
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: హిందూపురంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దీపిక భర్త వేణురెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(సోమవారం) ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు బేడీలు వేసి నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఇవాళ వైఎస్సార్‌సీపీ నేత వేణరెడ్డి ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ధర్మవరం నియోజకవర్గంలో రెచ్చిపోయిన టీడీపీ నేతలు
మరో వైపు, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు. వైఎస్ జగన్ ఫోటోను వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్న బాబ్జన్‌పై దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలు కాడంతో కదిరి ఆసుపత్రికి తరలించారు. ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బలో ఘటన జరిగింది. ఫోన్‌లో దూషించిన టీడీపీ నేతలు.. అనంతరం దాడి చేశారు.