మూడిళ్ళ చుట్టం మూతి ఎండి చచ్చినట్లు అయిందట. మాఇంటికి రాలేదు కదా... వాళ్ళింటికి కదా వచ్చారు.. అక్కడే తింటారులే అని ఈ ఇంటివాళ్ళు... అదేం లేదులే.. అక్కడికి వెళ్ళాడు కదా... తినేసి వస్తాడేమో అని ఆ ఇంటివాళ్ళు మొత్తానికి ఆ చూట్టానికి చుక్కలు చూపించి చివరకు పస్తులు పెట్టారట.. అలా అయ్యేలా ఉంది రఘురామకృష్ణం రాజు పరిస్థితి. బిజెపి... టిడిపి.. ఇలా అన్ని పార్టీల్లో తిరిగేసి. ఎక్కడ నిలువనీడ లేకుండా ఉండిపోయే పరిస్థితుల్లో అయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు.
2019లో వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత ముసుగు తీసి చంద్రబాబు ఏజెంట్ గా మారిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో బాటు ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించడం మొదలెట్టారు. ఇదంతా సహజంగా అటు తెలుగుదేశానికి, దాని మద్దతుదారులయిన మీడియా సంస్థలకు అయన ఒక సోర్స్ గా మారిపోయారు. అయన రోజూ జగన్ మోహన్ రెడ్డిని. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీవీల్లో మాట్లాడడం.. దాని ఆయా సంస్థలు ఘనంగా ప్రచురించడం జరుగుతూ వస్తోంది.
మొదట్లో అయన వ్యాఖ్యలు.. కామెంట్లకు మంచి రేటింగ్స్... వ్యూవర్ షిప్ ఉండేది కానీ నిత్యం జగన్ను తిట్టడమేపనిగా పెట్టుకున్న ఆయన్ను ఇక ప్రజలు చూడడం మానేశారు. అయినా సరే ఆయనకు వేరే గత్యంతరం లేక ఆయా మీడియా సంస్థలను అనధికార రెగ్యులర్ యాంకర్ కమ్. మోడరేటర్ కమ్ సలహాదారు... విశ్లేషకుడుగా మారిపోయారు.
ఈ ఎపిసోడ్లన్నీ ముగిసి ఇప్పుడు ఆయా పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. జనసేన... తెలుగుదేశం.. వైయస్సార్ కాంగ్రెస్.. ... చివరకు ఒక్కసీటు కూడా గెలవని బిజెపి సైతం తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ రఘురామకృష్ణం రాజుకు ఎవరు టికెట్ ఇస్తారన్నది అర్థం కావడం లేదు.
ఆయన్ను ఎవరూ భరించలేరు.. పైగా ఆయనకు సొంత క్యాడర్ లేదు.. ప్రజల్లోనూ ఆదరణ లేదు.. అలాంటపుడు ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే అయన దెబ్బకు ఆ ఎంపీ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు సైతం ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆయన్ను అందరూ ఒక ఐటం క్యారెక్టర్ మాదిరి వాడుకుని పక్కనపడేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది.
కుక్కను శత్రువుమీద మొరగడానికి పెంచుకుంటాం... మనమీద మొరుగుతుంది అనుకుంటే చెప్పుతో కొడతాం అనే సినిమా డైలాగ్ మాదిరి... ఆయన్ను టీడీపీ... దాని అనుబంధ మీడియా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించినంతవరకే మీడియాలో కవరేజి ఇచ్చి ఊరుకుంటారు తప్ప ఆయనకు ఎక్కడా టిక్కెట్ మాత్రం ఇవ్వరు అంటున్నారు.
ఆయనకు నర్సాపురం... లేదా ఇంకోచోట టికెట్ ఇస్తే అయన అసమర్థత.. అహంకారం .. ఇవన్నీ కలగలిసి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతారన్న ఆందోళన ఆయనపార్టీల్లో కనిపిస్తోంది. అందుకే కేవలం ఆయన్ను తమ ఛానెళ్లలో చూపడానికి మాత్రమే వాడుకుని ఎన్నికలు.. టిక్కెట్స్ ఇచ్చేవేళ పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు. ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా టీడీపీ.. జనసేన కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు.
ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత అయన భోగినాడు సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చారు. ఆయనకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో భారీగా భౌన్సర్లను ఆయనే ఏర్పాటు చేసుకుని ఊళ్లోకి వచ్చారు తప్ప ఆయనకోసం ఎక్కడా అభిమానులు. క్యాడర్ ఎదురు చూడలేదు. దీంతో రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనని, కేవలం టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు తప్ప కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకు దక్కదని నరసాపురం ప్రజలు అంటున్నారు.
✍️ సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment