YS Jagan Mohan Reddy Birthday
-
‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా పోర్ట్ స్టేడియంలో ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ టోర్నమెంట్ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. కాగడ వెలిగించి టోర్నమెంట్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, కురసాల కన్నబాబు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రేపటి నుంచి వచ్చే నెల 9 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నమెంట్లో 422 టీమ్‌లు పాల్గొంటున్నాయి. (చదవండి: సీఎం జగన్ బర్త్‌డే: 20వేల మందితో భారీ ర్యాలీ) ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, ప్రతి వ్యక్తిలో వజ్ర సంకల్పం ఉండాలని..దీనికి నిదర్శనం సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. ఆయన ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని సంక్షేమ పాలన అందిస్తున్నారని తెలిపారు. యువశక్తి అంతా ఈ రోజు ‘వైఎస్సార్ క్రికెట్ కప్’ లో భాగస్వామ్యం అవుతున్నారని పేర్కొన్నారు. అత్యత్తమ ప్రతిభ కనబరిచి గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి సచిన్, ధోనీ లాంటి వారు ఎదిగారని తెలిపారు. ప్రతి ఏడాది ఇదే స్థాయిలో అన్ని క్రీడలు బాట్మింటన్, కబడ్డీ, టెన్నిస్ అన్ని రంగాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. -
సీఎం జగన్ బర్త్‌డే: 20వేల మందితో భారీ ర్యాలీ
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. వంద కిలోల కేక్‌ను ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే భూమన ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. 20 వేల మందితో కృష్ణాపురం ఠాణా నుంచి తుడా కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే పరమావధిగా జగన్ పాలన సాగుతోందని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను యువత ప్లకార్డులతో ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువత పాల్గొన్నారు. (చదవండి: సీఎం జగన్ బర్త్ డే: కేట్ కట్ చేయించిన సీఎస్, డీజీపీ) విశాఖ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాదయాత్ర చేపట్టారు. బుచ్చయ్య పేట మండలంలోని లోపూడి, ఎల్. సింగవరం, పొట్టి దొరపాలెం, కోమళ్లపూడి గ్రామాల్లో పర్యటించారు. సీఎం వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు దేవరాపల్లి మండలం తెనుగుపూడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. (చదవండి: ఏపీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం) ప్రకాశం జిల్లా: సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా కనిగిరి వ్యవసాయ మార్కెట్లో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ సరితా రెడ్డి, బన్నీ, రంగనాయకుల రెడ్డి, అబ్దుల్ గఫార్, మోహన్‌రడ్డి, టి.సుజాత పాల్గొన్నారు. తూర్పుగోదావరి: పి.గన్నవరంలో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు భారీ కేక్‌ను కట్ చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వరలక్ష్మి చినబాబు, పీకే రావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లో ఏపీ సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రపుల్లా రెడ్డి.. పంజాగుట్టలో కేక్ కట్ చేసి వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. -
క్యాంపు ఆఫీస్‌లో ఘనంగా సీఎం వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుక
-
ఆస్ట్రేలియాలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
మెల్బోర్న్: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ నేత చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో మెల్బోర్న్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్న వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా ఎన్నారైలనుద్దేశించి పార్టీ ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ ఎన్నారై కో–ఆర్డినేటర్ వెంకట్ మేడపాటి తదితరులు జూమ్ ద్వారా మాట్లాడారు. అనంతరం మూడు రాజధానులకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా విభాగం తీర్మానం చేసింది. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా నాయకులు పాల్గొన్నారు. (చదవండి: సీఎం వైఎస్ జగన్‌కు శుభాకాంక్షల వెల్లువ) -
సీఎం వైఎస్ జగన్‌తో బ్యాంకు ప్రతినిధుల భేటీ
-
జగమంత సంబరం
సాక్షి ప్రతినిధి విజయనగరం: ఇంటి బిడ్డ పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకుంటామో.. అంతకుమించిన సంబరంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు వేడుకలను జిల్లా ప్రజలు జరుపుకున్నారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి బొబ్బిలి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ప్రారంభించి జిల్లాలోని 444 మంది నేతన్నలకు ఒక్కొక్కరికీ రూ.24వేలు చొప్పున రూ.1,06,56,000 అందజేశారు. బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. పుష్పశ్రీవాణి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే శంబంగి, జిల్లాకలెక్టర్ హరిజవహర్‌లాల్ తదితరులకు అందజేశారు. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ముఖ్య అతిధిగా పుష్పశ్రీవాణి, వైఎస్సార్సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కేక్ కట్ చేశారు. ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి స్వయంగా రక్తదానం చేశారు. పార్వతీపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్‌చేశారు. సాయంత్రం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షత వహించగా ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, విశ్వాసరాయి కళావతి, చెట్టి ఫల్గుణ, మాజీ ఎంపీ బొత్సఝాన్సీలక్ష్మి కేక్ కట్ చేసి సీఎం పుట్టినరోజు వేడుకలు జరిపారు. విజయనగరంలో మెగా రక్తదాన శిబిరం విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. మెగా బ్లడ్ క్యాంప్ ఆర్గనైజింగ్ చైర్మన్ సంగంరెడ్డి బంగారునాయుడు, కో చైర్మన్లు అల్లు చాణుక్య, జి.ఈశ్వర్ కౌశిక్‌ల నేతత్వంలో 356 యూనిట్ల రక్తాన్ని వివిధ రక్తనిధి కేంద్రాల వైద్యులు సేకరించారు. వైఎస్సార్సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నగరంలోని హెలి్పంగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ జంక్షన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసిన అనంతరం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెలి్పంగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ అధ్యక్షురాలు దవడ మీన, కార్యదర్శి స్రవంతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు పిళ్ళా విజయకుమార్, కాళ్ల గౌరీ శంకర్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్ స్థానిక సత్య కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఘోషాస్పత్రి, పూల్‌బాగ్‌లోని ద్వారకామయి అంధుల పాఠశాలలో రోగులకు, విద్యార్థులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అన్నదానంలో రాజన్నదొర సాలూరు పట్టణంలోని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర స్వగృహంలో కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీహెచ్సీలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సాలూరు పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అన్నదానం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్వి రమణరాజు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సతీమణి బెల్లాన శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్సార్ బీమా చెక్కులను లబి్ధదారులకు అందజేశారు. విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున చేరి సీఎం జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. డెంకాడలో దుప్పట్ల పంపిణీ నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడలో నిర్వహించిన సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా పేదలకు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు దుప్పట్లు పంపిణీ చేశారు. పూసపాటిరేగలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గజపతినగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య స్థానిక సామాజిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలోని దేవీ జంక్షన్లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో సహా పలువురు నాయకులు పూలమాలలువేసి నివాళులరి్పంచారు. అనంతరం ఎస్‌కోట ప్రభుత్వాస్పత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. గురుదేవా చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో వికలాంగులకు ట్రై సైకిళ్లు, కృత్రిమ పరికరాలను అందజేశారు. దిశ చట్టం తేవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎల్కోటలో క్షీరాభిõÙకం నిర్వహించారు. -
ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ/నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్ని శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి.. పలు చోట్ల రక్తదాన శిబిరాలు, సేవాకార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, రాష్ట్ర మంత్రులు, పలువురు ఉన్నతాధికారులు సీఎంకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు, అధికారుల శుభాకాంక్షలు ఉదయం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్‌ను అధికారుల సమక్షంలో సీఎం జగన్ కట్ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లంతో పాటు అధికారులు శామ్యూల్, ధనుంజయరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ తదితరులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పర్యటనకు వెళ్లే ముందు ముఖ్యమంత్రికి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పినిపే విశ్వరూప్, ఆదిమూలపు సురేష్, కొడాలి నాని, పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు శుభాకాంక్షలు తెలిపారు. ధర్మవరం పర్యటన ముగించుకుని వచ్చాక మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, పి.అనిల్‌కుమార్ యాదవ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లోక్‌సభ సభ్యులు వి.బాలశౌరి, నందిగం సురేష్ ముఖ్యమంత్రిని కలిసి అభినందనలు తెలిపారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో... తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకల్లో శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పాల్గొని కేక్ కట్ చేసి, దుప్పట్లు పంపిణీ చేశారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో గత ఆరు నెలలుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన చట్టాలు, తీసుకున్న నిర్ణయాలు దేశానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ రాష్ట్రానికి సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జ్ కొండమడుగుల సుధాకర్‌రెడ్డి, నాయకులు నాగదేశి రవికుమార్, నడికూడి సూరీరెడ్డి, నాగార్జున యాదవ్, జె శ్రీనివాసులరెడ్డి, షేక్ గౌస్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. డెహ్రాడూన్‌లో కేక్ కట్‌చేసిన స్పీకర్ తమ్మినేని ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్‌లో శనివారం జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు డెహ్రాడూన్ వెళ్లిన స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి అక్కడ ఓ హోటల్లో కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో గుజరాత్ స్పీకర్ రాజేంద్ర త్రివేది, గోవా స్పీకర్ రాజేష్ పట్నేకర్, ఢిల్లీ స్పీకర్ రామ్నివాస్ గోయెల్, హిమాచల్‌ప్రదేశ్ స్పీకర్ రాజీవ్ బిందాల్, ఉత్తరాఖండ్ లైజన్ ఆఫీసర్ కులదీప్ రాణా, కర్ణాటక, అసోం, గుజరాత్, గోవా అసెంబ్లీల కార్యదర్శులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ, గవర్నర్, కేంద్ర మంత్రుల శుభాకాంక్షలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్షు, ఆరోగ్యవంతమైన జీవితం కలిగి ఉండాలని ఆశిస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ రీట్వీట్ చేస్తూ... ‘నరేంద్రమోదీ గారూ! హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినందుకు నా కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ట్విటర్లో శుభాకాంక్షలు అందచేశారు.గవర్నర్‌కు కూడా జగన్ ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌లు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. కేంద్ర గణాంక, ప్లానింగ్ శాఖ మంత్రి రావ్ ఇందర్‌జిత్‌సింగ్, పశు సంవర్ధక శాఖ సహాయ మంత్రి ప్రతాప్సారంగి, రాజస్థాన్ గవర్నర్ కల్రాజ్ మిశ్రా, మేఘాలయ ముఖ్యమంత్రి సి.సంగ్మా , నాగాలాండ్ ఉప ముఖ్యమంత్రి యాంతుంగో పాఠన్, జార్ఖండ్ ఎంపీ అన్నపూర్ణ దేవి, కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా, రాష్ట్రీయ కామధేను ఆయోగ్ చైర్మన్ డాక్టర్ వల్లభ్ కథిరియా, ఇండియా టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ రజత్ శర్మ, తదితరులు ట్విటర్లో ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడు సీఎం, ప్రతిపక్ష నేత స్టాలిన్ శుభాకాంక్షలు వైఎస్ జగన్‌కు తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి, ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తూ సీఎం పళనిస్వామి లేఖ పంపగా.. ప్రతిపక్ష నేత స్టాలిన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజానేతగా వైఎస్ జగన్ ప్రజల గుండెల్లో ఉంటారు: పోసాని
-
‘ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్ ప్రతీ అడుగు’
-
సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్బంగా సేవాకార్యక్రమాలు
-
అందరినీ అశ్చర్యపరుస్తున్న సీఎం వైఎస్ జగన్ పాలన
-
నెల్లూరులో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
కుప్పంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
అనంతపురంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
గుడివాడలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
తిరుపతిలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
అమలపురంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
పెద్దపురంలో ఘనంగా సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజుల వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తమ స్వగృహంలో పార్టీ నాయకుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో పార్టీ నాయకుడు వెలుగోటి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ రుక్మిణీ దేవి, షర్మిలమ్మ జీసస్ ఛార్టిస్ లో అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి మండల ఇంచార్జి శివప్రకాశ్ రెడ్డి, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. రాజంపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం వరకు రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి దంపతులు పాదయాత్ర చేపట్టారు. అలాగే నందలూరు సౌమ్యనాధ స్వామి ఆలయంలో ఆకేపాటి అమరనాథ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేశారు. కమలాపురం : అనాధ శరణాలయంలోజిల్లా కార్యదర్శి సుమిత్రా రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అనాధ పిల్లలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పార్టీ పంచారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కడప : నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం నాయకుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్సీ సెల్ నేత త్యాగరాజు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. యువజన విభాగం నాయకుడు చల్లా రాజశేఖర్ నేతృత్వంలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్ల మధుసూదన్ రెడ్డి, సీ. రామచంద్రయ్య, డిసిసిబి చైర్మన్ తిరుపాల్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు హాజరైయ్యారు. ఒంటిమిట్ట ఏకశిలా గ్రాండ్ హోటల్ లో వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం,కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, నందకికిషార్ రెడ్డి, ఒబుల రెడ్డి నాగార్జున పాల్గొన్నారు. జమ్మలమడుగు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పులివెందుల : వేంపల్లిలో మాజీ జెడ్పీటీసీ షబ్బీర్ వలి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ 47 వ పుట్టినరోజు సందర్భంగా వేంపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 47 కేజీల భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్ ,పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవికుమార్ రెడ్డి మండల కన్వీనర్ చంద్రఓబుల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి షబ్బీర్ వలి, కార్యకర్తలు పాల్గొన్నారు. బద్వేలు : వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా వైఎస్సార్పీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలునిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి హాజరరైయ్యారు. రాయచోటి : నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండ్యం, గాలివీడు, రామపూరం, సంబేపల్లి లలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వెయ్యిమందితో రక్తదానం నిర్వహించారు. కాజీపేట : వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. -
ఏపీ భవన్లో సీఎం జగన్ జన్మదిన వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ భవన్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు పోతల ప్రసాద్, వైఎస్సార్సీపీ అభిమానులు కేక్ కట్ చేశారు. రూ. 25లకే ఉల్లిగడ్డలను అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని.. కార్యకర్తలు ఉల్లి గడ్డలను పంచిపెట్టారు. హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని కార్మికనగర్, శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వికలాంగులకు వీల్‌చైర్స్, అంధ విద్యార్థులకు పరికరాలు పంపిణీ చేశారు. సిద్ధిపేట : జిల్లాలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు అన్నబోయిన అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. -
‘ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్ ప్రతీ అడుగు’
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బీఆర్టీఎస్ రోడ్డులో కేక్ కట్ చేసి పేద పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆరునెలల పాలనలో సీఎం జగన్ పథకాలను వివరిస్తూ నిర్వహించిన ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని జై జగన్ అంటూ నినాదాలు హోరెత్తించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని, ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న గొప్ప నాయకుడని ప్రశంసించారు. అందరి సంక్షేమంతోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తున్న ముఖ్యమంత్రి అందరి అభిప్రాయాలు సేకరించాకే ఎక్స్పర్ట్ కమిటీ మూడు రాజధానులపై సిఫార్సు చేసిందని స్పష్టం చేశారు. అయిదేళ్లు ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన టీడీపీకి సీఎం జగన్‌ను విమర్శించే అర్హత లేదని మండిపడ్డారు. రాజకీయ దురుద్ధేశంతో టీడీపీ చేస్తున్న టీడీపీ కుట్రలను జనం గమనిస్తున్నారని, ప్రజాభీష్టం మేరకే సీఎం జగన్ ప్రతీ అడుగు ముందుకు వేస్తున్నారని పేర్కొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు
-
విశాఖలో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
-
సీఎం జగన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు