TDP Worker Bhanumurthy Big Shock TO Nara Lokesh In Padayatra Infront Of Public - Sakshi
Sakshi News home page

చిత్తూరు: లోకేష్‌ యాత్రలో టీడీపీ కార్యకర్తల షాక్‌

Published Sun, Jan 29 2023 8:05 AM | Last Updated on Sun, Jan 29 2023 2:51 PM

TDP Worker Shock TO Nara Lokesh In Padayatra - Sakshi

చిత్తూరు: టీడీపీ నేత నారా లోకేష్‌కు పాదయాత్రలో షాకిచ్చారు ఆ పార్టీ కార్యకర్తలు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై భానుమూర్తి అనే కార్యకర్త లోకేష్‌ను నిలదీశాడు. చంద్రబాబు హయాంలో బీసీలకు సంక్షేమ పథకాలు అందలేదని చెప్పాడు. టీడీపీ నేతలు వాళ్లకు వాళ్లే సంక్షేమ పథకాలు పంచుకున్నారని పేర్కొన్నాడు.

టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు అందక బీసీలు ఎంతో ఇబ్బందిపడ్డారని భానుమూర్తి అన్నాడు. కుప్పంలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగోలేదని లోకేష్‌కు నిర్మొహమాటంగా చెప్పాడు. కుప్పంపై పార్టీ నాయకులు తప్పుడు రిపోర్టు ఇస్తున్నారని వివరించాడు. తాను వాస్తవం చెబుతున్నానని, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదని భానుమూర్తి తేల్చి చెప్పాడు.

బీసీలకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా భానుమూర్తి మాట్లాడటంతో టీడీపీ నేతలు మొహాలు తెల్లబోయాయి. నిజాలు చెప్పిన భానుమూర్తిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కుప్పంలో గ్రౌండ్ రిపోర్టు ఎందుకు బాగోలేదంటూ మండిపడ్డాడు.
చదవండి: నేను మూర్ఖుడిని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement