home minister
-
సహకారోద్యమాన్ని దెబ్బ తీసింది
భోపాల్: గత కాంగ్రెస్ ప్రభుత్వాల నిష్క్రియాపరత్వం కారణంగా దేశంలో సహకార ఉద్యమం తీవ్రంగా దెబ్బ తిందని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకునే సమయానికి సహకార ఉద్యమం దాదాపు మృతదశలో ఉందన్నారు. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు గత ప్రభుత్వాలు ఎన్నడూ ప్రయతి్నంచలేదని ఆరోపించారు. అవసరమైన చట్టాలు చేయలేదని తెలిపారు. భోపాల్‌లో ఆదివారం జరిగిన ఓ సదస్సులో అమిత్ షా ప్రసంగించారు. ఈ రంగంలో సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు ప్రధాని మోదీ సహకార శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారన్నారు. -
ఔరంగజేబ్ ఓటమిపాలై సమాధి అయ్యిందిక్కడే
రాయ్‌గఢ్: జగజ్జేత(అలంగీర్)నని చెప్పుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జీవితమంతా మహారాష్ట్రలో మరాఠాలతో పోరాటంతోనే గడిపి, ఓటమిపాలై ఈ గడ్డపైనే సమాధి అయ్యాడని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. శివాజీ 345 వర్ధంతి సందర్భంగా ఆయన శనివారం రాయ్‌గఢ్ కోటలో ఆయనకు నివాళులరి్పంచారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి సూపర్ పవర్‌గా ఎదగాలన్న భారతదేశం లక్ష్యానికి శివాజీ మహారాజే స్ఫూర్తి అని అమిత్ షా పేర్కొన్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను మహారాష్ట్రకు మాత్రమే పరిమితం చేయవద్దని ప్రజలకు ఆయన విజŠక్షప్తి చేశారు. శివాజీ దీక్ష, పట్టుదల, సాహసం దేశానికే ఆదర్శమని, సమాజంలోని అన్ని వర్గాలను వ్యూహాత్మకంగా ఆయన ఏకం చేశారని చెప్పారు. మారాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న రాయ్‌గఢ్ కోటలోని శివాజీ సమాధి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సంభాజీనగర్ జిల్లా ఖుల్టాబాద్‌లో ఉన్న 17వ శతాబ్దం నాటి మొఘల్ చక్రవర్తి సమాధిని మరో చోటుకు తరలించాలన్న డిమాండ్లు ఇటీవల ఎక్కువైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
జగన్ భద్రతా వైఫల్యంపై రిపోర్టర్ల ప్రశ్నలు.. నీళ్లు నమిలిన హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రత వైఫల్యంపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి వంగలపూడి అనిత నీళ్లు నమిలారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడిగితే ఎలా అంటూ చిందులు తొక్కారు. ప్రశ్న అడిగే రిపోర్టర్లతో ఆగు ఆగు అంటూ వాగ్వాదానికి దిగారు.1100 మందితో భారీ భద్రత కల్పిస్తే హెలికాప్టర్ దగ్గరకు ప్రజలు ఎలా దూసుకు వెళ్లారంటూ రిపోర్టర్ ప్రశ్నించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోలీసులు కాపలా పెట్టాలా అంటూ హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. జనాలు ఎక్కువగా వస్తారని మీ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా?. లేదా మీ ఇంటిలిజెన్స్ బలహీనంగా ఉందా..?. డ్రోన్ సీసీ కెమెరా వ్యవస్థ అంతా మీ చేతుల్లోనే ఉంది కదా?’’ అంటూ రిపోర్టర్ల ప్రశ్నలు అడుగుతుండగానే సమాధానం చెప్పలేక మధ్యలోనే హోం మంత్రి వెళ్లిపోయారు.కాగా, శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా పోలీసుల భద్రతా వైఫల్యం మరోసారి బహిర్గతమైన సంగతి తెలిసిందే. ఓ మాజీ సీఎం వచ్చినప్పుడు పోలీసులు కనీస భద్రత చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం వైఎస్ జగన్ పర్యటనలో అడుగడుగునా భద్రతా లోపాలు కనిపించాయి.పాపిరెడ్డిపల్లికి వచ్చే రహదారుల్లో వైఎస్సార్సీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యతను పోలీసులు.. జగన్ భద్రత విషయంలో చూపకపోవడం గమనార్హం. హెలిప్యాడ్ వద్ద చోటు చేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. తమ అభిమాన నేతను చూసేందుకు వేలాదిమంది హెలిప్యాడ్ వద్దకు పోటెత్తారు. జగన్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి చేరుకోగానే జనం తాకిడి అంతకంతకు ఎక్కువైంది. అక్కడ నామమాత్రంగా ఉన్న పోలీసులు వారిని అదుపు చేయలేక చేతులెత్తేశారు.హెలికాప్టర్ చుట్టూ జన సందోహం గుమిగూడటంతో చాలాసేపు జగన్ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. అభిమానుల తాకిడితో హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతింది. దీంతో వీఐపీ భద్రతా కారణాల రీత్యా తిరుగు ప్రయాణంలో ఆయన్ను తీసుకెళ్లలేమని పైలెట్లు స్పష్టం చేశారు. కొద్దిసేపటికి హెలికాప్టర్ తిరిగి వెళ్లిపోయింది. జగన్ రోడ్డు మార్గంలో బయలుదేరి వెళ్లారు. జగన్ పర్యటనల సమయంలో అరకొర పోలీసు భద్రతపై పార్టీ శ్రేణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పెద్దలు ఉద్దేశపూరితంగానే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. -
సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ
జమ్మూ: దేశ సరిహద్దుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను మోహరిస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవా దుల అక్రమచొరబాట్లను తిప్పికొట్టేందుకు, సరిహ ద్దుల్లో అండర్‌గ్రౌండ్ టన్నెళ్లను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. సరిహ ద్దుల కు ఆవలి వైపు ఎలాంటి అనుమా నాస్పద కదలి కలున్నా ఈ నిఘా వ్యవస్థ కనిపెట్టి తక్షణమే స్పందిస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనకు సోమవారం ఇక్కడికి ఆయన చేరుకు న్నారు. ఈ సందర్భంగా కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ‘వినయ్’ బోర్డర్ పో స్టును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య విధులను సమర్థమంతంగా నిర్వహిస్తున్న జవా న్లను ఆయన ప్రశంసించారు. వానలు, భీకరమైన చలి, ఎండలను సైతం లెక్కచేయకుండా 365 రోజు లూ బోర్డర్ పోస్టుల్లో విధులు కొనసాగిస్తూ శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారంటూ ప్రశంసించారు. ఇక్కడికి వచ్చి చూసిన వారికే జవాన్ల కష్టం ఏమిటో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. అమరుల సంతానానికి ఉద్యోగాలుఅనంతరం మంత్రి అమిత్ షా రాజ్‌భవన్‌లో ఉగ్రవాదులతో పోరాటంలో నేలకొరిగిన 10 మంది పోలీసులు, ఒక ఇంజనీర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కారుణ్య ప్రాతిపదికన మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల కథువా జిల్లాలో పాక్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో నేలకొరిగిన నలుగురు పోలీసు కుటుంబాల వారు కూడా వీరిలో ఉన్నారు. వీరమరణం పొందిన జశ్వంత్ సింగ్ కుమారుడు 12 ఏళ్ల యువరాజ్ సింగ్ కూడా కారుణ్య నియామక పత్రం అందుకున్నాడు. మేజర్ అయ్యాక ఇతడి నియామ కానికి అనుకూలమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు. -
అందరి నోట.. రాజగోపాల్‌రెడ్డి మాట!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న వార్త మంగళవారం అందరి నోటా వినిపించింది. శాసనసభ హాలు, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలిపారు. శాసనసభ ఎన్నికలకు ముందు అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. మునుగోడు నుంచి ఆయన విజయం సాధించడంతో పాటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న భరోసా రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల్లో ఉంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తనకు అధిష్టానం ఏ పదవి అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని రాజగోపాల్‌రెడ్డి మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన అనుచరులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు మాత్రం రాజగోపాల్‌రెడ్డికి హోంమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. -
డీలిమిటేషన్‌తో ఒక్క సీటూ తగ్గదు
కోయంబత్తూరు: దామాషా విధానంలో చేపట్టే పునర్వ్యవస్థీకరణ వల్ల లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గదని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. తమిళనాడుకే కాదు, ఏ ఒక్క దక్షిణాది రాష్ట్రానికి కూడా నష్టం జరగదని ఆయన కుండబద్దలు కొట్టారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ వ్యవహరిస్తారని చెప్పారు. ఒక్క సీటు కూడా నష్టపోనివ్వరని మంత్రి హామీ ఇచ్చారు. పునర్వ్యవస్థీకరణ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగదంటూ మోదీ ప్రభుత్వం ఇప్పటికే పార్లమెంట్లో ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు. ఈ విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. డీలిమిటేషన్ వల్ల తమిళనాడు లోక్‌సభ సీట్ల సంఖ్య 39 నుంచి 31కి తగ్గిపోతుందని సోమవారం సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించడం, దీనిపై చర్చించేందుకు 5న అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశామనడం తెల్సిందే. తమిళనాడుకు నిధుల మంజూరు విషయంలో కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సీఎం ఎంకే స్టాలిన్ చేసిన ఆరోపణలను మంత్రి తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే స్టాలిన్ డీలిమిటేషన్‌తో నష్టం జరుగుతుందని చెబుతున్నారని ధ్వజమెత్తారు. బుధవారం అమిత్ షా కోయంబత్తూరులో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తిరువణ్ణామలై, రామనా థపురంలలో పార్టీ కార్యాలయాలను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కా ర్యకర్తలు, ప్రజలనుద్దేశించి మంత్రి ప్రసంగించారు. దేశ వ్యతిరేక ధోరణి పెరిగిందిరాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైందంటూ అధికార డీఎంకేపై అమిత్ షా విరుచుకుపడ్డారు. తమిళనాడులో జాతి వ్యతిరేక ధోరణి గరిష్ట స్థాయికి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు. 1998 బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు, ప్రధాన సూత్రధారి ఎస్ఏ బాషా అంతిమ యాత్రకు తమిళనాడు ప్రభుత్వం భద్రత కల్పించిందని విమర్శించారు. ‘రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మైనింగ్ మాఫియానే ఇక్కడ రాజకీయాలను నడిపిస్తోంది. శాంతిభద్రతల పరిస్థితి అధ్వానంగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. అవినీతిలో డీఎంకే మంత్రులంతా మాస్టర్స్ డిగ్రీ చేశారు. డీఎంకే నేతలపై ఉద్యోగాలను అమ్ముకున్న కేసులు, మనీలాండరింగ్ ఆరోపణలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు, రూ.6 వేల కోట్ల కుంభకోణం కేసులున్నాయి. వీటిన్నిటినీ చూస్తే అవినీతికి పాల్పడిన వారికే డీఎంకే సభ్యత్వం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుండగా వాటిని పరిష్కరించడం మానేసిన సీఎం, ఆయన కుమారుడు ఉదయనిధి వారి దృష్టిని మళ్లించేందుకు ఇతర అంశాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు.నిధులపై వాస్తవ గణాంకాలివీ..కేంద్రం నుంచి అందిన నిధులపై చేతనైతే సీఎం స్టాలిన్ వాస్తవాలను వెల్లడించాలని అమిత్ షా సవాల్ విసిరారు. ‘మోదీ ప్రభుత్వ హయాంలో పదేళ్ల వ్యవధిలో తమిళనాడుకు రూ.5,08,337 లక్షల కోట్ల నిధులందాయి. వీటికి తోడు, మౌలిక వనరుల అభివృద్ధి కోసం మరో 1.43 లక్షల కోట్లను అందజేశాం. అదే, యూపీఏ హయాంలో 2004–14 సంవత్సరాల మధ్య కాలంలో తమిళనాడుకు కేవలం రూ.1.52 లక్షల కోట్లే దక్కాయి. అయితే, మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని మీరంటున్నారు. వాస్తవానికి రాష్ట్రానికి యూపీఏ హయాంలో, అప్పటి ప్రభుత్వం మీరు కూడా భాగస్వాములుగా ఉండగానే అన్యాయం జరిగింది’అని షా చెప్పారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థినులకు భద్రత కరువైందని ఆరోపించారు. అక్రమ సారాయి విక్రయాలను వ్యతిరేకించిన కాలేజీ విద్యార్థులు దారుణ హత్యకు గురవుతున్నారన్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని, మహారాష్ట్ర, హరియాణాల్లో బీజేపీ సాధించిన గెలుపు కంటే ఇది మిన్నగా ఉంటుందన్నారు. -
డిన్నర్లపై హైకమాండ్ గరం
శివాజీనగర: రాష్ట్ర కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు పెరిగిపోగా, ఢిల్లీలో హైకమాండ్ అగ్గిమీద గుగ్గిలమైనట్లు తెలిసింది. మంత్రులు, సీనియర్లు విందు భేటీలు జరుపుతూ ముఠా రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు రావడంతో పార్టీ పెద్దలు సీరియస్ అయినట్లు సమాచారం. డిన్నర్లు, రహస్య భేటీల్లో నిమగ్నమైన నాయకులను ఢిల్లీకి పిలిపించి మందలించనుంది. ఎలాంటి విందు రాజకీయ సమావేశాలను, పార్టీ అనుమతి లేకుండా జరపరాదని హెచ్చరికలు చేయడంతో రాష్ట్ర నాయకుల్లో కలవరం నెలకొంది. వచ్చే వారం కొందరు మంత్రులకు ఢిల్లీకి రావాలని రాహుల్‌గాంధీ ఆప్తుడు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ సమాచారం పంపారు. డీకే ఫిర్యాదు ఏమిటి? రాష్ట్ర కాంగ్రెస్‌లో విందు రాజకీయాలు ముమ్మరం కాగా, ప్రతిపక్షాలు దీనిని హేళన చేస్తున్నాయి. ప్రజల సమస్యలతో సంబంధం లేకుండా డిన్నర్లు చేసుకుంటున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. దీంతో పార్టీ గౌరవానికి భంగం వాటిల్లుతోంది. దీనంతటికీ చెక్ పెట్టాలని కేపీసీసీ అధ్యక్షుడు డీ.కే.శివకుమార్(DKShivakumar) హైకమాండ్‌కు విన్నవించారని తెలిసింది. ఎందుకంటే ఎక్కువ డిన్నర్లు ఆయన వ్యతిరేక వర్గీయులు జరుపుతున్నవే. డీకేశి విన్నపానికి సానుకూలంగా స్పందించిన కాంగ్రెస్ హైకమాండ్ (CongressHighCommand) మరో రెండు వారాల్లో ప్రక్షాళన చేపడతామని సంకేతాలిచ్చింది. కొందరు మంత్రులు విందు భేటీలు ఏర్పాటు చేయడం సరికాదు, నేను కూడా విందు ఇవ్వవచ్చు, కానీ అలాంటివి సబబుకాదు అని డీకే పేర్కొన్నట్లు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికలలో ఎంతో కష్టపడి అధికారంలోకి వస్తే నేతలు, మంత్రులు ఇలా చేస్తున్నారేమిటా అని తీవ్రంగా పరిగణించిన హైకమాండ్ పలువురు సీనియర్ మంత్రులను పిలిపించి గట్టిగా మాట్లాడనుంది. సీఎం వర్గం గుర్రు మరోవైపు డీ.కే.శివకుమార్‌పై సీఎం సిద్దరామయ్య(Siddaramaiah) వర్గానికి చెందిన కొందరు మంత్రులు అసంతృప్తికి గురయ్యారని తెలిసింది. వీరంతా వచ్చేవారం ఢిల్లీకి వెళ్లి హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలనుకుంటున్నారు. అంతఃకలహాలు కాంగ్రెస్‌లో ఏ పరిణామాలకు దారితీస్తాయనేది ఉత్కంఠగా మారింది. డీకే అడ్డుగోడల్ని సీఎం వర్గీయులు ఎలా ఛేదిస్తారనేది చర్చకు కారణమైంది.13న సీఎల్పీ భేటీ శివాజీనగర: తాజా పరిణామాల నేపథ్యంలో జనవరి 13న బెంగళూరులోని ఓ హోటల్లో సీఎం సిద్దరామయ్య నేతృత్వంలో సీఎల్పీ సమావేశం జరగనుంది. సాయంత్రం 6 గంటలకు సభ మొదలవుతుంది. పారీ్టలో గ్రూపు కొట్లాటలు, హైకమాండ్ ఆగ్రహం నేపథ్యంలో ఈ భేటీ కుతూహలం కలిగిస్తోంది.నా విందు వాయిదా: హోంమంత్రి పరమేశ్వర్బుధవారం సాయంత్రం దళిత ఎమ్మెల్యేలు, మంత్రులకు నేను ఏర్పాటు చేసిన విందు రద్దు కాలేదు, వాయిదా పడింది అంతేనని హోం మంత్రి జీ.పరమేశ్వర్ అన్నారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన, హైకమాండ్ సూచన మేరకు విందు భోజనాన్ని వాయిదా వేశాను. విందు తేదీని త్వరలో వెల్లడినన్నారు. డీకే శివకుమార్ హైకమాండ్‌కు ఫిర్యాదు చేసినట్లు తనకు తెలియదన్నారు. తాను విందు ఇవ్వరాదని ఎవరైనా అంటే సమాధానం చెప్పే శక్తి తమకు ఉందన్నారు. -
ఏపీ హోంమంత్రి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి,పశ్చిమ గోదావరి : డ్రగ్స్ తీసుకుంటేనే, స్మగ్లింగ్ చేస్తేనే హీరోలా చూస్తున్నారని హోం మంత్రి వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జిల్లా పాలకొల్లు మండలంలో ఇవాళ (డిసెంబర్15) ఉదయం పాలకొల్లులో ‘సేవ్ గర్ల్ చైల్ఢ్’ అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు.ఈ సందర్భంగా వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీలో యువత గంజాయి మత్తుకు అలవాటుపడుతోంది. సినిమాలు చూసి ప్రభావితమవుతున్నారు. గంజాయి,డ్రగ్స్,మందు తాగేవాళ్లను హీరోలుగా చూస్తున్నారు. చిన్నారులపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం,రాష్ట్రంలో శాంతి భద్రతలు సంరక్షించే హోంమంత్రి హోదాలో అనిత ఈ తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై వివాదం రాజుకుందిఇలా హోమంత్రిగా హోదాలో ఉన్న వంగలపూడి అనిత ఈ నవంబర్ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నోరు పారేసుకున్నారు.అసెంబ్లీలో అనిత ఏం మాట్లాడారంటే?ఐదు సంవత్సరాల వైఎస్సార్సీపీ పాలనలో కంటే.. తమ హయాంలోని గత ఐదు నెలల కాలంలోనే క్రైమ్ రేటు విపరీతంగా తగ్గిందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శాంతి భద్రతల అంశంపై చర్చ సందర్భంగా.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ప్రశ్నలకు ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ ఆందోళనకుదిగగా.. మరోవైపు చైర్మన్ సైతం ఆమె తీరును తప్పుబట్టారు.ఏపీ శాసన మండలిలో శాంతి భద్రతలపై వాడీ వేడి చర్చ నడిచింది. తొలుత.. రాష్ట్రంలో అత్యాచార ఘటనలు పెరిగిపోవడంపై వరదు కళ్యాణి మాట్లాడారు. దిశ యాప్, చట్టాన్ని నిర్వీర్యం చేయడంపై ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రభుత్వం నుంచి వివరణ కోరారు. దీనిపై అనిత మాట్లాడుతూ.. అత్యాచార ఘటనను రాజకీయం చేయొద్దన్నారు. అలాగే.. మహిళల భద్రత పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిశ చట్టం తెచ్చిందని, దిశ పోలీస్ స్టేషన్లు గతంలో ఏర్పాటు చేశారని.. తాము అధికారంలోకి వచ్చాక వాటిని తొలగించామని ఆమె అన్నారామె. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా విఫలం అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పిన వ్యాఖ్యలను మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు.అసహనానికి లోనైన ఆమె.. దమ్ము, ధైర్యం అంటూ ఆమె తీవ్ర పదజాలంతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొయ్యే మోషేన్‌రాజు, మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు.బాధ్యత గల మంత్రిగా ఉండి.. దమ్ము ధైర్యం గురించి మాట్లాడం సరైనది కాదు అని అన్నారాయన. దీంతో ఆమె క్షమాపణలు చెప్పి కూర్చున్నారు. అయితే అనిత వ్యాఖ్యలపై నిరసనగా.. శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి ప్రభుత్వం విఫలమైనందున మండలి నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది. అంతకు ముందు..‘‘ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల పై నేరాలు, వేధింపులు పెరిగాయి. రాష్ట్రంలో రోజుకు 59 నేరాలు మహిళల పై జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రతి గంట కి ఇద్దరు, ముగ్గురు మహిళలు పై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం, పోలీసులు వైఫల్యం వలన మహిళలు, చిన్నారుల పై నేరాలు జరుగుతున్నాయి. ముచుమర్రి లో 9 ఏళ్ల బాలిక పై అత్యాచారం చేసి చంపేస్తే ఈరోజు కి మృతదేహం దొరకలేదు. హిందూపురం లో అత్తా కోడళ్ల పై గ్యాంగ్ రేప్ చేశారు. ఏ ఆర్ పురంలో చిన్నారిని అత్యాచారం చేసి చంపేశారు. దిశ యాప్ ని కొనసాగిస్తున్నారా..? లేదా..?. దిశ పోలీసు స్టేషన్ల ను కొనసాగిస్తున్నారా లేదా?. మహిళల పై నేరాల పై నియంత్రణ కు ఏదైనా కొత్త వ్యవస్థ తెచ్చారా..? అని మండలిలో ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు గుప్పించారు. -
చెక్ బౌన్స్ కేసు.. అనిత పిటిషన్‌పై హైకోర్టు అసంతృప్తి
-
క్షమించండి.. చైర్మన్ ను వేడుకున్న వంగలపూడి అనిత
-
విశాఖ నగరంలో గంజాయి కలకలం
విశాఖపట్నం, సాక్షి: శాంతిభద్రతలు క్షీణించడంపై చర్చ నడుస్తున్న వేళ.. నగరంలో మరోవైపు సంచలనం వెలుగు చూసింది. విశాఖలో గంజాయి కలకలం రేగింది. హోం మంత్రి అనిత నివాసానికి సమీపంలోనే ఉండడం గమనార్హం.లేడీస్ హాస్టల్ వెనుక ఉన్న కేజీహెచ్ కొండ ప్రాంతంలో గంజాయి ముఠా గుట్టు రట్టైంది.. ఏజెన్సీ నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ పండిస్తోంది ఓ ముఠా. తాము సేవించడమే కాకుండా.. మిగతాది నగరంలోని విద్యార్థులకు విక్రయిస్తోంది. ఈ గ్యాంగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు.. దాడులు జరిపారు. ఐదుగురు ముఠా సభ్యుల గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అందులో ఇద్దరు పారిపోగా.. ముగ్గురు మాత్రం దొరికారు. వీళ్లలో ఒక మైనర్ ఉండడం గమనార్హం. ఈ ప్రాంతం హోం మంత్రి అనిత నివాసానికి కేవలం 3 కి.మీ. లోపే ఉంది. నావికా దళం(నేవీ) ఆధీనంలో ఉండడం, పైగా హోం మంత్రి నివాస సమీపంలోనే గంజాయి సాగు జరగడం ఒక్కసారిగా విశాఖను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ముఠా ఎవరెవరకి సప్లయ్ చేసిందనే దానిపై నిందితుల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
హోం మినిస్టర్ పై పవన్ వ్యాఖ్యలు వైఎస్ జగన్ రియాక్షన్
-
..అలా అయితే మీరు చాలా శాఖలు తీసుకోవాల్సి వస్తుంది సార్!
-
అనితకు పవన్ వార్నింగ్.. ‘ఇప్పటికైనా మార్చాలి’
గుంటూరు, సాక్షి: చంద్రబాబు సర్కార్ అన్ని రంగాల్లోనూ విఫలమైందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 5 నెలల్లోనే మహిళలపై వందకుపైగా అఘాయిత్యాలు జరిగాయని మండిపడ్డారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘హోమంత్రిగా అనిత ఫెయిల్ అయ్యారని కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న వవన్ కల్యాణే చెబుతున్నారు. మేం కూడా మొదట్నుంచీ అనిత తీరును ఎండగడుతూనే ఉన్నాం. అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నైతిక బాధ్యత వహిస్తూ అనిత రాజీనామా చేయాలి. అనితతో పాటు చంద్రబాబు సైతం సీఎంగా రాజీనామా చేయాలి’’ అన్నారు.‘పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే బాబును రాజీనామా చేయమనాలి’హోంమంత్రిగా అనిత పూర్తిగా విఫలమయ్యారని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఇప్పటికైనా హోం మంత్రిని మార్చాలి. వైఎస్ జగన్‌ను తిట్టడానికే అనితకు హోం మంత్రి పదవి ఇచ్చినట్లు ఉందని మండిపడ్డారు. సోమవారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. ‘‘హోంమంత్రి అనితను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారు. కూటమి అక్రమాలపై పశ్నిస్తే.. అక్రమ కేసులు పెడుతున్నారు. ఇప్పటికైనా సర్కార్ తీరు మార్చుకోవాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలైమంది. పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే బాబును రాజీనామా చేయమని చెప్పాలి’’ అని అన్నారు. -
హోమ్ మంత్రి అనితపై పవన్ ఫైర్
-
నన్ను చంపాలని చూస్తున్నారు.. భద్రత పెంచండి
సాక్షి, న్యూఢిల్లీ: తనను కొందరు చంపాలని చూస్తున్నారని, భద్రత పెంచాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా లకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ లేఖ రాశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ, సహా మోదీ కూడా తనకు శత్రువులే అని పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నన్ను చంపితే స్వర్గానికి పోతా..మీరు (చంపాలనుకున్నవారు) చస్తే నరకానికి పోతారు’అంటూ వ్యాఖ్యానించారు. పలు విషయాలపై తాను కేసులు వేస్తూ పోరాడుతున్నానని, ఎన్నో కేసుల్లో స్టే లు తీసుకువస్తున్నానని తెలిపారు. చంద్రబాబు, పవన్ సహా.. బీజేపీ,ఆర్ఎస్ఎస్, తీవ్రవాదుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని తెలిపారు. పాలన చేతకాకపోతే సీఎం పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని కేఏపాల్ డిమాండ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వేలాది మంది గ్రూప్–1 అభ్యర్థులపై పోలీ సులు దాడులు చేయడం అమానుషమన్నారు. -
అనితక్కా.. ఏందీ నీ తిక్కా.. ఏపీ హోం మంత్రిపై మాధవీలత ఫైర్
ఏపీ హోమంత్రి వంగలపూడి అనితపై హీరోయిన్, బీజేపీ నాయకురాలు మాధవీలత మండిపడ్డారు. వినాయక చవితి సందర్భంగా చలాన్లు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గణేశ్ మండపాల దగ్గర చిల్లర డబ్బులు ఏరుకోవడం ఏంటని హోమంత్రిని నిలదీశారు. అన్ని మతాలు, పండుగలు సమానమని.. కానీ హిందూ పండగలపైనే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ ప్రశ్నిస్తూ.. మాధవీలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అనితక్కా?.. ఏంది మీ తిక్కా?.. ఏపీలో చిన్నపిల్లపై అత్యాచారం జరిగితే ఇంతవరకు ఆ కేసు ఏమైందని నిలదీశారు. గణేశ్ మండపాల దగ్గర ఈ చిల్లర అడుక్కోవడమేంటి అక్కా? అంటూ మరింత ఘాటుగా ఇచ్చిపడేశారు. మాధవీలత తన ఇన్‌స్టాలో రాస్తూ..' ఆంధ్ర హిందూ బంధువులు ముఖ్యంగా వినాయక భక్తులు అడుక్కుంటే భిక్షం వేయడానికి ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. అసలే మా గణేశుడికి ఆకలి ఎక్కువ. ఆయన కోసం వండే వాటిని తగ్గించి మీకు నాలుగు చిల్లర డబ్బులు మీ ముఖాన వేస్తారు. అందరికీ మా పండగల మీద చిల్లర ఏరుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సమాన న్యాయం, సమాన ధర్మం పెట్టండి. అన్ని మతాలు , పండగలు సమానం, అందరూ సమానమని చెప్పి.. మరి మా మైక్ సెట్‌కి, మా గణేశ మంటపాలకి, మా గమేష్ ఎత్తుకి డబ్బులెందుకో? అనితక్కా?.. ఏంది మీ తిక్కా? ఔనక్కా మొన్న చిన్నపిల్లని మానభంగం చేసి చంపేశారు ఏమైంది ఆ కేసు ?? ముసలోడు ఉయ్యాల్లో ఉన్న బిడ్డని మానభంగం చేశాడు. ముసలోడికి ఉరిశిక్ష వేయలేదా? ఓహో ఇపుడు మేమిచ్చే చిల్లర భిక్షతో లాయర్‌ను పెడతారా?' అంటూ పోస్ట్ చేసింది. (ఇది చదవండి: తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు? )కాగా.. నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవీలత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. View this post on Instagram A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi) -
హోం మంత్రి రాకతో పోలీసుల ఓవరాక్షన్
విజయవాడ స్పోర్ట్స్/రామవరప్పాడు: బుడమేరు వరద బాధితులకు సహాయం అందించాల్సిన పోలీసులు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మిన్నకుండిపోయారు. సింగ్‌నగర్ ఫ్లై ఓవర్ వద్దకు హోం మంత్రి అనిత రాగానే ఓవరాక్షన్ చేశారు. బాధితులను పక్కకు నెట్టేసి ఒక్కసారిగా బారికేడ్లను అడ్డం పెట్టారు. దీంతో పోలీసులపై బాధితులు మండిపడ్డారు.ఇప్పటివరకు పట్టించుకోకుండా.. హోం మంత్రి రాగానే.. చచ్చీ చెడి ఈదుకుంటూ.. వచ్చిన మమ్మల్ని పక్కకు తోసేస్తారా అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. తమ వాళ్లను తీసుకొచ్చేందుకు బోట్లు ఏర్పాటు చేయాలని కోరిన బాధితులపై ఆమె దురుసుగా ప్రవర్తించారు. కాగా, రామవరప్పాడు ఫ్లై ఓవర్ దిగువ ప్రాంతంలోని ఎస్ఎల్వీ గ్రీన్ మెడాస్లోని విల్లాలు వరద నీటితో నిండిపోయాయి. ఈ ఎస్ఎల్వీ విల్లాస్‌లో హోం మంత్రి అనితకు చెందిన విల్లాలు కూడా మునిగిపోయాయి. -
AP: హోంమంత్రి అనితకు తప్పిన ప్రమాదం
సాక్షి,ఏలూరు జిల్లా: ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది. ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశారు. దీంతో ఎస్కార్ట్ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద ఆదివారం(ఆగస్టు11) ఈ ఘటన జరిగింది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మంత్రి కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఘటన తర్వాత మంత్రి అక్కడినుంచి వేరే వాహనంలో వెళ్లిపోయారు. -
379 అక్రమ రుణ వెబ్సైట్లు, 91 ఫిషింగ్ సైట్ల తొలగింపు
ఆర్థిక మోసాలను అణిచివేసేందుకు ప్రభుత్వం 379 అక్రమంగా రుణాలందించే వెబ్సైట్లను, 91 ఫిషింగ్ సైట్లను తొలగించినట్లు కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ..‘ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) అక్టోబర్ 2023 నుంచి మార్చి 2024 మధ్యకాలంలో 379 అక్రమంగా రుణాలిస్తున్న వెబ్సైట్లను మూసివేసింది. 91 ఫిషింగ్ సైట్లను తొలగించింది. ప్రభుత్వ వెబ్సైట్లను ప్రతిపాదించే ‘.in’ డొమైన్ల దుర్వినియోగాన్ని పరిష్కరించడానికి నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (నిక్సీ)తో ఐ4సీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. జనవరి 31న నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)లో ‘రిపోర్ట్ సస్పెక్ట్’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టారు. దాంతో అనుమానాస్పద వెబ్సైట్ యూఆర్ఎల్తో చేసిన సైబర్ క్రైమ్‌ను త్వరగా గుర్తించవచ్చు. వెంటనే సంబంధిత శాఖకు ఈ విషయాన్ని నివేదించవచ్చు. వీటిలో ఇప్పటివరకు 5,252 రికార్డులు నమోదయ్యాయి. ఆర్థిక మోసాలను తక్షణమే నివేదించడానికి ‘సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్’ను ఏర్పాటు చేశాం. దాని ద్వారా 7.6 లక్షలకు పైగా సైబర్ క్రైమ్ కేసుల్లో రూ.2,400 కోట్లు ఆదా చేశాం’ అన్నారు.ఇదీ చదవండి: పారిస్ ఒలింపిక్స్.. గూగుల్ ప్రత్యేక డూడుల్!2024 వార్షిక నివేదికలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ సుమారు 36,000 ఆర్థిక మోసాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. 2022లో వీటి సంఖ్య 9,000 ఉండడం గమనార్హం. 2024 వరకు ఇవి ఏకంగా 300 శాతం పెరిగాయి. ఈ ఆర్థిక మోసాలను పరిష్కరించడంలో భాగంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడానికి ఆర్బీఐ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. -
దాడులు ఆగటానికి ఇంకాస్తా సమయం పడుతుంది
-
హోం మంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నెలకొన్న అశాంతి, ప్రజల్లో పేరుకుపోయిన అభద్రతాభావ పరిస్థితులపై హోంమంత్రి వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. లా అండ్ ఆర్డర్‌పై ప్రశ్నించిన మీడియాపై ఆమె అసహనం ప్రదర్శించారు. ‘మీరు హోంమంత్రిగా ఏం చేయలేకపోయారు కదా?’ అని ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘‘నన్నేం చేయమంటారు?. నేనే లాఠీ పట్టాలా..? గన్ పట్టాలా?. దేనికైనా టైం రావాలి. ఒకేసారి ఏం చేయలేం కదా. దేనికైనా టైం పడుతుంది’’ అని అన్నారామె. ఇక.. నెలకు పైగా సాగిన కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఓ వైపు వైఎస్సార్సీపీ నేతలపై కక్షసాధింపు దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. హత్యలు, వేధింపుల పర్వాలు, చిన్నారులతో సహా మహిళలపై అఘాయిత్యాలు కొనసాగుతున్నాయి. -
ఏపీ హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనిత
-
దేశం, ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రధాని మోదీ నాయకత్వంలో వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎప్పటిలాగే దేశం, ప్రజల భద్రతకు కట్టుబడి ఉంటుందన్నారు. మోడీ 3.0 భారతదేశ భద్రత కోసం తన ప్రయత్నాలను తదుపరి స్థాయికి తీసుకువెళుతుందని ఎక్స్‌వేదికగా ట్వీట్ చేశారు. తిరుగుబాటు, నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాడతామని అన్నారు.మోదీ దార్శానికతకు అనుగుగుణంగా రైతులకు సాధికారత కల్పించడం, గ్రామీణ జాతీయ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా సహకార మంత్రిత్వ శాఖ పనిని కొనసాగిస్తుంది. లక్షలాది మందికి కొత్త అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. -
Lok Sabha Elections 2024: దక్షిణాదిన అత్యుత్తమ ఫలితాలు: అమిత్ షా
అహ్మదాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యుత్తమ ఫలితాలను సాధించనుందని హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ‘బీజేపీకి ఉన్న అనుకూల వాతావరణాన్ని బట్టి 400 పైగా సీట్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈదఫా ఎన్నికల్లో దక్షిణాదిన మొదటిసారిగా అత్యధిక స్థానాలు సాధించుకుంటాం’అని అమిత్ షా చెప్పారు. దీన్ని బట్టి ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎన్ని సీట్లు దక్కుతాయో ఊహించుకోవచ్చునన్నారు. -
Farmers movement: నేడు రైతు సంఘాల ‘బ్లాక్ డే’
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో మహాపంచాయత్‌లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. గురువారం ఎస్కేఎం నేతలు చండీగఢ్‌లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్‌కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్‌లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. -
దేశ గౌరవం పెంచిన మోదీ: అమిత్ షా
మైసూరు: ‘‘అయోధ్యలో రామమందిర నిర్మాణంతోపాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు. తద్వారా అంతర్జాతీయ వేదికలపై దేశ సాంస్కృతిక గౌరవాన్ని ఇనుమడింపజేశారు. దేశాన్ని సురక్షితంగా, సుభిక్షంగా తీర్చిదిద్దడంతోపాటు యోగ, ఆయుర్వేద, భారతీయ భాషల పరిరక్షణకు మోదీ చర్యలు తీసుకుంటున్నారన్నారు’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆదివారం ఆయన మైసూరు సమీపంలోని సుత్తూరు జాతరలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మైసూరులోని చాముండి హిల్స్‌పై కొలువుదీరిన చాముండేశ్వరీ మాతను దర్శించుకుని పూజలు చేశారు. -
‘నేను హోం మంత్రి అయితేనే వాళ్లు కంట్రోల్లో ఉంటారు’
సాక్షి, హైదరాబాద్: తాను హోం మంత్రిని అయితేనే బీఆర్ఎస్ నాయకులు కంట్రోల్లో ఉంటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాత క్యాబినెట్ విస్తరణ ఉంటుందని తెలిపారు. హోం శాఖ అడుగుతున్నా.. తనకు మంత్రి పదవి ఇచ్చేందుకు అధిష్టానం హామీ ఇచ్చిందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే తనకు హోం శాఖ ఇవ్వాలని అడుగుతున్నానన్నారు. తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చిందే కేసీఆర్‌ను గద్దె దించేందుకేనన్నారు. తాను హోంమంత్రిని అయితేనే వాళ్లు (బీఆర్ఎస్ నాయకులు) కంట్రోల్లో ఉంటారన్నారు వాళ్లంతా జైలుకు వెళ్లడం ఖాయం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత, సంతోష్ రావు, జగదీష్ రెడ్డితో సహా ఆయన కుటుంబ సభ్యులందరూ జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు బీజేపీయే శ్రీరామరక్ష అని, బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారని జోస్యం చెప్పారు. ఇక భువనగిరి, నల్గొండ పార్లమెంట్ స్థానాలకు తమ కుటుంబ సభ్యులెవరూ పోటీ చేయకూడదన్నది తమ ఉద్దేశమన్నారు. అయితే పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తామని, టెకెట్ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని వివరించారు. -
సిమిపై మరో ఐదేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతూ శాంతి, మత సామరస్యానికి భంగం కలిగిస్తున్న స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(సిమి)పై నిషేధాన్ని కేంద్ర ప్రభ్వుం మరో అయిదేళ్లు పొడిగించింది. ఈ విషయాన్ని హోం శాఖ మంత్రి అమిత్ షా సోమవారం ‘ఎక్స్’లో ప్రకటించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)కింద సిమిని చట్టవ్యతిరేక సంస్థగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సహా సుమారు 10 రాష్ట్రాల వినతి మేరకు.. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండగా మొదటిసారిగా కేంద్రం 2001లో సిమిని నిషేధించింది. ఆ తర్వాత పొడిగిస్తూ వస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో 1977లో సిమి ఏర్పాటైంది. భారత్‌ను ముస్లిం దేశంగా మార్చాలన్న అజెండాతో పనిచేస్తున్నట్లు ఈ సంస్థపై ఆరోపణలొచ్చాయి. గత కొన్నేళ్లలో సిమి కార్యకర్తలపై ఉగ్రవాద సంబంధ 17 కేసులు నమోదు కాగా, 27 మంది సభ్యులను అరెస్ట్ చేసినట్లు హోం శాఖ తెలిపింది. -
కేంద్రం కీలక నిర్ణయం.. ‘సిమి’పై మరో ఐదేళ్లు నిషేధం
న్యూఢిల్లీ: చట్ట విరుద్ధమైన స్టుడెంట్స్ ఆఫ్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా(SIMI)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం(UAPA) కింద.. సిమిపై మరో ఐదేళ్ల పాటు నిషేధం కొనసాగుతుందని సోమవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా వెల్లడించింది. మొదటి ఏన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో 2014లో ఉపా చట్టం కింద ‘సిమి’ సంస్థపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. Bolstering PM @narendramodi Ji's vision of zero tolerance against terrorism ‘Students Islamic Movement of India (SIMI)’ has been declared as an 'Unlawful Association' for a further period of five years under the UAPA. The SIMI has been found involved in fomenting terrorism,… — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) January 29, 2024 ‘ఉగ్రవాదాన్ని సహించేది లేదన్న ప్రధాని మోదీ విధానాన్ని బలపరుస్తూ.. యూఏపీఏ కింద ‘సిమి’ని మరో ఐదేళ్లపాటు ‘చట్టవిరుద్ధమైన సంఘం’గా ప్రకటించబడింది. భారత సార్వభౌమత్వం, భద్రత, సమగ్రతకు ముప్పు కలిగించేలా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, శాంతి, మతసామరస్యానికి భంగం కలిగించడంలో ‘సిమి’ ప్రమేయం ఉన్నట్లు తేలింది’ అని హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం పేర్కొంది. -
సోషల్ జస్టిస్ కి రోల్ మోడల్ సీఎం జగన్..
-
Parliament security breach: పట్టువీడని విపక్షాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాలతో ఉభయ సభలు వరుసగా రెండో రోజు శుక్రవారం సైతం పూర్తిగా స్తంభించిపోయాయి. తమ డిమాండ్ నుంచి విపక్ష ఎంపీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బుధవారం నాటి అవాంఛనీయ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే సభకు వచ్చి వివరణ ఇవ్వాలని, భద్రతా లోపంపై ఉభయ సభల్లో చర్చ చేపట్టాలని వారు తేలి్చచెప్పారు. పార్లమెంట్ బయట మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న హోంమంత్రి సభకు ఎందుకు రావడం లేదని వారు నిలదీశారు. పార్లమెంట్లో భద్రతా లోపానికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆగంతకులకు విజిటర్ పాసులు ఇచి్చన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై చర్చలు తీసుకోవాలన్నారు. భద్రతా లోపంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు 14 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతించాలంటూ లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదేపదే కోరినా వినిపించుకోలేదు. ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడకపోవడంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. పరిస్థితిలో మార్పు రాకపోవడంతో సభలను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలోనూ విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. గురువారం సస్పెన్షన్ వేటు పడిన ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలో గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోక్‌సభ అలా... లోక్‌సభ శుక్రవారం ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. భద్రతా లోపాన్ని లేవనెత్తారు. వెల్‌లోకి దూసుకెళ్లి ప్రకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు. విపక్ష సభ్యులు నినాదాలు ఆపలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ సోలంకీ ప్రకటించారు. రాజ్యసభ ఇలా... ఎగువ సభలోనూ విపక్షాలు అలజడి సృష్టించాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్షాల నుంచి నినాదాల హోరు మొదలైంది. హోంమంత్రి అమిత్ షా సభకు వచి్చ, సమాధానం చెప్పాల్సిందేనని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే అన్నారు. సభలో స్టాండింగ్ కమిటీ నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భద్రతా లోపంపై చర్చ చేపట్టాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేయగా, చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ అంగీకరించలేదు. భద్రతా లోపంపై రాజ్యసభలో చర్చ కోసం పట్టుబడుతూ విపక్షాలు ఇచి్చన 23 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు చెప్పారు. జీరో అవర్ చర్చను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సమయంలో పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్ధా ప్రయతి్నంచగా, చైర్మన్ ధన్‌ఖడ్ అసహనం వ్యక్తం చేశారు. నిబంధనలు అతిక్రమించవద్దని సూచించారు. విపక్ష ఎంపీలు నినాదాలు జోరు పెంచడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. పునఃప్రారంభమైన తర్వాత కూడా సభలో అలజడి తగ్గలేదు. సభా కార్యకలపాలు సజావుగా సాగడానికి సహకరించాలని పలుమార్లు కోరినా విపక్ష ఎంపీలు లెక్కచేయలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ధన్‌ఖడ్ ప్రకటించారు. అది మా బాధ్యత: ఖర్గే దేశ భద్రతకు సంబంధించిన అత్యంత కీలకమైన అంశంపై గళం వినిపించడం, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తమ బాధ్యత, పార్లమెంటరీ విధి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. విపక్ష ఎంపీలను చట్టవ్యతిరేకంగా నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. ఇదెక్కడి న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన 14 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విపక్ష ఇండియా కూటమి నేతలు శుక్రవారం పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయించారు. గురువారం రాజ్యసభ నుంచి సస్పెండైన ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేత సోనియా గాంధీ ఈ నిరసనలో పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎలాంటి తప్పు చేయని విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని, భద్రతా లోపానికి కారణమైన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహాపై మాత్రం చర్యల్లేవని మండిపడ్డారు. తమపై సస్పెన్షన్ వేటును ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్లాన్ బీ కూడా ఉంది..! పార్లమెంట్లో అలజడికి కుట్ర పన్నిన లలిత్ ఝా బృందం, ప్లాన్ బీ కూడా సిద్ధం చేసుకుంది. విచారణలో లలిత్ ఈ మేరకు వెల్లడించాడు. నీలమ్, అమోల్ పార్లమెంట్ వద్దకు చేరుకోలేకుంటే ముకేశ్, కైలాశ్ మరో మార్గంలో చేరుకుని మీడియా కెమెరాల ఎదుట నినాదాలిస్తూ పొగ గొట్టాలను పేల్చాలనుకున్నారు. కానీ మంగళవారం రాత్రి గురుగ్రామ్‌లోని విక్కీ ఇంటికి సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్, నీలమ్ మాత్రమే వచ్చారు. మహేశ్, కైలాశ్ రాలేకపోయారు. బూట్లలో పొగ గొట్టాలు లోక్‌సభలో ప్రయోగించిన పొగ గొట్టాలను నిందితులు బూట్లలో దాచి సభలోకి తెచి్చనట్లు పోలీసులు గుర్తించారు. ఎడమ బూటు కింది భాగంలో రబ్బరు పొరలతో చేసిన రహస్య అరలో వాటిని అమర్చుకొని సభలోకి ప్రవేశించారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బూట్లను భద్రతా సిబ్బంది తనిఖీ చేయరని కనిపెట్టే ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. వారినుంచి స్వా«దీనం చేసుకున్న కరపత్రాల్లో కరపత్రాల్లో మణిపూర్ హింసాకాండపై నినాదాలున్నట్లు తెలిపారు. -
కొవ్వూరు రైల్వేస్టేషన్లో రైళ్లను పునరుద్ధరించాలి: తానేటి వనిత
సాక్షి, విజయవాడ: కరోనా సమయంలో లాక్ డౌన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగా కొవ్వూరు రైల్వేస్టేషన్లో రద్దు చేసిన రైళ్లును పునరుద్దరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత కోరారు. శనివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్న నిర్మలా సీతారామన్‌ను విజయవాడలో కలిసి ఈ మేరకు ఆయా రైళ్ల వివరాలను ప్రత్యేక లేఖ ద్వారా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. కొవ్వూరు రైల్వేస్టేషన్లో రెగ్యులర్‌గా నిలుపుదల చేయవలసిన రైళ్లను నిలుపుదల చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. హైదరాబాద్, మద్రాసు, బెంగుళూరు, తిరుపతి వెళ్లే ప్రయాణికులు రైళ్లు నిలుపుదల చేయకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని, వ్యయ ప్రయాసలకు గురై రాజమహేంద్రవరం వెళ్లి రైళ్లు ఎక్కవలసి వస్తుందన్నారు. ప్రజలశేయస్సు దృష్ట్యా కొవ్వూరు స్టేషన్లో కొవిడ్ కారణంగా రద్దుచేసిన రైళ్లును పునరుద్ధరించాలని కోరారు. సదరు విజ్ఞప్తిని కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి కొవ్వూరు నియోజకవర్గ ప్రజల ఇబ్బందులను తొలగించాలని నిర్మలా సీతారామన్ ను హోంమంత్రి తానేటి వనిత కోరారు. కొవ్వూరు రైల్వేస్టేషన్ కొవ్వూరు, పోలవరం, గోపాలపురం మొత్తం మూడు నియోజకవర్గాల్లోని ప్రజలకు అందుబాటులో ఉంటుందని వివరించారు. కరోనా లాక్ డౌన్ అనంతరం 4 రైళ్లను మాత్రమే పునరుద్దరించారని.. మరో 9 రైళ్లను పునరుద్దరించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరులో పునరుద్దరించాల్సిన రైళ్ల జాబితాను అందజేశారు. పునరుద్దరించాల్సిన రైళ్లలో విజయవాడ వైపు, విశాఖపట్నం వైపు తిరిగే రైళ్లున్నాయి. తిరుమల ఎక్స్ ప్రెస్ (17488, 17487), సర్కార్ ఎక్స్ ప్రెస్ (17644, 17643), బొకారో ఎక్స్ ప్రెస్ (13351, 13352), కాకినాడ-తిరుపతి ఎక్స్ ప్రెస్ (17250, 17249), సింహాద్రి ఎక్స్ ప్రెస్ (17240, 17239), తిరుపతి-పూరి ఎక్స్ ప్రెస్ (17479, 17480), మచిలీపట్నం-విశాఖపట్నం ఎక్స్ ప్రెస్ (17220, 17219), రాయగడ-గుంటూరు ఎక్స్ ప్రెస్ (17244, 17243), బిలాస్ పూర్ ఎక్స్ ప్రెస్ (17482, 17481) రైళ్లకు కొవ్వూరు రైల్వేస్టేషన్ లో ఆగేవిధంగా పునరుద్దరించాలని హోంమంత్రి అందజేసిన లేఖలో పేర్కొన్నారు. హోంమంత్రి విజ్ఞప్తి పై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. కొవ్వూరు రైల్వే స్టేషన్లో రైళ్లు నిలుపుదల పునరుద్ధరణకు తన వంతు కృషి చేస్తానని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. -
వారసులకు ‘హోం’ సిక్
హోం మినిస్టర్... ముఖ్యమంత్రి తర్వాత అంతటి ప్రాధాన్యత ఉన్న పదవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కీలక నేతలకే హోం మినిస్టర్‌గా అవకాశం దక్కింది. అప్పట్లో ఆ పదవి చేపట్టిన వారిలో దాదాపు తెలంగాణకు చెందిన వారే అత్యధికులు. కాలక్రమేణా ప్రాధాన్యతల్లో మార్పుల నేపథ్యంలో లా అండ్ ఆర్డర్ విభాగం ముఖ్యమంత్రి వద్ద ఉంటున్నప్పటికీ ఆ పోస్టు పవర్ మాత్రం తగ్గలేదు. అలాంటి కీలక పదవి చేపట్టి విజయవంతంగా ప్రస్థానం సాగించినప్పటికీ... వారి తర్వాతి తరం మాత్రం రాజకీయంగా ఒడిదుడుకుల్లోనే కొనసాగుతోంది. గత మూడు దశాబ్దాల చరిత్ర పరిశీలిస్తే హోం మంత్రులుగా పనిచేసిన నేతల కుటుంబాల నుంచి వచ్చిన తర్వాత తరం ఇంకా రాజకీయంగా ఓనమాలు నేర్చే స్థాయిలోనే ఉంది. ♦ ఎన్టీఆర్ మంత్రివర్గంలో హోంమంత్రిగా పట్లోళ్ల ఇంద్రారెడ్డి పనిచేశారు. టీడీపీ నుంచి బయటికొచ్చిన తర్వాత రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన భార్య పి.సబితారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో చేరారు. తొలిదఫాలో గనులు, భూగర్భ వనరులు, జౌళి శాఖ మంత్రిగా... రెండోసారి వైఎస్ సీఎం అయ్యాక హోం మంత్రిగా కొనసాగారు. 2018 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 2014 పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయనకు మరో అవకాశం రాలేదు. ♦ ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ మంత్రివర్గంలో కుందూరు జానారెడ్డి హోంమంత్రిగా పనిచేశారు. ఆయన తనయుడు రఘువీర్‌రెడ్డి గత ఎన్నికల్లో టికెట్ ఆశించినా అవకాశం దక్కలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో జానారెడ్డి చిన్నకుమారుడు జయవీర్‌రెడ్డి కాంగ్రెస్ తరఫున నాగార్జునసాగర్ అసెంబ్లీ బరిలో నిలిచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ♦ ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు మంత్రివర్గంలో హోం మంత్రిగా ఎలిమినేటి మాధవరెడ్డి కొంతకాలం కొనసాగారు. ఆ తర్వాత పోర్ట్ పోలియో మారి పంచాయతీరాజ్ మంత్రిగా వ్యవహరించారు. మందుపాతర పేలిన ఘటనలో ఆయన మరణించడంతో భార్య ఉమా మాధవరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె కూడా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది కొంతకాలం మంత్రిగా పనిచేశారు. కానీ ఆ తర్వాత ఆ కుటుంబం నుంచి చట్టసభల్లోకి వారసులెవరూ రాలేదు. కానీ ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి స్థానిక సంస్థల్లోకి ఎంట్రీ ఇచ్చి యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. ♦ చంద్రబాబు మంత్రివర్గంలో చక్రం తిప్పిన నేత తూళ్ల దేవేందర్‌గౌడ్. బాబు మంత్రివర్గంలో హోం మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు వీరేందర్‌గౌడ్ ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుంచి, చేవెళ్ల పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా, ఆయనకు అవకాశం దక్కలేదు. ♦ కేసీఆర్ మంత్రివర్గంలో అనూహ్యంగా చోటు దక్కించుకుని రెవెన్యూ శాఖ మంత్రిగా, హోంమంత్రిగా కొనసాగుతున్న మహమూద్ అలీ కూడా తనయుడు ఆజాం అలీని ప్రత్యక్ష రాజకీయాల్లో దింపే ప్రయత్నం చేశారు. మలక్‌పేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలో దింపేందుకు ప్రయత్నించినప్పటికీ ఆయన ప్రయత్నాలు విఫలమైనట్లు సమాచారం. ♦ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కేసీఆర్ తొలి మంత్రివర్గంలో హోంమంత్రిగా నాయిని నర్సింహారెడ్డి కొనసాగారు. ఆయన 2018 ఎన్నికల్లో అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని ముషీరాబాద్ అసెంబ్లీ సెగ్మెంటు నుంచి బరిలో నిలిపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసి భంగపడ్డారు. -చిలుకూరి అయ్యప్ప -
అది నాకు సెంటిమెంట్.. ఆయన వస్తే గెలుపు తథ్యం: మంత్రి పువ్వాడ
సాక్షి, ఖమ్మం: తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మైనార్టీల అభివృద్ధి ఎంతగానో జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు అధికారంలో ఉండి మైనార్టీలకు ఎటువంటి పథకాలు అందించలేదని విమర్శించారు. ఈ మేరకు ముస్లిం, మైనార్టీ సభలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. ముస్లింల కోసం సీఎం రూ. 32 వందల కోట్లు ఖర్చు చేశారని.. అదే ముస్లింల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రూ. 50 లక్షలు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. తెలంగాణలో ముస్లిం పిల్లలకు సీఎం కేసీఆర్ మంచి విద్యను అందిస్తున్నారని తెలిపారు. పేద వాడి కోసం పని చేసిన సీఎం ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని అన్నారు. షాదీముబారక్‌తో ముస్లిం మహిళలకు ఆసరాగా నిలిచారన్నారు. ‘నా తమ్ముడు అజయ్, ఆయన 10 సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్నాడు. నా తమ్ముడికి తోడుగా మీరంతా ఉండాలి. సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాకు ఎన్నో నిధులు ఇచ్చారు. హైదరాబాద్ వ్యక్తులు వచ్చి ఇక్కడి అమ్మాయిలను పెళ్లి చేసుకుని వెళ్తున్నారు. నేను తెలంగాణ మొత్తం తిరుగుతున్నా, అన్నింటి కంటే ఎక్కువగా ఖమ్మం అభివృద్ధి చెందింది. పువ్వాడ అజయ్ సీఎం కేసీఆర్ దగ్గరకు వచ్చిన ప్రతిసారీ ఖమ్మం అభివృద్ధికి కావాల్సిన నిధులు అడుగుతుంటారు. కాంగ్రెస్ పార్టీవి మొత్తం మాటలే. ముసలి పార్టీని పట్టించుకునే వాడు లేడు. వీల్ చైర్లో తిరిగే ముసలి వాడు మీకు కావాలా? యువకుడైన పువ్వాడ అజయ్ కావాలా నిర్ణయించుకోండి. చదవండి: తెలంగాణను ఏడిపించేదే కాంగ్రెస్ పార్టీ: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మంచి మంత్రి పువ్వాడ అజయ్. ఖమ్మం నియోజకవర్గం పట్ల అతనికి ఉన్న నిబద్దత ఇంకా ఎవరికి లేదు. ముస్లిం, క్రిస్టియన్లు ఇరువురు అన్నా దమ్ములు వారి పండుగ మేము, మా పండుగ వారు జరుపుకుంటారు. అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు మీ ఓటు వృథా చేయకుండా కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించండి. అజయ్ అన్నకు మరోసారి అవకాశం ఇవ్వండి. పోయినసారి కంటే భారీ మెజార్టీతో నా తమ్ముడు పువ్వాడ అజయ్‌ను గెలిపించండి’ అని హోంమంత్రి కోరారు. 2018 నవంబర్‌లో ఖమ్మం ప్రాంతంలో పెట్టిన మైనార్టీ సభ తనకు సెంటిమెంట్ సభ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికల్లో హోం మంత్రి మహమూద్ అలీ వచ్చి ప్రచారం చేస్తే 16కు 16 సీట్లు గెలుచుకున్నామని తెలిపారు. ఆయన వస్తే గెలుపు తథ్యమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి డిప్యూటీ సీఎం పదవి ముస్లింలకు సీఎం కేసీఆర్ కేటాయించారని అన్నారు. దీన్ని బట్టి ఆయనకు మైనార్టీల పట్ల ఉన్న నిబద్దత అర్థమవుతోందన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ స్థానం కేసీఆర్ గుండెల్లో పదిలలంగా ఉంటుందన్నారు. -
కుల గణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను పెంచారు
ముజఫర్‌పూర్: బిహార్‌లోని నితీశ్ కుమార్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన కులగణనలో ముస్లింలు, యాదవుల సంఖ్యను ఉద్దేశపూ ర్వకంగానే ఎక్కువ చేసి చూపించిందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. మొత్తమ్మీద వెనుకబడిన కులాల వారికి మొండిచేయి చూపిందని చెప్పారు. ముజఫర్‌పూర్ జిల్లా పటాహిలో ఆదివారం జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. ముస్లింల పట్ల అనుసరిస్తున్న బుజ్జగింపు వైఖరి ఫలితంగా నేపాల్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర సమస్యలు తప్పవని నితీశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటువంటి రాజకీయాలకు తక్షణమే ముగింపు పలకాలని కోరారు. ‘నితీశ్ కుమార్ ప్రధాని పీఠంపై ఆశలు వదులుకోవాలి. అది ఎన్నటికీ జరగ దు. ఇండియా కూటమికి కనీసం ఆయన కన్వీనర్ అయినా కాలేకపో యారు. బిహార్‌లో గూండారాజ్యాన్ని తిరిగి రావడానికి ఆయనే బాధ్యుడు’అని ఆరోపించారు. గతంలో కులగణనకు ఆదేశాలు ఇచ్చిన సమయంలో రాష్ట్రంలో నితీశ్ కుమార్ ప్రభుత్వంలో బీజేపీ భాగంగా ఉన్నట్లు ఆయన గుర్తు చేశారు. ఓబీసీలను ఎన్నడూ పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ సైతం ఇప్పుడు అధికారంలోకి వస్తే దేశవ్యాప్త కులగణన చేపడతానంటోందని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో అధికారం పంచుకుంటున్న జేడీయూ, ఆర్జేడీలు ప్రతిపక్ష ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నాయంటూ అమిత్ షా, ఈ కూటమి ఏకైక ఎజెండా ప్రధాని మోదీని వ్యతిరేకించడమేనన్నారు. ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ఈ కూటమి పార్టీలు వ్యతిరేకించాయని కూడా మంత్రి చెప్పారు. కేంద్ర కేబినెట్లో 27 మంది మంత్రులు, అంటే 35 శాతం మంది వెనుకబడిన కులాలకు చెందిన వారేనన్నారు. ప్రధాని మోదీ హయాంలోనే ఓబీసీల జాతీయ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించామన్నారు. -
Police Commemoration Day: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాద ఘటనల్లో పదేళ్లలో 65% తగ్గుదల
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో విద్రోహ చర్యలు గత దశాబ్ద కాలంలో 65 శాతం మేర తగ్గుముఖం పట్టాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని మూడు హాట్ స్పాట్లుగా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, జమ్మూకశ్మీర్‌ల్లో పరిస్థితులు ప్రశాంతంగా మారాయన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావడంతోపాటు ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తుండడమే దీనికి కారణమన్నారు. శనివారం నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి అమిత్ షా మాట్లాడారు. పోలీస్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేసి పోలీసు బలగాలను తీవ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 150 ఏళ్లనాటి క్రిమినల్ జస్టిస్ విధానాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం పార్లమెంట్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో 36,250 మంది పోలీసులు ప్రాణాలర్పించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు 188 మంది పోలీసులు విధుల్లో ఉండగా అమరులయ్యారు. పోలీసు స్మారకం కేవలం చిహ్నం కాదు, దేశ నిర్మాణం కోసం పోలీసు సిబ్బంది చేసిన త్యాగం, అంకితభావానికి గుర్తింపు’అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతర్గత రక్షణతోపాటు దేశ సరిహద్దుల భద్రతకు సైతం సమర్థమంతమైన పోలీసు విధానం అవసరం ఎంతో ఉందని చెప్పారు. -
Chhattisgarh Assembly Election 2023: కాంగ్రెస్ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోంది
జగదల్పూర్: కాంగ్రెస్ పార్టీ నక్సలిజాన్ని ప్రోత్సహిస్తోందని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రభుత్వ తొమ్మిదేళ్లపాలనలో వామపక్ష తీవ్రవాద ఘటనలు 52 శాతం మేర తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. ఛత్తీస్‌గఢ్ సీఎం భగేల్ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌కు ఏటీఎంగా మార్చారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలన స్కాముల ప్రభుత్వంగా తయారైందని పేర్కొన్నారు. జగదల్పూర్, కొండగావ్‌లలో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో అమిత్ షా మాట్లాడారు. ‘రాష్ట్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అర్ధించటానికే మీ ముందుకు వచ్చా. స్కాములకు పాల్పడటం ద్వారా గిరిజనుల డబ్బును దోచుకున్నవారిని తలకిందులుగా వేలాడదీస్తాం’అని ఆయన అన్నారు. బీజేపీకే ఓటు వేయాలని ప్రజలను కోరిన అమిత్ షా, ‘మీ ముందు రెండు అవకాశాలున్నాయి..ఒకటి నక్సలిజాన్ని ప్రోత్సహించే కాంగ్రెస్, మరోవైపు, ఈ బెడదను నిర్మూలించే బీజేపీ. కోట్లాది రూపాయల అవినీతి సొమ్మును ఢిల్లీ దర్బార్‌కు పంపే కాంగ్రెస్.. కోట్లాది మంది పేదలకు గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్లు, తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, రేషన్, ఇళ్లు అందజేస్తున్న బీజేపీ. ఈ రెండింట్లో మీరు ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటారు?’అని ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్ ప్రజలు దీపావళి పండుగను ఈసారి మూడుసార్లు జరుపుకుంటారంటూ... మొదటిది దీపావళి రోజున, రెండోది డిసెంబర్ 3న రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక, మూడోది జనవరిలో అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తయ్యాక (శ్రీరాముడి మాతామహుల నివాసం ఛత్తీస్‌గఢ్ అని ప్రజల విశ్వాసం)అని అమిత్ షా చెప్పారు. ‘రాష్ట్రంలో బీజేపీకి అధికారమిస్తే, ఈ బెడద నుంచి పూర్తిగా విముక్తి కలి్పస్తాం. మోదీ ప్రభుత్వ పాలనలో 9 ఏళ్ల కాలంలో నక్సల్ సంబంధ హింస 52% తగ్గగా నక్సల్ ప్రభావిత జిల్లాల సంఖ్య 62% మేర క్షీణించింది’అని ఆయన వివరించారు. ఈ ప్రాంతంలో జరిగే తీవ్రవాద సంబంధ హింసాత్మక ఘటనల్లో ప్రాణాలు కోల్పోయే పోలీసులైనా, పౌరులైనా, నక్సలైట్లయినా అందరూ గిరిజనులేనని ఆయన చెప్పారు. -
‘సెప్టెంబర్ 17’: బీజేపీ Vs కాంగ్రెస్.. తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు
హైదరాబాద్: అత్యంత కీలక రోజుగా మారిన ‘సెప్టెంబర్ 17’ నేపథ్యంలో నగర పోలీసు విభాగం అత్యంత అప్రమత్తమైంది. ఇప్పటికే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల నేపథ్యంలో శనివారం నుంచి ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిటీలోనే ఉన్నారు. ఆదివారం బోయిన్‌పల్లిలో జరిగే కార్యక్రమానికి వీరు హాజరవుతారు. మరోపక్క తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం నేపథ్యంలో పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమానికి ప్రముఖులు హాజరవుతారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే తెలంగాణ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాల నేపథ్యంలో పోలీసు విభాగం గతానికి భిన్నంగా పటిష్ట బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అటు పరేడ్ గ్రౌండ్, ఇటు పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా తీసుకుంటున్న చర్యలను నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్, నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌ను శనివారం నాటికే పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. శాంతి భద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాలు బందోబస్తులో పాల్గొంటున్నాయి. మొత్తమ్మీద దాదాపు 2500 మంది సిబ్బందిని రెండు చోట్ల మోహరిస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు దృష్టిలో పెట్టుకుని నగర వాసులు సహకరించాలని, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లు, జేబీఎస్‌లకు వెళ్లే ప్రయాణికులు నిర్ణీత సమయానికి కంటే ముందే బయలుదేరాలని పోలీసులు కోరుతున్నారు. ట్రాఫిక్ మళ్లింపులు ఇలా.. పబ్లిక్ గార్డెన్స్ కేంద్రంగా .. ►ఎంజే మార్కెట్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్ నుంచి ఏక్ మినార్ వైపు మళ్లిస్తారు. ► నాపంల్లి రైల్వే స్టేషన్ నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను ఛాపెల్ రోడ్ టీ జంక్షన్ నుంచి మళ్లిస్తారు. ►నిరంకారి నుంచి ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ వైపు వచ్చే వాహనాలను టెలిఫోన్ భవన్ వైపు పంపిస్తారు. ► బషీర్‌బాగ్ జంక్షన్, ఇక్బాల్ మినార్, ఏఆర్ పెట్రోల్ పంప్, ఆదర్శ్ నగర్ల వైపు నుంచి పబ్లిక్ గార్డెన్స్ వైపు వచ్చే వాహనాలను వివిధ మార్గాల్లో పంపిస్తారు. పరేడ్ గ్రౌండ్స్ కేంద్రంగా.. ►ప్లాజా ఎక్స్ రోడ్ నుంచి ఎస్బీఐ చౌరస్తా మధ్య మార్గాన్ని పూర్తిగా మూసేస్తారు. వైఎంసీఏ ఫ్లైఓవర్ పై నుంచి మాత్రమే ట్రాఫిక్ అనుమతిస్తారు. ► బోయిన్పల్లి–తాడ్‌బండ్ వైపు నుంచి వచ్చే వాహనాలను సీటీఓ వైపు మళ్ళిస్తారు. కార్ఖానా–జేబీఎస్ వైపు నుంచి వచ్చే వాహనాలను స్వీకార్ ఉపకార్ నుంచి టివోలీ వైపు పంపిస్తారు. ► ఆర్పీ రోడ్ నుంచి ఎస్బీహెచ్ చౌరస్తా వైపు వచ్చే ట్రాఫిక్ ప్యాట్నీ నుంచి ప్యారడైజ్ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు చూపించాలి... ఆదివారం నగరం వివిధ ప్రాంతాల్లో కేంద్రాల్లో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష జరగనుంది. ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉన్న చోట్లా ఈ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు చూపించిన వారిని బారికేడింగ్ పాయింట్లు దాటి ముందుకు పంపాలని ఆదేశించారు. -
చొరబాట్లు ఆగాలంటే మోదీకే ఓటేయండి
ఝంఝార్పూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరోసారి అధికారం ఇవ్వకుంటే బిహార్‌లోని సరిహద్దులకు సమీపంలోని ప్రాంతాలు అక్రమ చొరబాటుదార్లతో నిండిపోతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెచ్చరించారు. బిహార్‌లో ఝంఝార్పూర్ పార్లమెంటరీ నియోజకవర్గంలో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. బిహార్‌లోని ఈ ప్రాంతం నేపాల్, బంగ్లాదేశ్‌ల సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుతోపాటు వచ్చే ఏడాది జనవరికల్లా అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేయనున్న ప్రధాని మోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు. లాలూ– నితీశ్ ద్వయం మళ్లీ అధికారంలోకి వచ్చినా, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టలేకపోయినా ఈ ప్రాంతం మొత్తం అక్రమ చొరబాటుదార్లతో కిక్కిరిసి పోవడం ఖాయమన్నారు. ఫలితంగా బిహార్‌ను అనేక సమస్యలు చుట్టుముడతాయని ఆయన హెచ్చరించారు. చొరబాటుదార్లతో ఈ ప్రాంతం నిండిపోవాలని మీరు అనుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే 2024 లోనూ బిహార్‌లోని మొత్తం 40 సీట్లను బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. యూపీఏ బదులు..ఇండియా ఎందుకంటే.. యూపీఏ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణంతో సంబంధాలున్నాయి కాబట్టే అప్పటి పార్టీలన్నీ కలిసి ఈసారి ఇండియా అనే కొత్త పేరు పెట్టుకున్నాయని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ కూటమి నేతలు సనాతన ధర్మాన్ని చులకన చేసి మాట్లాడటాన్ని ఆయన తప్పుపట్టారు. ప్రధాని పీఠంపై ఆశలు పెట్టుకున్న నితీశ్ కుమార్ గతంలో లాలూ ప్రసాద్ పాల్పడిన కుంభకోణాలను చూసీచూడనట్లుగా వదిలేస్తున్నారని ఆరోపించారు. అయితే, ప్రధాని పదవి ఖాళీగా లేదన్న విషయం నితీశ్ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. లాలూతో నితీశ్ పొత్తు నీళ్లు, చమురు కలయిక చందంగా ఉంటుందన్నారు. నీళ్లతో చమురు కలియకపోగా నీళ్లన్నిటినీ కలుషితం చేస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారు. ప్రధాని కావడమెలాగని నితీశ్ ఆలోచిస్తుండగా లాలూ మాత్రం తన కొడుకు, డిప్యూటీ సీఎం తేజస్వీని సీఎంగా చూడాలని ప్రణాళికలు వేస్తున్నారని చెప్పారు. సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కలిసి ప్రభుత్వ స్కూళ్లకు సెలవులు తగ్గించడం వంటి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నా రని ఆరోపించారు. రాష్ట్రంలోని సంకీర్ణ కూటమిలోని కాంగ్రెస్ కూడా ఇదే వైఖరితో ఉందన్నారు. కృష్ణాష్టమి, రక్షాబంధన్ సందర్భంగా సెలవులను రద్దు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసుకునేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చిన బిహార్ ప్రజలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు సమ్మె చేయడంతో ఏడాదిలో అవసరమైనన్ని రోజులు తరగతులు నిర్వహించాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన కొత్త క్యాలెండర్‌ను విద్యాశాఖ ఉపసంహరించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
‘వారసత్వ రాజకీయాలు విషతుల్యం’
భోపాల్: వారసత్వ రాజకీయాలు విషంతో సమానమని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. వీటివల్ల ఒకే కుటుంబం చెప్పుచేతల్లో పార్టీ, ప్రభుత్వం ఉంటాయన్నారు. కాంగ్రెస్, డీఎంకే, శివసేన(ఉద్ధవ్)వర్గం కుటుంబ రాజకీయాలను నడిపిస్తున్నాయని ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కుల ఉద్యమాలను ప్రోత్సహిస్తోందన్నారు. వీటివల్లే 2018లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పారు. -
మీ మౌనం వల్లనే మణిపూర్‌లో ఘోరం
సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో కుకి మహిళలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హేయమైన ఘటనలు, బృంద హింసపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సామా జిక మాధ్యమ వేదిక ట్విట్టర్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ‘మహిళలు, పిల్లలను తాలిబాన్లు అగౌరవ పరుస్తున్నపుడు భారతీయులుగా మనందరం ఆందోళన చెందాం. కానీ ప్రస్తుతం మన సొంత దేశంలోనే మెయితీ గుంపులు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించి, లైంగికంగా వేధింపులకు గురి చేయడం అత్యంత హేయం. మనసు కలిచి వేసే ఇలాంటి అనాగరిక ఘటనలు నయా భారత్‌లో సాధారణంగా మారు తున్నాయి. ప్రధాని, హోంమంత్రి, కేంద్ర ప్రభు త్వం మౌనముద్ర వహించడంతో మణి పూర్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించి భయాన కమైన హింసకు దారితీసింది. మణిపూర్ మంటలను ఆర్పేందుకు ప్రధాని, హోంమంత్రి అన్ని అంశాలను పక్కన పెట్టి శక్తిని, సమయాన్ని వెచ్చించాలి.. నాగరిక సమాజంలో హింసకు తావులేదనే సందేశాన్ని పంపాలి’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. -
వరదలకు గుజరాత్ అతలాకుతలం
అహ్మదాబాద్: గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లతున్నాయి. వరదలతో అతలాకుతల మవుతున్న పలు గ్రామాలతో ఇతర ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. వల్సాద్ ప్రాంతలోని దర్మపూర్లో గత 24 గంటల్లో ఏకంగా 23.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరదల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడడానికి జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంలో జామ్‌నగర్‌లో వరద పరిస్థితి భయంకరంగా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే గత రెండు రోజుల్లో 11 మంది మరణించారు. సురేంద్ర నగర్ జిల్లాలో పలు గ్రామాలకు వెళ్లే రహదారులు ధ్వంసం కావడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. తాజా వరద పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట ముఖ్యమంత్రి భూపేంద్రతో ఫోన్లో మాట్లాడారు. రాష్ట్రంలో పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆపదలో ఉన్న ప్రజలకి సాధ్యమైనంతవరకు సాయం అందిస్తోందని షా ట్వీట్‌చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు స్థానియ యంత్రాంగం కూడా వరద ప్రాంతాల్లో సహాయ చర్యల్లో ముగినిపోయిందని అమిత్ తెలిపారు. -
రాహుల్ ప్రధాని అయితే స్కాములే గతి
ఉదయ్‌పూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే దేశం కుంభకోణాలు, అవినీతిమయంగా మారుతుందని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. మళ్లీ నరేంద్ర మోదీయే ప్రధానమంత్రి అయితే మోసగాళ్లంతా కటకటాల వెనక్కి వెళ్తారని పేర్కొన్నారు. శుక్రవారం ఉదయ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. పట్నాలో ఇటీవల జరిగిన ప్రతిపక్ష నేతల భేటీపై ఆయన..‘అక్కడ సమావేశమైన వారంతా అవినీతితో సంబంధం ఉన్నవాళ్లే. వారి ఆరాటమంతా తమ కుమారుల భవిష్యత్తు కోసమే తప్ప ప్రజలకు మంచి చేయడం కాదు’అని విమర్శించారు. ‘రాహుల్ గాం«దీని ప్రధానమంత్రిని చేయడమే సోనియా గాంధీ లక్ష్యం. లాలూ ప్రసాద్ యాదవ్ లక్ష్యం తేజస్వీయాదవ్‌ను ప్రధానిని చేయడం, తన మేనల్లుడు అభిషేక్‌ను సీఎంను చేయడమే మమతా బెనర్జీ లక్ష్యం. కొడుకు వైభవ్ గెహ్లాట్‌ను సీఎంను చేయడం అశోక్ గెహ్లాట్ లక్ష్యం’అని ఆయన ఎద్దేవా చేశారు. రాజస్తాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. గత ఏడాది ఉదయ్‌పూర్‌లో జరిగిన కన్హయ్య లాల్ హత్య కేసులో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసి ఉంటే, ఇప్పటికే నిందితులకు ఉరిశిక్ష పడి ఉండేదని పేర్కొన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్న సీఎం గహ్లోత్ వల్లే నిందితులకు శిక్ష పడటం ఆలస్యమవుతోందని ఆరోపించారు. సస్పెండైన బీజేపీ నేత నుపుర్ శర్మకు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ కన్హయ్య లాల్ అనే దర్జీని గత ఏడాది ఇద్దరు దుండగులు పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో కన్హయ్యలాల్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ కలి్పంచలేకపోయిందని మంత్రి అన్నారు. -
డ్రగ్స్ రహిత భారత్’ను సాధిస్తాం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశం నుంచి డ్రగ్స్ భూతాన్ని తరిమేస్తుందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశం గుండా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికడుతుందని స్పష్టం చేశారు. సోమవారం ‘ఇంటర్నేషనల్ డే ఎగెనెస్ట్ డ్రగ్ అబ్యూజ్’సందర్భంగా అమిత్ షా ఈ మేరకు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఇతర శాఖలు, విభాగాల సమన్వయంతో తమ హోం శాఖ అమలు చేస్తున్న నార్కోటిక్స్ వ్యతిరేక జీరో–టాలరెన్స్ విధానం విజయవంతమైందని, సానుకూల ఫలితాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని చెప్పారు. డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంలో విజయం సాధించేవరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆ వీడియోల అమిత్ షా స్పష్టం చేశారు. 201–2022 సంవత్సరాల మధ్యలో సమష్టి చర్యల ఫలితంగా రూ.22 వేల కోట్ల మాదకద్రవ్యాలను సీజ్ చేశామన్నారు. ఇవి 2006–13 సంవత్సరాల మధ్య స్వాధీనం చేసుకున్న రూ.768 కోట్ల డ్రగ్స్ కంటే 30 రెట్లు ఎక్కువని వివరించారు. 2006–13 మధ్యలో డ్రగ్స్ విక్రేతలపై 1,257 కేసులు నమోదు కాగా, 2014–22 సంవత్సరాల్లో 3,544 కేసులు పెట్టినట్లు చెప్పారు. ఇవి 181 శాతం అధికమన్నారు. వీటితోపాటు 2022 జూన్ నుంచి ఇప్పటి వరకు 600 టన్నుల డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ఉమ్మడిగా సాగించిన కృషి వల్లనే సాధ్యమైందని అన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సహా అన్ని విభాగాలు డ్రగ్స్‌పై పోరాటాన్ని కొనసాగిస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, తమ కుటుంబాలను ఈ మహమ్మారికి దూరంగా ఉంచాలని ఆయన పిలుపునిచ్చారు. -
ప్రధానికి మణిపూర్‌లో పరిస్థితిని వివరించిన అమిత్ షా
న్యూఢిల్లీ: నెలరోజులకు పైగా మణిపూర్‌లో చెలరేగుతున్న అల్లర్ల గురించి ప్రధాని నరేంద్ర మోదీకి నివేదించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమెరికా ఈజిప్టు పర్యటనను ముగించుకుని భారత్ చేరుకొనున్న నేపథ్యంలో ఒక రోజు ముందే మణిపూర్ ముఖ్యమంత్రి బైరెన్ సింగ్ అమిత్ షాను కలిసి మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. ప్రస్తుతానికి ఈశాన్య రాష్ట్రంలో ఉద్రిక్తత కొంతవరకు సద్దుమణిగిందని, అతి త్వరలోనే పరిస్థితి పూర్తిగా యధాస్థితికి చేరుకుంటుందని ఆయనన్నారు. మెయితీ, కుకీ తెగల మధ్య అడపాదడపా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో శాంతిని నెలకొల్పడానికి మిత్రపక్షాలు, పౌరసంస్థలు, పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు బైరెన్ సింగ్. విదేశీ పర్యటన ముగించుకుని భారత్ చేరుకున్న తర్వాత ప్రధానికి స్వయంగా హోంమంత్రి మణిపూర్‌లో పరిస్థితిని, అక్కడ శాంతిని నెలకొల్పే విషయమై ఈ నెల 18ని నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నినదించిన సమయానుకూల కార్యాచరణ గురించి ఆయనకు వివరించారు. అనంతరం హోంమంత్రి మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి ఎప్పటికప్పుడు మణిపూర్‌లో పరిస్థితిని సమీక్షిస్తున్నారని.. కేంద్రం చొరవతోనే అక్కడ ఇప్పుడు కొంత ప్రశాంతత నెలకొందని అన్నారు. అల్లర్లు జరిగిన వెంటనే స్పందించి అక్కడ సుమారు 32 వేల మంది సైనిక బలగాలను మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఇది కూడా చదవండి: కర్ణాటకలో "గృహ జ్యోతి" ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం -
మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపించాలి
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో అఖిలపక్ష భేటీ నిర్వహించింది. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, డీఎంకే, ఏడీఎంకే, బీజేడీ, ఆప్, ఆర్జేడీ, శివసేనతోపాటు వామపక్షాల పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నిత్యానంద్ రాయ్, అజయ్ కుమార్ మిశ్రా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలను హోం మంత్రి అమిత్ షా వారికి వివరించారు. ప్రధాని మోదీ స్వయంగా ప్రతిరోజూ అక్కడి పరిస్థితులపై వాకబు చేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు వెంటనే అఖిలపక్ష బృందాన్ని పంపించాలని కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీల నేతలు కోరారు. శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, సీఎం బిరెన్ సింగ్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్పీ కోరింది. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం చేయగలిగిందంతా చేస్తోందని చెప్పారు. అఖిలపక్ష బృందాన్ని పంపించడంపై అమిత్ షా ఎటువంటి ప్రకటన చేయలేదని అనంతరం బీజేపీ మణిపూర్ ఇన్చార్జి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు. ప్రభుత్వం మణిపూర్‌ను మరో కశ్మీర్‌లాగా మార్చాలనుకుంటున్నట్లుందని అక్కడి పరిస్థితులపై టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్ మీడియాతో వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో మంత్రి గోదాముకు నిప్పు మణిపూర్‌లో నిరసనకారుల గుంపు మరోసారి రెచ్చిపోయింది. శుక్రవారం రాత్రి తూర్పు ఇంఫాల్ జిల్లా చింగారెల్‌లోని మంత్రి ఎల్.సుసింద్రోకు చెందిన ప్రైవేట్ గోదాముకు నిప్పుపెట్టడంతో అది కాలిబూడిదయింది. అనంతరం ఖురాయ్‌లోని మంత్రి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై బాష్పవాయువును ప్రయోగించామన్నారు. -
విదేశీ గడ్డపై స్వదేశాన్ని విమర్శించడం తగదు: అమిత్ షా
పటన్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సమయంలో దేశాన్ని విమర్శించడం, అంతర్గత రాజకీయాలను గురించి మాట్లాడటాన్ని హోం మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఇటువంటి వాటిపై రాహుల్ తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని, దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్‌లోని పటన్ జిల్లా సిద్ధ్‌పూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ‘దేశభక్తి ఉన్న ఎవరైనా భారత రాజకీయాల గురించి భారత్‌లోనే మాట్లాడాలి. ఏ రాజకీయ పార్టీ నేత అయినా సరే విదేశాల్లో ఉండగా దేశాన్ని విమర్శించడం, దేశ రాజకీయాలపై చర్చించడం సరికాదు. రాహుల్ బాబా.. దేశ ప్రజలు ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి’అని ఆయన పేర్కొన్నారు. ‘వేసవి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు రాహుల్ బాబా విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నారు. అక్కడున్న సమయంలోనూ దేశాన్ని విమర్శిస్తున్నారు. ఇది సరికాదన్న విషయాన్ని తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని రాహుల్‌కు సలహా ఇస్తున్నా’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నా కాంగ్రెస్ మాత్రం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు ఆపలేదని విమర్శించారు. -
డీజీపీ బదిలీ.. మణిపూర్ అల్లర్ల వెనుక ఎవ్వరున్నా వదలం: అమిత్ షా
ఇంఫాల్: మే 3న దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో ఇక్కడ శాంతిని నెలకొల్పేందుకు స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. మణిపూర్‌లో మూడు రోజుల పర్యటన ముగిసిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన అల్లర్లకు కారణమైన వారిని వదలబోయేది లేదని అన్నారు. అలాగే విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో అల్లర్లకు కారణమైన వారిని పట్టుకునేందుకు ఒక కమిటీని, ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి ఒక కమిటీని, శాంతిని నెలకొల్పేందుకు మరో కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలకు ధైర్యం చెప్పి... అమిత్ షా అల్లర్ల నేపథ్యంలో భయబ్రాంతులకు గురైన ప్రజలకు ధైర్యం చెప్పారు. చెప్పుడు మాటలను గానీ, ఎటువంటి వదంతులను గానీ నమ్మవద్దని అన్నారు. ఈ సందర్బంగా మెయితేయి, కుకీ వర్గాలవారు తొందరపడొద్దన్నారు. ప్రజాసంఘాల వారు కూడా సంయమనం పాటించాలని కోరారు. డీజీపీ బదిలీ... ప్రస్తుత డీజీపీ పి.దౌన్గల్‌ను హోంశాఖకు బదిలీ చేసి ఆయన స్థానంలో CRPF ఐజీగా వ్యవహరించిన త్రిపుర ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన రాజీవ్ సింగ్ ను నూతన డీజీపీగా నియమించారు. ఇక్కడ ఉన్న గిరిజన తెగలకు ఎటువంటి సంబంధం లేని తటస్థ వర్గానికి చెందిన వారిని డీజీపీగా నియమిస్తే శాంతిభద్రతలను తొందరగా అదుపులోకి తేవచ్చనే ఉద్దేశ్యంతోనే డీజీపీని బదిలీ చేశారు. అల్లర్లకు కారణమైనవారిని వదిలే ప్రసక్తే లేదు... హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థాయి కలిగిన విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని వేసి అల్లర్ల వెనుక ప్రధాన సూత్రధారులను కనుగొనేందుకు కేంద్ర ప్రభుత్వమే దర్యాప్తు చేస్తుందన్నారు హోంమంత్రి. ఎవరి దగ్గరైనా ఆయుధాలు ఉన్నట్లయితే వారు వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలన్నారు.లేదంటే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కొంటారని హెచ్చరించారు. శాంతిని నెలకొల్పేందుకు కమిటీ... అలాగే మణిపూర్ ప్రజల్లో భయాందోళనలను తొలగించి శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అనసూయ ఉయికే నేతృత్వంలో మరో కమిటీని నియమించనున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, మెయితేయి, కుకీ వర్గాల ప్రతినిధులతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారన్నారు. చదవండి: మణిపూర్‌లో అమిత్ షా పర్యటన.. వారికి రూ.10 లక్షల నష్టపరిహారం -
అనంతగిరి గుట్టలో షాకింగ్ విషయాలు
-
'బ్రిటిష్-పాకిస్తానీ మగవాళ్లు ఇంగ్లీష్ అమ్మాయిలను దారుణంగా..'
లండన్: బ్రిటన్ హోంమంత్రి సుయెల్లా బ్రవర్మన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బ్రిటిష్-పాకిస్తానీ పురుషులే దేశంలో తీవ్ర నేరాల్లో భాగం అవుతున్నారని ఆమె ఆరోపించారు. ఇంగ్లీష్ మహిళలను వేధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం సహా డ్రగ్స్, హాని తలపెట్టే పనుల్లో పాక్ సంతతికి చెందిన బ్రిటన్ పురుషులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్లు, ఇంగ్లీష్ యువతులను లక్ష్యంగా చేసుకుని వీరు వికృత చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. 'మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే.. సంరక్షణ కేంద్రాలు, జీవితంలో సవాళ్లను ఎదుర్కొంటున్న బలహీనమైన తెల్ల ఇంగ్లీష్ అమ్మాయిలు, పిల్లలను బ్రిటిష్-పాకిస్తానీ పురుషుల ముఠాల వేధిస్తున్నాయి. వారిని వెంబడించి అత్యాచారం చేయడం, మత్తుపదార్థాలు ఇవ్వడం, హాని చేయడం వంటి క్రూర చర్యలకు పాల్పడుతున్నాయి. నిందితుల్లో సంరక్షణ కేంద్రాల్లో పని చేసేవారు ఉంటున్నారు. మరికొందరికి పెద్ద నెట్వర్క్ ఉంది. చాలా మంది నేరస్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు ఈ నేరస్థులకు భయం కల్గించేలా చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయనో లేక భయంతోనో, జాత్యహంకారం, మతోన్మాదం అనుకుంటారనో అధికారులు వీరిని గుడ్డిగా వదిలేస్తున్నారు.' అని బ్రవర్న్ అన్నారు. Home Secretary @SuellaBraverman says 'vulnerable white girls are being targeted by British Pakistani grooming gangs', and people have been 'turning a blind eye out of political correctness'.#Ridge https://t.co/ZoMhCmTrtv 📺 Sky 501, Virgin 602, Freeview 233 and YouTube pic.twitter.com/vO2KSs6vEX — Sophy Ridge on Sunday & The Take (@RidgeOnSunday) April 2, 2023 'కొన్ని జాతి సమూహాల ప్రాబల్యం గురించి చాలా కాలంగా అనేక నివేదికలు ఉన్నాయి. బ్రిటిష్ పాకిస్తానీ పురుషులు బ్రిటిష్ విలువలకు పూర్తిగా విరుద్ధమైన సాంస్కృతిక విలువలను కలిగి ఉంటారు. వారు స్త్రీలను అవమానిస్తారు. కాలం చెల్లిన సంప్రదాయాలు పాటిస్తారు. కొన్నిసార్లు వారి ప్రవర్తన హేయంగా ఉంటుంది' అని హోంమంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పిల్లలు, యువతులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న నీచమైన నేరస్థుల ముఠాల పనిపట్టేందుకు కొత్తటాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. చదవండి: చైనాను రెచ్చగొట్టిన తైవాన్.. సరిహద్దులో ఉద్రిక్తత -
హోం మంత్రి ఎస్కార్ట్ వాహనం ఢీకోని వ్యక్తి మృతి ..కానీ కాన్వాయ్..
కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర ఎస్కార్ట్ వాహనం బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొనడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన హాసన్ జిల్లా అర్సికెరెలోని గండాసి గ్రామంలో చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి చామరాజనగర్ జిల్లాలోని ప్రసిద్ధ కేత్రమైన మలే మహాదేశ్వర బెట్ట నుంచి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఐతే ప్రమాదం జరిగిన తర్వాత జ్ఞానేంద్ర అతని కాన్వాయ్ ఆగకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. ఐతే వ్యక్తిని ఢీకొట్టిన ఎస్కార్ట్ వాహనం ప్రధాన కాన్వాయ్‌లో భాగం కాదని, వారి వాహానాల వెనుకే ప్రయాణించిందని కర్ణాటక హోంమంత్రి కార్యాలయం పేర్కొంది. (చదవండి: భర్త పాయిజన్ తీసుకుని చనిపోవడంతో భార్య..) -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హోంమంత్రి తానేటి వనిత
-
2024లో మోదీకి పోటీ లేదు: కేంద్రమంత్రి అమిత్ షా
-
అట్టహాసంగా ఐపీఎస్ పాసింగ్ ఔట్ పరేడ్.. పాల్గొన్న అమిత్ షా
సాక్షి, హైదరాబాద్: హైదబాద్‌లోని వల్లబాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో 74 వ బ్యాచ్ ఐపీఎస్‌ల అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం కోసం శుక్రవారం రాత్రికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అమిత్ షా ఆ పరేడ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అక్కడ ట్రైనీ ఐపీఎస్‌ల నుంచి అమిత్ షా గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. "ట్రైనీ ఐపీఎస్‌లకు అభినందనలు. ఈ బ్యాచ్‌లో అధికం శాతం టెక్నాలజీ బ్యాక్ గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. రానున్న కాలంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది. అంతేగాదు టెక్నీలజీతో కూడిన పోలీస్ మేనేజ్మెంట్ మరింతగా అందుబాటులోకి వస్తుంది కూడా. అలాగే 2005లో ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న దేశాన్ని 5వ స్థానంలోకి నిలబెట్టాం. త్వరితగతి దాన్ని కూడా అధిగమించి మూడవ స్థానాన్ని చేరుకుంటుందని ఆశిస్తున్నా. ఐతే శాసన వ్యవస్థ ద్వారా ఒక నాయకుడుకి కేవలం 5 సంవత్సరాలు మాత్రమే పాలించే అధికారం ఉంటుంది. కానీ ఐపీఎస్‌లకు 30 సంవత్సరాల వరకు ఆ అధికారం ఉంటుంది. రాజ్యాంగం మీ భుజస్కంధాలపై చాలా బాధ్యత పెట్టింది. ప్రతీ ఐపీఎస్ తన బాధ్యతను గుర్తించుకోవాలి. ఎనిమిదేళ్ల క్రితం దేశ అంతర్గత భద్రత విషయంలో చాలా ఆందోళనగా ఉండేది. జమ్ము కాశ్మీర్ తీవ్రవాదము, ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా ఎన్నో సమాస్యలు ఉండేవి. అలాంటి సమస్యలన్నింటిని పూర్తిగా కట్టడి చేశాం. అలాగే శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు." అని అమిత్ షా నొక్కి చెప్పారు. కాగా, ఈ 74వ బ్యాచ్‌లో దాదాపు 195 మంది ఐపీఎస్‌లు శిక్షణ పొందారు. 105 వారాలపాటు ఇండోర్ ఔట్‌డోర్ కలిపి మొత్తం సుమారు 17 విభాగాల్లో ట్రైనింగ్ పొందారు. వీరిలో 166 మంది భారతీయులు, 29 మంది విదేశీయలు ఉన్నారు. అందులో 37 మంది మహిళా ఐపీఎస్‌లు కూడా ఉన్నారు. అంతేగాదు ప్రతి ఏడాది మహిళా ఐపీఎస్‌లు పెరుగుతుండటమే గాక ఈ బ్యాచ్‌లో ఇంజనీరింగ్, మెడికల్, సీఏ స్టూడెంట్స్ అధికంగా ఉండటం విశేషం. ఈ శిక్షణలో ప్రతిభ కనబర్చిన ప్రోబేషనరీ ఐపీఎస్‌లకు ట్రోఫీలు అందజేస్తారు. పరేడ్ అనంతరం 11 నుంచి 12 గంటల సమయంలో అధికారులతో అమిత్ షా భేటీ కానున్నారు. (చదవండి: ఈ నెల 11న హైదరాబాద్‌కు అమిత్ షా.. పోలీస్ అకాడమీలోని పరేడ్‌కు హజరు!) -
అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువాహటి: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని దారిమళ్లించారు అధికారులు. అసోంలోని గువాహటి లోక్ప్రియా గోపినాథ్ బర్దోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి 10.45 గంటలకు అత్యవసర ల్యాండింగ్ చేశారు. త్రిపురలోని అగర్తలాకు వెళ్లున్న హోంమంత్రి అమిత్ షా విమానం ప్రతికూల వాతావరణం కారణంగా ల్యాండింగ్ చేయలేకపోయారు. దీంతో విమానాన్ని అసోంకి మళ్లించి సురక్షితంగా కిందకు దించారు. విమానం అత్యవసర ల్యాండింగ్ చేపట్టిన క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్వాగతం పలికారు. అక్కడి నుంచి గువాహటిలోని హోటల్ రాడిసన్ బ్లూకు చేరుకుని బుధవారం రాత్రి బస చేశారు అమిత్ షా. వాతావరణ పరిస్థితులపై అనుమతులు వచ్చిన తర్వాత గురువారం ఉదయం అగర్తలాకు బయలుదేరి వెళ్తారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా చేపట్టనున్న రథయాత్రను ప్రారంభించేందుకు వెళ్తున్నారు షా. ఈ రథయాత్రతో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇదీ చదవండి: రామ్‌పూర్ ప్రత్యేక కోర్టులో జయప్రద -
అమిత్ షాతో పాండ్యా బ్రదర్స్ భేటీ
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, క్రునాల్ పాండ్యాలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను న్యూఇయర్‌ను పురస్కరించుకుని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం షాతో భేటీపై సోషల్ మీడియా వేదికగా ఫోటో షేర్ చేశారు హార్దిక్ పాండ్యా. తన ఇంటికి ఆహ్వానించినందుకు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హోంమంత్రి అమిత్ షాతో వీరు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘మీతో విలువైన సమయాన్ని గడిపేందుకు ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవడం గౌరవంగా భావిస్తున్నాం. ’అంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. పాండ్యా స్వస్థలం గుజరాత్ కావడంతోనే షా వారిని కలిసినట్లుగా పలువురు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్, క్రునాల్ పాండ్యాలు క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకుని సేదతీరుతున్నారు. డిసెంబర్లో బంగ్లాదేశ్ టూర్‌కు హార్దిక్‌కు విశ్రాంతినివ్వగా.. క్రునాల్ పాండ్యా చివరిసారిగా నవంబర్‌లో విజయ్ హజారే ట్రోఫీలో బరోడా తరఫున ఆడారు. ఇటీవలో భారత టీ20 జట్టుకు సారథిగా ఎన్నికయ్యాడు హార్దిక్ పాండ్యా. కొత్త ఏడాదిని శ్రీలంకతో జరగనున్న 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో మొదలు పెట్టనున్నాడు. జనవరి 3 నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ టూర్లో రోహీత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్ వంటి స్టార్లకు విశ్రాంతినిచ్చింది బీసీసీఐ. మరోవైపు.. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్‌కు హార్దిక్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. Thank you for inviting us to spend invaluable time with you Honourable Home Minister Shri @AmitShah Ji. It was an honour and privilege to meet you. 😊 pic.twitter.com/KbDwF1gY5k — hardik pandya (@hardikpandya7) December 31, 2022 ఇదీ చదవండి: నీకే కాదు.. నీ తండ్రికి కూడా ఎవరూ భయపడటం లేదు: ఫడ్నవీస్ -
రాహుల్ గాంధీ భద్రతపై కాంగ్రెస్ ఆందోళన
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భారత్ జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది కాంగ్రెస్ పార్టీ. భారత్ జోడో యాత్రలో పలు సందర్భాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయాని, సరైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాసింది. జోడో యాత్ర శనివారం ఢిల్లీకి చేరుకోనుంది. అయితే, ఈ నేపథ్యంలో పలు సందర్భాల్లో యాత్ర భద్రత చర్యల్లో లోపాలు బయటపడ్డాయని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. రాహుల్ గాంధీకి ప్రస్తుతం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అయితే భారత్ జోడో యాత్రలో జనాలను నియంత్రించడం, వారిని రాహుల్ గాంధీకి సమీపంలోకి రాకుండా చూడడంలో ఢిల్లీ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని లేఖలో పేర్కొంది కాంగ్రెస్. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, రాహుల్‌తో పాదయాత్ర చేస్తున్న వారు ఆయనకు భద్రత వలయంగా ఏర్పడి రక్షణ కల్పిస్తున్నారని తెలిపింది. ఢిల్లీ పోలీసులు మౌన ప్రేక్షకులుగా ఉండిపోతున్నారని వెల్లడించింది. హరియాణాలో కొందరు దుండగులు భారత్ జోడో యాత్ర కంటెయినర్లలోకి ప్రవేశించారని గురుగ్రామ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు లేఖలో పేర్కొంది. ‘భారత్ జోడో యాత్ర అనేది దేశంలో శాంతి, సామర్యాన్ని తీసుకొచ్చేందుకు చేస్తున్న పాదయాత్ర. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతీకార రాజీకీయాలకు పాల్పడకూడదు. కాంగ్రెస్ నేతల భద్రత, రక్షణకు భరోసా కల్పించాలి. జనవరి 3 నుంచి భద్రతా పరంగా సున్నితమైన పంజాబ్, జమ్మూకశ్మీర్‌లోకి యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నేతలకు సరైన భద్రత కల్పించాలని కోరుతున్నాం.’అని లేఖలో డిమాండ్ చేసింది కాంగ్రెస్. ఇదీ చదవండి: అత్యంత అవినీతిమయం.. సోనియా కుటుంబంపై బీజేపీ తీవ్ర విమర్శలు -
Times Now Sumit 2022: ఉమ్మడి పౌరస్మృతికి కట్టుబడి ఉన్నాం
న్యూఢిల్లీ: దేశంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) తీసుకొచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని హోంమంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. అయితే, అన్ని రకాల ప్రజాస్వామిర ప్రక్రియలను అనురించడంతోపాటు సంప్రదింపుల తర్వాతే తీసుకొస్తామని తేల్చిచెప్పారు. ఆయన గురువారం ఢిల్లీలో ‘టైమ్స్ నౌ’ సదస్సులో ప్రసంగించారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ(ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కులతత్వం, వారసత్వం, బుజ్జగింపు వంటి జాడ్యాల నుంచి దేశ రాజకీయాలకు విముక్తి కలిగించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని అమిత్ షా ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం పుట్టుక, కులం, ఇతరులను బుజ్జగించే తత్వం ఆధారంగా ఎన్నికల్లో నెగ్గే రోజులు పోయాయని స్పష్టం చేశారు. మతం ఆధారంగా చట్టాలా? బీజేపీ భారతీయ జనసంఘ్‌గా ఉన్నప్పటి నుంచే ఉమ్మడి పౌరస్మృతిపై దేశ ప్రజలకు హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. బీజేపీ మాత్రమే కాదు రాజ్యాంగ సభ కూడా సరైన సమయంలో యూసీసీని తీసుకురావాలని పార్లమెంట్‌కు, రాష్ట్రాలకు సూచించిందని వెల్లడించారు. ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు అనేవి మతం ఆధారంగా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ లేదా రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించిన ఒకే ఒక ఉమ్మడి చట్టం ఉండాలని చాలామంది కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలో బీజేపీ తప్ప ఇతర పార్టీలేవీ ఉమ్మడి పౌరస్మృతి పట్ల అనుకూలంగా లేవని అమిత్ షా పేర్కొన్నారు. దానిపై కనీసం మాట్లాడడం లేదన్నారు. మాట్లాడే ధైర్యం లేకపోతే వ్యతిరేకించవద్దని హితవు పలికారు. ‘మీరు అమలు చేస్తే మేము మీ వెంటనే ఉంటాం’ అని కూడా ప్రతిపక్షాలు చెప్పడం లేదని ఆక్షేపించారు. ఉమ్మడి పౌరస్మృతిపై ఆరోగ్యకరమైన, బహిరంగ చర్చ జరగాలని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అంటే.. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) గురించి భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు. ఈ పౌరస్మృతిపై చట్టాలు చేసే అధికారం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఉంది. ప్రస్తుతం గోవాలో యూసీసీ అమలవుతోంది. యూసీసీకి మరో అర్థం.. ఒకే దేశం, ఒకే చట్టం. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలు, వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ సమానంగా వర్తించే ఒకే చట్టమే ఉమ్మడి పౌరస్మృతి. భారత్‌లో వేర్వేరు మతస్తులకు, జాతులకు వారి మతగ్రంథాలు, అందులోని బోధనల ఆధారంగా వేర్వేరు వ్యక్తిగత(పర్సనల్) చట్టాలు అమల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఓ వర్గం పురుషులు ఒక్కరి కంటే ఎక్కువ మంది మహిళలను వివాహం చేసుకోవచ్చు. అందుకు వారి ‘పర్సనల్ లా’ అనుమతిస్తుంది. మరో మతంలో అలాంటి వివాహాలకు అనుమతి లేదు. ఉమ్మడి పౌరస్మృతిపై దేశంలో కొన్ని దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ప్రధానంగా వామపక్షాలు, ఇస్లామిక్ సంస్థలు, కొన్ని జాతులు, తెగలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
పొలిటికల్ కారిడార్ : ఏపీ హోంమంత్రికి అమిత్ షా అభినందనలు
-
పోలీసులకు ఒకే యూనిఫాం
సూరజ్‌కుండ్ (హరియాణా): పోలీసులకు దేశవ్యాప్తంగా ఒకే యూనిఫాం ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ‘ఒక దేశం, ఒకే యూనిఫాం’ భావనపై ఆలోచించాలని రాష్ట్రాలకు సూచించారు. అయితే వాటిపై దీన్ని రుద్దబోవడం లేదని స్పష్టం చేశారు. ‘‘ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. పోలీసు బలగాలకు ఇది ఉమ్మడి గుర్తింపునిస్తుందన్నదే నా ఉద్దేశం. కావాలంటే యూనిఫాంపై రాష్ట్రాలవారీగా ప్రత్యేక గుర్తింపు చిహ్నాలు ఉండవచ్చు. ఇది వీలైతే ఇప్పుడు, లేదంటే ఐదేళ్లు, పదేళ్లు, వందేళ్లకు ఎప్పటికైనా సాధ్యపడొచ్చు’’ అని సూచించారు. హరియాణాలోని సూరజ్‌కుండ్‌లో జరుగుతున్న రాష్ట్ర హోం మంత్రుల చింతన్ శిబిర్‌ను ఉద్దేశించి మోదీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘గన్నులు, పెన్నులు... ఇలా నక్సలిజం ఏ రూపంలో ఉన్నా కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాల్సిందే. యువత మనసులను విషపూరితం చేసి వారిని తీవ్రవాదంవైపు మళ్లించకుండా నిరోధించాల్సిందే. అందుకోసం ఈ తీవ్రవాద శక్తుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి’’ అంటూ పిలుపునిచ్చారు. దేశ క్షేమం దృష్ట్యా ఈ శక్తులు విజృంభించకుండా చూడాల్సిన అవసరముందన్నారు. ‘‘పాత చట్టాలను సమీక్షించుకోండి. కాలం చెల్లిన వాటిని వదిలించుకోండి. మిగతా వాటిని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు మెరుగు పరుచుకోండి’’ అని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. ‘‘శాంతిభద్రతలు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశమే అయినా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సమన్వయంతో కూడిన ఉమ్మడి కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలి. పౌరుల పరిరక్షణే అంతిమ లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర బలగాలు అన్ని అంశాల్లోనూ పరస్పరం సహకరించుకోవాలి’’ అని సూచించారు. నేరాల స్వభావం అంతర్రాష్ట్రీయ, అంతర్జాతీయ తరహాను సంతరించుకుంటున్నందున ఇది తప్పనిసరన్నారు. సైబర్ క్రైం, ఆయుధాలు, డ్రగ్స్ సరఫరాల్లో నేరగాళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నందున ఈ ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు సాంకేతికంగా వారికంటే ముందే ఉండాలన్నారు. ఫేక్ న్యూస్‌కు తెర పడాలి కొంతకాలంగా ఫేక్ న్యూస్ పెద్ద బెడదగా మారిందని మోదీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి తప్పుడు సమాచార వ్యాప్తిని తక్షణం అడ్డుకోవాల్సిన అవసరముందన్నారు. ఇది దేశానికే ముప్పుగా పరిణమించగలదన్నారు. ‘‘ఏ సమాచారాన్నయినా ఫార్వర్డ్ చేసే ముందు ప్రజలు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అందులోని నిజానిజాలను నిర్ధారించుకోవాలి. అందుకు వీలు కల్పించే వ్యవస్థలను వారికి చేరువ చేయడంలో టెక్నాలజీది కీలక పాత్ర’’ అని చెప్పారు. టెక్నాలజీపై వెచ్చించే మొత్తాన్ని మెరుగైన భవిష్యత్తు కోసం పెట్టే పెట్టుబడిగా చూడాలని అన్నారు. పర్యాటకం ప్రధాన ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో పర్యాటక పోలిసింగ్పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని రాష్ట్రాలను కోరారు. అవినీతిపరులను వదిలేది లేదు న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడితే వ్యక్తులనైనా, సంస్థలనైనా వదిలే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ హెచ్చరించారు. అక్టోబర్ 31న మొదలవుతున్న విజిలెన్స్ వారోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతికి సందేశమిచ్చారు. అవినీతి సామాన్యుల హక్కులను హరించడమే గాక దేశ ప్రగతిని కూడా కుంటుబరుస్తుందన్నారు. అవినీతిపై ఉమ్మడిగా పోరాడాలంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ కూడా పిలుపునిచ్చారు. మన ఉక్కు పరిశ్రమ శక్తికి ఐఎన్ఎస్ విక్రాంతే తార్కాణం సూరత్: భారత ఉక్కు పరిశ్రమ శక్తిసామర్థ్యాలకు, పనితనానికి తొలి దేశీయ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ చక్కని ఉదాహరణ అని ప్రధాని మోదీ అన్నారు. ఎనిమిదేళ్ల సమష్టి కృషి ఫలితంగా భారత ఉక్కు పరిశ్రమ ప్రపంచంలో రెండో స్థానానికి ఎగబాకిందన్నారు. గుజరాత్‌లోని సూరత్ జిల్లా హజీరాలో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా విస్తరణ ప్లాంటు భూమి పూజలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు! -
బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ రాజీనామా
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ రాజీనామా చేశారు. లండన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని బుధవారం ధ్రువీకరించాయి. గోవా మూలాలున్న తండ్రి–తమిళనాడు మూలాలున్న తల్లికి జన్మించిన బ్రేవర్మన్ 43 రోజుల క్రితమే యూకే హోం సెక్రెటరీగా నియమితులయ్యారు. యూకే ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుండడంతో ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. బ్రవెర్మన్ బుధవారం ఉదయం లిజ్ ట్రస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా సమర్పించినట్లు తెలిసింది. ట్రస్ విధానాలతో బ్రవెర్మన్ విభేదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ రాజీనామా పరిణామంతో ట్రస్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. -
అమ్మాయి డ్యాన్స్ వీడియో వివాదాస్పదం...హోం మంత్రి సీరియస్
మధ్యప్రదేశ్‌లో ప్రసిద్ధిగాంచిన ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై మద్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సీరియస్ అవ్వడమే కాకుండా కలెక్టర్, ఎస్సీని ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మత విశ్వాసాలతో చెలగాటమాడితే సహించేది లేదని మిశ్రా మండిపడ్డారు. ఐతే ఈ వీడియోలో ఆ అమ్మాయి గర్భగుడిలో జలాభిషేకం చేస్తున్నప్పుడూ కాంతులు వెదజిమ్మితున్నట్లు ఎఫెక్ట్స్ వంటివి పెట్టింది. అదీగాక ఆలయ పరిసరాల్లో డ్యాన్సులు చేస్తూ బ్యాగ్రౌండ్లో బాలీవుడ్ పాట వీడియోలో వినిపిస్తుంది. మరో యువతి ఆలయంలో పరిసరాల్లో వీడియో తీస్తున్నట్లు ఉంటుంది. ఐతే ఈ వీడియోపై ఆలయ పూజారి మహేష్గురు ఇది సనాతన సాంప్రదాయానికి విరుద్ధమంటూ సదరు అమ్మాయిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వీడియో ఆలయ పవిత్రతను మంటగలిపేలా ఉందంటూ మండిపడ్డారు. అలాగే మహకాల్ ఆలయ ఉద్యోగులు కూడా తమ బాధ్యతను సరిగా నిర్వర్తించడం లేదని పూజారి అన్నారు. (చదవండి: బిల్కిస్ బానో కేసు: రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు) -
అమరావతి రైతుల పాదయాత్రకు ప్రజల మద్దతు కరువైంది : హోంమంత్రి తానేటి వనిత
-
మంత్రులపై దాడి ఘటనకు పవన్ బాధ్యత వహించాలి : హోంమంత్రి తానేటి వనిత
-
అమిత్ షా సమక్షంలో 40,000 కిలోల డ్రగ్స్ ధ్వంసం
గువాహటి: మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో ఆధ్వర్యంలో ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 40,000 కిలోల వివిధ రకాల డ్రగ్స్‌ను పట్టుకున్నారు. వాటిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో శనివారం ధ్వంసం చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా గువాహటి నుంచి వర్చువల్‌గా డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను పర్యవేక్షించినట్లు ట్వీట్ చేసింది. అస్సాంలో 11,000 కిలోలు, అరుణాచల్ ప్రదేశ్‌లో 8,000 కిలోలు, మేఘాలయలో 4,000 కిలోలు, నాగాలాండ్‌లో 1600 కిలోలు, మణిపుర్లో 398 కిలోలు, మిజోరాంలో 1900కిలోలు, త్రిపురలో 13,500 కిలోలు పట్టుకున్నట్లు వెల్లడించింది. అస్సాం పర్యటనలో ఉన్న అమిత్ షా.. డ్రగ్ అక్రమ రవాణా, జాతీయ భద్రత అంశంపై ప్రాంతీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈశాన్య ప్రాంతంలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, నియంత్రణపై సమీక్షించారు. ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఎన్సీబీ ఆధ్వర్యంలో 75,000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేయాలని నిర్ణయం తీసుకున్నాం. అంతకు రెండింతలు 150,000 కిలోలు ధ్వంసం చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా పెద్ద విజయం.’ అని తెలిపారు షా. కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఎన్సీబీ జూన్ 1 నుంచి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి మత్తు పదార్థాలను పట్టుకుంటోంది. దేశాన్ని మత్తు పదార్థాల రహితంగా మారుస్తామన్న మోదీ ప్రభుత్వ ఆశయానికి తగినట్లుగా డ్రగ్స్‌ను ధ్వంసం చేస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. గత జులై 30న సుమారు 82వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించిన అమిత్ షా.. 31 వేల కిలోల డ్రగ్స్ ధ్వంసం చేసే ప్రక్రియను వర్చువల్‌గా పర్యవేక్షించారు. #WATCH | Union Home Minister Amit Shah conducts a meeting on Drug Trafficking and National Security in Guwahati in the presence of Assam CM Himanta Biswa Saram and Union Minister G Kishan Reddy. pic.twitter.com/yAvXXDvTsn — ANI (@ANI) October 8, 2022 ఇదీ చదవండి: అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు కొనసాగుతా: శశిథరూర్ -
ఏపీ విభజన చట్టం అమలుపై ముగిసిన హోంశాఖ భేటీ
-
బీజేపీ రౌడీయిజం చేస్తే బాగోదు: హోంమంత్రి మహమూద్ అలీ
-
ఏపీ హోంమంత్రి తానేటి వనితతో స్ట్రెయిట్ టాక్
-
హోంమంత్రి ఇంటిపై ఏబీవీపీ కార్యకర్తల దాడి!
శివాజీనగర: దక్షిణ కన్నడ జిల్లాలో బీజేపీ నేత ప్రవీణ్ నెట్టారు హత్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏబీవీపీ కార్యకర్తలు శనివారం కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఇంటిని ముట్టడించారు. శనివారం బెంగళూరులో జ్ఞానేంద్ర ఇంటి ప్రాంగణంలోకి చొరబడి బైఠాయించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నాశనమయ్యాయని, హోం శాఖను నిర్వహించటంలో విఫలమైన మంత్రి.. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. తర్వాత ఆందోళనకు దిగిన వారిపై పోలీసులు లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. కొందరిని అరెస్ట్ చేసి 30 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదుచేశారు. ఇదీ చదవండి: కళాశాల విద్యార్థికి ఉగ్రవాదులతో లింక్! -
తప్పు చేస్తే జైలుకి పంపారు.. మళ్లీ అక్కడ కూడా అదే తంతు!
శివాజీనగర(బెంగళూరు): రాష్ట్రంలో ఏ జైలులోనైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే అందుకు సంబంధిత అధికారులనే బాధ్యులుగా చేయాల్సి వస్తుందని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. శనివారం వికాససౌధలో ఇటీవల ఏర్పాటైన కారాగృహ అభివృద్ధి మండలి తొలి సమావేశాన్ని నిర్వహించారు. జైళ్లు, పోలీసు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ కారాగృహంలో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగళూరు పరప్పన అగ్రహార, బెళగావిలోని హిండలగ, బళ్లారి జైలులో నిరంతరం అక్రమ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నాయి. మీడియాలో నిరంతరం వార్తలు వస్తున్నా కూడా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. జైలులో నిందితులపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది పునరావృతం కారాదని, ముందు ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ ఘటనల్లో 15 మందిని సస్పెండ్ చేసి 30 మందిని బదిలీ చేసినట్లు చెప్పారు. సమావేశంలో డీజీపీ ప్రవీణ్ సూద్, జైళ్ల మండలి కార్యదర్శి అలోక్ మోహన్, హోమ్‌శాఖ కార్యదర్శి రజనీశ్ గోయల్ పాల్గొన్నారు. ఎస్ఐ స్కాంలో ఎవరినీ వదలం ఎస్ఐ ఉద్యోగాల స్కాంపై నిష్పాక్షపాతంగా విచారణ నడుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను కూడా బహిరంగం చేస్తానని హోంమంత్రి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలోనే మొదటిసారిగా అక్రమాల కేసులో ఏడీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేశామన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అనేక అక్రమాలు జరిగాయన్నారు. ఇందులో ఎవరున్నా వదిలే ప్రసక్తి లేదన్నారు. డబ్బులిచ్చినవారు, తీసుకున్నవారు, మధ్యవర్తులపై కూడ కఠిన చర్యలు తీసుకుంటామని, సీఐడీకి సంపూర్ణ అధికారమిచ్చామని చెప్పారు. చదవండి: తమిళనాడులో టెన్షన్.. టెన్షన్.. స్కూల్ బస్సులను తగలబెట్టారు: సీఎం వార్నింగ్ -
హైదరాబాద్: బాలిక అత్యాచార ఘటనపై స్పందించిన హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: బాలిక అత్యాచార ఘటనపై మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్‌పై హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. కచ్చితంగా నిందితులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే పోలీసులకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. నిందితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. కేటీఆర్ ట్వీట్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌లో అత్యాచార ఘటన వార్తలు చూసి షాక్ గురయ్యానన్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. హోదాతో సంబంధం లేకుండా నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అన్నారు. నిస్పక్షపాత విచారణ జరిపించాలన్నారు. ఇద్దరు అరెస్ట్ కాగా జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా పబ్‌కు వెళ్లిన 17 ఏళ్ల బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరిని పోలీసులు చేశారు. వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చదవండి: బాలిక అత్యాచారం కేసు.. పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు -
ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలు.. హోంమంత్రి కౌంటర్
సాక్షి, విజయవాడ: ఇంగ్లీష్ మీడియంపై చంద్రబాబు వ్యాఖ్యలకు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత కౌంటర్ ఇచ్చారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టామని ఆమె అన్నారు. ‘‘వాళ్ల పిల్లలను విదేశాల్లో ఇంగ్లీష్ మీడియం చదివించుకోవచ్చు.. పేదలు ఇంగ్లీష్ చదువులు చదవకూడదన్నదే చంద్రబాబు రూల్’’ అంటూ మంత్రి మండిపడ్డారు. చదవండి: బాబు పర్యటనకు దూరంగా గంటా శ్రీనివాసరావు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడే మాటలు ఇవ్వేనా?.ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మొద్దబ్బాయిల్లా మారతారని తమకు ఇప్పటివరకూ తెలియదు. అలా కూడా ఆలోచించవచ్చా అని ప్రతిపక్షనేత చెప్పే వరకూ తెలియదంటూ మంత్రి ఎద్దేవా చేశారు. ‘‘ఈ మూడేళ్లు రాష్ట్రంలో జగన్ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వాల కంటే సంతోషంగా ఉన్నామని ధైర్యంగా చెబుతున్నారు. కరోనా సమయంలో టీడీపీ నేతలు ఎక్కడున్నారో వారికే తెలియదు. ఇప్పుడేమో జనాన్ని ఉద్దరించేస్తామని తయారయ్యారు. సీఎం జగన్‌ను పిల్లలందరూ మేనమామగా భావిస్తున్నారు. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసమే ఇంగ్లీష్ మీడియం’’ అని మంత్రి తానేటి వనిత అన్నారు. -
‘టీడీపీ తప్పుడు ప్రచారం.. ఇదేం రాజకీయం బాబు’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని.. చంద్రబాబు పాలనతో పోలిస్తే రాష్ట్రంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మహిళలకు భద్రత కోసం జీరో ఎఫ్ఐఆర్, దిశ పోలీస్ స్టేషన్లు తీసుకొచ్చామన్నారు. కఠినమైన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయని, అందుకే వేగంగా శిక్షలు వేసేలా చట్టం తెచ్చామని హోంమంత్రి అన్నారు. చదవండి: చంద్రబాబు, ఎల్లోమీడియాపై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు.. ‘‘మహిళలపై నేరాల నియంత్రణకి దిశ యాప్ తీసుకొచ్చాం. దిశ యాప్‌ని కోటి 28 లక్షలు మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ వలన 900 మంది మహిళలను కాపాడాం. ఫోరెన్సిక్ ల్యాబ్ లు తెచ్చాం, మహిళ కోర్టులు తెచ్చాం. గతంలో ఎస్సీ, ఎస్టీ బాధితులకు రూ.50 కోట్లు పరిహారం ఇచ్చారు. సీఎం జగన్ పాలనలో ఇప్పటికే 120 కోట్లు పరిహారం ఇచ్చామని’’ మంత్రి అన్నారు. ‘‘మహిళకు భద్రతకు చర్యలు తీసుకుంటుంటే టీడీపీ రాజకీయం చేస్తోంది. బాధితులకు అండగా నిలవాల్సిన సమయంలో టీడీపీ వెళ్లి రాజకీయం చేస్తుంది. మహిళల భద్రత కోసం ప్రతి గ్రామంలో మహిళ పోలీస్‌ని నియమించాం. దిశ చట్టంపై కేంద్రం అడిగిన క్లారిఫికేషన్‌ను 20 రోజుల కిందట పంపాం. ఇప్పటికి రెండు సార్లు క్లారిఫికేషన్ అడిగితే సమాధానం పంపినట్లు హోంమంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. -
AP: అత్యాచార బాధితురాలిని పరామర్శించిన హోంమంత్రి
సాక్షి, ప్రకాశం జిల్లా: రైల్వే స్టేషన్లలో భద్రత పెంచే విధంగా చర్యలు చేపడతామని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచార బాధితురాలిని ఆమె పరామర్శించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ, భర్తను నిద్రలేపిన నిందితులు.. టైం అడిగి కొట్టారని, భర్తపై దాడిని అడ్డుకోబోయిన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టారన్నారు. రైల్వేస్టేషన్ దగ్గరలో ఉన్న నేతాజీ కాలనీకి చెందిన నిందితులను గంటల వ్యవధిలోనే పట్టుకుని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. చదవండి👉: ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు బాధిత కుటుంబాన్ని పరామర్శించానని, బాధితురాలికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించామన్నారు. నిందితులపై అట్రాసిటీ, రాబరీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశామన్నారు. గోప్యత కోసమే పరామర్శకు పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతి ఇస్తున్నామని, పరామర్శ పేరుతో అలజడి చేస్తామంటే కుదరదన్నారు. ‘‘కొన్ని నేరాలు టీడీపీ కార్యకర్తలే చేస్తున్నారని, అంటే టీడీపీ ప్రోత్సహిస్తోంది అనాలా’’ అంటూ హోంమంత్రి తానేటి వనిత ప్రశ్నించారు. -
ప్రకాశం జిల్లాలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లాలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. హోంమంత్రి తానేటి వనిత కాన్వాయ్‌పై దాడికి యత్నించారు. ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న రేపల్లె అత్యాచారం బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కారు అద్దాలు పగులగొట్టేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. టీడీపీ కార్యకర్తల ఆందోళనలతో రహదారిపై ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. హోంమంత్రి కాన్వాయ్ పై దాడికి యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. చదవండి: టీడీపీ కుట్రలు: తమ్ముళ్ల నాటకం.. విస్తుబోయే నిజం 17 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు కాన్వాయ్‌పై దాడి ఘటనలో 17 మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
గోపాలపురం ఎమ్మెల్యేపై దాడి.. స్పందించిన హోంమంత్రి
సాక్షి, విశాఖపట్నం: ఎండాడలో ‘దిశ’ పోలీస్ స్టేషన్‌ను హోం మంత్రి తానేటి వనిత శనివారం సందర్శించారు. సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసమే దిశ యాప్, దిశ చట్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చారని హోంమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 24 లక్షల మందికి పైగా దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. చదువుకొనే ప్రతి విద్యార్థిని దిశా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: AP: ఏలూరు కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్తత మహిళలపై దాడులను సీఎం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించరన్నారు. ఇటీవల మహిళలపై దాడులు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందన్నారు. వారే దాడులు చేసి వారే తిరిగి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. విశాఖ నగరంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన టీడీపీ నేత పై కేసు నమోదు చేశామన్నారు... జి.కొత్తపల్లి ఘటనపై స్పందిస్తూ.. ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై జరిగిన దాడిపై ఆమె స్పందిస్తూ.. ఎమ్మెల్యేపై జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకున్నానన్నారు. ఇప్పటికే తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని.. దాడి ఎందుకు జరిగిందన్న దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారన్నారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యేపై దాడి జరిగిందన్నారు. -
ఎస్ఐ పరీక్షలో అక్రమాలు.. మళ్లీ ఎగ్జామ్
బనశంకరి: ఎస్ఐ పరీక్షల్లో అక్రమాలు వెలుగు చూడటంతో ఆ పరీక్షను రద్దు చేసినట్లు హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విధానసౌధలో మీడియాతో మాట్లాడుతూ మొత్తం 545 ఎస్ఐ పోస్టులకు 2021 ఆగష్టు 3న రాత పరీక్ష నిర్వహించగా రాష్ట్రవ్యాప్తంగా 54,289 మంది అభ్యర్దులు హాజరైనట్లు తెలిపారు. అక్రమాలు చోటుచేసుకున్నట్లు విచారణలో వెలుగుచూడటంతో పరీక్షను రద్దు చేశామన్నారు. కొత్తగా పరీక్ష నిర్వహిస్తామని త్వరలో తేదీ ప్రకటిస్తామన్నారు. ఇప్పటికే ఎంపికైన వారు కూడా పరీక్ష రాయాలన్నారు. ఎస్ఐ పరీక్షలో కుమ్మక్కైన వారికి మళ్లీ పరీక్ష రాయడానికి అవకాశం ఇచ్చేదిలేదన్నారు. ఇకపై పరీక్షల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బ్లూటూత్ వినియోగించి అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో నిర్ధారణ అయ్యిందని, ఇందులో ఎవరు భాగస్వాములైనప్పటికీ విడిచిపెట్టేదిలేదన్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది : ప్రియాంక ఖర్గే దివ్యహాగరగి అరెస్ట్‌పై మాజీమంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. ఎస్ఐ అభ్యర్థుల నుంచి వసూలు చేసిన కోట్లాదిరూపాయల డబ్బు ఎక్కడికి వెళ్లిందనే దానిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సీఐడీ బృందం పుణెలో దివ్య హాగరగితో సహా ఆరుగురిని అరెస్ట్‌చేయడాన్ని ప్రియాంక్ ఖర్గే స్వాగతించారు. పరీక్ష కేంద్రాలు కేటాయించడం, డబ్బు ఇచ్చిన అభ్యర్థులకు నిర్దిష్టమైన పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసే సదుపాయం కల్పించడం లాంటి పనులు చేపట్టడం వెనుక ప్రముఖులు ఉన్నారని, వారిపై సీఐడీ విచారణ చేపట్టలేదన్నారు. అసలైన తిమింగలాలను పట్టుకోవాలన్నారు. కింగ్‌పిన్ దివ్య అరెస్ట్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్షల్లో చోటు చేసుకున్న అక్రమాల కేసులో ప్రధాన సూత్రధారి దివ్య హాగరగి, కలబురిగి జ్ఞానజ్యోతి విద్యాసంస్థ ప్రిన్సిపాల్ కాశీనాథ్, ఇని్వజిలేటర్లు అర్చన, సునంద, ఎస్ఐ అభ్యర్థిని శాంతాబాయి, వీరికి ఆశ్రయమిచ్చిన పారిశ్రామికవేత్త సురేశ్‌ను సీఐడీ ఎస్పీ రాఘవేంద్ర నేతృత్వంలోని బృందం గురువారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని పుణెలో అరెస్ట్ చేసింది. వీరిని శుక్రవారం కలబురిగి సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. గురువారం ఈ కేసులో అరెస్ట్ అయిన జ్యోతి పాటిల్‌ను విచారణ చేపట్టగా దివ్య హాగరగితో పాటు ఐదుగురు పుణెలో తలదాచుకున్నట్లు సమాచారం అందించారు. గురువారం రాత్రి సీఐడీ బృందం మహారాష్ట్రకు వెళ్లి ఐదుగురిని అరెస్ట్ చేసింది. కస్టడీకి నిందితులు.. దివ్యతోసహా ఆరుగురిని వైద్య పరీక్షల అనంతరం శుక్రవారం కలబురిగి ఒకటవ అదనపు జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 11 రోజుల కస్టడీకి అనుమతించింది. ఇక, దివ్య హాగరగితోసహా ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయంపై రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌సూద్ సీఎం బసవరాజ బొమ్మైకి సమాచారం అందించారు. ఆర్టీ.నగరలో ఉన్న సీఎం నివాసానికి ప్రవీణ్‌సూద్ విచ్చేసి వివరాలు తెలియజేశారు. ఈ కేసులో ఎవరు భాగస్వాములైనప్పటికీ చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. -
మానవత్వం చాటుకున్న హోంమంత్రి తానేటి వనిత
సాక్షి,విజయవాడ: రోడ్డు ప్రమాదానికి గురైన మహిళకు హోంమినిస్టర్ వనిత సహాయం చేసి మానవత్వం చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరి హ్యాపీ రిసార్ట్స్ సమీపంలో బైక్ పై వెళ్తున్న దంపతులను ఆటో ఢీ కొట్టింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న హోంమంత్రి తన కాన్వాయ్ ఆపి గాయపడిన దంపతులకు సహాయం చేశారు. అంబులెన్స్‌కు కాల్ చేసి వచ్చే వరకు అక్కడే ఉండి దగ్గరుండి వారిని ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా గాయపడిన దంపతులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. -
హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తానేటి వనిత
సాక్షి, అమవరావతి: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రిగా మంత్రి తానేటి వనిత సోమవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అప్పగించిన బాధ్యతను శక్తి వంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. న్యాయం, చట్టం వివక్ష లేకుండా అందిస్తున్న ప్రభుత్వంలో.. ఫ్రెండ్లీ పోలీస్, క్విక్లీ రెస్పాన్స్ విధానంతో పనిచేస్తామని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో మూడు ఏళ్లుగా సీఎం జగన్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో ఏపీకి జాతీయ అవార్డులు కూడా తీసుకొచ్చారని కొనియాడారు. ‘టెక్నాలజీ వినియోగలోనూ మన పోలీస్ విభాగం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాబోయే రెండేళ్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాం. మహిళలపై నేరాల నియంత్రణకు కృషి చేస్తాం. దిశ చట్టం కేంద్రంలో పెండింగ్‌లో ఉన్నా అందులోని అంశాలను అమలు చేస్తున్నాం. దిశా యాప్ ద్వారా 900 మందికిపైగా ఆడపిల్లల్లను కాపాడారు. పోలీస్ వ్యవస్థలో పారదర్శకత, ఫ్రెండ్లీ పోలీసింగ్, క్విక్ రెస్పాన్స్ అమలును కొనసాగిస్తాం. శాంతి భద్రతల పరిరక్షణలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేస్తాం. జగనన్న స్ఫూర్తి తోనే పనిచేస్తాం’ అని తెలిపారు. చదవండి: వైద్యారోగ్య శాఖ మంత్రిగా విడదల రజిని బాధ్యతలు -
అవసరమైతే పోరస్ ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
-
హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నా: తానేటి వనిత
ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో తొలిసారి మహిళకు హోం మంత్రి పదవి కట్టబెట్టిన ఘనత దివంగత మహానేత వైఎస్సార్‌దైతే, ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మరో అడుగు ముందుకేశారు. వరుసగా ఇద్దరు దళిత మహిళలకు కీలకమైన ఈ బాధ్యతలు కేటాయించారు. రాష్ట్ర హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత ఈ మాటలన్నారు. మొదటి విడతలోనే మంత్రి పదవి వస్తుందని ఊహించలేదన్నారు. రెండోసారి హోం శాఖ అప్పగించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గానికి వచ్చిన వనిత బుధవారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంకా ఏమన్నారంటే.. –కొవ్వూరు ప్రశ్న: పోలీసులపై పని ఒత్తిడి అధికంగా ఉంది. వారాంతపు సెలవులు కొన్నిచోట్ల సక్రమంగా అమలు కావడం లేదన్న వాదనలు ఉన్నాయి? మంత్రి: క్షేత్ర స్థాయిలో సిబ్బంది ఇబ్బందులను తెలుసుకుంటాను. పోలీసులకు కచ్చితంగా వారాంతపు సెలవులు అన్నిచోట్లా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. దీనిపై మీ అభిప్రాయం? ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎంతో అవసరం. ఏ సమస్యపైనైనా ప్రజలు నిర్భయంగా స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలంటే ప్రజలకు, పోలీసులకు మధ్య çసుహృద్భావ వాతావరణం ఉండాలి. దీనివల్ల ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుంది. సమస్యలు పరిష్కారం అవుతాయి. మహిళలు, యువతులపై అకృత్యాల నివారణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు? ఇప్పటికే ప్రభుత్వం ప్రతి పోలీసు స్టేషన్లో మహిళా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసింది. దిశ సహాయ కేంద్రం పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను నియమించి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రతి జిల్లాకి ఒక దిశ పోలీసు స్టేషన్‌తో పాటు ప్రత్యేకంగా దిశ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. దిశ యాప్ ద్వారా పోలీసుల నుంచి ఆపదలో ఉన్న మహిళలకు తక్షణ సాయం అందేలా చర్యలు తీసుకున్నాం. మంత్రివర్గ పునర్ వ్యవస్ధీకరణ ఎలా ఉంది? మంత్రి వర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు 70 శాతం పదవులు కేటాయించడం ద్వారా సామాజిక విప్లవానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదుగురు మంత్రులకు ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చారిత్రక నిర్ణయం. భవిష్యత్తు తరాల రాజకీయాలకు సీఎం ఓ దిక్సూచిగా నిలిచారు. హైవే పెట్రోలింగ్ వాహనాల్లో పోలీసుల పని తీరుపై విమర్శలున్నాయి. దీనిపై మీ స్పందన.? హైవేల్లో ప్రమాదాలు సంభవించిన సమయంలో తక్షణ సాయం అందించేందుకు నిర్దేశించిన హైవే పెట్రోలింగ్ వాహనాల పనితీరు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటాం. నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పని చేసేలా చూస్తాం. పోలీసుల్లో అవినీతి నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? అవినీతి అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటాం. అందుకు ప్రజల వైఖరిలోను మార్పు రావాల్సిన అవసరం ఉంది. డబ్బులిస్తేనే తొందరగా పని అవుతుందన్న భావన నుంచి ప్రజలు బయటికి వస్తేనే అవినీతి కట్టడి అవుతుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటున్నారు.? రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ముఖ్యమంత్రి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అసాంఘిక శక్తులపై ప్రత్యేక నిఘా ఉంచుతాం. శాంతిభద్రతలకు విఘాతం కలించే వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఇటీవల తాడేపల్లిగూడెం నిట్ కళాశాలలో ర్యాగింగ్ అంశం తెరపైకి వచ్చింది. కళాశాలల్లో ర్యాగింగ్ నియంత్రణకు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు.? ర్యాగింగ్‌కి పాల్పడితే కలిగే అనర్థాలు, శిక్షల గురించి విద్యార్థుల్లో అవగాహన పెంపొందిస్తాం. విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం. ప్రతీ కళాశాలలో ర్యాగింగ్ నియంత్రణ కమిటీల పనితీరును మెరుగు పరిచేలా చర్యలు తీసుకుంటాం. -
హోంమంత్రితో వివాదాలు.. క్లారిటీ ఇచ్చిన సీఎం
సాక్షి, ముంబై: రాష్ట్ర హోంశాఖ మంత్రి దిలీప్ వాల్సే పాటిల్(ఎన్సీపీ)తో వివాదాలున్నట్లు వస్తున్న వార్తలను రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కొట్టి పారేశారు. ఒక్క పాటిల్‌పైనే కాదు.. మొత్తం కేబినెట్‌పైనా తనకు పూర్తి విశ్వాసముందని స్పష్టం చేశారు. మంత్రులందరూ అద్భుతంగా పనిచేస్తున్నారని, తప్పుదారి పట్టించేందుకే అలాంటి నిరాధార వార్తలు ప్రచారం చేస్తున్నారని ఉద్ధవ్ శుక్రవారం ఒక ప్రటకన విడుదల చేశారు. రాష్ట్రంలోని శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ నేతలను కేసుల్లో ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మాజీ మంత్రి ఫడ్నవీస్ ఆరోపణలపై.. హోంమం త్రివాల్సే అసెంబ్లీ సరైన సమాధానం ఇవ్వలేదని సీఎం అభిప్రాపడినట్లుగా వార్తలొచ్చాయి. కేబినెట్ సమావేశాల్లోనూ ఠాక్రే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వాల్సే... శుక్రవారంనాడు ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... తాను పాలనాపరమైన అంశాలు చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే వివరణ ఇచ్చిందని, అందరినీ పరిగణనలోకి తీసుకునే కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. చదవండి: బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలి అయితే అంతకుముందు.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. హోంశాఖ బలంగా లేనందునే ఈడీ వంటి ఏజెన్సీలతో మహారాష్ట్ర ప్రభుత్వంపై, ప్రత్యేకించి హోంశాఖపై కేంద్రం దాడి చేస్తోందని అన్నారు. సాధారణంగా సీఎంతో ఉండాల్సిన హోంశాఖ ఎన్సీపీకి వెళ్లిందని అభిప్రాయపడ్డారు. అయితే రౌత్ చెప్పినదాంట్లో తప్పేం లేదని, అలాంటివేమైనా ఉంటే పరిష్కరిస్తామని వాల్సే తెలిపారు. హోంశాఖపై శివసేన దృష్టి పడిందా అన్న ప్రశ్నకు పాటిల్ సమాధానమిస్తూ తానలా భావించడం లేదని, చట్టం ప్రకారమే ప్రభుత్వం నడుస్తుందని, ప్రతి కేసులోనూ హోంశాఖమంత్రి ఉత్తర్వులు ఇవ్వలేరని చెప్పారు. చాలా నిర్ణయాలు డీజీపీ, సీపీ, ఇతర ఉన్నతాధికారుల పరిధిలోనే జరిగిపోతాయని, ఏదైనా ఆలస్యం జరిగితే మాత్రమే హోంశాఖ జోక్యం చేసుకుంటుందని వివరించారు. బీజేపీ పట్ల ఎన్సీపీ మెతకధోరణి అవలంభిస్తోందన్న ఆరోపణలను వాల్సే కొట్టిపారేశారు. మసీదుల్లో అజా(ప్రార్థన)లకు ఉపయోగించే లౌడ్స్పీకర్లను నిషేధించాలన్న బీజేపీ డిమాండ్ గురించి ప్రశ్నించగా... ధరల పెరుగుదల వంటి సమస్యలనుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు బీజేపీ ఇలాంటివి ముందుకు తెస్తుందని మండిపడ్డారు. -
Statue Of Equality : శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల్లో అమిత్ షా
-
Guntur: ఆక్సిజన్ ప్లాంట్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత
-
డిసెంబర్ 31 న అమిత్ షా అయోధ్య పర్యటన!
Amit Shah Ayodhya Campaign 2021 లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి కాషాయ పార్టీ సిద్ధమైంది. డిసెంబర్ 31న అయోధ్యాలో జరగనున్న ఎన్నికల ర్యాలిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్లొననున్నారు. పర్యటనలో భాగంగా అక్కడి రామ్లాల, హనుమాన్ గర్హి ఆలయాలను సందర్శించనున్నారు. ఈమేరకు షా అయోధ్య పర్యటనకు భాజపా సన్నాహాలు చేస్తోంది. మరోవైపు అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ప్రతిపక్షాలు, అధికార బీజేపీ మధ్య వాగ్వాదం నడుస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అయోధ్య కేంద్రంగా మారనుంది. కాగా హోంమంత్రి అయోధ్య పర్యటన రాష్ట్రంలో రాజకీయ రగడను మరింత పెంచుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. డిసెంబర్ 31న షా అయోధ్య పర్యటనపై సోమవారం కూడా బీజేపీ సమావేశం నిర్వహించింది. ఒకవైపు అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి పనులకు యూపీలోని యోగి ప్రభుత్వం, కేంద్రంలోని మోదీ సర్కార్ బాధ్యతవహిస్తుందనే సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు అందించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. అయితే అయోధ్యను సాకుగా చూపి బీజేపీ మత పరమైన రాజకీయాలు చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. చదవండి: వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ ఒమిక్రాన్ కాటుకు బలి! మొదటిసారిగా.. -
శివసేనపై హోంమంత్రి ఆగ్రహం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): శివసేన కార్యకర్తలు కన్నడ పతాకాన్ని కాల్చివేయడం సరైన చర్య కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నమని హోంమంత్రి అరగజ్ఞానేంద్ర మండిపడ్డారు. బుధవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ... మరాఠీలు, కన్నడిగులు అనే భేదభావం లేకుండా ప్రజలు ఉన్నారన్నారు. కానీ కొందరు శాంతికి భంగం కలిగించేందుకు యత్నిస్తున్నారు, దీనిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామన్నారు. ఈ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అనేక ధర్నాలు జరుగుతున్నాయని, వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. కాగా, పోలీసుల వసతి, వేతన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ -
హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే
గుంటూరు ఎడ్యుకేషన్: అధికారంలో ఉండగా ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీశారని హోం మంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. ఆదివారం గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఏరోజూ మాట్లాడలేదన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలంటూ కేంద్రం నుంచి నిధులు తెచ్చి దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. బీజేపీతో విడిపోయిన తరువాత దొంగ దీక్షలు చేయడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని ఆనాడు కేంద్రం స్పష్టం చేసినప్పుడు టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించని చంద్రబాబు.. ఇప్పుడు రాజీనామాలు అంటున్నారని విమర్శించారు. ప్రజలు ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరన్నారు. ‘ఉక్కు’పై చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించు పవన్.. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కోసం దీక్ష చేస్తున్నానని చెబుతున్న పవన్ కల్యాణ్.. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. బీజేపీకి మద్దతు పలుకుతున్న పవన్‌కల్యాణ్.. విశాఖ ఉక్కుపై ముందు కేంద్రంతో మాట్లాడాలన్నారు. ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె స్పష్టం చేశారు. కాగా, కల్తీ విత్తనాలు, తెగుళ్లు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. రైతులకు కల్తీ విత్తనాలు విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
హోం మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
సాక్షి, కోలారు (కర్ణాటక): పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హోం మంత్రి తీరును ఖండిస్తూ రైతు సంఘం పదాధికారులు సోమవారం నగరంలోని గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించి హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె నారాయణగౌడ మాట్లాడుతూ... నిత్యం ప్రజాసేవలో ఉంటున్న పోలీసులను నోటి కొచ్చినట్లుగా మాట్లాడడం పరిపాటిగా మారిందని, హోం మంత్రి బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం నగర పోలీస్ స్టేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు ఐతాండహళ్లి మంజునాథ్, మహిళా అధ్యక్షురాలు నళినిగౌడ, తాలూకా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు. -
పోలీసులుగా మీకు ఆత్మగౌరవం లేదా? హోంమంత్రి తీవ్ర వ్యాఖ్యలు
Karnataka Home Minister Araga Jnanendra Slams Cops: కర్ణాటక హోంమంత్రి అరగా జ్ఞానేంద్ర పోలీసులపై చేసిన తీవ్ర వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. పశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకుంటారని పోలీసులుపై మండిపడ్డారు. కొంతమంది పోలీసులు లంచాలు తినే కుక్కల్లా బతుకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడిన వీడియో రికార్డింగ్ వైరల్‌గా మారింది. అయితే పుశువుల అక్రమ రవాణాదారుల నుంచి లంచాలు తీసుకొని కొంతమంది పోలీసులు వారిని వదిలేస్తున్నారని, విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఆత్మగౌరవం ఉండదా? అని ప్రశ్నించారు. వధించడం కోసం పశువులను రవాణా చేయడం కర్ణాటక ప్రభుత్తం నిషేధించిన విషయం తెలిసిందే. తాను పోలీసులందరినీ విమర్శించడం లేదని, డబ్బు కోసం పశువుల అక్రమ రవాణాదారులతో కుమ్మక్కైన పోలీసులను మాత్రమే విమర్శిస్తున్నానని తెలిపారు. -
టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు
-
కేంద్రంలో మోదీ.. యూపీలో యోగి
సాక్షి, న్యూఢిల్లీ: 2024లో కేంద్రంలో నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిగా చేయాలంటే.. 2022లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మళ్లీ గెలిపించి, యోగి ఆదిత్యనాథ్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిందేనని హోం మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన యూపీ రాజధాని లక్నోలో పర్యటించారు. ‘మేరా పరివార్–బీజేపీ పరివార్’ పేరిట సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు. రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్‌గా మార్చేందుకు మరో ఐదేళ్లు బీజేపీ అధికారంలో ఉండడం అవసరమని చెప్పారు. రాష్ట్రంలో మాఫియాను తరిమికొట్టే అతిపెద్ద పనిని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేశారని ప్రశంసించారు. 1.43 లక్షల మందికి పైగా పోలీసు సిబ్బంది నియామకంలో ఎక్కడా ఎలాంటి అవినీతి జరగలేదని గుర్తుచేశారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా వ్యాప్తి, వరదల సమయంలో అఖిలేష్ యాదవ్, రాహుల్‌గాంధీ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. 2014లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని తెలిపారు. యూపీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 300 సీట్లకు పైగా గెలుచుకోవాలని బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 1.5 కోట్ల నూతన కార్యకర్తలే లక్ష్యం: యోగి ఏక్ భారత్, శ్రేష్ట భారత్ కలను ప్రధాని మోదీ సాకారం చేశారని సీఎం యోగి అన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో కొత్త చైతన్యం వచ్చిందని చెప్పారు. ఇప్పుడు 1.5 కోట్ల మంది కొత్త కార్యకర్తలను తయారు చేసుకోవడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోదీ, అమిత్ షా నేతృత్వంలో అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతుండడంపై ప్రజలంతా గర్వపడుతున్నారని తెలిపారు. -
టీకా తీసుకున్నా రెండోసారి కరోనా బారిన మహారాష్ట్ర హోంమంత్రి
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ ముప్పు భయపెడుతోంది. కరోనా రష్యా, బ్రిటన్, చైనా దేశాల్లో మరోసారి కరోనా ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే డెల్టాకు సంబంధించిన కొత్త వేరియంట్ ఏవై 4.2 ఉనికి దేశంలోని పలు రాష్ట్రాల్లో కనిపించడం ఆందోళన రేపుతోంది. తాజాగా మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ కరోనా బారినపడ్డారు.పాటిల్‌కు బుధవారం కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. ఏడాది వ్యవధిలో ఆయనకు రెండోసారి కరోనా సోకింది. మరోవైపు ఆయన రెండు మోతాదుల టీకా కూడా తీసుకున్నారు. గత ఏడాది అక్టోబరులో పాటిల్‌కు కరోనా నిర్ణారణ అయింది. స్వల్ప కరోనా లక్షణాలతో పరీక్ష చేయించుకోవడంతో తనకు పాజిటివ్ వచ్చిందని పాటిల్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు చెప్పారు. అలాగే నాగపూర్, అమరావతి పర్యటనల్లో భాగంగా, ఇతర కార్యక్రమాల్లో తనతోపాటు పాల్గొన్న వారు పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తూ పాటిల్ గురువారం ఉదయం ట్వీట్ చేశారు. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమాచారం గురువారం కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో 16,156 కొత్త కేసులు నమోదు కాగా, 733 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 17,000 మంది కోలుకున్నారు. అటు మహారాష్ట్రలో కొత్తగా 1485 కేసులు, 38 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,03,536 కు చేరింది. After experiencing mild symptoms I decided to get tested for COVID-19. I have tested positive. My condition is stable and I am following my doctor’s advice. I urge all those who came in contact with me during Nagpur & Amravati tour, & other programs, to get themselves tested. — Dilip Walse Patil (@Dwalsepatil) October 28, 2021 -
యువనటి ఆత్మహత్య కేసులో ట్విస్టు.. నటుడు వివేక్‌పై ఆరోపణలు
శివాజీనగర్ (కర్ణాటక): బుల్లితెర నటి సౌజన్య ఆత్మహత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నటుడు వివేక్ ప్రేమ, పెళ్లిపేరుతో వేధించడం వలన తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తండ్రి ప్రభు మాదప్ప ఆరోపించాడు. నటుడు వివేక్, అసిస్టెంట్ మహేశ్‌లపై కుంబళగోడు పోలీస్‌స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. కాగా, తన కూతురు అమాయకురాలని,ఎలాంటి తప్పు చేయలేదని తెలిపాడు. తన కూతురు దగ్గర ఉన్న బంగారం,డబ్బులు కనిపించడంలేదని ఫిర్యాదులో ప్రభు మాదప్ప పేర్కొన్నాడు. ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడికి ఒక సంవత్సరం నుంచి తన కూతురితో పరిచయం ఉందని తెలిపాడు. తన కూతురిని ప్రేమించాలని వేధించాడని చెప్పుకొచ్చాడు. కాగా, పోలీసులు వచ్చేలోగా ఘటనా స్థలం నుంచి తన కూతురి మృత దేహన్ని నిందితుడు మార్చాడని ఆరోపించాడు. ఆమె మొబైల్ కూడా కనిపించడం లేదని తెలిపాడు. మొబైల్ దొరికితే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నాడు. ఇక ఈ ఆరోపణలపై నటుడు వివేక్ స్పందిస్తూ.. ఇప్పుడు తానేమి చెప్పలేనని అన్నాడు. నటి సౌజన్య తనకు.. ఏడాదిగా తెలుసని అన్నాడు. ఆమె చాలా అమాయకురాలని అన్నాడు. సౌజన్య.. ఒత్తిడికి గురైనప్పుడల్లా తనబాధను నాతో చెప్పుకునేదని వివేక్ పేర్కొన్నాడు. మరోవైపు సౌజన్య గదిలో లభించిన నాలుగు పేజీల సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఆమె తన మానసిక స్థితి బాగాలేదని.. అందుకే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసింది. ఇక ఈ ఘటనపై కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర విచారణను వేగవంతం చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సూచించారు. కాగా, పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. చదవండి: Actress Soujanya : విషాదం.. సూసైడ్ నోట్ రాసి యువనటి ఆత్మహత్య -
TS: నేడు నిర్మల్‌కు అమిత్‌షా
సాక్షి, హైదరాబాద్/ నిర్మల్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శుక్రవారం నిర్మల్ రానున్నారు. వెయ్యిమంది అమరవీరులకు ఆయన నివాళులరి్పంచిన అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి దారిలో గల క్రషర్ మైదానంలో తెలంగాణ విమోచన సభలో పాల్గొంటారు. పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నిర్మల్ సభ కోసం బండి సంజయ్ తమ పాదయాత్రకు ఒకరోజు విరామం ఇవ్వనున్నారు. పాదయాత్రలో తనతో వెంట నడుస్తున్న 300 మంది కార్యకర్తలు, ఇతర నాయకులతో కలిసి నేరుగా నిర్మల్ బహిరంగసభ వేదికకు చేరుకుంటారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న బీజేపీ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది నిర్మల్‌లో భారీ సభకు ఏర్పాట్లు చేసింది. రాంజీగోండు సహా వెయ్యిమంది వీరుల ప్రాణత్యాగాల చరిత్రను దేశానికి తెలిసేలా చేయాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ చెబుతోంది. ఈ కార్యక్రమానికి అమిత్‌షా ముఖ్యఅతిథిగా రానుండడంతో జాతీయస్థాయిలో నిర్మల్ పేరు చర్చకు వస్తోంది. అమిత్‌షా షెడ్యూల్ ఇదీ.. ► ఉదయం 9.25 నిముషాలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి బీఎస్ఎఫ్ ప్రత్యేక విమానంలో బయలుదేరి నాందేడ్ విమానాశ్రయంలో దిగుతారు ► 12 గంటలకు నాందేడ్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ముద్ఖేడ్ సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రానికి చేరుకుంటారు. æ అక్కడ మొక్కలు నాటాక ముద్ఖేడ్‌లోనే వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ► అక్కడే మధ్యాహ్న భోజనం చేస్తారు. æ ఆ తర్వాత ముద్ఖేడ్ నుంచి హెలికాప్టర్లో నిర్మల్‌కి చేరుకుంటారు. ► హెలిప్యాడ్ నుంచి కారులో బహిరంగ సభాస్థలి నిర్మల్ క్రషర్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. æ సభాస్థలి ప్రాంగణంలోనే ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సందర్శిస్తారు. ► అక్కడే మాజీ ఉప ప్రధాని, కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. æ సెపె్టంబర్ 17 విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగురవేస్తారు. æ అనంతరం కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత బహిరంగసభలో ప్రసంగిస్తారు.æ సాయంత్రం 5 గంటల సమయంలో నిర్మల్ నుంచి హెలికాప్టర్లో నాందేడ్‌కు తిరుగు ప్రయాణమవుతారు æ రాత్రి 8 గంటల సమయంలో నాందేడ్ ఎయిర్పోర్ట్ నుంచి బీఎస్ ఎఫ్ విమానంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. -
తానేటి వనితకు స్వాగతం పలికిన మంత్రి రంగనాథరాజు
-
Karnataka: ఆరు నెలలు జైల్లో ఉన్నా: హోంమంత్రి
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): నేను కూడా దేశంలో ఎమర్జెన్సీ సమయంలో ఆరు నెలలపాటు జైల్లో ఉన్నా అని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర తెలిపారు. జైల్లో ఏం దొరుకుతుంది, ఏమి దొరకదో బాగా తెలుసు. ఒక బీడీకి ఎంత డబ్బులివ్వాలో నాకు బాగా తెలుసన్నారు. బుధవారం చిక్కమగళూరు జిల్లా తరీకెరె జైలును తనిఖీ చేశారు. జైల్లో సరిగా అన్నం వండి పెట్టడం లేదని కొందరు ఖైదీలు రాసిన లేఖ తనకు చేరిందన్నారు. ఆ లేఖ ఖైదీలు రాశారో లేక ఎవరు రాశారో తెలియదు. నా ఫోన్‌కు వచ్చిందని, జైల్లో చిన్నచిన్న తప్పులను గుర్తించినట్లు చెప్పారు. ఎమర్జెన్సీ సమయంలో జేహెచ్ పటేల్, డీహెచ్ శంకరమూర్తితో కలిసి జైలులో ఉన్నట్లు తెలిపారు. చదవండి: Padmarajan Record: రాజాధిరాజన్ ఓడినా.. రికార్డే -
సామూహిక లైంగిక దాడి ఘటన: కర్ణాటక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
Mysore Gang Rape Case: మైసూర్ శివార్లలో పరిశోధక విద్యార్ధినిపై ఆరుగురు వ్యక్తుల సామూహిక లైంగిక దాడి ఘటనకు సంబంధించి కర్ణాటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లైంగిక దాడి ఘటనను ఉద్దేశిస్తూ.. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమెకు అక్కడేం పని అని అంటూ బాధితురాలని కించపరిచేలా వ్యాఖ్యానించారు. బాధితురాలు ఆమె స్నేహితుడు అక్కడికి కాకుండా వేరే నిర్జన ప్రదేశానికి వెళ్లాల్సిందంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. ఏదిఏమైనప్పటికీ.. ఈ ఘటన అమానుషమని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఘటనను రాజకీయం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. మైసూరులో ఘటన జరిగితే కాంగ్రెస్ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ.. తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ వ్యవహారం చూస్తే.. తనపై లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నట్లుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బ్రిజేష్ కల్లప్ప తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హోం మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని, తాను జవాబుదారిగా ఉండాల్సిన అంశంలో తనకేం సంబంధం లేదంటూ చేతులు దులుపుకునే ప్రయత్నం చేయడం మంత్రి అవగాహాన రాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. మరోవైపు ఈ ఘటనపై రాష్ట్ర బీజేపీ నేత ఎస్ ప్రకాష్ కూడా స్పందించారు. ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయం చేయరాదని, హోం మంత్రి కూడా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిందని అన్నారు. చదవండి: తల్లి అయిన టీఎంసీ ఎంపీ, విషెస్ చెప్పిన మాజీ భర్త -
Karnataka: ఖాకీలూ మారాలి.. హోంమంత్రి జ్ఞానేంద్ర హెచ్చరిక
సాక్షి, బనశంకరి (కర్ణాటక): పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చే సిబ్బందిని సహించేదిలేదని హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర హెచ్చరించారు. బుధవారం మైసూరురోడ్డులోని సీఏఆర్ కేంద్ర కార్యాలయంలో నగర పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.56 కోట్ల విలువైన సొత్తు ప్రదర్శన, వారసుదారులకు అప్పగింతలో హోంమంత్రి పాల్గొని మాట్లాడారు. రౌడీలతో, నేరకార్యకలాపాలకు పాల్పడేవారితో ఎవరైనా పోలీసులు చేతులు కలిపితే ఊరుకోబోమని, అలాంటి వారిని ఎక్కడ పెట్టాలో అక్కడ ఉంచుతామన్నారు. కొందరి వల్ల పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తోందన్నారు. పోలీసులు నేరగాళ్లను మట్టికరిపించాలి తప్ప నేరస్తులతో కుమ్మక్కు కారాదని సూచించారు. కొందరు పోలీసులు హత్యకేసుల్లో భాగస్వాములయ్యారనే ఆరోపణలు వినబడుతున్నాయని, ఇలాంటివి సహించేది లేదని తెలిపారు. బాగా పనిచేసేవారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ కేసుల్లో రికవరీ చేసిన రూ.56 కోట్లు విలువచేసే వాహనాలు, బంగారం, ఇతర విలువైన సామగ్రిని, రూ.32 కోట్ల డ్రగ్స్‌ను ప్రదర్శించారు. సొత్తును సొంతదారులకు అప్పగింతను ప్రారంభించారు. సవాల్‌గా మారిన భద్రత: కమిషనర్ పోలీస్ కమిషనర్ కమల్‌పంత్ మాట్లాడుతూ వేర్వేరు రాష్ట్రాల నుంచి ప్రజలు బెంగళూరుకు వచ్చి స్థిరపడటంతో వారికి భద్రత కల్పించడం సవాల్‌తో కూడుకున్న విషయమన్నారు. డ్రగ్స్‌ను, గూండాగిరీని అడ్డుకట్టకు కఠినచర్యలు తీసుకుంటున్నామని, నగరంలోని అఫ్గానిస్తాన్లకు పూర్తి భద్రతను కల్పిస్తామని చెప్పారు. సీనియర్ ఐపీఎస్‌లు సౌమేందు ముఖర్జీ, మురుగన్, సందీప్ పాటిల్, రవికాంతేగౌడ పాల్గొన్నారు. -
మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యం: సుచరిత
-
రేపు శ్రీశైలంకు కేంద్రమంత్రి అమిత్ షా
సాక్షి, అమరావతి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా రేపు(గురువారం) ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన శ్రీశైలంకు వెళ్లనున్నారు. అమిత్ షా ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. అనంతరం ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లనున్నారు. -
Traffic Challan: వాహనదారులకు తీపి కబురు
సాక్షి, బనశంకరి( బెంగళూరు): వాహనదారులకు హోంశా మంత్రి ఎ.జ్ఞానేంద్ర తీపి కబురు అందించారు. బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ స్పాట్ ఫైన్‌ను రద్దుచేయాలని పోలీసుశాఖను ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ పోలీసులు వినియోగిస్తున్న చలానా ఉపకరణాలను వారి వారి పోలీస్స్టేషన్లలో అప్పగించాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను ట్రాఫిక్ పోలీసులు నిలిపి అక్కడిక్కడే చలానాలు రాసి వసూలు చేస్తున్నారు. ఇందుకు పీడీఏ మిషన్లను ఉపయోగిస్తున్నారు. చలానాలపై ఆరోపణలు ఫైన్ చెల్లించినప్పటికీ పీడీఏ లేదా పీఓఎస్ మెషిన్లు గత జరిమానాలు పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతున్నాయని ప్రజల నుంచి ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా స్పాట్ చలానాలను రద్దు చేయాలని హోంమంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో రోడ్లపై డిజిటల్ కెమెరాలో రికార్డయ్యే ఉల్లంఘలనపై వాహనదారు ఇంటికి చలానా పంపిస్తారు. -
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. హోంమంత్రి సీరియస్
సాక్షి, హైదరాబాద్: మాసబ్ ట్యాంక్‌లో తెలంగాణ డీజీపీ ప్రోటోకాల్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు బ్లాక్ చేసి వాహనాలను నిలిపివేశారు. దీంతో రెండు అంబులెన్స్‌లో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. అందులో ఎమర్జెన్సీ కేసులూ ఉన్నాయి. అంబులెన్స్ సైరన్ మోగుతున్న తమకేం పట్టన్నట్లు ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించారు. ఈ ట్రాఫిక్‌లో రెండు అంబులెన్స్‌లు దాదాపు గంటకు పైగా చిక్కుకున్నాయి. ఎంత సేపటికీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో అంబులెన్స్ సిబ్బంది ట్రాఫిక్ కానిస్టేబుల్ వద్దకు వెళ్లి అంబులెన్స్‌లో పేషెంట్ పరిస్థితి విషమంగా ఉందని, వెంటనే దారివ్వాలని కోరారు. అయితే దానికి ట్రాఫిక్ సిబ్బంది నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీంతో అంబులెన్స్ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ సమస్యను క్లియర్ చేశారు. ప్రస్తుతం పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా మాసబ్ ట్యాంక్ పోలీసుల నిర్లక్ష్యంపై హోంమంత్రి మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్ ఘటనపై హైదరాబాద్ సీపీకి ఫోన్ చేసి ఆరా తీశారు. ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వివరణ ఇచ్చారు. అయితే మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తానని సీపీ హోంమంత్రికి తెలియజేశారు. -
ట్రాఫిక్ పోలీసుల నిర్లక్ష్యం.. హోంమత్రి సీరియస్
-
'దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టనున్నాం'
-
లోకేష్ శవరాజకీయాలకు పాల్పడుతున్నారు : హోం మంత్రి సుచరిత
-
సీబీఐ విచారణకు మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్
-
2 కోట్లు ఇవ్వు.. పవార్‌ను మేనేజ్ చేస్తాను!
సాక్షి, ముంబై: మహారాష్ట్ర మాజీ హోం మంత్రిపై పోలీస్ అధికారి పరమ్‌బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తనకు తిరిగి పోస్టింగ్ ఇచ్చేందుకు రూ.2 కోట్లు డిమాండ్ చేశారని సస్పెండైన పోలీస్ అధికారి సచిన్ వాజే ఆరోపించారు. మరో మంత్రి అనిల్ పరబ్ కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేయాలంటూ ఒత్తిడి చేశారని కూడా పేర్కొన్నారు. ఈమేరకు ఆరోపణలతో స్వయంగా రాసిన లేఖను బుధవారం ఎన్ఐఏ కోర్టుకు హాజరైన సమయంలో అందజేసేందుకు యత్నించగా జడ్జీ నిరాకరించారు. నిబంధనల మేరకు నడుచుకోవాలని ఆదేశించారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తనపై మళ్లీ సస్పెన్షన్ వేటు వేయాలని ప్రయత్నించారని వాజే ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, పవార్‌ను ఒప్పించే పూచీ తనదని అప్పటి హోం మంత్రి దేశ్‌ముఖ్..అందుకు గాను రూ.2 కోట్లు ఇవ్వాలని షరతు పెట్టారని తెలిపారు. అంత డబ్బు ఇవ్వలేనని అశక్తత వ్యక్తం చేయగా తరువాత ఇవ్వాలని దేశ్‌ముఖ్ కోరారన్నారు. సయిఫీ బుర్హానీ అప్లిఫ్ట్మెంట్ ట్రస్ట్ కేసు విచారణను మూసివేసేందుకు రూ.50 కోట్లు ఆ ట్రస్టు సభ్యుల నుంచి వసూలు చేయాలని టార్గెట్ పెట్టగా అటువంటి పనులను చేయలేనని తప్పుకున్నట్లు పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలున్న 50 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.2 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని మరో మంత్రి అనిల్ పరబ్ తనను కోరారని తెలిపారు. కాగా, ఈ ఆరోపణలను రవాణా శాఖ మంత్రి పరబ్ ఖండించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకే ఈ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ముంబై ఉన్న సుమారు 650 బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.3 లక్షల నుంచి రూ.3.5లక్షల వరకు వసూలు చేయాలని మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కోరినట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని అప్పటి పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్‌కు కూడా తెలిపానన్నారు. రాష్ట్రంలోని గుట్కా, పొగాకు అక్రమ వ్యాపారుల నుంచి రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ కేబినెట్లో సీనియర్ మంత్రి సన్నిహితుడినంటూ దర్శన్ ఘోడావత్ అనే వ్యక్తి సంప్రదించగా నిరాకరించినట్లు తెలిపారు. చదవండి: సంచలనం: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా పరంబీర్ ఆదేశాల మేరకే వాజేకు పోస్టింగ్ సస్పెండైన వివాదాస్పద పోలీస్ అధికారి సచిన్ వాజేను గత ఏడాది జూన్‌లో అప్పటి పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ ఆదేశాల మేరకే క్రైం ఇంటెలిజెంట్ యూనిట్(సీఐయూ)లోకి తిరిగి తీసుకున్నట్లు ముంబై పోలీస్ శాఖ మహారాష్ట్ర హోం శాఖకు అందజేసిన నివేదికలో స్పష్టం చేసింది. ఈ విషయంలో అప్పటి జాయింట్ పోలీస్ కమిషనర్(క్రైం) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోలేదని తెలిపింది. విధి నిర్వహణలో సచిన్ వాజే నేరుగా అప్పటి పోలీస్ కమిషనర్ పరంబీర్కే నేరుగా రిపోర్టు చేసేవారని తెలిపింది. కీలక కేసులపై జరిగే మంత్రివర్గ స్థాయిలో జరిగే సమావేశాల్లో సీపీతోపాటు పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారికి బదులుగా అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్థాయి ఉన్న వాజే పాల్గొనేవారని వివరించింది. కీలక కేసుల విచారణలో పోలీస్ కమిషనర్ పరంబీర్‌సింగ్ సూచనల మేరకు వాజే నిర్ణయాలు తీసుకునే వారని వెల్లడించింది. వాజేను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణల కేసులో ముంబై పోలీస్ మాజీ అధికారి సచిన్ వాజేను విచారించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు సీబీఐకి అనుమతి మంజూరు చేసింది. అనిల్ దేశ్‌ముఖ్ అవినీతికి పాల్పడ్డారంటూ ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు నివేదిక అంద జేయాలన్న ముంబై హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ రంగంలోకి దిగింది. పరంబీర్ సింగ్ ఆరోపణలపై కేసు నమోదు చేయడంతోపాటు ప్రస్తుతం ఎన్ఐఏ కస్టడీలో ఉన్న వాజేను ప్రశ్నించేందుకు అనుమతి వ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి పీఆర్ సిత్రే సీబీఐకి అనుమతించడంతోపాటు వాజే కస్టడీని ఈనెల 9వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. చదవండి: ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు -
‘మహా’ ముడుపులపై సీబీఐ
ముంబై: మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై పదిహేను రోజుల్లో ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీబీఐని బొంబే హైకోర్టు ఆదేశించింది. ప్రజల ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం, ప్రజల్లో నమ్మకం పాదుకొల్పడం కోసం స్వతంత్ర ఏజన్సీతో విచారణ అవసరమని తెలిపింది. మొత్తం మూడు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఒక క్రిమినల్ రిట్పిటీషన్పై కోర్టు తీర్పు వెలువరించింది. ఇందులో ఒక పిల్‌ను సింగ్ దాఖలు చేయగా, మిగిలిన పిల్స్‌ను ఒక లాయర్, ఒక టీచర్ దాఖలు చేశారు. క్రిమినల్ రిట్‌ను లాయర్ జయశ్రీ వేశారు. ఈనెల 25న దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా సీబీఐ విచారణ జరపాలని సింగ్ పిల్ దాఖలు చేశారు. సచిన్ వాజే సహా పలువురు పోలీసులను మామూళ్లు వసూలు చేయాలని అనిల్ ఆదేశించినట్లు సింగ్ ఆరోపించారు. ఈ ఆరోపణలను దేశ్‌ముఖ్ తోసిపుచ్చారు. మహా ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ పిల్‌ను తిరస్కరించాలని కోరారు. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు కానందున సీబీఐ విచారణ సాధ్యం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. మంగళవారం నుంచి సీబీఐ విచారణ షురూ! విచారణకు మంగళవారం సీబీఐ బృందం ముంబైకి వచ్చి విచారణ ప్రక్రియ ఆరంభించనుంది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో తమకు అధికారిక ఆదే శాలు అందిన అనంతరం లీగల్ అభిప్రాయం తీసు కొని సీబీఐ విచారణ ఆరంభిస్తుంది. కానీ ఈ కేసు లో కోర్టు కేవలం 15 రోజుల సమయం ఇవ్వడంతో వీలయినంత తొందరగా విచారణ ఆరంభించాలని సీబీఐ భావిస్తుందని అధికారులు చెప్పారు. ముంబై రాగానే కోర్టు ఆదేశాలను, ఫిర్యాదు కాపీలను, ఇతర డాక్యుమెంట్లను సీబీఐ సమీకరించనుంది. అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా తనపై మాజీ పోలీస్ కమిషనర్ సింగ్ చేసిన ఆరోపణలను సీబీఐతో విచారించాలని బొంబై హైకోర్టు నిర్ణయించడంతో మహారాష్ట్ర హోంమంత్రి అనీల్ దేశ్‌ముఖ్ ఆ పదవికి రాజీనామా చేశారు. అనీల్ తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్‌కు పంపినట్లు ఎన్సీపీకి చెందిన మంత్రి నవాబ్ మాలిక్ చెప్పారు. అనీల్ సైతం తన లేఖ కాపీని ట్విట్టర్లో ఉంచారు. కోర్టు ఆదేశానంతరం అనీల్ ఎన్సీపీ నేత శరద్ పవార్‌ను కలిసి పదవి నుంచి దిగిపోవాలని భావిస్తున్నట్లు చెప్పారని మాలిక్ తెలిపారు. పవార్ అంగీకారంతో అనీల్ రాజీనామాను ఉద్దవ్‌కు అందజేసినట్లు తెలిపారు. నూతన హోంమంత్రిగా ఎన్సీపీ నేత దిలీప్ వాల్సే పాటిల్ నియమితులయ్యారు. అనిల్æ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో దిలీప్‌ను సీఎం నియమించారు. -
సంచలనం: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా
ముంబై: పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు కీలక మలుపు తిరిగింది. మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. అతడిపై ముంబై మాజీ సీపీ పరమ్‌బీర్ సింగ్ అవినీతి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదై కోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. పార్టీ ఆదేశాల మేరకు అనిల్ దేశ్‌ముఖ్ తన రాజీనామా లేఖను సీఎం ఉద్దవ్ ఠాక్రేకు పంపించారు. హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తీరుపై ముఖ్యమంత్రికి పరమ్‌వీర్ సింగ్ ఫిర్యాదు చేశారు. పేలుడు పదార్థాల కేసులో ఎన్ఐఏ అరెస్టు చేసిన మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను మంత్రి వాడుకున్నారని ఆరోపించారు. నెలకు రూ.100 కోట్ల చొప్పున వసూలు చేయాలని వాజేకు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పురమాయించారంటూ పరంబీర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి అనిల్ ఫిబ్రవరి నుంచి పలు పర్యాయాలు సచిన్ వాజేను తన అధికార నివాసానికి పిలిపించుకున్నారని, నిధులు సమకూర్చేందుకు సాయపడాలంటూ పదేపదే మంత్రి అనిల్ కోరినట్లు తెలిపారు. రూ.100 కోట్ల ఫండ్ కలెక్ట్ ఎలా చేయాలో కూడా సచిన్ వాజేకు చెప్పినట్లు పరమ్‌బీర్ సింగ్ లేఖలో తెలిపారు. అయితే ఆయన రాజీనామాను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే ఇంకా ఆమోదించలేదు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రాజీనామాకు అంగీకారం తెలపడంతోనే అనిల్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. చదవండి: వాజే టార్గెట్ వంద కోట్లు -
దీటైన జవాబిస్తాం
-
దీటైన జవాబిస్తాం
గువాహటి/న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా సిబ్బందిపై దాడికి కారణమైన వారికి సరైన సమయంలో సరైన జవాబు చెబుతామని కేంద్ర హోంశాంఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్కౌంటర్ అనంతరం ఛత్తీస్‌గఢ్‌లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సంఖ్యను బట్టి చూస్తే ఈ ఘటనలో ఇరువైపులా నష్టం వాటిల్లిందని, ఎంతమంది చనిపోయారన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమని అన్నారు. అస్సాంలో ఉన్న అమిత్ షా ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్ గురించి తెలియగానే ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే విరమించుకున్నారు. హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఆదివారం ఉన్నతాధికారులతో సమావేశమై, తాజా పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘నక్సలైట్ల దాడిలో మన భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ హింసాకాండను సహించే ప్రసక్తే లేదు. బాధ్యులకు సరైన సమయంలో దీటైన జవాబు ఇచ్చితీరుతాం’’ అని తేల్చిచెప్పారు. అంతకుముందు ఆయన జల్కాబారీ నియోజకవర్గంలో, బార్పేట జిల్లా సోర్భోగ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి(ఎన్ఈడీఏ) అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అస్సాం అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండా అంటూ లేదని విమర్శించారు. ఎన్డీయే నేతృత్వంలోని ‘డబుల్ ఇంజన్’ ప్రభుత్వం అస్సాంను అభివృద్ధి పథంలో మరింత ముందుకు తీసుకెళ్తుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక టూరిస్టులాగా అస్సాంకు వచ్చివెళ్తున్నాడని అమిత్ షా వ్యాఖ్యానించారు. అస్సాంలో ఇప్పటికే జరిగిన రెండు దశల ఎన్నికల్లో బీజేపీ కూటమి అత్యధిక స్థానాలను దక్కించుకోబోతోందని జోస్యం చెప్పారు. ఇక పశ్చిమ బెంగాల్లో దీదీ మమతా బెనర్జీ ఇంటికెళ్లబోతున్నారని, బీజేపీ అధికారంలోకి రాబోతోందని స్పష్టం చేశారు. అస్సాంలో బీజేపీని మళ్లీ గెలిపిస్తే రాజధాని గువాహటిని ఆగ్నేయ ఆసియాకు స్టార్టప్ రాజధానిగా మారుస్తామని ఉద్ఘాటించారు. నక్సలైట్లపై విజయం తథ్యం ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లి, పరిస్థితిని స్వయంగా సమీక్షించాలని ఆదివారం సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్‌కు ఆదేశాలు జారీచేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ భగేల్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నక్సలైట్లు కేవలం తమ ఉనికిని చాటుకోవడానికి ఈ దురాగతానికి పాల్పడినట్లు భూపేష్ భగేల్ చెప్పారు. వారి సిద్ధాంతాల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోయారని అన్నారు. తీవ్రవాదులకు పరాజయం తప్పదని పేర్కొన్నారు. భద్రతా బలగాలు నైతిక స్థైర్యం కోల్పోలేదని, ఈ పోరాటంలో నక్సలైట్లపై కచ్చితంగా విజయం సాధిస్తారని అమిత్ షాకు తెలియజేశారు. కేంద్ర, రాష్ట్ర బలగాలు కలిసి పోరాడుతున్నాయని, విజయ బావుటా ఎగురవేస్తాయని అమిత్ షా ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా ట్వీట్ ఛత్తీస్‌గఢ్‌లో తీవ్రవాదులతో జరిగిన పోరాటంలో అమరులైన భద్రతా సిబ్బంది ప్రదర్శించిన ధైర్యసాహసాలు మరువలేనివని అమిత్ షా శ్లాఘించారు. ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. శాంతి, అభివృద్ధి కోసం శత్రువులకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఎన్కౌంటర్లో గాయపడిన భద్రతా సిబ్బంది త్వరగా కోలుకోవాలని అమిత్ షా ఆకాంక్షించారు. -
‘లవ్‌కి వ్యతిరేకులం కాదు, జిహాద్‌కి వ్యతిరేకం’
భోపాల్: వివాహం పేరుతో మోసపూరితంగా మతమార్పిడికి పాల్పడడంపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. దాన్ని నేరపూరితంగా పరిగణిస్తూ, అందుకు పదేళ్ళ వరకు జైలు శిక్షని విధించేలా మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బిల్లుని పాస్ చేశారు. ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ చట్టం ఆవశ్యకతను ప్రశ్నించగా, హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సమాధానమిస్తూ 1968 చట్టం మాదిరిగా కాకుండా, ఈ చట్టం అలాంటి వివాహాన్ని రద్దు చేస్తుందని, ఆ నేరానికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడుతుందని చెప్పారు. అలాగే లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధిస్తారన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో సైతం ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చారు. మోసపూరితంగా గానీ, బలవంతంగా గానీ, భయపెట్టిగానీ, ఏదైనా ప్రలోభంతో గానీ పెళ్ళి పేరుతో మతమార్పిడికి పాల్పడడం ఈ చట్టరీత్యా నిషేధం. దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తారు. ‘‘మధ్య ప్రదేశ్ ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ బిల్ 2021’’ఆమోదం అనంతరం బీజేపీ శాసనసభ్యులు సభలో ‘జై శ్రీరాం’నినాదాలు చేశారు. అంతకు ముందు జరిగిన చర్చ సందర్భంగా హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా మాట్లాడుతూ తాము లవ్ జిహాదీ కోసం ‘రఫీక్‌ని రవిగా’మారనివ్వమని అన్నారు. తాము ‘లవ్‌కి వ్యతిరేకులం కాదు, జిహాద్‌కి వ్యతిరేకం’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటులో సీఏఏని వ్యతిరేకించినట్టే, ఆర్టికల్ 370ని వ్యతిరేకించినట్టే కాంగ్రెస్ ఈ బిల్లుని సైతం వ్యతిరేకించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యానాన్ని కాంగ్రెస్ నేతలు విజయ్ సక్సేనా తదితరులు తీవ్రంగా తప్పు పట్టారు. చదవండి: కోవిడ్ టీకా: పడిపడి నవ్వుతున్న పోలీసు అధికారి -
ఉమెన్స్ డే: ఆమె కానిస్టేబుల్ కాదు.. హోం మంత్రి!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఓ మహిళా కానిస్టేబుల్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో మీనాక్షి వర్మ అనే కానిస్టేబుల్‌కు ఒకరోజు హోంమంత్రిగా పనిచేసే అవకాశం లభించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ మీనాక్షిని మంత్రి మిశ్రా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన చైర్‌ను ఓ రోజు పాటు కానిస్టేబుల్ మీనాక్షి వర్మకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ ఒక్కరోజు(సోమవారం) హోంశాఖ పూర్తిగా మీనాక్షి ఆదేశాల మేరకే పని చేస్తుందని పేర్కొన్నారు. అనంతరం సమస్యలు తెలపటానికి వచ్చిన ప్రజల నుంచి మీనాక్షీ వర్మ పలు వినతిపత్రాలు స్వీకరించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కాగా ప్రజా సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చిన ప్రజలు అక్కడ మంత్రి కూర్చునే స్థానంలో ఓ మహిళా కానిస్టేబుల్ ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు. మహిళా దినోత్సవం రోజున తనకు దక్కిన ఈ అరుదైన గౌరవం తనకు జీవితాంతం గుర్తుండిపోతుందని మీనాక్షి అన్నారు. తాను హోంమంత్రిగా పనిచేసే అవకాశం తనకు దక్కుతుందని తాను కలలో కూడా ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు మీనాక్షి హోమంత్రి కార్యాలయంలోనే సెక్యూరిటీ విధుల్లో ఉంటున్నారు. చదవండి: రాజస్తాన్ కమలంలో వర్గపోరు ! ప్రధాని అపాయింట్మెంట్ కోరిన సీఎం జగన్ Madhya Pradesh: Woman constable Meenakshi Verma took charge as state home minister for a day today. "I have given my chair to Meekankshi for the day on the occasion of #InternationalWomensDay," State Home Minister Narottam Mishra says. pic.twitter.com/zBD722giKd — ANI (@ANI) March 8, 2021 -
తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్
-
పూర్తి సామర్థ్యంతో సినిమా హాళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వంద శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లలో ప్రదర్శనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కేంద్ర హోంశాఖ ఇటీవల జారీ చేసిన నూతన కోవిడ్–19 మార్గదర్శకాలకు అనుగుణంగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం ప్రామాణిక నియమావళిని విడుదల చేశారు. కోవిడ్–10 ప్రోటోకాల్స్ పాటిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి వంద శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చని పేర్కొన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిబంధనలు పాటించాలని చెప్పారు. శానిటైజేషన్ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయాలన్నారు. పూర్తి సామర్థ్యంలో సినిమా హాళ్లలో ప్రదర్శనలు కొనసాగించవచ్చంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఏఐ) స్వాగతించాయి. డిజిటల్‌కి గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తాం.. ఓటీటీల్లో విడుదలవుతున్న పలు వెబ్ సిరీస్‌లు, షోలు వివాదాలకు దారి తీస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ వేదికలపై విడుదలయ్యే వెబ్‌సిరీస్‌లు, షోల నియంత్రణకు గైడ్‌లైన్స్ ఏర్పాటు చేస్తామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ‘‘ఓటీటీల్లో విడుదలవుతున్న కంటెంట్‌పై ఫిర్యాదులు వస్తున్నాయి. త్వరలోనే గైడ్‌లైన్స్ తీసుకొస్తాం’’ అని వెల్లడించారు. నియమావళిలోని ముఖ్యాంశాలు ► కంటైన్మెంట్ జోన్లలోని థియేటర్లలో చలనచిత్రాల ప్రదర్శనకు అనుమతి లేదు. ► క్షేత్రస్థాయి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రాలు /కేంద్రపాలిత ప్రాంతాలు అదనపు చర్యలకు సిఫార్సు చేయొచ్చు. ► థియేటర్లలో సీట్ల సామర్థ్యం వందశాతానికి పెంచుకోవచ్చు. ► సినిమా హాళ్లు, థియేటర్లలో కోవిడ్–19 సంబంధిత భద్రతా చర్యలను అమలు చేయాలి. ► ఫేస్ మాస్కుల వినియోగం తప్పనిసరి. ► థియేటర్ల బయట, కామన్ ప్రాంతాలు, వేచిఉండే ప్రాంతాల్లో కనీసం ఆరు అడుగుల సామాజిక దూరం పాటించేలా చూడాలి. ► బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ► ఆరోగ్యసేతు యాప్ వినియోగాన్ని ప్రోత్సహించాలి. ► ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో రద్దీ లేకుండా ప్రేక్షకులకు థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. ► సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ స్క్రీన్‌లో సినిమాల ప్రదర్శనల మధ్య తగినంత విరామం ఇవ్వాలి. ► టికెట్లు, ఆహారం, పానీయాల కొనుగోలులో చెల్లింపుల నిమిత్తం కాంటాక్ట్‌లెస్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలి. ► టికెట్ల కొనుగోలు నిమిత్తం రోజంతా తెరచి ఉండేలా తగిన సంఖ్యలో బాక్సాఫీస్ కౌంటర్లు ఏర్పాటు చేయాలి. కౌంటర్ల వద్ద రద్దీ లేకుండా ముందస్తు బుకింగ్‌ను అనుమతించాలి. ► థియేటర్ల ప్రాంగణంలో శానిటైజేషన్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► మానవ సంచారం ఉండే అన్ని చోట్లా హ్యాండిల్స్, రెయిలింగ్స్ తరచుగా శానిటైజ్ చేయాలి. ► థియేటర్లలో చేయాల్సిన పనులు, చేయకూడని పనులపై ప్రకటనలు, పోస్టర్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలి. -
అట్టుడుకుతున్న ఢిల్లీ.. అమిత్ షా కీలక భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ డే రోజున రైతులు చేప్టటిన ర్యాలీ హింసాత్మకంగా మారడంపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. ఘటనపై వెంటనే సమీక్షించేందుకు ఆ శాఖ మంత్రి అమిత్ షా అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చారు. హోంశాఖ నేతృత్వంలో ఉన్నతస్థాయి అధికారులు ఈ సమావేశంలో రైతుల ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనపై చర్చించనున్నారు. అలాగే ఎర్రకోటపై రైతు జెండాను ఎగరేయడంపై కూడా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాజా హింసాత్మక ఘటనలో ఓ రైతు మృతిచెందగా.. మరికొంతమంది గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసుల వాహనాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. బారికేడ్లు, బస్సులు, కంటైనర్లను తోసుకుంటూ ఎర్రకోట వైపు దూసుకెళ్లారు. రైతుల ఆందోళనతో ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేశారు. హింసాత్మక చర్యలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను సైతం నిలుపుదల చేశారు. (ఎర్రకోటపై ఎగిరిన రైతు జెండా ) -
పాతబస్తీలో 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో పుట్టి పెరిగారు. చట్టసభకు ఎంపికయ్యారు. రాష్ట్ర హోంమంత్రి పదవిలో ఉన్నారు. బల్దియా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతున్న వేళ ఆజంపురా కేంద్రంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు హోంమంత్రి మహమూద్ అలీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వందకుపైగా డివిజన్లలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేస్తున్నారు. నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్ఎస్కు మళ్లీ పట్టం కడతారని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ముఖాముఖి మాట్లాడారు. ► టీఆర్ఎస్ ఎన్ని డివిజన్లను కైవసం చేసుకుంటుంది? బల్దియాలో గత ఐదేళ్లలో దేశంలోని ఏ నగరంలో జరగని అభివృద్ధి హైదరాబాద్‌లో జరిగింది. నగరం మెరుస్తోంది. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చూసి గ్రేటర్ జనం ఓటు వేస్తారని భావిస్తున్నాం. వంద డివిజన్లకుపైగా గెలుస్తాం. ► మజ్లిస్‌తో టీఆర్ఎస్కు పొత్తు ఉందా? మేం సొంతంగా 150 డివిజన్లలో బరిలో నిలిచాం. మాకు ఏ పారీ్టతోనూ పొత్తు లేదు. గత ఎన్నికల్లో పాతబస్తీలో 5 డివిజన్లలో గెలిచాం. పాతబస్తీలో ఈసారి 10 నుంచి 15 స్థానాలు గెలుస్తాం. మజ్లిస్‌తో టీఆర్ఎస్కు పొత్తు ఉందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవు. ► నగరంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయి? దేశంలో ఎక్కడా లేనివిధంగా అత్యాధునిక పరికరాలతో పోలీస్ శాఖ పని చేస్తోంది. గత ప్రభుత్వాల హయాంలో నగర శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా ఉండేది. టీఆర్ఎస్ అధికారంలో వచి్చనప్పటి నుంచి నగర ప్రజలు శాంతియుతంగా జీవనం కొనసాగిస్తున్నారు. మతకల్లోలాలు, కర్ఫూలు, ఘర్షణలు లేవు. క్రైమ్ రేట్ ఇతర నగరాల కంటే చాలా తక్కువగా ఉంది. ►నగరంలో ఆశించినంత అభివృద్ధి జరగలేదనే విమర్శలపై మీరేమంటారు? టీఆర్ఎస్ అధికారంలో రాకముందు నగరంలో గంటల తరబడి విద్యుత్తు ఉండేది కాదు. ప్రస్తుతం 24 గంటలపాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తున్నాం. ఎప్పటికప్పుడు రోడ్లకు మరమ్మతులు జరుగుతున్నాయి. తాగునీరు పుష్కలంగా వస్తోంది. ప్రజల ఆరోగ్యం కోసం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశాం. రూ.5కు భోజనం అందిస్తున్నాం. విద్య, వైద్య వ్యవస్థలు మెరుగుపడ్డాయి ►టీఆర్ఎస్ పాలనలో మైనారిటీల సంక్షేమం ఎలా ఉంది? ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్యులర్ నాయకుడు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తోంది. కేవలం మైనారిటీలనే కాదు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం పథకాలు ప్రవేశపెట్టాం. ఇది భవిష్యత్‌లోనూ కొనసాగుతుంది. ►మైనారిటీలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారానే విమర్శలున్నాయి? మతత్వ పార్టీలు నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పింగిచాలని చూస్తున్నాయి. ఆ పార్టీల ఆగడాలు సాగవు. నగర ప్రజలు శాంతియుత వాతావరణం కోరుకుంటున్నారు. టీఆర్ఎస్ అన్ని మతాలను గౌరవిస్తుంది. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయడం సరికాదు. -
టీఆర్ఎస్ నేతల బాహాబాహి
సాక్షి, హైదరాబాద్ : రాంకోఠిలోని రూబీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం రసాభాసగా మారింది. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలోనే టీఆర్ఎస్ నాయకులు బాహాబాహికి దిగడం చర్చనీయాంశంగా మారింది. అసలు విషయంలోకి వెళితే.. రూబీ గార్డెన్స్‌లో నిర్వహించిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ, గోషామహల్ నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే సమావేశం సందర్భంగా తనను వేదికపైకి ఎందుకు పిలవలేదంటూ సమావేశానికి హాజరైన ఉద్యమకారుడు ఆర్వి మహేందర్ కుమార్ నిలదీశాడు. దాంతో పక్కనే ఉన్న మరో వ్యక్తి అడ్డుచెప్పబోతే ఒకరిని ఒకరు తోసుకుంటూ హోంమంత్రి సమక్షంలోనే కొట్టుకున్నారు. దీంతో సమావేశం నిలిపివేసిన హోంమంత్రి మహమూద్ అలీ గొడవపడుతున్న నాయకుల దగ్గరకు వెళ్లి వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. -
టీఆర్ఎస్ నేతల బాహాబాహి
-
‘మహమ్మారిపై విజయం మనదే’
గుర్గావ్ : కరోనా వైరస్‌పై పోరాటంలో భారత్ మెరుగైన స్ధానంలో ఉందని హోంమంత్రి అమిత్ షా అన్నారు. మహమ్మారిపై భారత్ దృఢంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు (సీఏపీఎఫ్) చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో అమిత్ షా ఆదివారం పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కరోనా వైరస్‌పై భారత్ విజయవంతంగా పోరాడటాన్ని ప్రపంచం గమనిస్తోందని చెప్పారు. ప్రపంచంలోనే పెద్దసంఖ్యలో జనాభా, ఫెడరల్ వ్యవస్థ కలిగిన భారత్‌లో కరోనాను ఎలా కట్టడి చేస్తారన్న సందేహాలు ముందుకొచ్చాయని అన్నారు. కోవిడ్-19పై పోరాటంలో దేశంలో 130 కోట్ల మంది జనాభా, అన్ని రాష్ట్రాలు, వ్యక్తులు ఒక్కటిగా నిలిచారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రభుత్వాలు కోవిడ్-19పై పోరాడుతున్నా మన దేశంలో ప్రతిఒక్కరూ ఈ వ్యాధిపై పోరుకు చేతులు కలిపారని చెప్పారు. కరోనా వైరస్‌పై గట్టిగా పోరాడి దాన్ని ఓడించే సత్తా మనకుందని అన్నారు. ఈ పోరాటంలో భద్రతా దళాలు కీలక పాత్ర పోషించాలని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కోవిడ్-19 విధుల్లో నిమగ్నమై 31 మందికి పైగా సీఏపీఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలు కోల్పోయారని, వీరి త్యాగం వృధా కాబోదని అన్నారు. చదవండి : ‘చైనా సరిహద్దు వివాదంపై చర్చకు సిద్ధం’ -
హోంమంత్రికి ప్రగతిభవన్‌లో నో ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి ప్రగతిభవన్‌లో నేరుగా ప్రవేశం లభించలేదు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమీక్ష నిర్వహిస్తుండగా, మధ్యాహ్నం 3.40 గంటల ప్రాంతంలో మహమూద్ అలీ సీఎంను కలిసేందుకు వచ్చారు. ప్రగతిభవన్ ప్రవేశ ద్వారం వద్దే ఆయన్ను భద్రతా సిబ్బంది నిలిపేశారు. కొంతసేపు అక్కడే వేచిచూసిన మహమూద్ అలీ తిరిగి వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ ముఖ్యమైన సమీక్ష నిర్వహిస్తున్నందున లోపలికి ఎవరినీ అనుమతించరాదని ఆదేశాలున్నాయని, హోంమంత్రి వచ్చిన విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందేలోగా ఆయన వెళ్లిపోయారని ముఖ్యమంత్రి ముఖ్య భద్రతా అధికారి ఎంకే సింగ్ ‘సాక్షి’కి తెలిపారు. ఎవరూ అడ్డుకోలేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన హోంమంత్రికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవలేదని, ఆయనను ఎవరూ అడ్డుకోలేదని హోం మంత్రి కార్యాలయ ప్రజాసంబంధాల అధికారి (పీఆర్వో) శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం సాయంత్రం సీఎంను కలిసేందుకు వెళ్లగా.. అదే సమయానికి ఆయన గవర్నర్‌ను కలిసేందుకు సిద్ధపడ్డారని తెలిసి హోంమంత్రి వెనుదిరిగారని వివరించారు. ము ఖ్యమంత్రిని కలుసుకోవడంలో హోంమంత్రి మహమూద్ అలీకి ఏనాడూ ఎలాంటి ఇబ్బందులూ ఎదురవలేదని, ఆయనను ప్రగతి భవన్‌లోకి వెళ్లకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోలేదని స్పష్టంచేశారు. -
‘ఈనాడుపై వెయ్యి కోట్లకు దావా’
సాక్షి, హైదరాబాద్: తమ పోలీసులు చాలా బాగా పని చేస్తున్నారని, ప్రజలతో ఫ్రెండ్లీగా ఉంటున్నారని తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్‌వన్‌గా నిలిచారని, నేరం జరిగిన వెంటనే నిందితులను అరెస్ట్ చేస్తున్నారని చెప్పారు. ‘దొంగలతో దోస్తి’ పేరుతో ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనాన్ని హోంమంత్రి ఖండించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈనాడు కథనంలో వాస్తవాలు లేవని అన్నారు. రాజకీయ నాయకులు చెప్తే పోలీస్ పోస్టింగ్‌లు వస్తున్నాయనేది అవాస్తవమని, బదీలీల వ్యవహారాన్ని గమనించడానికి ఓ ప్రత్యేక విభాగం ఉందని వెల్లడించారు. ఏ అధికారి ఎలా పని చేస్తున్నారనే దానిపై నిఘా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ భద్రత పరంగా బాగుండడానికి పోలీసుల పనితీరే కారణమని, ఆధారాలు లేకుండా కథనాలు రాయడం బాధాకరమన్నారు. ఏ ఆధారాలతో కథనాలు రాశారో ఈనాడు ఎడిటర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవాస్తవ కథనం ప్రచురించిన ఈనాడు సంపాదకులు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే ప్రభుత్వం తరపున వెయ్యి కోట్ల దావా వేస్తామని హెచ్చరించారు. (‘మేము బిజీగా ఉన్నాం.. వాళ్లకు పనిలేక’..) ఈనాడుపై చట్టప్రకారం చర్యలు: సజ్జనార్ ఈనాడు రాసిన కథనం పోలీసులను అవమానించేలా ఉందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. నేరాలు తగ్గే విధంగా పోలీసులు పనిచేస్తున్నారని, ఆధారాలు లేకుండా ఇలాంటి కథనాలు రాయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసులు ప్రజల కోసమే పనిచేస్తున్నారని, పోలీసు అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. ఏదైనా ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసుల వివరణ కూడా తీసుకోవాలని సూచించారు. ఏ అధికారి తప్పు చేశారని తమ దృష్టికి వచ్చినా తక్షణమే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు చెప్పినట్లు పోస్టింగ్ ఇస్తున్నామని రాయడం బాధాకరమని, ఇది పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఉందన్నారు. ఈనాడుపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతీయొద్దు ‘దొంగలతో దోస్తి’ పేరుతో ఈనాడు దినపత్రికలో వచ్చిన కథనం తెలంగాణ పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉందని తెలంగాణ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గోపిరెడ్డి మండిపడ్డారు. పోలీస్ అధికారుల నియామకాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉందని చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పోలీస్ శాఖ అత్యంత పారదర్శకంగా పని చేస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీసు వ్యవస్థ నిరంతరం శ్రమిస్తోందని, ఇలాంటి వార్తలు ప్రచురించడం వలన పోలీసుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడుపై న్యాయ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివరణ ఇవాలి: అడిషనల్ డీజీపీ దొంగలతో దోస్తీ కథనంలో వాస్తవం లేదని, ఈ వార్తపై ఈనాడు వివరణ ఇవాలని అడిషనల్ డీజీపీ(శాంతి భద్రతలు) జితేందర్ డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వార్త రాయడం బాధాకరమని, వాస్తవాలు మాత్రమే ప్రచురించాలని అన్నారు. పోలీసుల పోస్టింగుల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండదని స్పష్టం చేశారు. శాంత్రి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు 24 గంటలు పనిచేస్తున్నారని చెప్పారు. -
దాని గురించి మాట్లాడకుండా ఆరోపణలా?
సాక్షి, గుంటూరు: తనకు భద్రత తగ్గించారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఒక్కరిని కూడా తగ్గించలేదని స్పష్టం చేశారు. ఆర్నెళ్లకొకసారి ఇలాంటి ఆరోపణలు చేయటం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రజల్లో సానుభూతి కోసం ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన వ్యక్తిగత మాజీ కార్యదర్శి ఇంట్లో జరిగిన ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాల గురించి మాట్లాడరు గానీ ఇలాంటి ఆరోపణలు మాత్రం చేస్తుంటారని చురక అంటించారు. చంద్రబాబు కోరితే ఆయనకు మరింత భద్రతను పెంచటానికి సిద్ధమని హోంమంత్రి ప్రకటించారు. (చదవండి: ఐటీ గుప్పిట్లో బిగ్‌బాస్ గుట్టు!) 183 మందితో చంద్రబాబుకు భత్రత: డీజీపీ దేశంలో అత్యంత ఎక్కువగా చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ప్రస్తుతం జడ్‌ప్లస్ కేటగిరి కింద సెక్యురిటీ ఇస్తున్నట్టు చెప్పారు. మొత్తం 183 మందితో ఆయనకు భద్రత ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. (చదవండి: చంద్రబాబూ.. ఏంటయ్యా నీ బాధ?) -
సచివాలయం అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫలితాలు విడుదల
-
ఇటలీ సోనియాకు ఇవ్వచ్చు కానీ..
చండీగఢ్ : హర్యానా హోం మినిస్టర్ అనిల్ విజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మంత్రి గురువారం మాట్లాడుతూ.. పాకిస్తాన్లో హింసకు గురవుతున్న మా హిందూ, సిక్కు సోదరులకు పౌరసత్వం ఇస్తానంటే, ఇటలీలో పుట్టి భారత పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీలు గ్రూపుగా ఏర్పడి దేశాన్ని తగలబెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి : ‘జాగ్రత్త! రాహుల్, ప్రియాంకలు అగ్గి రాజేస్తారు’ -
‘జాగ్రత్త! రాహుల్, ప్రియాంకలు అగ్గి రాజేస్తారు’
సాక్షి, చండీగఢ్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలు పెట్రోల్ బాంబు వంటి వారని హర్యానా హోం మంత్రి పేర్కొన్నారు. మంగళవారం రాహుల్, ప్రియాంకలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే స్థానికంగా 144 సెక్షన్ విధించి ఉండడంతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో హర్యానా బీజేపీ హోం మంత్రి అనిల్ విజ్ ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో జాగ్రత్తగా ఉండండి. వాళ్లు ప్రాణాలతో ఉన్న పెట్రోల్ బాంబు లాంటి వాళ్లు. వారు అడుగుపెట్టిన చోట అగ్గి రాజేసి, ప్రజా ఆస్తుల విధ్వంసానికి కారణమవుతారని ట్వీట్ చేశారు. చదవండి : రాహుల్‌కు ప్రశాంత్ కిషోర్ అభినందనలు Beware of @priyankagandhi and @RahulGandhi as they are live Petrol Bombs where ever they go they ignite fire and cause loss to Public Property. — ANIL VIJ MINISTER HARYANA (@anilvijminister) December 24, 2019 -
దిశ చట్టం : హోంమంత్రి సుచరితతో స్పెషల్ డిబెట్..
-
దేశ భద్రత కోసం మొత్తం సరిహద్దు రీమ్యాప్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ సరిహద్దులను రీ మ్యాప్ చేయడానికి కేంద్ర హోం శాఖ ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాలనుంచి మాదకద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ చొరబాటుదారులు, ఉగ్రవాదులు ప్రవేశిస్తున్న నేపథ్యంలో హోంమంత్రి అమిత్‌షా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అంతేకాక, ఆయా సరిహద్దులలో రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి జాయింట్ యాక్షన్ దళాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఇతర దేశాల నుంచి స్మగ్లింగ్ పెరుగుతున్న నేపథ్యంలో హోం మంత్రి అమిత్‌షా అక్టోబరులో పారా మిలిటరీ దళాల డీజీ, ఐబీ చీఫ్, రా, సీబీఐ అధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారని తెలుస్తోంది. హోంశాఖ వర్గాల సమాచారం ప్రకారం.. సరిహద్దు వెంబడి బైక్ మీద లేదా అవసరమైతే కాలినడకన వెళ్లి బలమైన కంచెను ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. సరిహద్దు రాష్ట్రాల భాగస్వామ్యంతో ఐబీ, సీబీఐ, కస్టమ్స్ అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిరోధించే చర్యకు ప్రభుత్వం ఉపక్రమించింది. మరోవైపు పంజాబ్‌లోకి పాక్ పెద్దెత్తున మాదకద్రవ్యాలు అక్రమంగా సరఫరా చేస్తుంది. ఐఎస్ఐ ప్రేరేపిత ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని స్థానికంగా రెచ్చగొడుతోంది. అంతేకాక, ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఆ దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, జీహాదీ ఉగ్రవాదం, భయంకర ఆర్థిక ఇబ్బందుల దృష్యా సరిహద్దుల్లోనూ, దేశంలోనూ తీవ్ర అలజడి సృష్టించే అవకాశాలున్నట్టు నిఘా వర్గాలు సమాచారమందించాయి. ఈ నేపథ్యంలో సీబీఐ, రా, ఎన్ఏఐ, ఇంటెలిజెన్స్, కౌంటర్ టెర్రరిజం, పంజాబ్ పోలీసులతో స్పెషల్ కౌంటర్ గ్రూపును ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో గతంలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో అక్కడ ఎస్పీజీ కమాండో యూనిట్‌ను నెలకొల్పాలని అమిత్‌షా భావిస్తున్నారు. పాకిస్తాన్‌లోని నరోవర్ జిల్లాలో సరిహద్దు వెంబడి ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదుల క్యాంపును గుర్తించామని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం కూడా దీనికి కారణం అయ్యింది. ఉగ్రదాడులను ఎస్పీజీ బలగాలు సమర్థంగా ఎదుర్కొంటాయి. -
బెంగళూరు, మైసూర్లో ఉగ్రకదలిక
మైసూరు: బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో ఉగ్రవాద స్లీపర్ సెల్స్ చురుగ్గా ఉన్నాయని, కర్ణాటక తీరం, బంగాళాఖాతం వెంబడి అవి తమ కార్యకలాపాలను తీవ్రతరం చేశాయని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం పేర్కొన్నారు. మైసూరులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. ఆ ఉగ్రవాద స్లీపర్ సెల్స్ జమాత్–ఉల్–ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ)కి చెందినవిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అనుమానిస్తోందని తెలిపారు. బెంగళూరు, మైసూరుల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వాన్ని మరింత జాగ్రత్త తీసుకోమని ఎన్ఐఏ సూచించిందన్నారు. కోస్టల్, ఇంటీరియర్ కర్ణాటకలోనే కాకుండా బంగాళాఖాతం, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో కూడా జేఎంబీ కార్యకలాపాలు విస్తరించిందని బొమ్మై హెచ్చరించారు. ఈ సందర్భంగా అక్రమ బంగ్లాదేశీ వలసదారులు కూడా రాష్ట్రంలో పెరుగుతున్నారని మంత్రి పేర్కొన్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఎన్ఐఏతో కలసి పనిచేస్తుందని, నవంబర్ 1 నుంచి పని చేయడం మొదలుపెడుతుందని తెలిపారు. జేఎంబీ బృందాలు తమిళనాడులోని క్రిష్ణగిరి కొండల ప్రాంతాల్లో శిక్షణ పొందాయని, అక్కడ స్థావరం ఏర్పర్చుకొని దేశవ్యాప్తంగా అలజడి సృష్టించాలని చూశాయని ఎన్ఐఏ తెలిపింది. జేఎంబీ జార్ఖండ్, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లో విస్తరించిందని న్యూఢిల్లీలో జరిగిన ఏటీఎస్ సమావేశంలో ఎన్ఐఏ చీఫ్ వైసీ మోదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా తన కోరలు విస్తరించాలని జేఎంబీ చూస్తోందని, ఇప్పటికే 125 మంది అనుమానితుల జాబితాను రాష్ట్రాలకు అందించామన్నారు. జేఎంబీ గ్రూప్ 2014 నుంచి 2018 మధ్య బెంగళూరులో 22 రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుందన్నారు. -
ఘనంగా హోంమంత్రి మేకతోటి సుచరిత కుమార్తె వివాహం
-
త్వరలోనే ఖాళీలన్నీ భర్తీ చేస్తాం : హోంమంత్రి
సాక్షి,అమరావతి : పోలీస్‌శాఖలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, జైలు వార్డన్స్ కానిస్టేబుళ్ల ఫలితాలను గురువారం విడుదల చేసినట్లు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. మొత్తం 2623 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికవగా, అందులో 500 మంది మహిళలు ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే శిక్షణ ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం త్వరలోనే భారీ రిక్రూట్మెంట్ చేపట్టి పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలన్నింటిని భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్‌శాఖలో అమలు చేస్తున్న వీక్లీఆఫ్ వలన కొత్తగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించామని తెలిపారు. ఎస్సై ఫిర్యాదు చేస్తే చర్యలు పల్నాడు ఘటనపై స్పందించిన సుచరిత... టీడీపీ స్వార్థ రాజకీయాలు పల్నాడులో పని చేయలేదని విమర్శించారు. టీడీపీ చేపట్టదలిచిన 'చలో ఆత్మకూరు'లో పెయిడ్ ఆర్టిస్ట్‌లు ఉన్నారు కాబట్టే వాళ్ల శిబిరం నుంచి కార్యకర్తలు వెళ్లిపోయారని మండిపడ్డారు. దళితుల పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తోన్న చంద్రబాబు వారి ప్రభుత్వ హయాంలో ఐపీఎస్ అధికారిణి వనజాక్షిపై జరిగిన దాడిపై ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా ఎస్సైగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తోన్న మహిళను నన్నపనేని రాజకుమారి కులం పేరుతో ధూషించడం తగదని హెచ్చరించారు. ఎస్సై ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి స్పష్టం చేశారు. దళితులను అవమానిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత పేర్కొన్నారు. -
అమిత్ షాకు సర్జరీ
న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అస్వస్థతకు గురవ్వడంతో అహ్మదాబాద్‌లోని కేడీ ఆస్పత్రి వైద్యులు ఆయనకు చిన్నపాటి సర్జరీ చేశారు. అమిత్ షాకు చికిత్సలో భాగంగా పరీక్షించిన వైద్యులు.. ఆయన మెడ వెనుక భాగంలో మైనర్ సర్జరీ నిర్వహించి లింఫోమాను తొలగించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సర్జరీ అనంతరం మధ్యాహ్నం గం. 12.30 గంటల ప్రాంతంలో అమిత్ షాను డిశ్చార్జ్ చేయడంతో ఆయన సర్కేజ్- గాంధీనగర్ హైవే రోడ్డులోని తన నివాసానికి వెళ్లారు. కాగా, వ్యక్తిగత పర్యటన నిమ్మిత్తం మంగళవారం రాత్రి అమిత్ షా తన కుటుంబ సభ్యులతో కలిసి గుజరాత్‌కు వచ్చారని, ఇప్పుడు ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. -
మానవత్వం చాటుకున్న హోంమంత్రి సుచరిత
గుంటూరు రూరల్: నడిరోడ్డుపై ఫిట్స్ వచ్చి పడిపోయిన ఓ యువకుడికి సత్వరం చికిత్స చేయించి మానవత్వాన్ని చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత. వివరాల్లోకి వెళ్తే విజయవాడ–చెన్నై జాతీయ రహదారిపై లారీలో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి మంగళవారం గుంటూరు జిల్లా కొలనుకొండ సమీపంలో ఉండగా ఫిట్స్ వచ్చింది. ఫిట్స్‌తో కొట్టుకుంటున్న యువకుడిని లారీడ్రైవర్ లారీ నుంచి దించి నడిరోడ్డుపై విడిచి వెళ్లాడు. అటుగా వెళ్తున్న వందల వాహనాలు రోడ్డుపక్కన ఫిట్స్‌తో కొట్టుకుంటున్న యువకుడిని చూసి పట్టించుకోకుండా వెళ్తుండగా, అదే సమయంలో సెక్రటేరియట్ నుంచి గుంటూరుకు కాన్వాయ్‌తో వెళ్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆ యువకుడిని గమనించి కాన్వాయ్ నిలిపి ఆతనికి తాగునీరు అందించి, సిబ్బందితో సమీపంలోని వైద్యులను పిలిపించి ప్రథమచికిత్స చేయించారు. అనంతరం సెక్యూరిటీ సిబ్బందితో ఆతని వివరాలు తెలుసుకుని ఫోన్ ద్వారా నెల్లూరులోని యువకుడి అక్కకు సమాచారం అందించారు. యువకుడు స్పృహలోకి వచ్చిన తరువాత ఆతనిని పోలీసుల సహాయంతో నెల్లూరుకు బస్‌లో పంపించారు. -
భద్రతతోనే ఆర్థికాభివృద్ధి : అమిత్ షా
సాక్షి, న్యూఢిల్లీ : దేశ భద్రత ఆర్థిక పురోగతికి అత్యంత కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పోలీసు బలగాల ఆధునీకరణ ప్రాధాన్యతను వివరిస్తూ దేశంలో భద్రతా పరిస్థితి మెరుగవకుంటే ఆర్థిక పురోగతి సాధ్యం కాదని చెప్పారు. బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ 49వ వ్యవస్థాపక దినం సందర్భంగా ఆయన మాట్లాడుతూ విచారణలో భాగంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించే రోజులకు కాలం చెల్లిందని, దీనికోసం శాస్ర్తీయ పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. దర్యాప్తు ప్రక్రియలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టేందుకు అవసరమైన కసరత్తు సాగుతోందని తెలిపారు. దేశాన్ని ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ప్రధాని సంకల్పాన్ని నెరవేర్చేందుకు దేశంలో అంతర్గత భద్రతను మెరుగ్గా నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. -
మోడల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించిన హోంమంత్రి
సాక్షి, ఆవనిగడ్డ(కృష్ణా) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం ఆవనిగడ్డలో మోడల్ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు పేర్ని నాని, మోపిదేవి వెంకటరమణ, అడిషనల్ డీజీపీ సునీల్ కుమార్, డిఐజి ఏఎస్ ఖాన్లు అతిథులుగా హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన హోంమంత్రి మేకతోటి సుచరితకు అధికారుల సమక్షంలో ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పోలీస్ సిబ్బందికి మౌలిక సదుపాయల కల్పన కోసమే మోడల్ పోలీస్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు సుచరిత పేర్కొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే మహిళల సమస్యలను పరిష్కరించడానికి ' మహిళా క్రాంతి' కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 'మహిళా మిత్ర' పేరిట ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తే మహిళలు తమ సమస్యలను మరింత స్వేచ్ఛగా తెలపడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. మహిళా పోలీసులు బందోబస్తుకు వెళ్లినపుడు వారికి కనీస అవసరాలు తీర్చేందుకు మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అవినీతి రహితంగా ఉంటూ, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా లక్ష్యం పెట్టుకోవాలని సుచరిత పిలుపునిచ్చారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్య్వస్థను తీసుకొస్తాం: హోంమంత్రి
-
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
-
ప్రజా సంక్షేమమే లక్ష్యం
న్యూఢిల్లీ: దేశ భద్రత, ప్రజా సంక్షేమమే మోదీ ప్రభుత్వ ప్రథమ లక్ష్యాలని నూతన హోం మంత్రి అమిత్ షా తెలిపారు. హోం మంత్రిగా రెండు రోజుల క్రితం బాధ్యతలు చేపట్టిన ఆయన శనివారం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు హోం మంత్రిత్వ శాఖ పనితీరు, ప్రస్తుతం శాఖకు సంబంధించిన కీలక అంశాలను అధికారులు వివరించారు. షాతో పాటు సహాయ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన జి.కిషన్‌రెడ్డి, నిత్యానంద్ రాయ్ కూడా దాదాపు గంటసేపు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. అంతకుముందు నార్త్‌బ్లాక్‌లోని హోం శాఖ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ రాజీవ్ జైన్ తదితర సీనియర్ అధికారులు మంత్రి అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. సమావేశం అనంతరం అమిత్ షా ట్విట్టర్లో..‘దేశ భద్రత, ప్రజా సంక్షేమం మోదీ ప్రభుత్వం ప్రథమ లక్ష్యాలు. మోదీజీ నేతృత్వంలో ఈ లక్ష్యాల సాధనకు శాయశక్తులా కృషి చేస్తా’ అని అన్నారు. -
కేంద్ర హోంమంత్రిగా అమిత్ షా బాధ్యతలు
-
దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ది కీలక పాత్ర
సాక్షి, బంజారాహిల్స్: పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్ఎస్ సిద్ధమైంది. ఇప్పటికే సభలు సమావేశాలతో జోరుమీదుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధి కిందకు వచ్చే ఖైరతాబాద్ బాధ్యతలను హోంమంత్రి మహమూద్ అలీకి అప్పగించారు. ఈయన నేతలకు దిశానిర్దేశం చేసే కార్యక్రమాన్ని శనివారం బంజారాహిల్స్‌లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ నెల 13న సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో యువ నేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని, ఖైరతాబాద్ బలమేంటో ఈ సభలో చూపించాలని నేతలకు సూచించారు. దానం నాగేందర్‌తో పాటు నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మెజార్టీకి మించి పార్లమెంట్ అభ్యర్థికి రికార్డు స్థాయిలో ఆధిక్యాన్ని తీసుకురావాలని శ్రేణులను ఆదేశించారు. ఇందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, దేశం ఫడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం చూస్తోందన్నారు. ఈ అవకాశాన్ని జారవిడ్చుకోవద్దని, దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర పోషించబోతుందన్నారు. 16 ఎంపీ స్థానాలు గెలిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమే అయినా మెజార్టీ ఆధిక్యాన్ని చూపించాలని, ఆ మెజార్టీలో ఖైరతాబాద్ ముందుండాలన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే శక్తి కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు. కేంద్రంలో చక్రం తిప్పి రాష్ట్ర ప్రయోజనాలను తప్పకుండా నెరవేరుస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి బండి రమేష్ కూడా పాల్గొన్నారు. -
రాష్ట్రానికి కేసీఆర్ దేవుడి బహుమతి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ గాడ్ గిఫ్ట్ అని, దేశంలోనే ఆయనంతటి నాయకుడు లేరని హోంమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. గతంలో తనకు డిప్యూటీ సీఎంగా, ఇప్పుడు హోంమంత్రిగా అవకాశం క ల్పించినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. గురువా రం సచివాలయంలోని ఆయన చాంబర్లో హోంమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఏ ర్పాటు సమయంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణపై ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానించారని, అయన చేసిన ఆరోపణలను సీఎం కేసీఆర్ తిప్పికొట్టేలా పనిచేస్తున్నారని చెప్పారు. దేశంలోనే టాప్ శాంతి భద్రతల పరిరక్షణలో దేశంలోనే తెలంగాణ పోలీస్‌శాఖ టాప్‌లో ఉందని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు అనేక సార్లు కితాబునిచ్చినట్టు మహమూద్ అలీ వెల్లడించారు. అలాగే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేని విధంగా మైనారిటీల సంక్షేమంపై కేసీఆర్ దృష్టి పెట్టి అమలుచేస్తున్నారని చెప్పారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే అధికారం అప్పగించారన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కేటాయించని విధంగా బడ్జెట్లో రూ.2 వేల కోట్లు మైనారిటీ కోసం కేటాయిస్తున్నది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. మంచి పేరు తెచ్చుకుంటా.. సీఎం కేసీఆర్ అప్పగించిన హోంమంత్రి పదవీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకుంటానని మహమూద్ అలీ అన్నారు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలని, క్రైమ్ రేట్ ఇంకా తగ్గించాల్సిన అవసరముందన్నారు. అలాగే పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవుల అంశంపై డీజీపీ మహేందర్‌రెడ్డితో చర్చిస్తానని తెలిపారు. పదవీ బాధ్యతలు చేపట్టిన సంద ర్భంగా మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమూద్ అలీకి అభినందనలు తెలిపారు. అలాగే డీజీపీ మహేందర్‌రెడ్డి, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ తేజ్‌దీప్‌కౌర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, ఫైర్ విభాగం డీజీ గోపీకృష్ణ, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్, పీసీఎస్ అదనపు డీజీపీ రవిగుప్తా, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ బి.మల్లారెడ్డి తదితరులు హోంమంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. -
హోం మంత్రిగా మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రిగా మహమూద్ అలీని నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గురువారం మధ్యాహ్నం కేసీఆర్‌తోపాటు మంత్రిగా మహమూద్ అలీ ఒక్కరే ప్రమాణం చేశారు. మహమూద్ అలీ నియామకాన్ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జీవోలో ఉప ముఖ్యమంత్రి అని పేర్కొనలేదు. దీంతో ప్రస్తుత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రులు ఉండకపోవచ్చని తెలిసింది. మహమూద్ అలీ గత ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ బాధ్యతలు నిర్వహించారు. తాజా బాధ్యతలతో.. తెలంగాణ రాష్ట్రంలో హోం శాఖ బాధ్యతలను చేపట్టిన తొలి ముస్లిం నేతగా గుర్తింపు పొందారు. అలీ శాఖ మారిన నేపథ్యంలో గత ప్రభుత్వంలోని మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది. పాల వ్యాపారం నుంచి.. హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన మహమూద్ అలీ 1953 మార్చి 2న జన్మించారు. ఆయన తండ్రిపేరు పీర్ మహ్మద్ బాబూమియా, తల్లి సయీదున్నీసా బేగం. భార్యపేరు నస్రీన్ ఫాతిమా. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కూతుళ్లు (ఫిర్దోస్ ఫాతిమా, అఫ్రోజ్ ఫాతిమా), కుమారుడు మహ్మద్ ఆజం అలీ. బీకాం వరకు చదివిన ఆయన పాల వ్యాపారం చేశారు. మలక్‌పేట ప్రాంతం నుంచి చురుకైన మైనారిటీ నేతగా ఆయనకు మంచి పేరుంది. ఇంటర్మీడియట్ చదివే రోజుల నుంచే మహమూద్ అలీ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. టీఆర్ఎస్ అవిర్భావం నుంచి కేసీఆర్ వెంటే ఉన్నారు. 2001లో టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా, ఆ తర్వాత హైదరాబాద్ నగర టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడిగా పని చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడిగా.. 2005, 2007లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2009లో టీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 2013లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మహమూద్ అలీ గురువారం మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. కీలకమైన హోం శాఖ బాధ్యతలను అప్పగించారు. -
రాజధానిలో రూ. 500 కోట్లు.. పార్క్ చేసిన ముఖ్యనేత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమిని గెలిపించుకోవాలన్న కుతంత్రంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా పచ్చనోట్ల వరద పారించేందుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణలో మహాకూటమికి అధికారాన్ని కట్టబెట్టేందుకు రూ.500 కోట్లను ఖర్చుపెట్టేందుకు సిద్ధమయ్యారు. టీఆర్ ఎస్‌లో తనకు సన్నిహితులైన ఓ 10 మంది అభ్యర్థుల ఖర్చును కూడా తానే భరిస్తున్నట్లు కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌కు వెల్లడించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సీట్లు ఏమైనా తగ్గితే.. ఆ పదిమందిని తీసుకురాగలనని బాబు భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఏఐసీసీ నేత ఒకరు రాష్ట్ర కాంగ్రెస్ నేతతో ఈ విషయంపై ఆరాతీసి ధ్రువీకరించుకున్నట్లు సమాచారం. అటు, ఇప్పటికే ఈ రూ.500 కోట్లను హైదరాబాద్‌లోని పలుచోట్ల దాచిపెట్టారని సమాచారం. టీడీపీకి అనుకూలంగా ఉండే నలుగురు వ్యాపారులు, ఇద్దరు కాంట్రాక్టర్ల కనుసన్నల్లో ఈ డబ్బులను దాచే వ్యవహారం కొనసాగుతోందని తెలంగాణ నిఘావర్గాలకు సమాచారం అందింది. ఇందులో భాగంగానే కరీంనగర్‌కు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, మహాకూటమిలో చక్రం తిప్పాలని బాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. తెలంగాణలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల సేవలను వినియోగించుకుని.. కాంగ్రెస్‌లో విజయావకాశాలున్న అభ్యర్థుల జాబితాను తయారుచేశారు. శనివారం నాటి ఢిల్లీ పర్యటనలో రాహుల్ సమావేశమై ఈ జాబితాను అందజేయనున్నారు. తెలంగాణలో తాను జరిపించిన సర్వేలో కూటమి గెలిచేందుకు అవకాశాలున్నట్లు తేలిందన్న నివేదికనూ ఈ జాబితాకు జతచేర్చనున్నారు. అందుకే.. కాంగ్రెస్ తరఫున దాదాపు 60 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పూర్తయినప్పటికీ.. చంద్రబాబు నివేదిక అందిన తరువాత అందులో వివరాలు పరిశీలించి అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ విషయాన్ని సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు స్వయంగా వెల్లడించడం గమనార్హం. రూ.500 కోట్లకు అదనంగా.. టీడీపీతోపాటు కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బు సమకూర్చుతానని రాహుల్‌గాంధీకి ఇటీవలే బాబు హామీ ఇచ్చారు. తమ కూటమి అభ్యర్థుల విజయానికి రూ.500 కోట్లు సిద్దంగా ఉంచానని, అవసరమైతే మరింత ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడబోనని బాబు పేర్కొన్నట్లు కాంగ్రెస్ వర్గాలే చెపుతున్నాయి. తనకు అత్యంత సన్నిహితుడైన ఓ పత్రికాధిపతి ద్వారా ఈ డబ్బు పంపిణీ చేసేందుకు చంద్రబాబు స్కెచ్ వేశారు. 1996 లోక్‌సభ ఎన్నికల సమయంలో.. నాడు జర్నలిస్టుగా ఉన్న ఇప్పటి సదరు పత్రికాధిపతి ఇంటినుంచే చంద్రబాబు అభ్యర్థులకు డబ్బు పంపిణీ చేసిన విషయం బహిరంగ రహస్యమే. ప్రస్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్‌తోనూ సన్నిహితంగా ఉంటున్న ఆ పత్రికాధిపతికి డబ్బు పంపిణీ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందన్న యోచనలో బాబు ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణలో అధికారంలో భాగస్వామ్యం అయ్యేందుకు.. ఇంత భారీ ఎత్తున డబ్బు ఖర్చుచేస్తూ కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్న టీడీపీ అధినేత..వచ్చే ప్రభుత్వంలో తన పార్టీకి హోం శాఖ కేటాయించాలని రాహుల్‌కు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఓ పత్రికాధిపతి పర్యవేక్షణలో.. ఏపీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఓ పత్రికాధిపతి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోందని తెలిసింది. ఇటీవల ఈ రెండు కంపెనీలపై జరిగిన ఐటీ దాడుల్లో డొల్ల కంపెనీలకు భారీగా డబ్బు తరలించినట్లు బయటపడిన సంగతి తెలిసిందే. ఆ డబ్బును ఎక్కడ నిల్వ చేశారన్నది నిఘా సంస్థల వద్ద సమాచారం ఉంది. హైదరాబాద్‌లో బడావ్యాపారులుగా చెలామణీ అవుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యాపార ప్రముఖులు మరో రూ.150 కోట్లు ఎన్నికల కోసం నిల్వ చేశారు. ఈ సొమ్ములో కొంత ఇప్పటికే జిల్లాల్లో అవసరమైన టీడీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు సమాచారం. కరీంగనర్‌కు నగదు పంపేక్రమంలో ఓ వ్యాపారి నుంచి పోలీసులు పెద్ద ఎత్తున సొమ్మును స్వాధీనం చేసుకోవడంతో ఈ రవాణా ప్రస్తుతానికి ఆగిపోయిందని తెలుస్తోంది. అయితే అభ్యర్థుల ఎంపిక పూర్తి కాగానే బాబు సన్నిహిత పత్రికాధిపతి సమక్షంలో డబ్బు పంపిణీకి వ్యూహరచన జరుగుతోందని సమాచారం. అంబులెన్స్‌ల్లో డబ్బు పంపిణీ చంద్రబాబు సమకూర్చిన ఈ రూ.500కోట్లను పంపిణీ చేసేందుకు అంబులెన్స్‌లను వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి టీడీపీ అధినేతకు సన్నిహితుడైన ఓ మెడికల్ కాలేజీ యజమానితో సంప్రదింపులు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. 2014 ఎన్నికల్లోనూ టీడీపీ.. విజయవాడలో ఓ ప్రముఖ వైద్య కళాశాల నుంచి ఎవరికి అనుమానం రాకుండా రాత్రిపూట అంబులెన్స్‌ల్లో రాష్ట్రవ్యాప్తంగా డబ్బును సరఫరా చేసింది. ఇప్పుడు అదే వ్యూహాన్ని తెలంగాణలోనూ అమలు చేయడానికి వీలుగా ఆ వైద్యకళాశాలతో పాటు తన సామాజిక వర్గానికే చెందిన మరో రెండు కార్పోరేట్ వైద్యశాలల సహకారం కోరినట్లు తెలిసింది. నిఘావర్గాల సమాచారంతో ఇప్పటివరకు వీరు పన్నిన కుట్రలను తెలంగాణ పోలీసులు వమ్ము చేశారు. ఈ నేపథ్యంలోనే అంబులెన్స్‌లపై ఆధారపడాలన్న నిర్ణయానికి వచ్చారు. కాగా, ‘డబ్బు ఎక్కడ నిల్వ చేశారు, ఎవరు పర్యవేక్షిస్తున్నారన్న విషయాలను చూచాయగా తెలుసుకున్నాం. ఖమ్మం జిల్లాలో ఒక చోట రూ.250 కోట్లు దాకా నిల్వ చేసినట్లు సమాచారం ఉంది. అయితే, పక్కా సమాచారం కోసం ప్రయత్నిస్తున్నాం. ఏపీలో వచ్చే ఎన్నికలకు కొన్ని జిల్లాలకు ఖమ్మం నుంచి డబ్బు సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిఘావర్గాల ద్వారా తెలిసింది’అని ఐజీస్థాయి అధికారి ఒకరు వెల్లడించారు. హోం శాఖే ఎందుకు? వచ్చే ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే టీడీపీకి హోం శాఖ ఇవ్వాలన్న చంద్రబాబు తలంపు వెనుక కారణం.. ఓటుకు కోట్లు కేసు. ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడితే భవిష్యత్‌లో ఇబ్బంది ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోవడం వెనక కూడా ఇదే కారణమని కాంగ్రెస్ వర్గాలు ప్రైవేట్ సంభాషణల్లో చెపుతున్నాయి. ఒకవేళ కూటమి గెలవలేకపోతే.. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఓటుకు కోట్లు కేసును మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని ఆధారాలు సిద్ధం చేసుకున్నారని బాబుకు భయం పట్టుకుందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అందుకోసమే.. చంద్రబాబు ఈ ఎన్నికల్లో భారీగా డబ్బు ఖర్చు చేయడానికి పూనుకున్నారు. ఈ వ్యూహం కేవలం ఎన్నికలకే పరిమితం కాలేదని.. ఏడాదిగా హైదరాబాద్‌లో డబ్బు నిల్వ చేసినట్లు సమాచారం. ఏపీలో సాగునీటిశాఖ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న ఇద్దరు కాంట్రాక్టర్ల నుంచి రూ.350 కోట్లు ఇక్కడే ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు సామాజికవర్గానికే చెందిన ఒకరితో పాటు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు (కాంట్రాక్టర్) ఈ మొత్తాన్ని ఇప్పటికే సమకూర్చిపెట్టారు. -
షటిల్ ఆడుతూ జారిపడ్డ హోంమంత్రి
-
అయ్యో.. మంత్రి అలా పడిపోయారేంటి?
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కుళాయి చెరువు వద్ద వివేకానంద పార్కును శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి సరదా కలిసి షటిల్ ఆడటానికి సిద్ధమయ్యారు. కొండబాబు కొట్టిన కాక్‌ను అందుకునే క్రమంలో కాలు జారి షటిల్ కోర్టులో పడిపోయారు. సెక్యురిటీ సిబ్బంది, అక్కడున్నవారంతా కలిసి ఆయనను వెంటనే పైకి లేవదీశారు. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆయన అందరితో సరదాగా మాట్లాడారు. -
ఆధార్‌తో ఫింగర్ ప్రింట్ బ్యూరో సమన్వయం
సాక్షి, హైదరాబాద్ : ఫింగర్ ప్రింట్ బ్యూరోతో ఆధార్ వ్యవస్థను సమన్వయం చేసేలా కసరత్తు చేయనున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్ గంగారాం అహిర్ వెల్లడించారు. తద్వారా నేరస్తుల గుర్తింపు సులభతరం అవుతుందని చెప్పారు. వేలిముద్రల సేకరణలో చట్టపర సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్‌ను సవరించేందుకు ఉన్నత స్థాయిలో చర్చిస్తామన్నారు. ఫింగర్ పింట్ బ్యూరో 19వ జాతీయ స్థాయి సమావేశాలు గురువారం హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి్ద సంస్థలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో తొలిరోజు కార్యక్రమానికి హాజరైన హన్స్‌రాజ్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ఒక్కరి వేలిముద్రలు డేటాబేస్‌లో ఉంటున్నాయని, కానీ మన దేశంలో నేరస్తులకు సంబంధించి 11.50 లక్షల మంది వేలిముద్రలే డేటాబేస్‌లో ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో 80% కొత్త వ్యక్తులు చేస్తున్నవేనన్నారు. నేరాలు, శిక్ష శాతాల్లో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోందన్న మంత్రి.. అన్ని రాష్ట్రాల డీజీపీలతో ఏటా ప్రధాని మోదీ సమావేశం నిర్వహిస్తున్నారని తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్‌లో తెలంగాణ పోలీస్ శాఖ దూసుకెళ్తోందని హాన్స్‌రాజ్ ప్రశంసించారు. టెక్నాలజీ వినియోగంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ పోలీస్ శాఖ ‘ది బెస్ట్’గా ఉందని కొనియాడారు. ‘కంపెన్డియం ఆఫ్ ఫింగర్ ప్రింట్ ఎక్విప్మెంట్’ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. అన్ని ఠాణాలకు డేటా: ఎన్సీఆర్బీ డీజీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలోని ఫింగర్ ప్రింట్ విభాగం వద్ద ఉన్న వేలిముద్రల డేటాను దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేస్తామని ఎన్సీఆర్బీ డీజీ ఈష్‌కుమార్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లోని ఫింగర్ ప్రింట్ బ్యూరోల్లో తీవ్రమైన సిబ్బంది కొరత ఉందని.. 250 పోస్టులకుగాను 50 మంది సిబ్బందే పనిచేస్తున్నారని చెప్పారు. ఏటా నమోదవుతున్న కేసుల్లో ఒక శాతం మాత్రమే ఫింగర్ ప్రింట్ సిబ్బంది, అధికారులు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫింగర్ ప్రింట్ బ్యూరోను సర్కిల్, సబ్ డివిజన్ వారీగా నియమిస్తే కేసులు పరిష్కారంతోపాటు నియంత్రణ కూడా పెరుగుతుందని వివరించారు. అతి తక్కువ సమయంలో.. : డీజీపీ తెలంగాణలో ఫింగర్ ప్రింట్ బ్యూరోను పటిష్టం చేశామని డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. ఆటోమేషన్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ విధానం (ఏఎఫ్ఐఎస్) ఇటీవలే ప్రారంభించామని, అతి తక్కువ కాలంలో మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. ఏఎఫ్ఐఎస్ విధానాన్ని అమలుపరచడంతో 868 పాత కేసులు పరిష్కరించామని, ఇందులో 480 కేసులు పాత ఫింగర్ ప్రింట్స్ విధానంలో పరిష్కారం కాలేదని వివరించారు. కొత్త విధానంతో నిందితుల నుంచి రూ.7.2 కోట్ల విలువైన సొత్తు కాపాడగలిగామని చెప్పారు. ఫింగర్ ప్రింట్ మొబైల్ డివైజ్ ద్వారా 1.22 లక్షల మంది వేలిముద్రలను సేకరించి డేటాబేస్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని, ఇందులో 7,273 మంది పాత నేరస్తులను గుర్తించినట్లు వెల్లడించారు. సదస్సులో ఎన్సీఆర్బీ జాయింట్ డైరెక్టర్ సంజయ్ మాథుర్, సీఐడీ అదనపు డీజీపీ గోవింద్‌సింగ్, రాష్ట్ర ఐపీఎస్‌లు, సీఐడీ అధికారులు పాల్గొన్నారు. -
సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మన కర్తవ్యం
హైదరాబాద్ : దేశ సరిహద్దులో ప్రాణాలను అడ్డుపెట్టి పనిచేస్తున్న సైనికులకు మనం ఎంత చేసినా తక్కువేనని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ మాజీ సైనికులు, కుటుంబసభ్యుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయిని మాట్లాడుతూ, సైనికులు తమ కుటుంబాలను, భార్యాపిల్లలను వదిలిపెట్టి దేశాన్ని కాపాడుతున్నారని తెలిపారు. సైనికుల కుటుంబాలను ఆదుకోవడం మనందరి కర్తవ్యం అని అన్నారు. వీరి సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, మంచి పథకాలను ప్రవేశపెట్టాలని కోరారు. సైనికుల సంక్షేమాన్ని కాపాడాలన్న కారణంతో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఒకరోజు జీతాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు మొదలుకుని ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఒక్క రోజు జీతాన్ని సైనిక సంక్షేమానికి ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో ఒక గ్రూపు ఒక రోజు జీతాన్ని ఇవ్వలేదన్నారు. కెప్టెన్ ఉరేష్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కారం రవీందర్‌రెడ్డి, సైనిక సంక్షేమ అధికారి శ్రీనిష్ కుమార్, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. -
మావోయిస్టులకు విరాళాలపై కేంద్ర హోంశాఖ నిఘా
న్యూఢిల్లీ: మావోయిస్టుల ఆర్థిక కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులు వారి పిల్లల చదువుల కోసం, కుటుంబ పోషణ కోసం లక్షల రూపాయలు దారి మళ్లిస్తున్నారని పేర్కొన్నారు. వారి పిల్లలకు, బంధువులకు ప్రొఫెషనల్ కాలేజీల్లో ఇంజినీరింగ్, మెడికల్ సీట్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. మావోయిస్టులకు వస్తున్న నిధులను గుర్తించేందుకు ప్రత్యేక గూఢాచార పరిశోధనా సంస్థలను, టాక్స్ విభాగాలను ఏర్పాటు చేయనున్నుట్లు మంగళవారం ఉన్నతాధికారుల సమావేశంలో ప్రకటించారు. హోంశాఖ అధికారుల సమాచారం ప్రకారం కీలకమైన మావోయిస్టులపై పలు ఆర్థిక పరమైన కేసులు ఉన్నాయి. వారిలో ముఖ్యంగా... బిహార్, జార్ఖండ్ ఏరియాల్లో మావోయిస్టు నేత ప్రదీమన్ శర్మపై పలు కేసులు నమోదయ్యాయి. తన మేనకోడలు మెడికల్ సీటు కోసం 2017లో రూ. 22 లక్షలు ప్రైవేట్ కాలేజీకి చెల్లించారని పోలీసులు తెలిపారు. బిహార్ మావోయిస్టు సీనియర్ నేత సందీప్ యాదవ్‌పై కూడా పలు కేసులున్నాయి. పెద్దనోట్ల రద్దు సమయంలో 15 లక్షల రూపాయలను అక్రమంగా మార్పిడి చేశారని పోలీసులు గుర్తించారు. జార్ఖండ్ మావోయిస్టు అరవింద్ యాదవ్ తన సోదరుడి చదువుల కోసం రూ. 12 లక్షలు ఇంజినీరింగ్ కాలేజీలో చెల్లించడంపై కేసు నమోదు చేసినట్లు జార్ఖండ్ పోలీసులు వెల్లడించారు. ఇలా భారీగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న మావోయిస్టులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులు నమోదు చేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన మావోయిస్టు సీనియర్ నేత బాలమూరి నారాయణ అలియాస్ ప్రభాకర్ కూడా భారీగా ఆర్థిన నేరాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై ప్రస్తుతం 10 లక్షల రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టు పార్టీలకు వస్తున్న విరాళాలపై కేంద్ర హోంశాఖ దృష్టి సారించిన నేపథ్యంలో.. నిషేధిత సంస్థలకు వెళ్తున్న ఫండ్‌ను గుర్తించేందుకు పలు సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. -
‘చివరి అంచుల్లో నక్సలిజం’
గుర్గావ్ : దేశంలో నక్సజలిం చివరి అంచుల్లో ఉందని, భద్రతా దళాలు నక్సలిజాన్ని ఎదుర్కోవడంలో విజయవంతం అయ్యాయని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. హరియాణాలోని గుర్గావ్లో శనివారం సీఆర్పీఎఫ్ దళాల 79వ రైసింగ్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుక్మా ఎన్కౌంటర్లో మరణించిన జవాన్లకు నివాళులర్పించిన అనంతరం రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘నక్సలిజాన్ని ఎదుర్కొవడం పెద్ద సవాల్. కానీ, సీఆర్పీఎఫ్ సహా భద్రతాదళాలు దానిని కట్టడి చేయటంలో కృషి చేస్తున్నాయి. భద్రతా దళాలను నేరుగా ఎదుర్కొనే శక్తిలేక మావోయిస్టులు పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు. దీనివల్ల భద్రతా సిబ్బంది మరణాల రేటు తీవ్రంగా పెరిగింది. అందుకే నక్సల్ వ్యతిరేక చర్యలను పోత్సహిస్తున్నాం. నిర్ణయాత్మక చర్యలతో వారి చేష్టలను తిప్పికొడుతున్నాం’ అని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. వాళ్లే నష్టపోతున్నారు... ‘మావోయిస్టుల చర్యల వల్ల సామాన్య ప్రజానీకం కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. వారి చర్యల వల్ల వారే నష్టపోతున్నారు’ అని రాజ్‌నాథ్ తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి వ్యతిరేకంగా మావోయిస్టులు పని చేస్తున్నారని, చివరకు రోడ్లు వేస్తున్న సిబ్బందిని కూడా హతమారుస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. నిజానికి రైసింగ్ డే మార్చి 19నే కాగా, రాజ్‌నాథ్ బిజీ షెడ్యూల్ మూలంగా ఈ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు.