kuppam
-
శిలాఫలకం ధ్వంసం చేసిన టీడీపీ కార్యకర్తలు
-
చంద్రబాబు ఇలాకాలో రైస్ మాఫియా
-
పచ్చ పచ్చాని దారిలో సాగిపోదామా..
కనువిందు చేసే పచ్చని చెట్లు... బడలికను పోగొట్టే చల్లగాలి... ఎవరైనా సరే ఆ మార్గంలో ఒకసారి ప్రయాణిస్తే ఫిదా అవ్వాల్సిందే. మళ్లీ మళ్లీ ఆ దారిలో వెళ్లాలనే కోరిక తట్టాల్సిందే. రహదారికి పచ్చటి తోరణం కట్టినట్లుండి.. వాటి కిందకు వెళ్లగానే ఏదో గుహలోకి ప్రవేశించినట్లుగా కలిగే అనుభూతి ప్రయాణికులను కొద్దిసేపు అక్కడ ఆగేలా చేస్తోంది. అనంతపురం జిల్లా గార్లదిన్నె నుంచి మిడ్‌పెన్నార్ డ్యాంకు వెళ్లే మార్గంలో రోడ్డుకిరువైపులా చెట్లు ప్రయాణికులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురంగుంటూరు జిల్లా ప్రత్తిపాడు పరిసర ప్రాంతాలు అంటే గుర్తుకువచ్చేది పత్తి, మిర్చి సాగు. దశాబ్దాలుగా ఇవే పంటలు ఈ ప్రాంతంలో సాగుచేస్తుంటారు. కానీ ఇటీవల ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగానే బంతి పూల తోటలు కూడా సాగుచేశారు. గుంటూరు పర్చూరు పాత మద్రాసు రోడ్డు వెంబడి పుల్లడిగుంట సమీపంలో పండించిన బంతి పూలు పసుపు, ఆరెంజ్ రంగుల్లో చూపరులను ఆకర్షిస్తున్నాయి.నిత్యం అలలతో ఎగసి పడే సంద్రం.. వెనక్కు తగ్గింది. ఇప్పటి వరకు అలల మాటున ఉన్న శిలలు అందమైన ఆకృతులతో సరికొత్తగా పరిచయం చేసుకున్నాయి. వాతావరణ మార్పులతో సముద్రం వెనక్కు వెళ్లడంతో విశాఖ బీచ్‌లోని వైఎంసీఏ ప్రాంతంలో నల్లని రాళ్లు కనువిందు చేశాయి. దీంతో సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం కాకినాడ జిల్లా తుని పట్టణంలోని ఓ రైతుకు చెందిన నాటుకోడి అతి చిన్న గుడ్డు పెట్టడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు గండి రమణ నాటు కోళ్లు పెంచుతున్నారు. ఇందులో ఒక పెట్ట ముందు రోజు సాధారణ పరిమాణం కలిగిన గుడ్డు పెట్టగా.. మంగళవారం చిన్న గుడ్డు పెట్టింది. జన్యుపరమైన లోపం వల్ల ఇలా జరుగుతుందని పశు వైద్యుడు శ్రీధర్ చెప్పారు.విశాఖ కేంద్ర కారాగారం ఆవరణలో సీజనల్ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం శీతాకాలం కూరగాయల పంటలు ప్రారంభమయ్యాయి. కొన్ని కాపు దశకు వచ్చాయి. జైలులో ఉండే ఓపెన్ ఎయిర్ ఖైదీలచే రసాయనిక ఎరువుల్లేకుండా అధికారులు ఇక్కడ పంటలు పండిస్తుంటారు. జైలు లోపల మామిడి, కొబ్బరితోపాటు, బయట ఆవరణ సుమారు 20 ఎకరాల్లో సీజనల్ పంటలు పండించి వాటిని ఖైదీలకు వినియోగిస్తుంటారు. మిగిలిన వాటిని జైలు గేటు ముందు బీఆర్టీఎస్ పక్కన సుధార్ కేంద్రంలో విక్రయిస్తుంటారు. ప్రస్తుతం వంగ, బీర, క్యాబేజీ, టమాటా, ఆనప (సొర) సాగు చేస్తున్నారు. ఈ పంటలతో జైలు ఆవరణ అన్ని కాలాల్లోను పచ్చదనంతో కళకళలాడుతోంది.తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కిన ఘటన సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. మండలంలోని వీర్నమల ఎస్సీ కాలనీలో మూడు నెలలుగా తాగునీటి సమస్యతో సతమతమవుతున్నామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కారు. ఎస్సీ కాలనీలో ఉన్న బోరులో నీరు ఇంకిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చిందని, డబ్బులిచ్చి నీళ్లు కొనుక్కోవాల్సిన ఖర్మ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోకపోవడంతో వారంతా ఖాళీ బిందెలతో ఆంధ్ర–తమిళనాడు సరిహద్దు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఈ కారణంగా వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది.చౌక దుకాణాల వద్ద రేషన్ కోసం లబ్ధిదారులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి మళ్లీ ఎదురైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో ఇంటి వద్దకే రేషన్ పథకాన్ని అమలు చేసింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాల్లో ఈ వ్యవహారాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. చిత్తూరులోని 27వ వార్డు చామంతిపురం రేషన్‌షాపు వద్ద మంగళవారం ప్రజలు రేషన్ కోసం గంటల కొద్దీ పడిగాపులు కాశారు. గంటల కొద్దీ నిలబడలేక తాము తెచ్చుకున్న సంచులను వరుస క్రమంలో పెట్టారు. సమీపంలోని 28వ వార్డులో, మరికొన్ని మండలాల్లో సైతం ఇదే పరిస్థితులు ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రజలు గత ప్రభుత్వ పాలనే బాగుందని వ్యాఖ్యానిస్తున్నారు. చదవండి: ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు 1,027.58 కిలో మీటర్లు -
కుప్పంలో సీజ్ ది థియేటర్
చిత్తూరు, సాక్షి: సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి కోపమొచ్చింది. తమ అభిమాన నటుడి సినిమా ప్రదర్శించకుండా అధికారులు ఓ థియేటర్‌ను సీజ్ చేయడంపై రగిలిపోతున్నారు. స్థానికంగా ఓ నేతకు చెందిన రెండు థియేటర్లలో పుష్ప 2 చిత్రం ప్రదర్శిస్తున్నారు. అయితే.. ఎన్వోసీ సర్టిఫికెట్ లేకుండా సినిమా ప్రదర్శిస్తున్నారంటూ అధికారులు షోలను అర్ధాంతరంగా నిలిపివేయించి మరీ తాళాలు వేశారు. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. లైసెన్సు రెన్యూవల్ చేసుకోకుండా థియేటర్ రన్ చేస్తున్నారని అధికారులు చెబుతుండగా.. ఇది కక్ష సాధింపు చర్యలో భాగమై ఉండొచ్చంటూ ఫ్యాన్స్ వాదిస్తున్నారు. మరోవైపు వారాంతం కావడంతో కొత్త సినిమా చూద్దామని థియేటర్‌కు వస్తున్న ప్రేక్షకులు.. గేటుకు తాళాలు చూసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇదీ చదవండి: టార్గెట్ అల్లు అర్జున్.. రాజకీయ సెగ! -
చిత్తూరు జిల్లా కుప్పంలో కాంట్రాక్ట్ లెక్చరర్ల వినూత్న నిరసన
-
ఎన్టీఆర్ కోసం ఫ్యాన్స్ వందల కిలోమీటర్ల పాదయాత్ర
తనని ప్రేమించే ఫ్యాన్స్ అంటే జూనియర్ ఎన్టీఆర్‌కు ఎనలేని అభిమానం. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులపై కూడా ఆయన ఎంతో ఆప్యాయత కనబరుస్తుంటారు. అందుకే తారక్ ప్రతి ఆడియో ఫంక్షన్లో అభిమానులు అందరూ క్షేమంగా ఇంటికి చేరుకోవాలని, వారి కోసం ఇంటి వద్ద ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు ఉంటారని సూచిస్తాడు. ఫ్యాన్స్‌పై ఆయన చూపించే ఇలాంటి ప్రేమనే నేడు 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించేలా చేసింది.కుప్పంలోని గుడుపల్లి మండలానికి చెందిన నలుగురు యువకులు తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్‌కు పాదయాత్ర చేశారు. సోడిగానిపల్లి పంచాయతీ పాళెం గ్రామానికి చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు శివ, హరి, లక్ష్మీపతి, కదిరప్ప పాద యాత్ర ద్వారా హైదరాబాద్ చేరుకుని జూనియర్ ఎన్టీఆర్‌ను కలిశారు. నవంబర్ 3న వారు తమ ఇంటి నుంచి ప్రయాణించారు. తమ స్వగ్రామం నుంచి హైదరాబాద్‌లోని జూనియర్ ఎన్టీఆర్ నివాసం వరకూ ‘వేసే ప్రతి అడుగు జూనియర్ ఎన్టీఆర్ అన్న కోసం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. దాదాపు 650 కిలోమీటర్లు పైగా కాలినడకన హైదరాబాద్ చేరుకుని ఎన్టీఆర్ కలుసుకున్నారు. కుప్పం నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు వారికి సుమారు 13 రోజుల సమయం పట్టింది. తారక్‌పై వారు చూపించిన ప్రేమకు కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడు శివరాయల్ వారికి సంఘీభావం తెలిపారు.This is why he’s the PEOPLE’S HERO ❤️❤️MAN OF MASSES @Tarak9999 met fans who walked all the way from Kuppam. He spent time with them and made their day with his warmth 😍✨ #ManOfMassesNTR #NTR pic.twitter.com/FmR7vok8w8— Vamsi Kaka (@vamsikaka) November 15, 2024 -
కుప్పంలో హైడ్రామా !
-
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ బాషా రాసలీలలు
-
కుప్పం: ప్రియురాలు పిలిచిందని లేడీస్ హాస్టల్లో దూరి..
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల నర్సింగ్ హాస్టల్లోకి యువకుడు చొరబడిన ఘటన కలకలం రేపింది. కేరళ నుంచి ప్రియుడిని యువతి, పిలిపించుకుంది. ఒకే గదిలో ఆరుగురు నర్సింగ్ విద్యార్థినులు ఉండగా, బురఖా వేసుకొని మారు వేషంలో లేడీస్ హాస్టల్‌కు ప్రియుడు వెళ్లాడు.ఆటో దిగి వ్యక్తి వెళ్తుండగా, గమనించిన ఆటో డ్రైవర్లు వార్డెన్‌కు సమాచారం అందించారు. దీంతో కాలేజీ సెక్యూరిటీ సిబ్బంది ఆ యువకుడిని పట్టుకున్నారు. గుడిపల్లి పోలీసులకు హాస్టల్ వార్డెన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఇదీ చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో! -
కుప్పంలో గంజాయి ‘మత్తు’.. తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ
సాక్షి, చిత్తూరు జిల్లా: సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి మత్తులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణ పడటంతో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఇరువర్గాలు ఒకరిపై మరొకరు కత్తులు, రాడ్డులతో దాడులు చేసుకున్నారు. దాడిలో కుప్పం మాజీ జడ్పీటీసీ రాజ్ కుమార్ తమ్ముడు వినయ్ తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘర్షణలో న్యాయవాది కుమారుడు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు తెలిసింది. టీడీపీ కార్యకర్త వినయ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఇలాంటి ఘర్షణలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇదీ చదవండి: గనుల శాఖలో బదిలీల ‘వేలం’ -
కుప్పంలో క్షుద్ర పూజల కలకలం..
-
టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు: కుప్పం ఎంపీపీ
సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సోమవారం కుప్పం ఎంపీపీ అశ్విని, ఎంపీటీసీలు కలిశారు. తన తండ్రి కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ మండలం కన్వీనర్ మురుగేశ్, సోదరుడు శ్రీను రాజేంద్ర ప్రసాద్ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఎంపీపీ ఆవేదన వ్యక్తం చేశారు. మిథున్‌రెడ్డిని కలిసిన అనంతరం ఎంపీపీ అశ్విని మీడియాతో మాట్లాడారు. ‘‘ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా నిలుస్తుందని ఎంపీ మిథున్‌రెడ్డి చెప్పారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్నారు. జనవరి నెలలో మల్లనూరు పంచాయితీ ట్రాక్టర్ పోయిందని మేము పిర్యాదు చేశాం, ఇప్పుడు మాపైనే కేసు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు, లేదంటే కుప్పం ఎంపీపీ పదవికి రాజీనామా చేయమంటున్నారు. కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలుపై తప్పుడు కేసులు బనాయించి సీఐ ఇబ్బందులు పెడుతున్నారు. అన్ని రోజులు ఒకేలా ఉండవు.. ఐదేళ్ల తర్వాత పరిస్థితి మారుతుంది.. అప్పుడు మీ పరిస్థితి ఆలోచన చేసుకోండి’’ అని ఆమె అన్నారు. -
కుప్పంలో జల్లికట్టు నిర్వహణ.. 10 మందికి గాయాలు
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో జల్లికట్టు నిర్వహించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో ఈ జల్లికట్టు నిర్వహణ జరిగింది. చెక్కునత్తం గ్రామంలో నిర్వహించిన జల్లికట్టులో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
రాజకీయ కక్షతోనే కేసు.. అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు: ఎమ్మెల్సీ భరత్
సాక్షి, కుప్పం: తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని అన్నారు వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని తెలిపారు. ఉన్నత విలువలతో బతికే వ్యక్తినని చెప్పారు.తన వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్ఓ ఎవరూ లేరని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని అన్నారు భరత్. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం, అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతోనే తనపై కేసులు నమోదు చేసి అప్రతిష్టపాలు జేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రలను కచ్చితంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. అసలు తనపై ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరు? అవన్నీ ఆరా తీస్తానని చెప్పారు. పూర్తి వివరాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తన వీడియో సందేశంలో తెలిపారాయన. -
కుప్పంలో టీడీపీ నేతల ఓవరాక్షన్
సాక్షి, చిత్తూరు జిల్లా: కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేశారు. రామకుప్పంలో ఎంపీటీసీల సమావేశానికి వెళ్లిన ఎమ్మెల్సీ భరత్‌పై దాడికి యత్నించారు. వైఎస్సార్సీపీ నేత, రామకుప్పం ఎంపీపీ చంద్రా రెడ్డి ఇంట్లో ఎంపీటీసీలతో ఎమ్మెల్సీ భరత్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంపీపీ ఇంట్లోకి తెలుగు తమ్ముళ్లు దౌర్జన్యంగా ప్రవేశించారు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలపై దురుసుగా ప్రవర్తించారు. వైఎస్సార్సీపీ నేతలు వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. ఎంపీపీ ఇంటికి చేరుకున్న పోలీసులు టీడీపీ నేతలను అక్కడి నుంచి పంపించేశారు. -
సోనూ సూద్ బర్త్ డే.. ఏపీ విద్యార్థుల స్పెషల్ విషెస్!
బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇవాళ 51వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా సినీతారలు, టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆయనకు విషెస్ తెలిపారు. అరుంధతి మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సోనూసూద్.. బాలీవుడ్లో బిజీగా ఉన్నారు. అయితే సినిమాలతో పాటు సమాజ సేవలోనూ ఆయన ముందున్నారు. సోనూసూద్ ఫౌండేషన్ స్థాపించిన నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు.తాజాగా ఇవాళ సోనూ పుట్టిన రోజు కావడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. కుప్పంలోని హాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ఆయన రూపంలో నిలబడి విషెస్ చెప్పారు. దాదాపు 1200 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యాపీ బర్త్ డే రియల్ హీరో అంటూ తమ అభిమానం చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విధంగా కార్యక్రమంలో విద్యార్థుల సృజనాత్మకత, ఉత్సాహాన్ని పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. కాగా.. ఇటీవలే సోనూసూద్ ఏపీకి చెందిన విద్యార్థికి చదువుకు సాయమందించిన సంగతి తెలిసిందే. నటుడు @SonuSood పుట్టినరోజు సందర్భంగా అద్భుత రీతిలో శుభాకాంక్షలు తెలిపిన కుప్పం విద్యార్థులుసోను సూద్ ముఖ చిత్రాన్ని ప్రతిబింబించేలా విద్యార్థుల అద్భుత ప్రదర్శనహాకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం#sonusoodbirthday #Kuppam pic.twitter.com/tGLKlhF7ym— Telugu Galaxy (@Telugu_Galaxy) July 30, 2024 -
YSRCP నాగార్జున యాదవ్ అరెస్ట్..
-
నాగార్జున యాదవ్ అరెస్ట్
సాక్షి చిత్తూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను ఆదివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. అర్థరాత్రి ఆయనను కుప్పం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నాగార్జునయాదవ్ ఓ టీవీ ఛానెల్ చర్చలో సీఎం చంద్రబాబు గురించి మాట్లాడినందుకు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి కుప్పం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దానిపై అక్కడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ, ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో వైఎస్సార్సీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈనెల 25 వరకు అతన్ని అరెస్టు చేయరాదని ఆదేశించిన విషయం తెలిసిందే. నాగార్జున యదావ్పై 196(1), 351(2)BNS సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.ఇంతలోనే బెంగళూరు నుంచి విజయవాడ వస్తుండగా ఆదివారం రాత్రి చిత్తూరు జిల్లా వికోట సమీపంలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇది హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనని, పోలీసులిచ్చిన 41ఏకి కూడా విరుద్ధంగా ఉందని వైఎస్సార్సీపీ తప్పుబడుతోంది. దీనిపై న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది. -
కుప్పంలో దారుణం..
-
చంద్రన్న నాటుసారా.. కుప్పంలో కొత్త లిక్కర్
-
తల్లికి పెన్షన్ తీసేశారని.. కుప్పంలో దారుణం..
-
కుప్పం ప్రజలను మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం
-
కుప్పాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
సాక్షి, చిత్తూరు/కుప్పం: రానున్న ఐదేళ్లల్లో కుప్పాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన సీఎం హోదాలో తొలిసారిగా సొంత నియోజకవర్గం కుప్పానికి మంగళవారం వచ్చారు. అక్కడి నుండి శాంతిపురం మండలం జెల్లిగానిపల్లి చేరుకుని హంద్రీనీవా కాలువను సందర్శించారు. అనంతరం సా.4 గంటలకు స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లల్లో కుప్పాన్ని అగ్రస్థానంలో నిలబెట్టి, ప్రజల రుణం తీర్చుకుంటానన్నారు. పేదరికం లేని సమాజం చేస్తానన్నారు. గత ప్రభుత్వంలో అప్రజాస్వామ్యం, రౌడీయిజం, అన్నా క్యాంటీన్‌పై దాడులు, ఏకంగా తననే బెదిరించే స్థాయి దౌర్జన్యాలతో కుప్పాన్ని భ్రష్టు పట్టించారన్నారు. కేజీఎఫ్ గనులు, గ్రానేట్ దోపిడీ చేశారన్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని, అభివృద్ధి బాధ్యత తనేదన్నారు. తనకు ఎవరిపైనా కోపంలేదని, ప్రశాంతమైన పట్టణంగా అభివృద్ధికే కట్టుబడి ఉన్నానన్నారు. ఇకపై కుప్పంలో ఎవరు రౌడీయిజం చేసినా అదే కడపటి రోజు అవుతుందని చంద్రబాబు హెచ్చరించారు. గంజాయి, అక్రమ వ్యాపారాలు చేస్తే అణచివేస్తామన్నారు. కుప్పం అభివృద్ధికి ‘కడా’ ఏర్పాటు..ఇక కుప్పం అభివృద్ధి కోసం గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (కడా) ఏర్పాటుచేశానని, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మళ్లీ ‘కడా’ను ఏర్పాటుచేస్తానని, ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారిని నియమించి అభివృద్ధి చేస్తామన్నారు. కుప్పం నియోజకవర్గంలో మరో రెండు మండలాలుగా మల్లానూరు, రాళ్ళబూదుగూరులను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. ఆర్టీసి డిపోను ఆధునీకరించి, ఎలక్ట్రికల్ బస్సులు తీసుకొస్తామన్నారు. కుప్పంలోని ప్రధాన ఆలయాలను అభివృద్ధి చేస్తానన్నారు. అలాగే, కుప్పంలో విమానాశ్రయం నిర్మించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. కుప్పంలో ఉత్పత్తి చేసే కూరగాయలు, పండ్లు, పూలు, ఇతర వస్తువులు ఇక్కడి నుంచి దేశవిదేశాలకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. పూలకు ప్రత్యేకంగా మార్కెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. కోళ్ళు, గొర్రెల పెంపకం పరిశ్రమలు ఏర్పాటుచేసి రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పాల ఉత్పత్తి సామర్థ్యాన్ని 10 లక్షల లీటర్ల వరకు పెంచే చర్యలు చేపడతామన్నారు. కుప్పంలో ప్రతి కుటుంబాన్ని లక్షలాధికారులుగా తీర్చిదిద్దే బాధ్యత తాను తీసుకుంటున్నట్లు చంద్రబాబు చెప్పారు.కుప్పం–బెంగళూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే..కుప్పం నియోజకవర్గాన్ని తమిళనాడు, కర్ణాటకలతో అనుసంధానం చేసేందుకు ఫోర్వే రోడ్లను అభివృద్ది చేయనున్నట్లు సీఎం చెప్పారు. ఇందులో భాగంగా కుప్పం–బెంగళూరు మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే, పలమనేరు–క్రిష్ణగిరి మధ్య ఫోర్ వే రోడ్లను నిర్మించనున్నట్లు చెప్పారు. అలాగే, హంద్రీ–నీవా కాలువ అభివృద్ధి పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి, ట్రాక్టర్లతో నీటిని నింపి సినిమా షో చేసిందని విమర్శించారు. కానీ, తాను ఈ ఏడాదిలోనే పూర్తిస్థాయిలో కృష్ణాజలాలు కుప్పానికి తీసుకొస్తానన్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు భారీ మెజారిటీలు రాగా.. తనకు ఆ స్థాయిలో మెజారిటీ రాకపోవడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాలోని 4 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాలు అమరావతి నిర్మాణం కోసం రూ.4.5 కోట్లు విరాళం చెక్కులను సీఎంకు అందజేశారు. -
మా పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు ఇక రాకూడదు
-
చంద్రబాబుకు ‘కుప్పం’ టెన్షన్.. జరిగేది అదేనా?
నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్‌కు కౌంటింగ్ భయం పట్టుకుందా? కుప్పం ఫలితంపై ఇప్పటి నుంచే ఆందోళన మొదలైందా? వైఎస్ జగన్ పాలనలో కుప్పం ప్రజలు గతంలో ఎన్నడూ చూడని విధంగా లబ్ది పొందడమే టీడీపీ భయానికి కారణమా? మూడున్నర దశాబ్దాలుగా కుప్పంలో గెలుస్తూ వచ్చిన చంద్రబాబులో కూడా భయం ప్రారంభమైందా? కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందా అంటూ టీడీపీలో మొదలైన భయానికి కారణం అదేనా? ఎన్నికల ఓట్లు లెక్కించే గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు గెలుపు ఓటములపై లెక్కలు వేసుకోవడంలో తల మునకలుగా ఉన్నాయి. ప్రధానంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మూడు దశాబ్దాలకు పైబడి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు గెలుస్తూ వస్తున్నారు. సొంత నియోజకవర్గం చంద్రగిరిలో 1983లో ఓటమి తర్వాత చంద్రబాబు తన రాజకీయ ప్రస్థానాన్ని 1989లో కుప్పం నుంచి ప్రారంభించారు. ఎక్కువగా బడుగు బలహీన వర్గాల ప్రజలే ఉన్న కుప్పంలో చంద్రబాబు మాయమాటలకు ఎదురులేకుండా పోయింది. అయితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 2019 నుంచి కుప్పం వాసుల్లో మార్పు మొదలైంది. ఇందుకు వైయస్సార్ సీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణం. కుప్పంలో తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతూ వచ్చిన చంద్రబాబు గ్రాఫ్ క్రమంగా పడిపోతూ వచ్చింది.ఈ ఎన్నికల్లో కుప్పంలో చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఫలితాలు ఎలా ఉంటాయో అని చంద్రబాబుకు సైతం టెన్షన్ పట్టుకుందని టీడీపీ వర్గాల సమాచారం. కుప్పంలో ఈసారి పోలింగ్ శాతం 89.88గా నమోదైంది. గతంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ 30 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దొంగ ఓట్లతోనే చంద్రబాబు విజయం సాధిస్తూ వచ్చారన్న వాదనా ఉంది. ప్రధానంగా తమిళనాడుకు చెందిన వానంబాడి, తిరుపత్తూరు, నాట్రంపల్లితో పాటు కర్ణాటక రాష్ట్ర పరిధిలోని కే జి ఎఫ్, బంగారు పేట, బెంగళూరు, బేతమంగళం వంటి ప్రాంతాల నుంచి వేలాదిమంది వచ్చి కుప్పంలో టిడిపికి ఓట్లు వేసేవారు. 2019 ఎన్నికలకు ముందు దివంగత వైఎస్సార్సీపీ నేత చంద్రమౌళి టీడీపీ దొంగ ఓట్ల వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్‌కు పూర్తి వివరాలతో సహా అందించారు. విచారణ జరిపిన ఎన్నికల కమిషన్ దాదాపు 20 వేల ఓట్లను తొలగించింది. ఈ కారణంగానే 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గిందని విశ్లేషకులు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో 46 వేల మెజార్టీ రాగా, 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ 30 వేలకు పడిపోయింది. 2019 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా కుప్పంలో దాదాపు 20వేల టిడిపి దొంగ ఓట్లు ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పరిశీలనలో తేలింది. వీటిలో కేవలం 7, 8 వేల దొంగఓట్లను మాత్రమే ఈసీ ద్వారా తొలగించగలిగారు. ఇదిలా ఉంటే..ఈ ఎన్నికల్లో కుప్పంలో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం టీడీపీ వర్గాలకు ఆందోళన కలిగిస్తోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఐదేళ్ళ పాలనా కాలంలో కుప్పం వాసులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూర్చారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా వేలాదిమందికి ఇంటి పట్టాలతో పాటు గృహాలు మంజూరు చేశారు. అలాగే పంచాయతీగా ఉన్న కుప్పంను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసి కుప్పం వాసుల చిరకాల వాంఛ నెరవేర్చారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయించారు. ప్రధానంగా కృష్ణా జలాలను కుప్పం వాసులకు అందించారు. ఈ కారణాలతో కుప్పం వాసుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల సంపూర్ణంగా నమ్మకం ఏర్పడింది. అందువల్లే ఈ ఎన్నికల్లో కుప్పం వాసులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో టీడీపీ వర్గాలలో టెన్షన్ ప్రారంభమైంది.కౌంటింగ్ రోజు ఏమి జరుగుతుందో అన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది మెజారిటీతో అయినా చంద్రబాబు గెలవడం ఖాయం అంటూ కుప్పం పచ్చ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి కుప్పం ఏమవుతుందా అని చంద్రబాబు ఆందోళన చెందుతుంటే టీడీపీ క్యాడర్ లెక్కల మీద లెక్కలు కడుతున్నట్లు సమాచారం. 2019లో చంద్రబాబు మెజార్టీ భారీగా తగ్గింది. అందుకే ఈసారి టీడీపీ నేతలు బయటికి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోన మాత్రం ఆందోళనకు గురవుతున్నారనే టాక్ నడుస్తోంది.