జెండాకు నమస్కరించని వారు దేశం గురించి మాట్లాడతారా?: రాహుల్‌ గాంధీ | Congress Rahul Gandhi Serious Comments On Mohan Bhagwat | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో కాంగ్రెస్‌ కొత్త ఆఫీస్‌ ప్రారంభం.. రాహుల్‌ గాం‍ధీ కీలక వ్యాఖ్యలు

Published Wed, Jan 15 2025 11:20 AM | Last Updated on Wed, Jan 15 2025 1:14 PM

Congress Rahul Gandhi Serious Comments On Mohan Bhagwat

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన కాంగ్రెస్(congress Office) పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభమైంది. పార్టీ కార్యాలయ భవనాన్ని కాంగ్రెస్‌ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పార్టీ జెండా ఎగురవేశారు. ఆరు అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కొత్త భవనం నిర్మించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఇక, కొత్త భవనానికి ‘ఇందిరాగాంధీ భవన్’ అని పేరు పెట్టారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ(rahul Gandhi) మాట్లాడుతూ.. దేశాన్ని విచ్చిన్నం చేసే వారిని ఆపగలిగేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమే. జాతీయ జెండాకు నమస్కరించరని వారు దేశం గురించి మాట్లాడుతున్నారు. స్వాతంత్ర్య పోరాటాన్ని కించపరిచే విధంగా మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఐడియాలజీతో పోరాడుతూనే ఉంటాం. బ్రిటీష్‌ వారితో పోరాడిన యోధులను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.  ఈ భవనం ప్రతీ కార్యకర్తకు చెందుతుంది. దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం అక్బర్ రోడ్డు 24వ నంబర్ భవనంలో ఏఐసీసీ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బంగ్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉండకూడదని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగానే పార్టీలు సొంత భవనాలు నిర్మించుకున్నాయి. ఐదు దశాబ్దాలుగా అక్బర్ రోడ్డులోనే కాంగ్రెస్‌ కార్యకలాపాలు నిర్వహించింది. 1978 నుంచి ఇది ఏఐసీసీ కేంద్ర కార్యాలయంగా ఉంది.

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ రాహుల గాంధీ

9A కోట్లా రోడ్డులో 6 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో కాంగ్రెస్ నూతన కార్యాలయాన్ని నిర్మించారు. కోట్లా మార్గ్‌కు ఏఐసీసీ కార్యాలయాన్ని తరలించినా.. అక్బర్ రోడ్డు నుంచి కూడా కార్యకలాపాలు ఉంటాయని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 2008లో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం స్థలం కేటాయించింది. అనంతరం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ మార్గ్ నుంచి కోట్లా మార్గ్ వైపు ప్రవేశాన్ని మార్చుకున్నారు. 2009లో కేంద్ర కార్యాలయం నిర్మాణం మొదలు పెట్టారు. 15 ఏళ్ల పాటు ఇందిరాగాంధీ భవన్ నిర్మాణం సాగింది.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement