భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 40 కోట్ల విలువైన బంగారం, 10 కోట్ల నగదు దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బంగారం దొరికిన కారును గ్వాలియర్‌కు చెందిన చేతన్ గౌర్‌కు చెందినది గుర్తించారు.
వివరాల ప్రకారం..భోపాల్ శివారులోని మెండోరి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన ఇన్నోవా వాహనం నుంచి సుమారు రూ.40 కోట్ల విలువైన 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ, ఆ రాష్ట్ర లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గురువారం రాత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో, అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతానికి 30 వాహనాల్లో 100 మంది పోలీసులు చేరుకుని ఇన్నోవాను చుట్టుముట్టారు.
అనంతరం.. ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో భారీ మొత్తంలో బంగారం, రూ.10కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక, వాహనం గ్వాలియర్ వాసి చేతన్ గౌర్‌కు చెందినదిగా గుర్తించారు. చేతన్ గౌర్.. ఆర్టీవో ఆఫీసులో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మకు అత్యంత సన్నిహితుడు. ఇక, ఈ బంగారం, నగదు ఎవరిదనే విషయమై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.
#WATCH | Madhya Pradesh | In a joint action by Bhopal Police and Income Tax, 52 kg of gold and bundles of money were found in an abandoned car in Bhopal during an IT raid. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area. Police and Income Tax are trying… pic.twitter.com/7KOoJ4AZBJ
— ANI (@ANI) December 20, 2024
అయితే, అక్రమ ఆస్తుల కేసుల్లో భోపాల్‌కు చెందిన మాజీ కానిస్టేబుల్ శర్మ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయన ఇళ్లపై అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఈ సోదాల్లో కోటి రూపాయలకు పైగా నగదు, కిలోన్నర బంగారం, వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించారు. ఆయనకు చెందిన 10 లాకర్లు, 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వివరాల పత్రాలను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజులుగా భోపాల్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన వ్యక్తులే టార్గెట్‌గా సోదాలు కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment