Simmadhirappanna
-
విలువే లేకుండా పోయింది.. ఎందుకీ ఊడిగం!
కూటమి విజయానికి మనమే కారణం అయ్యాం... మనం లేకుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేనా.. ఆయన సీఎం అయ్యేనా.. కాపులంతా గంపగుత్తగా ఓట్లేయకపోతే కూటమికి ఇంత మెజారిటీ ఎలా వస్తుంది.. ఇన్ని సీట్లు ఎలా వస్తాయి..ఈ కూటమి ప్రభుత్వ రథానికి మనమే చక్రాలం..మనమే ఇరుసు..మనమే ఇంధనం కానీ ఇప్పుడు మనం కరివేపాకులం అయిపోయాం. పులుసులో ముక్కలం అయిపోయాం .. మనకు ఎక్కడ విలువ గౌరవం దక్కడం లేదు.దేనికోసం ఇంత త్యాగాలు చేయాలి అంటూ జనసేన ఎమ్మెల్యేలు మదన పడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామి.. అందులో 21 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. వారిలో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ ఈ ముగ్గురికి క్యాబినెట్లో స్థానం దక్కింది.. మిగతా 18 మంది వట్టి ఎమ్మెల్యేలు గానే ఉన్నారు. అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోతుందని జనసేన బాధపడుతుంది.జనసేన ఎమ్మెల్యే కన్నా టిడిపి ఇంచార్జీ మిన్నతాము ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీని ఆ నియోజకవర్గాల్లో టిడిపి ఇన్చార్జిలకే అధికారులు గౌరవిస్తున్నారని వారి మాట వింటున్నారని తమకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని జనసేన ఎమ్మెల్యేలు ఆవేదన చెందుతూ కాసేపటి క్రితం విజయవాడలోని హోటల్లో సమావేశం అయ్యారు. దీనికి నాదెండ్ల మనోహర్ కొందరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మనోహర్ తో ఎమ్మెల్యేలంతా ఈ విషయాన్ని మొరపెట్టుకున్నట్లు తెలిసింది. స్థానికంగా తమ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీని తమ మాటను పోలీసులు రెవెన్యూ పంచాయతీ అధికారులు ఎవరూ వినడం లేదని తెలుగుదేశం వారు చెబితేనే అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని మనోహర్ ఎదుట వాపోయారు.మంత్రులుగా ఉన్న ఆ ముగ్గురికి నియోజకవర్గంలో కాస్త గౌరవం ఉన్నప్పటికీ మిగతా ఎమ్మెల్యేలు ఎవరికి ఇండిపెండెంట్‌గా పని చేసే అవకాశం దక్కడం లేదు. నియోజకవర్గాల పెద్ద పని ఏదైనా ఉంటే ఆ జిల్లా మంత్రి వద్దకు వెళ్లాల్సి వస్తుంది. పైగా ఆ మంత్రి కూడా లోకేష్ కంట్రోల్లో పనిచేస్తున్నారు. లోకేష్ కూడా జనసేన ను పెద్దగా పట్టించుకోకుండా జిల్లాల తన సొంత టీం ఏర్పాటు చేసుకొని ముందుకు సాగుతున్నారు. దీంతో అనివార్యంగా జనసేన నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోతుంది. పలుచోట్ల వ్యాపారాల్లోనూ అక్రమ ఆదాయం తెలుగుదేశం జనసేన మధ్య పోటీ నెలకొన్న తరుణంలో తెలుగుదేశం వారు పలువురు జనసేన కార్యకర్తలను వెంటాడి కొట్టిన ఘటనలు ఉన్నాయి.ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్లు తెలుగుదేశానికి ఊడిగించేయడం కోసమే తమ పార్టీ ఉందా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని తెలుగుదేశం ఇన్చార్జిలకు అధికారులు గౌరవం ఇవ్వడం దానికి ఎంత అవమానం అన్నది ఈ సమావేశంలో వారంతా నాదెండ్ల మనోహర్ కు మొరపెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని తెలుగుదేశం పెద్దలతో మాట్లాడి సెటిల్ చేస్తే జిల్లాలో తమ గౌరవం నిలబడుతుందని అంతిమంగా పార్టీ కూడా బలపడే అవకాశం ఉంటుందని వారు చెప్పుకున్నారు.కానీ జనసేన బలపడాలని తెలుగుదేశం ఏ కోశానా కోరుకోదు. జనసేన బలం తమకు బలం కావాలని తెలుగుదేశం భావిస్తుంది తప్పితే జనసేన సొంతంగా తన కాళ్లపై తన నిలబడి పోటీ చేసే పరిస్థితి వస్తే తెలుగుదేశానికి ఎంత ఇబ్బంది అన్నది చంద్రబాబు లోకేష్ లకు తెలుసు. అందుకే ఎక్కడికి అక్కడ జనసేన నాయకులను కార్యకర్తలను తమ కాళ్ళ కింద పెట్టి ఉంచుతూ ఆయా ప్రాంతాల్లో తెలుగుదేశం క్యాడర్‌ను మాత్రమే గుర్తిస్తూ పనులు పథకాలు పైరవీలు అని వాళ్ల ద్వారా జరిగేలా చూస్తున్నారు.నియోజకవర్గాల్లో పనులు అంటూ జరిగితే తెలుగుదేశం వారి ద్వారానే జరగాలి లేదంటే లేదు. అంతేతప్ప జనసేన నాయకుడికి ఎక్కడా మర్యాద దక్కకూడదు అనే సింగల్ పాయింట్ ఏజెండాతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఇదంతా తమకు అవమానంగా భావిస్తున్న జనసేన ఎమ్మెల్యేలు తమ గౌరవానికి భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత మీదే అంటూ మనోహర్ మీద ఒత్తిడి తెచ్చారు. మరోవైపు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ శాఖను సైతం హైజాక్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇదంతా జనసేన మనుగడకు.. భవిష్యత్తుకు ముప్పుగా మారుతుందని వారు కలవరపడుతూ దిద్దుబాటు చర్యలకు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఏ స్థాయి ఫలితాలు ఇస్తుందో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
నమ్మకమే జీవితం.. ఆయనే ఉదాహరణ..
ఓనాడు స్కూల్లో పిల్లలందరినీ దగ్గరకు పిలిచిన టీచర్ తలా ఒక్కో అరటిపండు ఇచ్చి ఎవరు చూడని చోటకు వెళ్లి తినేసి రండి అన్నారట. పిల్లలందరూ తినేసి వట్టి చేతులతో వచ్చి.. ఎవరు చూడకుండా తినేసాను మాస్టర్ గారు అన్నారట. కానీ స్వామి వివేకానంద మాత్రం అదే అరటిపండు వెనక్కి తెచ్చి నిలబడ్డారు. అదేంటి నరేంద్ర నువ్వు ఎందుకు తినలేదు ఆ మూలకు వెళ్లి తినొచ్చు కదా అన్నారంట టీచర్ గారు.. ఎవరూ లేని చోటుకి నేను వెళ్ళలేదు టీచర్ గారు.. ఎవరికి కనిపించిన చోటు అంటూ ఉండదు.. ఎవరు చూడకపోయినా మనం చేసే ప్రతి పని ప్రతి కర్మను భగవంతుడు చూస్తుంటాడు.. అందుకే నేను ఆయన కళ్ళుగప్పి తినలేకపోయాను.. ఇదిగోండి మీ అరటిపండు అంటూ తెచ్చి ఇచ్చేసాడట. అంటే ఎవరికీ కనిపించకపోయినా నమ్మకం, విశ్వాసం అనేది ఒకటి ఉంటుంది.. అదే ఈ జీవితాలను నడిపిస్తుంది..ఓ పసి పిల్లాడ్ని గోడ ఎక్కించి మనం కింద నిలబడి దూకేయిరా చిన్నా నేను పట్టుకుంటాను అని చేతులు చాచిన మరుక్షణం ఆ చంటోడు ఒక్క క్షణం జాగు చేయకుండా నవ్వుతూ చటుక్కున దూకేస్తాడు. వాడికి తండ్రి మీద ఉన్న నమ్మకం. నాన్న తనను జారిపోనివ్వడని.. పడిపోనివ్వడని.. తనను భద్రంగా పట్టుకుంటాడని విశ్వాసం. ఆ నమ్మకమే పిల్లాణ్ణి అంతెత్తు నుంచి దూకేలా చేసింది.. చేస్తుంది.అమ్మా గమ్మున జడ వేసేసి పౌడర్ రాయవే నాన్న వస్తారు.. నన్ను బయటకు తీసుకెళ్ళి జైంట్ వీల్ ఎక్కిస్తారు అని అల్లరి చేస్తోంది చిన్నారి. దానికి నాన్నంటే అంత నమ్మకం.. అందుకే స్కూలు నుంచి రాగానే బ్యాగ్ పక్కన పడేసి ఫ్రెష్ గౌన్ వేసుకుని నాన్న కోసం గుమ్మంలో ఎదురుచూస్తోంది. ఒసేయ్ మీ నాన్న రాడు.. మార్చి నెల కదా ఆఫీసులో పని ఎక్కువ ఉంటుంది. ఇంకో రోజుంటే తీసుకువెళ్తాడులే అని అమ్మ చెబుతున్నా వినదు. దాని నమ్మకం దానిది. తనకు మాట ఇచ్చారంటే ఆఫీస్ పని వాయిదా వేసి.. అవసరం అయితే ఆఫీసులో గొడవ పెట్టుకుని అయినా వస్తారనేది దాని నమ్మకం. అనుకున్నట్లే అరగంట ముందు వచ్చాడు నాన్న.. చిన్నదాని కళ్లలో మెరుపు.. చూశావా నాన్న నాకు ఎప్పుడూ అబద్ధం చెప్పడు అంటూ బైక్ ట్యాంక్ మీద కూర్చుని అమ్మకు బై చెబుతూ తుర్రుమంది.. వెళ్తున్నంతసేపూ నాన్నతో అమ్మమీద కంప్లయింట్లు చెబుతోంది. నువ్వు రావన్నది నాన్నా . వస్తావని నేను చెబుతున్నా వినదే అంటున్నపుడు నా నమ్మకాన్ని నిలబెట్టావు.. నా మాట నెగ్గింది.. నెగ్గించావు నాన్నా అనే గర్వం ఆ చిన్నదాని మాటల్లో ప్రస్ఫుటిస్తూనే ఉంది.ఈసారి సరిగా వేయలేదు కానీ.. వచ్చే ఏడాది అప్రైజల్లో నీకు భారీ హైక్.. ప్రమోషన్ గ్యారెంటీ.. గట్టిగా పని చేయవయ్యా సుభాష్ అని చెబుతున్న మేనేజర్ మాటల్లోని దృఢత్వం సుభాష్ ను రేసు గుర్రంలా పరుగెత్తించింది. మేనేజర్ మాటంటే మాటే.. అదే నమ్మకం సుభాష్ తో మరింత ఎక్కువ పని చేయించింది.Amazing to see this. Shri Laddu Gopal shop in Jabapur - you pick what you like and pay. No shop boys/girls, no cashier.Even if you don't have money, you pick up what you want and pay when you can.Amazing we have such places even now. pic.twitter.com/I287IXsOJN— D Prasanth Nair (@DPrasanthNair) March 17, 2025కొన్నిసార్లు ఈ నమ్మకం మనల్ని ముంచేస్తుంది.. నీకెందుకు డార్లింగ్ మీ అమ్మ తాలూకు బంగారం డబ్బు పట్టుకుని వచ్చేయ్ ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకుందాం అని ప్రియుడు చెప్పిన మాటలు నమ్మి ఊబిలో చిక్కుకున్న అమాయకురాళ్లు ఎందరో.. ఈ సైట్ కొనండి సర్.. రెండేళ్లలో డబుల్ చేసి అమ్మెద్దాం అని బ్రోకర్ చెప్పగా నమ్మేసి ప్రభుత్వ భూమిని కొనేసి అడ్డంగా నష్టపోయినవాళ్ళూ ఉన్నారు. నమ్మకం అనేది ఒకొక్కరి జీవితంలో ఒక్కోలాంటి ఫలితాలను సూచిస్తుంది. దుష్యంతుడు తన వద్దకు మళ్ళీ వస్తాడు అనేది శకుంతల నమ్మకం.. కానీ శాపగ్రస్తుడైన ఆయన శకుంతలకు ఇచ్చిన మాట మర్చిపోతాడు. అది ఆమెకు ఎంతటి నష్టాన్ని కలగజేసిందో పురాణాల్లో చదవవచ్చు.ఇదంతా ఎందుకు చెప్పడం అంటే జబల్పూర్లోని లడ్డు గోపాల్ అనే వ్యక్తి స్వీట్ షాపులోని క్యాష్ కౌంటర్లో ఎవరూ ఉండరు. షాప్ తెరిచే ఉంటుంది.. సీసీ కెమెరాలు కూడా ఉండవు. ఎవరికి నచ్చిన మిఠాయి వాళ్ళు తీసుకుని కౌంటర్ మీద ఉండే డబ్బాలో డబ్బులు వేయడమే. మీరు వేశారా లేదా అనేది మీకు తెలుస్తుంది అంతే తప్ప దుకాణం యజమానికి తెలియదు.. చూడడు. అయితే, ఆ కౌంటర్ వద్ద చిన్ని కృష్ణుని విగ్రహం మాత్రం ఉంటుంది. మీరు చేసేవన్నీ ఎవరూ చూడకపోయినా ఆయన చూస్తూ ఉంటాడన్నమాట . ఆ నమ్మకంతోనే ఆ ఓనర్ ఆ షాపును అలా నిర్వహిస్తున్నారు. అదన్నమాట సంగతి.. నమ్మకమే జీవితం.-సిమ్మాదిరప్పన్న. -
May Be.. బాబుగారికి ఆయనంటే ఎంతో స్పెషల్!
నేను కత్తి వాడడం మొదలు పెడితే నాకన్నా ఎవరూ గొప్పగా వాడలేరు అనేది మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పే డైలాగ్. అదే.. అధికారులను వాడకం మొదలు పెడితే నా కన్నా గొప్పగా ఎవరూ వాడలేరు అనేది ఇప్పటికే చంద్రబాబు ఎన్నోసార్లు రుజువు చేశారు. పోలీసుల మొదలు.. రాజకీయ నాయకులు, న్యాయాధికారులు.. ఇలా ఒకరేమిటి చంద్రబాబు తలచుకుంటే ఎవరినైనా వాడేయగలరు. ఆ వాడకం తర్వాత వారికి సముచిత స్థానం కల్పిస్తూ రుణం తీర్చుకోగలరు... తాజాగా ఏపీ ప్రభుత్వం నలుగురు సలహాదారులను నియమించించుకుంది. వారిలో గౌరవ సలహాదారుగా డీఆర్డీవో మాజీ చీఫ్ జి.సతీష్ రెడ్డి, ఏపీ స్పేస్ టెక్నాలజీ గౌరవ సలహాదారుగా ఇస్రో మాజీ చీఫ్ సోమనాథ్, చేనేత, హస్తకళల అభివృద్ధికి గౌరవ సలహాదారుగా భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా, ఏపీ ఫోరెన్సిక్ గౌరవ సలహాదారుగా కేపీసీ గాంధీని నియమించారు. వీరికి కేబినెట్ హోదా కల్పిస్తూ వాహనం.. ఆఫీసు.. అదే స్థాయిలో వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లిస్తారు. అయితే ఇందులో మొదటి ముగ్గురు సంగతి పక్కన పెడితే నాలుగో వ్యక్తి అయిన కేపీసీ గాంధీ గురించి కాస్త ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఫోన్లో బేరాలు మాట్లాడి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఆ కేసునుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ ఆయన మాట్లాడిన వాయిస్ రికార్డ్ అప్పట్లో రాజకీయ సంచలనం అయింది. ఆఘటన తరువాత రాత్రికి రాత్రి ఆయన ఏపీ తెలంగాణ ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ వదిలి విజయవాడ వచ్చేశారు. ఆయన ఊరు వదిలి వచ్చేసినా తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కేసులు మాత్రం వదలలేదు. ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన వాయిస్ రికార్డర్‌ను ఫోరెన్సీక్ లాబరేటరీ పంపించారు. అందులో ఉన్న గొంతు చంద్రబాబుదా కాదా అన్నది తేల్చడం ఆ ల్యాబ్ బాధ్యత. అదిగో ఆ టైంలో ఆ ల్యాబ్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు కేపీసీ గాంధీ. ‘‘ఆ వాయిస్ చంద్రబాబుది అని చెప్పలేం. మిమిక్రీ కూడా కావొచ్చు’’ అని ఓ రిపోర్ట్ రాసి పడేశారాయన. దీంతో ఆ కేసు అక్కడితో ఆగిపోయింది. కట్ చేస్తే.. గాంధీ 2014-19 మధ్య కూడా ప్రభుత్వంలో సలహాదారు పాత్ర ఇచ్చారు. ఆ రుణం తీర్చుకోలేదని అనుకున్నారో ఏమో.. ఇప్పుడు కూడా ఆయన్ని గౌరవ సలహాదారుగా కేబినెట్ హోదాలో నియమించారు. మునుముందు ఫోరెన్సిక్ సంబంధ అంశాల్లో ఆయన ప్రభుత్వానికి సలహాలు ఇస్తారట. ఆ సలహాలు ఎవరికి పనికొస్తాయన్నది పెద్ద ప్రశ్నార్థకం. అన్నట్లు.. గతంలో అధికారంలో ఉన్నపుడు తను డీజీపీ స్థాయి అధికారిని అనే సంగతి కూడా మరిచిపోయి టీడీపీకి ఏబీ వెంకటేశ్వర రావు ఊడిగం చేశారనే చర్చ నడిచింది. అయితే.. మళ్ళీ అధికారంలోకి రాగానే పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు. అలాగే.. మంత్రి అచ్చెన్నాయుడు సోదరుడు ప్రభాకర్ నాయుడిని విజిలెన్స్ విభాగంలో ఓఎస్డీగా నియమించారు. ఇలా ఎంతోమంది అనుయాయులను అడ్డగోలుగా పోస్టింగ్స్ ఇచ్చి సొంత పనులు..రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని చర్చ చాలాకాలంగా నడుస్తోంది. ఈ తరుణంలో ఇప్పుడు కేపీసీ గాంధీ నియామకం కూడా అదే కోవలోకి వస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది.:::సిమ్మాదిరప్పన్న -
పచ్చని చిలుకలు తోడుంటే.. పాడే కోయిల వెంటుంటే!
గతంలో పల్లెలు అంటే చాలు ఠక్కున పక్షుల కిలకిలలు స్ఫురణకు వచ్చేవి. ఏ ఇంటి పెరట్లో అయినా ఒక జామ చెట్టు దానిమీద నిత్యం పారాడుతూ జామకాయలు కొరుకుతూ ఉండే చిలుకలు.. పొలంలో కల్లంలో.. ఇంటి ముందున్న కరెంటి వైర్ల మీద చిలుకలతోబాటు కోయిలలు.. లెక్కకుమిక్కిలిగా ఊరపిచ్చుకలు.. కత్తెర పిట్టలు.. పాలపిట్టల.. ఒకటేమిటి.. ఊరు అంటేనే మనుషుల కన్నా పక్షులే ఎక్కువగా ఉండేవి.. కానీ కాలం మారింది.. మారుతోంది.. వేలాది పక్షి జాతులు అంతరించిపోతున్నాయి. మనిషి తాను బతకడం కోసం పక్షులను పొట్టనబెట్టుకుంటున్నాడు. ఎక్కడికక్కడ ఏర్పాటయ్యే సెల్ ఫోన్ టవర్ల కారణంగా పిచ్చుకలవంటి జీవాలు కనుమరుగైపోతున్నాయి.ఈ భూమి మనుషులకోసమే కాదు.. పశుపక్ష్యాదులు వంటి ఎన్నో జీవులకు ఆలవాలం.. కానీ మనిషి తన తెలివిని అతితెలివిగా మార్చి మిగతా జీవులన్నింటినీ మింగేస్తూ తానొక్కడే భూగోళాన్ని ఏలాలని చూస్తున్నాడు. ఆ క్రమంలోనే తూనీగలు.. నత్తగుల్లలు.. పలు రకాల చేపలు.. పిచుకలు వంటివి అంతరించిపోతున్నాయి. అయితే అందరూ ఇలా దారుణాలు చేస్తూ పోతుంటే ఎలా.. దిక్కులేనివాళ్లకు దేవుడే దిక్కు అన్నట్లుగా ఈ జీవాల రక్షణ కోసం ఎవరో ఒకరు ఉండే ఉంటారు.. దేవుడే ఎవరోఒకరికి బాధ్యత అప్పగించి ఉంటారు.. వాళ్ళే ఈ చిరు జీవుల రక్షణ బాధ్యతలు భుజానికి ఎత్తుకుంటారు. అనంతపురం పట్టణ యువత పక్షులను సంరక్షించేందుకు హోమ్ ఫర్ బర్డ్స్(Home For Birds) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. అనిల్ కుమార్(Anil Kumar) అనే యువకుడి సారథ్యంలోనే ఈ బర్డ్స్ సొసైటీ పక్షులకు ఇళ్ళు నిర్మిస్తోంది.. అవును.. పక్షుల కోసం గూళ్ళు కడుతూ వాటిని చెట్లకు వేలాడతీస్తోంది. అంతేకాకుండా ఔత్సాహికులకు వాటిని ఉచితంగా ఇస్తోంది.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వినూత్నమైన కార్యక్రమం చేపట్టాలని ఎలా అనిపించింది అనే ప్రశ్నకు అయన నా బాల్యంలో మా ఊళ్ళో... ఇంట్లో.. పొలంలో పెరట్లో ఎన్నో మొక్కలు చెట్లు ఉండేవి.. వాటిమీద రకరకాల పిచ్చుకలు.. పక్షులు సందడి చేసేవి.. వాటిని చూస్తూ ఆడుకునేవాళ్ళం .. ఇప్పుడు పట్టణాల్లో పారిశ్రామికీకరణ పెరిగింది.. ఎక్కడ చూసినా సెల్ ఫోన్ టవర్లు.. విద్యుత్ స్తంభాలు ఉంటున్నాయి తప్ప పక్షులు వాలెందుకు.. అవి గూళ్ళు కట్టుకునేందుకు చెట్లే కరువయ్యాయి. దీంతో అవి తమ సంతతిని వృద్ధి చెందించుకోలేక క్రమేణా తగ్గిపోతున్నాయి. వాటికి మళ్ళీ మనం గూళ్ళు కల్పించి.. ఆహారం అందిస్తే మళ్ళీ మనచుట్టూ తిరుగుతూ సందడి చేస్తాయి. అందుకే వాటిని మళ్ళీ ఆహ్వానించాలని భావించి అనంతపురం చుట్టుపక్కల ప్రతి ఇంటికి ఇలా గూళ్ళు అందిస్తున్నాం. రకరకాల పక్షులు తమ గూళ్ళను ఎలా రూపొందిస్తాయో. మేమూ అచ్చం అలాగే వాటిని తయారు చేసి పంచుతున్నాం. వీటిలో ఇప్పుడు పిచ్చుకలు.. పక్షులు నివాసం ఉంటున్నాయి.. ఇది చాలా సంతోషకరమైన అంశం అని అయన చెబుతున్నారు.హోమ్ ఫర్ బర్డ్స్ సొసైటీ సభ్యులు వీధుల్లో తిరుగుతూ పక్షుల అలికిడిని బట్టి.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి పక్షులు ఉంటున్నాయనేది ఒక సర్వే మాదిరి చేసి ఆయా ప్రాంతాల్లో అలంటి గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు.. స్కూళ్ళు.. విద్యాసంస్థలు.. కాలేజీలు.. పార్కులు.. పెద్దపెద్ద చెట్లు ఉన్న చోట్ల ఈ గూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా వాటికీ నీళ్లు ఆహారం కూడా అందిస్తూ వాటి మనుగడకు ఎంతో దోహదం చేస్తున్నారు. పక్షి నిపుణులతో మాట్లాడి.. ఏయే జాతి పక్షులు ఎలాంటి గూళ్ళు కడతాయనేది తెలుసుకుని ఆమేరకు నాలుగు రకాల గూళ్ళు తయారు చేసి అందజేస్తున్నారు. ఈ సంస్థ పుణ్యాన ఇప్పుడు అనంతపురం చుట్టుపక్కల పక్షుల సంతతి పెరిగింది.. వాటి సందడి సైతం పెరిగింది. మనం బతుకుదాం.. చిరు జీవులను బతికిద్దాం :::సిమ్మాదిరప్పన్న -
పందెం గెలిచిన బాలు.. ఇక కృష్ణయ్య బాధ్యత తనదే
మడుగులో నీటికోసం దిగిన తనను మొసలి అమాంతం పట్టుకుని లోపలి ఈడ్చుకెళ్ళిపోతూ తనను హరించేస్తున్న తరుణంలో కన్నీటి పర్యంతమవుతూనే సర్వ శక్తులు ఒడ్డుతూ పోరాడుతోంది. మరోవైపు మొసలికి స్థానబలం ఎక్కువగా ఉండే మడుగులో దాన్ని ఓడించడం గజేంద్రుడికి సాధ్యం కావడం లేదు... దీంతోమొసలితో పోరాడలేక.. దాన్ని ఓడించలేక.. తనను తానూ కాపాడుకోలేక ఆ గజరాజు, మకరాన్ని గెలవడం తనవల్ల కాదు అని అర్థం చేసుకుని తనను రక్షించేది ఈ భూలోకంలో శ్రీహరి ఒక్కడేనని అర్థం చేసుకుని విష్ణుమూర్తిని ప్రార్థించింది. ఈ విధంగా మ్రెక్కింది.కలఁ డందురు దీనులయెడఁ,గలఁ డందురు పరమయోగి గణములపాలంగలఁ డందు రన్ని దిశలను,గలఁడు గలం డనెడువాఁడు గలఁడో లేఁడోఅని ప్రార్థించగా ఆ క్షణాన శ్రీదేవితో పాలసముద్రంలో శేషతల్పం మీద పయనిస్తున్న శ్రీహరి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఉన్న ఫలాన భూలోకానివచ్చి సుదర్శన చక్రంతో మొసలి కంఠాన్ని ఖండించి గజేంద్రుడిని కాపాడాడు. అప్పట్నుంచి గజేంద్రుడు శ్రీ హరి సేవలో ఉంటూ పునీతుడైనాడు. ఇక దక్షిణభారత దేశంలోనే ప్రముఖమైన గురువాయూర్ కృష్ణ మందిరంలో సోమవారం మొదలైన ప్రత్యేక ఉత్సవాలకు రంగం సిద్ధం చేసారు. గురువాయూర్ అంటేనే ఏనుగులకు ప్రసిద్ధి.. సువిశాలమైన కృష్ణ మందిరంలో అంతెత్తున గజరాజులు ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఉత్సవాల సందర్భంగా కృష్ణయ్యను మోసే బాధ్యత కూడా ఆ గజరాజులదే.. కృష్ణయ్య సదరు గజరాజుపై అధిరోహించి ఊరేగింపుగా వెళ్తారు. అయితే ఆలయంలో అన్నీ ఉత్తమోత్తమ జాతికి చెందిన గజరాజులే .. అందులో ఎవరికీ ఈ మహాద్భాగ్యం దక్కుతుంది.. అందుకే ఏటా మాదిరిగానే ఆలయంలో ఒక పోటీ పెట్టారు.దేవి, దేవదాస్, చెంతమరాక్షన్, నందన్.. బాలు అనే కరిరాజుల మధ్య పరుగుపందెం నిర్వహించారు. మొత్తం 12 ఏనుగులను ఈ పోటీకి పరిశీలించగా అందులో బాలుతోబాటు ఐదు ఏనుగులను మాత్రమే ఫైనల్ పోటీకి నిలిపారు. ముందుగా వాటిని స్వచ్ఛమైన నీటిలో స్నానం చేయించి వాటి కంఠాన గణగణమని మోగే గంటలను అలంకరించి ముందుగా దేనికి సంబంధించిన మావటి దాను ముందుగా ఉరుకుతుంటే వారివెనుకనే కరిరాజులు పరుగెత్తాయి. ఈ పందెం చూసేవాళ్లకు కన్నులపంట కాగా వినేవాళ్లకు వీనులవిందు అవుతుంది. ఈ పందెంలో బాలు అనే గజరాజు విజయం సాధించాడు. విజయం తర్వాత, బాలు ఒలింపిక్ పతకం సాధించిన విజేత మాదిరి అందర్నీ విజయగర్వంతో పరికించి చూసి.. తొండం అభివాదం చేసాడు. తరువాత తూర్పు గోపురం గుండా ఆలయంలోకి ప్రవేశించి, గురువాయురప్పన్కు భక్తితో ఏడు ప్రదక్షిణాలు చేసాడు. ఆ తరువాత ఈ ఉత్సవాల్లో స్వామిని మోసే బాధ్యత ఈ బాలుకు మాత్రమే దక్కుతుందన్నమాట..ఈ సందర్భంగా నిర్వహించే పోటీలకు ముందు గజరాజులు వెటర్నరీ డాక్టర్లు ఫిట్నెస్ పరీక్షలు చేస్తారు. అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడే కాసిన్ని ఏనుగులను రంగంలోకి దించి పూర్తి భద్రతనడుమ ఈ పరుగుపందెం నిర్వహిస్తారు. జనం అల్లరికి ఏనుగులు బెదిరిపోయి జనంలోకి వెళ్లే ఇంకేదైనా అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ పోటీలు నిర్వహిస్తారు.. :::సిమ్మాదిరప్పన్న -
మెగా బ్రదర్స్ అత్యుత్సాహం..
మాటలు నేర్చిన కుక్కను వేటకు తీసుకెళ్తే ఉస్కో అంటే ఎదురు మళ్ళా ఉస్కో అందట.. ఆలా అయింది తెలుగుదేశం పరిస్థితి. పార్టీ పెట్టి పుష్కరం దాటి.. అసెంబ్లీ గేటు కూడా దాటలేకపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం.. బీజేపీతో పొత్తు పుణ్యాన ఈసారి అసెంబ్లీ లోపలి అడుగుపెట్టారు. పవన్ ప్రాధాన్యాన్ని గుర్తించిన చంద్రబాబు సైతం ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇచ్చారు. ఇక జనసేనలో మొదట్నుంచి ఉన్న నాగబాబు సైతం గతంలో ఎంపీగా పోటీ చేసి మట్టికరిచారు. ఇక డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేయడం అచ్చిరాదనుకున్నారో ఏమో అడ్డదారిలో శాసనమండలిలోకి అడుగుపెట్టారు. ఇక చట్టసభలో ప్రజల తరఫున మాట్లాడాల్సిన నాగబాబు తొలిసారిగా మైక్ అందుకుని ఇక ఒంటి మీద స్పృహ లేకుండా నోటికొచ్చింది వాగేశారు. తెలుగుదేశానికి లైఫ్ ఇచ్చింది తామేనని పవన్ అంటే.. అసలు పవన్‌ను గెలిపించింది ప్రజలు.. జనసైనికులే తప్ప ఇంకెవరూ కాదని గట్టిగా చెప్పారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు పిఠాపురం సీటును పవన్ కోసం త్యాగం చేసిన వర్మను నాగబాబు.. పవన్ ఇద్దరూ భుజానికి ఎత్తుకుని మోశారు. నా గెలుపు బాధ్యత మీదే.. మీ భుజాల మీదనే ఉందని మునగ చెట్టు ఎక్కించారు. ఇక గెలిచాక.. వర్మ త్యాగం గాలిలో కలిసిపోయింది.. అసెంబీ గేటు వరకూ ఓడ వర్మ.. గేటు దాటాక బోడి వర్మ అన్నట్లుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నలభయ్యేళ్ళ తెలుగుదేశాన్ని తామే నిలబెట్టినట్లు ఈ బ్రదర్స్ చెప్పుకున్నారు.పాలన గురించి ఒక్క ముక్కాలేదు..అటవీ, పంచాయతీ రాజ్ మంత్రిగా ఉన్న పవన్ ఈ తొమ్మిది నెలల్లో చేసిన ఒక్క మంచి పని గురించి కూడా చెప్పలేదు.. ఎంతసేపు తన స్వోత్కర్ష.. సొంత ఎలివేషన్ తప్పితే ప్రజలకు పనికొచ్చేది.. సమాజానికి ఉపయోగపడే మాట ఒక్కటీ లేదు.. పైగా జనసైనికులు కూడా అచ్చం అలాగే తయారయ్యారు.. 2029 నాటికి పవన్‌ను సీఎం అభ్యర్థిగా చూడాలన్నది వారి అభిలాష అని అక్కడ ఓపెన్ అయిపోయారు.. ఈ అన్నదమ్ముల అత్యుత్సాహం తెలుగుదేశాన్ని ఇరిటేట్ చేస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా ఖాతాల్లో ఈ బ్రదర్స్ గురించి ట్రోలింగ్ మొదలైంది. తెలుగుదేశం లేకపోతే జనసేన ఎక్కడ ఉంటుంది. ఇదేంటి ఇంత ఓవర్ యాక్షన్ అంటూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు తన గురించి మాటమాత్రం ప్రస్తావించకపోవడం పిఠాపురం వర్మను మరింత వేడెక్కిస్తోంది. ఈ అంశం లోకేష్ వద్దకు కూడా చేరింది.. పలువురు కార్యకర్తలు లోకేష్ తో మాట్లాడుతూ నాగబాబు.. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.చెప్పులోని రాయి చెవిలోని జోరీగకంటిలోని నలుసు కాలి ముల్లుఇంటిలోని పోరు ఇంతింత గాదయావిశ్వదాభిరామ వినురవేమ!అన్నట్లుగా తయారైంది టీడీపీ పరిస్థితి. తమ గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్‌ను ఇప్పుడు చెప్పులమాదిరిగా బయట వదిలేయలేక.. వాళ్ళ అన్నదమ్ముల కామెంట్లు చెవిలో జోరీగమాదిరిగా ఇబ్బంది పెడుతున్నా భరించలేక.. సతమతమవుతున్నారు. మొత్తానికి నోటి దురుసు ఉన్న నాగబాబు ఎప్పటికైనా కూటమిలో చిచ్చుకు కారణం అవుతారని అంటున్నారు..-సిమ్మాదిరప్పన్న -
మిమ్మల్ని మార్చలేకపోతున్నాను.. మన్నించండి.. గుంజీలు తీసిన హెడ్ మాస్టర్
ఒరేయ్ రామూగా.. నువ్వు చెప్పినపని చేయడం లేదు.. బుద్ధిగా ఉండడం లేదు.. అమ్మకు ఎదురుసమాధానం చెబుతున్నావు.. ఇలాగైతే స్కూల్లో మీ మాస్టారుకు చెప్పి బరిగెతో తొక్క తీయిస్తాను. నీకు మేం చెబితే వినవు.. మీ లెక్కల మాష్టారే కరెక్ట్ ఆయనైతేనే నీకు చర్మం వలిచేసి బుద్ధి చెబుతాడు.. -ఒక పిల్లాడికి తండ్రి వార్నింగ్ ...మాస్టర్ గారండీ.. ఆ శీనుగాడు మా గుంటడే .. బడి నుంచి వచ్చాక పుస్తకాలు సంచి ఇంట్లో పడేసి బావుల్లోనూ చెరువుల్లోనూ ఈతకని తిరుగుతున్నాడు తప్ప పుస్తకం తీయడం లేదు.. చదవడం లేదు.. మీరు వాణ్ని ఏమాత్రం వదలొద్దు... చేమడాలు వలిచేయండి.. నేనేం అనుకోను.. ముందు వాణ్ని దారిలో పెట్టండి-టీచర్‌తో ఒక తండ్రి వేడుకోలు..ఒరేయ్ ఇక ఆడింది చాలు.. ఆదివారం కూడా చదూకోమన్నాడు సైన్స్ మాస్టర్.. అయన ఇల్లు ఈ దారిలోనే .. మనం ఇంకా ఈ మామిడి తోటల్లో తిరిగి.. ఆయనకు దొరికిపోతే మాత్రం మనం అయిపోయినట్లే.. ఇక ఇదే ఆఖరాట వెళ్లిపోదాంరా.. నాకు భయమేస్తోంది..-పిల్ల గ్యాంగులో ఒకడి ఆందోళనఒరేయ్ బెల్లం తింటే పళ్ళు పుచ్చిపోతాయి. కడుపులో పాములు వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా మా పిల్లాడు వినడం లేదు.. మీరైనా చెప్పండి టీచర్ గారు.. వీడికి మేమంటే భయం లేకపోతోంది.. మీరే వీడికి రెండు వేసి దారిలో పెట్టండి-మాష్టర్ వద్ద ఒక తల్లి విజ్ఞాపనపాతికేళ్ల క్రితం టీచర్ అంటే బడిలోనే కాదు.. ఊళ్ళో.. గుడిలో.. పెళ్ళిలో.. సంతలో.. మార్కెట్లో ఎక్కడ కనిపించినా టీచర్ గానే చూసేవాళ్ళు.. ఎక్కడ ఆయన ఎదురైనా పక్కకు తప్పుకోవడం.. కూడా లేచి నిలబడి గౌరవించడం.. ఇంట్లో భయం లేకపోతే నేరుగా తల్లిదండ్రులే స్కూలుకు వచ్చి టీచరుకు చెప్పి మరీ తమ బిడ్డల్ని దారిలో పెట్టించడం నాటి సమాజపు సంస్కృతి.. స్కూలు టైములోనే కాదు.. తమ జీవితంలో ఎప్పుడూ టీచర్ అంటే టీచర్ గానే గౌరవించి.. భయభక్తులతో ఉండేవాళ్ళు. కానీ కాలం మారింది.. టీచర్ అంటే జీతం తీసుకుని పని చేసే ఒక పనివాడు.. ఒక ఉద్యోగి.. అంతేతప్ప అయన తమకు ఇంకేం కాడు కాలేడు. అయినా మనను టీచర్ కొట్టడం ఏంది.. కొడితే ఊరుకుంటామా.. ఇదే దారిలో వెళ్తాడు కదా.. సాయంత్రం చూసుకుందాం లే .. అన్నట్లుగా పిల్లల తీరు ఉండగా.. ఏంది టీచర్ మా వాణ్ని కొట్టిర్రట.. వాణ్ని మేమె ఏనాడూ ఏమీ అనలేదు. మీరు కొడితే ఎట్లా .. చదువు చెబితే చెప్పండి.. లేకుంటే లేదు.. వాడికి చదువురాకున్నా ఫర్లేదు.. కొట్టుడు మాత్రం వద్దు.. ఈసారి కొడితే ఊరుకునేది లేదు.. అంటూ టీచర్లకే పేరెంట్స్ వార్నింగ్ ఇస్తున్న కాలం ఇది.అల్లరి చేసినా .. చెప్పినమాట వినకపోయినా చేతులు ఒళ్ళు వాచిపోయేలా టీచర్లు కొట్టినా ఏమీ అనని రోజులు పోయి.. మావాణ్ని కొడితే నీకు పడతాయి మాస్టర్ గారు ఎన్ని వార్నింగ్ ఇస్తున్న రోజులు వచ్చాయి.. పిల్లల్ని దండించడాన్ని అతిపెద్ద నేరంగా పరిగణిస్తూ వ్యూస్ పెంచుకునే మీడియా లైన్లోకి వస్తుంది.. పిల్లల హక్కుల సంఘాలు సంస్థలు కూడా యాగీ చేయడానికి ఎల్లపుడూ సిద్ధమే.. టీచర్ చేతిలో బెత్తం ఏనాడైతే మూలకు చేరిందో ఆనాడే పిల్లల్లో అల్లరి పెరిగింది.. భయం బాధ్యత స్థానంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది.. టీనేజీలోనే దురలవాట్లు.. నేరాలకు సిద్ధం అవుతున్నారు..ఇలాంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ.. వారిని ఏమీ నిందించలేక.. దండించలేక.. శిక్షించలేక.. అనలేక ఒక హెడ్ మాస్టర్ మనస్తాపంతో కుమిలిపోతూ.. మీరు మారరు.. మిమ్మల్ని నేను మార్చలేను.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మేము ఎన్ని చెప్పినా మీరు వినడం లేదు.. మీకు భయం లేదు.. గౌరవం లేదు.. అయినా మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం.. ఇకపై మీ ఇష్టం అంటూ గుంజిళ్ళు తీశారు.. ఇది అయన ఆవేదన కాదు.. సమాజంలో విద్యార్థులు.. తల్లిదండ్రుల పరిస్థితిని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఆనాడు గురువు గురించి వేమన రాసిన పద్యాన్ని ఒకసారి గుర్తి చేసుకుందాం‘గురుని శిక్షలేక గురుతెట్లు కలుగునో అజునకైనా వాని యబ్బకైన తాళపుచెవి లేక తలుపెట్లు లూడునో విశ్వదాభిరామ వినురవేమ’గురువుతో శిక్ష అనుభవించకుండా చదువు ఎలా వస్తుంది అంటాడు వేమన.. కానీ ఇప్పుడు పిల్లల్ని కొట్టడం నేరం అంటున్నారు.. ఇప్పుడు దండించకపోతే వారు మున్ముందు మరింతగా రాటుదేలిపోతారన్నది వేమన ఉద్దేశ్యం.. అది నాడు.. నేడు.. ఏనాడైనా చెల్లుబాటు అవుతుంది. అని ప్రస్తుత సమాజాన్ని చూస్తే స్పష్టం అవుతోంది.-సిమ్మాదిరప్పన్న. -
అందరూ మహానటులే.. అసలైన ‘నటుడే’ స్పందించలేదే!
అందరూ అమాయకులే.. కానీ ఉట్టిమీద ఎండు చేపలు మాత్రం ఏమైనాయో తెలీదు. చేయాల్సింది చేసేసి ఇప్పుడు అందరూ.. అయ్యో.. ఇదెక్కడి ఘోరం.. తప్పయింది.. సరిదిద్దుతాం.. మా చేతిడబ్బులు పెడతాం అని ఆస్కార్ స్థాయి నటన చూపుతున్నారు. వాత పెట్టేది వాళ్ళీ.. వెన్నరాసేది వాళ్ళే..లంబు.. జంబు మాదిరి కేబినెట్లో ఈ లోకేష్.. పవన్ భలే తగిలారు.. తిరుమల తొక్కిసలాట మీద లోకేష్.. చంద్రబాబు కిక్కురుమనలేదు కానీ ఎగురుకుంటూ వచ్చి పవన్ సారీ చెప్పారు.. చైర్మన్ నాయుడు కూడా సారీ చెప్పాల్సిందే అని డిమాండ్ చేసారు. ఇప్పుడు పవన్ చేతిలో ఉన్న అటవీశాఖ పరిధిలోని కాశీనాయన సత్రం భవనాలను కడప జిల్లాలో ప్రభుత్వం కూల్చేసింది.. దీనిమీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వేలాదిమంది ఆకలి తీరుస్తున్న అన్నసత్రాలను కూల్చడం ఏమిటని ప్రజలు.. యువత.. సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. దీంతో ఇదేదో పెద్ద డ్యామేజ్ అయింది అనుకున్న ప్రభుత్వం వెంటనే రిపేర్లు మొదలు పెట్టింది.కూల్చేశాక దీనికి సంబంధించి పవన్ ఎక్కడా నోరుమెదపలేదు.. కానీ లోకేష్ లైన్లోకి వచ్చి ఎకాఎకిన సారీ చెప్పేసి సొంత డబ్బుతో వాటిని నిర్మిస్తాను అంటున్నారు. అసలు ఆ సత్రాల కూల్చివేత వెనుక కూసే కులపరమైన రాజకీయ విద్వేషం ఉందని అంటున్నారు. కానీ, దానితో సంబంధం లేకుండానే రాయలసీమ నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత పెల్లుబుకడంతో ఏకంగా లోకేష్ లైన్లోకి వచ్చేసారు. ఆ భవనాలు టైగర్ జోన్లోకి వస్తాయి కాబట్టి కూల్చేశారని అది తప్పేనని అంగీకరిస్తూ.. మళ్ళీ వాటిని పునర్నిర్మిస్తామని.. దానికి తన సొంత డబ్బును వెచ్చిస్తానని చెబుతున్నారు. అదెలా సాధ్యం కూల్చినపుడు అవి టైగర్ జోన్లో ఉన్నాయ్ అన్నారు.. మరి మళ్ళీ నిర్మిస్తే టైగర్ జోన్లోకి రావా?. అది నిబంధనలకు విరుద్ధం కాదా?. అప్పుడు అటవీ చట్టాలు ఒప్పుకుంటాయా అనేది అర్థం కానీ విషయం. అటవీ మంత్రి సౌండ్ చేయడం లేదేం..టైగర్ జోన్లో ఉన్న భవనాలను కూల్చడం అంటే అది పవన్ కల్యాణుకు తెలిసే జరిగి ఉంటుంది.. లేదా పవన్ కు తెలియకుండా లోకేష్ సారధ్యంలో అయినా అది జరిగి ఉండాలి.. మరి ఇలాంటప్పుడు పవన్ కదా బయటకు వచ్చి దానిమీద స్పందించాలి.. అసలు పవన్ ఎక్కడున్నారో తెలియదు.. శాసనసభ సమావేశాలు మొదట్లో ఒకట్రెండు రోజులు వచ్చిన ఆయన తరువాత ఏమయ్యారో తెలియడం లేదు. తన శాఖ పరిథిలోకి లోకేష్ దూరిపోయి పెత్తనం చేయడం.. ఏకంగా క్షమాపణ చెప్పడం అంటే పవన్‌ను ఓవర్ టేక్ చేసేయడమే అని స్పష్టంగా తెలుస్తోంది. సంబంధిత దేవాదాయ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఈ అంశం మీద మాట్లాడారు.. ఆ సంఘటన జరిగి ఉండకూడదన్నారు.. కానీ తన శాఖలో జరిగిన ముఖ్యమైన పరిణామం మీద పవన్ కిక్కురుమనడం లేదు. నాడు తిరుమల తొక్కిసలాట సమయంలో లోకేష్ సౌండ్ చేయలేదు.. పవన్ మాత్రం ఓవర్ యాక్షన్ చేసారు.. నేడు పవన్ చప్పుడు చేయడంలేదు కానీ లోకేష్ మొత్తం మాట్లాడేసి.. దాని విరుగుడు కూడా చెప్పేస్తున్నారు. అంటే అందరూ కూడబలుక్కుని జనాన్ని మోసం చేస్తున్నారా? ఏమి అని సందేహం వస్తోంది.-సిమ్మాదిరప్పన్న. -
బాబు, పవన్ రాజకీయం.. వర్మకు వెన్నుపోటు!
ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మాట తప్పారు. చంద్రబాబు మాట మీద నిలబడితే వింతకానీ మాట తప్పితే వింతేముంది. తనది నలభై ఏళ్ల రాజకీయ అనుభవం అంటారు కానీ.. ఈ అనుభవం వెన్నుపోట్లలోనే ఎక్కువగా ఉంటుందన్నది చరిత్ర తెరిచి చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.దీనికి తాజా ఉదాహరణ కావాలా?. పిఠాపురం ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తి.. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన వర్మనే తీసుకుందాం. ‘నీకెందుకు వర్మా నీ రాజకీయ భవిష్యత్ నా చేతిలో ఉంది.. మొదటి ఛాన్స్ లోనే నీకు ఎమ్మెల్సీ ఖాయం.. ముందు నువ్వు పవన్‌ను గెలిపించి చూడు.. నీ ఫ్యూచర్ ఎక్కడో ఉంటుంది’ అని ఎన్నికల సమయంలో చంద్రబాబు వేలాది మంది జనం సమక్షంలో చెప్పారు.. అదే తరుణంలో పవన్ సైతం తనకు వర్మ రాజకీయ భవిష్యత్ కన్నా పెద్ద పనేం లేదని.. ఆయన్ను ఒక స్థాయిలో పెట్టడమే తన ముందున్న కర్తవ్యం అన్నారు. ఇలా ఇద్దరు పెద్ద మనుషులు మాటిచ్చారు.దీంతో, ఇక తనకు తిరుగులేదని వర్మ కూడా నిన్న మొన్నటివరకూ దిలాసాగా ఉన్నారు. తీరా చూస్తే ఎమ్మెల్యేల కోటాలో వచ్చిన మూడుకు మూడు ఎమ్మెల్సీలను కావలి గ్రీష్మ.. బీద రవిచంద్ర.. బీటీ నాయుడులకు ఇచ్చిన చంద్రబాబు.. వర్మకు మాత్రం దెబ్బేశారు. అదేంటి తన ఫ్యూచర్ కోసం ఇద్దరు హామీలు ఇచ్చారు కానీ ఒక్కరు కూడా తన గురించి ఆలోచించలేదా అని వర్మ.. ఆయన వర్గీయులు లోలోన మదనపడుతున్నారు. కానీ, ఈ విషయం ఎక్కడా బయటకు అనలేని పరిస్థితి.ఇదిలా ఉండగా తన గెలుపు వెనుక వెన్నుదన్నుగా నిలిచిన వర్మను పవన్ కళ్యాణ్ కూడా కావాలనే పట్టించుకోవడం మానేశారా.. అది తెలుగుదేశం పార్టీ వ్యవహారం కదా మధ్యలో నేనెందుకు దూరడం అని దూరంగా ఉన్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అందుకే తన పార్టీకి దక్కిన ఎమ్మెల్సీని అన్నయ్య నాగబాబుకు ఇచ్చి.. అక్కడితో పవన్ సైలెంట్ అయ్యారు తప్ప తన కోసం పని చేసిన వర్మను పట్టించుకోలేదు. వాస్తవానికి పవన్‌లో ఈ ఆలోచన ఉండుంటే అయన చంద్రబాబుకు గట్టిగా చెప్పి వర్మకు అవకాశం ఇప్పించవచ్చు. కానీ, పవన్ ఆపని చేయలేదు.అప్పట్లో మాటైతే ఇచ్చేసారు కానీ మాటను నిజం చేసే విషయంలో పెద్దగా సీరియస్‌గా లేరు. అందుకే వర్మను ఆయన మానాన ఆయన్ను వదిలేశారు. మరోవైపు చంద్రబాబు కూడా పిఠాపురంలో పవన్ ఫిక్స్ అయిపోతున్న తరుణంలో వర్మను ఎందుకు ఇంకా మోయడం అని పక్కన పెట్టారా అనే సందేహాలు కూడా ఉన్నాయ్.. ఏదైతేనేం పవన్‌ను గెలుపు తీరానికి చేర్చిన వర్మ రేవులో తాడిచెట్టు మాదిరిగా ఒంటరిగా మిగిలిపోయారు.. చంద్రబాబు బాగా వాడుకుని వదిలేసిన వారి జాబితాలో తాజాగా చేరిపోయారు.-సిమ్మాదిరప్పన్న. -
పుణ్యమూర్తివి నీవమ్మా.. మా ఇంటి కావలి తల్లివి నీవమ్మా
ఆధునిక సమాజంలో మహిళలకు గౌరవం దక్కడం ఇప్పిడిప్పుడే మొదలైంది. స్త్రీ విద్య.. స్త్రీలకు ఉద్యోగాలు.. రాజకీయ పదవులు.. సామాజిక హోదా ఈమధ్యనే పెరుగుతూ వస్తోంది. కానీ, ఈ మారుమూల పల్లెల్లో స్త్రీమూర్తులను సాక్షాత్తుగా దేవతలుగా కొలుస్తారు. తమ ఇంటి ఇలవేల్పులుగా ఆరాధిస్తారు. తమ కుటుంబాలను కాపాడే శక్తిగా.. అమ్మవారిగా పూజిస్తారు.. తమ ఇంట పండిన పంటలో తోలి గంపను ఆమెకు సమర్పిస్తారు.. తమ ఇంట వండిన వంటలు తొలిముద్దను ఆమెకు సమర్పిస్తారు. ఇంట్లో ఏదైనా పండగొచ్చినా పబ్బమొచ్చినా ఇళ్లలో వండుకునే పిండివంటల్లో తొలివాయి ఆమెకే ఇచ్చి.. అమ్మా నీ చలవతోనే మేమంతా చల్లగా ఉన్నాం.. నువ్విచ్చిన ఆస్తిపాస్తులు.. ఆశీస్సులతో ఇలా సాగుతున్నాం.. నువ్వు లేకున్నా నీ జ్ఞాపకాలు చాలు.. ఇదిగో నిన్ను చూస్తూ బతికేస్తాం అంటూ భక్తి.. ప్రేమ నిండిన కళ్ళతో ఆ స్మారకాలవద్ద పవిత్రంగా ప్రమిదలు వెలిగిస్తారు.. ఏదైనా ఇంట్లో ఒక మహిళా పుణ్యస్త్రీగా కన్నుమూస్తే ఆమెను పేరంటాలుగా గౌరవిస్తారు. ఆమె పేరిట ఒక స్మారక చిహ్నాన్ని నిర్మిస్తారు.. వీటిని గుండాం అంటారు. భర్తకన్నా ముందే తనువు చలించడం ఒక మహిళకు దైవత్వాన్ని తెచ్చిపెడుతోంది. అంటే ఆమె పుణ్యస్త్రీగా ముత్తైదువుగా కన్నుమూసి ఆ ఇంటి వారి పాలిట ఇలవేల్పుగా కొలువైపోతుంది. భారతీయ సమాజంలో విధవగా జీవించడం మహిళ ఒక శాపంలా భావిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తకన్నా ముందుగానే ప్రాణం విడిచివెళ్లిన స్త్రీ ఏకంగా దైవత్వాన్ని సంతరించుకుని ఆయా కుటుంబాల్లో దేవతలుగా కొలువుదీరుతారు. విజయనగరం జిల్లాలోని రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాల్లో వందలాది పల్లెల్లో ఈ ఆచారం ఉంది.పంటపొలాలకు.. పాడిపశువుల నువ్వే అండాదండాఇక్కడ పొలాల్లో, రోడ్లకు ఇరువైపులా కనిపిస్తున్న ఈ చిన్న చిన్న నిర్మాణాలను ఇక్కడి స్థానికులు గుండాలు అని పిలుస్తారు. ఇటువంటి గుండాలు ప్రతీ గ్రామంలో వందల సంఖ్యలో ఉంటాయి. బొమ్మనాయుడువలస, బొద్దూరు, గుళ్ళ సీతారాంపురం, గడ్డి ముడిదాం, ఉణుకూరు, అరసాడ, కాగితాపల్ల వంటి పల్లెల్లో ప్రతి ఇంటికీ ఇలాంటి గుండాలు ఒంటరి.. వారువారు స్థోమతను బట్టి తమ పొలాల్లోను.. కల్లంలోనూ వీటిని నిర్మించి అందులో ఆ మహిళా ఆత్మను ప్రతిష్టించి ఆ గుండంలో ఆమె జీవించి ఉన్నట్లుగా భావిస్తారు. ఆ ఇంట జరిగే శుభ కార్యాల్లో తోలి కబురు ఆమెకే చెబుతారు. గర్భిణీలు.. పెళ్లికూతుళ్ళు కూడా అక్కడకు వెళ్లి దీపం పెట్టి.. నీలాగే గొప్ప ముత్తైదువులా జీవించేలా ఆశీర్వదించాలమ్మా అని ప్రార్థిస్తారు. అంతేకాకుండా పంటపొలాలు.. పాడిపశువులను సైతం ఆ పేరంటాలు కాపాడుతుందని.. వ్యవసాయపనుల సందర్భాల్లో ఎలాంటి ఇబ్బందులు.. ప్రమాదాలు కూడా రాకుండా ఆమె కావలి ఉంటుందని .. ఇంటికి చీడపీడలు.. అనారోగ్యాలు రానివ్వకుండా ఆ పేరంటాలు అడ్డంగా నిలబడుతుందని విశ్వాసంతో ఉంటారు. అందుకే ప్రతి గుండానికి లలితమ్మ పేరంటాలు.. లక్షమ్మ పేరంటాలు.. రాధమ్మ పేరంటాలు అని పేర్లు పెడుతూ మరణించిన తరువాత కూడా తమ భక్తిప్రపత్తులు చాటుకుంటారు. ఈ గ్రామాల్లో వందలాది ఇలాంటి స్మారకాలు ( గుండాలు) కనిపిస్తాయి. వాటికి ఏటా రంగులు వేసి.. చక్కగా ముస్తాబు చేసి అందులో తమ ఇంటి ముత్తైదువను చూసుకుంటారు. ఈరోజుల్లో మహిళలను గౌరవించడం మాట అటుంచి వారికి రక్షణ కూడా లేకుండా పోతున్న పరిస్థితుల్లో ఉండగా వందల ఏళ్ళనుంచీ ఆ పల్లెవాసులు మహిళలకు ఏకంగా దేవతా స్థానం కల్పించి మరణించాక కూడా ఆమెను తమ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చూస్తూ.. ఏటా కొత్తబట్టలు.. పిండి వంటలు.. పళ్ళు ఫలాలు.. సమర్పిస్తారు.. ఇది కదా అసలైన మహిళా సాధికారత.. ఇది కదా మహిళలకు అసలైన గౌరవం..-సిమ్మాదిరప్పన్న. -
Chandrababu: వృద్ధనారీ పతివ్రత
చంద్రబాబు అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఒకేలా ఉన్నారు.. అందితే జుత్తు..అందకపోతే కాళ్ళు పట్టుకోవడంలో ఆయన మాస్టర్ డిగ్రీ చేశారు. రాజకీయంగా తనకు అవసరమైనవాళ్లను మాత్రమే దగ్గర ఉంచుకుని ఒక్కోమెట్టు పైకెక్కిన అయన తనకు అవసరం లేనివాళ్లను తొక్కుకుంటూ ముందుకు వెళ్లారు. ఎవరి అండదండలు తన ఎదుగుదలకు నిచ్చెనమెట్లుమాదిరి ఉపయోగపడ్డాయో.. పైకెక్కక ఏవ్ నిచ్చెనను విరిచేసి మూలపెట్టేశారు . డెబ్బై ఐదేళ్ల వయసులో చంద్రబాబులో పరివర్తన వచ్చిందో... ఇంకా వైరం ఎందుకని అనుకున్నారోకానీ చరమాంకంలో అయన తన తోడల్లుడు డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వర రావును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబు పెద్దల్లుడిగా దగ్గుబాటి ఆనాడు కేబినెట్లో చక్రం తిప్పుతున్న రోజులవి. వాస్తవానికి చదువు.. కుటుంబం.. సామాజిక హోదా విషయంలో వెంకటేశ్వర రావు అన్నిటిట్లోనూ చంద్రబాబు కన్నా పైమెట్టులో ఉంటారు. అయినా రాజకీయంలో మాత్రం అయన వెనుకబడ్డారు.. ముఖ్యంగా ఎన్టీయారును పదవినుంచి తొలగించే సమయంలో తోడల్లుడు దగ్గుబాటిని ఒక మెట్టుగా వాడుకుని తనకు ఒక కంఫర్ట్ పొజిషన్ ఎమ్మెల్యేల సమీకరణ అంతా తాను తన మద్దతుదారులైన మీడియా సంస్థలు సహాయంతో సానుకూలంగా సాగిపోగానే నెమ్మదిగా దగ్గుబాటిని సైడ్ చేయడం మొదలు పెట్టారు.. ఆ తరువాత తాను ఫోన్ చేసినా చంద్రబాబు లిఫ్ట్ చేయలేదని దగ్గుబాటి చెప్పుకున్నారు. ఆ తరువాతి పరిణామాల్లో చంద్రబాబు తెలుగుదేశాన్ని తన గుప్పెట్లో పెట్టుకుని తనకు పోటీ అనుకున్నవాళ్లను. సమర్థత.. పార్టీలో గౌరవం గుర్తింపు ఉన్న దగ్గుబాటివంటి వారిని వారంతట వాళ్ళే పార్టీనుంచి వెళ్లిపోయేలా చేసారు.. ఇదంతా గతం.. కానీ ఇప్పుడు ఇద్దరూ వృద్ధులయ్యారు.ఇప్పుడు దగ్గుబాటి నుంచి ముప్పు లేదుగాదగ్గుబాటి వెంకటేశ్వర రావు మొదటినుంచి మంచి అవగాహన ఉన్న వ్యక్తి.. జాతీయ అంతర్జాతీయ సామాజికాంశాలు గమనించి పుస్తకాలూ రాయడం అయన హాబీ కమ్ వ్యసనం.. ఆ క్రమంలోనే "ప్రపంచ చరిత్ర' పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా చంద్రబాబుకు తోడల్లుడు దగ్గుబాటిలో ఎన్నో సుగుణాలు కనిపించాయి. బిజీగా ఉండే దగ్గుబాటి వంటి వ్యక్తి రిటైర్ అయ్యాక జీవితం ఎలా గడుపుతున్నారో తెలుసుకున్నాను.. నేనూ రిటైర్మెంట్ కు సిద్ధం అవుతున్నాను అన్నారు.. అంతేకాకుండా వెంకటేశ్వర రావుతో తనకు వైరం ఉందని అందరూ అనుకుంటారు అంటూనే.. ఒకప్పుడు చాలా వైరం ఉండేదని. ఇప్పుడు లేదని.. తామంతా కలిసిపోయామని కవరింగ్ ఇచ్చారు. ఇప్పుడు తామంతా ఒకటే అని చెప్పేందుకు తాపత్రయ పడ్డారు.. అవును ఇప్పుడు మీరంతా ఒక్కటే .. తెలుగుదేశాన్ని క్యాడర్ ను పార్టీ నిధులను కొట్టేసి. తోడల్లుడిని ఆనాడు తొక్కేసి తనకు ఎవరూ పోటీ కారాదని అంతా నీ గుప్పెట్లోకి తెచ్చుకున్నావు.. ఇప్పుడు నీకు ఎదురులేదు కాబట్టి.. ఇప్పుడు దగ్గుబాటి మీకు మళ్ళీ బంధువయ్యాడు.. ఇప్పుడు కూడా అయన మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయితే.... నీకు పోటీ వస్తాడనిపిస్తే మళ్ళీ తొక్కేయడానికి ఏమాత్రం సందేహించవు అని సగటు టిడిపి కార్యకర్త లోలోన గొణుక్కుంటున్నాడు..- సిమ్మాదిరప్పన్న -
రియల్ ఎస్టేట్ ఢమాల్.. కొనేది లేదు... అమ్మేది లేదు
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తోంది.. ఎక్కడా ప్లాట్లు.. సైట్ల అమ్మకాలు లేవు.. కొందామంటే కొరివి. అమ్ముదాము అంటే అడవిలా ఉంది పరిస్థితి.. రియల్ వ్యాపారాలు రేట్లు పెంచడం మాట అటుంచి వైఎస్ జగన్ అధికారంలోంచి దిగిపోయాక ఖజానాకు ఆదాయం దారుణంగా తగ్గిపోయింది. ఖజానాకు ప్రతినెలా బోలెడు లోటు కనిపిస్తోంది దాన్ని నింపుకోవడానికి ప్రజలపై భారం వేయడం.. కుదిరినన్నిచోట్ల నుంచి పన్నులు పిండుకోవడమే మార్గంగా భావించిన చంద్రబాబు రియల్ ఎస్టేట్ రంగాన్ని టార్గెట్ చేసారు. భూముల ధరలు పెంచేశారు.. దీంతో పదివేలున్న గజం భూమి ఒకేసారి పదిహేను వేలు అయింది.. దానిమీద జరిగే క్రయవిక్రయాలమీద ప్రభుత్వానికి పన్ను ఆదాయం సమకూరుతుంది. బాబు ఆలోచన బాగానే ఉంది కానీ ఇప్పుడు పెరిగిన ఈ ధరలు చూసి జాగాలు కొనేందుకు జనం భయపడుతున్నారు. భూమి కొనడం మాట అటుంచి ఈ రిజిస్ట్రేషన్ చార్జీలు.. ఆఫీసు మామూళ్లు చూసి జనం భీతిల్లుతున్నారు.ఇసుక ధరలు.. గుండెలు గుభేల్ఇదిలా ఉండగా ఉచిత ఇసుక అంటూ ఊదరగొట్టిన తెలుగుదేశం ప్రభుత్వం గెలిచాక ప్రజలకళ్ళలో ఇసుక పోసింది. మారాజా అంటే మరి రెండు తన్నండి అన్నట్లుగా.. వైఎస్ జగన్ హయాంలో ఇసుక ధరలు ఎక్కువ ఉన్నాయ్.. మేమొస్తే ఫ్రీ ఇసుక అని నమ్మించి గెలిచాక కూటమి నేతలు ఇసుకను ఆదాయవనరుగా మార్చుకున్నారు. దేశంలో ఎక్కడా లేని ధరకు ఇసుక అమ్ముతున్నారు. ఒక లారీ ఇసుక తెచ్చుకోవడం అంటే శేషాచలం కొండలనుంచి ఎర్రచందనం తెచ్చుకోవడం కన్నా ఎక్కువ ప్రయాస ఐంది. దీన్ని తెలుగుదేశం వాళ్ళు అక్రమంగా తరలిస్తూ ప్రజలకు అందకుండా చేస్తున్నారు. ఇదంతా కలిసి ప్రజలకు ఇసుక అనేది మహాప్రసాదం ఐంది. దీంతో ఇసుక సంపాదించి ఇల్లు కట్టి.. వ్యాపారం చేయడం గగనం అయిపోతోంది.వెంచర్లమీద వాలుతున్న పచ్చ రాబందులురాష్ట్రంలో వ్యాపారం చేసేందుకు వాతావరణం సరిగా లేదు. మొన్నటికిమొన్న మద్యం వ్యాపారం మోసం లక్షల్లో అప్పులుచేసి లైసెన్సులు తీసుకుని షాప్ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే టీడీపీ ఎమ్మెల్యేలు వాలిపోయారు.. మాకు పావలా వాటా ఇస్తావా.. షాప్ మూసుకుని వెళ్ళిపోతావా అని బెదిరించారు. అనంతపురం.. తాడిపత్రి ప్రాంతాల్లో జెసి బ్రదర్స్ అయితే లైసెన్స్ దారులమీద చేసిన రుబాబు రాష్ట్రంమొత్తం చూసింది. ఇప్పుడు ఇదే సంస్కృతి రియల్ ఎస్టేట్ లోకి కూడా పాకింది. ఎక్కడ ఎవరు ప్లాట్లు అమ్మడానికి.. అపార్టుమెంట్లు నిర్మించడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే చాలు టిడిపి నేతలు వాలిపోతున్నారు. మాకు రౌడీ మామూలు కడితే సరేసరి.. లేదంటే ఆ భూములు వివాదాస్పదం అంటూ రెవెన్యూ అధికారులతో దాడులు చేయిస్తూ ఆ భూములు ప్లాట్లు రిజిస్ట్రేషన్ కాకుండా ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో కోట్లు పెట్టి వ్యాపారం చేసేది తెలుగుదేశం వాళ్లకు సమర్పించుకోవడానికా అని రియల్టర్లు బెంబేలెత్తుతున్నారు. ఈ తొమ్మిదినెలలుగా ఇంటి స్థలాలు.. అపార్టుమెంట్ల అమ్మకాలు ఘోరంగా పడిపోయాయి. దీంతో కోట్లు పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వడ్డీలు కట్టలేక.. వ్యాపారం సాగక సతమతమైపోతున్నారు. ఇదేకాదు చిన్నాచితకా పరిశ్రమలు నడిపేవారిపైనా తెలుగుదేశం నేతలు రుబాబు చేస్తున్నారు. దీంతో డబ్బున్న వాళ్ళు కూడా పరిశ్రమలు పెట్టడం కన్నా బ్యాంకులో వేసుకుంటే భద్రంగా ఉంటుందని ఊరుకుంటున్నారు - సిమ్మాదిరప్పన్న -
Nara Lokesh: నారా లోకేష్ వింత వ్యాఖ్యలు
కందకు లేని దురద కత్తిపీటకు రావడం.. గజ్జికి లేని దురద జాలిమ్ లోషన్ కు రావడం అంటే ఇదే కావచ్చు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీద చేసిన కామెంట్లకు.. రావాల్సిన వారి నుంచి స్పందన రాలేదు. కానీ మంత్రి నారా లోకేష్ బాబు మాత్రం సత్వరమే స్పందించారు. అంతేకాకుండా ఎవరు ఎవర్ని విమర్శించాలన్నదాని మీద ఓ కొత్త రూల్ తీసుకొచ్చారు. ఎన్నికల్లో ఎవరికీ తక్కువ మెజారిటీ ఉంటె వాళ్ళు ఎక్కువ మెజారిటీ ఉన్నవాళ్లను విమర్శించరాదని కొత్త కాన్సెప్ట్ ను తెరమీదకు తెచ్చారు. బుధవారం జగన్ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ‘‘రెండు చోట్లా ఓడిపోయి .. దిక్కూదివాణం లేక మూడు పార్టీల పొత్తుతో గెలిచాడు.. అయన కార్పొరేటరుకు ఎక్కువ .. ఎమ్మెల్యేకు తక్కువ’’ అని పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే ఈ అంశానికి సంబంధించి పవన్ నుంచి ఎలాంటి సమాధానం.. కౌంటర్ రాలేదు.. కానీ ఆ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ మాత్రం పవన్‌ను డిఫెండ్ చేస్తూ ఏదో రిప్లై ఇచ్చారు. ఇక జనసేన కన్నా ఎక్కువగా లోకేష్ లైన్లోకి వచ్చేసారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సమయంలో లోకేష్ ఏకంగా పవన్ కాళ్లకు నమస్కారం చేసారు. పవన్ లేకుంటే.. బీజేపీ మద్దతు లేకుంటే తమకు ఈ అధికారం దక్కేది కాదని తెలుగుదేశంలో అందరికీ తెలుసు. అందుకే వాళ్ళు ఓ వైపు పవన్‌ను కంట్రోల్ చేస్తూ ఆయనకు స్వేచ్ఛ లేకుండా నియంత్రిస్తూనే మరోవైపు పవన్‌ను డిఫెండ్ చేయడం కూడా తమదే బాధ్యత అన్నట్లుగా లోకేష్ పెద్దరికం తీసుకుంటున్నారు.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. ‘‘ఏయ్ జగన్.. నీ మెజారిటీ ఎంత.. పవన్ మెజారిటీ ఎంత.. నీకన్నా పవన్‌కు ఎక్కువ మెజారిటీ వచ్చింది. అలాంటి నువ్వు ఆయన్ను విమర్శిస్తావా? అన్నారు. రాజకీయ విమర్శలకు మెజారిటీతో ముడిపెట్టి మాట్లాడడం సరికొత్త కాన్సెప్ట్.. లోకేష్ చెప్పినదానిప్రకారం పవన్ మెజారిటీ 70,279. కాగా జగన్ మెజారిటీ 61,687.. ఇక్కడ జగన్ కు పవన్ కన్నా తక్కువ మెజారిటీ కాబట్టి అయన పవన్‌ను విమర్శించకూడదు.. మరి ఈలెక్కన చంద్రబాబు 48,000 మెజారిటీతో గెలిచారు.. ఇది జగన్ కన్నా తక్కువే మెజారిటీ .. ఇప్పుడు లోకేష్ కొత్త కాన్సెప్ట్ ప్రకారం చంద్రబాబు కూడా తనకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చిన జగన్‌ను విమర్శించడం.. అవహేళన చేయడం కూడా తగదు కదా!.. ఇంకా లెక్కవేస్తే గతంలో వైఎస్ జగన్ ఎంపీగా గెలిచినా మెజారిటీ ఒక రికార్డ్.. కడప ఎంపీ స్థానానికి 2011 లో జరిగిన ఉప ఎన్నికల్లో జగన్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి 5,43,053 ఓట్ల మెజారిటీతో గెలిచారు.. ఇది రాష్ట్ర చరిత్రలోనే రికార్డ్. తెలుగుదేశంలో ఎవరూ ఇంత భారీ ప్రజామద్దతు పొందలేదు. తన అద్దె అన్నయ్యను కాపాడుకోవడం.. మద్దతు ఇవ్వడం ద్వారా అభిమానాన్ని పొందాలన్న దుగ్ధతో లోకేష్ కొత్తకొత్త కాన్సెప్టులు తీసుకొస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు.:::సిమ్మాదిరప్పన్న -
నా ఏజ్ ... గేజ్ చూడాలి కదా
నా ఏజ్ ఏంది.. .. నా గేజ్ ఏంది.. అన్నిటికి మించి నా రేంజ్ ఏంది.. అన్నీ తెలిసే నాకు ఈ పోస్ట్ ఇచ్చారా.. నా జూనియర్ల వద్ద నేను పని చేయాలా... వద్దు అంటూ మాజీ డిజి ఏబీ వెంకటేశ్వర రావు అలిగి కూర్చున్నారు. తనకు ఇచ్చిన పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో చేరకుండా ఊరుకున్నారు. తెలుగుదేశం హయాంలో ఇంటలిజెన్స్ డిజి హోదాలో పార్టీ కార్యకర్తకన్నా ఎక్కువగా పనిచేసారు.. ఆనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ దగ్గర్నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను బెదిరించిమరీ తెలుగుదేశంలో చేర్చడం వెనుక అయన కీలకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఆయన్ను సస్పెండ్ చేసింది.. దాదాపుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అయన పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్‌లో ఉంటూ కోర్టుల చుట్టూ తిరిగారు.. అయితే రిటైర్మెంట్ రోజే ఆయన్ను విధుల్లోకి చేర్చుకున్న ప్రభుత్వం అదేరోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేశారు. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చాక తనకు చాలా కీలకమైన బాధ్యత ఇస్తారని ఆశించారు. అలాంటిదేం లేకపోయినా రెండేళ్ల సస్పెన్షన్ కాలాన్ని సర్వీసుగా గుర్తిస్తూ దానికి సంబంధించి జీతభత్యాలు చెల్లించేలా మాత్రం కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.ఇక ఆయనకు మంచి ప్రాధాన్యం ఉండే పోస్టింగ్ పోస్టింగ్ ఇస్తారు అని ఆశించినా పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ పోస్ట్ ఇచ్చి ఊరుకున్నా ప్రభుత్వం ఆయన్ను అక్కడికి పరిమితం చేసింది. అయితే అది తన స్థాయికి తగిన పదవి కాదని, తన జూనియర్లు.. తన కింద పని చేసినవాళ్లు కూడా ఇప్పుడు తనకన్నా పెద్ద పోస్టుల్లో ఉన్నారని.. ఇప్పుడు తాను వారివద్ద ఎలా పని చేస్తానని అంటూ ఫిబ్రవరి ఒకటిన ఉత్తర్వులు వచ్చినా నెలరోజులు గడిచినా ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారు అనుకుంటే కేవలం ఒక శాఖకు సంబంచించిన ఓ పోస్టులో పడేశారని.. అందులో పెద్దగా చేయడానికి కూడా ఏమీ ఉండదని అయన అంటున్నారు. ఎస్పీలు.. ఇతర ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు ఉండవని.. వారిపై ఆధిపత్యం .. పవర్ చూపడానికి ఏమాత్రం అవకాశం లేని హోసింగ్ కార్పొరేషన్ పదవిలో ఎందుకు చేరాలని అయన మధనపడుతున్నారు. ఇటీవలనే రిటైర్ అయిన డీజీపీ ద్వారకాతిరుమల రావును ఆర్టీసీ ఎండీగా నియమించారని.. ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖర్ ను కూడా సర్వీసు పొడిగించి మరీ కొనసాగిస్తున్నారని.. అలాంటిది తాను తెలుగుదేశానికి ఇంత సేవలు చేస్తే తనకు ఇచ్చేది ఓ నామమాత్రపు పోస్టింగా అంటూ పెదవి విరిచి ఆ పోస్టులో చేరకుండా అలకవహిస్తున్నట్లు తెలిసింది. మరి ప్రభుత్వ పెద్దలు ఆయన్ను బుజ్జగిస్తారో.. ఇచ్చిందే ఎక్కువ తీసుకుంటే తీసుకో.. అలిగితే అట్టూ లేదు.. ముక్కా లేదని మిన్నకుంటారో చూడాలి.-సిమ్మాదిరప్పన్న -
శివరాత్రి జాగరణ: జగడమైనా ఆడుదాం.. జామురాతిరి వరకు గడిపేద్దాం..
ముక్కోటి దేవతలు ఒక ఎత్తు.. శివయ్య ఒక్కడూ ఒకెత్తు.. అందుకే శివయ్య పండగ శివరాత్రి అంటేనే ఒక ప్రత్యేకత.. అన్ని పండగలకూ ఇంట్లోనే పూజలు. మహా అయితే గుళ్లకు పోయి రావడం.. ఇంట్లో రకరకాల వంటలకు చేసుకుని తినడం.. భుక్తాయాసంతో రోజూకన్నా ఓ గంట ముందుగానే పడుకోవడం సర్వసాధారణం. కానీ శివరాత్రి అంటేనే వేరు.. ఆ పండగ చేసుకునే తీరే వేరు.. ఇష్టాను సారం తినడం. గుర్రుపెట్టి నిద్రపోవడం వంటి రెగ్యులర్ ఫార్మాట్ ఈ శివయ్య పండక్కి ఉండదు.. శివరాత్రికి దాదాపుగా ఉపవాసం ఉంటారు.. పండో.. ఫలమో తిని.. పంచామృతం వంటివి సేవించి రోజూకన్నా తక్కువ ఆహారంతో శివయ్యను సేవిస్తారు..అన్నిటికి మించి ఆ ముక్కంటి కోసం కోట్లాదిమంది ప్రజలు ఏకంగా జాగరణ చేయడం ఇందులో ప్రత్యేకత. జాగరణ అంటే ఎలా.. రోజూ తొమ్మిది.. పదింటికి నిద్రపోయే జనాలు తెల్లార్లు నిద్రపోకుండా ఉండడం ఎలా ? వారికి నిద్రను దూరం చేసేది ఎలా ? ఇప్పుడంటే రకరకాల చానెళ్లు.. ఓటీటీలు... టీవీల్లో ప్రత్యేక కార్యక్రమాలు వస్తున్నాయి కానీ 2000 సంవత్సరం వరకు జాగరణ అంటే అదొక ప్రత్యేక ప్లాన్ .. దానికోసం రెండురోజుల ముందునుంచే ఏర్పాట్లు.. ఉండేవి...పేకాడుకుందాం మామాఇప్పుడంటే ఏదీ వింతకాదు కానీ ఓ ఇరవయ్యేళ్ళ క్రితం వరకు జాగరణ అంటే అదో పెద్ద ప్రక్రియ. ఊళ్లలో కొన్ని చోట్ల శివకళ్యాణం .. గంగావివాహం వంటి కథాకాలక్షేపాలు ఉండేవి.. ఇంకొందరు జల్దీ ఫైవ్ .. లేదా పేకాట వంటివాటితో జాగరణ చేసేవాళ్ళు.. జగడం ఆడుతూ అయినా సరే జామురాతిరి వరకైనా జాగరణ చేయాలన్నది సూక్తి.. ఈ మేరకు కొందరు అర్థరాత్రి వరకు ఏదోలా ఓపికపట్టి జాగరణ ఉండేవారు..దానికోసం రకరకాల కార్యక్రమాలు.. కథా కాలక్షేపాలు.. రంగస్థల ప్రోగ్రామ్స్.. వంటివి ఊళ్లలో నిర్వహించేవాళ్ళు.. అది లేనివాళ్లు దగ్గర్లోని శివాలయం వద్ద కూర్చుని భజనలతో గడిపేవాళ్లు... ఆలయాల వద్ద తెల్లార్లు సాంస్కృతిక కాలక్షేపాలు ఉండేవి. కొన్ని పల్లెల్లో గ్రామం మొత్తం చందాలు వేసుకుని 16 ఎంఎం తెరలు కట్టి ఊళ్లలో సినిమాలు వేయించేవాళ్ళు.. కృష్ణ.. శోభన్ బాబు.. ఎన్టీయార్ సినిమాలు ఎక్కువగా ఈ చిన్న స్క్రీన్ మీద వేసి.. గ్రామం మొత్తం జాగరణ చేసేవాళ్ళు.కేబుల్ ఆపరేటర్ కు ఫోన్ కొట్టు.. నచ్చిన సినిమా పెట్టుఆ తరువాతి కాలంలో కేబుల్ టీవీలు వచ్చాయి.. అంటే 1990ల్లో కేబుల్ టీవీలు వచ్చాక జాగరణ తీరు మారింది. కేబుల్ ఆపరేటర్లు తెల్లార్లు తమ కేబుల్ చందాదారులకు సినిమాలు వేసేవాళ్ళు. అందరూ రాత్రి భోజనాలు చేసేశాక తమ టివిల ముందు కూర్చుంటే అయన వరుసగా ఓ నాలుగు సినిమాలు వేసేవాడు.. దీంతో తెల్లారిపోయేది. ఇంటిల్లిపాదీ టివిల ముందు కూర్చుని సినిమా చూస్తూ మధ్యలో నిద్ర వస్తే నాలుగు అడుగులు అటు ఇటు వేసి రావడం.. లేదా మధ్యలో టీ కాపీలు పెట్టుకుని తాగడం.... కొంతమంది అయితే కేబుల్ ఆపరేటరుకు ఫోన్ చేసి ఈ సినిమాలు వేయాలో లిస్ట్ కూడా ఇచ్చేవాళ్ళు. అందులోనూ మళ్ళా రికమెండేషన్లు.. కొంతమందికి మాత్రమే ఆపరేటర్ వద్ద పలుకుబడి ఉండేది.. కాబట్టి ఆ పలుకుబడి ఉన్న పెద్దలతో కేబుల్ ఆపరేటరుకు చెప్పించి.. చిరంజీవి.. నాగార్జున.. బాలకృష్ణ.. సినిమాలు వేయించి మెల్లగా జాగరణ పూర్తి చేసేవాళ్ళు.మిడ్ నైట్ సినిమాకు పోదాం మామాపల్లెల్లో జాగరణ చేయడం ఇష్టం లేని యువత మాత్రం నడిచి కొందరు.. సైకిళ్ళ మీద కొందరు దగ్గర్లోని పట్టణాలకు పోయేవాళ్లు. అక్కడ సెకెండ్ షో అయ్యాక అంటే రాత్రి 12 తరువాత ఒక షో సినిమా వేసేవారు. దాన్ని మిడ్ నైట్ షో అనేవారు. అది ముగిసేసరికి దాదాపు మూడు అయ్యేది.. ఒక్కోసారి ఊళ్లలోని టూరింగ్ టాకీసులు ఒకే టిక్కెట్ మీద రెండు సినిమాలు.. వేసి ప్రేక్షకులను రప్పించేవారు.. పట్టణాల్లోని దాదాపు అన్ని థియేటర్లల్లోనూ ఈ మిడ్ నైట్ షోలు వేసేవాళ్ళు.దీనికి రెండు రోజుల ముందు నుంచే .. పోస్టర్లు.. రిక్షాలో మైక్ పెట్టి ప్రచారం వంటివి చేసేవాళ్ళు.. జాగరణ రోజు ఊళ్లలో తెల్లార్లు టీ స్టాళ్లు నడిచేవి.. తెల్లార్లు సినిమాలు చూసి.. అట్నుంచటే నదీస్నానం చేసి జాతరకు వెళ్ళేవాళ్ళు.. కొందరు జోగుతూ సైకిళ్ళ మీద ఇళ్లకు చేరేవాళ్ళు.. జాతరలో బొమ్మలు.. జీళ్ళు.. ఖజ్జూరం.. సెనగలు.. చేరుకుముక్కలు కొనుక్కుని ఇళ్లకు రావడం ఒక మధురానుభూతి. ఇప్పుడు ఆ జాగరణ తీరు మారింది.. ఎవరింట్లో వాళ్ళు ఓటిటిలు.. బిజీ.. పక్కింటికి వెళ్లి మాట్లాడడం.. వారి ఇంట్లో కూర్చుని పేకాడుకోవడం.. కబుర్లాట అంతా నామోషీ.. ఇప్పుడు ఎవరికీ వారే యమునా తీరు.. ముక్కోటి దేవతలకు మహారాజు అయినా ఈ మనుషులమధ్య దూరాన్ని మాత్రం శివయ్య కూడా తగ్గించలేకపోతున్నాడు.-సిమ్మాదిరప్పన్న -
ఒరేయ్ గుంటల్లారా.. ఏట్లో జాగర్తర్రా
ఒరేయ్ గుంటల్లారా శివరాత్రికి గుంప సోమేశ్వరాలయానికి వెళ్తారు గావాలా... జాగర్త యేరు జోరుగా పారతంది .. గుమ్ములు.. గోతులు ఉంతాయి ... ఎక్కడబడితే అక్కడ దిగకండి.. జాగర్తగా చూసుకుని ఎల్లండి.. మళ్ళా రాత్రివరకు ఉండకండి.. గమ్మున సెనగలు ఖజ్జూరం కొనుకుని వచ్చియండి. మళ్ళా రేపు వెల్దురు లెండి.. అంటూ అమ్మమ్మ చెప్పిన జాగర్తలు ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయ్. అవును విజయనగరం జిల్లాలో పార్వతీపురం ఏజన్సీ ప్రాంతంలో నాగావళి,. జంఝావతి నదుల సంగమ ప్రాంతంలో ఉన్న ఈ సోమేశ్వరాలయం ద్వాపరయుగంలో బలరాముడు ప్రతిష్టించాడని అంటారు. ఆయన తన నాగలితో ఒక చారికను గీయగా ఏర్పడిందే నాగావళి అని, అదే సమయంలో శివ లింగాన్ని కూడా బలరాముడే ప్రతిష్టించాడని స్థలపురాణం చెబుతోంది.ఒడిశా.. శ్రీకాకుళం.. పార్వతీపురం ప్రాంతాలనుంచి వచ్చే వేలాదిమంది భక్తులతో శివరాత్రి నాడు సోమేశ్వర ఆలయం కిక్కరిసిపోతుంది. పిల్లాపెద్దా ముందురోజే.. అంటే జాగరణ రోజే ఎడ్లబళ్ళమీద నాగావళీ తీరానికి చేరడం.. సమీప తోటల్లో బస చేసి.. అక్కడే వండుకుని తిని.. ఆరోజు నాగావళి ఇసుక తిన్నెలమీద వేసే పౌరాణిక.. జానపద నాటకాలు డ్రామాలో చూసి తెల్లారుతూనే రెండునదుల సంగమం వద్ద మూడు మునకలేసి సోమేశ్వరుడిని దర్శించుకోవడం గొప్ప అనుభూతి. శివరాత్రి రోజు పగలంతా అక్కడే ఇసుక తిన్నెల్లో తిరగడం.. ఒళ్ళు వేడెక్కగానే బుడుంగున మళ్ళీ నీటిలో మునగడం.. ఆలయం వద్ద ఇచ్చే ప్రసాదాలు తినడం. ఆడుకోవడం ఇదే.. ఇక పొద్దల్లా శివయ్య సన్నిధిలోనే గడిచిపోయేది.. ఎంత పుణ్యం. ఎంత మోక్షం వచ్చిందో లెక్క తెలీదు.. అవును బాల్యం అంటేనే పుణ్యం.. ఆకాలం అంతా పుణ్యకాలమే.. ఎక్కడా పాపం అంటని పనులు.. ఎప్పుడూ అబద్ధం చెప్పని నోరు.. ఏరా నీకు ప్రసాదం ఇందాకే ఇచ్చాను కదా అని పూజారి అంటే.. కాదని అనడం రాక.. అవును ఇచ్చారు కానీ మళ్ళీ ఇవ్వండి అనేంత అమాయకత్వం..శివయ్య పండగ అంటే ముల్లోకాలకూ సంబరం.. అందులోనూ బాల్యంలో ఉన్న మాలాంటి పిల్లిబిత్తిరిగుంటలకు మరింత సంబరం... అలా యేటి గట్టుపై కూర్చుని వచ్చిపోయే పిచ్చికలను చూడడం.. నీటిలో జలకాలాడే చేపలను ఉత్తచేత్తో పట్టుకోవాలని ఆరాటపడడం. అవి చేతికి దొరికినట్లే దొరికి చేతిలోంచి జారిపోవడం.. ఒక అద్భుత అనుభవం.. కానీ అంతెత్తున ఎగిరే కింగ్ ఫిషర్ మాత్రం క్షణాల్లో డైవ్ చేసి నా కళ్ళముందే పెద్ద పెద్ద పరిగెలను ఎత్తుకెళ్ళడం చూసి సంభ్రమాశ్చర్యానికి లోనవడం.. డొంక దారిన శివాలయానికి అని వచ్చే కొన్ని యువ జంటలు మార్గమధ్యంలో పరాచికాలు ఆడడం.. అవన్నీ మా పిల్లగుంటల కంటబడటం కూడా ఓ జ్ఞాపకం. అమ్మమ్మ ఇచ్చిన ఐదు రూపాయల్లో అంతా లాటరీలు.. గుండాటలో పోగొట్టకుండా జాగ్రత్త చేసుకుని .. కొంత ఖర్చుకు పోను.. ఇంటికి వెళ్ళేటపుడు సెనగలు. ఖర్జూరం పట్టుకెళ్ళడం మనం సాధించిన ఘనవిజయమే.. అందుకే అంటారు బాల్యం బంగారం అని.-సిమ్మాదిరప్పన్న. -
మరేటి సేత్తామ్ .. పనుల్లేవు.. దేశం ఎలిపోదాం
పల్లకోయే లచ్చిమి.. ఏదో ఈ మూడోరాలు చేసిద్ధుమా.. వందో.. వెయ్యో పట్టుకొస్తే మెల్లగా రెండు నెలలు గడిచిపోతాయి... పల్లక ఇంట్లో కూకుంటే ఏటి వస్తాది చెప్పు... తిరిగి చేతి ఖర్చు కాకపోతే.. కష్టమో నష్టమో.. అటు వెళ్తే కాలం గడుస్తాది... పూట గడుస్తాది.. చెబుతోంది మంగ. అవునుగానీ పిల్లలిద్దరినీ అమ్మగారింట్లో ఒగ్గిసి రావడం మనసుకు కష్టంగానే ఉంది... కానీ చేతిలో పైసా లేదు.. పైగా ఖర్చులు చూస్తుంటే మరింత భయంగా ఉన్నది.. పిల్లల చదువులు. వారి బట్టలు.. పుస్తకాలూ.. ఇవన్నీ తల్చుకుంటే భయంగా ఉంది.. అందుకే నీతో వస్తన్నాను.. అప్పుడైతే జగన్ డబ్బులొచ్చేవి.. ఇప్పుడు అవి కూడా పైసా కానరావడంలేదు.. అవి వచ్చింటే చేతికి ఆధారమయ్యేది.. ఇప్పుడు అంతా మేమిద్దరమే పడాలి అంటూ చేతిలోని సమోసా ముక్క భర్త రామినాయుడికి ఇచ్చింది.. నాకొద్దే నువ్వు తిను అన్నాడు అయన..మీ మొగుడూ పెళ్ళాల ముచ్చట్లు ఆపర్రా... అంది మంగ.. అవును మంగొదినా... పిల్లల్ని వదిలేసి ఈయన్ను ఈ మనిషిని వెంటేసుకుని జిల్లాలకు జిల్లాలు మారిపోయి అక్కడ పెసరచెను తీతకు వెళ్లడం మనసుకు కష్టంగానే ఉంది కానీ.. ఇక్కడ పైసా లేదు.. అందుకే.. అంటూ పిల్లల్ని తలచుకుని మథనపడింది... పోన్లేవే... లచ్చిమి.. రోజుకు ఒకరికి ఏడొందలు.. మీ మొగుడూ పిల్లలకు పదిహేను వందలు.. ఇద్దరూ రెండు వారాలు చేస్తే ఎంతోకొంత చేతికి వస్తాది.. పైగా బియ్యం వాళ్లే ఇస్తారు.. పడుకోడానికి రూములు కూడా వాళ్ళవే అని మంగ చెబుతుంటే లక్ష్మి కళ్ళు భయం.. ఆందోళన స్థానే కాస్త ధైర్యం.. మెరుపు సంతరించుకున్నాయి.రాయగడ నుంచి గుంటూరు వెళ్లే ప్యాసింజర్ మహిళలు.. కూలీలతో కిక్కిరిసిపోయింది.. అడుగుతీసి అడుగేయలేని పరిస్థితి. అందరూ నెత్తిన మూటలు.. కొందరు పారలు.. గునపాలు సైతం పట్టుకుని ఎక్కేసారు.. దాదాపుగా అందరూ కిందనే కూర్చున్నారు. ఏమ్మా అక్కడికి అని అడిగితె గుంటూరు.. వెళ్తున్నాం బాబు అన్నారు.. ఎందుకూ అంటే అక్కడ పెసర.. మినపచేలు తీయడానికి వెళ్తున్నాం అన్నారు. అక్కడ కూలీలు దొరకడం లేదట.. పార్వతీపురం ప్రాంతంనుంచి మహిళలు.. పురుషులను ఆ చేను తీయడానికి తీసుకెళ్తున్నారు. ఒకొక్కరికి ఏడువందలు రోజుకూలీతోబాటు జంటకు రోజుకు రెండుకేజిల బియ్యం కూడా ఇస్తారు.చిన్న రూము.. షెడ్లు కూడా ఉంటాయి.. అక్కడే వండుకుని తిని ఇద్దరూ తెచ్చుకున్న డబ్బును జాగత్త చేసుకుని మూడు వారాల తరువాత మళ్ళీ సొంత ఊళ్లకు వెళ్తారు.. సీతానగరం.. పార్వతీపురం.. కురుపాం ... బాడంగి.. రామభద్రపురం మండలాల నుంచి కూలీలు ఇదే ట్రైన్లో వెళ్తారు.. వంటకు ఎలా మరి అని అడిగితే ఒసే.. పళ్లకుందో ... అప్పులు..పప్పులు.. వర్రగుండ .. పచ్చళ్ళు.. చింతపండు.. అన్నీ పట్టుకెళ్ళిపోతాం కదేటి .. అక్కడే కఱ్ఱలపొయ్యిమీద నాలుగు గింజలు ఉడకేసుకుని తినేసి పడుకుండిపోతాం అంటారు అందరూ కోరస్ గా.. పిల్లల్ని ముసలోళ్ల చెంత వదిలేసి వెళ్లడం బాధగానే ఉంది కానీ.. ఇద్దరం ఈ నాలుగురోజులు కష్టపడితే ఓ ఇరవైవేలు వస్తాయి.. జూన్‌లో పిల్లల చదువులు.. ఇతర ఖర్చులకు సరిపోతాయి.. అందుకే ఎంతదూరం అయినా వెళ్తామని... మనసు దిటవు చేసుకుని షార్ట్ టైం లేబర్ పేరిట కృష్ణ గుంటూరు జిల్లాలకు వెళ్తుంటారు..-సిమ్మాదిరప్పన్న -
సీఐడీలో C అంటే చంద్రబాబేనా?
వ్యవస్థలను మ్యానేజ్ చేయడం.. అందులోని వాళ్ళను వివిధమార్గాల ద్వారా తన దారికి తెచ్చుకోవడం.. అవసరాన్ని బట్టి అవతలివారి అవసరాలు తీర్చడం,. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం.. ఇలాంటి జయప్రదంగా చేసిన రికార్డ్ చంద్రబాబుకు ఉంది. ఇందుకోసం అయన ఎన్ని మెట్లు కిందికి దిగిపోవడానికైనా వెనుకాడరు. తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఏ వ్యవస్థను అయినా భ్రష్టుపట్టించగలరు.. తన తన కాళ్లకిందకు తెచ్చుకోగలరు. తన చర్యలతో సదరు వ్యవస్థల గౌరవం.. ఔన్నత్యం ఎలా మంటగలిసిపోయినా చంద్రబాబు ఫర్వాలేదనుకుంటారు. తన ప్రయోజనాలే తనకు ముఖ్యం అనేది ఆయన పాలసీ. కేసులు దర్యాప్తు చేసే పోలీసు వ్యవస్థను సైతం నేరుగా వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.చంద్రబాబు(Chandrababu) గతంలో వ్యవస్థలను, ప్రభుత్వ పెద్దలను తనకు అనుకూలంగా మార్చుకుని వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎంతలా ఇబ్బందులు పెట్టింది తెలిసిందే. జగన్ సీఎంగా ఉన్నప్పుడూ కూడా అది నడిచింది. మరోవైపు.. చంద్రబాబు 2014-19 మధ్య స్కిల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బును ఏ విధంగా పక్కదారి పట్టించింది.. వేర్వేరు సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులను సొంత సంస్థలకు మళ్లించుకుని... ఆ డబ్బును తాను కాజేసిన అంశం గురించి తెలిసిందే. ఈ వ్యవహారంపై వైయస్ జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. స్కిల్ స్కాంకు సంబంధించిన అన్ని ఆధారాలూ అప్పటి ఏపీ సీఐడీ(AP CID) విభాగం చీఫ్ సునీల్ కుమార్ సారథ్యంలోనే దర్యాప్తు బృందాలు సేకరించి కోర్టుకు అందజేశాయి. దీంతో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై బెయిల్ మీద కూడా వచ్చారు. ఐతే ప్రభుత్వం మారగానే చంద్రబాబు దర్యాప్తు సంస్థ మీద మీద కన్నేశారు. తనను ముప్పుతిప్పలు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిన సీఐడీనీ.. దాని అధికారులను టార్గెట్ చేసారు. ఐజీ సంజయ్, సునీల్ కుమార్ తదితరులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్ కేసు సైతం లేకుండా చేసేందుకు సీఐడీలోని తన విధేయులైన అధికారులద్వారా కథ నడిపిస్తున్నారు.ఇదీ చదవండి: చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు విప్పని సీఐడీరాజగురు రుణం తీర్చుకుంటూ..ఇన్నాళ్లూ రాజకీయంగా తాను చేస్తూ వస్తున్నా అవినీతి.. అక్రమాలను కాపాడుతూ వస్తున్నా రాజగురు రామోజీరావు(Ramoji Rao)కు ఋణం తీర్చుకునేందుకు చంద్రబాబు నడుం బిగించారు. రామోజీకి చెందిన మార్గదర్శిపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా వేలాదికోట్ల డిపాజిట్లను సేకరించిన అభియోగం మీద కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రూ. 1,050 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ సైతం తెలంగాణ హైకోర్టుకు గతంలోనే ఆధారాలు అందించింది. ఈలోపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్ళీ సీఐడీ ప్లేటు ఫిరాయించింది. ఇదీ చదవండి: మార్గదర్శిపై కేసు.. మా పొరపాటే!మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు(Margadasi Illegal Deposits) సేకరించినట్లు తాము ఆధారాలు సంపాదించలేకపోయామని, కొద్దోగొప్పో వివరాలు ఉన్నా.. వాటితో మార్గదర్శిని విచారించలేమని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. తాము ఇక కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేసినా ఫర్వాలేదని సీఐడీ కోర్టుకు నివేదించింది. చంద్రబాబు పవర్లో ఉంటే కేసులు కూడా మాఫీ అయిపోతాయి. తమ అనుయాయులంతా పత్తిగింజలు అయిపోతారు.. తనకు రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో వెన్నుదన్నుగా మారినవాళ్లను కాపాడేందుకు చంద్రబాబు మరోమారు సీఐడీని ఇలా దిగజార్చుతున్నారు.:::సిమ్మాదిరప్పన్న -
కామాఖ్య దర్శనం.. చిరస్మరణీయం
దేశంలో వివిధ రకాల ఆలయాలున్నా వాటన్నిటిలోనూ ముఖ్యమైనది.. విశిష్టమైనది కామాఖ్య... ఆలయంలో పూజలు చేసే విధానం.. దర్శన నిబంధనలు కూడా ఇతర ఆలయాలకు భిన్నంగానే ఉంటుంది. దక్షుని యజ్ఞావటికలో ఆత్మార్పణ చేసుకున్న సతీదేవి శరీరాన్ని మోస్తూ శివుడు విలయతాండవం చేశాడు. ఆ తండవానికి ముల్లోకాలూ వణికిపోయాయి. దీంతో శివుని తాండవం ఆపడానికి సతీదేవిని విష్ణుమూర్తి తన చక్రంతో ఖండఖండాలుగా చేశారు. ఆ తరుణంలో సతీదేవి శరీర భాగాలు పడిన ప్రాంతాలన్నీ శక్తి పీఠాలుగా పూజలందుకుంటున్నాయి. ఇందులో 18 ముఖ్యమైనవాటిని అష్టాదశ శక్తిపీఠాలు అంటారు. అందులో సతీదేవి జననాంగం పడిన ప్రాంతమే ఈ కామాఖ్య.ఇక్కడ అమ్మవారు మహిళల జననాంగం రూపంలోనే దర్శనం ఇస్తారు. ముఖ్యంగా ఈ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు చేయడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందుతారన్న విశ్వాసం ఉంది. సంతానం లేనివారు సైతం ఈ ఆలయాన్ని దర్శించడం ద్వారా తమ ఆశలు నెరవేర్చుకుంటారు. మహిళలకు సంబంధించి సమస్యల నుంచి సైతం కామాఖ్య దర్శనం విముక్తి కలిగిస్తుందని విశ్వాసం. ఈ ఆలయాన్ని ఏటా నాలుగు రోజులపాటు మూసి ఉంచుతారు.ఏటా ఆషాఢ మాసంలో ఏడో రోజు నుంచి పదోరోజు వరకు అమ్మవారు ఋతుస్రావం లో ఉంటారని భావించి ఆ రోజుల్లో భక్తులకు దర్శనం నిలిపివేశారు. ఈ 2025లో జూన్ 22 నుంచి 25 వరకు ఆలయం తలుపులు మూసేసి ఉంచుతారు. ఆ తరువాత భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ సందర్భంగా అంబుబాచీ మేళా పేరిట భారీగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ నాలుగు రోజులు ఆలయ గర్భ గుడిని తెల్లని వస్త్రాలతో .. అమ్మవారి ప్రతిరూపాన్ని తెల్లని వస్త్రాలతో కప్పి ఉంచుతారు. నాలుగో రోజు ఆలయం తెరవగానే ఆ తెల్లని వస్త్రాలు కాస్తా ఎర్రబారతాయి..అంతేకాకుండా. అమ్మవారి ప్రతిరూపం ( జననాంగం) వద్ద నిత్యం ప్రవహించే నీటి ఊట కూడా ఆ రోజుల్లో ఎర్రగా మారుతుంది.ఎర్రని వస్త్రం మహా ప్రసాదంఆ రోజుల్లో ఎర్రగా మారిన వస్త్రాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి భక్తులకు అందజేస్తారు. ఈ వస్త్రం ఇంట్లో.. పూజా మందిరంలోనుంచుకుంటే శుభాలు కలుగుతాయని.. మహిళల ఆరోగ్యం బాగుంటుందని భక్తుల విశ్వాసం.పాంచ్ బలిఅమ్మవారి ఆలయంలో ఇంకో విశిష్టమైన బలి పూజ. జరుగుతుంది. పాంచ్ బలి.. అంటే కామాఖ్యకు ఐదు రకాల పదార్థాలను అర్పిస్తారు. ఎనుబోతు.. మేక.. బాతు ఈ మూడింటిని ఆలయంలో బలి ఇస్తారు..వీటితోబాటు బూడిద గుమ్మడి కాయను. చెరుకు గడను సైతం అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ఐదింటిని కలిపి పాంచ్ బలి అంటారు. మనోభీష్టం సిద్ధించడానికి కొంతమంది ఇలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు. సింహాచలం.. వేములవాడలో కోడె మొక్కులు మొక్కుకుని స్వామికి దూడలు సమర్పించినట్లు ఇక్కడ భక్తులు అమ్మవారికి మేకలు సమర్పించి ఆలయంలో వదిలేస్తారు. అవి ఆలయంలో సందడి చేస్తూ జనం మధ్యలో తిరుగుతుంటాయి. ఉచిత దర్శనం కోసం కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. లేదా పరిమిత సంఖ్యలో ఇచ్చే రూ.500 టికెట్ల కోసం వేకువజామున లైన్లో ఉంటే తెల్లవారేసరికి ఆ టిక్కెట్ తీసుకుని రెండు గంటల్లో దర్శనం చేసుకోవచ్చు. దీంతోబాటు బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉండే కొండపై ఉండే ఉమానంద శివాలయాన్ని లాంచీలో వెళ్ళి చూసి రావడం ఓ మధురానుభూతిని కలిగిస్తుంది. గౌహతికి దేశంలోని అన్ని మూలల నుంచి రైళ్లు.. విమాన సౌకర్యాలు ఉన్నాయి. హోటళ్లు.. లాడ్జిలు.. టాక్సీలు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటాయి.-కామాఖ్య నుంచి సిమ్మాదిరప్పన్న -
యేటి వదినీ... పిల్ల దొరికిందా...
యేటి మంగొదినా పండుగ అయిపొయింది.. మాఘమాసం వచ్చిసింది.. మన రాజేష్ కోసం పిల్లను చూస్తున్నారా లేదా.. యేటి మరి.. ఇంకెన్నాళ్లు ఉంచుతావు.. ఎంత ఉంచితే అంతెక్కువ కట్నం వస్తాదని గట్రా లెక్కేస్తున్నావా యేటి అంది వరలక్ష్మి .. లేదొదినా అదేట్లేదు .. సూత్తన్నాము.. మేము చూసిందాన్ని వాడు నచ్చడం లేదు.. వాడికి నచ్చిందేమో మాకు కుదరడంలేదు.. అన్నిటికి మించి ఇప్పుడు ఆడపిల్లలు కూడా బోలెడు లెక్కలేస్తాన్నారు..అంటూ చెబుతోంది మంగ... 'ఆ నీ నోటికి భయపడి ఎవరూ ఇవ్వడం లేదని చెప్పొచ్చుగా.. లోలోన అనుకుంది వరలక్ష్మి.. అయినా నాకెందుకులే అని ఊరుకుని.. లేదులే వదినా నీకు కోడలు అవ్వాలంటే ఎవరికో బీభత్సంగా రాసిపెట్టి ఉండాలి.. అంటూ కవరింగ్ ఇచ్చింది. వాస్తవానికి మంగమ్మ పేరులోనే అమ్మ ఉందికానీ మనిషి మాత్రం మహంకాళీ అని చుట్టుపక్కల పేరు.. నోరు తెరిస్తే శృతి ఆరున్నరకు చేరుతుంది.. మామూలోళ్ళంతా పరారవ్వాల్సిందే.. ఇప్పటికే పెద్దకోడలు ఈమెకు దండం పెట్టేసి మొగుడు సూర్యనారాయణతో పట్నంలో వేరుకాపురం పెట్టేసింది.. ఇప్పుడు చిన్నోడు రాజేష్ కోసం పిల్లను చూస్తున్నారు. కానీ మంగమ్మ నోటికి జడిసి ఎవరూ పిల్లను ఇవ్వడం లేదు..మాకేమో కట్నం ప్రసక్తి లేదు.. పిల్ల బాగుంటే చాలు... బుద్ధిమంతురాలైతే ఇంకా మేలు.. అయినా మనం అడిగినా లేకున్నా ఆడపిల్లకు ఇవ్వాల్సినవి వాళ్ళు ఇస్తారు కదా వదినా అంటూ అసలు విషయం చెప్పింది మంగమ్మ. అయినా ఈరోజుల్లో మీలాగా కట్నం వద్దంటున్నవాళ్ళు ఎవరున్నారు.. నువ్వంటే మంచిదానివి కాబట్టి సరిపోయింది అని అంటూనే దీనికి కట్నం వద్దట కానీ డబ్బున్న సంబంధాలే చూస్తోంది అని మనసులోనే బుగ్గలు నొక్కుకుంది వరలక్ష్మి. పోనీ వాడికి ఎవరైనా నచ్చినపిల్ల ఉందేమో చూడలేకపోయావా సలహా ఇచ్చింది వరలక్ష్మి.. ఊరుకో వదినీ.. వాడికేం తెలుసు.. నోట్లో వేలెడితే కొరకలేని అమాయకుడు.. వాడికి నచ్చడం ఏంది... వాడి చెడ్డీలు. బనీన్లు కూడా నేనే కొనాలి.. నా మాటే వాడికి వేదం.. గర్వంగా చెప్పింది.. మంగమ్మ.. ఎంతైనా నువ్వు లక్కీ వదినా.. అటు అన్నయ్యను.. ఇటు పిల్లలను ఆడిస్తున్నావు అనేసింది వరలక్ష్మి.. అదేటి అంతమాట అనేశావు అంది మంగమ్మ.. ఆడించడం అంటే వాళ్లంతా నీ కనుసన్నల్లో ఉంటారు అంటున్నా.. అంటూ కవర్ చేసేసింది వరలక్ష్మి.. మొత్తానికి ఆ చుట్టుపక్కల ఆరేడు మండలాలు.. మూడు నియోజకవర్గాలు కవర్ చేసినా మంగమ్మాకొడుక్కి పిల్ల దొరకలేదు.. పిల్లలు ఉన్నా ఈమె నోటికి జడిసి ఇవ్వడం లేదు. చూసిచూసి ఈవిడకు విసుగొచ్చింది.. అలాగని నోటిని కంట్రోల్ చేసుకుని మంచిగా ఉండడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు.. పైగా ఇన్నేళ్ళపాటు గయ్యాళి బ్రాండ్ దక్కించున్న మంగమ్మ ఇప్పటికిప్పుడు అమాయకపు కన్నాంబ పాత్రలోకి మారడం కష్టమే.. అందుకే ఇక ఆమె పెళ్లి విషయాల ప్రస్తావన ఆపేసింది.ఓరోజు తెల్లారేసరికి కార్లో దిగాడు రాజేష్.. పక్కన దండలతో ప్రమీల.. తాను చూస్తున్నది కలయా నిజమా .. తెలీక కాసేపు మంగమ్మ అలాగే కొయ్యలా నిలబడిపోయింది. ఒరేయ్ రాజేష్ ఏందిరా ఇది అని అడిగింది.. అవునమ్మా ఇక నీ నోటి బ్రాండ్ దెబ్బకు నాకు పెళ్లవ్వదని అర్థం ఐంది.. అందుకే ఇదిగో పక్కూరి వజ్రమ్మ కూతుర్ని చేసుకున్నాను.. ప్రమీల నాతోబాటే ఉద్యోగ చేస్తోంది.. అన్నాడు.. వజ్రమ్మ అంటే తనను మించిన నోటి దురుసు.. తనది మండల్ లెవెల్ అయితే ఆమెది జిల్లా లెవెల్.. ఆపిల్లతో తనకొడుకు ఎలా వేగుతాడో అనుకుంటూనే మరి వేరే మార్గం లేక దిష్టి తీసి ఇంట్లోకి పిలిచింది.. సిమ్మాదిరప్పన్న -
పిల్లలూ దేవుడూ.. చల్లనివారే
మామా మందుకు డబ్బుల్లేవా.. డోంట్ వర్రీ మామా.. నేనున్నాను కదా పదా పోదాం.. ఇదిగో సిగరెట్ తీసుకో బావా.. భయమెందుకు నేనున్నా.. కదా.. బే ఫికర్ బ్రదర్.. నేను చూస్కుంటానులే.. ఈ చొక్కా నచ్చిందా తీసుకో.. నేను బిల్లు పే చేస్తాను.. ఆగాగు.. టిక్కెట్ నువ్వెందుకు తీయడం.. నీకసలే జీతం తక్కువ.. ఇంకెప్పుడూ పక్కన నేను ఉండగా నువ్వు జేబులో చేయి పెట్టొద్దు.. పెట్రోల్ నేను పోయిస్తాను తమ్ము.. నువ్వెందుకు కంగారు పడతావ్... ఇలాంటి స్నేహాలు మనం చూస్తూనే ఉన్నాం..వద్దులే లక్ష్మి ఆటోచార్జీ పది రూపాయలు నువ్వు ఇవ్వకు.. నేను ఇస్తాలే.. ఒసేయ్ మంగా మేమంతా తలో రెండొందలతో ఆరుకు వెళ్తున్నాం.. నువ్వూ రావాలి.. డబ్బులెం ఇవ్వద్దులే.. మేం చూసుకుంటాం.. జస్ట్ నువ్వు ఆటో ఎక్కు చాలు.. ఇదీ హౌస్ వైవ్స్ స్నేహం.. హలొ.. బ్రదర్ రాజేష్.. మనవాళ్ళం ముగ్గురం బిజినెస్ పెడుతున్నాం తలో టూ క్రోర్స్ ఉండాలి.. నువ్వు అంత పెట్టలేవు.. ఎంత ఉంటే అంత పెట్టు.. చాలు.. మిగతాది మేం చూస్తాం.. నువ్వేం ఫీల్ కావద్దు.. హలో రెడ్డీ.. ఈ బిజినెస్ మనదే.. పెట్టుబడి నేను పెడతాను.నువ్వు జస్ట్ డబ్బుల్లేకున్నా వర్కింగ్ పార్ట్నర్ గా ఉండు.. పని మొత్తం నువ్వే చూసుకో.. ఇదో టైప్ స్నేహం.. అసలు స్నేహం.. ఇతరులకు సహాయం చేయడం ఇది ఒక జీవన విధానం అయింది.. చిన్నప్పుడు తెచ్చుకున్న బిస్కెట్ ముక్క.. కాకెంగిలి చేసి ఇచ్చిన ఉసిరికాయ లంచ్ టైములో తన డబ్బాలోంచి తీసిచ్చిన చిన్న ఆవకాయ ముక్క.. ఇవన్నీ మనలోని ఒక ఆత్మీయ భావనకు సూచికలు ...ఒక్కడే తిన్నది తిండీ కాదు.. ఒక్కడే బతికింది బతుకూ కాదు.. మనిషి సంఘ జీవి.. తాను బతుకుతూ ఇంకొందరిని బతికించాలి.. తానూ తింటూ ఇంకొకరి ఆకలి తీర్చాలి అప్పుడు కదా జీవితానికి సార్థకత. కాకి .. పిచ్చుక.. కుక్కలు కూడా తాము తింటూనే అక్కడ అక్కడ గింజలు.. మెతుకులు ఉన్నాయ్.. మీరూ రండి అని తోటివాళ్లను పీలుస్తాయి.. అంతా కలిసి ఆకలి తీర్చుకుంటాయి.. కానీ మనిషి ఒక్కడే తాను తింటే చాలనుకుంటాడు.చిన్న పిల్లలు.. పెద్ద మనసులు ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఓ స్కూల్లో పిల్లలు తమ సహచరుడి ఫీజ్ కోసం ఎంత యాతన పడ్డారు.. వారంతా ఐక్యంగా ఆ సమస్య నుంచి తమ మిత్రుడిని ఎలాగట్టెక్కించారన్నది ఒక వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది. దీనికి వేళల్లో షేర్లు.. వందల్లో కామెంట్లు వచ్చాయి. స్కూల్లో ఫీజు చెల్లించలేదని ఒక అబ్బాయిని స్కూలు మేనేజిమెంట్ ప్రశ్నిస్తుంది.. అయితే తన తండ్రి పేదరికం కారణంగా ఆ పిల్లడు ఫీజు సకాలంలో చెల్లించలేకపోతాడు.. దీంతో అతని సహచరులు.. అంతా పదేళ్లలోపు పిల్లలే అయినా పెద్దమనసు చేసుకుంటారు.. తలా కొంత వేసుకుని స్నేహితుడి ఫీజు చెల్లిస్తారు.వారు తమలోతాము చందాలు వేసుకుంటుండగా టీచర్ వచ్చి అబ్బాయిలు.. మీ ఫ్రెండ్ ఫీజు సంగతి నేను చూసుకుంటాను.. మీరు వెళ్ళండి.. మీకెందుకురా కష్టం అని చెబుతున్నా.. మీ సాయం మాకు అవసరం లేదు.. మా వాడికి మేమున్నాం.. మేం చూసుకుంటాం అని వారంతా ఏకమై తమ మిత్రుడి ఫీజు చెల్లించిన వీడియో అందరి హృదయాలను కదిలిస్తోంది. తనకోసం వాళ్లంతా ఇలా డబ్బులు వేసుకోవడాన్ని చూసిన ఆ పిల్లడు కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తే మనకైనా మనసు కరుగుతుంది. ఇది కదా పిల్లలలో ఉండాల్సింది. ఇలాంటి లక్షణాలు కదా పిల్లల్లో మొలకెత్తాలి.. అలా పిల్లల్లో పురుడుపోసుకున్న ఆలోచనలకూ తల్లిదండ్రులు సైతం తోడ్పాటును ఇవ్వాలి-సిమ్మాదిరప్పన్న These young good hearts collected money to pay fees of his friend 🥺I hope these young angels continue their pure and innocent spirit and bless the world 🙌 pic.twitter.com/BGQ2uw9d5o— Vineeta Singh 🇮🇳 (@biharigurl) February 7, 2025 -
పవన్ Vs లోకేష్.. బాబు ప్లాన్ ఫలించినట్టేనా?
చంద్రబాబు చేసేది చౌకబారు రాజకీయం.. చిల్లర వ్యవహారాలు కానీ బిల్డప్పులు మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి.. ఇంతవరకు ఏ ప్రధానమంత్రి కూడా చేయని విధంగా పాలన సాగిస్తున్నట్లు ఆయన ప్రచారం చేసుకుంటారు. ఎప్పట్లానే చంద్రబాబు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మంత్రుల పనితీరుకు ప్రాతిపదిక ఏమిటో.. వారి ర్యాంకింగ్స్ ఏ అంశాల మీదుగా నిర్ణయించి ఇచ్చారన్నది ఆయనకు తప్ప వేరే ఎవరికీ తెలియదు.మొత్తానికి క్యాబినెట్‌లోని పాతిక మంది మంత్రులకు చంద్రబాబు ర్యాంకింగ్ ఇచ్చేశారు. అందులో ఎన్ఎండీ ఫరూక్ మొదటి ర్యాంకులో ఉండగా జనసేనకు చెందిన కందుల దుర్గేష్ రెండో ర్యాంకులో ఉన్నారు.. చంద్రబాబు ఆరో స్థానంలో ఉండగా లోకేష్‌కు ఎనిమిది ర్యాంకు దక్కింది.. అన్నింటికీ మించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదో స్థానంలో నిలిచారు. అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అందరి పనితీరును మదింపు చేసే చంద్రబాబు ఆరో ర్యాంకులో నిలవడం ఏమిటో మరి విచిత్రంగా ఉంది.మంత్రులు అందరికన్నా ఎక్కువ అని ఫీలయ్యే లోకేష్ అన్ని శాఖలను సమన్వయం పేరిట కెలికేస్తున్నారు. ఒక పవన్ కళ్యాణ్ చూస్తున్న పంచాయతీరాజ్ శాఖ మినహా ఇతర అన్ని శాఖల్లోనూ లోకేష్ పెత్తనం సాగుతోంది. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్తే ఏ మంత్రి కూడా కిక్కురుమనే పరిస్థితి లేదు.. ఆయన అనధికారికంగా సీఎంగా కొనసాగుతున్నారు.. ఢిల్లీ వెళ్లి పెద్దలను కలవాలన్నా.. దావోస్ వంటి సదస్సుల్లో పెద్దపెద్ద సీఈఓలతో చర్చలు జరపాలన్న లోకేష్ మాత్రమే సీన్లో ఉంటారు. ప్రధాని మోదీతో వేదిక పంచుకోవాలన్నా లోకేష్‌కి అగ్ర తాంబూలం ఉంటుంది. మరి ఇంత గొప్పగా ప్రధాన పాత్ర పోషిస్తున్న లోకేష్‌కు ఆరో ర్యాంకు ఇవ్వడం ఏంటి?.పవన్‌ను వెనక్కి నెట్టేశారా!మిగతా మంత్రుల ర్యాంకింగ్స్ ఎలా ఉన్నా కూటమిలో ఉంటూ ఇండిపెండెంట్‌గా ఎదగాలని.. సొంత మార్క్ చూపాలని ఆరాటపడుతున్న పవన్ కళ్యాణ్‌ను మాత్రం ఏకంగా 10వ స్థానానికి నెట్టేశారు చంద్రబాబు. ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో నడుస్తూ తన పాలిట కంట్లో నలుసుగా మారుతున్నారు అని పవన్‌పై ఇప్పటికే చంద్రబాబు నిఘా వేశారు అని అంటున్నారు. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ గత పది రోజులుగా జ్వరం పేరిట సెలవులో ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాకుండా హోం మంత్రి అనిత.. టీటీడీ చైర్మన్ నాయుడు వంటి వారి విషయంలో పవన్ చేసిన కామెంట్లు కూటమి ప్రభుత్వాన్ని ఇరుక్కుని పెట్టాయి. పవన్‌ను అలాగే వదిలేస్తే శల్య సారథ్యం వహించి కూటమి రథాన్ని ఏదో రోజు బోల్తా కొట్టిస్తారు అనే భయం ఉన్న చంద్రబాబు ఇప్పుడు పవన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా పథకాలు వేస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే, పవన్.. మీ పనితీరు ఏం బాలేదు చూసావా.. ఏకంగా పదో ర్యాంకులో ఉన్నావు. నువ్వు డల్ స్టూడెంట్‌వి అని చెప్పే క్రమంలోనే ఏకంగా ఆయనను వెనక్కి నెట్టేసి డిఫెన్స్‌లో పడేశారని టీడీపీ అంతర్గత సమాచారం చెబుతోంది. నువ్వు బయట అరవడానికి తప్ప పరిపాలన.. రాజకీయాలు.. అడ్మినిస్ట్రేషన్ ఇవేం నీకు చేతకాదు అని పవన్‌కు చెప్పకనే చెప్పారు అని అంటున్నారు. తనను అన్ని రకాలుగా కార్నర్ చేస్తున్న చంద్రబాబును పవన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తారు.. కూటమి ప్రభుత్వంపై ఏ విధంగా తన సొంత ముద్ర వేసుకుంటారన్నది చూడాల్సి ఉంది. -సిమ్మాదిరప్పన్న. -
పేదింటికి కలెక్టరచ్చిండు... పిల్లగాన్ని చదుకోనికి నిద్ర లేపిండు
తెల్లారింది లేవండోయ్ కొక్కురోకో !!పదోక్లాస్ పిల్లలను నిద్ర లేపుతున్న యాదాద్రి కలెక్టర్ హనుమంత రావుఅప్పుడే తెల్లారుతోంది...కోళ్లు కూస్తున్నాయి... సూరీడు రాలేదు.. ఇంకా మంచు తెరలు తొలగనే లేదు. ఆ చిన్న ఊళ్ళోకి పెద్ద కారొచ్చింది. ఇంత చిన్న పల్లెలోకి ఇంత పొద్దుగాల ఎవరచ్చిర్రా అని తెల్లారి పొలం పనులకు వెళ్ళే రైతులు..నీళ్ళకోసం బావులవద్దకు వెళ్ళే మహిళలు విస్తుపోయి చూస్తున్నారు. కార్లోంచి టిప్ టాప్ గా దిగిన ఒక ఆఫీసర్ ఆ ఊళ్ల పదోక్లాస్ చదూతున్న పిల్లవాడు ఇంటికి వెళ్ళి.. టక్.. టక్ అని డోర్ కొట్టారు.. ఏందబ్బా ఇంత మబ్బులల్ల ఇంటికి ఎవరొచ్చిర్రు.. చుట్టాలు ఇంత వేకువనే వస్తారా... అంటూ పిల్లగాని తల్లి విజయలక్ష్మి తలుపు తీసింది.. ఎదురుగా ఎవరో ఆఫీసర్...అమ్మో ఎవరాయన ఇంత ఉదయం ఎందుకు వచ్చాడు అనుకుంటూ విస్తుపోయి చూస్తుండగా ఆయనే ముందుగా మాట్లాడారు...అమ్మా నేను మీ జిల్లా కలెక్టర్‌ను.. మీ అబ్బాయి భరత్ చంద్ర పదోక్లాస్ చదువుతున్నాడు కదా..ఎలా ఉన్నాడు.. బాగా చదువుతున్నాడా..బాధ్యతగా ఉంటున్నాడా.. పొద్దున్నే మబ్బులల్ల నిద్ర లేపండి..ఉదయాన్నే చదివించండి...పొద్దీకి టీవీలు. ఫోన్లు చూడనివ్వకండి.. పదో క్లాస్ చాలా ముఖ్యం కదమ్మా.. బాగా చదివించండి.. అంటూ ఒక చైర్..ఎగ్జామ్ ప్యాడ్..పెన్నులు వంటివి అందజేశారు..అసలు కలెక్టర్ ఏందీ..తమ ఇంటికి రావడం ఏందీ అని ఆ తల్లి విజయలక్ష్మి నోట మాట రాలేదు..అసలిదంతా ఏమిటి అని ఆమె షాక్ లో ఉండిపోయింది.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు పదోక్లాస్ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు.ఈ నేపథ్యంలో టెన్త్ క్లాస్ పిల్లలను ప్రోత్సహించేందుకు.. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివేందుకు పదో క్లాస్ అనేది తొలిమేట్టు అనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచెప్పేందుకు తానే నడుంబిగాంచారు. అందులో భాగంగా ఆయన సంస్థాన్ నారాయణపురం మండలంలోని కంకణాలు గూడెం గ్రామానికి వెళ్లి తెల్లవారి ఐదు గంటలకే విద్యార్థులు నిద్రలేపే వేకప్ కాల్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ గ్రామంలో పదో క్లాస్ చదువుతున్న పిల్లలు పిల్లలకు వెళ్లి వారు చదువుతున్న తీరు గురించి తల్లిదండ్రులతో ఒక చేసి పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాలని సూచించారు. అంతేకాకుండా భరత్ చంద్ర అనే విద్యార్థి ఇంటికి వెళ్లి ఆయన పదవ క్లాస్ పరీక్షలు పూర్తయ్యే వరకు నెలకు రూ.5000 రూపాయలు ఖర్చుల నిమిత్తం తాను చెల్లిస్తానని చెబుతూ.. వెనువెంటనే రూ. 5000 అందజేశారు. అంతేకాకుండా భరత్ ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును తాను భరిస్తానని.. ఆయన జీవితం స్థిరపడేంతవరకు తాను తోడుగా ఉంటానని కలెక్టర్ హామీ ఇచ్చారు. తెల్లవారేసరికి గ్రామంలో కలెక్టర్ పర్యటన ఓ విద్యార్థి ఇంట్లో ఆయన కూర్చుని తల్లిదండ్రులతో మాట్లాడడం క్షణాల్లో ఊరంతా పాకేసింది. మన ఊరు అబ్బాయి భరత్ ఇంటికి కలెక్టర్ సాబ్ వచ్చాడంట.. చదువుకోడానికి డబ్బులు ఇచ్చారట.. పెన్నులు కుర్చీ ప్యాడ్ వంటివి ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఆయన ఎంత చదివితే అంత చదివిస్తానని కూడా మాటిచ్చాడంట.. నిజంగా ఇంతలా ప్రోత్సహించే అధికారులు ఉంటే పిల్లలు ఎందుకు చదువుకోరు అంటూ గ్రామస్తులు అబ్బాయి తో పాటు కలెక్టర్‌ను సైతం అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ విద్యార్థి దశలో పిల్లలు బాధ్యతగా ఉండాలని.. వృధా కాకుండా తెల్లవారు జామునే లేచి చదువుకోవాలని.. అలాంటప్పుడే ఉన్నత స్థానాలకు చేరుతారని ఉద్బోధించారు.. చదువుకునే పిల్లలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చి ముందుకు కదలారు... ఆయన వెళుతున్న వైపే చూస్తూ భరత్... ఆయన తల్లి విజయలక్ష్మి.. చూస్తూ నిలబడిపోయారు. సిమ్మాదిరప్పన్న -
అరసవిల్లి ఎల్లొద్దాం పదర్రా !!
ఓరి సూర్నారాయనా... ఓసి ఉషా..పదర్రా బేగి బయలుదేరితే అరసవిల్లి ఎల్లి ఎలిపొద్దుము.. ఈరోజు అసలే రథ సప్తమి. అలాగ వెళ్లి... దేముడికి దండం పెట్టిసి వచ్చిద్దుము... గాబరా పెడుతున్నాడు సురేసు... ఓరి గుంటడా ఒట్టి నీళ్ళు కాదురా బుర్రమీద రేగిపళ్ళు... జిల్లేడు ఆకు పెట్టుకుని పోసుకోరా పెరట్లొంచి మనవడు ఆదిత్య మీద కేకేసింది నానమ్మ సూరమ్మ.. ఏటే నాయినమ్మా పొద్దుట నుంచి గొల్లు గొల్లు పెడతన్నావు.. చిరాకు పడ్డాడు ఆదిత్య . గొల్లు కాదురా పిక్కిరోడా మన ఊరి దేముడు లోకానికే నాయకుడు ..ప్రపంచానికి దారి చూపే నాయకుడు.. యేటనుకున్నావు చెబుతోంది నానమ్మ పొయ్యిమీంచి నీళ్ళు దించుతూ... ఒసే.. పల్లకోయే నువ్వాన్నీ ఇలాగే సెప్తవు. సిరాకు పడ్డాడు బుడ్డోడు ఆదిత్య.. అవునురా నీకేకాదు..మీ నాన్నకు కూడా ఇలాగే నీళ్ళు పోసేదాన్ని.. మన ఊళ్లో ఆన్న సూర్యనారాయణ స్వామి మన శిక్కోలుకు ఆస్తి. ప్రపంచం మొత్తానికి వెలుగునిచ్చే సూర్యుడు మన ఊళ్లో ఉండడం అంటే గొప్ప కాదేట్రా అంది.. పిల్లాడి నెత్తిన జిల్లేడు ఆకులు పెడుతూ అవునే నానమ్మ.. ఈ జిల్లేడు ఆకుల ఎందుకే.. చిన్నప్పటి నుంచి నెత్తి మీద పెట్టి నీళ్ళు పోస్తావు అన్నాడు ఆదిత్య.. ఒరేయ్ ఇవి వట్టి ఆకులు కాదురాజిల్లేడు ఆకుల స్నానానికి ఆధ్యాత్మికంగానే కాదు, శాస్త్రీయంగా కూడా విశిష్టత ఉంది. ఈ ఆకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. వీటిని నెత్తిమీద పెట్టుకుని స్నానం చేస్తే ఒంట్లో ఉన్న వేడి తగ్గడమే కాకుండా శరీరంలో ఉన్న చెడును సైతం తొలగిస్తుంది. ఈ ఆకుల్లో ఉండే లక్షణాలు జుట్టు రాలకుండా చేస్తాయి. గాయాలని పోగొట్టే గుణాలు కూడా ఉందిరా.. ఏదైనా చోట దెబ్బ తగిలి వాపు, నొప్పి వచ్చినా ఈ ఆకులు నయం చేస్తాయిరా అంది నానమ్మ. ఓహో అన్నాడు బుడ్డోడు. ఒరేయ్ నీకు ఇంకో విషయం చెప్పాలిరా అంది నానమ్మ.. పొద్దున్నుంచి నోరు ఆపకుండా వాగుతూనే ఉన్నావు మళ్లీ ఇంకేం చెప్తావె అన్నాడు ఆదిత్య. ఒరేయ్ అప్పట్లో ఎవరికైనా కొడుకు పుట్టాలి అంటే మన సూర్యనారాయణ మూర్తిని దర్శించుకుని మొక్కుకొని.. సూర్య నమస్కారాలు చేస్తే కొడుకు పుట్టేవాడ్రా.. మీ నాన్న కూడా నాకు అలాగే పుట్టాడు.. అందుకే వాడికి సురేష్ అని పేరు పెట్టాం అంది నానమ్మ.. ఓహో అందుకేనా మా నాన్న తరచు అరసవిల్లి గుడికి వెళుతుంటాడు అన్నాడు పిల్లాడు.. అవున్రా సూర్యనారాయణ స్వామి మన శ్రీకాకుళానికి ఆస్తి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తానికి ఒక వెలుగు.. అందుకే మనం అందరం గుడికి పోదాం.. ముందు పిడకల మీద పరమాన్నం చేసి స్వామికి నైవేద్యం పెట్టి రిక్షాల వెళ్లిపోదాం సరేనా అంది నానమ్మ.. మన ఊళ్లో కాకుండా ఇంకెక్కడా సూర్యుడికి గుళ్ళు లేవా నానమ్మా అడిగాడు ఆదిత్య.. ఉన్నాయిరా కాశ్మీర్లో మార్తాండ ఆలయం ఉండేది.. కానీ అందులో పూజల్లేవు.. శిథిలమైంది.. ఒరిస్సా కోణార్క్ లో ఉన్నదీ సూర్యుని ఆలయమే కానీ అక్కడా పూజలు ఉండవు.. ఈ దక్షిణ దేశంలో పూజలందుకుంటున్న సూర్య ఆలయం మన ఊళ్లోనే ఉందిరా చిన్నా అని. చదవండి: పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదుసూర్యుణ్ణి ఆరాధించడం ద్వారా ధన.. గుణ సంపన్నులు అవుతారు బుజ్జి..నువ్వు రోజూ ఆయన్ను నమస్కరించి వీలైతే సూర్యనమస్కారాలు చేసుకో.. ఆరోగ్యం ఐశ్వర్యం దక్కుతాయి.. చెప్పింది నానమ్మ.. అదెలాగే అన్నాడు ఆదిత్య... అవునురా సత్రాజిత్తు అనే రాజు సూర్యుణ్ణి పూజించడం ద్వారానే శమంతక మణిని పొందాడు.. అది రోజుకు ఎంత బంగారం ఇస్తుందో తెలీదు.. అంతెందుకు రోజూ ఎండలో కాసేపు నిలబడితే ఒంటికి కూడా మంచిదిరా.... విటమిన్లు వస్తాయి చెప్పింది నానమ్మ.. నానమ్మ విటమిన్లు ఎండలో వస్తాయి కదాని నన్ను ఎండలో నడిపిస్తే కుదరదు. రిక్షాలో వెళ్దాం . నాకు అక్కడ సెనగలు ఖజ్జూరం కొనాలి మరి అన్నాడు..పిల్లాడు.. సరే పదండి..గమ్మున వెళ్ళి లైన్లో నిలబడదాం.. ఆదిత్యుణ్ణి దర్శిద్దాం అంటూ అందరూ బయల్దేరారు..- సిమ్మాదిరప్పన్న -
నీ ముక్కెర ... కాళ్ళ పట్టాలు కూడా మెరుస్తాయి లక్ష్మి
చీకటిపడుతున్నవేళ చిన్నగా ఈలవేస్తూ.. లచ్మీ ఇదిగో.. మన పొలం కాడ గుమ్మిలో దొరికింది పట్టేశాను.. బుర్రా తోకలు పులిసెట్టు.. నడు మ్ముక్కలు ఇగురు చెయ్యవే.. అంటూ కళ్ళు కడుక్కోడానికి గోలేం కాడికి వెళ్ళాడు.. మత్స్య రాజు... తిక్కనా సన్నాసికి ఎప్పుడు ఏది అనిపిస్తే అదే చేస్తాడు..ఈడి జిమ్మకు ఒకటి చాలదు .. రెండు రకాలుండాలి.. ఈ చీకట్లో ఇదేటి దరిద్రం.. సన్నగా గొణుక్కుంది లచ్మి .. ఒసేయ్... ఇన్నావా.. వాటిని తియ్యు.. లేపోతే పిళ్లెత్తుకెళ్ళిపోద్ది.. అప్పుడు నీకు దరువులు పడతాయి అన్నాడు కొంటెగా..ఈ రాత్తిరిపూట వాటిని పెరట్లోకి వెళ్లి రాయిమీద పొయ్యి బుగ్గేసి పామి.. కడిగి.. పులు సెట్టి ఈడీకి కూడెట్టాలి.. మొగుడిమీద ప్రేమగా విసుక్కుంది లచ్మి.. ఏందే నీ సణుగుడు... కేకేశాడు.. రాజు.. ఈడీకి పనికొచ్చినముక్క చెప్తే ఒక్కటీ ఇనబడదు కానీ. ఇలాంటివి మాత్రం టక్కున చెవిలోపడతాయి.. సచ్చోనోడివి పాము చెవ్వులు.. అంటూనే వంటి పూర్తి చేసేసింది .. చీకట్లో సరిగ్గా చూసుకుని తిను.. లేపోతే ముల్లుదిగిపోద్ది.. జాగ్రత్త చెప్పింది.. పోన్లేయే.. ఇదొక్కటే చీకటి భోజనం.. ఎల్లుండినుంచి అదిగో.. అక్కడ కూకుని తిందాం.. నువ్వు నేను.. మన బుడ్డి సాంబిగాడు అన్నాడు..సీకట్లో కూకుని ఆ సెట్టుకింద తింతావా .. నువ్వేమైనా గబ్బిలానివా మామ.. అంటూ నవ్వింది లచ్చ్మి.. లేదే.. మనూరికి కరెంటొచ్చింది.. అదిగో మన గొర్రిల పాక పక్కనే స్థంభం వచ్చింది.. ఇక మనకు ప్రతోరోజూ.. పగలే... రేత్తిరి అనేది ఉండదు అన్నాడు.. రేత్తిరి లేకపోతే నువ్వు ఊరుకుంటావా మామ .. నర్మగర్భంగా పంచ్ వేసింది.. ఐనా కరెంటొస్తే మనకేటి మామ.. లాభం అంటూ డోకితో కాసింత పులుసు పోసింది.. అదేటి అలాగంటావు. కరెంటొస్తే ఊరికే కాదే మన బతుకుల్లోకి కూడా వెలుగొచ్చినట్లే అన్నాడు .. అదెలా అంది..చేప తలకాయ ను రాజు పళ్లెంలో వేస్తూ..ఒసేయ్ లచ్చిమి.. కరెంట్ వచ్చిందనుకో.. మనం ఇంటికి ఒక కరెంట్ బుడ్డి వేసుకోవచ్చు.. మన బుడ్డి గాడు మన ఇంట్లోనే పెట్టి మీద కూకుని సదూకుంటాడు.. మనం కొర్రలు... సామలు.. గట్రా ఇంట్లోనే మరాడించుకోవచ్చు.. కరెంట్ కుక్కర్ కొనుక్కోవచ్చు.. ఇక నువ్వు చీకటిపడ్డాక కూడా ఉడుకుడుగ్గా వండొచ్చు.. మనం కూడా వేడివేడిగా తిని.. అన్నాడు.. సాల్సాల్లే నీకు తిపారం ఎక్కువైంది.. అన్నది లచ్చ్మి . ఒసేయ్.. ఈ చీకట్లో కనబళ్ళేదు కానీ... కరెంట్ వచ్చాక.. ఆ వెల్తుర్లో నీ నత్తు .. కాళ్ళ పట్టీలు కూడా భలే మెరుస్తాయి లచ్చిమి అన్నాడు.. ఆమె చుబుకం మీద చెయ్యేస్తూ.. ఈడీకి పనికి వెళ్ళడానికి ఒల్లొంగదుకానీ ఇలాంటీటీకి మాత్రం రద్దీగా ఉంటాడు మురిపెంగా విసుక్కుంది లచ్చిమి.. ఒసేయ్ ఇంకెన్ని లాభాలున్నాయో తెలుసా.. మనఇంటి ముందు లైట్ ఉంటుంది కదా.. అక్కడే మనమంతా రాత్రి పూత కబుర్లు చెప్పుకుని పడుకోవచ్చు.. ఇక ఆముదం. కిరసనాయిలు దీపాలు అక్కర్లేదు.. చుట్టాలు వచ్చినా ఇక ఇంటిముందున్న రాళ్లు తన్నుకుని పడిపోయేది ఉండదు.. ఒసేయ్ లచ్మి కరెంట్ ఎల్తురులో నువ్ మరింత మెరిసిపోతావే అన్నాడు.. రాజు.. ఈడికిపోయేకాలం రాను.. అంటూ గిన్నెలు తీసి.. సర్లే.. అవతల పెయ్యి అరుస్తుంది దాన్ని పాకలో కట్టేసి రా.. అంటూ గదిమింది..అనకాపల్లి జిల్లా గిరిశిఖర గ్రామం నీలబంధకు తొలిసారిగా కరెంట్ వచ్చింది.. ఈ సందర్భంగా ఓ గిరిజన కుటుంబంలో కలిగే మార్పులపై చిన్న కథ.. కథనం.. మీ కోసం... -- సిమ్మాదిరప్పన్న77 ఏళ్ల తర్వాత కొండశిఖర గ్రామమైన నీలబంధకు ఎట్టకేలకు విద్యుత్ సౌకర్యం.#APNDAWorkshttps://t.co/VN2UYyVSxr— Team Rajakeeyam (@TeamRajakeeyam) February 2, 2025 -
పెళ్లేందుకే రవణమ్మా.. గ్రీన్ కార్డు వస్తలేదు.. ఉద్యోగం దిక్కులేదు
అప్పుడెప్పుడో పదిహేనేళ్ల క్రితం ఆర్థిక మాంద్యం.. సాఫ్ట్వేర్ రంగం నేల చూపులు చూస్తున్న తరుణంలో భాస్కర భట్ల రాసిన వాక్యాలు మళ్ళీ ఇప్పుడు నిజమవుతున్నాయి. కొడుకు చదువు అయిపొయింది.. ఇక ఉద్యోగం రావడమే తరువాయి.. పెళ్లి చేసేద్దాం అనుకుంటున్న రవణమ్మకు కొడుకు ఆనాటి సామాజిక .. ఆర్ధిక పరిస్థితులు వివరిస్తూ ఒక సాంగ్ వేసుకుంటాడు.. అప్పటి పరిస్థితులకు సరిగ్గా కళ్ళకు కట్టినట్లుండే ఆ పాట అప్పట్లో మార్మోగిపోయింది. రికార్డింగ్ డాన్సులు.. ఆర్కెస్ట్రాలు.. యూత్ ఫెస్టివల్స్‌లో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంతకూ భాస్కర భట్ల ఏమన్నాడంటేరియల్ ఎస్టేట్ ఏమో కుప్ప కూలిపోయిందిసాఫ్ట్వేర్ ఫీల్డ్ ఏమో దెబ్బడి పోయిందిఈ సంగతులన్నీ పెద్ద మనసుతోనువ్వు అర్థం చేసుకునిఈ మంగళం మాని వేయ వలయునోఅవునట్టు మర్సిపోయానుఅమెరికా నుంచి మనోళ్లందరూతట్ట బుట్ట సర్దుకునివచ్చేస్తున్నారే తల్లీఎందుకేె రవణమ్మాపెళ్లేందుకే రవణమ్మాఎందుకె రవణమ్మాపెళ్లేందుకే రవణమ్మాతానూ దూర సందు లేదు యోతానూ దూర సందు లేదు యోతానూ దూర సందు లేదుమెడకేమో డోలా రవణమ్మాచిక్కెను ముక్క లేదుచిల్డ్ బీరు చుక్క లేదుగర్ల్ ఫ్రెండు లేదుకాల్చనీకి కింగ్ లేదుఈడ్చి కొడితే దమ్మిడీ లేదుఅప్పు కూడా పుడతా లేదుసినిమా లేదు సరదా లేదుఅతి గతి లేనే లేదుసాలరీలోస్తా లేదుసెల్ బిల్లు కడత లేదుబుర్ర పనిచేస్తా లేదువీకెండు సెలవు లేదుమింగా మెతుకు లేదు యోమింగా మెతుకు లేదు యోమింగా మెతుకు లేదుసంపెంగే నూనె రవణమ్మాసతాయించాకే రవణమ్మాఇలా సాగుతుంది ఆ పాట .. సరిగ్గా ప్రస్తుతం అమెరికాలో కూడా పరిస్థితులు అలాగే ఉన్నాయ్. డొనాల్డ్ ట్రంప్ వచ్చాక పరిస్థితులు అమాంతం మారిపోయాయి అని చెప్పడం కాదుగానీ.. ముందునుంచే అమెరికన్ సాఫ్ట్ వేర్ పరిశ్రమతోబాటు జాబ్ మార్కెట్ బాగా నేలచూపులు చూస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నాటి పరిస్థితులు లేకున్నా మొత్తానికి అమెరికాలో చదువు అవగానే ఉద్యోగం వస్తుంది అనే భ్రమలు ఐతే తొలిగాయి.వాస్తవానికి ఏటా లక్షల్లో భారతీయ విద్యార్థులు.. అమెరికాలో ఎమ్మెస్.. ఎంబీఏ.. ఫార్మా వంటి ఉన్నత విద్యకోసం అమెరికా వెళ్తారు.. అప్పులు చేసి మరీ అక్కడకు వెళ్లి.. లక్షల్లో ఫీజులు కట్టి ముగ్గురు నలుగురు చిన్న చిన్న రూముల్లో ఇరుక్కుని.. వంట చేసుకుంటూ ఎడ్జస్ట్ అయి చదువుకుంటారు. కొందరు పార్ట్ టైం పేరిట పెట్రోల్ పంపులు.. షాపింగ్ మాల్స్ .. హోటళ్లలో పని చేసి ఖర్చులమందం డబ్బులు తెచ్చుకుని చదువు పూర్తి చేసేవారు. చేతికి మాస్టర్స్ డిగ్రీ రాగానే ఏదో ఉద్యోగం కుదురుకుంటుందన్న నమ్మకం కూడా ఉండేది.అయితే ఇప్పుడు రూల్స్ మారాయి.. దేశంలో రూలింగ్ కూడా మారిపోయింది. అమెరికాలో జన్మించినంతమాత్రాన గ్రీన్ కార్డు ఇవ్వాలన్న రూల్ లేదు అని ట్రంప్ ఒక టెంకి జెల్ల కొట్టారు. క్యాంపస్ దాటి బయటకు వచ్చి పార్ట్ టైం ఉద్యోగం చేయడమూ ఇప్పుడు చట్ట విరుద్ధమే. దీంతో అక్కడి విద్యార్థులు చేతి ఖర్చులకు డబ్బుకోసం ఇంటివైపు చూస్తున్నారు. అటు సాఫ్ట్ వేర్ రంగం కూడా గొప్పగాలేదు. ఇప్పటికే అక్కడ పని చేస్తున్న సీనియర్ల పరిస్థితి కూడా భయంభయంగా ఉంటోంది. దీంతో కొత్తగా డిగ్రీ చదవగానే ఉద్యోగం అనే నమ్మకాలూ పోతున్నాయి. దీంతో దాదాపు యాభై లక్షలు పెట్టి అక్కడ ఎమ్మెస్ చదవడం సాహసమేనని నిపుణులు అంటున్నారు. పైగా దేశంలోకి అక్రమంగా వచ్చేసి ఏదోలా ఉద్యోగం చేసేద్దాం అనుకునేవాళ్ళందరినీ తరిమేస్తామంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఇంకోపెద్ద ప్రకంపన పుట్టిస్తోంది. ఇంకా H1-B వీసాల మీదా పరిమితి విధించారు. ఈ నేపథ్యంలో తమకు తెలిసినవాళ్లున్నారని అప్పులు చేసి అమెరికా రావద్దని.. అక్కడున్న తమ పరిస్థితే అంత గొప్పగాలేదని అక్కడివారు చెబుతున్నారు. పరిస్థితులు అంత సానుకూలంగా లేవు : పద్మనాభం సప్తగిరిఅక్కడి ప్రస్తుత పరిస్థితిపై జేపీ మోర్గాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పద్మనాభం సప్తగిరి మాట్లాడుతూ ఐటీ రంగం ఇప్పుడు ఒడుదుడుకులు ఎదుర్కొంటోందని.. అసాధారణ ప్రతిభ..నైపుణ్యాలు ఉంటే తప్ప ఉద్యోగం రావడం కష్టం అని అన్నారు. పరిస్థితులు గతంలో లా లేవని..మంచి స్కాలర్ షిప్‌తో మంచి యూనివర్సిటీలో సీట్ వస్తేనే అమెరికా రావాలని..ఇక్కడ ఏదోలా గెటాన్ అయిపోదాం అనుకుంటే కుదరదని అన్నారు. ఉద్యోగావకాశాలు కూడా మునుపు ఉన్నంత గొప్పగా లేవని..సీనియర్స్..ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళకు కొంత ఫరవాలేకున్నా ఫ్రెషర్స్‌కు ఓపెనింగ్స్ అంత సానుకూలంగా లేదని అన్నారు.పద్మనాభం సప్తగిరి, జేపీ మోర్గాన్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ -
‘పెద్దలు’ దావోస్ వెళ్లేది అందుకేనా..?
వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF)దావోస్‌లో పెట్టుబడుల సదస్సు అంటూ జనవరి 20-24 తేదీల మధ్య నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం అబాసుపాలైంది. ఈ సదస్సులో పెట్టుబడులు,వ్యాపారం,పరిశ్రమల స్థాపన,ఆయా రంగాల్లో నిపుణులు,అనుభవజ్ఞులతో చర్చలు, ఉపచర్చలు అంతిమంగా ఆరోగ్యకరమైన పారిశ్రామిక విధానాల రూపకల్పన వంటివి ఉంటాయనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలా సదస్సు ఉద్దేశ్యం అదే అయినా..వెళ్లినవారి ఉద్దేశాలు వేరని అందరూ అక్కడికి విలాసాలకు కులాసాలకు మాత్రమే వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. అక్కడి హోటల్స్ రిసార్ట్స్ బుకింగ్స్ బట్టి ఇదే అర్థం అవుతోందని జాతీయ,అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి.అక్కడికి వచ్చేవారికి వారి కోరికమేరకు 'వ్యక్తిగత సేవలు' అందించే సంస్థలకు భారీ గిరాకీ దక్కిందని ఈ సర్వీసుల సేవల విలువ దాదాపు రూ.పదికోట్ల పైమాటే అని ఆ కథనాల్లో వివరిస్తున్నారు.పెట్టుబడులు,పారిశ్రామిక విధానాలు,వాతావరణ మార్పుల మీద చర్చలకన్నా అక్కడికి ధనికులు 'గాలి మార్పు' రిలాక్సేషన్ కోసమే ఎక్కువ తాపత్రయపడినట్లు ఓ అంతర్గత నివేదిక బయటకు వచ్చింది. స్విట్జర్లాండ్ లో అలాంటి సేవలు అందించే సంస్థలకు దావోస్ సదస్సు టైమ్‌లో డిమాండ్ గణనీయంగా పెరిగింది అంటూ బ్రిటన్ నుంచి వెలువడే డైలీ మెయిల్ పత్రిక,వెబ్ సైట్ ఒక సంచలన కథనాన్ని వెలువరించింది. ఇలాంటి బుకింగ్స్ అందుబాటులో ఉంచే ఒక వెబ్ సైట్ ఐతే మొదటి రెండు మూడు రోజుల్లోనే దాదాపు రూ.3 కోట్లు ఆర్జించింది.గత ఏడాది ఈ సర్వీసులు కేవలం 170 సంస్థలు మాత్రమే అందించగా ఈసారి వాటి సంఖ్య దాదాపు మూడు వందలకు పెరిగిందట.దావోస్‌లో పెట్టుబడులు అంటూ వెళ్లే పెద్దలు..పెద్దల ముసుగులో వెళ్లే నాయకులూ అక్కడకు వెళ్లి చేసే రాచకార్యాలు ఇవీ అంటూ హిందూస్తాన్ టైమ్స్,ఎకనామిక్ టైమ్స్ తో పాటు పలు వెబ్ సైట్స్ కూడా బోలెడు ఇన్సైడర్ కథనాలు ప్రచురించాయి.దీనిమీద సోషల్ మీడియాలోనూ పంచులు పేలుతున్నాయి. ఓ నెటిజన్ అయితే దావోస్ సదస్సుమీద వ్యంగ్యంగా పాట కూడా రాశారు..గుడివాడ యెల్లాను... గుంటూరు పొయ్యాను... దావోసూ పోయాను... ఎన్నెన్నో చూశాను. యాడ చూసినా, ఎంత చేసినా ఏదో కావాలంటారు... నోళ్ళు... ‘పెట్టుసచ్చిబడుల వేటకు వచ్చినోళ్ళు’. అంటూ పాట రాశారు. మొత్తానికి పెట్టుబడుల వేట అంటూ వెళ్లిన వేటగాళ్లు.. అసలు పనికన్నా కొసరూపానికి ప్రాధాన్యం ఇచ్చారని.. మీడియా.. సోషల్ మీడియా కోడై కూస్తోంది..-- సిమ్మాదిరప్పన్న -
దావోస్ తుస్.. పవన్ ఫుల్ ఖుష్!
దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్లిన చంద్రబాబు.. లోకేష్ అక్కడ సీఈవోలు.. టెక్ కంపెనీల పెద్దలతో ఫోటోలు దిగారు.. ఎప్పట్లానే కోట్లు కోట్లు.. పెట్టుబడులు అంటూ ఊదరగొట్టినా ఒక్క ఇటుకబట్టీ.. అతుకుల మిల్లు.. అప్పడాల మిషన్ వంటి చిన్న పరిశ్రమల కూడా రాలేదు.. దీన్ని అటు సోషల్ మీడియాలో యూత్ మీమ్స్.. ట్రోలింగులతో పోస్టింగులు పెడుతుండగా అటు టీడీపీ అనుకూల మీడియా మాత్రం సైలెంట్ ఐంది. ఏపీలో అన్ని ప్రాథమిక ప్రక్రియలు పూర్తయి నిర్మాణం మొదలు కావాల్సిన జిందాల్ స్టిల్స్ మహారాష్ట్రకు తరలిపోయింది. అటు కొత్తగా ఒక్కటీ ఒప్పందం జరగలేదు. దీంతో ఇక ఈ దావోస్ విజయోత్సవాలు ఎలా చేయాలన్నదాన్ని పక్కనబెట్టిన తెలుగుదేశం అనుకూల మీడియా ప్రస్తుతానికి ఆ అంశాన్ని చర్చల్లో ఉంచడం లేదు. ఏది ఎలా ఉన్నా ఇప్పుడు ఈ దావోస్ పర్యటన పెద్దగా ఫలితం ఇవ్వకపోవడాన్ని తెలుగుదేశం కక్కలేక మింగలేక ఉంటున్నా అటు లోలోన పవన్ కళ్యాణ్ మాత్రం సంబరపడిపోతూ సెలబ్రేషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ను ఇగ్నోర్ చేసిన చంద్రబాబు.. లోకేష్వాస్తవానికి మొదట్లో బాబుపట్ల అత్యంత వినయవిధేయతలతో ఉన్న పవన్ ఒక్కోసారి ఆవేశంతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. శాంతిభద్రతలు బాలేవు.. అవసరం ఐతే నేనే హోం శాఖను తీసుకుంటాను.. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తాను అన్నారు.. తిరుమల తొక్కిసలాట మీద కూడా తాను ముందుగా స్పందించి ప్రజలకు ప్రభుత్వం తరఫున సారీ చెప్పడంతోబాటు మీరెందుకు చెప్పరు మీకేం కష్టం.. అన్నట్లుగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు.. ఈవో శ్యామలరావును సైతం ప్రశ్నించి ఇరుకునపెట్టేసారు. ఇవన్నీ లోకేష్ ను బాగా ఇరిటేట్ చేశాయని .. పవన్‌ను కంట్రోల్ చేయాలనీ అయన ప్లాన్ చేస్తున్నారని.. అందుకే తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాలని కొందరు లీడర్లతో డిమాండ్లు చేయిస్తున్నారన్న ఫీలర్లు కూడా వచ్చాయి. మొత్తానికి అది సమసిపోగా ఇప్పుడు దావోస్ సదస్సుకు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు తీసుకెళ్లకుండా బాబు.. లోకేష్ ఇద్దరే వెళ్లారు. సీఎం హోదాలో బాబు.. ఐటి మంత్రిగా లోకేష్ వెళ్లారనుకున్నా పవన్‌ను సైతం తీసుకెళ్తే బాగుణ్ణని జనసైనికులు ఆశించారు. కానీ అక్కడ కూడా పవన్ వెళ్తే మీడియా మొత్తం ఆయనచుట్టూ ఉంటుందని.. లోకేష్.. చంద్రబాబును పట్టించుకోదని భయంతోనే ఆయన్ను తీసుకెళ్లలేదని అంటున్నారు..హమ్మయ్య మనకు హ్యాపీఇప్పుడు ఏమీ పెట్టుబడులు లేకుండా తిరిగొచ్చిన లోకేష్.. చంద్రబాబును చూసి పవన్ లోలోన సంతోషపడుతున్నారని అంటున్నారు... తనను పూర్తిగా పక్కనబెట్టేసి అదేదో వాళ్ళ సొంత ఫ్యామిలీ ఫంక్షన్ అన్నట్లుగా వాళ్లిద్దరే వెళ్లడం.. పవన్‌ను కనీసం మాట మాత్రంగా అయినా చెప్పకపోవడం.. ఒకరకంగా ఆయన్ను అవమానించడమే అని అంటున్నారు. ఐటి గురించి నీకేం తెలీదు.. మేం చాలాసార్లు దావోస్ వెళ్లాం.. అవన్నీ నీకు అర్థం కానీ విషయాలు అన్నట్లుగా పవన్‌ను చిన్నచూపు చూసి ఆయన్ను వదిలేశారని ఇది చిన్నతనంగా భావించినా ఏమీ మాట్లాడకుండా పవన్ సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు. ఇక ఇప్పుడు దావోస్ సదస్సు తుస్సుమనడంతో పోన్లే.. మనకు సంబంధం లేని విషయం. వాళ్లిద్దరే వెళ్లారు.. వట్టి చేతులతో తిరిగొచ్చారు.. మనదేం పోయింది.. నన్ను ఇగ్నోర్ చేసినందుకు అలాగే జరగాలి అని పవన్ లోలోన ఖుష్ అవుతున్నారని అంటున్నారు..--సిమ్మాదిరప్పన్న -
వలసదారుల పాలిట సింహస్వప్నం లేకెన్ రిలే చట్టం
మనలో పాపం చేయని వాడు... ఎవడో చెప్పండి.. ఏ దోషం లేని వాడు ఎవడో చూపండి.. అంటూ 1976లో సి. నారాయణరెడ్డి రాసిన పాటను ఎవరైనా ట్రంప్ కు వినిపిస్తే బాగుణ్ణు. పోనీ పాట పాడడం రాకపోతే అప్పట్లో సోక్రటీస్ చెప్పిన మాటను అయినా అమెరికా అధ్యక్షుడికి ఆయనకు వినిపించండి. సోక్రటీస్ ఏమన్నారా... ఆనాటి సమాజంలో పెద్ద నేరంగా పరిగణించబడిన తప్పిదానికి పాల్పడిన ఓ మహిళను రాళ్లతో కొట్టి చంపాలని ఆనాటి గ్రీకు రాజు తీర్పు ఇచ్చారు.ఆమె ప్రాణభయంతో పరుగుపరుగున సోక్రటీస్ వద్దకు వచ్చిందట.. ఆమెను వదిలిపెట్టి తమకు అప్పగిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తామని గ్రామస్తులు సోక్రటీసును కోరారట. అయితే అప్పుడు సోక్రటీస్.. అలాగే .. మీరన్నట్లుగానే ఆమెను మీకు అప్పగిస్తాను.. అయితే 'మీలో ఏనాడూ.. చిన్న పొరపాటు.. తప్పిదం.. ఏ పాపం చేయని వాళ్ళు మొదటి రాయి విసరండి. దీనికి మీ అంతరాత్మే రుజువు' అని కండిషన్ పెట్టారట. దీంతో వచ్చినవాళ్లలో ఎవరూ ఒక్క రాయి కూడా విసరాలేకపోయారట.. వచ్చినవాళ్లంతా ఏదోనాడు చిన్నదో పెద్దదో తప్పు చేశారట.. అందుకే అందరూ రాళ్లు అక్కడ పడేసి వెళ్లిపోయారట ఈ ఎపిసోడ్ కూడా ట్రంప్ కు చెప్పాలి .. ఎందుకంటేఅమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పూటపూటకూ కొత్త చట్టాలు.. నిబంధనలు తీసుకొస్తూ.. అమెరికాలో నివసిస్తున్న వలసజీవులకు నిద్రలేకుండా చేస్తున్నారు. గ్రీన్ కార్డు ఉన్నంతమాత్రాన అమెరికా పౌరులు అయిపోలేరు అంటూ టీజర్ రిలీజ్ చేసిన ట్రంప్ ఇప్పుడు ఇంకో టీజర్ సిద్ధం చేసారు. వలసదారులపాలిట సింహస్వప్నంలాంటి లేకెన్ రిలే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని.. ఇక అమెరికాలో చిన్నపాటి నేరాలను సైతం తీవ్రంగా పరిగణించి అమెరికా నుంచి స్వదేశానికి పంపేస్తారన్నమాట.చిన్న నేరానికి కూడా వెలివేస్తారా?అమెరికాలో 2022లో లేకెన్ రిలే అనే అమెరికా అమ్మాయిని వెనిజులా నుంచి వచ్చిన ఒక వలసదారుడు హత్య చేసాడు. వాస్తవానికి ఆ హత్య చేసిన అంటొనియా ఇబర్రా అనేవ్యక్తి మీద గతంలో కూడా కేసు నమోదైంది. కానీ అరెస్ట్ చేయలేదు. అప్పుడే వాణ్ని జైల్లో పడేసి ఉంటె ఈ లేకెన్ రిలే హత్యకు గురయ్యేది కాదు కదా.. వలసదారులు విచ్చలవిడిగా తిరుగుతూ ఉండడం వాళ్ళ స్థానిక అమెరికన్లకు భద్రతా లేకుండా పోతోంది. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లోని లొసుగులు.. కొన్నికొన్ని మినహాయింపులు ఇలా వలసదారులకు వరంగా మారుతున్నాయి అనే వాదన మొదలైంది.ఇదీ చదవండి: చట్టసభల్లో ట్రంప్ తొలి విజయం.. లేకెన్ రిలే చట్టం గురించి తెలుసా?దీంతో ఆమె పేరిట ఒక చట్టాన్ని తీసుకురాగా దానికి ట్రంప్ మద్దతుపలుకుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ చట్టం కింద ఎవరైనా విదేశీయుడు అమెరికాలో బుద్దిగా ఉండకుండా విచ్చలవిడిగా ఉంటె వెంటనే అరెస్ట్ చేస్తారు.. అంతేకాకుండా వాళ్ళను వెనువెంటనే వారి స్వదేశానికి తరిమేస్తారన్నమాట. ఇది అమెరికా వెళ్లి చదువుకుంటున్న.. ఉద్యోగం చేస్తున్న లక్షలాదిమంది భారతీయులతోబాటు పలు విదేశీయులకూ ప్రమాదంగా మారుతోంది.చిన్న చిన్న తప్పులు చేసి అరెస్ట్ అయినంతమాత్రాన అమెరికాలో చదువుకుంటున్న.. జాబ్ చేస్తున్నవాళ్లను వెనువెంటనే వారి స్వదేశానికి పంపేయడం ఏమిటన్న వాదన మొదలైంది. యువత.. విద్యార్థులు తెలిసో.. తెలియకో.. ఏదో చిన్న చిన్న నేరాలు చేసినంతమాత్రాన మొత్తం దేశబహిష్కరణ చేసేసి వారి ఆశలను చిదిమేస్తారా.. అవసరం ఐతే కేసు పెట్టి.. విచారించి శిక్ష వేయాలి కానీ ఇలా ఏకంగా వారి భవిష్యత్తును నాశనం చేస్తారా అనే అభిప్రాయాలు వినవస్తున్నాయి.-సిమ్మాదిరప్పన్న -
బాబును పాన్ ఇండియా స్టార్‌ను చేద్దాం!!
దేశంలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్లు..పాన్ ఇండియా క్రికెటర్లు..పాన్ ఇండియా బిజినెస్ మెన్..పాన్ ఇండియా హీరోలు..పాన్ ఇండియా మార్కెట్ ఉన్న నటీనటులు.. ఇదీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అంశం .అయితే పబ్లిసిటీ అంటే పీక కోసుకునే చంద్రబాబుకు కూడా ఇప్పుడు జాతీయస్థాయి లీడర్‌గా ఎదగాలనే పిచ్చి పట్టుకుంది. దేశంలో తన కన్నా సీనియర్ నాయకులు లేరని. మోడీ తదితరులు కూడా తనకన్నా జూనియర్లు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు పబ్లిసిటీతో అయినా సరే మీడియాను కొనేసి అయినా సరే.. లేకుంటే కొత్త పబ్లిసిటీ వ్యవస్థను ఏర్పాటు చేసి అయినా సరే యమర్జంట్‌గా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అవ్వాలని తెగ ఆరాట పడుతున్నారు.ఈ క్రమంలోనే దావోస్ సదస్సుకు చంద్రబాబు లోకేష్ వెళ్లగా దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రచారం చేసే నిమిత్తం ఎన్డీటీవీ.. ఐబీఎన్ వంటి జాతీయ ఇంగ్లీష్ ఛానల్ కు భారీ ఎత్తున డబ్బు గుమ్మరించారు. దీంతో ఆ చానళ్ళు చంద్రబాబు ఆహా ఓహో అంటూ జాకీలు పెట్టి లేపుతున్నాయి.👉చదవండి : భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మాఆ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు వస్తాయన్నది గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే తేటతెల్లమైంది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న ఏటా దావో సదస్సుకు వెళ్లడం.. ఫోటోలు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదు. కానీ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుగుతున్నాయి... అదిగో భారీ పరిశ్రమ.. ఇదిగో వేలల్లో ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టడం అందరికీ తెలిసిందే.వాస్తవానికి చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ, తోపాటు పదుల సంఖ్యలో వెబ్సైట్లు . వందల సంఖ్యలో ఫేస్బుక్,ఇన్స్టాగ్రామ్ పేజీలు.. వేలల్లో సోషల్ మీడియా కార్యకర్తలు నిత్యం భజన చేస్తూ ఎలివేషన్లు ఇస్తున్నారు.చంద్రబాబు ప్రస్తుతం ఏం చేస్తానన్నది ప్రజలకు చెప్పారు కానీ వచ్చే పాతికేళ్లు.. రానున్న 50 ఏళ్లలో రాష్ట్రాన్ని అలా మారుస్తా? ఇలా మారుస్తా అంటూ మభ్య పెట్టడం అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల కిందట విజన్ 2020 అంటూ కథలు చెప్పారు కానీ ఏమీ చేసింది లేదు. ఇప్పుడు ఏకంగా విజన్ 2047 అంటున్నారు. ఈ కథలన్నీ ప్రజలతో నమ్మించడానికి సరికొత్త ఏజెన్సీ సృష్టించడానికి ప్రభుత్వం పథకం సిద్ధం చేసింది.👉చదవండి : దావోస్ వెళ్దాం.. పబ్లిసిటీ బారెడు.. దక్కేది చెంచాడు!ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు సమాచారం అందించడానికి ప్రభుత్వం తరఫున సమాచార శాఖ ఉండనే ఉన్నది. దీనిలో ఐఏఎస్ అధికారి తో పాటు ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు, జేడీలు, డీడీలు, ఏడీలు, డీపిఆర్ఓ, కేడర్‌లో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్లంతా సరిపోలేదని మరో ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి చంద్రబాబు కు ఎలివేషన్..జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అంటే ఆ ఏజెన్సీకి ప్రజాధనం ధారవోసి చంద్రబాబుకు పబ్లిసిటీ ఇప్పిస్తారన్నమాట. దీనికోసం కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భారీ ఎత్తున సిబ్బందిని నియమించి వారితో బాబుకి ఎలివేషన్ ఇప్పిస్తారన్నమాట.దీంతోపాటు ఇద్దరు ఉద్యోగులను ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా నియమించి వారికి రూ.లక్షన్నర జీతం ఇవ్వాలని నిర్ణయించారు. వారు చంద్రబాబు పర్యటనకు..సభలు సమావేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు అందజేస్తారు. ఇటు తమ అనుకూల మీడియాకు కోట్లు దారబోస్తూనే ప్రైవేటు ఏజన్సీ ద్వారా కూడా భారీ ఎత్తున పబ్లిసిటీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మొత్తానికి ఎదైనాగానీ చంద్రబాబు తక్షణం జాతీయ స్థాయి నాయకుడు అయిపోవాలి..అదే టీడీపీ లక్ష్యం. 👉చదవండి : లోకేష్‌కు ఫుల్ ఎలివేషన్.. కాబోయే డిప్యూటీ సీఎం?సిమ్మాదిరప్పన్న -
భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మా
ఆగండ్రా బాబు.. అసలే అయన తిక్కలోడు.. ఏ క్షణానికి కండువా విసిరేసి వెళ్ళిపోతాడో తెలీదు.. కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండండి.. వచ్చి ఏడాది కూడా కాలేదు ఇప్పుడే మీరు చినబాబు డిప్యూటీ సీఎం .. చినబాబు డిప్యూటీ సీఎం అని కేకలు వేయకండి.. కొన్నాళ్ళు ఆగండి .. పరిస్థితులు చిన్నగా సర్దుకున్నాక అన్నీ చేద్దాం.. ముందే గాయిగాత్తర చేయకండి. అసలే తిక్కలోడికి ఢిల్లీ సపోర్ట్ ఉంది.. వాళ్ళ సపోర్ట్ టోన్ మనం గెలిచాం.. అప్పుడే అల్లరల్లరి చేస్తే లేనిపోని బాధలు. కొన్నాళ్ళు సైలెంట్ ఉండండి అని తెలుగుదేశం అధిష్టానం పార్టీ వీరవిధేయులైన ఎమ్మెల్యేలు.. ఇతర నాయకులకు సూచించింది.వాస్తవానికి ఇది అధిష్టానానికి తెలిసి.. చంద్రబాబు కనుసన్నల్లో జరుగుతోందో..లోకేష్ పట్ల భక్తిభావం పెల్లుబికి.. దాన్ని అణచుకోలేక అంటున్నారో తెలియదు కానీ కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు అర్జంట్ గా లోకేష్ ను డిప్యూటీ చీఫ్ మినిష్టర్ గా చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఆఖరుకు పవన్ కళ్యాణ్ గెలుపులో కీలకపాత్ర పోషించిన పిఠాపురం వర్మ కూడా అదే రాగం ఎత్తుకున్నారు. ఇది గత రెండు నెలలుగా ఉధృతంగా సాగింది. ఐతే ఇన్నాళ్లుగా ఆ భజనను చూస్తూ ఊరుకున్న జనసైనికులు గత కొద్దిరోజులుగా నోరువిప్పుతూ సోషల్ మీడియాలో టీడీపీ మీద కౌంటర్లు వేస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ ఇవ్వండి ఫర్లేదు కానీ అదే టైములో పవన్‌కు సీఎంగా బాధ్యతలు ఇవ్వండి.. అప్పుడు ఎవరికీ అభ్యంతరం లేదు.. అంతేకానీ పవన్‌ను డిప్యూటీ సీఎంగా ఉంచుతూ మళ్ళీ లోకేష్‌కు అదే హోదా ఇస్తేమాత్రం గొడవలైపోతాయి అన్నట్లుగా పోస్టింగులు పెడుతున్నారు. ఈ జనసైనికులను పవన్ సైతం నియంత్రించలేదు. మరోవైపు బీజేపీతో పొత్తు.. జనసేనలో సీట్ల సర్దుబాటు వంటివన్నీ పవన్ దగ్గరుండి మరీ కుదిర్చారు. పవన్ లేకపోతె మొన్న తెలుగుదేశం గెలుపు అసాధ్యం అనేది అందరికి తెలిసిందే అలాంటపుడు మా పవన్‌ను కాదని వేరే వాళ్లకు.. అదే లోకేష్‌కు ఎలా డిప్యూటీ ఇస్తారు అనేది జనసేన వాదన. దీంతోబాటు కేంద్రం సైతం పవన్ తోబాటు ఇంకో డిప్యూటీ ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. మొన్న అమిత్ షా వచ్చినపుడు సైతం లోకేష్ కు డిప్యూటీ ఇచ్చే అంశం ప్రస్తావనకు రాగా అయన తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో కేంద్రం దన్ను సంపూర్ణంగా ఉన్న పవన్ తో గొడవ ఎందుకు.. అందాకా సైలెంట్ గా ఉండండి అని తెలుగుదేశం తన క్యాడరుకు ఒక మెసేజ్ పంపింది.ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికారికంగా పార్టీ శ్రేణులకు ఒక సందేశం పంపింది. ఇకముందు ఎవరూ లోకేష్ డిప్యూటీ సీఎం కావాలంటూ డిమాండ్లు చేయకండి. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టకండి అంటూ గేటు వేసింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడిప్పుడే అధికారం రుచి మరిగిన నేపథ్యంలో ఆయన్ను ఇబ్బంది పెట్టి. ఇరిటేట్ చేసేలా ఏదీ చేయొద్దని.. అలాగైతే కూటమిలో చిచ్చు రేగుతుందని చంద్రబాబు గ్రహించి క్యాడర్‌ను నియంత్రించినట్లు చెబుతున్నారు. నాక్కొంచెం తిక్కుంది.. దానికి ఓ లెక్కుంది అనే పవన్ కు తిక్కరేగకుండా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నారన్నమాట. --సిమ్మాదిరప్పన్న -
దావోస్ వెళ్దాం.. పబ్లిసిటీ బారెడు.. దక్కేది చెంచాడు!
ఉందిలే మంచి కాలం ముందుముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా అంటూ ఎగురుతున్నాడు అప్పన్న.. ఏమైందిరా అని అడిగాడు సింహాచలం. అయినా సరే అప్పన్న నిలవలేకపోతున్నాడు.. మరి పర్లేదు ఈ నాల్రోజులు గడిస్తే నాకు నా కొడుక్కి.. నా కూతురికి ఉద్యోగాలు.. మేమంతా హాయిగా ఇంటిల్లిపాదీ ఉద్యోగాలు చేస్తాం.. అందరికీ ఉద్యోగాలు.. నాలుగు జీతాలు.. చేతినిండా డబ్బులు.. మంచి బ్రాండ్లు తాగొచ్చు అనుకుంటూ ఊగిపోతున్నాడు.ఏందిరా అప్పిగా ఏంది నీ గొల్లు.. ఏదీ చెప్పకుండా ఎగురుతున్నావ్.. మెంటల్ గానీ ఎక్కిందేట్రా అన్నాడు సింహాచలం.. మరేట్లేదు.. ముందు ముందు అంతా అదిరిపోతోంది.. ఊళ్లన్నీ ఉద్యోగాలు.. నా కొడుక్కు ఒక మంచి జాబ్.. పాతికవేలు జీతం.. ఇక మా డబ్బులు దాచావుకొవడానికి బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయాలి.. రెండు జీతాలు ఖర్చుపెట్టుకుని ఒక జీతం దాచుకోవాలి అనుకుంటూ ఊగుతున్నాడు. చీప్ లిక్కర్ తాగి పిచ్చిగా వాగుతున్నావా?.. ఎదవా.. అసలు ఏమైంది చెప్పురా అని అప్పన్న టెంకిమీద ఒకటిచ్చాడు సింహాచలం.. టెంకి మీద దెబ్బతో మామూలు పరిస్థితికి వచ్చిన అప్పన్న తుపుక్కున బీడీ పడేసి.. విషయం నీకు తెలీదా.. ఐతే రా చెబుతా అని రాయి మీద కూర్చున్నాడు.మా వోడు.. కొడుకూ కలిపి ఇమానంలో ఎల్లారా.. ఇక పదిరోజుల్లో వచ్చేత్తారు.. రాగానే బోలెడు కంపెనీలు తెచ్చేస్తారు.. ఇక మనకు ఉద్యోగాల జాతరే అన్నాడు అప్పన్న.. ఒరేయ్ అడ్డదిడ్డంగా కూస్తే పీక కొస్తా అని సింహాచలం చెప్పడంతో.. లైన్లోకి వచ్చిన అప్పన్న.. మరేటి లేదురా.. పెదబాబు.. చినబాబు దావోస్ వెళ్లారు. వస్తూనే సంచుల్లో కంపెనీలు తేవడం.. ఉద్యోగాలు ఇవ్వడం.. ఇక ఏపీ ఎలిగిపోవడం.. తథ్యం అన్నాడు. ఇప్పటికే ఇంగ్లీష్ చానెల్లకు డబ్బులు కూడా ఇచ్చేశాం తెలుసా.. పబ్లిషిటీ కోసం అన్నాడు.. అప్పన్న.ఒరేయ్ తాగుబోతోడా.. మీ బాబులు ఇది ఎన్నోసారి దావోస్ వెళ్లడం.. అని అడిగాడు సింహాచలం.. ఎయ్యే ఎన్నోసార్లు వెళ్ళాడు.. మరి ఏమైంది అన్నాడు సింహాచలం.. వెళ్ళాడు అప్పట్లో కర్రీ పాయింట్ పెట్టి.. పాల కూర పప్పు కూడా అందరికి వడ్డించాడు తెలుసా.. గర్వంగా అన్నాడు అప్పన్న. సరే.. కర్రీపాయింట్ కాకుండా ఇంకేం జరిగింది.. అడిగాడు సింహాచలం. ఏమోరా అన్నాడు అప్పన్న. సరే నేను చెబుతా విను.. అంటూ సింహాచలం మొదలెట్టాడు. అప్పట్లో బిల్ గేట్స్ తో ఫోటో దిగాడు.. మరి ఆంధ్రకు మైక్రోసాఫ్ట్ వచ్చిందా.. రాలేదు.. డెలాయిట్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. జనరల్ అట్లాంటిక్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. ఇంటర్నేషనల్ ఆస్పత్రి అన్నారు.. ఫోటోలు దిగారు.. వచ్చిందా.. రాలేదు.అలాగే, గూగుల్, యాక్సెంజర్ డేటా సెంటర్లు అన్నారు.. వచ్చాయా.. రాలేదు.. పైగా సిస్టమ్స్ అన్నారు వచ్చిందా.. రాలేదు.. మరి ఏమీ రానిదానికి అప్పట్లో ఏ స్థాయి బిల్డప్ ఇచ్చారు గుర్తుంది కదా.. అవునవును యాదొచ్చింది అన్నాడు అప్పన్న.. మరి అప్పుడు రాని కంపెనీలు ఇప్పుడు ఎలా వస్తాయిరా అప్పిగా.. మెల్లగా చురకేశాడు సింహాచలం.. అవునురోయి.. నేను హిస్టరీ మర్చిపోయాను.. అప్పుడు రానివి ఇప్పుడెలా వస్తాయి.. మారేలా అన్నాడు అప్పన్న. ఏమీ లేదు.. మళ్ళీ మన డబ్బుతో తండ్రీ కొడుకులు షికారు వెళ్లి వస్తారు అంతే అంటూ జ్ఞానోదయం చేశాడు సింహాచలం. అయితే మరెలా అన్నాడు బాధపడుతూ అప్పన్న.. ఏమీ లేదు మీ తండ్రీ కొడుకులు ఆటో నడుపుకోండి.. అని సలహా ఇచ్చి అక్కణ్ణుంచి కదిలాడు సింహాచలం. -సిమ్మాదిరప్పన్న. -
లోకేష్‌కు ఫుల్ ఎలివేషన్.. కాబోయే డిప్యూటీ సీఎం?
టీడీపీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా నారా లోకేష్ మాత్రమే నంబర్ టూగా చెలామణీ అవుతున్నారు. ఆయనకు సంబంధం లేకపోయినా అన్నీ శాఖల్లోనూ అలవిమాలిన జోక్యం చేసుకుంటున్నారు. ఒక్కసారిగా పార్టీమీద పట్టు సాధించాలని స్టేట్ మొత్తం తన కంట్రోల్లో ఉండాలని ఆయన చాలా తాపత్రయపడుతున్నారు కానీ వాస్తవ పరిస్థితులు మాత్రం వేరుగా ఉంటున్నాయి.ఏపీ కేబినెట్లో చంద్రబాబు తరువాత నంబర్ టూగా అధికారికంగా మాత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయనకు మాత్రమే కేబినెట్లో సెకెండ్ పొజిషన్ ఉంది. అయితే, తనకు అధికారికంగా పవన్ కన్నా తక్కువ గుర్తింపు ఉండటంతో దాన్ని అధిగమించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. నేడు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. అందులో ఎన్టీఆర్ ఫొటోకు అటు ఇటుగా చంద్రబాబు.. లోకేష్ ఫోటోలు ఉంచారు.. అంటే పార్టీలో లోకేష్‌ను ఇంకోమెట్టు ఎక్కించేసారన్నమాట.పవన్ దూకుడుకు బ్రేకులు..రాష్ట్రంలో తెలుగుదేశం సభ్యత్వాలు కోటి దాటాయని.. ఇదంతా లోకేష్ ఘనత అని చెబుతూ ఆయన్ను ఉన్నపళంగా అందలం ఎక్కిస్తున్నారు. మరోవైపు, కొంతమంది వీరవిధేయులు అయితే నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అటు పవన్ కళ్యాణ్ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నా ఇండిపెండెంట్‌గా ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తిరుమల తొక్కిసలాట సందర్భంలో టీటీడీ ఈవో చైర్మన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం.. రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగాలేవని.. అవసరం అయితే తానే హోంశాఖను తీసుకుంటానని ప్రకటించడం వంటివి చంద్రబాబుతో పాటు లోకేష్‌కు లోలోన కోపం తెప్పించినా ఏమీ చేయలేని పరిస్థితి కావడంతో మిన్నకున్నారని అంటున్నారు.ఇక, కేబినెట్లో ఒకే ఒక డిప్యూటీ ఉండటం.. పైగా పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావడంతో ఆయన కాస్త స్వేచ్ఛగా.. మాట్లాడినా.. చంద్రబాబు ఏమీ అనలేకపోతున్నారు. పైగా ఆయన్ను నియంత్రించడం.. వంటివి చేస్తే మళ్లీ ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి కావడంతో ఆయన్ను అలాగే ఉంచి అయన పక్కన డిప్యూటీ హోదాలో లోకేష్‌ను నిలబెడితే ఆటోమేటిక్‌గా పవన్ ప్రాధాన్యం తగ్గిపోతుందని.. ఇప్పుడు డిప్యూటీగా చేసేస్తే.. మున్ముందు చంద్రబాబు వయసు రీత్యా పదవి నుంచి తప్పుకున్నా లోకేష్‌ను సీఎంగా చేసేయవచ్చు అని టీడీపీ ఆలోచనగా ఉంది. ఇక కేబినెట్లో తనకు పోటీగా ఇంకో వ్యక్తిని డిప్యూటీ సీఎంగా చేస్తే పవన్ ఎలా స్పందిస్తారో అనేది చూడాల్సి ఉంది. -సిమ్మాదిరప్పన్న. -
వెళ్ళొస్తా సుజాతా.. సంక్రాంతి సిత్రాలు
పండగ అయిపోయింది.. భీమవరం నుంచి భార్య రేవతి.. పిల్లలు భరత్.. భావనతో కలిసి పార్వతీపురం పండక్కి వెళ్లిన శ్రీకాంత్ మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యాడు.. బస్సులు ఎక్కలేని పరిస్ధితి.. ఏదోలా సంచులు అందుకుని తల్లి, నలుగురు ఎక్కేశారు. లక్కీగా బొబ్బిలిలో సీట్ దొరికింది.. కిటికీ పక్కన శ్రీకాంత్ కూర్చోగా ఆ పక్కనే తల్లి ముగ్గురు సర్దుకున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉన్న శ్రీకాంత్ చిన్ననాటి మిత్రుల్లాంటి వాళ్ళు.. బంధువుల గెటప్పుల్లో ఉన్న అంతర్గత విలన్లు.. సొంతవాళ్ల ముసుగులో ఉన్న పరాయివాళ్లతోనూ గడిపిన సంఘటనలు.. కళ్ళ ముందు గిర్రున తిరిగాయి.భోగినాడు రాత్రి తాను తెచ్చిన ఫుల్ బాటిల్ ఇంకా మంచింగ్ కోసం వెయ్యి పట్టుకెళ్లిన బావ శ్రీను తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో కల్లంలో సిట్టింగ్ వేశాడు. పిల్లలను ఊళ్ళో అటు ఇటు తిప్పి మొత్తానికి మనోళ్ల సిట్టింగ్ స్పాట్ దగ్గరకు వెతుక్కుని వెళ్లిన శ్రీకాంత్ కు వాళ్ళ మాటలు వినబడ్డాయి. ఒరేయ్.. ఆ శ్రీకాంత్ గాడు మహా ముదుర్రా.. అక్కడ ఎన్నెన్ని చేస్తున్నాడో ఏందో.. బాగా సంపాదించాడు. మొత్తానికి ఏదో ఉందిరా అంటున్నాడు బావ శ్రీను పెగ్గు కలుపుతూ.. అదేం లేదులేరా.. పదిహేనేళ్లుగా భార్యా భర్త అక్కడ పంజేస్తున్నారు. పైగా వాడు జాగ్రత్తపరుడు.. వ్యసనాల్లేవు.. అందుకే పదో పరకో దాచుకున్నాడు అన్నాడు ఇంకో బ్రదర్ నాగరాజు.అదేం లేదురా వాడు ఏదో చేస్తున్నాడు.. నాకు అనుమానమే.. లేకుంటే ఇంత ఎక్కువ ధర ఉన్న మందు మనకు ఎందుకు ఇస్తాడు.. వాడికి ఉబ్బర్న వచ్చింది కాబట్టే ఇచ్చాడు.. బావ శ్రీను ముక్తాయింపు ఇచ్చాడు. శ్రీకాంత్ కు కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ ముందు బాటిల్ ను బట్టల మాటున బ్యాగులో తాను రేవతిని ఎంతలా ఒప్పించాల్సి వచ్చిందో.. దేవుడికి చూపే బట్టల్లో అది వద్దని తానూ ఎంతలా వాదించిందో గుర్తొచ్చి శ్రీకాంత్ ఇంకక్కడ ఉండలేక భారమైన మనసుతో చల్లగా అక్కణ్ణుంచి జారుకున్నాడు.చీరలు పెట్టే సమయంలో పెద్దక్క భవాని చేసిన కామెంట్లు మళ్లోసారి జ్ఞాపకం వచ్చాయి. చూసావా అమ్మా.. వాడి పెళ్ళానికి మంచిది కొన్నాడు.. మనకు ఏదో ఆఫర్లో వచ్చిన గుడ్డ ముక్కలు కొని పడేసాడు అంటూ పొయ్యిదగ్గర మాట్లాడుకున్న మాటలు తన చెవిన పడ్డాయి. అదేం లేదులేవే అని సర్ది చెప్పాల్సిన తల్లి వరాహలమ్మ కూడా.. వాడు పెళ్ళైన రోజునుంచే మారిపోయాడు కధేటి.. అనడం శ్రీకాంత్ ను మరింత బాధించింది. కానీ భవానికి చీర సెలక్షన్ కోసం రేవతి ఎన్ని షాపులు తిరిగిందీ.. దానికి మ్యాచింగ్ గాజులు.. జాకెట్ ముక్కలను ఎలా విశ్లేషించి సెలెక్ట్ చేసిందీ శ్రీకాంత్ కు గుర్తొచ్చింది. ఎవరికీ అవతలి వారి కష్టం పట్టదు.. తమ సౌఖ్యం మాత్రమే ముఖ్యం.. అందులో తల్లీ చెల్లీ కూడా మినహాయింపు కాదని తెలిసొచ్చింది. అయినా వాళ్ళను ఏమీ అనలేక తమాయించుకున్నడుఓహ్.. ఎవరికీ ఎంత చేసినా అందులో లోపాలు వెతకడమే కాకుండా అవహేళన చేయడమే నైజంగా ఉన్న బంధువులను సంతోషపరచడం ఇసుక నుంచి నూనెను పిండటం లాంటిదే అని శ్రీకాంత్ కు వందోసారి తెలిసొచ్చింది. కానీ సంప్రదాయలపేరిట.. నకిలీ అనుబంధాల మాటున వాటిని భరిస్తూ వస్తున్నాడు. ఇంతలో రేవతి యాండీ ఇదేటి.. ఈ షర్ట్ మనం కొనలేదు కదా.. ఇదేక్కడిది అంది కవర్లోంచి తీస్తూ.. అర్రే చూసేసిందా అని నాలుక్కరుచుకున్న శ్రీకాంత్.. ఓహ్.. అదా.. అదా.. మా క్లాస్మేట్ టైలర్ రమణగాడు కుట్టి ఇచ్చాడులే అని డైవర్ట్ చేశాడు.కానీ సంక్రాంతి నాడు సాయంత్రం టెంట్ కింద పిల్లలంతా డాన్సులు చేస్తుంటే అక్క కూతురు సుమిత్ర వచ్చి మామయ్యా సుజాత బాప్ప రమ్మంది .. ఆ రామ్మందిరం పక్కనే ఉంది అని చెప్పేసి తుర్రుమంది. సుజాత.. ఒకనాటి నెచ్చెలి.. డిగ్రీ వరకు క్లాస్మేట్. ఎన్నెన్ని ఊసులు.. ఎన్నెన్ని బాసలు.. ఎక్కడా ఇద్దరం గీత దాటింది లేదు.. పెళ్లి చేసుకున్నాకే అన్నీ అనుకున్నాం.. కానీ విధి ఆమెను తన మేన బావకిచ్చి పెళ్ళిచేసింది.నేను ఏం చేయలేక.. అసలు ఎందుకు బతకాలో తెలియక.. అలా ఊరొదిలి వెళ్ళిపోయా.. తరువాత సుజాత పంచాయతీరాజ్‌లో ఉద్యోగం తెచ్చుకుని ఊళ్ళోనే ఉంది. ఊరొచ్చిన ప్రతీసారీ దూరం నుంచి చూడటం.. కన్నీళ్లతో ప్రేమను చూపడం.. అంతే ఉండేది.. కానీ ఈసారి ఎందుకో సుజాతను చూడాలనిపించింది.. తనే పిలిచింది.. గోడ పక్కకు వెళ్ళగానే... ఇలారా అంటూ పిలిచింది. ఏదేదో మాట్లాడాలనుకున్నాను కానీ నోరు పెగల్లేదు.. మాట రాలేదు.. తనకూ నాకూ మధ్య నిశ్శబ్దమే మాట్లాడింది. ఆ నిశ్శబ్దంలో ఎన్నో భావాలూ.. బాసలూ.. నీకోసం చొక్కా తీసుకున్నాను.. అంటూ ఇచ్చింది.. వణుకుతున్న చేత్తో తీసుకున్నాను.. అదే ఈ చొక్కా.. చూస్తుంటే దానిలో క్రీనీడ మధ్య నీడలా కనిపించిన సుజాత మొహం గుర్తొచ్చింది... దాన్ని ప్రేమగా ఒళ్ళోకి తీసుకున్నాను.. మొత్తం సంక్రాంతి ఎపిసోడ్లో నాకు నచ్చింది.. ఇష్టమైన ఘట్టం ఏదైనా ఉందంటే.. ఆ రెండు నిముషాల నిశ్శబ్ద సంభాషణ మాత్రమే. -సిమ్మాదిరప్పన్న. -
పని చేయకపోతే ఇల్లెలా గడుస్తాది.. నారాయణుడి జీవిత గాథ
యేటి సేత్తామ్.. అందరికి అనుకున్నట్లు అవుతాదేటీ.. ఎవలికి ఏది ప్రాప్తమో.. అదే దక్కుతాది.. నువ్వెంత ఎగిరినా కాణీ ఎక్కువ రాదు.. అంటాడు నారాయణ. అచ్చం రజనీ కాంత్ చెప్పినట్లే చెప్పాడు.. దక్కేది దక్కకుండా పోదు.. దక్కనిది ఎన్నటికీ దక్కదు అనే మాటను నారాయణ సింపుల్‌గా చెప్పేసాడు.అవును.. ఇద్దరు మగపిల్లలు.. ఒక ఆడపిల్ల ఉన్న నారాయణకు అరవయ్యేళ్లపైనే ఉంటుంది.. అప్పట్లో చిట్టివలస జూట్ మిల్లులో పని చేశాడట.. అది మూసేసాక ఇక వేరే పనేం లేక.. ఆనందపురం దగ్గర్లోని తాళ్ల వలసలో ఊరకనే ఇంట్లో ఉండడం ఎందుకని కూరగాయలు.. ఆకుకూరలు, పూలు.. మార్కెట్లో కొనుక్కుని మళ్ళా మారు అమ్మకానికి మోపెడ్ మీద తిరుగుతాడు. రోజూ దాదాపు అరవై డెబ్బై కిలోమీటర్లు తిరుగుతాడు.పెద్దగా తెలివితేటలు లేవు .. ఎక్కువ రేటు చెప్పడు.. మార్కెట్ రేటుకు మరి కాసింత పైన వేసుకుని అమ్ముతాడు.. ఇదేంటి నారాయణ ఇంత అమాయకుడివి.. తెలివి లేదు ఎలా బతుకుతావు అంటే.. పల్లకుందూ ఎవడినైనా ముంచాలంటే తెలివుండాలి గానీ.. మామ్మూలుగా బతకడానికి తెలివెందుకు.. మనం కొన్న సరుకుమీద కేజీకి ఐదో పదో వస్తే చాల్లే.. నాకెందుకు తెలివి.. మేడలు కట్టాలా.. మిద్దెలు కట్టాలా అంటాడు.. అవునులే.. బతకడానికి తెలివి అక్కర్లేదు.. రెక్కలకష్టం చాలు.. ఎవరినో మోసం చేయాలంటే తెలివి ఉండాలి.. అనేశాను.నారాయణతో వాదించలేం.. తెలివి లేదంటాడు.. కొత్త లాజిక్కులు తీస్తాడు.. నారాయణ ఇద్దరు కొడుకులూ మేస్త్రీలే.. రోజూ పని.. డబ్బులు ఉంటాయి.. ఇద్దరి బతుకులకు ఎక్కడా సమస్య లేదు.. ఆడపిల్లను కూడా దగ్గిరోళ్లకే ఇచ్చాను.. దాని బతుక్కి పర్లేదు.. అల్లుడు మంచోడే.. పండక్కి కూతురికి మూడువేల ఇచ్చాను.. నా కొడుకులు కూడా తలా వెయ్యేసి ఇచ్చారు.. మొత్తం ఐదువేలు.. దానికి దాని పిల్లలకు గుడ్డముక్కలకు సరిపోతాయి.. ఇంకేటి కావాలి చెప్మి అంటాడు.. అంత దిలాసాగా ఉన్నవాడితో మనం నెగ్గుకురాలేం.. అవును నారాయణ జీవితానికి ఇంకేటి కావాలి అన్నాను. పిల్లలు బాగున్నారు కదా మరి నువ్వెందుకు తిరగడం అంటే.. మా బాగా చెప్పినావ్.. మన బతుకు మనది.. నేను మా ముసల్ది .. నా జీవితం వేరే.. పిల్లలతో మనకెందుకు.. ఒంట్లో సత్తువున్నంత వరకు మనం పంజేయాలా. పైసా తెచ్చుకోవాలా.. మనం ఆళ్ళమీద చెరబడ్డం ఎందుకు.. నాకసలు అలాంటివి నచ్చదు.. రోజూ ఇలాగే తిరుగుతా నాకు మా ఇంటిదానికి సరిపోతాయి.. ఇంకా వందా యాభై మిగిలితే మానవరాళ్లకు గట్రా ఇస్తుంటా అంటాడు.. యేటి మరి పండక్కి బట్టలు కొన్నావా అంటే.. ఆ.. రెండు కొత్త నిక్కర్లు.. చొక్కా కొన్నా అన్నాడు మెరుస్తున్న కళ్ళతో.. మరేటి ఐతే కనుమకు ఏర్పాట్లు అంటే.. ఉంటుందిలే.. ముక్కలు గట్రా.. ఉండవేటి మరి.. అన్నీ ఉంటాయి.కనుమంటే కనుమే అంటాడు.. మరి కనుమకు మా ఇంటికి వచ్చేరాదూ నారాయణా అంటే.. గొప్పగ చెప్పినావ్.. మనవళ్లు.. మనవరాళ్లు కొడుకులు.. కోడళ్ళు.. ఓస్.. ఎంతమంది ఉన్నారనుకున్నావ్.. మా ఇల్లే పెద్ద జాతర తెలుసా.. నువ్వే మా ఇంటికి వచ్చిద్దు.. మంచి మాంసం కూర వండుకుందుము అని ఎదురు ఆహ్వానిస్తాడు.. అప్పుడంతే జగనన్న ఉన్నప్పుడు పండుక్కి ఏదో పధకం డబ్బులొచ్చేవి.. పండుగ గడిసిపోయేది.. ఇప్పుడవేటి లేవు.. ఇంట్లో పైసా లేదు. జనాల దగ్గర డబ్బుల్లేవు.. మనమే ఏదో చేసి తెచ్చుకోవాలి.. అంటూ ఎకనామిక్స్ మొదలెట్టాడు.. ఆ ఓహో అన్నాను. సర్లే.. నీతోటి మాట్లాడుకుని కూకుంటే నా యాపారం లాసైపోద్ది .. ఎల్తాను.. మళ్ళా పండుగ.. కనుమల తరువాత వస్తాను.. అంటూ కూరగాయల సంచితో బయల్దేరాడు..-సిమ్మాదిరప్పన్న. -
అహం దెబ్బతిన్న డిప్యూటీ సీఎం?
తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా ఇంకో నలభైమంది గాయపడిన ఘటన కూటమిలో కాకరేపుతోంది. ఘటన జరిగిన మరుక్షణం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బయటకు వచ్చి ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పి మొత్తం అంశాన్ని తాను హైజాక్ చేసారు. అటు చంద్రబాబు ఆ అంశాన్ని నీరుగార్చి చిన్నదిగా చేసి చూపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలోనే పవన్ ఏకంగా బహిరంగంగానే క్షమాపణ చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్, ఈవో మరికొందరు పెద్దలు దీనికి బాధ్యత వహించాలి అని బాణం సంధించారు. అయితే.. దీనికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మాత్రం తలబిరుసుతో మాట్లాడుతూ.. ఎవరో ఏదో అన్నారని తానెందుకు స్పందించాలి? అని ప్రశ్నిస్తూనే.. క్షమాపణ చెబితే పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా? అంటూ బాధ్యతా రహితంగా మాట్లాడారు. పవన్ అక్కడితో ఊరుకోకుండా టీటీడీ చైర్మన్ భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందే అని మరోసారి పిఠాపురంలో డిమాండ్ చేయడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. టీటీడీ చైర్మన్ విషయంలో పట్టుబట్టినట్లుగా ఉన్న పవన్ ను పదే పదే ఆయన్ను సారీ చెప్పడం కోసం డిమాండ్ చేస్తున్నారు. . ఇదంతా ఒకేగానీ పవన్ ఉన్నఫళంగా టీటీడీ విషయంలో ఇంతగా ఎందుకు పట్టుదలతో ఉన్నారు?. ఆయనకు ఏమైనా ఆత్మాభిమానం గట్రా దెబ్బతిన్నదా ?.. మోదీ సభలో ప్రాధాన్యం తగ్గిందా ?వాస్తవానికి మొన్నటి విశాఖ సభలో ఉంటేగింటే మోదీ తరువాతి ప్రాధాన్యం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబుకు .. రెండో స్థానంలో ఉన్న పవన్‌కు దక్కాలి. కానీ 24 మంది మంత్రుల్లో ఒకరైన లోకేష్ కు అధిక ప్రాధాన్యం దక్కడం పవన్‌కు నచ్చలేదని అంటున్నారు. కేవలం కేబినెట్లో మంత్రిగా ఉన్న లోకేష్‌ను తనతో సమానంగా మోదీ సమక్షంలో కూర్చోబెట్టి అధిక ప్రాధాన్యం ఇవ్వడం అంటే మున్ముందు తనతో సమానంగా.. ఇంకా చెప్పాలంటే తనకు పోటీగా.. లోకేష్ ను తయారు చేస్తూ అవకాశం ఉంటె తనను తొక్కేసేందుకు చంద్రబాబు ఏమాత్రం వెనుకాడడు అని ఇప్పటికే గుర్తించిన పవన్ తన సహజశైలిలో ముందుకు వెళ్తున్నట్లు భావిస్తున్నారు. తనను తొక్కేసి లోకేష్‌ను ఎలివేట్ చేసే ప్లాన్లకు తానెందుకు తలొగ్గాలి.. అసలు కూటమి విజయంలో తనదే కీలకపాత్ర అని నమ్ముతున్న పవన్ ఇప్పుడు తెలుగుదేశం చేస్తున్న తప్పులు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న దందాలు చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. అవకాశం దొరికితే మున్ముందు ఇలాంటి అంశాలను బహిరంగంగానే ఖండించి తన వాయిస్ బలంగా వెళ్లేలా చూసుకుని సొంత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. మున్ముందు పవన్ కల్యాణ్ చంద్రబాబు కాలికింద చెప్పులా ఉంటారా? చెప్పులోని రాయిలా మారతారా? చూడాలి..:::సిమ్మాదిరప్పన్న -
తొక్కిసలాట ఘటన.. పవన్ మరో ప్రాయశ్చిత్త దీక్ష?
డిప్యూటీ సీఎం, సనాతనవాదిగా లేబుల్ వేసుకున్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మళ్ళీ తన చిత్తశుద్ధిని చాటుకుని తన ఆపాదించుకున్న సనాతనవాది టైటిల్‌ను నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చింది. సందర్భాన్ని బట్టి కమ్యునిష్టుగా.. కులం లేనివానిగా.. ఒక్కోసారి.. దళితుడిగా.. ఇంకోసారి ఇంకోలా మారిపోయే నయా సనాతన వాది పవన్ కళ్యాణ్ ఇప్పుడు తక్షణమే గెటప్ మార్చాల్సిన తరుణం వచ్చింది. తిరుపతిలో లడ్డుల్లో కల్తీ, జంతువుల కొవ్వు ఉందని ఎవరో ఎక్కడో చెప్పారని .. రూఢీ కానీ ఆరోపణలను పట్టుకుని ఉన్న ఫలంగా కాషాయం బట్టలు ధరించి ప్రాయశ్చిత్తం అనే కిరీటం పెట్టేసుకుని దుర్గమ్మ ఆలయం మెట్లు కడిగేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు సనాతనవాది గెటప్ వేయాలి. దేశంలో దుష్టశిక్షణ జరగాల్సిన ప్రతి సందర్భంలోనూ నేను అవతరిస్తాను అని విష్ణుమూర్తి చెప్పి... అలాగే ఉద్భవించి రావణుడు.. హిరణ్యకశిపుడు వంటి రాక్షసులను సంహరించారు,. అలాగే పవన్ కూడా ఇదే మాట చెప్పుకున్నారు. సనాతన ధర్మానికి విఘాతం కలిగితే చాలు తాను మగ కాళికగా మారతానని హూంకరించారు. నిలువు బొట్లు.. కాషాయం బట్టలతో నానా హడావుడి చేశారు.. ఆలయ ఆంప్రోక్షణ పేరిట వీడియో షూట్లు చేశారు. చిత్తశుద్ధి పేరిట పవన్ చేసిన ఈ స్కిట్‌ను కొందరు అభినందించగా చాలామంది ట్రోల్ చేసారు. ఇక ఇప్పుడు వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లు ఇచ్చేవిషయంలో క్యూ లైన్లు నిర్వహణ సరిగా లేక అధికారుల్లో బాధ్యత లేక.. సినిమా టిక్కెట్ల కోసం ఒకేసారి గేట్లు తీసి జనాన్ని వదిలినట్లు వదలడం. పోలీసులు కూడా ఎక్కడ లైన్లు నియంత్రించకపోవడంతో తొక్కిసలాట(Stampede) జరిగింది. ఆరుగురు ప్రాణాలు హరించుకుపోయాయి. పదుల సంఖ్యలో భక్తులు తొక్కిసలాటలో నలిగిపోయి ఆస్పత్రుల పాలయ్యారు. మరి ఇప్పుడు ఆలయ పవిత్రతకు భంగం కలగలేదా..? ఇన్స్టంట్ సనాతన వాది పవన్ రక్తం మరిగిపోలేదా.. ఇప్పుడు సంప్రోక్షణ అవసరం లేదా.. ప్రాయశ్చిత్త దీక్ష చేయోద్దా...? మెట్లు కడిగే పని లేదా ? మరోవైపు బిజెపి నాయకులు కూడా కిక్కురుమనడం లేదు.. అసలు రాష్ట్రంలో అలంటి ఘటన జరగనట్లే ఉంటున్నారు. అంటే వీళ్లంతా చంద్రబాబుకు ఇబ్బంది ఎదురైతేనే కలుగుల్లోంచి బయటకు వస్తారా లేకుంటే బొరియలలో దాక్కుంటారా అనే సందేహాలు ప్రజల్లో ముప్పిరిగొంటున్నాయి. ఇప్పుడు పవన్ అర్జన్ట్ గా తిరుపతి వెళ్లాలి.. వీలయితే చీపురు ఫినాయిల్ బకెట్ పట్టుకుని మెట్లు కడగాలి.. మల్లోమారు ఆయనలోని సనాతన వాది బయటకు రావాలని ఒరిజినల్ హిందుత్వవాదులు ఆశపడుతున్నారు. కానీ, ఇప్పటికే ఆయన అక్కడికి చేరుకోవడంతో.. అది జరగదనే అనుకోవాలి. :::సిమ్మాదిరప్పన్నఇదీ చదవండి: పవన్ ఇమేజ్‌కు డ్యామేజ్ షురూ! -
లోకేష్‌కు ప్రత్యేక హోదా వచ్చింది..
ప్రధాని మోదీ విశాఖ పర్యటన పూర్తయింది. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు సంస్థలు మళ్లీ అదే ఒప్పందాలు ఇప్పుడే కుదర్చుకున్నట్లు ఫోటోలు దిగాయి.. అదంతా బాబు గొప్పతనం అన్నట్లుగా మీడియాలో ప్రచారం కూడా జరిగింది. ఇక పత్రికల్లో భారీ ప్రకటనలు.. రాష్ట్ర స్వరూపం మారిపోతున్నట్లు పెద్ద పెద్ద హోర్డింగులు.. ఇవన్నీ చంద్రబాబు హయాంలో సహజమే అయితే ప్రధాని మీటింగ్ వలన రాష్ట్రానికి. విశాఖ నగరానికి పెద్దగా ప్రయోజనం ఏమీ లేకున్నా లోకేష్ కు మాత్రం ప్రత్యేక హోదా దక్కింది.మోదీ పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన పెద్దపెద్ద పత్రికా ప్రకటనలలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోలు ఆ ప్రకటనల్లో పెట్టారు అంటే అర్థం ఉంది కానీ కేబినెట్లో అందరిలా మంత్రి పదవి తప్పితే ప్రత్యేకమైన ఏ గుర్తింపు లేని లోకేష్ ఫోటోలు ఎందుకు పెట్టినట్లు.. సీఎం, డిప్యూటీ సీఎం సహా లోకేష్‌ను ప్రధానితో వేదిక మీద ఎందుకు కూర్చోబెట్టినట్లు. ఆయనకు చంద్రబాబు కొడుకుగా కాకుండా ప్రత్యేక గుర్తింపు ఏముంది.?ఇప్పటికే అన్నిశాఖల్లోనూ విపరీతంగా జోక్యం చేసుకుంటూ పెత్తనం సాగిస్తున్న లోకేష్ ఇప్పుడు అనధికార సీఎంగా.. సూపర్ పవర్‌గా ఎదిగారని అధికారులే అంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ పెద్ద ఫైల్ కదలాలన్నా.. ఎవరికీ ఏ పోస్టింగ్ ఇవ్వాలన్నా లోకేష్‌ను కలవాలి అనేది ఒక అనధికారిక జీఓ మాదిరి నడుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన్ను డిప్యూటీ సీఎం హోదాలో అధికారికంగా నియమించడమే తరువాయి అని అంటున్నారు.ప్రస్తుతానికి అధికారికంగా అయితే చంద్రబాబు తరువాత పవన్‌కు మాత్రమే ఉప ముఖ్యమంత్రిగా ప్రాధాన్యం దక్కుతోంది. ఇక త్వరలో లోకేష్‌కు కూడా డిప్యూటీ స్థాయికి ఎలివేషన్ ఇచ్చారంటే ఇక పవన్ ప్రాధాన్యం తగ్గినట్లే.. ఇక డిప్యూటీ హోదాలో లోకేష్ మరింతగా రెచ్చిపోయి శాఖలన్నింటినీ కెలికేస్తాడు. పాపం ఇటు పవన్ తన పంచాయతీ రాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించిన పనులే అర్థం కాక తికమకపడిపోతున్నారు. రానున్న రోజుల్లో పవన్ ప్రాధాన్యం తగ్గించి లోకేష్‌ను ముందుకు తెచ్చేందుకు ఈ మోదీ పర్యటన బాగా ఉపయోగించుకున్నారని అర్థం అవుతోంది.-సిమ్మాదిరప్పన్న -
దుమ్ము దులిపేద్దాం.. జ్ఞాపకాలు సర్దేద్దాం!!
అంజలీ.. ఈరోజు ఎలాగూ కాలేజీ సెలవు కదా ఇల్లు సర్దేద్దాం నువ్వూ నాన్నా రెడీగా ఉండండి.. వంటింట్లోంచి కేకేసింది లావణ్య.. అమ్మా ఈరోజు వద్దమ్మా .. ఇంకోరోజు చేద్దాం.. తప్పించుకోబోయింది కూతురు.. లేదు.. లేదు.. పండగ వచ్చేస్తోంది.. ఎక్కడి వస్తువులు అక్కడే ఉన్నాయి.. అన్నీ రూములు.. సెల్ఫ్ లు.. పుస్తకాలు.. బట్టలు.. బుక్స్ ర్యాకులు అన్నీ తీసి పక్కన పెట్టండి.. అన్నీ దుమ్ము దులిపి అన్నీ మళ్ళా లోపల పెట్టాలి.. అర్థమైందా.. ఆర్డర్ వేసింది లావణ్య. సరే.. చేస్తే నాకేమిస్తావ్ అంది అంజలి.. నీకు బిర్యానీ చేసి.. సాయంత్రం బొబ్బట్లు చేస్తాను అని ఆఫర్ ఇచ్చింది.. మరి నాకూ అన్నాడు రాజేష్ కొంటెగా.. సిగ్గుండాలి మనిషికి అని మురిపెంతో కలిపిన చిరాకుతో వంటింట్లోకి వెళ్ళింది లావణ్య.బుక్స్ సర్దుతూ నాన్నా ఇదేంటి ఇలా మాసిపోయింది అంటూ ఓ కోతిబొమ్మను చూపించింది.. ఓ.. అదా.. ఇన్నేళ్లకు మళ్ళీ దొరికిందా అంటూ దాన్ని ముద్దుగా చేతిలోకి తీసుకున్న లావణ్య.. ఓహ్.. అదా.. నువ్వు నాలుగేళ్లు ఉన్నపుడు డాల్ఫిన్ హోటల్లో ఓ పుట్టినరోజుకు వెళ్ళాం గుర్తుందా అప్పుడు అక్కడ డెకరేషన్ కోసం పెట్టిన బొమ్మ కావాలని ఏడ్చావు.. ఎంత ఊరుకోబెట్టినా ఏడుపు ఆపలేదు.. చిరాకొచ్చి నాన్న నీకు టెంకిమీద రెండు పీకాడు గుర్తుందా.. అంది లావణ్య.. ఓహ్.. నాన్న నన్ను కొట్టారా.. అంటూ ఇప్పుడు ఏడుపు మొహం పెట్టింది అంజలి.. ఆ.. అలా కొట్టి మళ్ళీ నిన్ను ఎత్తుకుని జగదాంబ జంక్షన్లో చినుకులు పడుతున్నా వెతికి మరీ ఈ బొమ్మ కొన్నాం.. అదన్నమాట దీని కథ.. అని లావణ్య చెప్పగా.. ఓహ్.. అంటూ నాన్న తనను కొట్టారన్న కోపం స్థానే.. నాన్నను నేనంటే ఎంత ముద్దో అని ప్రేమగా నాన్నవైపు చూసింది అంజలి. నాన్నా చిన్న చిన్న గ్రీటింగ్స్ .. ఆకులు.. ఎండిపోయిన పూలు.. రంగుకాగితాలు దొరికాయ్.. అంది అంజలి.. అవునమ్మా చిన్నప్పుడు నువ్వు నా బర్త్ డేకు. న్యూ ఇయర్ కు కూడా నువ్వే సొంతగా గ్రీటింగ్ చేసి ఇచ్చేదానివి.. అవన్నీ ఇలా దాచిపెట్టాను.. ఇప్పుడు పెద్దయ్యాక ఇవ్వడం మానేసావులే.. అన్నాడు రాజేష్ నిష్టూరంగా. చిన్ననాటి తన క్రియేటివిటీకి మురిసిపోయిన అంజలి.. అయ్యో అదేంలేదునాన్న నువ్వు ఎప్పటికీ నాకు హీరోవి.. నీకు నేనే పెద్ద గ్రీటింగ్ కార్డు.. అంటూ కవర్ చేసేసింది.నాన్నా ఇవేంటి ఐస్ క్రీమ్ కప్పులు.. జడక్లిప్పులు.. అన్నీ ఒక్కో రంగులో ఒక్కో గాజు.. ఇవన్నీ ఒక్కో కవర్లో ఉన్నాయి.. బయటపడేయాలా అంది అంజలి.. వంటగదిలోంచి పరుగున వచ్చిన లావణ్య.. వెంటనే ఆ కవర్ అందుకుని తీసుకుంది.. ఎందుకమ్మా ఆ చెత్తంతా బయటేసేద్దాం అంది అంజలి.. అది చెత్త కాదమ్మా.. ప్రేమ జ్ఞాపకాలు చెప్పబోయాడు రాజేష్.. చాలు.. మీ దిక్కుమాలిన లవ్వు.. దానికో జ్ఞాపకం.. పిల్ల ఉందన్న జ్ఞానం కూడా లేదు.. కసురుకుంటూ.. జ్ఞాపకాలను తలచుకుంటూ కవర్ తీసుకుని ప్రేమగా వేరేచోట పెట్టింది.ర్యాక్ లోని కవర్ నుంచి ఓ పాత చీర తీసి సెల్ఫ్ మొత్తం తుడిచేయబోతుంటే రాజేష్ .. అంజూ ఆ చీర జాగ్రత్తగా ఉంచమ్మా అన్నాడు.. ఏంది దీనికి కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా అంది అంజలి.. ఉంది నాన్న.. నేను అమ్మను తొలిసారి చూసింది ఈ చీరలోనే.. ఆ తరువాతనే నేను అమ్మను ప్రపోజ్ చేయడం.. పెళ్లి చూపులు చూడడం ... నువ్వు మాకు దక్కడ అంటూ పరవశంతో చెబుతున్నాడు.. ఐతే నాన్న నేను ఈ చీర ఉంచుకుంటా.. అమ్మనువ్వు ఇద్దరూ నాతో ఉన్నట్లే ఉంటుంది కదా అంది అంజలి.. పాప ప్రేమను చూసి భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.. సరే సర్దింది చాలు.. బిర్యానీ అయిపొయింది.. రండి అంది లావణ్య. చూసారా ఇల్లు సర్దితే అటు సమన్లు పేర్చుకోవచ్చు.. ఇటు పాత జ్ఞాపకాలనూ పొడుపుకోవచ్చు అంది లావణ్య.. అవునవును అంటూ తండ్రీకూతుళ్ళు ఇద్దరూ తల్లిని అల్లుకుపోయారు.-సిమ్మాదిరప్పన్న. -
పవన్‌కు మొత్తానికి గుర్తుకొచ్చింది!
మొత్తానికి ఇన్నాళ్లకు పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు తనకొక రాజకీయ పార్టీ ఉందని.. దానికీ ఆవిర్భావ దినం ఉందని యాదొచ్చింది. ఎంత సేపూ పార్టీని ఒక్కో ఎన్నికల సమయంలో ఒక్కోలా వాడుకోవడం మినహా.. పార్టీ నిర్మాణం.. పధ్ధతి.. దానికొక విధివిధానాలు లేకుండా నడుపుతూ.. పీస్ రేట్.. అంటే చేసినపని డబ్బు తీసుకునే కూలీ లెక్క పార్టీని నడుపుతూ వచ్చిన పవన్ కు ఇన్నేళ్లకు తనకు ఒక రాజకీయ పార్టీ ఉందన్న స్ఫురణకు రావడం గొప్పేనని క్యాడర్ అంటోంది.2014లో జస్ట్ ఎన్నికల ముంది మార్చి 14 న కేవలం చంద్రబాబుకు సాయం చేయడం కోసమే అన్నట్లుగా ప్రారంభమైన ఈ జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. జస్ట్ చంద్రబాబు కు మద్దతు ఇచ్చింది. చంద్రబాబును గెలిపించడమే తన లక్ష్యం అన్నట్లుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆ ఎన్నికల్లో మొత్తానికి బాబును సీఎం చేసారు. అందరినీ ఒడ్డుకు చేర్చి తనుమాత్రం ఒంటరిగా మిగిలిన నావమాదిరి ఉండిపోయిన పవన్ ఆ ఐదేళ్లు.. సినిమాలు చేస్తూ గడిపేశారు. అప్పుడప్పుడు రావడం సినిమా కబుర్లు. స్కిట్లు చేయడం .. అరుపులు కేకలతో గడిపేశారు తప్ప పార్టీని ఏనాడూ నిర్మించలేదు.. అసలు అది అవసరం అనికూడా అనుకోలేదు. ఆ తరువాత 2019లో సింగిల్ గా పోటీ చేసిన జనసేన(Jana Sena) పార్టీ ఘోరమైన దెబ్బతిన్నది. ఆఖరుకు పవన్ సైతం భీమవరం.. గాజువాకలో ఓడిపోయారు.ఆ ఐదేళ్లు అప్పుడప్పుడూ బయటకు రావడం. వకీల్ సాబ్(Vakreel Saab) వంటి సినిమాలు.. ఇప్పటం గ్రామంలో కారుమీదెక్కి రోడ్డు షో.. ఇలాంటివి చేస్తూ టైంపాస్ చేసారు టాప్ పార్టీ రాష్ట్ర.. జిల్లా కమిటీలు ఏమీ వేయలేదు. ఒక్కో ఎలక్షన్ కు ఇలా పార్టీని చంద్రబాబుకు అప్పగిస్తూ వెళ్తే పోయేదానికి పార్టీ నిర్మాణం ఎందుకు అనుకున్నారో ఏమో ఎన్నడూ ఆ విషయాన్నీ ఆలోచించలేదు. అసలు ఆపార్టీలో పవన్, నాదెండ్ల మినహా ఎవరున్నారో కూడా తెలియని పరిస్థితి.. కానీ మొన్నటి 2024 ఎన్నికల సమయంలో నాగబాబు(Nagababu) మాత్రం ప్రధానకార్యదర్శి పేరిట హడావుడి చేయడం.. క్యూ ఆర్ కోడ్ చూపించి చందాలు వసూలు చేసారు తప్ప ఎక్కడా పార్టీ గురించి చర్చలేదు. పార్టీకి ఒక పధ్ధతి.. విధానం లేకున్నా ఇన్నాళ్లు నడిపేసినా.. ఇప్పుడు ఎట్టకేలకు.. అధికారం వచ్చాక పార్టీ గుర్తొచ్చినట్లుంది. మార్చి 12, 13,14 తేదీల్లో పార్టీ ప్లీనరీ.. ఆవిర్భావదినం పిఠాపురంలో నిర్వహించాలని నిర్ణయించారు. అంటే పార్టీ పెట్టిన పదేళ్లకు ప్లీనరీ నిర్వహిస్తారా ? అధికారం వచ్చింది కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు.. పార్టీ గుర్తొచ్చిందా..? అనే సౌండ్ వినిపిస్తోంది.పోనీ ఇప్పుడైనా పార్టీకి జిల్లా రాష్ట్ర కమిటీలు వేస్తారా.. ఎమ్మెల్యే టిక్కెట్లు రానివాళ్లు.. గత పదేళ్లుగా పార్టీని కనిపెట్టుకుని ఉంటున్నవాళ్లకు గుర్తింపు ఉంటుందా .. కేవలం పవన్ భజనకు మాత్రమే ఈ ప్లీనరీ నిర్వహిస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. మొత్తానికి ఏదైతేనేం పవన్ కు పార్టీ గుర్తొచ్చిందనే కామెంట్లు క్యాడర్ నుంచి వినిపిస్తున్నాయి.. :::సిమ్మాదిరప్పన్న -
బాబు ఎఫెక్ట్.. కళ తప్పిన పండగ మార్కెట్!
రాష్ట్రంలో దసరా.. దీపావళి.. నూతన సంవత్సరం తరువాత మరో పెద్ద పండగ వస్తోంది. పిల్లాపాపలతో.. కొడుకులు.. కోడళ్ళు.. కూతుళ్లు.. అల్లుళ్లతో సందడిగా జరుపుకోవాల్సిన పెద్ద పండగ సంక్రాంతి వస్తోంది. పండుగ నేపథ్యంలో ఈపాటికే మార్కెట్లో కొనుగోళ్లు మొదలవ్వాలి. కొత్త బట్టలు.. చెప్పులు.. ఆడపిల్లల రిబ్బన్లు.. గాజులు.. పూసలు.. బట్టలు.. ఒకటా రెండా.. ఇంటిల్లిపాదికీ కొత్త వస్తువులు కొనాల్సిన పండగ.. అవి ధరించి ఇదిగో.. మా నాన్న కొత్తవి కొన్నాడు అంటూ మెరిసే కళ్లతో ఊళ్ళో తిరుగుతూ అందరికి చెప్పుకొనే చిన్నారి చిన్నబోయింది.. ఎందుకంటే నాన్న జేబులో పైసల్లేవు.. ప్రభుత్వం నుంచి పైసా రాలేదు..ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం దిగిపోయాక ప్రజల చేతుల్లో ఒక్క పైసా కూడా కానరావడం లేదు. పేదల ఇళ్లలో కొనుగోళ్ల జాడ లేదు.. పండగ వస్తే ఏంది.. వెళ్తే ఏంది అన్నట్లుగా నిస్తేజంగా ఉంది మార్కెట్ మొత్తం. వాస్తవానికి వైఎస్ జగన్ హయాంలో ప్రతీ పండుగకు ఏదో ఒక పథకం కింద వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాల్లోకి వెళ్లేవి. సంక్రాంతికి అమ్మఒడి, ఇంకోసారి ఫీజు రీయింబర్స్మెంట్.. ఆసరా... ఇలా నిత్యం డబ్బు చేతిలోకి వస్తుండడంతో ఆ డబ్బుతో పండగ గడిచిపోయేది. పేదవాడి చేతిలోకి వచ్చిన రూపాయి మార్కెట్లోకి పరుగులు తీసేది.. బట్టలు.. చెప్పులు.. ఫోన్లు.. టీవీలు.. ఇలా రకరకాల గృహోపకరణాలు కొనేవాళ్ళు.ఆ డబ్బుతో కొంత డౌన్ పేమెంట్ కట్టి.. మిగతా నెలవారీ కిస్తీలు కట్టేలా వస్తువులు తీసుకునేవాళ్ళు. దీంతో పండగ వస్తే చాలు మార్కెట్లు జనంతో కళకళలాడేవి. ఒక పేదవాడి వద్దకు వచ్చిన పదివేలు రిటైల్ షాపులకు చేరితే అక్కడి నుంచి హోల్ సేల్ డీలర్ వద్దకు.. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ వరకూ ఆ పదివేలు ప్రవహించేది. కానీ గత ఆర్నెల్లుగా ఎక్కడా రూపాయి వచ్చింది లేదు.. పైగా కరెంటు బిల్లుల మోత మొదలైంది. రానున్న సంక్రాంతి పండగ సైతం ఉస్సూరుమంటుంది తప్ప ఏమాత్రం జోష్ ఉండదు అని ఇప్పటికే జనాలకు అర్థమైంది.. ఈ క్రమంలోనే పల్లెల్లోని చిన్న చిన్న దుకాణాలు సైతం నడవని పరిస్థితి నెలకొంది. పండగ నాడు చేతిలోకి డబ్బులు రాగానే బట్టలు.. ఇంటి నిత్యావసరాలు.. చెప్పులు.. వాచీలు.. ఇలా రకరకాల వస్తువుల కొనుగోళ్లు భారీగా జరిగేది.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.వీధి వ్యాపారులు.. చిరు వ్యాపారాలు కుదేలు..పండగ పూట పల్లెల్లో చిన్నచిన్న సామాన్లు.. బట్టలు.. దుప్పట్లు.. గాజులు.. పూసలు.. గౌన్లు .. కొత్త గిన్నెలు.. అమ్మేవారు కోకొల్లలుగా తిరిగేవారు. అంతేకాకుండా పట్టణాల్లోనూ అలంటి చిరువ్యాపారులు సరుకులను వీధుల్లో పోసి అమ్మేవారు. కానీ ఇప్పుడు ప్రజల చేతుల్లో పైసల్లేకపోవడంతో ఆ వ్యాపారులు సైతం అమ్మకాలు మానేశారు. భారీగా పెట్టుబడులు పెట్టి.. అప్పు చేసి మోపెడ్ మీద రోజంతా తిరిగినా జనాలు కొనడం లేదని అంటున్నారు.భారీగా తగ్గిన జీఎస్టీ వసూళ్లు..వాస్తవానికి మధ్యతరగతి, పేదల వద్దకు చేరిన డబ్బు వెనువెంటనే మార్కెట్లోకి ప్రవహిస్తుంది. ఈ క్రమంలో దానిమీద కనీసం 18 శాతం వరకు జీఎస్టీ రూపేణా ప్రభుత్వానికి వస్తుంది. అందులో సగమైనా రాష్ట్రప్రభుత్వం వాటా ఉంటుంది. అంటే పదివేలు ఖర్చు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రమారమి వెయ్యి ఆదాయం వస్తుంది. ఆయా పదివేలు ఇంకో చెయ్యి మారితే అందులోనూ మళ్ళీ జీఎస్టీ వాటా.. ఇంకో లావాదేవీ జరిగితే మళ్ళీ జీఎస్టీ.. అంటే ప్రజలనుంచి డబ్బు ఎన్ని చేతులు మారితే అన్నిసార్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నమాట. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ప్రస్తావనే లేదు. దీంతో అంతిమంగా చిన్న వ్యాపారాలు తగ్గిపోయాయి. బట్టలు.. ఇతర మామూలు సరుకులు అమ్మే వ్యాపారాలు దివాళా తీశాయి. ఇక, వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జీఎస్టీ వసూళ్లు బ్రహ్మాండంగా ఉండేవి. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక జీఎస్టీ వసూళ్లు తగ్గుముఖం పడుతూ ఏకంగా మైనస్ లోకి వెళ్ళిపోయింది. నవంబర్ నెలకు సంబంధించి ఏపీ రాష్ట్రం దేశ సగటు జీఎస్టీ వసూళ్లలో -10% (మైనస్ పదిశాతం) నమోదు చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అక్టోబర్ మినహా ఎప్పుడు వృద్ది నమోదు కాలేదు. మొత్తం మీద చూసుకుంటే జనం కొనుగోలు శక్తి తగ్గుముఖం పట్టింది అని ఈ జీఎస్టీ వసూళ్ల లెక్కలు చెబుతున్నాయిఏపీలో ఈ ఆర్థిక సంవత్సరం వివరాలు ఇలా.. 2024 ఏప్రిల్.. +12%మే +15%జూన్ వివరాలు జీఎస్టీ వెబ్ సైట్లో అందుబాటు లో కనిపించలేదు.జూలై -7%ఆగష్టు -5%సెప్టెంబర్ -4%నవంబర్ -10%డిసెంబర్ - 6%.-సిమ్మాదిరప్పన్న -
తీసేయ్.. తీసేయ్.. అందర్నీ డిలీట్ చేసేయి స్వామీ
దేముడా.. ఓ మంచి దేముడా.. నా జీవితంలో ఇంకో ఏడాది గడిచిపోయింది.. వయసు ఏడాది పెరిగింది తప్ప జీవితంలో మార్పులేం రాలేదు.. కాలం మారింది.. మారిందంటే వానాకాలం పోయి చలికాలం వచ్చిందని కాదు.. కాలాన్ని బట్టి మనుషులు బుద్ధులు మారినై అంటున్నా.. మనుషులు మారినారు.. అదిగో మళ్ళా మనుషులు మారడం అంటే ఆడోల్లు మగాళ్లుగ.. మగాళ్లు ఆడోళ్లలా మారడం కాదు.. మనిషి తీరు మారింది అంటున్నా.. మీ దేవుళ్ళు మాత్రం యుగయుగాలుగా ఒకేలా ఉంటున్నారు కానీ.. మావాళ్లేంది సిచ్యువేషన్ బట్టి మారిపోతున్నారు.. నువ్వు పుట్టించినప్పుడే పర్మినెంట్ చిప్ కదా పెట్టాలి.. మంచివాడికి ఒక చిప్.. అంటే వాడు చచ్చేవరకు మంచివాడిగా ఉండాలి.. వెధవలకు ఇంకో చిప్.. అలా పెడితే బాగుణ్ణు కదయ్యా.. మొబైల్ ఫోన్లలో ఆటో అప్డేట్ ఉన్నట్లు .. ఫోన్లో సెట్టింగ్స్ మారిపోతున్నట్లు ఫ్రెండ్స్.. చుట్టాలు.. బంధువులు కూడా అప్డేట్ ఐపోతున్నారు స్వామి.. అంటే వాళ్ళంతట వాళ్లే మారిపోతున్నారు.. నేనేమో ఇంకా వాళ్ళు ఎప్పట్లానే ఉన్నారేమో అని చూస్తుంటే ఫోన్లో యాప్స్ సపోర్ట్ చేయనట్లుగానే వాళ్ళు నా మైండ్ సెట్ కు సూటవకుండా ఫోన్ కు.. బ్లూ టూత్ కనెక్ట్ కాకుండా ఉంటున్నట్లు ఉండిపోతున్నారు.అంతా రివర్స్ లో ఉంటోంది ఏంది స్వామీఅదేంటో స్వామీ.. నేను నాలుగేళ్ళ క్రితం వరకూ నానా ఇబ్బందులో ఉండేవాణ్ణి.. ఆ సమయంలో కాస్త కలిగిన మా చుట్టాలంతా నావాళ్ళ మాదిరిగానే ఉండేవాళ్ళు. నా ఉద్యోగం పోయిందని సంతోషంతోనో.. వీడికి బాగా అయిందన్న ఆనందంతోనో తెలీదు కానీ ఎంతోమంది పలకరించారు. వాళ్ళ గొప్పతనం చాటుకోవడం కోసమేనేమో.. బియ్యం పంపిన బంధువులు.. వెయ్యి వేసిన చుట్టాలు ఉన్నారు.. కానీ ఆ వెయ్యి.. ఆ బియ్యం వాళ్ళ దాతృత్వాన్ని చెప్పుకోవడానికి.నా అసమర్థతను చాటడానికి వాడుకున్నారని తరువాత తెలిసింది. అదేంటో స్వామి.. విత్తనాల్లో కల్తీ.. ఆహారంలో కల్తీ.. నూనెకల్తీ.. టీపొడి కల్తీ విన్నాను కానీ ఈ ఏడాది ఏకంగా బంచువుల్లోనే కల్తీగాళ్లను చూసాను స్వామి.. వాళ్ళ ఇంటికి భోజనానికి పిలుస్తారు.. పోన్లే అభిమానంతో పిలిచారేమో అని వెళతానా.. కూర్చోబెట్టి వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ నా అసమర్థతను .. నా పేదరికాన్ని తరచూ గుర్తు చేస్తున్నారు.. అవమానంతో ముద్ద గొంతు దిగలేదయ్యా.. పోనీ బయటి బంధువులు ఎవరో ఇలా చేశారంటే ఒకే ఒకే.. అందరూ నావాళ్లు.. ఆత్మీయులు అని నమ్మినవాళ్ళే ఇలా చేస్తుంటే ఇక ఎవర్ని నమ్మాలయ్యా ..కూట్లో బుగ్గిపోసే రకంనాతో గడిపి గడిపి కష్ఠాలు.. బాధలకు కూడా బోరొచ్చిందేమో.. నాక్కాస్త గ్యాపిచ్చాయి.. రాత్రి పగలు కష్టించాను.. చిన్నా పెద్ద .. ఏపని దొరికితే అది చేశాను.. చిన్న ఉద్యోగం.. పదిరూపాయలు ఆదాయం.. కాస్త నడుపునిండా బువ్వ.. ఇంట్లో భార్యాబిడ్డలతో కాసిన్ని స్మైలీ సన్నివేశాలు దొరికాయి. వాటిని ఫోన్లో స్టోర్ చేసేలోపే మళ్ళీ ఫేక్ పాత్రధారులు ఎదురయ్యారు. ఏంటీ ఏదో ఆఫర్ తగిలిందట కదా.. ఏదో అయిందట కదా అంటూ ఓ ఫంక్షన్లో సెటైర్లు.. కొందరు ఇలాగే రాత్రికిరాత్రి ఎదిగిపోతుంటారు అంటూ ఎత్తిపొడుపులు.. నేను నిద్రపోని రాత్రులు.. ముద్ద తినని పొద్దులు.. నడిచి నడిచి తిరిగిన నా కళ్ళు.. కునుకు లేక ఇంకిన నా కళ్ళు... ఇవన్నీ వీళ్లకు తెలుసా ? తెలీదు.. నేను ముద్దలేక ఏడుస్తుంటే సంబరంలో వీళ్ళీ.. నేను కడుపునిండా తింటుంటే కడుపు మంటతోనూ వీళ్ళే .. వద్దు స్వామి.. ఇలాంటి నకిలీలు నాకొద్దు.. వీళ్ళను నానుంచి తీసెయ్యి.. ఫోన్లనుంచి నంబర్లు తీసేసినట్లు నా మైండ్ నుంచి వెళ్ళాను తీసెయ్యి.. ఒరిజినల్ .. మనసున్నవాళ్లను నాకు దగ్గర చెయ్యి.. ఈ కొత్త ఏడాదిలో నాకు ఇంకేం వద్దు.. ఒరిజినల్ మనుషులను ఇవ్వు చాలు..-సిమ్మాదిరప్పన్న -
అసలు సిసలు విజనరీ..
అదేంటి మావాడు పోస్టాఫీసులో రన్నర్‌గా పంజేస్తున్నాడు.. పర్మినెంట్ కాదు గానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. కట్నం కింద సైకిల్.. నేషనల్ టూ ఇన్ వన్ టేప్ రికార్డర్ ఇవ్వాల్సిందేఒరేయ్ రాముడూ బామ్మ సీరియస్.. స్టార్ట్ ఇమీడియట్లి అని హైదరాబాద్‌లో మీ అన్నకు టెలిగ్రామ్ పంపరాఒసేయ్ గీతా.. నీకు కొత్త పుస్తకాలు ఎందుకే.. మీ అక్క పాత బుక్స్ ఉన్నాయిగా అవి కొత్త అట్టలు వేసుకుని వాడుకోమొన్న దసరాకే లాగు చొక్కా కొన్నాను.. మళ్ళీ సంక్రాంతికి కొనాలంటే ఎలా..మళ్ళీ వచ్చే సారి చూద్దాంలేచుట్టాలొచ్చారు.. పప్పు.. గుడ్డు వండి అప్పడాలు వేయించాలిఒరేయ్ చింటూ సైకిల్ బాగా కడిగి..తుడిస్తే నీకు సాయంత్రం ఓ అరగంట తొక్కనిస్తాఢిల్లీ వెళ్ళాలంటే మాటలా రైల్లో మూడురోజులు పడుతుంది మరిఆకాశవాణిలో పుష్ప సినిమా సంక్షిప్త శబ్ద చిత్రం వచ్చిందట పెట్టాండర్రఈసారి పెళ్లి బంతిలో మొదట వేసే లడ్డూను జేబులో దాచేసి ఇంకో లడ్డూ అడగాలిపెళ్లవ్వగానే ఆయన వెళ్ళిపోయారు. లెటర్స్ వస్తున్నాయి కానీ ఆయన్ను చూస్తే బావుణ్ణు.. ఉత్తరాల్లో మనిషి కనిపిస్తే ఎంత బావుణ్ణుఅసలు ఈ పట్ట పగలు ఫుల్ చార్జి పే చేసి ఫోన్ ఎందుకు చేయాలి..రాత్రి పది తరువాత ఐతే హాఫ్ చార్జి ఉండేదిగాఒరేయ్ నాగులూ నాన్న ప్యాంట్ కాస్త సైజ్ చేసి వాడుకోరా నీకు సరిపోతుందిఅమెరికాలో జేబులో పెట్టుకునే ఫోన్లు ఉన్నాయట తెలుసా?ఎన్నైనా చెప్పు..రాజ్ దూత్ అంబాసిడర్..ఈ రెండూ భూమి ఉన్నంత వరకూ ఉంటాయ్బ్యాంకులో ఖాతా ఉండడం అంటే మాటలా.. అమ్మో ఆయనకు ఎంత పరపతి..మేం బ్లాక్ అండ్ వైట్ టివి మాత్రమే ఇస్తాం..కలర్ టీవీ ఇవ్వలేం.. సంబంధం క్యాన్సిల్ ఐనా ఫర్లేదు.. మేం తూగలేమురామారావు అప్పుడే బజాజ్ చేతక్ కోసం మొడువేలు అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేశాడట.. అంటే ఆయన బయటి ఆదాయం ఎంత ఉందో మరిఎదురింటి లక్ష్మి గోద్రెజ్ పఫ్ ఫ్రిజ్ కొనింది.. మొగుడు బానే సంపాదిస్తున్నాడునేను ఎంత రాత్రయినా కానీ మీ అన్నయ్య వచ్చాకే వంట చేస్తాను.. మాకు గ్యాస్ పొయ్యి ఉందిగా వదినా..ఇదీ మన్మోహన్ సింగ్ అనే ఒక ఆర్థిక మేధావి లేకుంటే భారతదేశ పరిస్థితి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన్నుంచి 1990ల వరకూ దేశం ఇలాగే ఉండేది. ఏ మూల చూసినా నిరుద్యోగం. వెనుకబాటు.. ఒక చిన్న ఉద్యోగం కోసం పోరాటం.. ఇంటిల్లిపాదీ ఆ ఉన్న కొద్దిపాటి పొలంపైనే జీవనం. మూడు నెలలు పని ఉంటే మిగతా తొమ్మిది నెలలూ ఖాళీగా ఉండడమే. ఎకరాకు 18-20 బస్తాల ధాన్యం పండితే గొప్ప. అసలు ఇంత పెద్ద దేశానికి మన్మోహన్.. పీవీ నరసింహారావు వంటివాళ్లు ప్రధానులు.. అర్థికమంత్రులు కాకపోయి ఉంటే దేశం ఆకలితో అల్లాడిపోయేది. ఒరిస్సాలోని కలహండి ఒక్కటే కాదు దేశం నలుమూలలా ఆకలి చావులు ఉండేవి. దేశంలో ఇన్ని పరిశ్రమలు.. ఇంత ఉత్పత్తి.. ఇన్ని లక్షల ఉద్యోగాలు.. ఈ స్థాయి ఆదాయం ఉండేదే కాదు. ఇప్పుడు మన కళ్లముందు ఉన్న భారత దేశం అనే చిత్తరువు మన్మోహన్.. పీవీ అనే విజనరీ చిత్రకారులు తమ మనో నేత్రంతో ఊహించి గీసిన చిత్తరువే ఈ ఆధునిక భారతదేశం. వేలాది ఆటోమొబైల్ పరిశ్రమలు.. పోర్టులు.. టూరిజం..ప్రైవేటు బ్యాంకులు.. చెప్పులు.. వస్త్రాలు.. మొబైల్ ఫోన్లు ..దేశంలో వేసిన రహదారులు.. ఎయిర్పోర్ట్ లు..ప్రైవేటు విమానయాన సంస్థలు.. విద్యుత్ ప్రాజెక్టులు... రైల్వే లైన్లు.. ఐస్ క్రీములు.. ఆఖరుకు ఫ్లేవర్డ్ కండోమ్స్.. కోట్లలో ఉద్యోగాల కల్పన.. ఇవన్నీ ఆ ఇరువురి చలవే..అన్నిటికీ మించి భారత సాఫ్ట్వేర్ రంగం మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసింది. దానిద్వారా ఉత్పన్నమైన సంపద దేశ రియల్ ఎస్టేట్.. నిర్మాణ రంగాన్ని సమున్నతంగా నిలిపింది.. ఇలా ఆ దర్శనికులు ఆనాడు శ్రీకారం చుట్టి మొక్కగా వేసిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చాయి. అంతర్జాతీయంగా మనను సగౌరవంగా నిలబెట్టింది. దేశానికి ఎంతోమంది ప్రధానులుగా పని చేసినా పీవీ.. మన్మోహన్ అనే జోడుగుర్రాలు మాత్రమే దేశాన్ని పేదరికం స్థాయి నుంచి మరో మెట్టు పైకి ఎక్కించారు.. ఇప్పుడు భారత్ పేద దేశం కాదు.. ఎన్నో రంగాల్లో ప్రపంచాన్ని శాసిస్తున్న ఒక మహా మేరు పర్వతమిది.. దీనికి ఇంధనం.. శక్తి నింపింది ఆ ఇద్దరే . మరోమారు ఆ మౌనముని మన్మోహన్ సింగ్‌కు అంజలి ఘటిస్తూ.. -సిమ్మాదిరప్పన్న -
కాలం మారింది.. నాన్నను మార్చింది
నాన్న.. అమ్మలా మారుతున్నాడు. కోపం చిరాకు లేదు.. ఎక్కువటైం పిల్లలతోనే!. కాలం తెచ్చిన మార్పు.. పిల్లలకు తండ్రితోనే ఎక్కువ సాన్నిహిత్యం!కుటుంబలో నాన్న అంటేనే ఒక ప్రత్యేక క్యారెక్టర్... నాన్న అంటే గాంభీర్యతకు ప్రతీక .. ఎప్పుడూ పనులు.. బాధ్యతలు.. కుటుంబ సమస్యలు.. అప్పులు.. వ్యవసాయం వంటి పనుల్లో బిజీ.. నాన్నను కలవాలంటేనే ముందుగా ప్రిపరేషన్ ఉండాలి. నాన్నతో మాట్లాడడం అంటే హైడ్మాస్టర్ దగ్గర నిలబడినట్లే.. నాన్న ఒక సీరియస్ క్యారెక్టర్... నాన్న వేలు పట్టుకుని నడిస్తే ఎంతబావున్ను.. నాన్న నన్ను తన భుజాలమీద ఎక్కించుకుని జాతరలో తిప్పుతూ.. జీళ్ళు కొనిపెడితే ఎంతబావుణ్ను... నాన్న పక్కన పడుకోబెట్టుకొని కబుర్లు.. కథలు చెప్పే రోజులు నాకు రావా ? ఇదీ సగటు తండ్రి క్యారెక్టరైజేషన్. దాదాపు 1990ల వరకూ నాన్న(Father) పరిస్థితి ఇదే.. ఇంట్లో అందరి బాధ్యతలూ మోస్తూ అందరికీ దూరంగా ఉండే ఒక సెమి విలనీ పాత్ర...ఎప్పుడూ పనులు.. బాధ్యతల్లో ఉంటూ అసలు పిల్లలతో టైం గడపడం.. వారిని ఆడించడం.. వారితో ముచ్చట్లు ఆడడం అనేది తనకు సంబంధం లేదనుకునే పాత్ర ఆయనది. కేవలం పిల్లల ఖర్చులు.. బట్టలు.. పుస్తకాలు.. జ్వరం వస్తే మందులు వంటివి తేవడం తప్పిస్తే పిల్లలతో టైం గడపడం అనేది తండ్రి డైరీలోలేదు. పిల్లలకు స్నానం చేయడం.. వారిబట్టలు మార్చడం .. ఇలాంటివి అంటే డాడీకి ఎన్నడూ అసలు పరిచయం లేని పనులు. నాన్న కేవలం కొన్ని బాధ్యతలు మోయడం తప్ప పిల్లలతో ప్రేమను పంచుకునే సందర్భాలు.. సన్నివేశాలు దాదాపు తక్కువే. అప్పట్లో అన్నీ ఉమ్మడికుటుంబాలు.. పిల్లలతో టైం గడపడం అనేది ఆయనకు తెలియని పని.. అలాంటివి అన్నీ అమ్మే చూసుకుంటుంది.. పిల్లల విషయంలో తండ్రిది ఎప్పటికీ గెస్ట్ పాత్ర మాత్రమే....కాలం మారింది .. నాన్నను మార్చింది1960 ల నుంచి 1990, 2000 వరకు నాన్నది అదే సీరియస్ పాత్ర.. కానీ రోజులు మారుతున్న కొద్దీ నాన్నలోని కాఠిన్యం కరిగిపోతూ వస్తోంది.. నాన్నలో కూడా అమ్మలాంటి సున్నితత్వం... పిల్లలపట్ల ఎనలేని ప్రేమ పొటమరిస్తున్నాయి. ఇవన్నీ కాలం తెస్తున్న మార్పులే. గ్లోబలైజేషన్ కారణంగా ఉపాధి అవకాశాలు పెరగడం.. ఉమ్మడికుటుంబాల ప్రాబల్యం తగ్గడం.. ఎక్కడికక్కడ ఉపాదివేటలో పట్టణాలకు వలసవెళుతున్న కుటుంబాలు(Families) అక్కడే స్థిరపడడం వంటివి నాన్న పాత్రలో మార్పులు తెస్తోంది. పట్టణానికి చేరిన నాన్న.. తన కుటుంబాన్ని తానే చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ తమ బిడ్డలకు సాయం చేసేందుకు బామ్మలు.. మామ్మలు లేరు.. తల్లి ఒక్కతీ పనులు చేసుకోదు .. చేసుకోలేదు.. దరిమిలా నాన్న కూడా అమ్మకు పనుల్లో తోడుగా నిలవాల్సిన పరిస్థితి అనివార్యంగా మారింది. ఈక్రమంలోనే నాన్న కూడా సున్నితత్వాన్ని సంతరించుకుంటున్నాడు . గత పాతిక ముప్పై ఏళ్ళ క్రితం జనరేషన్లకు ఊహాకు కూడా అందని సేవలు ఇప్పుడు నాన్న తన బిడ్డలకు చేస్తున్నాడు. 1980ల్లో 43 శాతం మంది తండ్రులకు తమ పిల్లల \డైపర్లు మార్చడం అనేది తెలియదట ప్రస్తుతానికి అది 3 శాతానికి తగ్గింది. అంటే ఇప్పుడు తండ్రులు పిల్లల సేవల్లో(Father-Kids Relation) తల్లితోబాటు సమానంగా బాధ్యత తీసుకుంటున్నారట.నాన్నతోనే స్నేహం ఇప్పుడుఅప్పట్లో సీరియస్ పాత్రలో ఉండే నాన్న ఇప్పుడు పిల్లలపట్ల అత్యంత ప్రేమతో ఉంటున్నారట. పిల్లలకు కెరీర్ సంబంధ సలహాలు ఇవ్వడం.. వారికి సైకిల్.. బైక్.. నేర్పడం.. వేలు పట్టుకుని నడిపించడం.. సాధ్యమైనంత ఎక్కువటైం పిల్లలతో గడపడం.. కథలు చెప్పడం.. టూర్లకు తీసుకెళ్లడం.. పిల్లలకు స్నానం చేయించడం.. వాళ్లతో పడుకోవడం.. ఇలా ప్రతి పనిలోనూ నాన్న తోడుగా ఉంటున్నాడు.. అమ్మలా మారిపోతున్నాడు. గ్లోబలైజేషన్(Globalisation) తెచ్చిన మార్పులతో నాన్నల పాత్రల్లోనూ మార్పులు వస్తున్నాయి..:::సిమ్మాదిరప్పన్న -
నాగబాబు బెర్త్ ఇంకా వెయిటింగ్ లిస్ట్ లోనే
మెగా బ్రదర్... జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు మంత్రి యోగం.. ఉందా..? ఇప్పట్లో..? పండక్కి అవుతుందా ? ఇంకా టైం పడుతుందా ? అంతా గందరగోళం. తన మానాన తాను ట్విట్టర్లో పిచ్చి ట్వీట్స్ చేసుకుంటూ ఎకసెక్కాలు ఆడుకుంటావు ఉంటే ఉన్నఫళాన ఆయన్ను కేబినెట్లోకి తీసుకుంటాం సీఎం చంద్రబాబు ఒక ప్రకటన విడుదల చేసారు. వాస్తవానికి మొన్నామధ్య ఖాళీ అయినా మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదానికి ఆయన్ను ఎంపిక చేసి రాజ్యసభకు ఢిల్లీ పంపుతారని వార్తలు వచ్చాయి కానీ అది కుదరకపోవడంతో ఎకాఎకిన ఆయన్ను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాం అంటూ చంద్రబాబు ప్రకటన విడుదల చేశారు. వాస్తవానికి దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఫలానా వ్యక్తికీ త్వరలో కేబినెట్లో స్థానం కల్పిస్తాం అని ప్రకటన చేయలేదు. దీని మీద అప్పట్లో జరిగాయి.. వైఎస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియావాళ్లు సైతం బాగానే ట్రోల్ చేసారు. కానీ ఇంతవరకు ఆ విషయమై ఏమీ తేలలేదు..ఇదిలా ఉండగా మంత్రిగా ప్రమాణస్వీకారం ఎలా చేయాలన్నదానిమీద నాగబాబు ఇప్పటికే రిహార్సిల్స్ కూడా చేసేసి. కొత్త బట్టలు కుట్టించుకుని రెడీగా ఉన్నారు. కానీ మరి చంద్రబాబు నుంచి .. రాజ్ భవన్‌నుంచి కనీసం పిలుపు రాలేదు. వాస్తవానికి రాష్ట్ర కేబినెట్లో ఒకే ఒక్క పోస్ట్ ఖాళీగా ఉంది. ఇప్పటికె పలువురు మంత్రులు రెండేసి పదవులు చేపట్టి బాధ్యతలు మోస్తున్నారు. వాటిలో ఒకటి తీసేసి ఈయనకు ఇస్తారని.. అది కూడా జనసేన మంత్రి కందుల దుర్గేష్ వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు ఇస్తారని కూడా పుకార్లు వచ్చాయి. కానీ ఆ సౌండ్ కూడా ఇప్పుడేం లేదు.. అంతా సైలెంట్ అయిపొయింది.ఆరోజుకు కూల్ చేయడమే చంద్రబాబు లక్ష్యమా ?వాస్తవానికి రాజ్యసభ స్థానం కోసం పట్టుబట్టిన నాగబాబును కూల్ చేయాడానికి అప్పటికపుడు ఆ మంత్రి పదవి పేరిట ఒక ప్రకటన ఇచ్చారు తప్ప ఇప్పుడప్పుడే ఆయన్ను కేబినెట్లోకి తీసుకునే అవకాశం లేదని అంటున్నారు. ఇదిలా ఉండగా అసలు ఏమి పదవి అడగాలి.. ఏది తీసుకోవాలి అనే విషయంలో పవన్ కళ్యాణ్.. నాగబాబులమధ్య చర్చలు కూడా నడిచాయని ఏ శాఖ తీసుకోవాలన్నదానిమీద వారు ఒక అవగాహనకు వచ్చారని కూడా అంటున్నారు కానీ చంద్రబాబు దగ్గర ఇవన్నీ నడుస్తాయా..? అయన ఇచ్చింది తీసుకోవడం తప్ప వీళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఉందా అనే అంశాలూ చర్చకు వస్తున్నాయి. ఏది ఏమైనా కానీ గమ్మున కేబినెట్లోకి దూకేసి హడావుడి చేద్దాం అనుకున్న నాగబాబు స్పీడ్ కు చంద్రబాబు బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాజ్యసభ ఎన్నికల హడావుడి ముగిసింది.. మళ్ళా ఏదైనా అవసరం పడినపుడు. పవన్ బ్రదర్స్ ను కూల్ చేయాల్సిన అవసరం వచ్చినపుడు చూద్దాం అందాక ఊరుకుందాం అని చంద్రబాబు సైలెంట్ గా ఉన్నారని అంటున్నారు.- సిమ్మాదిరప్పన్న -
హీరో అంటే ఇలా ఉండాలి చిన్నా..!
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం లేదు... ఈ పాఠాలు.. లెక్కలు.. కెమిస్ట్రీ ఇదేం నావల్లకావడం లేదు.. పైగా ఈ సీటు కోసం క్రికెట్.. సినిమాలు.. ఇవన్నీ మానేయాల్సి వస్తోంది.. అందుకే ఈ ఐఐటి వంటి పెద్ద గోల్స్ మానేద్దాం అనుకుంటున్నా.. ఇంకేదైనా చేస్తాను..’’ బాధపడిపోతూ చెప్పాడు శ్రీనాథ్.. కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకున్న గోపాల్ రావు 'అర్రర్రే.. అలగానీస్తే ఎలారా..కష్టంగా ఉందని మానేస్తే నీ టార్గెట్ ఏటవ్వాలి.. ఇదేకాదు ఏ పనిలో అయినా కష్టం ఉంటాది.. లక్ష్యానికి చేరాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి..అప్పుడే నీ ఆశయం నెరవేరుతాది అన్నాడు గోపాల్ రావు.. పెద్దపెద్ద డైలాగులు చెప్పడం సుళువేగానీ ఆ దారిలో వెళ్లడం కష్టం నాన్నా అంటూ మ్రాన్పడిపోతున్నాడు కొడుకు.. ఒరేయ్ అందరూ నీలాగే అనుకుంటే పెద్దపెద్ద లక్ష్యాలకు ఎలా చేరతారు. అంతెందుకు మన జగన్‌ను చూడు.. ఎన్ని బాధలు పడితేతప్ప సీఎం కాలేదు.. దీనికోసం ఎంత కష్టించాడో.. ఎన్ని ఇష్టాలను వదులుకున్నాడో తెలుసా అన్నాడు తండ్రి.. పళ్లకో నాన్న నువ్వన్నీ ఇచిత్రాలే చెప్తావ్.. జగనుకు యేటి కష్టం.. వాళ్ళనాన్న రాజశేఖర్ రెడ్డి సీఎం కాబట్టి ఈయనా సీఎం అయ్యాడు.. ఏం కష్టం పడ్డాడు చెప్పు అన్నాడు శ్రీనాథ్.. ఒరేయ్ అలాగనీకు యావత్ దేశంలోనే ఒక సంచలనం.. జగన్ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. నీలాంటి యువతకు ఒక రిఫరెల్ సక్సెస్ స్టోరీ అన్నాడు గోపాలం. ఏదీ అంత గొప్పేముందని అందులో.. అన్నాడు కొడుకు.. సరే పక్కన కూకో అంటూ.. గోపాలరావు చెప్పాడునువ్వనుకుంటున్నట్లు జగన్ జీవితం కొన్నాళ్లవరకు.. వడ్డించిన విస్తరే కానీ.. ఆ విస్తరి అక్కర్లేదు.. తనకోసం కొత్తబాట వేసుకుందాం అనుకున్నాడు అందుకే రాజకీయాల్లోకి వచ్చాడు అన్నాడు తండ్రి.. అదెలా అన్నాడు శ్రీనాథ్.. అవును వైఎస్సార్ కొడుకుగా జగన్ ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్.. కానీ తండ్రి మరణం తరువాత తనకంటూ ఒక బాటవేసుకున్నాడు. తండ్రిని గుండెల్లో పెట్టుకున్న ప్రజలకోసం తానూ అండగా ఉండాలని భావించాడు..' అందుకే సీఎం అయిపోయాడు అన్నాడు శ్రీనాథ్.. నీ తలకాయ.. అయన అంత సులువుగా అవ్వలేదు.. దీనికోసం పడిన కష్టాలు వింటే నువ్వు పడుతున్న ఇబ్బందులు కూడా ఒక సమస్యేనా అంటావు.. అన్నాడు నాన్న ఏం కష్టాలు నాన్నా.. సులువుగానే సీఎం అయ్యాడు కదా అన్నాడు శ్రీనాథ్. కాదురా బాబు.. వైయస్ మరణం తరువాత పొలిటికల్ స్క్రీన్ మీద అయన పాత్రను ముగించేందుకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నో కుట్రలు జరిగాయి. వైయస్సార్ పుణ్యాన మాంత్రులు అయినవాళ్లు.. ఎంపీలు అయినవాళ్లను సైతం జగన్ వెంట గోతులు తీశారు. అయినా ఈయనవెరవలేదు. నీలాగా భయం వేస్తోందని పారిపోలేదు.పరిస్థితులకు ఎదురీది.. సవాళ్లకు ఎదురేగి నిలబడ్డాడు.. కాలంతో కలబడ్డాడు... ఢిల్లీ పెద్దలతో తలపడ్డాడు.. అది కదా పోరాటం అంటే.. పోన్లే అలా చేసి గెలిచేసాడు.. సీఎం అయిపోయాడు అంతేనా అన్నాడు శ్రీనాథ్.. జగన్ జీవితం అంతవీజీగా అవ్వలేదురా... తన లక్ష్యసాధనకు అడ్డుగా ఉందని భావించిన ఎంపీ పదవిని వదిలేసాడు.. నువ్వు ఆఫ్ట్రాల్ సినిమాలు.. క్రికెట్ వదులుకోలేని అంటున్నావు ... లోకాన్ని తెలుసుకోవడానికి వేలకిలోమీటర్ల పాదయాత్రలు చేశాడు.. మొదటిసారి కూడా ప్రజలకు తానూ చేయగలిగేవే చెబుతాను తప్ప మోసం చేయలేను అంటూ సాధ్యాసాధ్యాలు పరిశీలించి కొన్ని కొన్ని హామీలు ఇచ్చి పోటీ చేసాడు. మంచి సీట్లొచ్చాయి.. కానీ అధికారం రాలేదు.. నీలాగా నావల్ల కాదని పారిపోలేదు.. ఆ వచ్చిన సీట్లలో కొందరు పార్టీమారిపోయారు.. ఆ పరిణామాలను చూస్తూ నవ్వుకున్నాడు.. రాటుదేలాడు తప్ప ఇది కష్టం అని వదులుకోలేదు.. మళ్ళీ రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూలకు పాదయాత్ర చేశాడు.. నువ్వు కూడా నే సిలబస్ మొత్తం ఆమూలాగ్రం ఇలాగె చదవాలి. ‘‘ఓహో.. ఒకే మరి నడిస్తే ఏమైంది..’’ అన్నాడు కొడుకు.. ఏముంది పాదయాత్రలో భాగంగా తాను చూసినా ప్రజల కష్టాలే అయన మ్యానిఫెస్టో అయింది. అదేమాట చెప్పాడు.. అఖండ మెజార్టీ సాధించాడు. రెండేళ్లు కోవిడ్ కాలంలోనూ ప్రజలను కాపాడుకుని దేశవ్యాప్తంగా పేరుపొందాడు.. రాష్ట్రంలో విద్యావైద్యరంగాలను పరుగులు పెట్టించాడు. పారిశ్రామికరంగం ఉరకలేసింది. అడిగాడా హీరో అంటే.. నీలాగా ఎప్పుడూ ఎక్కడా.. ఏనాడూ భయపడలేదు.. ఎవర్నీ లెక్కచేయలేదు.. అదిరా మగాడితనం అంటే.. అది కదా ఛాలెంజింగ్ అంటే.. నువ్వూ ఆలా ఉండాలి.. హీరోలా ఎదగాలి.. ఈ ఎగ్జామ్స్ నాకొలెక్కా అనేలా ఎదురెళ్లి మరీ నీ దమ్ము చూపాలి అన్నాడు.. ‘‘అవును నాన్న.. నిజమే.. జగన్ రాజకీయ ప్రస్థానం ఒక స్ఫూర్తిమంతం. అయన గమనం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం’’ అన్నాడు.. సరే మరి ఇప్పుడేమంటావ్ అన్నాడు గోపాలరావు.. లేదు నాన్న నేను ఈసారి మరింత రెట్టించి చదువుతాను.. సీట్ సాధించి నేనేమిటో చేసి చూపిస్తాను అంటూ బుక్స్ తీసుకుని బయల్దేరాడు.. కొడుకు వంక ఆలా చూస్తూ నిలబడిపోయాడు.. తండ్రి గోపాల రావు .. ఒరేయ్ ఈరోజు జగన్ పుట్టినరోజు.. ఆయనకు విషెస్ చెప్పి నీ చదువు ప్రారంభించు.. ఖచ్చితంగా పాసవుతావు అని చెప్పాడు.. సరే నాన్నా అంటూ కదిలాడు శ్రీనాథ్ :::సిమ్మాదిరప్పన్న -
ఏ చాయ్.. చటుక్కున తాగరా భాయ్
ఒసేయ్.. తల పగిలిపోతుంది కాసింత టీ పొయ్యవే ..గట్టిగా భార్య భారతి మీద అరిచాడు సూర్యం.రండి..రండి.. చాన్నాళ్ళకు వచ్చారు కూర్చోండి.. టీ తాగుతారామామా చికాగ్గా ఉంది అలా వెళ్లి మంచి అల్లం టీ తాగి వద్దాం రా మామా పిలిచాడు రామకృష్ణహలో అమీర్ భాయ్ దో చాయ్ దేదో కేకేశాడు లక్ష్మణ్ఇలా చినుకులు పడుతుండగా అలా నీ కళ్ళలోకి చూస్తూ వేడివేడి టీ పెదాలను తాకుతుంటే అచ్చం నిన్ను ముద్దాడినట్లె ఉంటుంది ప్రియా.. పొయిటిక్ గా చెబుతున్నాడు దీపక్తెల్లారి ఆరైంది ఇంకా టీ లేకపోతే ఎలాగూ..కోడలు పిల్లా నాకూ మీ మామయ్యకు స్ట్రాంగ్ ఇలాచి టీ తీసుకురామ్మా.. ఆర్థర్ వేసింది అత్త అనసూయఈరోజు బోర్డు మీటింగ్..మంచి టీ ఓ ఇరవై చెప్పండి.. చెక్ లిస్టులో రాసేసాడు ఎండీపిల్లాడికి జ్వరం..దగ్గు ఉంది .కాస్త అల్లం టీ ఇవ్వండి గొంతు రిలీఫ్ వస్తుంది.. ఓ డాక్టర్ సూచనట్రైనెక్కి అరగంట అయింది ఇంకా టీ కుర్రాడు రాలేదేంటి..కిటికీలోంచి చూస్తూ గొనుక్కున్నాడు రాకేష్సర్ మీకు ఏ టీ తేమ్మంటారు.. అల్లం టీ..ఇలాచి టీ..గ్రీన్ టీ.. లెమన్ టీ.. హెర్బల్ టీ.. ఏదిమ్మంటారు అడిగింది ఎయిర్ హోస్టెస్..పొద్దంతా రిక్షా లాగి లాగి తల వాచిపోతోంది.. ఓ టీ పడితే తప్ప ఇంకో ట్రిప్ లోడ్ ఎత్తలేను అంటూ టీ బంక్ వైపు పరుగుతీసాడు నర్సయ్యదేశంలో ఎక్కడ ఏ స్థాయిలో .. ఏ ఇద్దరు మాట్లాడుకోవాలన్నా వారిమధ్య వారధి టీ.. దేశ రాజకీయాలన్నీ చర్చకు వచ్చేది కూడా టీ బంకుల దగ్గరేటకీమని మూడ్ మార్చేస్తుంది..మనసు బాగా లేకపోయినా.. ఒంట్లో బాలేకపోయినా.. ఇంట్లో బాలేకపోయినా ఏ ఇద్దరి మధ్య గొడవ అయినా సరే ...ఇలాంటి ఎన్నో చిన్నచిన్న సమస్యలను టీ చటుక్కున పరిష్కరించేస్తుంది.. అడగ్గానే డబ్బు సరిపోక.. భర్త నక్లెస్ కొనలేదని మూడు రోజులుగా జగడమాడి మాటలు మానేసి అటు తిరిగి మూతి ముడుచుకుని కూర్చున్న ప్రశాంతి సాయంత్రం చిన్నగా వర్షం పడుతున్న వేళ ఎలాగైనా శ్రీమతిని మచ్చిక చేసుకోవాలని మూడు రోజులుగా భర్త శ్రీకాంత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కానీ తనకు ఇష్టమైన యాలకుల టీ చేసి రెండుకప్పుల్లో పోసి ఒక కప్పును ప్రశాంతి ముందుకు జరిపి ఏమంటుందో ఏమో అని కాస్త భయంతో బెదురు చూపులు చూస్తున్న శ్రీకాంత్ కు ఆఫర్ తగిలేసింది.. ఘమాఘమలాడే టీ సువాసనతో ప్రశాంతి కోపం కూడా ఆవిరైపోయింది. భర్తను దగ్గరకు తీసుకుని నెక్లెస్ ఏముంది..డబ్బులున్నపుడు కొందాం లెండి అంటూ అల్లుకుపోయింది.విద్యార్థులను మేల్కొలిపే ఆత్మీయ హస్తం టీఇప్పటి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయ సాధించేందుకు గంటలు గంటలు.. ఒక్కోసారి నైట్ అవుట్.. అంటే తెల్లార్లు చదవాల్సి ఉంటుంది. అలాంటప్పుడు నిద్ర మేల్కొని ఉండేందుకు.. శరీరం డస్సిపోకుండా ఉండేందుకు.. కోల్పోయిన శక్తిని మళ్లీ రీచార్జ్ చేసుకునేందుకు. చదివింది మైండ్ లోకి ఎక్కేందుకు .. నిద్ర రాకుండా.. మూత పడిపోకుండా ఉండేందుకు కూడా టీ ఆత్మీయ మిత్రుల పక్కనే నిలబడి ఉంటుంది. ఫ్లాస్క్ లో టీ పెట్టుకుని పుస్తకం పట్టుకుని కూర్చున్నారు అంటే ఇక ఆ సిలబస్ అంతు తేల్చేయాల్సిందే. రెప్పల మూతపడుతున్న తరుణంలో.. లేవయ్యా.. బోలెడు సిలబస్ ఉంది నిద్రపోతే ఎలా.. అంటూ ఆ టీ కప్ మనల్ని నిద్రలేపి పుస్తకం వైపు చూసేలా చేస్తుంది..సర్జరీలు చేసి అలసిపోయే డాక్టర్లు.. వేల కిలోమీటర్లు ప్రయాణాన్ని అలవోకగా పూర్తిచేసే డ్రైవర్లు.. పరిశోధన విద్యార్థులు శాస్త్రవేత్తలు ఒకరేమిటి,. అన్ని రంగాల వారికి టి అనేది ఒక ఔషధం.. అందమైన వ్యసనం.. ఉదయం పూట సూర్యోదయాన్ని చూస్తూ.. ఆ వెచ్చదనాన్ని టీ కప్పులో ఆస్వాదించడం కొందరికి ఒక ఇష్టమైన దినచర్య. సాయంత్రం వేళ కొండల్లోకి వెళ్లిపోతున్న సూర్యుని చూస్తూ మళ్ళీ ఓ టీ తీసుకోవడం మరికొందరికి ప్రియమైన ప్రక్రియ. ఇలా అన్నివర్గాల వారినీ కలిపి ఉంచే టీ కి కూడా అన్ని సందర్భాల్లో ఓ గౌరవప్రదమైన స్థానం ఉంది. అందరం టీ తాగుదాం.. ఆరోగ్యంగా ఉందాం.- సిమ్మాదిరప్పన్న -
మీరు రాకుంటే కామెంట్లు ఎవరు చేస్తారు.. ?
మా ఇంట పెళ్లి.. మీరంతా రావడం మా కల.. పెళ్లి పందిరి నవ్వాలి కిలకిల. మీరాక మాకెంతో శుభదినం.. ఇలా కదా పెళ్లి పత్రిక రాస్తారు.. కానీ ఈ కుటుంబం వేసిన పెళ్లి ఆహ్వాన పత్రిక చూసి నెటిజన్లు అబ్బా.. ఏం రాసిర్రు భయ్యా అంటూ నవ్వుతూనే.. కామెంట్లు సైతం పెడుతున్నారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన కొద్దీ సమయానికే లక్షదాటిన వ్యూస్.. దీంతో ఇదిప్పుడు వైరల్ ఐంది. సాధారణ సంప్రదాయానికి భిన్నంగా ఉన్న ఈ పెళ్లి పత్రిక చూసి పలువురు నవ్వుకుంటూనే.. మొత్తానికి అన్నీ నిజాలే రాసారు అని కామెంట్లు చేస్తున్నారు. మీరు పెళ్ళికి రాకుంటే ఎలా ? భోజనాల గురించి కామెంట్లు ఎవరు పెడతారు.. అది అలా ఉంది.. ఇది ఇలా ఉందని ఎవరు చెబుతారు ? కాబట్టి మీరు తప్పనిసరిగా రావాల్సిందే అని అందులో పేర్కొన్నారు. వధువు, “శర్మాజీకి లడ్కీ” (శర్మాజీ గారి కుమార్తె ) “మంచి తెలివైన అమ్మాయి" అని రాశారు. వరుడు, “గోపాలజీ కా లడ్కా” (గోపాలజీ గారికి కుమారుడు ) అంటూనే ఈయన బీటెక్ పూర్తి చేసినప్పటికీ, ఇప్పుడు ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడని వివరించారు. జనవరి ఐదోతేదీ నాటికి తమ పిల్లలతోబాటు, బంధువుల పిల్లల పరీక్షలు కూడా ముగుస్తున్నందున ఆరోజు పెళ్లి చేస్తే బావుంటుందని ముగ్గురు పురోహితులు కలిసి ముహుర్తాన్ని ఖరారు చేసారని పేర్కొన్నారు. వియ్యాలవారి మధ్య చిన్నచిన్న కయ్యలు ఉంటాయి...వాటిని పట్టించుకోవద్దు అని చెబుతూనే పెళ్లి వేదికమీదకు వధూవరులు ఆలస్యంగా వస్తారని, అంత వరకు ఓపిక పట్టాలని రాసారు. అసలే వివాహవేదిక చాలా ఖరీదుపెట్టి డెకరేట్ చేయించాం. అందుకే అక్కడ మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి.. అదేం మీ పిల్లలు ఆదుకునే అట స్థలం కాదు కదా.. అని గుర్తు చేశారు ఫుడ్ చాలా కాస్ట్లీ.. ఒకసారే తినండి పెళ్లికోసం బుక్ చేసిన భోజనం చాలా ఖరీదైంది.. ఒక్కో ప్లేట్ భోజనం రూ. 2000 కాబట్టి.. కాస్త తక్కువ తినండి. లేదా ఒకసారి మాత్రమే తినండి. వివాహ వేదిక మీకు తెలుసుగా మన దూబే గారి రిటైర్మెంట్ ఫంక్షన్ జరిగింది కదా.. అక్కడే ఈ పెళ్లి కూడా అని రాశారు. కానుకలు వద్దు.. క్యాష్ కొట్టండి పెళ్లిలో ఇచ్చే కనుకలగురించి కూడా వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఇంట్లో ఆల్రెడీ 20 ఫోటో ఫ్రేమ్స్.. బోలెడు డిన్నర్ సెట్లు ఉన్నాయి కాబట్టి.. క్యాష్ కొట్టండి. లేదా గూగుల్ పే చేయండి అని గుర్తు చేసారు. బంధుమిత్రులగురించి చెబుతూ వాళ్లంతా ఎప్పట్లానే బోరింగ్ బ్యాచ్ అని రాశారు.. ఇంకా భారీగా కానుకలు ఇస్తారు కాబట్టి.. తాతయ్య పేరును పత్రిక పైన రాశామని సరదాగా చెప్పారు. మామ.. అత్తయ్యలను గురించి వివరిస్తూ ఇంట్లో గొడవలను తీర్చే స్పెషలిస్టులుగా వివరించారు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ పత్రికను దాదాపు 1.94 లక్షల మంది చూశారు. అయ్యో నేను ఈ కార్డు ముందే చూసి ఉంటె మా అబ్బాయి పెళ్ళికార్డును కూడా ఇలాగె ప్రింట్ చేయించేవాడిని అని ఒకాయన కామెంట్ చేయగా.. వామ్మో మరీ ఇంత నిజాయితీగా రాసేశారు.. బంధువులు ఏమనుకుంటారో అని ఇంకో అయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఈ పోస్ట్ కింద వందలాది ఎమోజీలు కూడా వచ్చాయి. సిమ్మాదిరప్పన్న -
రిచ్ బెగ్గర్ భరత్ జైన్.. నెల సంపాదన ఎంతంటే?
మాఫియా తెలుసు.. ముష్టియా తెలుసా... అంటాడు ఆలీ ఓ సినిమాలో.. ఆయన చిటికేస్తే వందమంది బిచ్చగాళ్ల బిలబిలమంటూ వస్తారు. రూపాయి గట్రా ఇస్తే తీసుకోడు.. ఓన్లీ కరెన్సీ నోట్లు మాత్రమే బొచ్చెలో వేయాలి. హార్లిక్స్ మాత్రమే తాగుతాడు.. ఆరోగ్యం కోసం అంత జాగ్రత్త మరి. బిచ్చగాళ్ళు అంటే అందరికీ లోకువే. బిచ్చగాడు అంటే డబ్బులు లేని వాళ్ళని అనుకోకండి. ముంబై కి చెందిన భారత్ జైన్ అనే ఓ బిచ్చగాడు మహా రిచ్.. రిచ్ అంటే అలాంటి ఇలాంటి రిచ్ కాదమ్మా.. కోటీశ్వరుడు.. అక్షరాల రూ.7.50 కోట్ల ఆస్తులు.. షాపులు వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆయన రోజువారి సంపాదన రెండున్నర వేల పైనే. నెలకు 75000 సంపాదిస్తాడు. అంటే దాదాపుగా ఓ ఐటీ ఉద్యోగి సంపాదన అంత.. ఓ గవర్నమెంట్ ఆఫీసర్ జీతం అంత ఉంటుంది ఈ బెగ్గర్ గారి ఆదాయంఆరోజు తాను తిరిగిన ప్రాంతం.. జనంలో ఉన్న దాతృత్వపు లక్షణాన్ని బట్టి తన ఆదాయంలో కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయని ఆయన అంటున్నారు. బాల్యం నుంచే ఇదే వృత్తిని నమ్ముకున్న ఈ 54 ఏళ్ల భరత్ జైన్ ముంబై లోని చత్రపతి శివాజీ టెర్మినస్, అజాద్ మైదాన్ వంటి రద్దీ ప్రాంతాల్లో నిత్యం యాచిస్తూ తిరుగుతుంటారు. రోజులో 10-12 గంటలు ఈ పనిలో ఉంటూ ఒక్కోరోజు 4000 వరకూ సంపాదిస్తారట. ఇన్నేళ్ల సంపాదనతో వచ్చిన ఆదాయాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేస్తారు.రూ.1.4 కోట్లతో ముంబాయిలో రెండు ఫ్లాట్స్ కొన్నారు. తండ్రి, తమ్ముడు, భార్య, ఇద్దరు పిల్లలతో సొంత ఫ్లాట్ లో విలాసంగా బతికే బెగ్గర్ గారికి రెండు దుకాణాలు కూడా ఉన్నాయి. వాటి నుంచి నెలకు రూ.30,000 అద్దెలు కూడా వస్తున్నాయి. పేదరికం కారణంగా తాను సరిగా చదువుకోలేకపోయినా తన ఇద్దరు బిడ్డలను మంచి కాన్వెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. భవిష్యత్తు కోసం ఇంకొన్నాళ్ళు ఇదే వృత్తిలో ఉంటానని అంటున్నారు.ఇదే సమయంలో తనకు ఆశ.. దురాశ లేదని.. పిసినారిని కూడా కానని చెప్పిన జైన్ అప్పుడప్పుడు గుళ్లలో దానాలు.. విరాళాలు కూడా ఇస్తుంటానని అన్నారు. దేశంలో మొత్తం 4,13,670 మంది బిచ్చగాళ్ల ఉన్నట్లు జనగణనలో తేలింది. జైన్‌తో పాటు సంభాజి కాలే రూ.1.5 కోట్ల ఆస్తులు.. లక్ష్మి దాస్ రూ.1 కోటి ఆస్తులతో బిచ్చగాళ్లలో రిచ్చు గాళ్ళుగా రికార్డు సాధించారు. సో.. బిచ్చగాళ్లను తేలికగా చూడకండి. వాళ్ళు మీకన్నా రిచ్చు గాళ్ళు కూడా కావచ్చు. -సిమ్మాదిరప్పన్న. -
2025లో ఏం జరగబోతోంది..?: నోస్ట్రడామస్ ఏం చెప్పాడు ?
ఈ ఏడాది 2024 ఇంకొద్ది రోజుల్లో ముగుస్తుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా..ప్రపంచ వ్యాప్తంగా ఏం జరిగిందీ మనమంతా చూశాం. ఉక్రెయిన్ యుద్ధం, ట్రంప్ మళ్ళీ గెలవడం,టీ20 వరల్డ్ కప్ భారత్ గెలవడం, పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా ఆధిపత్యం సాధించడం, బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి సిరియా, ఇరాన్,ఇజ్రాయెల్, పాలస్తీనా వంటివి యుద్ధాల్లో రగులుతుందడం, అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రావడం, నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావడం,ఎన్నడూలేని కృష్ణా నది వరదల్లో విజయవాడ అల్లాడిపోవడం..ఇవన్నీ మనం చూశాం. మరి వచ్చే ఏడాది 2025 ఎలా ఉండబోతోంది..ఎలా ఉండబోతోంది.కాలజ్ఞానానికి మాత్రమే తెలుస్తుంది. అవును ఫ్రెంచ్ కాలజ్ఞాని నోస్ట్రడామస్ ఏం చెప్పాడన్న దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో ఎన్నో అంతర్జాతీయ పరిణామాలను చూచాయిగా చెప్పిన నోస్ట్రడామస్ ఈ 2025 గురించి కూడా చెప్పారు. గతంలో భూకంపాలు ప్రపంచ యుద్ధాలు అమెరికాలో ట్విన్ టవర్ల కూల్చివేత ఇలా ఎన్నో అంశాల గురించి ఆ కాలజ్ఞాని చెప్పినవన్నీ తూచా తప్పకుండా జరిగాయి. ఈ నేపథ్యంలో రానున్న 2025 కూడా ఆయన చెప్పినట్లుగానే జరుగుతుందని నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు. ఇంతకూ ఆయన ఏం చెప్పారు..1500 శతాబ్దంలో ఫ్రాన్స్ లో జన్మించిన నోస్ట్రడామస్ జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ అధికారంలోకి రావడం,అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులు,కొవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేయడం వంటి పరిణామాలను అంచనావేసి చెప్పారు.అతను 1555లో ప్రచురించిన తన పుస్తకం లెస్ ప్రోఫేటిస్ (ది ప్రొఫెసీస్) ద్వారా అంతర్జాతీయంగా కాలజ్ఞానిగా ప్రసిద్ధి చెందాడు.ఆ పుస్తకంలో దాదాపుగా 942 అంశాలను పేర్కొన్నారు.ఇవన్నీ కాలానుక్రమంగా జరుగుతూ వస్తున్నాయి. 2025లో ఏం జరగబోతోంది..2025లో భూగోళాన్ని ఓ గ్రహశకలం ఢీకొంటుంది. దీనివల్ల భూమిమీద పెను మార్పులు సంభవిస్తాయిబ్రిటన్లో ప్లేగు వంటి ఓ మహమ్మారి కారణంగా వ్యాధి ప్రబలుతుంది. పెద్ద సంఖ్యలో జనం మరణిస్తారుఓ ఖండాంతర యుద్ధం 2025లో ముగుస్తుందని అన్నాడు అంటే మూడేళ్లుగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారుసుదీర్ఘ యుద్ధంలో ఇరుదేశాల సైన్యం అంతా అలసిపోతుంది. ఆర్థికంగా ఇరుదేశాలు ఇబ్బందికర పరిస్థితికి చేరుకుంటాయి. కాబట్టి పేదరికానికి ఆహ్వానం పలుకుతూ యుద్ధాన్ని ముగిస్తారుఈ యుద్ధంలో ఫ్రాన్స్, టర్కీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయిఇంగ్లాండ్.. దేశం అటు యుద్ధాలు,ఇటు ప్లేగు వంటి వ్యాధులను ఎదుర్కొంటుంది.ఇంగ్లాండ్ దేశం క్రూరమైన యుద్ధాలతో బాటు "శత్రువుల కంటే ఘోరంగా" ఉండే "పురాతన ప్లేగు" వ్యాప్తిని ఎదుర్కొంటుంది.గ్రహశకలం భూమిని ఢీకొంటుందా?ఓ భారీ గ్రహ శకలం భూమిని ఢీ కొనడం లేదా భూమికి సమీపంగా రావడం తథ్యం అని నోస్ట్రడామస్ చెప్పారు. దీని దెబ్బకు భూమి నుంచి జీవమే తుడిచిపెట్టుకుపోతుందని ఆయన చెప్పారు. అయితే గ్రహశకలాలు భూమికి దగ్గరగా రావడం కొత్త విషయం కాదు. ప్రతి సంవత్సరం అనేక వందల గ్రహశకలాలు భూమిని దాటుతాయి, వాటిలో ఎక్కువ భాగం భూమికి నష్టం చేయకుండానే వెళ్లిపోతున్నాయి.బ్రెజిల్లో ప్రకృతి వైపరీత్యాలు..గార్డెన్ ఆఫ్ ది వరల్డ్ అని పిలిచే దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్, ఈసారి తీవ్రమైన ఉత్పాతాలకు...దారుణ పరిస్థితులకు ప్రభవితమైపోతుందని నోస్ట్రడామస్ తెలిపారు. వాతావరణ మార్పులతో ముడిపడి ఉన్న వరదలు, అగ్నిపర్వత పేలుళ్లవంటి ఘటనలు కూడా జరగవచ్చు అని ఆయన పేర్కొన్నారు.- సిమ్మాదిరప్పన్న -
కూటమి @ ఫ్యామిలీ ప్యాక్
కూటమి సర్కారు ఫ్యామిలీ సర్కస్ మాదిరి మారింది. సర్కారులో ఉపముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును సైతం కేబినెట్లోకి తీసుకుంటామని చంద్రబాబు చేసిన ప్రకటన రాష్ట్రంలో రాజకీయ చర్చకు దారితీసింది. వాస్తవానికి పార్టీలో అత్యంత కీలకమైనవ్యక్తులకు నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేనివాళ్లకు మాత్రమే ఇలా ఎమ్మెల్సీగా గెలిపించి మంత్రిగా చేస్తారు.. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా పొంగూరు నారాయణ, లోకేష్ వంటివాళ్లకు మంత్రిగా స్థానం కల్పించారు. మొన్నటికి మొన్న వైయస్ జగన్ కేబినెట్లోనూ ఓడిపోయినా మోపిదేవి వెంకటరమణకు ఎమ్మెల్సీగా చేసి మంత్రిగా అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడొచ్చిన చిక్కంతా కూటమిలో ఫ్యామిలీ ఫ్యాక్స్ ఎక్కవైనాయి అనేది చర్చకు వచ్చింది.కూటమి ధర్మం అంటూ చంద్రబాబు చేస్తున్న చేష్టలు దిగజారినట్లుగా ఉంటున్నాయని అంటున్నారు. వాస్తవానికి తాజాగా ఖాళీ అయిన మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి నాగబాబుకు ఇస్తారని ఊహాగానాలు వచ్చాయి. పవన్ సైతం ఆ అంశాన్ని చర్చించేందుకు ఢిల్లీ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ మూడు సీట్లలో ఒకటి బిజెపి.. రెండు తెలుగుదేశం వాళ్ళు ఎగరేసుకుపోవడంతో నాగబాబుకు రాజ్యసభ ప్రాప్తం లేకుండా పోయింది. దీంతో ఆయన్ను సంతుష్టుణ్ణి చేసేందుకు కేబినెట్లోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మొదటినుంచీ కష్టపడినవాళ్లకు కాకుండా పైరవీకారులకు, డబ్బులు ఇచ్చేవాళ్లకే ప్రాధాన్యం దక్కిందన్న మూతి విరుపులు ఇప్పటికే వెల్లువెత్తుతున్నాయి. జనసేన పార్టీలో నాగబాబు పాత్ర, పార్టీ నిర్వహణ .. ఆర్థికవ్యవహారాలు వంటి అంశాల్లో అయన వ్యవహారశైలి మీద తీవ్ర విమర్శలు ఉన్నాయి. టిక్కెట్ల కోసం డబ్బులు కలెక్షన్ చేశారని. కార్యకర్తలను సాంతం వాడేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.అయినా సరే డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు కావడం.. పైగా ఎలాగైనా చట్టసభకు వెళ్లాలన్న కోరిక నాగబాబుతో ఉండడంతో ఆయన్ను ఈవిధంగా సంతృప్తి పరుస్తున్నట్లు టీడీపీ క్యాడర్ చెప్పుకుంటోంది. ఇప్పటికే టీడీపీలో సీనియర్లు అయిన యనమల రామకృషుడు,, కిమిడి కళావెంకట్రావు, పత్తిపాటి పుల్లారావు వంటివాళ్లకు మంత్రిపదవుల్లేక వట్టి ఎమ్మెల్యేలుగా జనాల్లోకి వెళ్లలేక అవమానభారం మోస్తుంటే ఇప్పుడు ఏమీలేని నాగబాబును ఎలా మంత్రిని చేస్తున్నారు అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.ఇప్పటికే చంద్రబాబు.. అయన కుమారుడు లోకేష్ అధికారంలో ఉన్నారు.. ఇక శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు. అయన అన్నకొడుకు రామ్మోహన్ నాయుడు (కేంద్ర మంత్రి)గా ఉన్నారు. అలవిమాలిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులూ ఇప్పుడు ఆహామీల సంగతిపక్కనబెట్టి అధికారాన్ని పంచుకోవడంలో బిజీ అయ్యారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు.బాబు మాటలు.. నీటి మూటలునీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. అనడమే కాకుండా ప్రతి వ్యక్తికీ ఒక పథకాన్ని ప్రకటించారు. అవేం అమలుకాకపోగా గతంలో జగన్ ఇచ్చిన పథకాలన్నీ రద్దు చేసారు . పైగా ఇప్పటికే 75 వేల కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు రెండుసార్లు పెంచి జనం నడ్డివిరగ్గొట్టారు. ఆ వైఫల్యాలను జనం ప్రస్తావించకుండా ఉండేందుకు ఒక నెల తిరుమల లడ్డులో కొవ్వు అంటూ.. ఇంకో నెల సోషల్ మీడియా అరెష్టులు.. ఇంకోసారి ఇంకేదో అంశాన్ని తెరమీదకు తెచ్చి జనం దృష్టిని మళ్లిస్తూ వస్తున్నారు.ఇదీ చదవండి: డైలాగులకూ చేతలకూ పొంతనుండొద్దా?ఫ్రీ ఇసుక లేకపోగా దాని ధర ఆకాశాన్ని అంటింది. మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎక్కడ రూపాయి ఉంటె అక్కడికి వాలిపోతున్నారు. ఇక పవన్ సైతం పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఖజానా ఖాళీగా ఉంది.. ఏమి చేయలేకపోతున్నాం అని వగచారు. సంపద సృష్టిస్తాం అని చెప్పుకుని గెలిచాక ఈ చేతగాని ఏడుపులు ఎందుకు అంటూ ప్రజలనుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉండగానే నాగబాబుకు మంత్రిపదవి అంటూ చంద్రబాబు సరికొత్త కాన్సెప్ట్ ను బయటకు తీశారు. మొత్తానికి కూటమి సర్కారు జల్సా చేస్తోంది తప్ప ప్రజలకు చేస్తున్నదేం లేదని అంటున్నారు. నాగబాబు మంత్రి అయితే జబర్దస్త్ కామెడీ మొత్తం కేబినెట్లోనే ఉంటుందని అంటున్నారు-సిమ్మాదిరప్పన్న -
పార్వతీపురం ఎమ్మెల్యే నయా దందా.. లోకలోళ్లు వద్దు.. గెంటేయండి!
అమెరికా నుంచి దిగుమతి అయిన వాడిగా చెప్పుకుంటున్న పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే స్థానిక నేతలను దగ్గరకు రానివ్వడంలేదు. తన కోసం కొద్దిమంది లీడర్లను బయటినుంచి తెచ్చుకుని వారితోనే దందాలు చేస్తున్నారు.. సెటిల్మెంట్స్.. లిక్కర్ ఇవన్నీ వాళ్లతోనే చేయిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. పార్వతీపురం (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే విజయ చంద్ర ఎన్నారై అనే బ్రాండ్ వేసుకొని లోకేష్ తాలూకా అని చెప్పుకుంటూ జస్ట్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. వస్తూనే హడావుడి చేసి అందర్నీ కలుపుకొని వెళ్తున్నట్టు నటించి గెలిచేశారు.తెలిసిన మరుక్షణం నుంచి తన గురువు చంద్రబాబు పంథాలోనే వెళుతున్నారు. అంటే గెలిచిన తర్వాత అదంతా తన గొప్పతనమేనని స్థానికంగా ఎవరు తనకు సపోర్ట్ చేయలేదని, తన సామర్థ్యం.. తన తెలివితేటలే తనని గెలిపించాలని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆయనకు మొన్నటి ఎన్నికల వరకు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అన్నది కూడా స్పష్టంగా తెలియదు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ భారీగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని అకస్మాత్తుగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోయారు గెలిచేసారు. మాజీ ఎమ్మెల్యే చిరంజీవి.. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. ఇంకా గొట్టపు వెంకట్ నాయుడు.. తదితరులంతా ఆయన కోసం పనిచేసి.. ఆయన్ని గెలిపించారు. అయితే తాను మాత్రం కార్యకర్తల ను ఏ మాత్రం లెక్క చేయకపోగా స్థానిక నాయకత్వాన్ని కూడా పూర్తిగా ఇగ్నోర్ చేశారు.సరికొత్త టీం దిగుమతిఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అని ఎవరైనా స్థానికంగా అప్పటికే ఉంటున్న టీడీపీ క్యాడర్‌తో కలిసి మెలిసి పనిచేసుకుంటూ పోతారు. వారు చెప్పినట్లు చేయాలని లేకుండా వారిని కూడా కలుపుకొని పోవడం అనేది రాజకీయంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. కానీ విజయ్ చంద్ర మాత్రం ఎక్కడెక్కడో వేరే జిల్లాల నుంచి కొంత మందిని తీసుకొచ్చి తన చుట్టూ ఉంచుకొని వాళ్ల ద్వారా నియోజకవర్గంలో దందా చేస్తున్నారు. రెండు మూడు సార్లు ఎంపీపీలు జడ్పిటిసిలుగా చేసిన వాళ్ల సైతం విజయ్ చందన కలవాలంటే ముందు ఆ కోటరీని కలవాల్సి ఉంటుంది. వాళ్లను సంతృప్తి పరిస్తే తప్ప ఎమ్మెల్యే దర్శనం దక్కదు.. ప్రతి చిన్న విషయంలోనూ ఎమ్మెల్యే ఆయన బ్యాచ్ ఇన్వాల్వ్ అయిపోతూ బెదిరింపులు బ్లాక్ మెయిల్ వసూళ్లకు దిగుతున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చాడని గెలిపిస్తే ఇలా పీక మీద కత్తి పెడితే ఎలా అని వారు భీతిల్లిపోతున్నారు.లిక్కర్ దందా మనదేమొన్నామధ్య లాటరీల లిక్కర్ షాపులు దక్కించుకున్న వాళ్లని సైతం ఎమ్మెల్యే పేరట అనుచరులు బెదిరించి 20 శాతం వాటా ఇస్తారా 10% కమిషన్ ఇస్తారా తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికీ మార్జిన్లు లేక నష్టాల బాటలో షాపులు నడుపుతుంటే రాబందుల్లా ఎమ్మెల్యే బ్యాచ్ దిగిపోయిందని పెట్టుబడి పెట్టకపోయినా వ్యాపారం వాటా ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని లిక్కర్ లైసెన్సీలు ఆవేదన చెందుతున్నారు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులుఇది కాకుండా రియల్ ఎస్టేట్.. ఇసుక.. కన్స్ట్రక్షన్ వంటి అన్ని వ్యాపారాల్లోనూ విజయ చందర్ జోరుగా జోకింగ్ చేసుకుంటూ కమిషన్లు నొక్కుతున్నారు. గట్టిగా మాట్లాడితే దాని దళిత ఎమ్మెల్యే అని అంటూ సరికొత్త బ్లాక్ మెయిల్‌కి దిగుతున్నారు. మాటకు మన ఉద్యోగులు బదిలీల విషయంలో కూడా సిఫార్సు లెటర్స్ కు రేటు పెట్టి మరి వసూలు చేసుకున్నారని.. గ్రామస్థాయి ఉద్యోగాల బదిలీల్లోనూ ఆయన డబ్బులు తీసుకుని లెటర్ ఇచ్చారని ఉద్యోగులు గొల్లుమంటున్నారు. రాజకీయాలకు కొత్తగా అయినా దందాలు చేయడంలో ఆరు నెలల్లోనే ఆరితేరిపోయారని మున్ముందు ఆయన ఇంకెంత రెచ్చిపోతారో తెలీదని స్థానిక వ్యాపారుల సైతం భయపడుతున్నారు.-సిమ్మాదిరప్పన్న -
ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు
పవన్ కళ్యాణ్‌ను సరిగా వాడుకోవడం ద్వారా కాకినాడ పోర్టును సైతం కబ్జా చేయొచ్చని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆ దిశగా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. నౌకలో బియ్యం విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయి... నేను కనిపెట్టేశాను.. సీజ్ ది షిప్ అంటూ రీల్స్ చేసి సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నడిపిస్తున్న కథకు ఇరుసుగా మారారు.ఎన్నికల హామీల అమలులో వైఫల్యం... కూటమి నేతల అరాచకాలపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు నెలకో అంశాన్ని తీస్తున్న చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఈ కాకినాడ పోర్టు అంశాన్ని అందుకున్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను లాక్కునేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.అంతా చంద్రబాబు ప్లాన్ ప్రకారమేఅందులో భాగంగానే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ డ్రామా పండించారు. పౌరసరఫరాల శాఖ, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాల్సిన పవన్ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై ఆరోపణలు చేస్తున్నారు. అరబిందో సంస్థ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని దుష్ప్రచారం చేశారు.చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అరబిందోఇందులో భాగంగా చంద్రబాబు తన సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్‌పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు చేయించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేసారు. ఆ వెంటనే సీఐడీ కేసు కూడా నమోదు చేసేసింది.వాస్తవానికి కేవీ రావు 2020లో పోర్టులో తన 41 శాతం వాటాలను అరబిందో సంస్థకు రూ. 494 కోట్లకు అమ్ముకున్నారు. అప్పట్లో ఆ అమ్మకం తనకు ఇష్టం లేనిపక్షంలో ఆనాడే అయన దాన్ని వ్యతిరేకించి అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో అరబిందో సంస్థ వాటాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు కేవీ రావు మళ్ళీ స్క్రీన్ మీదకు వచ్చారన్నది తెలుస్తోంది.అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అరబిందో సంస్థ కెవిరావు నుంచి 41 శాతం వాటాలను కొనుగోలు చేసాక పోర్ట్‌ను ఆనుకుని ఉన్న జీఎంఆర్ సెజ్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్‌లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే మేలని భావించిన అరబిందో సంస్థ భవిష్యత్‌లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన (రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో రెండు పోర్టులను నిర్వహించవచ్చన్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది.పోర్టును కారుచౌకగా అమ్మేసింది చంద్రబాబేవాస్తవానికి 1999లో అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా తన సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టారు. నిజం సుగర్స్ వంటి సంస్థలను అమ్మేసింది చంద్రబాబేనన్నది అందరికి తెలిసిందే. అదే క్రమంలో లాభాల్లో ఉన్న ఆ పోర్టును సైతం కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్ పోర్టును కారు చౌకగా చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావుకు కట్టబెట్టేశారు. అదే కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెర తీశారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.-సిమ్మాదిరప్పన్న -
దక్షిణకొరియా మాయమవుతుందా?
ఊరందరిదీ ఒకదారి.. ఉలిపిరి కట్టెది ఇంకోదారి అన్నట్లుగా ఉంది ఈ దేశం పరిస్థితి. అత్యద్భుతంగా సాంకేతికతను అందిపుచ్చుకుని యూరోప్, అమెరికా దేశాలను దాటి ప్రగతిపథంలో సాగుతున్న దక్షిణ కొరియా జనభాపరంగా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశంలో నానాటికీ జనాభా తగ్గుతూ వస్తున్నందున రానున్న కొన్ని దశాబ్దాల్లో ఆ దేశం జనంలేక నిర్జీవమై అంతరించిపోతుందేమో అనే సందేహాలు వస్తున్నాయి.ఇదిలా ఉండగా గురజాడ చెప్పినట్లుగా దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనావంటి దేశాలు జనాభాని పెంచుకుంటూ పట్టణాలు.. పల్లెలు కిక్కిరిసిపోతున్నాయి. కానీ దక్షిణ కొరియా మాత్రం జనాభా కొరతతో అల్లాడిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే వందేళ్లలో జనాభా పూర్తిగా తగ్గిపోయి దేశమే అంతర్థానం అయ్యే ప్రమాదం ఉందని సామాజికవేత్తలు అంటున్నారు.పెళ్లి వద్దు.. కెరీర్ ముద్దు దేశంలో యుక్త వయస్సు రాగానే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే సంప్రదాయం తగ్గిపోతూ వస్తోంది. ముఖ్యంగా మహిళలు ముందుగా కెరీర్లో స్థిరపడాలి.. ఉన్నత స్థితికి చేరాలి.. ఇల్లు.. కార్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి.. ఆ తరువాతనే పెళ్లి గురించి ఆలోచిద్దాం అనే భావనలో ఉండడంతో దేశంలో పెళ్లిళ్లు కూడా లేటుగా అవుతున్నాయి. పెళ్లి.. ఇల్లు పిల్లలు.. సంసారం గురించి పెద్దలు చెబుతున్నా వినే పరిస్థితుల్లో దేశంలోని మహిళలు లేరని సర్వేలు చెబుతున్నాయి. దీంతో శతాబ్ద కాలంలో దేశం 70 శాతం జనాభాను కోల్పోతుందని, జనాభాలో పునరుత్పత్తి సామర్ధ్యం కూడా గణనీయంగా పడిపోతూ వస్తున్నదని, దేశంలో జననాల రేటు ఏటా 5,00,000 కన్నా అతక్కువగా నమోదవుతూ వస్తోంది.ఇదిలా కొనసాగితే దేశ జనాభా కొన్ని దశాబ్దాల్లోనే ఐదున్నర కోట్ల నుంచి కోటిన్నరకు పడిపోతుందని, ఇది ఏకంగా దేశ మనుగడకు ముప్పుగా మారుతుందని పరిశోధకులు అంటున్నారు. దేశం జనాభాతో కళకళలాడుతూ పది కాలాలపాటు పచ్చగా ఉండాలంటే జననాల రేటు 2. 1 శాతంగా ఉండాలి కానీ ప్రస్తుతం అది 0. 72 శాతానికి పడిపోయింది. తద్వారా దేశంలో జననాల రేటుకన్నా మరణాల రేటు ఎక్కువై పల్లెలు, పాట్టణాలు సందడి తగ్గిపోతూ వస్తున్నాయి.ప్రభుత్వ నిర్ణయాలే కారణమా ?1960 కాలంలో దేశం అంతగా అభివృద్ధి చెందలేదు.. ఇంకా వర్థమానదేశంగానే ఉండేది. ఆ తరుణంలో దేశంలో జనాభా పెరిగితే దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకం అవుతుందని దేశంలో కుటుంబ నియంత్రణను అమలు చేశారు . పిల్లలను కనడం తగ్గించాలని, లేకుంటే మున్ముందు బతకడం కష్టం అవుతుందని చేసిన ప్రభుత్వ ప్రచారం ప్రజలమీద గట్టిగా పని చేసింది. దీంతో అప్పట్నుంచి దేశంలో జనాభా నియంత్రణ మొదలైంది. సరే మనం దేశ జనాభా తగ్గిస్తున్నాం అనుకుంటున్న పాలకులు ఆ నియంత్రణ ఏకంగా దేశాన్ని ఇలా సంక్షోభంలోకి నెట్టేస్తున్నాం అని గుర్తించలేకపోయారు. ఆ తగ్గుదల క్రమంగా అట్టడుగు స్థాయికి దిగిపోయింది. 1980 దశకంలోనే తగ్గుదల కనిపించినా పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈ శతాబ్దం చివరి నాటికి, 52 మిలియన్ల ఉన్న దక్షిణ కొరియా జనాభా 17 మిలియన్లకు తగ్గిపోవచ్చని అంచనా వేస్తున్నారు.దిద్దుబాటు చర్యలున్నా.. ఫలితం నిల్ పరిస్థితిని చక్కదిద్దే యత్నంలో ప్రభుత్వం మళ్ళీ జనాభాను పెంచేందుకు చర్యలు ప్రారంభించింది. పిల్లల సంరక్షణలో సహాయం చేయడానికి విదేశీ ఆయాలను సైతం తెచ్చుకోవచ్చని చెబుతోంది. దీనివల్ల పిల్లల పెంపకం అంటే భయపడుతున్న కొరియా యూత్ కు కాస్త ఉపయుక్తం అవుతుందని ప్రభుత్వం భావించింది. 30 ఏళ్లు నిండకముందే ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు తండ్రయ్యే పురుషులను ఆర్మీ నుంచి పంపేయాలని కూడా భావిస్తోంది. ఇన్ని చేస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇదిలా ఉండగా పెళ్లి చేసుకుని, పిల్లల్ని కనడం, వారి సంరక్షణ అనేది తమకు తలకు మించిన భారంగా ఉంటోందని భావించిన మహిళలు అసలు పెళ్లి వద్దనుకుంటున్నట్లు ఒక సర్వేలో వెల్లడైంది. దాదాపు 30 శాతం మంది మహిళలు తాము పెళ్లి చేసుకోకూడదని ఆ సర్వేలో అభిప్రాయపడ్డారు.సైన్యానికి యువకుల కొరత దేశంలో జననాలు తగ్గిపోతుండడంతో దక్షిణ కొరియా సైన్యానికి యువకుల కొరత ఎదురవుతోంది. పక్కనే ఉంటూ నిత్యం కయ్యానికి కాలుదువ్వే ఉత్తర కొరియాలో 12 లక్షల మంది సైన్యం ఉన్నారు. కానీ దక్షిణ కొరియాకు 2017 లో 6. 2 లక్షలుగా ఉండే సైన్యం నేడు అయిదు లక్షలకు పడిపోయింది,. రానున్న అవసరాలమేరకు ఏటా రెండు లక్షల మందిని రిక్రూట్ చేసుకోవాలని దేశం భావిస్తున్నా 1.25 లక్షలమంది యువకులు మాత్రమే అందుబాటులో ఉన్నారట. అదన్నమాట.. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దక్షిణ కొరియా జనంలేక మొత్తం దేశం ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని అంటున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
EVM Row: ‘ఒకవేళ సీఈసీని తొలగించమని కోరితే..!’
దేశంలో ఇటీవల జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(EVM) పనితీరు మీద ఎన్నో సందేహాలకు కారణమయ్యాయి. ఈవీఎంలను ఎవరో.. ఎక్కణ్ణుంచో ఆపరేట్ చేస్తున్నారని.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నా ఎన్నికల సరళికి ఎన్నికల ఫలితాలకు సంబంధం లేకుండా ఉంటోందనే విమర్శలు వస్తున్నాయి. అమెరికాలో ఉంటున్న సుజా సయీద్ అనే ఉద్యోగి తాను ఈవీఎంను హ్యాక్ చేయగలను అని ఛాలెంజ్ చేసినందుకు ఆయనమీద ఎలక్షన్ కమిషన్ మహారాష్ట్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా అయన మీద కేసు కూడా బుక్కైంది... మొన్న మహారాష్ట్రలో పోలింగ్ జరిగిన తీరుమీద సందేహాలు వ్యక్తం చేస్తూ షోలాపూర్ జిల్లా మల్షిరాస్ తహసీలులో 1900 ఓట్లున్న మర్కర్‌వాడీ గ్రామం ప్రజల వినూత్న పోరాటం చేస్తున్నారు. ఈవీఎంల మీద అనుమానాన్ని వ్యక్తం చేస్తూ తమ ‘తీర్పు’ను తామే బ్యాలెట్ పేపర్ల ద్వారా మరోసారి క్రాస్ చెక్ చేసుకోవాలని సంకల్పించారు. అధికారవర్గాలకు కంగారు పుట్టించింది. ప్రజలు స్వచ్ఛందంగా అలాంటి పోలింగును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా ఊరుమొత్తాన్ని చుట్టుముట్టిన పోలీసులు ఏకంగా ప్రజలను కర్ఫ్యూ పేరిట నిర్బంధించారు.ఇదిలా ఉండగా దేశంలో పలు చోట్ల జరిగిన ఎన్నికల్లో ఈవీఎంల పనితీరు.. వాటిని హ్యాక్ చేసేందుకు ఉన్న అవకాశాల మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. గతంలో ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ నిన్నటి మహా రాష్ట్ర ఎన్నికల్లోనూ పోలింగ్ సమయానికి ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓట్లకు, కౌంటింగ్ రోజున బయల్పడిన ఓట్లకు భారీ వ్యత్యాసం రావడంతో ఓడిపోయిన పార్టీల్లో బోలెడు సందేహాలు ముప్పిరిగొన్నాయి. దేశంలో మళ్ళీ బ్యాలెట్ విధానం రావాలంటూ డిమాండ్స్ వస్తున్నాయి. ఈ తరుణంలో భాను ప్రతాప్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా చీఫ్ ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలని డిమాండ్ చేయండి.. ఈ మేరకు లోక్ సభలో నోటీస్ ఇవ్వండి అంటూ కాంగ్రెసుకు సలహా ఇచ్చారు. మీరు డిమాండ్ చేసినట్లు ఈసీని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోదు కానీ ఒక చర్చ అయితే అవుతుంది కదా.. ఎన్నికల కమిషనర్‌ను తొలగించడం అంత ఈజీ కాదు కానీ మీ ప్రయత్నం వల్ల ఈవీఎంల పనితీరు మీద ప్రజల్లోనూ చర్చ జరుగుతుంది కదా.. ఈ దిశగా ఒక అడుగు వేయండి అంటున్నారు ఆ అడ్వకేట్.ఇక ఎన్నికల కమిషన్ నిర్మాణం..కమిషనర్ తొలగింపు పద్ధతులు చూద్దాం..భారత ఎన్నికల సంఘం:-భారత ఎన్నికల సంఘం (ECI) దేశంలో ఎన్నికల ప్రక్రియలను నిర్వహించడానికి బాధ్యత వహించే స్వయంప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థభారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లో ఎన్నికల సంఘం గురించి పేర్కొన్నారుకమిషన్ ప్రధానకార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఈ కమిషన్ భారతదేశంలోని లోక్ సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలతోబాటు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహిస్తుందిప్రస్తుతం రాజీవ్ కుమార్ ముఖ్య ఎన్నికల కమిషనర్‌గా ఉన్నారు.ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలంటే : ఎన్నికల కమిషనర్ తొలగింపు గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5)లో పేర్కొన్నారు.లోక్‌సభ, రాజ్యసభలలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉండి దానికి ఓటు వేయడానికి అవసరమైన అభిశంసన ప్రక్రియ ద్వారా మాత్రమే ప్రధాన ఎన్నికల కమిషనరును తొలగించవచ్చు. దీంతోబాటు ముఖ్య ఎన్నికల కమిషనర్ సిఫార్సుపై ఇతర ఎన్నికల కమీషనర్లను రాష్ట్రపతి తొలగించవచ్చు. ఇదిలా ఉండగా 2009 లో, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రవర్తించారంటూ ఎన్నికల కమిషనరు నవీన్ చావ్లాను తొలగించాలని అప్పటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎన్. గోపాలస్వామి అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు సిఫార్సు పంపినా దాన్ని రాష్ట్రపతి ఆమోదించలేదు.-సిమ్మాదిరప్పన్న -
డాల్లాస్‌లో మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
వాషింగ్టన్ : ఎక్కడి ఆంధ్రప్రదేశ్.. ఎక్కడి అమెరికా.. ఆంధ్రాలో ఉన్నన్ని సంప్రదాయాలు.. ఆధ్యాత్మికత అక్కడ ఎందుకు ఉంటుంది.. అది అమెరికా.. అక్కడి జనాలు వేరు.. అందరూ మనలా ఉండరు అని అనుకుంటారు. కార్తీకం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇల్లిల్లూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. నిత్యం శివారాధన.. ఆలయాల దర్శనాలు.. పూజలు.. ప్రతి ఊళ్లోనూ శివమాలలు వేసుకునే భక్తులు.. అయ్యప్ప దీక్షలు.. వీధుల్లో శరణుఘోష.. తెల్లారితే శివ స్తోత్రాలతో ఒక ప్రశాంత భావన ఉంటుంది.. ఇదే వాతావరణం అమెరికాలో ఉంటుందా ? ఆహా..అది సాధ్యమేనా .. అక్కడివాళ్లకు ఈ పూజలు భజనలు. మాలలు ఉంటాయా.. అంటే అక్కణ్ణుంచి ఒక పెద్దాయన లైన్లోకి వస్తారు.. భలేవారే మీరు అలా సులువుగా తీసిపడేయకండి. మన మాతృ భూమికి దూరంగా ఉన్నా సరే.. మెం మీకన్నా ఎక్కువగా మన సంప్రదాయాలు.. భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాం అంటారు. అంతేకాదు తనతోబాటు వందలమందికి ఈ ఆధ్యాత్మిక సౌరభాలను అందించి వారిని కూడా భక్తిమార్గంలో నడిపిస్తున్నారు.అటు కంప్యూటర్ పని ఇటు అయ్యప్ప భజనలు కొమండూరి రామ్మోహన్ .. అయన ఓ టెక్ కంపెనీ సీఈవో.. నిత్యం ప్రాజెక్టులు.. టీమ్ మీటింగులు.. కార్పొరేట్ డిస్కషన్స్ అంటూ ఏడాదంతా బిజీగా ఉంటారు. కానీ కార్తీకంలో మాత్రం అయన ఆ సీఈవో స్థానం నుంచి కాస్తా పక్కకు జరిగి గురుస్వామిగా మారతారు. అమెరికాలోని డల్లాస్.. టెక్సాస్... వాషింగ్టన్ మినియాపోలిస్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని తెలుగు యువతను ఐక్యం చేసి వారిలో భక్తిభావాన్ని నింపుతారు. ఏటా కనీసం ఐదారు వందలమందికి అయ్యప్ప మాలధారణ చేస్తారు. అంతేకాకుండా తొలిసారిగా మాలవేసుకునే ప్రతి కన్నె స్వామి ఇంటికి వెళ్లి వారు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప పీఠాన్ని పర్యవేక్షించి నిత్య పూజలు భజనలు ఎలా చేయాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి .. మాలధారణ తరువాత మన నడవడిక ఎలా ఉండాలి అనేది పూసగుచ్చినట్లు చెప్పి వారిని స్వాములుగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే పాతికసార్లకు పైగా మల ధారణ చేసిన రామ్మోహన్ గురుస్వామి తాను వీలు కుదిరినప్పుడల్లా శబరిమల వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకుని మాల విసర్జన చూస్తుంటానని అన్నారు. అయితే అమెరికాలో ఉంటున్నవారి పరిస్థితి ఏమిటి ? వారు మల విసర్జన ఎలా అంటే.. అమెరికాలో ప్రతి పెద్ద నగరంలోనూ అయ్య్యప్ప ఆలయాలు ఉన్నాయని, అక్కడకు వెళ్లి మాలను విసర్జిస్తాం అని అన్నారు.అత్యంత నిష్ఠతో పూజలు భజనలు అమెరికావాళ్లకు అంత టైం ఉండదు.. ఏదో అలా పూజలు చేసేసి మామ అనిపిస్తారు అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా అమెరికాలోనే అత్యంత భక్తిప్రపత్తులతో అయ్యేప్ప మండల దీక్ష చేస్తారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా భక్తులంతా వీలును బట్టి ఇళ్లలోనే పీఠాలు పెట్టుకుంటారు. లేనిపక్షంలో పదిమంది కలిసి ఒక ఇంటిని వేరేగా అద్దెకు తీసుకుని అందులో పీఠం పెట్టుకుంటారు. కొంతమంది ఐతే ఇంట్లోని పీఠంలోనే 18 మెట్లతో కూడిన పీఠం పెట్టుకుని పూజలు చేస్తారు. ముఖ్యంగా అత్యంత ఖర్చుతోకూడిన పడిపూజ చేయడానికి ఎంతో వ్యయప్రయాసలకు సైతం సిద్ధం అవుతారు. జెపి మోర్గాన్‌లో పనిచేసే సిస్టమ్స్ ఆర్కిటెక్ సప్తగిరి పద్మనాభం, ఐటి కంపెనీ మేనేజర్ శ్రవణ్, ఉత్తమ్ కుమార్ అనే మరో సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ తమకు ఈ నెలన్నారా అత్యంత ప్రశాంతమైన భావన కలుగుతుందని, అటు ఉద్యోగాలు.. ఆఫీస్ బాధ్యతలు చూస్తూనే అయ్యప్ప భజనలు.. పూజలు ఎక్కడా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. ఇదంతా తమ గురుస్వామి రామ్మోహన్ గారి ప్రోత్సహంతోనే సాధ్యం అయిందని అన్నారు. ఐటి ఉద్యోగులే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు సైతం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.శరణు ఘోషతో మార్మోగిన డల్లాస్ తొలిసారి దీక్ష తీసుకున్న సప్తగిరి స్వామి మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా మన మనసు ప్రశాంతత వైపు పయనిస్తుందని.. నిత్యం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి సైతం విముక్తి లభిస్తుందని అన్నారు. మొన్న భారీ ఎత్తున చేపట్టిన పడిపూజకు ఐదువందలమంది దీక్షాధారులతోబాటు కనీసం రెండువేలమంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. రామ్మోహన్ గురుస్వామి మాట్లాడుతూ తాము ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని అక్కడ పడిపూజ చేస్తామని.. ఇది యావత్ డల్లాస్ లో జరిగే పెద్ద కార్యక్రమం అని.. ఇది ఈ ప్రాంతం మొత్తానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని అన్నారు. మనిషి ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా అద్దేఆత్మికత లేకపోతె జీవితానికి సార్థకత లేదని సెప్పే గురుస్వామి రామ్మోహన్ తనకు చేతనైనంత వరకు యువతలో భక్తిభావాన్ని పెంపొందిస్తుంటానని చెప్పారు. అమెరికాలోనూ అయ్యప్ప ప్రాచుర్యం పొందడం వెనుక ఆ దీక్షలో ఉండే నియమాలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం వంటివే కారణముంది... అందుకే యువత పెద్దసంఖ్యలో ఈ దీక్ష తీసుకుంటున్నారని అయన చెప్పారు.-సిమ్మాదిరప్పన్న. -
సంక్రాంతి నుంచి జనంలోకి జగన్
అయిపొయింది.. కూటమి సర్కారు హనీమూన్ టైం ముగిసింది ... తమను ఎలా మోసం చేస్తున్నదీ ప్రజలకు సైతం అర్థం అవుతోంది. సూపర్ సిక్స్ .. భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నారు .. మంచి ప్రభుత్వం అన్నారు.. చాలా చాలా అన్నారు కానీ అధికారం ఇచ్చి చూడు ఒక నాయకుని నిజరూపం తెలుస్తుంది అన్నారు అబ్రహం లింకన్. చంద్రబాబు సైతం ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పే మాట అధికారంలోకి వచ్చాక పాటించలేదు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబును ప్రతిసారీ గెలిచాక మాట తప్పడం అయన అలవాటుగా మారింది. ఇప్పుడు కూడా చంద్రబాబు గెలిచీగెలవగానే తన నిజరూపం చూపుతున్నారు. విద్యుత్ చార్జీల భారం మోపడం మొదలైంది. ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదు.వైఎస్ జగన్ హయాంలో అమలయ్యే ఏ సంక్షేమ పథకమూ ఇప్పుడు ఇవ్వడం లేదు. అన్నిటికీ మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద... ముఖ్యంగా టీడీపీ తప్పిదాలు.. మోసాల మీద సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి . ఎక్కడా లేని సెక్షన్ల కింద కేసులు పెట్టడం రాష్టాన్ని కుదిపేసింది. ఇక ఇన్నాల్లమాదిరిగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుంటే కుదరదు .. జనంలోకి వెళ్లాల్సిందే.. చంద్రబాబు తీరును ఎండగట్టాల్సిందే అని నిర్ణయించుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక ఉపేక్షించరాదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబ చేస్తున్న తప్పిదాలు.. దాష్టీకాలను ప్రజలముందు నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు.గత ఆర్నెళ్లుగా చంద్రబాబు అమలు చేసిన సొంత ఎజెండా.. లోకేష్ అమలు చేసిన వ్యక్తిగత రెడ్ బుక్ ఎజెండాలను ప్రజలముందు పెట్టి క్యాడర్ కు భరోసా ఇవ్వాలని జగన్ భావించడం పార్టీ వర్గాల్లో హుషారును రేకెత్తిస్తోంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి.. జగన్ మోహన రెడ్డి అంటేనే ప్రజలు.. ఆ కుటుంబం అంటేనే జనం.. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ జనానికి.. పార్టీ కార్యకర్తలకు దూరం అయ్యారన్న భిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అయన ఇకముందు జనంలోనే ఉండాలని నిర్ణయించుకోవడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఏడాదిన్నర తరువాత జరిగే పంచాయతీ.. మున్సిపల్ ఎన్నికలకు క్యాడరును సిద్ధం చేసేందుకు సైతం జగన్ పర్యటనలు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదురైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రజల్లో నిక్కచ్చిగా 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. అటు కూటమి పార్టీలన్నీ కలిస్తే తప్ప జగన్‌ను ఓడించలేని పరిస్థితి అన్నది అందరికి తెలిసిందే.. ఇలాంటి తరుణంలో జగన్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ఆ 40 శాతం ప్రజలతోబాటు తెలుగుదేశం పాలనపట్ల పెద్దగా ఆసక్తిలేని వారిని సైతంఆకట్ట్టుకునే పనిలో ఉంటారని క్యాడర్ భావిస్తోంది. ఆయన జిల్లాలకు వచ్చినట్లయితే.. అక్కడే బస చేస్తారు.. ఆ సందర్భంగా సర్పంచ్ స్థాయి నుంచి జడ్పి చైర్మన్ వరకు వివిధ స్థాయిల్లోని నాయకులూ.. కార్యకర్తలు ఆయన్ను కలిసి క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని వివరించే అవకాశాలు మోసం ఎదురుచూస్తున్నారు. స్థానికంగా ఉన్న విభేదాలు.. అక్కడక్కడా ఎదురవుతున్న చిక్కులన్నీ జగన్ దృష్టికి వెళతాయి. దీంతో అయన వర్దిని అక్కడికక్కడే సరిదిద్ది పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్లాలన్న అటు టీడీపీకి ప్రాణసంకటంగా మారగా ఇటు వైసిపి క్యాడర్ కు సంతోషాన్ని పంచుతోంది.వాస్తవానికి జగన్ ఎన్నికల ఫలితాల తరువాత గుంటూరు.. పులివెందులతోబాటు డయేరియా బాధితులను పరామర్శించేందుకు విజయనగరం జిల్లా గుర్ల వచ్చారు. ఆ సందర్భాంగా ఎలాంటి జనసమీకరణ చేయకపోయినా ప్రజలు అధికసంఖ్యలో వచ్చారు. ఆయన్ను అభిమానంతో ఆదరించారు. ఇదే సందర్భంగా జగన్ ఉంటే తమకు మరింత బాగుండేదని.. పేదలకు పథకాలు వచ్చేవని .. స్కూళ్ళు.. ఆస్పత్రులు బాగుండేవని.. అమ్మ ఒడి అందేదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకోవడం జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఆ ఆదరణను మరింత ప్రోది చేసుకునే క్రమంలో జగన్ జనంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది..-సిమ్మాదిరప్పన్న -
మనసులు కలిపే వంతెన..
యాండే.. గోదారి బ్రిడ్జి ఎప్పుడు వస్తుందండీ పడుచుపిల్ల ఉత్సాహంగా అడిగింది.. లేదే లక్ష్మి రాగానే చెప్తాను నువ్ కాస్త పడుకో.. ఓహ్.. ఇంకా టైముందా... సరే రాగానే మర్చిపోకు మరి అంటూ అటు తిరిగింది అమ్మాయి.. ఇంకో పాతికేళ్ల కుర్రాడు పై బెర్త్ నుంచి కిందికి చూస్తూ రాయమండ్రి బిర్జి వచ్చేహిందా అన్నాడు.. లేదండీ.. బండింకా సామాల్కోట దాట్లేదు .. ఇంకా టైముంది అన్నాడు కిందిబెర్త్ అంకుల్.. ఓహో.. ఐతే రైల్ బ్రిడ్జి మీదకు ఎంటరవగానే చెప్పండే అంటూ కుర్రాడు మళ్ళీ ఫోన్లో బుర్ర దూర్చేసాడు. ఓలమ్మి.. రామండ్రి గోదారి బ్రిడ్జి వచ్చిండేటి అంది వరాలమ్మ.. లేదమ్మమ్మా.. ఇంకా రానేదు.. వచ్చినప్పుడు దడదడదడ సప్పుడొస్తది.. అందరికి తెలుస్తాదిలే.. నేను లేపుతాను నువ్వు తొంగోయే అని చెప్తోంది మనవరాలు మంగ... ఐడ్రాబాడ్ .. విశాపట్నం.. లేదా ఇసాపట్నం మద్రాస్.. ఈరూట్లో వెళ్ళేవాళ్ళకు గోదారి బ్రిడ్జి ఒక ఎమోషన్. ఒక బంధం.. అంతవరకూ నిప్పులుగక్కుతూ యుద్ధానికి వెళ్తున్న వైజయంతి యుద్ధ ట్యాంక్ మాదిరిగా దూసుకెళ్లే రైళ్లన్నీ గోదారిని చూడగానే.. ఎక్కడలేని సిగ్గును పులుముకున్న పడుచుపిల్ల పెళ్ళిచూపుల్లో నడిచినట్లు వగలుపోతూ స్లో అయిపోతాయి. అక్కడికి వచ్చేసరికి అడుగులు తడబడినట్లు.. అడుగులో అడుగేసినట్లు.. వాలుజడ ఊగినట్లు.. జడలోని మల్లెలు నవ్వినట్లు.. అంత సొగసుగా నడుస్తుంది ట్రైన్ అదంతే .. గోదారి.. దానిమీద వంతెన.. ఈ దక్షిణభారతంలోనే ఒక ఐకానిక్ నిర్మాణం...అది కేవలం తూర్పు.. పశ్చిమ గోదావరి జిలాలలను మాత్రమే కలిపే వంతెన కాదండి.. ఎన్నో మనసులతో ముడేసుకున్న బంధం.. కాదనుకున్నా వెంటాడే అనుబంధం. 1964 లో మూడో పంచవర్ష ప్రణాళికలో ఇక్కడ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి నిర్మాణానికి బీజం పడింది. 1974లో వంతెన నిర్మాణం పూర్తవగా అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దాన్ని జాతికి అంకితం చేసారు. ఆ మహా మహా నిర్మాణం ప్రారంభోత్సవాన్ని అప్పటి విజయవాడ కేంద్రంగా ఉన్న ఆలిండియా రేడియో ప్రత్యక్ష ప్రసారం చేసింది. దీని నిర్మాణంతో రాజమండ్రి, కొవ్వూరు మధ్య లాంచీల ప్రయాణం స్థానే బస్సులను నడపడం మొదలైంది. రెండు గోదావరి జిల్లాల మధ్య రాకపోకలు సులువయ్యాయి. ఈ ఏడాదితో గోదారి రైల్. రోడ్ బ్రిడ్జికి యాభయ్యేళ్ళు నిండాయి..ఇక ఈ మార్గంలో ట్రైన్ మీదుగా ప్రయాణించే కోట్లాదిమందికి ఈ వంతెన మీదుగా ట్రైన్ నడవడం.. దాన్ని కిటికీలోంచి చూడడం ఒక అద్భుత భావన. ఒరేయ్.. బుడ్డోడా.. గోదారొచ్చింది.. చిల్లర పైసలు ఉంటే ఇవ్వరా అంటూ తీసుకుని కిటికీలోంచి గోదారమ్మకు దక్షిణ సమర్పించి ఒక దండం పెట్టుకుని సంతృప్తి పడని జీవులు లేనట్లే లెక్క. రాత్రి పూలతో బెర్త్ మీద నిద్దరోయి తెల్లారి వాటిని బయటపడేయకుండా గోదారి వచ్చేవరకూ ప్రేమగా చేతిలో పట్టుకుని కూర్చునే నవవధువులు.. సాయం సంధ్యవేళ దూరంగా కొండల్లోకి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఆదిత్యుని.. గోదారిని కలిపి చూడడం.. అందులోని భావుకత్వాన్ని ఆనందించడం కవులకే సాధ్యం.. అమ్మా కిందికి చూడు ఎన్ని బోట్లో... అంటూ ముద్దుముద్దుగా చెబుతున్న పిల్లాడిని దగ్గరకు పొదుముకుంటూ అవున్నన్నా గోదారిలో అన్నీ ఉంటాయి.. వాళ్లంతా చేపలు పడుతున్నారు అని వివరించే తల్లి. బ్రిడ్జి రాగానే... నోట్లో నీళ్లూరుతుండగా యాండే ఈ సీజన్లో గోదారిలో పులస దొరుకుతుందండీ... అది పులుసూపెట్టుకుని మర్నాడు తింటే ఉంటుందండీ అని వివరించే ఇంకో ఫుడీ నేరేషన్.. ఇంకో లెవెల్..ఇలా గోదావరి వంతెన కేవలం ఒక నది మీద కట్టిన ఇనుప నిర్మాణం కాదండి.. అందులో బంధం.. ఆత్మీయత.. ఒక తీయని అనుభూతి.. ఇలా చెబుతూ వెళ్తే ఇంకెంతైనా రాయొచ్చు..- సిమ్మాదిరప్పన్న -
పొద్దున్న పోస్టింగ్.. సాయంత్రం ఊష్టింగ్
తనకుమాలిన ధర్మం ఎంత ప్రమాదం చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. చంద్రబాబు ప్రాపకం కోసం.. ఆయన ఆశీస్సుల కోసం తన ఉన్నత ఉద్యోగాన్ని.. పదవిని.. ముప్పయ్యేళ్లపాటు చేస్తున్న ఉన్నత పదవిని ఫణంగా పెట్టి చివరకు పదవీభ్రష్టుడై.. తన తోటి సహచరులవద్ద చులకన అయిపోయి చివరకు ఎవరికీ తెలియని స్థితిలో రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి ఒక డీజీపీకి పట్టింది. ఆయన మరెవరో కాదు.. ఏబీ వెంకటేశ్వర రావు. తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ నిఘా విభాగం (ఇంటలిజెన్స్) చీఫ్‌గా పని చేసి చీప్ పనులకు దిగజారిపోయి నానా అనైతిక పనులకు పాల్పడ్డారు. ఆయన ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్నపుడు ఇజ్రాయిల్ నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేసి అప్పటి ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారని అభియోగాలు ఉన్నాయి. దాంతోబాటు చంద్రబాబు హయాంలో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల కొనుగోలు అప్పట్లో సంచలనం లేపింది. వాస్తవానికి అప్పట్లో ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలన్న చంద్రబాబు దురాలోచనకు ఈ వెంకటేశ్వరరావు వెన్నుదన్నుగా నిలిచి ఆయా ఎమ్మెల్యేలను భయపెట్టి 23 మందిని టీడీపీలో చేర్చే విషయంలో ఎంతగానో సహాయపడ్డారు.అప్పట్లో తానొక పోలీస్ ఉన్నతాధికారిని అని విస్మరించి అధికారపార్టీకి తొత్తుగా పనిచేసి, చంద్రబాబు మద్దతు ఉందని చెబుతూ డీజీపీలను, మంత్రులను, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను సైతం చిటికెనవేళ్లమీద నడిపించారు. లొంగని వాళ్ళను భయపెట్టారు. మొత్తానికి ఐదేళ్లు ఏబీ వెంకటేశ్వరరావు ఒక రౌడీ పోలీస్ మాదిరిగా అధికారం చెలాయించారు. విధినిర్వహణ పేరిట పూర్తిగా సరిహద్దులను క్రాస్ చేసి ఇష్టానుసారం చెలరేగిపోయారు. మళ్ళీ 2019లో టీడీపీ గెలిస్తే తానూ డీజీపీని అవుతానని కలలుగన్నారు. కానీ అప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గెలవడంతో ఏబీవి పరిస్థితి తల్లకిందులైంది. ఆయన చేసిన అరాచకాలను వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఆధారాలతో సహా వెలికితీసి సస్పెన్షన్ వేటు వేసింది. కోర్టుల చుట్టూ తిప్పించి ఐదేళ్లు పోస్టింగ్ లేకుండా ఆయన్ను మూడు చెరువుల నీళ్లు తాగించింది. గంగ మెల్లగా చంద్రముఖిగా మారిన విధంగా ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఫక్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మారిపోయి వెంకటేశ్వర రావు చేసిన అనైతిక చర్యలకు మద్దతు పలకడమే కాకుండా ఆ అప్రజాస్వామిక చర్యలను దగ్గరుండి చేయించిన ఆయనకు ఈ ప్రభుత్వంలో అసలు కష్టం తెలిసొచ్చింది. కోర్టులు.. కేసులు.. సస్పెన్షన్లు అంటూ ఆయన ఈ ఐదేళ్లు యూనిఫామ్ వేసుకోకుండానే గడిపారు. డీజీపీ స్థాయి అధికారి తన స్థాయిని మరిచి అధికారపార్టీకి తాబేదారుగా పనిచేయడం అంటే తన ఆత్మగౌరవాన్ని, ఐపీఎస్ వృత్తి నిబంధనలను సైతం పరిహాసం చేయడమే అని తేలింది.డీజీపీగా రిటైర్ కావాల్సిన ఉన్నతాధికారి.. ఐదేళ్లు ఉద్యోగం లేకుండా కోర్టులచుట్టూ తిరుగుతూ.. క్యాట్‌లో పిటిషన్లు వేస్తూ పోస్టింగ్ కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఆయన చేసిన తప్పిదాలు, ఘోరాలను కోర్టుల ముందు ఆవిష్కరించిన ఇప్పటి ప్రభుత్వం మళ్ళీ ఆయన యూనిఫామ్ వేసుకోకుండా చేసింది. మొత్తానికి ఎట్టకేలకు ఏబీవికి మొన్న కేంద్ర పాలనా ట్రిబ్యునల్ (క్యాట్) పోస్టింగ్ ఇవ్వాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈరోజు ఆయనకు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఎట్టకేలకు ఆయనకు పోస్టింగ్ వచ్చిందని సంతోషించాలో.. ఇదే రోజు సాయంత్రం రిటైర్ అవుతున్నందుకు విచారించాలో తెలియని పరిస్థితుల్లో ఆయన ఉద్యోగ జీవితం ముగిసిపోతుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబుకు కళ్ళు, ముక్కు, చెవులు అనేలా ప్రవర్తించిన ఏబీవి నేడు సాయంత్రం రిటైర్ అవుతున్నారు. పొద్దున్న పోస్టింగ్ వచ్చిన ఆయన సాయంత్రం ఉద్యోగ విరమణ చేయడం గమనార్హం. :::: సిమ్మాదిరప్పన్న -
అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
పెళ్లి ముహూర్తం రెండ్రోజులే వుంది.. పీటలమీద ఇవ్వాల్సిన కట్నం కానుకలకు రావాల్సిన డబ్బు రాలేదు... ఇస్తానన్నవాడు పత్తాలేకుండాపోయాడు. వాణ్ని నమ్ముకుని ముహూర్తం పెట్టుకున్నాం... ఇప్పుడెలా ? డబ్బు లేకుంటే పెళ్లి ఆగిపోతుంది. నాన్న ఆపరేషన్‌కు పది లక్షలు ఇస్తే తప్ప కత్తెర పట్టేదిలేదన్నాడు డాక్టర్.. టైం ముంచుకొచ్చింది... డబ్బులు రాలేదు. ఇప్పుడెలా ? ఆపరేషన్ చేయకుంటే ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే.అబ్బాయికి అమెరికా చదువుకు వీసా వచ్చింది.. కానీ అక్కడి కాలేజీ వాళ్ళు డబ్బు డిపాజిట్ చేయమన్నారు.. కట్టేస్తాం అని రెడీ అయ్యాం...టిక్కెట్స్ తీసేసాం... లగేజ్ సర్దేసామ్ కానీ చివరలో డబ్బు రాలేదు.. ఎలా మరి..చదువు ఆగిపోవాల్సిందేనా ? ఇలా ఉంటుంది డబ్బు పరిస్థితి... అవసరానికి అందకపోతే వారి మానసిక పరిస్థితి కూడా దారుణంగా ఉంటుంది..తొలివిడతగా ఇచ్చిన డబ్బులు ఈ నెలన్నర రోజుల ప్రచారంలో ఖర్చయిపోయాయి ...మున్ముందు ఇంకా ఇస్తాం అని హామీ ఇచ్చినవాళ్లు చివరలో చేతులు ఎత్తేసారు..దీంతో టీడీపీ ఎంపీ అభ్యర్థులు డైలమాలో పడ్డారు.. రెండ్రోజుల్లో ఎన్నికలు ఉండగా దాదాపు ఏడుగురు చిన్న ఎంపీలు ( అంటే ఓ మోస్తరు స్తొమత ఉన్నవాళ్లు ) చేతిలో డబ్బుల్లేక గిలగిలా కొట్టుకుంటున్నారు.బిగ్ షాట్స్ ...శ్రీభరత్ వంటివాళ్ళు ఏదోలా నెట్టుకొస్తున్న... చోటామోటా ఎంపీ అభ్యర్థులు మాత్రం డబ్బుల్లేక ఇటు క్యాడర్‌కు ఎమ్మెల్యే అభ్యర్థులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ముందు మీదగ్గర ఉన్నది ఖర్చు చేయండి ..ఢిల్లీ పెద్దలు ఎలాగు మనతోనే ఉన్నారు కాబట్టి ఎక్కణ్ణుంచయినా డబ్బు తెచ్చుకోవచ్చు. మనల్ని ఎవరూ ఆపరు..ఆపలేరు... అనే చంద్రబాబు భరోసాతో ఎంపీ టిక్కెట్లు పొందిన కొందరు టీడీపీ అభ్యర్థులు తమ దగ్గర ఉన్న డబ్బును ఇన్నాళ్లూ ఖర్చు చేసారు. దీంతోబాటు తమ పరిధిలోనే ఏడుగురు ఎమ్మెల్యేలకు సైతం డబ్బు సర్దుబాటు చేసే బాధ్యత వాళ్ళకే ఉండడంతో ఇబ్బందిపడుతున్నారు.గతంలో లేనట్లు దాదాపు ఎన్నికలకు .నోటిఫికేషన్‌కు ఎక్కువ టైం ఉండడంతో ఖర్చులు కూడా అమాంతం పెరిగాయి. డబ్బు వస్తుంది అనుకున్న మార్గాలు వివిధ కారణాలవల్ల మూసుకుపోవడంతో సప్లై ఆగిపోయింది... అలాంటి పనులకోసం పనికొస్తారనుకున్న ఢిల్లీ పెద్దలు ఇప్పుడు 'అలాంటివేం కుదరదు.. అంతా ఈసీ పరిధిలో వుంది మీ చావు మీరు చావండి.." అని చావు కబురు చల్లగా చెప్పడంతో ఏమి చేయాలో తోచడం లేదు.ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తమ వాళ్లకు పరిచయస్తులకు ఫోన్లు చేసి ఓ రెండు, మూడుట్లు ఉంటే సర్దు గురూ అని అడుగుతున్నా ఈ రోజుల్లో అలాంటివి కష్టం అని వాళ్ళు కూడా చేతులు ఎత్తేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ మధ్యతరగతి ఎంపీ అభ్యర్థులు ఈ చివరి రోజుల్లో చేతులు నలుపుకుంటున్నారు.ఇన్నాళ్లూ ఖర్చుపెట్టింది ఒక ఎత్తు.. ఈ చివరి మూడు రోజులూ ఇంకో ఎత్తు. ఓటర్లకు పంచడమే కాకుండా ఎన్నికల పనుల్లో ఉండే మండల గ్రామ స్థాయి క్యాడరుకు డబ్బును నీళ్ల మాదిరి పారిస్తే తప్ప మాట వినరు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో కిందికి కాళ్ళు అందాకా పైకి చేతులు అందాకా తాటిచెట్టు ఎక్కుతూ మధ్యలో ఉండిపోయిన పిల్లాడి పరిస్థితి అయిపొయింది. ఇటు క్యాడర్ మాత్రం డబ్బు వస్తుంది... రెచ్చిపోదాం అని ఆశగా ఎదురుచూస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
విశాఖ బెస్ట్.. అమరావతి వేస్ట్: తేల్చి చెప్పేసిన బాలయ్య చిన్నల్లుడు
అదేంటి అలాగనేశాడు.. ఒసే.. అలా చెప్పడమేటి? పళ్ళకుండూ.. ఇలాపింటి మాటలే దెబ్బేసేస్తాయి. నిజాలు అయినా.. అలా ఒప్పేసుకోకూడదు. ఆ.. ఎలచ్చన్లు అంటే ఏటనున్నావ్ మనకు ఏది లాభమో అదే చెప్పాలి. పక్కోడు మంచోడు అయినా మంచి చేసినా మనం ఒప్పుకోకూడదు. కానీ బాలయ్య చిన్నల్లుడు మాత్రం నిజం ఒప్పేసుకున్నాడు.. అంటూ కంచరపాలెం టీ కొట్టు దగ్గర చెప్పుకెళ్తున్నాడు సిమాచలం. ఒరే ఏట్రా బాబు.. అలా ఒక్కడివే పేలుకుంటున్నావ్ అన్నాడు నారాయణ బీడీ అంటిస్తూ, మరేట్రా బాలయ్య చిన్నల్లుడు.. ఇసాపట్నం టీడీపీ ఎంపీ కేండేట్ శ్రీభరత్ మొత్తానికి నిజం ఒప్పేసుకున్నాడు. జగన్ చేసిందే కరెస్ట్ అని చెప్పేసాడు అన్నాడు సిమాచలం. ఒరేయ్.. అసలు పాయింట్ చెప్పకుండా ఏదేదో పేల్తే గూబ పేలిపోద్ది అన్నాడు సిరగ్గా నారాయణ..మనకు రాజధానిగా ఇసాపట్నమే బెస్టని, పొలాలు తుప్పలు డొంకలతో విలేజిల్లో ఉన్న అమరావతి వేస్ట్ అని చెప్పేశాడ్రా బాబు అన్నాడు సిమాచలం. ఒసే.. తెలుగుదేశపోల్లు అమరావతి అంటారు కదేటి.. ఉన్నఫళంగా ఇలాగనేశాడేటి అన్నాడు నారాయణ. ఒరేయ్.. వాళ్లకూ తెలుసురా అమరావతి అయ్యేది కాదని, ఎప్పటికైనా ఇసాపట్నమే ఆంధ్రకు పెద్ద దిక్కు అని. అందుకే ఆళ్ళ కాలేజీ కూడా ఇక్కడే డెవలప్ చేస్తున్నాడుచూసావా అన్నాడు సిమాచలం. అవునురోయ్ మన ఇసాపట్నానికి అమరావతికి సాపత్తిమా, పల్లకోరా బాబు.. ఆ ముక్క తెలుగుదేశపోళ్ళకు కూడా తెలుసు. కానీ చంద్రబాబుకు అన్నీ మూసుకున్నారు. ఏదైనా జగన్ గొప్పోడురా బాబు అందుకే మన వైజాగ్‌ను రాజధానిగా చేయడమే కాదు ఇక్కడే పెద్దపెద్ద కంపెనీలు తెస్తాను అని అప్పుడే డిసైడ్ అయ్యాడు. చూస్తుండు అన్నీ ఖచ్చితంగా చేస్తాడు అని చెబుతున్న సిమాచలం వైపు విస్మయంతో చూస్తూ... పోన్లేరా అలాగైతే మన గుంతలకు ఇక్కడే ఉజ్జోగాలు వస్తాయి అన్నాడు నారాయణ.టీడీపీ ఎంపీ అభ్యర్థి గీతం కాలేజీ చైర్మన్ శ్రీభరత్ మనసులోని మాట చెప్పేశారు. రాష్ట్ర రాజధానిగా విశాఖ అద్భుతంగా ఉంటుందని, ఈ నగరానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయ్ కాబట్టి దేన్నిమించిన నగరం రాజధానిగా ఎంపిక చేసుకోలేమని తేల్చి చెప్పేశారు. ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమరావతి అనేది రాజధానిగా పనికిరాదని, విశాఖ అద్భుతంగా అభివృద్ధి చెందిన నగరమని, అందుకే దీన్నే రాజధానిగా చేయాలనీ అన్నారు. అయన ఇప్పుడు చెబుతున్నారు కానీ సీఎం వైఎస్ జగన్ ఏనాడో విశాఖను రాజధానిగా చేస్తానన్నారు.అయన రేపు ప్రమాణస్వీకారం కూడా విశాఖలోనే అని తేల్చేశారు. ఇక శ్రీ భారత్ మామ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా విశాఖలో భీమిలి ప్రాంతంలో భూములు కొన్నట్లు తెలుస్తోంది. అంటే ఆయనకు కూడా విశాఖ రాజధాని అవుతుందని తెలుసు. కానీ చంద్రబాబు మాత్రమే తన తాబేదారులకోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకోసం అమరావతి కావాలని అంటున్నారని ప్రజలు గుర్తించారు. ఇక ఎన్నికల ఫలితాలు రావడం, జగన్ గెలవడం.. విశాఖలోనే ప్రమాణస్వీకారం చేయడం, అక్కడే నివాసం ఏర్పాటు చేసుకోవడం చకచకా జరిగిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న -
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది.. ప్రతి బాలు బౌండరీ దాటుతుంది.. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.. తుపానొచ్చినపుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది? కెరటాటు తీరం వైపు పోటెత్తుతాయి.. అడ్డం వచ్చిన వాటిని ఊడ్చి పడేస్తాయి.అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజైతే ఏమవుతుంది... ఏమీ కాదు... భారత్ మొత్తం స్థంభించిపోతుంది... కోట్లాదిమంది అమితాబ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటారు.. ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది.. అచ్చం.. అలాగే... పైన చెప్పిన మాదిరిగానే... సీఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ-9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది.. దాంతో బాటు యూట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూను చూసింది.అందులో అభివృద్ధి, సంక్షేమం... వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న వేర్వేరు సందేహాలను టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ వెళ్లలచెరువు లేవనెత్తారు.. భూ సర్వే గురించి... టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు... సంధించిన ప్రశ్నలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి... తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు. దాంతోబాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది... ఒకసారి తప్పు చేస్తే పొరపాటు... రెండో సారి చేస్తే గ్రహపాటు... మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దాంతోబాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు..పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్హును లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది... ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు.. ఈ ఇంటర్వ్హు తమకు బాగా మైలేజి ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది.మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు..చూసేవాళ్ళు కరువయ్యారు... అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్.. దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని.. అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు. బాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని... వాటిల్లో నిబద్ధత లేదని.. అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు.ఒక పక్క మోదీ రోడ్ షో జరుగుతున్నా.. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఏబీఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఇమేజ్ మరోసారి జగన్‌ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.-సిమ్మాదిరప్పన్న -
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
ఎన్నికలు వచ్చేశాయి.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ, జనసేనలతో జతకట్టి ప్రజల్లోకి వెళ్తోంది. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి రకరకాలవాళ్ళను ప్రచారానికి దించుతోంది.బాలయ్య బాబు వంటి సినిమా స్టార్లు ఒకవైపు ప్రచారం చేస్తుండగా ఏకంగా పవన్ కళ్యాణ్ సైతం అటు పిఠాపురంలో పోటీ చేస్తూనే వేరే నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తరఫున జబర్దస్త్ టీమ్ మొత్తం కొన్నాళ్లపాటు ప్రచారం చేయగా ఇక మెగా కాంపౌండ్‌లోని హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ వంటివాళ్ళు సైతం ప్రజల్లోకి వెళ్లి కూటమికి ఓటేయాలని అడుగుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్‌ను పిఠాపురంలో గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేశారు. ఇలా కూటమి వైపు మొత్తం పెద్దపెద్ద సినిమా స్టార్లు ప్రచారం చేస్తున్నారు.లబ్ధిదారులే జగన్ స్టార్ క్యాంపెయినర్లు అటు ప్రచారం అలా ఉండగా ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారధ్యంలోని వైఎస్సార్సీపీ మాత్రం ప్రజలే ప్రచార సారధులుగా ముందుకు సాగుతోంది. ఓ వైపు అంతా తానై సీఎం జగన్ ప్రచారం చేస్తుండగా మరోవైపు ఆయన ప్రభుత్వంలో లబ్దిపొందినవాళ్లు ఆయన కోసం ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో పెన్షన్ కోసం ఇబ్బంది పడిన ఓ తాత.. అమ్మ ఒడి అందుకున్న ఓ అక్క.. జగనన్న విద్యాకానుక అందుకున్న ఒక కుర్రాడి తల్లి.. ఆసరా అనుకున్న ఓ అక్క.. ఇలా పేదలే సీఎం జగన్ తరఫున ప్రచారం చేస్తున్నారు. మీ అందరికీ మంచి జరగాలి అంటే మళ్ళీ జగన్ గెలవాలి అని ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు. ఆ గట్టున సినిమా క్యాంపెయినర్లుగా ఉండగా ఈ గట్టున పేదలే స్టార్ క్యాంపెయినర్లుగా నిలబడి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చేందుకు పని చేస్తున్నారు.-సిమ్మాదిరప్పన్న. -
నాడు ఒప్పయింది.. నేడు తప్పయిందా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం... దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది... ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్.. కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం... రైతులకు చుట్టం... అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు... భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు.చంద్రబాబుకు పనికొస్తుంది ఆంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు.. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు... బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు.👉ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు...ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి, విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.👉ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారు... ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు...ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయగా...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు... ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు.👉ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు... ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు... ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ...ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు... జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం జేజెమ్మ గుర్తొస్తుంది.:::: సిమ్మాదిరప్పన్న -
నాడు ఒప్పయింది.. నేడు తప్పయిందా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం... దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది... ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్.. కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం... రైతులకు చుట్టం... అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు... భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు. చంద్రబాబుకు పనికొస్తుంది అంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు... బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు.👉ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు... ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి,,విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.👉ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారు... ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు...ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయగా...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు... ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు...👉ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు... ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు... ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ...ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు... జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం జేజెమ్మ గుర్తొస్తుంది ..:::సిమ్మాదిరప్పన్న -
సీను సీతారైంది సాంబడా
ఎంతమంది రౌడీలను పెట్టినా హీరో లొంగడం లేదు.. పైగా ఎగిరెగిరి తంతున్నాడు. వచ్చినవాళ్లు వచ్చినట్లే నేలకు కరుచుకుపోతున్నారు.. ఇక ఇలాక్కాదని రావుగోపాలరావుకు కోపం వచ్చింది. బొంబాయి నుంచి జిముంబా అనే పెద్ద దాదాను తీసుకొచ్చాడు. వాడు మామూలు మనిషి కాదు.. పూటకు రెండు గొర్రెలు వంద గుడ్లు తింటాడు. వాణ్ని ఎవరూ ఎదుర్కోలేరు. అలాంటివాణ్ణి హీరోమీదకు ఉసిగొల్పాడు.. మొదటి రెండు షాట్లు తిన్న హీరో ఇక లేచాడు. కళ్ళలో పడిన దుమ్మును దులిపేసి.. నడుముకు తువాలు చుట్టి జై భజరంగి భళి అంటూ గర్జించాడు.. ఎగిరెగిరి తన్నాడు.. దెబ్బకు జిముంబా కూడా నేల కరిచేసాడు.ఆంధ్ర పాలిటిక్స్ కూడా ఇలాగే ఉన్నాయ్.. రావుగోపాలరావు పాత్రలో ఉన్న చంద్రబాబు కూడా ఇలాగే హీరో జగన్ మీద రకరకాల వాళ్ళను ప్రయోగిస్తున్నారు... వలంటీర్ల మీద దుమ్ము రేపబోయాడు... అది ఎదురుతన్నింది... వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లను ఆపించాలని చూసాడు... వృద్ధులతో తిట్లు కాసాడు.. ఇంగ్లిష్ మీడియం వద్దన్నాడు.. పేరెంట్స్ తో చీవాట్లు కాసాడు... ఇక ఇలా కాదని ఎక్కడా లేని ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని బయటకు తెచ్చి ఇది వచ్చిందంటే ఇక మీ భూములన్నీ ఉఫ్... జగన్ ఎత్తుకుపోతాడు.. అంటూ తన బ్యాచ్ తో కలిసి తెగ ప్రచారం చేసాడు... పత్రికలూ...మీడియా..చానెళ్లు ఇవన్నీ నాలుగురోజులపాటు ఇదే పనిమీద ఉన్నాయ్.. పూనకం వచ్చినట్లు ఊగిపోయారు... ఎల్లో మీడియా సంస్థలన్నీ ఒళ్ళంతా సూదులతో గుచ్చుకుని కొరడాలతో కొట్టుకున్నారు... జనాన్ని భయపెట్టేసి కంగారు పెట్టేసి.. వామ్మో వాయ్యో అనేలా చేసి....సంబరపడుతున్న తరుణంలో మెల్లగా సీఎం వైయస్ జగన్ మైక్ అందుకున్నారు. చదవండి: కొత్త పగటివేషగాడు వచ్చాడుఅసలు ఆ చట్టం ఆంటే ఏమిటి... దానిలోని లోటుపాట్లు...అంతా చిన్నపిల్లలకు వివరించినట్లు చెప్పారు... లక్షల ఎకరాల చుక్కల భూములను పేదలకు పంచింది మీ జగన్.... లక్షల ఎకరాల పోడు భూముల మీద గిరిజనులకు హక్కులిచ్చాము... ఇంకా చంద్రబాబు గ్యాంగ్ అడ్డుకున్నా.. కోర్టుల్లో కేసులు వేసినా లక్షలమందికి వేలాది ఎకరాల్లో ఇళ్ల పట్టాలు ఇచ్చాము...ఇదీ మీ జగన్ నిజాయితీ...ఇదీ మీ జగన్ కు మీ పట్ల ఉన్న ప్రేమ... అలాంటి జగన్ మీ భూములు లాక్కుంటాడా ? ఈ ఐదేళ్ల పాలనలో మీరు జగన్‌ను ఇదేనా అర్థం చేసుకున్నది... అంటూ వివరించారు. దీంతో జనానికి విషయం అర్థం ఐంది.అంటే పెన్షన్ల విషయంలో కుట్రపన్నినట్లే ఈ ల్యాండ్ టైట్లింగ్ చట్టం విషయంలోనూ చంద్రబాబు కావాలనే ప్రజలను తప్పుదోవపడుతున్నట్లు జనానికి అర్థం ఐంది... దీంతోబాటు అలంటి తప్పుడు ప్రకటనలు..ప్రసంగాలు చేస్తున్నందుకు ఎన్నికల సంఘం ఆదేశాలతో చంద్రబాబు, లోకేష్ సీఐడీ కేసు నమోదు చేసింది.దీంతో ప్రజలకు విషయం అర్థమైంది...అంతేకాకుండా ఆ అంశం ప్రజల మనస్సుల్లోంచి తొలగిపోతూ... జై జగన్ అనే నినాదం వచ్చి చేరుతోంది... దీంతో ఎల్లో మీడియా... చంద్రబాబు క్యాంప్ తేలుకుట్టిన దొంగల్లా సైలెంట్ అయిపోయారు.. ఎంతో ప్లాన్ చేసి ఈ టైట్లింగ్ చట్టం మీద గాయిగాత్తర చేయబోతే ఇలాగయ్యిందేంటిరా సాంబడా అంటూ తండ్రీకొడుకులు నెత్తి నోరు బాదుకుంటున్నారు.. మనం ఎంత పెద్ద కుట్రపన్నినా అటు జగన్ ఒక్క బాణంతో దాన్ని ఎఱుర్కొంటూనే తిరిగి ఆ వ్యూహం మనకు తగిలేలా చేస్తున్నాడు..ఇలాగైతే ఎలారా సాంబా అని తండ్రీకొడుకులు కొత్త కుట్రలకు సిద్ధమవుతున్నారు... ఈసారి ఢిల్లీ కాకుండా బీహార్ నుంచి భిక్షు యాదవ్ ను తెచ్చేపనిలో ఉన్నారేమో... చూడాలి.:::: సిమ్మదిరప్పన్న -
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఎప్పుడో మూలబడిపోయి, నట్లు ఊడిపోయిన అంబాసిడర్ కారుకు కలర్ వేసి తీసుకొస్తే అది ఆడి కార్ అయిపోతుందా...ముసలమ్మకు మేకప్ వేసి చూపిస్తే ముద్దుగుమ్మ అయిపోతుందా..సంస్థను మోసం చేసి...చెక్కుబుక్కులు ఎత్తుకుపోయి వ్యవస్థనే మోసం చేసి కేసులపాలై ఏళ్లపాటు సమాజానికి మొహం చూపించలేక ఎక్కడో దూరంగా బతుకుతున్న వ్యక్తిని తీసుకొచ్చి రాత్రికిరాత్రి సర్వేలు అంటూ అవాస్తవాలు. చెప్పిస్తే ప్రజలు నమ్ముతారా ? అసలు ఈ కాలం జనం అలా ఉన్నారా? ఎవరో ఏదో చూపిస్తే అబ్బో...బ్రహ్మాండం అని నమ్మే తీరులో ఉన్నారా? అసలు ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెల్లోని జనం కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతూ సోషల్ మీడియాలో అన్నీ చూస్తూ ఏ ఛానెల్..ఏ పత్రిక ఎవరిపక్షమో చెప్పగలుగుతున్నపుడు ఈ మాయమాటలు ఎవరు నమ్ముతారు.వాస్తవానికి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక ఊత కర్ర లేకపోయింది. అంటే ఏ అంశాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్లి నమ్మిస్తారు..ఆకట్టుకుంటారు..ప్రస్తుత వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం అన్నివర్గాలనూ ఆకట్టుకుంటూ అవినీతి రహిత పాలనా అందిస్తోంది. దానికితోడు చంద్రబాబు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయి గౌరవాన్ని కోల్పోయి ఏదో అలా బతుకుతున్నారు తప్ప ఆయన రాజకీయనాయకుడు స్టేచర్ ఏనాడో కోల్పోయారు. దీంతో ఈ ఎన్నికలవేళ తెలుగుదేశానికి కాళ్ళు చేతులు కట్టేసినట్లయింది. ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక కారణం..ఒక అంశం లేకుండా పోయింది.ఇక జగన్ ఐతే చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు. మాయలు ఉండవు...చేయలేనిది చేయలేను ఆయనే ఒప్పేసుకుంటాడు.. అలాంటపుడు మోసానికి కేరాఫ్ అయిన చంద్రబాబు నమ్మాల్సిన అవసరం ఏముందన్న ట్రెండ్ ప్రజల్లో నడిచింది . సినిమా ఫ్లాప్ అయిపోయి..జనాదరణ కోల్పోయి, ఇది చెత్త అని జనాల్లో టాక్ వచ్చినపుడు కొత్త మసాలా పాట కలిపి మళ్ళీ రిలీజ్ చేస్తుంటారు. అంతే ఆ పాట సినిమాను నిలబడుతుందన్న భ్రమ ఆ నిర్మాతలది. మొత్తం సినిమా దరిద్రం అయిపోయాక ఆ ఒక్క పాట సినిమాను నిలబెట్టలేదు. ఇప్పుడు చంద్రబాబు కూడా తన పార్టీ మీదా ఆశ కోల్పోయి బిక్కుబిక్కుమంటున్న పరిస్థితుల్లో రవి ప్రకాష్ అనే అవుట్ డేటెడ్ జర్నలిస్టును తీసుకొచ్చి నోటికొచ్చిన అంకెలు వేసి సర్వే అని విడుదల చేాశారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎవరికీ ఎక్కువ సీట్లు వస్తాయన్నది. ఎవరిపాలన బాగుందన్నది జనానికి తెలుసు. అలాంటిది ఎక్కడో హైదరాబాద్‌లో కూర్చుని ఇష్టానుసారం అంకెలు వేసేసి ఇదే సర్వే అని జనాల్లోకి వదిలితే నమ్మే కాలం కాదని ఇలాంటి కుట్రదారులు తెలుసుకోవాలి. --సిమ్మాదిరప్పన్న-- -
కన్ఫ్యూజ్ చేయబోయి బొక్కబోర్లా పడ్డారు
కన్విన్స్ చేయడం చేతగానపుడు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం సులువు.. ఇది చంద్రబాబు దశాబ్దాల నుంచి అమలు చేస్తున్న కుట్ర.. తన పాలనా గురించి,. తాను చేసిన అభివృద్ధి గురించి ఏనాడూ ఎప్పుడూ చెప్పుకోలేని చంద్రబాబు..ఎన్నికల సమయంలో అవతలి పార్టీవల్ల మీద దుమ్మెత్తిపోసి ప్రజలను గందరగోళపరిచి లభ్ది పొందుతూ ఎన్నికల్లో గట్టెక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా తాను గత ఐదేళ్ళలో ఏమి చేసిందీ చెప్పుకోలేని చంద్రబాబు సీఎం వైఎస్ జగన్ పాలనలోని గొప్పతనాన్ని గుర్తించే మనసులేక.. ఏకంగా లేని చట్టాన్ని చూపించి ప్రజలను భయపెట్టాలని చూశారు.కేవలం ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనే అంశాన్ని చూపించి ప్రజలను భయపెట్టి లబ్ధిపొందాలన్నది చంద్రబాబు కుట్రగా తెలుస్తోంది... ఈ క్రమంలో అయన కొంతమంది కార్యకర్తలు, యువత, రైతులను డబ్బులిచ్చి జనంలోకి పంపించి ఆ చట్టం పేరిట జనాన్ని భయపెట్టాలని చూాశారు. దీంతోబాటు TDP ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా జగన్‌పై, ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలు పెట్టారు. దీంతోబాటు ప్రజల భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తోందని దుష్ప్రచారం మొదలు పెట్టింది. ప్రజలకు లక్షల ఎకరాల అటవీ భూములు, చుక్కల భూములకు సంబంధించి ప్రజలకు శాశ్వత హక్కులు కల్పించిన జగన్ తిరిగి ప్రజల భూములు లాక్కోవడం ఏమిటన్న చర్చ జనంలోకి వచ్చింది. తెలుగుదేశం అనుకూల మీడియా కూడా కేవలం ఇదే అంశాన్ని రాస్తూ..టీవీల్లో...చూపిస్త్తూ ప్రజలను భయపెట్టేందుకు ప్రయతించింది. దీంతో ఈ తప్పుడు ప్రచారాన్ని ఆపాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌ను కలిసి టీడీపీ తీరుమీద ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదులో బలం ఉందని గ్రహించిన ఎన్నికల కమిషన్ ఇక ముందు ఈ చట్టం గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నవాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారని రాష్ట్ర సీబీసీఐడీని సైతం ప్రశ్నించింది.. దీంతో తెలుగుదేశం వారి గొంతులో వెలక్కాయపడినట్లు అయింది.. సీఐడీ ని ఎన్నికల సంఘం ఆదేశించడం ఆంటే అందులో నిజం ఉన్నట్లే... ఇకముందు నోటికొచ్చినట్లు మాట్లాడితే కేసులు తప్పవని ఈసీ ఆదేశాలతో టీడీపీ వాళ్లకు అర్థం ఐంది.-సిమ్మాదిరప్పన్న -
మళ్ళీ వచ్చారు...మౌత్ టాక్ మల్లిగాళ్ళు
సినిమా ఎప్పుడైతే చప్పగా ఉన్నట్లు అనిపిస్తుందో... సరిగ్గా అప్పుడే రెండు కామెడీ జోక్స్...లేదా మంచి మసాలా ఐటం సాంగ్ వేస్తారు... దీంతో మళ్ళీ థియేటర్లో ప్రేక్షకులు ఎటెన్షన్లోకి వచ్చి...సినిమాలో లీనమవుతారు... అచ్చం చంద్రబాబు కూడా ఇదే విధానము ఫాలో అవుతున్నారు.టీడీపీ గ్రాఫ్... చంద్రబాబు ప్రతిష్ట ఎప్పుడైతే డౌన్ అవుతోందని గ్రహిస్తారో.... అప్పుడు తన మీడియాను... పచ్చ జనాన్ని... అలవోకగా బొంకగలిగేవాళ్లను జనంలోకి దించుతారు... వీళ్ళే మౌత్ టాక్ మల్లిగాళ్ళు వీళ్ళు జనం ఎక్కువగా ఉండే హోటళ్లు... టీ స్టాళ్లు..బస్సులు...రైల్వే కౌంటర్ల వద్ద అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఉన్నఫళంగా ప్రభుత్వాన్ని తిడుతూ అరుస్తూ కేకలు వేస్తారు.. అక్కడ ఉన్నవాళ్ళంతా ఆటే చూసేలా చేస్తారు.ఐదారు నిముషాలు స్క్రిప్ట్ ప్రకారం తమిళ యాక్టర్లు మనోరమ.. శివాజీ గణేష్‌లను మించిపోయేలా యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతారు... చూసేవాళ్ళు మాత్రం...వామ్మో ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందా అని జనం అనుకోవాలనేది వాళ్ళ ప్లాన్. దీనికోసం టీడీపీ ఎన్నారై విభాగం సైతం గ్రామాల్లోకి దిగింది.తమ చుట్టుపక్కల ఉన్నవాళ్లను ప్రభావితం చేసి తెలుగుదేశానికి ఓటేయించడం వారి విధి.. దీనికోసం కోట్లలో నిధులు సైతం సమీకరించి దేశవిదేశాల్లోని ఎన్నారై యువత సెలవులు పెట్టుకుని మరీ పల్లెల్లో, పట్టణాల్లోని కాలనీల్లో పాగా వేసింది..వాస్తవానికి టీడీపీ మ్యానిఫెస్టో జనంలోకి వెళ్ళకపోవడం, ప్రజలు పెద్దగా నమ్మకపోవడం.. సీఎం వైయస్ జగన్ అందిస్తున్న పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రం మరింతగా ప్రగతి సాధించాలంటే మళ్ళీ జగన్ రావాలి..పోర్టులు... మెడికల్ కాలేజీలు... స్కూళ్ళు.. ఇంగ్లిష్ మీడియం చదువులు... ఇప్పుడిప్పుడే ఊపందుకున్న పరిశ్రమలు... ఇవన్నీ పూర్తి కావాలన్నా... ఉద్యోగావకాశాలు పెరగాలన్నా మళ్ళీ జగన్ గెలవాలి...అలాగైతే ఇప్పుడు పురోగతిలో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి అని జనం అనుకుంటున్నారు...దీంతోబాటు గ్రామస్థాయిలో ప్రజల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఇల్లు కదలకుండా తమ గుమ్మం వద్దకే వస్తున్నా సంక్షేమ పథకాలు... ఊరు దాటకుండానే సచివాలయంలో అందుతున్న ప్రభుత్వ సేవలను అందుకుంటున్న తీరు ప్రజల స్మృతిపథంలో కదులుతూనే ఉన్నాయి. . దీనికితోడు మహిళలు... వికలాంగులు... రైతులు ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ తమకు ఎంత మేలు ఎంత మేలు చేశారన్నది లెక్కలు వేసుకుని మరీ ప్రజలు ఓటు చేతబట్టుకుని ఎన్నికల తేదీ కోసం సిద్ధంగా ఉన్నారు.మళ్ళీ తమ సోదరుడిని గెలిపించుకోవాలని వాళ్లంతా ఎదురుచూస్తున్నారు... ప్రజల్లో అలా అభిప్రాయం ఉన్నపుడు ఈ మౌత్ టాక్ మల్లిగాళ్ళు ప్రజల మనోభిప్రాయాలను మార్చలేరని అంటున్నారు. ఎన్నిసారు అరిచినా ఇత్తడిని పుత్తడి చేయలేరని.. చంద్రబాబును మళ్ళీ గెలిపించలేరని అంటున్నారు. గట్టిగా అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు కాలేవని... గ్రామసింహం సింహం కాలేదని ప్రజలు అంటున్నారు.-- సిమ్మాదిరప్పన్న -
కూటమి అంటేనే ఎలపరమబ్బా....
అసలు చేయితగిలితేనే ఒప్పుకోని మనిషి కాలు తగిల్తే ఊరుకుంటుందా ? అసలే ఊరుకోదు... ఇల్లుపీకి పందిరిస్తుంది.. ఊరంతా గాయి గత్తర చేస్తుంది. బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది... మ్యానిఫెస్టోలో చంద్రబాబు బాటు పక్కనే తన ఫోటో ఉంచితేనే వద్దన్నా ప్రధాని మోడీ ఇప్పుడు చంద్రబాబు... పవన్ తో కలిసి ప్రచారం చేస్తారా? చేయనే చేయరు. వాస్తవానికి టీడీపీ జనసేన...బీజేపీల ఉమ్మడి మ్యానిఫెస్టో మొన్న విడుదల చేసారు. వాస్తవానికి మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నపుడు... సీట్లు కూడా పంచుకుని మరీ బరిలోకి దిగుతున్నపుడు మ్యానిఫెస్టోలో కూడా మూడుపార్టీల ఫోటోలు ఉండాలి.కానీ దీనికి బిజెపి పెద్దలు నో అన్నారని, అందుకే మోడీ పేరు, ఫోటో లేకుండానే కేవలం చంద్రబాబు, పవన్ ఫొటోలతో మ్యానిఫెస్టో విడుదల చేసారు.. ఆ మ్యానిఫెస్టోతో తమకు సంబంధం లేదని, దాని అమలు అనేది వాళ్లదే బాధ్యత అని బీజేపీ తేల్చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం అనేది తుది అంకానికి చేరిన తరుణంలో మోడీ మరోమారు ఆంధ్రాలో ప్రచారానికి వస్తున్నారు. గతంలో వచ్చి పవన్, చంద్రబాబులతో కలిసి చిలకలూరిపేటలో బహిరంగ సభలో మాట్లాడారు. అప్పుడు కూడా మా ఎన్డీయేను గెలిపించండి అన్నారు తప్ప మాటవరసకు ఐన జగన్‌ను విమర్శించలేదు... బాబును నెత్తికి ఎత్తుకుని గెలిపించాలని ప్రజలను కోరలేదు. వాస్తవానికి బీజేపీ ఆంధ్రాలో ఆరు లోక్‌సభ ...పది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.ఇప్పుడు మళ్ళీ మోదీ రెండోవిడత ప్రచారానికి వస్తున్నారు., ఇందులో భాగంగా 7, 8 తేదీల్లో ఏపీలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ వస్తున్నారు. ఏదో తేదీన పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్న రాజమండ్రి నియియోజకవర్గంలో ని వేమగిరిలో బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. ఆ తరువాత అదేరోజు సాయంత్రం సీఎం రమేష్ ఎంపీగా పోటీ చేస్తున్న అనకాపల్లి పరిధిలోని రాజుపాలెం సభలో పాల్గొంటారు. 8న సాయంత్రం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్న రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని పీలేరులో పాల్గొంటారు... ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు... అదేరోజు రాత్రి రాత్రి 7 గంటలకు విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్‌షో నిర్వహిస్తారు. ఇక్కడ విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారువాస్తవానికి ఈ కార్యక్రమాలకు కూటమి భాగస్వాములు అయిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైతం హాజరవ్వాలి... కానీ మోడీ తీరు, బిజెపి విధానం చూస్తుంటే అసలు వాళ్లతో మాట్లాడేందుకు సైతం ఇష్టపడుతున్నట్లు కనిపించడం లేదు.. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో పొత్తుపెట్టుకున్నాం తప్ప మాకు వాళ్ళిద్దరంటేనే చిరాకు.. చూస్తుంటేనే ఎలపరం వస్తోంది అన్నట్లుగా ఉన్నారు.. అందుకే ఈ ప్రచార సభల్లో టీడీపీ, జనసేన నేతలు పాల్గొనే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మోడీ కూడా కేవలం తమ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోటనే ప్రచారం చేసేలా టూర్ షెడ్యూల్ రూపొందించారు..-సిమ్మాదిరప్పన్న -
టచ్ మీ నాట్... దూరం జరగండమ్మా
మొత్తానికి రాష్ట్రంలో టీడీపీ సారధ్యంలో ఏర్పడిన ఎన్డీయే కూటమి మనసులు కలవని బలవంతపు కాపురం అని తేలిపోయింది. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ భావిస్తోంది. అందుకే మీ పాట్లేవో మీరు పడండి... అందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి నాయుడుగారు అని స్పష్టంగా చెబుతోంది. వాస్తవానికి టీడీపీ.. జనసేన... బీజేపీల కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టోను విడుదల చేసే కార్యక్రమానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.దీనికి జాతీయ బీజేపీ నేత సిద్దార్థ నాథ్ సింగ్ సైతం ఢిల్లీ నుంచి వచ్చారు. అయితే ఆ మ్యానిఫెస్టో కాపీ మీద ఎక్కడా మోడీ ఫోటో లేదు. కేవలం చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి. అంతేకాకుండా ఆ మ్యానిఫెస్టో కాపీని విడుదల చేసే సమయంలో వరుసగా ఈ ముగ్గురు నాయకులూ నిలబడి ఫోటోలకు.. పత్రికలకు ఫోజులిచ్చారు. అయితే ఆ సందర్భంగా ఆ కాపీని చేత్తో పట్టుకుని బాబు, పవన్ పక్కన నిలబడేందుకు సైతం సింగ్ విముఖత చూపించారు. ఎవరో వచ్చి ఆ కాపీని సింగ్‌కు ఇస్తుండగా అక్కర్లేదు.. అంటూ నేను దాన్ని తాకను అనేలా సంజ్ఞ చేసారు. ఆ తరువాత అయన మీడియాతో మాట్లాడుతూ ఈ మ్యానిఫెస్టో ఈ ఇద్దరిదే.. మా బీజెపికి ఏమీ సంబంధం లేదని చెప్పేసారు. అంతేకాకుండా రాష్ట్ర బిజెపి నుంచి సైతం ఈ కార్యక్రమానికి ఎవరూ.. ఆఖరుకు అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం హాజరు కాలేదు. దీంతో ఇది జస్ట్ పవన్... జనసేనల పొత్తు అని తేలిపోయింది.అసలేం జరిగింది ?గతంలో 2014 లో సైతం ఇలాగే మూడు పార్టీలు పొత్తులో ఎన్నికలకు వెళ్లాయి. అప్పుడు చంద్రబాబు దాదాపు ఆరువందల హామీలు ఇచ్చి.. ఆ తరువాత మాటతప్పి.. మ్యానిఫెస్టోను పార్టీ వెబ్సైట్ నుంచి మాయం చేసారు. ఇప్పుడు ఆ మ్యానిఫెస్టోను సీఎం వైఎస్ జగన్ బయటకు తీసి.. ఒక్కో హామీని ప్రజలకు గుర్తు చేస్తూ ఈ హామీ ఇచ్చారు. అమలు చేసారా అక్కా.. రుణమాఫీ చేసారా అన్నా.. పెన్షన్ ఇచ్చారా తాతా.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసారా చెల్లి.. ఉద్యోగాలు ఇచ్చారా తమ్ముడూ.. చూడండి ఈ హామీలకు అప్పట్లో మోడీ.. పవన్ సైతం గ్యారెంటీలుగా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు సైతం ఉన్నాయ్. మళ్ళీ అలాంటి వాళ్లకు ఓట్లెద్దామా అంటూ ఊరూరా ప్రచారం చేయడంతో.. చంద్రబాబు ఇచ్చే అమలుసాధ్యం కానీ హామీలవల్ల మేమెందుకు ప్రజలకు జవాబుదారీ కావాలి...? మేమెందుకు పరువుపోగొట్టుకోవాలని భావించిన బీజేపీ ఈసారి ఆ హామీల విషయంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు నాయుడుగారు.. మీరు మీరు.. ఏదోలా తగలడండి అనేసింది. అంతేకాకుండా దానిమీద మోదీ ఫోటో సైతం వేసేందుకు కేంద్రం ఒప్పుకోలేదని తెలిసింది. అందుకే ఈసారి మ్యానిఫెస్టో మీద కేవలం.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఫోటోలు మాత్రమే ఉన్నాయ్. మరోవైపు బాబు ఇస్తున్న హామీలకు మా కేంద్రానికి, బీజేపీకి ఎలాంటి బాధ్యత లేదని వాళ్ళు తేల్చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల విషయంలో కూడా చంద్రబాబు తమను మోసం చేసినట్లు కేంద్రం గుర్తించింది. పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు వంటివాళ్లకు టిక్కెట్లు ఇవ్వకుండా కేవలం టీడీపీ నాయకులనే బీజెపి నేతలుగా చూపించి టిక్కెట్లు ఇచ్చుకుని అసలైన బీజెపి నేతలను మోసం చేసారని అధిష్టానం గమనించింది. అంటే ఎన్ని చేసినా.. ఎంత చేసినా కుక్కతోక వంకరే అని.. చంద్రబాబులోని మోసపూరిత గుణం మారదని స్పష్టతకు వచ్చిన కేంద్రం.. అసలు ఈ దరిద్రమే మాకువద్దు. మీ చావు మీరు చావండి. మీ ఎన్నికలు.. మ్యానిఫెస్టోలో మాకు ఏమీ సంబంధం లేదని తేల్చేసింది.:::: సిమ్మాదిరప్పన్న -
నాయకుడి రూపం...గారడీ వేషం
మాటలది ఏముంది..ఏమైనా చెప్పొచ్చు ఎన్నైనా చెప్పొచ్చు..మబ్బులు తెచ్చి ఒళ్ళో పోస్తాను అనొచ్చు.. జాబిల్లిని తెచ్చి చేతికి ఇస్తామనోచ్చు. కానీ నిజంగా ఆ మాట నిలుపుకున్నపుడు కదా ఆ మాటకు, ఇచ్చినవాడికి విలువ.. రాజకీయంగా చూస్తే చంద్రబాబు గత నలభయ్యేళ్లుగా ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు... అసలు మేనిఫెస్టో అనేది ఆయనకు ఒక చిత్తుకాగితంతో సమానం. ఎన్నికలప్పుడు వెయ్యిమాటలు చెప్పడం.. ఒక్కటంటే ఒక్కటీ చేయకుండా..మాయమాటలతో పూటగడిపేయడం...మళ్ళీ అవే హామీలను ఇస్తూ మరో ఎన్నికకు సిద్ధం కావడం..అదే అయన కెరీర్ మొత్తం..సాగిపోయింది.2014 లో కూడా ఇలాగే రైతు రుణమాఫీ... డ్వాక్రా రుణ మాపీ....నిరుద్యోగ భృతి అంటూ వందలాది పథకాల పేర్లు చెప్పి ఓట్లేయించుకుని చివరకు మేనిఫెస్టో కూడా దొరక్కుండా దాచేసారు. మళ్ళీ ఇప్పుడు అదే హామీలు ఇస్తూ 2024 ఎన్నికలకు చంద్రబాబు.. జనసేనాని కలిపి సిద్ధం అవుతున్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ ఐతే నవరత్నాలు అంటూ తాను అమలు చేయగలిగే హామీలు మాత్రమే జాబితాలో చేర్చి వాటిని తూచా తప్పకుండా అమలు చేసారు.. అమ్మఒడి, ఆసరా.. సున్నా వడ్డీ , రైతు భరోసా.. జగనన్న విద్యా దీవెన , విద్యా కనుక, ముప్పై లక్షలమందికి ఇళ్ళు, కాపునేస్తం...ఇలా జాబితాలో చేర్చినవన్నీ చేసుకుంటూ వెళ్లారు.. ఆర్థికంగా అది ఖజానాకు భారమే అయినా ప్రజలకు మాట ఇచ్చాము కాబట్టి ఎలాగైనా చేయాలన్న పట్టుదల, తలంపుతో రెండేళ్లు కోవిద్ కారణంగా ఖజానా వట్టిపోయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా పథకాలు ఇచ్చారు.ఈ ఎన్నికలకు సైతం తాను చేయగలిగేవే చేస్తాను అంటూ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుకలను మాత్రం మరింతగా పెంపుదల చేస్తాను అని చెప్పారు. ఇక చంద్రబాబు మాత్రం ఎలాగూ అమలు చేయరు కాబట్టి... అలవిమాలిన హామీలన్నీ ఇస్తున్నారు...కానీ చేయి చాచి సాయం చేసేది ఎవరు... వట్టినే నోటితో మాటలు చెప్పి చేతల్లో సున్నా చుట్టేది ఎవరన్నది ప్రజలకు తెలుసు... చంద్రబాబును గత పదేళ్లుగా గమనిస్తున్న వాళ్లందరికీ అయన నిజరూపం ఏమిటన్నది తెలుసు..అందుకే అయన ఎన్ని హామీలిచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక జగన్ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పులపాల్జేస్తున్నారు అని ఆరోపించేవాళ్లకు చంద్రబాబు ఇస్తున్న భారీ హామీలు కనిపించవా ? అయన లక్షలకోట్ల ఇచ్చుకుంటూ పొతే రాష్ట్రం మరింత కుదేలవదా అనే చర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న పథకాలు ఇవ్వడమే గొప్ప... అది కూడా జగన్ ఒక్కడే చేస్తారు... వేరేవాళ్లకు సాధ్యం కాదని అవగతం చేసుకున్న ప్రజలు మళ్ళీ జగన్ మాత్రమే మనకు ఉండాలి అని నిర్ణయించుకున్నారు. -సిమ్మాదిరప్పన్న -
మోసాల బాబు వద్దు.. జగన్ ముద్దంటున్న జనం
అది కాదురా అప్పలరాజు.. కంకర్రాళ్ళు గంపెడు ఎందుకురా.. పనికొచ్చే రత్నం ఒక్కటి ఉంటె సరిపోదేట్రా.. ఎదవ సంతానం పదిమందిని కంటే యేటి లాభం.. వజ్రంలాంటి కొడుకు ఒక్కడు ఉంటె సరిపోదేట్రా.. కాయలివ్వని చెట్లు వెయ్యి ఉంటె యేటి లాభం.. పళ్ళిచ్చే మొక్క ఒక్కటి సరిపోదేట్రా.. అంటున్నారు నారాయణ.. ఒరేయ్ బాబు నీ ఎగ్జామ్పుల్స్ ఆపురా నాయిన ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావ్... హాయిగా తాటిముంజెలు తిని ప్రశాంతంగా కూకోరా అన్నాడు... అప్పలరాజు... వెంటనే నారాయణ అందుకుని.... అదేరా.. నిన్న జగన్ మ్యానిఫెస్టో ఇచ్చాడు కదా... అదైతే నాకు నచ్చిందిరా... చక్కగా రైతులకు... మహిళలకు, చిరు ఉద్యోగులకు తాను ఏమి చేయగలడో అది క్లారిటీగా చెప్పేసాడు... చంద్రబాబు మాదిరి వంద మాటలు చెప్పి రెండు అమలు చేసి మిగతావి ఎగదొబ్బే రకం కాదని లచ్ఛమంది సమక్షంలో ఒప్పుకున్నాడు.తండ్రి మాదిరి మనిషిరా... ఎక్కడా మాయ మర్మం.. ఉండవు... చెప్పేదే చేస్తాడు..చేసేదే చెబుతాడు...అదన్నమాట... అన్నాడు నారాయణ... ఐతే ఇప్పుడేమంటావ్ రా బాబు అన్నాడు అప్పలరాజు... నేనేమీ అనడం లేదురా.. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నాయకుడు మనకు ఉండాల... చంద్రబాబు మాదిరి వెయ్యి మాటలు చెప్పి... రెండో మూడో అమలు చేసి కాదన్నా మ్యానిఫెస్టోను దాచేసేవాడు మనకు వద్దురా బాబు... ఎంత చేయగలడో... అదే చెప్పాడు.. కాబట్టి నాకు మరొక్కసారి జగన్ నచ్చాడురా... అన్నాడు.. నారాయణ.. నువ్వన్నదీ నిజమేరా.. అలా నిజాయితీగా చేసేవాళ్ళు... చెప్పేవాళ్ళు లేరిప్పుడు... ఇక చంద్రబాబు ఐతే మొత్తం మాయ చేస్తాడు... అలాంటివాళ్లను ఇప్పటికే మూడుసార్లు నమ్మి మునిగిపోయాం చాలురా బాబూ... అనుకుంటూ తాటిముంజెలు తింటూ కూర్చున్నారు ఇద్దరు...అమలు చేయని హామీలు ఎన్ని ఇస్తే ఏమి లాభం... కదలని చెక్క గుర్రం ఎంత బావుంటే ఏమి లాభం.... పాలివ్వని ఆవు ఎంత అందంగా ఉంటె ఏమి లాభం... అలాగే అమలు చేయని మ్యానిఫెస్టోలో ఎన్ని పథకాలు ఎన్ని హామీలు ఉంటె ఏమి లాభం... అందుకే చెప్పేదే చేస్తాం... చేసేదే చెబుతాం .... విశ్వసనీయతే మా ప్రాణం... ఇచ్చిన మాట మీద నిలబడడమే మా విశ్వసనీయత అంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసిన మ్యానిఫెస్టో ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆకాశాన్నంటే హామీలు లేవు...ఇంటింటిలో బంగారం గుమ్మరిస్తాం అనే బొంకులు లేవు.. ఊరూవాడా పందిరివేస్తాం... రోజూ మీకు విందుభోజనాలు పెడతాం అనే మాయలు లేవు... రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ...ఎక్కడెక్కడ .. ఏఏవర్గాలకు ఏయే విధంగా మరింత మేలు చేయగలమో అక్కడక్కడా అలా చేస్తూ వెళతాం అంటూ హామీ ఇచ్చారు.. అమ్మఒడి .. రైతుభరోసా వంటివి ఆయావర్గాలకు మేలు చేస్తాయి.ఇక మిగతా పథకాలు ఇప్పటికే అమలులో ఉన్నవి వాటిని యథాతథంగా కొనసాగిస్తారు... అన్నిటికీ మించి చంద్రబాబు మాదిరిగా నోటికొచ్చింది చెప్పడం, తరువాత మాట తప్పడం జగన్ వద్ద ఉండదు.. ఏది చెబుతారో అదే చేస్తారన్న నమ్మకం ప్రజల్లో ఉండడంతో ఉన్నవి చాలు... ఈ మాత్రం సరిగ్గా అమలైతే ఇంకేం కావాలి... చంద్రబాబు వస్తే అవి కూడా ఇవ్వడు.. మాటలు చెప్పి ఓట్లేయించుకుని మోసం చేస్తాడు అని ప్రజలు తమ అనుభవాలను గుర్తు చేసుకుంటున్నారు. జగన్ అన్న ఉంటే చాలు... ఉన్న పథకాలు అమలు చేస్తారు అనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తోంది.AP people praising cm ys jagan manifesto 2024 for ap elections:::: సిమ్మాదిరప్పన్న -
జైత్రయాత్రను తలపించిన సీఎం జగన్ బస్సుయాత్ర
నేను కోరినట్లే నాకు అధికారం ఇచ్చారు. కానీ నేను దాన్ని అధికారం అనుకోలేదు. మిమ్మల్ని చూసుకునే బాధ్యత అనుకున్నాను. ప్రతి ఇంట్లో, ప్రతివ్యక్తికి మంచి చేసే అవకాశం మీరు ఇచ్చారు అనుకున్నాను. నేనూ అలాగే నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను. ప్రతి ఇంటికి మేలు చేశాను. ఇది మీ ప్రభుత్వం. మీ తమ్ముడి ప్రభుత్వం.. మీ సోదరుడి ప్రభుత్వం గత డెబ్బై ఏళ్లలో ఏ ప్రభుత్వానికి సాధ్యం కానివి ఎన్నో చేసి చూపించాను.నేను చెప్పినవన్నీ నిజం అనిపిస్తే, నేను నిజంగా మీకు మేలు చేశాను అనిపిస్తే నాకు ఓటు వేయండి. లేదులేదు నేను మీకేమీ చేయలేదనిపిస్తే నాకు ఓటేయవద్దు అని చెబుతూ.. తన ఐదేళ్ల పాలన మీద మార్కులు వేయించుకునేందుకు ప్రజా స్పందన తెలుసుకునే నిమిత్తం సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఈరోజుతో ముగిసింది.మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైన బస్సుయాత్ర నేడు టెక్కలిలో ముగిసింది. 22 రోజుల పాటు 2100 కిలోమీటర్ల మేర జరిగిన ఈ బస్సు యాత్ర ఒక జైత్రయాత్రను తలపించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 బహిరంగ సభల్లో సీఎం వైయస్ జగన్ ప్రసంగించారు. ఆరు ప్రత్యేక సమావేశాల్లో జగన్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 86 నియోజకవర్గాలోని కోట్లమందికి స్పృశిస్తూ సాగిన ఈ యాత్ర ఒక ఆత్మీయ యాత్రగా మారింది.ఎక్కడికక్కడ మహిళలు, వృద్ధులు.. రైతులు..యువత తమ అభిమాన నాయకున్ని చూసేందుకు నిప్పులుగక్కే ఎండను సైతం లెక్క చేయకుండా వేచి ఉన్నారు. ఆయనవెంట ..ఆ బస్సు వెంట పరుగులు తీసిమరీ సెల్ఫీలు సంపాదించి దాన్ని అపురూపంగా దాచుకున్న యువతీయువకులు ఎంతోమంది. మా అన్నకు కష్టం చెప్పుకుని సాంత్వన పొందాలని భావించి ఆయన్ను కలిసి గోడువెళ్లబోసుకుని కన్నీళ్లు తుడుచుకుని భరోసాతో అన్నకు బైబై అంటూ సాగనంపిన ఆడబిడ్డలు ఎంతోమంది. మనవడా.. నువ్వు మళ్ళీ రావాలి మాకందరికీ మంచి చేయాలి అంటూ ఆశీర్వదించి పంపిన అవ్వాతాతల ఆశీర్వాదాలు ఆ బస్సులో మూటలు మూటలుగా పేరుకుపోయాయి.మామయ్యా మళ్ళీ నువ్వొస్తావుగా అంటూ వీడ్కోలు పలికిన పిల్లల చిరునవ్వులు జగన్ మోములో ప్రతిబింబించాయి. ఇలా ఒకటా రెండా.. ఎన్నో గుండెలను, ఎంతోమంది మనసులను తడుముతూ ఈ యాత్ర సాగింది. తాను గతంలో ప్రతిపక్ష నేతగా నడిచి వెళ్లిన మార్గంలో మళ్ళీ ఇప్పుడిలా, అప్పుడు ఎలా ఉండే స్కూళ్ళు ఇప్పుడెలా మారాయి అప్పుడు కష్టాలతో కన్నీళ్లు ఇంకిన కళ్ళు ఇప్పుడు తనను ఆనందం నింపిన ప్రేమతో దగ్గరకు పిలుస్తుంటే ఏ నాయకుడికి మాత్రం ఆనందం కాదు.ఈ యాత్ర మొత్తం రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని, ప్రజల మూడ్‌ను మార్చేసింది. ఎక్కడికక్కడ జగన్ మావాడే . నేను సైతం జగన్ వెంట అంటూ వేర్వేరు పార్టీల నుంచి వచ్చి చేరుతున్నవాళ్ళతో జిల్లాల్లో పార్టీ విభాగం కిక్కిరిసిపోతోంది. రానున్న ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేదానికి ఈ బస్సు యాత్ర ఒక నిదర్శనం.. మళ్ళీ వస్తాను..మీకు మరింత మంచి చేస్తాను..అని చెబుతూ జగన్ వెళుతున్న దారిని చూస్తూ ప్రజలు అరచేతుల్లోనే హారతి కర్పూరాలు వెలిగించి విజయీ భావ అంటూ ఆశీర్వదించి పంపించారు.-సిమ్మాదిరప్పన్న -
సేనానీ.. నీ ప్రాణాలకు ఉంది హాని ..
అయిపోయాయి.. అన్ని రకాల భూతవైద్యాలు.. చేతబడులు.. బాణామతి.. ఎత్తులు.. జిత్తులు ముగిశాయి. కూటమి విజయానికి చేయాల్సిన కుట్రలన్నీ చేసేశారు. ఎన్ని సపర్యలు చేసినా పక్షవాతం రోగికి చెయ్యి కాలు నోరు రానట్లే కూటమి కూడా నిస్తేజంగా మంచానపడిన రోగిమాదిరి చూస్తుందే తప్ప ప్రయోజనం లేదు. ఈ గుడ్డిగుర్రాన్ని పంచకల్యాణి మాదిరిగా మార్చి యుద్ధానికి బయల్దేరుదాం అనుకున్న చంద్రబాబుకు నిరాశే మిగులుతోంది. పవన్ కల్యాణ్‌కు చేర్చుకోవడం ద్వారా కాపుల ఓట్లు గంప గుత్తగా కొట్టేద్దాం. దాదాపు యాభై నియోజకవర్గాల్లో కాపులకు ప్రాబల్యం ఉంది కాబట్టి అవనీ హోల్‌సేల్ లాక్కోవచ్చని భావించి 21 సీట్లు ఇచ్చినా అదీ పెద్ద వర్కవుట్ కావడం లేదు.పవన్ ప్రభావం భారీగా ఉంటుందని ఆశించిన తూర్పు గోదావరి జిల్లాలోనే దాని ఫలితం అంతంతమాత్రం అని తెలుస్తోంది. గోదావరికి వరదలు తెచ్చే స్థాయిలో ఓట్లు తెస్తాడు అనుకున్న పవన్ సైతం పిఠాపురంలో గెలుపు కష్టమే అని ఎదురీదుతున్న తరుణంలో ఇక బాబులో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఏమి చేస్తే ఈ బతుకు బాగవుతుంది దేవుడా అనుకుంటున్నా తరుణంలో అయన ఇంకో కుట్రకు కూడా పాల్పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కు హాని తలపెట్టి ఆ అఘాయిత్యాన్ని ప్రభుత్వం మీదకు నెట్టేసేందుకు సైతం కుట్ర పన్నుతున్నట్లు జనసైనికులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందుగానే తమకు అనుకూలమైన పత్రికల్లో వార్తలు, కథనాలు రాయించి ఎన్నికల ముందు పవన్ మీద దాడి చేయించి దాన్ని ప్రభుత్వం వైఫల్యం అని బుకాయించి ఆ గాయాల నుంచి లభ్ది పొందాలని టీడీపీ, చంద్రబాబు కుట్ర పన్నుతున్నట్లు సందేహాలున్నాయి. ఈమేరకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు ఒక అవగాహనా కుదిరిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ విషయం మీద ఇప్పటికే పవన్ కూడా పలు సార్లు కామెంట్లు చేశారు. తనమీద దాడులు చేసేందుకు రౌడీలు సిద్ధంగా ఉన్నారని, బ్లేడ్లు పట్టుకుని తమవాళ్లను కోస్తున్నారని కూడా అన్నారు. అంతే కాకుండా తానూ ఎలాంటి దాడులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ రెచ్చగొడుతున్నారు. చూస్తుంది బయటివాళ్ల సంగతి ఏమోకానీ చంద్రబాబు పురమాయించినవాళ్ళే పవన్ మీద దాడి చేసి, అయ్యో..మన బిడ్డకు ఘోరం జరిగిందని కొందరు అద్దె మనుషుల ద్వారా డ్రామా నడిపించి కాపుల ఓట్లు దండుకునేందుకు కుట్రలకు తెగబడవచ్చని జనసైనికులు, ఇంకా చంద్రబాబు నైజం తెలిసినవాళ్ళు అంటున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో చంద్రబాబును మించినవాళ్లు లేరని, రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతటికైనా దిగజారుతారని తెలిసినవాళ్ళు గుర్తు చేస్తున్నారు. అందుకే పవన్... నువ్వు జరంత పైలం బిడ్డా అని జాగ్రత్తలు చెబుతున్నారు.- సిమ్మాదిరప్పన్న -
కూటమికి వెంటిలేటర్ తీసేసినట్లేనా?
రెండు కాళ్లూ పడిపోయి చంకల్లో కర్రలు పెట్టుకుని దేకుతూ వెళ్తున్నవాడి కర్రలు ఫాట్ మని లాగేస్తే ఏమవుతుంది? అన్ని అవయవాలూ పని చేయడం మానేస్తూ.. ఒక్కోటీ విశ్రమిస్తుంటే.. ఏదోలా ఆయువును నిలుపుతున్న వెంటిలేటర్‌ను ఆపేస్తే ఏమవుతుంది. ఏదోలా గౌరవ ప్రదమైన స్కోర్ చేస్తాడు అనుకున్న బ్యాట్స్ మ్యాన్ రెండో బంతికే అవుటైతే ఎలా ఉంటుంది.. గోల్డ్ మెడల్ తెస్తాడు అనుకున్నవాడు డోపింగ్ టెస్టులో దొరికిపోతే ఏమవుతుంది.. ఆ అందరి ఆశలూ గల్లంతవుతాయి. భవిష్యత్ అంధకారమవుతుంది.. కొన్ని జీవితాలు ముగిసిపోతాయి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిణామం కూడా అచ్చం అలాంటిదే. తెలుగుదేశం.. జనసేన.. బీజేపీ.. ఇంకా కాంగ్రెస్ నాయకులూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక్కటంటే ఒక్క కారణం, రాజకీయ ఆధారం కనిపించడం లేదు. గతంలో టీడీపీ- జనసేన-బీజేపీ కలిపినా ఉమ్మడి పాలనలో రాష్ట్రానికి ఏమి చేశారన్నది వాళ్లు ఒక్క ముక్కా చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధిలను మిళితం చేసి రుచి చూపించిన పాలనకు ప్రజలు ఫిదా అయ్యారు. ఈసారి కూడా జగన్ మళ్లీ గెలవాలని రైతులు.. మహిళలు.. యువత.. పేదలు... దళితులూ.. మైనారిటీ గిరిజనవర్గాలు బలంగా కోరుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం తీసుకొచ్చిన సంక్షేమ పథకాల జాబితా సూపర్ సిక్స్ ను ప్రజలు నమ్మడం లేదు... ఎందుకంటే బాబుకున్న ట్రాక్ రికార్డ్ అలాంటిది మరి. అందుకే సూపర్ సిక్స్ పెద్ద అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో కూటమి నాయకులూ యావత్తు.. తాము మూడుసార్లు గెలిచాక ఏమి చేసాం.. మళ్ళీ గెలిస్తే ప్రజలకు ఏమి చేస్తాం అనేది చెప్పకుండా ఐదేళ్ల క్రితం జరిగిన వివేకానందరెడ్డి హత్యకేసును ప్రచారాంశంగా మార్చుకుని పదేపదే అదే అంశాన్ని మాట్లాడుతున్నారు. మాటిమాటికీ హూ కిల్డ్ బాబాయ్ అని చంద్రబాబు అరుస్తూ ఆ హత్యకేసును సీఎం వైయస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డికి చుట్టేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇదే ఎజెండాను అటు వివేకా కుమార్తె సునీత, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, పవన్ కళ్యాణ్, ఆఖరుకు బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్మోహన్రెడ్డిని దోషిగా మార్చేందుకు యాతన పడుతున్నారు. వాస్తవానికి ఈ కేసు ఇప్పటికే సీబీఐ విచారణలో ఉండగా ఈ కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ విచారించింది. కోర్టులో ఉన్న ఈ అంశాన్ని పదేపదే ప్రజల్లోకి తీసుకెళ్లడం అనైతికమని చంద్రబాబుకు తెలుసు కానీ అది మినహా వేరే అంశం తనకు లేకపోవడంతో ఎంతసేపూ వివేకా హత్య అంశమే ప్రచారాంశం అవుతోయింది. దీంతో ఇక ఈ హత్య కేసును ఆ అంశాన్ని ప్రచారంలో వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని వైసీపీ నేత సురేష్‌బాబు కడప కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన పిటిషన్‌ను బలపర్చిన న్యాయస్థానం వైఎస్ షర్మిళ, సునీత, చంద్రబాబు, పవన్, లోకేష్.. పురందేశ్వరి ఇలా ఎవరూ ఆ హత్య కేసును ప్రచారంలో ప్రస్తావించరాదని కోర్టు ఆదేశించింది. దీంతో కూటమి నాయకులకు గొంతులో వెలక్కాయ పడినట్లు అయింది. ఇన్నేళ్ల పాలనలో తాము చేసింది కానీ.. చేయబోయేది కానీ చెప్పుకునేందుకు ఒక్కటీ లేని పరిస్థితుల్లో కేవలం ఆ హత్య కేసుని పదేపదే సభల్లో ప్రస్తావించి పబ్బం గడుపుకుందాం అనుకున్న చంద్రబాబుకు ఇది షాకింగ్ వార్త.. ఇక ఈ అంశం మాట్లాడకుండా ఎన్నికల సభలు ఎలా నిర్వహిస్తారో ఆయనకు.. లోకేష్.. పవన్.. పురందేశ్వరికి తెలియాలి. ఇక చేయడానికి ఏమీ లేని తరుణంలో చంద్రబాబు ఎలా ముందుకు వెళ్తారో.. ప్రజలను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి.. -సిమ్మాదిరప్పన్న -
పవన్ కల్యాణ్ Vs పవన్ కల్యాణ్.. పిఠాపురంలో విచిత్ర పరిస్థితి
పనివాడు పందిరి వేస్తె పిచ్చుకలొచ్చి పడగొట్టాయి అన్నట్లుగా పవన్ కల్యాణ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ బుగ్గైపోతోంది. గతంలో జగన్‌ను సీఎం కానివ్వను.. ఇది శాసనం.. అని భారీ డైలాగులు కొట్టిన పవన్ కట్ చేస్తే గాజువాక, భీమవరం రెండుచోట్లా ఓడిపోయారు. ఇటు జగన్ రాజాలాగా సీఎంగా అసెంబ్లీకి వెళ్లారు. ఈసారి కూడా పవన్ గట్టిగానే మాట్లాడారు. హే జగన్ నిన్ను అదః పాతాళానికి తొక్కేస్తా అన్నారు... డైలాగ్ ఐతే ఎవరో రాసింది సులువుగా చెప్పేశారు కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని తొక్కడం సంగతి అటుంచి ఈ భారీ డైలాగ్స్ పవన్ పాలిట సంకటంలా మారాయి. ఈసారి టార్గెట్ మిస్సవ్వకూడదని గట్టిగా డిసైడైన పవన్ భూతవైద్యులు, కోయదొరలను, ఎరుకలసాని, గవ్వలు రాళ్లతో భవిష్యత్ చెప్పేవాళ్ళు, కొండదొరలను సైతం సంప్రదించి..చంద్రబాబు సలహాతో కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండేచోట పిఠాపురంలో పోటీ చేయాలనీ డిసైడయ్యారు. ఎంసెట్‌లో రెండుసార్లు మూడేసి లక్షల ర్యాంకులతో కుదేలైపోయి ఏందీ.. ఈసారీ ఎంసెట్ రాలేదా.. అదేంటి.. బాగా చదవాలమ్మా అని చుట్టాలు ఇచ్చే బోడి సలహాలతో విసిగిపోయి...సిగ్గుతో చచ్చిపోయిన పిల్లాడిమాదిరి పరువుపోగొట్టుకున్న పవన్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో అయినా ఎంసెట్ కొట్టాలన్న స్టూడెంట్ లెక్క ఈపాలి ఎలాగైనా అసెంబ్లీలో అధ్యక్షా అనాలన్న కసిమీద ఉన్నారు. అందుకే పిఠాపురంలో గెలుపుకోసం గతంలో తాను పేకాట క్లబ్బుల ఓనర్ అని విమర్శించిన వర్మ ఇంటికే వెళ్లి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సి వచ్చింది. నా గెలుపు నీ చేతిలో ఉందంటూ పవన్ మోకరిల్లారు.. సరే వర్మ పని చేస్తాడు అనుకుంటున్న తరుణంలో ఈయన పిఠాపురం వెళ్లేసరికి అక్కడ ఇంకో పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడు.. ఆయనకూడా అచ్చం ఈయన మాదిరిగానే మెడ మీద చెయ్యివేసి రుద్దుకుంటూ... సరిగ్గా నిలబడకుండా ఊగిపోతూహ..హ..అంటుంటే ఎవుడ్రా నువ్వూ అంటూ కొందరు ఆయన్ను ప్రశ్నించారట.. ఏయ్ నేను పవన్ కళ్యాణ్.. ఎస్..నేనే పవన్ కళ్యాణ్ అంటున్నారాయన..ఇంతకూ ఎవరా అని చూస్తే అయన నవరంగ్ నేషనల్ పార్టీ అభ్యర్థి అని, అయన పేరుకూడా కె. పవన్ కళ్యాణ్ అని, తాను పిఠాపురంలో బకెట్ గుర్తు మీద పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈసారి పిఠాపురంలో తానే గెలుస్తానని అయన అంటున్నారు. ఆ బకెట్ గుర్తు చూడడానికి గాజు గ్లాసు గుర్తు మాదిరిగానే ఉండడంతో నిరక్షరాస్యులు ఓటేసేటపుడు గందరగోళానికి గురై గాజు గ్లాసును బదులుగా ఈ బకెట్ గుర్తుమీద నొక్కేస్తే ఎలా అని జనసేనాని ఆందోళన చెందుతున్నారు. ఇలా ఓ రెండు మూడు వేల ఓట్లు ఆ బకెట్ గుర్తు పాలైనా తనకు ఓటమి తప్పదని జనసేనాని టెన్షన్ పడుతున్నారు. అందుకే దరిద్రుడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం వదలడం లేదని పెద్దలు అంటారు. -సిమ్మాదిరప్పన్న. -
ఇది ఖచ్చితంగా క్లాస్ వార్.. పేదలపై పెత్తందారుల దాడి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద శనివారం రాత్రి విజయవాడలో జరిగిన రాళ్ల దాడి వెనుక చాలా సామాజిక రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దాడి ఒక ఆకతాయి పని కాదని, ఒక తుంటరి కుర్రాడు చేసిన పని కాదని, ఆ ఘటన వెనుక పెద్ద పన్నాగమే ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా సీఎం జగన్ వేస్తున్న అడుగులు, ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పెత్తందారులకు కంటగింపుగా, కడుపు మంటగా మారాయని, ఆ క్రమంలోనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి నుంచీ రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతోమంది మేధావులు, సామాజికవేత్తలను ఆలోచింపజేస్తున్నాయి. మొదటి నుంచీ తాను పేదల ప్రతినిధిని అని, పేదలు, బీసీలు ఇతర అణగారిన వర్గాలకు నాయకుడిని అని పదేపదే చెప్పడమే కాకుండా టిక్కెట్లు ఇచ్చే సమయంలో తాను తన మాటకు ఏ విధంగా కట్టుబడిందీ చేసి చూపించారు. రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు మొత్తం 200 ఉండగా అందులో వంద స్థానాలు.. అంటే యాభై శాతం సీట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించారు. విశాఖ, నరసరావుపేట వంటి లోక్‌సభ స్థానాలను సైతం బీసీలకు కేటాయించారు. ఇన్నాళ్ళూ ఆర్థికంగా బలవంతులు, అగ్రవర్ణాలు, సామాజికంగా రాజకీయంగా పెత్తందారీ పాత్ర పోషించిన వర్గాలకు ఇప్పుడు సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు శరాఘాతంగా మారాయి. రూల్స్ మావి రూలింగ్ మాది.. గవర్నమెంట్ మాది.. అసలు మేమే గవర్నమెంట్ అనే పరిస్థితిని ఆయన ఏకంగా తిరగరాశారు. దానికితోడు విజయవాడ వంటి పెత్తందారీ పోకడలున్న నగరంలో సీఎం జగన్ రోడ్ షోకు వస్తున్న అసాధారణ స్పందన చూసి వారికి కడుపు రగిలిపోయింది. పేదల ప్రతినిధిగా, సామాజిక, రాజకీయ సంస్కర్తగా ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, వేస్తున్న అడుగులు తమను రాజకీయ సమాధి చేస్తాయన్న భయాందోళనలతోనే పెత్తందారుల చెంచాలు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సీఎం జగన్‌పై జరిగిన చేసిన ఈ దాడిని ఏకంగా పేదలపై జరిగిన దాడిగా చూడాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు సీఎం జగన్ చెప్పినట్లుగానే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది క్లాస్ వార్ అని.. రానున్న ఎన్నికలు పేదలు, పెత్తందారులు మధ్య జరిగే యుద్ధానికి ప్రతీక కాబోతున్నదని ఈ దాడి స్పష్టం చేస్తోంది. -సిమ్మాదిరప్పన్న. -
సేనానిని నమ్ముకో.. ఉన్నదంతా అమ్ముకో !
తమ్ముణ్ణి సినిమాకు తీసుకెళ్లావ్..నన్నుతీసుకెళ్లలేదు..వాడికి కొత్త బట్టలు కొన్నావు,సైకిల్ కొన్నావ్..నాకు కొనలేదు అని పిల్లలు అలుగుతుంటారు..అలాంటప్పుడు తల్లి, తండ్రి వాణ్ని దగ్గరకు తీసి ఒరేయ్ చిన్నోడా అది కాదురా.. వాడికి సైకిల్ కొన్నాను కదా... నీకూ కొంటాను.. నీకు ఇంకోటి కొంటాను.. వాణ్ని సినిమాకు తీసుకెళ్ళాను కదా.. నువ్వు బాధపడకు నిన్ను జాతరకు తీసుకెళ్తాను... బాధపడకు... అని ఓదార్చాలి... అదే కుటుంబం బాధ్యత. అదే విధంగా పార్టీలో ఉన్నవాళ్లందరికీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వడం సాధ్యం కాకపోవచ్చు.. అలాంటప్పుడు పిలిచి ఇదిగోవయ్యా.. నువ్వు బాగానే కష్టపడ్డావు కానీ నీకు నేను టికెట్ ఇవ్వలేకపోతున్నాను.. దానికి ఏవేవో కారణాలు ఉన్నాయ్.. కాబట్టి ఏమీ అనుకోకు.. పార్టీ కోసం పని చేయండి.. గెలిస్తే మిమ్మల్ని తప్పక గౌరవిస్తాం అని చెప్పాల్సిన బాధ్యత పార్టీ అధినేత మీద ఉంటుంది. కానీ జనసేనాని వీటన్నిటికీ అతీతంగా ఉంటారు.. టికెట్లు తనకు నచ్చినవాళ్లకు ఇచ్చుకుంటారు. తిరుపతిలో కిరణ్ రాయల్ కావచ్చు.. విజయవాడ వెస్ట్ లో పోతిన మహేష్..ఇలా ఎన్నో జిల్లాల్లో ఎంతోమంది పవన్ కోసం పదేళ్లుగా పని చేస్తూ లక్షలు, కోట్లు తగలేశారు. ఇన్నేళ్ళుగా వాళ్ళను వాడుకుని అక్కడ పార్టీ ఉనికిలోకి వచ్చాక.. ప్రజల్లో కాస్త గుర్తింపు వచ్చాక అక్కడి సీటును వేరేవాళ్లకు ఇచ్చుకోవడం, ఇదేమంటే పొత్తు ధర్మం అని, త్యాగాలకు సిద్ధం కావాలని సమర్థించుకోవడం పవన్ కు అలవాటుగా మారింది. పోతిన మహేష్ టికెట్ బీజేపీకి అంటే సుజనా చౌదరికి ఇవ్వడానికి వెనుక కోట్లు చేతులుమారాయని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇలా పవన్‌ను నమ్ముకుని బికారులు అయిపోయినవాళ్లు రాష్ట్రవ్యాప్తంగా పదులసంఖ్యలోనే ఉన్నారు అయితే ఏనాడూ.. పవన్ అలా నష్టపోయిన లేదా మోసపోయినవాళ్లను పిలిచి వాళ్ళతో మాడ్లాడడం కానీ... వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా..హామీ కానీ ఇచ్చినట్లు వినలేదు. మాకు పవన్ మద్దతుగా ఉంటామన్నారు అని ఇంతవరకూ ఏ ఒక్క నాయకుడూ చెప్పలేదు. ఆంటే ఆయనది అంతా తన ఇష్టానుసారం. తనకు నచ్చినవాళ్లకు టికెట్లు ఇచ్చుకోవడం.. ఆయన్ను నమ్ముకుని మునిగిపోయినవాళ్లు పోవడం.. అంతే తప్ప...కనీసం వాళ్ళ బాధను చెప్పుకోవడానికి కూడా పార్టీలో ఇంకో వ్యక్తి, ఇంకో నాయకుడు లేకపోవడం ఇక్కడ దారుణం. దీంతో బాధితుల రోదన అరణ్య రోదన అవుతోంది తప్ప వాళ్ళ గోడు వినేవాళ్ళు లేకుండాపోయారు. దీంతో ఎక్కడికక్కడ జిల్లాలు.. నియోజకవర్గాల్లో పార్టీని మోసి మోసపోయిన జనసేన నాయకులంతా ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తూ తమ దారితాము చూసుకుంటున్నారు. తాను పిఠాపురంలో గెలిస్తే చాలు..పార్టీ మొత్తం ఏమైపోయినా ఫర్లేదు...అనే భావనలో పవన్ ఉండడంతో క్యాడర్ సైతం మెల్లగా సైడ్ అయిపోతున్నారు. --సిమ్మాదిరప్పన్న -
Nara Lokesh: కూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తాడా
కూట్లో రాయి తీయలేనివాడు... ఆంటే తింటున్న అన్నంలో చిన్న రాయిని తీయాలని లోకేష్ ఏకంగా ఏట్లోని అంటే నదిలోని రాయిని తీస్తాడా అనే సందేహం క్యాడరుకు వస్తోంది. మూడుశాఖలకు మంత్రిగా పని చేసి మంగళగిరిలోనే ఓడిపోయినా లోకేష్ పక్క రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేస్తారా? అంత ధైర్యం దేనికి అనే పంచులు పేలుతున్నాయి. వాస్తవానికి లోకేష్ యువగళం పేరిట భారీగా పాదయాత్ర చేసినా పార్టీకి కానీ ఆయనకు కానీ పెద్ద మైలేజి రాలేదు. దేంతోబాటు అయన తిండి యావ. తింగరి మాటలు కలిసి అయన ప్రతిష్టను మరింతగా దిగజార్చాయి. దీంతో ఆయన్ను మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి తిప్పాలన్న చంద్రబాబు ఆలోచనలకూ పార్టీ నాయకులు గండి కొట్టారు. లోకేష్‌ను మళ్ళీ తమ నియోజకవర్గాలకు పంపించవద్దని, తామే ఏదోలా ప్రచారాన్ని పూర్తిచేసుకుంటామని చంద్రబాబుకు చెప్పడంతో అయన తన కొడుకు కాళ్లకు బంధనాలు వేసి అమరావతి మినహా ఇంకెక్కడికీ వెళ్లోద్దని సూచించారు. అంటే లోకేష్‌కు ప్రస్తుతం అమరావతిలో గెలుపే పెద్ద టాస్క్ అన్నమాట. చదవండి: సీఎంగా మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం: మంత్రి బొత్స ఇదిలా ఉండగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో సైతం గెలిపించేందుకు యాతనపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులో ఉన్నపుడే బీజేపీ.. టీడీపీ మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో ఎక్కడబడితే అక్కడ టీడీపీ బీజేపీ క్యాడర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు లోకేష్ ఏకంగా తమిళనాడు వెళ్లి అక్కడ బీజేపీకోసం ప్రచారం చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీశాఖ చెబుతోంది. తమిళనాడులోని కోయంబత్తూరులో లోకేష్ రోడ్డు షో.. ప్రచారం.. సభలో సైతం మాట్లాడతారని బీజేపీచెబుతోంది. కోయంబత్తూరు ఆ చుట్టుపక్కల తెలుగువాళ్లు. ముఖ్యంగా లోకేష్ సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఓట్లు ఉండడంతో ఆ ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు బీజేపీ శాఖ ట్విట్టట్లో పెట్టిన ఈ పోస్టు చూసి ఆంధ్రాలో అప్పుడే పంచులు పేలుతున్నాయి. నీ మంగళగిరిలోనే నువ్వు గెలుస్తావో లేదో నీకే తెలీదు.. అలాంటిది నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్లి అక్కడేం సాధిస్తావు పప్పూ అంటూ సెటైర్లు వేస్తున్నారు, వాస్తవానికి లోకేష్ ఈసారి కూడా మంగళగిరిలో గట్టిగా కష్టపడితే తప్ప గెలుస్తారో లేదో తెలియని పరిస్థితి అలాంటపుడు అయన ఇక్కడ వదిలేసి పక్కరాష్ట్రానికి ఎందుకు వెళ్లడం అనే ప్రశ్నలు.. వస్తున్నాయి. - సిమ్మాదిరప్పన్న -
పవన్‌కు వీళ్లా స్టార్ క్యాంపెయినర్లు!
పెళ్లి కార్డు చూసి.. అందులోని కుటుంబాలు.. బంధువుల తీరు చూసి అది ఎంత గొప్ప సంబంధమో చెప్పేయొచ్చు. సినిమా పోస్టర్‌లోని పేర్లు చూసి.. అంటే హీరో హీరోయిన్లు.. డైరెక్టర్.. మ్యూజిక్.. విలన్స్.. ఇతర టెక్నీషియన్స్‌ను చూసి అది ఎలాంటి కాంబినేషలో చెప్పేయొచ్చు. క్రికెట్ టీమ్ లోని సభ్యులను బట్టి ఆయా జట్టు ఎంత బలమైందో ఒక అంచనాకు రావచ్చు. అదే విధంగా ఒక రాజకీయ పార్టీ తానూ ఎంపిక చేసుకున్న అభ్యర్థులను బట్టి.. దానికోసం ఆ పార్టీ చేసిన కసరత్తును బట్టి.. ప్రచార శైలిని బట్టి దానికి రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం ఉంది.. ఆ పార్టీ గమనం ఎలా ఉంటుందో చెప్పవచ్చు. అందుకే పెద్దలు కాళ్ళు తొక్కినపుడే కాపురం కళ తెలిసిపోతుందని అనేవాళ్ళు. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో జనసేన ప్రకటించిన అభ్యర్థుల ప్రొఫైల్స్ చూసి ప్రజలు.. కార్యకర్తలు నీరుగారిపోగా ఇప్పుడు ఆ పార్టీ తరఫున ప్రచారం చేసే ప్రధాన ప్రచారకర్తలు (స్టార్ క్యాంపెయినర్లను) చూసి కూడా జనం నివ్వెరపోతున్నారు. మొత్తానికి జబర్దస్త్ నటులతో ఈ 2024 ఎన్నికల స్కిట్ పూర్తి చేస్తావ్ అన్నమాట. రాజకీయాలంటే మీ @JanaSenaParty కి అంత కామెడీ అయిపోయాయి! ప్రజాసేవ మీ దృష్టిలో కామెడీ అయిపోయింది. ఇక మీకు రాజకీయాలెందుకు, డైలీ డబ్బులు వచ్చే కామెడీ స్కిట్లు, సినిమా కాల్షీట్లు చూసుకోండి! #PackageStarPK… https://t.co/4Sh27uDfyq — YSR Congress Party (@YSRCParty) April 10, 2024 వాస్తవానికి ఏదైనా పార్టీ తరఫున ప్రముఖ రాజకీయ నాయకుడు.. లేదా పెద్ద క్రీడాకారుడు.. సినిమా స్టార్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుంటారు కానీ, జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం జబర్దస్త్.. ఇతర టీవీ షోల్లో కామెడీ కార్యక్రమాలు వేసే కామెడియన్లను స్టార్ క్యాంపెయినర్లుగా ప్రకటించారు. డాన్స్ మాస్టర్ జానీ.. హైపర్ ఆది.. గెటప్ శీను, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ఇలాంటివాళ్లను స్టార్ క్యాంపెయినర్లుగా పెట్టుకుని రాజాకీయ ప్రచారం చేస్తున్నారు. అసలు వాళ్లకు రాజకీయాలు గురించి ఏమైనా తెలుసా? వాళ్లకు కనీస అవగాహనా అయినా ఉందా.? అసలు ఆ పార్టీని నెత్తినపెట్టుకుని మోయాల్సిన అవసరం.. ఆ జనసేనకు వత్తాసు పలకాల్సిన అవసరం వాళ్లకు ఏముందనున్నది అర్థం కానీ విషయం. ఇక పార్టీలో కేవలం చందాలు వసూళ్లకు మాత్రమే ముందుకు వచ్చే నాగబాబు ఎక్కడా ప్రచారసభల్లోకి వెళ్లడం లేదు. పోనీ జనసేన పోటీ చేస్తున్న చోట్ల కూడా నాగబాబు ప్రచారం చేయడం లేదు. ఇదిలా ఉండగా కేవలం కొద్దిమంది టీవీ ఆర్టిస్టులు మినహా పవన్ వెంట ఎవరూ కనిపించడం లేదన్నది మరోమారు స్పష్టమైంది. పవన్‌కు రాజకీయాలు అంటే ఎలాంటి అభిప్రాయం.. ఎలాంటి దృక్పథం ఉందన్నాడో ఈ ప్రచార కమిటీ చూస్తే తెలుస్తోందని అప్పుడే సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతున్నాయి. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తమ ప్రభుత్వంలో ప్రయోజనాలు పొందినపేదలు, లబ్దిదారులే తమ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు అంటున్నారు. -సిమ్మాదిరప్పన్న -
టీడీపీలో కొత్త ట్విస్ట్.. అసలు ‘వరుడు’ ఆయనేనా?
మంగళవాయిద్యాలు మోగుతుంటాయి.. పందిట్లో అందరూ సందడిగా ఉంటారు.. వధువు సిగ్గుల మొగ్గ అవుతుంది.. ఇటు వియ్యాలవారు కబుర్లు.. పిల్లల ఆటలతో అంతా కోలాహంగామా ఉంటుంది. ముహూర్తం టైం అవుతోంది.. వధువును పీటలమీద కూర్చోబెట్టండి.. అమ్మ నువ్వు జడ ఎత్తి పట్టుకోమ్మా.. బాబూ పెళ్ళికొడుకు నువ్వు తాళి కట్టు బాబు.. ఏయ్ భజంత్రీలు మోగించడమ్మా అంటాడు పంతులు. పెళ్ళికొడుకు లేచి తాళి కట్టబోతుండగా హఠాత్తుగా ఆహూతుల్లోంచి ఒకరు ఆపండీ.. డీ.. డీ.. ఈ.. ఈ.. అని అరుస్తారు. అక్కడంతా సైలెన్స్.. ఏమి జరుగుతుందో తెలీదు. ఎందుకు ఆపమన్నారో అర్ధం కాలేదు. వధువు.. ఆమె తల్లిదండ్రుల్లో కన్ఫ్యూజన్.. అంతలో ఒక పెద్దాయన వచ్చి అసలు వరుడు వీడు కాదు.. వీడు డూప్లికేట్.. అసలైనవాడు ఇప్పుడొచ్చాడు.. వాడే అసలు పెళ్ళికొడుకు.. నువ్వెళ్ళి తాళి కట్టుబాబూ అంటాడు. అప్పుడు ఒరిజినల్ వాడు వెళ్లి తాళి కట్టి.. ఆ పెళ్లి తంతు ముగిస్తాడు. వాస్తవానికి ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇప్పటికైతే కూటమి తరఫున తమకు వాటాగా వచ్చిన 144 స్థానాల్లో అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ.. వాళ్లతో మాత్రం ప్రచారం చేయిస్తోంది. అయితే, అందులో ఇంకా కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వాళ్ళను ఎదుర్కొనే సత్తా లేదని భావించిన కొన్ని స్థానాల్లో తమ వాళ్ళను మార్చేందుకు చంద్రబాబు ప్లాన్ వేసినట్లు సమాచారం. ఉదాహరణకు ఉండి ఎమ్మెల్యేగా విజయరామరాజుకు టిక్కెట్ ప్రకటింపచేయగా ఆయన ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో మళ్ళీ రఘురామకృష్ణంరాజును అభ్యర్థిగా ప్రకటించారు. అంతేకాకుండా జగపతినగరానికి కొండపల్లి శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించగా ఆయన జనంలోకి వెళ్తున్నారు. అయితే, అక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి అప్పలనర్సయ్యను ఓడించడం శ్రీనివాస్‌కు సాధ్యం కాదని భావించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ను మార్చాలని చూస్తున్నారట. అలాగే టీవీల్లో అడ్డం దిడ్డంగా మాట్లాడటం ద్వారా పాపులర్ అయిన కొలికపూడి శ్రీనివాస్‌కు తిరువూరు టిక్కెట్ ఇచ్చారు. అయితే, టీవీల్లో వాగడం వేరు.. జనాల్లో తిరగడం వేరని పార్టీకి ఇప్పటికే అర్థం అయిందని, దీంతో ఆయన్ను కూడా పక్కన బెట్టేసి ఇంకో వ్యక్తిని చూస్తున్నారని అంటున్నారు. పాతపట్నంలో వైస్సార్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతి మీద పోటీకి మామిడి గోవిందరావును ప్రకటించారు. ఈ నెలన్నర తరువాత అబ్బె.. ఆయన సరిపోవడం లేదని తేలిందట. దీంతో రెండో కృష్ణుడు రాబోతున్నట్లు రూమర్లున్నాయి శ్రీకాకుళం, సత్యవేడు ఇలా ఇంకొన్ని చోట్ల రెండు.. మూడో కృష్ణుడు రాబోతున్నట్లు టీడీపీ కేడర్‌లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఎన్నికల వరకూ.. బీ ఫారం వచ్చేవరకూ ఎవరూ శాశ్వతం కాదని వేదాంత ధోరణిలో కేడర్ పని చేస్తోంది. -సిమ్మాదిరప్పన్న. -
చిరంజీవి దారెటు.. సభ్యత్వం ఇక్కడ.. విరాళం అక్కడ
మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఒక్కోసారి ఒక్కోలా వినూత్నంగా, విచిత్రంగా వ్యవహరిస్తుంటారు. అటు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీఆర్ఎస్ ప్రభుత్వంతోనూ, ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంతోనూ సఖ్యతగా ఉంటారు. కొన్నాళ్ళకు బీజేపీ వాళ్లతో బావుంటారు. ఇంకోరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫోటో దిగుతారు. అలా సందర్భాన్ని బట్టి అల్లుకుపోతుంటారు. ఇదిలాఉండగా ఆయన తాజాగా జనసేనకు రూ.ఐదు కోట్ల విరాళం ఇచ్చిన అంశం పెద్దగా చర్చకు వచ్చింది. తాను కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే కాంగ్రెస్‌కు మాత్రం రూపాయి విరాళం ఇవ్వలేదు కానీ.. తన తమ్ముడి జనసేన పార్టీకి మాత్రం రూ. 5 కోట్లు విరాళం ఇచ్చారు. ఇక, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం చిరంజీవి ఇంకా తమ పార్టీ నాయకుడే అంటున్నారు. వాస్తవానికి చిరంజీవి ఇంకా కాంగ్రెస్‌లో కొనసాగుతూనే ఉన్నారు. ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. దీంతోబాటు ఆయన్ను కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా కూడా పలుమార్లు చెబుతూ వచ్చింది. కానీ, ఆయన మాత్రం అటు కాంగ్రెస్‌తో పెద్దగా రిలేషన్ కొనసాగించకుండా అంటీముట్టనట్లుగా ఉన్నారు. బీజేపీ, నరేంద్ర మోదీతో కూడా ఆయన మంచి సంబంధాలనే కలిగి ఉన్నారు. ఆ మధ్య ఆంధ్రకు వచ్చి, భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సైతం హాజరైన మోదీ అప్పట్లో చిరంజీవితో సఖ్యతగానే మెలిగారు. మొత్తానికి ఇప్పుడు ఆయన తమ్ముడికి మద్దతుగా ఆర్థిక సాయం అందజేశారు. ఇదిలా ఉండగా అటు కాంగ్రెస్ నాయకులు చింతా మోహన్.. గిడుగు రుద్రరాజు వంటివాళ్ళు సైతం చిరంజీవిని ఇంకా తమవాడేనని, ఆయన తమ కోసం ప్రచారం చేస్తారని అంటున్నారు. అయితే, అసలుకు చిరంజీవి కేవలం టాక్స్ ఎగ్గొట్టడానికి అలా విరాళం ఇచ్చారు తప్ప సీట్లు, పార్టీని అమ్ముకున్న పవన్ కళ్యాణ్‌కు ఈ విరాళాలు ఎందుకని కొందరు అంటున్నారు. మరోవైపు చిరంజీవి కేవలం విరాళంతో ముగిస్తారా లేక జనసేన తరఫున ప్రచారం చేస్తారా? అనే చర్చ కూడా నడుస్తోంది. అయితే, అటు కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న చిరంజీవి.. తమ్ముడి కోసం ఎలా ప్రచారం చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో, అదంతా ఫామిలీ డ్రామా తప్ప ఇంకేం లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చేశారు. - సిమ్మాదిరప్పన్న. -
టీడీపీలో మరిన్ని మార్పులు?!
మంగళ వాయిద్యాలు మోగుతుంటాయి.. పందిట్లో అందరూ సందడిగా ఉంటారు.. వధువు సిగ్గుల మొగ్గ అవుతుంది.. ఇటు వియ్యాలవారు కబుర్లు.. పిల్లల ఆటలతో అంతా కోలాహంగామా ఉంటుంది. ముహూర్తం టైం అవుతోంది.. వధువును పీటలమీద కూర్చోబెట్టండి.. అమ్మ నువ్వు జడ ఎత్తి పట్టుకోమ్మా.. బాబూ పెళ్ళికొడుకు నువ్వు తాళి కట్టు బాబు... ఏయ్ భజంత్రీలు మోగించడమ్మా అంటాడు పంతులు.. పెళ్ళికొడుకు లేచి తాళి కట్టబోతుండగా హఠాత్తుగా ఆహూతుల్లోంచి ఒకరు ఆపండీ.. డీ.. డీ... ఈ.. ఈ.. అని అరుస్తారు... అక్కడంతా సైలెన్స్.. నిశ్శబ్దం.. ఏమి జరుగుతుందో తెలీదు.. ఎందుకు ఆపమన్నారో తేలేదు.. వధువు.. తల్లిదండ్రుల కన్ఫ్యూజన్.. అంతలో ఒక పెద్దాయన వచ్చి...అసలు వరుడు వీడు కాదు... వీడు డూప్లికేట్.. అసలైనవాడు ఇప్పుడొచ్చాడు.. వాడే అసలు పెళ్ళికొడుకు... నువ్వెళ్ళి తాళి కట్టుబాబూ అంటాడు.. అప్పుడు ఒరిజినల్ వాడు వెళ్లి తాళి కట్టి.. ఆ పెళ్లి తంతు ముగిస్తాడు.. వాస్తవానికి ఈ ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఇప్పటికైతే కూటమి తరపున తమకు వాటాగా వచ్చిన 144 స్థానాల్లో అభర్ధులను ప్రకటించిన టీడీపీ వాళ్లతో ప్రచారం చేయిస్తోంది. అయితే అందులో ఇంకా కొందరిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో వాళ్ళను ఎదుర్కొనే సత్తా లేదని భావించిన కొన్ని స్థానాల్లో తమ వాళ్లను మార్చేందుకు చంద్రబాబు ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఉదాహరణకు ఉండి ఎమ్మెల్యేగా విజయరామరాజుకు టిక్కెట్ ప్రకటించేయగా అయన ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్నారు.. ఈ తరుణంలో మళ్లీ రఘురామకృష్ణం రాజును అభ్యర్థిగా ప్రకటించారు. అంతే కాకుండా జగపతినగరానికి కొండపల్లి శ్రీనివాస్‌ను అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించగా అయన జనంలోకి వెళ్తున్నారు. అయితే అక్కడ వైసీపీ అభ్యర్థి అప్పల నర్సయ్యను ఓడించడం శ్రీనివాస్‌కు సాధ్యం కాదని భావించిన చంద్రబాబు ఇప్పుడు ఆయన్ను మార్చాలని చూస్తున్నారట. అలాగే టీవీల్లో అడ్డం దిడ్డం మాట్లాడడం ద్వారా పాపులర్ అయిన కొలికపూడి శ్రీనివాస్‌కు తిరువూరు టిక్కెట్ ఇచ్చారు.. అయితే టీవీల్లో వాగడం వేరు.. జనాల్లో తిరగడం వేరని పార్టీకి ఇప్పటికే అర్థం అయిందని, దీంతో ఆయన్ను పక్కన బెట్టేసి ఇంకో వ్యక్తిని చూస్తున్నారని అంటున్నారు. పాతపట్నంలో వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతి మీద పోటీకి మామిడి గోవిందరావును ప్రకటించారు.. ఈ నెలన్నర తరువాత ఆబ్బె... ఆయన సరిపోవడం లేదని తేలిందట.. దీంతో రెండో కృష్ణుడు రాబోతున్నట్లు రూమర్లున్నాయి. శ్రీకాకుళం, సత్యవేడు ఇలా ఇంకొన్ని చోట్ల రెండు.. మూడో కృష్ణుడు రాబోతున్నట్లు క్యాడర్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి ఎన్నికల వరకూ.. బీ ఫారం వచ్చేవరకూ ఎవరూ శాశ్వతం కాదని వేదాంత ధోరణిలో క్యాడర్ పని చేస్తోంది. -సిమ్మాదిరప్పన్న -
మొదటి ఆటే ఆఖరాట.. బాబు అతి తెలివి ఢిల్లీకి అర్థమైందా?
కూటమి సినిమా అట్టర్ ప్లాప్ అయిందా.. మొదటి ఆటతోనే సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేసారా? మొదటి ఆటే ఆఖరాట అయ్యిందా.. చూస్తుంటే అలాగే ఉంది. కాస్త లేటుగా అయినా పాము విషాన్నే కక్కుతుంది తప్ప పాలను కాదు.. తుమ్మ చెట్టుకు ముళ్ళే వస్తాయి తప్ప పూలు రావు.. అలాగే ఎంతగా మారిపోయాను అని చెప్పి.. కాళ్లావేళ్లా పడి బీజేపీతో పొత్తు పెట్టుకున్నా అవకాశం వచ్చినపుడు మాత్రం చంద్రబాబు తన అసలు రూపాన్ని బయటకు తీస్తూనే ఉంటారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం అని చెప్పి ఢిల్లీతో పొత్తు పెట్టుకున్నా ఆయన అంతరంగంలో ఏముందన్నది గుర్తించలేని అమాయకులు బీజేపీలో ఎవరూ లేరు. కానీ, మనిషి మారాడేమో అనుకున్నా లేదు.. ఎందుకు మారతాడు.. ఒరిజినల్ అలాగే ఉంటుంది. అది అవసరం వచ్చినప్పుడల్లా బయటపడుతుంది. దీంతో చంద్రబాబు తత్వాన్ని మరోమారు అర్థం చేసుకున్న బీజేపీ పెద్దలు ఇంకోసారి ఆయనతో వేదిక పంచుకునేది లేదని తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. మొన్నామధ్య చిలకలూరిపేటలో జరిగిన ఉమ్మడి వేదిక మీద మోదీ.. చంద్రబాబు.. పవన్ ముగ్గురూ మాట్లాడారు. ఆ తరువాత సీట్ల పంపిణీ జరిగింది. అక్కడే చంద్రబాబు తీరు మరోమారు బీజేపీ పెద్దలకు అర్థమైంది. ఎక్కడెక్కడో ఉన్న టీడీపీ వాళ్ళను బీజేపీలో చేర్చి తన వదిన అయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా టిక్కెట్లు ఇప్పించుకున్న చంద్రబాబు తీరును చూసి ఢిల్లీ బీజేపీ పెద్దలకు మైండ్ బ్లాక్ అయ్యిందట. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్లకు టిక్కెట్లు లేకుండా ఎంతసేపూ సీఎం రమేష్, సుజనా చౌదరి.. ఇలాంటి వాళ్ళు తప్ప వేరేవాళ్లు అభ్యర్థులే లేరా?. అంతా తన చంచాలేనా.. మొదటి నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళు ఎవరూ అభ్యర్థులు కాలేక పోయారా? అంటూ రాష్ట్ర పాతకాపులైన బీజేపీ నాయకులు చేసిన ఫిర్యాదు చూశాక అర్థమైంది. పీవీఎన్ మాధవ్.. వీర్రాజు వంటి వాళ్లకు ఎక్కడా టిక్కెట్లు లేకుండా చంద్రబాబు తన బంధువు పురంధేశ్వరి ద్వారా చక్రం తిప్పి బీజేపీని తన గుప్పిట్లో పెట్టుకుని ఎలా కథ నడిపింది బీజేపీకి అర్థమైంది. దీంతో, ఇక చాలు ఆయనతో అంటకాగింది చాలు.. కూటమి తరఫున ఇంకో ఉమ్మడి సభ వద్దే వద్దు అని తీర్మానించారని తెలుస్తోంది. దీంతో మోదీ, అమిత్ షా వచ్చినా ఇక చంద్రబాబుతో సంబంధం లేకుండా కేవలం బీజేపీ వాళ్ళతో సభ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్.. చంద్రబాబు సైతం ఉమ్మడిగా కాకుండా ఎవరికీ వారే సభలు.. రోడ్డు షోలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు తప్ప ఎక్కడా కలిసి వెళ్లడం లేదు. - సిమ్మాదిరప్పన్న. -
ఒకటికి రెండు.. రెండుకు నాలుగు! బెట్టింగ్ బంగార్రాజుల జోరు
రండన్నా రండి.. వెయ్యికి రెండు వేలు.. లచ్ఛకు రెండు లచ్చలు.. గవర్నమెంట్ ఎవరిదీ వస్తుంది.. జగనా ? చంద్రబాబా ? ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి. రండి పందెం కాసుకోండి అంటున్నారు గోదావరి జిల్లాల్లో పందెం రాయుళ్లు.. కోడిపందాలు.. క్రికెట్ పందాలు.. ఇలా రకరకాల పందేలకు పేరుగాంచిన భీమవరంలో ఇప్పుడు రాజకీయ పందేలు మొదలయ్యాయి. ఇంకా నెలన్నరలో ఎన్నికలు జరగనుండగా.. ఎవరికీ ఎన్ని సీట్లు వస్తాయి.. ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అంటూ ఇప్పుడే పందేలు కాస్తున్నారు.. ఈ మేరకు అగ్రిమెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి ఈ రాజకీయ పందేలు గత దసరా నుంచే మొదలయ్యాయి...అప్పట్లో కొందరు టీడీపీ అభిమానులు సీఎం వైయస్ జగన్ సారధ్యంలోని వైఎస్సార్ కాంగ్రెసుకు యాభై సీట్లకన్నా తక్కువే వస్తాయని చెబుతూ అలా పందెం కాశారు. అది కూడా కోసు పందెం... అంటే ఫ్యానుకు యాభై సీట్లకు మించి వస్తే టీడీపీ వాళ్ళు రెండు రెట్లు.. మూడు రెట్లు డబ్బులిస్తారన్నమాట.. అంటే లక్ష పందెం కాసారనుకోండి.. జగన్ పార్టీకి యాభై సీట్లకు లోపు వస్తే ఆ లక్ష పోయినట్లు... కానీ యాభైకి మించి వస్తే టీడీపీ వాళ్ళు.. రెండు.. మూడు లక్షలు ఇస్తారన్నమాట.. ఇలా అప్పట్లో పందేలు ఫిక్స్ చేసుకుని నోట్లు.. అగ్రిమెంట్లు.. పెద్దమనుషుల సమక్షంలో మాట కూడా తీసుకోవడం జరిగింది.. ఇదిలా ఉండగా సంక్రాంతి పోయాక పందెం తీరు మారింది... జగనుకు 70 - 80 సీట్లు వస్తాయంటూ సమపందెం కాస్తున్నారు. అంటే పందెంలో ఎంత వేస్తె అంత వస్తుంది.. ఎంత కాస్తే అంతే ఓడిపోతారు తప్ప.. రెండు మూడు రెట్లు అనేది ఉండదు. ఇదిలా ఉండగా మర్చి నెలలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది.. మళ్ళీ జగన్ వస్తున్నారట.. పేదలు.. బీసీలు.. మహిళలు.. రైతులు అందరూ జగన్ పక్షాన ఉండడంతో ప్రభుత్వానికి ఎదురేలేదట.. నూట ఇరవై సీట్లతో మళ్ళీ జగన్ గెలుస్తున్నారట అనే భావన పల్లెల్లో మొదలైంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనేదానిమీద పందేలు కాస్తున్నారు. అయితే గతంలో జగన్ కు 50 సీట్లకు మించి రావంటూ రెండు మూడు రెట్లు ఇచ్చేలా పందెం ఖరారు చేసుకున్నవాళ్ళంటా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. కూటమిలో సీట్ల చిచ్చు.. వాళ్ళిస్తున్న మ్యానిఫెస్టో.. హామీలను ప్రజలు నమ్మకపోవడం... గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎలా తుంగలోకి తొక్కింది.. ఇవన్నీ ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు.. అంతేకాకుండా చెప్పినమాటమీద.. ఇచ్చిన హామీ మీద నిలబడే జగన్ అంతే జనానికి నమ్మకం కుదిరిందని, ఇటు సంక్షేమం.. అటు అభివృద్ధి కూడా చేసి చూపుతున్న జగన్ గెలుపు విషయంలో సందేహాలు లేనేలేవని ప్రజల్లో అభిప్రాయాలూ గట్టిగా వినిపిస్తుండడంతో ఇప్పుడు పందెం తీరు మారింది. ఎన్ని సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు.. వంద.. నూట ఇరవై.. ఇలా ఇప్పుడు పందేలు కాస్తున్నారు.. మొత్తానికి గతంలో ఉన్న పరిస్థితికి ఇప్పుడు పూర్తి భిన్నంగాఉండడంతో పందెం రాయుళ్లు ఇప్పుడు జగన్ గెలుపు మీద కాపు కాస్తున్నారు.. అయితే గతంలో టీడీపీ గెలుపు మీద లక్షల్లో అగ్రిమెంట్లు చేసుకున్న వాళ్లంతా ఇప్పుడు దిగాలు పడిపోతున్నారు.. ఈ నెలలో పరిస్థితి వైయస్సార్ కాంగ్రెస్ పరిస్థితి మరింత మెరుగై... నూట నలభై.. వరకూ ఎగబాకుతుందని.. కూడా పందెం రాయుళ్లు అంటున్నారు.. మరోవైపు జగన్ గెలిస్తే లక్ష ఇస్తాం.. టీడీపీ గెలిస్తే మీరు అరవై.. డెబ్బై వేలు ఇస్తే చాలు అన్నట్లుగా ఇప్పుడు ట్రెండ్ నడుస్తోంది. -సిమ్మాదిరప్పన్న -
పవన్ ఆపసోపాలు.. హైదరాబాద్ ఫాంహౌస్‌కు జంప్
‘‘రెండు రోజులు ప్రచారం చేయలేని వాడు ఎమ్మెల్యే అవుతాడా?. హైదరాబాద్ ఫాంహౌస్‌లకు అలవాటు పడిన వాడు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాడా?. పార్ట్‌టైం పాలిట్రిక్స్ చేస్తే జనం నమ్ముతారా?. స్టంట్లలో డూపులను పెట్టినట్టు.. జనసేన సింబల్ కింద టీడీపీ నేతలతో పోటీ చేయిస్తావా?. ఇదేనా నిఖార్సయిన రాజకీయం?. ఇదేనా గోదావరి ప్రజల ముందుకెళ్లి తేల్చుకునే అంశం?’’ అంటూ పవన్‌కల్యాణ్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ తెనాలి పర్యటనను రద్దు చేసుకున్నారు. హైదరాబాద్‌కు వెళ్లిపోయిన పవన్.. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది.. దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో.. సేనాని దమ్ము ఇంతేనా.. ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం.. స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా.. క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా? పిఠాపురం ఒక్కదానికే ఆయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని.. బ్రాయిలర్ కోడి మళ్లీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు. మరో వైపు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ పిల్లి మొగ్గలు వేస్తున్నారు. గతంలో టీడీపీని గెలిపిస్తే నన్ను నా తల్లిని తిట్టారు.. టీడీపీ వాళ్ళను వదిలిపెట్టను అన్నారు. కానీ, మళ్ళీ టీడీపీతో అంటకాగుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు ఎన్నికలు అంటే అసలు భయం పట్టుకుని తనను తానూ ఓ యోధుడిగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ గతంలో భీమవరం.. గాజువాక.. రెండుచోట్లా ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని అర్థిస్తున్నారు. సీఎం అవ్వాలనుకుంటే నన్నెవడ్రా ఆపేది అనే డైలాగ్స్ దగ్గర్నుంచి ప్లీజ్.. నన్ను గెలిపించండి.. అర్థిస్తున్నాను అనేవరకు పవన్ వచ్చారు. -సిమ్మాదిరప్పన్న -
పిఠాపురంలో ‘సేనాని’ పిల్లి మొగ్గలు
చంద్రబాబుతో రాజకీయ సావాసం అంటే చీకట్లో వెళ్తూ దెయ్యాన్ని తోడుతెచ్చుకున్నట్లే.. ఈ విషయం గతంలో బీజేపీకి.. కమ్యునిస్టులకు.. కాంగ్రెసుకు.. అందరికీ అవగతమైంది. పవన్ కల్యాణ్‌కు కూడా కాసింత అర్థం అయినట్లు అప్పుడప్పుడు ప్రవర్తిస్తూనే.. తనకు తోడుగా ఆ దెయ్యమైనా ఉంది.. పూర్తి ఒంటరిని కాదు కదా అనుకుంటూ దాంతోనే సావాసం, ప్రయాణం అనివార్యమైంది. గతంలో టీడీపీని గెలిపిస్తే నన్ను నా తల్లిని తిట్టారు.. టీడీపీ వాళ్ళను వదిలిపెట్టను అన్నారు. కానీ, మళ్ళీ టీడీపీతో అంటకాగుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్‌కు ఇప్పుడు ఎన్నికలు అంటే అసలు భయం పట్టుకుని తనను తానూ ఓ యోధుడిగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ గతంలో భీమవరం.. గాజువాక.. రెండుచోట్లా ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని అర్థిస్తున్నారు. సీఎం అవ్వాలనుకుంటే నన్నెవడ్రా ఆపేది అనే డైలాగ్స్ దగ్గర్నుంచి ప్లీజ్.. నన్ను గెలిపించండి.. అర్థిస్తున్నాను అనేవరకు పవన్ వచ్చారు. ఇదిలా ఉండగా టీడీపీ ఇంచార్జ్ వర్మ కూడా ఇప్పుడు పవన్‌కు పెద్ద నాయకుడైపోయారు. ఒక పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన పవన్ గెలుపు ఇప్పుడు వర్మ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. వర్మ చేతిలో పాతికవేలకుపైగా ఓట్లున్నాయనేది ఒక అంచనా.. గతంలో ఆయనకు అన్ని ఓట్లు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళా అవి ఆయనకు వస్తాయా రావా అనేది వేరే ప్రశ్న. కానీ, ఇప్పుడు పవన్ గెలవాలంటే వర్మ ఒక్కరే మనస్ఫూర్తిగా పని చేయాలి. అలా ఆయన చేస్తేనే వంగా గీత మీద పవన్ గెలిచేందుకు కొంతమేరకు అవకాశాలు ఉంటాయి. కానీ, తన వేలితో తన కన్ను పొడుచుకునేందుకు వర్మ ఏమైనా అమాయకుడా? పవన్ కానీ గెలిస్తే వచ్చే ఎన్నికల్లో కూడా అక్కడే పోటీ చేస్తారు. అంటే అప్పుడు కూడా వర్మకు పోటీ చేసే అవకాశం ఉండదు. ఆ విధంగా పవన్‌ను గెలిపించడం ద్వారా వర్మ తన కెరీర్‌ను ముగించుకునేందుకు సిద్ధపడతారా?. అందుకే వర్మ కూడా ఇప్పుడు పవన్‌ను గెలిపించేందుకు నిజాయితీగా పని చేస్తారని నమ్మడానికి లేదని జనసైనికులు అంటున్నారు. వర్మ కూడా చంద్రబాబు శిష్యుడే.. కాబట్టి చంద్రబాబు సూచనల మేరకు పవన్ గెలుపు కన్నా ఆయన కూటమికే పని చేస్తారన్న అనుమానాలున్నాయి. పవన్ గెలిస్తే అటు లోకేష్‌కు కూడా పోటీగా వచ్చే ప్రమాదం ఉందని చంద్రబాబు భావిస్తారని, అందుకే పవన్ కోసమే పని చేస్తున్నట్లు కనిపించాలి కానీ చివరికి ఓటమిని కానుకగా ఇవ్వాలని లోలోన వర్మకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో పవన్ గెలుపు అంత వీజీ కాదని సైనికులు అంటున్నారు. గెలిపిస్తాను అని చెబుతూనే వర్మ చివరి నిమిషంలో తనవాళ్లను పక్కకు తప్పించి పవన్‌ను ఓటమి సముద్రంలో ముంచేసే ప్రమాదముందని అంటున్నారు. అందుకే పవన్ ఇప్పుడు పిఠాపురంలో పిల్లిమొగ్గలు వేయక తప్పడం లేదు. -సిమ్మాదిరప్పన్న. -
పెన్షన్ల పంపిణీ బ్యాక్ ఫైర్.. సరిదిద్దుకోలేక టీడీపీ తిప్పలు
కొండవీటి దొంగలో చిరంజీవిని ఎలాగైనా పట్టుకుంటానని. ఆయన్ను నిలువరిస్తానని ప్రతినబూనిన పోలీస్ ఆఫీసర్ విజయశాంతి ఆయన్ను వెంబడిస్తుంది. చిరంజీవిని పట్టుకునేందుకు ఎంత ప్రయత్నించినా కుదరదు.. చివరకు ఆమె పెద్ద బురదగుంటలో పడిపోతుంది.. దీంతో చిరంజీవి వచ్చి నన్ను ఉచ్చులో దించుతామని నువ్వు రొచ్చులో పడ్డావేంటి అంటాడు. అచ్చం ఇపుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఐంది. రేసు గుర్రంలా దూసుకెళ్తున్న జగన్‌ను నిలువరించేందుకు వేసిన వలంటీర్ల ఉచ్చు తిరిగి చంద్రబాబు మెడకు చుట్టుకుంది. దాన్నిప్పుడు తొలగించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అయ్యవారిని చేయబోతే కోతి అయినట్లుంది టీడీపీ పరిస్థితి. వాస్తవానికి టీడీపీ జనసేన బీజేపీ కలిసి పొత్తులో సీట్లు ప్రకటించిన దగ్గర్నుంచి వారి పరిస్థితి ఏమాత్రం బాలేదు. ఎటునుంచి చూస్తున్నా ఎక్కడోచోట ఇబ్బంది కనిపిస్తూనే ఉంది. దానికితోడు టీడీపీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేని చోట్ల తమ వాళ్ళను జనసేనలోకి పంపించి అక్కడ గ్లాసు గుర్తు మీద పోటీ చేయిస్తున్నారు. అవనిగడ్డలో బుద్ధప్రసాద్, పాలకొండలో నిమ్మక జయకృష్ణ అలా టిక్కెట్లు తెచ్చుకున్నవాళ్ళే.. ఇదిలా ఉండగానే తమ కూటమిని డిఫెండ్ చేసుకునే ప్రయత్నంలో టీడీపీ వేసిన తప్పటడుగు ఇప్పుడు వాళ్ళను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేసింది. చిన్న గాయాన్ని గోక్కుని... గెలుక్కుని పెద్ద పుండుగా మార్చినట్లు ఐంది. ఇన్నేళ్ళుగా వాలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి పెన్షన్ ఇస్తూ వస్తున్నారు. ఐతే అది ఆపాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా కోర్టును ఆశ్రయించిన చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులమేరకు వాలనీర్లను పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం దూరం పెట్టింది. అది సకాలంలో పెన్షన్లు ఇవ్వలేని ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తారని, అది తమకు లాభిస్తుందని టీడీపీ క్యాంప్ భావించింది. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ అదే అంశం మీద ప్రజల్లోకి వెళ్ళింది. ఫస్ట్ తేదీ వచ్చినా పెన్షన్లు ఇవ్వలేకపోవడానికి టీడీపీ కారణం... చంద్రబాబే వాలంటీర్లను అడ్డుకున్నారు. లేకుంటే ఈపాటికి అవ్వాతాతలకు పెన్షన్లు అందేవి అంటూ వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియాతోబాటు ఆ పార్టీ నాయకులూ ప్రచారం మొదలు పెట్టి.. ఈ అంశాన్ని ప్రజలకు వివరించారు. ఇంకేముంది... ప్రజలు.. దాదాపు 67 లక్షలమంది వృద్ధులు.. వికలాంగులు తిట్లు అందుకున్నారు. మా నోటికాడి కూడు ఆపేసారు... లేకుంటే ఈపాటికి మాకు పెన్షన్లు అందేవి.. చంద్రబాబు పెద్ద కుట్రదారు అంటూ ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఈ ఎండల్లో వృద్ధులం ఎక్కడికి వెళ్తాం.. మా వాలంటీర్ ఉంటే మాకు చక్కగా పెన్షన్లు అందేవి.. ఈ చంద్రబాబు మాకు పెన్షన్లు ఆపేసాడు.. ఎన్నికల్లో అయన సంగతి చూస్తాం అంటున్నారు. రోజూ ఇంట్లోని రొట్టెముక్కల్ని తినేస్తున్న ఎలకను పట్టుకునేందుకు పిల్లి ఒక ఉచ్చు తయారు చేసింది... అది ఎలక మెడకు వేయబోతే తిరిగి తన మెడకే చుట్టుకోవడంతో దాన్ని తీసుకోలేక పిల్లి గిలగిలా కొట్టుకుంది... అచ్చం ఇలాగే ఇంటింటికి వలంటీర్ల ద్వారా సేవలు అందిస్తూ తన ఓట్లను సునాయాసంగా ఎత్తుకుపోతున్న సీఎం వైయస్ జగన్‌ను అదుపు చేసేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు... వలంటీర్ల కాళ్లకు కర్ర అడ్డం బెట్టి వాళ్ళను పడగొట్టి తాను రేసులో ముందుకు పోదాం అనుకున్నారు... అయితే చంద్రబాబు ఆ కర్రను తన కాళ్ళమధ్య పెట్టుకుని తానే బోర్లా పడినట్లు ఐంది.. దీంతో ఇప్పుడు లేవలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇది కాస్తా టీడీపీకి డ్యామేజ్‌గా మారింది. దీంతో ఇప్పుడు బాబు, టీడీపీ నేతలు కొత్త రాగం అందుకున్నారు. సచివాలయంలో లక్ష ముప్ఫైవేలమంది ఉద్యోగులు ఉన్నారు కదా వాళ్లతో పెన్షన్లు ఇప్పించండి అంటూ దీర్ఘాలు తీస్తున్నారు. అసలు జగనొచ్చాక ఉద్యోగాలే ఇవ్వలేదని చెబుతూ వస్తున్న చంద్రబాబు ఇప్పుడు సచివాలయంలోని లక్షా ముప్పైవేల ఉద్యోగులు ఉన్నారుగా వాళ్లతో పెన్షన్లు ఇవ్వండి అని సలహా ఇచ్చేసారు. మొత్తానికి కూటమి కూర్చిన తరువాత పార్టీ పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు ఏదేదో చేసి ప్రభుత్వాన్ని గందరగోళపరుద్దామని భావించి తానే ఉచ్చులో చిక్కుకున్నట్లు అయింది. ఇప్పుడు మెడకు చుట్టుకున్న తాడును తప్పించుకునేందుకు చంద్రబాబు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఈ అంశంలో పవన్ కల్యాణ్... బీజేపీలు సైలెంట్ గా ఉన్నాయ్... చంద్రబాబు చేసిన పెంటను తామెందుకు నెత్తికి రుద్దుకోవాలి అనుకున్నాయో ఏమో మరి ఆ పార్టీలు... దాని నేతలు మాత్రం ఈ అంశాన్ని విననట్లే ఊరుకున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
ఒక్కరోజు ఎండలకే పవన్ పరార్
ఎండాకాలం... ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతూ ఉంటాయి. సుకుమారంగా సున్నితంగా పెరిగే జీవులకు ఇవి గడ్డు రోజులు. కోళ్లఫారాలు...హైబ్రిడ్ ఆవులు.. గేదెలు పెంచేవాళ్ళు తమ జీవాలను కాపాడుకునేందుకు వాటికి ఏసీలు పెడుతుంటారు. తరచూ చల్లని నీళ్లు చల్లుతూ వాటిని కూల్ చేస్తుంటారు.. లేదంటే అవి ఎండవేడికి తట్టుకోలేక గుడ్లు తేలేస్తాయి..నిత్యం ప్రజల్లోనే ఉంటాను.. ప్రజలతోనే ఉంటాను.. ప్రజలకోసం ఉంటాను.. సీఎం వైఎస్ జగన్‌కు యుద్ధాన్ని చూపిస్తాను అంటూ పెద్ద డైలాగ్స్ చెప్పిన పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనను ముగించారు. వాస్తవానికి ఏప్రిల్ రెండో తేదీ వరకూ పిఠాపురంలో ఉండేలా షెడ్యూల్ రూపొందించారు. మచ్చుకు ఒక రోజు అలా పిఠాపురం వెళ్లి టీడీపీ వర్మను.. ఇంకొందరు పెద్దలను కలిసి ప్రచారం చేసారు. ప్లీజ్.. ప్లీజ్.. నన్ను గెలిపించండి అని అర్థించారు. తాను గెలిస్తే అక్కడ ప్రైవేటుగా నిధులు సేకరించి ఆస్పత్రి నిర్మిస్తాను అని చెప్పి... కాస్త హడావుడి చేసారు. అంతే.. మళ్ళీ సాయంత్రం చూస్తే పవన్ లేరు. జంప్.. ఏమైంది అని ఆరా తీస్తే జర్రమొచ్చింది అనే సమాచారం తెలిసింది. మండుటెండల్లో రెండ్రోజులు జనాల్లో తిరిగేసరికి ఆయనకు ఆరోగ్యం చెడింది. సాయంత్రానికి జర్రమొచ్చింది... జ్వరం రావడంతో డాక్టర్లు రెస్ట్ తీసుకోవాలని సూచించారు.. దానికితోడు ఆయన మీద అభిమానులు పూలు చల్లడంతో అది కూడా ఎలర్జీకి దారితీసిందని తెలిసింది.. దీంతో ఇక ప్రచారం రద్దు చేసి విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లిపోయారు. రాజకీయం అంటే అప్పుడప్పుడు వచ్చి షో చేసి.. ఫోటోలు దిగి... ప్రభుత్వాన్ని.. రాజకీయ వైరి పక్షాలను నోటికొచ్చినట్లు తిట్టడం కాదని.. ఎండావానలను లెక్కచేయకుండా ప్రజల్లో ఉండాలని... అప్పుడే వారి అభిమానం చూరగొంటామని ప్రజలు సైతం అంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ అంటే సినిమాల్లో పెద్ద స్టార్.. అడుగుతీసి అడుగువేస్తే పూలు పరుస్తారు... గొడుగుపడతారు.. మేకప్ చెదిరిపోకుండా క్షణానికోసారి టచప్ చేస్తారు. గంటకోసారి ఏసీలో కూర్చోవచ్చు.. కానీ రాజకీయాల్లో అదేం ఉండదు.. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ... వాగులు వంకలు... గుట్టలు కొండలు అన్నీ దాటాలి. ప్రతి గుండెనూ తడమాలి... ప్రతిపేదవాన్నీ తనవాడు అనుకోవాలి... అన్ని చేస్తేతప్ప ప్రజల్లో నిలవలేరు. జస్ట్ అలా వచ్చి నోటికొచ్చినట్లు తిట్టేసి వెళ్ళిపోతే రాజకీయం కాదు అనే విషయం పవన్ కల్యాణ్‌కు అర్థం కాలేదు. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది... దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో... సేనాని దమ్ము ఇంతేనా... ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం... స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా... క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా ? పిఠాపురం ఒక్కదానికే అయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని... బ్రాయిలర్ కోడి మళ్ళీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
ఎవరికీ వారే ... యమునా తీరు
కూటమిలో సీట్లు పంపిణీ ఐతే ఐంది కానీ మనసులు కలవని మనువు మాదిరిగా వారి ప్రయాణం సాగుతోంది... కలివిడిగా ఉందాం అనుకున్నారు కానీ విడివిడిగా వెళ్తున్నారు... టిక్కెట్లు ప్రకటించినా ఎక్కడా ఆ మూడు పార్టీల నాయకులు కలిసి సాగడం లేదు... ఎక్కడికక్కడ గట్లు వేసుకుంటూ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తూ వెళ్తున్నారు. ఈ పొత్తు పొసిగేది కాదులే అని జనంలో ఇప్పటికే అభిప్రాయం వచ్చేసింది. ఇదిలా ఉండగా టీడీపీ జనసేన అధ్యక్షులు ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో కూడా ఎవరికివారే అన్నట్లుగా ఉంటున్నారు...పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ చూస్తే అదే అర్థం అవుతోంది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు పవన్ కళ్యాణ్ టూర్ చేస్తున్నారు.. ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే అయన వారాహిని సైతం తీసుకొచ్చారు.. పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టగా అందులో భాగంగా ముందుగా టీడీపీ ఇంచార్జ్ వర్మ ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.. ఇదంతా ఒకెత్తు అయితే అయన పన్నెండు రోజులు చేసే ప్రచారంలో ఎక్కడా టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలను టచ్ చేయడం లేదు.. సంపూర్ణంగా అయన తన జనసేన అభ్యర్థులున్నచోటనే ప్రచారం చేస్తున్నారు.. టీడీపీ బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట్లకు వెళ్లి మన కూటమి అభ్యర్థులను గెలిపించాడని అని చెప్పే ఉద్దేశ్యం లేనట్లు ఈ షెడ్యూల్ చూస్తే తెలుస్తోంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేవలం వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఉన్న చోటనే ప్రచారం చేస్తున్నారు. జనసేన అభ్యర్థులు ఉన్న ప్రాంతాలకు పోవడం లేదు.. అంటే ఎవరి అభ్యర్థుల గెలుపు బాధ్యత వాళ్లదే అన్నట్లుగా ఈ పరిణామాలు చూస్తే తెలుస్తోంది. ఆలా ఎవరికీ వాళ్ళే ఉంటే ఇక పొత్తుపెట్టుకుని ఏమి లాభం... మేమెలా గెలుస్తాం అని జనసేన అభ్యర్థులు లోలోన భయపడుతున్నారు. ఇక బయటకు చెప్పకపోయినా టీడీపీ వాళ్ళు కూడా లోలోన భయపడుతున్నారు.. జనసేన ఓట్లు మాకు రాకపోతే... కేవలం తమ ఓట్లతో ఐతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఓడించలేమని వాళ్ళు కలవరపడుతున్నారు. ఇదిలా ఉండగా మోడీ కూడా త్వరలో ఆంధ్రాలో పర్యటనకు వచ్చి కేవలం బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉన్న చోటనే ప్రచారం చేస్తారని అంటున్నారు. దానికితోడు మొన్నటి చిలకలూరిపేరిట సభలో సైతం మా ఎంపీ అభ్యర్థులను గెలిపించండి.. ఎన్డీయేకు 400 సీట్లు ఇవ్వండి అని మాత్రమే చెప్పిన మోడీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం గురించి.. చంద్రబాబు నాయకత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు... దీంతో బీజేపీ సపోర్ట్ కూడా టీడీపీకి అంతంతమంత్రమే అని స్పష్టమైంది. ఇక ఇప్పుడు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ యాత్రలు..ప్రచార సభలు చూస్తున్నా అలాగే ఉన్నాయ్... అంటే అది చెప్పుకోవడానికే కూటమి తప్ప ఇది వర్కవుట్ అయ్యేది కాదని క్యాడర్ ఆవేదన చెందుతోంది. -సిమ్మాదిరప్పన్న -
ఏపీ బీజేపీ లిస్ట్.. ఇవి గెలిచే మొహాలేనా?
అనుకున్నదే జరిగింది.. చంద్రబాబు మళ్ళీ తన సహజ బుద్ధిని బయటపెట్టుకున్నారు.. కాళ్ళా వెళ్ళా పడి బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీకి వెన్నుపోటు పొడిచారు. పాలు పోసి పించినా పాము విషాన్నే కక్కుతుందని మరోమారు రుజువైంది. తెలుగుదేశం, జనసేన.. బీజేపీల కూటమి గుంజాటన.. తన్నులాటల నడుమ బీజేపీ తన పదిమంది అభ్యర్థులను ప్రకటించింది. అయితే ఈ జాబితా చూస్తుంటే చంద్రబాబు కనుసన్నల్లోనుంచి.. ఆలోచనల్లోంచి వచ్చిన పేర్లను మాత్రమే అభ్యర్థులుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆ జాబితాలో మొదటినుంచి పార్టీకోసం పని చేస్తున్న వాళ్ళు ఎవరూ లేకుండా చంద్రబాబు కుట్రపన్నినట్లు అర్థం అవుతోంది. సీనియర్ నాయకుడు పీవీఎన్ మాధవ్ కానీ... విష్ణువర్థన్ రెడ్డి... సోము వీర్రాజు వంటి వాళ్ళు ఎవరూ జాబితాలో లేకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు. తన బంధువు, వదిన, పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ద్వారా చక్రం తిప్పి తాను అనుకున్నవాళ్లకు మాత్రమే టిక్కెట్లు ఇచ్చారు. జాబితాలో ముగ్గురు కమ్మ సామాజికవర్గానికి చెందినవావాళ్లకు టిక్కెట్ ఇచ్చిన పురంధేశ్వరి ఒక్కరంటే ఒక్కరు కాపులకు కూడా టిక్కెట్ ఇవ్వలేదు. గట్టిగానొరు విప్పుతారు అని పేరొందిన సోము వీర్రాజుకు టిక్కెట్ ఇవ్వకపోవడం కూడా పెద్ద కుట్ర అని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ క్యాడర్ ఆవేదన చెందుతోంది. పోన్లే కదాని పొత్తు కు ఒప్పుకుంటే ఇలాగేనా వెన్నుపోటు పొడుస్తారు అని వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. 2014లో కైకలూరులో గెలిచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన కామినేని గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తరువాత ఈ ఐదేళ్ళలో ఏనాడూ నియోజకవర్గానికి వెళ్ళలేదు. ప్రజలు, క్యాడర్‌ను పట్టించుకోలేదు. కానీ సరిగ్గా ఐదేళ్ల తరువాత ఎన్నికలు రాగానే మళ్ళీ కామినేని శ్రీనివాస్ దిగిపోయారు. ఠక్కున టిక్కెట్ ఎగరేసుకుపోయారు. ఇది పురంధేశ్వరి ద్వారా చంద్రబాబు పన్నిన కుట్ర అని స్పష్టమవుతోంది. ఆశ్చర్యంగా శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల టిక్కెట్ కూడా బీజేపీకి ఇచ్చారు. అక్కడ వాస్తవానికి తూర్పు కాపు ఓటర్లు ఎక్కువ.. కానీ అక్కడ కూడా కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈశ్వర రావుకు టికెట్ ఇచ్చారు. దానికితోడు బీజేపీలో టిక్కెట్లకోసం పురంధేశ్వరి డబ్బులు కూడా వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మొత్తానికి తిమ్మిని బమ్మిని చేస్తూ బిజెపిని సైతం విజయవంతంగా ముంచేసి తన రాజకీయం పవరేమిటన్నది చంద్రబాబు మరోమారు రుచి చూపించారు. ఈ జాబితా చూస్తుంటే అలసివి గెలిచే మొహాలేనా.. చంద్రబాబు మొత్తం మన పార్టీని గొర్రెలను చేసేసాడు కదా అని హార్డ్ కొర్ బీజేపీ క్యాడర్ ఆవేదన చెందుతున్నా.. చేసేదేమి లేక సైలెంట్ గా లోలోన బాధపడుతోంది. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు.. 1)ఎచ్చెర్ల – ఎన్ ఈశ్వర రావు(కమ్మ ) 2)విశాఖపట్నం నార్త్ – విష్ణు కుమార్ రాజు 3)అరకు లోయ – పంగి రాజారావు 4)అనపర్తి – ఎం.శివ కృష్ణం రాజు 5)కైకలూరు – కామినేని శ్రీనివాసరావు(కమ్మ ) 6)విజయవాడ వెస్ట్ – సుజనా చౌదరి (కమ్మ ) 7)బద్వేల్ – బొజ్జా రోశన్న 8)జమ్మలమడుగు – ఆదినారాయణ రెడ్డి 9)ఆదోని – పార్థసారథి 10)ధర్మవరం – వై.సత్యకుమార్ -/// సిమ్మాదిరప్పన్న /// -
టిక్కెట్ ఇస్తే ఓడిపోతారు.. ఇవ్వకుంటే ఓడగొడతారు
తిండికి తిమ్మరాజులు.. పనికి పోతురాజుల అనే బ్యాచ్ ప్రతిచోటా ఉంటుంది.. కాలం గడిచేకొద్దీ కొందరు తమ గ్లోరీని.. పాత వైభవాన్ని. కోల్పోతుంటారు.. కొత్తనీరొచ్చి పాత నీటిని అడుక్కు నెట్టేసినట్లు.. కొత్త ఆటగాళ్లొచ్చి సీనియర్ ఆటగాళ్లను కామెంటేటర్లుగా మార్చేసినట్లు.. ఒకనాటి హీరోలు మెల్లగా తండ్రి పాత్రలోకి అడిగినట్లు.. ఆయనతో వన్నె చిన్నెల హీరోయిన్లు అత్తా.. అమ్మ పాత్రలోకి మారినట్లు.. ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే జరుగుతోంది. మేము ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. ఆరోజుల్లో మా స్థాయి వేరు.. మేము ముఖ్యమంత్రులతో.. కాఫీలు తాగినామ్.. ప్రధానులతో ఫోటోలు దిగినామ్ అంటే.. అవును దిగినారు నిజమే... మీది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నది కూడా నిజమే... అంటే మీరు సీనియర్లు.. క్లియరుగా చెప్పాలంటే ముసలోళ్ళు.. అందుకే పక్కకు జరిగితే కొత్త మొహాలు.. కొత్త నాయకులూ...ఆటగాళ్లు వస్తుంటారు అన్నది కూడా నిజమే అని నయా జమానా అంటోంది. తెలుగుదేశంలో కూడా అలాంటి బ్యాచ్ ఒకటి తయారైంది. గతంలో పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళు కొందరు ఇప్పుడు సీనియర్లు అయిపోయారు.. అంటే వాళ్ల ప్రభ తగ్గింది.. వారిమీదున్న ఇమేజీ కోల్పోవడం కావచ్చు.. ప్రజాదరణ తగ్గడం.. కొత్తవాళ్లు రావడంతో వీళ్ల పట్ల ప్రజల్లో పెద్దగా మోజు లేకపోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో వాళ్లను పక్కనబెట్టాల్సిన అవసరం. టీడీపీ అధినాయకత్వానికి ఏర్పడుతోంది. అంటే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేరన్నమాట... అలాని నేరుగా నీకు టిక్కెట్ లేదు అంటే ఊరుకోరు.. ఆయ్... నేను నీతోబాటు రాజకీయాల్లోకి వచ్చాను అంటూ చంద్రబాబు మీదకే కత్తులు దూసే టైప్ అన్నమాట.. అలాగని వాళ్ళను ఉపేక్షిస్తూ.. టిక్కెట్లు ఇస్తే ఓడిపోతారు.. అందుకని ఆలపాటి రాజాకు తెనాలిలో టిక్కెట్ ఇవ్వలేకపోయారు. అక్కడ జనసేన నంబర్ టూ మనోహర్ పోటీలో ఉన్నారు.. పార్టీలో కీలకనాయకుడికే టిక్కెట్ ఇవ్వకపోతే ఇక పార్టీని ఏమి నడుపుతారులే అనే ఆరోపణల నుంచి తప్పించుకోవడం కోసం పవన్ చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి ఆలపాటి రాజేంద్రప్రసాదుకు టిక్కెట్ ఆపగలిగారు.. దీంతో అయన ఇప్పుడు పార్టీమీద రంకెలు వేస్తున్నారు.. ఇక జనంలో తొడగొట్టి మీసం తిప్పిన పెందుర్తి మాజీ మంత్రి బండారు సత్యనారాయణకు టిక్కెట్ లేదు.. ఆయనమీదున్న వ్యతిరేకతను భరించలేక టిక్కెట్ ఇవ్వలేదు. దీంతో అయన ఆవేదన, అవమానభారంతో ఆస్పత్రిపాలయ్యాడు. మైలవరం నుంచి మంత్రి అయిన దేవినేని ఉమాకు నో టికెట్. టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడ.. మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావుకు సైతం నో టిక్కెట్.. ఆయన బాగా సీనియర్ అయిపోయారు.. ఇప్పుడు వీళ్ళతో చంద్రబాబుకు కొత్త చిక్కొచ్చింది.. వాళ్లకు టిక్కెట్లు ఇస్తే నేరుగా ఓడిపోతారు.. వాళ్ళను కాదంటే పార్టీ ప్రకటించిన అభ్యర్థిని ఓడిస్తారు.. వీళ్ళతో పెద్ద చిక్కొచ్చి పడింది అని చంద్రబాబు బుర్రబాదుకుంటున్నారు. -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: రూల్స్ ఫర్ ఫూల్స్.. రాజకీయాల్లో చంద్రబాబు నైజమిదే..! -
రూల్స్ ఫర్ ఫూల్స్.. రాజకీయాల్లో చంద్రబాబు నైజమిదే..!
చంద్రబాబు ఎప్పుడూ అంతే.. రూల్స్ పెడతారు.. తానుమాత్రం పాటించరు.. కేడర్‌కు, ప్రజలకు.. అధికారులకు బోలెడు నీతులు చెబుతారు.. కానీ తనకు మాత్రం అవేం వర్తించవు. ఆయన అన్నింటికీ అతీతుడు.. ఆయనకు మకిలి అంటదు.. సూర్యుడు మరి. ఇక పార్టీకి సంబంధించి సీట్లు ఇచ్చే విషయంలో కూడా ఆయన చాలా రూల్స్ పెట్టారు. కుటుంబానికి ఒకటే టిక్కెట్ అని గట్టిగా ప్రకటించారు కానీ.. కిందన మాత్రం చిన్న అక్షరాలతో కొందరికి మాత్రం ఈ రూల్స్ వర్తించవు అని రాస్తారు. కుటుంబానికి ఒక టిక్కెట్ మాత్రమే అనే రూల్ పెట్టి కొన్ని కుటుంబాలకు చెక్ పెట్టిన చంద్రబాబు ఇంకొన్ని కుటుంబాలకు మాత్రం రెండు.. మూడేసి సీట్లు ఇచ్చారు. పరిటాల సునీతకు రాప్తాడులో మాత్రమే ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన బాబు.. ఆమె కొడుకు శ్రీరామ్‌కు ధర్మవరం టికెట్ నో అన్నారు. ఎందుకు అని అడిగితే ఒకే కుటుంబం నుంచి ఇద్దరేసి పోటీ చేస్తే ఎలా? మిగతా వాళ్లకు కూడా ఛాన్స్ రావాలి కదా అన్నారు. దీంతో ఆ ఫ్యామిలీ ఒక టికెట్‌తో సరిపెట్టుకుంది. అయ్యన్నపాత్రుడు కూడా నర్సీపట్నం ఎమ్మెల్యే టిక్కెట్‌తో సైలెంట్ అయ్యారు. కొడుకు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం ప్రయత్నించినా కుదరలేదు. ఆ ఎంపీ టిక్కెట్ కాస్తా బీజేపీ కోటాలో సీఎం రమేష్‌కు దక్కే అవకాశాలు ఉన్నాయి. జేసీ బ్రదర్స్ కుటుంబంలో అస్మిత్ రెడ్డికి తాడిపత్రి టిక్కెట్ ఇచ్చి ఊరుకున్నారు. మరి జేసీ దివాకర్.. ప్రభాకర్లకు ఇద్దరికీ టిక్కెట్లు లేవని చెప్పేశారు. ఇక అక్కడితో సీన్ కట్ చేసి రెండో స్క్రీన్ ఓపెన్ చేస్తే అన్నీ ఫ్యామిలీ ప్యాకులే కనిపిస్తాయి. చంద్రబాబు కుటుంబంలో మొత్తం నలుగురు పోటీలో ఉన్నారు. చంద్రబాబు కుప్పంలో.. లోకేష్ మంగళగిరిలో.. బాలయ్య హిందూపురంలో.. బాలయ్య చిన్నల్లుడు భరత్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం రూల్స్ గట్రా లేవని చెప్పేశారు. ► యనమల రామకృష్ణుడు ఫ్యామిలీలో కూడా యనమల కూతురు- తుని (అసెంబ్లీ), యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్- మైదుకూరు(అసెంబ్లీ), యనమల అల్లుడు, పుట్టా మహేష్ యాదవ్- ఏలూరు (పార్లమెంట్) ఇంకా యనమల ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ► కింజరపు ఫ్యామిలిలో బాబాయ్ అచ్చం నాయుడు టెక్కలి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా అబ్బాయి రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన చెల్లెలి భర్త, బావ ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ మొత్తం ఆ ఇంట్లో మూడు టిక్కెట్లు తీసుకున్నారు. ఇక వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నెల్లూరు ఎంపీగా ఛాన్స్ ఇవ్వగా ఆయన భార్య ప్రశాంతి రెడ్డికి కోవూరు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. ఇలా చంద్రబాబు రూల్స్ పెడతారు. తనకు నచ్చిన వాళ్ళ కోసం వాటిని బ్రేక్ చేస్తారుంటూ టీడీపీలోనే గుసుగుసలాడుకుంటున్నారు. -సిమ్మాదిరప్పన్న -
ఏపీ ఎన్నికల బరిలో కీలకంగా ఆరుగురు.. అందరూ మాజీ సీఎం కుమారులే
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందడి మొదలైంది. 175 అసెంబ్లీ స్థానాలకు వందలాది మంది అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. అందులో మాజీ క్రీడాకారులు.. సినిమా నటులు.. పారిశ్రామికవేత్తలు.. వ్యాపారాలు.. ఫక్తు రాజకీయ నాయకులతోబాటు డాక్టర్లు.. లాయర్లు.. ఇంజినీర్లు.. ఉపాధ్యాయులు.. జర్నలిష్టులు ఉన్నారు. ఇలా వివిధ వృత్తుల్లోని వాళ్ళు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వీరితోపాటుగానే కుటుంబ రాజకీయ నేపథ్యం ఉన్నవాళ్లు కూడా ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఇదంతా ఇలా ఉండనీయండి కానీ ఈ రాష్ట్రాన్ని కొన్నేళ్లపాటు పాలించిన ముఖ్యమంత్రుల కుటుంబాల నుంచి సైతం తరువాతి తరం వాళ్ళు పోటీకి సిద్ధం అంటున్నారు. ఈ జాబితాలో చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసినవారి కుమారులు ఆరుగురు ఈసారి ఎన్నికలబరిలో నిలుస్తున్నారు. 1. వైఎస్సార్ కుమారుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (పులివెందుల- వైఎస్సార్సీపీ) 2. ఎన్టీయార్ కుమారుడు నందమూరి బాలకృష్ణ (హిందూపూర్- టీడీపీ) 3. నాదెండ్ల భాస్కరరావు కుమారుడు మనోహర్ (తెనాలి- జనసేన) 4. నారా చంద్రబాబు కుమారుడు (లోకేష్- టీడీపీ) 5. నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ (వేంకటగిరి - వైయస్సార్ కాంగ్రెస్) 6. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు సూర్యప్రకాష్ రెడ్డి (డోన్ - టీడీపీ) ►ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే కడప నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు. 2019లో మళ్లీ గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఇప్పడు మూడోసారి గెలిచేందుకు సన్నద్ధం అవుతున్నారు. ►బాలకృష్ణ హిందూపురంలో ఇప్పటికే గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచారు. ఇప్పుడు మూడోసారి బరిలో దిగి ప్రజల మద్దతుకోరుతున్నారు. ►లోకేష్ ఐతే 2019లో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోగా ఈసారి ఎలాగైనా గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ►కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గతంలో 1991, 2004, 2009 ఎన్నికల్లో కర్నూలు నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో రైల్వే శాఖ సహాయమంత్రిగా కూడా పని చేశారు. ఇప్పుడు డోన్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ►నేదురుమల్లి రామ్ కుమార్ తొలిసారిగా వేంకటగిరి నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. గతంలో ఆయన తల్లి రాజ్య లక్ష్మి అక్కడి నుంచే గెలిచి విద్యాశాఖా మంత్రిగా పని చేశారు. ►నాదెండ్ల మనోహర్ 2004, 2009లో కాంగ్రెస్ తరఫున తెనాలి నుంచి అసెంబ్లీకి ఎన్నికై కొన్నాళ్లపాటు అసెంబ్లీ స్పీకర్‌గా కూడా పని చేశారు. ఇప్పుడు ఆయన మళ్ళీ తెనాలి నుంచి జనసేన తరఫున పోటీ చేస్తున్నారు. అయితే, తాత, తండ్రుల పేర్లు చెప్పుకుని గెలిచే రోజులు కావివి.. నువ్వేమిటి.. సమాజానికి నువ్వేం చేసావ్.. నువ్వేం చేస్తావ్ అని చెప్పుకుంటే తప్ప ప్రజామోదం దక్కని రోజులివి. మరిప్పుడు వీళ్ళలో ఎవరిని ప్రజలు ఆదరిస్తారో.. ఆరాధిస్తారో చూడాలి. -సిమ్మాదిరప్పన్న. -
పొలిటికల్ బిడారీ.. ఈసారెటు పరారీ
అప్పట్లో బిడారులు ఉండేవాళ్ళు..అంటే వాళ్లకు ఒక స్థిరనివాసం ఉండదు.. ఒక్కో ఊళ్ళో కొన్నేసి రోజులు ఉంటూ మళ్ళీ బతుకుదెరువుకోసం పయనం.. ఇంకో ఊళ్ళో కొన్నాళ్ళు నివాసం.. అలాగే రాజకీయాల్లో కూడా బిడారులు ఉంటారు.. అంటే ఒక్కో ఎలక్షన్‌కు ఒక్కో చోట పోటీ చేస్తారన్నమాట.. మళ్ళీ ఎన్నికల సమయానికి అక్కడ ఉండరు.. ఇంకో ఊరు చూసుకుంటారు. అదే కోవకు చెందినవారు సీనియర్ నాయకుడు గంటా శ్రీనివాస్.. 2004లో టీడీపీతో కెరీర్ మొదలెట్టి చోడవరంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయన పాలసీ ప్రకారం నియోజకవర్గం మార్చేయాలి కాబట్టి. 2009లో ఏకంగా పార్టీని కూడా మార్చేసి ప్రజారాజ్యం తరఫున అనకాపల్లిలో గెలిచారు.. ఈసారి మళ్ళీ ఎన్నికలొచ్చాయి.. మళ్ళీ కొత్త నియోజకవర్గముతోబాటు కొత్త పార్టీ కావాలి కాబట్టి.. మళ్ళీ 2014లో భీమిలిలో టీడీపీ నుంచి గెలిచారు. ఇంకా 2019 లో మళ్ళీ ఎన్నికలొచ్చాయి... పార్టీ మార్చడం కుదరలేదు.. నియోజకవర్గం మార్చేశారు.. విశాఖ నార్త్ కు వచ్చి గెలిచారు.. మళ్ళీ 2024 ఎన్నికలు రాగా అయ్హన అక్కడా ఇక్కడా పోటీ చేసేందుకు ట్రై చేసినా చంద్రబాబు పడనివ్వలేదు..ఈసారి ఏకంగా జిల్లామారిపోయి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయాలనీ ఆదేశించారు. తోచీతోచనమ్మ తోడికోడలు పుట్టింటికి పోయినట్లు ఎక్కడా సీట్ లేదని పోయిపోయి బొత్స ఎదురుగా పోటీ చేయడం అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టుముందు తొడగొట్టడమే.. ఆ ముక్క గంటాకు తెలుసు.. అందుకే ఉహు.. నేను పోను అన్నారు. చీపురుపల్లి వస్తే ఏమవుతుందో గంటాకు తెలుసు.. ఇన్నాళ్లూ పార్టీలు నియోజకవర్గాలు మారుతూ గెలుస్తూ వస్తున్న తనకు చీపురుపల్లి వెళ్తే సీను సితార్ అని అర్థమైంది. అందుకే అబ్బబ్బే పోయినుగాక పోను అనేసారు.. పోకపోతే ఇంట్లో రెస్ట్ తీసుకో.. భీమిలి టిక్కెట్ నెల్లిమర్ల ఇంచార్జ్ బంగార్రాజుకు కానీ ఇంకెవరికో అయినా ఇస్తాను.. మీరు వెళ్తే భీమిలి వెళ్ళండి లేదా రెస్ట్ తీసుకోండి అని చంద్రబాబు చెప్పేశారు. దీంతో ఈ పొలిటికల్ బీదవారికి సీట్ దక్కకుండా పోయింది. ప్రతి ఎన్నికకూ ఒక్కో పార్టీలో చేరడం.. ఒక ప్యాకేజి మాదిరి నాలుగైదు సీట్లు దక్కించుకుని తన మిత్రులతోకలిసి గెలవడం.. ప్రభుత్వాన్ని ఆడించడం రివాజుగా పెట్టుకున్న గంటాకు ఈసారి గంట పగిలిపోయినట్లయింది. పోనీ ఎక్కడా లేదు కదాని చీపురుపల్లి వస్తే ఇక్కడి జనాలు కొండచీపురుతో కొట్టడం ఖాయం.. దానికితోడు చీపురుపల్లిలో నాలుగు మండలాల్లో సగం జనాన్ని పెట్టి పిలిచే చనువు.. విస్తృత పరిచయాలు ఉన్న బొత్స మీద పోటీ అంటే మాటలు కాదు.. వేరే జిల్లానుంచి ఇంపోర్ట్ అయిపోయి నేరుగా డబ్బులు విసిరేసి ఎన్నికలు చేద్దాం అంటే ఇక్కడ కుదరదు. అయన వస్తే ఓటర్లు సంగతి అటుంచి ఇక్కడున్న టీడీపీ కార్యకర్తలు సైతం వ్యతిరేకంగా పనిచేస్తారు. తోటి కాపు వాడు అనే సంగతి సైతం మరిచిపోయి ఎక్కణ్ణుంచో వచ్చి ఇక్కడెలా పెత్తనం చేస్తావు అంటూ నెత్తి వాచిపోయేలా గంట వాయిస్తారు.. స్థానికుడు టీడీపీ తరఫున పోటీ చేస్తే అదో లెక్క.. తప్పదు కాబట్టి పార్టీ కోసం పని చేస్తారు కానీ వేరే జిల్లాల నుంచి వచ్చేసి నేను కాపు.. నేను టీడీపీ కాబట్టి మీరంతా నన్ను గెలిపించండి అంటే కుదరదు.. ఆ విషయం గంటాకు తెలుసు.. అందుకే ఒళ్లనోరి మామా నేనొల్లను.. చీపురుపల్లి పోనే పోను అని మొరాయించారు.. ఈసారి గంటా విషయంలో చంద్రబాబు కూడా గట్టిగానే ఉన్నారు.. చెప్పాను కదా.. వెళ్తే చీపురుపల్లి వెళ్ళు.. లేదంటే మానెయ్.. అది నీ ఇష్టం.. మీటింగ్ ఓవర్.. నువ్విక వెళ్లొచ్చని తేల్చేసారు... దీంతో ఇప్పుడు ఈ రాజకీయ బిడారికి సీటు కరువైంది. ///సిమ్మాదిరప్పన్న/// -
సామాన్యులే మాన్యులు: మొన్న ఉపాధి కూలీ.. నేడు డ్రైవర్
కూలీలు జీవితాంతం కూలీలుగానే ఉండాలా.. యజమానులుగా ఎదగొద్దా? బోయీలు.. తరతరాలు పల్లకీపై మోస్తూనే ఉండాలా.. వాళ్లకు పల్లకీ ఎక్కే అవకాశం రాదా ? రానివ్వరా? లారీ డ్రైవర్ ఓనరు కాడా అన్నట్లుగా నిరుపేదలు. అసలు పూట గడవడమే కష్టం అని భావిస్తున్నవాళ్లకు చట్టసభల్లో పోటీ చేసే అవకాశం రావడం అంటే ? వామ్మో ఇది ఊహిస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది.. అది నిజంగా జరిగితే? నిజంగా మనకళ్లముందే జరిగితే.. ఆ అద్భుతం చూడగలమా.. చూద్దాం.. ఎన్నికలు అంటేనే లక్షలు కోట్లు పంచాల్సిన పరిస్థితి. అలాంటిది ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రోజు కూలీలకు రావడమా? అంత గొప్ప మనసు ఉన్న మారాజెవరు.. వాళ్లకు టిక్కెట్లిచ్చి ప్రజల్లోకి పంపే మహా నాయకుడెవరు..? ఇంకెవరు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డే. గతంలో ఎంతోమంది సాధారణ కార్యకర్తలకు చట్టసభల్లో స్థానం కల్పించిన సీఎం జగన్ ఈసారి కూడా అదే ఒరవడి కొనసాగించారు. 2019 ఎన్నికల్లో అరకు ఎంపీగా గెలిచినా గొట్టేటి మాధవి.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ వంటి ఎంతోమంది అత్యంత సాధారణమైన కార్యకర్తలు.. ఉండడానికి సరైన ఇల్లే లేని పరిస్థితి.. జీవనానికి ఏదో ఒక ఉద్యోగం చేసుకునే స్థితి.. కానీ వాళ్ళను గుర్తించి తన ప్రతినిధులుగా ప్రజల్లోకి పంపించి వాళ్లకు ఏకంగా ఢిల్లీ సభలో కూర్చోబెట్టారు. ఇదే ఒరవడి మొన్నటి స్థానికసంస్థల ఎన్నికల్లోనూ కొనసాగించి ఎంతోమంది పేదలు చివరకు వాలంటీర్లను సైతం సర్పంచులు, ఎంపీపీలుగా గెలిపించారు. ఇక ఇప్పుడు కూడా సింగనమల ఎమ్మెల్యేగా వీరాంజనేయులుకు అవకాశం ఇచ్చారు. అయన జీవనం కోసం టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నారు.. జగనన్న నిన్ను ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇస్తున్నారు అని చెప్పగానే... హహ.. భలే జోక్ అనుకున్న అయన నిజం అని తెలుసుకుని షాకయ్యారు. నేను పార్టీలో సాధారణ కార్యకర్తను. అలాంటి నన్ను ఎమ్మెల్యేగా పోటీ చేయించడం అంటే నాలాంటి పేదలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే. శక్తివంచన లేకుండా పని చేసి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం ముందు నిలబడతాను అంటున్నారు అయన. ఇదే తరహాలో మడకశిర నుంచి ఈర లక్కప్ప అనే ఉపాధిహామీ కూలీని ఎమ్మెల్యేగా నిలబెట్టారు. అప్పుడెప్పుడో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన ఇందిరమ్మ ఇల్లు అనే చిన్న నివాసంలో ఉంటున్న లక్కప్ప కూడా తాను ఎమ్మెల్యే అభ్యర్థిని అంటే ముందు నమ్మలేదు.. ఇప్పుడు ఆయనే మెడలో కండువా వేసుకుని జగనన్న ప్రతినిధిని అంటూ ఊరూరా తిరుగుతున్నారు. జగనన్న తెచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయి అని వాళ్ళు నమ్ముతున్నారు. మాలాంటి వాళ్ళం సర్పంచులం కావడమే గగనము. అలాంటిది మమ్మల్ని ఎమ్మెల్యేలుగా చేస్తున్నారంటే పేదలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు అంటే జగనన్నకు ఎంత మక్కువ అని వాళ్ళే అబ్బురపడిపోతున్నారు. డబ్బుంటేనే టిక్కెట్.. లేదంటే వెళ్లండమ్మా చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందు సాధారణ కార్యకర్తలే రాజకీయాలు చేసేవాళ్ళు. కానీ ఆయనొచ్చాక ఓటుకు ఇంత అని రేటుపెట్టి మరీ కొనుగోలు చేయడం మొదలెట్టి.. ఎన్నికలను బాగా ఖరీదు వ్యవహారంలా చేసారు.. నీకు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలా? ఎంత ఉంది? ఎన్ని కోట్లు ఖర్చు చేస్తావ్.. ఎన్నికోట్లు పార్టీకి ఇస్తావు అనే మాట తరచూ చంద్రబాబు నోట వస్తుంది. కోట్లున్నవాళ్లకే తప్ప ప్రజల్లో ఉన్నవాళ్లు ఎవరికీ టీడీపీ టికెట్లు దక్కడంలేదు.. దీంతో టీడీపీ నాయకులంతా కోటీశ్వరులే అని వేరే చెప్పక్కర్లేదు. ఎంపీ.. ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. రాజ్యసభ ఇలా ఏ పదవికి అయినా వందలకోట్లు పెట్టాల్సిన పరిస్థితి చంద్రబాబు తీసుకొచ్చారు. దానికితోడు ఎన్నికల్లో ఇన్నికోట్లు ఓటర్లకు పంచాలి. గెలిస్తే అంతకంతా రికవర్ చేస్తావులే..రకరకాలుగా దోచుకునేందుకు నేనే ఆద్యమార్గాలు చూపిస్తాను అని కూడా చంద్రబాబు హింట్ ఇస్తున్నారు.. నాడు హైటెక్ సిటీ భూముల దగ్గర్నుంచి అమరావతీ రాజధాని భూముల దోపిడీ వరకూ చంద్రబాబు పాత్ర ఉంది అంటే ఇదే కారణం. పార్టీ నాయకులను భూములమీదకు ఉసిగొల్పి వాటిని ఎలా కాజేయాలా అనేది కూడా ఆయనే సలహా ఇస్తుంటారు. ఇక ఇప్పుడు సీఎం వైయస్ జగన్ ఐతే రాజకీయాలకు కొత్త భాష్యం చెబుతూ పేదలు.. సాధారణ కార్యకర్తలు సైతం ఎమ్మెల్యేలు ఎంపీలు కావచ్చని నిరూపించడమే కాకుండా తన విలువలను ...కొనసాగిస్తూ ఈసారి కూడా మామూలు కార్యకర్తలకు టిక్కెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ///సిమ్మాదిరప్పన్న/// -
‘అన్నన్నా.. మోదీనే పొగుడుతావా?’
పగవాడికి కూడా రాకూడని కష్టం చంద్రబాబుకు వచ్చింది.. జస్ట్ ఐదేళ్ల క్రితం ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తరువాత మోదీని.. బీజేపీని చంద్రబాబు ఏన్నేసి మాటలన్నారు. ధర్మపోరాట దీక్షలు అంటూ జిల్లాకు కోటి ఫండ్స్ రిలీజ్ చేసి మరీ మోదీని అయన తిట్టడమే కాకుండా క్యాడర్.. ఎమ్మెల్యేలు.. ఎంపీలతో సైతం తిట్టించారు.. మోదీని బహుశా రాజకీయ శత్రువులు.. కాంగ్రెస్ వాళ్ళు సైతం అన్ని తిట్లు తిట్టలేదేమో! చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక ఒకసారి ఏపీకి మోదీ వస్తుంటే.. ఎందుకు వస్తున్నారు? సిగ్గుందా? అని ట్వీట్ చేశారు చంద్రబాబు. ఇప్పుడు మళ్ళా చాన్నాళ్ల తరువాత మోదీతో చిలకలూరిపేటలో వేదిక పంచుకున్న చంద్రబాబు.. మళ్ళీ మోదీ భజన మొదలెట్టారు. మేకిన్ ఇండియా.. వికసిత భారత్.. అమృత్ భారత్.. ఇలా ఒకటా రెండా ? ఆయన్ను కీర్తిస్తూ చాలాసేపు మాట్లాడారు . ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మోదీ అంటే ఆత్మవిశ్వాసం మోదీ అంటే ఆత్మగౌరవం మోదీ అంటే అభివృద్ధి మోదీ అంటే సంక్షేమం మోదీ అంటే ఒక వ్యక్తి కాదు మోదీ అంటే భారత్ ను విశ్వ గురువు గా మారుస్తున్న శక్తి... మోదీ అంటే సబ్ కా సాత్ మోదీ అంటే సబ్ కా వికాస్ మోదీ అంటే సబ్ కా విశ్వాస్ ఇలా ఒకటే కీర్తనలు.. ఒకటే చిడతలు.. ఒకటే భజన.. ఆనాడు ‘‘ఏయ్ మోదీ.. నువ్వో ఉగ్రవాదివి.. నువ్వో టెర్రరిస్ణ్టువి నిన్ను ఉరితీయాలి.. పెళ్ళాన్ని చూడలేనివాడు.. తల్లిని చూడలేనివాడు దేశాన్ని చూస్తాడా అని ఆనాడు వెక్కిరించినా చంద్రబాబు నేడు అదే నోటితో మోదీని కీర్తించడం చూసి బీజేపీ క్యాడర్ విస్తుపోయింది.. అవకాశం వస్తే బాబు ఇంతలా దిగజారిపోతాడా? అని ముక్కునవేలేసుకుంది . మరోవైపు మోడీ కూడా ఆంధ్రకు ఏమి చేసాం అన్నది వివరించారు.. విశాఖలో ఐఐఎం .. గోదావరి జిల్లాలో నిట్.. తిరుపతిలో ఐఐటి.. మంగళగిరిలో ఎయిమ్స్ ఇలా కేంద్రం ఇచ్చిన విద్యాసంస్థల గురించి వివరించారు తప్ప ఆనాడు చంద్రబాబును విమర్శించిన రీతిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని దునుమాడలేదు. ఇక సభ ఆద్యంతం మైకులు మొరాయించాయి.. ప్రతి ఐదు నిముషాలకు ఒకసారి మైకులు కట్ అవడంతో టీవీల్లో చూసేవాళ్ళు అసహనానికి లోనయ్యారు. :::సిమ్మాదిరప్పన్న -
చిరంజీవి ఒక్క దెబ్బతో ముగింపు.. పవన్ కల్యాణ్ మాత్రం..
మన ఇళ్లలో పెళ్లిళ్లు.. పేరంటాలు.. ఫంక్షన్స్ జరుగుతున్నపుడు చూస్తున్నదే.. బాగా దగ్గరి బంధువులను ‘ఆ మనవాళ్లే ఏమనుకోరులే’ అంటూ వాళ్ళను పట్టించుకోము. సింపుల్‌గా తీసి పడేస్తాం.. కానీ వాళ్ళు.. ఎక్కడెక్కడి నుంచో వచ్చినవాళ్ళను మాత్రం మూడేసి సార్లు పలకరించి టీ, కాఫీలు అందించి వాళ్లకు ఎక్కడలేని ప్రాధాన్యం ఇచ్చి నెత్తినబెట్టుకుంటాం.. చివరకు తేలేది ఏమంటే మనకు కష్టం వచ్చినపుడు మాత్రం మళ్ళీ మన చుట్టూ చేరేది మనవాళ్లే.. ఇందాక మనం అధిక ప్రాధాన్యం ఇచ్చినవాళ్లెవరూ మళ్ళీ కనిపించరు. జనసేనాని పవన్ సైతం తన పార్టీని అచ్చం అలాగే నడిపిస్తున్నారు. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్న తిరుపతి కిరణ్ రాయల్, విశాఖ బొలిశెట్టి సత్యనారాయణ వంటివాళ్లను టిక్కెట్ల విషయంలో ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. వాళ్ళు మనవాళ్లే కదా.. మనకు అలవాటైనవాళ్లు.. యాడికి పోతారులే.. మన గుమ్మం ముందే ఉంటారు అనే నమ్మకమో.. ఇంకేదో కానీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేదు. భీమిలిలో పంచకర్ల సందీప్ పరిస్థితి కూడా ఇదే.. పాపం ఎన్నాళ్ళనుంచో పార్టీలో ఉన్నా చివరకు టిక్కెట్ దక్కలేదు. ఎవరెవరికో టిక్కెట్లు దక్కడం.. అదికూడా టీడీపీ నుంచి వచ్చినవాళ్ళను టిక్కెట్లు ఇవ్వడాన్ని చూస్తుంటే పొత్తులో భాగంగా వచ్చిన ఆ 21 సీట్లలో అధిక భాగం చంద్రబాబు చెప్పినవాళ్లకే ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా సీట్లు ఇచ్చినందుకు కూడా ఎంతో కొంత ప్యాకేజీ అందుకున్నారేమో అనే సందేహాలు కూడా పార్టీలో వెల్లువెత్తుతున్నాయి. అనంతపురంలో లక్ష్మీపతి, వైజాగ్‌లో సుందరపు సతీష్ లాంటి నేతలు పార్టీకోసం ఎంతో కష్టపడ్డారు. ఆర్థికంగా కూడా అండగా నిలిచారు. వాళ్ళు విరాళాల రూపంలో కూడా భారీగా ముట్టజెప్పినా చివరకు వాళ్లకు ఏమీ లేకపోవడంతో వారి అనుచరులు రగిలిపోతున్నారు. తెలుగుదేశంలో టిక్కెట్లు రానివాళ్లను చంద్రబాబే మెల్లగా జనసేనలోకి పంపించి టిక్కెట్లు ఇప్పిస్తున్నారని ఆ క్రమంలోనే మొదటి నుంచీ ఉన్న అసలైన జనసేన కేడర్‌ను తొక్కేసి టిక్కెట్లు ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని ఏర్పాటు చేసి దాన్ని నడపలేక ఏకమొత్తంలో కాంగ్రెస్‌కు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. ఆయన్ను నమ్ముకున్న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది అభిమానులు.. వేలాది మంది కార్యకర్తలు ఘోరంగా నష్టపోయారు, మోసపోయారు. అయితే, అది ఒక దెబ్బతో ముగిసింది. కానీ ఇప్పుడు పవన్ మాత్రం.. ఎన్నికలవారీగా.. అంటే ఐదేళ్లకు ఒకసారి ఇలా విడతలవారీగా పార్టీని టీడీపీకి తాకట్టుపెట్టేసి కేడర్‌ను, కాపులను మోసం చేస్తున్నారని వాపోతున్నారు. ఈ టిక్కెట్ల విషయంలో కూడా భారీగా డబ్బులు చేతులు మారినట్లు కేడర్‌లో అనుమానాలు ఉన్నాయ్. రాజ్యాధికారం సాధిస్తాం.. ఎవరివద్దా ఊడిగం చేయం అని మీటింగుల్లో గట్టిగా అరిచే పవన్ తానే ఏకంగా చంద్రబాబుకు లొంగిపోయి పార్టీని అప్పగించేశారని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. -సిమ్మాదిరప్పన్న. -
ఏపీ బీజేపీ మౌనమా.. ముభావమా?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, బీజేపీ జనసేనతో కూడిన కూటమిని కూర్చిన తరువాత ఎందుకనో ఆ సందడి లేదు. పెళ్లి సమయంలో ఉన్నప్పటి కళ కాపురానికి వెళ్లేసరికి లేనట్లుగా మారింది. దీంతో ఇది కొంపదీసి వన్ సైడ్ లవ్వు గట్రా కాదు కదా అనే సందేహాలు వస్తున్నాయి. దానికితోడు కొంపదీసి చంద్రబాబు ఎప్పట్లానే తన నిజరూపాన్ని బయటకు గానీ తీసారా? దాని దెబ్బకే బీజేపీ వాళ్లకు అందులోని ప్రధాన పార్ట్నర్కు బుర్ర తిరిగిపోయి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయిందా అనే డౌట్స్ తన్నుకొస్తున్నాయి. ఒంటె సాయిబు కథ మాదిరి.. చంద్రబాబు మళ్లీ తన స్మార్ట్ బుర్రను వాడి బీజేపీని తొంగోబెట్టే ఎత్తులు వేసారా? వేస్తున్నారా? అనే అనుమానాలు బీజేపీ పెద్దల్లో ఉన్నాయి అంటున్నారు. అందుకే కూటమిలో ఇటు టీడీపీ.. జనసేన పార్టీలు ఎవరికివారు సీట్లు.. స్థానాలు ఖరారు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా బీజేపీ మాత్రం ఎక్కడా చప్పుడు చేయడం లేదు.. అసలు కూటమిలో ఉందా లేదా అన్నట్లుగా గుంభనగా ఉంది. వాస్తవానికి పొత్తుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగిన చంద్రబాబు మొత్తానికి నానా రికమెండేషన్ల తరువాత ఢిల్లీ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ సంపాదించి వారిని ఎలాగోలా పొత్తుకు ఒప్పించారు. అయితే, ఆయన ఆ చర్చల సందర్భంగా అక్కడ ఇచ్చిన సీట్ల హామీ వేరని, ఢిల్లీ నుంచి వచ్చాక ఇక్కడ ఆయన చేస్తున్న రాజకీయం వేరని అంటున్నారు. ఢిల్లీ పెద్దలతో చర్చల సందర్భంగా బీజేపీకి కనీసం పది లోక్‌సభ.. అదే సంఖ్యలో అసెంబ్లీ సీట్లు ఇచ్చేనందుకు బాబు ఒప్పుకున్నారని అంటున్నారు. ఇక, ఆంధ్రాకు వచ్చాక మాట మార్చేసి ఆరు లోక్‌సభ, ఓ పది.. అంతకన్నా తక్కువ శాసనసభ సీట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని చెబుతూ తన లెక్కలనే ఎల్లోమీడియాలో కథనాలు రాయించారని బీజేపీ గుర్తించింది. అందుకే ఎకాఎకిన కేంద్ర జలవనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను ఢిల్లీ పెద్దలు తమ ప్రతినిధిగా ఆంధ్రకు పంపించారు. ఇక్కడ కూడా బాబు తన అతి తెలివి చూపించి ఆయన్ను బురిడీ కొట్టించాలని చూశారని తెలుస్తోంది. ఢిల్లీలో చెప్పిన మాటకు ఇక్కడి మాటకు తేడా రావడంతో ఒక రోజంతా ఇక్కడే ఉండి లెక్కలు తెలుద్దామని భావించిన షెకావత్ మొత్తానికి ఏమీ ఫైనల్ చేయలేక బాబు అతి తెలివికి సమాధానం చెప్పలేక బుర్ర ఖరాబై ఢిల్లీ వెళ్లారు. గంటలకొద్దీ చర్చ జరిగినా ఒక్క ముక్కా అర్థం కానీ షెకావత్‌కు మాత్రం ఒకటి అవగతమైంది. ‘చంద్రబాబు మళ్ళీ బీజేపీని ముంచేయడం ఖాయం.. ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా బాబులోని మోసపూరిత బుద్ధి మారదు’. ఈ పాయింట్ అర్థం చేసుకున్న షెకావత్ ఢిల్లీ వెళ్లి బాబు ఇలా మాట మారుస్తున్న విషయాన్నీ పార్టీ పెద్దలకు నివేదించారని తెలుస్తోంది ఇక, అప్పట్నుంచి బీజేపీ సైలెంట్ అయిందని అంటున్నారు. ఇటు లెక్క ప్రకారం టీడీపీ 144 స్థానాల్లో పోటీ చేయనుండగా ఇప్పటికే 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 16 సీట్లను ప్రకటించగా ఇంకో ఐదు స్థానాలకు సరైన అభ్యర్థులు కోసం చూస్తున్నారు. వీళ్ళు ఇలా జోరుమీద ముందుకు పోతున్నా బీజేపీ మాత్రం ఎక్కడా ఒక్క సీట్ కూడా వెల్లడించలేదు. ఎందుకంటే ఇదే కారణం అని చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే సీట్లను అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు తప్ప పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకులతో చర్చించడం అనేదే లేదు. అంతా సింగిల్ హ్యాండెడ్‌గా ఆయన నిర్ణయాలు తీసుకుని అభ్యర్థులు.. స్థానాలను ఖరారు చేస్తూ పొతే ఇక మేమెందుకు అనే భావనలో బీజేపీ నాయకులు ఉన్నారని అంటున్నారు. మరోవైపు టీడీపీతో పొత్తు ఆంధ్రలోని ఒరిజినల్ బీజేపీ నాయకులకు ఇష్టం లేదని.. దాంతోబాటు బీజేపీ అభ్యర్థులను సైతం చంద్రబాబే ఖరారు చేస్తూ రావడం గతంలో చూశామని.. అలాంటప్పుడు తమకు విలువ ఏముందని రాష్ట్రంలోని ఒరిజినల్ బీజేపీ నాయకులూ కినుక వహించారని అంటున్నారు. అందుకే ఇవన్నీ రిపోర్టులు.. లెక్కలు బేరీజు వేస్తే తప్ప బీజేపీ తన అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. - సిమ్మాదిరప్పన్న -
నాగబాబు గాయబ్.. ఫోన్ స్విచ్ ఆఫ్!
సినిమాల్లో అంతే.. కొన్ని సీన్లను, కొంతమంది నటులను షూటింగులో షూట్ చేస్తారు. ఆ సీన్లు బ్రహ్మాండంగా వచ్చాయని, రష్ చూసి సంబరపడతారు. ఆ సీన్లు తనకు భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని, తననుంచి నటనను పిండుకోవడంలో డైరెక్టర్ చూపిన ప్రతిభ అంతా ఇంతా కాదని, అయితే అంతా తాను ప్రెస్మీట్లో చెప్పలేనని మిగతాది వెండితెరమీద చూస్తేనే అర్థం అవుతుందని నటీనటులు చెప్పుకుంటారు. తీరా చూస్తే సినిమా రిలీజయ్యాక ఆ సీన్లు ఉండవు.. ఏంది వయ్యా అంటే సినిమా నిడివి ఎక్కువైనందున ఎడిటింగులో ఆ సీన్లు తీసేశామని, చల్లగా చెబుతారు. సరే.. సినిమా లెంగ్త్ ఎక్కువైంది.. కొంత కట్ చేయాలి.. దానికి నేను నటించిన సీన్లనే తీసెయ్యాలా.. ఇంకేమీ లేవా అనే ప్రశ్నకు ప్రొడక్షన్ హౌస్ నుంచి సమాధానం ఉండదు.. ఇప్పుడు జనసేన అనే పొలిటికల్ సినిమాలో నాగబాబు పాత్ర కూడా అలాగే లేచిపోయింది. మొన్నటివరకు అంతా తానే అంటూ హడావుడి చేయడం.. సీనియర్ నాయకులూ.. మంత్రులు.. ఎంపీలను సైతం అచ్చం జబర్దస్త్ కామెడీ గాళ్ళను ఎటకారం చేసినట్లు చేయడం.. ట్విట్టర్లో పోస్టింగులు పెట్టడం.. దీంతో బాగా ఓవర్ యాక్షన్ చేసిన నాగబాబు ఇప్పుడు సరైన టైం వచ్చేసరికి గాయబ్ అయ్యారు. వాస్తవానికి నాగబాబును అనకాపల్లి ఎంపీగా ముందు ఫోకస్ చేసారు. ఈ నేపథ్యంలో ఆయన అచ్యుతాపురం వద్ద ఇల్లు కూడా రెంటుకు తీసుకుని కొన్నాళ్ళు కార్లు.. నౌకర్లు.. జెండాలతో హడావుడి చేసారు. దీంతో అక్కడ ఆయన కొన్నాళ్ళు ఉండడమే కాకుండా అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం పరిధిలో పర్యటనలు చేయడంతోబాటు ఆయన అన్నిటికన్నా ముఖ్యంగా కార్యకర్తల మీటింగ్ పెట్టారు. వారితో అదీ ఇదీ మాట్లాడుతూ అసలు విషయం చెప్పారు. ఏమంటే నిధులు.. విరాళాల గురించి మాట్లాడారు. వంద రూపాయల నుంచి ఎంత వరకైనా విరాళం ఇవ్వవచ్చని చెబుతూ నేరుగా క్యూ ఆర్ కోడ్‌ను సైతం చూపించారు. అంటే ఆయనకు పార్టీ ఇచ్చిన అసలు బాధ్యత విరాళాలు సేకరించడం అని కేడర్‌కు అర్థమైంది. దాంతోబాటు ఆయనకు క్యాడర్ మీద అధికారము చెలాయించడం తప్ప బాధ్యత కూడా లేదని వాళ్లకు మెల్లగా తెలిసొచ్చింది. ఇదిలా ఉండగానే అనకాపల్లి ఎంపీ సీటు జనసేనకు లేదని.. వేరే ఎవరికో కేటాయిస్తున్నారని సమాచారం బయటకు వచ్చింది. దీంతో నాగబాబు చిన్నగా ఇల్లు ఖాళీ చేసేసి ఎక్కడికో వెళ్లిపోయారు. సినిమా భాషలో చెప్పాలంటే ప్యాకప్ చెప్పేసారు. అంతేకాకుండా ఇప్పుడు ఫోన్లకు సైతం దొరకడం లేదని అంటున్నారు. ఫోన్లు ఏకంగా స్విచ్చాఫ్ చేసేశారని.. ఎక్కడున్నారోకూడా తెలియడం లేదని అంటున్నారు. ఆయనమీద నమ్మకంతో కొంతమంది భారీగా విరాళాలు సైతం ఇచ్చారు. అంతేకాకుండా ఆయన మరికొంతమందికి టిక్కెట్ హామీలు కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వాళ్లకు సమాధానం చెప్పలేక నాగబాబు పొలిటికల్ స్క్రీన్ మీద నుంచి పరారైనట్లు చెబుతున్నారు. తనతో కేవలం హడావుడి మాత్రమే చేయించారని.. టిక్కెట్ విషయానికి వస్తే తనకు ఏమీ లేకుండా చేసారని ఆయన అవమానంగా ఫీలవుతున్నట్లు తెలిసింది. ఇక జనసేనకు రెండంటే రెండే ఎంపీ స్థానాలు దక్కడంతో అందులో ఒకటి మచిలీపట్నం కాగా అక్కడి నుంచి వల్లభనేని బాలసౌరి పోటీ చేస్తున్నారు. ఇంకోటి కాకినాడ కాగా అక్కడ పవన్ బరిలో ఉంటారని అంటున్నారు. దీంతో నాగబాబుకు ఎంపీ సీట్ ఎక్కడా కనిపించడం లేదు. పోనీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అంటే దానికి ఆయన ఆసక్తి చూపడం లేదు. చేస్తే ఎంపీగానే అనేది ఆయన ఆలోచన. గతంలో 2019 లో కూడా ఆయన నరసాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయనకు ఏకంగా టిక్కెట్ కూడా లేకపోవడంతో తాను కేడర్‌కు మొహం చూపించలేక మొత్తం గాయిబ్ అయినట్లు చెబుతున్నారు. రెండు వారాలుగా ఆయన ఎక్కడా సభలు.. సమావేశాల్లో కానరావడం లేదు. ఎక్కడున్నారో తెలీదు. మొత్తానికి విరాళాలు దండుకుని పారిపోయారని కొందరు సెటైర్లు వేస్తున్నారు. -సిమ్మాదిరప్పన్న -
లోలోన కుమిలిపోతూనే.. పవర్ లెస్‌గా పవన్ కల్యాణ్
అధికారంలో వాటా తీసుకుంటాం.. ప్రశ్నిస్తాం.. బాధ్యతగా ఉంటాం.. రాష్ట్రాన్ని మోస్తాం అంటూ హడావుడి చేసిన పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు సాంతం నాకేసాడు.. సీట్ల షేరింగ్.. సింహభాగం మాకే అంటూ వచ్చిన జన సైనికులకు నోట మాట రానివిధంగా జస్ట్ 24 ఎమ్మెల్యే సీట్లు మొహాన కొట్టిన చంద్రబాబు పవన్ నోరు మూయించారు. అయితే దానికి సేనాని ఇచ్చిన సమర్థింపు చూస్తే నవ్వాగదు.. అత్యంత శక్తిమంతమైన గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి కాబట్టి మేము పవర్ ఫుల్ గా 24 సీట్లు తీసుకున్నాం అని సమర్థించుకున్నారు. ఇప్పుడు ఆ ఇరవై నాలుగులో మూడు సీట్లను బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. అదేమీ తీరో.. అదేం పంపకమో కానీ నూట యాభై సీట్లున్న చంద్రబాబు వాటాలోంచి కాకుండా ఇరవై నాలుగు సీట్లున్న పవన్ వాటా సీట్లలోంచి మాత్రమే బీజేపీకి ఇవ్వాల్సి రావడం.. తన రాజకీయ మనుగడ మీద ఏమాత్రం సోయి ఉన్నవాడైనా దీనికి అంగీకరించరు కానీ పవన్ మాత్రం బాబు ఎలా చెబితే అలా ఆడుతున్నారు. ఇక ఇప్పుడు ఆ ఇరవై ఒక్క సీట్లకు కూడా అభ్యర్థులను చంద్రబాబే సూచిస్తారు.. అయన చెప్పినవాళ్లకే జనసేన తరఫున సీట్లు దక్కుతాయి. ఇక ఇప్పుడు 21 సీట్లకు పవన్ కల్యాణ్ పరిమితం అవ్వడం పట్ల సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.. ఇప్పుడిచ్చిన 21 సీట్లను ఎలా సమర్థించుకుంటావు పవన్ అంటూ ట్విట్టర్, ఫేస్బుక్కుల్లో కామెంట్స్.. చురకలు.. వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. స్కాండియం యొక్క పరమాణు సంఖ్య -21 కోడి పొదగడానికి పట్టే సమయం -21 రోజులు. ఈరోజు డేట్ 12...దాన్ని తిరగేస్తే వచ్చేది -21 వినాయకుడి కి పూజ చేసే ఆకుల రకాలు 21 మొత్తం Alphabets without vowels - 21 నేనూ ఏడు అడుగులు మూడు సార్లు వేసా 7×3=21 పెళ్లి చేసుకోడానికి కనీస వయసు -21 ఏళ్ళు. 21st century = 21 సీట్లు జగన్ పుట్టినరోజు -21... ఇలా చెప్పుకుంటూ పోస్టింగులు పెడుతున్నారు. మరోవైపు బీజేపీలోకి కూడా చంద్రబాబు తన కార్యకర్తలను పంపుతూ ఆ పార్టీని కబ్జా చేస్తున్నారని, గతంలో ఏదైతే జరిగినదో, బీజేపీకి ఎలా నష్టం చేకూర్చారో ఇప్పుడూ అదే చేస్తున్నారని హార్డ్ కొర్ బీజేపీ క్యాడర్ ఆవేదన చెందుతోంది. ఇక జనసేన పరిస్థితి కూడా ఐస్ ముక్క మాదిరి క్షణక్షణానికి కరిగిపోతూ ఎన్నికలనాటికి ఏ ఐదారు.. పది సీట్లకు పరిమితం అయినా అవ్వొచ్చని జనసైనికులు లోలోన కుమిలిపోతున్నారు. చంద్రబాబుతో పొత్తు.. మా పవన్ కల్యాణ్ చిత్తు చిత్తు అని కామెంట్స్ చేస్తున్నారు -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
టిక్కెట్ కోసం అంత దూరమా ?
మొత్తానికి తెలుగుదేశం... జనసేన.. బీజేపీ మధ్య పొత్తుకుదిరింది.. ఇప్పుడు సీట్ల పంపిణీ జరగాలి... ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నది తేలాలి.. ఎవరు తేల్చాలి.. ఇంకెవరు.. చంద్రబాబే తేల్చాలి... జనసేనకు ఏమేం ఇవ్వాలి.. ఎక్కడెక్కడ ఇవ్వాలన్నది ఆయనే తెలుస్తారు.. ఈక్రమంలో అనకాపల్లి ఎంపీ సీటు కూడా బీజేపీకి ఇస్తున్నారని అంటున్నారు. అంటే అక్కడ మొన్నటివరకు నాగబాబు పోటీ చేస్తారని అన్నారు.. కొన్నాళ్ళు అక్కడ ఇల్లు అద్దెకుతీసుకుని సైతం ఆ ప్రాంతంలో పర్యటించారు కానీ గెలుపుమీద నమ్మకం లేక రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసారు. దీంతో అక్కడ పోటీ చేసేందుకు బీజేపీ తరఫున సీఎం రమేష్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో రాజ్యసభ సభ్యుడు అయిన రమేష్.. 2019 లో టీడీపీ ఓడిపోగానే చంద్రబాబు సలహామేరకు బీజేపీలో చేరారు.. ఇప్పుడు అయన ఏకంగా అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. కడప వాసి అయిన రమేష్ ఏకంగా రాష్ట్రానికి ఈ చివర ఉన్న అనకాపల్లి వచ్చి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. దీంతోబాటు ఏలూరు - పురందేశ్వరి అనకాపల్లి - సీఎం రమేష్ రాజమండ్రి - సుజనాచౌదరి హిందూపురం - వి.సత్యకుమార్ రాజంపేట - కిరణ్ కుమార్ రెడ్డి అరకు - కొత్తపల్లి గీత సైతం బీజేపీ నుంచి ఎంపీ టిక్కెట్స్ ఆశిస్తున్నారు ఇదిలా ఉండగా బీజేపీ రాజ్యసభసభ్యుడు జివిఎల్ నరసింహారావు కొన్నాళ్లుగా విశాఖలో మకాం వేసి ఉన్నారు.. అయన కూడా విశాఖ లోక్ సభ టిక్కెట్ ఆశిస్తున్నారు. అలా ఇస్తే మొత్తం విశాఖ... అనకాపల్లి.. అల్లూరి జిల్లాల్లోని మూడు ఎంపీ టికెట్స్ కూడా బీజేపీకి ఇచ్చినట్లు అవుతుంది.. మరి తెలుగుదేశం నుంచి గతంలో ఓడిపోయినా గీతం చైర్మన్ , బాలకృష్ణ అల్లుడు శ్రీ భారత్ కూడా విశాఖ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు కదా...మరి ఆయన్ను ఎలా బుజ్జగిస్తారు. అది చూడాలి... ప్రస్తుతానికి మూడు ఎంపీలదగ్గర మొదలైన జనసేన టీడీపీ పొత్తు రెండు స్థానాలకు దిగింది.. ఇప్పుడేమో ఒకదానిలో పవన్ పోటీ చేస్తే ఇంకొక్క ఎంపీ మాత్రమే మిగిలింది.. అది ఎవరికీ ఇస్తారో చూడాలి.. పవన్ కళ్యాణ్ పరిస్థితి పంచపాండవులు మంచం కోళ్లలా ముగ్గురు అన్నట్లుగా రోజురోజుకూ దిగజారిపోతూ పాతాళానికి చేరింది. -సిమ్మాదిరప్పన్న -
సిద్ధం ఓ సభ కాదు.. ఓ సింహనాదం
ఇటీవల తెలుగురాష్ట్రాల్లో.... ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ.. ఏ పార్టీకి సాధ్యం కానీ రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సిద్ధం సభలు చరిత్రాత్మకం అయ్యాయి. భీమిలి, దెందులూరు, రాప్తాడు నియోజకవర్గాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర్వహించిన సభలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మొత్తాన్ని వేడెక్కించాయి. లక్షలాదిగా హాజరవుతున్న జనం సీఎం వైయస్ జగన్ పట్ల తమకు ఎంత అభిమానం ఉన్నదో.. ఆయనకు ప్రజల్లో ఎంతటి ఆదరణ ఉన్నదో తేటతెల్లం చేశారు. అంతేకాకుండా సిద్ధం స్థాయి సభలు నిర్వహించాలని ప్రతి పార్టీ కూడా తలపోసి రీతిలో ఈ సభలు జరుగుతున్నాయి. లక్షలాదిగా వచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి అధినేత జగన్ చేస్తున్న ప్రసంగాలు సొంత క్యాడర్లో ఉత్తేజాన్ని నింపుతుండగా అవతలి పార్టీల పాలిట అదో సింహనాదం మాదిరి వినిపిస్తోంది. ఒకదాన్ని మించి ఇంకోటి అన్నట్లుగా భీమిలి సభను మించి దెందులూరు సభ నిర్వహించారు.. దాన్ని మించి రాప్తాడు సభ జరిగింది.. ఇప్పుడు అద్దంకిలో ఏకంగా పదిహేను లక్షలమందితో అంటే అచ్చంగా ఓ యుద్దాన్ని తలపించే రీతిలో సైన్యాన్ని సమీకరించి జగన్ చేసే ప్రసంగం ప్రతిపక్షాల గుండెల్లో భయాన్ని రేపిన సభలు ఇవి. ఒక్కో సభ జరిగేకొద్దీ ప్రజల్లో పార్టీకి క్రేజ్ పెరుగుతూ వస్తోంది... మళ్ళీ వచ్చేది జగనే... ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్నా చివరకు గెలిచేది జగనే.. అనే సందేశం... ఓ పాజిటివ్ అభిప్రాయం సమాజంలోకి దూసుకు వెళ్తోంది. దానికితోడు.. మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి.. మంచి జరగకపోతే ఓట్ వద్దు అని వైయస్ జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేయడం కూడా ప్రజలను ఆలోచింపజేస్తోంది. అదీ మాట ... అదీ మగాడితనం అంటే... అదిరా దమ్ము అనే అభిప్రాయం సైతం ప్రజల్లోకి వెళ్ళింది. తాను ఈ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఏమి చేసానన్నది రొమ్ము విరుచుకుని మరీ చెబుతున్నారు. అటు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రసంగాలు.. నిర్వహిస్తున్న సభల్లో కేవలం జగన్‌ను తిట్టడానికి తప్ప తాము ప్రజలకు ఏమి చేస్తామన్నది చెప్పలేకపోతున్నారు. సిద్ధం సభలకు... ప్రతిపక్షాల సభలకు ఇది కదా అసలు తేడా... నిర్వహించి ఎన్నిలకు తాము సిద్ధం అని పొలికేక పెట్టిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే సిరీస్ లో భాగంగా ఇప్పుడు అడ్డంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో మరో బహిరంగ సభకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల క్యాడర్‌ను ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న సిద్ధం సభకు సంబంధించి ఇప్పటికే ప్రచారం మొదలైంది. దాదాపు పదిహేను లక్షల మంది కార్యకార్యకర్తలు హాజరవుతారని భావిస్తున్న మెదరమెట్ల సభ పార్టీకి మరింత ఊపు తేనుంది. భీమిలీ, దెందులూరు, రాప్తాపాడు లలో జరిగిన సభలు రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దమ్మును, ప్రజాదరణను తెలియజేయగా ఈ నాలుగో సభ కూడా ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తే విధంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. లక్షలాది మంది హజరయ్యే ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎక్కువ మంది వీక్షించే విధంగా ఎల్ ఈడీ స్క్రీన్ లు అమర్చారు. సీఎం వైయస్ జగన్ కార్యకర్తలకు మరింత చెరువ కావడానికి వీలుగా ర్యాంప్ లు ఏర్పాటు చేశారు. ఇదే సభలో సీఎం వైయస్ జగన్ ఎన్నికల మేనిఫేస్టో లో కొన్ని అంశాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇటు వరుస సిద్ధం సభలతో వైఎస్సార్ సీపీ దూసుకుపోతుండగా అటు ప్రత్యర్ధి టీడీపీ, జనసేన కూటమి ఇలాంటి సభ ఒక్కటి కూడా నిర్వహించలేకపోవడం వారి అనైక్యతను, ప్రజల్లో వారికున్న బలాన్ని తేటతెల్లం చేస్తోంది. ఒకవైపు అభ్యర్ధులను ప్రకటిస్తూ.. వరుస సభలతో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ కూటమి పొత్తులు, బేరసారాల పేరుతో ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తుంది. మేదరమెట్ల సిద్ధం సభ తర్వాత ప్రజల్లో సీఎం వైయస్ జగన్ కు ఉన్న ఆదరణ మరోమారు తెలుస్తుంది . దీంతరువాత ప్రతిపక్షాల పరిస్థితి దిక్కుతోచని విధంగా తయారవుతుంది. మరోవైపు ఇప్పటికే ఆంధ్రాలో మళ్ళీ జగనే వస్తారనే పాజిటివ్ టాక్ ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్, బిజెపి .. ఇలా ఎన్ని పార్టీలు కలిసినా జగన్ ను ఎదుర్కొవడం అంత ఈజీ కాదని టాక్ వినిపిస్తోంది. అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి పథకాలతో అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని నిలువరించడం కష్టమని ఇప్పటికే టీడీపీ, జనసేన క్యాడర్ అభిప్రాయపడుతోంది. ✍️సిమ్మాదిరప్పన్న -
చంద్రబాబుకు రాజకీయ జాగరణ
శివరాత్రి.. దేశం యావత్తు శివనామ స్మరణతో తెల్లవార్లూ రెప్ప వేయకుండా జాగరణ చేసి.. ముక్తిని.. మోక్షాన్ని శివానుగ్రహాన్ని పొందేందుకు భక్తులు తాపత్రయ పడతారు. అయితే, రాజకీయ భక్తుడు చంద్రబాబు సైతం అచ్చం సాదా భక్తుడి మాదిరిగానే అమిత్ షా గుమ్మం ముందు వేళ్ళాడుతూ తెల్లవార్లూ రెప్ప వేయకుండా ఎదురుచూశారు. శివలింగాన్ని పట్టుకుని వదలని మార్కండేయుడి మాదిరి, చంద్రబాబు సైతం అమిత్ షా గుమ్మం వద్ద వేళ్ళాడుతూ తన భక్తిని చాటుకున్నారు. దీంతోబాటు అమిత్ షా ఇంటి చుట్టూ ప్రదక్షిణలు సైతం చేసి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన భక్తుడి రూపంలో చంద్రబాబు పరివర్తన చెందారు. ఇంత చేసినా ఢిల్లీ పెద్దలు కరుణించడం లేదు. ఆయన ఓ భస్మాసురుడు అన్నది బీజేపీకి తెలుసు. వరాలిచ్చిన ఈశ్వరుణ్నే అంతం చేయాలని చూసిన భస్మాసురుడికి చంద్రబాబుకు సారూప్యతలు ఉన్న సంగతి బీజేపీ మరచిపోలేదు. బీజేపీ అండతో.. వాజపేయి చలవతో గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తరువాత మోదీని, బీజేపీని ఎన్నెన్ని మాటలన్నది వాళ్లకు గుర్తుంది. ఆ తరువాత మోదీని ఉరితీయాలన్న అంశంతోబాటు 2019లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక మోదీని, అమిత్ షాను ఎన్నెన్ని మాటలన్నది సైతం వాళ్లకు గుర్తుంది. వరం ఇచ్చేవరకూ ఒకలెక్క.. వరం అందుకున్నా సాక్షాత్తు శివయ్యను భస్మం చేసేందుకు భస్మాసురుతూ వేసిన ఎత్తులే అచ్చం చంద్రబాబు వేస్తున్నారన్నది బీజేపీ పెద్దలు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆలయం ఎదుట నంది ఎదురుచూస్తున్న మాదిరి ఆయన్ను అమిత్ ఇంటి గుమ్మం వద్ద రెండ్రోజులపాటు వెయిట్ చేయించారు. ఎట్టకేలకు కాసేపటి క్రితమే అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వడంతో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ వెళ్లి ఆయనను కలిశారు. వీరి భేటీలో భాగంగా పొత్తుల గురించి ప్రత్యేకంగా చర్చ జరిగినట్టు సమాచారం. మరోవైపు.. రెండు రోజుల పాటు చంద్రబాబు వేచి చూడటంపై సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు.. మీమ్స్, సెటైర్లు సర్క్యులేట్ అవుతున్నాయి. మొత్తానికి దేశం మొత్తం శివరారాత్రిని ఒక తీరున జరుపుకోగా చంద్రబాబు మాత్రం బీజేపీని ప్రసన్నం చేసుకునే యత్నంలో నిద్రలేని రాత్రులు గడిపారు. - సిమ్మాదిరప్పన్న -
ఎంపీగా గెలిచి సీఎంగా సేవ చేయాలి
బీకాం చదివి డాక్టర్ అయ్యి..బోలెడు బిల్డింగులు నిర్మించి రైతులకు లాభం చేకూర్చి సైన్యంలో చేరి యుద్ధం చేసి ఓడలు నడపాలి.. ఇదే నా లక్ష్యం అన్నాడొక స్మార్ట్ బాయ్.. స్మార్ట్ అంటే..మహా స్మార్ట్.. తెలివి.. అతి తెలివన్నమాట. అంటే తానేం కావాలనుకున్నదీ.. ఆ దిశగా తనేం చేస్తున్నదీ తెలియని ఓ మేధావితనం అన్నమాట. ఇప్పుడు జనసేనాని పవన్ సైతం అలాగే ఉన్నారు. పెద్దమ్మ చెరువు గట్టు మీద మూడు సుమోలు.. ఆ తరువాత మర్రి చెట్టు దగ్గర మూడు సుమోలు.. అదీ మిస్సయితే ఈసారి ఊరు పొలిమేర దగ్గర ఏకంగా ఆరు సుమోలు పెట్టాడు.. అన్నెందుకురా బుజ్జా అంటే..ఏమో..నాకు తెలీదు అంటాడు. తాను ముఖ్యమంత్రి అవడమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన పవన్ పరిస్థితి ఇప్పుడు జాతరలో తప్పిపోయిన పిల్లాడిలా ఉంది. పేరుకే జన సేన కానీ సైనికుల్లో బోలెడు సందేహాలు. సేనాని గమనం అనుమానాస్పదం.. ఎటు పయనిస్తున్నాడో తెలీదు. ఆయన లక్ష్యం గమ్యం.. గమనం అంతా సందేహాస్పదంగా ఉంటోందని సైనికుల కలవరం. ఆత్మ విశ్వాసం ఉన్న వారు నిర్ణయాలు ఠకీ ఠకీమని తీసేసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మాదిరిగా అన్నమాట. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 గెలిచి తీరతామన్న ధీమా నుంచి ‘వైనాట్ 175?’ పుట్టుకొచ్చింది ఈ ఆత్మ విశ్వాసం నుంచే. నియోజకవర్గాల ఇంఛార్జుల నియామకమూ టకటకా సాగిపోయింది కూడా తనపై, తన పార్టీ విధానాలపై, పరిపాలనదక్షతలపై ఉన్న నమ్మకం కారణంగానే.. వైఎస్సార్సీపీలో పరిస్థితి ఇలా ఉంటే.. ప్రతిపక్ష పార్టీల్లో జరుగుతోందేమిటి? అడుగుఅడుగునా బలహీనత! నీడను చూసి కూడా భయపడే పరిస్థితి. పొత్తుల కోసం తాపత్రయం. పొత్తు బలమిస్తుందన్న భ్రమ. ఇదిలా ఉండగా సీఎం అవుతానని పార్టీ పెట్టిన పవన్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ లో ఉన్నారు. తెలుగుదేశంలో పొత్తుతో 24 ఎమ్మెల్యే మూడు ఎంపీ సీట్లు తెచ్చుకున్న పవన్ ఇప్పుడు సీఎం పదవి సంగతి పక్కనబెట్టి తన రాజకీయ గమనాన్ని..మార్గాన్ని మార్చుకున్నారు. ఇప్పుడు తాను ఎంపీగా, ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో భీమవరం.. గాజువాకలో కూడా ఓడిపోయిన పవన్ ఇప్పుడు ఎంపీగా పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. అంటే...ఎంపీగా గెలిస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం వస్తుందని ఆయన చూస్తున్నారు. ఈ చంద్రబాబు.. జనసేన.. బిజేపీ పొత్తులో ఎలాగైనా ఎంపీగా గెలవాలన్న అశతో ఉన్న పవన్ ఈసారి అనకాపల్లి లేదా ఇంకో చోట ఎంపిగా పోటీ చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం.. బిజేపీ..జనసేనతో కూడిన ప్రభుత్వం రాకపోతే కనీసం కేంద్రంలో అయినా మంత్రిగా ఉండోచ్చనేది పవన్ ఆలోచన. అయితే ఆయన ఎక్కడ పోటీ చేస్తారు. ఎంపీగా గెలిచే సాధన సంపత్తి, క్యాడర్.. అన్నిటికీ మించి అటు టీడీపీ నుంచి సహాయం..మద్దతు ఉంటుందా అన్నది చూడాలి.. ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి ఎంపీగా ఎలా గెలుస్తారని వెక్కిరించేవాల్లు ఉన్నా పవన్ మాత్రం.. అటు ఎమ్మెల్యే..ఇటు ఎంపీగా బరిలో దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. - సిమ్మాదిరప్పన్న -
ఆస్తి నాకు.. పాస్తి నీకు.. నగ నాకు.. నట్రా నీకు
ఒరేయ్ మనం ఇద్దరం అన్నదమ్ములం.. ఏదున్నా ఇద్దరం సమానంగా పంచుకుందాం.. అందులో భాగంగా పొలం నాకు పుట్ర నీకు.. నగ నాకు నట్రా నీకు.. పాడి పంట నాకు పేడ పెంట నీకు... ఆస్తి నాకు.. పాస్తి నీకు .. ఇలా వాటాలు వేసేద్దాం.. చూసావా ఎక్కడా ఇందులో పక్షపాతం లేదు.. రెండూ సమానం. పెర్ఫెక్ట్ పంపిణీ అని అమాయకపు అన్నను మోసం చేసిన తమ్ముణ్ణి సినిమాల్లో చూసాం.. ఇప్పుడు రాజకీయాల్లో అచ్చం అలాంటి పంపిణీ జరుగుతోంది. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ మధ్య సీట్ల పంపిణీ చూస్తుంటే అదే గుర్తొస్తోంది. గెలిచే సీట్లన్నీ తెలుగుదేశం తీసుకుని ఖచ్చితంగా ఓడిపోయే సీట్లు మాత్రం జనసేనకు తగలబెట్టేందుకు చంద్రబాబు పక్కా వ్యూహం పన్నారు. అందులో భాగంగా కాపు ఓటర్లను చూసుకుని రాజమండ్రి రూరల్‌పై కందుల దుర్గేష్ ఆశలు పెట్టుకుంటే అది కూడా టీడీపీకి ఇస్తున్నారు. దుర్గేష్‌కు నిడదవోలు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వేరే ఊరు వెళ్ళేది ఓడిపోవడం కోసమే తప్ప అక్కడ అయన గెలిచేది లేదు. భీమిలిలో పంచకర్ల సందీప్‌ది ఇదే పరిస్థితి. చాలా కాలంగా సందీప్ కాపు ఓటర్లను చూసుకుని పవన్ కల్యాణ్ పేరిటి బోలెడుడబ్బులు ఖర్యు పెట్టాడు. అయితే అదంతా బూడిదలో పోసిన పన్నీరేనని చంద్రబాబు నిరూపిస్తూ భీమిలిని లాగేసుకున్నాడు. అనకాపల్లి మీద జనసేనకు కొంత హోప్స్ ఉన్నాయనే భ్రమలో ఇప్పటివరకూ పవన్ కల్యాణ్ ఉన్నాడు దాన్ని కూడా టీడీపీ లాగేసుకుంది. గాజువాకలో సేమ్ టూ సేమ్ ఇదే పరిస్థితి. అక్కడ ఉన్న స్థానిక సంస్థల్లో 90 శాతం హవా వైఎస్సార్సీపీదే. ఈ నాలుగు తీసుకున్నాం కాబట్టి మీకు నాలుగు సీట్లు ఇస్తున్నాం అంటూ రాయలసీమలో నాలుగు సీట్లు పవన్ మొకాన పడేస్తున్నారు. రాయలసీమ అంటే సీఎం వైఎస్ జగన్‌కు, వైఎస్సార్ కాంగ్రెసుకు బాగా పట్టున్న ప్రాంతం. గత ఎన్నికల్లో మొట్ట నాలుగుజిల్లాల్లోని 52 సీట్లలో 49 సీట్లు గెలిచి రొమ్ము విరుచుకుని నిలబడిన ప్రాంతమది. అక్కడ జనసేనకు నాలుగు సీట్లు ఇవ్వడం అంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకెళ్లి తొడకొట్టడం వంటిదే... నిర్దాక్షిణ్యంగా పీకకోసి ..బొచ్చు పీకి బిర్యానీ వండుకుని తినేస్తారు. అందుకే చంద్రబాబు కూడా ఎలాంటి ఆలోచన లేకుండా తాము ఖచ్చితంగా ఓడిపోయే సీట్లన్నీ పవన్‌కు ఇచ్చేసి చూసావా.. ఇచ్చిన మాట ప్రకారం మీకు ఇరవైనాలుగు సీట్లు ఇచ్చాము.. ఇక మీ చావు మీరు చావండి అన్నట్లుగా ఒక మాట చెప్పి పంపేశారు. ఇది కాకుండా ఓడిపోయే నెల్లిమర్ల వంటి సీట్ కూడా జనసేన చేతిలో పెట్టేసి బాబుగారు గొప్పోళ్ళు.. అందుకే నేను ఆయనవెంట నిలబడ్డాను అనే డైలాగ్స్ పవన్‌తో చెప్పించారు. చివరకు పవన్ కాస్తా చంద్రబాబుకు తాబేదారుగా మిగిలిపోవడం ఖాయం అని సైనికులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా కాసేపటి క్రితం ఇద్దరి మధ్య జరిగిన భేటీలో సీట్ల పంపిణీ గురించి కూడా చర్చకు వచ్చింది. గతంలో జనసేనకు 24 ఎమ్మెల్యే.. మూడు ఎంపీ సీట్లు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది అయితే వాటిలో ఏవేవి జనసేనకు ఇవ్వాలన్నది తేల్చలేదు. ఆ అంశం గురించి నేడు వారు చర్చించినట్లు తెలిసింది. అందులో భాగంగా పవనుకు ఇచ్చే సీట్లన్నీ ఏర్చి కూర్చి .చివరకు ఆయనను నిండా ముంచేసేలా చంద్రబాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది నువ్వు సెనగలు తీసుకురా.. నేను పొట్టు తీసుకొస్తాను.. ఇద్దరం కలిపేసి ఊదుకుని పంచుకుందాం అని చెప్పి... అయన తెచ్చిన సెనగలు రెండు వాటాలు వేసుకుని తినేసే రకం చంద్రబాబు... ఆయన్ను నమ్మితే ఏమవుతుందో పవనుకు మున్ముందు అర్థం అవుతుంది -సిమ్మాదిరప్పన్న -
CM Jagan: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్
‘నేను విశాఖలోనే ఉంటాను. నేను ఈసారి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తాను. విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాను. ఈ నగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాను..’అని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపు విషయంలో తనకు ఎలాంటి శషభిషలు లేవని.. గెలిచి తీరుతున్నాం అని చెప్పారు. అంతేకాదు మళ్ళీ ఇక్కడే నేను ప్రమాణస్వీకారం చేస్తాను అని కూడా తేల్చి పారేసారు. ఇక ఇటు శత్రుకూటమి అయిన టీడీపీ జనసేన ఇంకా పొత్తులతో పోట్లాడుకుంటున్నాయి. ఎవరికీ ఎక్కడ.. ఏయే సీట్లు.. పోటీ చేసేది ఎవరు.. పోటు పొడిచేది ఎవరు.. ఓట్లు వచ్చేది ఎవరికీ అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు.. పవన్ ఇద్దరూ ఢిల్లీ పెద్దలవైపు చూస్తూ పొత్తులకు పాకులాడుతున్నాయి. వారు ఇలా దారీతెన్నూ లేకుండా కళ్ళకు గంతలు కట్టుకుని చీకట్లో దొంగాట ఆడుతుండగా ఇటు జగన్ మాత్రం ఎన్నికల మాటను వదిలేసి ప్రమాణస్వీకారం గురించి మాట్లాడడం ద్వారా తన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేశారు. ఇది వినడానికి సాధారణంగానే ఉండొచ్చు కానీ.. గుండెలోతుల్లో ఎంత దమ్ము.. గెలుపు మీద మనసులో ఎంత నమ్మకం విశ్వాసం లేకపోతే అలా చెప్పగలరు ? అటు ఇంకా మ్యాచ్ కోసం ప్యాడ్స్, హెల్మెట్స్ కట్టుకుని ఆటగాళ్లు క్రీజ్‌లోకి రాకముందే ఇటు వైపున్న జట్టు గెలుపును ఖరారు చేసినట్లుగా జగన్ చేసిన ప్రసంగం క్యాడర్లో గొప్ప ఊపు తెచ్చాయి. ఎస్.. ఈసారి మళ్ళీ గెలుస్తున్నాం.. మనమే గెలుస్తున్నాం.. ఎందుకు గెలవం..? మనమేం తక్కువ చేశాం.. రాష్ట్రంలోని ఏ వర్గాన్ని వదలకుండా సంక్షేమం ఇచ్చాము. ఏ ప్రాంతాన్నీ మర్చిపోకుండా అభివృద్ధిని పరిచయం చేశాం. చదవండి: హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి: సీఎం జగన్ గత డెబ్భైయేళ్లలో ఎన్నడూ చట్ట సభల ముఖం చూడని కొన్ని అణగారిన వర్గాలవారికి పదవులిచ్చి పథకాలిచ్చి చేయిపట్టుకుని చట్టసభలకు తీసుకొచ్చి కూర్చొబెట్టాం. పేదవాడి కంచంలో అన్నం ముద్దయ్యాం.. చదువుకునే పిల్లాడి చేతిలో పలకమయ్యాం.. పేదింటి ఆడబిడ్డకు తోడయ్యాం.. పండుటాకుల చేతిలో ఊతకర్రమయ్యాం.. మరి మనకన్నా తోపులేవరు.. మనకన్నా గొప్పపాలకులెవరు.. ఎస్.. అందుకే మళ్ళీ మనమే వస్తున్నాం. అనే కాన్ఫిడెన్స్ క్యాడర్లో నింపిన జగన్ స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది. నా ప్రమాణ స్వీకారం విశాఖలోనే అంటూ వేదికను సైతం ప్రకటించడం ద్వారా యుద్ధం ముగిసింది. ఇక మీరు ఇళ్లకు వెళ్లొచ్చు అనే సంకేతం ప్రతిపక్షాలకు జగన్ ఇచ్చారు. ఇక ఇటు మాత్రం ఇంకా వాళ్ళు సీట్లకోసం... స్థానాలకు లక్కీ డ్రా వేసుకుంటూనే ఉన్నారు. ///సిమ్మాదిరప్పన్న /// చదవండి: Vision Visakha: ప్రతీ జిల్లాలో ఓ స్కిల్ కాలేజ్: సీఎం జగన్ -
మనవాళ్ల కోసం ఎకరాకు పదివేలు.. రాజధాని ప్రాంతంలో సేకరణ
‘‘మనకు ఇదే ఆఖరి అవకాశం.... ఇప్పుడు తప్పితే మరెప్పుడూ రాలేం.. ఈసారి మనం ప్రాణాలకు తెగించి పోరాడాలి.. అవసరమైతే చందాలు ఇవ్వాలి.. విరాళాలు ఇవ్వాలి.. భోజనాలు పెట్టాలి.. ఆస్తులైనా అమ్మాలి... మనవాళ్లను మన పార్టీని మనం కాపాడుకోవాలి.. లేదంటే మన పార్టీతో బాటు మన పెద్దరికాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండాలి.’’ ఇదీ అమరావతి ప్రాంతంలో భూములున్న రైతులు.. చంద్రబాబు సామాజికవర్గం మోతుబరుల్లోని అభిప్రాయం. అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చినవాళ్లు.. అమరావతి కారణంగా భూముల ధరలు పెరిగి అమాంతం కోటీశ్వరులు అయినవాళ్లు.. వ్యాపారాలు చేసి పోగేసిన వాళ్లు.. వీళ్లంతా ఎక్కువమంది టీడీపీ సానుభూతిపరులుగా ఉన్నారు. గతంలో రాజధాని పేరిట బాగా లబ్ధిపొందిన ఈ వర్గం వారు 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో హతాశులయ్యారు. ఇక కొందరైతే భారీగా భూముల ధరలు పెరుగుతాయని అప్పులు తెచ్చిమరీ భూములుకొన్నవాళ్ళు ఆ మేరకు ధరలు పెరగకపోవడం... రాజధాని కుంభకోణాలు బయటపడడంతో ఆ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడం... కోర్టు కేసుల్లో కొన్ని భూములు చిక్కుకోవడంతో తమ కలలు కల్లలయ్యాయని కలవరపడ్డారు. ఆ నష్టాన్ని పూరించుకోవాలని, మళ్ళీ రాజధాని పేరిట లబ్ధిపొందాలని సర్వదా ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఐదేళ్లు గడిచాక అసెంబ్లీ ఎన్నికలకు సమయం వచ్చింది. దీంతో ఇప్పుడు వాళ్లంతా ఏకమయ్యారు. ఈ ప్రాంతంలో ఎకరా భూమి ఉన్నవాళ్లు కనీసం రూ. 10 వేలు టీడీపీకి విరాళం ఇవ్వాలని .. ఆ మేరకు ఎంత ఎక్కువ భూమి ఉంటె అంత మొత్తంలో డబ్బులు జమచేసి టీడీపీకి విరాళంగా ఇవ్వాలని, టీడీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని తీర్మానించారు. ఈమేరకు గ్రామాలూ.. వార్డులు.. మండలాలవారీగా చంద్రబాబు సామాజికవర్గం ప్రజలు.. వ్యాపారులు రైతులు కూడా ఎకరానికి కనీసం పదివేలు ఖచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన విధించి ఆ మేరకు పని చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే గ్రామ.. మండలాల వారీగా కమిటీలు వేసి వసూళ్లు చేపడుతున్నారు. అందరం ఐక్యంగా ఉండాలని, ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ గెలిస్తే తెలుగుదేశానికి పుట్టగతులు ఉండవని, అందుకే ఖచ్చితంగా టీడీపీని గెలిపించుకునే బాధ్యత తామే తీసుకోవాలని తీర్మానించారు. ఈ క్రమంలో వారి వారి స్థాయిని బట్టి చందాలు రెడీ చేస్తున్నారు. ఇక ఇక్కడ భూములు కొనేసి ప్రవాసాంధ్రులు , అమెరికాలోని తానా(TANA) సంఘం సభ్యులు... వారి బంధుమిత్రులు సైతం ఈ బాధ్యతల్లో యాక్టివ్ గా పాల్గొనేలా చూస్తున్నారు. విదేశాల్లోని యువత, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు.. సాఫ్ట్ వేర్, ఇతర వృత్తుల్లోని వాళ్ళను సైతం ఈ చందాల కార్యక్రమంలో చేర్చుకుని టీడీపీ కోసం అందరం పని చేయాల్సిన అవసరాన్ని వాళ్లకు పదేపదే చెబుతున్నారు. ///సిమ్మాదిరప్పన్న /// -
వల్లనోరిమామా నేనెళ్లను.. చీపురుపల్లి పోనంటున్న తమ్ముళ్లు
పిచ్చి కాకపొతే.. పోయిపోయి మైక్ టైసన్‌తో పోరాడాలని ఎవరనుకుంటారు.. హుస్సేన్ బోల్ట్‌తో పరుగెత్తాలని ఎందుకనుకుంటారు. షార్క్‌తో సెల్ఫీ దిగాలని ఎందుకనుకుంటారు. అలాగే రాజకీయంగా చూస్తే కొన్ని కొన్ని నియోజకవర్గాల జోలికి పోకూడదని కూడా అనుకుంటారు.. వాటిల్లో చీపురుపల్లి ఒకటి. ఇక్కణ్ణుంచి వైయస్సార్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈపాలి ఆయన్ను ఎలాగైనా ఓడించాలని చంద్రబాబు కూడా శతథా ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ 2014 లో గెలిచిన కిమిడి మృణాళిని అప్పటి టీడీపీ ప్రభుత్వంలో కొన్నాళ్ళు మంత్రిగా చేసారు అయితే ఆ తరువాత 2019 లో ఆవిడకు బదులుగా కొడుకు నాగార్జునను రంగంలోకి దించారు కానీ సత్తిబాబు ఎత్తులు... అనుభవం... వీటిముందు నాగార్జున నిలవలేదు. ఓడిపోయారు.. ఈసారి కూడా మళ్ళీ అక్కడ పోటీ చేసేందుకు నాగార్జున ప్రయత్నాలు చేస్తున్నారు.. స్థానికంగానే ఉంటూ పదిమందినీ కలుస్తూ గతంలో ఓడిపోయినా సానుభూతి మిక్స్ చేసి గెలుద్దాం అని ఆశిస్తున్నారు. అయితే ఈ తరుణంలో విశాఖకు చెందిన గంటా శ్రీనివాసుని చీపురుపల్లిలో దించుతారని లీకులొచ్చాయి. ఒక్కో ఎన్నికకు ఒక్కో నియోజకవర్గం మారే గంటా ఈసారి ఏకంగా జిల్లా క్రాస్ చేసేసి విజయనగరం వచ్చి బొత్స మీద పోటీ చేస్తారని అన్నారు.. గంటా కూడా తక్కువైనోడు కాదు.. పక్కా గెలుపు అనిపిస్తేనే నియోజకవర్గం మారతాడు తప్ప ఇలా సింహానికి ఎదురెళ్లే రకం కాదు. సేఫ్ గేమ్ ఆడతాడు తప్ప ప్రయోగాలు చేసేందుకు ఏమాత్రం సిద్ధపడని రకం అయన. అలాంటి వ్యక్తి బొత్సకు ఎదురెళ్లి ఓటమిని కొనితెచ్చుకోవాలాలని ఎందుకు అనుకుంటాడు. అందుకే నేను రానుగాకరాను అనేశాడు... దీంతో రెండో కృష్ణుడు ఎవరబ్బా అని చూస్తే సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకట్రావు కనిపించారు.. ఆయన్ను పెద్దాయన మీరైతేనే బొత్సను ఓడిస్తారు.. చీపురుపల్లి వెళ్ళండి అన్నారట చంద్రబాబు.. దీనికి ఆ పెద్దాయన...' బాబుగారు నాకు టిక్కెట్ ఇవ్వకుంటే మానేయండి అంతేకానీ బొత్సకు ఎదురుగా పోటీ చేయమని చెప్పకండి.. ఎందుకంటే ఈ వయసులో నేను చికెన్ షాప్ ముందు తొడగొట్టలేను సారీ అని తప్పుకున్నట్లు చెబుతున్నారు. అలా ఇలా కాదని ఇంకో కాపు అభ్యర్థిని తెరముందుకు తెచ్చిన చంద్రబాబు ఆమెను సైతం చీపురుపల్లి వెళ్లాలని కోరారట. 2014 లో విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మీసాల గీతకు చీపురుపల్లి టిక్కెట్ ఇస్తాను... వెళ్లి బొత్స మీద పోటీ చేయండి అన్నారట.. గంటా, కళా వంటి పెద్దలే పారిపోతుంటే నేనెళ్ళి ఎందుకు ఓటమిని మోయాలి అంటూ ఆబ్బె.. నాకు వద్దండి... అది తప్ప ఇంకేదైనా ఇవ్వండి అని గీత కూడా చంద్రబాబు దగ్గర కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు చీపురుపల్లికి టీడీపీ అభ్యర్థి దొరకడం లేదట.. ఖర్చులు మొత్తం పార్టీ తరఫున పెట్టుకుంటాం.. పోటీ చేయండి అంటున్నా ఎవరూ రావడం లేదని టీడీపీ వర్గాలు బావురుమంటున్నాయి. ::: సిమ్మాదిరప్పన్న -
పరిటాల ఫ్యామిలీకి గడ్డు కాలం
తెలుగుదేశంలో వ్యక్తులను బట్టి న్యాయ సూత్రాలు మారిపోతున్నాయి. ఒకొక్క కుటుంబానికి ఒక్కో రూల్ అన్నట్లుగా పార్టీ నడుస్తోంది. తమకు నచ్చితే ఒక విధంగా లేకుంటే ఇంకోవిధంగా రూల్స్ మార్చేసే చంద్రబాబు ఇప్పుడు పరిటాల కుటుంబాన్ని మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు. ఒకనాడు అనంతపురంతోబాటు రాయలసీమలో అధికభాగాన్ని ప్రభావితం చేసిన పరిటాల కుటుంబం ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోంది. గతంలో పెనుగొండ నుంచి గెలిచిన పరిటాల రవి మంత్రిగా పని చేశారు. జిల్లావ్యాప్తంగానే కాకుండా రాయలసీమ, కోస్తాలో సైతం హవా వెలగబెట్టారు. అయన మరణం తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన సునీత సైతం టీడీపీలో మంత్రిగా చేసారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం సునీతతోబాటు కుమారుడు శ్రీరామ్‌కు రెండు టిక్కెట్స్ అడుగుతోంది. కానీ దీనికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ ఇస్తామని, రెండేసి ఇవ్వలేమని, ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ అని చెబుతున్నారు. కానీ లోకేష్, చంద్రబాబు, బాలయ్యబాబు మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఉండొచ్చా అనే ప్రశ్నలు పరిటాల క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి. ఇక లోకేష్, చంద్రబాబు మాత్రం రెండేసి చోట్ల పోటీ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి.. లోకేష్ మంగళగిరి నుంచి.. బాలకృష్ణ హిందూపురం నుంచి.. బాల కృష్ణ చిన్న అల్లుడు భరత్.. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాకానీ మాకు మాత్రం రాప్తాడు, ధర్మవరం రెండు సీట్లు ఇవ్వరా అని పరిటాల కుటుంబం ఆవేదన చెందుతోంది. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా టెక్కలి నుంచి అయన బాబాయ్ అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఒకే కుటుంబం కాదా అని పరిటాల కుటుంబం అడుగుతోంది. రాప్తాడు నుంచి పరిటాల రవి సతీమణి సునీత.. కుమారుడు శ్రీరామ్ ఆశిస్తున్నారు కానీ రాప్తాడు వరకూ ఒకే చేసిన చంద్రబాబు ధర్మవరం టిక్కెట్ మాత్రం ఇచ్చేదిలేదని అంటూ అక్కడ వరదాపురం సూరి వైపు మొగ్గు చూపుతున్నారు. యువతకు 40 సీట్లు ఇస్తానని మహానాడులో భారీగా హామీ అయితే ఇచ్చారు కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య యేళ్ళనాటి వైరం ఉంది. దీంతోబాటు పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి కూడా పరిటాలను ధర్మవరం రానివ్వడం లేదు. వాళ్ళు అవకాశం వస్తే పరిటాల కుటుంబాన్ని ఓడించడానికి చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా జిల్లాలో మూలమూలనా వ్యతిరేకత మూటగట్టుకుని శత్రువులను పెంచుకుంటూ వెళ్లిన పరిటాల కుటుంబాన్ని ఆదరించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాప్తాడుతో సరిపెట్టేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. - సిమ్మాదిరప్పన్న -
సినబాబు సిలక్కొట్టుడు.. టిక్కెట్ల పేరిట డబ్బులు వసూళ్లు
టీడీపీలో నంబర్ టూ స్థానంలో ఉన్నానని భావిస్తున్న లోకేష్ కొన్ని సందర్భాల్లో పార్టీని తానే సొంతంగా లీడ్ చేయాలని ఆశిస్తుంటారు. పార్టీ విధానపరమైన నిర్ణయాల్లోనూ కొన్ని సార్లు కీలకంగా వ్యవహరిస్తుంటారు. చాలా సందర్భాల్లో అవి ఎదురుతంతున్నప్పటికీ తీరు మార్చుకొని లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు సైతం చేస్తూ తండ్రిని ఇరకడంలో పెడుతున్నారు. జనసేనతో అధికార పంపిణీ విషయంలో అయన చేసిన కామెంట్స్ జనసైనికుల్లో అగ్రహాన్ని లేపాయి. అసలు అలాంటి ఆలోచనే లేదని, కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని తేల్చేసారు. దానికి తోడు యువగళం పాదయాత్రలో తనలో పోరాట పటిమ, పరిణితి బాగా పెరిగిందని భావిస్తున్న లోకేష్ ఇప్పటికే తండ్రిని ఓవర్ టేక్ చేసి తీసుకుంటున్న నిర్ణయాలు పార్టీలో చిక్కులు తెస్తున్నట్లు పెద్దలు గుర్తించారు. వాస్తవానికి ఆమధ్య పాదయాత్రలో భాగంగా లోకేష్ చాలాచోట్ల బహిరంగసభల్లో మాట్లాడారు. ఆ సందర్భంగా కొందరు నాయకులను అక్కడికక్కడే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేసారు. అయితే అయన ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ప్రకటించుకుంటూ వెళ్లడంతో చంద్రబాబు ఆగ్రహించి ఇకముందు అలా చేయొద్దని హెచ్చరించడంతో ఆ తరువాత అయన అభ్యర్థుల ప్రకటనను ఆపేసారు. కానీ తనలోని పెద్దరికపు కోరికను చంపుకోలేని లోకేష్ దాదాపు నలభై మంది వరకు ఆశావహుల దగ్గర టిక్కెట్లు ఆశచూపి డబ్బులు తీసుకున్నారని అంటున్నారు. గుంటూరు, కృష్ణ, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువమంది లోకేష్ కు దాదాపు ఐదేసి కోట్లవరకు డబ్బులిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వారికి టిక్కెట్ దక్కుతుందా లేదా అన్నది ప్రశ్నర్థకంగా మరేంది. గుంటూరు జిల్లాలో ఓ విద్యాసంస్థకు చెందిన యజమాని దగ్గర దాదాపు ఐదు కోట్లు తీసుకున్నారని తెలిసింది. ఐతే ఇప్పుడు అయన టిక్కెట్ వెనుకబడినట్లు చెబుతున్నారు. లోకేష్ హామీ ఇచ్చినావాళ్ళకు ప్రజాదరణ లేదని సర్వేల్లో తేలిందని, అందుకే వాళ్లకు టిక్కెట్లు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేసారని అంటున్నారు. అనంతపురంలో ఓ మాజీ మంత్రి కుటుంబానికి చెందిన వ్యక్తి దగ్గర కూడా ఇలాగే కొంత డబ్బు తీసుకుని లోకేష్ హామీ ఇచ్చినా అక్కడ ఐవీఆర్ఎస్ ద్వారా మళ్ళీ సర్వే చేస్తున్నారు. అందులోకానీ సదరు నాయకుడికి మంచి మార్కులు రాకపోతే టిక్కెట్ ఇచ్చేది లేదని చంద్రబాబు చెప్పేశారట. విశాఖ నుంచి కూడా ఇలాగే కొందరికి హామీ ఇచ్చిన లోకేష్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారో తెలియడం లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యం ఇస్తామని, ఎమ్మెల్సీలు ఇస్తామని లోకేష్ నచ్చజెబుతున్నట్లు అంటున్నారు. కానీ ఆ మాటలు నమ్మేలా లేవని, అనవసరంగా డబ్బులిచ్చి ఇరుక్కున్నామని వారు వాపోతున్నారు. మొత్తానికి చినబాబు లోకేష్ జోక్యం పార్టీకి పెద్ద తలనొప్పులు తెచ్చిందని అంటున్నారు. :::సిమ్మాదిరప్పన్న -
అందుకేనా లోకేష్ రాలేదు...
ఇటీవల జరిగిన రెండు కీలక రాజకీయ సమావేశాలకు టీడీపీ యువనేత లోకేష్ డుమ్మా కొట్టాడు పార్టీకి, కూటమిని సంబంధించిన కీలక సభలు, సమావేశాలకు లోకేష్ రాకపోవడం పార్టీలో చర్చకు దారితీసింది. మొన్న జరిగిన ఇరుపార్టీల సీట్ల పంపకం సభకు కూడా లోకేష్ రాలేదు... నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన కూటమి సభకు సైతం లోకేష్ రాలేదు..? ఎందుకని ఏమి జరిగింది.. గతంలో భోగాపురంలో జరిగిన లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభకు పవన్ కళ్యాణ్ వచ్చారు కానీ నేడు తాడేపల్లిగూడెం సభకు లోకేష్ ఎందుకు రాలేదు..? ఏమైనా బిజీగా ఉన్నారా ? ఎంత బిజీగా ఉంటేమాత్రం ఈ కార్యక్రమానికన్నా ముఖ్యమైనది ఏముంది... కానీ లోకేష్ రాకపోవడం మాత్రం అక్కడ చర్చకు దారితీసింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కాస్త ప్రాధాన్యం ఇవ్వడాన్ని లోకేష్ అంగీకరించడం లేదని, అసలు పవన్ తో పొత్తే లోకేష్ కు ఇష్టం లేదని, అంటున్నారు. పవన్ కు కాస్త సినిమా క్రేజ్ ఉండడం.. అయన సభలకు జనం రావడం.. అయన కోసం చంద్రబాబు వెళ్లి కలవడం వంటివి తనకు అవమానంగా భావించిన లోకేష్ సాధ్యమైనంతవరకు పవన్ తో దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మొన్నామధ్య టీవీఛానెల్ ఇంటర్వ్యలో కూడా లోకేష్ మాట్లాడుతూ పవన్‌ను పూచికపుల్ల మాదిరి తీసి పారేసారు. అధికారంలో పావనుకు వాటా ఇస్తారా అని ప్రశ్నించగా అస్సలు అలాంటి ప్రసక్తే లేదని, మొత్తం ఐదేళ్లూ చంద్రబాబే సీఎంగా ఉంటారని, అసలు పవన్ ను ఆ దృష్టితో చూడడం లేదన్నట్లు చెబుతూ ఆయన్ను చాలా లైట్ అన్నట్లుగా మాట్లాడారు. ఇది జనసైనికుల్లో కాస్త ఆగ్రహాన్ని రేకెత్తించిన అయన మాత్రం తగ్గలేదు.. ఆంటే లోకేష్ దృష్టిలో పవన్ ఒక రాజకీయ నాయకుడు కాదు...కేవలం సినిమా హీరో మాత్రమే కాబట్టి ఆయన్ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదనేది అయన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.. దీనికితోడు ఆ సభలో పవన్ కు క్రేజ్ ఉంటుంది.. క్యాడర్.. జనాలు కూడా పవన్‌ను చూసి కేకలు, అరుపులు ఉంటాయి తప్ప అక్కడ లోకేష్ ను ఎవరూ పట్టించుకోరు... అది కూడా లోకేష్ ఆబ్సెంట్ కు ఒక కారణం అని చెబుతున్నారు. పవన్ తో పొత్తులేకుండా సింగిల్ గా ఎన్నికలకు వెళ్లాలన్నది లోకేష్ ఆలోచన అయితే దీన్ని చంద్రబాబు కాదని జనసేనలో పొత్తు పెట్టుకున్నారని, ఈ అంశం కుటుంబంలో గొడవకు దారితీసిందని కూడా అంటున్నారు. ఏదైతేనేం మొత్తానికి లోకేష్ రెండు కీలక ఘట్టాల్లో కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిచ్చింది . సిమ్మాదిరప్పన్న -
ఆస్తుల అమ్మకం.. పవన్ సరికొత్త నాటకం
తెలుగుదేశం, జనసేన కూటమి సీట్ల పంపిణీ అంశం బయటపడగానే ఇరుపార్టీల్లో అసమ్మతి గుప్పుమన్నది. తెలుగుదేశంలో కాస్త తక్కువ మోతాదులోనే అసమ్మతి వ్యక్తం అయినా, జనసేనలో మాత్రం తీవ్రత ఎక్కువే ఉంది. కేవలం పాతికలోపు సీట్ల కోసమా ఇన్నాళ్లూ ఎదురుచూసింది.. దానికోసం మేమెందుకు టీడీపీ జెండాలు మోయాలి.. మేము సహకరించేది లేదు అనే అసంతృప్తి జనసైనికులు, కాపు సంఘాల్లో వ్యక్తమవుతోంది. దీంతో కేడర్‌లో వెల్లువెత్తిన ఈ అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పవన్ కళ్యాణ్ సరికొత్త డ్రామాకు తెరతీసినట్లు తెలుస్తోంది. అందుకే తాను కష్టాల్లో ఉన్నానని, పేదరికంతో బాధపడుతూనే ప్రజలకోసం పార్టీని నడుపుతున్నాను అని చెప్పుకునేందుకు సరికొత్త డ్రామాకు తెరతీసినట్లు చెబుతున్నారు. కేవలం చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని అతి తక్కువ సీట్లకు చంద్రబాబుకు జనసేనను తాకట్టు పెట్టేశారన్న అపవాదును, ఆరోపణలకు తప్పించుకునేందుకు పవన్ కొత్త ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన తన ఆస్తులు అమ్ముతున్నట్లు ఒక ప్రకటన చేశారు. జీరో బడ్జట్ పాలిటిక్స్ చేస్తాను అని, తరచూ చెప్పే పవన్ ఇప్పుడు ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారు?. ఇంతా చూస్తే ఆయన అభ్యర్థుల దగ్గరే డబ్బు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దానికితోడు నాగబాబు అయితే ఏకంగా క్యూఆర్ కోడ్ పెట్టి మరీ విరాళాలు వసూళ్లు చేస్తున్నారు. అలాంటి తరుణంలో పవన్ ఆస్తులు అమ్ముతున్నట్లు ఎందుకు ప్రకటన చేశారు. ఎందుకంటే పాపం పవన్ డబ్బుల్లేక ఇబ్బందుల్లో ఉన్నారు. ఆస్తులు అమ్మితే తప్ప పార్టీ నడవదు. ఇంకా ఆయనకు చంద్రబాబు సైతం ప్యాకేజీ ఇవ్వడం లేదు అందుకే పాపం ఆస్తులు అమ్ముకుని మరీ పార్టీని నడుపుతున్నారు అని కేడర్ అనుకోవాలన్నది ఆయన ఎత్తుగడ అంటున్నారు. గత ఎన్నికల్లో 2019లో వందకు పైగా నియోజకవర్గాల్లో పోటీ చేసినప్పుడు కూడా ఎక్కడా సెంటు భూమి అమ్మని పవన్ ఇప్పుడు కేవలం పాతిక సీట్లల్లో పోటీ చేస్తూ ఆస్తులు అమ్ముతున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం జనసేన కేడర్‌ను చల్లబరిచేందుకు.. వారిలో కోపానికి లేపనం పూసేందుకు మాత్రమే అలాంటి పుకార్లు వదులుతున్నట్లు చెబుతున్నారు. సినిమాల్లో ట్రిక్స్చూపించడం ద్వారా ప్రేక్షకులు, అభిమానులను ఆకట్టుకున్న రీతిలోనే ఇప్పుడు పాలిటిక్స్‌లో సైతం ఇలాంటి మ్యాజిక్కులు చేసి ప్రజలను, కాపు సంఘాలను నమ్మించేందుకు ఆయన ఇలాంటి బీద ఏడుపులు ఏడుస్తున్నారని అంటున్నారు. ఎన్ని గ్లిజరిన్ ఏడుపులు ఏడ్చినా ఈసారి కేడర్ నమ్మేది లేదని బుద్ధి చెప్పడం ఖాయమని అంటున్నారు. - సిమ్మాదిరప్పన్న -
ప్రత్యర్థి శిబిరంతో సీఎం జగన్ చెడుగుడు
సాధారణంగా రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రత్యర్థికి చెందిన నియోజకవర్గంలో పర్యటించేందుకు పెద్దగా ఇష్టపడరు. ఎంతసేపూ తమకు చెల్లుబాటు అయ్యే ప్రాంతాలు, తమకు ఆదరాభిమానాలు మెండుగా ఉండే చోట్లకు మాత్రమే వెళ్లేందుకు ఇష్టపడతారు. పైగా వైరిపక్షమన్న పేరుతో ఆయా నియోజకవర్గాలకు పనులు చేయని సందర్భాలూ గతంలో కోకొల్లలు. రాజకీయ వైరి అయిన నాయకుడి ఇలాకాలోకి వెళ్ళడానికి ఇష్టపడరు.. ఎందుకంటే అక్కడి ప్రజల అప్పటికే తన ప్రత్యర్థిని తమ నాయకుడిగా ఎన్నుకుని ఆదరించారని, తాను ఇప్పుడు అక్కడికి వెళ్లినా తనను అక్కడి ప్రజలు ఆత్మీయంగా రిసీవ్ చేసుకోరని, పైగా ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుల నుంచి తిరస్కారం.. వ్యతిరేకత వంటి అనుభవాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న సందేహంతో అక్కడికి వెళ్లరు. వెళ్లినా ఎక్కువసేపు అక్కడ గడపడానికి ఇష్టపడరు.. ఇలా వెళ్లి అలా సేఫ్‌గా వచ్చేద్దాం అనుకుంటారు.. అయితే ఇప్పుడు రాజకీయం మారిపోయింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరుగా రాజకీయ ప్రత్యర్థి బాబు ఇలాకాలోనే సింహనాదం చేశారు. చంద్రబాబును 1989 నుంచి వరుసగా గెలిపిస్తూ వస్తున్న కుప్పంలో కాసేపటి క్రితం పర్యటించారు. హంద్రీ నివా కాలువ ద్వారా కుప్పానికి సాగు నీరుతోబాటు నాలుగైదు లక్షలమందికి తాగునీరు అందించే ప్రాజెక్టును ప్రారంభించారు. అంతేకాకుండా ఆ తరువాత అయన సుదీర్ఘంగా అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత 35 ఏళ్లుగా చంద్రబాబును గెలిపిస్తున్న ప్రజలను చంద్రబాబు ఏ విధంగా వాడుకుని వదిలేశారు..? వాళ్ళను ఎలా మోసం చేస్తూ వచ్చింది అన్నది పూసగుచ్చినట్లు జగన్ వివరించారు.. కుప్పాన్ని తమ ప్రభుత్వం వచ్చాక ఏ విధంగా అభివృద్ధి చేసిందీ... అప్పట్లో కేవలం పంచాయతీగా ఉన్న కుప్పాన్ని తామే మున్సిపాలిటీగా,, రెవెన్యూ డివిజన్ కేంద్రంగా.. పోలీస్ డివిజన్ కేంద్రంగా అప్ గ్రేడ్ చేసిన విషయాన్నీ అయన వివరించారు. అంతేకాకుండా బాబు హయాంలో ప్రాజక్టుల పనులను చంద్రబాబు , అయన అనుచరులు ఏ విధంగా వాడుకుని లబ్ది పొందినది చెబుతూనే తాము వచ్చాక పథకాలు, సంక్షేమం ఇంటింటికీ ఎలా అందిస్తున్నది ప్రతి పాయింటునూ వివరించారు. జగనన్న ఇళ్ళు, పెన్షన్లు, ఉద్యోగాలు, ఉపాధి వ్యవసాయం, రైతుభరోసా కేంద్రాలు... చిత్తూరు డైరీ ఇలా ప్రతి అంశంలోనూ తన ప్రభుత్వ పనితీరును, దాని ద్వారా లబ్ధిపొందిన విధానాన్ని లెక్కలతో వివరించారు. తాను చంద్రబాబు మాదిరిగా తనవాళ్లకు మాత్రమే ప్రయోజనం కలిగించే నాయకుడిని కాదని, ఇచ్చాపురం నుంచి కుప్పం వరకూ అందర్నీ సమదృష్టితో చూస్తూ అందరికీ ప్రభుత్వ సేవలు, పథకాలు అందిస్తాం అని చెబుతూ వారి నుంచి చప్పట్ల రూపంలో మద్దతు పొందారు. అంతేకాకుండా మీ నియోజకవర్గానికి ఏమీ ఉపయోగపడని చంద్రబాబును ఇన్నేళ్లు మోసిన ప్రజలకు జోహార్లు అనడం ద్వారా మీరంతా ఇలాంటి పనికిరాని నాయకుడిని ఇన్నాళ్లూ ఎలా మోశారబ్బా అనే ప్రశ్న కూడా వేసినట్లయింది. ఇక ఆయన్ను వదిలించుకోవాలని, సమర్ధుడైన భరత్‌ను గెలిపించుకుని కుప్పాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు తోడ్పడాలని కోరారు. భరత్ గెలిస్తే ఆయనకు మంత్రిపదవి ఇస్తామని హామీ ఇవ్వడం ద్వారా కుప్పాన్ని తన సొంత ప్రాంతంగా భావిస్తానని చెప్పేసారు. తాను ఎన్నడూ కుప్పం ప్రజలను పల్లెత్తు మాట అనలేదు కానీ చంద్రబాబు మాత్రం నిత్యం రాయలసీమతోబాటు పులివెందుల ప్రజలను చిన్నచూపు చూస్తూ కించపరుస్తుంటారు అని గుర్తు చేసారు.. అలా చెప్పడం ద్వారా 'చూసారా... అయన మన ప్రాంతాన్ని ఎలా అవమానిస్తున్నారో' అని ప్రజలకు గుర్తు చేసారు.. ఫైనల్ గా జగన్ కుప్పంలో అడుగుపెట్టి అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూనే చంద్రబాబును కడిగిపారేశారు. :::సిమ్మాదిరప్పన్న -
బీజేపీ సీరియస్.. పురంధేశ్వరి పోస్ట్ ఊష్టింగ్!
ఏ ఆడపిల్ల అయినా పుట్టిల్లు బాగును కోరుతుంది. మెట్టినింటి మంచిని కోరుతుంది. కానీ విలువలు, నీతి ఉన్నవాళ్లు ఎవరూ తమకు నీడనిచ్చిన చెట్టు కూలిపోవాలని కోరుకోరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం తిన్నింటి వాసాలు లెక్కేశారు. అందుకే ఆమెను పదవి నుంచి తీసేయాలని పార్టీ పెద్దలు భావించారని తెలుస్తోంది. ఎన్టీఆర్ కుమార్తె అయినా ఆమె తెలుగుదేశంలో ఉండకుండా కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేసారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఓడిపోవడంతో ఎటూ వెళ్లే వీల్లేక బీజేపీలో చేరారు. పోన్లే అని ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించింది. కానీ, మనసోచోట మనువోచోట అన్నట్లుగా ఉండే పురంధేశ్వరి తలుపులన్నీ తెలుగుదేశంవైపే ఉన్నాయి. తన తండ్రి పెట్టిన పార్టీ, తన అక్క భర్త చంద్రబాబు నడుపుతున్న తెలుగుదేశం బలోపేతం అవ్వాలని పురంధేశ్వరి తపిస్తూ ఉండేవారు. ఆమె పార్టీ పదవి చేపట్టిన నాటి నుంచీ తెలుగుదేశం, బీజేపీ మధ్య పొత్తు కుదర్చడానికి మాత్రమే యత్నించారు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి కృషి చేయలేదు. దీనికి సంబంధించి తాజాగా అధిష్టానం వద్ద ఇంకో ఆధారం కూడా ఉందని తెలుస్తోంది. సొంతపార్టీని బలోపేతం చేయడానికి బదులు తెలుగుదేశాన్ని ఉద్ధరించేందుకు ఆమె కుయుక్తులు పన్నుతున్నట్లు బీజేపీ పెద్దల వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రాలో అధికార వైఎస్సార్సీపీలో టిక్కెట్లు దక్కని కొందరు నాయకులు బీజేపీలో చేరాలని ప్రత్నించి, ఆమెతో మాట్లాడగా దానికి ఆమె సంతోషంగా ఒప్పుకుని పార్టీ కండువా వేసి ఆహ్వానించాల్సి ఉండగా దానికి విరుద్ధంగా ఆమె కుట్రలకు పాల్పడ్డారు. ఆంధ్రాలో బీజేపీలో ఎందుకు చేరడం.. మేము చేరి తప్పు చేసాం.. పార్టీకి ఇక్కడ ఏమీ ఫ్యూచర్ లేదు. పార్టీ బలం అయ్యే అవకాశం లేదు. మీరు వెళ్లి టీడీపీలో చేరండి నేను చంద్రబాబుతో మాట్లాడతాను వెళ్ళండి అని సలహా ఇచ్చారట. దీంతో, బీజేపీలో చేరేందుకని వెళితే ఆవిడ ఏమిటి ఇలా చెబుతోంది అని ఆశ్చర్యపోయారట. దానికితోడు ఆమె పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగేలా చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్స్ కూడా ఢిల్లీ పెద్దలకు చేరినట్లు తెలిసింది. దీంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం.. నీడనిచ్చిన చెట్టును కూల్చేయడం లాంటి అనైతిక చర్యలకు పురంధేశ్వరి పాల్పడుతోందని ఆగ్రహం చెందిన బీజేపీ అధిష్టానం ఆమెను పదవిలోంచి తొలగించాలని డిసైడ్ అయిందని సమాచారం. ఈమేరకు ఆమెకు ఇప్పటికే చెప్పేశారని, త్వరలోనే ఆమెకు ఉద్వాసన తప్పదని అంటున్నారు. - సిమ్మాదిరప్పన్న -
గోదాట్లో కాపుల నిమజ్జనం.. నిండా ముంచేసిన చంద్రబాబు
కాపులే మా బలం.. మేమే కాపులకు అసలైనప్రతినిధులం అని చెప్పుకునే జనసేనకు సరైన చోట దెబ్బ పడింది. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో తమదే హవా.. అక్కడ మాకు మాగ్జిమమ్ సీట్లు ఇవ్వాలని .. ఇస్తారని ఆశించిన జనసేనకు వెన్నుపోటు రుచి ఏమిటో తెలిసొచ్చింది. ఆరెండు జిల్లాల్లో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. తొలివిడత మొత్తం 118 సీట్లలో ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశానికి 13 సీట్లు.. ఇవ్వగా రెండు స్థానాలు మాత్రం జనసేనకు ఇచ్చారు. అంటే ఇంకా అక్కడ 19 స్థానాలు ఉన్నాయ్.. అందులో జనసేనకు ఎన్ని ఇస్తారన్నది సందేహమే.. మొత్తం 34 స్థానాల్లో తమకు ఇరవై వరకూ సీట్లు ఇస్తారని సైనిక్స్ ఆశించారు.. గోదావరి జిల్లాలను స్వీప్ చేస్తామని ప్రగల్భాలు పలికారు. తీరా చూస్తే ఇప్పుడిచ్చినవి రెండు సీట్లు పోనూ మిగిలిన 19 స్థానాల్లో మహా ఇస్తే పది ఇస్తారేమో .. అప్పుడు మొత్తం పన్నెండు ఇచ్చినట్లు అవుతుంది.. మరి గోదావరి జిల్లాల్లో జనసేన పెత్తనం .. పెద్దరికం.. ప్రాధాన్యం ఎక్కడుంది... చంద్రబాబు ప్లాన్ ఎలా ఉంటుందంటే ఈతకాయ ఇచ్చి తాటికాయ లాక్కున్నట్లు ఉంటుంది. దీంతో జనసైనికులు మాత్రం చంద్రబాబును నమ్ముకుని నిలువుగా గోదావరిలో మునిగిపోయినట్లు అయిందని నిర్వేదంలో ఉన్నారు. గోదావరి రెండు జిల్లాల్లో మాదే హవా.. ప్రజలను, ఓటర్లను మేము శాసిస్తాం... అందుకే పెద్ద మొత్తంలో టిక్కెట్లను ఆశిస్తున్నాం అని చెప్పుకున్న జన సైనిక్స్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కాపుల మద్దతు మాత్రం కావాలి.. జనసేన ఓట్లు కావాలి కానీ వాళ్లకు టిక్కెట్లు మాత్రం ఎక్కువగా ఇవ్వకూడదు అనే కాన్సెప్ట్ మీద పని చేసిన చంద్రబాబు... సరిగ్గా తాను అనుకున్నట్లే దెబ్బ కొట్టారు.. దీంతో జనసైనికుల నడుం విరిగినంత పని అయింది.. కొన్నాళ్లుగా కాపు నాయకుడు చేగొండి హరిరామ జోగయ్య బహిరంగ లేఖలు రాస్తూ కాపులకు, జనసేనకు కనీసం యాభై టిక్కెట్లు ఇవ్వకపోతే పొత్తు పొసగదు అంటూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు మత్తులోపడిన పవన్... ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టారు.. దీంతో చంద్రబాబు తాను అనుకున్న ప్రకారమే గుప్పెడు సీట్లు పవన్ మొహాన పడేసి సింహభాగం తాను ఎత్తుకెళ్లారు. ఇదిలా ఉండగా జనసేనకు ప్రస్తుతం కేటాయించిన 24 సీట్లలో ఐదింటికి అభ్యర్థులను ప్రకటించగా ఇంకా 19 చోట్ల అభ్యర్థులను తేల్చలేదు. అంటే అక్కడ కూడా చంద్రబాబే కొందర్ని పంపించి పోటీచేసే అవకాశాలు ఉన్నాయ్. ఏది ఏమైనా జనసేనకు టిక్కెట్లు, అభ్యర్థులను సైతం సప్లై చేస్తూ మెల్లగా ఆ పార్టీని నిర్వీర్యం చేసి జనసేనానిని పూర్తిగా పీల్చి పిప్పి చేసేసి వదిలేస్తారు అని సైనిక్స్ ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న చంద్రబాబు..లోకేష్.. బాలకృష్ణ, అచ్చెన్నాయుడు ..అయ్యన్నపాత్రుడు వంటి వాళ్లంతా తమ నియోజకవర్గాలను ప్రకటించుకున్నారు. ఈ లిస్టులో వారి పేర్లు ఉన్నాయి కానీ ఆశ్చర్యంగా పవన్ కళ్యాణ్ మాత్రం తన నియోజకవర్గాన్ని సైతం బహిర్గత పరచలేదు..ముందే చెబితే ఓడగొట్టెందుకు సీఎం వైఎస్ జగన్ గట్టి ప్రణాళిక వేస్తారని భయపడ్డారో.. ఇంకేదైనా కారణం ఉందో కానీ పవన్ తన నియోజకవర్గాన్ని సైతం ప్రకటించే సాహసం చేయకపోవడం కాపులను, జనసైనికులను మరింత కలవరపరుస్తోంది.. ఎన్నికల షెడ్యూల్ సమీపిస్తున్నా కనీసం తన నియోజకవర్గం పేరును వెల్లడించలేని నాయకుడు ఇక పార్టీని ఎలా నడుపుతాడు అని విమర్శలు వస్తున్నాయి. ::: సిమ్మాదిరప్పన్న -
ఉంగరాల సింగరాజు రింగులో ఫింగరు!
పదిహేనేళ్ల నుంచీ రాజకీయాలు చేస్తున్నా తనకు రాజకీయ నాయకుడి ముద్ర, ఆ గుర్తింపు లేకపోవడం, ఎంతసేపూ తనను సినిమా హీరోగానే ప్రజలు చూస్తుండడం.. అటు టీడీపీ, వైఎస్సార్సీపీ కేడర్, ఆ పార్టీ నాయకులు సైతం తనను ప్యాకేజీ స్టార్ అని అవమానిస్తుండడంతో.. ఇక లాభం లేదు, ఎలాగైనా తన జాతకం మార్చాలని.. మార్చుకోవాలని స్ట్రాంగ్ గా డిసైడైన పవన్ కళ్యాణ్ ఓ రోజు బురఖా వేసుకుని టాంక్ బండ్ మీద చిలక జోతిష్యం చెప్పే వారి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ చెట్టుకు చేరబడి బీడీ కాలుస్తున్న జ్యోతిష్యం గంగరాజు ఒక్కసారి ఈ బురఖా చూసి ఎలర్ట్ అయ్యాడు. బేరం తగిలిందని సంబరపడుతూ రామ్మా..చిలకమ్మా మంచి బేగం బేరం వచ్చిందమ్మా అంటూ పవన్‌ను చాపమీద కూర్చోబెట్టాడు. చేతిని చూసి అమ్మా మిమ్మల్ని చూస్తుంటే అమ్మాయి కానట్లుంది.. మీకు మగ లక్షణాలే ఉన్నాయి దానికితోడు మీకు మూడునాలుగు పెళ్ళిళ్ళు కూడా అయ్యే ఛాన్స్ ఉంది. దాంతోపాటు రాజకీయంగా కూడా ఎదుగుదల లేదు. ఎంతసేపూ వేరేవారి ఎదుగుదలకు మీరు పనికొస్తారు తప్ప మీ క్రేజీ మీకు పనికిరాదు. మీరు పోటీ చేసినా ఓడిపోయే ప్రమాదాలు ఉన్నాయి.. మీకు కళారంగమే పనికొస్తుంది..అందులు ట్రై చేయండి అంటూ చెబుతున్నాడు. దీంతో లోపలున్న పవన్ చిరాకుపడుతూనే బయటికి మాత్రం ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. గొంతు మార్చి ‘‘మరి నాకు విరుగుడు చెప్పండి స్వామీ.. ఏమి చేయాలో చిలుకను అడగండి’’ అన్నాడు. మళ్లీ గంగరాజు చిలుకను రావమ్మా సోనాలి బింద్రే.. ఈ బురఖా బుజ్జమ్మకు మంచి కార్డ్ తీసి ఫ్యూచర్ చూపించమ్మా అన్నాడు. అంతసేపూ లోపల జామకాయ తింటూ ఏదో మూడ్‌లో ఉన్న చిలక.. షిరాగ్గా మొహం పెట్టి ‘ఎన్నిసార్లు పిలుస్తావురా?..’ అన్నట్లు చూసింది. దాని శిరాకు చూసి గంగరాజుకు భయమేసింది. అయినా సరే ‘ఒసే సోనాలి.. మనిద్దరం పొట్లాడుకుంటే వచ్చే బేరం పోతుంది . ఈసారికి వచ్చి ఏదో కార్డ్ తీసి మొహాన కొట్టిపోవే’ అన్నాడు వేరే భాషలో. దీంతో సరే అడుక్కుంటున్నవు కాబట్టి వస్తున్నా అన్నట్లు చూసి మెల్లగా బయటికి వచ్చి ఓ పాము బొమ్మ ఉన్న కార్డ్.. తాబేలు బొమ్మ కార్డు తీసి బయట గిరాటేసి. ‘ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేస్తే పారిపోతాను’ అన్నట్లు వార్నింగ్ లుక్కేసి పెట్టెలో దూరింది. దీంతో బురఖా లోపలున్న పవన్ ఆ కార్డులు చూసి ఇదేంటి స్వామి పాములు తాబేళ్లు అంటోంది(అంటాడు). ‘‘నేనేమైనా వాటి యపారం చెయ్యాలా?’’ అన్నాడు కంగారుగా!. దీంతో గంగరాజు చిరునవ్వు నవ్వి ‘లేదు అమ్మా.. మీరు ఈ రెండు బొమ్మలున్న ఉంగరాలు పెట్టుకోండి. ఇక మీకు తిరుగే ఉండదు.. మా సోనాలి మీద ఒట్టు’ అన్నాడు.. హమ్మయ్య బ్రతికించాడు అనుకుని పవన్ వెంటనే రెండువేలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ మరునాడే చేతికి ఉంగరాలు వచ్చాయి.. తాబేలు.. పాము ఉన్న ఉంగరాలతో జనంలోకి వచ్చి చేతులు తిప్పుతున్నారు. అదన్నమాట పవన్ గారి ఉంగరాల కథ! ✍️ సిమ్మాదిరప్పన్న -
కండీషన్లతోనే ఖతం.. చంద్రబాబుకు కొత్త టెన్షన్!
అవసరం మనది అయినప్పుడు అవతలివాళ్లు పెట్టే షరతులు చాలా కఠినంగా ఉంటాయి. పగటిపూట పిలిచిమరీ ఎక్కించుకుని రూ.ఇరవైకి డ్రాప్ చేసే షేర్ ఆటోవాడు అవసరం మనది అయినప్పుడు.. సమయం కాని సమయం అయినప్పుడు నూట యాభై అడుగుతాడు. లేదా నడిచి వెళ్ళండి అంటారు. అర్థరాత్రి నడిచి వెళ్ళాలంటే కుక్కల భయం.. పోనీ వాడిని తోడు రమ్మంటే వాడి రేటు చూస్తేనే ప్రాణం పోయేలా ఉంది. మన అవసరానికి అప్పు అడిగితే నూటికి నెలకు పది రూపాయల వడ్డీ అడుగుతాడు. పోనీ డబ్బులు వద్దంటే ఇటు అవసరం తీరదు. ఇదీ ఒక్కోసారి మనకు ఎదురయ్యే పరిస్థితి. ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి కూడా ఇదే. చూస్తూ చూస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సింగిల్‌గా ఎదుర్కోలేడు. అలాగని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చూస్తుంటే వాళ్లు పెడుతున్న కండీషన్లు భయంకరంగా ఉన్నాయి. చంద్రబాబు బలహీనతను వాళ్లు ఎంత అలుసుగా తీసుకున్నారో చూస్తుంటే బాబుకు కోపం కట్టలు తెంచుకుంటోంది. అలాగని బీజేపీ వాళ్లను ఏమీ అనలేదు. ఏమన్నా అందాం అంటే.. ఒంటరిగా పోటీచేసుకో.. ఎవరొద్దన్నారు అంటూ అటునుంచి గదమాయింపులు. దీంతో బాబుకు దెయ్యంతో చుట్టరికం చేస్తున్నట్లు ఉంది. ఇవీ షరతులు.. పొత్తుల కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఓవైపు గౌరవించుతున్నట్లుగానే నటిస్తున్న బీజేపీ మాత్రం పెద్ద షరతులే విధించింది. ఇందులో భాగంగా చంద్రబాబు.. పవన్ ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కాకుండా కేవలం ఎంపీలుగా చేయాలని చెప్పింది. అంటే వాళ్ళిద్దరూ లోక్‌సభకు వెళ్లాలని.. అసెంబ్లీ బాధ్యత బీజేపీ చూసుకుంటుందని చెప్పేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెద్దరికం సంగతి తాము చూసుకుంటామని, ఒకవేళ కూటమికి మెజారిటీ వస్తే బీజేపీ ఎమ్మెల్యే మాత్రమే ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతారని, అటు పవన్, చంద్రబాబు ఇద్దరూ ఎంపీలుగా పోటీ చేయాలని, గెలిస్తే వాళ్లను కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటాం అని చెప్పింది. ఈ కండీషన్లు చూస్తుంటే చంద్రబాబు రక్తం మరిగిపోతోంది. కానీ, బీజేపీ సపోర్ట్ లేకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ము లేదు. అందుకే తోడు కోసం బీజేపీని రమ్మని పిలిస్తే వాళ్ళేమో మొత్తం పార్టీని మింగేస్తున్నారు. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా చంద్రబాబు ఎమ్మెల్యేగా కాకుండా ఎంపీగా వెళ్ళడమా.. ప్రధానులను తయారు చేసిన తాను తనకన్నా జూనియర్ అయిన మోడీ దగ్గర మంత్రిగా చేయడమా?. ఈ ఊహలే చాలా అవమానకరంగా ఉన్నాయి. కానీ కాదంటే అసలు ఎన్నికలకు పోయే పరిస్థితి లేదు. ఏమి చేయాలో తెలియని పరిస్థితి. - సిమ్మాదిరప్పన్న -
పవన్ డెసిషన్.. ఇక నిప్పురవ్వలు లేవడమే తరువాయా?
సినిమాల్లో గెస్ట్ రోల్స్ ఉంటాయి.. ఆ సినిమాల్లో వాళ్ళ పాత్ర నిడివి తక్కువే .. కానీ వారి ప్రభావం ఎక్కువ ఉంటుంది. సినిమా మొత్తాన్ని సైతం ప్రభావితం చేసేంత పవర్ ఫుల్ గా ఆ పాత్రలను కథకులు రూపొందిస్తారు. అదేమాదిరి పాలిటిక్స్ లోనూ అతిథి పాత్రలు ఉంటాయి. వాళ్ళు కనిపించేది తక్కువే అయినా వాళ్ళ హడావుడి ఎక్కువ ఉంటుంది. వాళ్ళ లెక్కలు.. లాభనష్టాల బేరీజులు కూడా వేరేలేవేల్.. అంతా స్పాట్లో తేలిపోవాల్సింది.. ఆ కోవకు చెందినవారే జనసేనాని పవన్ కళ్యాణ్. మూన్నెళ్లకు ఒకసారి ప్రజల్లోకి వచ్చే అయన ఆమధ్య ఈస్ట్ గోదావరికి పర్యటించి రాజోలు, రాజనగరానికి అభ్యర్థులు ప్రకటించేశారు. దీంతోబాటు రాజమండ్రి రూరల్ కూడా తమ అభ్యర్థి కందుల దుర్గేష్ కు ఇవ్వాలని ఇస్తారని తేల్చేసారు.. అక్కడ ప్రస్తుతం ఆరుసార్లు గెలిచిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు... ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ... నన్ను కాదని మీరు టిక్కెట్లు ఎలా ఇస్తారు అంటూ అయన ఇప్పటికే నిప్పు రాజేశారు..దీంతోబాటు రాజానగరం, రాజోలులోనూ టీడీపీ నాయకులూ ఇప్పటికే సుర్రుమంటున్నారు.. మళ్ళీ మూణ్ణెల్ల గ్యాప్ తీసుకుని ప్రజల్లోకి వచ్చిన పవన్ విశాఖ జిల్లా పాలిటిక్స్ మీద దృష్టిపెట్టారు. విశాఖలో అన్నయ్య నాగబాబుతోబాటు పలు సమీక్షలు సమావేశాలు నిర్వహించిన పవన్ ఏకంగా నాలుగూటిక్కెట్లు ప్రకటించేసారు.. తెలుగుదేశంతో పొత్తు ఉన్నప్పటికీ అలా ఏకపక్షంగా టిక్కెట్స్ ఎలా ఇచ్చారో తెలీడం లేదు కానీ భీమిలికి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ ను ఇంచార్జ్ గా నియమించారు. పెందుర్తి పంచకర్ల రమేష్ బాబును, గాజువాకకు సుందరపు సతీష్ కుమార్ ను, యలమంచిలిని సుందరపు విజయ్ కుమార్ కు ప్రకటించేసారు. ఇక పెందుర్తి జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని టీడీపీ సీనియర్ బండారు సత్యనారాయణ మూర్తి ఇప్పటికే కత్తులు నూరుతున్నారు. ఇప్పుడు ఏకంగా నలుగురికి దాదాపు టిక్కెట్లు ఇచ్చేస్తుంటే టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా ? ఇప్పటికే అక్కడ ఐదేళ్లుగా పని చేస్తున్న టీడీపీ క్యాడర్ ఎందుకు ఊరుకుంటుంది.. తమ ఎత్తులు.. తమ నిరసనలు వ్యక్తం చేస్తారు కదా అని అంటున్నారు. ఏకపక్షంగా టిక్కెట్లు ఇచ్చేస్తుంటే తెలుగుదేశం అధిష్టానం, చంద్రబాబు ఎందుకు ఊరుకుంటున్నారన్న అనుమానాలు వస్తున్నాయి. పవన్ ఇప్పటికే ఈ విషయమై మాట్లాడుకుని బాబు దగ్గర హామీ తీసుకునే చెప్పారా అనే దావుట్లు వ్యక్తం అవుతున్నాయి.. ✍️సిమ్మాదిరప్పన్న -
జనసేనకు ‘కొత్త’ తలనొప్పి
అలగడమే అలంకారంగా భావించే సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ.. జనసేనలో చేరీ చేరడంతోనే తన సహజనైజాన్ని బయటపెట్టుకున్నారు. అనకాపల్లిలో ఎంపీగా పోటీ చేసేది తానేనని ఫిక్స్ అయిపోయాకనే అయన జనసేనలో చేరారు. వాస్తవానికి అయన ఆలోచనలకూ విరుద్ధంగా జరిగితే వెంటనే అయన అలకపాన్పు ఎక్కుతారు.. ఇది గత కొన్నేళ్లుగా జరుగుతున్నదే. కాంగ్రెసులోను, వైఎస్సార్ కాంగ్రెస్ లోను ఇలా ఎక్కడైనా ఆయనది అదే తీరు. ఇక చాన్నాళ్లుగా ఖాళీగా ఉంటున్న కొణతాల రామకృష్ణ మొన్నీమధ్యనే జనసేనలో చేరారు. చేరుతూనే.. తాను అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని అని తనకుతానే ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉండగానే.. అనకాపల్లి నుంచి తాను పోటీ చేస్తాను అంటూ పవన్ అన్నయ్య నాగబాబు సైతం అనకాపల్లి మీద కన్నేశారు.. తరచూ అక్కడే పర్యటిస్తున్నారు. యలమంచిలి దగ్గర అయన ఉండేందుకు ఒక ఇతనికి, స్టాఫ్ కోసం ఇంకో రెండు ఇళ్లను సైతం తీసుకున్నారు. అనకాపల్లి నుంచి పోటీకి అయన ఏర్పాట్లు చేసుకున్నారు... దీంతో తన అంశాలమీద నీళ్లు పడ్డాయని గుర్తించిన కొణతాల మొన్న నిన్న అనకాపల్లిలో జరిగిన పార్టీ సభలు, ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ' తనకు టిక్కెట్ ఇవ్వనప్పుడు ఇంకా పార్టీ సమావేశాలకు వెళ్లడం ఎందుకన్నది ఆయన భావన. ఇదిలా ఉండగా అనకాపల్లిలో ప్రధాన సామాజిక వర్గం అయిన గవర కమ్యూనిటీకి చెందిన కొణతాల అలిగితే ఇక తన గెలుపు సంగతి అటుంచి డిపాజిట్లు కూడా రావని భయపడిన నాగబాబు ఒకవైపు.. పవన్ మరోవైపు కొణతాల ఇంటికి వెళ్లి ఆయన్ను బుజ్జగించారు. ఇదిలా ఉండగా తెలుగుదేశంతో పొత్తులో భాగంగా జనసేనకు అనకాపల్లి,కాకినాడ,మచిలీపట్నం లోక్ సభ స్థానాలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో నాగబాబు సైతం అనకాపల్లిలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక.. కొణతాల సైతం అక్కడే కన్నేయడంతో ఇరువురిమధ్య పీఠముడి పడింది. దీంతో ఆ విభేదాలను పరిష్కరించేందుకు పవన్, నాగబాబు సైతం కొణతాల ఇంటికి వెళ్లి వచ్చారు. ఒకవేళ అయన మెత్తబడినా ఆయనకు ఇంకోచోట ఎక్కడ సీట్ ఇస్తారనేది తెలియడం లేదు. ఇప్పటికే విశాఖలో పెందుర్తి, భీమిలి ఇలా మూడు నాలుగు సీట్లలో జనసేన గట్టిగా డిమాండ్ చేస్తోంది.. ఇప్పుడు అవికాకుండా అనకాపల్లి ఎమ్మెల్యే కూడా తీసుకోవడం కష్టమే.! మరి అలాంటప్పుడు కొణతాలను ఎక్కడ ? ఎలా ఎకామిడేట్ చేస్తారో చూడాలి. ఇక్కడ.. వైవీ చక్రవర్తి అనే అయన సైతం తెలుగుదేశం నుంచి పోటీ చేసేందుకు రెడీ అవుతుండగా. సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడు కొడుకు విజయ్ కూడా టిక్కెట్ కోసం చూస్తున్నారు.. ఇదిలా ఉండగా మరో సీనియర్ నాయకుడు దాడి వీరభద్రరావు కొడుకు రత్నాకర్ సైతం టీడీపీ కోసం గట్టిగా ఆశతో ఉన్నారు. దీంతో వీళ్ళు ఎవరికీ టిక్కెట్ లేకుండా నాగబాబుకు ఇచ్చేలా చంద్రబాబును పవన్ ఒప్పిస్తున్నారు అని అంటున్నారు.. దీంతో అనకాపల్లి కాస్తా హాట్ టాపిక్ అయ్యింది. ✍️సిమ్మాదిరప్పన్న -
త్యాగరాజులు రెడీగా ఉండండి..
ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తోంది.. త్వరలో షెడ్యూల్ అనే బాజా భజంత్రీలు మోగనున్నాయి. ఈలోపు రాజకీయ పార్టీలు తమ ఎత్తులు.. పొత్తులు.. జిత్తులతో సిద్ధం అవుతున్నారు. ఇదిలా ఉండగా చంద్రబాబు మాత్రం తమ పార్టీ విధానాన్ని, వ్యూహాన్ని క్యాడరుకు కాస్త చెప్పారు.. బీజేపీతో పొత్తు ఉంటుందని.. ఇక జనసేనలో ఎలాగూ ప్రయాణం ఉంటుందని.. అంటే మూడుపార్టీలూ కలిసి వెళ్తాయని చెప్పారు. ఇదే క్రమంలో పార్టీలోని వాళ్లు.. త్యాగాలకు సిద్ధం కావాలని చెప్పారు.. అంటే మూడు పార్టీలు కలిసి వెళ్తాయి కాబట్టి అటు జనసేనకు, బీజేపీకి ఇవ్వాల్సిన సీట్లలో టీడీపీ నాయకులూ త్యాగాలు చేయాలనీ చెప్పారు. ఇదే తరుణంలో అసలు అభ్యర్థుల ఎంపికకు సైతం చాలా సమయం పడుతుందని అప్పుడే సీట్ల గురించి కంగారు పడొద్దని అయన చేసిన అభ్యర్థులు, ఆశావహుల్లో నైరాశ్యాన్ని నింపింది.. అసలే అటు వైఎస్ జగన్ జెట్ స్పీడులో సభలు సమావేశాలు.. సమీక్షలు.. అంటూ పార్టీని ముందుకు ఉరికిస్తుంటే ఇటు ఎక్కడ ఎవరికీ సీట్ అన్నది కూడా ఇంకా తేల్చకపోతే ఇంకా తామెప్పుడు ప్రచారం చేస్తాము.. ఇంకెప్పుడు ఎన్నికలకు వెళ్తాం అని వారు కలవరపడుతున్నారు. ఇదిలా ఉండగా ఐదేళ్లుగా పార్టీని మోస్తున్న తమను కాదని ఇప్పుడొచ్చిన జనసేన, బీజేపీలకు ఎలా టిక్కెట్లు ఇస్తారని కొందరు టీడీపీ నాయకులూ ఆందోళన చెందుతున్నారు.. ఎక్కడ తమ స్థానం కూడా మిత్ర పక్షాలకు వెళ్లిపోతుందేమో అని మరికొందరు టెన్షన్ పడుతున్నారు. మరికొందరు మాత్రం అసలు ఈ ఎత్తులు పొత్తులు ఎందుకు విజయమో వీర స్వర్గమో సొంతంగా సింగిల్‌గా పోటీ చేస్తే ఆటో ఇటో తేలిపోతుందని ఎవర్నీ దేబిరించే అవసరం ఉండదు అని.. కొందరు అంటున్నారు.. కానీ పొత్తుల్లేకుండా వెళితే మళ్ళీ 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అవుతాయని కొందరు భయపడుతున్నారు. మరోవైపు లోకేష్ చేస్తున్న యాత్రలు.. టూర్లు కూడా పెద్దగా మైలేజి ఇవ్వడం లేదని పార్టీ అంతర్గత సర్వేల్లో తేలినట్లు తెలిసింది.. అలాగని ఆయన్ను ఇంట్లో కట్టేసి ఉంచితే ఊరుకోవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా తిరుగుతాను. ప్రజల్లో ఉంటాను.. అని చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని తెలిసింది.. దీంతో అయన మాట కాదనలేక అలా జిల్లాల టూర్లకు పంపుతున్నారు. అటు ఈయన మీటింగుల్లో చేసే కామెంట్లు.. వ్యాఖ్యలు ఘోరంగా ట్రోలింగ్‌కు గురవుతున్నాయని.. ఆయన అపరిపక్వత మరింతగా జనానికి తెలుస్తుందని, అటు నియోజకవర్గ ఇంఛార్జులకు ఖర్చుతప్ప పార్టీకి లాభం లేదని కొందరు ఆవేదన చెందుతున్నారు.. -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: చంద్రబాబులోని చీకటి కోణమే ఇది! -
Pawan Kalyan: సేనాని రూటే సెపరేటు!
ఊళ్లలో కొంతమంది ఉంటారు.. లోకం ఎలా పోయినా ఫర్లేదు.. నేను, నా ఫ్యామిలీ బాగుంటే చాలు అనుకుంటారు. దేశం ఎలా తగలాడినా నాకేటి బాధ నా ఆదాయం బాగుంటే చాలకునుకేవాళ్లు ఇంకొందరు. అచ్చం అలాంటివాళ్లే రాజకీయాల్లోనూ ఉంటారు. విలువలు... గౌరవం.. మట్టిగడ్డ ఏమి ఎలా పొతే నాకేం.. నా లాభం... నా ప్రయోజనం నాకు ముఖ్యం అనుకుంటారు... అందులో చంద్రబాబు ఎలానూ ఉండనే ఉంటారు... ఇప్పుడు ఆ టీంలో చేరిన పవన్ కళ్యాణ్ సైతం అచ్చం అదే పాలసీ ఫాలో అవుతున్నారు. రాష్ట్రంలోని వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం ఇంకా బీజేపీ వంటి పార్టీలు సైతం.. ‘‘అమ్మో.. ఎన్నికలు వస్తున్నాయి... పార్టీని నడపాలి... ఇంఛార్జులను వేయాలి ... క్యాడర్‌ను సమాయత్తం చేయాలి.. ఈసారి ఎలాగైనా గట్టిగా పోరాడి పార్టీని ఒక స్థాయికి తీసుకు రావాలి... అధికారం చేపట్టాలి’’ అంటూ వాళ్ళవాళ్ళ స్థాయిని బట్టి వ్యూహాలు.. సమీకరణాలు వేస్తున్నారు... కానీ జనసేనాని పవన్ కల్యాణ్ మాత్రం ఇవేం పట్టించుకోకుండా హాయిగా డబ్బులు కలెక్షన్ మీద దృష్టి పెట్టారు. నా పార్టీ కోసం ఎవరూ పైసా ఇవ్వొద్దు అని, తన సొంత సొమ్ము ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాను అని, రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నాను అని చెబుతూ వచ్చిన జనసేనాని ఇప్పుడు ఏకంగా అధికారికంగా విరాళాలు సేకరించే పనిలో పడ్డారు. దీనికోసం ఏకంగా క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేసి ట్విట్టర్లో పోస్ట్ చేసి నేరుగా విరాళాలు దండుకుంటున్నారు. రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడం కొత్త కాదు, తప్పు కాదు కానీ ఏకంగా ఇలా చిల్లరగా క్యూ ఆర్ కోడ్ పెట్టి దండుకోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నడపడం లేదు. క్యాడర్ కోసం ఏమీ చేయడం లేదు.. పవన్ సభలకు వాహనాలు.. ఇతర ఏర్పాట్ల ఖర్చు సైతం స్థానిక నాయకులే చూసుకుంటున్నారు తప్ప పార్టీ నుంచి ఏమీ మద్దతు లేదు. దీనికితోడు చంద్రబాబు కోసం దశాబ్దకాలంగా పని చేస్తున్నందుకు అయన నుంచి కూడా భారీగా ముడుపులు పుచ్చుకుంటున్నట్లు పవన్ మీద ఆరోపణలు మొదటి నుంచీ ఉన్నవే!. మరి అలాంటప్పుడు.. ఇంకా ఈ చిల్లర కలెక్షన్ ఎందుకు అన్న అనుమానాలు వస్తున్నాయి. అటు బాబు నుంచి భారీగా ప్యాకేజి అందుకుంటూనే ఇటు చిల్లర కలెక్షన్ సైతం వదలడం లేదని అంటున్నారు. అంటే అయన కూడా తన గురువు చంద్రబాబు మాదిరి తనకు వాచీ , ఉంగరం లేదని, ఏదోలా బతుకుతున్నాను అని చెప్పడానికే ఈ విరాళాల సేకరణ అని అంటున్నారు. వాస్తవానికి జనసైనికులే తల్లిదండ్రులమీద ఆధారపడి బతుకుతుంటారు. వారి జేబు ఖర్చులకే పేరెంట్స్ నుంచి వంద యాభై అడిగి తీసుకుంటారని, ఇప్పుడు వారి దగ్గరున్న ఆ చిల్లర సైతం లాగేసేందుకు పవన్ కల్యాణ్ భలే ఎత్తులు వేశారని సెటైర్లు వినిపిస్తున్నాయి. :::సిమ్మాదిరప్పన్న -
Congress: షర్మిలకు మొండి చెయ్యి
అంతన్నారు ఇంతన్నారు.. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఆమెకు ఏపీ పీసీసీ చీఫ్ పదవితో బాటు కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తారని, ఇంకా కాంగ్రెస్ గెలిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఇస్తారని ఊదరగొట్టారు.. చూస్తే చివరకు ఆమెకు ఏమీ లేకుండా పోయింది. అప్పట్లో ఆమె తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జాతీయ కాంగ్రెసులో విలీనం చేసినప్పుడే ఆమెకు రాజ్యసభ హామీ ఉందని అన్నారు.. కానీ చివరకు ఏం జరిగింది. దేశంలో పలు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్ర నుంచి మూడు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. దీనికోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సైతం ప్రకటించింది. ఈనెల 15 తేదీలోపు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువుంది. కానీ ఈ క్రమంలో కాంగ్రెస్ తరఫున షర్మిలకు టిక్కెట్ అయితే దక్కలేదు. ఒకనాడు యావద్దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు అక్కడక్కడా మిణుకుమిణుకుమంటూ వెలుగుతోంది. ప్రస్తుతం తెలంగాణ, హిమాచల్, కర్ణాటకలో మాత్రం అధికారంలో ఉండగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటిచోట్ల చెప్పుకోదగ్గ సీట్లతో ప్రతిపక్షంలో ఉంది. వ్యూహాత్మకంగా ప్లాన్ చేస్తే ఓ పది వరకు సీట్లు కాంగ్రెసుకు రావచ్చని అధిష్టానం అంచనా వేస్తోంది. ఐతే ఈ క్రమంలో విజయ్ మాకెన్ వంటి కొందరు పేర్లను ప్రకటించిన కాంగ్రెస్ షర్మిల పేరును మాత్రం ఆ జాబితాలో చేర్చలేదు. దీంతో ఆమెకు ఇన్నాళ్లుగా జరిగింది ప్రచారమే తప్ప ఆమెకు ఇంకేం లేదని అంటున్నారు. ఆమెను కేవలం సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మీద విమర్శలు.. నిరాధార ఆరోపణలు చేయడం కోసమే వాడుకుంటున్నారు తప్ప అంతకు మించి ప్రాధాన్యం ఉండదు అని.. ఆమె అటు చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీలకు పావుగా ఉపయోగపడడం ఆంధ్రాలో గౌరవాన్ని పోగొట్టుకోవడం మినహా ఆమెకు రాజకీయ కెరీర్ ఉండదు అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు అంటున్నారు. -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: Pawan Kalyan: అనువుగాని చోట..! -
ఏపీ Alliance: బాబు పాలిట అశనిపాతంలా..
ఇన్నాళ్లూ ఒకలెక్క... ఇకనుంచి ఇంకోలెక్క ... వాళ్లొచ్చాక.. ప్రతి లెక్కా పక్కా.. అప్పట్లా ఇప్పుడూ నడిపిస్తాం అంటే కుదరదు... టర్మ్స్ మీరు డిసైడ్ చేసే కాలం పోయింది.. మేము రూల్స్ రాస్తాం.. మీరు పాటించాలి అనే పరిస్థితి వచ్చింది.. ఇది కాస్త చంద్రబాబు పాలిట ఆశనిపాతంలా మారింది. దీంతో ఏమి చేయాలో తెలీక చంద్రబాబు గుడ్లనీళ్ళు మింగుకుంటూ దిగులుగా కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు కోవిడ్ అనే వైరస్ ఫార్ములాను చైనా కనిపెట్టి ప్రపంచాన్ని వణికించడంలో ఎంత నిజం ఉందో లేదో తెలీదు కానీ బీజేపీ కనిపెట్టిన ఈ కొత్త ఫార్ములా మాత్రం చంద్రబాబును వణికిస్తోంది. అద్వానీ.. వాజ్‌పేయి కాలంలో బీజేపీకి ఉన్న ఆదరణ ఓటు బ్యాంకును వాడుకుని ఒకసారి.. మోదీ క్రేజును వాడుకుని ఇంకోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తరువాత మోదీ, అమిత్ షా వంటివారిని ఎంతలా అవమానించారో టీడీపీ వాళ్ళు మర్చిపోయినా ఢిల్లీవాళ్ళు మాత్రం గుర్తుంచుకున్నారు. ఈసారి కూడా అలాగే బీజేపీ భుజాలమీద నుంచి అధికారం వైపు నడుచుకుంటూ పోదాం అనే చంద్రబాబు ఆశలకు ఢిల్లీ పెద్దలు అడ్డుకట్ట వేశారు. పొత్తు పెట్టుకుందాం.. మీకు అధికారం వచ్చేలా మేము సాయం చేస్తాం.. కానీ ... కానీ అంటూ షరతులు వర్తిస్తాయి అనే మాట వాడారు. ఈసారి బీజేపీ అధిష్టానం మాత్రం షరతులు చాలా పక్కాగా రూపొందించడంతో.. ఎండు చేప ముక్క కోసం వెళ్లి బోనులో ఇరుక్కున్న మాదిరి అయింది చంద్రబాబు పరిస్థితి. ఇంతకూ ఏమిటా షరతులు ? ఇన్నాళ్ల మాదిరి అక్కడా ఇక్కడా ఓ పదిహేను ఎమ్మెల్యే.. ఓ మూడు నాలుగు ఎంపీసీట్లు పడేసి రాష్ట్రం మొత్తం బిజెపికి ఉన్న ఓటు బ్యాంకుకు... ఆదరణను వాడుకోవడం ఈసారి కుదరదు. ప్రతి ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఉండే ఏడు ఎమ్మెల్యే సీట్లలో నాలుగు సీట్లు టీడీపీకి పోగా రెండు జనసేనకు, ఇంకోటి బీజేపీకి ఇవ్వాల్సిందే! లేదా రెండు బీజేపీకి.. ఒకటి జనసేనకు ఇవ్వాలి.. అంటే ఫైనల్ గా పాతిక ఎంపీ స్థానాల పరిధిలో 75 సీట్లు ఈ ఇద్దరికీ ఇవ్వాల్సిందే. .. అలా ఇస్తే టీడీపీకి మిగిలేది వంద సీట్లే.. ఇలా ఇస్తే ఆ 75 చోట్లా టీడీపీ నాయకులను నచ్చజెప్పడం అసాధ్యం. నియోజకవర్గాల్లో నాయకులూ కొట్టుకుని చస్తారు. పార్టీ అల్లకల్లోలం అవుతుంది. పోనీ అలా కాదని.. పొత్తు లేకుండా ఎన్నికలకు వెళితే మొన్న 2019 లో ఏమి జరిగిందో బాబుకు తెలుసు.. ఒంటరిగా జగన్‌ను అడ్డుకోవడం బాబుకు కలలో కూడా సాధ్యం కాదు. పోల్ మేనేజ్మెంట్.. ఇతరత్రా వ్యవహారాల్లో చాలా పడగబ్బందీగా ఉండే సీఎం వైఎస్ జగన్‌ను ఎన్నికల్లో నిలువరించడం బాబుకు కుదరని పని. అలాగని బీజేపీ చెప్పినట్లు వింటే పార్టీలో తుపాను వస్తుంది. దీంతో ఏమి చేయాలో అర్థం కాక ఇటు అభ్యర్థులను ఖరారు చేయలేక సైలెంట్ అయ్యారు.. ఇటు వైయస్ జగన్ మాత్రం తమ అభ్యర్థులను ఒక్కొక్కరినీ ప్రకటించుకుంటూ .. సామాజిక సమీకరణాలు.. ఇతరత్రా వ్యూహాలు పన్నుతూ ముందుకు సాగుతుంటే.. టీడీపీ జనసేన కూటమి మాత్రం జాతరలో తప్పిపోయిన పిల్లల్లా బిత్తర చూపులు చూస్తూ తమను ఎవరైనా సేఫ్ ప్రాంతానికి తీసుకుపోలేకపోతారా? అనే ఆశతో అక్కడే ఉండిపోయారు. ✍️సిమ్మాదిరప్పన్న -
టీడీపీ చంద్రబాబు: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..
తన నలభయ్యేళ్ళ కెరీర్లో చంద్రబాబు గతంలో ఎన్నడూ ఎదుర్కొని సందిగ్ధావస్థను ఎదుర్కొంటున్నారు. ముందుకు వెళ్తే నుయ్యి.. వెనక్కి వెళ్తే గొయ్యి అనేలా ఉంది చంద్రబాబు పరిస్థితి. రాష్ట్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తన పార్టీకి నష్టం.. పొత్తు లేకపోతె ఎన్నికలకు పోవడం కష్టం.. అనేది ఆయనకు సమజయింది. ఈసారి ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవడం తనకు సింగిల్‌గా అసాధ్యం కాబట్టి ఢిల్లీ పెద్దల పొత్తు, సపోర్ట్ అవసరం అని చంద్రబాబుకు ఎప్పుడో తెలుసు. దానికితోడు కాపుల మద్దతుకోసం ఇటు పవన్ సైతం కావాల్సి వచ్చింది. దీంతో పవన్, బీజేపీ మధ్యలో టీడీపీ ఇలా ముగ్గురూ పొత్తులో కలిసి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. అయితే, ఇప్పుడున్న బీజేపీ గతంలో అద్వానీ.. వాజ్‌పేయ్ కాలం నాటి బీజేపీ కాదు. ఇది మోదీ, అమిత్ షాల సారధ్యంలో ఉన్న టర్బో ఇంజిన్ ఉన్న ఫైటర్ జెట్ లాంటి బీజేపీ. దానికి ఎదురొస్తే తొక్కుకుంటూ పోవడమే తప్ప కలుపుకుని పోవడం అలవాటులేదు. దానికితోడు జాతీయ స్థాయిలో అవకాశవాదానికి బ్రాండ్ నేమ్ అని ముద్రపడిన చంద్రబాబును నమ్మడం ఇప్పుడు బీజేపీకి అవసరం లేదు. గతంలో అంటే 1999, 2014లో బీజేపీ సపోర్ట్‌తో గెలిచిన చంద్రబాబు ఆ తరువాత ఆ పార్టీని దాని నాయకులను ఎలా అవమానించింది అందరికీ తెలిసిందే. కేవలం పదిహేను సీట్లు పడేసి.. బీజేపీ మద్దతు పొంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది పవర్ అనుభవిద్దాం అనుకుంటే అప్పుడు చెల్లింది కానీ ఇప్పుడు నడవదు. అవ్వాకావాలి బువ్వా కావాలి అంటే కుదరదు. కాబట్టి ఈసారి పొత్తులకు వెళ్లిన చంద్రబాబుకు బీజేపీ వాళ్ళు సవాలక్ష కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. దాదాపు నలభైకి పైగా సీట్లు అడుగుతున్నట్లు తెలిసిందే. అంటే బీజేపీకి నలభై.. జనసేనకు కనీసం ఓ పాతిక సీట్లు ఇవ్వకతప్పదు. అంటే మొత్తం అరవై సీట్లు వదిలేసి ఎన్నికలకు వెళ్ళాలి. ఇలా అరవై వదిలేస్తే అక్కడ టీడీపీ ఆశావహులు ఊరుకుంటారా?. వాళ్ళు చేసే గొడవ అంతా ఇంతా కాదు.. పోనీ ఈ అరవై సీట్లలో జనసేన, బీజేపీ గెలిచేందుకు టీడీపీ వాళ్ళు సహకరిస్తారా అంటే అనుమానమే. దీంతోపాటుగా టిక్కెట్ దక్కని టీడీపీ వాళ్ళు అక్కడ ఖచ్చితంగా పార్టీకి నష్టం చేస్తారు. అలాగని పొత్తుల్లేకుండా ఎన్నికలకు వెళ్లే దమ్ములేదు. దీంతో చంద్రబాబు ఎటు వెళ్ళాలి.. ఎలా వెళ్లాలని తీవ్ర మల్లగుల్లాలు పడుతున్నారు. బీజేపీతో వెళితే మాత్రం వాళ్ళ కండీషన్స్‌ను ఒప్పుకోవాలి. లేకుండా వెళ్తే.. ఎన్నికలలోపే గేమ్ ముగిసిపోతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం జగన్ వేసే ఎత్తులు.. వ్యూహాల ముందు చంద్రబాబు ఎదురు నిలవలేని పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నపుడే జగన్ ఎన్నికల మ్యానేజ్మెంట్లో విశ్వరూపం చూపించారు. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నాక ఎందుకు ఊరుకుంటారు. ఆ భయం కూడా చంద్రబాబును నిద్రకు దూరం చేస్తోంది. మరోవైపు పవన్ ఢిల్లీ టూర్ వాయిదా పడింది. ఇంకో పదిరోజులు గడిస్తే తప్ప కూటమికి ఏదీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇక, ముఖ్యమంత్రి జగన్ మాత్రం అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. -సిమ్మాదిరప్పన్న -
కొంప ముంచే డైరీలు..!
ఆనాడు హవాలా జైన్ డైరీ.. నేడు లోకేష్ రెడ్ డైరీ.. తెలంగాణాలో రేవంత్ రెడ్డి డైరీ.. వీళ్లంతా డైరీల పేరిట జనాన్ని భయపెడుతున్నారో లేక రాజకీయాల్లో హడావుడి చేస్తున్నారో తెలీదు కానీ వీళ్ళ పుణ్యాన డైరీల్లోని రహస్యాలు.. అందులోని అంశాలు.. వాటి పర్యవసానాలు ఎక్కడికి తీసుకుపోతాయోనన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు డైరీలు రాయడం.. ఎదుటివాళ్లను బెదిరించడం ఒక ఫ్యాషన్ అయింది. అప్పట్లో స్కూల్లో టీచర్ బయటికి వెళ్తూ.. ఒరేయ్ లీడర్.. క్లాసులో అల్లరిచేసే వాళ్ళ పేర్లు పుస్తకంలో రాయి.. మళ్ళీ వచ్చి ఒక్కొక్కడికి వీపులు వాయగొడతాను అని చెప్పి వెళ్తాడు.. ఆ లీడర్ అలాగే తనకు నచ్చనివాళ్ళ పేర్లు... ఇంటర్వెల్లో జామకాయలు.. రేగ్గాయలు ఇవ్వని వాళ్ళను.. సైకిల్ అడిగితె ఇవ్వని వాళ్ళ పేర్లన్నీ రాసేసి టీచరుకు ఇచ్చి దెబ్బలు కాయిస్తాడు.. అచ్చం ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే నడుస్తోంది.. ఆంధ్రాలో లోకేష్ సైతం తన యువగళం పాదయాత్ర చేస్తున్నానని రోజులూ ఒక ఎర్ర బుక్కు పట్టుకుని ఉండేవారు.. తనకు నచ్చని.. తమ పార్టీని.. తమ క్యాడర్ ను ఇబ్బంది పెట్టినవాళ్లందరినీ మున్ముందు అధికారంలోకి వచ్చాక శిక్షిస్తాను అని చెబుతూ వాళ్ళ పేర్లు రాసుకునేవారు. పోలీసులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ.. కార్యకర్తలు .. అధికారులు.. ఇలా రకరకాల వాళ్ళను టార్గెట్ చేస్తూ వారి పేర్లను రెడ్ బుక్కులో రాస్తున్నాను .. మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళను కట్ డ్రాయర్లతో నడిపిస్తాను అని హెచ్చరించారు. ఇది ఆపూటకు ఆ మీటింగులో లోకేష్‌కు మైలేజి తెచ్చిందో లేదో తెలీదు కానీ.. జనం మాత్రం నవ్వుకున్నారు.. ఇలా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదేమైనా రాచరికపు కాలంలో ఉన్నామా అనే కామెంట్లు కూడా వచ్చాయి. గతంలో నిషిద్ధ పీపుల్స్ వార్ నక్సలైట్లు మాత్రమే ఇలా డైరీ రాసేవారు. తమ వర్గశత్రువుల పేర్లు ఆంటే ఎమ్మెల్యేలు ఆ జిల్లాలోని కొందరు పోలీసుల పేర్లు అందులో రాసి వాళ్ళను టార్గెట్ చేసి హత మార్చేవారు. అచ్చం ఆ డైరీని తలపించే లోకేష్ రెడ్ డైరీ మీద ఆంధ్ర సీఐడీ కేసు బుక్ చేసింది. విచారణకు సైతం రమ్మని నోటీసులు పంపింది. సిమ్మాదిరప్పన్న -
జోగయ్య కాదు జోరీగయ్య
చేగొండి హరిరామ జోగయ్య తీరు చూస్తుంటే పవన్ కళ్యాణ్‌కు చిర్రెత్తుకొస్తోంది... ఒకవైపు చూస్తే కులంలో పెద్ద... మరోవైపు సీనియర్ నాయకుడు... అలాంటి మనిషి తరచూ తనను ఇరిటేట్ చేస్తుంటే పవన్ ఏమీ అనలేక.. ఇటు చంద్రబాబు దగ్గర డిమాండ్ చేసే పరిస్థితి లేక.. బిత్తరపోయి చూడడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు. ముక్కీ మూలిగి పొత్తులో ఓ పాతిక సీట్లు తెచ్చుకోవడం పవన్ కళ్యాణ్ కు గగనమైపోతోంది..ఇది కూడా ఎక్కడ ఇస్తారన్నది ఖరారు కాలేదు.. కేవలం టిక్కెట్లే ఇస్తారా.. అభ్యర్థులను శాతం చంద్రబాబే సప్లై చేస్తారా అన్నది కూడా ఇంకా స్పష్టత రాలేదు.. ఈలోపే జోగయ్య మళ్ళీ జోరీగయ్య మాదిరి మారిపోయి లేఖలు రిలీజ్ చేస్తున్నారు కనీసం అరవై సీట్లు ఇవ్వకుండా దేనికోసం పొత్తు.. ఇలాగైతే మా కాపులు .. కాపు యువత.. నాయకులూ ఏమవ్వాలి.. చంద్రబాబును సీఎంను చేసేందుకు మేమెందుకు పాలికాపులమవ్వాలి. పాతిక ఇరవై సీట్లకోసం పవన్ ఇంత యాగీ చేసి సినిమా కెరీర్ వదులుకుని జగన్ మీద ఇంతగా రెచ్చిపోయి కాలు దువ్వి శత్రుత్వం తెచ్చుకోవాలా ? ఇదెక్కడి దరిద్రం అంటూ జోగయ్య రాస్తున్న లేఖలు. వాటిలో లేవనెత్తుతున్న సందేహాలు ఇటు కాపు యువతలో ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. కాపులకు అధికప్రాధాన్యం ఇస్తూ కాపు నేస్తం వంటి పథకాలతో మహిళలను సైతం ఆడుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కాళ్ళదన్నుకుని తెలుగుదేశం పల్లకీ ఎందుకు మోయాలి అనేది ఇప్పుడు గోదావరి జిల్లాల్లోచర్చ. కులం చెడినా సుఖం దక్కాలన్నది సామెత. కానీ కేవలం పాతిక సీట్ల కోసం మొత్తం కాపులను గంపగుత్తగా చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేస్తే ఎలా అనేది జోగయ్య ప్రశ్న... అరవై సీట్లయినా ఇవ్వకుంటే కాపు నాయకులకు పోటీ చేసేందుకు ఎక్కడ అవకాశం వస్తుందని.. వాళ్లంతా చాన్నాళ్లుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోసం చూస్తున్నారని. ఇప్పుడు పాతిక సీట్లకే ఒప్పేసుకుంటే ఇక వాళ్లంతా ఎందుకు ఊరుకుంటారని..? ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేస్తారని జోగయ్య లేవనెత్తిన ప్రశ్నలు సమంజసమే అని కాపు యువత అంటోంది. గౌరవప్రదంగా సీట్లు కేటాయించకుంటే పొత్తు పొసగదని జోగయ్య తేల్చేసారు. దీంతో పవన్ ఏమీ చేయలేక సైలెంట్ అయ్యారు. ఇటు చూస్తుంటే చంద్రబాబు పాతిక సీట్లకు మించి ఇవ్వడు.. కావాలంటే బ్లాకులో డబ్బు ఇస్తాడు కానీ సీట్లు ఇవ్వడు.. అన్ని లేకపోతె ప్రజలు ఒప్పుకోరు.. దీంతో ఏమి చేయాలో తోచక పవన్ మళ్ళీ కార్యకర్తలకు మొహం చూపలేక సిగ్గుతో దాక్కున్నారు. అలాగని టీడీపీని కాదని అటు బీజేపీతో వెళ్లేందుకు మనసు ఒప్పడం లేదు.. ఏమిటో పార్టీ పెట్టి ఇన్నేళ్లయినా ఒక దారీ తెన్నూ లేకుండా జాతరలో దారితప్పిన పిల్లాడిలా పవన్ ఆందోళనలో ఉండిపోయారు -సిమ్మాదిరప్పన్న -
గోదావరి ఎక్స్‌ప్రెస్.. కోట్ల మంది ఎమోషన్!
ఏరా రామినాయుడూ.. ఐడ్రాబాడ్ నుంచి ఎప్పుడొచ్చావు.. ఎలా వచ్చావు.. ఆ పొద్దున్నే గొడావరికి దిగాను.. మళ్ళీ ఎల్లుండి గొడావరికి వెళ్లిపోతున్నా.. ఒరేయ్ నరేషూ అక్కాబావ పండక్కి గొడావరికి వస్తున్నారట స్టేషనుకు వెళ్లి ఆటోలో తీసుకొచ్చేరా.. బావా నువ్వెళ్లు.. అక్కను వారం తరువాత గొడావరికి ఎక్కిస్తాలే.. నువ్వొచ్చి రిసీవ్ చేసుకో.. అబ్బా.. ఏ ట్రైనుకు అయినా టిక్కెట్స్ దొరుకుతాయి కానీ గొడావరికి దొరకవండీ.. ట్రైన్ అంటే ట్రైన్ గొడావరి.. షార్ప్.. విమానం కన్నా పర్ఫెక్ట్ టైమింగ్.. అదీ.. అదీ గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న పాపులారిటీ. యాభయ్యేళ్ళ క్రితం హైదరాబాద్ డెక్కన్.. విశాఖ మధ్య ప్రారంభమైన ఈ ట్రైన్ మామూలు ఇనుప యంత్రం కాదు.. ఉమ్మడి ఆంధ్రాలో ప్రతి ఇంటికీ ఉన్న ఒక ఎమోషనల్ బంధం.. అసలు గోదావరి అంటేనే ఒక ఎమోషన్. ఈ యాభయ్యేళ్లలో ఎన్నో కోట్లమందిని కలిపిన ఆత్మీయ బంధం.. అన్నిటికీ మించి అది ఒక వీఐపీ ట్రైన్. రాష్ట్రానికి ఈ చివరనున్న ఉత్తరాంధ్ర నవదంపతులను పొందిగ్గా అత్యంత జాగ్రత్తగా పూల పల్లకీలో ఊరేగించినంత భద్రంగా హైదరాబాద్ తీసుకెళ్లాల్సి వచ్చినా.. అప్పుడే బీకామ్.. బీఎస్సీ చదివిన సింహాచలానికి ఉద్యోగం కావాల్సి వచ్చినా.. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రులు.. నాయకులను ఇక్కడి కార్యకర్తలు కలవాలన్నా.. ఉపాధి కోసం వెళ్లాల్సిన కూలీలకు.. అందరికీ గోదావరి అంటే ఒక హృద్యమైన అనుబంధం. దానిలో ప్రయాణం ఒక ఆత్మీయ అనుభూతి. హైదరాబాద్‌లో కొత్తకాపురం పెట్టిన కూతుర్ని విశాఖ స్టేషన్లో దిగబెడుతూ కిటికీ ఇవతల నుంచి కన్నీళ్ల మాటున తల్లి జాగ్రత్తలు చెబుతూ.. కాసింత దూరాన నిలబడి తండ్రి బెంగతో చూసే చూపులు.. రెణ్ణెల్ల తరువాత ఆషాఢానికి బయల్దేరిన భార్యను హైద్రాబాదులో ఎక్కిస్తూ 'నువ్వు ఒంటరిగా పోవచ్చుగా.. నా మనసును.. ప్రాణాన్ని కూడా తీసుకుపోవాలా' అంటూ భావుకత్వంతో భర్త చెప్పే మాటలు విని లోలోన మురిసిపోయే నవయవ్వని అంతరంగం.. ఇవన్నీ గోదావరికి మాత్రమే సొంతం.. ఐడ్రాబాడ్లో చిన్న ఉద్యోగం చేస్తున్న కొడుకు సన్యాసి దగ్గరకు బయల్దేరిన నారాయణమ్మ, బంగార్రాజు దంపతులు స్టీల్ కేరేజిలో పులిహోరా.. పాత పెప్సీ బాటిల్లో నీళ్లు పట్టుకుని ఎక్కితే మళ్ళా సికింద్రాబాదు వరకూ ఏమీ కొనేది లేదు.. దడదడా చప్పుడు చేస్తూ రాజమండ్రి వంతెన రాగానే గోదారమ్మ గోదారమ్మా అంటూ పిల్లా పెద్దా గోదాట్లో కాయిన్లు వేయడం.. అదో నమ్మకం.. గోదారిలో దిగలేకపోయినా పైసలు నివేదించడం ద్వారా భక్తిని చూపడం.. అదో గొప్ప సంస్కృతి. విశాఖలో ప్యూర్ ఉత్తరాంధ్ర యాస భాషలతో బయల్దేరే గోదారి.. రెండున్నర గంటల తరువాత స్టయిల్ మార్చేస్తుంది.. యాండీ.. మీది ఆ సీటు కదండీ.. ఇక్కడ ఉన్నారేంటీ.. వెళ్లిపోండి.. ఆయ్.. అంటూ గదమాయించే ఆడపిల్ల మాట వినిపించగానే ఓహో ట్రైన్ రాజమండ్రి చేరిందని తెలిసిపోతుంది. ఆత్రేయపురం పూతరేకులూ, నేతి పూతరేకులూ అని అరుపులు వినిపిస్తే ఓ.. ఇంకా విజయవాడ చేరలేదా అని అర్థం. ఏమిరా భాయ్.. ఇంకెంతసేపు ఆపుతాడు మల్ల.. ఈ ఫుడ్ మస్తుందిరా.. మనూళ్ళో ఇలా ఉండదేందిరా అని మల్లేశం చెప్పే కామెంట్లు.. ఆయన భోనగిరిలో దిగుతాడని చెప్పేస్తాయి.. ఇలా వేర్వేరు సంస్కృతులు.. పద్ధతులు.. ఎన్నో.. ఎన్నెన్నో.. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో కనిపిస్తాయి. అదొక ఆత్మీయ బంధం.. మరువలేని అనుబంధం. -సిమ్మాదిరప్పన్న -
YSRCP: సరికొత్త సామాజిక విప్లవం..
ఏపార్టీ అయినా కానీ బాసూ.. అక్కడ మాత్రం ఆ కులానికే సీట్ ఇవ్వాలి.. ఎవరేమనుకున్నా కానీ ఈ ఎంపీ, ఎమ్మెల్యే సీట్ మాత్రం వాళ్ళకే ఇస్తారు. అయినా కోట్లు లేకుండా టిక్కట్ ఎలా దక్కుతుంది గురూ.. డబ్బుల్లేకుండా ఎలా గెలుస్తారు? ఇవీ గత కొన్నేళ్ళక్రితం వరకూ ప్రజల్లో ఉన్న అభిప్రాయం.. కానీ, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్తగా సామాజిక విప్లవానికి నాంది పలికారు. ఇన్నాళ్లూ ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు పోగా మిగిలిన జనరల్ సీట్లలో ఆ ఎంపీ సీటు ఆ కులానిది.. ఈ ఎమ్మెల్యే సీటు ఆ వర్గానిది అంటూ అనధికారిక రిజర్వేషన్లు ఉండేవి. అంటే ఆ ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు ఏ పార్టీ వాళ్ళయినా ఫలానా కులానికి ఇవ్వాలన్నది ఒక అలిఖిత నిబంధన.. కొనసాగుతూ వస్తోంది. కానీ, సీఎం జగన్ ఆ నిబంధనల సంకెళ్లు తెంచేసి.. ఎస్సీ, ఎస్టీ సీట్లు మినహా మిగతా ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు సరికొత్త ఫార్ములాను రూపొందించారు. అగ్రకులాలు అంటే రెడ్డి, కమ్మ.. కాపు.. క్షత్రియ నాయకులు ఏలిన స్థానాల్లో సైతం ఇప్పుడు బీసీ అభ్యర్థులకు స్థానం కల్పిస్తూ సరికొత్త సామజిక విప్లవానికి ముఖ్యమంత్రి జగన్ బీజం వేశారు. నెల్లూరు సిటీ స్థానాన్ని గతంలో ఎవ్వరూ ఇవ్వని విధంగా ముస్లింలకు ఇవ్వడం ద్వారా.. అక్కడ ఆ వర్గాన్ని దగ్గర చేసుకున్నారు. నర్సాపురం లోక్‌సభ నియోజకవర్గం మొదటి నుంచీ క్షత్రియులు లేదా కాపులకు రిజర్వ్ చేయబడిన సెగ్మెంట్. కృష్ణంరాజు.. చేగొండి హరిరామజోగయ్య.. భూపతిరాజు విజయకుమార్ రాజు వంటి పెద్ద నాయకులు ఎంపీగా గెలిచిన చోటు అది. దానికితోడు భారీగా ఖర్చు కూడా పెట్టగలిగే వాళ్ళు అక్కడ పోటీ చేస్తారు. ఆ ప్రాంతానికి ఉన్న పొటెన్సీ అలాంటిది. అలాంటి నర్సాపురం ఎంపీగా బీసీ శెట్టిబలిజ కులానికి చెందిన సాధారణ అడ్వకేట్ ఉమాబాలకు కేటాయించి సీఎం జగన్ ప్రత్యర్థులకు గట్టి సవాల్ విసిరారు. ఈ క్రమంలోనే ఏలూరు.. కాకినాడ.. శ్రీకాకుళం.. విజయనగరం.. నర్సరావుపేట, అనంతపురం.. హిందూపురం.. కర్నూల్.. విశాఖ వంటి ఎంపీ స్థానాలు బీసీలకు కేటాయించారు. తద్వారా ఆయా నియోజకవర్గంలో దశాబ్దాలుగా ఓటర్లుగానే ఉంటూ వస్తున్నా కులాలకు నాయకత్వాన్ని అప్పగించే సరికొత్త విధానానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు. అయితే, ఈ నిర్ణయాల పట్ల కొందరు పుల్లవిరుపు మాటలు, వ్యంగ్యపు కామెంట్లు చేస్తున్నారు. అనామకులనుకున్నవాళ్ళే అసామాన్యులయ్యారు.. వీళ్ళు ఎంపీలా?, వీళ్ళు ఎమ్మెల్యేల అంటూ అప్పట్లో చాలామంది మీద ఇలాంటి కామెంట్స్ వినిపించాయి. కానీ, ఆ ఫలితాలు చూసాక వాళ్ళే వారెవ్వా ఇదీ జగనన్న స్కెచ్ అన్నారు.. ఉదాహరణకు.. # పార్వతీపురం(ఎస్టీ) నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రిగా చేసిన వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తపల్లి గీత, గొట్టేటి మాధవి అనే సాధారణ కార్యకర్తల చేతిలో రెండు సార్లు ఓడిపోయారు # కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అనే సీనియర్ నేత అనామకుడైన సంజీవ్ కుమార్ చేతిలో ఓడిపోయారు # రాయపాటి సాంబశివరావు అనే సీనియర్ నాయకుడు.. లావు కృష్ణదేవరాయలు అనే యువకుడి చేతిలో గుంటూరులో ఓటమి చవిచూశారు # సినీ నటుడు.. డబ్బున్న నాయకుడు అయినా మురళీమోహన్ కోడలు మాగంటి రూప కాస్తా రాజమండ్రిలో కొత్తవాడైన మార్గాని భరత్ చేతిలో ఓడిపోయారు. # విజయనగరం రాజకుటుంబీకుడు పలుమార్లు రాష్ట్ర.. కేంద్ర మంత్రిగా చేసిన అశోక్ గజపతిరాజు కాస్తా కొత్తవాడైన బెల్లాన చంద్రశేఖర్ చేతిలో మట్టి కరిచారు. ఇలా చూసుకుంటూ పొతే జగనన్న వేసిన ప్లాన్ ఎంతోమంది సాధారణ కార్యకర్తలను రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులుగా మార్చింది. -సిమ్మాదిరప్పన్న -
చంద్రబాబుకు భవిష్యద్దర్శనం
చాలామందికి వృద్ధాప్యంలో తమ భవిష్యత్తు తెలిసిపోతుందట అంటే ఎప్పుడు తమ జీవితం ముగుస్తుంది.. తమ అడుగులు ఎప్పుడు తడబడతాయి.. తమ ముందు రోజులు ఎలా గడుస్తాయి ఇత్యాది అంశాలు లీలగా కళ్ళముందు కదలాడుతాయన్నమాట. అంటే భవిష్యత్ తమకు దృగ్గోచరమవుతుంది. దాదాపు నలభయ్యేళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబుకు సైతం తన భవిష్యత్ అర్థమైపోయిందా? . రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమపార్టీ ఓడిపోతే చంద్రబాబు ఇక మెల్లగా రాజకీయ చిత్రపటం నుంచి వైదొలుగుతారా? అంటే ఆయనే అవునని చెప్పేశారు. ఓ జాతీయ టెలివిజన్ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన రానున్న ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటాను అని చెప్పేశారు. మంచిదే.. ఆయన తీసుకున్న నిర్ణయం మంచిదే.. ఎందుకంటే ఇప్పటికే 74 ఏళ్ళ వయసులో ఉన్న అయన ఆ తరువాతి ఎన్నికలు అంటే 2029 నాటికి ఎనభైకి దగ్గరపడతారు. అప్పటివరకు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పార్టీని నిలబెట్టుకోవడం పదేళ్లుగా అధికారంలోకి సంపూర్ణంగా శుష్కించిపోయిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు కల్పించి మళ్ళీ 2029లో పార్టీని నడపడం అసాధ్యం అని చంద్రబాబుకే కాదు ఆయనబాబు లోకేష్ బాబుకు ఆయన బాబు దేవాన్ష్ బాబుకు కూడా తెలుసు.. ఇప్పటికే తెలుగుదేశం-జనసేనలమధ్య సీట్ల పంచాయితీ తేలడం లేదు.. ఎన్నికలు దగ్గరపడుతున్నా.. ఎవరికీ ఏ సీట్ అనేది తెలీడం లేదు.. జనసేనకు ఎక్కడ ఇస్తారో.. ఏవి ఇస్తారో ఎవరికీ క్లారిటీ లేదు.. చూస్తుంటే పవన్ కళ్యాణ్ ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తున్నాడు.. సీనియర్ సార్వాడు చంద్రబాబు రెండు సీట్లు ప్రకటించాడు కదా అని ఊరుకోకుండా పవన్ కళ్యాణ్ కూడా ఎకాఎకిన వచ్చి రాజానగరం, రాజోలు మావే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ షాక్ నుంచి టీడీపీ కోలుకోలేదు.. పొరపాటున రేపెక్కడో ఇంకోసీటు కానీ చంద్రబాబు కానీ ప్రకటిస్తే పవన్ కూడా సీట్లు ప్రకటించి అంతా గందరగోళం చేస్తాడేమో అని భయం పట్టుకుంది. మరోవైపు రెండు పార్టీలు కూర్చుని ఉమ్మడి మ్యానిఫెస్టో రూపొందిస్తారట. అదెప్పటికీ అవుతుందో తెలీదు.. ఇలా వాళ్ళంతా కలిసి ప్రయాణం మొదలెట్టేసరికి ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం ఒక విడత ప్రచారం పూర్తి చేస్తుంది.. ఇలా అన్ని విధాలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందంజలో ఉండడంతో చంద్రబాబుకు సైతం రానున్న ఎన్నికల ఫలితాలు ముందే తెలిసిపోయాయని.. అందుకే ఎన్నికల తరువాత రాజకీయ సన్యాసం తీసుకుంటాను అని తననోటితోనే చెప్పేశారని అంటున్నారు. - సిమ్మదిరప్పన్న -
జనం గుండెల్లో జగన్.. కుమారిపై ప్రతిపక్షాల టార్గెట్ అందుకేనా?
శ్రీహరి నామ శబ్దాన్నే సహించలేని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ని నానా హింసలూ పెడతాడు.. నీ శ్రీహరి ఎక్కడున్నాడు చెప్పు. అక్కడా...? ఇక్కడా ? ఎక్కడ ? అంటూ ఇబ్బంది పెడతాడు.. అప్పుడు బాలకుడు ప్రహ్లాదుడు పద్యం అందుకుంటూ ఇందు గలఁ డందు లేఁ డని సందేహము వలదు తండ్రీ.. ఎందెందు వెతికినా.. శ్రీహరి కనిపిస్తాడు అంటాడు.. అప్పుడు తండ్రి.. ధిక్కారమున్ సైతునా అంటూ ఏదీ ఈ స్తంభంలో చూపించు అని ఆ స్తంభాన్ని బద్దలుకొట్టగా అందులోంచి ప్రళయగర్జన చేస్తూ నరసింహస్వామి వస్తాడు.. అది వేరే.. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పరిస్థితి కూడా అలాగే కనిపిస్తోంది.. ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులై ఉంది... దేశంలో ఏ చిటారుకొమ్మకు ఎగిరిపోయినా ఏ రాష్ట్రానికి మరలిపోయినా జగనన్న ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు.. తమ పట్ల ఆయన తీసుకున్న బాధ్యత... శ్రద్ధాసక్తులు సైతం ఆ వలస జీవులు తమతో మోసుకెళుతున్నారు. దానికి ఉదాహరణే.. హైదరాబాద్‌లో బతకడానికి వలసవెళ్లిన గుడివాడకు చెందిన కుమారి అనే మహిళా అక్కడ ఫుట్ పాత్ మీద చిన్న భోజన హోటల్ పెట్టుకుని నడుపుతోంది. ఇక్కడ తాము ఆర్జిస్తున్న ఆదాయం తమ కుటుంబానికి సరిపోకపోవడంతో భర్త పిల్లలతో కలిసి హైదరాబాద్ వలస వెళ్లారు. అక్కడ ఆమె భర్త ఆటో నడుపుతుండగా ఆమె హోటల్ పెట్టి తక్కువ ఖర్చుతో పదిమందికీ భోజనం పెడుతోంది. ఆమె వండి వడ్డిస్తున్న తీరు.. మాటకారితనం.. అన్నీ కలిపి ఆమెను కొద్దిరోజుల్లోనే పాపులర్ చేసేశాయి.. దానికి తోడు యూట్యూబ్ చానెళ్లు ఆమెను ఇంటర్వ్యూ చేయగా తనకు ఆంధ్రాలో జగనన్న ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చిందని, ఇల్లు ఇచ్చిందని సంతోషంగా చెప్పింది.. సరిగ్గా ఈ పాయింటును పట్టుకున్న ఆంధ్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు తెలంగాణలోని తమ అనుకూల ప్రభుత్వంలోని పెద్దలను పురమాయించి రోడ్డు పక్కనున్న ఆమె హోటల్‌ను తొలగించారని వార్తలు వెల్లువెత్తాయి. కేవలం జగనన్న పేరు తల్చుకున్నంతనే ఆమె మీద టార్గెట్ చేసి హోటల్ తీయించేసారు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. జగన్ అన్న పేరు తలచుకున్నవారిని చూసి కూడా ప్రతిపక్ష నేతలు భయపడుతున్నారని కొందరు అంటున్నారు. దేశ విదేశాలకు వెళ్ళిపోయినా వారు కూడా ఏదో విధంగా జగన్ ప్రభుత్వం ద్వారా లబ్దిపొందినవారేనని ఈ ఒక్క సంఘటన వెల్లడిస్తోంది. ఏ రాష్ట్రానికి వలసపోయినా వారికి స్వగ్రామంలో ఏదోవిధంగా ప్రయోజనం జగన్ ప్రభుత్వం కల్పించిందని... అందుకే వారంతా జీవిత పర్యంతం సీఎం జగన్‌ని తలచుకుని గుండెల్లో గుడికట్టుకుంటున్నారని చెప్పడానికి కుమారి ఉదంతమే ఒక ఉదాహరణ అంటున్నారు -సిమ్మాదిరప్పన్న ఇదీ చదవండి: Pulivendula Politics : పులి ముందు ఫ్లూటా.? -
Pulivendula Politics : పులి ముందు ఫ్లూటా.?
చదివే పాఠకులకు రచయిత ముందస్తు హెచ్చరిక : సదివి నవ్వినవ్వి సచ్చిపోతే నాదేం పూచీ కాదు ‘ప్రతిపక్షాల ఊహలకు, ఆలోచనలకూ అందకుండా రాజకీయ ఎత్తులు వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈసారి పులేందుల్లోనే ఓడించేందుకు చంద్రబాబు బ్రహ్మాండమైన ఎత్తు వేశారట.. అని అన్నాడు యాదగిరి.’ ‘ఏందిరా కడప కారం దోసెలో సేనిక్కాయల సెట్నీ వేసేది అనుకుంటున్నారా.. అంది ఆది లక్ష్మి.’ ‘ఈసారి ఒక్కో మండలంలో పది సుమోలు పెడుతున్నాం మే.. అక్కడ తప్పితే ఇక్కడ.. ఇక్కడ తప్పితే అక్కడ.. ఎలాగైనా మొత్తానికి పులెందుల్లో ఈసారి జగన్‌కు కష్టమే అంటున్నాడు యాదగిరి.’ ‘నీ పల్లి చెట్నీలో నా వెల్లిపాయ, అన్నేసి సుమోలు పెట్టడానికి చంద్రబాబు, మీరంతా ట్రావెల్స్ యాపారం స్టార్ట్ చేస్తున్నరా? సరిగా చెప్పుబా అంది ఆదిలక్ష్మి.’ (యాదగిరికి చిర్రెత్తుకొచ్చింది.) ‘ఏంది మే.. నేను సీరియస్‌గా చెప్తానంటే ఎకసెక్కాలు ఆడుతుండావు అని చిరాకు పడ్డాడు యాదగిరి’ ‘లేకుంటే ఏందన్నా.. పులెందుల్లో జగనన్నను ఎదుర్కోవడం ఏందీ అన్నా? అక్కడ ప్రచారానికి వచ్చిన మీరు నీళ్లు తాగాలన్నా మా జగనన్న అభిమాని ఇవ్వాల్సిందే. మీకు వేరే ఎవరూ ఇచ్చేది లేదబ్బా అంది ఆదిలక్ష్మి.’ ‘దీంతో యాదగిరికి మరింత చికాకు లేచింది. అసలు నీకు తెలుసా.. ఇయ్యాల షర్మిల, సునీత ఇద్దరూ కలిశారు. సేనాసేపు మాట్లాడుకున్నారు తెలుసా అన్నాడు.’ ‘అబ్బో ఐతే ఇక మీ కాంగ్రెస్, తెలుగుదేశం ముఠాకు కనీసం 170 సీట్లు వస్తాయన్నట్టేనా అంది ఆదిలక్ష్మి చెరుకు ముక్క తింటూ.’ ‘ఏమమ్మా .. నేను అంత సీరియస్ గా చెప్తుంటే ఎటకారమాడతావు అన్నాడు యాదగిరి.’ ‘ఆ లేదులేన్నా ..చెప్పు.. ఇద్దరూ కలిసి ఏమేం తిన్నారటా ? ఉగ్గాని బజ్జి.. ఇంకా నెయ్యి దోశె తిని పెద్ద గాలాసు నిండా కాఫీ తాగి, ఈమధ్య వచ్చిన సినిమాల మీద రివ్యూలు మాట్లాడుకున్నారటనా అంది లక్ష్మి.’ ‘అది కాదమ్మి ఈసారి పులెందుల నుంచి సునీతక్కాను నిలబెడితే మామూలుగా ఉండదట మావాళ్లు అనుకుంటున్నారు అన్నాడు కాన్ఫిడెంట్‌గా యాదగిరి. ’ ‘మామూలుగా ఎందుకు ఉండదురా అంది అదిలక్ష్మి. ఆయమ్మికి మన పులెందుల మొత్తం ఫాలోయింగ్ ఉంది. ఆమె చిటికేస్తే .. అంటూ యాదగిరి కూడా చిటికేయబోయాడు.. కానీ సౌండ్ రాలేదు.’ ‘వెంటనే ఆదిలక్ష్మి చెరకు పిప్పిని తుపుక్కున ఊసేస్తూ.. ఆ చిటికేస్తే ఇప్పుడు నువ్వేసినట్లే తుస్సుమంటుందా.. ఆయమ్మి నాన్న వివేకం సార్ పోటీ చేస్తేనే చిత్తుగా ఓడిపోయాడు. ఇప్పుడీయమ్మి వచ్చి ఎందుకు బదనాం అవుద్దిరా అన్న అన్నది ఆదిలక్ష్మి.’ ‘ఎహె.. నీకు తెలీదులే వాళ్ళ వెనకమాల చంద్రబాబు అలియాస్ చాణక్యుడు ఉన్నాడు అన్నాడు. సర్లేన్నా సునీతతో బాటు ఇంకో పని చేయండి. అలాగైతే ఇక మీకు తిరుగుండదు అంది ఆమె. చెప్పక్కా నీ ఐడియా బాగుంటే మాత్రం నీకు నక్కిలేసు గొలుసు కొనిస్తా అన్నాడు.’ ‘ఏందిరో సీమ నుంచి ఏకంగా శ్రీకాకుళం పోయావు అంటూనే.. రాసుకోరా... బంగారంలాంటి ఐడియా మళ్ళా మళ్ళా రాదు అంది.. బల్ల మీద కూర్చుంటూ. ’ ‘సరేక్కా చెప్పు....అన్నాడు...’ ‘పులెందుల నుంచి సునీతక్క...కడపనుంచి షర్మిలక్క జమ్మలమడుగు నుంచి నర్రెడ్డి రాజశేఖర్ అన్న పొద్దుటూరు నుంచి అనీల్ అన్న దస్తగిరి కూడా మైదుకూరు ఇచ్చేయండి.. సెటిల్మెంట్స్ బాగా చేస్తాడు కాబట్టి ఓ లచ్చ ఓట్లు తేవడం పెద్ద కష్టం కాదులే.. బద్వేలులో కూడా దస్తగిరి తాలూకా వాళ్ళను పెట్టండి.. గెలుపు పక్కా’ ‘ఇక కమలాపురం.. రాజంపేట.. ఇక్కడ కూడా నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డికి అయన బామ్మర్దులకు ఇచ్చేస్తే హోల్ మొత్తం కడపంతా మీ చంకలో ఉన్నట్లుంటుంది. ఏమంటావ్ అంది ఆదిలక్ష్మి.. చెరుకు ముక్క విరుస్తూ.. యాదగిరి మొహం మాడిపోయింది.. వాడు ఏదో చెప్పబోయేలోపు.. ఒరేయ్ అన్నా కడప ఎంపీగా మాత్రం నువ్వే చేయాలి.. ఇన్నోటు తెలివితేటలున్న నువ్వుకాకుండా ఇంకెవరు చేస్తారు.. మీ తెలివి తగలెయ్య.. ఇంకో తూరి కడప, పులెందుల అంటూ ఇటు వస్తే ఊరకుక్కలతో కర్పిస్తా. ముందు మీ చాణక్యుడు కుప్పంలో ఓడిపోతాడట. నిన్ననే పెద్దిరెడ్డన్న గట్టిగా ఛాలెంజ్ చేసాడు. ముందు ఆ గోచీ ఊడిపోకుండా బాబును చూసుకోమను అంటూ వెంట తరిమింది ఆది లక్ష్మి.’ (‘దెబ్బకు యాదగిరి పరార్.. ’) -సిమ్మాదిరప్పన్న -
జనసేనాని సరికొత్త స్కిట్.. ఇప్పుడు కాసేపు కోపం తెచ్చుకుందాం?
బాలేదు.. ఇదేం బాలేదు.. మరీ నేను లొంగిపోయినట్లు ఉంటే దొరికిపోయేలా ఉన్నాను.. మా సైనికులు సైతం నా ఈక్నెస్ పోల్చేసారంటే పార్టీ సైతం ఈకైపోద్ది. అందుకే కాసేపు కోపం తెచ్చుకుందాం అని డిసైడైపోయిన పవన్ కళ్యాణ్ అద్దం ముందు ఆగ్రహాన్ని ప్రాక్టీస్ చేసి మీడియా ముందుకు వచ్చారు. కోపం ఆవాహయామి.. ఆవాహయామి.. ఆవాహయామి అని మూడుసార్లు గట్టిగా అనుకుని తెలుగుదేశం మీద లేని ఆగ్రహాన్ని చూపించారు. ఇలాగైతే కుదరదు.. నేను ఊరుకున్నంతవరకే సైలెంట్.. లేచానో మహా వైలెంట్ అంటూ గాల్లో కత్తి తిప్పారు. ఎగిరెగిరి తంతాను అన్నట్లుగా బయల్దేరి చివరాఖరుకు నాకు టీడీపీ తప్ప వేరే గతిలేదని తేల్చేశారు.. చంద్రబాబే సీఎం అంటూ మొన్న లోకేష్ సైతం తేల్చి చెప్పేసినా నేను ఏమీ అనలేదు.. నేను తలచుకుంటే ఇప్పుడే రెండు సీట్లు ప్రకటిస్తాను అంటూ తాము గతంలో గెలిచిన రాజోలు సీటుకు అభ్యర్థి పేరును ప్రకటించారు. ఇంత దీర్ఘం తీసి మనోడు ప్రకటించింది వాళ్ళ సొంత సీటే.. ఓస్ ఇదేనా అన్నట్లుగా ఉంది. అదేదో టీడీపీ బలంగా కోరుతున్న సీటును జనసేనకు ప్రకటిస్తే మనవాడు వీరత్వం తెలిసేది అని సైనికులు అంటున్నారు. ఇంకా పనిలో పనిగా మూడోవంతు సీట్లు కావాలని అన్నారు.. మంచిదే.. బలమైన డైలాగ్ వాడారు కానీ చివరివరకూ అదే పట్టుమీద ఉంటారా చివర్లో మళ్ళా జారిపోతారా? అదో సందేహం.. పద్మవిభూషణ్ ఎర.. టీడీపీ-సేన పొత్తుకు తెర..! ఇదిలా ఉండగా పవన్‌ను తెలుగుదేశం వైపు పోనివ్వకుండా తమతోనే కలిసి ఎన్నికలకు వెళ్లేలా బీజేపీ కూడా పెద్ద ఎత్తులే వేస్తున్నట్లు తెలుస్తోంది. చిరంజీవికి పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా కొణిదెల కుటుంబాన్ని ఇంకో లెవెల్‌కు తీసుకువెళ్లేందుకు బీజేపీ మార్గం వేసింది.. ఇప్పటికే పద్మ భూషణ్ అందుకున్న చిరంజీవికి ఇది మరో మెట్టు అన్నమాట. తద్వారా అయినా పవన్ బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లేలా కాషాయపార్టీ పావులు కదుపుతున్నట్లు భావిస్తున్నారు. అలా చేయడం ద్వారా పవన్ మళ్లీ టీడీపీ వైపు వెళ్లకుండా బీజేపీతోనే ఉండేలా కాషాయ పార్టీ అగ్రనాయకులు ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇన్ని చేసినా తెలుగుదేశం వేసే ఎంగిలి మెతుకులు కేతకడానికి అలవాటుపడిపోయిన పవన్ బీజేపీ పట్ల సానుకూలంగా ఉంటాడా?. మళ్లీ తోక ఊపుకుంటూ టీడీపీ వైపు వెళ్తారా? అనేది ఇప్పటికైతే తెలీడం లేదు. ఇదిలా ఉండగా పవన్‌కు తాను ఇప్పుడు ప్రకటించుకున్న రాజానగరం, రాజోలు.. ఈ రెండు సీట్లే ఇచ్చి.. నువ్వే ప్రకటించుకోవయ్యా అని చంద్రబాబు చెప్పారని.. ఆఖరుకు ఆయనకు ఆ రెండే దక్కుతాయని అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగులు మొదలయ్యాయి. - సిమ్మాదిరప్పన్న. -
అంతా అయోమయం, జగన్నాథం.. టీడీపీ జనసేన కూటమిలో కంగాళీ
అసలేం జరిగింది.. ఏం జరుగుతోంది.. ఏం జరగబోతోంది నాకు తెలియాలి.. నాకు ఇప్పుడే తెలియాలి.. ఇదీ సగటు జనసేన. టీడీపీ నాయకుల ఆందోళన కమ్ కంగారు కమ్ కన్ఫ్యూజన్ కమ్ చిరాకు కమ్ పరాకులు వినిపిస్తున్నాయి. జనసేన, టీడీపీ మధ్య పొత్తు అన్నారు. అదిప్పుడు ఏ స్థాయిలో ఉన్నదో తెలీదు. ఎవరికీ ఎక్కడ సీట్లు ఇస్తారో తెలీదు.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసేలా ఉంది.. ఇప్పటికి కూడా తమ నియోజకవర్గం అడ్రస్ తెలీకుండా ఎలా అని ఇరుపార్టీల్లో ఆందోళన నెలకొంది. కానీ ఎవరూ ఎక్కడా బయటపడడం లేదు.. అంతా గుంభనంగా ఉంటూ మేకపోతు గాంభీర్యం చూపుతున్నారు. దీనికి తోడు పొత్తు వ్యవహారంలో ఉన్న కన్ ఫ్యూజన్ కూడా ఇరుపార్టీల నాయకులను ఇంకా ఇరకాటంలోనే ఉంచుతోంది. అందుకే చంద్రబాబు ఇప్పటి వరకు తొలి జాబితా విడుదల కాలేదు. ఎవరికీ ఎక్కడ సీట్ అన్నది తేలితే తప్ప పనులు మొదలు పెట్టి ముందుగు సాగే అవకాశం లేకపోవడంతో నాయకులు అంతా అయోమయంలో ఉన్నారు. అసలు నియోజకవర్గాల్లో తిరుగుదాం. పని మొదలు పెడదాం. అందర్నీ కలుద్దాం అంటే టిక్కెట్ వస్తుందో రాదో.. అది కాస్తా జనసేనకు వెళ్ళిపోతే తన ఖర్చు.. కష్టం.. టైం అంతా వృథా అవుతుందని టీడీపీ నాయకులు డైలమాలో ఉన్నారు. ఇదిలా ఉండగా అటు కాపునేత చేగొండి హరిరామ జోగయ్య మాత్రం 51 స్థానాల్లో జనసేనకు సీట్లు ఇవ్వాల్సిందే అని చెబుతూ సొంతంగా లిస్ట్ కూడా విడుదల చేసారు. మరోవైపు చుట్టపు చూపుగా ఆంధ్రకు వచ్చే పవన్ ఇక్కడి నాయకులకు అస్సలు అందుబాటులో ఉండరు.. కాబట్టి ఆయనతో ఏమైనా మాట్లాడాలి అనుకున్న కష్టమే.. దీంతో జనసేన క్యాడర్ సైతం చికాకు, చిరాకు పడుతోంది. మరోవైపు అంగన్ వాడీలను రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం.. ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఎక్కువచేసి చూపిద్దాం అనుకున్న టీడీపీకి అక్కడా పెద్ద ఫాయిదా దక్కలేదు. వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉండడంతో అంగన్వాడీలు సమ్మె విరమించారు. దీంతో వారి తెరవెనుక ఉండి చంద్రబాబు ఆడించిన నాటకానికి తెరపడింది. వాళ్లంతా ఇప్పుడు జై జగన్ అంటున్నారు. దీంతో ఎటు చూసినా తనకు దారి క్లియర్‌గా కనిపించకపోవడంతో చంద్రబాబు సైతం ఇంకా సీట్లు సంగతి తేల్చడం లేదు. దీంతో క్యాడర్లో కంగారు మొదలైంది.. చివరి నిముషంలో టిక్కెట్ తెచ్చుకుని బలమైన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కోవడం కష్టం కదా అని వారు లోలోన ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ ఫ్రాస్ట్రేషన్నుఎవరిమీద చూపాలో తెలీక లోలోన కుమిలిపోతున్నారు. -సిమ్మాదిరప్పన్న. -
ఎవరికోసం ఈ ఆరాటం.. ఎవరితో పోరాటం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ షర్మిల వేస్తున్న అడుగులు.. తీసుకుంటున్న నిర్ణయాలు సందేహాస్పదంగా ఉంటున్నాయి. అంటే ఆమె పూర్తిగా తెలిసే ఆ మార్గంలో వెళుతున్నారా?.. తన రాజకీయ ప్రయాణపు పర్యావసనాలు తనకు అర్థం అవుతున్నాయా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయంగా షర్మిల వేస్తున్న అడుగులు.. ఆమె చేస్తున్న కామెంట్లు.. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు సగటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులను బాధిస్తున్నాయి. దీంతో పాటుగా ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వైఎస్ అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఆనాడు భూతంలా కనిపించిన కాంగ్రెస్ పార్టీ నేడు షర్మిల కంటికి దేవతలా కనిపిస్తోందా?. నాటి విషవృక్షమే నేడు కల్పవృక్షము అయ్యిందా? అంటున్నారు. తమ కుటుంబాన్ని అవమానించిన కాంగ్రెస్ ఇప్పుడు ముద్దయిందా?. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్‌షీట్‌లో పెట్టి ఆయన్ను అవినీతిపరుడిగా ముద్ర వేసేందుకు ప్రయత్నించి, తన అన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కుట్రలతో కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టిన కాంగ్రెస్ పంచన చేరడానికి షర్మిలకు ఏమీ సిగ్గు అనిపించడం లేదా?. ఇవీ ఓ సగటు వైఎస్ కుటుంబ అభిమానుల మదిలో తొలుస్తున్న ప్రశ్నలు. ఇదిలా ఉండగా ఆనాడు వైఎస్సార్ కుటుంబాన్ని సంపూర్ణంగా నాశనం చేసేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకోగా దానికి అప్పట్లో చంద్రబాబాబు సహకరించారు. అలాంటి చంద్రబాబు ఉన్న కాంగ్రెస్ గ్రూపులో చేరి పుట్టింటికి నిప్పు పెట్టే దుస్సాహసానికి షర్మిల పాల్పడడాన్ని వైఎస్సార్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా వస్తూనే జగన్ రెడ్డి అంటూ మాట్లాడటం ఆమె దురుసుతనాన్ని గుర్తు చేస్తోంది. చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు ఆడిస్తున్న రాజకీయ వైకుంఠపాళిలో షర్మిల అడుగుపెట్టారని, ఆమె అక్కడి విషసర్పాల నోటికి చిక్కి పరువుపోగొట్టుకోవడం ఖాయం అని అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు కాగా తాను.. సీఎం వైఎస్ జగన్‌ను దెబ్బకొట్టేందుకు బాణం ఎక్కుబెట్టినట్లు ఆమె మాటలు ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధిలేదని, ఉద్యోగాలు లేవని, ఎక్కడ ప్రగతి, ఉపాధిలేదని అంటున్నారు. ఆమె తెలిసి మాట్లాడుతున్నారో రెచ్చగొట్టేందుకు చేస్తున్నారో కానీ ఆమె కామెంట్లు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. అంటే అన్నను నష్టపరచడం ద్వారా ఆమె సాధించే ఫలితం ఎవరికి దక్కుతుంది?. ఒకవేళ తెలుగుదేశం గెలిస్తే తనకు ఏమైనా లాభమా? ఒకనాడు తన కన్నవారి కుటుంబాన్ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కాంగ్రెస్‌తో కలిపి కుట్రలు చేసిన తెలుగుదేశానికి ప్రయోజనం కలిగించడమే ఆమె లక్ష్యమా?. ఈ సవాలక్ష సందేహాలు.. ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందేమో.. -సిమ్మాదిరప్పన్న. -
ముందు ఉప్మా తినండి.. తర్వాతే వివరాలు చెప్పండి
‘‘సరే మద్దతు కోరి వచ్చారు.. ముందు కూర్చోండి.. ఇదీ ఉప్మా తినండి.. కాఫీలు తాగారా.. ఇప్పుడు చెప్పండి.. అసలు జనసేనకు టీడీపీకి పొత్తు ఏ ప్రాతిపదికన కుదిరింది. ఎవరికీ ఎన్ని సీట్లు ఇస్తున్నారు... ఎక్కడెక్కడ ఇస్తున్నారు.. పోనీ కూటమి అధికారంలోకి వస్తే జనసేనకు ఎన్నిమంత్రిపదవులు ఇస్తారు.. ఆదేశికారంలో జనసేనకు, టీడీపీకి ఏ నిష్పత్తిలో అధికార పంపిణీ ఉంటుంది.. పవన్ కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి గట్రా ఉందా.. దోస వేసుకోండి... ఒరేయ్ చట్నీ వెయ్యరా మనోళ్లకు అంటూనే.. ఆ ఇప్పుడు చెప్పండి.. రెండు పార్టీల మధ్య ఒప్పందం ఎలా జరిగింది.. అన్నీ చెప్పండి.. అప్పుడు నేను తప్పకుండా జనసేనలో చేరుతాను’’ అన్నారు ముద్రగడ. ఈ లోపు ఇడ్లీలు అయ్యాయి.. వేడి పూరీ వచ్చింది.. ‘‘దీన్ని కూడా వేసుకోండి’’ అని కొసరికొసరి వడ్డించిన ముద్రగడ ‘‘ఆ... ఇప్పుడు కాఫీ తాగి చెప్పండి.. గెలిస్తే మన కాపులకు ఒరిగేది ఏమిటి? మన వాళ్లకు ఎన్ని పదవులు.. ఈ లెక్కాపత్రం ఏమైనా ఉందా’’ అని వరుస ప్రశ్నలు వేయడంతో జనసేన ప్రతినిధుల గొంతులో ఉప్మా అడ్డం పడింది.. ‘‘అదేంటండి అన్ని ప్రశ్నలు ఒకేసారి వేశారు’’ అంటూ ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ కాపీ తాగి.. ‘‘టిఫిన్లు బాగున్నాయండి.. కానీ మీరు అడిగిన ప్రశ్నలకు మా దగ్గర సమాధానం లేదండి’’ అన్నారు తీరిగ్గా.. ఈసారి ముద్రగడకు మరింత చిర్రెత్తుకొచ్చింది... ‘‘సరే తిన్నారా... చేతులు కడుక్కుని మళ్ళీ కూర్చోండి’’ అని కుర్చీలు చూపించి.. ‘‘మన కాపులకు.. జనసేనకు ఎన్ని సీట్లు.. ఎక్కడెక్కడ ఇస్తారో తెలీదు... ఎవరెవరికి ఇస్తారో తెలీదు... ఎన్నికల ఖర్చులు ఎవరివో తెలీదు.. గెలిస్తే పవన్ కళ్యాణ్ కు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారో తెలీదు.. ముఖ్యమంత్రి.. ఉప ముఖ్యమంత్రి ఇలాంటివి జనసేనకు ఉన్నాయో లేదో తెలీదు.. మరి ఏమీ తెలీకుండా చంద్రబాబు కావిడి మోయడానికి మీకు సిగ్గు లేకపోతే లేదు.. నాకైనా ఆలోచన ఉండాలి కదా.. ప్రతిఫలం ఆశించకుండా.. అధికారంలో వాటా కోరకుండా బేషరతుగా తెలుగుదేశం గెలుపుకోసం ఎందుకు పని చేయాలి.. ఇలా ఎవరైనా చేస్తారా ? మీరు రాజకీయ నాయకులా.. కూలీలా... కనీసం బుద్ధీ బుర్రా ఉండక్కర్లా’’ అన్నట్లుగా ఎదురు ప్రశ్నలు ఫటా ఫట్ సంధించడంతో జనసేన ప్రతినిధుల మొహాల్లో వరుసగా క్వశ్చన్ మార్కులు పడ్డాయి. ‘‘ముందు మనకు చంద్రబాబు ఏమి ఇస్తాడో చెప్పండి.. అప్పుడే నేను జనసేనలో చేరతాను.. పార్టీ కోసం పని చేస్తాను.. ఏమీ తెలీకుండా గుడ్డిగా చేరలేను.. చంద్రబాబుకు సేవ చేయలేను.. నా ఆత్మగౌరవం చంపుకోలేను’’ అంటూ.. నేను మీలాంటోడిని కాదని క్లారిటీ ఇచ్చారు.. దీంతో అయన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేని జనసేన ప్రతినిధులు మొహాలు దిగాలుగా పెట్టుకుని వెనక్కు వచ్చారు. దీంతో ప్రస్తుతం ముద్రగడ జనసేనలో చేరిక ప్రశ్నార్ధకమైంది. -సిమ్మాదిరప్పన్న -
సెంట్రల్లో వంగవీటి రాధకు దెబ్బేస్తారా ?
రాజకీయ దురదృష్టవంతుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి రాధాకృష్ణ మాత్రమే.. అయన ఎప్పుడూ అవకాశానికి ఆమడ దూరంలో.. దురదృష్టానికి అంగుళం దగ్గరలో ఉంటూ వస్తున్నారు. అప్పుడెప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా కృష్ణ మళ్ళీ ఈ ఇరవయ్యేళ్లలో ఎన్నడూ గెలుపు ముఖం చూడలేదు. 2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో అయన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తరువాత గెలుపు అనేది ఆయనకు దూరమైంది. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు. అప్పట్లో వైఎస్ జగన్ ఎంపీ స్థానం ఆఫర్ చేస్తే కాదని.. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు రాధా వైఎస్సార్సీపీని కాదని టీడీపీలో చేరారు. అక్కడ చేరేవరకూ అబ్బో.. బ్రహ్మాండం.. వీరుడు.. సూరుడు అంటూ బాజాలు మోగించిన తెలుగుదేశం నాయకులూ.. క్యాడర్ .. ఆఖరుకు టీడీపీకి వత్తాసు పలికే మీడియా సైతం ఆయన చివరకు టీడీపీలో చేరాక ప్లేటు ఫిరాయించారు. అయన గెలవలేదని, క్యాడర్ లేదని.. సమర్థత.. సత్తా సరిపోదని చెప్పి టికెట్ ఇవ్వకుండా తప్పించుకున్నారు. చేరేవరకు ఓడ మల్లయ్య అని పిలిచి గట్టు ఎక్కాక బోడి మల్లయ్య అనడం టీడీపీకి, చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమాకు టిక్కెట్ ఇచ్చారు.. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు గెలవడంతో ..ఇక రాధా కూడా చేసేదేం లేక ఊరుకున్నారు. చదవండి: అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోంది! అప్పట్నుంచీ అసంతృప్తితో టీడీపీలో సైలెంట్‌గా ఉన్నా ఉన్నా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాధా మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. తన పాత కాంటాక్ట్స్, క్యాడర్ ను సమీకరించి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతోబాటు ఆయనకు సెంట్రల్ టికెట్ కూడా ఇస్తామని చంద్రబాబు, లోకేష్ సైతం హామీ ఇచ్చినట్లు రాధా అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయనకు టిక్కెటి వస్తుందన్న భయంతో బోండా ఉమా చేస్తున్నారో.. లేక లోకేష్.. చంద్రబాబు సహకారంతో టీడీపీ క్యాడర్ చేస్తున్నారో ఏమో కానీ రాధకు స్థిరం లేదని. పార్టీలు మారుతుంటారని.. ఇలా అయన వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దెబ్బ తీస్తూ టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. రాధకు రాజకీయ స్థిరత్వం లేదని, అయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదని, ఇంకా అయనకు సొంత క్యాడర్ లేదని, అంతా డైల్యూట్ అయిపోయిందని, ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం అని.. అందుకే టీడీపీ వేరే అభ్యర్థిని ఆంటే అంతిమంగా బోండా ఉమకు టిక్కెట్ ఇవ్వాలన్నట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదంతా కేవలం బోండా చేస్తున్నదే అని వంగవీటి రాధా అనుచరులు గుర్రుమంటున్నారు. లేదని .. చంద్రబాబు మద్దతుతోనే బోండా ఇలా రెచ్చిపోతున్నాడని కొందరు అంటున్నారు. కొంగ నక్క ఒకరినిఒకరు మోసం చేసుకున్న రీతిన చంద్రబాబు ఇలా రాధాలో అసలు కల్పించి చివరకు వట్టి చెయ్యి చూపడం అలవాటేనని రాధా అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - సిమ్మాదిరప్పన్న -
Janasena: అల్టిమేటంపై పవన్ రియాక్షన్ ఏంటో?
ఆలు లేదు చూలు లేదు కానీ కొడుకుపేరు మాత్రం పవన్ కళ్యాణ్ అన్నట్లుగా ఉంది జనసేన తీరు. అసలు జనసేనలో టీడీపీ పొత్తు ఏ స్థాయిలో ఉంటుందో.. ఎన్ని సీట్లు ఇస్తారో.. తమను గౌరవప్రదంగా చూసుకోవాలి అని ఇప్పటికి పవన్ కల్యాణ్ ఎన్నోమార్లు చెప్పినా ఆయన మాటలను టీడీపీ ఎప్పటికప్పుడు కట్ చేస్తూ వస్తోంది. ఎన్ని సీట్లు ఇస్తే గౌరవం కాపాడినట్లు అన్నదానికి ఒక ప్రామాణికం.. లెక్కా పత్రం లేకపోయినా ఇటు కాపు ఉద్యమనేత చేగొండి హరిరామ జోగయ్య మాత్రం పవన్ కళ్యాణ్ చెవిలో జోరీగ మాదిరి మారి పోరుతూనే ఉన్నారు. మనం ఎక్కడా తగ్గొద్దు .. మన గౌరవం మనం కాపాడుకోవాలి అంటూ నిత్యం పవన్‌ను రెచ్చగొడుతూ కాపుల్లో ఐక్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కోసం మనం ఎందుకు పని చేయాలి అంటూ జోగయ్య బహిరంగ లేఖల్లో పవన్‌ను ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇన్నాళ్లూ ఒక లెక్క.. నేడు జోగయ్య ఏకంగా యాభై మంది అభ్యర్థులతో ఒక లిస్ట్ కూడా విడుదల చేసేసారు. ఇదిగో ఈ యాభై స్థానాల్లో మన జనసేన అభ్యర్థులు పోటీ చేయాల్సిందే అని అయన అల్టిమేటం ఇచ్చారు. అందులో టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు సొంత నియోజకవర్గం అయిన విజయనగరం కూడా ఉంది. ఆ స్థానాన్ని సైతం జనసేనకు కేటాయించాలని జోగయ్య డిమాండ్ చేసారు. విజయనగరం సీటును ఘరాన అయ్యలు అనే కాపు నేతకు ఇవ్వాలని జోగయ్య డిమాండ్ చేస్తున్నారు. ఇంకా తెనాలిలో నాదెండ్ల మనోహర్ కు టిక్కెట్ ఇవ్వాలని, అక్కడ ఆయనే పోటీ చేయాలనీ ఆ జాబితాలో చేర్చారు. ఇప్పటికే తెనాలిలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ అలకబూని ఉన్నారు. తానూ ఐదు సార్లు గెలిచిన తెనాలి సీటును జనసేనకు ఎలా ఇస్తారన్నది ఆలపాటి రాజా ప్రశ్న.. ఇప్పటికే అయన క్యాడర్ తో సమావేశమై రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తాను అని హెచ్చరించారు. ఈ సందర్భంగా జోగయ్య తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు కోరుతున్నారు. ఈ జాబితాను టీడీపీ గౌరవించాలని లేదు కానీ జోగయ్య దృష్టిలో నాయకుడిగా గుర్తింపు పొందిన వాళ్లకు టిక్కెట్స్ రాకపోతే ఇప్పుడు వాళ్ళు అలకబూని పార్టీకి దూరం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు జనసేనను దాదాపు ఇరవైసీట్లకు పరిమితం చేసేందుకు టీడీపీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తే తమకు అంత నష్టం అని చంద్రబాబు భవిస్తూ సేనానిని సాధ్యమైనన్ని తక్కువసీట్లకు ఒప్పించాలని చూస్తున్నారు. దీంతోబాటు కూటమి సీఎంగా చంద్రబాబే ఉంటారని మొన్నామధ్యన లోకేష్ చేసిన ప్రకటన సైతం జనసేన గ్రాఫ్ ను పవన్ రాజకీయ పటిమను తగ్గించిందని అంటున్నారు. చంద్రబాబు ఐదేళ్లు సీఎంగా ఉండేదానికి మేమెందుకు చాకిరీ చేయాలన్నది జనసైనికులు, కాపుల అభిప్రాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే హరిరామ జోగయ్య ఇలా లిస్ట్ విడుదల చేసి కాపు నాయకులను సంఘటితం చేయాలనీ భావిస్తున్నట్లు చెబుతున్నారు. మరి పవన్ దీనిమీద ఎలా స్పందిస్తారో చూడాలి. ✍️సిమ్మాదిరప్పన్న -
Kesineni Nani: ఉంటే ఉండండి.. పొతే పోండి..
రెండేళ్లుగా తనను పార్టీలో కుదురుగా ఉండనివ్వకుండా ఇబ్బందులు పెడుతూ వస్తున్న తెలుగుదేశాన్ని వీడిన కేశినేని నాని ఇప్పుడు తన వ్యూహాలకు పదునుపెడుతున్నారు. తనను కాదని తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని)కి తెలుగుదేశం ఎంపీ టికెట్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు కేశినేని నానిని ఇప్పటికే వైఎస్సార్సీపీ పార్టీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమించగా ఇప్పటికే ఆయన తన పనులు మొదలు పెట్టారు. కేడర్‌తో సమావేశం కావడం, వారిని తనవెంట నడిపించేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. మరోవైపు ఆయన తన పరిధిలోని విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలతోబాటు తిరువూరు, మైలవరం.. నందిగామ.. జగ్గయ్యపేటల్లోని తన కేడర్‌తో కూడా భేటీలు నిర్వహిస్తూ ఎప్పటిలా తనకు మద్దతుఇవ్వాల్సిందిగా కోరుతూ ముందుకుసాగుతున్నారు. ఇదిలా ఉండగా ఆయనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నది. కేశినేని నాని తన ప్రధాన అనుచరులు.. నాయకులతో కూడిన వాట్సాప్ గ్రూపులో మొన్న ఆయన తరఫున ఒక మెసేజ్ పోస్ట్ చేసారు. కేశినేని నాని ఇకపై వైఎస్సార్సీపీతో కలిసి ప్రయాణించాలని నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలో ఆయన ఆలోచలను.. నిర్ణయాలు.. అడుగుల గమనాన్ని అంగీకరించి, ఆమోదించేవాళ్ళు మాత్రమే ఆ వాట్సాప్ గ్రూపులో ఉండాలని, ఆయన ఆలోచనలు, నిర్ణయాలను వ్యతిరేకించేవాళ్ళు సదరు గ్రూపు నుంచి వెళ్లిపోవచ్చని అందులో ప్రత్యేకంగా పేర్కొన్నారు. అంటే నాని అలా టీడీపీని వీడి వైఎస్సార్సీపీ వెంట నడవడాన్ని అంగీకరించాలని వాళ్లు గ్రూపు నుంచి వెళ్లిపోవాలని అందులో తేల్చి చెప్పేశారు. అయితే, అలా చెప్పినప్పటికీ ఒక్కరు కూడా గ్రూపు నుంచి వెళ్లలేదని తెలుస్తోంది. అంటే వారంతా నాని నిర్ణయాన్ని ఆమోదిస్తున్నట్లే అని తెలుస్తోంది. ఇది కాకుండా ఇంకా ఆ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గ్రామ మండల స్థాయి నాయకులు పెద్ద ఎత్తున కేశినేని నాని వెంట వైఎస్సార్సీపీ వెంట నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. ఆయన సైతం తన బలాన్ని.. బలగాన్ని నిరూపించుకుని ఎన్నికల్లో తన పట్టును రుజువు చేసుకునేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. వాస్తవానికి కేశినేని నాని వెంట తిరువూరు మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు కూడా వైఎస్సార్సీపీలో చేరారు. ఆయనకు టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతోబాటు ఇంకా పెద్ద సంఖ్యలో గ్రామ, మండల స్థాయి నాయకులూ వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. తామంతా ఈసారి ఐక్యంగా కదులుతామని, నాని మొన్న చెప్పినట్లు జిల్లాలో 60 శాతం వరకూ టీడీపీ కేడర్‌ను తమ వెంట తీసుకుపోతామని వారు అంటున్నారు. రెండుసార్లు గెలిచిన నాని ఇప్పుడు వైఎస్సార్సీపీలో చేరడంతో ఆ సామాజికవర్గంలో కూడా ఆలోచన మొదలైంది. మళ్ళీ వచ్చేది జగన్.. గెలిచేది జగన్ అని వారు భావిస్తున్నారు. దీంతో ఎన్టీయార్ జిల్లాలో ఈసారి తెలుగుదేశానికి గట్టి దెబ్బ తప్పదు అని తెలుస్తోంది. - సిమ్మాదిరప్పన్న -
AP: ఆ నలుగురు మోసపోయినట్లే!
బంగారు కడియం ఆశ చూపించి బాటసారులను బురదలోకి దించి వాళ్ళు అందులో చిక్కుకోగానే తన అసలు రూపం చూపించి గుటుక్కున మింగేసే కథను ఎన్నిసార్లు వింటున్నా ఇంకా బాటసారులు అలాంటి పులినోటికి చిక్కుతూనే ఉన్నారు. కాకుంటే వాళ్లంతా నిజమైన పెద్ద పులి నోటికి చిక్కితే ఇప్పుడు కొంతమంది రాజకీయ బాటసారులు ఇలాగే రాజకీయ పులి నోటికి చిక్కుతున్నారు. ఇక్కడ ఆ రాజకీయ పులిగా చంద్రబాబు తనను తాను అనుకోగా.. ఆ బాటసారులు ఉండవల్లి శ్రీదేవి.. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. ఆనం రామనారాయణ రెడ్డి.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఇంకా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. వీళ్లంతా అలా చంద్రబాబు నోటికి చిక్కారు. మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నట్లు.. ఎండుచేప ముక్కకు ఆశపడి బోనులో ఎలుకలు చిక్కుకున్నట్టు ఆ నాయకులంతా చంద్రబాబు ట్రాపులో పడిపోయారు. ఇప్పుడు బోనులోనుంచి బయటకు రాలేరు.. అందులో ఉంటే బతుకు లేదు. వాస్తవానికి ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు ఏడాది క్రితమే కసరత్తు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నియోజకవర్గాల నుంచి నివేదికలు రప్పిస్తూ వారి పనితీరును మదింపు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న అనం రామనారాయణ రెడ్డి ( వెంకటగిరి), మేకపాటి చంద్రశేఖర రెడ్డి( ఉదయగిరి), కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి( నెల్లూరు రూరల్) ఉండవల్లి శ్రీదేవి( తాడికొండ)లకు టిక్కెట్స్ ఇవ్వలేమని అప్పుడే సూచనప్రాయంగా చెప్పారు. సరిగ్గా ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడే 2023 మార్చిలో శాసన సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగగా ఈ నలుగురిలో ఉన్న అసంతృప్తిని గుర్తించిన చంద్రబాబు.. వారిని డబ్బు.. రానున్న ఎన్నికల్లో టికెట్స్ ఇస్తామని నమ్మబలికి తమ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు అనుకూలంగా ఓటు వేయించుకుని ఆమెను గెలిపించుకున్నారు. దీంతో సీఎం జగన్ ఈ నలుగురూ పార్టీ నియమావళి ధిక్కరించారు అని గుర్తించి తమ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇక వారు వేరే గత్యంతరం లేక టీడీపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా రానున్న ఎన్నికల్లో ఈ నలుగురికి టిక్కెట్లు ఇస్తామని అప్పట్లో నమ్మబలికిన చంద్రబాబు ఇప్పుడు వీళ్లకు టిక్కెట్లు లేవని చెబుతున్నారని అంటున్నారు. నెల్లూరు రూరల్ - శ్రీధర్ కి బదులు గిరిధర్ రెడ్డికి.. ఉదయగిరి - మేకపాటికి బదులు రామారావుకి.. వెంకటగిరి - ఆనం ను కాదని రామకృష్ణ కు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. తాడికొండ శ్రీదేవికి సైతం టిక్కెట్ లేదని.. ఇంకోసారి చూద్దాం అని చెప్పినట్లు తెలిసింది. ఏరు దాటే వరకు ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడి మల్లయ్య అన్నట్లుగా వాడకం ముగిశాక వీరిని ఎంగిలాకును విసిరేసిన తీరున చంద్రబాబు పక్కన పడేస్తున్నారు. అప్పట్లో సందర్భానుసారం వాడుకున్నాము తప్ప టిక్కెట్లు ఎలా ఇస్తాం అని ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీంతో మబ్బుల్లో నీళ్ళు చూసి ముంత ఒలకబోసుకున్నం దేవుడా అని కొందరు వాపోతుండగా మిగతావాళ్ళు పోయాం మోసం.. పోయాం మోసం అని నిర్వేదంగా విషాద గీతాలు ఆలపిస్తూ ఉన్నారు. ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వీళ్లకు టిక్కెట్లు ఇస్తే ఎన్నాల్లనుంచో పార్టీని కాపాడుతూ వస్తున్న మేమేం కావాలి.. ఎంత ఖర్చు పెట్టాం.. మాకు ఏదీ భరోసా అని టీడీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. దీంతో ఈ కొత్త చుట్టాలకు నేల మీద చాపలు వేసి.. ఆల్రెడీ అక్కడున్న తమ పార్టీ సీనియర్లకు పట్టె మంచాలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఆయనకు టిక్కెట్ ఇస్తే మేం పోటీ చేయం.. మరోవైపు రఘురామ కృష్ణంరాజు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలిచి టీడీపీ వైపు చూస్తూ ఇప్పుడు మళ్లీ తిడుతున్నారు. ఇదంతా టీడీపీ, దాని అనుబంధ మీడియాలో కవరేజీ వరకు బాగానే ఉన్నా ఆయనకూ నరసాపురం టికెట్ దక్కేలా లేదు. ఆయనకు టిక్కెట్ ఇస్తే ఆ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లు గోవిందా అయిపోతాయి అని భయపడిన టీడీపీ నేతలు రఘురామకు టిక్కెట్ ఇస్తే మేము పోటీ చేయం అని తేల్చి చెప్పేశారు. దీంతో రఘురామకు సైతం టీడీపీ టిక్కెట్ రావడం లేదని స్పష్టమైంది. దీంతో ఇప్పుడు వీళ్లంతా ఎక్కినకొమ్మను నరుక్కుని.. తింటున్న అన్నంలో అగ్గిపోసుకున్నట్లుగా మారిందని అంటున్నారు. ✍️సిమ్మాదిరప్పన్న -
పుట్టింటోళ్ళు తరిమేశారు.. కట్టుకున్నోడు వదిలేశాడు!
మూడిళ్ళ చుట్టం మూతి ఎండి చచ్చినట్లు అయిందట. మాఇంటికి రాలేదు కదా... వాళ్ళింటికి కదా వచ్చారు.. అక్కడే తింటారులే అని ఈ ఇంటివాళ్ళు... అదేం లేదులే.. అక్కడికి వెళ్ళాడు కదా... తినేసి వస్తాడేమో అని ఆ ఇంటివాళ్ళు మొత్తానికి ఆ చూట్టానికి చుక్కలు చూపించి చివరకు పస్తులు పెట్టారట.. అలా అయ్యేలా ఉంది రఘురామకృష్ణం రాజు పరిస్థితి. బిజెపి... టిడిపి.. ఇలా అన్ని పార్టీల్లో తిరిగేసి. ఎక్కడ నిలువనీడ లేకుండా ఉండిపోయే పరిస్థితుల్లో అయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచారు. 2019లో వైఎస్సార్సీపీలో చేరి ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత ముసుగు తీసి చంద్రబాబు ఏజెంట్ గా మారిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో బాటు ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించడం మొదలెట్టారు. ఇదంతా సహజంగా అటు తెలుగుదేశానికి, దాని మద్దతుదారులయిన మీడియా సంస్థలకు అయన ఒక సోర్స్ గా మారిపోయారు. అయన రోజూ జగన్ మోహన్ రెడ్డిని. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ టీవీల్లో మాట్లాడడం.. దాని ఆయా సంస్థలు ఘనంగా ప్రచురించడం జరుగుతూ వస్తోంది. మొదట్లో అయన వ్యాఖ్యలు.. కామెంట్లకు మంచి రేటింగ్స్... వ్యూవర్ షిప్ ఉండేది కానీ నిత్యం జగన్‌ను తిట్టడమేపనిగా పెట్టుకున్న ఆయన్ను ఇక ప్రజలు చూడడం మానేశారు. అయినా సరే ఆయనకు వేరే గత్యంతరం లేక ఆయా మీడియా సంస్థలను అనధికార రెగ్యులర్ యాంకర్ కమ్. మోడరేటర్ కమ్ సలహాదారు... విశ్లేషకుడుగా మారిపోయారు. ఈ ఎపిసోడ్లన్నీ ముగిసి ఇప్పుడు ఆయా పార్టీలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నాయి. జనసేన... తెలుగుదేశం.. వైయస్సార్ కాంగ్రెస్.. ... చివరకు ఒక్కసీటు కూడా గెలవని బిజెపి సైతం తమ అభ్యర్థులను సిద్ధం చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ రఘురామకృష్ణం రాజుకు ఎవరు టికెట్ ఇస్తారన్నది అర్థం కావడం లేదు. ఆయన్ను ఎవరూ భరించలేరు.. పైగా ఆయనకు సొంత క్యాడర్ లేదు.. ప్రజల్లోనూ ఆదరణ లేదు.. అలాంటపుడు ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తే అయన దెబ్బకు ఆ ఎంపీ పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు సైతం ఓడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆయన్ను అందరూ ఒక ఐటం క్యారెక్టర్ మాదిరి వాడుకుని పక్కనపడేస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. కుక్కను శత్రువుమీద మొరగడానికి పెంచుకుంటాం... మనమీద మొరుగుతుంది అనుకుంటే చెప్పుతో కొడతాం అనే సినిమా డైలాగ్ మాదిరి... ఆయన్ను టీడీపీ... దాని అనుబంధ మీడియా కేవలం ప్రభుత్వాన్ని విమర్శించినంతవరకే మీడియాలో కవరేజి ఇచ్చి ఊరుకుంటారు తప్ప ఆయనకు ఎక్కడా టిక్కెట్ మాత్రం ఇవ్వరు అంటున్నారు. ఆయనకు నర్సాపురం... లేదా ఇంకోచోట టికెట్ ఇస్తే అయన అసమర్థత.. అహంకారం .. ఇవన్నీ కలగలిసి మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు ఓడిపోతారన్న ఆందోళన ఆయనపార్టీల్లో కనిపిస్తోంది. అందుకే కేవలం ఆయన్ను తమ ఛానెళ్లలో చూపడానికి మాత్రమే వాడుకుని ఎన్నికలు.. టిక్కెట్స్ ఇచ్చేవేళ పక్కన పెట్టేస్తారు అని అంటున్నారు. ఆయన్ను ఎంపీ అభ్యర్థిగా టీడీపీ.. జనసేన కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఎంపీగా గెలిచిన నాలుగేళ్ళ తరువాత అయన భోగినాడు సొంత నియోజకవర్గం నర్సాపురం వచ్చారు. ఆయనకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో భారీగా భౌన్సర్లను ఆయనే ఏర్పాటు చేసుకుని ఊళ్లోకి వచ్చారు తప్ప ఆయనకోసం ఎక్కడా అభిమానులు. క్యాడర్ ఎదురు చూడలేదు. దీంతో రాజకీయంగా అయన పాత్ర ముగిసినట్లేనని, కేవలం టీడీపీ అనుకూల మీడియాలో వ్యాఖ్యానాలు చేసుకోవడానికి మాత్రమే పనికొస్తారు తప్ప కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆయనకు దక్కదని నరసాపురం ప్రజలు అంటున్నారు. ✍️ సిమ్మాదిరప్పన్న -
చింతమనేని సీట్ సిరిగిపోయిందా ?
రౌడీ ఎమ్మెల్యే అనే ట్యాగ్ లైను వేసుకోవడానికి తెగ ఇష్టపడే దెందులూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు గడ్డు కాలం వచ్చింది.. 'ఆయనొద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ తెలుగు తమ్ముళ్లు అక్కడక్కడా ఫ్లెక్సీలు కట్టడం తెలుగుదేశాన్ని.. చంద్రబాబును కలవరపరుస్తోంది. నోటి దురుసుకు చేయి జోరుకు మారు పేరుగా నిలిచిన చింతమనేని గతంలో టీడీపీ హయాంలో ఉన్నపుడు మహా ఉజ్వలంగా వెలిగిపోయారు. తన దెందులూరు నియోజకవర్గానికి ఆయనే ముఖ్యమంత్రి, రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్, గనులు.. ఇలా అన్ని శాఖలకూ ఆయనే అధిపతి. అడ్డొస్తే అడ్డంగా నరికేసినంత పని చేసేవారు. ఆ దూకుడులో భాగంగానే ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకున్న ఎమ్మార్వో వనజాక్షిని ఈడ్చి కొట్టి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తరువాత అనుమతులు లేకుండా అడవీ భూముల్లో రోడ్లు వేస్తుండగా అడ్డుకున్న ఫారెస్ట్ సిబ్బందిని కొట్టారు.. అంతేకాకుండా అధికారంలో ఉన్నపుడు నోటి దురుసును అడ్డూ అదుపూ లేకుండా పోయేది. 'ఏంటీ పవన్ కళ్యాణ్ మద్దతుతో కదా మీరు గెలిచారు' అని అడిగితే.. 'హహ.. పవన్.. ఒక సన్నాసి.. సొంత అన్నను పాలకొల్లులో గెలిపించలేనివాడు మా చంద్రబాబును గెలిపిస్తాడా..? ఊరుకోండయ్యా..' అని సెటైర్లు వేశారు. 'ఒరేయ్ మీరు ఎస్సీలు..! మీకెందుకురా రాజకీయాలు..? మేము రాజకీయాలు చేస్తాం' అని ఓపెన్ సభలో చెప్పడం కూడా ఆయనకే చెల్లింది. ఆ తరువాత ప్రభుత్వంతో పాటు అతనూ ఓడిపోయినా కూడా.. అయన జోరు తగ్గకపోయేసరికి పోలీస్ కేసుల్లో పడ్డారు. మళ్ళీ బయటకు వచ్చాక అదే దూకుడు చూపడం మొదలైంది. మొన్నటికి మొన్న తన వ్యవసాయ భూముల్లో మేకలు మేస్తున్నాయని కొందరు మేకలకాపరులమీద దాడి చేయడమే కాకుండా రెండు మేకలు సైతం తన కార్లో ఎత్తుకెళ్ళి తనకు ఎదురే లేదని మరోమారు చాటిచెప్పారు. అది కాస్తా వివాదంగా.. యాదవులు సంఘటితమై గళం ఎత్తేసరికి ఆయన కాస్త వెనక్కితగ్గారు. ఇదిలా ఉండగా ఆయనకు మళ్ళీ దెందులూరు టికెట్ ఇస్తారని వార్తలు వస్తున్నా నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు, ఫ్లెక్సీలు మొదలయ్యాయి. 'ప్రజా వ్యతిరేకి.. రౌడీ అయిన చింతమనేని మాత్రం వద్దు.. ఇంకెవరైనా ఫర్లేదు' అంటూ అయన వ్యతిరేకులు, కొందరు టీడీపీ నాయకులూ ఫ్లెక్సీలు పెట్టారు. ఇది కాస్తా చింతమనేని ప్రభాకర్‌కు ఇబ్బందికరంగా మారింది. తనను ఓడించిన వైఎస్సార్సీపీ నాయకుడు అబ్బయ్య చౌదరి మీద ప్రతీకారం తీర్చుకుంటానని భావించి.. ఎన్నికలకోసం వెయిట్ చేస్తున్న చింతమనేని ప్రభాకర్‌కు ఇప్పుడు ఇలా వ్యతిరేకపవనాలు వీయడం ఇబ్బందికరంగా మారింది. మరి చంద్రబాబు ఆయనను మారుస్తారో.. కొత్తవాళ్లను తీసుకొస్తారో.. లేదా 'రౌడీలకు టిక్కెట్లు ఇవ్వకపోతే ఎలా ? వాళ్ళే కదా అసలైన నాయకులూ' అని భావించి మళ్ళీ ఆయనకే టికెట్ ఇస్తారో చూడాలి. -- సిమ్మాదిరప్పన్న ఇవి చదవండి: చంద్రబాబు.. లోకేశ్‌కు మేము పేరు పెట్టలేమా?: మంత్రి బుగ్గన ఫైర్ -
అన్నగారి పదవీ స్వీకారానికి నలభైయేళ్ళు.. మరి వెన్నుపోటుకు, అవమానాలకు ఎన్నేళ్లు?
దివంగత నందమూరి తారకరామారావు మొదటి సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ సరిగ్గా 41 ఏళ్ళు అయ్యాయి. అయన 1983 జనవరి 9న మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడి తొలిసారిగా ఓ ప్రాంతీయపార్టీ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పాలన మొదలైంది. అంతకుముందు తొమ్మిది నెలలపాటు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించిన ఎన్టీఆర్ ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సమస్యలు, ప్రజల ఆవేదన, కష్టాలను తెలుసుకున్నారు. తర్వాత తన పాలనతో రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలతో ప్రజల మనస్సుల్లో నిలిచిపోయారు. ప్రజారంజక పాలనలో గొప్ప పేరు తెచ్చుకున్నారు. అయితే నాదెండ్ల భాస్కర రావు వంటివారి కారణంగా కాస్త ఇబ్బంది పడినా సరే మొత్తానికి మళ్ళీ ప్రజామోదం పొంది 1994లో ఘన విజయం సాధించారు. మొత్తం 294 స్థానాలకు గాను 216 సీట్లు తెలుగుదేశం ఖాతాలోకి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం 26 స్థానాల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక అప్పుడు ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇన్నాళ్లుగా ఎన్టీఆర్ వెన్నంటి ఉంటూ వచ్చిన అయన చిన్నల్లుడు చంద్రబాబు చక్రం తిప్పడం మొదలుపెట్టారు. మెల్లగా తన తెలివితేటలు బయటకు తీయడం ప్రారంభించారు. తనకున్న పైరవీ స్కిల్స్, లోపాయికారీ, బ్లాక్మెయిల్ వంటి విద్యలన్నీ బయటకు తీసి ఎన్టీఆర్‌ను విలన్ మాదిరి చిత్రీకరించడం మొదలు పెట్టారు. అయన సతీమణి లక్ష్మీపార్వతిని ఒక భూతం మాదిరి చూపెడుతూ ఎన్టీఆర్‌ను విలువలు లేని అసమర్ధుడు అంటూ చిన్నగా ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి ప్రాపకం పొంది.. ఎన్టీఆర్‌కు దగ్గరైన నాయకులు సైతం చంద్రబాబు ఉచ్చులో పడిపోయారు. లక్ష్మీపార్వతి ప్రమేయం ప్రభుత్వంలో పెరుగుతోందని.. ఎన్టీఆర్‌కు ప్రజలకు మధ్య గ్యాప్ ఉందని.. తన అనుయాయి మీడియాలో ప్రచారం మొదలు పెట్టిన చంద్రబాబు ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్లో రహస్యంగా దాచారు. పదిమంది తన క్యాంపులో ఉంటే వంద మంది ఉన్నట్లుగా పత్రికల్లో వార్తలు రాయించి మిగతావారిని సైతం తమవైపు తిప్పుకున్నారు. ఇదంతా చూసి ఎన్టీఆర్ మనసు చలించిపోయింది. చదవండి: flash back: పిల్లి లేవని పొయ్యిపై చంద్రబాబు ఎసరు ! తాను పెట్టిన పార్టీ నుంచి తనను బయటకు పంపే కుట్రలను భరించలేక అయన తన భార్య లక్ష్మీపార్వతితోపాటు వైస్రాయ్ హోటల్ వద్దకు వచ్చి ధర్నా చేయగా ఆయన మీద చంద్రబాబు అనుచరులు చెప్పులతో దాడి చేశారు. ఇది మరింత అవమానకరంగా మారినా ఎన్టీఆర్ ఏం చేయలేని పరిస్థితి. మొత్తానికి చంద్రబాబు తన జిత్తులతో ఎన్టీ రామారావు నుంచి అధికారాన్ని లాక్కొని, పార్టీని.. పార్టీ నిధులను.. చివరకు సైకిల్ గుర్తును సైతం లాక్కుని 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. దాన్ని తెలుగుదేశం పార్టీతోపాటు రాజకీయ పరిశీలకులు ఆగస్టు సంక్షోభం అని అంటుంటారు. ఈ అవమానాన్ని భరించలేక ఎన్టీఆర్ 1996 జనవరి 18న కన్ను మూశారు. అంతవరకూ రామారావును అసమర్ధుడు.. చేతకానివాడు అంటూ చెబుతూ వచ్చిన చంద్రబాబు.. అయన భజన మీడియా.. ఎన్టీఆర్ మరణం తరువాత ఆయనకు మళ్ళీ దండలు వేసి దండాలు పెట్టడం మొదలు పెట్టారు. ఏటా అయన జయంతిని.. వర్థంతిని తూతూమంత్రంగా నిర్వహించి ఆయనకు భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం తెలుగుదేశం కార్యకర్తలకు ఒక రివాజుగా మారింది. ఎన్టీఆర్ అసమర్ధుడు అంటూ ఆయన్ను అవమానించి పార్టీ నుంచి తరిమేసి మళ్లీ ఇప్పుడు అవి స్వర్ణయుగపు రోజులు అని చెబుతూ చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పిస్తూ కాసేపు నటిస్తుంటారు. - సిమ్మాదిరప్పన్న -
ప్రతి ధర్నాకు ఓ రేటు... అదే వాళ్ల రూటు
ఆఖరుకు రాజకీయాలు అలా తయారయ్యాయి.. ప్రజలు.. కార్మికులు.. ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాల్సిన ఉద్యమ పార్టీలు డబ్బుకు అమ్ముడుపోయాయి. రాష్ట్రంలో లేని కారణాలు సృష్టించి.. ఉద్యోగుల్లోనూ, అంగన్ వాడీల్లోనూ లేని అసంతృప్తిని రేకెత్తించి వాళ్లను ఉద్యమాలవైపు నడిపిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో కార్మిక.. ఉద్యోగ.. విద్యార్ధివర్గాల్లో అసంతృప్తి ఉందన్న భావనను విస్తృతం చేయడం.. ప్రభుత్వ వ్యతిరేకతను మరింత రాజేయడం వారి లక్ష్యం. అయితే ఇదంతా ఊరకనే చేయరు.. అటు ప్రతిపక్ష తెలుగుదేశానికి లబ్ది చేకూర్చడానికి వారు ఎన్నికల్లో గెలవడానికి తమవంతు పాత్ర పోషించే క్రమంలో ఫీజు తీసుకుని ఇలా ఉద్యమాలు చేస్తుంటారు అన్నమాట. అన్ని వర్గాల ప్రజలకు బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందుతుండడంతో వాళ్లంతా సంతోషంగా ఉన్నారు. వారినుంచి ఎలాంటి అసంతృప్తి లేదు. ఉద్యోగుల్లో అంగన్ వాడీలు.. ఇంకా ప్రభుత్వ సిబ్బందికి సైతం ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. మరి అలాంటపుడు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం తెలుగుదేశం వల్లకాదని అర్థం చేసుకున్న ఆ పార్టీ పెద్దలు.. నేరుగా ఉద్యమపార్టీలను లైన్లో పెట్టారని విశ్వసనీయ సమాచారం. ఇందుకుగాను వారికి కోట్లకు కోట్లు ప్రతిపక్ష టీడీపీ ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ డబ్బును జిల్లాల యూనిట్ల బాధ్యులకు కాస్త పంపించి ఉద్యమాలకు ఉసిగొల్పుతున్నట్లు తెలిసింది. అందుకే కారణం లేకుండానే అంగన్ వాడీలు సైతం ఆందోళనలకు దిగారు. వారికి గతంలో ఎన్నడూ లేనంత ప్రోత్సాహాన్ని సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న జీతాలను జగన్మోహన్రెడ్డి పెంచి.. వారికి ఉద్యోగభద్రత కల్పించడమే కాకుండా పదోన్నతుల్లో వారికి మరిన్ని వెసులుబాట్లు ఇచ్చారు. అయినా సరే అకస్మాత్తుగా వారు సమ్మెకు దిగారు. గతంలో జగన్‌కు క్షీరాభిషేకాలు చేసినవాళ్లే ఇప్పుడు ఇలా ప్రవర్తించడాన్ని సందేహిస్తున్న వారికి అసలు కారణం తెలుస్తోంది. వాస్తవానికి 2014-19 మధ్య అంగన్ వాడీలు.. ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు పెద్దగా చేసిందేమి లేదు కానీ ఆనాడు ఉద్యమాలు పెద్దగా చేసింది లేదు. అంటే అప్పుడు మిన్నకుండడానికి సైతం పేమెంట్ ముట్టిందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు ఇన్నేళ్లు ఊరుకున్న ఉద్యోగులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోడ్లెక్కడం వెనుక ఆ పార్టీల పెద్దల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయన్నది అవగతం అవుతున్నది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఏమీ చేయకపోయినా పల్లెత్తుమాట అనలేదు కదా చంద్రబాబుని.. పల్లెత్తు మాట అనలేదు. ఇప్పుడు మాత్రం.. ఉపాధ్యాయ.. విద్యార్ధి.. ఇతర ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టి వారి ఖర్చులు.. ధర్నాల టెంట్లకు డబ్బులు ఇచ్చి మరీ ఆందోళనలు చేయిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. -- సిమ్మాదిరప్పన్న చదవండి: ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు -
ఎంత మంది ఉన్నారన్నది కాదు.. ఇటు ఎవరున్నారన్నది పాయింట్
అటు వైపు ఎంతమంది ఉన్నారన్నది కాదు.. వాళ్ళు ఎదుర్కొంటున్నది ఎవరిని అన్నది ముఖ్యం. అటు ఎంతమంది గుంపు కడుతున్నారు అంటే ఇటువైపు ప్రత్యర్థి అంత బలంగా ఉన్నట్లు వాళ్ళు అంగీకరించినట్లే.. విలన్ గ్యాంగ్ ఎంత ఎక్కువ ఉంటే హీరో అంత బలవంతుడు అని చెబుతున్నట్లే.. ఇప్పుడు ఆంధ్రాలో కనిపిస్తున్న రాజకీయ చిత్రం గతంలో ఎప్పుడో చూసిన పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి కదా.. అవును నిజమే అప్పట్లో 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు TDP+TRS+CPI+CPM కలిసి మహా కూటమి ఏర్పాటు చేశాయి. మరోవైపు, చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం దూకుడు సైతం ఆరోజుల్లో గొప్పగానే కనిపించేది. దాదాపు చిరంజీవి ముఖ్యమంత్రి అయినట్లే అని ప్రచారం నడిచింది. చిరంజీవి పార్టీ కారణంగా కాంగ్రెస్‌కు కాపులు దూరం అయినా వీటన్నింటినీ అడ్డుకుని మళ్లీ ఆనాడు వైయస్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ విజయపతాకం ఎగరేసింది. అంతేకాకుండా ఆనాడు రెండోసారి యూపీఏ ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన కీలకమైన ఎంపీల్లో 33 సీట్లు అప్పటి ఉమ్మడి ఆంధ్రా నుంచి వచ్చినవే కావడం గమనార్హం. ఇదే అంశాన్ని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం అంగీకరించారు. ఇక ఆనాటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే మొత్తం 294 స్థానాలకుగాను కాంగ్రెస్-157, తెలుగుదేశం, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసివచ్చిన మహాకూటమి -106 స్థానాల్లో గెలవగా ప్రజారాజ్యం-18, ఇతరులు 13 సీట్లు గెలిచారు. అంతిమంగా వైఎస్సార్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఇటు సమర్ధుడైన నాయకుడు నిలబడితే అటు ఎంతమంది నిలబడినా ముందుగా అరుపులు కేకలు వినిపిస్తాయి. ఒక్కసారి రాజు కత్తి దూస్తే ఆనక వినిపించేవి ఆర్తనాదాలే. హిస్టరీ రిపీట్.. చరిత్ర పునరావృతం అవుతుంది అంటారు. అంటే గతంలో జరిగిన సంఘటనలు.. సన్నివేశాలు మళ్లీ జరుగుతూనే ఉంటాయి అన్నమాట. అంటే ఫలితాలు కూడా మళ్లీ అలాగే వస్తాయి అన్నమాట. ఆ సిద్ధాంతం ప్రకారం 2009లో జరిగినట్లుగానే రానున్న ఎన్నికల్లో సైతం టీడీపీ+జనసేన ప్రస్తుతం పొత్తులో ఉండగా బీజేపీని సైతం ఆ కూటమిలోకి తేవడానికి చంద్రబాబు.. పవన్ కళ్యాణ్.. ఇంకా బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలను కలిసి తమతో కలిసిరావాల్సిందిగా కోరుతున్నారు. ఎన్నోరకాలుగా బీజేపీని తమతో కలుపుకునేందుకు చంద్రబాబు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. ఇక కమ్యునిస్టులను సైతం తమతో తీసుకుపోయేందుకు కూడా వెనుకడరు. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం తనకు వేరే ఏ పార్టీతో పొత్తు వద్దని ప్రజలే తమకు మద్దతుదారులు అని.. చెబుతూ తన అంతర్గత సర్వేలు.. నివేదికలు.. లెక్కలు వేసుకుంటూ ఒక్కో నియోజకవర్గాన్ని క్లియర్ చేసుకుంటూ బిజీగా ఉన్నారు. ఇటు చంద్రబాబు జనసేనలో ఎవరికీ ఎన్ని సీట్లు అన్నది కూడా లెక్క తేలలేదు. కాపుల మద్దతు టీడీపీకి ఉంటుందా లేదా? అన్నది కూడా ఇంకా కొలిక్కి రాలేదు. మొత్తానికి అటువైపు గుంపుగా వస్తుండగా జగన్ మాత్రం సంక్షేమం.. అభివృద్ధి తనను గెలిపిస్తాయి అంటూ సింగిల్‌గా వెళ్తున్నారు. అప్పట్లో వైఎస్సార్ సాధించినట్లే సింగిల్ హ్యాండ్ విజయం సాధిస్తాం అని జగన్, ఆయన సైన్యం గట్టిగా నమ్ముతూ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు. -సిమ్మాదిరప్పన్న -
ఒకనాటి మేటి .. నేడు నోటాకు సరిసాటి
ఒకనాడు దేదీప్యమానంగా వెలిగిపోయిన జాతీయ పార్టీ కాంగ్రెస్... దేశంలోని దాదాపు 90 శాతం రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నపార్టీ... పదులసంఖ్యలో ముఖ్యమంత్రులు.. అదే సంఖ్యలో గవర్నర్లు.. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ కాంగ్రెస్ నాయకుడు అనే ట్యాగ్ లైన్ ఏంటో ఘనంగా.. క్యాడర్ మెడలో కండువా గర్వంగా ఉండేది. కానీ ఆ వెన్నెలరోజులు ముగిశాయి.. ఇప్పుడు కాంగ్రెస్ సంపూర్ణంగా అమావాస్య రోజులను చూస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కుంటుతూ నడుస్తోంది.. కొన్ని చోట్ల ఉనికి కూడాలేదు. ఆంధ్రప్రదేశ్‌ను తమ రాజకీయ ప్రయోజనాలకోసం విడగొట్టిన కాంగ్రెసును సీమాంధ్ర ప్రజలు తమ క్రోధాగ్నిలో భస్మం చేసేసారు. సమీప భవిషత్తులో కోలుకునే అవకాశం లేకుండా చేసారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు ఎగిరెగిరిపడిన నాయకులంతా 2019 ఎన్నికల్లో మట్టికరిచారు. నాయకుల మెడలోని కండువా దిగాలుగా నేలరాలింది. దీనికితోడు దివంగత మహానాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తరువాత అయన కుటుంబాన్ని, ముఖ్యంగా కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ కర్కశ వైఖరిని అంగీకరించని ప్రజలు ఆ పార్టీని నేలమట్టం చేసేశారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆంధ్రాలో ఎక్కడా పచ్చి మంచినీళ్లు కూడా పుట్టలేదు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ పేరు తలచుకోవడానికి సైతం కార్యకర్తలు ఇష్టపడడం లేదు. అయినా సరే 2014, 2019 ఎన్నికల్లో కొందరు నాయకులు కేంద్ర మంత్రులుగా చేసినవాళ్లు సైతం పట్టుమని పదివేల ఓట్లు సాధించలేక కుదేలైపోయారు. ఆశ్చర్యంగా మాకు ఈ నాయకుల్లో ఎవరూ వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు పెట్టిన నోటా కన్నా కూడా తక్కువ ఓట్లు తెచ్చుకుని కాంగ్రెస్ అవసాన దశలో ఉందన్న విషయాన్నీ ఎలుగెత్తి చాటుకుంది. కేంద్ర మంత్రిగా పని చేసిన పల్లం రాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. ఇంకో కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే 9585 ఓట్లు వచ్చాయి . ఇంకో సీనియర్ నాయకుడు సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1384 ఓట్లు వచ్చాయి.. ఇక్కడ నోటాకు 2340 ఓట్లు రావడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పొతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ కు కనీస మర్యాద దక్కలేదు.. ఇకముందూ దక్కదు. ఇంకెంత గొప్ప నాయకులు వచ్చి చేరినా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆంధ్రాలో నూకలు దొరకవు అనేది ఇక్కడి స్కూలు పిల్లాడిని అడిగినా స్పష్టంగా చెబుతాడు.. కాబట్టి దానిగురించి ఇంత చర్చ అవసరం లేదు. -సిమ్మాదిరప్పన్న -
‘పాత సామాన్లు కొంటాం.. చెత్తా చెదారం కొంటాం!’
పొద్దున్నే లేవగానే వీధుల్లోకి మైకేసుకుని రిక్షాలో వస్తుంటారు ఇలాంటి వాళ్ళు.. పెద్ద సౌండ్ చేస్తూ పాత కుర్చీలు.. వాడని సైకిళ్ళు.. ప్లాస్టిక్ బకెట్లు కొంటాం.. ఉల్లిపాయలు ఇస్తాం అంటుంటారు.. అంటే ఈ సామాన్లు సదరు కాలనీవాసులకు పనికిరాదు కానీ ఆ వ్యాపారికి మాత్రం లాభసాటి అన్నమాట.. తడిచెత్త.. పొడిచెత్త మనకు పనికిరాదు కానీ దాంతో విద్యుత్ తయారు చేసేవాళ్లకు మాత్రం అదే బంగారం. తెలుగుదేశం వాళ్ళ పరిస్థితి సైతం అలాగే మారింది. గత కొన్నాళ్లుగా.. క్షయ రోగి మాదిరిగా క్షీణిస్తూ వస్తున్న తెలుగుదేశం నుంచి బయటకు వచ్చేవాళ్లే తప్ప కొత్తగా చేరేవాళ్ళు కానరావడం లేదు. దీంతో ఏ మొక్కా లేనిచోట ఆముదం మొక్కే మహావృక్షం అయినట్లుగా.. ప్రజలు పూర్తిగా మరచిపోయిన, ప్రజాదరణ లేని కొందరిని తెలుగుదేశంలో చేర్చుకుని అదే మహాప్రసాదంగా భవిస్తూ సంబరపడిపోతున్నారు. దాంతోబాటు తెలుగుదేశం మద్దతుదారు అయిన పచ్చ మీడియా సైతం తెలుగుదేశం బలపడుతోందంటూ ఊదరగొడుతున్నారు. ►వాస్తవానికి నిన్న టీడీపీలో చేరినవాళ్లలో ద్వారకానాథ రెడ్డి 1994లో ఆయన లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో పాటు లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రద్దు కావడంతో ద్వారకానాథరెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. 2009లో టికెట్ దక్కలేదు. వైఎస్ జగన్ వైఎస్సార్సీపీని స్థాపించిన తర్వాత 2014లో టికెట్ ఆశించగా దక్కలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా 2019లో వైఎస్సార్సీపీ, టీడీపీల నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు. అనంతరం రాజకీయాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఇప్పుడు అయన టీడీపీలో చేరడం.. దాన్ని చూసి సంబరపడిపోవడం చూస్తుందే. ►ఇక సి.రామచంద్రయ్య అయితే ఎన్నడూ ప్రజల నుంచి గెలవలేదు.. టీడీపీ.. కాంగ్రెస్.. ప్రజారాజ్యం అన్ని పార్టీలూ చూసేసారు.. అయన మేధావి అని చెప్పుకుంటూ ఇన్నాళ్లూ పబ్బం గడిపేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరాక ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చారు. అయినా ఇప్పుడు తాజాగా టీడీపీలో చేరారు. అయన ఉనికి కూడా కడప జిల్లావాసులకు తెలియదు. ►1999లో అనకాపల్లి నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దాడి వీరభద్ర రావు సైతం గత ఇరవయ్యేళ్లులో గెలిచింది లేదు. ప్రజలకు దూరంగానే ఉంటున్నారు. ఆయన్ను చేర్చుకోవడం మహా ఘనత అని తెలుగుదేశం చెప్పుకుంటోంది. ►ఇది కాకుండా కడప జిల్లాకు చెందిన డీ.ఎల్ రవీంద్ర రెడ్డి, వీర శివారెడ్డి సైతం టీడీపీవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. వీరు కూడా దాదాపు రిటైర్ అయినట్లే.. ప్రజలకు దూరమై చాన్నాళ్లు ఐంది. కానీ ఎవరో ఒకరు వచ్చారు కదా అన్నట్లుగా టీడీపీ సంబరపడుతోంది. ✍️:::సిమ్మాదిరప్పన్న -
భువనేశ్వరి మళ్లీ బస్సు యాత్ర చేసేది అందుకేనా?
అదేమిటో విచిత్రం. చంద్రబాబుకు.. ఆయన కుటుంబ సభ్యులకు తాము ఇబ్బందుల్లోను, చిక్కుల్లోను, ప్రతిపక్షంలో ఉన్నపుడు మాత్రమే జనం గుర్తొస్తారు. తాను అధికారంలో విలాసాల్లో.. కంఫర్ట్‌గా ఉన్నపుడు ఏనాడూ పేదలు.. నిర్భాగ్యులు కనిపించరు. అప్పుడు వీళ్లంతా చీమల్లా.. దోమల్లా..పూచిక పుల్లలలా కనిపిస్తారు.. తమకు కష్టాలు రాగానే ప్రజల మద్దతు కోరతారు..చంద్రబాబు అరెస్టును భరించలేక రాష్ట్రంలో దాదాపు 300 మంది గుండె పోటు వచ్చి చనిపోయారని తెలుగుదేశం దాని మద్దతుదారు అయిన మీడియాలు ఊదరగొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మరణాలను తమకు అనుకూలంగా . సానుభూతిగా మార్చుకునే క్రమంలో నిజం గెలవాలి అంటూ ఓ మూడు రోజులు బస్సు యాత్ర చేశారు. మృతుల కుటుంబాలకు రూ. మూడు లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందించారు. పనిలోపనిగా తన భర్తను జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా అరెస్ట్ చేసిందని ఆరోపిస్తూ కొంత సానుభూతిని పోగేసి ప్రయత్నం చేసారు. ఈలోగా చంద్రబాబుకు బెయిల్ వచ్చింది. దీంతో ఆమె ఆయనకు స్వగాతాలు పలుకుతూ ఆ ఆనందంలో ఇటు కార్యకర్తలు మరణించిన అంశాన్ని మరచిపోయారు. ఓ విలేకరి ఇదే విషయాన్నీ ప్రస్తావించగా ఆయనకు బెయిల్ వచ్చేశాక ఇంకా యాత్ర అవసరం ఏముంది అంటూ తనకు మళ్ళీ ప్రజలను కలవాల్సిన అవసరం లేదని తప్పించుకున్నారు. దీనిమీద సోషల్ మీడియాలో విమర్శలు.. ట్రోలింగులు మొదలయ్యాయి. కేవలం సానుభూతికోసమే యాత్ర చేస్తారా.. మీ ఆయనకు బెయిల్ వస్తే ఇక కార్యకర్తల కుటుంబాలను పరామర్శించక్కరలేదా? తాజాగా మళ్ళీ భువనేశ్వరి నిన్న బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటించారు.. చంద్రబాబు అరెస్టు భరించలేక గుండెలు ఆగిన ముగ్గురు కార్యకర్తల కుటుంబాలకు ఆర్థికసాయం చేసారు. టీడీపీ ప్రభుత్వం వస్తే వారికీ ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా అప్పట్లోనే ఈ యాత్ర చేయకుండా కొన్నాళ్ళు బ్రేకిచ్చి ఎందుకు యాత్ర చేస్తున్నారన్న సందేహాలు వస్తున్నాయి. పార్టీకి ఓటమి భయం పట్టుకుందా ? ఇంటిల్లిపాది తిరగడం కాకుండా పవన్ కళ్యాణ్.. బీజేపీ ఇతర పార్టీలతో సైతం పొత్తులు ఉండాలా ... ఇవేం లేకపోతే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని అడ్డుకోలేం అని భయం పట్టుకుందా.. అందుకే మళ్ళీ ఆమె బస్సు యాత్ర.. పరామర్శలు అంటూ ప్రజల్లోకి వెళ్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అటు యువనాయకుడు అని ఎంతగానో హైప్ ఇచ్చిన లోకేష్ పెద్దగా ప్రజలను ప్రభావితం చేయలేకపోవడం తెలుగుదేశానికి ఇబ్బందిగా మారింది. ఈ ఎన్నికలవేళ చంద్రబాబు వయసు రీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయడం.. భారీ ప్రసంగాలు చేయడం వంటికి ఇబ్బందిగా మారిన తరుణంలో లోకేష్ కానీ సమర్థంగా ఉంటే పార్టీకి కొంత బలం అయ్యేది. కానీ లోకేష్ ఎక్కడికి వెళ్తే అక్కడ పార్టీ మటాష్ అయిపోయేలా కనిపిస్తుండడంతో టీడీపీ పెద్దలతోబాటు.. చంద్రబాబు, భువనేశ్వరి సైతం ఆందోళన చెందుతున్నారు. పనికిమాలిన కొడుకు. పార్టీకి భారమే తప్ప లాభం లేదని లోలోన భావిస్తున్నా బయటకు ఆ భావన కనిపించకుండా కవర్ చేస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికల సమయంలో సైతం అలా కప్పి ఉంచలేక.. ఇప్పుడు భువనేశ్వరిని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఆమె అయితే కాస్త మహిళా సెంటిమెంట్‌ను రగిలిస్తూ మహిళలతో మాట్లాడడం.. కొంత సానుభూతి పోగేసే అవకాశాలు ఉన్నట్లు భావించిన చంద్రబాబు ఆ మేరకు ఆమెను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది -సిమ్మాదిరప్పన్న -
అమ్మ అఖిలప్రియా.. అలా డిసైడ్ అయ్యావా?
చంద్రబాబు రాజకీయ ఎత్తులు.. జిత్తుల సంగతి పూర్తిగా అవగతం చేసుకున్న భూమా అఖిల ప్రియ.. తనకు తాను అపరచాణక్యుడిలా ఫీలయ్యే చంద్రబాబుకే షాక్ ఇచ్చారట. తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత అనూహ్యంగా మంత్రి అయిన అఖిలప్రియ పేరు కన్నా చెడ్డపేరును ఎక్కువ సంపాదించారు. హత్యలు.. కిడ్నాపులు.. బ్యాంకులను మోసం చేయడం.. రుణాలు ఎగ్గొట్టడం.. బెదిరించడం.. ఇంకా తన తండ్రి అంతరంగికుడు.. ఆప్తమిత్రుడు అయినా ఏవీ సుబ్బారెడ్డి మీద లోకేష్ పాదయాత్రతోనే బహిరంగంగా దాడులు చేయడం వంటి దూకుడు చర్యలతో ఎంత అప్రదిష్టమూటగట్టుకున్నారో ఎవరికీ తెలియదు.. ఆళ్లగడ్డలో మళ్ళీ పోటీ చేసేందుకు ఆమె ఉత్సాహంగా ఉన్నా పరిస్థితులు అనుకూలంగా లేవని టీడీపీ అంటోంది.. ఆమెకు టికెట్ ఇస్తే క్యాడర్ సపోర్ట్ చేయదని .. ఆమె దూకుడు పార్టీకి మరింత చేటు చేస్తుందని పార్టీ పెద్దలు భయపడుతున్నారు. అందుకే ఆమెకు టికెట్ లేకుండా పక్కనబెట్టి. ఆమె సపోర్ట్ తీసుకుని వేరేవాళ్లకు టికెట్ ఇచ్చేలా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తెలుగుదేశం సైతం టిక్కెట్లు ఖరారు చేసేందుకు ఓ వైపు సిద్ధం అవుతూనే చంద్రబాబు మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు షెడ్యూల్ రెడీ చేసారు. ఈనెల ఐదున తణుకు, ఏడున కృష్ణాజిల్లా తిరువూరు.. తొమ్మిదిన ఆళ్లగడ్డ , పదకొండున నరసరావుపేటలో భారీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ జనసమీకరణతో .. భారీ వేదికలు ఏర్పాటుతో రూపొందే ఈ సభలకు ఆయా స్థానిక నాయకులూ ఖర్చు చేయాల్సి ఉంటుంది.. బస్సులు.. వేదిక.. సౌండ్ సిస్టం.. రవాణా.. భోజనాలు.. పెద్ద నాయకులకు ప్రత్యేక ఏర్పాట్లు అన్నీ అక్కడి ఎమ్మెల్యే అభ్యర్థులు లేదా. టికెట్ కోరుకుంటున్నవాళ్ళు చేయాల్సి ఉంది. ఇది అన్ని చోట్లా ఉన్నదే.. అయితే ఆళ్లగడ్డ సభకు మాత్రం భూమా అఖిల ప్రియ మెలికపెట్టినట్లు తెలిసింది. తనకు టిక్కెట్ ఇస్తామంటేనే ఈ సభ ఖర్చులు తాను పెట్టుకుంటానని. లేకుంటే ఈ సభకు దాదాపు కోటి ఖర్చు చేయలేనని పార్టీ పెద్దలకు చెప్పేసినట్లు తెలిసింది. టిక్కెట్ ఇవ్వనప్పుడు ఈ గడ్డు రోజుల్లో అంత డబ్బును అప్పుతెచ్చి ఎందుకు ఖర్చు చేయాలన్నది ఆమె ఆలోచన అంటున్నారు. ఇప్పటికే కోర్టులు.. కేసులు.. బ్యాంకర్ల నోటీసులతో ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న అఖిల ప్రియా ఇంత పెద్ద మొత్తాన్ని ఖర్చు చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. టిక్కెట్ ఇస్తాను అంటేనే సభా ఖర్చుల బాధ్యత తీసుకుంటాను అని .. లేదంటే లేదని ఆమె పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఆమెకు టిక్కెట్ ఇస్తారా.. ఆమెను పక్కన పెడతారా అన్నది టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.. ఆమె రాజకీయ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. -సిమ్మాదిరప్పన్న