raghurama krishnam raju
-
గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామాలు
సాక్షి, విజయవాడ: గుడివాడ టీడీపీ నేత తులసి బాబుపై టీడీపీ డ్రామా మొదలుపెట్టింది. తులసి బాబుకి టీడీపీతో సంబంధం లేదంటూ పల్లా శ్రీనివాస్ ప్రకటించారు. టీడీపీలో ఇన్నాళ్లు ఉన్నా తమకు సంబంధం లేదంటూ టీడీపీ ప్రకటనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రఘురామ కృష్ణంరాజు కేసులో టీడీపీ నేత తులసిబాబు రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.గుడివాడ టీడీపీ ఎమ్మెల్యేకి బినామిగా ఉన్న నిందితుడు తులసిబాబు.. నారా లోకేష్‌తోనూ గతంలో ఫోటోలు దిగాడు. గుడివాడలో కలెక్టర్ ఇతర అధికారులతోనూ తులసిబాబు సమీక్షలు చేశారు. టీడీపీకి ఇప్పుడు సంబంధం లేదంటూ పల్లా శ్రీనివాస్ వింత ప్రకటన చేశారు. గుడివాడ టీడీపీ షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన తులసిబాబు.. ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో కలిసి వ్యవహారాలు చక్కపెట్టారు.ఇదీ చదవండి: నారావారిని ఇరకాటంలో పడేసిన సొంత మీడియా! -
సుప్రీంకోర్టు చివాట్లు పెడితే ఇంత దిగజారి రాస్తారా..!
-
జగన్ కేసులతో మీకేం పని?
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసులతో మీకేం పనంటూ మాజీ ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. ఈ కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదలాయించాలన్న ఆయన అభ్యర్థనను తిరస్కరించింది. ఆ కేసులను మరో రాష్ట్రానికి బదలాయించే ప్రసక్తే లేదని, మహా అయితే ఈ కేసుల్లో విచారణను వేగవంతం చేయాలని కింది కోర్టుకు చెప్పగలమని స్పష్టం చేసింది.అంతే తప్ప ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేమంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు కోరుతున్న నేపథ్యంలో, అసలు ఆ కేసులతో మీకేం సంబంధమని ఆయన్ని నిలదీసింది. వాదనలు వినిపించేందుకు సీఐడీ గడువు కోరడంతో విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీ‹Ùచంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజుకు ప్రత్యేక కోర్టు, హైకోర్టుల్లో చుక్కెదురు.. జగన్ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీఐడీ, ఈడీ పలువురిపై కేసులు నమోదు చేసింది. ఈ కేసుల్లో జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జగన్‌పై నమోదైన కేసుల్లో సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణ కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా, జగన్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ రఘురామకృష్ణరాజు సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని ఆ కోర్టు కొట్టేసింది. ఆ తరువాత హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో సైతం రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. దీంతో జగన్ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు, ఆయనపై నమోదైన కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఆయన 2023లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు పలుమార్లు విచారణ జరిపింది. తాజాగా సోమవారం ఈ వ్యాజ్యంపై జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అసలు జగన్ కేసులతో మీకేం సంబంధమంటూ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పింది.రాజకీయ విద్వేషంతోనే పిటిషన్ అనంతరం జగన్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. రాజకీయపరమైన విద్వేషంతోనే రఘురామకృష్ణరాజు ఈ పిటిషన్ దాఖలు చేశారన్నారు. సీఐబీ, ఈడీ నమోదు చేసిన కేసులపై సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణను హైకోర్టు పర్యవేక్షిస్తోందని తెలిపారు. ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. సీబీఐ తరఫు న్యాయవాది స్పందిస్తూ.. కేసుల వివరాలు, వాటి ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేశామని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీబీఐ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) మరో కేసులో వాదనలు వినిపిస్తున్నారని, అందువల్ల ఈ వ్యాజ్యంలో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. -
రఘురామ కృష్ణంరాజు లాయర్‌కు సుప్రీంకోర్టు అక్షింతలు
-
రఘురామ కృష్ణంరాజు లాయర్ కు సుప్రీంకోర్టు అక్షింతలు
-
కోడిపందాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు
-
రఘురామ.. ఫ్లెక్సీ చింపి అంబేద్కర్‌ను అవమానిస్తారా?: తానేటి వనిత
సాక్షి, ఏలూరు: ఏపీలో కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి అంబేద్కర్‌కు అవమానమే జరుగుతోందన్నారు మాజీ హోంమంత్రి తానేటి వనిత. కూటమి నేతలు అంబేద్కర్‌కు ఏ మాత్రం గౌరవం ఇవ్వడం లేదన్నారు. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చింపేసి అవమానించారని మండిపడ్డారు.మాజీ హోంమంత్రి తానేటి వనిత తాజాగా aమీడియాతో మాట్లాడుతూ.. గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం బాధాకరం. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని తప్పకుండా శిక్షించాలి. కూటమి నేతలు అంబేద్కర్‌కు గౌరవం ఇవ్వడం లేదు. ఎమ్మెల్యే రఘురామ అంబేద్కర్ ఫ్లెక్సీ చించేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘాలు కోరితే న్యాయం జరగలేదు. విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని వైఎస్ జగన్ నిర్మిస్తే.. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన పేరును తొలగించారు. అంబేద్కర్‌పై రాజకీయాలా?.అంబేద్కర్ విగ్రహం వద్ద లైట్లన్నీ ఆపేసి.. శిలాఫలకాలు పగలగొట్టారు. ఇప్పటి వరకూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్.. విగ్రహం వద్దకు వెళ్లి చూసింది లేదు. శిలాఫలకం ధ్వంసం చేసిన వారిపై కనీసం చర్యలు తీసుకోలేదు. ఇలాంటి అవమానకర ఘటనలు రాష్ట్రంలో ఎక్కడా రిపీట్ కాకూడదని కోరుతున్నాను. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కేసులు పెట్టాలి.. వారికి శిక్ష పడాలని కోరుతున్నాం.సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఎక్కడా లేని విధంగా కొత్త చట్టాలు తీసుకువచ్చి వారిపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలి. అంతేకానీ.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకే పోలీసులను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి నేతలకు అధికారం ఇచ్చింది.. ప్రజలకు మేలు చేయడానికి.. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కాదు. ఢిల్లీలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచినా వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. -
ఇసుక పాలసీ బాలేదన్న జ్యోతుల.. మైక్ కట్ చేసిన రఘురామ!
సాక్షి, గుంటూరు: ఇసుక పాలసీపై సొంత పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇసుక పాలసీ అంత మంచిగా లేదని ఇసుక పాలసీపై ప్రభుత్వం పునరాలోచించాలని జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా మాట్లాడిన జ్యోతుల.. ఇసుక విధానాన్ని వ్యతిరేకించారు. సామాన్యులకు అందే పరిస్థితి లేదని అసెంబ్లీలో ప్రస్తావించారు. ఇసుక పక్క రాష్ట్రాలకు పోతుందని మాట్లాడుతుండగానే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మైక్ కట్ చేసేశారు.తాను అందరికంటే సీనియర్‌నని.. మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ స్పీకర్‌ని జ్యోతుల నెహ్రూ రిక్వెస్ట్ చేశారు. అయినా కూడా ఆయన విజ్ఞప్తిని పట్టించుకోకుండా డిప్యూటీ స్పీకర్ మైక్ కట్ చేశారు. మైక్ లేకపోయినా తన ప్రసంగాన్ని జ్యోతుల కొనసాగించారు. రెండు నిమిషాల సమయం ఇవ్వాలంటూ మిగిలిన సభ్యులు చెప్పగా, జ్యోతుల నెహ్రూ ప్రసంగ సమయంలో రఘురామకృష్ణం రాజు అసహనం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు విజయసాయిరెడ్డి సవాల్కాగా, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం భవన నిర్మాణ రంగానికి శాపంగా మారింది. నిర్మాణ రంగంలో ప్రధానమైన ముడి సరకు ఇసుక. కూటమి ప్రభుత్వ విధానం పుణ్యమా అని.. పేరుకు ఉచితమే అయినా.. ఇసుక కోసం వస్తున్న వారిని అధికారం అండతో అక్రమార్కులు ఎక్కడికక్కడ నిలువు దోపిడీ చేస్తున్నారు. ముక్కుపిండి మరీ అధిక ధరలు వసూలు చేస్తున్నారు.ఒక యూనిట్ ఇసుకను రూ.5వేల నుంచి రూ.10 వేల వరకూ విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారంటే ఇసుక దోపిడీ ఏ రీతిలో జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఆన్లైన్లో కంటే ఆఫ్‌లైన్‌లోనే ఇసుక విక్ర యాలు అధికంగా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం, అధికారులు చెబుతున్న మాటలకు, ఇసుక స్టాక్ పాయింట్ల వద్ద పరిస్థితికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు. పలు ర్యాంపుల్లో రాత్రి వేళ యథేచ్ఛగా ఇసుక తవ్వుతూ వందలాది లారీల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. -
ఏలూరుపాడులో అంబేద్కర్ ఫ్లెక్సీని చించేసిన రఘు రామ కృష్ణంరాజు
-
ఏలూరుపాడులో రఘురామకృష్ణంరాజు దౌర్జన్యం
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరుపాడులో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దౌర్జన్యానికి దిగారు. అంబ్కేదర్ ఫ్లెక్సీని రఘురామకృష్ణంరాజు చించేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో వచ్చి చించేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు తీరును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వార్ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వివాదం రచ్చరచ్చగా మారింది. పాత మున్సిపల్ సెంటర్లో జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీల్లో జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఇదీ చదవండి: ఆ చర్చల సారాంశం చెప్పలేను: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ -
వికృతానందంతోనే జగన్‌పై తప్పుడు కేసు: రఘురామపై అంబటి ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు.. వాటిని మేము ఎదుర్కొబోతున్నామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. రాజకీయ నాయకుల ఒత్తిడితో ఇప్పుడు కేసులు పెడితే రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారాయన.కాగా, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని టీడీపీ ఖండించలేదు. వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. పిన్నెల్లిపై తప్పుడు కేసులు పెట్టి జైలులో పెట్టారు. వైఎస్ జగన్, ఇద్దరు ఐపీఎస్ అధికారులపై కేసు పెట్టారు. ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారులు చంద్రబాబు హయాంలో కూడా పని చేశారు... వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెట్టి వికృతమైన ఆనందం పొందాలని చూస్తున్నారు. నాడు రఘురామ కృష్ణంరాజు ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై గెలిచి చంద్రబాబుతో కలిశాడు. హైదరాబాద్‌లోనే ఉండి మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. ఎల్లో మీడియాతో జతకట్టి ఇష్టం వచ్చినట్టు తిట్టారు. .. రఘురామను అరెస్ట్ చేసిన 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టారు. తనను కొట్టారని రఘురామ చెప్పారు. కొడితే గాయాలు ఉండాలి కదా?. తనను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టారని కోర్టులో చెప్పారు. కానీ, మూడేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి ఇప్పుడు కేసులు గుర్తుకు వచ్చాయా?. ఇంత కాలం ఎందుకు గుర్తుకురాలేదు’ అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు తప్పుడు కేసులు పెడితే అధికారులు ఇబ్బందులు పడతారని, తర్వాత కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంబటి వారించారు.ఇదీ చదవండి: రఘురామ ఓ అబద్ధాలకోరు.. మాజీ ఐపీఎస్ సంచలన వ్యాఖ్యలు -
బాబు కక్ష సాధింపులో భాగమే వైఎస్ జగన్‌పై కేసు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై సెటైరికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మూడేళ్ల క్రితం జరిగిన వ్యవహారంపై ఇప్పుడు కేసు నమోదు చేయడమంటే అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు వాయించినట్టు ఉందన్నారు.కాగా, అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రఘరామ ఫిర్యాదుపై వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటుగా పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైఎస్ జగన్‌పై కేసు నమోదు చేశారు. అధికారం ఉంది కాబట్టి పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. లోకేష్ రెడ్ బుక్‌లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారు.మీరు ఇలాంటి కేసులు పెట్టి వైఎస్ జగన్‌ను భయపెట్టలేరు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తనను వేధించారని రఘురామ మేజిస్ట్రేట్‌కు నాడు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైన రఘురామ.. సుప్రీంకోర్టుకు వరకు వెళ్లారు. అక్కడ కూడా ఈ కేసు వీగిపోయింది. కానీ, ఇప్పుడు మాత్రం ఈ ఘటనపై కేసు ఎందుకు నమోదు చేశారు’ అని ప్రశ్నించారు. -
"వీళ్లకు అది కూడా తెలియదా.." బాబును నవ్వులపాలు చేసిన రఘురామ
-
ఘొల్లుమనే జోకులేసిన రఘురామ
పశ్చిమ గోదావరి, సాక్షి: ఓడలు ఏదో ఒకనాటికి బండ్లు అవుతాయంటే ఇదేనేమో. తొమ్మిదేళ్లలో ఐదుసార్లు పార్టీలు మార్చిన కనుమూరి రఘురామకృష్ణంరాజు.. చివరకు అనుకున్న సీటు దక్కించుకోలేక, ఓ అసెంబ్లీ సీటు సంపాదించుకోవడం కోసం ఎంతగా దిగజారుడు రాజకీయాలు చేశారో తెలుగు రాష్ట్రాలు కళ్లారా చూశాయి.ఈ ఐదేళ్లలో రఘురామ వెలగబెట్టింది ఏంటో అందరికీ తెలిసిందే. చంద్రబాబు డైరెక్షన్లో నిత్యం సీఎం జగన్‌ను, ఏపీ సర్కార్‌ను విమర్శిస్తూ.. ఢిల్లీలో ఉంటూ కోర్టుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేస్తూ కాలం వెల్లదీశారు. అయితే ఎన్నికలు ముగిసినా కూడా రఘురామ తన డ్యూటీని ఇంకా మానలేదు. పాపం స్పీకర్ సీటు మీద ఆయనకు ఆశలున్నాయేమో కదా. అందుకే.. పుట్టినరోజున కూడా ఘొల్లుమనే జోకులేశారు. జోస్యం పేరిట రఘురామ పేల్చిన ఆ జోకులనే యెల్లో మీడియా తెగ ప్రచారం చేసుకుంటోంది. నిన్న(మే 14న) రఘురామ పుట్టినరోజు. పాపం.. పెద అమిరంలోని తన ఆఫీస్‌లో రచ్చబండ పెట్టారుకానీ జనాలు మాత్రం రాలేదు. అయినా రఘురామ తగ్గలేదు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందంటూ బిగ్గరగా మాట్లాడారు. ఏపీ కూటమి ఏకంగా 150కిపైగా సీట్లు దక్కించుకుందట. అధికారంలోకి వస్తుందట. ఆ మాటకు పక్కనున్న టీడీపీ నేతలు బయటకే నవ్వుకోవడం కనిపించింది. రఘురామ జోకులు అంతటితో ఆగలేదు.తనపై మత వ్యతిరేకుడనే ముద్ర వేయించారని తెగ ఫీలైపోయారు. అంతేకాదు.. తన శపథం నెరవేరిందని, పోలింగ్‌కు జనం పెద్ద ఎత్తున తరలిరావడమే కూటమి గెలుస్తుందనడానికి సంకేతమంటూ మాట్లాడారు. అయితే రఘురామ వాస్తవాల్ని గ్రహించలేకపోతున్నారు. పోటెత్తిన ఓటర్లలో జగనన్న పాలనలో సంక్షేమం అందుకున్న లబ్ధిదారులు, ఆ సంక్షేమం కొనసాగాలని కోరుకుంటున్న మహిళా ఓటర్లు.. అదే టైంలో ఇంకోవైపు పెన్షన్లు ఇంటికే అందక ఇబ్బందులు పడి చంద్రబాబును తెగ తిట్టుకున్న అవ్వాతాతలు.. అధికంగా ఉన్నారు. మరి వాళ్లంతా తిరిగి ఎవరికి పట్టం కడతారో ఊహించలేమా?. అయినా.. రాబోయేది జగన్ సర్కారే అని చెప్పడానికి గోదావరి జిల్లాల సిద్ధం సభలకు లభించిన స్పందన చాలాదా?. -
రఘురామ, గంటాకు బ్యాంకుల షాక్
సాక్షి, అమరావతి: రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఉండి, భీమిలి అసెంబ్లీ స్థానాల నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుకు ఎన్నికలకు రెండు రోజుల ముందు బ్యాంకులు గట్టి షాక్ ఇచ్చాయి. బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన కేసుల్లో ఆస్తులను వేలం వేయడానికి నోటీసులు జారీ చేశాయి. ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంకు, దాని అనుబంధ బ్యాంకుల నుంచి సుమారు రూ.1,383 కోట్లు రుణాలు తీసుకున్నారు. ఇందులో రూ. 826.17 కోట్ల రుణాన్ని కంపెనీ అవసరాలకు వాడకుండా వేరే ఖాతాల్లోకి మళ్లించి బ్యాంకుల్ని మోసగించారు. వడ్డీ కూడా చెల్లించలేదు. ఈ వ్యవహారం తెలిసి బ్యాంకులు సీబీఐని ఆశ్రయించడంతో ఆయన మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై బ్యాంకులు దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో రూ.361.96 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టి) హైదరాబాద్ శాఖ పత్రికా ప్రకటనలు జారీ చేసింది. ఇండ్ భారత్ థర్మల్‌కు చెందిన బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఆస్తులు రూ.180.98 కోట్లు, తమిళనాడు టూటికోరిన్లో ఉన్న 311.72 ఎకరాల ఫ్యాక్టరీ స్థలాలు రూ.164.73 కోట్లు, కర్ణాటకలోని కార్వార్ ప్రాంతంలో ఉన్న 129.73 ఎకరాలు రూ.11.74 కోట్లు, ఇతర సెక్యూరిటీలు, ఆర్థిక ఆస్తులకు రూ.4.51 కోట్లు రిజర్వ్ ప్రైస్‌గా నిర్ణయించింది. ఈ ఆస్తులకు సంబంధించిన జూన్ 13న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం వేయనున్నట్లు ఎన్సీఎల్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.రూ.400.37 కోట్లు ఎగవేసిన గంటా శ్రీనివాసరావు మాజీ మంత్రి, భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకొని తిరిగి చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి సుమారు రూ.400.37 కోట్ల రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో ఆయన ఆస్తులను స్వా«దీనం చేసుకోవడానికి బ్యాంకులు ఐదేళ్లుగా పోరాడుతున్నాయి. గంటాకు చెందిన ప్రత్యూష గ్రూపు కంపెనీలు ఈ రుణం తీసుకొని, ఇంతవరకు ఒక్క వాయిదా కూడా చెల్లించలేదు. దీంతో ఇండియన్ బ్యాంకు ఆస్తుల స్వా«దీనానికి రంగంలోకి దిగింది. విశాఖ నగరం గంగుల వారి వీధిలోని సర్వే నెంబర్ 13లో ఉన్న వాణిజ్య భవనాన్ని వేలానికి పెట్టింది. జూన్ 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వేలం జరుగుతుంది. ఈ భవనం రిజర్వు ధరను రూ.2.84 కోట్లుగా బ్యాంకు నిర్ణయించింది. -
రఘురామ, గంటాకు బిగ్ షాక్
విశాఖపట్నం, సాక్షి: ఎన్నికల వేళ.. తెలుగు దేశం పార్టీ నేతలు రఘురామకృష్ణంరాజు, గంటా శ్రీనివాస్‌లకు భారీ షాక్ తగిలింది. బ్యాంకు రుణాల ఎగవేత కేసులో ఈ ఇద్దరి ఆస్తుల వేలం కోసం వేరువేరుగా నోటీసులు జారీ అయ్యాయి.తమిళనాడులోని థర్మల్ పవర్ ప్లాంట్‌కు సంబంధించిన భూములు, ప్లాంట్ ఆస్తుల్ని విక్రయించేందుకు హైదరాబాద్‌కు చెందిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(NCLT) నోటీసు జారీ చేసింది. జూన్ 13 2024 లోపు ఈ ఆస్తులకు సంబంధించిన కొనుగోలు చేసేటువంటి వారు బిడ్డు దాఖలు చేయాల్సిందిగా సదరు ప్రకటనలో NCLT తెలిపింది. ఈ ఆప్షన్ కు పిలిచిన వాటిలో 311 ఎకరాల ఇన్డ్ భారత్ థర్మల్ పవర్ భూములు, కర్ణాటకలో హంకోన్ గ్రామంలోని 129 ఎకరాల భూములు ఉన్నాయి.అలాగే.. గంటా శ్రీనివాసరావుకు చెందిన ప్రత్యూష రిసోర్సెస్ ఇన్ఫ్రా ఆస్తుల వేలం వేసేందుకు ఇండియన్ బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది. ప్రత్యూష కంపెనీ ఇండియన్ బ్యాంకు నుంచి 400 కోట్లు ఇన్ఫ్రా కంపెనీ రుణం తీసుకుంది. అయితే.. సకాలంలో రుణాలు చెల్లించకపోవడంతో ఈ కంపెనీకి ఆస్తులు వేలం వేస్తున్నట్లు నోటీసులు జారీ చేసింది. బిడ్స్ దాఖలు చేసేందుకు జూన్ ఏడో తారీఖు ఆఖరి తేదీగా నిర్ణయించింది ఇండియన్ బ్యాంక్.గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి నుంచి, రఘురామ కృష్ణంరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ సీట్లపై ఇంకా నాన్చుడే
సాక్షి, అమరావతి: ఎన్నికల నామినేషన్లకు సమయం ముంచుకొస్తున్నా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల సీఎం అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు ఇప్పటికీ కొన్ని సీట్లలో టీడీపీ అభ్యర్థులపై తేల్చుకోలేక తిప్పలు పడుతున్నారు. ఇప్పటికీ నాన్చుతూనే ఉన్నారు. సుమారు 20 సీట్లలో అభ్యర్థులను మారుస్తామని సంకేతాలు ఇచ్చినా ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో టీడీపీ క్యాడర్ అసహనంతో ఉంది. ప్రధానంగా నర్సాపురం ఎంపీ స్థానంపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడంలో చంద్రబాబు తడబడుతున్నారనే అభిప్రాయం టీడీపీ నేతల నుంచే వినిపిస్తోంది. రాజకీయ బ్రోకర్ రఘురామకృష్ణరాజుకు భయపడి ధైర్యంగా ముందుకెళ్లలేకపోతున్నారని టీడీపీ నేతలే చెబుతున్నారు. నర్సాపురం ఎంపీ స్థానాన్ని ఆయనకిచ్చేందుకు బీజేపీ నిరాకరించింది. దీంతో ఆయన తన బాధ్యతనంతా చంద్రబాబుపైనే పెట్టారు. వెంటనే టీడీపీలో చేరిపోయి తనకు సీటు ఇవ్వాల్సిందేనని ఒత్తిడి తెచ్చారు. నర్సాపురం ఎంపీ, ఉండి ఎమ్మెల్యే స్థానాల్లో ఏదో ఒకటి ఆయనకు కట్టబెట్టేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఉండి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా ఇప్పటికే రామరాజును ఎంపిక చేశారు. ఇప్పుడు ఆయనను తప్పించి ఉండి సీటును రఘురామకి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో నర్సాపురం ఎంపీ స్థానాన్ని రఘురామకు ఇవ్వడం కోసం దాన్ని బీజేపీ నుంచి తీసుకునేందుకు ప్రతిపాదన పెట్టారు. నర్సాపురం ఎంపీ సీటును తమకు ఇస్తే దాని బదులు ఉండి ఎమ్మెల్యే సీటును బీజేపీకి ఇస్తామని, నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా ఉన్న శ్రీనివాసవర్మను ఉండిలో నిలబెట్టాలని ప్రతిపాదించారు. లేనిపక్షంలో ఏలూరు ఎంపీ సీటును బీజేపీకి ఇస్తామని, నర్సాపురం ఎంపీ సీటును తమకు ఇవ్వాలని కోరుతున్నారు. ఇదంతా తన అనుంగు బ్రోకర్ నేత రఘురామకృష్ణరాజు కోసమే కావడంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టీడీపీ నేతలంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీ నేతలను ఇబ్బంది పెట్టడం, రఘురామకృష్ణరాజుకు లబ్ధి చేకూర్చడం కోసం ఎంతమందినైనా బలి పెట్టేందుకు చంద్రబాబు సిద్ధమవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు దెందులూరు ఎమ్మెల్యే స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌ను తప్పించి దాన్ని కూడా బీజేపీకి ఇస్తారనే ప్రచారమూ జరుగుతోంది. అక్కడ బీజేపీ నేత గారపాటి చౌదరి టిక్కెట్ కోసం గట్టిగా పట్టుబడుతుండటం, బీజేపీ అధిష్టానం నుంచి ఆ దిశగా ఒత్తిడి పెంచడంతో దానికీ బాబు తలొగ్గుతున్నట్లు చెబుతున్నారు. తన బినామీ కోరిక తీర్చడానికి అనకాపల్లి జిల్లా మాడుగుల స్థానాన్ని చంద్రబాబు ఇప్పటికే ఎన్ఆర్ఐ పైలా ప్రసాద్‌కు కేటాయించారు. అయితే, అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి, తన బినామీ సీఎం రమేష్ మాడుగుల నుంచి ప్రసాద్‌ను తప్పించి, ఆ స్థానాన్ని బండారు సత్యనారాయణమూర్తికి ఇవ్వాలని కోరారు. ఇందుకు కూడా చంద్రబాబు సిద్ధపడ్డారు. అక్కడ పైలా ప్రసాద్‌ను తప్పించి బండారుకు టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీటును బీజేపీ నుంచి వెనక్కి తీసుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నారు. చింతలపూడి, తిరువూరు, సత్యవేడు స్థానాల్లోనూ అభ్యర్థులను మార్చి, కొత్తవారిని పెట్టాలని ఆలోచిస్తున్నారు. మరికొన్ని స్థానాల్లోనూ అభ్యర్థుల మార్పు ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు. అయితే, ఈ స్థానాలన్నింటి పైనా ఇప్పటికీ చంద్రబాబు నిర్ణయం తీసుకోలేకపోతుండటంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. -
బాబు, రఘురామలకు ఝలక్
ఎన్టీఆర్, సాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజులకు బీజేపీ ఝలక్ ఇచ్చింది. కూటమి తరఫున సీట్ల మార్పునకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను బీజేపీ తిరస్కరించింది. దీంతో.. నరసాపురం ఎంపీ టికెట్‌పై రఘురామ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. పొత్తులో భాగంగా టీడీపీ, జనసేనలకు సీట్ల పంపంకంతో పాటు బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో.. బీజేపీ ఇదివరకే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే ఆ జాబితాలో మార్పుల కోసం చంద్రబాబు బీజేపీతో మంతనాలు మొదలుపెట్టారు. నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లతో పాటు 20 సీట్ల దాకా మార్చుకుందామంటూ బీజేపీ ముందర ప్రతిపాదన పెట్టారు. అయితే.. ‘‘నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ. ఆయన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేశారు. అతని తరఫునే మేం ప్రచారం చేయబోతున్నాం’ అని ఏపీ బీజేపీ ఎన్నిలక ఇంఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తాజాగా ప్రకటించారు. దీంతో.. చంద్రబాబు ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించిందనేది స్పష్టమవుతోంది. ఉండి కూడా ఫసకే? ఇదిలా ఉంటే.. నరసాపురం ఎంపీ సీటు కోసం రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా యత్నించారు. చంద్రబాబుతోనూ సంప్రదింపులు జరిపారు. చివరకు ఉండి అసెంబ్లీ సీటు మాట దక్కించుకుని, టీడీపీలో చేరారు. అయితే పాలకొల్లు టీడీపీ భేటీలో చంద్రబాబు రఘురామ కృష్ణంరాజును ఉండి అభ్యర్థిగా ప్రకటించగానే.. అక్కడి టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పటికే టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, మరో టీడీపీ నేత కలవపూడి శివరామరాజు మధ్య ఉండి టికెట్ కోసం కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ మధ్యలో చంద్రబాబు రఘురామ పేరును ప్రస్తావనకు తేవడాన్ని టీడీపీ శ్రేణులు భరించలేకపోయాయి. ఉండిలో 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ)ను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నిలిపి, ఆయన అనుచరుడు రామరాజుకు ఉండి టికెట్ ఇచ్చింది టీడీపీ. ఉండి సీటుకు రఘురామ కృష్ణంరాజు పేరుతో టీడీపీ శ్రేణులు భగ్గుమనడంతో చంద్రబాబు కాస్త మెత్తబడ్డారు. అదే సమయంలో ఉండి సీటు నిర్ణయం ఇంకా జరగలేదంటూ రఘురామ సన్నాయి నొక్కులు నొక్కారు. ఈలోపు రఘురామకు నర్సాపురం ఎంపీ సీటు కోసం చంద్రబాబు ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చారు. చివరకు.. బీజేపీ ఆ సీటను వదులుకునేందుకు నో చెప్పేసింది. దీంతో ఇటు నరసాపురం, అటు ఉండి రెండూ రఘురామకు కాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు.. ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా బీజేపీ, టీడీపీ అధినేతకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో.. అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత నెలకొంది. -
కూటమికి బీటలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ప్రతిపక్ష కూటమి బీటలు వారుతోంది. నేతలు తలోదారి అన్నట్లుగా ఉండడంతో గెలుపు అవకాశాలు రోజురోజుకు సన్నగిల్లుతున్నాయి. ఇంతలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు జిల్లా పర్యటన మరింత చిచ్చు రాజేసింది. ఏలూరు ఎంపీ సీటు విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ బీజేపీ నేత తపన చౌదరి హడావుడి చేస్తుండగా.. ఉండిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు షాక్ ఇవ్వడంతో టీడీపీ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి. కూటమిలో కీలక నేతలుగా ఉన్నవారు రాజీనామాల బాట పట్టి అధికార వైఎస్సార్సీపీలో చేరుతుండటంతో కూటమి రాజకీయాల్లో తీవ్ర గందరగోళం రేగింది. ఉండిలో రామరాజుకు షాక్ పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం నర్సాపురం, పాలకొల్లులో పర్యటించి రఘురామకృష్ణరాజును టీడీపీలో చేర్చుకున్నారు. శనివారం ఉదయం పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ అభ్యర్థులతో పాటు, మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్ధులతో సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఉండి సీటును రఘురామకృష్ణరాజుకు ఖరారు చేసి రామరాజుకు హ్యాండ్ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును తొలి జాబితాలో అభ్యర్థిగా ఖరారు చేయగా రామరాజు, ఆయన సతీమణి ఇద్దరూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రఘురామరాజుకు సీటు అనడంతో టీడీపీ కేడర్ పాలకొల్లులో చంద్రబాబు క్యాంపు వద్దకు చేరుకుని పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేసింది. చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డగించి ఘెరావ్ చేశారు. రామరాజుకే సీటు ఇవ్వాలని, రఘురామకృష్ణరాజుకు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని నినాదాలు చేశారు. దీంతో నియోజకవర్గమంతా టిక్కెట్ మార్పు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. రామరాజు వర్గానికి సర్ధిచెప్పే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పశ్చిమ టీడీపీ కూటమి రాజకీయాల్లో గందరగోళం నెలకొంది. ఇంతవరకు ఎక్కడా లేని విధంగా జనసేనకు కేటాయించిన నర్సాపురం అసెంబ్లీ సీటులో చంద్రబాబునాయుడు సభ నిర్వహించడంపై పార్టీలో తీవ్ర చర్చ సాగుతోంది. ఏలూరు పార్లమెంట్లో వరుస షాక్‌లు ఏలూరు పార్లమెంట్లో కూటమి పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. దెందులూరు నియోజకవర్గ టీడీపీ సీటు ఆశించి భంగపడిన అశోక్‌గౌడ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వైఎస్సార్సీపీలో చేరనున్నారు. దెందులూరు నియోజకవర్గంలో అశోక్‌గౌడ్‌కు బలమైన సామాజిక వర్గం మద్దతు ఉండటంతో పాటు టీడీపీలో క్రియాశీలకంగా పనిచేశారు. తపన చౌదరి బల ప్రదర్శన ఏలూరు పార్లమెంట్ బీజేపీ నేత తపన చౌదరి బలప్రదర్శనకు దిగారు. పోలవరం నుంచి కై కలూరు వరకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీకి వెనక్కి తగ్గేది లేదని టీడీపీ కుట్ర రాజకీయాలకు బీజేపీని బలి చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఈ క్రమంలో పార్లమెంట్ నుంచి పోటీ తప్పనిసరిగా చేస్తానని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో నిలుస్తానని కేడర్‌కు సంకేతాలు ఇచ్చారు. -
ఉండి అభ్యర్థిని మారిస్తే ఉండేలుదెబ్బే
సాక్షి, భీమవరం/ పాలకొల్లు సెంట్రల్, సాక్షి, అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా రెండో రోజు పర్యటనలో చంద్రబాబుకు సొంత పార్టీ శ్రేణుల నుంచి నిరసన సెగ తగిలింది. ఉండి నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తున్నట్టు ఇచ్చిన సంకేతాలపై కార్యకర్తలు ఆయనపై తిరగబడ్డారు. గత ఎన్నికల్లో సైకిల్ గుర్తును తగలబెట్టిన వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నించిన తెలుగు తమ్ముళ్లు.. రామరాజును కాదని రఘురామకృష్ణరాజుకు టికెటిస్తే చిత్తుగా ఓడిస్తామంటూ చంద్రబాబు ఎదుటే తేల్చిచెప్పారు. ఉండి నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు పేరును చంద్రబాబు మొదటి జాబితాలోనే ప్రకటించారు. ఈ మేరకు రామరాజు ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నారు. ఉండి సీటు తనదేనని, రెండు మూడు రోజుల్లో చంద్రబాబు ప్రకటిస్తారని రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో చెబుతున్నట్టుగా జరుగుతున్న ప్రచారం ఎమ్మెల్యే రామరాజు వర్గానికి మింగుడు పడలేదు. ఈ తరుణంలో అభ్యర్థి మార్పుపై చంద్రబాబు ఇచ్చిన సంకేతాలు పార్టీ క్యాడర్లో అగ్గిరాజేశాయి. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం పాలకొల్లు ఎస్ కన్వెన్షన్ హాలులో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కూటమి అభ్యర్థులు, ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. సమావేశానికి ఉండి ఎమ్మెల్యే రామరాజుతోపాటు రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామరాజుకు ప్రచారం స్పీడు తగ్గించాలని చంద్రబాబు చెప్పినట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ సమాచారంతో ఉండి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఎమ్మెల్యే రామరాజు అనుచరులు పాలకొల్లులోని ఫంక్షన్ హాలు వద్దకు చేరుకుని బయటే బైఠాయించి నిరసనకు దిగారు. రామరాజును మారిస్తే తమ సత్తా చూపిస్తామని, ఉండిలో పార్టీ విజయాలకు బ్రేక్ వేస్తామని హెచ్చరించారు. సమావేశం అనంతరం బయటకు వచ్చిన చంద్రబాబును అడ్డుకునే యత్నం చేశారు. చంద్రబాబు వారికి సమాధానం చెప్పకుండా సెక్యూరిటీ సిబ్బంది సాయంతో వెళ్లిపోయారు. ఉండి కూటమి అభ్యర్థి, ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు, పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఎన్నోఏళ్లుగా పార్టీ విజయానికి పనిచేస్తున్న కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. బ్రోకర్‌కు టికెట్టా! రాజకీయ బ్రోకర్‌గా, వివాదాస్పదుడిగా ముద్రపడిన రఘురామకృష్ణరాజుకు ఉండి సీటు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధపడడమేమిటని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే అసలు ఈ ఉదంతంలో చంద్రబాబు ఆలోచనలు వేరుగా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామ ఆ పార్టీలో తన ఆటలు సాగకపోవడంతో కొద్దినెలలకే రాజకీయ బ్రోకర్‌గా మారి టీడీపీకి, చంద్రబాబుకు ఆప్తుడిగా మారిపోయారు. ఆయనకు అనుకూలంగా పనిచేశారు. చంద్రబాబు చేసిన కుట్రలన్నీ రఘురామకు తెలుసని, అందుకే ఇప్పుడు ఆయనకు సీటు ఇవ్వకపోతే ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందనే ఆందోళనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. రఘురామ కూటమి తరఫున నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఏడాది క్రితమే ప్రకటించారు. బీజేపీలో చేరి నర్సాపురం ఎంపీ సీటు తెచ్చుకోవాలని కలలు కన్నారు. కానీ బీజేపీ అందుకు అంగీకరించలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో తన సంగతి తేల్చాలని చంద్రబాబుపై రఘురామ ఒత్తిడి తెచ్చారు. ఇంతకాలం అన్ని పనులకూ ఆయనను ఉపయోగించుకున్న కారణంగా రఘురామ బాధ్యత చంద్రబాబుపైనే పడింది. -
రఘు రామ చేసిన పనికి సొంత పార్టీ నేతలతో అవమానాల పాలైన బాబు
-
"ఖబడ్డార్..సైకిల్ భూస్థాపితం చేస్తాం.." : రఘురామ
-
అమిత్ షా ఇంటి గేటు బయట నిలబడ్డ రఘురామ కృష్ణంరాజు
-
పుట్టింటోళ్ళు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు!
మూడిళ్ళ చుట్టం మూతి ఎండి చచ్చినట్లు అయిందట. మాఇంటికి రాలేదు కదా... వాళ్ళింటికి కదా వచ్చారు.. అక్కడే తింటారులే అని ఈ ఇంటివాళ్ళు... అదేం లేదులే.. అక్కడికి వెళ్ళాడు కదా... తినేసి వస్తాడేమో అని ఆ ఇంటివాళ్ళు మొత్తానికి ఆ చూట్టానికి చుక్కలు చూపించి చివరకు పస్తులు పెట్టారట.. అలా అయ్యేలా ఉంది రఘురామకృష్ణం రాజు పరిస్థితి. బిజెపి... టిడిపి.. ఇలా అన్ని పార్టీల్లో తిరిగేసి. ఎక్కడ నిలువనీడ లేకుండా ఉండిపోయే పరిస్థితుల్లో అయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. 2019లో వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత ముసుగు తీసి చంద్రబాబు ఏజెంట్ గా మారిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో బాటు ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించడం మొదలెట్టారు. ఇదంతా సహజంగా అటు తెలుగుదేశానికి, దాని మద్దతుదారులయిన మీడియా సంస్థలకు అయన ఒక సోర్స్ గా మారిపోయారు. అయన రోజూ జగన్ మోహన్ రెడ్డిని. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీవీల్లో మాట్లాడడం.. దాని ఆయా సంస్థలు ఘనంగా ప్రచురించడం జరుగుతూ వస్తోంది. మొదట్లో అయన వ్యాఖ్యలు.. కామెంట్లకు మంచి రేటింగ్స్... వ్యూవర్ షిప్ ఉండేది కానీ నిత్యం జగన్‌ను తిట్టడమేపనిగా పెట్టుకున్న ఆయన్ను ఇక ప్రజలు చూడడం మానేశారు. అయినా సరే ఆయనకు వేరే గత్యంతరం లేక ఆయా మీడియా సంస్థలను అనధికార రెగ్యులర్ యాంకర్ కమ్. మోడరేటర్ కమ్ సలహాదారు... విశ్లేషకుడుగా మారిపోయారు. ఈ ఎపిసోడ్లన్నీ ముగిసి ఇప్పుడు ఆయా పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. జనసేన... తెలుగుదేశం.. వైయస్సార్ కాంగ్రెస్.. ... చివరకు ఒక్కసీటు కూడా గెలవని బిజెపి సైతం తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ రఘురామకృష్ణం రాజుకు ఎవరు టికెట్ ఇస్తారన్నది అర్థం కావడం లేదు. ఆయన్ను ఎవరూ భరించలేరు.. పైగా ఆయనకు సొంత క్యాడర్ లేదు.. ప్రజల్లోనూ ఆదరణ లేదు.. అలాంటపుడు ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే అయన దెబ్బకు ఆ ఎంపీ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు సైతం ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆయన్ను అందరూ ఒక ఐటం క్యారెక్టర్ మాదిరి వాడుకుని పక్కనపడేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. కుక్కను శత్రువుమీద మొరగడానికి పెంచుకుంటాం... మనమీద మొరుగుతుంది అనుకుంటే చెప్పుతో కొడతాం అనే సినిమా డైలాగ్ మాదిరి... ఆయన్ను టీడీపీ... దాని అనుబంధ మీడియా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించినంతవరకే మీడియాలో కవరేజి ఇచ్చి ఊరుకుంటారు తప్ప ఆయనకు ఎక్కడా టిక్కెట్ మాత్రం ఇవ్వరు అంటున్నారు. ఆయనకు నర్సాపురం... లేదా ఇంకోచోట టికెట్ ఇస్తే అయన అసమర్థత.. అహంకారం .. ఇవన్నీ కలగలిసి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతారన్న ఆందోళన ఆయనపార్టీల్లో కనిపిస్తోంది. అందుకే కేవలం ఆయన్ను తమ ఛానెళ్లలో చూపడానికి మాత్రమే వాడుకుని ఎన్నికలు.. టిక్కెట్స్ ఇచ్చేవేళ పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు. ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా టీడీపీ.. జనసేన కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత అయన భోగినాడు సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చారు. ఆయనకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో భారీగా భౌన్సర్లను ఆయనే ఏర్పాటు చేసుకుని ఊళ్లోకి వచ్చారు తప్ప ఆయనకోసం ఎక్కడా అభిమానులు. క్యాడర్ ఎదురు చూడలేదు. దీంతో రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనని, కేవలం టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు తప్ప కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకు దక్కదని నరసాపురం ప్రజలు అంటున్నారు. ✍️ సిమ్మాదిరప్పన్న -
Chandrababu : చేతులు కలపడమే తరువాయి.?
చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ప్రయాణంలో స్పష్టత వస్తున్నట్టు సంకేతాలందుతున్నాయి. ఇక తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే కొనసాగించాలని బాబు నిర్ణయించుకున్నట్టు తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి. బీజేపీతో ఇప్పటికే పూర్తిగా తెగతెంపులు చేసుకున్న చంద్రబాబు.. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్‌షాను టార్గెట్ చేసుకుని 2019లో చేసిన యాంటీ బీజేపీ క్యాంపెయిన్ ఇంకా ప్రజల మదిలో చెదిరిపోలేదు. గత నాలుగున్నరేళ్లుగా పైకి బీజేపీతో దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. లోలోన మాత్రం కాంగ్రెస్‌తో నడుపుతున్న రాయబారాలు బహిర్గతమవుతున్నాయి. సీన్ 1 : 2019 ఎన్నికలు - జాతీయ రాజకీయాలు ఎన్నికల్లో యాంటీ బీజేపీ స్టాండ్ తీసుకున్న చంద్రబాబు.. దేశవ్యాప్తంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఉదయం తూర్పున బెంగాల్లో మమతో ఒక భేటీ జరిగితే, మధ్యాహ్నానికల్లా ముంబైలో శరద్ పవార్‌తో మరో భేటీ నిర్వహించారు. ఢిల్లీలో కేజ్రీవాల్‌ను కలిస్తే.. అంతే వేగంగా కేరళలో కమ్యూనిస్టులతో భేటీ అయ్యారు. చంద్రబాబు స్పీడ్ చూసి నేషనల్ మీడియా కూడా అవాక్కయిన సందర్భాలు 2019లో ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులయితే సరే సరి. రాహుల్‌తో 10 జన్‌పథ్‌లో నిర్వహించిన మీటింగ్‌కు ఎల్లో మీడియా ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. అంతెందుకు కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణస్వీకారంలో సభ మీద రాహుల్‌తో చట్టాపట్టాల్ వేసుకున్నవి కూడా ఇంకా ఇప్పుడే చూసినట్టు ఉంది. (కర్ణాటక రాజకీయాల సందర్భంగా చంద్రబాబు తిప్పిన యూపీఏ చక్రం) సీన్ 2 : 2019 ఫలితాలు - తదనంతర పరిణామాలు ఎన్నికలు ముగిసాయి. ప్రజా తీర్పు వెల్లడయింది. సైకిల్ కొట్టుకుపోయింది. చంద్రబాబులో నిర్వేదం ఏర్పడింది. ఇంతా చేసినా.. ప్రజలెందుకు తరిమికొట్టారన్న ఆత్మవిమర్శ మాత్రం చేసుకోలేకపోయారు. తనను ఓడించి ప్రజలు ద్రోహం చేశారంటూ నిందించడం మొదలెట్టారు. అదే సెల్ఫ్ డబ్బా.. ఈ రోడ్డు నేనేశా.. ఈ భవనం నేను కట్టా.. ఈ కాలువ నేను తవ్వించా.. ఎంత సేపు నేను అనే సోత్కర్ష నుంచి బయటకు రాలేకపోయారు. చివరికి భ్రమలనే నిజమనే స్థాయికి చేరిపోయారు. ఈ సమయంలో ఎల్లో మీడియా వల్ల ఆయనకు నిజంగానే అన్యాయం జరిగింది. ఉదాహారణకు హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ హయాంలో అని తెలిసినా.. చంద్రబాబే .. చంద్రబాబే అని ప్రచారం చేసి అదే నిజమని ప్రజల్ని నమ్మించే స్థాయికి చేరారు. అంతెందుకు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టును దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మిస్తే.. ఆ క్రెడిట్ చంద్రబాబుకు ఇచ్చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే.. పెద్దలా గద్దలా అంటూ ఈనాడులో విమర్శలు చేసి... ఇప్పుడు జన జీవన నాడిగా మారిన తర్వాత చంద్రబాబుకు క్రెడిట్ ఇస్తున్నారు. ఇలా మారని భ్రమలతో ఆయన వ్యక్తిత్వ పరంగా మరింత దిగజారారు. (జపాన్ సహకారంతో టెక్నాలజీ పార్కును శంకుస్థాపన చేస్తున్న నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, ఆ సందర్భంగా మీడియాలో వచ్చిన వార్తలు) (శంషాబాద్ ఎయిర్‌పోర్టును, PV నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి పూర్తి చేసిన డా.వైఎస్సార్) సీన్ 3 : పార్టీ నిర్మాణంలో ఎన్నో లోపాలు తానొక విజనరీ నాయకుడినని, విజన్ 2020 తర్వాత విజన్ 2047 తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో తెలుగుదేశం పార్టీని ఒక నిష్క్రియాత్మకమైన వ్యవస్థగా మార్చారు. ఏ పార్టీలోనయినా పిరమిడ్ లెవల్ ఉంటుంది. అంటే ఒక నాయకుడి తర్వాత అంతటి బాధ్యతలు నిర్వహించగలిగే సత్తా ఉన్నా ఇద్దరో, ముగ్గురో ఉంటారు. మేనేజ్మెంట్ పాఠాలను వల్లె వేసే చంద్రబాబుకు ఈ విషయాలన్నీ తెలియవని కాదు. తెలుగుదేశం పార్టీలో తీసుకునే ఏ నిర్ణయమైనా చంద్రబాబుకు తప్ప మూడో కంటికి తెలియదు. తన వారసుడిగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేయాలని చూసినా.. ఎమ్మెల్యేగా గెలవలేని ప్రతిభాసామర్థ్యాలు లోకేష్‌వి. ఇక పవన్‌కళ్యాణ్‌కు ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా.. ఏ ఎజెండాలో సక్సెస్ అయిన దాఖలాలు లేవు. (తన పొలిటికల్ పార్ట్నర్ పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు ) సీన్ 4 : కిం కర్తవ్యం.. కాంగ్రెసే శరణ్యం ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు ఉన్న ఏకైక మార్గం కాంగ్రెస్. అందుకే తన శిష్యుడు రేవంత్ రెడ్డిని నమ్ముకున్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఇప్పటికే రేవంత్‌రెడ్డి రాయబారం నడుపుతున్నారు. బాబును కాపాడేందుకు ఏం చేయాలన్న దానిపై రేవంత్‌రెడ్డి కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించి ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తాను అరెస్ట్ అవుతానంటూ చెప్పుకొచ్చిన చంద్రబాబుతో డీకే శివకుమార్‌తో రేవంత్ ఫోన్ చేయించినట్టు కథనంలో పేర్కొంది. బాబు తరఫున ఏసీబీ కోర్టులో వాదించిన న్యాయవాది సిద్దార్థ్ లూథ్రాకు డీకేతో మంచి సంబంధాలున్నాయి. డీకేకు ఆయన అన్ని విషయాల్లో తోడుగా ఉంటారు. డీకే సిఫారసుతోనే బాబు కేసులో లూథ్రా రంగంలోకి దిగారు. అయితే కేసు పక్కాగా ఉండడం, ఆధారాలు బలంగా ఉండడంతో లూథ్రా కాస్తా నిర్వేదంలో పడిపోయారు. (చంద్రబాబును రక్షించేందుకు బెంగళూరులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో రేవంత్ మంతనాలు) సీన్ 5 : ఇండియా కూటమి వైపు సైకిల్ తాజా పరిణామాలతో రేపో, మాపో ఇండియా కూటమి దిశగా సైకిల్ వెళ్తోందని తేలిపోయింది. ఇంతవరకు ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా అధికారంలోకి వచ్చిన చరిత్ర చంద్రబాబుకు లేదు. ఇప్పుడు కూడా పవన్‌తో పొత్తు ప్రకటించేశారు. బీజేపీ ఈ పరిణామాలపై గుర్రుగా ఉంది. ఇక మిగిలింది కాంగ్రెస్. రాహుల్‌తో తనకు చక్కటి సమన్వయం, అంతకు మించిన పరిచయం ఉన్నాయి. అంతా అనుకున్నట్టు జరిగితే.. కాంగ్రెస్ నుంచి ఓ స్టెప్పు ముందుకు పడవచ్చు. జైల్లో ఉన్న చంద్రబాబును ములాఖత్‌లో రాహుల్‌గాంధీ కలవొచ్చు. లేదా తన ప్రతినిధిగా డీకే శివకుమార్ గానీ, కపిల్‌సిబల్‌ను కానీ పంపించవచ్చు. ఇటు ఢిల్లీలో కూడా లోకేష్ ఓ చీకటి వేళ ఒకరిద్దరు కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ కావొచ్చు. ఇప్పటికే రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ ప్రయత్నాల్లో ఉన్నారు. (ఢిల్లీలో రఘురామకృష్ణరాజుతో కలిసి ఎడతెగని ప్రయత్నాలు చేస్తోన్న లోకేష్) సీన్ 6 : కథ సశేషం.. మిగిలింది ఉత్కంఠభరితం ఎన్నికలు వడివడిగా వస్తున్నాయి. పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రంగులు మార్చడంలో ఊసరవెల్లిని మించిన చరిత్ర చంద్రబాబుది. ఇదీ వైఎస్సార్సిపి మొదటి నుంచి చెబుతున్న విషయం. ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కూడా ఇదే విషయాన్ని పంచుకున్నారు. ఈ రాజకీయ ముఖచిత్రం త్వరలోనే సుస్పష్టంగా ఆవిష్కృతం కానుంది. దానికి ప్రజలే సాక్షి. Only the I.N.D.I.A. Alliance members are supporting Sri. Chandrababu @ncbn through phone calls to his son. This proves that TDP is part of the I.N.D.I.A. Alliance and that they have the same strategy, come together for power and loot the State while you can. TDP is incapable of… — Vijayasai Reddy V (@VSReddy_MP) September 16, 2023 -
ఆంధ్రప్రదేశ్ అప్పులపై తేలిపోయిన విపక్షాల అబద్ధాలు
-
ఏపీ అప్పులపై తేలిపోయిన విపక్షాల అసత్య ప్రచారం
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై పదే పదే రాద్దాంతం చేస్తున్న విపక్షాలది అసత్య ప్రచారమేనని మరోసారి తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులపై వాస్తవాలు బయటపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్. ఏపీ అప్పులు ఎఫ్ఆర్బీఎంకు లోబడే ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎఫ్ఆర్బీఎంకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు. ఈరోజు(సోమవారం) ఏపీ అప్పులపై లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ తేల్చి అసలు విషయం చెప్పారు. ‘ఏపీ అసెంబ్లీ ఎఫ్ఆర్బీఎంను పర్యవేక్షిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫారుసులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయి. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ. 2,64,451 కోట్లు. 2023 నాటికి ఏపీ అప్పులు రూ. 4,42, 442 కోట్లకు చేరాయి. నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,77,991కోట్లు’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. చదవండి: గ్రామాల్లో సమగ్ర సర్వేపై దృష్టిపెట్టాలి: సీఎం జగన్ -
రఘురామపై ఎంపీ భరత్ ఆ్రగహం
రాజమహేంద్రవరం సిటీ: దమ్ముంటే రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గంలో తనపై పోటీ చేసి గెలవాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్ సవాల్ విసిరారు. సోమవారం రాజమహేంద్రవరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం తగదంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు బతిమలాడితే జగనన్న నరసాపురం నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. తీరా నెగ్గాక అటు టీడీపీతోఇటు బీజేపీతో శిఖండిలా మంతనాలు చేస్తున్నారంటూ విమర్శించారు. తమంది పేటీఎం బ్యాచ్‌ను రాజమహేంద్రవరంలో పెట్టుకుని లేనిపోని ప్రచారం చేయిస్తున్నారన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాజమహేంద్రవరంలో టీడీపీ, జనసేన.. ఏ పార్టీ నుంచి రఘురామ పోటీ చేసినా లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో తాను గెలిచి చూపిస్తానన్నారు. ఆవ భూములకు సంబంధించి ఆరోపణలు మానుకోవాలన్నారు. ఒక్క రూపాయి అవినీతి చేసినట్లు ఆధారమున్నా నిరూపించాలన్నారు. బ్యాంకుల నుంచి బినామీ పేర్లతో కోట్లాది రూపాయలు ఎగ్గొట్టడం తనకు చేతకాదన్నారు. తాను సొంత డబ్బుతోనే రాజకీయాలు చేస్తానని భరత్‌రామ్ పేర్కొన్నారు. -
ప్రతివాళ్లు సుప్రీంకోర్టుకు వస్తే ఎలా? హైకోర్టుకు ఎందుకు వెళ్ళరు?
సాక్షి, న్యూఢిల్లీ: ‘ఎంపీ రఘురామకృష్ణరాజు కస్టడీ విచారణ వ్యవహారంపై హైకోర్టుకు ఎందుకు వెళ్లరు? ప్రతి వాళ్లు సుప్రీంకోర్టుకు వస్తే ఎలా’ అని రఘురామ కుమారుడి తరపు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సీబీఐతో విచారణ చేయించాలన్న అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. ఈమేరకు జస్టిస్ ఎఆర్ గవాయ్, జస్టిస్ సి.టి.రవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ విచారణ వ్యవహారంలో సీబీఐతో విచారణ చేయించాలని ఆయన కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు రెండోసారి విచారణ చేపట్టింది. తొలిసారి విచారణ జరిగినప్పుడు సీబీఐకి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బుధవారం విచారణ సందర్భంగా ఇప్పటివరకు కేంద్రం, సీబీఐ కౌంటర్లు దాఖలు చేయలేదని భరత్ తరపున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తెలిపారు. ఈ పిటిషన్లో ప్రతివాదుల జాబితాలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇతరులను ఎందుకు తొలగించారని ధర్మాసనం ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులే టార్చర్‌కు గురి చేశారని, నిర్ణయం తీసుకునే ముందు నిందితుల వాదనలు వినాల్సిన అవసరం లేదని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు ఉన్నాయని ఆయన చెప్పారు. హైకోర్టు విచారణ తర్వాతే తాము విచారణకు తీసుకుంటేనే అర్థం ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని భరత్ తరపు న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. దీనికి సమయం కావాలని పిటిషనర్ కోరగా, రెండు వారాల గడువు ఇచ్చింది. -
ఎంపీ రఘురామపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు అయ్యింది. రఘురామ కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఏ1గా రఘురామ, ఏ2 భరత్, ఏ3 సీఆర్పీఎఫ్ ఏఎస్సై, ఏ4 కానిస్టేబుల్ సందీప్, ఏ5 పీఏ శాస్త్రిని చేర్చారు. పోలీసుల ప్రకటన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ భాషాపై ఎంపీ రఘురామ కృష్టంరాజు కుటుంబ సభ్యులు దాడిపై ఏపీ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. రఘురామ కృష్ణం రాజు ఇంటి వద్ద ఎలాంటి పోలీసులను పెట్టలేదన్నారు. ప్రధాని పర్యటన సందర్బంగా కానిస్టేబుల్ ఐఎస్బీ గేట్ వద్ద స్పాటర్‌గా ఉన్నాడని తెలిపారు. కానిస్టేబుల్ ఫరూక్ విధులకు, రఘురామ ఇంటికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రఘురామ ఇంటికి కిలోమీటర్ దూరంలో ఫరూక్ విధుల్లో ఉన్నాడని వెల్లడించారు. కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఇద్దరు సీఆర్పీఎఫ్ సిబ్బందిని ఉన్నాతాధికారులు సస్పెండ్ చేసినట్లు ఏపీ పోలీసులు తెలిపారు. నా కాళ్లు, చేతులు కట్టేయమని చెప్పాడు: పరూక్ నన్ను చంపటానికి వచ్చావా అంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు తనపై దాడి చేశారని కానిస్టేబుల్ ఫరూక్ తెలిపారు. తన కాళ్లు, చేతులు కట్టేయమని తన మనుషులకు చెప్పినట్లు పేర్కొన్నారు. కరెంటు షాక్ ఇవ్వాలంటూ తన కుమారుడిని ఆదేశించారని అన్నారు. నా జుట్టు పట్టుకుని తలను గోడకేసి కొట్టారని తెలిపారు. ‘రఘురామ వెళ్లాక రంగంలోకి దిగిన ఆయన కుమారుడు భరత్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను రెచ్చగొట్టాడు.మా ఇంట్లో తింటూ, నెలనెలా మామూళ్లు తీసుకుంటూ వాడిని చిన్నగా కొడతారేంటంటూ మాట్లాడాడు.భరత్ హెచ్చరికతో పి.ఏ. శాస్త్రి, సీఆర్పిఎఫ్ కానిస్టేబుళ్లు మళ్లీ దాడికి దిగారు. చాలాసేపటి తర్వాత వచ్చిన పోలీసులు నన్ను రక్షించి గచ్చిబౌలి పీఎస్‌కు తీసుకెళ్లారు’ అని ఫరూక్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫరూక్ బాషాపై ఎంపీ రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై దాడి చేసి, కిడ్నాప్ చేశారు. కొందరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లతో వచ్చి నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డారు. అతని ఐడీ కార్డు లాక్కొని, ఈడ్చుకుంటూ ఎంపీ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ రెండు గంటలకు పైగా చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం అనుమానిత వ్యక్తిగా గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఆ సమయంలో ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంట్లోనే ఉండటం గమనార్హం. -
ఎంపీ రఘురామపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నందున రఘురామపై సీఐడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ కేసు కొట్టేయాలన్న రఘురామ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. రఘురామకృష్ణంరాజు సీఐడీ విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్‌లోని దిల్కుష్ గెస్ట్‌హౌస్‌లో సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. చదవండి: రూటు మార్చింది.. అనకాపల్లిలో ప్రవేశించిన పెద్దపులి -
రఘురామకృష్ణరాజుపై వైఎస్సార్సీపీ ఎంపీల ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: రఘురామకృష్ణరాజుపై ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పాటు కీలక ఆధారాలను వైఎస్సార్సీపీ ఎంపీలు సమర్పించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిసిన వైఎస్సార్సీపీ ఎంపీలు.. రఘురామ దేశం విడిచి పారిపోకుండా కఠినచర్యలు తీసుకోవాలని కోరారు. రఘురామకు, టీవీ5 చైర్మన్ నాయుడుకు మధ్య 11 కోట్ల ఆర్థిక లావాదేవీలు జరిగాయని, అక్రమ నగదు చలామణి చట్టం, ఫెమా కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. రఘురామ, నాయుడులను కస్టడీలోకి తీసుకోవాలని, అక్రమ లావాదేవీల గుట్టు బయటకు తీయాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కోరారు. -
రఘురామకృష్ణరాజుకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలన్న వైఎస్సార్సీపీ ఫిర్యాదుపై లోక్‌సభ సచివాలయం గురువారం నోటీసులు జారీ చేసింది. అనర్హత పిటిషన్‌పై 15 రోజుల్లోగా జవాబు చెప్పాలని నోటీసులో పేర్కొంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున ఆయనపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఏడాది క్రితం ఆధార సహితంగా సభాపతికి ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతునారని, అందువల్ల ఆయన పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి, లోక్ సభ పక్ష నేత పీవీ మిథున్ రెడ్డి, పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్ పలుమార్లు సభాపతికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధిన ఆధారాలను గతంలోనే సమర్పించారు. ఈ దృష్ట్యా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్ క్వాలిఫై చేయాలని ఇటీవల మరోసారి వారు లోక్‌సభ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. -
త్వరలో రఘురామపై క్రమశిక్షణ చర్యలు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణరాజుకు వారం రోజుల్లో లోక్‌సభ స్పీకర్ నుంచి నోటీసులు వచ్చే అవకాశముందని రాజమహేంద్రవరం ఎంపీ, లోక్‌సభలో వైఎస్సార్సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్సీపీ గుర్తుపై గెలుపొందిన రఘురామ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును తెలియజేసే 290 పేజీల డాక్యుమెంట్‌ను పూర్తి సాక్ష్యాధారాలతో స్పీకర్‌కు అందించామని చెప్పారు. కాస్త ఆలస్యమైనా ఆయనపై స్పీకర్ ఓం బిర్లా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. తనకున్న విశేష అధికారాన్ని ఉపయోగించి రఘురామ ఎంపీ పదవిని రద్దు చేస్తారన్నారు. భవిష్యత్‌లో ఏ సభ్యుడైనా ఇలా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా రఘురామపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు. -
రఘురామ వ్యవహారంపై స్పీకర్‌కు ఫిర్యాదు: ఎంపీ మార్గాని భరత్
సాక్షి, తూర్పుగోదావరి: ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యవహారంపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశామని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. రఘురామపై 290 పేజీల డాక్యుమెంట్‌ను స్పీకర్‌కు అందజేశామన్నారు. వారం రోజుల్లోనే రఘురామకు నోటీసులు వస్తాయని భావిస్తున్నామని తెలిపారు. స్పీకర్‌కు ఉన్న విచక్షణ అధికారాలతో వేటు వేస్తారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. రఘురామ కృష్ణరాజు వైఎస్సార్సీపీ అధినేత, సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్తున్నారని విమర్శించారు. ఆయన పాల్పడుతున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. గతంలో జరిగిన శరద్ యాదవ్ ఘటన కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. -
రఘురామకృష్ణరాజు అప్పీల్‌పై ఆక్షేపణ
సాక్షి, అమరావతి: లైమ్‌స్టోన్ మైనింగ్ లీజు పునరుద్ధరణకు అనుమతిస్తూ 2019లో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నరసాపురం ఎంపీ కె.రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన అప్పీల్‌పై సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సింగిల్ జడ్జి ముందున్న కేసులో రఘురామకృష్ణరాజు కక్షిదారు కాదని, అలాంటప్పుడు సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్ దాఖలు చేసే అర్హత ఆయనకు లేదని సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ తరఫు సీనియర్ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ అప్పీల్ దాఖలు చేసేందుకు అనుమతి కోరుతూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపారు. అప్పీల్‌కు అనుమతినివ్వాలా? లేదా? అన్న అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని వివరించారు. 2019లో కోర్టు తీర్పునిస్తే ఇప్పుడు అప్పీల్ దాఖలు చేయడంలో ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు, అప్పీల్లో ప్రతివాదులుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్‌కు నోటీసులు జారీ చేసింది. రఘురామకృష్ణరాజు లీవ్ పిటిషన్‌పై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. -
అనర్హతపై జాప్యంతో అన్యాయం
సాక్షి, న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న తీవ్ర జాప్యం వల్ల నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పేర్కొంది. ఈమేరకు పార్టీ పార్లమెంటరీ నేత వి.విజయసాయిరెడ్డి బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవడంలో అసాధారణ జాప్యం జరుగుతున్నందున అర్హత లేని వ్యక్తి ప్రాతినిథ్యం వహించడం ద్వారా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు అన్యాయం జరుగుతోందని లేఖలో పేర్కొన్నారు. లేఖలో వివరాలివీ.. 2020 జూలై 3న అనర్హత పిటిషన్ ఇచ్చాం.. నాతో పాటు పార్టీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ప్రతినిధి బృందం 2020 జులై 3న మిమ్మల్ని (లోక్‌సభ స్పీకర్) కలసి రఘురామకృష్ణరాజును అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ పిటిషన్ సమర్పించింది. రాజ్యాంగంలోని పదో షెడ్యూలు ప్రకారం పిటిషన్ సమర్పించాం. గౌరవ సభాపతిని స్వయంగా కలిసి ఇచ్చినందున పిటిషన్‌ను పద్ధతి ప్రకారమే సమర్పించామని భావించాం. ఆ తర్వాత వైఎస్సార్సీపీ సభ్యులు మిమ్మల్ని పలుమార్లు కలిసి వేగంగా పరిష్కరించాలని కోరారు. సమయానుసారం చర్యలు తీసుకుంటామని అనేక సందర్భాల్లో మీరు హామీ ఇచ్చారు. జూన్ 11, 2021న వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ విప్ మిమ్మల్ని స్వయంగా మీ నివాసంలో కలిసి పిటిషన్‌ను పరిష్కరించాలని కోరారు. జూన్ 17న పార్టీ లోక్‌సభాపక్ష నేత మిమ్మల్ని స్వయంగా కలసి రఘురామకృష్ణరాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తగిన సాక్ష్యాలతో లేఖను మీకు అందజేశారు. 2020 జూలై 3 నాటి అనర్హత పిటిషన్‌ను పరిష్కరించాలని అభ్యర్థించారు. 11 నెలల తరువాత సవరించాలని సూచనా? పిటిషన్ దాఖలు చేసిన తరువాత 11 నెలలు గడిచిన తరువాత మీ కార్యాలయం నుంచి జవాబు వచ్చింది. పిటిషన్‌పై తీసుకున్న చర్యలకు సంబంధించి కాకుండా పిటిషన్‌ను సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908 ప్రకారం సవరించాలని అందులో పేర్కొన్నారు. తర్కబద్ధంగా పరిశీలిస్తే ఈ జవాబు క్లరికల్ జవాబు. పార్లమెంట్ రెండు సెషన్లు పూర్తయిన తరువాత కాకుండా ఆ విషయాన్ని మా పరిశీలనకు ఎప్పుడో తీసుకురావాల్సింది. పిటిషన్లో ఏవైనా లోపాలు ఉంటే దాఖలు చేసిన పార్టీ దృష్టికి చాలా ముందుగానే తీసుకురావాల్సింది. ఏమైనప్పటికీ మీ కార్యాలయం లేఖలో సూచించిన వివరాలన్నింటితో మరో తాజా పిటిషన్‌ను సమర్పిస్తాం. దురదృష్టకరం: నిబంధనలు, దక్షత విషయంలో సభాపతి కార్యాలయం ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు ఆదర్శంగా ఉంటుందని పరిగణించాల్సిన పరిస్థితుల్లో అనర్హత పిటిషన్‌పై చర్యలు తీసుకోవాలని అనేకమార్లు కోరాల్సి రావడం దురదృష్టకరం. సుప్రీం తీర్పునకు విరుద్ధం.. మేం సమర్పించబోయే తాజా అనర్హత పిటిషన్‌ను అత్యవసరంగా పరిష్కరించాలని కోరుతున్నాం. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయినందున దీనిపై స్వయంగా దృష్టి పెట్టాలి. ఒక పార్లమెంటు సభ్యుడు చట్టబద్ధంగా, నైతికంగా, ప్రవర్తనాపరంగా సభలో ఉండాల్సిదగిన వ్యక్తి కానప్పుడు సభకు హాజరుకానివ్వడం వాంఛనీయం కాదు. చర్యలు తీసుకోవడంలో చోటు చేసుకునే అసాధారణమైన జాప్యం.. కె.మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ అసెంబ్లీ స్పీకర్ కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పునకు విరుద్ధం అవుతుంది. ఇలాంటి అనర్హత పిటిషన్లను పరిష్కరించేందుకు మూడు నెలల సమయాన్ని ఆ తీర్పులో సుప్రీం కోర్టు నిర్దేశించింది. -
అది కేసును ప్రభావితం చేసే కుట్రే
సాక్షి, అమరావతి: సీఐడీ అధికారులు తన సెల్‌ఫోన్ తీసుకున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం నిబంధనలకు విరుద్ధమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కేసు దర్యాప్తును ప్రభావితం చేసే కుట్రతోనే ఆయన ఇలా చేస్తున్నారని తేల్చి చెబుతున్నారు. కేసు విచారణలో భాగంగా ఏదైనా వస్తువును జప్తు చేసే చట్టబద్ధమైన అధికారం దర్యాప్తు అధికారులకు ఉందనే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. జప్తు చేసిన వస్తువు గురించి నిందితుడు మాట్లాడ కూడదని.. అందుకు విరుద్ధంగా మాట్లాడితే అది విచారణను ప్రభావితం చేయడం కిందకు వస్తుందని చెబుతున్నారు. కేవలం విచారణను తప్పుదారి పట్టించాలనే దురుద్దేశంతోనే రఘురామకృష్ణరాజు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు భారత శిక్షా స్మృతిలోని నిబంధనలను న్యాయ నిపుణులు ప్రధానంగా ఉదహరిస్తున్నారు. జప్తు చేసే విశేష అధికారాలు సెక్షన్ 102 ప్రకారం నేరంతో సంబంధం ఉందని అనిపించిన వస్తువులను జప్తు చేసే అధికారం దర్యాప్తు అధికారికి ఉంది. దర్యాప్తు సమయంలో విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు అప్పటికప్పుడు తటస్థ సాక్షులతో నిమిత్తం లేకుండా జప్తు చేసే విశేష అధికారాలు కూడా అధికారులకు ఉన్నాయి. రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడానికి సీఐడీ అధికారులు హైదరాబాద్‌లో ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అలాంటి పరిస్థితే తలెత్తిందని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కొన్ని సార్లు కింది స్థాయి అధికారులు దర్యాప్తునకు వెళ్లినప్పుడు జప్తు చేసిన వస్తువుల గురించి విచారణ అధికారికి తెలియజేయాలి. విచారణ కోసం ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయస్థానానికి సమర్పిస్తామని లిఖిత పూర్వకంగా తెలియజేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా సమర్పించవచ్చు సెక్షన్ 167 ప్రకారం జప్తు చేసిన వస్తువుల గురించి రిమాండ్ రిపోర్ట్‌తో పాటు సమర్పించాలని లేదు. కేసు విచారణలో భాగంగా ఎప్పుడైనాసరే సమర్పించవచ్చు. న్యాయస్థానానికి తరలించడానికి అవకాశం ఉన్న వస్తువుల జప్తు గురించి తర్వాత అయినా సరే ప్రస్తావించవచ్చు. తరలించడానికి అవకాశం లేనివాటి గురించి అప్పటికప్పుడు చెప్పాలి. రఘురామకృష్ణరాజు కేసులో సెల్‌ఫోన్ అన్నది న్యాయస్థానానికి తరలించదగిన వస్తువే కాబట్టి దాని గురించి తర్వాత చెప్పే వెసులుబాటు దర్యాప్తు అధికారులకు ఉంది. ఆ వస్తువుల గురించి నిందితుడు మాట్లాడరాదు సెక్షన్ 165 ప్రకారం దర్యాప్తు అధికారులు జప్తు చేసిన వస్తువుల గురించి నిందితుడు మాట్లాడకూడదు. అందుకు విరుద్ధంగా మాట్లాడితే అది దర్యాప్తును ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్టు అవుతుంది. ఈ దృష్ట్యా తన సెల్‌ఫోన్‌ను సీఐడీ అధికారులు జప్తు చేశారని రఘురామకృష్ణరాజు ప్రస్తావించడం నిబంధనలకు విరుద్ధం. జప్తు చేసిన వస్తువులు అన్నింటి గురించి కూడా దర్యాప్తు అధికారులు వెంటనే ప్రస్తావించాలని కచ్చితమైన నిబంధన లేదు. కొన్ని సార్లు వివిధ కారణాలతో అన్ని వస్తువుల గురించి ప్రస్తావించలేకపోవచ్చు. తర్వాత చార్జ్‌షీట్ నమోదు చేసినప్పుడుగానీ ప్రత్యేక మెమో వేసిగానీ ఆ వస్తువుల జప్తు గురించి న్యాయస్థానానికి తెలియజేసే వెసులుబాటు దర్యాప్తు అధికారులకు ఉంది. రఘురామకృష్ణరాజు వాదన అసంబద్ధం తన సెల్‌ఫోన్‌ను జప్తు చేసిన విషయాన్ని సీఐడీ అధికారులు వెల్లడించలేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేయడం అసంబద్ధంగా ఉంది. దాని గురించి విచారణ సమయంలో ఎప్పుడైనా చెప్పొచ్చు. జప్తు చేసిన వస్తువు గురించి నిందితుడు రఘురామకృష్ణరాజు మాట్లాడటం నిబంధనలకు వ్యతిరేకం. కేవలం దర్యాప్తు అధికారులను భయభ్రాంతులకు గురిచేసి, కేసును ప్రభావితం చేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నారు. జప్తు అంశాల్లో లోటుపాట్లను సాకుగా చూపించి కేసు నుంచి తప్పించుకోలేరని పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ బల్బీర్‌సింగ్ కేసులో అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. – కోటంరాజు వెంకటేశ్ శర్మ, న్యాయవాది -
తీరు మార్చుకోకపోతే.. గుణపాఠం చెబుతాం..
సాక్షి, విజయవాడ: దళిత ఐఏఎస్, ఐపీఎస్‌లపై రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామని ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు వరప్రసాద్‌రావు అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలోనే డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. సీఐడీ ఏడీజీ పై అసత్య ఆరోపణలు మానుకోకుంటే రఘురామకృష్ణరాజుకు గుణపాఠం చెబుతామని వరప్రసాద్‌రావు హెచ్చరించారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మ.. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ బందర్ పార్లమెంటు ఇంఛార్జి రమేష్ మాట్లాడుతూ, రాజుల కుటుంబాలకే రఘురామకృష్ణరాజు కళంకం తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు చేతిలో రఘురామకృష్ణరాజు కీలుబొమ్మగా మారాడని, రఘురామకృష్ణరాజు తన పద్ధతి మార్చుకోకుంటే ఆందోళనలు చేస్తామని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ విజయవాడ సిటీ అధ్యక్షుడు బూదాల శ్రీను అన్నారు. చదవండి: Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..! వంద శాతం విద్యుదీకరణ భేష్: ఏపీకి నీతి ఆయోగ్ ప్రశంస -
అమూల్‌తో ఒప్పందం అమలుకు ఎలాంటి ఖర్చు చేయొద్దు
సాక్షి, అమరావతి: అమూల్‌తో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా పాలసేకరణ, మార్కెటింగ్ తదితరాలపై ఎలాంటి ఖర్చు చేయరాదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాడి రైతుల లబ్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం–అమూల్ కుదుర్చుకున్న ఒప్పందంపై నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కోరినట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు, అమూల్, ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్‌లకు నోటీసులు జారీచేసింది. వీరికి వ్యక్తిగతంగా నోటీసులు పంపే వెసులుబాటును రఘురామకృష్ణరాజుకు ఇచ్చింది. వీరికి నోటీసులు పంపిన రుజువులను కోర్టు ముందుంచాలని రఘురామను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, జస్టిస్ దొనడి రమేశ్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఏపీడీడీసీఎఫ్ ఆస్తుల బదలాయింపుపై మంత్రిమండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతోపాటు, అమూల్, ఏపీడీడీసీఎఫ్‌ల మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందం తాలుకు జీవో 25ను రాజ్యాంగ విరుద్దంగా ప్రకటించాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కొంగర విజయలక్ష్మి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. అమూల్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించి ప్రభుత్వం సవివరంగా దాఖలు చేసిన కౌంటర్ హైకోర్టు రికార్డుల్లో కనిపించలేదు. దీంతో ధర్మాసనం విచారణను వాయిదా వేస్తామని, అప్పటివర కు పిటిషనర్ కోరినట్లు మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని ప్రతిపాదించింది. దీనిని ప్రభుత్వ ప్రత్యేక న్యా యవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ తీవ్రంగా వ్యతి రేకించారు. రాష్ట్రంలో పలు ప్రైవేటు డెయిరీలకు లబ్ధిచేకూర్చడం కోసమే అమూల్‌తో ప్రభుత్వ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రఘురామకృష్ణరాజు పిల్ వేశారని కోర్టుకు వివరించారు. పాడిరైతుకు లీటరు కు అదనంగా రూ.4 వస్తుంటే చూసి తట్టుకోలేక ఈ వ్యాజ్యం వేశారన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలతో దాఖలు చేసిన ఈ వ్యాజ్యం విచారణార్హతను తేల్చాలని కోరారు. అయినా.. ధర్మాసనం రఘురామకృష్ణరాజు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీచేస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఆ లీజుల వెనుక దురుద్దేశాలేవీ లేవు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ డీడీసీఎఫ్) ఆస్తులను గుజరాత్ కో–ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్)కు లీజుకిస్తూ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి దురుద్దేశాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మహిళల సాధికారత, పాడి రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హైకోర్టుకు నివేదించింది. పాల ఉత్పత్తిదారులకు సాధ్యమైనంత మంచి ధర రావాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామంది. దీనివల్ల దాదాపు 30 లక్షల మంది మహిళా పాడి రైతులు లబ్ధి పొందుతారని వివరించింది. ఈ విధాన నిర్ణయం వెనుక సామాజిక, సంక్షేమ కారణాలున్నాయని తెలిపింది. ఏపీడీడీసీఎఫ్ ఆస్తులను అమూల్ సంస్థకు వాణిజ్య ప్రయోజనాల కోసం లీజుకు ఇవ్వడం లేదని, పాలు, పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా వచ్చే లాభాలను అమూల్ వాటాదారులకు పంచే పరిస్థితి ఉండదని స్పష్టం చేసింది. ఆ లాభాలను మహిళా పాల సహకార సంఘాల (ఎండీఎస్‌ఎస్) సభ్యుల మధ్య పంపిణీ చేయడం జరుగుతుందని వివరించింది. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు ఏపీ డీడీసీఎఫ్ ఆస్తుల బదలాయింపుపై మంత్రి మండలి తీర్మానాన్ని ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి అమూల్, ఏపీ డీడీసీఎఫ్ మధ్య కుదిరిన పరస్పర అవగాహన ఒప్పందానికి సంబంధించిన జీవో 25ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలంటూ ఎంపీ కె.రఘురామకృష్ణరాజు హైకోర్టులో ఇటీవల పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పశు సంవర్థక, డెయిరీ డెవలప్మెంట్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య కౌంటర్ దాఖలు చేస్తూ.. అమూల్ సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నామన్న పిటిషనర్ రఘురామకృష్ణరాజు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. పాల ఉత్పత్తిదారుల సంక్షేమం కోసం ఈ పిల్ దాఖలు చేశానని చెబుతున్న రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో ఎక్కడా ఏపీ డీడీసీఎఫ్ ఆస్తులను అమూల్‌కు లీజుకిస్తే పాల రైతులు ఎలా ప్రభావితం అవుతారో చెప్పలేదని కౌంటర్లో పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం తప్ప ప్రజాప్రయోజన వ్యాజ్యం కాదు సంగం డెయిరీ అక్రమాలు బహిర్గతమైన సమయంలోనే రఘురామకృష్ణరాజు ఈ వ్యాజ్యం చేశారని.. ఇది వ్యక్తిగత ప్రయోజన, రాజకీయ ప్రయోజన వ్యాజ్యమే తప్ప ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎంత మాత్రం కాదని పూనం మాలకొండయ్య తన కౌంటర్లో పేర్కొన్నారు. అమూల్‌తో ఒప్పందం తరువాత మహిళా పాడి రైతులకు లీటరుకు రూ.4 నుంచి రూ.14 వరకు అదనంగా లభిస్తోందని తెలిపారు. ప్రైవేటు పాల కంపెనీలకు లబ్ధి చేకూర్చడమే ఈ పిల్ దాఖలు వెనుక ప్రధాన ఉద్దేశమని, ఈ ఒక్క కారణంతో ఈ వ్యాజ్యాన్ని భారీ జరిమానాతో కొట్టేయాలని హైకోర్టును అభ్యర్థించారు. రఘురామ వాస్తవాలను తొక్కిపెట్టారు రూ.వెయ్యి కోట్లకు పైగా బ్యాంకులను మోసం చేసిన రఘురామకృష్ణరాజుపై సీబీఐ తీవ్ర అభియోగాలతో ఇప్పటికే రెండు కేసులు నమోదు చేసిందని, వరా>్గల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేలా మాట్లాడినందుకు అతనిపై రాష్ట్రంలో పలు కేసులు నమోదయ్యాయని మాలకొండయ్య కోర్టుకు నివేదించారు. వీటి గురించి పిటిషనర్ ఎక్కడా కూడా వ్యాజ్యంలో ప్రస్తావించకుండా వాస్తవాలను తొక్కిపెట్టారని, ఇది హైకోర్టు పిల్ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. -
Raghurama Krishnam Raju Case: న్యాయ వర్గాల్లో విస్మయం
సాక్షి, అమరావతి: తన తండ్రిని సీఐడీ అధికారులు హింసించారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజు కుమారుడు కె.భరత్ తరఫు సీనియర్ న్యాయవాది మంగళవారం సుప్రీంకోర్టులో వినిపించిన వాదనలపై న్యాయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సీఐడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన భరత్ ఇప్పుడు తన పిటిషన్లో ప్రతివాదుల జాబితా నుంచి ఏపీ ప్రభుత్వం, సీఐడీలను తొలగించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేయడం, అందుకు సుప్రీంకోర్టు అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కనీసం వారి వాదనలు వినిపించే అవకాశం కూడా లేకుండా చేయడంతో పాటు సీబీఐ దర్యాప్తును వ్యతిరేకించే అవకాశం లేకుండా చేసేందుకే ఇలా వ్యూహాత్మకంగా చేస్తున్నారన్న అనుమానాలను న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. న్యాయ సూత్రాల ప్రకారం.. ఒక వ్యక్తి లేదా సంస్థపై ఆరోపణలు చేస్తూ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు ఆ వ్యక్తి లేదా సంస్థను ప్రతివాదిగా చేర్చడం తప్పనిసరి. ఇది అందరూ పాటించే న్యాయ నియమం. అలా ప్రతివాదిగా లేదా ప్రతివాదులుగా చేరిస్తే కోర్టు వారికి నోటీసులు జారీ చేసి ఆరోపణలపై వివరణ కోరుతుంది. తద్వారా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి లేదా సంస్థ తన వాదనలను వినిపించుకునే అవకాశంతో పాటు జరిగింది న్యాయస్థానానికి నివేదించే వీలుంటుంది. ఇది సహజ న్యాయ సూత్రం కూడా. న్యాయ సూత్రాల్లో ‘ఆడి ఆల్ర్టమ్ పార్టమ్’ (ప్రతివాదుల వాదనలు కూడా వినాలి) చాలా ముఖ్యమైనది. ఇప్పుడు భరత్, ఆయన న్యాయవాదులు ఈ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారు. భరత్ తన పిటిషన్లో సీఐడీపై పలు ఆరోపణలు చేయడమే కాకుండా దురుద్దేశాలు కూడా ఆపాదించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం దురుద్దేశాలు అంటగట్టారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ ప్రతివాదులుగా ఉండటం తప్పనిసరి. తద్వారా అటు సీఐడీకి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి తమపై వచి్చన ఆరోపణలకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది. రఘురామకృష్ణరాజు గాయాలపై వాస్తవాలను కోర్టుకు వివరించడానికి ఆస్కారం ఉంటుంది. జీజీహెచ్ మెడికల్ బోర్డు నివేదికలోని అంశాలతో పాటు ఆర్మీ ఆసుపత్రి నివేదికలోని అంశాలపై కూడా సుప్రీంకోర్టు ముందు గట్టిగా వాదనలు వినిపించవచ్చు. ఇప్పుడు అవన్నీ లేకుండా చేశారని, ఇది ఎంత మాత్రం సరికాదని, ఇలా చేయడం ద్వారా భరత్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హత లేకుండా పోయిందని న్యాయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సుప్రీంకోర్టు తదుపరి విచారణ సమయంలో ఈ విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందని ఆ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతివాదులుగా ఉండటం తప్పనిసరి... రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీపై ఆరోపణలు చేస్తున్నప్పుడు వారు ప్రతివాదులుగా ఉండటం తప్పనిసరి. అప్పుడే సహజ న్యాయ సూత్రాలను పాటించడం సాధ్యమవుతుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రతివాదులుగా లేకుంటే వారి వాదన ఎవరికి వినిపించాలి? కోర్టు వారి వాదనలు వినకుండా పిటిషనర్ కోరిన ఉత్తర్వులు ఇచ్చేందుకు వీల్లేదు. ప్రతివాదులుగా చేర్చి ఆ తరువాత వారిని తీసేస్తే ఎందుకు తీసేస్తున్నామో కారణాలు చెప్పాలి. ఆ కారణాలు సహేతుకమైనవో కావో కోర్టు విచారించి నిర్ణయం వెలువరించాలి. ఈ కేసులో అలా జరగలేదంటే అది సహజ న్యాయ సూత్రాలను పాటించకపోవడమే అవుతుంది. – ఎల్.రవిచందర్, సీనియర్ న్యాయవాది ఆ పిటిషన్‌కు విచారణార్హతే లేదు రఘురామకృష్ణరాజు కుమారుడు తన పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఐడీకి వ్యతిరేకంగా సీబీఐ దర్యాప్తు కోరుతున్నారు. అలాంటప్పుడు సీఐడీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదులుగా ఉండొద్దంటే ఎ లా? ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన హక్కు సీఐడీకి, ప్రభుత్వానికి ఉంది. ఆ హక్కును కాలరాసే విధంగా సీఐడీ, ప్రభుత్వాన్ని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించారు. ఈ పరిస్థితుల్లో భరత్ దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణార్హతే లేదు. ఇంత చిన్న కేసు కూడా సీబీఐకి అప్పగించాలంటే ఎలా? – ఎస్.శరత్ కుమార్, న్యాయవాది -
రఘురామ కేసులో ప్రతివాదిగా... రాష్ట్ర ప్రభుత్వం తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణరాజు గాయాలపై సీబీఐ విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రతివాదిగా తొలగించడంపై రాష్ట్ర ప్రభుత్వ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని నివేదించారు. సీఐడీ పోలీసు కస్టడీలో తన తండ్రిని హింసించారని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. భరత్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ పిటిషన్లో సీబీఐని ప్రతివాదిగా చేర్చాలని కోరారు. తొలుత ప్రతివాదులుగా చేర్చిన ఏపీ ప్రభుత్వం, మంగళగిరి స్టేషన్ హౌస్ ఆఫీసర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్, సీఐడీ ప్రాంతీయ కార్యాలయం ఏసీపీ ఆర్.విజయపాల్‌ను ప్రతివాదులుగా తొలగించాలని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినలేదని, సీబీఐని ఏ రకంగా ప్రతివాదిగా చేరుస్తారని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ధర్మాసనం స్పందిస్తూ.. ప్రతివాదుల తొలగింపుపై పిటిషనర్ తరఫు న్యాయవాది రిస్క్ భరిస్తానని అంగీకరించారని పేర్కొంది. ‘ప్రతివాది నంబర్ 1గా ఎవరిని చేర్చారు? ఏపీ ప్రభుత్వాన్ని ఇపుడు ఎందుకు తొలగిస్తున్నారో అర్థం కావడం లేదు’ అని ధర్మాసనానికి దవే నివేదించారు. పిటిషనర్ తరపు న్యాయవాది రిస్క్ భరిస్తానంటున్నారు కదా? అని ధర్మాసనం పునరుద్ఘాటించింది. దవేకు ‘లోకస్ స్టాండీ’ లేదని, ఏపీ ప్రభుత్వాన్ని తొలగించాల్సిందేనని రోహత్గి పేర్కొనడంతో ఈ ప్రొసీడింగ్స్ హాస్యాస్పదంగా ఉన్నాయని దవే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో చాలా అంశాలు ఉన్నట్లుగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ ఆసక్తి ఉన్న పార్టీల వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వబోమని, కావాలనుకుంటే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. కేంద్రం, సీబీఐలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణ ఆరు వారాల పాటు వాయిదా వేసింది. ఈలోగా ప్రతివాదులిద్దరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
ఎంపీ రఘురామ విడుదల వాయిదా
సాక్షి, గుంటూరు: ఎంపీ రఘురామకృష్ణ రాజు విడుదల మరో నాలుగు రోజుల పాటు వాయిదా పడింది. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరుస్తూ, ఓ సామాజిక వర్గాన్ని, మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన రఘురామకృష్ణరాజుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి.. అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు సుప్రీంకోర్టు 21వ తేదీన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పొందడానికి అవసరమైన పత్రాలు, ష్యూరిటీ బాండ్లను రఘురామకృష్ణ తరపు న్యాయవాది లక్ష్మీనారాయణ గుంటూరు సీఐడీ కోర్టులో సోమవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై మెజిస్ట్రేట్ ఆరా తీశారు. మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఆస్పత్రిలో ఎంపీకి చికిత్స అవసరమని వైద్యులు సూచించారని న్యాయవాదులు మెజిస్ట్రేట్‌కు చెప్పారు. ఎంపీ ఆరోగ్యం కుదుటపడ్డాక డిశ్చార్జి సమ్మరీతో కలిపి బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని మెజిస్ట్రే ట్ ఆదేశించారు. దీంతో రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది. -
వేర్వేరుగా ఉత్తర్వులు..
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేసులో ఏపీ సీఐడీ అదనపు డీజీ, ఎస్‌హెచ్‌వోలపై కోర్టు ధిక్కార చర్యలకు ఆదేశాలిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల కాపీ శనివారం బయటకొచ్చింది. ఈ నెల 19న జారీచేసిన ఈ ఉత్తర్వులు.. రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజు బయటకు రావడం విశేషం. జాతీయ లీగల్ వెబ్సైట్లలో ఈ ఉత్తర్వులు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. హైకోర్టు తన ఉత్తర్వుల్లో ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డికి హితబోధ చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ లలితలు వేర్వేరుగా ఉత్తర్వులు వెలువరించారు. 16 పేజీల ఉత్తర్వుల్లో 15 పేజీలు జస్టిస్ లలితకు సంబంధించిన ఉత్తర్వులు కాగా, ఒక పేజీ జస్టిస్ ప్రవీణ్‌కుమార్ ఉత్తర్వులకు సంబంధించినది. జస్టిస్ లలిత తన ఉత్తర్వుల్లో ఏఏజీ సుధాకర్‌రెడ్డి తీరును ఆక్షేపిస్తూ పలు వ్యాఖ్యలు చేయగా, జస్టిస్ ప్రవీణ్ కుమార్ మాత్రం వాటి జోలికి వెళ్లలేదు. వాదనల సందర్భంగా స్వీయ నియంత్రణ పాటించడం అన్నది ఓ ప్రమాణ చిహ్నమని ప్రవీణ్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాదనల సమయంలో ఆచితూచి పద ప్రయోగం చేయాలన్నారు. సుధాకర్‌రెడ్డి వాదనల సందర్భంగా హుందా, మంచి పదాలను ఉపయోగించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. 12 లైన్లలో ఆయన తన ఉత్తర్వులను ముగించారు. జస్టిస్ లలిత ఉత్తర్వులు మాత్రం ఇందుకు భిన్నంగా సాగాయి. న్యాయవాది ఏ విధంగా వ్యవహరించాలి.. న్యాయవాది భాష ఎలా ఉండాలన్న దానిపై ఆమె తన ఉత్తర్వుల్లో పలు వ్యాఖ్యలు చేశారు. సుధాకర్‌రెడ్డి వాదనలు ప్రాథమికంగా చూస్తే.. అవి కోర్టు ధిక్కార స్వభావాన్ని కలిగి ఉన్నాయని, ఆయనపై చర్యల నిమిత్తం బార్ కౌన్సిల్‌కు నివేదించేందుకు ఈ కేసు తగినదని పేర్కొన్నారు. ఆయన తీరు పునరావృతమైతే తగిన చర్యలు తీసుకునేందుకు ఈ కోర్టు వెనుకాడబోదన్నారు. సుధాకర్‌రెడ్డి స్వరం పెద్దది చేసి వాదనలు వినిపించడాన్ని జస్టిస్ లలిత తన ఉత్తర్వుల్లో ఆక్షేపించారు. -
రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లకపోవడం కోర్టు ధిక్కారమే
సాక్షి, అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును గాయాల పరిశీలన నిమిత్తం రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ఈ నెల 15న తామిచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదంటూ సీఐడీపై హైకోర్టు మండిపడింది. తమ ఆదేశాలను అమలు చేయకపోవడం కోర్టు ధిక్కారమేనంటూ సీఐడీ అదనపు డీజీ, సీఐడీ మంగళగిరి ఎస్‌హెచ్‌వోలపై సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవాలని హైకోర్టు రిజిస్ట్రార్‌కు (జ్యుడీషియల్) సూచించింది. రఘురామకృష్ణరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి 15వ తేదీ మధ్యాహ్నం కల్లా నివేదిక అందచేయాలన్న తమ ఆదేశాల అమల్లో జాప్యంపై వివరణ ఇవ్వాలని మెడికల్ బోర్డు చైర్మన్‌గా వ్యవహరించిన గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ ప్రభావతిని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేస్తూ కేసును జూన్ 16కి వాయిదా వేసింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవి.. సుప్రీకోర్టులో విచారణ జరిగి... సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వైద్య పరీక్షల నిమిత్తం సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రికి రఘురామరాజును తరలించిన నేపథ్యంలో హైకోర్టు తాజా ఉత్తర్వుల పట్ల అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి విస్మయం వ్యక్తంచేశారు. రమేశ్ ఆస్పత్రికి పంపాలన్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని, ఇవి అమలు చేయడానికి వీల్లేని విధంగా ఉన్నాయని చెప్పారు. వీటిని అమలు చేయాలని అధికరణ 226 కింద హైకోర్టు ఆదేశాలివ్వడం సరికాదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 54ను ఓసారి చూడాలని, దాన్ని చదివితే మేజిస్ట్రేట్ ఉత్తర్వులు ఎలా చట్టవిరుద్ధమో అర్థమవుతుందని నివేదించారు. దాంతో తమకు సంబంధం లేదని, తమ ఉత్తర్వులను అమలు చేశారా? లేదా? అన్నది మాత్రమే చెప్పాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వులు చట్టవిరుద్ధమైతే వాటిని హైకోర్టులో సవాల్ చేసుకోవాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ‘‘మేం ఇప్పటికే ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ వేశాం’’ అని సుధాకర్‌రెడ్డి వివరించారు. రఘురామకృష్ణరాజును రమేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న మేజిస్ట్రేట్ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలంటూ 15న మేం ఇచ్చిన ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదని ధర్మాసనం మళ్లీ ప్రశ్నించింది. ‘‘రాత్రి 12 గంటలకు ఆదేశాలిస్తే వాటిని అమలు చేయడం ఎలా సాధ్యం?’’ అని సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తమ ఆదేశాలను అమలు చేయకపోవడాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. మీరేం చెప్పాలనుకున్నా కోర్టు ధిక్కార పిటిషన్ విచారణ సమయంలో చెప్పుకోండని ఆమె తేల్చి చెప్పారు. కోర్టు అడిగిన దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని, తాను చెప్పే విషయాలను నమోదు చేయాలని సుధాకర్‌రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. ఆ అవసరం లేదని న్యాయమూర్తి జస్టిస్ లలిత తెలపగా... తన వాదనలు వినేందుకు సిద్ధంగా లేకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోతానని సుధాకరరెడ్డి చెప్పారు. తన వాదనలు విననప్పుడు తాను ప్రభుత్వం తరఫున హాజరవడంలో అర్థం ఏముందని ప్రశ్నించారు. ఇదేదో ప్రత్యేక కేసు అన్నట్టు వ్యవహరించడం సరికాదు న్యాయమూర్తి జస్టిస్ లలిత స్పందిస్తూ.. తామిచ్చిన ఉత్తర్వులను తప్పని చెప్పే అధికారం మీకు లేదంటూ సుధాకర్‌రెడ్డికి స్పష్టం చేశారు. ‘మేం ఏం చెప్పాలనుకుంటున్నామో అది చెప్పే హక్కు మాకు ఉంది’ అని తేల్చి చెప్పారు. ‘‘ఉదయం 10.30 గంటలకే సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు పిటిషన్‌పై విచారణ మొదలుపెట్టింది. అలాంటప్పుడు చట్టవిరుద్ధమైన మేజిస్ట్రేట్ ఉత్తర్వులను మేమెలా అమలు చేయగలం? పైపెచ్చు అంత రాత్రి మేం వెళ్లి జైలుగేట్లు తెరవలేం కదా? ఇదో ప్రత్యేక కేసు అన్నట్లు కనిపించేలా ఈ కోర్టు వ్యవహరించకూడదు. చట్టం ముందు అందరూ సమానమే. రాజ్యాంగంలోని అధికరణను పరిగణనలోకి తీసుకోవాలి’’ అని సుధాకరరెడ్డి నివేదించారు. అయినా ఈ కేసులో అంత ప్రత్యేక ఆసక్తి ఏముందన్నారు. ఈ సమయంలో జస్టిస్ లలిత తీవ్రంగా స్పందించారు. కంట్రోల్లో ఉండి మాట్లాడాలని సుధాకర్‌రెడ్డికి సూచించారు. -
రఘురామ వైద్యపరీక్షల పర్యవేక్షణకు జ్యుడిషియల్ అధికారి
సాక్షి, హైదరాబాద్: నరసపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైద్య పరీక్షల పర్యవేక్షణ కోసం జ్యుడిషియల్ అధికారిని తెలంగాణ హైకోర్టు నియమించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ నాగార్జునను హైకోర్టు నియమించింది. ఈ మేరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రికి జ్యుడిషియల్ అధికారి చేరుకున్నారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకృష్ణరాజుకు ముగ్గురు ఆర్మీ వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ వైద్య పరీక్షలను అధికారులు వీడియో తీస్తున్నారు. మెడికల్ నివేదికను సీల్డ్ కవర్లో న్యాయాధికారి సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కేసులో అరెస్టయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిలు ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. తనకు రమేశ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ఆయన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చి.. రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సీల్డ్ కవర్లో తమకు నివేదిక పంపాలని పేర్కొంది. దీనిపై ఈనెల 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. -
రఘురామకు బెయిల్ నిరాకరణ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పరిచే కుట్ర కేసులో అరెస్టయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు బెయిలు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తనకు రమేశ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలన్న ఆయన విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. రఘురామకృష్ణరాజును సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి తెలంగాణ హైకోర్టు నియమించే జ్యుడిషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరించి తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ద్వారా సీల్డ్ కవర్లో తమకు నివేదిక పంపాలని పేర్కొంది. దీనిపై ఈనెల 19వ తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. హైకోర్టు బెయిలు నిరాకరించడంతో రఘురామకృష్ణరాజు, ఆయన కుమారుడు భరత్ వేర్వేరుగా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లను సోమవారం విచారించిన జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. మంగళగిరి ఎయిమ్స్, మణిపాల్ ఆస్పత్రులను సూచించినా... ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ‘‘జ్యుడీషియల్ అధికారి సమక్షంలో రఘురామకృష్ణరాజుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించడానికి అభ్యంతరం లేదు. మంగళగిరిలోని ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయవచ్చు. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రి(ప్రైవేట్)లో జరిపినా అభ్యంతరం లేదు’’ అని తెలిపారు. అయితే మంగళగిరిలోని ఎయిమ్స్ కొత్తగా ఏర్పాటైందని, తగినంత మంది సిబ్బంది లేరని, మణిపాల్ ఆసుపత్రి ప్రైవేట్‌ది అని రఘరామరాజు తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అభ్యంతరం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణరాజును సొంత ఖర్చులతో ఢిల్లీ రావడానికి అనుమతించి ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించాలని కోరారు. దీనికి కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం చెప్పలేదు. అయితే సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స కాకుండా కేవలం వైద్య పరీక్షలు మాత్రమే నిర్వహించాలని దుష్యంత్ దవే కోరారు. సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆస్పత్రికి చేరుకున్న ఎంపీ ఖర్చులు పిటిషనరే భరించాలి... ‘ఆర్మీ ఆసుపత్రి హెడ్ ఆధ్వర్యంలో ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డు వైద్య పరీక్షలు నిర్వహించాలి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఆర్మీ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించాలి. దీన్ని జ్యుడీషియల్ కస్టడీగా భావించాలి. ఆర్మీ ఆసుపత్రిలో అయ్యే ఖర్చును పిటిషనర్ భరించాలి. స్పెషల్ లీవ్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లుగా రెండు రోజులు గడువు ఇస్తున్నాం. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పిటిషనర్ కాపీలు అంజేయాలి. పిటిషనర్ రిజాయిండర్‌ను ఈ నెల 20లోగా దాఖలు చేయాలి. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నాం. ఈ ఆదేశాలు అమలు అయ్యేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలి. మా ఆదేశాలను ఈ–మెయిల్ ద్వారా తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఏపీ హైకోర్టు, సీఎస్, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి హెడ్‌కు పంపాలి’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టీవీ 5, ఏబీఎన్ ఈ వ్యవహారానికి సంబంధించి తమపైనా కేసు నమోదు చేయడంపై టీవీ 5, ఏబీఎన్ చానళ్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సంస్థ, ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, సీఐడీ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని కోరుతూ సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. ఆర్మీ ఆస్పత్రికి తరలింపు.. సాక్షి, గుంటూరు : సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణరాజును అధికారులు గుంటూరు జిల్లా జైలు నుంచి సికింద్రాబాద్‌కు తరలించారు. జైళ్ల శాఖ డీజీపీ నుంచి ఉత్తర్వులు అందడంతో సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో పోలీసు భద్రత నడుమ వ్యక్తిగత వాహనంలో జైలు నుంచి ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. -
ఒంటిపై గాయాలేవీ లేవు
సాక్షి, అమరావతి: వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడటంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు తనను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు తనను కస్టడీలో తీవ్రంగా కొట్టారంటూ నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని హైకోర్టు ఏర్పాటు చేసిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్ నేతృత్వంలోని మెడికల్ బోర్డు ఆదివారం హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక ఇచ్చింది. గాయాలున్నాయనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంది. కాళ్లలో నీరు చేరిందని (ఎడెమా), అందుకే కాళ్లు రంగు మారి కనిపిస్తున్నాయని హైకోర్టుకు వివరించింది. ఎక్కువ సేపు కూర్చున్నా, ప్రయాణించినా కాళ్లు రంగుమారుతాయని చెప్పింది. 2020 నవంబర్ 30న తనకు బైపాస్ సర్జరీ అయిందని, గుండె నొప్పిగా ఉందని రఘురామ చెప్పడంతో వెంటనే కార్డియాలజిస్ట్‌ను పిలిపించామంది. కార్డియాలజిస్ట్ పరిశీలించి, ప్రస్తుతం గుండెకు ఎలాంటి ముప్పు లేదని, ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని చెప్పారని మెడికల్ బోర్డు తన నివేదికలో పేర్కొంది. న్యూరాలజీ, నెఫ్రాలజీ వైద్యులు సైతం రఘురామ ఆరోగ్యం స్థిరంగా ఉందనే చెప్పారని బోర్డు తన నివేదికలో వివరించింది. కొట్టడం వల్ల ఎలాంటి గాయాలు కాలేదని బోర్డు తన నివేదికలో తేల్చి చెప్పింది. ఆయనకు కలర్ డాప్లర్, ఈసీజీ, రక్త పరీక్షలన్నీ చేశామని, అన్నీ పరీక్షల ఫలితాలు సాధారణ స్థితిలో ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు మెడికల్ బోర్డు నివేదికను హైకోర్టు న్యాయమూర్తులు చదివి వినిపించారు. బోర్డు చైర్మన్ అయిన జీజీహెచ్ సూపరింటెండెంట్‌తో సహా మిగిలిన డాక్టర్లు కూడా వేర్వేరుగా ఒక రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలిపింది. ఈ నివేదికను హైకోర్టు రిజిస్ట్రీ నుంచి పొందే వెసులుబాటును ఇరుపక్షాలకు ఇచ్చింది. రమేశ్ ఆస్పత్రికి పంపలేం.. మేజిస్ట్రేట్ ఇచ్చిన ఆదేశాల మేరకు రఘురామను గాయాల పరిశీలన నిమిత్తం రమేశ్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీనిపై సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. రమేశ్ ఆస్పత్రికి పంపడం అంటే టీడీపీ ఆఫీసుకి పంపడమేనన్నారు. అగ్ని ప్రమాదం వల్ల పలువురు కోవిడ్ రోగులు మృతి చెందడానికి కారణమైన రమేశ్ ఆస్పత్రిపై రాష్ట్ర ప్రభుత్వం కేసు నమోదు చేసిందని ఆయన వివరించారు. దీంతో రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వంపై కక్ష కట్టి ఉందని, అందువల్ల ఆ ఆస్పత్రికి పంపడానికి తమకు అభ్యంతరం ఉందని తెలిపారు. రమేశ్ ఆసుపత్రికి పంపితే నిష్పాక్షిక నివేదిక వచ్చే అవకాశం ఉండదన్నారు. అంతేకాక రఘురామ గాయాల పరిశీలనకు హైకోర్టు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన్ను రమేశ్ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరించాలని కోరుతూ మేజిస్ట్రేట్ ముందు ఇప్పటికే పిటిషన్ దాఖలు చేశామని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఆయన్ను రమేశ్ ఆస్పత్రికి పంపాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై దర్మాసనం స్పందిస్తూ ఆ ఉత్తర్వులను సవాలు చేయడం గానీ, వాటిపై స్టే గానీ లేనందున, అవి అమల్లో ఉన్నాయని తెలిపింది. అందువల్ల వాటిని అమలు చేయాల్సిందేనని సీఐడీ అధికారులకు తేల్చి చెప్పింది. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల అమలును రేపటి వరకైనా నిలుపుదల చేయాలని పొన్నవోలు కోరగా, ధర్మాసనం ఆ అభ్యర్థనను సైతం తోసిపుచ్చింది. మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు రఘురామను రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఆదివారం రాత్రి ఉత్తర్వులిస్తూ తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఆస్పత్రికి తీసుకెళ్లమంటే జైలుకు తీసుకెళ్లారు.. ► అంతకు ముందు రఘురామకృష్ణరాజు తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, తనను కొట్టారన్న రఘురామ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన మేజిస్ట్రేట్ అతన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రితో పాటు రమేశ్ ఆసుపత్రికి సైతం తీసుకెళ్లాలని పోలీసు అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిపారు. ► అయితే ఈ ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు రఘురామను జైలుకు తరలించారని చెప్పారు. హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రమేశ్ ఆసుపత్రికి తరలించాల్సిన అవసరం లేదని పోలీసులు చెబుతున్నారన్నారు. మేజిస్ట్రేట్ ఉత్తర్వుల కంటే హైకోర్టు ఉత్తర్వులే అమల్లో ఉంటాయని వక్రభాష్యం చెబుతున్నారని తెలిపారు. సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడంతో ఏపీ సీఐడీ ఆయన్ను అరెస్టు చేసిన విషయం విదితమే. బెయిలు కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఆయనకు అక్కడ చుక్కెదురైంది. దీంతో హైకోర్టు ఆదేశాలు సవాల్ చేస్తూ బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు. బెయిల్ కారణాలను హైకోర్టు పరిశీలించలేదని, సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని సూచించిందని పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు తనను కొట్టారంటూ పిటిషన్లో ఆరోపించారు. ఆ ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్ చెప్పారు.. ► దీనిపై ఏం చెబుతారని అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ఆ విషయాన్ని రాత్రి 8.30 గంటల సమయంలో మేజిస్ట్రేట్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మేజిస్ట్రేట్ హైకోర్టు ఉత్తర్వుల కాపీ కావాలని కోరడంతో, హైకోర్టు ఉత్తర్వుల అధికారిక కాపీని ఆదివారం ఉదయం పంపామన్నారు. ఆ ఉత్తర్వులను చూసి రఘురామను రమేశ్ ఆసుపత్రికి పంపాలన్న ఉత్తర్వులను సవరిస్తామని మేజిస్ట్రేట్ చెప్పారని తెలిపారు. సవరణ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. ► జస్టిస్ లలిత స్పందిస్తూ, ఉత్తర్వులను మేజిస్ట్రేట్ సవరిస్తారన్న ఊహతో రఘురామను ఎలా జైలుకు తరలిస్తారని ప్రశ్నించారు. ఆ ఉత్తర్వులపై సందిగ్ధత ఉంటే తమ దృష్టికి ఆ విషయాన్ని తీసుకొచ్చి స్పష్టత తీసుకుని ఉండాల్సిందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకల్లా నివేదిక ఇవ్వాలని మెడికల్ బోర్డును ఆదేశిస్తే, సాయంత్రం ఎప్పుడో నివేదిక వచ్చిందని, నివేదిక ఆలస్యం అవుతుందన్న కనీస సమాచారం కోర్టుకు ఇవ్వకపోవడం ఏమిటని జస్టిస్ లలిత ప్రశ్నించారు. జైలుకు తీసుకెళ్లడంపై నిషేధం లేదు ► పొన్నవోలు సుధాకర్‌రెడ్డి స్పందిస్తూ, మెడికల్ బోర్డును తాము సంప్రదించే పరిస్థితి లేదన్నారు. మెడికల్ బోర్డు నివేదిక ఎందుకు ఆలస్యం అయిందో తమకెలా తెలుస్తుందన్నారు. పలు వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో నివేదిక ఆలస్యం అయి ఉండొచ్చని చెప్పారు. ► రిమాండ్‌కు అనుమతినిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు నిందితుడైన రఘురామను జైలుకు తీసుకెళ్లడంపై ఎలాంటి నిషేధం లేదన్నారు. పైపెచ్చు మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ అధికరణ 226 కింద హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. ► ఆదినారాయణరావు జోక్యం చేసుకుంటూ, జీజీహెచ్ సూపరింటెండెంట్ వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ నాయకుని భార్య అని తెలిపారు. జైల్లో రఘురామను హత్య చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ విషయాన్ని రికార్డ్ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. ► ఈ ఆరోపణలపై అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ వాటిలో అర్థం లేదన్నారు. ఆయన్ను చంపాలనుకుంటే జైల్లోనే ఎందుకు చంపాలనుకుంటుందని ప్రశ్నించారు. ఆదినారాయణరా>వు తీవ్ర స్వరంతో మాట్లాడుతుండటంతో పొన్నవోలు అభ్యంతరం తెలిపారు. మెడికల్ బోర్డును రఘురామ కోరితేనే హైకోర్టు ఏర్పాటు చేసిందన్నారు. ► సుధాకర్‌రెడ్డి కూడా తీవ్ర స్వరంతో మాట్లాడుతూ దీటుగా బదులిచ్చారు. కొద్దిసేపు ఇద్దరు న్యాయవాదులు వాదించుకున్నారు. దీంతో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ సంయమనం పాటించాలని కోరింది. ► మెడికల్ బోర్డు నివేదికపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదినారాయణరావుకు ధర్మాసనం స్పష్టం చేసింది. మెడికల్ బోర్డు నివేదికను తమకు అందజేసేలా చూడాలని ఆదినారాయణరావు కోరగా, రిజిస్ట్రీని ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. నేడు మేజిస్ట్రేట్ కోర్టు విచారణ.. ► రఘురామకృష్ణంరాజు తనను పోలీసులు కొట్టారని ఆరోపించిన నేపథ్యంలో ఆయనకు అయిన గాయాలను పరిశీలించేందుకు గుంటూరు ప్రభుత్వాసుపత్రితో పాటు రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలన్న ఆదేశాలను సవరించాలంటూ మేజిస్ట్రేట్ కోర్టులో సీఐడీ సోమవారం ఉదయం పిటిషన్ దాఖలు చేయనుంది. ► పిటిషన్ సిద్ధం చేసినప్పటికీ ఆదివారం కావడంతో దాఖలు చేయలేకపోయింది. ఈ పిటిషన్‌పై మేజిస్ట్రేట్ సోమవారం విచారణ జరపనున్నారు. హైకోర్టు ఏకంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన నేపథ్యంలో రఘురామకృష్ణంరాజును రమేశ్ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని, ఆ ఉత్తర్వులను సవరించాలని సీఐడీ తన పిటిషన్లో కోరనుందని తెలిసింది. -
రఘురామకృష్ణరాజు అనుకున్నదొక్కటి.. అయింది మరొకటి
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామకృష్ణరాజు అనుకున్నదొక్కటి.. అయింది మరొకటి అన్నట్లుంది. సీఐడీ పోలీసులు శుక్రవారం ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన్ను మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచకముందే శుక్రవారం రాత్రి బెయిల్ కోసం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. శనివారం హైకోర్టు ఇదే విషయమై తప్పు పడుతూ కింది కోర్టులోనే బెయిల్‌కు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అప్పటి వరకు బెయిల్ వస్తుందన్న ఆశతో ఉన్న రఘురామ.. ఆయన న్యాయ, ఇతర సలహాదారుల సూచన మేరకు వెంటనే ఓ కట్టుకథ సిద్ధం చేసుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు సీఐడీ కోర్టులో ఆయన్ను హాజరుపరచగానే పోలీసులు తనను కొట్టారంటూ కొత్త డ్రామాకు తెరలేపడం సర్వత్రా ఆశ్చర్య పరిచింది. నిజంగా పోలీసులు ఆయన్ను కొట్టి ఉంటే అప్పటి వరకు ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు సైతం ఎందుకు చెప్పలేదు? శనివారం మధ్యాహ్నం వారే ఆయనకు భోజనం తెచ్చిచ్చారు. ఆ సమయంలో వారితో ఈ విషయం చెప్పి, గాయాలు చూపించి ఉండాలి కదా? వారు బయటకు వచ్చి ఆ విషయమై మీడియా ఎదుట రచ్చ చేసి ఉండే వారు కదా? వారిలో కొందరు వారి అనుకూల మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో కూడా గాయాల విషయం ప్రస్తావనకు రాలేదు. ఎప్పుడో రాత్రి పోలీసులు ఆయన్ను కొట్టి ఉంటే, శనివారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచే ముందు వైద్యులు ఆయన్ను పరీక్షించినప్పుడు వారి దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం కనిపిస్తోంది. హైకోర్టులో బెయిల్ రాదని తెలిసినప్పుడే ఆయన ఈ నాటకానికి తెరతీశారు. వాస్తవానికి ఎంపీని పోలీసులు కొట్టి ఉంటే, బెయిల్ అడగడానికి అది చాలా బలమైన కారణంగా ఉండేది. ఇంతటి బలమైన కారణాన్ని ఆయన న్యాయవాది ఎందుకు ఉపయోగించుకోలేదు? బెయిల్ కోసం హైకోర్టులో వాదనలు జరిగినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు రాలేదెందుకు? ఈ విషయాలపై న్యాయవాద వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ముమ్మాటికీ కట్టుకథేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులు తన అరికాళ్లపై లాఠీలతో తీవ్రంగా కొట్టారని కోర్టులో ఎంపీ చెప్పారు. అయితే అంతకు ముందు కోర్టు ప్రాంగణంలో ఆయన కారు దిగిన సమయంలో, కోర్టులోకి ప్రవేశించే ముందు ఎవరి సాయం లేకుండా మామూలుగా నడుచుకుంటూ వెళ్లారు. అరికాళ్లపై అవి కొట్టిన దెబ్బలే అయితే 59 ఏళ్ల ఆయన ఎవరి సాయం లేకుండా మామూలుగా ఎలా నడవగలిగారన్నది ప్రశ్నార్థకం. కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో మాత్రమే న్యాయవాదులను కోర్టులోకి అనుమతించిన నేపథ్యంలో తమనూ లోనికి అనుమతించాలని పలువురు టీడీపీ లీగల్ సెల్ న్యాయవాదులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు తనను కొట్టారని ఎంపీ కోర్టులో చెప్పడంతో వారంతా ఆశ్చర్యపోయారు. -
ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని పథకం ప్రకారం అస్థిర పరచాలనే కుట్రకు మిమ్మల్ని పురిగొల్పింది ఎవరు.. ఎవరి ప్రోద్బలంతో మీరు ప్రభుత్వ, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారి ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు దిగారు? అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొద్ది రోజులుగా ఆయన పథకం ప్రకారమే కొన్ని మీడియా చానల్స్ చర్చ, వీడియో కాన్ఫరెన్సులు, సోషల్ మీడియా లైవ్‌లు, రచ్చ బండ పేరుతో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పూనుకోవడంతోపాటు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు. దీనిపై సీఐడీ అడిషనల్ డీజీ పీవీ సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ అనంతరం ఏ1గా ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటు ఏ2, ఏ3లుగా టీవీ5, ఏబీఎన్, మరికొందరిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో తొలుత రఘురామను శుక్రవారం అరెస్టు చేసిన సీఐడీ బృందం గుంటూరులోని కార్యాలయానికి తరలించి అర్ధరాత్రి వరకు, శనివారం ఉదయం మరోసారి సుదీర్ఘంగా విచారించారు. డీఐజీ సునీల్ కుమార్ నాయక్ నేతృత్వంలో రెండు దఫాలుగా సాగిన ఈ విచారణలో రఘురామ నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్టు విశ్వసనీయ సమాచారం. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేయగా, మరికొన్నింటికి బదులు ఇవ్వడంతో వాటిని సీఐడీ అధికారులు రికార్డు (నమోదు) చేసినట్టు తెలిసింది. ఇప్పటికే సేకరించిన ప్రాథమిక ఆధారాలను ప్రస్తావిస్తూ సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ విచారణ రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్న దగ్గర్నుంచి కోర్టుకు హాజరు పరిచే వరకు సీఐడీ అధికారులు కోవిడ్ జాగ్రత్త చర్యలు పాటించారు. ఆయనకు అవసరమైన మందులు, ఆహారం వంటివి వ్యక్తిగత సహాయకులు అందించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి చెందిన వైద్య బృందాన్ని తీసుకొచ్చి ఆయనకు బీపీ, షుగర్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యవసర సేవల కోసం ముందుగానే అంబులెన్స్‌ను సైతం సిద్ధంగా ఉంచారు. టీవీ 5, ఏబీఎన్‌తో కలిసి కుట్ర.. ప్రభుత్వంపై టీవీ 5, ఏబీఎన్‌లతో కలిసి ఎందుకు కుట్ర చేశారని, దీని వెనుక ఎవరి లబ్ధి ఉందని సీఐడీ ప్రధానంగా ఆరా తీసినట్టు తెలిసింది. టీవీ 5, ఏబీఎన్ పెద్దలతో ప్రతినిత్యం టచ్‌లో ఉంటూ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే చర్యలకు ఎందుకు పాల్పడ్డారని ఆధారాలతో సహా ప్రశ్నించినట్టు సమాచారం. రెడ్డి, క్రిస్టియన్ వర్గాలపైన విమర్శలు చేసి కించ పరుస్తున్నారని, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. ఇవే విషయాలపై టీవీ 5, ఏబీఎన్‌లకు చెందిన వారితో ఏ ఉద్దేశంతో సంప్రదింపులు, సమావేశాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది. ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా, శాంతి భద్రతల సమస్యలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టేలా, కుల, మత, వర్గాలను టార్గెట్ చేసుకుని మీరు నిర్వహించే వీడియో ప్రసంగాలకు, వ్యంగ్య వ్యాఖ్యలకు టీవీ 5, ఏబీఎన్‌లు ఎందుకు సహకరించాయని ప్రశ్నించారు. ప్రభుత్వంపై, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిపై మీరు విషం చిమ్మేందుకు టీవీ 5, ఏబీఎన్‌లు ప్రత్యేక స్లాట్లు కేటాయించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఒక పథకం ప్రకారం ఉద్రిక్తతలకు పురిగొల్పే కుట్రతో వ్యవహరిస్తున్న మీకు ఎవరి నుంచి సహకారం అందుతోందని, ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారని, ఇలా చేయడం వెనుక ఇంకా ఎవరున్నారు? తదితర విషయాలపై సీఐడీ అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. -
Raghu Rama Krishna Raju: ఏం గాయాలో తేల్చండి
సాక్షి, గుంటూరు, అమరావతి: తనను సీఐడీ పోలీసులు కొట్టారని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు మెజిస్ట్రేట్ కోర్టులో చెప్పడంతో, ఆ గాయాల నిగ్గు తేల్చేందుకు హైకోర్టు శనివారం మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరుస్తూ, ఓ సామాజికవర్గం, ఓ మతాన్ని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, ఉద్రిక్తతలు రెచ్చగొడుతుండటంతో ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ పోలీసులు శుక్రవారం సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురవ్వడంతో సీఐడీ పోలీసులు ఆయన్ను శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుంటూరు సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన తనను పోలీసులు కొట్టారని చెప్పడంతో, ఆ విషయాన్ని వివరిస్తూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణ హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖను హెబియస్ కార్పస్ పిటిషన్‌గా పరిగణించాలని కోరారు. ఈ లేఖపై న్యాయమూర్తులు జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, పార్లమెంట్ సభ్యుడినే కొడితే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటన్నారు. మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ శనివారం రఘురామకృష్ణరాజు స్టేట్మెంట్ రికార్డ్ చేశారని తెలిపారు. హైకోర్టు ఆయన గాయాలను పరిశీలించాలని కోరారు. గాయాల పరిశీలనకు మెడికల్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, అందువల్ల తాము పరిశీలించాల్సిన అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. గాయాల వెనుక వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు ముగ్గురు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, సూపరింటెండెంట్ సిఫారసు చేసే మరో డాక్టర్‌తో మెడికల్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ పోలీసులు తక్షణమే రఘురామకృష్ణరాజును మెడికల్ బోర్డు ముందు హాజరు పరచాలంది. గాయాల పరిశీలన ప్రక్రియను మొత్తం వీడియోగ్రఫీ చేయాలని మెడికల్ బోర్డును ఆదేశించింది. అవన్నీ అసత్య ఆరోపణలు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని ధర్మాసనం ఈ విషయమై వివరణ కోరింది. ఆదినారాయణరావు ఆరోపణలను సుధాకర్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. సీఐడీ పోలీసులు కొట్టారనడం శుద్ద అబద్ధమని చెప్పారు. ఉదయం హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగా ఆయన ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అసత్య ఆరోపణలతో కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని వివరించారు. మధ్యాహ్నం ఎంపీ కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చారని, అప్పటి వరకు రఘురామ బాగానే ఉన్నారని, ఆ తర్వాతే సీఐడీ పోలీసులు కొట్టారన్న నాటకాన్ని తెరపైకి తెచ్చారని తెలిపారు. డాక్టర్ పరిశీలించాకే అతన్ని కోర్టు ముందు హాజరు పరిచామని, అప్పుడు ఎలాంటి గాయాలు లేవన్నారు. ధర్మాసనం స్పందిస్తూ ఆ గాయాలు తాజావని తేలితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని వ్యాఖ్యానించింది. రఘురామ భద్రతా సిబ్బందిని ఆస్పత్రిలోకి అనుమతించాల్సిన అవసరం లేదని చెప్పింది. అనంతరం ధర్మాసనం రిమాండ్ రిపోర్ట్ గురించి ఆరా తీసింది. అరెస్ట్‌కు స్పీకర్ అనుమతి లేదన్న కారణంతో రిమాండ్ రిపోర్ట్‌ను కింది కోర్టు తిరస్కరించిందని ఆదినారాయణరావు చెప్పారు. స్పీకర్‌కు ఇప్పటికే అరెస్ట్ గురించి సమాచారం ఇచ్చామని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తదుపరి విచారణను ఆదివారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. హైకోర్టులో చుక్కెదురు నర్సాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజు బెయిల్ కోసం హౌస్ మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం మొదట కింది కోర్టులో పిటిషన్ వేసుకోకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడంపై అభ్యంతరం తెలిపింది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి కంచిరెడ్డి సురేశ్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రఘురామకృష్ణరాజును వెంటనే మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచాలని సీఐడీ పోలీసులను మౌఖికంగా ఆదేశించారు. తగిన వైద్య సాయం కూడా అందించాలని సూచించారు. దీనికి ఎంపీ తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు స్పందిస్తూ, ముందు కింది కోర్టుకెళ్లడం తప్పనిసరన్న నిబంధన ఏదీ లేదన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ కింది కోర్టులో బెయిల్ పిటిషన్ వేయకుండా నేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారించిన దాఖలా ఒక్కటి కూడా లేదన్నారు. ఈ పిటిషన్‌ను అనుమతిస్తే, హైకోర్టులో పిటిషన్ల వరద మొదలవుతుందని తెలిపారు. సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదన్నారు. ఎంపీని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచలేదని, రిమాండ్ లేకుండా బెయిల్ పిటిషన్ దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 437, 438 ప్రకారం దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి ఎంత మాత్రం విచారణార్హత లేదని వివరించారు. ఈ సందర్భంగా హైకోర్టు, సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పులను సుధాకర్‌రెడ్డి ఉదహరించారు. ఇద్దరి వాదనలు విన్న న్యాయమూర్తి, ఉత్తర్వులు జారీ చేస్తూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో కోర్టు సంతృప్తికరంగా లేదని స్పష్టం చేశారు. కింది కోర్టు బెయిల్ రద్దు చేసినప్పుడు దానిని సవాలు చేస్తూ బెయిల్ కోసం దాఖలు చేసే వ్యాజ్యాలనే వెకేషన్ కోర్టులో విచారిస్తారన్నారు. ఇక్కడ చెప్పుకున్న విషయాలన్నింటినీ సెషన్స్ కోర్టులో చెప్పుకోవాలని తేల్చి చెబుతూ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 14 రోజుల రిమాండ్ నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుకు గుంటూరు సీఐడీ కోర్టు ఈ నెల 28వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శనివారం సాయంత్రం సీఐడీ పోలీసులు ఆయన్ను గుంటూరులోని జిల్లా కోర్టు ప్రాంగణంలో గల ఆరవ అదనపు, గుంటూరు సీబీసీఐడీ కోర్టు జడ్జి కె.అరుణ ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, వైద్య సాయం అవసరమని, పోలీసులు తనను కొట్టారని రఘురామకృష్ణరాజు న్యాయమూర్తికి తెలిపారు. ఈ నేపథ్యంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, రమేష్ ఆసుపత్రిల్లో వైద్యులు పరీక్షించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎంపీకి ఉన్న ‘వై’ కేటగిరీ భద్రత నడుమే వైద్యుల పరీక్ష ప్రక్రియ కొనసాగాలని పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్, రమేష్ ఆసుపత్రి యాజమాన్యం వైద్య పరీక్షల రిపోర్టును కోర్టుకు సమర్పించాలని సూచించారు. అంతకు ముందు హైకోర్టు ఆయన బెయిల్ పిటిషన్‌ను రద్దు చేయడంతో సీఐడీ కార్యాలయానికి వచ్చిన వైద్యుల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించింది. అనంతరం రఘురామకృష్ణరాజును కోర్టుకు తరలించారు. రిమాండ్ రిపోర్టులో సాంకేతిక తప్పిదాలు ఉండటంతో వాటిని సరిచేయాలని కోర్టు సీఐడీ అధికారులకు సూచించింది. ఆ తప్పిదాలను సరిచేసి, తిరిగి సీఐడీ అధికారులు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. హావభావాలతో రక్తికట్టించిన రఘురామ సీఐడీ పోలీసుల అదుపులో ఉన్నంత వరకు ఎంపీ రఘురామకృష్ణరాజు మామూలుగానే ఉన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎంపీ కోసం కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన ఆహారాన్ని, మందులను పోలీసులు లోనికి అనుమతించారు. శుక్రవారం రాత్రి నుంచి రిమాండ్‌కు తరలించేవరకు వైద్యుడిని ఆయనకు అందుబాటులో ఉంచారు. అయితే హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు రద్దు చేసిందని తెలిశాక సీఐడీ కోర్టులో ఒక్కసారిగా కొత్త డ్రామాకు రఘురామకృష్ణరాజు తెరతీశారని విమర్శలు వినిపిస్తున్నాయి. తనను పోలీసులు కొట్టారని హావభావాలతో డ్రామాను రక్తి కట్టించి కోర్టును సైతం తప్పుదోవ పట్టించేందుకు పూనుకున్నాడని పలువురు న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసింగ్‌లోనూ మార్పులు వచ్చాయి. కరుడుగట్టిన నేరస్తులపై సైతం పోలీసులు చేయి చేసుకోవడం లేదు. అలాంటిది పార్లమెంట్ సభ్యుడు అయిన తనను పోలీసులు కొట్టారని రఘురామ చెప్పడం సర్వత్రా అనుమానాలకు తావిస్తోంది. తన కాళ్లపై లాఠీలతో కొట్టడం వల్ల కాళ్లు కందిపోయి, గాయాలయ్యాయని, నడవలేకపోతున్నానని ఎంపీ కోర్టులో తెలిపారు. సోరియాసిస్ వ్యాధితో బాధ పడుతున్నందున ఆయన అరికాళ్లలో ఎర్రగా బొబ్బలు వచ్చినట్లు తెలిసింది. జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు సీఐడీ కోర్టు ఆదేశాల మేరకు శనివారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం ఎంపీ రఘురామకృష్ణరాజును గుంటూరు జీజీహెచ్‌కు పోలీసులు తరలించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, ఆర్ఎంవో డాక్టర్ సతీష్‌ల ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం ఎంపీకి వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ డీఐజీ సునీల్‌కుమార్ నాయక్, గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి జీజీహెచ్‌ను సందర్శించారు. బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో కొత్త కథ.. సీఐడీ పోలీసులు ఎంపీ రఘురామను కొట్టారనడం శుద్ద అబద్ధం. ఉదయం హైకోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో ఒత్తిడి తీసుకొచ్చే ఎత్తుగడలో భాగంగా ఆయన ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారు. మధ్యాహ్నం కుటుంబ సభ్యులు భోజనం తీసుకొచ్చినప్పుడు కూడా రఘురామ బాగానే ఉన్నారు. ఆ తర్వాతే సీఐడీ పోలీసులు కొట్టారన్న నాటకాన్ని తెరపైకి తెచ్చారు. డాక్టర్ పరిశీలించాకే అతన్ని కోర్టు ముందు హాజరు పరిచాం. అప్పుడు ఎలాంటి గాయాలు లేవు. – అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి -
కఠిన చర్యలు తీసుకోవాలి
పెనుగొండ: నరసాపురం పార్లమెంట్ సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. శుక్రవారం ఎంపీ అరెస్ట్‌పై పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండలో మంత్రి స్పందిస్తూ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన కేసులోనే కాకుండా, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో నమోదైన కేసుల్లోనూ పోలీసులు విచారణ చేయాలన్నారు. స్థానికంగా ఎంపీపై పలు కేసులు నమోదు అయ్యాయని గుర్తు చేశారు. గెలిపించిన పార్లమెంటు ప్రజలను 13 నెలలుగా వదిలేసి.. ఢిల్లీ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారన్నారు. కరోనా కష్టకాలంలోనూ సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూంటే, ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగేలా ఎంపీ వ్యాఖ్యలు చేయడం దారుణం అన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీగా గెలిచి సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ పార్టీ పరువు తీసేలా ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ► వ్యక్తిగతంగా మా మీద ఎన్ని నిందలు మోపినా, ఎంత దిగజారి అసత్యాలు ప్రచారం చేసినా మేం సహించాం, భరించాం. ► ఈ రోజు రఘురామకృష్ణరాజు అరెస్టుకు.. మా పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది సీఐడీ పోలీసులు ప్రాథమిక విచారణ చేసి నమోదు చేసిన ఒక కేసులో జరిగిన అరెస్ట్. ► సీఐడీ ఏం చెప్పిందో వారి స్టేట్మెంట్లోనే ఉంది. ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేలా ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ఆయన చేస్తున్న ప్రసంగాలు.. ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ద్వేషాన్ని పెంచేందుకు ఆయన ప్రయత్నించారని తమకు వచ్చిన సమాచారం మీద విచారణ జరిపి కేసు నమోదు చేశామని, ఆ కేసు ప్రకారమే ఆయన్ను అరెస్టు చేశామని సీఐడీ స్పష్టం చేసింది. ► రాజద్రోహానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయగానే చంద్రబాబునాయుడు, టీవీ5, ఏబీఎన్ ఎంత ప్రేమ ఒలకబోశారో అందరూ చూశారు. -
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
సాక్షి, అమరావతి, హైదరాబాద్: పథకం ప్రకారం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని మణికొండ జాగీర్ గోల్ఫ్‌కోర్సు బౌల్డర్స్‌హిల్స్‌లోని విల్లా నెంబర్ 17లో ఉంటున్న ఆయన నివాసానికి శుక్రవారం వెళ్లిన సీఐడీ బృందం.. అరెస్టు కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులకు సెక్షన్ 50 నోటీసును జారీ చేసింది. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయనకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది తొలుత ఆయన్ను అరెస్టు చేయనీయకుండా వలయంగా అడ్డుపడ్డారు. వారికి సీఐడీ పోలీసులు అరెస్టుకు సంబంధించిన కారణాలు వివరించడంతో వెనక్కి తగ్గారు. ఈ సందర్బంగా రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్, కుటుంబ సభ్యులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు సీఐడీ పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌కు తరలించారు. రఘురామకృష్ణరాజును గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తరలిస్తున్న దృశ్యం తగిన ఆధారాలతోనే.. ఇటీవల ఏపీ రాష్ట్ర ప్రభుత్వంపై, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిపై రఘురామకృష్ణరాజు చేస్తున్న ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలపై ప్రాథమిక విచారణ చేపట్టిన సీఐడీ తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేసింది. ఇటీవల కొన్ని న్యూస్ చానల్స్, కొందరు వ్యక్తుల ప్రోద్బలంతో రఘురామకృష్ణరాజు రోజువారీగా వీడియో ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలను చేస్తున్నట్టు గుర్తించిన ఏపీ సీఐడీ అదనపు డీజీ పీవీ సునీల్‌కుమార్ ప్రాథమిక దర్యాప్తునకు ఆదేశించారు. ‘పథకం ప్రకారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వంపై కొన్ని వర్గాలను రెచ్చగొట్టేందుకు, కొన్ని సామాజిక వర్గాలను పురిగొల్పేందుకు ఆయన వ్యాఖ్యానాలు చేశారు. కొన్ని సామాజిక వర్గాలను, వ్యక్తులను కించపరిచేలా మాట్లాడారు. రోజువారీ వీడియో ఉపన్యాసాల ద్వారా పథకం ప్రకారం పలు సామాజిక వర్గాల్లో అభద్రత, ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారు. ప్రభుత్వ ముఖ్యులపై, ప్రభుత్వంపైన కించ పరిచే విమర్శలు చేయడంతోపాటు ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఉపన్యాసాలు, హావభావాలు ప్రభుత్వంపై ద్వేషం పెంచేలా, ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని చులకన చేసి మాట్లాడటం చేస్తున్నారు. పథకం ప్రకారం ప్రభుత్వంపై వరుసగా వీడియో ఉపన్యాసాలు చేస్తున్నారు. తద్వారా సామాజిక వర్గాలు, ప్రజల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు’ అని ఈ విచారణలో స్పష్టమైంది. ప్రాథమికంగా లభించిన ఈ ఆధారాలతో సీఐడీ ఏడీజీ పీవీ సునీల్ కుమార్ ఆదేశాలతో రఘురామకృష్ణరాజుపై కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు 124(ఎ), సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు 153(ఎ), బెదిరింపులకు పాల్పడటం 505, కుట్ర పూరిత నేరం 120(బి) సెక్షన్లపై కేసు నమోదైంది. ఈ కేసులో రఘురామకృష్ణరాజును అరెస్టు చేశామని, కోర్టుకు తరలిస్తామని సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్ తెలిపారు. కాగా, శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఆయన్ను గుంటూరులోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి తరలించారు. అనంతరం అదనపు డీజీ సునీల్‌కుమార్ అక్కడికి చేరుకున్నారు. పుట్టిన రోజునే అరెస్టు చేశారు ‘మా నాన్నను పుట్టిన రోజు నాడు అరెస్టు చేయడం అన్యాయం’ అని రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ ఆరోపించారు. నాలుగు నెలల క్రితమే ఆయనకు బైపాస్ సర్జరీ అయ్యిందని, ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదని అన్నారు. -
రఘురామకృష్ణరాజుపై మరో ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్ : ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైదరాబాద్‌లో మరో ఫిర్యాదు నమోదైంది. ఆయనపై ఓసీ సంక్షేమ సంఘం మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ‘‘కులం పేరుతో రెడ్లను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. కులాలు, వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా, టీవీ ఛానళ్లలో కులాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు’’ అని ఓసీ సంక్షేమ సంఘం ఫిర్యాదులో పేర్కొంది. రఘురామకృష్ణరాజుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆ సంఘం కోరింది. కాగా, ఎంపీ రఘురామను ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఆయనపై 124(A) ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు, 153(B) వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, 505 IPC బెదిరింపులకు పాల్పడటం, 120(B) కుట్రపూరిత నేరం సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ మేరకు కుటుంబసభ్యులకు నోటీసులు అందజేసింది. అనంతరం ఆయన్ని మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించింది. చదవండి : ‘రఘురామను అరెస్ట్ చేయటంలో ఎలాంటి తప్పులేదు’ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ -
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్
-
ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఆయనపై 124(A) ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు, 153(B) వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, 505 IPC బెదిరింపులకు పాల్పడటం, 120(B) కుట్రపూరిత నేరం సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ మేరకు కుటుంబసభ్యులకు నోటీసులు అందజేసింది. అనంతరం ఆయన్ని మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. రఘురామ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు: సీఐడీ ఎంపీ రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాం. వర్గాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. న్యూస్ ఛానళ్లు, వ్యక్తులతో కలిసి విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. 124(A), 153(A), 505 IPC, R/W 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం. -
ఎంపీ రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు
సాక్షి, అమరావతి: నరసాపురం ఎంపీ కనుమూరు రఘురామకృష్ణరాజుపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసినందుకు ఆయనపై ఇటీవల సీబీఐ కేసు నమోదు చేసి ఏకకాలంలో ఆయన ఆఫీసు, ఇళ్లపైన సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఫోర్జరీ పత్రాలతో బ్యాంకులకు టోకరా వేసినందుకు సీబీఐ కేసు నమోదు చేసింది. పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో రూ.237.84 కోట్ల రుణం తీసుకుని మోసం చేసినట్టు చెన్నై ఎస్బీఐ డీజీఎం ఎస్.రవిచంద్రన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ ఎస్పీ అశోక్‌కుమార్ కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ వివరాలను సీబీఐ కార్యాలయం గురువారం విడుదల చేసింది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్న ఆయన భార్య, కుమార్తె, ఇంకా పలువురిపై కేసు నమోదైంది. తమిళనాడులోని తూత్తుకూడిలో ఇండ్ భారత్ పవర్ జెన్‌కం లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు పేరుతో ఫోర్జరీ పత్రాలు పెట్టి రుణంగా పొందిన రూ.237.84 కోట్ల మొత్తాన్ని పక్కదారి పట్టించినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. రఘురామకృష్ణరాజుతోపాటు కంపెనీ డైరెక్టర్లపై ఐపీసీ 120బి రెడ్ విత్ 420, 467, 468, 471తోపాటు పీసీ యాక్ట్–1988 ప్రకారం పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఆయన బ్యాంకులను మోసం చేయాలనే ఉద్దేశపూర్వకమైన నేర స్వభావంతోనే పథకం ప్రకారం ఫోర్జరీ పత్రాలతో కోట్లాది రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా పొందినట్టు సీబీఐ పేర్కొంది. ఈ కేసులో ఎంపీ రఘురామకృష్ణరాజు, కనుమూరు రమాదేవి, కనుమూరు ఇందిరా ప్రియదర్శిని, అంబేద్కర్ రాజ్‌కుమార్ గంటా, దుంపల మధుసూదనరెడ్డి, నారాయణప్రసాద్ భాగవతుల, రామచంద్ర అయ్యర్ బాలకృష్ణ.. మరికొందరిని నిందితులుగా సీబీఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. చదవండి: ‘చంద్రబాబు డైరెక్షన్లో రఘురామ కృష్ణంరాజు’ -
పిట్టకథలు, జోస్యం చెప్పుకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ: నియోజకవర్గానికి కూడా వెళ్ల లేక ఢిల్లీలోనే కూర్చుంటున్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సాయంత్రం పూట పిట్టకథలు, జోస్యం చెప్పుకోవచ్చని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ హితవు పలికారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం ఎక్కడుందో తెలియని వ్యక్తి ఇతరుల గురించి జోస్యం చెప్ప డం కన్నా తన భవిష్యత్తు తెలుసుకోవడం మంచిదన్నారు. ఢిల్లీలో ఏపీ భవన్ వద్ద శుక్రవారం ఎంపీ సురేశ్ మీడియాతో మాట్లాడా రు. ‘రాజధాని ప్రాంతంలో ఏమున్నాయో తెలియని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తుంటే జాలి వేస్తోంది. చేసిన తప్పులకు అడ్డదారిలో స్టేలు తెచ్చుకొన్నప్పటికీ నియోజకవర్గానికి వెళ్లడానికి భయపడుతున్నారు. సాయంత్రం వేళ చిలక, పేకముక్కలతో జ్యోతిష్యం చెప్పుకో వచ్చు. దళితులు ఎవరితోనూ మాట్లాడకూడ దంటున్న ఆ వ్యక్తికి అసలు మానవత్వం, విలు వలు ఉన్నాయా? పతనానికి ముందు గర్వం నడుస్తుందన్న మాటలు ఆ వ్యక్తికే సరిగ్గా సరిపో తాయి. అమరావతిలో భూములు కొల్లగొట్టిన దాంట్లో ఆయన పాత్ర ఉందేమో అన్న అను మానం వస్తోంది..’ అని సురేశ్ పేర్కొన్నారు. -
నియోజకవర్గానికి వెళితే ప్రజల విలువ తెలుస్తుంది
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో చెట్ల కింద కూర్చొని ప్రజలకు సిగ్గులేదంటూ పాటలు పాడేవారికి ప్రజల విలువ తెలియదని, నియో జకవర్గానికి వెళితే ప్రజల విలువ తెలుస్తుందని వైఎస్సార్సీపీ ఎంపీలు నందిగం సురేష్, రెడ్డెప్ప వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో మంగళవారం వారు మీడియాతో మాట్లాడారు. దొంగలా బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టి టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తనకేదో అయిపోయినట్లు భావించే వారికి త్వరలోనే బుద్ధి చెబుతామన్నారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిన మోసాలు, అక్ర మాలకు నోటీసులు ఇస్తే రఘురామకృష్ణరాజు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశా రు. వీధికుక్కలా మొరిగేవారిని మీడియా పట్టిం చుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు ఎప్పు డు జైలుకు వెళ్తారా? పగ్గాలు అందుకుందామని లోకేశ్ ఆరాటపడుతున్నట్లుగా ఉందన్నారు. రఘురామకృష్ణరాజుకు ఢిల్లీ నడిబొడ్డున సమా ధానం చెప్పగలమన్నారు. కుప్పంలో గెలుస్తా మని చెప్పి గెలిచామని మరోసారి ఎన్నికలు వస్తే ప్రస్తుతం కన్నా ఎక్కువ శాతం సీట్లతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
‘రఘురామ కృష్ణంరాజు ముక్కు నేలకు రాయాలి’
సాక్షి, తాడేపల్లి: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు అహంకారంతో మాట్లాడుతున్నారని, దళితులంటే ఆయనకు చిన్నచూపు అని పేర్కొన్నారు. సెక్యూరిటీతో తనను కాల్చి చంపిస్తానని బెదిరించాడని నందిగం సురేష్ ఆరోపించారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై ఎస్పీ కమిషన్ మెంబర్ రాములుకు ఫిర్యాదు చేశానని తెలిపారు. రఘురామ కృష్ణంరాజు ఒక నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి అని సురేష్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీలో గెలిచి ప్రతిపక్షానికి సహకరిస్తున్నారని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చెప్పులు కుట్టుకునేవారమని దళిత జాతిపై అసూయ ద్వేషంతో రగులుతూ రఘురామకృష్ణంరాజు కామెంట్లు చేశారు. దళితులు ఓట్లు వేస్తేనే రఘురామ కృష్ణంరాజు ఎంపీ అయ్యారు. ఆయన ఆకాశం నుంచి ఊడి పడలేదు. తన సెక్యూరిటీతో తోలు వలిపిస్తాను, కాల్చేయిస్తాను అని రఘురామకృష్ణంరాజు మాట్లాడారు. నీకు సెక్యూరిటీ ఇచ్చింది ఎదుటివారి తోలు వలిపించడానికి కాదు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రఘురామ కృష్ణం రాజుపై ఎస్సీ కమిషన్ కేసు పెడతామని చెప్పింది. ఎంపీ రఘురామకృష్ణం రాజు సెక్యూరిటీ తొలగించాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తాం. (చదవండి: శాఖ బాబుది.. సంతకం చినబాబుది) ఆయనకు సెక్యూరిటీ తొలగించే అంతవరకు మా పోరాటం ఆగదు. ఆయన నియోజకవర్గంలో దళితులు ఆయనకు ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. కడపలో పదివేల మందితో మీటింగ్ పెడతానని రఘురామ కృష్ణంరాజు చెప్తున్నారు. ఆయన ముక్కును నేలకు రాసి పార్లమెంటులో అడుగు పెట్టాలి. ఢిల్లీలో సిగ్గు విడిచి తిరుగుతోన్న వ్యక్తి రఘురామకృష్ణంరాజు. మేము ఎప్పుడూ ఎవరినీ మోసం చేయలేదు నిజాయితీగా బతుకుతున్నాం. ఆయన బ్యాంకులకు అప్పులు ఎగ్గొట్టి, బ్యాంకు లూటీ చేసి ఆస్తులు సంపాదించాడు. త్వరలోనే తిరిగి నీవు వాస్తవ పరిస్థితికి వస్తావు. ఆయనకు బుద్ది చెప్పేందుకు దళిత సంఘాలు సిద్దంగా ఉన్నాయి’అని ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. (చదవండి: ‘ఒక్క స్టే ఎత్తివేసినా.. చంద్రబాబు జైలుకు వెళ్లడం ఖాయం’) -
‘ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్చాలి’
సాక్షి,న్యూఢిల్లీ: నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణం రాజు పశువు కంటే హీనంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించాలని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పాల్గొన్న ఎంపీ సురేశ్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘బ్యాంకులకు ఎగనామం పెట్టిన చరిత్ర నీది. మెప్పుకోసం పార్లమెంట్లో వాళ్ల కాళ్లు, వీళ్ల కాళ్లు పట్టుకునే వ్యక్తివి నువ్వు’అని పేర్కొన్నారు. -
‘ఉన్మాది, ఉగ్రవాదిలా వ్యాఖ్యలు చేస్తున్నారు’
సాక్షి, పశ్చిమ గోదావరి : నర్సాపురం పార్లమెంట్ ఓటర్లు ఎంపీ రఘురామ కృష్ణంరాజును మర్చిపోయారని తణుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. కరోనా మొదలు ఇప్పటి వరకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పర్యటించలేదని, వరదల సమయంలోను ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినిరంతరం శ్రమిస్తున్నారన్నారు. కరోనా కట్టడి చర్యలో భాగంగా ఎవరి ఇంటిలో వారు వినాయకచవితి చేసుకోవాలని సూచిస్తే దానిని రఘురామ కృష్ణంరాజు వక్రీకరిస్తున్నారని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘హైదరాబాద్.. ఢిల్లీలో ఉంటే ఏం తెలుస్తుంది’) పార్టీలు,మతాలకతీతంగా వైఎస్ జగన్ పాలన చేస్తుంటే ఆయనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హిందుదేవాలయాలు కూల్చి వేస్తే ఆనాడు బిజేపిలో ఉన్న రాఘురామ కృష్ణం రాజు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ఉన్మాది, ఉగ్రవాదిలాగా వ్యాఖ్యలు చేస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నావని విమర్శించారు. పుష్కరాలలో అంతమంది చనిపోతే ఎందుకు మాట్లాడలేదని, కులాలా మధ్య, మతాల మధ్య చిచ్చు పెడితే తనను కేంద్రమే జైలుకు పంపిస్తుందని నాగేశ్వరరావు హెచ్చరించారు. (ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై సోము సెటైర్లు) -
‘చంద్రబాబు డైరెక్షన్లో రఘురామ కృష్ణంరాజు’
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శుక్రవారం దర్శించుకున్నారు. వేకువజామున అభిషేకం సేవలో కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులు సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కరోనా దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలు ఇంటికే పరిమితం కావాలని సూచించాయని ఆయన పేర్కొన్నారు.(విశాఖ ఇమేజ్ దెబ్బతీయడమే చంద్రబాబు ఆలోచన) ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి వెల్లంపల్లి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘వైఎస్సార్ కుటుంబాన్ని ఏ ఒక్క కులానికో, మతానికో అంటకడుతున్నారు. ఢిల్లీలో కూర్చుని రఘురామ కృష్ణంరాజు.. హైదరాబాద్‌లో చంద్రబాబు.. నీచ రాజకీయాలు చేస్తున్నారు. విగ్రహాలు వీధుల్లో పెట్టరాదనే నిర్ణయానికి ముందు అన్ని పార్టీలు, మఠాధిపతులు, పీఠాధిపతులతో మాట్లాడామన్నారు. రఘురామ కృష్ణంరాజు గత ఐదు నెలలుగా ఇంత వరకు ఆయన నియోజకవర్గానికి రాలేదు. నియోజకవర్గం పై అంత ప్రేమ ఉంటే ఎందుకు అక్కడ చవితి వేడుకల్లో పాల్గొనలేదని’’ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేస్తూ.. చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజును ఘాటుగా ఆయన విమర్శించారు. -
వైఎస్ జగన్ చరిష్మాతోనే గెలిచాం..
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ చరిష్మాతోనే అందరం గెలిచామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెప్పారు. ఎంపీ రాఘురామకృష్ణరాజు వ్యాఖ్యలను ఖండిస్తూ విజయవాడలో మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యేలు కొట్టు సత్యనారాయణ, గ్రంధి శ్రీనివాస్, కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాద్‌రాజు మీడియాతో మాట్లాడారు. ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా వైఎస్ జగన్ ఫొటో పెట్టుకోవడం వల్లే గెలిచినట్టు తెలిపారు. అన్ని సామాజికవర్గాలనూ సీఎం సమానంగా చూస్తున్నారని వారు స్పష్టం చేశారు. రాఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, ఆయనకు రాజకీయ నాయకుడి లక్షణాలు లేవన్నారు. టికెట్ కోసం మూడు పార్టీలు మారారని దుయ్యబట్టారు. జగన్‌పై ఉన్న గౌరవంతోనే వైఎస్సార్సీపీలో చేరా : ఎంపీ రఘురామకృష్ణరాజు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న గౌరవంతో వైఎస్సార్సీపీలో చేరానని ఎంపీ రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆయన మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తన గురించి మాట్లాడిన విషయాల్లో ఏమాత్రం వాస్తవాలు లేవన్నారు. అందరం రాజీనామా చేసి ఎన్నికలకు వెళదామని, ఎవరి బొమ్మకు ఎంత సత్తా ఉందో తేలుతుందని ఆయన చెప్పారు. -
‘మూడు రాజధానులను స్వాగతిస్తున్నాం’
సాక్షి, నరసాపురం: మూడు రాజధానుల ప్రతిపాదనపై అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, జనవరి 20న అసెంబ్లీలో చర్చించిన తర్వాతే నిర్ణయం ఉంటుందని ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరైన నిర్ణయం తీసుకుంటారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఒకవేళ అధికార వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానులు ఏర్పడినా అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు నష్టం జరగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని ఆయన చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా మండలం కొప్పర్రు గ్రామంలో రూ.1.20 కోట్లతో నిర్మించే డ్రైన్ నిర్మాణ పనులకు శనివారం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. స్వాగతిస్తున్నా: కోటగిరి శ్రీధర్ మూడు రాజధానుల ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రకటించారు. జంగారెడ్డిగూడెంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది ఒక వర్గానికో, ప్రాంతానికో పరిమితం కాకూడదని అన్నారు. రూ.300 కోట్లతో కొల్లేరు ప్రాంతంలో రెగ్యులేటర్స్, 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్ ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లే యోచనలో ఉన్నట్టు చెప్పారు. పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. -
ఘనంగా జాషువా జయంతి
-
ఏపీ సీఎంవోలో గుర్రం జాషువా జయంతి వేడుకలు
సాక్షి, విజయవాడ : గుర్రం జాషువా 124వ జయంతి వేడుకలను ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంప్ కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యేలు మెరుగ నాగార్జున, రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తదితరులు హాజరై గుర్రం జాషువాకు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సాహితివేత్తలు కత్తి పద్మారావు, బోయి హైమావతి, గుజ్జర్లమూడి కృపాచారి, చందు సుబ్బారావులకు పురస్కారాలను ప్రధానం చేశారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. జాషువా రచనలను వారు ప్రస్తుతించారు. ఆయన సామాజిక చైతన్యం కోసం నడుం కట్టి నేటి తరం కవులకు ఆదర్శప్రాయంగా నిలిచారని వక్తలు ప్రశంసించారు. దళిత సాహిత్యం, చైతన్య వంతమైన సాహిత్యానికి జాషువా పెట్టింది పేరని వారన్నారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని వక్తలు కొనియాడారు. భగత్‌సింగ్‌కు నివాళుర్పించిన జగన్.. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం ట్విటర్ వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘నేడు నిజమైన హీరో జన్మించిన రోజు.. స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటీకి మరవలేనివి, అలోచనలకు మరణం లేదని నిరుపించిన వ్యక్తి భగత్ సింగ్ ఆయనకు నా ఘన నివాళి’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మహిళా హస్త కళా సదస్సు ప్రారంభం
సాక్షి, పశ్చిమగోదావరి: పోడూరు మండలం జిన్నూరులో వైఎస్సార్సీపీ, ఎల్ఆర్డిఏ సంస్థ ఆధ్వర్యంలో మహిళా హస్త కళా సదస్సు శనివారం ప్రారంభమయింది. ఈ కార్యక్రమంలో జాబ్‌మేళాను ఎంపీ రఘు రామకృష్ణంరాజు ప్రారంభించగా... లెస్ పార్కు, మహిళా శిక్షణా తరగతులను పాలకొల్లు ఇంచార్జి కవురు శ్రీనివాస్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గుంటూరి వాణి పెద్దిరాజు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లెం ఆనంద్ ప్రకాష్, చిలువూరి కుమార దత్త్ర్యాయ వర్మ, యడ్ల తాతాజీ, సొసైటీ అధ్యక్షుడు డీటీడీసీ బాబు పాల్గొన్నారు. -
టీడీపీకి షాకిచ్చిన నేతలు
సాక్షి, పశ్చిమ గోదావరి : ఉండి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. పాలకోడేరు మండలంలో టీడీపీకి చెందిన వేండ్ర చంటిరాజు, శృంగవృక్షం బుజ్జిరాజు ,గొరగణమూడి పాపారావు,గరగనర్రు రాము తదితరులు వైసీపీలో చేరారు. ఉండి వైసీపీ కన్వీనర్ పి.వి.ఎల్ నరసింహరాజు ఆధ్వర్యంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథ రాజు, ఎంపీ రఘురామ కృష్ణంరాజు సమక్షంలో దాదాపు నాలుగు వేల మంది కార్యకర్తలతో కలిసి చేరారు . కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. -
ఫ్రస్ట్రేషన్ వల్లే ఇలా చేస్తారు : కేఏ పాల్
సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిపై రఘురామకృష్ణం రాజుపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామకృష్ణం రాజుపై దాడి చేయడం.. హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఏ పాల్ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. ఓటమి భయం పట్టుకుంటేనే ఇలాంటి దాడులు చేస్తారని ఫ్రస్ట్రేషన్ వల్లే ఇలా ప్రవర్తిస్తారని దుయ్యబట్టారు. సంప్రదింపులు, చర్చలు చేసుకోవాలి తప్పా భౌతిక దాడులు సత్సంప్రదాయం కాదని సూచించారు. ఇటీవలె కొత్తాడ గ్రామంలో రఘురామకృష్ణంరాజుపై కొందరు యువకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడిలో ఆయన కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. సకాలంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది స్పందించి యువకులను చెదరగొట్టడంతో రఘురామ కృష్ణం రాజుకు ముప్పు తప్పింది. ఈ దాడి నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చదవండి.. నాగబాబు ట్వీట్‌పై అనుమానాలు : రఘురామ కృష్ణంరాజు -
‘నాగబాబు ట్వీట్‌పై అనుమానాలు’
సాక్షి, పశ్చిమగోదావరి : తనపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేయకముందే నర్సాపురం జనసేన అభ్యర్థి నాగబాబు ట్వీట్ చేయడం అనుమానాలకు తావిస్తోందని వైఎస్సార్సీపీ నర్సాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ నేతలు, సినీ కళాకారులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గురువారం తనపై కొందరు యువకులు దాడి చేశారని, ఈ ఘటనపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయకముందే జనసైనికుల ముసుగులో ఇతర పార్టీల వారు కొందరు విధ్వంస చర్యలకు దిగుతున్నారని, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలంటూ నాగబాబు ఫేస్బుక్లో పోస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నాగబాబు ట్వీట్‌పై అనుమానాలు ఉన్నాయన్నారు. దాడి చేసింది ఏ పార్టీ వారైనా పోలీసులు పట్టుకోవాలని డిమాండ్ చేశారు. పవర్ స్టార్ ప్యాకేజీ స్టార్‌గా మారారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఎద్దేవా చేశారు. ప్యాకేజీల రాజకీయాలు వద్దని, పవన్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ఓట్లు అడుక్కోవాలన్నారు. పశ్చిమ గోదావరి ప్రజలు శాంతి కాముకులు అని తన్నుడు రాజకీయాలు జిల్లాలో వద్దని పవన్‌కు సూచించారు. రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషం రఘురామ కృష్ణంరాజుపై దాడి అమానుషమని వైఎస్సార్సీపీ నాయకుడు, సినీ నటులు పృద్వీ అన్నారు. నాగబాబు, పవన్ లు మాట్లాడే భాష సరికాదన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి, జగన్‌ను ప్రశ్నిస్తున్నప్పుడే జనసేన వైఖరి ఏంటో ప్రజలకు అర్థమవుతుందన్నారు. నటన వేరు, రాజకీయం వేరన్నారు. రాష్ట్రంలో జగన్ సీఎం కావాలని ,రాజన్న రాజ్యం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుత ఎన్నికలతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గురువారం కొత్తాడ గ్రామంలో రఘురామకృష్ణంరాజుపై కొందరు యువకులు రాళ్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. దాడిలో ఆయన కారు అద్దం పూర్తిగా ధ్వంసమైంది. సకాలంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది స్పందించి యువకులను చెదరగొట్టడంతో రఘురామ కృష్ణం రాజుకు ముప్పు తప్పింది. ఈ దాడి నేపథ్యంలో రఘురామ కృష్ణం రాజు భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
జనసంద్రంగా పాలకొల్లు వైఎస్ జగన్ ప్రచార సభ
-
జనసంద్రంగా మారిన పాలకొల్లు
సాక్షి, పాలకొల్లు : ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గురువారంద జనసంద్రంగా మారింది. రాజన్న తనయుడి చూసేందుకు భారీగా జనాలు తరలి వచ్చారు. పాలకొల్లు చేరుకున్న వైఎస్ జగన్‌కు నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘు రామ కృష్ణంరాజు, పాలకొల్లు వైసీపీ అభ్యర్థి డాక్టర్ బాబ్జీ, స్థానిక నేతలు శేషు బాబు, నరసాపురం ఆచంట అభ్యర్థులు ప్రసాద రాజు, రంగనాథ రాజు తదితరులు స్వాగతం పలికారు. మరోవైపు వైఎస్ జగన్ ఏపీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రోజుకు నాలుగు ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్ పర్యటన కొనసాగనుంది. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా నుంచి చింతలపూడి చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు. మధ్యాహ్నం గుంటూరు జిల్లా వినుకొండలో, కృష్ణా జిల్లా నందిగామలోనూ వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ సభల ద్వారా... నవరత్నాల పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే... ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసం చేపట్టే చర్యలను తెలియజేస్తున్నారు. -
ఎప్పుడు వస్తావో చెప్పు నాగబాబు...
సాక్షి, నరసాపురం : జనసేన నేత నాగబాబు ఓటమి భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ..వాపును చూసి బలుపు అనుకోవద్దని, ఎన్నికల రోజు ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలిసిపోతుందని, ప్రజా తీర్పు వచ్చేవరకూ వేచి చూడాలని హితవు పలికారు. ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం కోరుకుంటున్నారని అన్నారు. రఘురామ కృష్ణంరాజు బుధవారమిక్కడ మాట్లాడుతూ...‘ఇంత లావుగా ఉంటే తంతాం...అంటే భయంతో ఇక్కడ చూస్తూ ఊరుకునివారు ఎవరూ లేరు. ఎప్పుడు వస్తావో చెప్పు నాగబాబు, ఛాలెంజ్. నన్ను తంతావో లేదో చూద్దాం రండి. మీరు సినిమాల్లో నటించారుగా... త్వరలోనే పశ్చిమ గోదావరి జిల్లాలో మేము మీకు సినిమా చూపిస్తాం. సొంత ఊరులో లైబ్రరీ పెట్టుకుంటాం అంటే ఉమ్మడి ఆస్తుల పేరుతో అడ్డుకొని అమ్ముకున్న వ్యక్తి నాగబాబు. ఆయన గురించి జిల్లాలో ఎవరికైనా తెలుసు. ఎన్నికల కోసమే మళ్లీ వచ్చారని కూడా ప్రజలకు తెలుసు. విలువల గురించి మీరా మాట్లాడేది? ప్రజా సమస్యలు అంటే ఇవేనా?. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి చాలు. నేను పార్టీలు మారడం కాదు. నా సొంత గూటికి తిరిగి వచ్చాను. నేను ఎప్పుడైనా ఒకదాని తర్వాత ఒక్కటే కండువా వేసుకున్నా. కానీ మీరు ఏడు కండువాలు ఒకేసారి వేసుకుని తిరుగుతున్నారు. సీపీఎం, సీపీఐ, ఏనుగు నడుముకు పచ్చ కండువా చివరికి కేఏ పాల్ కండువా ఇలా ఏడు వేసుకున్నారు. మీ తీరు వల్ల... మీ సోదరులు మీద ఉన్న గౌరవం, పరువు పోతోంది. ఇక మీరు మీ తమ్ముడు పవన్ కులాల మధ్య చిచ్చు పెట్టొద్దు. రెండు రాష్ట్రాల మధ్య శాంతి చెడగొట్టవద్దు. మీరు ప్రశాంతంగా మీ ప్రచారం చేసుకోండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ప్రశాంతమైన జిల్లాలో శాంతిగా ఉండండి.’ అని సూచించారు. -
‘చంద్రబాబువి హత్యా రాజకీయాలు’
-
‘చంద్రబాబువి హత్యా రాజకీయాలు’
సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డిని, సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేశారని అన్నారు. విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగిన అర గంటలోనే డీజీపీ, హోమ్ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అభిమాని దాడి అని చెప్పారు.. వాళ్లు కచ్చితంగా ఎలా చెప్పారు.. పథకం ప్రకారమే తెలిసి చేసినట్లు ఉందన్నారు. చంద్రబాబు కనుసన్నల్లోనే దర్యాప్తు సంస్థలు పని చేస్తున్నాయని, వివేకా హత్యపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయనే రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవన్నారు ప్రకాశం : రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ఒప్పుకున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మనందరెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని అభిప్రాయపడ్డారు. రాష్ట్రపతి పాలనలో ఎన్నికలు జరగాలని డిమాండ్ చేశారు. సిట్ ద్వారా వైఎస్ వివేకా హత్యకుట్ర బయటకు రాదన్నారు. సీబీఐ విచారణ జరపాలన్నారు. వివేకానంద రెడ్డి నాకు ఆప్తులు: రఘురామ కృష్టంరాజు పశ్చిమ గోదావరి: వైఎస్ వివేకానందరెడ్డి తనకు చాలా ఆప్తులని వైఎస్సార్ సీపీ నాయకులు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డిది హత్య అని తెలియగానే విస్మయానికి గురయ్యానన్నారు. చీమకు కూడా అపకారం చెయ్యని వివేకానందరెడ్డిని హత్య చేయడానికి దుర్మార్గులకు చేతులు ఎలా వచ్చాయ్ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డి హత్యను వెంటనే సీబీఐతో దర్యాప్తు చేయించి దోషులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. -
‘ఆయనకు ఓటేస్తే ప్రత్యేక హోదా రాదు’
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఓటు వేస్తే ఏపీకి ప్రత్యేక హోదా రాదని వైఎస్సార్ సీపీ నేత కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల, డీఎన్ఆర్ కళాశాలల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, ఏఎస్ రాజు, మేడిద జాన్సన్, గాదిరాజు సుబ్బరాజు, గూడూరి ఉమాబాల తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాటం చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని స్పష్టం చేశారు. -
వైఎస్ జగన్‌తోనే రాజన్న రాజ్యం సాధ్యం
సాక్షి, పశ్చిమగోదావరి : ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. బహిరంగ సభల్లో జేబులో పర్సు ఉందో లేదో చూసుకున్నట్లు ఇప్పుడు ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నేత ముదునూరి ప్రసాద్‌రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. అంతా కష్టపడి వైఎస్ జగన్‌ను సీఎం చేసుకొని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. -
‘రెండు నెలల్లో వైఎస్ జగన్‌ను సీఎంగా చూస్తాం’
సాక్షి, పశ్చిమ గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాబోయే రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చూస్తామని వైఎస్సార్సీపీ నేత రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కాళ్ళ మండలం పెద అమిరంలో రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో నరసాపురం పార్లమంటరీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముదునూరి ప్రసాదరాజు, కారిమూరి నాగేశ్వరరావు, గుణ్ణం నాగబాబు, గుబ్బల తమ్మయ్య, పాతపాటి సర్రాజు, గూడూరి ఉమాబాల, దాట్ల రంగమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2000 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. తెలుగు యువత సభ్యులు కళ్లేపల్లి సతీష్ రాజు, వాండ్రం సర్పంచ్ గడి గోవిందం, ఎంపీటీసీ నర్సే భారతి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. అనేక మంది తెలుగుదేశం పార్టీ పెద్ద నాయకులు ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకోనున్నారని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున తన సొంత గూటికి వచ్చి మహిళల మధ్య ఆత్మీయ సదస్సు నిర్వహించడం శుభ సూచికమన్నారు. నరసాపురం పార్లమెంట్‌లోని ఏడు నియోజక వర్గాల్లో వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు.