చంద్రబాబు ఇలాకా.. వెలుగులోకి టీచర్ల నిర్వాకం | kuppam: Parents Angry Over Students Being Made To Do Work In School | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ఇలాకా.. వెలుగులోకి టీచర్ల నిర్వాకం

Jun 27 2025 11:51 AM | Updated on Jun 27 2025 1:44 PM

kuppam: Parents Angry Over Students Being Made To Do Work In School

సాక్షి, చిత్తూరు: చంద్రబాబు ఇలాకా కుప్పం నియోజకవర్గంలో ఉపాధ్యాయుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. స్కూల్‌ ఆవరణలో విద్యార్థులతో ఉపాధ్యాయులు చెత్త ఎత్తించారు. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బైరుగానపల్లి ప్రభుత్వ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. స్వీపర్లు ఉన్నా కానీ విద్యార్థులతో పనులు చేయించడంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో విద్యార్థుల బతుకు విలువ ఇదేనా?’ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్‌ చేశారు. స్వీపర్లు ఉన్నా, బైరుగానపల్లి స్కూల్‌లో ఉపాధ్యాయులే విద్యార్థులతో చెత్త ఎత్తిస్తున్నారు. చదువు నేర్పించాల్సిన చోట కూలీ పనులా?. ఇది విద్యాలయమా? లేక శిక్షా శిబిరమా?. నారా లోకేష్‌.. పేద పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్జుకొని ఇప్పటికైనా విద్యాశాఖపై దృష్టి పెట్టండి’’ అంటూ రోజా హితవు పలికారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement