ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. అధికార ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి కేరళ కాంగ్రెస్ ఎంపీ కే సురేష నామినేన్లు దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే.. రేపు(జూన్ 26,2024) తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది.
అయితే ఇవాళ ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై బీజేపీ వ్యవరించిన తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
‘‘ స్పీకర్ పదవికి ఎన్నికకు ఇండియా కూటమి విపక్షాలు సహరిస్తాయని చెప్పాం. డిప్యూటీ స్పీకర్ విషయంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాకు ఫోన్ చేస్తాని చెప్పి ఇప్పటికీ చేయలేదు. మా అధ్యక్షుడు ఖర్గేను రాజ్‌నాథ్‌సింగ్ అవమానించారు. మోదీ తాను వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలి. ఖర్గేతో జరిగిన చర్చలో రాజ్‌నాథ్ సింగ్ డిప్యూటీ స్పీకర్‌పై ఎటుంటి హామీ ఇవ్వలేదు.
ప్రధాని మోదీ చెప్పెది ఒకటి.. చేసేది ఒకటి. సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు కావాలన్నాం. డిప్యూటీ స్పీకర్‌పై స్పష్టమైన హామీ ఇస్తేనే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని చెప్పాం. యూపీఏ హయాంలో మేము డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పటి విపక్షాలకు ఇచ్చాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
రాజకీయం చేయటం సరికాదు: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ‘స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే బాగుంటుంది. ఇలా రాజకీయం చేయటం సరికాదు. విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలాని ఎలాంటి నిబంధనల లేవు. ముందు డిప్యూటీ స్పీకర్ ఎవరో? తేల్చాలని కాంగ్రెస్ పట్టుబట్టింది’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment