సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వంలో చట్టం టీడీపీ వారికి ఒకలా, వైఎస్సార్‌సీపీ వారికి మరోలా అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
గత నెల 19న తమపై , తమ కుటుంబ సభ్యుల గురించి టీడీపీ నేతల ప్రోద్బలంతో ఆ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టారని, వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఆధారాలతో సహా వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అయితే, వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదులను పోలీసులు పట్టించుకోలేదు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వానికి ఒకలా, వైఎస్సార్‌సీపీ వారికి మరోలా వ్యవరిస్తున్నారని, తాము ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పోలీసుల తీరుపై పోలిస్ స్టేషన్ల ఎదుట వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన తెలపాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment