
సాక్షి, తూర్పుగోదావరి: ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. స్పీకర్‌కు ఉన్న విచక్షణ అధికారాలతో వేటు వేస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రఘురామ కృష్ణరాజు వైఎస్సార్‌సీపీ అధినేత, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని విమర్శించారు. ఆయన పాల్పడుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. గతంలో జరిగిన శరద్ యాదవ్ ఘటన కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment