Jananeta
-
ఎవరేమన్నా.. జగన్ వెంటే జనం!
అవసరాలకు అనుగుణంగా రాజకీయాలు చేయడం వైఎస్ జగన్మోహన్రెడ్డికి చేతకాదు. అధికారంలో ఉన్నా లేకున్నా.. ఏరకంగా చూసినా ఆయన జనం మనిషి. వాళ్లు ఇబ్బందుల్లో ఉన్నారంటే చాలూ ఆయన చలించిపోతారు. జనాల కోసం ఎంతదూరమైన వెళ్తారు. ఆ క్రమంలో.. ఎవరెన్ని రకాలుగా నిందించినా, ట్రోల్ చేసినా ఆయన అడుగులు ఆగిపోవు. ప్రజల సమస్యకు సత్వర పరిష్కారం కావాలన్నదే వైఎస్ జగన్ అభిమతం. సహాయం అందించే విషయంలోనూ ఆయనది అదే ధోరణి. సీఎంగా ఉన్న టైంలో వైఎస్ జగన్ ఎలాంటి కార్యక్రమానికి వెళ్లినా.. కచ్చితంగా ఎంతో కొంత మందికి సాయం అందేది. అలాగే ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు కూడా వీలైనంత తొందరగా సాయం అందేది!. అయితే ఇప్పుడు సీఎంగా లేకున్నా కూడా ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. బహుశా ఈ గుణమే.. జగన్మోహన్రెడ్డి ఎక్కడికెళ్లినా ప్రజాభిమానం కట్టలు తెంచుకునేలా చేస్తోందేమో!.జగన్ ఊరకనే జననేత అయిపోలేదు. ఇప్పటికీ ఫలానా చోటుకి.. ఆయన వస్తున్నారంటేనే జనం తండోపతండాలుగా వస్తారు. బడి ఈడు పిల్లల నుంచి పండు ముసలి అవ్వల దాకా.. చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరించే జగన్‌ను దగ్గరగా చూడాలని, వీలైతే ఆయన్ని కలవాలని.. షేక్‌హ్యాండ్ ఇవ్వాలని.. ఆయనతో ఓ ఫొటో దిగాలని ఆరాటపడుతుంటారు. అది ఎలాంటి సందర్భం అయినా సరే!. ఆ అభిమానాన్ని నిరుత్సాహపర్చడం ఇష్టంలేక అంతే ఒద్దికగా స్వీకరిస్తుంటారాయన. ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే!.ఇదీ చదవండి: ఇందుకుకదా జగన్ అంటే జనానికి ఇష్టం!ఎవరైనా తనను కలవడంలో ఇబ్బంది పడడం ఆయన కంటపడితే.. దగ్గరికి పిలిపించుకుంటారు. లేదంటే స్వయంగా ఆయనే వాళ్ల దగ్గరకు వెళ్తారు. అదంతా ‘తరలించిన అభిమానం’ అని కొందరు తీసిపారేయొచ్చేమో!. కానీ, ‘తరలివచ్చిన అభిమానం’ అని నిరూపించిన సందర్భాలు కోకోల్లలు ఉన్నాయి కదా!. పైగా మీరంతా ‘నా వాళ్లు’ అని అన్నివర్గాలను ఉద్దేశించి ఆయన అంటుంటారు కదా!. పోనీ అలా చెప్పే లీడర్లు దేశంలో మైక్రోస్కోప్ పెట్టి వెతికినా కనిపించరు మరి.జగన్‌కు ఉన్న ఫాలోయింగ్‌ను గమనిస్తే.. ఎలాంటి మాస్ లీడర్ ఇంతకాలం దానిని నిలబెట్టుకునేవారు కాదేమో!. తమ బాగోగుల కోసం జగన్ అంతలా ఆలోచిస్తారని జనం గుర్తించారు కాబట్టే ఆ అంతులేని అభిమానం. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ ఆయన జనం మధ్య ఉండే మనిషే. ఇది బలమైన ముద్ర. ఎవరెన్ని రకాలుగా అనుకున్నా సరే ఇది అంగీకరించాల్సిన విషయం. #HBDYSJaganఇదీ చదవండి: జగన్.. ఆ ఒక్కడు ఈయనే కదా! -
జగన్ కార్యాలయానికి పోటెత్తిన నేతలు, కార్యకర్తలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి మాట్లాడేందుకు నేతలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు గురువారం కూడా స్థానిక క్యాంపు కార్యాలయానికి పోటెత్తారు. ఓ వైపు రాజకీయ భేటీల్లో తీరిక లేకుండా ఉన్న జననేత మరో వైపు తన కోసం వచ్చిన వేలాది మందిని చిరునవ్వుతో పలకరించారు. ఇక నుంచి కార్యకర్తలను నిత్యం కలుసుకుంటానని ఆయన చేసిన ప్రకటన పత్రికల్లో ప్రముఖంగా రావడంతో వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో కార్యాలయానికి చేరుకున్నారు. వీరి రాకతో కార్యాలయ పరిసరాలు నూతన శోభను సంతరించుకున్నాయి. దాదాపు 3 గంటలకు పైగా జననేత వీరందరినీ ఓపిగ్గా పలకరించారు. దీంతో చాలా కాలం తర్వాత జగన్‌ను చూసిన కార్యకర్తలు, నేతలు ఆనందభరితులయ్యా రు. ఇదిలావుంటే, సాధారణ కార్యకర్తలు, నేతలతో పాటు గురువారం జగన్మోహన్రెడ్డిని కలిసిన వారిలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, బాలినేని శ్రీనివాసరెడ్డి, బి. గుర్నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, మద్దాలి రాజేష్‌కుమార్, ఆళ్లనాని, డీసీ గోవిందరెడ్డి, జలీల్‌ఖాన్, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, పార్టీ ఎస్సీ విభాగం కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ తదితరులు ఉన్నారు. ఇచ్ఛాపురం మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ భార్య, తన ఇద్దరు పిల్లలతో వచ్చి జననేతను కలిశారు. -
‘జననేత’ వెబ్సైట్ ఆవిష్కరణ
అత్యంత ప్రజాదరణ కలిగిన నాయుకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి సంబంధించి ఒక ప్రత్యేక వెబ్సైట్ ప్రారంభమైంది. వైఎస్ జగన్‌కి సంబంధించిన ప్రత్యేక వీడియోలు, పాటలు, డాక్యుమెంటరీలను పొందుపరుస్తూ jananeta.comపేరుతో పొన్నెకంటి శశికృష్ణ రూపొందించిన ఈ వెబ్‌సైట్‌ను ‘సాక్షి’ చైర్పర్సన్ వైఎస్ భారతి సోవువారం సాక్షి కార్యాలయుంలో ఆవిష్కరించారు. వైఎస్ జగన్ ప్రజా జీవితానికి సంబంధించిన ప్రత్యేక వీడియోలు ఇలా అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయువున్నారు.