![Chittoor Hospital: Peddireddy Visited Injured Policemen In Tdp Attack - Sakshi](/styles/webp/s3/article_images/2023/08/5/incident4.jpg.webp?itok=Qv-4uN-6)
సాక్షి, చిత్తూరు: టీడీపీ రౌడీల దాడిలో గాయపడిన పోలీసులను చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు రాజకీయంగా దివాళా తీశారని.. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.
‘‘పుంగనూరు బైపాస్ నుంచి వెళ్తామని పోలీసులకు రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ తర్వాత కావాలనే పుంగనూరులోకి వెళ్లాలని ప్రయత్నించారు. అనంతరం పోలీసులపై విచక్షణా రహితంగా దాడి చేశారు. చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడి పాల్పడేలా చేశారు. అనరాని మాటలు తిడుతూ ప్రజలను రెచ్చగొట్టారు. పోలీసులపై ఈ స్థాయిలో దాడి జరిగిన ఘటనలు ఇటీవల కాలంలో లేవు. కుప్పంలో ఓడిపోతానన్న భయంతో చంద్రబాబు నీచానికి దిగారు’’ అని మంత్రి మండిపడ్డారు.
చదవండి: టీడీపీ రాక్షస క్రీడ
‘‘కచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పోలీసులకు, ప్రభుత్వానికి ఇది ప్రతిష్టాత్మకం. షార్ట్ గన్స్‌కు లైసెన్స్ ఉండదు.. కానీ వారు ఆయుధాలు తెచ్చుకున్నారు. 200 వాహనాల్లో రౌడీలను తెచ్చుకున్నారు’’ అని మంత్రి పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment