overaction
-
జనసేన నేతల బరితెగింపు
-
ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాల పేరుతో కూటమి నేతల బరితెగింపు
-
తిరుమలలో పోలీసుల దురుసు ప్రవర్తన
-
ప్రధాని పర్యటనలో పోలీసుల ఓవరాక్షన్.. ఉక్కు కార్మికులకు వార్నింగ్
సాక్షి,విశాఖపట్నం:ప్రధాని మోదీ విశాఖపట్నం సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారు. డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న విశాఖ స్టీల్ కార్మికులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దీక్షా శిబిరం నుంచి బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే కార్మికులు దీక్ష చేస్తున్న కూర్మన్నపాలెంలో పోలీసులు భారీగా మోహరించారు.ఏ నిమిషమైనా పోరాట కమిటీ నేతలను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. మారుతి సర్కిల్ నుంచి ఐఎన్ఎస్ డేగా, కాన్వెంట్ జంక్షన్,రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో వాహనాలను నిలిపివేశారు. ప్రెగ్నెంట్ లేడీ ఆసుపత్రికి వెళ్లేందుకు బ్రతిమిలాడినా పోలీసులు అనుమతించలేదు. నిండు గర్భిణీ హాస్పిటల్ పేపర్స్ చూపించినా కనికరించలేదు.టీడీపీ ఎమ్మెల్సీ చిరంజీవిని మాత్రం అటుగా వెళ్లేందుకు పోలీసులు అనుమతించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.విశాఖ(visakhapatnam)లో స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాట కమిటీ నిరాహార దీక్షకు పూనుకుంది. విశాఖకు ప్రధాని మోదీ(PM Modi) వస్తున్న తరుణంలో పోరాట కమిటీ సభ్యులు.. ప్రధాని అపాయింట్మెంట్ కోరారు. అయితే, ప్రభుత్వం నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రధాని స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక జారీ చేశారు.మరోవైపు.. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్కు వద్ద ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సీపీఎం నేతలు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ సొంత గనుల గురించి ఇప్పటి వరకు నోరు మెదపని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి భరత్.. ఏకంగా ఆర్సెలార్ మిట్టల్‌కు ఏజెంట్‌గా మారారని మండిపడ్డారు. కేంద్ర ఉక్కు మంత్రి కుమార్‌స్వామిని కలిసి రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ పరిశ్రమకు నిరాటకంగా ముడి ఇనుప ఖనిజం సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారని ఆరోపించారు. తక్షణం మంత్రి పదవి నుంచి భరత్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. -
TDP ఎమ్మెల్యే మాధవిరెడ్డి దౌర్జన్యం
-
గుంటూరులో కొనసాగుతున్న టీడీపీ నేతల అరాచకం
-
నంద్యాలలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
-
తాడిపత్రిలో ఆగని జేసీ కుటుంబ అరాచకాలు
-
నీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ నేతల అరాచకం
-
సజ్జల భార్గవ్ రెడ్డి డ్రైవర్ పై పోలీసులు తప్పుడు కేసులు.. అంబటి స్ట్రాంగ్ కౌంటర్
-
పెనుకొండలో మంత్రి సవిత భర్త వెంకటేశ్వరరావు వీరంగం
-
కడప కార్పొరేషన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే హల్ చల్
-
బాణాసంచా షాపుల కేటాయింపులో టీడీపీ నేతల చేతివాటం
-
దసరా వేడుకల్లో వీరకుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం...
-
ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసిన రఘు రామ కృష్ణంరాజు
-
సచివాలయ ఉద్యోగిపై ‘తమ్ముడి’ శివాలు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: తనకు సమాచారం ఇవ్వకుండా రాయితీపై ప్రభుత్వం అందజేసే ఉలవలు ఎలా పంపిణీ చేస్తావంటూ టీడీపీ నాయకుడు వెంకటేష్ బండ బూతులతో సచివాలయ హార్టీకల్చర్ అసిస్టెంట్‌పై వీరంగం చేశాడు. శ్రీసత్యసాయి జిల్లా పరిగి మండలం శాసనకోటలో జరిగిన ఈ ఘటన.. టీడీపీ చోటామోటా నాయకులు కూడా ప్రభుత్వ యంత్రాంగంపై విరుచుపడుతున్న తీరుకు అద్దంపడుతోంది.ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఉలవ విత్తనాలు అందజేస్తోంది. పరిగి మండలంలోని వ్యవసాయాధికారులు ఈ నెల 12 నుంచి ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శాసనకోటలో 13వ తేదీ విత్తన పంపిణీ జరగాల్సిన ఉన్నా.. స్థానిక టీడీపీ నాయకుల బెదిరింపుతో మండల వ్యవసాయాధికారులు వాయిదా వేశారు. 14వ తేదీ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులతో కలిసి సచివాలయ ఉద్యోగులు ఆర్బీకే పరిధిలోని గ్రామ పంచాయతీ రైతులకు ఉలవ విత్తనాలను పంపిణీ చేశారు.ఆపై వరుస సెలవులు రావడంతో మంగళవారం ఉలవ విత్తనాల పంపిణీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి రావాలని అదే రోజు సచివాలయ ఉద్యోగి పవన్‌కుమార్‌రెడ్డి గ్రామానికి చెందిన టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేష్‌ను ఆహ్వానించేందుకు ఫోన్ చేశారు. అయితే తనకు తెలియకుండా రైతులకు విత్తనాలు ఎలా పంపిణీ చేస్తావంటూ ఆ టీడీపీ నేత వెంకటేష్ బూతు పురాణానికి తెరలేపాడు.ఇదీ చదవండి: శ్రీవారి లడ్డూపై CBN ఉన్మాద రాజకీయం‘ఈ వెంకటేశ్ గాడు పెద్ద క్రిమినల్.. వైకాపా నా కొడుకులతో నీ వేషాలు సరిపోతాయి.. నాతో కాదు.. అంటూ పచ్చి బూతులతో ఆ ఉద్యోగిపై విరుచుకు పడ్డాడు. ఆ ఉద్యోగిని బండబూతులు తిట్టిన ఆడియో తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అనుచరుడయిన శాసనకోట వెంకటేష్ ఓ అధికారిని అంతలా దూషిస్తూ మాట్లాడిన తీరు విమర్శలపాలవుతోంది. -
ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో రెచ్చిపోయిన టీడీపీ నేత
శ్రీ సత్యసాయి, సాక్షి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతల దాడులు ఆగటం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పచ్చనేతలు దాడులతో రెచ్చిపోతున్నారు.తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇలాకాలో టీడీపీ నేత రెచ్చిపోయాడు. హిందూపురంలో కొడవలితో టీడీపీ నేత శ్రీహరి నాయుడు వీరంగం సృష్టించాడు. వినాయకుడి మండపం వద్ద డీజే పెట్టొద్దని.. పాటలు నిలిపివేయాలని గొడవకు దిగాడు. అక్కడితో ఆగకుండా అక్కడి ఉన్నవారిపై దాడికి తెగబడ్డాడు.టీడీపీ నేత దాడిలో పాండురంగ అనే వ్యక్తి గాయపడ్డారు. ప్రస్తుతం టీడీపీ నేత దౌర్జన్యం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.చదవండి: విపత్తు నిర్వహణను పట్టించుకోని చంద్రబాబు సర్కార్ -
డార్క్ రూమ్ లో చిత్రహింసలు
-
టీడీపీ నేతలకు చెప్తున్నా.. అధికారం శాశ్వతం కాదు..
-
హోం మంత్రి రాకతో పోలీసుల ఓవరాక్షన్
విజయవాడ స్పోర్ట్స్/రామవరప్పాడు: బుడమేరు వరద బాధితులకు సహాయం అందించాల్సిన పోలీసులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మిన్నకుండిపోయారు. సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వద్దకు హోం మంత్రి అనిత రాగానే ఓవరాక్షన్ చేశారు. బాధితులను పక్కకు నెట్టేసి ఒక్కసారిగా బారికేడ్లను అడ్డం పెట్టారు. దీంతో పోలీసులపై బాధితులు మండిపడ్డారు.ఇప్పటివరకు పట్టించుకోకుండా.. హోం మంత్రి రాగానే.. చచ్చీ చెడి ఈదుకుంటూ.. వచ్చిన మమ్మల్ని పక్కకు తోసేస్తారా అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ వాళ్లను తీసుకొచ్చేందుకు బోట్లు ఏర్పాటు చేయాలని కోరిన బాధితులపై ఆమె దురుసుగా ప్రవర్తించారు. కాగా, రామవరప్పాడు ఫ్లై ఓవర్ దిగువ ప్రాంతంలోని ఎస్ఎల్వీ గ్రీన్ మెడాస్లోని విల్లాలు వరద నీటితో నిండిపోయాయి. ఈ ఎస్ఎల్వీ విల్లాస్‌లో హోం మంత్రి అనితకు చెందిన విల్లాలు కూడా మునిగిపోయాయి. -
ఎంపీడీఓ కార్యాలయంలో టీడీపీ నేతల వీరంగం..
-
అనకాపల్లి: వరాహపురంలో టీడీపీ దౌర్జన్యం
సాక్షి, అనకాపల్లి: టీడీపీ నాయకుల దౌర్జన్యాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. శనివారం అనకాలపల్లి చీడికాడ మండలం వరహాపురం స్కూల్ కమిటీ ఎన్నికలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి తెగపడ్డారు. టీడీపీకి బలం లేకపోవడంతో అక్రమ మార్గంలో గెలిచేందుకు ప్రయత్నం చేశారు. ఎన్నికలో చేతులెత్తే విధానానికి స్వస్తి పలికి సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది. స్కూల్ హెచ్ఎంపై టీడీపీ నాయకులు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో వరహపురం స్కూల్ కమిటీ ఎన్నిక గందరగోళంగా మారింది. -
టీడీపీ బరితెగింపు.. దళిత మహిళ చైర్మన్ అయితే మీకు నొప్పేంటి..
-
చంద్రంపాలెం స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యం
సాక్షి, విశాఖప్నటం: చంద్రంపాలెం స్కూల్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ దౌర్జన్యానికి తెగపడింది. ఈ ఎన్నికల్లో మొదట ముగ్గురు వైఎస్సార్సీపీ సానుభూతిపరులు గెలవడంతో ఎన్నిక వాయిదా వేయాలని టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకువచ్చారు. కానీ, ఎన్నికల వాయిదా వేయడానికి స్యూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకొలేదు. అక్కడితో ఆగకుండా టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్కూల్లోకి ప్రవేశించారు. దీంతో అవుటర్స్ను ఎలా స్కూల్లోకి అనుమతిస్తారని తల్లిదండ్రులు ఉపాధ్యాయులను నిలిదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరికి ఎన్నికల నిర్వహించకుండానే టీడీపీ సానుభూతిపరులు గెలిచినట్లు ప్రకటించారు. స్కూల్లోకి టీడీపీ కార్యర్తలు దూసుకురావటంపై విద్యార్థుల తల్లిదండ్రులు విమర్శలు చేస్తున్నారు. -
లాయర్ పై పోలీస్ ఓవరాక్షన్.. చివరికి సీన్ రివర్స్