
విజయవాడ స్పోర్ట్స్/రామవరప్పాడు: బుడమేరు వరద బాధితులకు సహాయం అందించాల్సిన పోలీసులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మిన్నకుండిపోయారు. సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వద్దకు హోం మంత్రి అనిత రాగానే ఓవరాక్షన్ చేశారు. బాధితులను పక్కకు నెట్టేసి ఒక్కసారిగా బారికేడ్‌లను అడ్డం పెట్టారు. దీంతో పోలీసులపై బాధితులు మండిపడ్డారు.
ఇప్పటివరకు పట్టించుకోకుండా.. హోం మంత్రి రాగానే.. చచ్చీ చెడి ఈదుకుంటూ.. వచ్చిన మమ్మల్ని పక్కకు తోసేస్తారా అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ వాళ్లను తీసుకొచ్చేందుకు బోట్లు ఏర్పాటు చేయాలని కోరిన బాధితులపై ఆమె దురుసుగా ప్రవర్తించారు. కాగా, రామవరప్పాడు ఫ్లై ఓవర్ దిగువ ప్రాంతంలోని ఎస్‌ఎల్‌వీ గ్రీన్ మెడాస్‌లోని విల్లాలు వరద నీటితో నిండిపోయాయి. ఈ ఎస్‌ఎల్‌వీ విల్లాస్‌లో హోం మంత్రి అనితకు చెందిన విల్లాలు కూడా మునిగిపోయాయి.