chittoor
-
వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలపై కూటమి కంటగింపు..
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. నేడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలపై కూడా సర్కార్ ఓవరాక్షన్ చేస్తోంది. పలుచోట్ల వైఎస్ జగన్ ఫ్లెక్సీలు తొలగించడమే కాకుండా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగారు.వివరాల ప్రకారం.. వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలపై కూడా కూటమి సర్కార్ కక్ష సాధింపులకు దిగింది. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ కార్యకర్తలు రేణిగుంటలో శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కూటమి నేతల ఆదేశాలతో పోలీసులు రంగంలోకి దిగి.. ఫ్లెక్సీలను తొలగించారు. ఇదే సమయంలో వైఎస్సార్సీపీ రేణిగుంట పట్టణ అధ్యక్షులు ప్రభాకర్‌కు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే కేసులు పెడతామని సీఐ వార్నింగ్ ఇచ్చారు.మరోవైపు.. అన్నమయ్య జిల్లాలో టీడీపీ నేతలు ఓవరాక్షన్‌కు దిగారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు, కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో, ఈఘటనపై మదనపల్లి తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
AP: బలహీనపడిన తుపాను
సాక్షి, అమరావతి/నెట్వర్క్: ఫెంగల్ తుపాను ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద నెమ్మదిగా బలహీనపడింది. తీరం దాటిన తర్వాత కూడా 6 గంటలకుపైగా భూమిపై తుపానుగానే స్థిరంగా కొనసాగింది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. ప్రస్తుతం ఇది పుదుచ్చేరి సమీపంలోని కడలూరుకు 30 కి.మీ., విల్లుపురానికి 40 కి.మీ., చెన్నైకి 120 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాత్రికి ఇంకా బలహీనపడి వాయుగుండంగా.. ఆ తర్వాత అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మూడు జిల్లాల్లో ఎడతెగని వర్షాలుతుపాను ప్రభావంతో చిత్తూరు, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఆదివారం కూడా ఎడతెగని వర్షాలు కురిశాయి. మిగిలిన కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. 24 గంటల వ్యవధిలో తిరుపతి జిల్లా పుత్తూరులో 18.7సెం.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. అదే జిల్లా పుత్తూరు మండలం రాచలపాలెంలో 15.2 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, తడ, చిత్తమూరు, దొరవారిసత్రం, నాయుడుపేట, వెంకటగిరిలో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లా నగరి, నిండ్ర, కార్వేటినగరం, పాలసముద్రం మండలాలు, నెల్లూరు జిల్లాలోని మనుబోలు, కొడవలూరు, సైదాపురం మండలాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. కోస్తా జిల్లాల్లోనూ చాలాచోట్ల భారీ వర్షాలు పడ్డాయి.డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోనలో 10 సెం.మీ. వర్షం కురిసింది. తిరుపతి జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. వాగుల్లోకి పెద్దఎత్తున నీరు చేరి ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చెన్నైలో ఇంకా తీవ్రంగా వర్షాలు పడుతుండటంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లే అనేక బస్సులను రద్దు చేశారు. సోమవారం కూడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. తిరుపతి జిల్లాలో జోరువానతిరుపతి జిల్లాలో 3 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. సత్యవేడు, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. వర్షం ప్రభావంతో 116 ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేశారు. 21 గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ సర్వీసులు వెళ్లడం లేదు. చెన్నైకి వెళ్లే పలు సర్వీసులకు బ్రేక్ పడింది. ఏసీ సర్వీసులను నిలుపుదల చేశారు. జిల్లాలో మామిడి కాలువ, పాముల కాలువ, కార్వేటి కాలువ, ఈదులకాలువ, సున్నపు కాలువ తదితర 21 కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ వానలుకృష్ణా జిల్లా పెనమలూరు, పెడన, పామర్రు, అవనిగడ్డ ప్రాంతాల్లో ఆదివారం కూడా వర్షాలు కురిశాయి. 19,500 ఎకరాల్లో వరి నేలవాలింది. కోతలు పూర్తయిన చోట్ల ధాన్యాన్ని రోడ్లపైనే రాశులు పోయగా.. తడిసిపోయింది. ఎన్టీఆర్ జిల్లాలో అక్కడక్కడా మోస్తరు జల్లులు కురిశాయి. పూత దశలో ఉన్న కంది, మిరప గాలులకు రాలిపోయింది. మబ్బుల కారణంగా పంటలు తెగుళ్ల బారిన పడే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో 9.2 మి.మీ. వర్షం పడగా, అత్యల్పంగా వట్టిచెరుకూరు మండలంలో 1.6 మి.మీ. వర్షం కురిసింది. కొల్లిపర, దుగ్గిరాల, తెనాలి, పొన్నూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో కోతకు వచ్చిన వరి పంట పలుచోట్ల నేల వాలింది.పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం చిరు జల్లుల కారణంగా సార్వా మాసూళ్ల (నూర్పిడి) పనులు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. భోగాపురం, గరివిడి, ఎస్.కోట, డెంకాడ, గుర్ల, చీపురుపల్లి, పూసపాటిరేగ, కొత్తవలస, బొండపల్లి, గజపతినగరం, వేపాడ, నెల్లిమర్ల, మెంటాడ, విజయనగరం, రామభద్రపురం మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో చెదురుమదురు జల్లులు పడ్డాయి.కాకినాడ జిల్లాలో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వరి చేలు నేలకొరిగాయి. సుమారు 30 శాతం వరిచేలు నేలనంటాయి. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో వరిపై వర్షాల ప్రభావం అధికంగా ఉంది. కూనవరం మొగ మూసుకుపోవడంతో ముంపు నీరు దిగడం లేదు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రొయ్యల చెరువుల్లో ఆక్సిజన్ శాతం పడిపోయింది. రొయ్యలను కాపాడుకునేందుకు ఆక్వా రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.తిరుమలలో విరిగిపడుతున్న కొండ చరియలుతిరుమలలోని రెండో ఘాట్ రోడ్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. సకాలంలో టీటీడీ సిబ్బంది వాటిని తొలగిస్తున్నారు. రెండు ఘాట్ రోడ్లలోనూ దిట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. తిరుమలలో ఆదివారం కూడా ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరగడంతో చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్ జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు పలు మండలాల్లో వరి పంట నేలకొరిగింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రైల్వేకోడూరు నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వరి, టమాటా, బొప్పాయి ఇతర ఆకు కూరల తోటలు దెబ్బతిన్నాయి. పొగ మంచు రావడంతో రహదారులపై వాహనదారులు కష్టతరంగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు. -
‘హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. వేధింపులా?’
చిత్తూరు: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్సార్సీపీ సోషల్‌మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తే వారిని అక్రమ కేసులతో వేధింపులకు గురిచేయడం అత్యంత దారుణమమన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. టీడీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిని పూతలపట్టు వైఎస్సార్సీపీ మండల పార్టీ కన్వీనర్ శ్రీకాంత్‌రెడ్డిని మిథున్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘కక్ష్య పూరిత రాజకీయాలకు టీడీపీ నాయకులు స్వస్తి పలకాలి. సొంత ఊర్లో తిరగలేని పరిస్థితి ఈరోజు పూతలపట్టు మండల పార్టీ కన్వీనర్ విషయంలో మీరు తీసుకు వచ్చారు. పోలీసులు చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పై దృష్టి పెట్టండి, డైవర్షన్ పాలిటిక్స్ వద్దు. సోషల్ మీడియా కార్యకర్తలు పై కేసులు పేరుతో వేధింపులు మానుకోవాలి.గతంలో టీడీపీ ప్రోద్బలంతో వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయండి అని ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలు పై వేధింపులు మానుకోవాలి.ఎల్లకాలం ఒకే ప్రభుత్వం అధికారంలో ఉండదు, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి.. ఇలానే చేస్తే ముగింపు అనేది ఉండదు’ అని మండిపడ్డారు మిథున్‌రెడ్డి. -
చిత్తూరు జిల్లాలో కిడ్నాప్ కలకలం
-
చిత్తూరులో 14 ఏళ్ల బాలిక అదృశ్యం
చిత్తూరు అర్బన్: చిత్తూరులో ఓ మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. నగరంలోని చామంతిపురానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈమె తండ్రి గల్ఫ్ దేశంలో పొట్టకూటి కోసం వెళ్లారు. తల్లి, అమ్మమ్మ వద్ద ఉంటున్న బాలిక ఆదివారం చికెన్ తీసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. కొద్ది సేపటి తర్వాత బాలిక ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు కంగారుపడి, తెలిసినవాళ్ల ఇళ్ల వద్ద వెతికారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు చెప్పి సీసీ కెమెరాలు పరిశీలించారు. ఆదివారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఆటో డ్రైవర్ కిడ్నాప్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ కేసుపై వైఎస్సార్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. మంగళవారం చిత్తూరు పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువయ్యిందని.. మహిళలు మిస్ అవుతున్నా, అఘాయిత్యాలు, అత్యాచారాలకు గురవుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తోందన్నారు. చిత్తూరులో కనిపించకుండాపోయిన బాలిక ఆచూకీ వెంటనే కనిపెట్టి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. బాలిక ఆచూకీ తెలియకపోవడంతో చామంతిపురం వాసులు మంగళవారం రాత్రి వన్‌టౌన్ స్టేషన్ వద్దకు చేరుకుని బాలిక వివరాలు చెప్పాలని నిరసన తెలిపారు. -
తోతాపురి పండు.. ఎగుమతుల్లో ట్రెండు
చిత్తూరు అర్బన్: తోతాపురి మామిడి కారణంగా చిత్తూరుకు ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు దక్కింది. తోతాపురి మామిడి కోసం ఏకంగా 48 దేశాలు చిత్తూరు వైపు చూస్తున్నాయి. ఇక్కడి నుంచి పంపిస్తున్న మామిడి గుజ్జు (మ్యాంగో పల్ప్)ను ఆయా దేశాల పౌరులు అపారమైన ప్రేమతో ఆస్వాదిస్తున్నారు. ఎగుమతుల్లో మరే దేశానికి లేని ప్రత్యేకత చిత్తూరు వల్లే భారత్‌కు దక్కుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తూరు మామిడిపై కాస్త దృష్టి సారిస్తే ఎగుమతుల్లో మరింతగా ముందడుగు వేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 1.12 లక్షల హెక్టార్లలోఏ రాష్ట్రంలో లేనివిధంగా మామిడి ఉమ్మడి చిత్తూరులో సాగవుతోంది. చిత్తూరు, మదనపల్లె, తిరుపతి జిల్లాల్లో 1.12 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇందులో తోతాపురి (బెంగళూరు) రకానికి చెందిన మామిడి చిత్తూరుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చి0ది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 70 వేల హెక్టార్లు తోతాపురి, 42 వేల హెక్టార్లలో టేబుల్ రకాలకు చెందిన మామిడి సాగులో ఉంది. రమారమి ఏటా 7.5 లక్షల టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుండగా.. ఇందులో 5 లక్షల టన్నులతో తోతాపురి సింహభాగంలో ఉంది. తోతాపురి రకం కాయలను పండుగా తినడానికి, పచ్చళ్లకు ఉపయోగించరు. ఇది మృదువుగా, తీపిగా ఉండటంతో దీనిని పూర్తిగా గుజ్జు (పల్ప్) కోసమే ఉపయోగిస్తారు. మామిడి కాయల్ని వేడి నీటిలో శుభ్రంచేసి, టెంకను తొలగించి, గుజ్జును యంత్రాల ద్వారా వేరు చేస్తారు. సహజంగానే ఇది తియ్యగా ఉండటంతో కొద్దిమొత్తంలో చక్కెరను కలిపి మొత్తం గుజ్జును గాలి తీసేసిన కంటైనర్లలో నిల్వచేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. దేశంలోనూ డిమాండే దేశీయంగా తయారయ్యే పల్పీ, ఫ్రూటీ, స్లైస్, డాబర్, బి–నేచురల్ వంటి కంపెనీలు ఈ గుజ్జుతోనే మామిడి పానీయాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ కంపెనీలు సైతం ఇక్కడి నుంచే గుజ్జును సేకరిస్తాయి. చిత్తూరు జిల్లాలో 47 మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, పోలెండ్, ఉక్రెయిన్, బెల్జియం, ఆ్రస్టేలియా, క్రోషియా, డెన్మార్క్, నార్వే, స్వీడన్, రుమేనియా, ఆల్బేనియా, ఐర్లాండ్, సెజియా, ఐస్లాండ్, స్లోవేనియా, హంగేరి, ఫిన్లాండ్, సెర్బీ, మాల్టా, లాక్సంబర్గ్, సిప్రస్, స్లోవేకియా, మోనాకో లాంటి 48 దేశాలకు చిత్తూరు నుంచే మ్యాంగో పల్ప్ ఎగుమతి అవుతోంది. ఏటా ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు తయారీ పరిశ్రమలు 24 గంటలపాటు పనిచేస్తుంటాయి. ఐదేళ్లలో 9 లక్షల టన్నుల ఎగుమతి ఐదేళ్లలో చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 9 లక్షల టన్నుల మామిడి గుజ్జు ఎగుమతి అయ్యింది. ఇది దేశంలోని మరే ప్రాంతానికి దక్కని గుర్తింపు. గుజ్జు ఎగుమతుల ద్వారా ఏటా సగటున రూ.1,200 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆర్జిస్తోంది. 1.20 లక్షల మంది రైతులు, 2 లక్షల మంది కార్మికులు ప్రత్యక్షంగాను, 4 లక్షల మంది పరోక్షంగా మామిడి గుజ్జు పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ప్రభుత్వాలు సహకరిస్తే.. భారత్‌తో పాటు ఈజిప్‌్ట, ఆఫ్రికా, మెక్సికో, పాకిస్థాన్ వంటి దేశాలు కూడా అంతర్జాతీయ మార్కెట్‌కు మామిడి గుజ్జు ఎగుమతులు ప్రారంభించాయి. మన దేశం నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జుపై 32% పన్ను వసూలు చేస్తున్నారు. దీనిని తొలగిస్తే వ్యాపారులు, ఎగుమతిదారులు మామిడి సేకరణ ధరను పెంచుతారు. తద్వారా రైతులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా.. చిత్తూరు నుంచి ఎగుమతి అవుతున్న మామిడి గుజ్జును కంటైనర్ల ద్వారా చెన్నైకు తీసుకెళ్లి, అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా విదేశాలకు పంపుతున్నారు. దీనివల్ల ఎగుమతి ప్రోత్సాహకాలు చెన్నైకి అందుతున్నాయి. అలాకాకుండా చిత్తూరు నుంచే కంటైనర్లతో గుజ్జును ఉంచి సీల్ చేసి, ఇక్కడి నుంచి చెన్నైకు పంపిస్తే ఆ ప్రోత్సాహకాలు మన రాష్ట్రానికి లభించడంతోపాటు పారిశ్రామిక రంగానికి అదనపు ఊతం ఇచ్చినట్టవుతుంది. దీనికోసం చిత్తూరులో ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో (ఐసీడీ)ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.మధ్యాహ్న భోజన మెనూలో చేర్చాలి మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు పెడుతున్నట్టే పిల్లలకు మ్యాంగో పల్ప్ కూడా ఇవ్వాలి. తిరుమల తిరుపతి దేవస్థానాల్లో భక్తులకు అన్న ప్రసాదాలతో పాటు మ్యాంగో పల్ప్ ఇస్తే ప్రయోజనం చేకూరుతుంది. కాణిపాకం, అన్నవరం, శ్రీశైలం, శ్రీకాళహస్తి లాంటి ఆలయాల్లో మ్యాంగో పల్ప్ వినియోగాన్ని తప్పనిసరి చేస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దీనిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాం. కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటే చిత్తూరు పల్ప్‌కు పేటెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. – గోవర్దన బాబి, చైర్మన్, ఆలిండియా ఫుడ్ ప్రాసెసర్స్ అసోసియేషన్, సౌత్‌జోన్, చిత్తూరు -
మద్యం టెండర్లలో రాజకీయ బెదిరింపులు
-
‘నువ్వు మేయర్ అయితే నాకేంటి? ఏం తమాషాలు చేస్తున్నావా?’
చిత్తూరు అర్బన్: గాంధీ జయంతి రోజే నగర ప్రథమ పౌరురాలైన మహిళా మేయర్‌కు అవమానం జరిగింది. నడిరోడ్డుపై కలెక్టర్, ఉన్నతాధికారులు, ప్రజలు చూస్తుండగానే మహిళా మేయర్ ఆముదపై ట్రాఫిక్ సీఐ నిత్యబాబు దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం, ఏకవచనంతో రెచి్చపోవడం అందరినీ నివ్వెరపరిచింది. ఓ దశలో మేయర్‌ను కొట్టడానికి మీదిమీదికి వెళుతున్నాడేంటి అంటూ చుట్టూ ఉన్న జనం నోరెళ్లబెట్టారు.బుధవారం మహాత్ముడి జయంతిని పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులరి్పంచడానికి మేయర్ ఆముద, కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పలువురు అధికారులు వచ్చారు. అధికారుల వాహనాలతో పాటు ఎమ్మెల్యే వాహనాలు రోడ్డుకు ఓవైపు పార్కింగ్ చేశారు. మేయర్ వాహనానికి స్థలం లేకపోవడంతో మరోవైపు పార్కింగ్ చేశారు. అప్పటికే అక్కడకు చేరుకున్న ట్రాఫిక్ సీఐ నిత్యబాబు.. మేయర్ కారును అక్కడి నుంచి తీసేయాలని చెప్పాడు.కార్యక్రమం అయిపోగానే వెళ్లిపోతామని మేయర్ డ్రైవర్ చెప్పినా సీఐ అంగీకరించలేదు. దీంతో డ్రైవర్ కారును కొద్దిసేపు పీసీఆర్ కళాశాల చుట్టూ తిప్పి.. కార్యక్రమం అయిపోవస్తుండటంతో కార్యక్రమం జరిగే ప్రాంతానికి కారును తీసుకొచ్చాడు. మేయర్ కారులోకి ఎక్కి, బయల్దేరబోతుండగా సీఐ మళ్లీ వచ్చారు. కారు అద్దాలను బాదుతూ బండి తీయాలంటూ రచ్చ చేశారు.ఇదీ చదవండి: ఇసుక బంద్.. చేతులెత్తేసిన చంద్రబాబు సర్కార్లోపల మేయర్ ఉన్నారని, వెళ్లిపోతున్నామని డ్రైవర్ చెబుతున్నా సీఐ వినలేదు. దీంతో ఆగ్రహించిన మేయర్ వాహనం దిగి కిందకు వచ్చారు. తమ వాహనానికి ముందు, వెనుక కలెక్టర్, ఎమ్మెల్యే కార్లు ఉంటే ఎలా వెళతామని ప్రశి్నంచారు. దీంతో సీఐ మరింతగా రెచి్చపోయారు. ‘నువ్వు మేయరైతే నాకేంటి? డ్రైవర్‌తో మాట్లాడుతుంటే నువ్వు వస్తావెందుకు? ఏం తమాషా చేస్తున్నావా?’ అంటూ ఏక వచనంతో సంబోధిస్తూ ఓ దశలో మేయర్‌పైకి సీఐ దూసుకెళ్లారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
-
చిత్తూరు రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహా పలువురు ప్రయాణికులు మరణించడం బాధాకరమన్నారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి కనుమ రహదారిలో బస్సు, రెండు లారీలు ఢీ కొన్న ఘటనలో ఎనిమిది మంది ఘటనా స్ధలంలోనే మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు వైపు నుంచి పలమనేరు వెళుతున్న ఆర్టీసీ బస్సును పలమనేరు వైపు నుంచి ఐరన్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఇదీ చదవండి: విజయవాడలాగే.. ఏలూరు వరదలు మ్యాన్ మేడ్! -
టీడీపీ ఎమ్మెల్యేలు డుమ్మా.
-
ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలు.. ఎన్హెచ్ఆర్సీ కీలక ఆదేశాలు
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఫుడ్ పాయిజన్ ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయ్యింది. అనకాపల్లి అనాథా శ్రయంలో ముగ్గురు విద్యార్థుల మృతి చెందగా, 37 మంది విద్యార్థుల అస్వస్థతకు గురయ్యారు. మరో ఘటనలో చిత్తూరు అపోలో ఆసుపత్రిలో 70 మంది విద్యార్థులు విషాహారం తిని అస్వస్థత గురయ్యారు.ఈ కేసులను జాతీయ మానవ హక్కుల సంఘం.. సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఏపీ చీఫ్ సెక్రటరీ , డీజీపీలకు నోటీసులు ఇచ్చింది. రెండు వారాల్లో నివేదిక పంపాలని ఆదేశించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు జారీ చేసింది. -
ప్రాణం తీసిన జల్లికట్టు
పూతలపట్టు (చిత్తూరు జిల్లా): జల్లికట్టు ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా, యాదమరి మండలం, కొట్టాలలో చోటుచేసుకోగా, శుక్రవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు.. ఆడిజాతర పురస్కరించుకుని కొట్టాలలో గురువారం మారెమ్మ జాతర జరిగింది. ఇందులోనే జల్లికట్టును నిర్వహించారు. దీనికి మండల, తమిళనాడు సరిహద్దు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ఎద్దులొచ్చాయి. కొంతసేపటికి ఓ ఎద్దు జల్లికట్టును వీక్షిస్తున్న బంగాపాళ్యంకు చెందిన దిలీప్‌కుమార్ (40)పైకి దూసుకెళ్లింది. కొమ్ములతో బలంగా పొడవడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఇదే ఘటనలో మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు. అనుమతి లేకుండా జల్లికట్టు నిర్వహించిన మునిరత్నం, సెల్వరాజ్, పళణివేలు, మరికొంతమందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిత్తూరు మండలం, తమ్మింద గ్రామంలో పదేళ్లుగా కాపురం ఉంటున్నారు. -
రాజకీయ కక్షతోనే కేసు.. అంత దౌర్భాగ్యం నాకు పట్టలేదు: ఎమ్మెల్సీ భరత్
సాక్షి, కుప్పం: తిరుమల శ్రీవారి దర్శనం, పూజ టికెట్లు అమ్ముకునేంత దౌర్భాగ్యం తనకు పట్టలేదని అన్నారు వైఎస్సార్సీపీ కుప్పం ఎమ్మెల్సీ కేఆర్జే భరత్. తాను ఒక బ్యూరోక్రట్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, తన తండ్రి ఒక ఐఏఎస్ అధికారి అని తెలిపారు. ఉన్నత విలువలతో బతికే వ్యక్తినని చెప్పారు.తన వద్ద మల్లికార్జునరావు అనే పీఆర్ఓ ఎవరూ లేరని, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియదని అన్నారు భరత్. కేవలం కుప్పంలో చంద్రబాబుపై పోటీ చేయడం, అక్కడ ఆయనను ఎదుర్కొంటూ రాజకీయాల్లో నిలబడుతున్నానన్న కక్షతోనే తనపై కేసులు నమోదు చేసి అప్రతిష్టపాలు జేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తనపై జరుగుతున్న కుట్రలను కచ్చితంగా ఎదుర్కొంటానని పేర్కొన్నారు. అసలు తనపై ఫిర్యాదు చేసిన వారెవరు? పోలీసులు కేసులో రాసిన వాళ్లు ఎవరు? అవన్నీ ఆరా తీస్తానని చెప్పారు. పూర్తి వివరాలతో మళ్లీ మీడియా ముందుకు వస్తానని తన వీడియో సందేశంలో తెలిపారాయన. -
మద్యం మత్తులో.. కూతురికే ఉరి
రొంపిచెర్ల: మద్యం మత్తులో ఓ తండ్రి కన్న బిడ్డనే ఉరేసి చంపిన సంఘటన మండలంలోని పెద్దమల్లెల గ్రామ పంచాయతీ నడింపల్లెలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మృతురాలు మేనమామ జయరాం కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నడింపల్లెకు చెందిన కె.మునిరత్నం(35), రెడ్డెమ్మ దంపతులకు ఒక కుమార్తె గౌతమి(14) ఉంది. పదేళ్ల క్రితం రెడ్డెమ్మ మృతి చెందారు. అప్పటి నుంచి గౌతమి తన తండ్రి, అవ్వతో కలసి ఉంటోంది.గౌతమి పెద్దమల్లెల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. అయితే మునిరత్నం తల్లి ఐదు నెలల క్రితం మృతి చెందింది. అప్పుటి నుంచి ఆ ఇంట్లో తండ్రి, కుమారై జీవిస్తున్నారు. మునిరత్నం ఆదివారం రాత్రి తాగొచ్చి ఇంట్లో పడుకుని ఉన్న కుమారైను ఏమీ పని చేయడం లేదని మందలించాడు. దీంతో గౌతమి కూడా గట్టిగా బదులిచ్చింది. వెంటనే కోపంతో సెల్ చార్జింగ్ వైర్‌ను మెడకు వేసి చంపివేశాడు. ఎవరికి అనుమానం రాకుండా ఉరి వేసుకుని మృతి చెందిందంటూ ఉదయాన్నే చుట్టుపక్కల వారికి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు తండ్రి మీద అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో తన బిడ్డను చార్జింగ్ వైరుతో చంపివేసినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం. ఆ క్రమంలోనే నిందితుడు మునిరత్నం పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. కల్లూరు సీఐ శ్రీనివాసులు, ఇన్చార్జి ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి, సంఘటన స్థలాన్ని సందర్శించి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి మునిరత్నం కోసం రొంపిచెర్ల పోలీసులు గాలిస్తున్నారు. రెండు రోజుల్లో నిందితుడిని అరెస్టు చేస్తామని సీఐ శ్రీనివాసులు తెలిపారు.ఎన్నో అనుమానాలు కుమారై గౌతమి మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గౌతమి తాను చనిపోతున్నానని తన చావుకు తన స్నేహితులను పిలవాలని రాసిన ఒక లేఖ సోమవారం బయటపడింది. అయితే మరోపక్క మునిరత్నమే తన కుమార్తెను చంపేశాడని ఒప్పుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తండ్రి కుమార్తెపై లైంగిక దాడికి యతి్నంచి, చంపేసి ఉంటాడని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. పోస్టుమాస్టరం నివేదికలో వాస్తవం బయటపడుతుందని భావిస్తున్నారు. -
దాయ్ యాప్ స్కాంపై విచారణ ముమ్మరం
-
చిత్తూరు జిల్లా పలమనేరులో భారీ ఆన్ లైన్ ఫ్రాడ్
-
ఏపీలో బీహార్ పరిస్థితులు.. చేతులెత్తేసిన పోలీసులు
-
పుంగనూరులో టీడీపీ.. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుని
సాక్షి,చిత్తూరు జిల్లా: ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో మొదలైన టీడీపీ నేతల అరాచకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం కమ్మపల్లిలో వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు సుబ్రమణ్యరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నేతలు గ్రామం నుంచి వెలివేశారు. ఆయన పండించుకున్న టమాటా పంటను అమ్ముకోకుండా అడ్డుకున్నారు. దీంతో టమాటాలన్నీ కుళ్లిపోయి భారీ నష్టం వాటిల్లింది. కనీసం ఆవులకు మేత వేయకుండా అడ్డుకుని అరాచకం సృష్టిస్తున్నారు. పోలీసులకు చెబితే గ్రామం వదిలి వెళ్లిపోవాలంటున్నారని సుబ్రమణ్యరెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. గ్రామంలోకి వస్తే చంపేస్తామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
విజృంభిస్తున్న అంటువ్యాధులు
-
సీనియర్లు, కూటమి శ్రేణులకు అడుగడుగునా అవమానం..
సాక్షి, టాస్క్‌ఫోర్స్: సీఎం చంద్రబాబు పర్యటనలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధిపత్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిని సీనియర్ నేతలు కలిసేందుకు సైతం ఆంక్షలు విధించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కార్యకర్తలనైతే తన నిరంకుశ వైఖరితో అడుగడుగునా అవమానించారని పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించారని మండిపడుతున్నాయి. ఆయన అనుమతి లేనిదే సీఎం సమీపంలోకి సైతం వెళ్లలేని పరిస్థితిని కల్పించారని ఆవేదన చెందుతున్నాయి. చివరకు పోలీసులు.. ఉన్నతాధికారులను తన కనుసన్నల్లోనే నడిపించారని ఆరోపిస్తున్నాయి. అభిమానంతో అధినేతను కలవాలని వస్తే ఇదెక్కడి పెత్తనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం నియోజకవర్గానికి విచ్చేశారు. ఇక అప్పటి నుంచి మొత్తం పర్యటన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కనుసన్నల్లోనే సాగడం టీడీపీ శ్రేణులను అసంతృప్తికి గురిచేసింది. ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్సీ చెప్పాలి. అది ఎమ్మెల్యే అయినా.. సీనియర్, టీడీపీ, జనసేన నేతలైనా సరే. ఆయన చెప్పకపోతే సీఎంని కలిసే అవకాశమే లేదు.అలా ఒకరోజంతా ఓపికగా వేచి చూసిన కూటమి నేతలు, కార్యకర్తలు సహనం నశించి బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఎట్టకేలకు సీఎం చంద్రబాబుని కలిసేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు మొదటి సారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి వచ్చారు. మంగళవారం కుప్పానికి చేరుకున్న చంద్రబాబు.. బుధవారం సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలకు హాజరైన చంద్రబాబుని కలిసేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా.. అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రిని కలవొచ్చని ఆశగా కుప్పానికి చేరుకున్న వారికి నిరాశే ఎదురైంది.అడ్డంకులు.. అవమానాలు!ఎమ్మెల్యేల నుంచి.. సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో సీఎం చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారికి అడుగడుగునా అడ్డంకులు, అవమానాలే ఎదురైనట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం అంటే సెక్యూరిటీ సహజమే అయినా.. ఎమ్మెల్యే అయితే పెద్దగా తనిఖీలు లేకుండా నేరుగా పంపేస్తుంటారు. అలాంటిది కుప్పంలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవమే ఎదురైంది.తాను ఎమ్మెల్యేని చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదని, పంపేందుకు ససేమిరా అన్నారని తెలిపారు. ఐడీ కార్డు ఉందా? మీరు ఎమ్మెల్యేనేనా? రుజువు ఏంటి? అంటూ సవాలక్ష ప్రశ్నలతో తీవ్ర అవమానాలకు గురిచేసినట్లు చెబుతున్నారు. ‘సీఎంని కలవాలంటే.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ నుంచి ఫోన్ చేయించండి లేదా చెప్పించండి’ అంటూ సమాధానం ఎదురైందంటున్నారు. సరే శ్రీకాంత్‌తో చెప్పిద్దాం అంటే ఆయన అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులే కాకుండా.. అధికారులు సైతం ఎమ్మెల్సీ కనుసన్నల్లో నడిచినట్లు వివరించారు. ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక నాయకులకు కూడా సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం లేకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకులందరినీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ దూరం పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం లోటే..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మంత్రి వర్గంలో పెద్దపీట వేశారు. ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ విప్ పదవి సైతం ఇచ్చారు. జిల్లాపై తనకున్న అభిమానం చాటుకున్నారు. అయితే ఇప్పుడు అదే స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడినా.. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రి వర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడంపై జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఒక్కరికై నా మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఇలా ఉండేది కాదనే అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లా ఎమ్మెల్యేలకే న్యాయం చేయకపోతే ఎలా? అని ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.ఆందోళనతో దిగొచ్చినా ప్రయోజనం శూన్యం!కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం.. సీఎం కుప్పానికి రావడంతో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేననేతలు చంద్రబాబుని కలిసేందుకు ఉత్సాహం చూపించారు. మంగళవారం ఉదయం నుంచి వేచి ఉన్న వారికి బుధవారం కూడా చంద్రబాబుని కలిసే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలవాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్‌తోపాటు పోలీసులను ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహించిన కూటమి శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ వారిని లోనికి పంపించమని పోలీసులను ఆదేశించారు. అయితే లోపలికి వెళ్లినా.. కొందరికి మాత్రమే సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం దొరికిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
చిత్తూరులో వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ దాడులు
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలో టీడీపీ కార్యకర్తలు రెచి్చపోతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. మంగళవారం రాత్రి కార్పొరేషన్ కో–ఆప్షన్ సభ్యుడు ఆనూ ఇంటిపై మొహాలకు ఖర్చీఫ్‌లు కట్టుకుని రాళ్ల దాడికి దిగిన విషయం తెలిసిందే. ఇదేరోజు అర్ధరాత్రి చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా) మాజీ చైర్మన్ పురుషోత్తంరెడ్డి ఇంటిపైకి టీడీపీ కార్యకర్తలు వెళ్లారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో బయట పార్కింగ్ చేసివున్న స్కార్పియో కారును ధ్వంసం చేసి పారిపోయారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్.పురం మండలానికి చెందిన తులసీరామ్ (రాజు) అనే వ్యక్తిని చిత్తూరుకు చెందిన టీడీపీ నేతలు కిడ్నాప్ చేశారు. రాజుకు చెందిన ఓ లారీను సైతం చోరీ చేశారు. రాజును కిడ్నాప్ చేసి, మురకంబట్టులోని ఓ నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లిన టీడీపీ నేతలు కర్రలు, పైపులతో తీవ్రంగా కొట్టారు. బాధితుడిని మోకాళ్లపై కూర్చోబెట్టి దాదాపు 30 మంది వరకు టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడగా.. కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తీవ్రంగా గాయపడ్డ రాజును స్థానికులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి, చోరీకి గురైన లారీని స్వాదీనం చేసుకున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడిఅన్నమయ్య జిల్లా తిమ్మాపురంలో టీడీపీ దుశ్చర్య కేవీ పల్లె: టీడీపీ వర్గీయుల దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన అన్నమయ్య జిల్లా కేవీ పల్లె మండలం తిమ్మాపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త విశ్వనాథ్ (33) ఇంటిపై టీడీపీ వర్గీయులు బుధవారం రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో విశ్వనాథ్ తలకు గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రహీముల్లా తెలిపారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామన్నారు.చెత్త వేయొద్దన్నందుకు టీడీపీ వర్గీయుల దాడి తండ్రీ, కొడుకులకు తీవ్ర గాయాలు పలమనేరు(చిత్తూరు జిల్లా): తమ ఇంటి ముందు చెత్త వేయొద్దన్నందుకు ఆగ్రహించిన టీడీపీ వర్గీయులు ఇంటి యజమానులపై నకుల్ డస్టర్‌తో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన బుధవారం పలమనేరు మండలంలో చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ముడివారిపల్లికి చెందిన కృష్ణమూర్తి, వరదరాజులు కుటుంబాలు పక్కపక్కనే ఉంటున్నాయి. వీరికి తరచూ చెత్త విషయంగా వాగ్వాదాలు జరిగేవి. ఈ నేపథ్యంలో కృష్ణమూర్తి ఇంటిముందు వరదరాజులు కుటుంబీకులు చెత్త వేయడంతో వారు ప్రశి్నంచారు. దీనిపై మండిపడిన వరదరాజులు కుమారుడు ఇంట్లో దాచిన నకుల్ డస్టర్‌ను చేతికి తొడుక్కుని కృష్ణమూర్తి(47) ఆయన కుమారుడు పురుషోత్తం (18)పై దాడిచేసి గాయపరిచాడు. వీరిని స్థానికులు పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
చిరుత చిక్కింది..
-
బౌన్సర్లతో పోలింగ్ వద్ద టీడీపీ అభ్యర్థి థామస్ హల్ చల్
-
ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం