సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఎంపీ రఘురామ కృష్ణరాజుకు వారం రోజుల్లో లోక్‌సభ స్పీకర్ నుంచి నోటీసులు వచ్చే అవకాశముందని రాజమహేంద్రవరం ఎంపీ, లోక్‌సభలో వైఎస్సార్‌సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలుపొందిన రఘురామ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును తెలియజేసే 290 పేజీల డాక్యుమెంట్‌ను పూర్తి సాక్ష్యాధారాలతో స్పీకర్‌కు అందించామని చెప్పారు. కాస్త ఆలస్యమైనా ఆయనపై స్పీకర్ ఓం బిర్లా క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు. తనకున్న విశేష అధికారాన్ని ఉపయోగించి రఘురామ ఎంపీ పదవిని రద్దు చేస్తారన్నారు. భవిష్యత్‌లో ఏ సభ్యుడైనా ఇలా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా రఘురామపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామన్నారు.
త్వరలో రఘురామపై క్రమశిక్షణ చర్యలు
Published Thu, Jul 15 2021 3:52 AM | Last Updated on Thu, Jul 15 2021 3:52 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment