
చండీగఢ్ : హర్యానా హోం మినిస్టర్ అనిల్ విజ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఏఏకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మంత్రి గురువారం మాట్లాడుతూ.. పాకిస్తాన్‌లో హింసకు గురవుతున్న మా హిందూ, సిక్కు సోదరులకు పౌరసత్వం ఇస్తానంటే, ఇటలీలో పుట్టి భారత పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీలు గ్రూపుగా ఏర్పడి దేశాన్ని తగలబెట్టాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి : ‘జాగ్రత్త! రాహుల్, ప్రియాంకలు అగ్గి రాజేస్తారు’