speaker
-
‘జమిలి’ బిల్లులపై ఉత్కంఠ
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల బిల్లుల అంశంపై ఏర్పాటు చేసే జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)పై ఉత్కంఠ నెలకొంది. గురువారం(డిసెంబర్ 19) లోక్‌సభలో స్పీకర్ ఓంబిర్లా జేపీసీని ఏర్పాటు చేస్తు ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారంతో పార్లమెంట్ సెషన్ ముగుస్తుండడంతో ఈలోపే జేపీసీపై స్పీకర్ ప్రకటన చేయాల్సి ఉంటుంది. లేదంటే జమిలిపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రెండు రాజ్యాంగ సవరణ బిల్లులు వృథా అయ్యే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వం ఈ బిల్లులపై ధృడ నిశ్చయంతో ఉన్నందున జేపీసీపై గురువారం ప్రకటన వస్తుందనే అంతా భావిస్తున్నారు.అధికారపక్ష సభ్యులే కాకుండా ప్రతిపక్ష సభ్యులకూ జేపీసీలో స్థానం ఉంటుంది. జేపీసీలోకి గరిష్టంగా 31 మందిని తీసుకోవచ్చు. ఇందులో లోక్‌సభ నుంచే 21 మంది ఉంటారు.ఇందుకు సంబంధించి తమ సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇప్పటికే పార్టీలకు స్పీకర్ ఛాంబర్ నుంచి ఆదేశాలు వెళ్లాయి.అయితే బీజేపీ లార్జెస్ట్ పార్టీ కావడంతో ఆ పార్టీకే కమిటీ చైర్మన్ పదవి వెళ్లే అవకాశాలెక్కువగా ఉన్నాయి. ఒకవేళ జేపీసీ ఏర్పాటు గనుక అనుకున్న టైంకి జరగకుంటే.. ప్రక్రియ మళ్లీ మొదటికి చేరుతుంది. అంటే.. వచ్చే సెషన్లో బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. -
జార్ఖండ్ కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకారం.. మంత్రులు వీరే
రాంచీ: ఎట్టకేలకు జార్ఖండ్‌లో మంత్రి వర్గ విస్తరణ కార్యక్రమం జరిగింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని మంత్రి మండలి గురువారం ప్రమాణ స్వీకారం చేసింది. రాంచీలో జరిగిన ఈ కార్యక్రమంలో 11 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మహేశ్‌పూర్ ఎమ్మెల్యే స్టీఫెన్ మరాండీతో జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్ జార్ఖండ్ విధానసభ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించారు అనంతరం పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఇక గత ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన రాందాస్ సోరెన్, దీపక్ బీరువా, హఫీజుల్ హసన్, కాంగ్రెస్‌కు చెందిన దీపికా పాండే సింగ్‌లు తమ పదవులను కొనసాగించారు. వీరితోపాటు జేఎంఎం నుంచి చమ్ర లిండా, యోగేంద్ర ప్రసాద్, సుదివ్య కుమార్, ఇర్ఫాన్ అన్సారీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాధా కృష్ణ కిషోర్, శిల్పి నేహా టిర్కీ, ఆర్జేడీ ఎమ్మెల్యే సంజయ్ ప్రసాద్ యాదవ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.Ranchi, Jharkhand | Congress MLA Radha Krishana Kishore, JMM MLA Deepak Birua, JMM MLA Chamra Linda and RJD MLA Sanjay Prasad Yadav take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/BXU7ozCGcx— ANI (@ANI) December 5, 2024Ranchi, Jharkhand | JMM MLA Ramdas Soren, Congress MLA Irfan Ansari, JMM MLA Hafizul Hasan and Congress MLA Dipika Pandey Singh take oath as Ministers in the JMM-led Mahagathbandhan Government in the state. pic.twitter.com/46PTFLlabh— ANI (@ANI) December 5, 2024 Ranchi, Jharkhand | JMM MLA Stephen Marandi took oath as Protem Speaker of the Legislative Assembly pic.twitter.com/n45Ih1sQ4V— ANI (@ANI) December 5, 2024కాగా జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నవంబర్ 28న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాంచీలోని మొరాబాది మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఆ రోజే జేఎంఎం సీనియర్ ఎమ్మెల్యే అయిన మరాండీని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. డిసెంబర్ 9-12 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని జేఎంఎం ప్రభుత్వం నిర్ణయించారు.#WATCH | Ranchi: After the Jharkhand cabinet expansion, CM Hemant Soren says, " As the time is moving forward, everything is happening quickly. Govt will get the direction now and we will move forward at a fast pace" pic.twitter.com/mGgfaDh0r2— ANI (@ANI) December 5, 2024ఇక ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్‌కు చెందిన జార్ఖండ్ ముక్తిమోర్చా (జేఎంఎం) ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ 2 సీట్లు గెలుచుకుంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 24 సీట్లు సాధించింది. -
ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు ప్రముఖుల హాజరు
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ విందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఓంబిర్లా కుమార్తె అంజలీ బిర్లా ప్రముఖ వ్యాపారవేత్త అనీష్ రజనీల వివాహం ఈనెల 12న జరగ్గా సోమవారం ఢిల్లీలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.దీనికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీలు అనిల్‌కుమార్ యాదవ్, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తదితరులు హాజరయ్యారు. అలాగే ఏపీ నుంచి గవర్నర్ అబ్దుల్ నజీర్, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మండలి చైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, వైఎస్సార్సీపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, ప్రసాద్, బాలశౌరి, ఉదయ్ తదితరులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
శాసనసభలో ఏపీ మంత్రులకు స్పీకర్ మందలింపు
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి.. సభలో కూటమి నేతల తీరు ఏమాత్రం సహించడం లేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం వేళ.. తమ అనుచరుల్ని సభలోకి తోలుకురావడంపై టీడీపీ ఎమ్మెల్యేలపైనే అసహనం వ్యక్తం చేసింది తెలిసిందే. అయితే..ఇవాళ నాలుగో రోజు సెషన్లో మంత్రులపైనే ఆయన మండిపడినట్లు తెలుస్తోంది. ఉదయం 9.గంకు సభ ప్రారంభం కాగా.. మంత్రుల్లో కొందరు సభకు ఆలస్యంగా వచ్చారు. ఇది గమనించిన స్పీకర్.. కాసేపు చూస్తూ ఉండిపోయారు. ఇంతలో కార్మిక శాఖకు సంబంధించిన ప్రశ్న ఎదురుకాగా.. సదరు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ టైంకి సభలో లేరు. అనంతరం వచ్చిన మంత్రితో స్పీకర్ అయ్యన్న.. క్వశ్చన్ అవర్ ని మంత్రులు సీరియస్ గా తీసుకోవాలని, మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా? అని, సమయం పాటించాలని హితవు పలికినట్లు సమాచారం. ఆలస్యానికి మంత్రి సుభాష్ క్షమాపణ చెప్పి.. మరోసారి ఇలా జరగదంటూ తన సీట్లో కూర్చున్నారు. ఇక సమావేశాల ప్రారంభ రోజు.. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన్న చెప్పారు. -
కూటమి ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న అసహనం
అమరావతి, సాక్షి: ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి కోపమొచ్చింది. సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. ఎమ్మెల్యేలతో పాటు వాళ్ల అనుచరులు కూడా అసెంబ్లీ హాల్‌కు వచ్చారు. దీంతో ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. అయితే..అంతటితో ఆయన ఆగలేదు. అనుచరులను తీసుకొని రాకుండా ఉండాలని ఎమ్మెల్యేలకు గట్టిగానే చెప్పారు. ‘‘మీ అనుచరులను సచివాలయం, ఇతర ప్రాంతాల్లో వుండే విధంగా చూస్కోండి. అసెంబ్లీ హాల్లోకి తేకండి’’ అని కాస్త కటువుగానే సొంత ఎమ్మెల్యేలతో చెప్పినట్లు తెలుస్తోంది. -
US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఒక విశేషం చోటు చేసుకుంది. 2024 అమెరికా ఎన్నికల ఫలితాలతో కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రతినిధి నాన్సీ పెలోసి యుఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు. దీంతో ఈ స్థానం నుంచి వరుసగా 20 సార్లు గెలుపొందిన మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు. అంతేకాదు హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ కూడా నాన్సీ పెలోసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఆమె సొంతం. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 2003 నుండి హౌస్ డెమొక్రాట్లకు నాయకత్వం వహించారు. హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌లో ప్రధాన పార్టీకి నాయకత్వం వహించిన తొలి మహిళ. 2007- 2011 వరకు, తిరిగి 2019- 2023 వరకు హౌస్ స్పీకర్‌గా వ్యవహరించారు. ఎక్కువ కాలం పనిచేసిన హౌస్ డెమోక్రాటిక్ నాయకురాలు పెలోసి. అలాగే చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన హౌస్ స్పీకర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఎఫర్డబుల్ కేర్ రక్షణ చట్టంతో సహా కొన్ని కీలకమైన చట్టాలను ఆమోదించడంలో పెలోసి కీలక పాత్ర పోషించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన లాంటి ఇతర ముఖ్యమైన సందర్భాలలో పార్టీలో ఆమె పాత్ర కీలకం.రాజకీయ వారసత్వం: రాజకీయంగా చురుకైన కుటుంబం నుండి వచ్చారు. నాన్సీ పెలోసి బాల్టిమోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి రాజకీయ మేత్త మేయర్ , కాంగ్రెస్ సభ్యుడు థామస్ డి'అలెసాండ్రో జూనియర్. వాషింగ్టన్ ట్రినిటీ కళాశాల నుండి నాన్సీ 1962లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్త పాల్ పెలోసిని వివాహం చేసున్నారు. -
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ స్పీకర్‌గా అబ్దుల్ రహీమ్ రాథర్
శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ అసెంబ్లీ తొలి సమావేశాలు నేటి(సోమవారం) నుంచి ప్రారంభమయ్యాయి. సీనియర్ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత, చరార్-ఎ-షరీఫ్ స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన అబ్దుల్ రహీమ్ రాథర్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.ఐదు రోజుల పాటు కొనసాగనున్న ఈ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజున ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ప్రొటెం స్పీకర్ ముబారక్ గుల్ కొత్త అసెంబ్లీ స్పీకర్ అబ్దుల్ రహీమ్ రాథర్‌కు నూతన బాధ్యతలను అప్పగిస్తూ, అభినందనలు తెలియజేశారు. 80 ఏళ్ల అబ్దుల్ రహీమ్ రాథర్ గతంలో కూడా జమ్ముకశ్మీర్ అసెంబ్లీలో స్పీకర్ పదవిని నిర్వహించారు. 2002 నుంచి 2008 వరకు పీడీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.సోమవారం జరిగే అసెంబ్లీ తొలి సమావేశంలో స్పీకర్‌ను ఎన్నుకుంటారని అసెంబ్లీ సచివాలయం ఇంతకుముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా నరేంద్ర సింగ్ రైనాను బీజేపీ ఎన్నుకుంది. అదే సమయంలో ప్రతిపక్ష నేత బాధ్యతలను సునీల్ శర్మకు అప్పగించారు. అబ్దుల్ రహీమ్ రాథర్ ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది కూడా చదవండి: అది ఫేక్ సర్వే: తాజా పోల్‌పై మండిపడ్డ ట్రంప్ -
ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై స్పీకర్‌కు ఫిర్యాదు
సాక్షి,హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మహిళా కాంగ్రెస్ నేతలు శుక్రవారం (సెప్టెంబర్13) స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో కౌశిక్‌రెడ్డి ఓటర్లను బెదిరించి గెలిచారని ,గెలిచాక మహిళలను కించపరుస్తూ మాట్లాడినందున కౌశిక్‌రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేసిన వారిలో మహిళా కాంగ్రెస్ నేతలు బండ్రు శోభారాణి, కాల్వ సుజాత తదితరులున్నారు. ఫిర్యాదు అనంతరం వీరు మీడియాతో మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డితో బీఆర్ఎస్ అధినేత కేసీఆరే ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నాడా అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు ఉద్రిక్తతలకు దారి తీసిన విషయం తెలిసిందే. అంతకుముందు కౌశిక్‌రెడ్డి మీడియా సమావేశంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ వారికి చీర,గాజులను పంపిస్తానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం పట్ల మహిళా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్‌లో ఆందోళన చేశారు. ఇదీ చదవండి.. మళ్లీ ఉద్రిక్తత.. ఎమ్మెల్యే అరికెపూడి ఇంటి వద్ద బందోబస్తు -
అసెంబ్లీ సెక్రటరీని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలపై బీఆర్ఎస్ యాక్షన్ మొదలుపెట్టింది. కోర్టు ఆదేశాలు అమలు చేయాలని కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం(సెప్టెంబర్11) అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కె.పి. వివేకానంద అసెంబ్లీ సెక్రటరీకి వినతి పత్రాన్ని అందజేశారు.బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలపై నెలరోజుల్లో చర్య తీసుకోవాలని, లేదంటే తామే సుమోటోగా కేసు మళ్లీ విచారిస్తామని హైకోర్టు ఇటీవల స్పీకర్‌కు సూచించిన విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ షెడ్యూల్‌ను తేదీలవారిగా ప్రొసీడింగ్స్ విడుదల చేయాలని హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. ఇదీ చదవండి.. వాల్మీకి స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్ -
స్పీకర్ స్పందించకుంటే మళ్లీ కోర్టుకే!
సాక్షి, హైదరాబాద్: పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయంలో అసెంబ్లీ స్పీకర్ నుంచి సానుకూల స్పందన రాని పక్షంలో మరోమారు కోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఫిరాయింపులపై పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద వేసిన రిట్ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టు సోమవారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. స్పీకర్ నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది.ఈ నేపథ్యంలో స్పీకర్ ప్రసాద్‌కుమార్ అనుసరించే వైఖరిని బట్టి తమ భవిష్యత్తు న్యాయ పోరాటం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్)పై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఈ ఏడాది మార్చిలో స్పీకర్‌కు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. స్పీకర్ స్పందించకపోవడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో హైకోర్టును ఆశ్రయించింది. తాజాగా కోర్టు తీర్పు నేపథ్యంలో.. ఇటీవలి కాలంలో ఇదే తరహాలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్యేల ఫిరాయింపులపై ఆయా రాష్ట్రాల స్పీకర్లు అనుసరించిన వైఖరిని బీఆర్ఎస్ పరిశీలిస్తోంది. మహారాష్ట్ర, హిమాచల్‌ప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఫిరాయింపులు, ఆయా సందర్భాల్లో స్పీకర్, కోర్టులు స్పందించిన తీరును అధ్యయనం చేస్తోంది. మహారాష్ట్ర, హిమాచల్‌లో ఏం జరిగింది? మహారాష్ట్రలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అంశం సుమారు రెండేళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. 2022 జూన్ 21న ప్రస్తుత మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కొందరు శివసేన ఎమ్మెల్యేలతో సొంత గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా షిండే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. షిండే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ అప్పట్లో సీఎంగా ఉన్న శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే డిప్యూటీ స్పీకర్ (స్పీకర్ పదవి ఖాళీగా ఉండటంతో)కు పిటిషన్లు సమరి్పంచారు.మరోవైపు తమదే అసలైన శివసేన అంటూ షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచి్చంది. అయితే కొత్త స్పీకర్ ఈ అనర్హత పిటిషన్లపై స్పందించకపోవడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. తొలుత 2023 డిసెంబర్ 31లోగా అనర్హత పిటిషన్ల అంశాన్ని తేల్చాలని స్పీకర్‌కు గడువు విధించిన సుప్రీంకోర్టు.. ఆ తర్వాత మరో పది రోజులు పొడిగిస్తూ ఈ ఏడాది జనవరి 10వరకు గడువు విధించింది. అయితే స్పీకర్.. షిండే, ఉద్ధవ్ వర్గాలు ఇచ్చిన అనర్హత పిటిషన్లను తిరస్కరించారు.దీంతో అనర్హత వేటు అంశం మరోమారు సుప్రీంకోర్టుకు చేరింది. ఇక హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర స్పీకర్ ఈ ఏ డాది ఫిబ్రవరి 29న అనర్హత వేటు వేశారు. అయితే తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉపఎన్నిక నిర్వహించవద్దని అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఈ అంశంలో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉప ఎన్నికలు జరిగాయి. మరో ఏడుగురు ఎమ్మెల్యేలపైనా వేటు వేయాలి హిమాచల్ తరహాలో ఉప ఎన్నికలు జరిగేలా చూడాలని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్‌లో చేరిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరితో పాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలపై ఇచ్చిన అనర్హత పిటిషన్లపైనా స్పీకర్ చర్యలు తీసుకోవాలని కోరుతోంది. కాంగ్రెస్‌లో చేరిన అరికెపూడి గాం«దీ, ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, గూడెం మహిపాల్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కూడా అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పిటిషన్లు సమరి్పంచింది. కోర్టు తీర్పులో పేర్కొన్న ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు ఈ ఏడుగురు ఎమ్మెల్యేలను కూడా అనర్హులుగా ప్రకటించని పక్షంలో కోర్టుకు వెళ్లాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. -
ప్రొటోకాల్ ఉల్లంఘన.. స్పీకర్‌కు కూకట్పల్లి ఎమ్మెల్యే ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫిర్యాదు చేశారు. మూడు సార్లు ప్రజల మద్దతుతో భారీ మెజారీతో గెలుపొందిన తాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటే కొందరు అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తూ పనులు చేయకుండా పబ్బం గడుపుతున్నారని ఫిర్యాదు చేశారు.ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి శాసనసభ్యుడి హక్కులకు భంగం కలిగించే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ప్రొటోకాల్ ఉల్లంఘనలు పునరావృతం అయితే తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించినట్లు కృష్ణారావు తెలిపారు. -
‘ప్రధాని ప్రసంగంలో తప్పులున్నాయ్.. తొలగించండి’
న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో విపక్ష నేత, ఇతర నేతల ప్రసంగాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ.. ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. మరోవైపు ప్రతిపక్ష రాహుల్ గాంధీ ప్రసంగాన్ని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించారు. అయితే దీనికి ప్రతిపక్ష కాంగ్రెస్ కౌంటర్ దాడికి దిగింది. ప్రధాని మోదీ ప్రసంగమే తప్పుల తడకగా సాగిందని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసింది.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగంలో తప్పుదోవ పట్టించే అంశాలున్నాయని పేర్కొంటూ చాలా భాగాన్ని రికార్డుల నుంచి తొలగించారు. ఈ పరిణామంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు స్పందిస్తూ.. ‘‘సభను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించే ఏ సభ్యుడైనా సులభంగా తప్పించుకోలేరు. నియమాలు వాళ్లను అడ్డుకుంటాయి’’ అని వ్యాఖ్యానించారు. అయితే దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ ఇప్పుడు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే క్రమంలో ప్రధాని మోదీ ప్రసంగంలో చాలా తప్పులు, అసత్యాలు ఉన్నాయని, వాటిని తొలగించాలని లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాసింది.‘‘2014లో బీజేపీ అధికారంలోకి రాక ముందు వరకు భారత రక్షణ దళాల్లో సరిపడా ఆయుధ సంపత్తి లేదని.. యుద్ధ విమానాలు అసలే లేవని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ, జాగ్వార్, మిగ్ 29, ఎస్‌యూ-30, మిరేజ్ 2000 లాంటి ఫైటర్ జెట్లు అప్పటికే ఉన్నాయి. అలాగే.. న్యూక్లియర్ బాంబులు, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్, బ్రహ్మోస్ క్షిపణులు కూడా ఉన్నాయి. అన్నింటికి మించి.. పదేళ్లలో 25 కోట్ల మంది దారిద్ర్యపు రేఖ దిగువ నుంచి పైకి తీసుకొచ్చినట్లు ప్రధాని ప్రకటించుకున్నారు. దీనిని కూడా మేం సవాల్ చేస్తున్నాం. అలాగే.. 16 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటు షేర్ పడిపోయిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ముమ్మాటికీ తప్పు. హిమాచల్, ఉత్తరాఖండ్, కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఓటు షేర్ పెరిగింది. కాంగ్రెస్‌పార్టీ మహిళలకు ప్రతీ నెలా రూ.8,500 ఇస్తుందనే తప్పుడు హామీ ఇచ్చిందని మోదీ మాట్లాడారు. కానీ, అది హామీ మాత్రమే. గెలిచి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అది నేరవేర్చాల్సిన విషయం. అలాంటప్పుడు అది అసత్య ప్రచారం ఎలా అవుతుంది?.కేవలం ప్రధాని మోదీతో పాటు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాగూర్ ప్రసంగంలోనూ తప్పులు ఉన్నాయని కాంగ్రెస్ ఆ లేఖలో ప్రస్తావించింది. ఈ మేరకు.. కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ పేరిట ఈ లేఖ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వెళ్లింది. 115(1)వ ఆదేశం అమలు చేసి.. ప్రధాని మోదీ, అనురాగ్ ఠాకూర్ ప్రసంగాల్లోని తప్పులు, తప్పుదోవ పట్టించే ప్రకటనల్ని తొలగించేలా చూడాలని మాణిక్కం ఠాగూర్ లేఖలో కోరారు.115(1) ఆదేశాల ప్రకారం.. మంత్రులుగానీ, ఇతర ఎంపీలుగానీ సభలో అసత్య ప్రకటనలు చేస్తే.. అభ్యంతరం వ్యక్తం చేసే సభ్యులు స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. చర్చ జరిపిన తర్వాత ఆ ప్రకటనలు తప్పని నిరూపిస్తే.. రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగిస్తారు. మోదీ, అనురాగ్ ఠాకూర్ ప్రసంగాల విషయంలో 115(1)ని అమలు చేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ స్పీకర్‌కు లేఖ రాశారు. -
Weekly Roundup : పార్లమెంట్ చిత్రం
18వ లోక్ సభ కొలువుదీరింది. పార్లమెంట్ తాత్కాలిక సమావేశాల్లో భాగంగా నూతనంగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార సమయంలో పలువురు ఎంపీలు చేసిన నినాదాలపై ఎన్డీయే కూటమి అభ్యంతరం వ్యక్తం చేసింది. 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్‌కు ఎన్నిక జరిగింది. స్పీకర్ ఓం బిర్లా ఎన్నిక, రాష్ట్రపతి ఎమర్జెన్సీపై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగ ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీక్‌పై చర్చ జరగాలని ప్రతి పక్షాలు పట్టుబట్టాయి. ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఉభయ సభలు హోరెత్తిరిపోవడంతో సోమవారానికి (జులై 1)కి వాయిదా పడ్డాయి. 18వ లోక్‌సభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు ప్రధాని మోదీతో సహా 262 మంది ఎంపీలు ప్రమాణం చేశారు.ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, కన్నడ, తెలుగు, మరాఠీ ఇలా భారతీయ భాషలలో కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల లోక్‌సభ భాషా వైవిధ్యాన్ని ప్రదర్శించింది.మోదీ ప్రమాణం చేసేటప్పుడు ఎన్డీయే నేతలు జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష నేతలంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు.ఏపీ నుంచి కేంద్రమంత్రిగాఉన్న రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ కు పంచె కట్టులో వెళ్లారు.రైతు నేత వీపీఐ (ఎం) ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్ కు వచ్చారు.తీహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు.పార్లమెంట్ సమావేశాల తొలి రోజు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పార్లమెంట్ హౌజ్‌కు విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు సైకిల్‌పై చేరుకున్నారు. లోక్‌సభలో తొలిసారి అడుగుపెట్టిన అప్పలనాయుడు, ఢిల్లీలో తన అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు చేరుకున్నారు.ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి ప్రమాణ స్వీకార సమయంలో నీట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. నీట్ ఫెయిల్డ్ మినిస్టర్ అని నినాదాలు చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారాలు..రెండో రోజు 274 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు.రెండో రోజు ప్రమాణ స్వీకారంలో భాగంగా స్వతంత్ర సభ్యుడు రాజేష్ రంజన్ అలియాస్ పప్పూ యాదవ్ ' నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలి' అని రాసి ఉన్న టీ షర్ట్ ధరించి ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.తమిళనాడులోని కృష్ణగిరి లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచిన గోపీనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో క్రిష్ణగిరి ఎంపీగా గోపీనాథ్ 1,92, 486 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఏఐఏడీఎంకే పార్టీకి చెందిన జయప్రకాష్ పై గెలుపొంది పార్లమెంటులో అడుగు పెట్టారు.రెండో రోజు సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు.హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఉర్ధూలో ప్రమాణం చేస్తూ.. జై భీం, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహో అక్బర్ అంటూ ప్రమాణం పూర్తి చేశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ జై పాలస్తీనా నినాదం ఇవ్వడంపై పలువురు మంత్రులు, బీజేపి సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీనిపై సభాపతి స్థానంలో ఉన్న రాధామోహన్ సింగ్ నిబంధనల ప్రకారం వ్యవహరిస్తానని, నిబంధనలు పరిశీలించి.. రికార్డుల నుంచి తొలగించే విషయాన్ని పరిశీలిస్తానని సభ్యులకు సూచించారు.ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగ ప్రతిని పట్టుకుని ప్రమాణం చేసి.. 'జై హింద్, జై సంవిధాన్' అని నినదించారు. ఆయన తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా సందర్శకుల గ్యాలరీ నుంచి ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీదాదాపు పదేళ్ల తర్వాత లోక్‌సభలో విపక్ష పార్టీ సభ్యుడికి ప్రతిపక్ష నేత హోదా దక్కింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆ బాధ్యతలు స్వీకరించారు. దీంతో కేబినెట్ మంత్రికి ఉండే సౌకర్యాలు పొందనున్నారు. లోక్‌సభలో విపక్ష కూటమికి నేతృత్వం వహించడమే కాకుండా.. ఈసీ, సీబీఐ, ఈడీ వంటి ప్రభుత్వ సంస్థలకు బాస్‌ల నియామకంలో కీలక భూమిక పోషించనున్నారు.2014, 2019లలో మొత్తం సీట్లలో 10 శాతం దక్కించుకోకపోవడంతో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే అవకాశం ఎవరికీ రాలేదు. దీంతో రెండుసార్లు ప్రతిపక్ష సభ్యుడి హోదా ఖాళీగా ఉంటూ వచ్చింది. ఈసారి 99 సీట్లను గెలుచుకోవడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు ఆ హోదా దక్కింది. మూడో రోజు సమావేశాల్లో మూజూవాణి ఓటు ద్వారా బుధవారం స్పీకర్‌గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక అయ్యారు.అధికార ఎన్డీయే కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో 48 ఏళ్ల లోక్ సభ చరిత్రలో తొలి సారి స్పీకర్ కు ఎన్నిక జరిగింది. మూజువాణి ఓటుతో ఎన్డీయే స్పీకర్ అభ్యర్థి కోట ఎంపీ మరోసారి స్పీకర్‌గా ఎన్నిక అయ్యారు.స్పీకర్ తొలి ప్రసంగంలో ఎమర్జెన్సీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యంతం తెలపగా.. ఎన్డీయే ఎంపీలు అనుకూలంగా నినాదాలు చేశారు. రాష్ట్రపతి నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 1975 నాటి ఎమర్జెన్సీ రోజుల్ని ప్రస్తావించారు.మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు 61 ఏళ్ళ ఓం బిర్లాను స్పీకర్ స్థానం వరకు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు.స్పీకర్ ఎన్నిక అయ్యక బిర్లాను పోడియం వరకు తీసుకువెళ్లే సందర్భంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిర్లాను అభినందించే క్రమంలో మోదీ, రాహుల్ కరచాలనం చేసుకున్నారు.స్పీకర్ ఎన్నిక సందర్భంగా రాహుల్ సరికొత్త వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. తెలుపు రంగు లాల్చీ పైజామ ధరించి లోక్ సభకు వచ్చారు.స్పీకర్ బాధ్యతలు చెబడుతూనే ఓం బిర్లా తీసుకున్న తొలి నిర్ణయం లోక్ సభ కాక రేపింది.1975 నాటి ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధానాన్ని ఖండిస్తూ స్పీకర్ స్వయంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఎమర్జెన్సీ ప్రస్తావన నిరసిస్తూ ప్రతిపక్షాలు నినాదాలతో హోరెత్తించారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఉభయ సభలను ఉదేశిస్తూ ప్రసంగించారు. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. రాజ్యాంగంపై దాడి అని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఎమర్జెన్సీ అంశాన్ని చొప్పించడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.రాష్ట్రపతి ప్రసంగం పూర్తిగా ప్రభుత్వ స్క్రిప్ట్. తప్పుల తడక అని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. చివరికి రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఎమర్జెన్సీ ప్రస్తావన తీసుకురావడం సిగ్గుచేటు. నిజానికి మోదీ పదేళ్ల పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని విపక్షాలు దుయ్యబట్టాయి. ప్రధాని మోదీ మంత్రి వర్గ సభ్యులను ఎగువ సభకు పరిచయం చేశారు.పార్లమెంట్ లో నీట్ రగడ..శుక్రవారం నీట్ పరీక్ష లో అక్రమాలపై వెంటనే చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. లోక్ సభ స్పీకర్ , రాజ్య సభలో చైర్మన్ అంగీకరించలేదు. దీంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదా పడ్డాయి.నీట్ పరీక్షపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనకంజ వేస్తోందని రాజ్య సభలో విపక్షాలు నిలదీశాయి. నీట్‌పై చర్చించాలని 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకువెళ్లారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. రాజ్య సభ మూడు సార్లు వాయిదా పడింది.ప్రతి పక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావటంపై రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు చేశారు. అనంతరం నీట్ రగడ నడుమ ఉభయ సభలు సోమవారానికి (జులై 1) వాయిదా పడ్డాయి. -
ఎమ్మెల్యేల పార్టీ మార్పు పిటిషన్.. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ఎమ్మెల్యే పార్టీ మార్పు అంశంపై స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని.. ఆ గడువు దాటి వారమైనా ఇంకా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్ల (బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్) తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేకు కనీసం ఇప్పటివరకు నోటీసులు కూడా జారీ చేయలేదన్నారు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘వీరు 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించి, తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ఒక పార్టీ అభ్యరి్థత్వంపై గెలిచి శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరిన వీరిని అనర్హులుగా ప్రకటించాలి. స్పీకర్‌ను కలవాలని ప్రయత్నించినా సమయం ఇవ్వడం లేదు. ఈ మెయిల్ ద్వారా పంపిన పిటిషన్‌పై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్ ఆదేశించాలి’అని కోరారు. ఇదే విధంగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరారని, ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి గురువారం మరోసారి విచారణ చేపట్టారు. రెండు తీర్పులను పరిశీలిస్తే.. సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపిస్తూ.. ‘ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి పార్టీ మారడమే కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఆయనను ప్రజలు ఓడించారు. మార్చి 18న పిటిషన్ ఇచ్చినా స్పీకర్ కార్యాలయం ఇంత వరకు ఏం చర్యలు చేపట్టిందో కూడా చెప్పలేదు. ఈ రోజు విచారణ ఉండగా, ఒక రోజు ముందు కౌంటర్ దాఖలు చేశారు. మహారాష్ట్ర, మణిపూర్ కేసులలో సుప్రీంకోర్టు వెలువరించిన రెండు తీర్పులను పరిశీలిస్తే.. తమ ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లపై నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రూల్ 6, 7 ప్రకారం స్పీకర్ నడుచుకోవడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రతివాదుల వాదన కోసం తదుపరి విచారణను జూలై 3కు వాయిదా వేసింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి, అనధికారిక ప్రతివాది తరఫున సీనియర్ న్యాయవాది మయూర్‌రెడ్డి హాజరయ్యారు. -
Parliament Special Session: కాక రేపిన ఎమర్జెన్సీ తీర్మానం
న్యూఢిల్లీ: స్పీకర్‌గా బాధ్యతలు చేపడుతూనే బుధవారం బిర్లా తీసుకున్న తొట్ట తొలి నిర్ణయమే లోక్‌సభలో కాక రేపింది. విపక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి తీవ్ర నిరసనలకు, వ్యతిరేకతకు దారి తీసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడాన్ని ఖండిస్తూ స్పీకర్ సభలో స్వయంగా తీర్మానం ప్రవేశపెట్టారు! ‘‘భారత్ ఎప్పుడూ ప్రజాస్వామిక విలువలకు పెద్దపీట వేసింది. అలాంటి దేశంలో ఇందిర 50 ఏళ్ల క్రితం ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారు. ప్రజాస్వామిక విలువలపై, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపారు. విపక్ష నేతలను జైళ్లలో కుక్కారు. రాజ్యాంగంపై నేరుగా దాడి చేశారు. ఎమర్జెన్సీ విధించిన 1975 జూన్ 26 దేశ చరిత్రలో ఎన్నటికీ చెరగని మచ్చగా మిగిలిపోతుంది’’ అంటూ తీర్మానాన్ని చదవి విన్పించారు. ఇందిర తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘ఎమర్జెన్సీ కాలంలో ప్రజలపై ఇందిర సర్కారు చెప్పలేనన్ని అకృత్యాలకు పాల్పడింది. బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీ బాధితుందరికీ 18వ లోక్‌సభ సంతాపం తెలుపుతోంది. ఎమర్జెన్సీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తోంది’’ అన్నారు. ఎమర్జెన్సీకి నిరసనగా నిమిషం పాటు మౌనం పాటించాలని సభ్యులను కోరారు. ఎన్డీఏ సభ్యులంతా నిలబడి మౌనం పాటించగా విపక్షాలన్నీ స్పీకర్ తీరును తీవ్రంగా ఖండించాయి. ఎమర్జెన్సీ ప్రస్తావనను నిరసిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దాంతో స్పీకర్‌గా తొలి రోజే సభను బిర్లా వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం విపక్షాల నిరసనలకు ప్రతిగా బీజేపీ సభ్యులంతా పార్లమెంటు ప్రాంగణంలో ప్రదర్శనకు దిగారు. ఎమర్జెన్సీ విధింపుపై కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ తీరు ప్రశంసనీయం: మోదీ ఎమర్జెన్సీని స్పీకర్ గట్టిగా ఖండించడం హర్షణీయమని మోదీ అన్నారు. ‘‘ఇందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఎమర్జెన్సీ వేళ జరిగిన అకృత్యాలను స్పీకర్ తన తీర్మానంలో ఎత్తి చూపారు. రాజ్యాంగాన్ని తోసిరాజంటే, ప్రజాభిప్రాయాన్ని అణగదొక్కితే, వ్యవస్థలను నాశనం చేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇందిర తీసుకున్న ఆ తప్పుడు నిర్ణయం ఒక చక్కని ఉదాహరణ’’ అని ఎక్స్‌లో ప్రధాని పేర్కొన్నారు. -
ఎంపీల సస్పెన్షన్ జరగదని ఆశిస్తున్నా: స్పీకర్‌తో అఖిలేష్
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎంపీ కే సురేష్‌పై ఓం బిర్లా అత్యధిక ఓటింగ్ సాధింగా వరుసగా రెండోసారి స్పీకర్ పదవి దక్కించుకున్నారు. అనంతరం స్పీకర్ అధ్యక్షతన సమావేశాలు కొనసాగాయి. ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికైన ఓం బిర్లాకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అభినందనలు తెలిపారు. అదేవిధంగా గత సమావేశాల్లో జరిగిన విషయాలను ప్రస్తావిస్తూ స్పీకర్‌కు చురకలంటించారు.గతంలో ఎంపీల సస్పెన్షన్ వంటి చర్యలు సభ గౌరవాన్ని దెబ్బతీశాయని అన్నారు. ఎంపీల సస్పెన్షన్, బహిష్కరణ వంటి చర్యలు కొత్త లోక్‌సభలో జరగవని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. 'ప్రజాప్రతినిధి గొంతు అణచివేయడం, బహిష్కరణ వంటి చర్యలు మళ్లీ జరగవని మేము ఆశిస్తున్నాము. మీ నియంత్రణ కేవలం ప్రతిపక్షంపైనే ఉంది, కానీ అది కూడా అధికార వర్గం వైపు కూడా ఉండాలి' అని అన్నారు.కాగా గత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రికార్డు స్థాయిలో వందకుపైగా ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. టీఎంసీ మహువా మొయిత్రా కూడా నైతిక దుష్ప్రవర్తన కారణంగా బహిష్కరణకు గురరయ్యారు.స్పీకర్ ప్రతిపక్షాల పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. నిష్పాక్షకతంగా ఉండటం అనేది ఈ పదవికి గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు.సభ మీ సంకేతాలపై పనిచేయాలని కానీ ఇతర మార్గాల్లో కాదని అన్నారు. స్పీకర్ తీసుకునే న్యాయమైన నిర్ణయాలకు తాము కట్టుబడి నిలబడతామని అన్నారు. ప్రజాస్వామ్య న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా స్పీకర్ ఇక్కడ కూర్చున్నారని, పాలక వ్యవస్థను గౌరవించినట్లే ప్రతిపక్షాలను కూడా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. -
పోచారం, సంజయ్‌పై బీఆర్ఎస్ ఫిర్యాదు.. స్పీకర్‌కు మెయిల్
సాక్షి,హైదరాబాద్: పార్టీ మారుతున్న ఎంఎల్ఏలపై అనర్హతపై దూకుడు బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్,శాసన సభ సెక్రటరీకి ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు.వెంటనే వారిద్దరిపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి మెయిల్లో విజ్ఞప్తి చేశారు. స్పీకర్ సమయమడగడానికి ఫోన్ చేసినా ఆయన ఆఫీస్ స్పందించకపోవడంతో ఈ మెయిల్,స్పీడ్ పోస్ట్ ద్వారా బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం, దానం, తెల్లంలపైనా బీఆర్ఎస్ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. వీరందరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. -
స్పీకర్ ఎన్నిక: ఓటింగ్‌కు ఆ ఏడుగురు దూరం!.. ప్రభావమెంత?
ఢిల్లీ: అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో ఏకాభిప్రాయం కుదరకపోవటంతో 18వ పార్లమెంట్‌లోని లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. ఇవాళ లోక్‌సభ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి. అయితే రెండురోజులు పాటు పార్లమెంట్లో ఎంపీల ప్రమాణ స్వీకారం జరగ్గా.. మరో ఏడుగురు సభ్యులు ఎంపీలుగా ప్రమాణం చేయలేదు. ఇది ఇవాళ్టి ఓటింగ్‌పై ప్రభావం చూపబోతుందా? అనే చర్చ నడుస్తోంది. ఎంపీలుగా ప్రమాణం చేయని వాళ్లలో ఇండియా కూటమికి చెందినవారే ఐదుగురు ఉండగా, మిగతా ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు. శశిథరూర్, శతృఘ్న సిన్హాలాంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయలేదు కాబట్టి ఇవాళ స్పీకర్ ఎన్నికలో ఈ ఏడుగురు ఓటింగ్‌కు దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అయితే.. ఓటింగ్‌పై ఇది ప్రభావం చూపెట్టే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు చెబుతున్నారు. సభకు హాజరయ్యే సభ్యుల ఆధారంగనే ఓటింగ్ మెజార్టీని లెక్కగడతారని వారంటున్నారు. అదే సమయంలో.. ఎన్డీయే కూటమి 293 సీట్లతో మెజార్టీలో ఉంది. స్పీకర్ ఎన్నికకు మ్యాజిక్ ఫిగర్ 269గా ఉంది. మరోవైపు బీజేపీ విజ్ఞప్తి మేరకు వైఎస్సార్సీపీ సానుకూలంగానే స్పందించింది. ఇక.. ఇండియా కూటమిలో మొత్తం 232గాను 227 మంది ఎంపీలు ప్రమాణం చేశారు. అంటే ఇండియా కూటమికి మెజార్టీ లేదనే చెప్పాలి. దీంతో స్పీకర్ ఎన్నిక ఎన్డీయే వైపు ఉండే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఇక.. స్పీకర్ ఎన్నిక కోసం మెజార్టీ ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ స్పీకర్ ఎన్నికలో 300 ఎంపీల ఓట్ల కోసం టార్గెట్ పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీయే కూటమిలో లేని పార్టీలను సైతం బీజేపీ మద్దతు కోరింది. స్పీకర్ ఎన్నికకు ఎన్డీయే కూటమి మాజీ స్పీకర్ కోటా ఎంపీ ఓం బిర్లాను, ఇడియా కూటమి కేరళ ఎంపీ కే. సురేష్‌ను బరిలోకి దింపాయి. ఇవాళ 11 గంటలకు స్పీకర్ ఓటింగ్ జరగనుంది. -
స్పీకర్ ఎన్నిక.. ‘ఇండియా’ కూటమిలో చిచ్చు !
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ప్రతిపక్షాల తరపున స్పీకర్ పదవికి కె.సురేష్‌ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆరోపిస్తోంది. స్పీకర్ పదవికి కె.సురేష్‌ను పోటీపెట్టేముందు తమను సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌బెనర్జీ పార్లమెంటు బయట మంగళవారం(జూన్25) మీడియాకు తెలిపారు. ‘మమల్ని ఎవరూ సంప్రదించలేదు. చర్చ జరగలేదు. దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా కె.సురేష్‌ను స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టింది’అని అభిషేక్ బెనర్జీ మీడియాకు చెప్పారు. ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.కాగా, 18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నిక బుధవారం(జూన్26) జరగనుంది. స్పీకర్ ఎన్నికకు సహకరించాల్సిందిగా ప్రతిపక్షాలను బీజేపీ కోరినప్పటికీ అవి అంగీకరించలేదు. సాంప్రదాయానికి విరుద్ధంగా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ప్రతిపక్షానికి ఆఫర్ చేయకపోవడంతో స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు అభ్యర్థిని పోటీ పెట్టాయి. -
లోక్‌సభలో నినాదాల వివాదం.. స్పీకర్ కీలక ప్రకటన
సాక్షి,న్యూఢిల్లీ: లోక్‌సభలో రెండోరోజు మంగళవారం(జూన్25) కొత్త ఎంపీల ప్రమాణస్వీకారం సందర్భంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణాలు చేసిన తర్వాత పలువురు ఎంపీలు చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తన ప్రమాణం ముగిసిన తర్వాత జై తెలంగాణ, జై భీం, జై పాలస్తీనా అని నినాదాలు చేశారు.BREAKING : Huge uproar in the Parliament after Hyderabad MP Asaduddin Owaisi says “ Jai Palestine” at the end of his oath. Your thoughts on this. pic.twitter.com/FQMEIeaFHX— Roshan Rai (@RoshanKrRaii) June 25, 2024తమిళనాడులోని తిరువళ్లూర్ ఎంపీ శశికాంత్ సెంథిల్ రాజ్యాగం చేత పట్టుకుని తమిళ్లో ప్రమాణం చేశారు. ఈయన కూడా తన ప్రమాణం ముగిసిన తర్వాత ‘ఆదివాసీలు, దళితులు, మైనారిటీల మీద వేధింపులు ఆపండి. జై భీం, జై సంవిధాన్’అని నినదించారు. ఈయన కాశ్మీర్ స్వయంప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా అప్పట్లో తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. The IAS officer who resigned after the abrogation of #Article370 in #Kashmir and #Tiruvallur's #Congress MP #SasikanthSenthil took oath in Tamil.When he said, "Stop the shameful atrocities against the Minorities, Dalits & Adivasis. Jai Bhim, Jai Sanvidhan" #BJP MPs protested.… pic.twitter.com/jv1uyp2pGu— Hate Detector 🔍 (@HateDetectors) June 25, 2024సభలో అసదుద్దీన్, శశికాంత్ సెంథిల్ చేసిన నినాదాలపై బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్పీకర్ కలుగజేసుకుని ఎంపీలు చేసిన వివాదాస్పద నినాదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. -
తొలిసారి లోక్‌సభ స్పీకర్ ఎన్నిక.. అభ్యర్థుల నేపథ్యం ఇదే..
ఢిల్లీ: 18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం మంగళవారం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఎన్డీయే కూటమి, ఇండియా కూటమి తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఎన్డీయే తరఫున గతంలో స్పీకర్‌గా సేవలు అందించిన కోటా ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి తరఫున 8 సార్లు ఎంపీగా గెలిచిన కేరళ ఎంపీ కే. సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే.. రేపు(జూన్ 26,2024) తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. స్పీకర్ బరిలో ఉన్న అభ్యర్థులు రాజకీయ నేపథ్యాలు ఇవే..ఇండియా కూటమి అభ్యర్థి కే. సురేష్తిరువనంతపురం జిల్లాలోని కోడికున్నిల్‌లో కుంజన్, థంకమ్మ దంపతులకు 1962లో సురేష్ జన్మించారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1989లో మొదటిసారి కేరళలోని అదూర్ లోక్‌సభ స్థానంలో ఎంపీ గెలిచారు. 1991, 1996, 1999 వరుస సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇదే స్థానంలో విజయం సాధించారు. అనంతరం మావేలికర లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల్లో సైతం మావేలికర నుంచి ఆయన విజయం సాధించారు. ఎంపీ సురేష్.. కేరళ పీసీసీ సభ్యునిగా, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా, పీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అనేక పదవులు చేపట్టి పార్టీని ముందుకు నడిపించారు. ఇ ఇప్పటివరకు మొత్తం 8 సార్లు ఎంపీగా గెలిచిన ఆయన ప్రస్తుతం కేరళ పీసీసీ చీఫ్ ఉన్నారు. ఇవాళ ఇండియా కూటమి తరఫున స్పీకర్ ఎన్నికకు నామినేషన్ వేశారు.ఎన్డీయే కూటమి అభ్యర్థి ఓం బిర్లా ఓం బిర్లా 1962లో శ్రీకృష్ణ బిర్లా, శకుంతలాదేవి దంపతులకు జన్మించారు. కోటాలోని ప్రభుత్వ కామర్స్ కళాశాల నుంచి మాస్టర్స్ డిగ్రీ, ఆజ్మీర్‌లోని మహర్షి దయానంద్ సరస్వతి విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. రామమందిరం నిర్మాణ ఉద్యమంలో పాల్గొని ఆయన యూపీలో జైలుశిక్ష కూడా అనుభవించారు. అనంతరం ఆయన రాజకీయాల్లో చేరి మొదటిసారి 2003లో కోటా దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా ఎన్నిక కాకముందు 2013లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2014, 2019లో కోటా లోక్‌సభ స్థానం నుంచి గెలుపొదారు. 16 లోక్‌భలో ఓం బిర్లా సామాజిక న్యాయం, సాధికారకత కొరకు ఎనర్జీ, కన్సాల్టేటివ్ స్టాండింగ్ కమిటీలో సభ్యుని పనిచేశారు.2019లో ఎంపీగా గెలిచిన ఆయన 17 లోక్‌సభకు స్పీకర్‌గా పనిచేశారు. 2014లో కోటా నుంచి ఎంపీగా గెలుపొందిన ఓం బిర్లా.. లోక్‌సభ స్పీకర్ ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. -
చాన్స్ ఇచ్చినా మోదీ కాదన్నారు: రాహుల్ గాంధీ
ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో లోక్‌సభ స్పీకర్ ఎన్నిక అనివార్యం అయింది. అధికార ఎన్డీయే కూటమి నుంచి బీజేపీ ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి కేరళ కాంగ్రెస్ ఎంపీ కే సురేష నామినేన్లు దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే.. రేపు(జూన్ 26,2024) తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. అయితే ఇవాళ ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై బీజేపీ వ్యవరించిన తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ‘‘ స్పీకర్ పదవికి ఎన్నికకు ఇండియా కూటమి విపక్షాలు సహరిస్తాయని చెప్పాం. డిప్యూటీ స్పీకర్ విషయంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాకు ఫోన్ చేస్తాని చెప్పి ఇప్పటికీ చేయలేదు. మా అధ్యక్షుడు ఖర్గేను రాజ్‌నాథ్‌సింగ్ అవమానించారు. మోదీ తాను వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలి. ఖర్గేతో జరిగిన చర్చలో రాజ్‌నాథ్ సింగ్ డిప్యూటీ స్పీకర్‌పై ఎటుంటి హామీ ఇవ్వలేదు.ప్రధాని మోదీ చెప్పెది ఒకటి.. చేసేది ఒకటి. సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి ప్రతిపక్షాలకు కావాలన్నాం. డిప్యూటీ స్పీకర్‌పై స్పష్టమైన హామీ ఇస్తేనే స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని చెప్పాం. యూపీఏ హయాంలో మేము డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పటి విపక్షాలకు ఇచ్చాం’’ అని రాహుల్ గాంధీ అన్నారు.రాజకీయం చేయటం సరికాదు: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ‘స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే బాగుంటుంది. ఇలా రాజకీయం చేయటం సరికాదు. విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలాని ఎలాంటి నిబంధనల లేవు. ముందు డిప్యూటీ స్పీకర్ ఎవరో? తేల్చాలని కాంగ్రెస్ పట్టుబట్టింది’అని అన్నారు. -
మళ్లీ ఓం బిర్లాకే ఛాన్స్
-
దేశ చరిత్రలోనే తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక!
ఢిల్లీ, సాక్షి: లోక్‌సభ స్పీకర్ ఎన్నికలో ట్విస్ట్ చోటుచేసుకుంది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆ పోస్టుకు ఎన్నిక జరగబోతోంది. ఇన్నేళ్లలో ఏకగ్రీవంగానే లోక్‌సభ స్పీకర్ ఎన్నిక జరుగుతూ వచ్చింది. అయితే 18వ లోక్‌సభ స్పీకర్ పదవి కోసం అధికార-ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో.. ఇటు ఎన్డీయే కూటమి, అటు ఇండియా కూటమి అభ్యర్థుల్ని బరిలో నిలిపాయి. ఎన్డీయే కూటమి తరఫున ఓం బిర్లా, ఇండియా కూటమి తరపున సీనియర్ ఎంపీ కే.సురేష్ నామినేషన్ వేశారు. లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 294 మంది ఎంపీల బలం ఉంది. అయినప్పటికీ తొలిసారి జరుగుతుండడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. మరోసారి లోక్‌సభ స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లానే ఎన్డీయే కూటమి ఎంచుకుంది. స్పీకర్ పోస్టుకు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు.. ఓం బిర్లాను లోక్‌సభ స్పీకర్‌గా కొనసాగిస్తారని ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో ఇవాళ ఉదయం ఓం బిర్లా.. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అదే సమయంలో.. ఓం బిర్లా ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీయే తీవ్రంగా యత్నించింది. బీజేపీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్.. ఇండియా కూటమి నేతలతో చర్చలు జరిపారు. అయితే ఆనవాయితీగా వస్తున్న డిప్యూటీ స్పీకర్ పోస్టును ప్రతిపక్షాలకు వదిలేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో పాటు ఇండియా కూటమి నేతలంతా ప్రతిపాదించారు. దీంతో.. మరోసారి ఫోన్ చేసి పిలుస్తామంటూ రాజ్‌నాథ్‌సింగ్ వాళ్లకు చెప్పారు. అయితే డిప్యూటీ స్పీకర్ విషయంలో అధికార కూటమి తటపటాయించింది. ఈ క్రమంలో మరోసారి ఎన్డీయే నుంచి పిలుపు రాకపోవడంతో.. అభ్యర్థినే నిలపాలని ఇండియా కూటమి నిర్ణయించింది. దీంతో దేశచరిత్రలోనే.. రేపు(జూన్ 26, 2024) తొలిసారి లోక్‌సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది. No consensus on Speaker's post. INDIA bloc is likely to field its candidate for the post of Speaker of the 18th Lok Sabha: Sources pic.twitter.com/seZyieAIhS— ANI (@ANI) June 25, 2024 ఇంతకు ముందు ప్రొటెం స్పీకర్ విషయంలోనూ కే.సురేష్ పేరు తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. కేరళ కాంగ్రెస్ సీనియర్ నేత అయిన సురేష్.. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.నిన్న 280 మంది ఎంపీలు లోక్‌సభలో ప్రమాణం చేయగా.. ఇవాళ మిగతా వాళ్లు చేస్తున్నారు. ఇక రేపు(జూన్ 26) స్పీకర్ ఎన్నిక జరగనుంది. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ సమక్షంలో ఎంపీలు స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. -
లోక్‌సభ స్పీకర్‌పై ఉత్కంఠ.. ఖర్గే సహా కూటమి నేతలతో చర్చలు
ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవుల ఎంపిక విషయంలో ఏకాభిప్రాయంపై తీసుకువచ్చేందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు రంగంలో దిగారు. ఈ క్రమంలో ప్రతిపక్షాల ఇండియా కూటమిని ఒప్పించేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఇతర నేతలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ప్రతిపక్షాల ఇండియా కూటమి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ కోసం పట్టుపడుతున్న విషయం తెలిసిందే. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక నామినేషన్‌కు మధ్యాహ్నం 12 గంటల వరకు గడువు ముగియనుండటంతో ఇరు కూటముల మధ్య ఉత్కంఠ నెలకొంది.మరోవైపు మాజీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈసారి కూడా బీజేపీ ఓం బిర్లాను స్పీకర్‌గా ఎంపిక చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎన్నికైన లోక్‌సభ స్పీకర్లు అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఇక, స్పీకర్ ఎంపికకు ఎన్నిక జరిగితే.. ఇలా ఎన్నిక జరగటం ఇదే తొలిసారి అవుతుంది.డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించటం ఆనవాయితీగా వస్తోంది. 2014లో బీజేపీ తన మిత్ర పక్షం అన్నాడీఎంకే ఎంపీ ఎం తంబిదురైని డిప్యూటీ స్పీకర్‌గా ఎంపిక చేసింది. ఇక.. 2019 నుంచి ఆ పోస్ట్ ఖాళీగా ఉంది.16,17 లోక్‌సభల్లో కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్షహోదా కూడా దక్కలేదు. కానీ, ఈసారి లోక్‌సభ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్ దక్కించుకోవాలని పట్టుపడుతోంది.