Find a Girl for Him: Sonia Gandhi to Haryana Women Farmers on Rahul Marriage - Sakshi
Sakshi News home page

మహిళా రైతులతో సోనియా ముచ్చట్లు: మీరే పిల్లను చూడండి..!

Published Sun, Jul 30 2023 5:09 AM | Last Updated on Sun, Jul 30 2023 5:48 PM

Find a girl for him: Sonia Gandhi to Haryana women farmers on Rahul marriage - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ పెళ్లి ప్రస్తావన మరోసారి నవ్వులు పూయించింది. హరియాణాకు చెందిన కొందరు మహిళలు ఢిల్లీలోని టెన్‌ జన్‌పథ్‌కు వచ్చి సోనియాగాంధీ కుటుంబంతో కాసేపు గడిపారు. వారిని సాదరంగా ఆహ్వానించిన గాంధీ కుటుంబం ఆతిథ్యమిచ్చింది. ఆ మహిళలతో కలిసి సోనియా, ప్రియాంక, రాహుల్‌ భోజనాలు చేశారు. ఆ తర్వాత కాసేపు వారితో ముచ్చటించారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు.

ఓ మహిళ సోనియాతో ‘‘రాహుల్‌కి పెళ్లి చేద్దామా’’ అని అడిగారు. దానికి సోనియా నవ్వుతూ ‘‘మీరే పిల్లని చూడండి’’ అని వాళ్లతో చెప్పారు. పక్కనే ఉండి ఇదంతా వింటున్న రాహుల్‌ ‘‘అవుతుంది. అవుతుంది’’ అని అన్నారు. దీంతో ప్రియాంక రాహుల్‌ స్వీట్‌గా కనిపిస్తున్నా చాలా  కొంటెవాడని చెప్పారు. వారి సమావేశం అంతా ఆహ్లాదకరమైన వాతావరణంలో సాగింది. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు హరియాణా సోనిపట్‌ జిల్లాకు చెందిన మహిళలతో ముచ్చటించారు.

వ్యవసాయ క్షేత్రాల్లో మహిళా కార్మికులతో కలిసి నాట్లు వేశారు. తాము ఇప్పటివరకు దేశ రాజధాని ఢిల్లీని చూడలేదని వారు చెబితే అప్పట్లోనే రాహుల్‌ వారికి ఢిల్లీకి పిలుస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు వారికి ఢిల్లీ చూపించాక తమ నివాసంలో భోజన ఏర్పాట్లు చేశారు. కొందరు మహిళలు రాహుల్‌కు ప్రేమగా తినిపించారు. దీనికి సంబంధించిన వీడియోని రాహుల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘‘మా ఇంటికి ప్రత్యేక అతిథులు వచ్చారు. ఈ రోజు మా అందరికీ బాగా గుర్తుండిపోతుంది. వారితో కలిసి భోజనం చేశాం. ముచ్చట్లు చెప్పుకున్నాం. వారంతా మాకు ఎంతో అమూ ల్యమైన కానుకలు ఇచ్చారు. దేశీ నెయ్యి, స్వీట్‌ లస్సీ, ఇంట్లో చేసిన ఊరగాయలు ఎంతో ప్రేమతో ఇచ్చారు’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ఆ మహిళ లతో కలిసి సోనియా, ప్రియాంక స్టెప్పులు వేశారు.

ఇదీ నేపథ్యం...
నా ఇంటిని ప్రభుత్వం లాగేసుకుంది
జూలై 8న భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ హరియాణాలోని సోనిపట్‌ జిల్లా మదినా గ్రామానికి వెళ్లారు. అక్కడి గ్రామస్తులతో మాట్లాడారు. వ్యవసాయ క్షేత్రాల్లో రైతులు, రైతు కూలీలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఢిల్లీలోని రాహుల్‌ సొంతింటిని గురించి అడిగారు. అందుకు రాహుల్‌..తనకు సొంతిల్లు లేదని, దానిని ప్రభుత్వం తీసేసుకుందని బదులిచ్చారు. ఢిల్లీలోని తన సోదరి ప్రియాంకా గాంధీ వాద్రాకు ఫోన్‌ చేశారు. రైతు మహిళలు భోజనానికి రావాలనుకుంటున్నారని చెప్పారు...ఇదంతా 12 నిమిషాల నిడివున్న వీడియోలో ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement