సమస్యలు నీముందు మోకరిల్లాలి
విజయం నీ ఒడిలో వచ్చి వాలాలి
కష్టాలను వెరవని నైజం... అవమానాలను ధిక్కరించే తేజం
గెలుపు సాధించేవరకు విశ్రమించని పంతం
‘‘కష్టం నాన్నా.. నాకు ఇవేం అర్థం కావడం లేదు... ఈ పాఠాలు.. లెక్కలు.. కెమిస్ట్రీ ఇదేం నావల్లకావడం లేదు.. పైగా ఈ సీటు కోసం క్రికెట్.. సినిమాలు.. ఇవన్నీ మానేయాల్సి వస్తోంది.. అందుకే ఈ ఐఐటి వంటి పెద్ద గోల్స్ మానేద్దాం అనుకుంటున్నా.. ఇంకేదైనా చేస్తాను..’’ బాధపడిపోతూ చెప్పాడు శ్రీనాథ్.. కొడుకును ప్రేమగా దగ్గరకు తీసుకున్న గోపాల్ రావు 'అర్రర్రే.. అలగానీస్తే ఎలారా..కష్టంగా ఉందని మానేస్తే నీ టార్గెట్ ఏటవ్వాలి.. ఇదేకాదు ఏ పనిలో అయినా కష్టం ఉంటాది.. లక్ష్యానికి చేరాలంటే ఎన్నో త్యాగాలు చేయాలి..అప్పుడే నీ ఆశయం నెరవేరుతాది అన్నాడు గోపాల్ రావు.. పెద్దపెద్ద డైలాగులు చెప్పడం సుళువేగానీ ఆ దారిలో వెళ్లడం కష్టం నాన్నా అంటూ మ్రాన్పడిపోతున్నాడు కొడుకు.. ఒరేయ్ అందరూ నీలాగే అనుకుంటే పెద్దపెద్ద లక్ష్యాలకు ఎలా చేరతారు. అంతెందుకు మన జగన్ను చూడు..
ఎన్ని బాధలు పడితేతప్ప సీఎం కాలేదు.. దీనికోసం ఎంత కష్టించాడో.. ఎన్ని ఇష్టాలను వదులుకున్నాడో తెలుసా అన్నాడు తండ్రి.. పళ్లకో నాన్న నువ్వన్నీ ఇచిత్రాలే చెప్తావ్.. జగనుకు యేటి కష్టం.. వాళ్ళనాన్న రాజశేఖర్ రెడ్డి సీఎం కాబట్టి ఈయనా సీఎం అయ్యాడు.. ఏం కష్టం పడ్డాడు చెప్పు అన్నాడు శ్రీనాథ్.. ఒరేయ్ అలాగనీకు యావత్ దేశంలోనే ఒక సంచలనం.. జగన్ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. నీలాంటి యువతకు ఒక రిఫరెల్ సక్సెస్ స్టోరీ అన్నాడు గోపాలం. ఏదీ అంత గొప్పేముందని అందులో.. అన్నాడు కొడుకు.. సరే పక్కన కూకో అంటూ.. గోపాలరావు చెప్పాడు
నువ్వనుకుంటున్నట్లు జగన్ జీవితం కొన్నాళ్లవరకు.. వడ్డించిన విస్తరే కానీ.. ఆ విస్తరి అక్కర్లేదు.. తనకోసం కొత్తబాట వేసుకుందాం అనుకున్నాడు అందుకే రాజకీయాల్లోకి వచ్చాడు అన్నాడు తండ్రి.. అదెలా అన్నాడు శ్రీనాథ్.. అవును వైఎస్సార్ కొడుకుగా జగన్ ఒక సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్.. కానీ తండ్రి మరణం తరువాత తనకంటూ ఒక బాటవేసుకున్నాడు. తండ్రిని గుండెల్లో పెట్టుకున్న ప్రజలకోసం తానూ అండగా ఉండాలని భావించాడు..' అందుకే సీఎం అయిపోయాడు అన్నాడు శ్రీనాథ్.. నీ తలకాయ.. అయన అంత సులువుగా అవ్వలేదు.. దీనికోసం పడిన కష్టాలు వింటే నువ్వు పడుతున్న ఇబ్బందులు కూడా ఒక సమస్యేనా అంటావు.. అన్నాడు నాన్న ఏం కష్టాలు నాన్నా.. సులువుగానే సీఎం అయ్యాడు కదా అన్నాడు శ్రీనాథ్. కాదురా బాబు.. వైయస్ మరణం తరువాత పొలిటికల్ స్క్రీన్ మీద అయన పాత్రను ముగించేందుకు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎన్నో కుట్రలు జరిగాయి. వైయస్సార్ పుణ్యాన మాంత్రులు అయినవాళ్లు.. ఎంపీలు అయినవాళ్లను సైతం జగన్ వెంట గోతులు తీశారు. అయినా ఈయనవెరవలేదు. నీలాగా భయం వేస్తోందని పారిపోలేదు.
పరిస్థితులకు ఎదురీది.. సవాళ్లకు ఎదురేగి నిలబడ్డాడు.. కాలంతో కలబడ్డాడు... ఢిల్లీ పెద్దలతో తలపడ్డాడు.. అది కదా పోరాటం అంటే.. పోన్లే అలా చేసి గెలిచేసాడు.. సీఎం అయిపోయాడు అంతేనా అన్నాడు శ్రీనాథ్.. జగన్ జీవితం అంతవీజీగా అవ్వలేదురా... తన లక్ష్యసాధనకు అడ్డుగా ఉందని భావించిన ఎంపీ పదవిని వదిలేసాడు.. నువ్వు ఆఫ్ట్రాల్ సినిమాలు.. క్రికెట్ వదులుకోలేని అంటున్నావు ... లోకాన్ని తెలుసుకోవడానికి వేలకిలోమీటర్ల పాదయాత్రలు చేశాడు.. మొదటిసారి కూడా ప్రజలకు తానూ చేయగలిగేవే చెబుతాను తప్ప మోసం చేయలేను అంటూ సాధ్యాసాధ్యాలు పరిశీలించి కొన్ని కొన్ని హామీలు ఇచ్చి పోటీ చేసాడు. మంచి సీట్లొచ్చాయి.. కానీ అధికారం రాలేదు.. నీలాగా నావల్ల కాదని పారిపోలేదు.. ఆ వచ్చిన సీట్లలో కొందరు పార్టీమారిపోయారు.. ఆ పరిణామాలను చూస్తూ నవ్వుకున్నాడు.. రాటుదేలాడు తప్ప ఇది కష్టం అని వదులుకోలేదు.. మళ్ళీ రాష్ట్రం ఆ మూల నుంచి ఈ మూలకు పాదయాత్ర చేశాడు.. నువ్వు కూడా నే సిలబస్ మొత్తం ఆమూలాగ్రం ఇలాగె చదవాలి.
‘‘ఓహో.. ఒకే మరి నడిస్తే ఏమైంది..’’ అన్నాడు కొడుకు.. ఏముంది పాదయాత్రలో భాగంగా తాను చూసినా ప్రజల కష్టాలే అయన మ్యానిఫెస్టో అయింది. అదేమాట చెప్పాడు.. అఖండ మెజార్టీ సాధించాడు. రెండేళ్లు కోవిడ్ కాలంలోనూ ప్రజలను కాపాడుకుని దేశవ్యాప్తంగా పేరుపొందాడు.. రాష్ట్రంలో విద్యావైద్యరంగాలను పరుగులు పెట్టించాడు. పారిశ్రామికరంగం ఉరకలేసింది. అడిగాడా హీరో అంటే.. నీలాగా ఎప్పుడూ ఎక్కడా.. ఏనాడూ భయపడలేదు.. ఎవర్నీ లెక్కచేయలేదు.. అదిరా మగాడితనం అంటే.. అది కదా ఛాలెంజింగ్ అంటే.. నువ్వూ ఆలా ఉండాలి.. హీరోలా ఎదగాలి.. ఈ ఎగ్జామ్స్ నాకొలెక్కా అనేలా ఎదురెళ్లి మరీ నీ దమ్ము చూపాలి అన్నాడు..
‘‘అవును నాన్న.. నిజమే.. జగన్ రాజకీయ ప్రస్థానం ఒక స్ఫూర్తిమంతం. అయన గమనం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం’’ అన్నాడు.. సరే మరి ఇప్పుడేమంటావ్ అన్నాడు గోపాలరావు.. లేదు నాన్న నేను ఈసారి మరింత రెట్టించి చదువుతాను.. సీట్ సాధించి నేనేమిటో చేసి చూపిస్తాను అంటూ బుక్స్ తీసుకుని బయల్దేరాడు.. కొడుకు వంక ఆలా చూస్తూ నిలబడిపోయాడు.. తండ్రి గోపాల రావు .. ఒరేయ్ ఈరోజు జగన్ పుట్టినరోజు.. ఆయనకు విషెస్ చెప్పి నీ చదువు ప్రారంభించు.. ఖచ్చితంగా పాసవుతావు అని చెప్పాడు.. సరే నాన్నా అంటూ కదిలాడు శ్రీనాథ్
:::సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment