిచేస్తుండగా అందులో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నమోదుకు అర్హత ఉన్నవారు 25 మంది మాత్రమే. కానీ అక్కడ టీడీపీ నేత ఒకరు సిబ్బంది అందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని సదరు యాజమాన్యానికి హుకుం జారీచేశారు. శ్రీకాళహస్తి పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో 14 మంది సిబ్బంది ఉండగా అందులో ఎమ్మెల్సీ ఓటు హక్కుకు అర్హులు 08 మంది మాత్రమే. స్థానికంగా టీడీపీ నేత దగ్గరుండి అందరినీ ఓటర్లుగా నమోదు చేయించేందుకు నకిలీ పత్రాలు సృష్టించే పనిలో ఉండడం గమనార్హం. ప్రచారంలో బిజీబిజీ చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పురాయలసీమ నియోజకవర్గ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయం సమీపిస్తుండడంతో అభ్యర్థులు ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు శ్యాంప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డి దూసుకుపోతున్నారు. అయితే టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన రాకముందే ఆ పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతూ అడ్డదారులు తొక్కడం విమర్శలకు తావిస్తోంది. -
కీచక ఉపాధ్యాయులు.. మొన్న మహిళా ఉద్యోగి.. నేడు విద్యార్థినితో
సాకక్షి, కరీంనగర్: అక్షర జ్ఞానం అందించి అందరిలో మిన్నగా భావిభారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు కొందరు పెడదారిలో వెళ్తు ఉపాధ్యాయ వృత్తికి అపవాదు తీసుకువస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో ఓ పాఠశాలలో మహిళా ఉద్యోగిపై, విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్న ఘటనపై ఫిర్యాదులు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. – మొన్న వేములవాడ.. నేడు సిరిసిల్ల.. వేములవాడ రూరల్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మహిళ హెచ్ఎంను అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు దుర్భాషలాడాడు. దీంతో సదరు హెచ్ఎం వేములవాడ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన సీఐ బన్సీలాల్ ఘటనపై పాఠశాలకు వెళ్లి విచారణ చేపట్టారు. విషయం తెలుకున్న డీఈవో రాధాకిషన్ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనపై ఉపాధ్యాయ సంఘం నాయకులు స్పందిస్తు విచారణ చేపట్టకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని విద్యాశాఖ అధికారులను విమర్శించారు. ఈ ఘటన మరువకముందే మరో ఉపాధ్యాయుడు ఏకంగా విద్యార్థిని వేధింపులకు గురిచేసిన ఘటన సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచి్చంది. తనను పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యారి్థని తన తల్లికి తెలపడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. ఈక్రమంలో పోలీసులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. పర్యవేక్షణ కరువు... ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన అనుసరిస్తున్న పాఠ్య ప్రణాళికలు విద్యార్థులకు ఉన్న వసతులపై పర్యవేక్షించే శాశ్వత అధికారులు జిల్లాలో లేరు. విద్యాశాఖలో 640 ప్రభుత్వ పాఠశాలలుంటే వీటిని పర్యవేక్షించడానికి ముగ్గురు ఎంఈఓలున్నారు. వీరందరూ ఏదో ఒక పాఠశాలలో హెచ్ఎంలుగా పనిచేస్తున్న వారేకావడం గమనార్హం. వీరి పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం, గతంలో వీరితో పనిచేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది వీరి ఆదేశాలను పాటించకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా డీఈవో కూడా డిప్యూటేషన్‌లో పనిచేస్తుండం గమనార్హం. ఇలా పర్యవేక్షణ అధికారులు రెగ్యులర్ కాకపోవడంతో పర్యవేక్షణ లోపం జిల్లాలో అధికంగా ఉందని ఇదే కారణంగా అనేక పాఠశాలలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయ సంఘం నాయకులు విమర్శిస్తున్నారు. వెంటనే రెగ్యులర్ ఎంఈవోలు, డీఈవో వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఫిర్యాదు వచ్చింది. దీనిపై చట్టపరమైన చర్యలుంటాయి. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యాశాక అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. – లక్ష్మారెడ్డి, ఎస్సై, తంగళ్ల్లపల్లి -
ఫోటో షూట్ కోసం వెళ్లి.. గోదావరిలో ఇద్దరు టీచర్లు గల్లంతు..
సాక్షి, మంచిర్యాల: వారు ముగ్గురూ ఉపాధ్యాయులు. వృతి నిమిత్తం కేరళ నుంచి వచ్చారు. చెన్నూర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి సందర్భంగా వరుసగా సెలవులు రావడంతో ఫోటోషూట్, సరదాగా గడిపేందుకు ముగ్గురూ గోదావరి నది వద్దకు వెళ్లారు. ముగ్గురూ కలిసి నదీ తీరంలో ఫోటోలు దిగారు. ఈ క్రమంలో ఇద్దరు గల్లంతు కాగా ఒకరు బయటకు వచ్చారు. ఈ విషాద ఘటన కోటపల్లి మండలం ఎర్రాయిపేట సమీపంలో జరిగింది. ఎస్సై చెన్నూర్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న కేరళకు చెందిన టోనీ, బిజూ, ఆంటోనీ సరదా కోసం ఆదివారం గోదావరి తీరానికి వెళ్లారు,. ఫోటో షూట్ అనంతరం నదిలో ఈతకొడుతుండగా బిజూ, టోనీ గల్లంతయ్యారు. ఆంటోనీ ఒడ్డుకు చేరారు. వెంటనే బంధువులకు, పోలీసులకు సమాచారం అందించారు. గజ ఈతగాళ్లను రప్పించి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా. ఒకరి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం వెతుకున్నారు. -
తెలంగాణ మంత్రి హరీష్ రావుకు సజ్జల కౌంటర్
-
తొలిమెట్టు.. తీసికట్టు!
సాక్షి, హైదరాబాద్: సర్కారు బడుల విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచే ‘తొలిమెట్టు’ అమలు కాగితాలకే పరిమితమైంది. కరోనా తీవ్రత నేపథ్యంలో వరుసగా రెండేళ్లు స్కూళ్ల మూత, ఆన్లైన్ బోధనలతో విద్యార్థుల సామర్థ్యాలు బాగా తగ్గాయి. ప్రైమరీ పాఠశాలల విద్యార్థులు బేసిక్స్ కూడా మరిచిపోవడంతో వారిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ప్రైమరీ స్కూల్ టీచర్లకు శిక్షణ ఇచ్చారు. సామర్థ్యాల పంపు ప్రక్రియ మాత్రం కనిపించడం లేదు. షెడ్యూలు ఇలా.. విద్యార్థులకు మౌలిక భాష, గణితంలో సామర్థ్యం పెరిగేలా బోధించడం కోసం తొలిమెట్టులో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలకు బేస్ లైన్ టెస్ట్‌లు నిర్వహించి అభ్యసన స్థాయిలను గుర్తించాలి. అనంతరం విద్యార్థుల స్థాయికి తగ్గట్టు బోధనా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఈ షెడ్యూలు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కనీసం ప్రస్తావన కూడా లేకుండా పోయింది. నెలకోసారి పిల్లల ప్రగతిని నమోదు చేసి కాంప్లెక్స్ స్థాయిలో ప్రతి నెలా 26న టీచర్లతో, 28న మండలాలవారీగా, 30న జిల్లాలవారీగా సమీక్షలు జరగాలి. ఆచరణలో మాత్రం ఆ జాడ కనిపించడం లేదు. టీచర్ల కొరతతోనే.. సర్కారు స్కూళ్లల్లో టీచర్ల కొరత కారణంగానే తొలిమెట్టు సక్రమంగా అమలు కావడం లేదు. కరోనాకు ముందు విద్యా వలంటీర్లతో కొంత సర్దుబాటు జరిగినా...ఆ తర్వాత వలంటీర్లను రెన్యూవల్ చేయలేదు. దీంతో బోధన కుంటుపడుతోంది. పలు సబ్జెకుల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం పర్యవేక్షణకు ప్రధానోపాధ్యాయులు లేక ఇన్చార్జిలతో కొనసాగుతున్నాయి. వాస్తవంగా ఏళ్లుగా టీచర్ల ఖాళీలు భర్తీ లేక బోధనకు ఆటంకం కలుగుతోంది. నాలుగేళ్లుగా బదిలీలు, ఏడేళ్లుగా పదోన్నతులు, 17 ఏళ్లుగా పర్యవేక్షణ అధికారుల నియామకాలు జరగడం లేదని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీచర్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యే దాకా బోధనకు ఆటంకం కలగకుండా వలంటీర్లను నియమించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది. (చదవండి: ఎన్ఐఏ విస్తృత తనిఖీలు) -
విద్యార్ధులను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంది
-
నాలుగు తరాలు ఉపాధ్యాయ వృత్తిలోనే..
తాళ్లరేవు: ‘ఇంజరం.. విద్వత్ కుంజరం..’ అన్నది అనాదిగా ఉన్న నానుడి. వేద పండితులు, విద్వాంసులు, సంగీత, సాహిత్య కళాకారులకు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని ఇంజరం గ్రామం నెలవు. ఇదేకాదు.. ఈ గ్రామంలో ఓలేటి కుటుంబానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఆ కుటుంబం నాలుగు తరాలుగా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతోంది. గ్రామానికి చెందిన ఓలేటి బంగారేశ్వరశర్మ పాఠశాల వ్యవస్థ లేని కాలంలోనే గురుకుల వ్యవస్థ పరంపరలో తన ఇంటి అరుగు మీదే విద్యార్థులకు సాహిత్యం, పాఠాలు బోధించేవారు. ఆయన కుమారుడు ఓలేటి సూర్యనారాయణశాస్త్రి గ్రేడ్–1 ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈయన కుమారుడు ఓలేటి శ్రీనివాసశర్మ కూడా ఉపాధ్యాయుడే. ఈయన తన ఏడుగురు కుమారులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. తన తాత, తండ్రి స్ఫూర్తితో విద్య ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమని విశ్వసించి తన పిల్లలను ఉపాధ్యాయులను చేశారు. ఆయన ఇద్దరు కోడళ్లు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే కావడం విశేషం. ఏడుగురు కుమారులూ ఇలా.. ఇక శ్రీనివాసశర్మ పెద్ద కుమారుడు సూర్యనారాయణశాస్త్రి తెలుగు ఉపాధ్యాయుడిగా.. రెండో కుమారుడు వెంకటభాస్కరశర్మ సంస్కృత, సాహిత్య అధ్యాపకునిగా.. మూడో కుమారుడు వెంకట ఫణినాథశర్మ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా.. నాలుగో కుమారుడు వెంకట రమణశర్మ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. అలాగే, ఐదో కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర శర్మ వ్యాకరణ అధ్యాపకుడిగా.. ఆరో కుమారుడు వెంకట బంగారేశ్వరశర్మ తెలుగు ఉపాధ్యాయుడిగా.. ఏడో కుమారుడు మృత్యుంజయశర్మ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరోవైపు.. మూడో కుమారుడు వెంకటఫణినాథశర్మ భార్య రాజేశ్వరి, ఆరో కుమారుడు బంగారేశ్వరశర్మ భార్య వీరేశ్వరి కూడా టీచర్లే. ఇలా మొత్తం ఆ కుటుంబంలో తొమ్మిది మంది ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. అలాగే, శ్రీనివాసశర్మ కుమార్తె సుబ్బలక్ష్మి కుమారుడు, అల్లుడు కూడా ఉపాధ్యాయులే. మొత్తం మీద ఓలేటి కుటుంబమంతా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ నాలుగు తరాలుగా విద్యాభివృద్ధికి కృషిచేస్తోంది. తన కుమారులు ఏడుగురూ తండ్రి ప్రోత్సాహంతోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని శ్రీనివాసశర్మ సతీమణి ఓలేటి వెంకట సీతామహాలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. -
11 మంది బీసీ గురుకుల టీచర్లకు పురస్కారాలు
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 11 మంది ఉపాధ్యాయులకు రాష్ట్ర పురస్కారాలు దక్కాయి. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 5న జరిగే రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ ఉత్సవాల్లో వారంతా అవార్డులు అందుకోనున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన వారిలో ప్రిన్సిపల్స్ యం.అంజలీకుమారి, కె.శోభారాణి, యం.రాములు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ కె.సుచిత్ర, జూనియర్ కాలేజీ లెక్చరర్ కె.రాధిక, ఉపాధ్యాయులు కె.పుష్ప, జి.అన్నపూర్ణ, హెచ్.సంతోష్, బి.గురువయ్య, పి.గీత, కె.వెంకటరెడ్డి ఉన్నారు. అవార్డులకు ఎంపికైన వారందరినీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ప్రత్యేకంగా అభినందించారు. -
‘బయోమెట్రిక్’ అమలు చేయాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ఆటలకు చెక్ పెట్టేలా హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూహెచ్) చర్యలకు ఉపక్రమించింది. కాలేజీలకు వర్సిటీ అనుబంధ గుర్తింపుప్రక్రియలో భాగంగా అధ్యాపకులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిస రి చేసిన వర్సిటీ.. దానిని అమలు చేయని కాలేజీలకు నోటీసులు జారీచేస్తోంది. అధ్యాపకులకు రోజువారీ బయోమెట్రిక్ అటెండెన్స్ ఎందుకు అమలు చేయడం లేదని ఆయా నోటీసుల్లో ప్రశ్నించింది. కనీస హాజరు శాతం కూడా ఉండడం లేదని పేర్కొంది. కాలేజీల తనిఖీల సమయంలో బయోమెట్రిక్ హాజరులేని బోధన సిబ్బందిని పరిగణనలోకి తీసుకోబోమని, వారిని ఫ్యాకల్టీగా భావించబోమని స్పష్టం చేసింది. ఈ విద్యాసంవత్సవరం నుంచి బయోమెట్రిక్ హాజరును పాటించకపోతే తదుపరి అనుబంధ గుర్తింపునకు అవకాశం ఉండబోదని తెలిపింది. దీనిపై ఈ నెల 8లోగా వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో యూనివర్సిటీ నిబంధనల మేరకు చర్యలు ఉంటాయని హెచ్చరించింది. తనిఖీల్లో గుర్తింపుతో.. 2022–2023 విద్యా సంవత్సరానికి అనుబంధ గుర్తింపు కోసం వర్సిటీ కమిటీలు కాలేజీల్లో గతనెల 18 నుంచి 22 వరకు తనిఖీలు నిర్వహించాయి. వర్సిటీ సర్వర్‌లో అధ్యాపకుల బయోమెట్రిక్ అటెండెన్స్ నమోదు కాని విషయాన్ని గమనించి నివేదిక సమర్పించాయి. ఈ నేపథ్యంలో జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ కళాశాలలకు నోటీసులు జారీ చేశారు. సగానికి పైగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత జేఎన్టీయూహెచ్ పరిధిలో సుమారు 143 కళాశాలలు ఉండగా సగానికి పైగా కళాశాలల్లో ఫ్యాకల్టీ కొరత వెంటాడుతోంది. మరోవైపు అధికారిక లెక్కల్లో ఫ్యాకల్టీ ఒకరు ఉంటే, వాస్తవంగా మరొకరు బోధిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఫార్మసీ లాబ్ల్లో, మెడికల్ షాపుల్లో పనిచేసేవారితో పాటు, సాఫ్ట్వేర్æ కంపెనీలు, ప్రభుత్వ రంగ కంపెనీలు (కాంట్రాక్ట్ పద్ధతిలో), ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీల్లో ఉన్నవారిని ఫ్యాకల్టీగా కళాశాలలు చూపించడం సర్వసాధారణమైంది. ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దే దిశలో జేఎన్టీయూహెచ్ చర్యలకు దిగుతున్నట్టు తెలుస్తోంది. నాణ్యమైన విద్య అందుతుంది ఇంజనీరింగ్ కాలేజీల అధ్యాపకులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేసి, దానిని అమలు చేయని కాలేజీల కు నోటీసులు జారీ చేయడం హర్షణీయం. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. కొన్ని కాలేజీల్లో సిలికాన్ వేలిముద్రలు వినియోగిస్తున్నారు. దానిపైనా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలి. – అయినేని సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, టీఎస్టీసీఈఏ -
‘టీచరమ్మ’గా వెండితెరపై బెత్తం పట్టి అలరించిన హీరోయిన్లు
‘ఈ టీచర్ చాలా స్ట్రిక్ట్’ అనిపించుకుంది సావిత్రి ‘మిస్సమ్మ’లో. ‘ఈ టీచర్ భలే చక్కగా పాఠాలు చెబుతుంది’ అని మెచ్చుకోలు పొందింది జమున ‘మట్టిలో మాణిక్యం’లో. ‘పంతులమ్మ’ సినిమాలో లక్ష్మి పిల్లల పాఠాలే కాదు కథానాయకుని జీవితాన్ని కూడా చక్కదిద్దింది. ‘రేపటి పౌరులు’, ‘ప్రతిఘటన’ దగ్గరి నుంచి నిన్న మొన్నటి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు టీచర్ అంటే విజయశాంతే. ‘లేడీస్ టైలర్’లో రాజేంద్ర ప్రసాద్ వంటి అల్లరి స్టూడెంట్‌ని బెత్తం దెబ్బలు కొట్టి సరి చేయలేదూ అర్చన. టీచర్ పాత్రకు గ్లామర్ ఉండకపోవచ్చు గాని ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత కొందరు హీరోయిన్లకే దక్కింది. అదిగో చాక్‌పీస్ ఒక చేత్తో బెత్తం మరో చేత్తో పట్టుకుని వాళ్లిటు నడిచొస్తున్నారు చూడండి. శిశువుకు అమ్మ తొలి టీచర్. స్కూల్లో ‘టీచరమ్మే’ తొలి టీచర్. నర్సరీల్లో, ఐదు లోపల తరగతుల్లో పిల్లలకు తొలిగా పరిచయం అయ్యేది ఎక్కువగా టీచర్లే. వీరే పిల్లలకు తొలుత ఆత్మీయులవుతారు. బడి పట్ల, పాఠాల పట్ల ఆసక్తి కలిగిస్తారు. ఈమె కూడా అమ్మలాంటిదే కాబట్టి భయం లేకుండా వెళ్లొచ్చు అని పిల్లలకు నమ్మకం కలిగిస్తారు. అయినా సరే ‘గురు దేవా’ అంటే మగ గురువు గుర్తుకొస్తాడు. స్త్రీల వాటా ఈ విషయంలో సమానం అయినప్పటికీ. సినిమాల్లో కూడా హీరోలు వేసిన టీచర్ పాత్రలు ఎక్కువ ఉన్నాయి. హీరోయిన్లకు తక్కువగా ఈ చాన్స్ వచ్చింది. ‘గ్లామర్’ సినిమా కమర్షియల్ సినిమా వచ్చాక ‘టీచర్’ పాత్రలో హీరోయిన్ను గ్లామరస్‌గా చూపించలేము అనే భావనతో నిర్మాత, దర్శకులు హీరోయిన్ను ‘ఒక ఆడి పాడే బొమ్మ’ స్థాయికే కుదించి పెట్టారు. అయితే అప్పుడప్పుడు మంచి టీచర్ పాత్రలు సత్తా ఉన్న నటీమణుల చేతుల్లో పడి మెరిశాయి. వాళ్లు తెర మీద ఉంటే ప్రేక్షకులు బుద్ధిగా చూసే విద్యార్థులయ్యారు. రిజల్ట్ వందకు వంద వచ్చింది. మీకు మీరే మాకు మేమే: సినిమాల్లో హీరోను చూసి హీరోయిన్ జంకడం ఆనవాయితీ. కాని ‘మిస్సమ్మ’లో సావిత్రిని చూసి రామారావు జంకుతుంటాడు. దానికి కారణం ఆమె నిజాయితీ, టీచర్‌గా సిన్సియారిటీ. స్కూల్లో పిల్లలకు పాఠాలతో పాటు జమిందారు గారి కుతురికి సంగీతం పాఠాలు కూడా చెప్తుంది సావిత్రి. అంతేనా? కొంచెం నాన్ సీరియస్‌గా ఉన్న ఎన్.టి.ఆర్ తనను అందుకునేంతగా ఎదిగేలా చేసి ఒక రేవుకు చేరుస్తుంది. ‘రావోయి చందమామా మా వింతగాధ వినుమా’... ఆ రోజుల్లో టీచర్లు పాటలు పాడే పాటలు ఇంత శుభ్రంగా వినసొంపుగా ఉండేది. నా మాటే నీ మాటై చదవాలి: ‘మట్టిలో మాణిక్యం’ లో చలం అమాయకుడు. పౌరుషంతో పట్నం వస్తే టీచరైన జమున పరిచయం అవుతుంది. ప్రేమిస్తుంది. మామూలు చదువే కాదు లౌక్యంగా ఉండటానికి అవసరమైన చదువు కూడా చెబుతుంది. పాఠాలను పాటగా మార్చి ఆమె పాడే ‘నా మాటే నీ మాటై చదవాలి నేనంటే నువ్వంటూ రాయాలి’ పాట బాగుంటుంది. ఆ తర్వాతి రోజుల్లో సింగీతం శ్రీనివాసరావు హీరోయిన్ లక్ష్మితో ‘పంతులమ్మ’ సినిమా తీశాడు. ‘పంతులమ్మ’ టైటిల్‌తో ఒక సినిమా వచ్చి హిట్ కావడం విశేషం. భార్య మరణించిన వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక పంతులమ్మ అతని పిల్లలకు పాఠాలు చెబుతూ అతనిలోని ఒక అపోహను తొలగించడం కథ. ‘ఎడారిలో కోయిల’ పాట ఒయాసిస్ లా ఉంటుంది. ఆ తర్వాత ‘శుభలేఖ’ సినిమాలో సుమలత టీచర్‌గా నటించింది. కట్నం అడగడాన్ని ఎదిరించిందని ఆమె ఉద్యోగం పోతుంది. కాని ఆమె వెరవదు. ఈ దుర్యోధన దుశ్శాసన క్లాసులోని రౌడీ పిల్లాణ్ణి సరి చేయడం టీచర్ బాధ్యత. మరి సమాజంలో ఉన్న రౌడీ పిల్లాణ్ణి దండించడం? చట్టం, న్యాయం, వ్యవస్థ విఫలమైతే ఆ బాధ్యత కూడా టీచరే తీసుకుంటుంది. ‘ప్రతిఘటన’లో లెక్చరర్ అయిన విజయశాంతి ఊళ్లో అనేక ఫతుకాలకు కారణం అవుతున్న రౌడీని అంతిమంగా తెగ నరికి నిర్మలిస్తుంది. చాక్‌పీస్ పట్టిన చేతులు గొడ్డలి కూడా పట్టగలవు అని హెచ్చరిస్తుంది. ఈ టీచర్ పాత్ర తెలుగులో వచ్చిన అన్ని టీచర్ పాత్రల కంటే శక్తిమంతమైనది. క్లాసురమ్లో పిచ్చి జోకులు, లెక్చరర్ల మీద పంచ్‌లకు తావు ఇచ్చే పాత్ర కాదు ఇది. ఈ పాత్రను చూడగానే మహా మహా పోకిరి స్టూడెంట్లు కూడా సైలెంటైపోవాల్సిందే. ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో’ అని విజయశాంతి పాడుతుంటే ఆ వేదనా శక్తి చసే ప్రతి విద్యార్థిలో పరివర్తన తెస్తుంది. విజయశాంతి ఆ తర్వాత ‘రేపటి పౌరులు’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల్లో కూడా టీచర్‌గా నటించింది. అరె ఏమైంది ఒక మనసుకు రెక్కలొచ్చి: అతను బెస్తపల్లెలో రౌడీ. ఆమె క్రైస్తవ విశ్వాసాలు కలిగిన టీచర్. అతను హింస. ఆమె దయ. హింసను వీడి దయ వరకూ చేసే ప్రయాణాన్ని ఆ టీచర్ ఆ రౌడీలో ప్రేరేపిస్తుంది. అతని పాపాలన్నీ స్వీయ రక్తంతో ప్రక్షాళనం అవుతాయి. చివరకు అతను ఆమె ప్రేమను పొందుతాడు. రౌడీగా చిరంజీవి, టీచర్‌గా సుహాసిని ‘ఆరాధన’లో నటించారు. ‘అరె ఏమైంది’ పాట ఇప్పటికీ హిట్ ప్రేమమ్ మరికొన్ని: ఇటీవలి కాలంలో ఈ కాలపు హీరోయిన్లు కూడా టీచర్లుగా నటించారు. ‘ఘర్షణ’లో అసిన్, ‘గోల్కొండ హైస్కల్’లో కలర్స్ స్వాతి, ‘హ్యాపీ డేస్’లో కమలిని ముఖర్జీ, ‘రాక్షసుడు’లో అనుపమ పరమేశ్వరన్ టీచర్లుగా కనిపిస్తారు. మన సాయి పల్లవి మలయాళ ‘ప్రేమమ్’లో టీచర్‌గా నటించే పెద్ద క్రేజ్ సాధించింది. ఆ పాత్రను తెలుగులో శృతిహాసన్ చేసింది. -
40 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు.. ఉత్తర్వులు విడుదల
సాక్షి, హైదరాబాద్: గురుపూజ దినోత్సవాన్ని (సెప్టెంబర్ 5) పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్తమ, అంకితభావం గల వారిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసింది. వీరిలో ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు 10 మంది, స్కూల్ అసిస్టెంట్స్, పీజీటీలు 19 మంది, ఎస్జీటీ, టీజీటీలు 10 మంది, ఒక సీనియర్ లెక్చరర్... మొత్తం 40 మంది ఉన్నారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్ల విభాగాల్లో చకినాల శ్రీనివాస్(సిరిసిల్ల), బూసా జమునాదేవి (జయశంకర్ భూపాలపల్లి), ఓ చంద్రశేఖర్ (జయశంకర్ భూపాల పల్లి), టి.మురళీకృష్ణమూర్తి (మేడ్చల్) ఎస్.సురేశ్ (నిజామాబాద్), వి.రాజేందర్(ఖమ్మం), వనుపల్లి నిరంజన్ (రంగారెడ్డి), సుర సతీశ్(భువనగిరి), గోపాలసింగ్ తిలావత్ (ఆదిలాబాద్), బి.చలపతిరావు(ఖమ్మం) ఎంపిక. స్కూల్ అసిస్టెంట్లు డి.సత్యప్రకాశ్ (స్టేషన్ ఘన్పూర్), జె.శ్రీనివాస్ (నిర్మల్), పి.ప్రవీణ్‌కుమార్ (కామారెడ్డి), తేజావత్ మోహన్‌బాబు (భద్రాద్రి కొత్తగూడెం), ఎ.వెంకన్న (సూర్యాపేట), కన్నం అరుణ(కరీంనగర్), సయ్యద్ షఫీ(ఖమ్మం), డాక్టర్ హజారే శ్రీనివాస్(నిజామాబాద్), కె.రామారావు (సూర్యాపేట), సీహెచ్ కృష్ణ (వరంగల్), కె.మధుకర్ (ఆసిఫాబాద్), ఎ.రాజశేఖర్ శర్మ (సిద్దిపేట), గొల్ల వెంకటేశ్ (జోగుళాంబ గద్వాల్), కె.ధనలక్ష్మి (వరంగల్), కంచర్ల రాజవర్ధన్ రెడ్డి (నల్లగొండ), జి.గిరిజమ్మ (నారాయణపేట), జె.ఎల్లస్వామి (గద్వాల్), సీహెచ్ భరణీకుమార్(యాదాద్రి భువనగిరి), అంబటి శంకర్(రాజన్న సిరిసిల్ల) ఎస్జీటీలు జి.చంద్రశేఖర్(నిర్మల్), ఎం.వెంకట్‌రెడ్డి( హైదరాబాద్), పశుల ప్రతాప్ (ఆదిలాబాద్), యు.లచ్చిరాం(నల్లగొండ), కె.ప్రవీణ్ (పెద్దపల్లి), అర్చ సుదర్శనం (హన్మకొండ), టి.ఓంకార్ రాధాకృష్ణ (సిద్దిపేట), కదరి అనిత (నల్లగొండ), బి.నర్సయ్య (నిజామాబాద్), సీహెచ్ రాజిరెడ్డి(జగిత్యాల). సీనియర్ లెక్చరర్... డాక్టర్ ఎం.రమాదేవి (ప్రభుత్వ లెక్చరర్, మాసబ్‌ట్యాంక్, హైదరాబాద్) ప్రత్యేక విభాగం... బి.శంకర్‌బాబు (సంగారెడ్డి), జె.శ్రీనివాసరెడ్డి(సిద్దిపేట), ఎం.రాంప్రసాద్ (సిద్దిపేట), టి.మధుసూదన్‌రావు (హైదరాబాద్), వరకల పరమేశ్వర్(రంగారెడ్డి), వై.లిల్లీమేరి (జనగాం), టి.సత్యనారాయణ(సూర్యాపేట), ఎం.వెంకటయ్య (సూర్యాపేట), సత్తులాల్(భద్రాద్రి కొత్తగూడెం), సముద్రాల శ్రీదేవి(సంగారెడ్డి). -
ఫేస్ రికగ్నెజేషన్ యాప్‌కు టీచర్లు అంగీకారం తెలిపారు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: విద్యావ్యవస్థలో మార్పులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పలు విషయాలు వెల్లడించారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయ సంఘాలతో రెండు అంశాలపై చర్చించాము. విద్య, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఫేస్ రికగ్నెజేషన్ యాప్‌లో లోపాలు సరిదిద్దాము. ఈ యాప్ అమలు కోసం 15రోజుల గడువు కోరాము. యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాము. ఫేస్ రికగ్నెజేషన్ యాప్ అమలుకు టీచర్లు అంగీకారం తెలిపారు. విద్యావ్యవస్థలో మార్పులు రావాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము. నాడు-నేడు ద్వారా స్కూళ్లలో మార్పులు తెచ్చాము. మండలానికి ఇద్దరు ఎంఈవోలను నియమిస్తున్నాము. 248 పోస్టులను సీనియారిటీపరంగా భర్తీ చేశాము. 38 డిప్యూటీ డీఈవో పోస్టులను కొత్తగా ఇస్తున్నాము. మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ గవర్నమెంట్’ అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ఏమనాలో తెలియక.. వారి ఖాతాలో వేసుకునే యత్నం! -
ఫోన్ యాప్ ద్వారానే టీచర్ల హాజరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేట్ అన్ఎయిడెడ్ మినహా అన్ని యాజమాన్యాల పరిధిలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ సెప్టెంబర్ 1 నుంచి ఇంటిగ్రేటెడ్ అటెండెన్స్ మొబైల్ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ విధానంలో హాజరు నమోదు చేయాలని పాఠశాల విద్యా శాఖ మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. ఫోన్ యాప్ ద్వారా మాత్రమే ఉపాధ్యాయులు హాజరును వేయాలని తెలిపింది. వీరితోపాటు పాఠశాల విద్యా శాఖ నియంత్రణలో ఉన్న అన్ని కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది కూడా ఈ యాప్‌లో హాజరు నమోదు చేయాలని వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి ఏ కార్యాలయాల్లోనూ మాన్యువల్ హాజరును నమోదు చేయకూడదని స్పష్టం చేసింది. వికలాంగుల సంక్షేమ శాఖ నిబంధనల ప్రకారం.. దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక మినహాయింపు ఉంటుందని వివరించింది. వారు ప్రత్యేకంగా మాన్యువల్ రిజిస్టర్లలో హాజరు నమోదు చేయాలని పేర్కొంది. కాగా, ఫేషియల్ రికగ్నిషన్ హాజరు విధానాన్ని నెల రోజుల్లో అన్ని విభాగాల్లో అమలు చేయనున్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే.. ఆండ్రాయిడ్ ఫోన్‌లేని టీచర్లు, ఉద్యోగులు తమ హాజరును హెడ్మాస్టర్ లేదా ఇతర ఉపాధ్యాయుల మొబైల్స్ ద్వారా నమోదు చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిజిస్ట్రేషన్లను బుధవారంలోపు పూర్తి చేయాలని తెలిపింది. యాప్ ద్వారా హాజరు నమోదు.. విద్యా శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయాలు, జోన్, జిల్లా కార్యాలయాలు, డైట్స్, ఎంఈవో తదితర కార్యాలయాలకు కూడా వర్తిస్తుందని వెల్లడించింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు హాజరు నమోదు కోసం యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేలా చూడాలని పాఠశాల విద్య ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్లు, డీఈవోలు, హెడ్మాస్టర్లను ఆదేశించింది. హాజరును క్రమం తప్పకుండా యాప్ ద్వారా నమోదు చేసేలా చూడాలని పేర్కొంది.