ఎవరేమన్నా.. జగన్‌ వెంటే జనం! | YS Jagan Mohan Reddy Birthday: A True Leader Who Brings People Together | Sakshi
Sakshi News home page

#HBDYSJagan: ఎవరేమన్నా.. జగన్‌ వెంటే జనం!

Published Sat, Dec 21 2024 7:03 AM | Last Updated on Sat, Dec 21 2024 7:03 AM

YS Jagan Mohan Reddy Birthday: A True Leader Who Brings People Together

అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చేతకాదు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ఏరకంగా చూసినా ఆయన జనం మనిషి. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలూ ఆయన చలించిపోతారు. జనాల కోసం ఎంతదూరమైన వెళ్తారు.  ఆ క్రమంలో.. ఎవరెన్ని రకాలుగా నిందించినా, ట్రోల్‌ చేసినా ఆయన అడుగులు ఆగిపోవు. 

ప్రజల సమస్యకు సత్వర పరిష్కారం కావాలన్నదే వైఎస్‌ జగన్‌ అభిమతం. సహాయం అందించే విషయంలోనూ ఆయనది అదే ధోరణి. సీఎంగా ఉన్న టైంలో వైఎస్‌ జగన్‌ ఎలాంటి కార్యక్రమానికి వెళ్లినా.. కచ్చితంగా ఎంతో కొంత మందికి సాయం అందేది. అలాగే ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వీలైనంత తొందరగా సాయం అందేది!. అయితే ఇప్పుడు సీఎంగా లేకున్నా కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.  బహుశా ఈ గుణమే.. జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకునేలా చేస్తోందేమో!.

జగన్‌ ఊరకనే జననేత అయిపోలేదు. ఇప్పటికీ ఫలానా చోటుకి.. ఆయన వస్తున్నారంటేనే జనం తండోపతండాలుగా వస్తారు. బడి ఈడు పిల్లల నుంచి పండు ముసలి అవ్వల దాకా.. చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే జగన్‌ను దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని.. షేక్‌హ్యాండ్‌ ఇవ్వాలని.. ఆయనతో ఓ ఫొటో దిగాలని ఆరాటపడుతుంటారు. అది ఎలాంటి సందర్భం అయినా సరే!. ఆ అభిమానాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేక అంతే ఒద్దికగా స్వీకరిస్తుంటారాయన. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే!.

ఇదీ చదవండి: ఇందుకుకదా జగన్‌ అంటే జనానికి ఇష్టం!

ఎవరైనా తనను కలవడంలో ఇబ్బంది పడడం ఆయన కంటపడితే.. దగ్గరికి పిలిపించుకుంటారు. లేదంటే స్వయంగా ఆయనే వాళ్ల దగ్గరకు వెళ్తారు. అదంతా ‘తరలించిన అభిమానం’ అని కొందరు తీసిపారేయొచ్చేమో!. కానీ, ‘తరలివచ్చిన అభిమానం’ అని నిరూపించిన సందర్భాలు కోకోల్లలు ఉన్నాయి కదా!. పైగా మీరంతా ‘నా వాళ్లు’ అని అన్నివర్గాలను ఉద్దేశించి ఆయన అంటుంటారు కదా!. పోనీ అలా చెప్పే లీడర్లు దేశంలో మైక్రోస్కోప్‌ పెట్టి వెతికినా కనిపించరు మరి.

జగన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను గమనిస్తే.. ఎలాంటి మాస్‌ లీడర్‌ ఇంతకాలం దానిని నిలబెట్టుకునేవారు కాదేమో!. తమ బాగోగుల కోసం జగన్‌ అంతలా ఆలోచిస్తారని జనం గుర్తించారు కాబట్టే ఆ అంతులేని అభిమానం. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన జనం మధ్య ఉండే మనిషే. ఇది బలమైన ముద్ర. ఎవరెన్ని రకాలుగా అనుకున్నా సరే ఇది అంగీకరించాల్సిన విషయం.  #HBDYSJagan

ఇదీ చదవండి: జగన్‌.. ఆ ఒక్కడు ఈయనే కదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement