gold biscuits
-
అడవిలో ఇన్నోవా కారు.. గోల్డ్ బిస్కెట్స్, కరెన్సీ నోట్లు..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఉన్న అటవీ ప్రాంతంలో పార్క్ చేసిన కారులో 40 కోట్ల విలువైన బంగారం, 10 కోట్ల నగదు దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. బంగారం దొరికిన కారును గ్వాలియర్‌కు చెందిన చేతన్ గౌర్‌కు చెందినది గుర్తించారు.వివరాల ప్రకారం..భోపాల్ శివారులోని మెండోరి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన ఇన్నోవా వాహనం నుంచి సుమారు రూ.40 కోట్ల విలువైన 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదును ఆదాయపు పన్ను శాఖ, ఆ రాష్ట్ర లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అడవి గుండా బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గురువారం రాత్రి అధికారులకు సమాచారం అందింది. దీంతో, అధికారులు అలర్ట్ అయ్యారు. అటవీ ప్రాంతానికి 30 వాహనాల్లో 100 మంది పోలీసులు చేరుకుని ఇన్నోవాను చుట్టుముట్టారు.అనంతరం.. ఇన్నోవా వాహనాన్ని తనిఖీ చేయగా వాహనంలో భారీ మొత్తంలో బంగారం, రూ.10కోట్ల వరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక, వాహనం గ్వాలియర్ వాసి చేతన్ గౌర్‌కు చెందినదిగా గుర్తించారు. చేతన్ గౌర్.. ఆర్టీవో ఆఫీసులో మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మకు అత్యంత సన్నిహితుడు. ఇక, ఈ బంగారం, నగదు ఎవరిదనే విషయమై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు.. ఈ ఘటన రాష్ట్రంలోని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ సంస్థల మధ్య సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.#WATCH | Madhya Pradesh | In a joint action by Bhopal Police and Income Tax, 52 kg of gold and bundles of money were found in an abandoned car in Bhopal during an IT raid. The car was found abandoned in the jungle of Mendori in the Ratibad area. Police and Income Tax are trying… pic.twitter.com/7KOoJ4AZBJ— ANI (@ANI) December 20, 2024అయితే, అక్రమ ఆస్తుల కేసుల్లో భోపాల్‌కు చెందిన మాజీ కానిస్టేబుల్ శర్మ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కోవడంతో ఆయన ఇళ్లపై అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. ఈ సోదాల్లో కోటి రూపాయలకు పైగా నగదు, కిలోన్నర బంగారం, వజ్రాలు, వెండి కడ్డీలు, ఆస్తుల పత్రాలను అధికారులు గుర్తించారు. ఆయనకు చెందిన 10 లాకర్లు, 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసిన వివరాల పత్రాలను కూడా పోలీసులు కనుగొన్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు రోజులుగా భోపాల్‌లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు చెందిన వ్యక్తులే టార్గెట్‌గా సోదాలు కొనసాగుతున్నాయి. -
కడుపులో బంగారం మాయం.. భార్య ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి!
సాక్షి,చెన్నై: కస్టమ్స్ వర్గాల కళ్లుగప్పేందుకు కడుపులో దాచి పెట్టుకొచ్చిన బంగారం బిస్కెట్లలో ఒకటి మాయం అయ్యింది. సినీ ఫక్కీలో సాగిన ఈ అక్రమ రవాణాలో ఓ యువకుడిని స్మగ్లర్లు కిడ్నాప్ చేశారు. ఆ బిస్కెట్ కోసం చిత్ర హింసలు పెట్టారు. చివరికి ముంబై పోలీసులు రంగంలోకి దిగి, ఆయువకుడిని రక్షించారు. ఆదివారం తిరువారూర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు.. తిరువారూర్‌కు చెందిన హిజాబ్ చెన్నైలో సెల్ ఫోన్ దుకాణం నడుపుతున్నాడు. మిత్రుడు ఔరంగ జేబ్ ద్వారా ముంబై నుంచి చెన్నైకు బంగారం అక్రమంగా తెప్పించుకుంటూ వచ్చాడు. చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్,నిఘా వర్గాల కళ్లు గప్పేందుకు సినీ ఫక్కీలో ఔరంగ జేబు మనుషులు చిన్న చిన్న బంగారం బిస్కెట్లను మింగేసే వారు. చెన్నైకు వచ్చినానంతరం కడుపు శుభ్రం చేయించే మాత్రల ద్వారా వాటిని బయటకు తీసేవారు. ఈ పరిస్థితుల్లో ముంబైకు చెందిన శంకర్ ద్వారా 2 రోజుల క్రితం చెన్నైకు ఇదే తరహాలో బంగారం తీసుకొచ్చారు. అయితే, తీసుకొచ్చిన బంగారంలో ఓ బిస్కెట్ మాయం కావడంతో శంకర్‌ను ఔరంగ జేబు, హిజాబ్, వారి అనుచరుడు విజయ్ కలిసి కిడ్నాప్ చేశారు. తిరువారూర్‌కు తీసుకెళ్లి చిత్ర హింసలు పెట్టారు. కారైక్కాల్‌లోని ఓ స్కాన్ సెంటర్‌కు తీసుకెళ్లి పరిశోధించారు. అయితే, ఆ బంగారం బిస్కెట్ ఏమైందని శంకర్‌ను తీవ్రంగా వేధిస్తున్న నేపథ్యంలో ఆదివారం ఉదయాన్నే ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. భార్య ఫిర్యాదుతో.. ముంబైలో ఉన్న శంకర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో బంగారం అక్రమ రవాణా గుట్టు వెలుగులోకి వచ్చింది. గత కొంతకాలంగా సాగుతున్న ఈ వ్యహారాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్న ముంబై పోలీసులు స్మగ్లర్ల కోసం చెన్నైకు వచ్చారు. ఇక్కడి పోలీసు సాయంతో శంకర్ సెల్ ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. తిరువారూర్‌లో శంకర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో కిడ్నాపర్ల చెర నుంచి అతడిని రక్షించి, ఆస్పత్రికి తరలించారు. ఔరంగ జేబు, విజయ్ను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నా రు. పరారీలో ఉన్న హిజాబ్ కోసం గాలిస్తున్నారు. చదవండి: ఊర్లో ఆడవాళ్లు, మగవాళ్లు నామీద ఇంత పగతో ఉన్నారా? -
బిస్కెట్లుగా దేవుడి నగలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ముఖ్య దేవాలయాల్లో మూలుగుతున్న బంగారు, వెండి ఆభరణాలు, వస్తువుల మూటలకు మోక్షం కలగనుంది. బంగారం బిస్కెట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా లాకర్ల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు వడ్డీ రూపంలో ఆదాయం సమకూర్చుకునే దిశగా దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. తెలంగాణలోనే ప్రధాన దేవాలయం వేములవాడ.. భక్తుల కొంగుబంగారం. అందుకు తగ్గట్టుగానే అక్కడికి వచ్చే భక్తులు విలువైన కానుకలు సమర్పిస్తుంటారు. ఇందులో పెద్దమొత్తంలో బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు కూడా ఉంటాయి. అయితే స్వామికి అలంకరించే ఆభరణాలు పోను మిగతావి పదుల సంఖ్యలో మూటల్లో నింపి లాకర్లలో పడేశారు. రాష్ట్రంలోని భద్రాచలం, బాసర, కొండగట్టు, యాదగిరిగుట్ట, కొమురవెల్లి, ధర్మపురి, వరంగల్ భద్రకాళి, ఉజ్జయినీ మహంకాళి.. ఇలా ముఖ్య దేవాలయాలన్నిటిలో ఇదే పరిస్థితి. భద్రాచలం దేవాలయంలో ఉత్సవాల సమయంలో ఎక్కువ నగలను దేవతా మూర్తులకు అలంకరిస్తున్నారు. యాదగిరిగుట్టలో దేవాలయ పునర్నిర్మాణం నేపథ్యంలో బంగారాన్ని కరిగించి ఆలయానికే వినియోగిస్తున్నారు. కానీ మిగతా దేవాలయాల్లో ఆభరణాలు, వస్తువులు, తుసుర్ల రూపంలో ఉన్న వెండి, బంగారం ఎన్నో ఏళ్లుగా లాకర్లలో మూలుగుతున్నాయి. అయితే ఇప్పుడవి బంగారం బిస్కెట్లలా మారనున్నాయి. తర్వాత అవి స్టేట్ బ్యాంకు అధీనంలోకి వెళ్లడం ద్వారా వడ్డీ రూపంలో దేవాదాయ శాఖకు పెద్దమొత్తంలో ఆదాయం సమకూరనుంది. గోల్డ్ మానిటైజేషన్ పథకం కింద.. బంగారాన్ని డిపాజిట్ చేసే పని ఇప్పటికే మొదలు కాగా, తాజాగా వేల కిలోల వెండి.. దాని విలువకు తగ్గ బంగారం బిస్కెట్లుగా మారనుంది. వెండిని కరిగించి దానికి బదులుగా స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో ఇచ్చేందుకు మింట్ అంగీకరించింది. మొత్తం బంగారాన్ని గోల్డ్ మానిటైజేషన్ పథకంలో డిపాజిట్ చేయటం ద్వారా సాలీనా రూ.2.5 కోట్ల వడ్డీ దేవాదాయ శాఖకు అందుతుందని సమాచారం. ఇంతకాలం ఆ వెండి, బంగారాన్ని బ్యాంకు లాకర్లలో భద్రపరిచినందుకు లాకర్ అద్దె, కొన్నింటికి బీమా చేయించినందుకు ప్రీమియం రూపంలో లక్షలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఆ ఖర్చు మిగలనుంది. వేములవాడ ఆలయంతో మొదలు.. దేవాదాయ శాఖ ఆధీనంలోని ఆలయాల్లో వినియోగంలో లేని బంగారం దాదాపు 425 కిలోలు ఉంది. అలాగే 18 వేల కిలోల వెండి లాకర్లలో మూలుగుతోంది. నిజానికి ఆలయాల్లో 38 వేల కిలోల వెండి ఆభరణాలు, వస్తువులున్నాయి. కానీ అందులో సగానికంటే కాస్త ఎక్కువ మాత్రమే వినియోగంలో ఉండగా మిగతావి లాకర్లలోనే ఉంటోంది. అయితే ప్రస్తుతం దేవాలయాల్లో ఉత్సవాల నిర్వహణకు కూడా నిధులు సరిపోక ఇబ్బందులు ఏర్పడుతున్న నేపథ్యంలో, ఆదాయాన్ని పెంచుకునే కసరత్తులో భాగంగా బంగారం, వెండి వస్తువులను స్టేట్ బ్యాంకు గోల్డ్ మానిటైజేషన్ స్కీంలో భాగంగా డిపాజిట్ చేయాలని ఇటీవల నిర్ణయించారు. ఆ మేరకు వినియోగంలో లేని బంగారాన్ని మెటల్స్ అండ్ మినరల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎంటీసీ) ఆధ్వర్యంలో కరిగించి బిస్కెట్లుగా మార్చే కసరత్తు ప్రారంభమయ్యింది. ఇటీవలే కొంత బంగారాన్ని స్టేట్ బ్యాంకుకు అప్పగించారు. దాదాపు 70 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేయనున్నారు. మింట్ అధికారులతో చర్చ తాజా సమాచారం ప్రకారం.. బంగారాన్ని నేరుగా స్టేట్‌బ్యాంకే ఎంఎంటీసీలో కరిగిస్తుంది. అక్కడ 95 శాతం ప్యూరిటీ స్థాయికి తెప్పించి దాన్ని బిస్కట్లుగా మారుస్తారు. వెండి విషయంలో మాత్రం ఇటీవల మింట్ యంత్రాంగంతో దేవాదాయ శాఖ అధికారులు చర్చించారు. వెండిని కరిగించి పూర్తి స్వచ్ఛమైన వెండిలా మార్చి.. అప్పటి బులియన్ ధరల ప్రకారం దాని విలువను బంగారంతో లెక్కగట్టి.. అంత విలువైన 24 క్యారెట్ల బంగారాన్ని బిస్కట్ల రూపంలో దేవాదాయ శాఖకు అందించేందుకు మింట్ అంగీకరించినట్టు తెలిసింది. దీంతో ప్రస్తుతం దేవాదాయ శాఖ ఆధీనంలోని దేవాలయాల్లో నిరుపయోగంగా ఉన్న 18 వేల కిలోల వెండిని మింట్‌కు అప్పగించనున్నారు. తొలుత వేములవాడ దేవాలయం వెండిని బిస్కెట్లుగా మార్చే పనికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ దేవాలయంలోని 800 కిలోల వెండికి బదులుగా మింట్ నుంచి దాదాపు 8 కిలోల బంగారు బిస్కెట్లు సమకూరుతాయని అంచనా. అలా అన్ని దేవాలయాల్లోని వెండి ద్వారా దాదాపు 180 కిలోల వరకు బంగారం సమకూరుతుందని భావిస్తున్నారు. అంటే వంద కిలోల వెండికి కిలో బంగారం వస్తుందన్నమాట. -
Chirala: చీరాలలో బంగారం నల్ల వ్యాపారం
ప్రకాశం జిల్లా చీరాల కేంద్రంగా గోల్డ్ బిస్కెట్ల అక్రమ వ్యాపారం మాయా బజారును తలపించే రీతిలో జోరుగా సాగుతోంది. సౌదీలోని ఖతర్ నుంచి వాయు, జలమార్గాల ద్వారా కస్టమ్స్ కళ్లుగప్పి దేశానికి బంగారం వస్తోంది. అక్రమార్కుల ద్వారా దర్జాగా చీరాల చేరుతోంది. పసిడి ధరలు పైపైకి ఎగబాకుతున్న నేపథ్యంలో ఈ చీకటి వ్యాపారం ఊపందుకుంది. తక్కువ ధరకే వస్తుండడం వ్యాపారులకు లాభసాటిగా మారింది. సుంకాలు ఎగ్గొట్టడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. మరో వైపు తక్కువకే బంగారం ఇస్తామనే కేటుగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. చీరాల: వస్త్ర వ్యాపారానికి పేరుగాంచిన చీరాలకు మినీ ముంబయిగా పేరుంది. తాజాగా బంగారం జీరో దందా వ్యాపారం విస్తరిస్తోంది. కొందరు సుంకాలు ఎగ్గొట్టి తక్కువ ధరకు బంగారాన్ని వర్తకులకు విక్రయిస్తుంటే.. మరి కొందరు ఈ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ వ్యాపారాన్ని కొందరు ఏజెంట్ల ద్వారా నిర్వహిస్తున్నట్లు సమాచారం. బంగారం తీసుకురావాలంటే కస్టమ్స్, జీఎస్టీ పన్నులు 17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అవి చెల్లించకుండా ఎంతో కొంత ముట్టచెప్పి తీసుకొస్తున్నామని, అందువల్లే చౌకగా బంగారం దొరుకుతుందని వ్యాపారాన్ని సాగిస్తున్నారు. సౌదీ నుంచే స్మగ్లింగ్ బంగారు గనులు విస్తారంగా ఉన్న సౌదీలోని ఖతర్ నుంచి స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్, అక్కడి నుంచి విశాఖపట్నం, చెన్నైకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. అలా తెచ్చిన బంగారాన్ని ఏజెంట్ల ద్వారా చీరాల, తెనాలి, నెల్లూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎటువంటి లెక్కా పత్రాలు లేకుండా తక్కువ ధరకు లభిస్తుండడంతో వ్యాపారులు కూడా మొగ్గు చూపుతున్నారు. చీరాల ప్రాంతంలో ఎక్కువగా వస్త్ర వ్యాపారంతో పాటు బంగారం వ్యాపారం సాగుతోంది. ఇక్కడ బంగారం దుకాణాలు ఎక్కువగా ఉండటంతో పాటు ఆభరణాల తయారీ కూడా జరుగుతోంది. ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి జీఎస్టీ బిల్లు కాకుండా ఎస్టిమేషన్ బిల్లులే ఇవ్వడం విశేషం. అందుకే అక్రమార్కులు చీరాల ప్రాంతాన్ని ఎంచుకున్నారు. 17 శాతం పన్నుల్లో సుమారు 5 నుంచి 7 శాతం తక్కువ ధరకే బిస్కెట్లు దొరకడంతో చీరాల, తెనాలిలోని బంగారం వ్యాపారులతో పాటు అనధికారికంగా కొందరు వ్యక్తులు కొనుగోలు చేసి క్రయవిక్రయాలు సాగిస్తున్నారు. చీరాలలో 75 వరకు, తెనాలి ప్రాంతంలో 200కుపైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. కస్టమ్స్‌లో ఉద్యోగమని.. చీరాలకు చెందిన పి.రవితేజ బీటెక్ పూర్తి చేశాడు. అనంతరం వ్యాపారం చేయాలనే ఆలోచనతో 2017 నుంచి చిట్టీల వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2020లో తెనాలిలో బులియన్ మార్కెట్లో మదన్ అనే బంగారం వ్యాపారితో పరిచయం ఏర్పడింది. వీరి ద్వారా చీరాలలోని పలు బంగారం దుకాణాలతో పాటు కొందరు వ్యక్తులకు మార్కెట్ ధర కంటే 5 నుంచి 10 శాతం తక్కువకు ఇవ్వడం మొదలు పెట్టాడు. చీరాల చుట్టు పక్కల బంగారు వ్యాపారులతో పాటు తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసే మరి కొందరిని ఆకర్షించాడు. చాలా కాలంగా తాను కస్టమ్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలికాడు. కస్టమ్స్ డ్యూటీతో పాటు జీఎస్టీ లేకుండా బంగారం తెచ్చి అమ్ముతున్నట్లు చెప్పుకొచ్చాడు. కొంత కాలం ఈ వ్యాపారం సజావుగా సాగింది. ఈ మార్గంలో అయితే భారీగా సంపాదించలేననుకున్నాడో ఏమోగానీ, 700 బిస్కెట్లకు (ఒక్కో బిస్కెట్ 100 గ్రా.) అడ్వాన్సుగా పలువురు వర్తకుల వద్ద డబ్బు తీసుకున్నాడు. చివరికి వారికి బంగారం ఇవ్వకపోగా ఇచ్చిన అడ్వాన్సును స్వాహా చేశాడు. మోసపోయామని గ్రహించిన వ్యాపారులు, ఇతర వ్యక్తులు చీరాల వన్‌టౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటి వరకు వ్యాపారుల వద్ద నుంచి రూ.3.50 కోట్లకుపైగా నగదు తీసుకుని అతని జల్సాలకు వాడుకున్నట్లు విచారణలో తేలింది. అయితే అందులో బయటపడని వ్యాపారులు చాలా మంది ఉన్నట్లు సమాచారం. తమ అక్రమ వ్యాపారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే వారంతా మౌనం దాల్చారు. మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. బంగారం వ్యవహారంపై దృష్టి సారిస్తున్నాం తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పే కేటుగాళ్లపై దృష్టి సారించాం. ఈ వ్యవహారం మొత్తాన్ని గమనిస్తున్నాం. ఇప్పటికే ఒక ఏజెంట్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద రూ.24 లక్షల నగదు, కొంత బంగారం రికవరీ చేశాం. బంగారం వ్యాపారులు కూడా కేటుగాళ్ల మాయమాటలు వినిమోసపోవద్దు. నిబంధనల ప్రకారమే వ్యాపారం చేయాలి. లేకుంటే చర్యలు తప్పవు. – పి.శ్రీకాంత్, డీఎస్పీ, చీరాల మాఫియా మధ్య విభేదాలతో బయటకు.. కొంత కాలంగా జోరుగా సాగుతున్న బంగారం అక్రమ వ్యాపారం ఆ మాఫియాలోని సభ్యుల మధ్య విభేదాలతో బయట పడింది. చివరకు పోలీసుల వరకు వెళ్లింది. చౌక బంగారం వ్యవహారంలో మొత్తం రూ.3.50 కోట్ల విలువైన 700 బిస్కెట్లు క్రయవిక్రయాలు జరిగాయనేది భోగట్టా. అయితే, తక్కువ ధరకు బంగారం వస్తుందని నమ్మడంతో పలువురు వ్యాపారులు కూడా జతకలిశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్న వారి మధ్య విభేదాలు రావడంతో బయటకు పొక్కింది. చివరకు భాగస్వాములకు కూడా ఇది అసలు బంగారమేనా అనే అనుమానాలు రావడంతో కీలక వ్యక్తిని నిలదీశారు. లావాదేవీలు, రసీదుల విషయంలో విభేదాలు రావడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఏజెంట్ రవితేజ అడ్వాన్సుగా కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి బంగారం ఇవ్వకపోవడంతో పోలీసులను బాధితులు ఆశ్రయించారు. వెలుగులోకి రాని ఉదంతాలు కూడా ఎన్నో ఉన్నాయి. తక్కువ ధరకే బంగారం వస్తోందన్న ఆశల ఊబిలో పడి చాలా మంది ఈ దందాలో ఇరుక్కుపోయి నష్టపోతున్నారు. వారంతా చెల్లించిన నగదు బ్లాక్‌మనీ కావడంతో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కేటుగాళ్లకు అదే ఆసరా అయింది. తీసుకున్న డబ్బుకు ఎటువంటి పత్రాలు లేకపోవడంతో బంగారం వ్యాపారులను వలలో వేసుకుని దర్జాగా మోసం చేస్తున్నారు. -
బంగారంతో పెట్టుబడి.. సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న, భక్తులు కానుకల ద్వారా సమర్పించిన బంగారాన్ని కరిగించి బిస్కెట్లుగా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసి తద్వారా కొత్తగా పెట్టుబడిని సమకూర్చుకోవాలని నిర్ణయించింది. ఈమేరకు నూతన కార్యక్రమానికి బుధవారం సీఎం ఎంకే స్టాలిన్ శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో 35 వేల వరకు ఆలయాలు దేవదాయశాఖ పరిధిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ఆలయాల పరిరక్షణ, విగ్రహాలు, ఆభరణాల భద్ర త, అన్యాక్రాంతమైన ఆస్తుల స్వాధీనం దిశగా డీఎంకే ప్రభుత్వం చర్యలను వేగవంతం చేయడం విధితమే. ఇందులో భాగంగా వేలాది ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని కరిగించి 24 క్యారెట్ల బిస్కెట్లుగా మార్చాలని నిర్ణయించింది. చదవండి: (ఇకపై ట్రాఫిక్ ఆపొద్దు.. ప్రజల వాహనాలతో కలిసే..) 2,137 కేజీల బంగారం 1980 నుంచి పలు ఆలయాల్లోని 479 కేజీల బంగారాన్ని బిస్కెట్లుగా గతంలో పాలకులు మార్చారు. ఇక మిగిలిన ఆలయాల్లో 2,137 కేజీల బంగారం వరకూ ప్రస్తుతం ఉన్నట్లు ఇటీవలి పరిశీలనలో వెలుగు చూసింది. దీంతో ఈ బంగారాన్నంతా కరిగించి స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లుగా మార్చేందుకు రెడీ అయ్యారు. ఈ మేరకు కొత్త కార్య క్రమానికి సీఎం స్టాలిన్ బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ పథకంలో భాగంగా తొలి విడతగా తిరుచ్చి సమయపురం మారియమ్మన్, తిరువేర్కాడు దేవీ కరుమారియమ్మన్, విరుదునగర్ ఇమక్కంకుడి మారియమ్మన్ ఆలయాల్లో నిరుపయోగంగా ఉన్న, భక్తులు సమర్పించిన కానుకల రూపంలో వచ్చిన బంగారాన్ని కరిగించేందుకు చర్యలు తీసుకున్నారు. బిస్కెట్లుగా మార్చిన తరువాత ఈ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేయనున్నారు. తద్వారా కొత్త మార్గంలో ప్రభుత్వానికి పెట్టుబడులు వచ్చేందుకు చర్యలు చేపట్టనున్నారు. దశల వారీగా అన్ని ఆలయాల్లోని బంగారం కరిగించి బిసెట్లుగా మార్చే విధంగా దేవదాయ శాఖ చర్యలు వేగవంతం చేసింది. కాగా ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను.. ఈప్రక్రియను నిఘా నీడలో పకడ్బందీగా చేపడుతున్నారు. కాగా కార్యక్రమం ప్రారంభోత్సవంలో దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు పాల్గొన్నారు. -
5 కోట్ల కరెన్సీ నోట్లు.. కిలోల కొద్దీ బంగారు, వెండితో అమ్మవారి అలంకరణ
నెల్లూరు(బృందావనం): కోట్ల రూపాయల కొత్త కరెన్సీ రెపరెపల తోరణాలు.. కిలోల కొద్ది బంగారు, వెండి బిస్కెట్లు.. విద్యుద్దీప కాంతుల నడుమ సింహపురి సీమలో ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నుడా చైర్మన్, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ముక్కాల ద్వారకానాథ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ఆర్యవైశ్య సంఘీయులు, భక్తుల సహకారంతో ఐదోరోజు సోమవారం శ్రీవాసవికన్యకాపరమేశ్వరి అమ్మవారిని, ఆలయాన్ని రూ.ఐదు కోట్ల రూపాయల కొత్త కరెన్సీ నోట్లు, రూ.3.5కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు బిస్కెట్లు, రూ.3.5 కోట్ల విలువైన 60 కిలోల వెండిబిస్కెట్లు, ఆభరణాలతో అలంకరించారు. (చదవండి: ఏపీపీఎస్సీలో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలు) ఇందుకోసం మహబూబునగర్ జిల్లా బందరుకు చెందిన వేమూరిచంద్రశేఖర్ నేతృత్వంలో 120 మంది నిపుణులు పనిచేసి అమ్మణ్ణి ఆలయానికి మరింత శోభను సంతరింపజేశారని ముక్కాల ద్వారకానాథ్ వివరించారు. ఈ సందర్భంగా కన్యకాపరమేశ్వరి అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులుతీరారు. (చదవండి: కర్రల సమరం: ‘గట్టు’ మీద ఒట్టు! ) -
జోరుగా బంగారం బిస్కెట్ల దందా.. తక్కువ ధరకు అంటగట్టి..
సాక్షి, చెన్నూర్(ఆదిలాబాద్): నాణ్యమైన బంగారానికి చెన్నూర్ పేట్టింది పేరు. ఇక్కడ నాణ్యమైన బంగారం లభిస్తుందనే నమ్మకంతో మంచిర్యాల జిల్లా వాసులే కాక పక్కనే ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారంతా చెన్నూర్‌లోనే బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీంతో చెన్నూర్ పట్టణంలో శుభకార్యాల సమయంలో నెలకు కోట్లాది రూపాయల బంగారం వ్యాపారం సాగుతుంది. కొనుగోలుదారుల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు అక్రమ బంగారు బిస్కెట్ల తయారీకి తెరతీశారు. అసలు బంగారాన్ని పోలిన రెండో రకం బంగారం బిస్కెట్లు తయారీ చేసి తక్కువ ధరకు విక్రయిస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధనార్జనే ధ్యేయంగా.. ధనార్జనే ధ్యేయంగా కొనుగోలుదారుల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు బంగారం బిస్కెట్ల తయారీకి పూనుకున్నారు. గత 10 ఏళ్లుగా కొనుగోలు చేసిన పాత బంగారం కరిగించి బిస్కెట్ల రూపంలో తయారీ చేస్తున్నారు. దీనిని అసలు బంగారం ధర కంటే రూ.వెయ్యి నుంచి రెండు వేలు తక్కువకు విక్రయించి కొందరు స్వర్ణకారులు సోమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. తక్కువ ధరకు బంగారు బిస్కెట్లను విక్రయిస్తుండటంతో స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారు. దీనినే అసలు బంగారంగా అంటగట్టి కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. సీపీకి ఫిర్యాదు చేసిన స్వర్ణకారుల సంఘం... చెన్నూర్ పట్టణంలో కొందరు బంగారం వ్యాపారులు తానాజీ తేజ్ బట్టిలో పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన సోమ్నాధ్ చౌహాన్ అనే వ్యక్తి పాత బంగారం కరిగించి బిస్కెట్లు తయారీ చేసి అసలు బంగారం మాదిరిగా ముద్రలు వేస్తున్నారని ఈనెల 24న స్వర్ణకారుల సంఘం నాయకులు రామగుండం సీపీ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీపీ దీనిపై విచారణ జరపాలని జైపూర్ ఏసీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అసలు బంగారం బిస్కెట్లు ఇలా... అసలు బంగారం బిస్కెట్లపై మూడు రకాల ముద్రాలు ఉంటాయి. కొన్ని బంగారం బిస్కెట్లపై 999.0 ముద్రించి ఉండడంతోపాటు కింద కంప్యూటర్ బార్కోడ్ ఉంటుంది. ఇక రెండో రకం 916 కేడీఏం, 85 కేడీఏం అనే ముద్రలతో పాటు హాల్‌మార్క్ ఉంటుంది. చెన్నూర్ పట్టణానికి చెందిన బంగారం వ్యాపారులు అసలు బంగారం బిస్కెట్లపై ఉండే కంప్యూటర్ హాల్‌మార్క్‌లను కరిగించిన పాత బంగారం బిస్కెట్లపై ముద్రించి మార్కెట్ ధర ఆధారంగా విక్రయాలు జరిపి ఒకపక్క ప్రభుత్వాన్ని, మరో పక్క కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారం చెన్నూర్, మంచిర్యాలతో పాటు గోదావరిఖని పట్టణాలు కేంద్రంగా సాగుతున్నట్లు తెలిసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు నిబంధనలకు విరుద్ధంగా బంగారం బిస్కెట్ల రూపంలో తయారు చేసి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. బిస్కెట్ బంగారం తయారు చేస్తున్నట్లు మాకు ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్‌కుమార్, సీఐ, చెన్నూర్ -
కారులో 260 బంగారు బిస్కెట్లు.. తీయడానికి 18 గంటలు
మణిపూర్: దేశంలో ఓ వైపు కరోనా వైరస్ వల్ల ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. దీంతో చాలా రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. కానీ ఇవేవి అక్రమార్కులను అడ్డుకోలేక పోతున్నాయి. తాజాగా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో రూ.21 కోట్ల విలువైన 43 కిలోల బంగారు బిస్కెట్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్న కారుని పోలీస్ అధికారులు మంగళవారం తనిఖీ చేయడానికి నిలిపారు. అయితే వారిని ప్రశ్నించిన తర్వాత అనుమానం రావడంతో.. కారులో క్షుణ్ణంగా తనఖీలు చేశారు. కారులోని వేరు వేరు ప్రదేశాల్లో బంగారు బిస్కెట్లు దాచినట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కారులో వివిధ చోట్ల దాచిన 260 విదేశీ బంగారు బిస్కెట్లను బయటకు తీయడానికి అధికారులకు 18 గంటల సమయం పట్టింది. గతంలో కూడా ఇదే వాహనాన్ని అక్రమ రవాణాలకు ఉపయోగించినట్లు అధికారులు తెలిపారు. ఇక గత మూడు నెలల్లో గౌహతి జోనల్ యూనిట్ మయన్మార్ సెక్టార్ నుంచి రూ. 33 కోట్లకు పైగా విలువైన 67 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తంలో కేవలం జూన్‌లోనే 55 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కాగా ఇండియా, మయన్మార్ సరిహద్దు మీదుగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరింత కట్టుదిట్టమైన తనిఖీ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: 123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు? -
కడలిలో విసిరేసారు.. అధికారులు పట్టేశారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: శ్రీలంక నుంచి తమిళనాడుకు రహస్యంగా రవాణా అవుతున్న 15 కిలోల బంగారు కడ్డీలను తనిఖీలకు భయపడి కడలిలో విసిరేయడం, వాటిని వెలికితీసిన సంఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. శ్రీలంక నుంచి తమిళనాడుకు భారీ ఎత్తున బంగారు రవాణా జరుగుతున్నట్లు తూత్తుకూడి డైరెక్టర్ ఆఫ్ రెవె న్యూ ఇంటెలిజెన్స్ అధికారులకు మంగళవారం స మాచారం వచ్చింది. రామనాథపురం జిల్లా మండ పం సముద్రతీర ప్రాంతాల్లో కోస్ట్‌గార్డు సిబ్బంది తో కలిసి నిఘాపెట్టారు. శ్రీలంక–భారత్ సరిహద్దులో బుధవారం ఉదయం ఒక నాటుపడవ వస్తుండడాన్ని గమనించి అడ్డుకుని తనిఖీలు చేపట్టగా అందులో ఏమీ లేదు. నాటుపడవలో వచ్చిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తాము తీసుకొచ్చిన 15 కిలోల బంగారు కడ్డీలను నడిసముద్రంలో విసిరేసినట్లు అంగీకరించారు. నిందితులను వెంటపెట్టుకుని వెంటనే రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డు సిబ్బంది కడలి గర్భంలోకి వెళ్లి ఐదు ప్యాకెట్లలో భద్రం చేసిన బంగారు బిస్కెట్ల సంచిని బయటకు తీశారు. మార్కెట్ ధర ప్రకారం ఈ బంగారు విలువ రూ.6.30 కోట్లని అధికారులు తెలిపారు. -
అవినీతికి తాతలాంటోడు..!
బీజింగ్: చైనాలో అతడో ఉన్నతాధికారి. కమ్యూనిస్టు పార్టీ నేత.. అతడి అవినీతికి అంతే లేకుండా పోయింది. ఇటీవల జరిపిన అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడుల్లో కళ్లు బైర్లు కమ్మేలా ఆ అధికారి సంపాదన బయటపడింది. ఇంతకీ ఆ అవినీతి సొమ్ము ఎంతో తెలుసా.. రూ.4,500 కోట్ల విలువైన 13.5 టన్నుల బంగారం, రూ.2.65 లక్షల కోట్లు.. మన దేశంలోని రెండు చిన్నపాటి రాష్ట్రాల ఏడాది బడ్జెట్ మొత్తం ఇది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం చైనాలోనే అత్యంత సంపన్నుడైన జాక్‌మా సంపాదన కన్నా అధికం. హైనన్ ప్రావిన్స్‌లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న జాంగ్ కీ (58) ఇంట్లో ఇటీవల అధికారులు సోదాలు జరపగా.. టన్నుల కొద్దీ బంగారం బిస్కెట్లు కుప్పలు తెప్పలుగా దొరికాయి. ఇతడి బ్యాంకు ఖాతాలో దాదాపు రూ.2.65 లక్షల కోట్ల అవినీతి సొమ్మును గుర్తించారు. ఇవే కాకుండా లంచం కింద విలాసవంతమైన విల్లాలను పలువురి నుంచి భారీగా తీసుకున్నట్లు తెలిసింది. బంగారాన్ని వ్యక్తి లెక్కిస్తున్న ఓ వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోపై చైనాలో నిషేధం విధించారు. తూర్పు చైనాలో పుట్టిన జాంగ్.. 1983లో కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. హైవాన్ ప్రావిన్స్‌లోని సాన్యా సిటీ డిప్యూటీ మేయర్‌గా, డాంగ్జో సిటీ మేయర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ హైకో సిటీ సెక్రటరీగా కూడా పనిచేశాడు. 2012లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక అవినీతికి వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకొచ్చారు. గత ఏడేళ్లుగా భారీగా అవినీతికి పాల్పడిన దాదాపు 53 మంది అధికారులు పట్టుబడ్డారు. ఈ ఏడాదిలో జాంగ్‌తో పాటు 17 మంది అవినీతి తిమింగలాలు చిక్కాయి. -
ముళ్ల పొదల్లో రూ.కోటి బంగారం స్వాధీనం
తమిళనాడు, అన్నానగర్: పారైయారు సమీపంలో గురువారం ముళ్ల పొదల్లో దాచి ఉంచిన రూ.కోటి విలువైన బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎస్ఐతో సహా ముగ్గురు పోలీసులను అధికారులు శుక్రవారం ఆకస్మిక బదిలీ చేశారు. పుదుచ్చేరి జిల్లా కారైక్కాల్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలకు పారైయారు మార్గంగా సారా, మద్యం బాటిళ్లు అక్రమంగా తరలిస్తుంటారు. దీన్ని అరికట్టేందుకు నండలారు ప్రాంతంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసి, ఆ మార్గంలో వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపుతున్నారు. అలాగే గురువారం పారైయారు సబ్ ఇన్స్పెక్టర్ నటరాజన్ ఆధ్వర్యంలో నాగై జిల్లా మద్యం నిషేధ పోలీసులు చెక్‌పోస్టులో వాహన తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో అక్కడున్న ముళ్లపొదల్లో ఓ బ్యాగ్ పడి ఉంది. పోలీసులు ఆ బ్యాగ్‌ను తీసి చూడగా అందులో 26 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తెలిసింది. వీటి బరువు 3,075 గ్రాములు. దీని విలువ రూ.కోటి ఉంటుందని తెలిసింది. అనంతరం బంగారు బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ప్రాథమిక విచారణలో ఎస్ఐతో సహా ముగ్గురు పోలీసులు బంగారాన్ని ముళ్ల పొదల్లో దాచినట్టు తెలిసింది. దీంతో శుక్రవారం ఎస్పీ విజయకుమార్ ఉత్తర్వుల మేరకు ఎస్ఐ సహా ముగ్గురు పోలీసులను సాయుధ ధళానికి ఆకస్మిక బదిలీ చేశారు. -
ప్రయాణికురాలి నుంచి 310 గ్రాముల బంగారం స్వాధీనం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి వద్ద 310 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం జి.లక్ష్మీ అనే మహిళ ఏఐ– 952 విమానంలో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరడానికి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆమె చేతి సంచిలో 310 గ్రాముల బరువు కలిగిన నాలుగు బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో బంగారం స్వాధీనం చేసుకుని ఆమెను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ నుంచి అరకేజీ బంగారం స్వాధీనం
శంషాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి అధికారులు 500 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో నివసించే రోషిని కొతాడియా ముంబై వెళ్లడానికి ఆదివారం ఉదయం శంషాబాద్ చేరుకుంది. ఈ క్రమంలో సీఐఎస్ఎఫ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆమె వద్ద 100 గ్రా. బరువున్న 5 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అమెరికాలో ఉండే తన మామ ఆ బంగారాన్ని బహుమతిగా ఇచ్చినట్లు ఆమె విచారణలో వెల్లడించినప్పటికీ.. అందుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం చెన్నైలో ఎందుకు చౌకంటే..
రెండేళ్ల క్రితం కావలికి చెందిన ఓ వ్యక్తి కోటి రూపాయలు తీసుకుని రైల్లో ప్రయాణం చేస్తుండగా, నెల్లూరు–పడుగుపాడు రైల్వేస్టేషన్ మధ్యలో ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి బెదిరించారు. అతన్ని నెల్లూరు రైల్వేస్టేషన్లో దింపి కారులో ఎక్కించుకుని, అతని వద్ద ఉన్న నగదు తీసుకున్నారు. జాతీయ రహదారిపై కావలి సమీపంలో ఆ వ్యక్తిని దింపి కారులో వెళ్లిపోయారు. ఈ సొమ్మంతా బంగారు వ్యాపారులది కావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును, అందులోని వ్యక్తులను కందుకూరు–కనిగిరి మధ్య పట్టుకున్నారు. నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. కావలి : పట్టణంలో నెలకు రూ.200 కోట్ల మేర బంగారు బిస్కెట్లు వ్యాపారం జరుగుతోంది. అంతా జీరో ట్యాక్స్ బిజినెస్. బిల్లులు లేకుండా చెన్నై నుంచి బంగారు బిస్కెట్లను తీసుకొచ్చి ముందుగా ఆర్డర్లు ఇచ్చిన వారికి వాటిని అప్పగిస్తుంటారు. కావలి నుంచి చెన్నైకు రాకపోకలు సాగించే క్రమంలో పోలీ సులు, డీఆర్ఐ అధికారుల తనిఖీల్లో దొరుకుతున్నారు. పట్టణంలో 60 మంది వరకు బంగారు వ్యాపారులు ఉన్నారు. వీరిలో 50 మంది ఆభరణాలు అమ్మకాలు చేస్తుంటారు. మిగిలిన వారు ఆభరణాల అమ్మకాలతో పాటు చెన్నై నుంచి బిల్లులు లేకుండా బంగారు బిస్కెట్లను కావలికి తెచ్చి అమ్మకాలు చేస్తుంటారు. ఈ పది మంది వ్యక్తులు, వారి వద్ద గుమస్తాలుగా పని చేసేవారు, సీజన్ బాయ్స్ ఈ బంగారు బిస్కెట్ల వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నెల్లూరుకు చెందిన బంగారు వ్యాపారస్తులు కూడా కావలికి వచ్చి బిల్లులు లేకుండా బంగారు బిస్కెట్లను కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ప్రకాశం జిల్లాలోని కందుకూరు, ఒంగోలు, చీరాల, గుంటూరు జిల్లా తెనాలి తదితర ప్రాంతాల నుంచి బంగారు వ్యాపారులు కావలికి వచ్చి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేస్తున్నట్లుగా సమాచారం. ఒక్క ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లోనూ కావలి– చెన్నై మధ్య రూ.కోట్ల నగదు, బంగారు బిస్కెట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రతి రోజూ కనీసం రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు బంగారు బిస్కెట్ల వ్యాపారం జరుగుతుండగా, నెలకు కనీసం రూ.200 కోట్లకు తగ్గకుండా టర్నోవర్ జరుగుతోంది. ఆర్డర్లు ఇలా.. బంగారు బిస్కెట్లు కావాల్సిన వ్యాపారస్తులు తమకు ఎంత తూకంలో కావాలో వాటి విలువకు సరిపడే నగదును ముందుగానే వ్యాపారులకు అందజేస్తున్నారు. ఏదైనా రిస్క్ జరిగితే ఆర్డరు ఇచ్చిన వారికి ఎటువంటి సంబంధం ఉండదు. ఆర్డర్లు ఇచ్చిన వారికి మాత్రం అనుకున్న ధరకు తూకం ప్రకారం బంగారు బిస్కెట్లు ఇవ్వాల్సిందే. అలా ఆర్డర్లు సేకరించి, చెన్నైలో బంగారు బిస్కెట్లు అమ్మకాలు చేసే వారితో ఫోన్లోనే కాంటాక్ట్ అవుతారు. ధరను బట్టి నగదు ఎంత తీసుకు వచ్చేది, ఎవరు వచ్చేది, చెన్నైలో ఎక్కడ కలుసుకునేది అంతా ఫోన్లోనే చెబుతారు. రవాణాలో అనేక మార్పులు బిల్లులు లేని బంగారు బిస్కెట్ల కోసం కావలి నుంచి చెన్నైకు వెళ్లే వారి ప్రయాణం చాలా విచిత్రంగా ఉంటుంది. రైల్లో సాధారణ మనుషులుగా చేతిలో చిరిగిన సంచి, పాత గోతం వంటి సంచి పెట్టుకుని బోగీలో నేలపై కూర్చొంటారు. చెన్నై సమీప రైల్వే స్టేషన్‌కు పోయేలోగా చాలా బోగీలు మారిపోతుంటారు. చెన్నై సమీప రైల్వేస్టేషన్లో దిగి సబర్బన్ రైల్లో కానీ, బస్సులో కానీ ప్రయాణించి చెన్నైకు చేరిపోతారు. చెన్నైలోని సెంట్రల్ రైల్వేస్టేషన్‌కు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వెళ్లరు. అక్కడ అడుగడుగు>నా నిఘా, సునిశిత పరిశీలన ఉంటుంది. కారులో కూడా రాకపోకలు సాగిస్తుంటారు. చెన్నైలో క్షేమంగా లావాదేవీలు పూర్తి చేసుకోవడానికి ఏది సౌలభ్యంగా ఉంటుందో చేసుకుంకొంటారు. కావలిపై డీఆర్ఐ నిఘా కావలికి చెందిన కొందరు విదేశాల నుంచి భారీ ఎత్తున బిల్లులు, ట్యాక్స్ లేకుండా బంగారం తరలిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) నిఘా పెట్టింది. ఇటీవల తనిఖీల్లో పట్టుబడిన బంగారు వ్యాపారుల గుమస్తాలను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరికి చెన్నైలో సరఫరా చేసే బంగారు మాఫియా వివరాలు, వారి స్థావరాలు, కావలి నుంచి వాటిని ఏ ఏ ప్రాంతాల్లోని బంగారు వ్యాపారస్తులకు అమ్మకాలు చేస్తున్నారు.. ఎంత కాలం నుంచి ఈ అక్రమ వ్యాపారం జరుగుతుందనే విషయాలు తెలుసుకుని నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద డీఆర్ఐ అధికారులు చెన్నై నుంచి కారులో బంగారు బిస్కెట్లు కావలికి తీసుకు వస్తుండగా పట్టుకున్నారు. పట్టుబడిప కావలికి చెందిన ముగ్గురు వ్యక్తుల నుంచి తమకు అవసరమైన కీలక సమాచారాన్ని సేకరించినట్లుగా తెలిసింది. ఈ కేసులోని నిందితులను సైతం విశాఖపట్నం కేంద్రకారాగారానికి తరలించారు. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ఉండేందుకు అవసరమైతే మరోసారి కస్టడీకి తీసుకుని విచారించేందుకు డీఆర్ఐ అధికారులు అక్కడికి తరలించినట్లు సమాచారం. దీంతో కావలిలో బిల్లులు లేకుండా చెన్నై నుంచి బంగారు బిస్కెట్లు తీసుకొచ్చి అమ్మకాలు చేసే వారు, వారి వద్ద కొనుగోలు చేసే వారు వణుకుతున్నారు. ఆదాయం లక్షల్లో ఉండడంతోనే.. చెన్నై నుంచి కావలికి చేర్చుకుని బంగారు బిస్కెట్లను ఆర్డర్లు ఇచ్చిన వ్యాపారస్తులకు ఇచ్చేస్తారు. అంటే పెట్టుబడి లేకుండానే బంగారు బిస్కెట్ల వ్యాపారం చేయడం అన్నమాట. బంగారు ధర షేర్ మార్కెట్లా ఉంటుంది. కాబట్టి ఈ వ్యాపారం చేసే స్థానికులు రోజుకు ఒక్కొక్కరు కనీసం రూ.50 వేలు నంచి రూ.లక్ష వరకు ఆదాయంగా ఆర్జిస్తున్నారు. చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం కావడంతో కావలి–చెన్నై, చెన్నై–కావలి మధ్య చాలా రకాల ఇబ్బందులు జరుగుతుంటాయి. తమిళనాడుతో పాటు మన రాష్ట్రానికి చెందిన పోలీసులు, ఇతర శాఖల అధికారులు, కేంద్ర సంస్థలు నుంచి, వ్యక్తుల నుంచి పలు రిస్క్‌లు నిత్యం ఎదుర్కొంటుంటారు. అయితే అంతా చేయి తడుపుకొంటూ దర్జాగా ఈ వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాన్ని విజయవంతంగా కొనసాగిస్తుంటారు. చెన్నైలో ఎందుకు చౌకంటే.. విదేశాల్లో చౌకగా దొరికే బంగారం, మన దేశంలో ప్రియం. చట్టాలకు అనుగుణంగా నిబంధనలను అనురించి విదేశాల నుంచి బంగారం కొనుగోలు చేయాలంటే పన్నుల రూపంలో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి చెల్లించాలి. బంగారం కొనుగోలుకు పెట్టే పెట్టుబడికి సంబంధించి ఆదాయపన్ను శాఖకు లెక్కలు చూపి, పన్నులు చెల్లించాలి. అందుకే ‘బంగారు మాఫియా’ జిత్తుల మారి కుయుక్తులతో ముందుస్తుగా ఏర్పాటు చేసుకొన్న వ్యక్తుల ద్వారా విమాన ప్రయాణాలు చేయించి బంగారాన్ని మన దేశానికి చేరవేస్తోంది. చెన్నైకు చేరిన బంగారు బిస్కెట్లను బిల్లులు లేకుండా అమ్మకాలు చేస్తుంటారు. దీని వల్ల బహిరంగ మార్కెట్ కన్నా 10 నుంచి 20 శాతం ధరల్లో తేడాలు ఉంటాయి. -
పెద్దఎత్తున బంగారం పట్టివేత
సాక్షి, చిత్తూరు : రేణిగుంట అటవీ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేణిగుంట మీదుగా రాజంపేటకు బంగారాన్ని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఆంజనేయపురం చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీని చేపట్టారు. అటుగా వస్తున్న టాటా సుమోను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో బంగారు బిస్కెట్లను గుర్తించారు. దీంతో వాహనంలో ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా కడప వాసులుగా పోలీసులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు కోటి రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. కువైట్‌లో పనిచేస్తూ సొంత ఊరికి వెళ్తామని చెప్పి సెలవు తీసుకొని ఇక్కడికి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి ఎక్కడా అనుమానం రాకుండా పక్కా పథకం ప్రకారం స్మగ్లింగ్ చేశారన్నారు. వాహనంతో పాటు ఆరుగురిని రేణికుంట అర్బన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కుక్కలా?
సాక్షి, బళ్లారి:బెంగళూరు విధానసౌధలో ఈనెల 25 నుంచి రెండు రోజులు పాటు జరగనున్న వజ్ర మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం బంగారు బిస్కెట్ల అందజేతను విధాన పరిషత్ ప్రతిపక్ష నేత కేఎస్ ఈశ్వరప్ప తీవ్రంగా ఖండించారు. ఆయన సోమవారం బళ్లారి జిల్లా సండూరులోని కుమారస్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. విధానసౌధను ఎవరో మహానుభావుడు నిర్మిస్తే ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఎందుకు బంగారు బిస్కెట్లు పంపిణీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుక్కలకు బిస్కెట్లు వేసినట్లుగా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సీఎం సిద్ధరామయ్య బంగారు బిస్కెట్లు అందిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలు అతివృష్టితో నానా అవస్థలు పడుతుంటే బంగారు బిస్కెట్లు ఇవ్వడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇందుకు అయ్యే ఖర్చును పేదల అభ్యున్నతికి, కరువు పీడిత ప్రాంతాల్లో ఖర్చు చేయాలని సూచించారు. వజ్ర మహోత్సవాల్లో పంపిణీ చేసే బంగారు బిస్కెట్లను బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీసుకోబోమన్నారు. వజ్ర మహోత్సవాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజా«ధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దుబారా ఖర్చులు చేస్తూ ప్రజా సంక్షేమం విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పంజాబ్‌లో రైతులకు రుణ మాఫీ చేసినట్లుగానే కర్ణాటకలో కూడా ఎందుకు సంపూర్ణ రుణ మాఫీ చేయడం లేదని నిలదీశారు. తక్షణం రైతులకు సంపూర్ణ రుణ మాఫీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలతోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు పట్టం కడతారని, 150 సీట్లు దక్కించుకుని బీజేపీ విజయ పతాక ఎగర వేస్తుందని జోస్యం చెప్పారు. -
ఎమ్మెల్యేలకు బంగారు బిస్కెట్లు!
సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో ప్రజలు ఎలా పోతే మనకేంటి, మనం బాగున్నామా లేదా? వరుస వర్షాలతో రాష్ట్రం, రాజధాని వణికిపోతున్నా పాలకులు మాత్రం సంబరాల్లో మునిగి తేలుతున్నారు. అడుగేయాలంటే భయపడుతూ ప్రజలు గుంతల రోడ్లపై తిరుగుతుంటే ప్రభుత్వం ఆండబరాలకు పోతోంది. వర్షం వస్తే చాలు మురుగునీరు రోడ్లపై ఏరులై పారుతుంది. గుంతల రోడ్ల కారణంగా వాహనదారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలా రాష్ట్రం మొత్తం సమస్యలతో సతమతమౌతుంటే, ప్రభుత్వం వీటన్నింటినీ ఏమాత్రం పట్టించుకోకుండా ప్రజా ప్రతినిధులకు బంగారు బిస్కెట్లు కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక అసెంబ్లీ(విధాన సౌధా) నిర్మించి 60 ఏళ్లు కావొస్తోంది. ఇందులో భాగంగా 300మంది ప్రజాప్రతినిధులకు బంగారు బిస్కెట్లను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.3కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోంది. ముఖ్యమంత్రి నుంచి ఆమోదం రాగానే సభ్యులందరికీ ఈ బంగారు బిస్కెట్లను అందిస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ సిబ్బందికి మాత్రం రూ.6వేలు విలువ చేసే వెండి వస్తువులను ఇవ్వాలని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం కోసం ఈ నెల 25, 26న ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈకార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించే యోచనలో ఉన్నారు. అయితే ఈ విషయమై సిద్ధరామయ్య ఎలాంటి అనుమతులు జారీ చేయలేదని అధికారులు వెల్లడించారు. అయితే ప్రభుత్వం తీరుపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి. తీవ్ర వర్షాలతో రాష్ట్రం అల్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం ఆడంబరాలకు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నగరంలో రోడ్లు నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా బంగారు బిస్కెట్లు పంచుకోవడం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఆ వార్తలు అబద్ధం : స్పీకర్ తన చేతుల మీదుగా బంగారు కాయిన్లు, వెండి పళ్లాలు పంచబోతున్నారన్న వార్తలను అసెంబ్లీ స్పీకర్ కేబీ కొలివాదా ఖండించారు. ‘ ఆ వార్త పచ్చి అబద్ధం. అలాంటి వార్తలు ఎలా పుట్టుకొస్తాయో కూడా తెలీటం లేదు’ అని ఆయన మీడియాతో అన్నారు. అయితే 26 కోట్ల రూపాయిలతో 19 రకాల వస్తువులను మాత్రం పంచబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆర్థిక శాఖకు ఓ ప్రతిపాదన పంపినట్లు ఆయన అంగీకరించారు. లెక్కలు ఎలా ఉన్నాయంటే... పూల అలంకరణకు 75 లక్షలు, కాఫీ, టీల ఖర్చు కోసం 35 లక్షలు, తిండి ఖర్చు 3 కోట్ల 75 లక్షలు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సాధించిన ఘనతలను ప్రత్యేక డాక్యుమెంటరీ రూపంలో ప్రదర్శించటం.. అందుకోసం 3 కోట్లు కేటాయించాలని నిర్ణయం. -
పసిడిని కాజేయబోయి పట్టుబడ్డారు
ముగ్గురు రైల్వేకూలీలు, ఇద్దరు ఆటోడ్రైవర్ల రిమాండ్ హైదరాబాద్: బంగారు బిస్కెట్లను కాజేయబోయిన ఐదుగురు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ కాచిగూడ రైల్వేస్టేషన్లో జరిగింది. ఈ నెల 13న రాత్రి 11 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్లో రైళ్లు, ప్లాట్‌ఫామ్‌లు, ప్రయాణికుల లగేజీలను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. భయంతో వణికిపోయిన ఓ గుర్తుతెలియని వ్యక్తి తన నడుంకున్న బెల్టును రైల్వేస్టేషన్ ప్రవేశద్వారం ముందు వదిలేశాడు. దానిని ఎనకపల్లి రామకృష్ణ అనే రైల్వే కూలి గుర్తించాడు. బెల్టును తెరిచిచూడగా అందులో బంగారు బిస్కెట్లు కనిపించాయి. దీనిని మరో ఇద్దరు రైల్వేకూలీలు గడ్డం నరేశ్, దొడ్డి అంజయ్య కనిపెట్టారు. ముగ్గురూ ఒక కలసి పంచుకోవాలని నిర్ణయించు కున్నారు. సమీపంలోని ఆటోస్టాండ్‌కు వెళ్లి బంగారు బిస్కెట్లు లెక్కపెట్టి పంచుకునే ప్రయత్నం చేశారు. పంపకాల వ్యవహారం లో కొద్దిపాటి తేడాలు రావడాన్ని పక్కనే ఉన్న ఆటోడ్రైవర్లు సయ్యద్ ఇక్బాల్, సయ్యద్ సాబీర్ గమనించారు. తమకు వాటాలు ఇవ్వాలని, లేదంటే పోలీసులకు సమాచారం ఇస్తామని రైల్వేకూలీలను ఆటోడ్రైవర్లు బెదిరించారు. పలు చర్చలు, వాగ్వాదాల అనంతరం చివరకు ఐదుగురు బంగారు బిస్కెట్లను పంచుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దూరంగా ఈ తతంగాన్ని గమనించిన మరొకరు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసుల రంగ ప్రవేశంతో వ్యవహారమంతా బెడిసికొట్టింది. ఎప్పుడు నేరాలు చేయని ముగ్గురు రైల్వేపోర్టర్లు, ఇద్దరు ఆటోడ్రైవర్లు పరాయి సొమ్ముకు ఆశపడి కటకటాలపాలయ్యారు. వీడని మిస్టరీ...: 28 బంగారు బిస్కెట్లు పోలీసుల చేతికి చిక్కి 48 గంటలు గడిచిపోయినా సదరు బంగారం ఎవరిదన్నది తేలలేదు. ఎవరో ఒక వ్యక్తి నడుంబెల్టును ప్రవేశద్వారం వద్దే వదిలి వెళ్లడం మాత్రం చూశామని కూలీలు చెబుతున్నారు. బంగారు బిస్కెట్లు స్విట్జర్లాండ్ నుంచి ఇక్కడికి చేరినట్టుగా వాటి మీద ముద్ర ఉందని డీజీపీ కృష్ణప్రసాద్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. రైల్వేస్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద సీసీ కెమెరాలు లేని కారణంగా బంగారం వదిలివెళ్లిన వ్యక్తిని గుర్తించే అవకాశం లేకుండా పోయిందన్నారు. -
28 బంగారు బిస్కెట్లు స్వాధీనం
హైదరాబాద్: అక్రమంగా బంగారం తరలిస్తున్న ఐదుగురిని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 13 రాత్రి నాంపల్లి రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపడుతున్న జీఆర్పీ పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 28 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైల్వే, రోడ్ సేఫ్టీ డీజీపీ వివరాలు తెలిపారు. గత మూడేళ్లలో 17 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నగరానికి ఇంత బంగారం ఎక్కడి నుంచి స్మగుల్ అవుతుందో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
కడుపులో బంగారం
సాక్షి, అన్నానగర్ (చెన్నై): బంగారు బిస్కెట్లు కడుపులో ఉంచుకుని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తి నుంచి ఎట్టకేలకు వైద్యులు వాటిని బయటకు తీశారు. తమిళనాడుకు చెందిన చెందిన మహ్మద్ ముస్తఫా సలీం ఈనెల 19న ఎయిర్ ఆసియా విమానంలో మలేసియాలోని కౌలాలంపూర్ నుంచి తిరుచ్చికి వచ్చాడు. అతడు కడుపులో ఏడు బంగారు బిస్కెట్లు ఉంచుకుని వచ్చినట్టు అధికారులు గుర్తించారు. బంగారు బిస్కెట్లను అరటి పండులో పెట్టుకుని మింగేసి అక్రమంగా తరలించేందుకు అతడు ప్రయత్నించినట్టు కనుగొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం అనుమతితో కడుపులోంచి బంగారు బిస్కెట్లు బయటకు తీసేందుకు తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పారు. వైద్యులు ఎనిమా ఇచ్చి సోమవారం ఒక బిస్కెట్‌ను బయటికి తీశారు. మంగళవారం మరో నాలుగు బిస్కెట్లు వెలుపలకు తీశారు. బుధవారం సాయంత్రం మిగిలిన రెండు బిస్కెట్లు వెలికితీశారు. ఆ ఏడు బంగారు బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 205 గ్రాముల బరువున్న వీటి విలువ రూ.5 లక్షల 96వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణ వాసిగా గుర్తించారు. -
కడుపులో 6 బంగారు బిస్కెట్లు
- మలేసియా నుంచి అక్రమంగా తరలించేందుకు యువకుడి యత్నం - నిందితుడిని అదుపులోకి తీసుకున్న తిరుచ్చి ఎయిర్పోర్ట్ అధికారులు కేకే.నగర్ (చెన్నై): కడుపులో బంగారు బిస్కెట్లు దాచుకుని వచ్చిన యువకుడిని విమానాశ్రయం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి తిరుచ్చికి ఏయిర్ ఏషియా విమానం ఆదివారం సాయంత్రం వచ్చింది. విమానంలో వచ్చిన ప్రయాణికుల వద్ద అధికారులు తనిఖీలు జరుపుతుండగా, ఓ యువకుడిపై అనుమానం రావడంతో అతడిని విచారించారు. ఆయన మలేసియా నుంచి తిరుచ్చికి కడుపులో ఆరు బంగారు బిస్కెట్లు ఉంచుకుని వచ్చినట్లు విచారణలో తేలింది. నిందితుడు రామనాథపురం జిల్లా ఎస్పీ పట్టణానికి చెందిన మహ్మద్ ముస్తఫా సలీంగా అధికారులు గుర్తించారు. వెంటనే అధికారులు ముస్తఫాను తిరుచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి, చికిత్స ద్వారా బంగారు బిస్కెట్లు వెలికితీయాలని వైద్యులకు సూచించారు. వైద్యులు ఒక బంగారు బిస్కెట్ మాత్రమే వెలికి తీయగలిగారు. మరో ఐదు బిస్కెట్లను తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
సెల్ఫోన్లో బంగారు బిస్కెట్లు
ముంబై: అక్రమంగా బంగారు బిస్కెట్లను తరలిస్తూ ఖాన్ మహమ్మద్ ఆరిఫ్ అనే ఎయిర్ ఇండియా ఉద్యోగి బుధవారం ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. టెర్మినల్–2లోని లిఫ్ట్ ప్రాంతంలో ఉదయం గస్తీ కాస్తున్న ఓ సీఐఎస్ఎఫ్ జవాన్ ఆరిఫ్పై అనుమానం వచ్చి అడ్డగించడంతో అసలు విషయం బయట పడింది. సెల్‌ఫోన్‌లోని బ్యాటరీ స్థానంలో 4 బంగారు బిస్కెట్లను తరలి స్తుండగా పట్టుకున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆరిఫ్‌ను అరెస్ట్ చేసి కస్టమ్స్ అధికారులకు అప్పగించామని ఆయన వెల్లడించారు. దుబాయికి చెందిన ఓ వ్యక్తి తనకు ఇచ్చాడని ఆరిఫ్ తన నేరాన్ని అంగీకరించాడు. -
14 కిలోల బంగారం స్వాధీనం
చెన్నై: తమిళనాడులోని కోవైలో అక్రమంగా తరలిస్తున్న బంగారం భారీగా పట్టుబడింది. విశ్వసనీయ సమాచారం మేరకు ఇన్‌కంటాక్స్ అధికారులు, పోలీసులతో కలిసి కోవై సమీపం సూలూరు ఎయిర్పోర్ట్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న కారులో వారు సోదాలు జరపగా సీటు అడుగు భాగంలో ఉన్న బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఒక్కోటి వంద గ్రాముల బరువుగల 100 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తేలింది. ఆ కారులో ఉన్న ఇద్దరు కోవైకి చెందిన మాధవన్ (39), సంపత్‌కుమార్ (51)గా తెలిసింది. వీరిచ్చిన సమాచారం ప్రకారం కోవై పెరియ దుకాణ వీధిలోని వారి సొంత దుకాణాలలో ఉన్న మరో నాలుగు కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 14 కిలోల బంగారు బిస్కెట్లు విలువ రూ.4 కోట్లు13 లక్షలు. ఈ బంగారు బిస్కెట్లు శ్రీలంక నుంచి పడవల ద్వారా తూత్తుకుడికి అక్రమంగా రవాణా చేసి కారులో కోవైకి తరలిస్తున్నట్లు తెలిసింది. అనంతరం అధికారులు మాధవన్, సంపత్‌కుమార్‌తో సహా వీరితో పని చేసిన ఎస్.రాజ్‌కుమార్ ఈ ముగ్గురిని అరెస్టు చేశారు. -
బంగారం బిస్కెట్లు స్వాధీనం
చెన్నై: శ్రీలంక నుంచి సముద్రమార్గం గుండా చెన్నైకి తరలిస్తున్న కేజీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు ఆదివారం తమిళనాడులోని సాయల్కుడిలో పట్టుకున్నారు. నలుగుర్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు. రామనాథపురం-శివంగంగై-తూత్తుకుడి సముద్ర తీర సరిహద్దు గ్రామాల ద్వారా శ్రీలంక నుంచి ఇటీవల కాలంలో బంగారం తమిళనాడులోకి ప్రవేశిస్తున్నట్టు నిఘా వర్గాల విచారణలో తేలింది. శనివారం రాత్రి తమకు అందిన సమాచారం మేరకు రామనాథపురం జిల్లా సాయల్‌కుడి మార్గంలో కస్టమ్స్ అధికారులు, పోలీసులు నిఘా వేసి వాహనాలు తనిఖీలు చేశారు. ఆదివారం వేకువజామున అటువైపు వచ్చిన నాలుగు మోటార్ సైకిళ్లను తనిఖీ చేశారు. వాటిలో చిన్నపాటి పార్సిల్స్‌లో ఒక కేజీ బరువు కలిగిన పది బంగారు బిస్కెట్లు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.3 కోట్లు ఉంటుందని భావిస్తున్నారు. వీటిని చెన్నైకి తరలించి ఇక్కడి నుంచి హవాలా రూపంలో తిరిగి శ్రీలంకకు నగదు రూపంలో చేర్చేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. దీంతో చెన్నైలో బంగారాన్ని హవాలా నగదుగా మార్చే పనిలో పడ్డ ఓ బడా బాబు కోసం వేట మొదలెట్టారు. -
ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారుల తనిఖీలలో అక్రమంగా తీసుకు వస్తున్న బంగారం బయపటడింది. జెడ్డా నుంచి శనివారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు ప్రయాణికులను సోదా చేయగా వారి వద్ద రూ.22 లక్షల విలువ జేసే 747 గ్రాముల బంగారం బిస్కెట్లు దొరికాయి. ఇందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవటంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
రూ. 75 లక్షల విలువైన బంగారం స్వాధీనం
రంగారెడ్డి: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు చేపడుతున్న కస్టమ్స్ అధికారులు గురువారం ఉదయం ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 75 లక్షల విలువైన రెండున్నర కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. జెడ్డ నుంచి నగరానికి వచ్చిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. -
తణుకులో బంగారు బిస్కెట్లు స్వాధీనం
తణుకు: పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారు వ్యాపారులపై కస్టమ్స్ అధికారులు నిఘా పెంచారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఓ బంగారు వ్యాపారి ఇంట్లో సోదాలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు 6 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బిస్కెట్ల విలువ సుమారు రూ. 17,80,000 ఉంటుందని అధికారులు తెలిపారు. -
ట్రాలీ బ్యాగ్‌లో బంగారం బిస్కెట్లు..
ముంబయి: అధికారులు ఎంత నిఘా పెట్టినా...అక్రమార్కులు మాత్రం వివిధ మార్గాల ద్వారా బంగారాన్ని తరలిస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయిలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా రూ.38 లక్షల విలువైన 12 గోల్డ్ బిస్కెట్లను కస్టమ్స్ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. ట్రాలీ బ్యాగ్‌లో తరలిస్తున్న 12 బంగారు బిస్కెట్లను సీజ్ చేసిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గత నెలలో కూడా దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 19 లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. మరోవైపు బీఎస్ఎఫ్ జవాన్లు గురువారం ఓ బంగ్లాదేశీ పౌరుడు వద్ద సుమారు కేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
బంగారు బిస్కెట్లతో పట్టుబడ్డ వ్యక్తి
నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్లో భారీ సొత్తుతో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 100 గ్రాముల బరువున్న ఆరు బంగారు బిస్కెట్లు, 60 గ్రాముల నెక్లెస్, అలాగే 22 వెండి బిస్కెట్లతోపాటు రూ.57,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్‌కు చెందిన పడాల సురేష్ గౌడ్ హైదరాబాద్ నుంచి ఓ రైలులో నిజామాబాద్‌కు రాగా.. అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. దీంతో భారీగా సొత్తు బయటపడింది. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ఈ సొత్తు విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
బ్లాకులో బంగారం బిస్కెట్లు
రూ.కోట్లలో పన్ను ఎగనామం వినూత్న పద్ధతులను ఆశ్రయిస్తున్న స్మగ్లర్లు విజయవాడలో సెంట్రల్ ఎక్సైజ్ కార్యాలయం ఏర్పాటు చేసి ఏడాది దాటింది. ఈ సంవత్సర కాలంలో సెంట్రల్ ఎక్సైజ్ అధికారులు మూడు కేసులు నమోదు చేశారు. 2015 ఫిబ్రవరిలో కిలో బంగారం, రూ.39 లక్షల నగదు పట్టుకున్నారు. 2015 సెప్టెంబర్‌లో జరిపిన దాడుల్లో 739 గ్రాముల బంగారం, రూ.6.38 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్‌లో 300 గ్రాముల బంగారం, రూ.3లక్షల నగదు బిల్లులు లేకుండా వస్తుండగా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు మంగళవారం గుళికల రూపంలో ఉన్న ఐదు కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. కోల్కత్తా నుంచి చెన్నై వెళ్తుండగా రాజమండ్రి రైల్వే స్టేషన్లో దీనిని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విజయవాడ మీదుగా చెన్నై జ్యూయలరీ దుకాణానికి వెళ్తోందని కస్టమ్స్ అధికారుల విచారణలో తేలింది. ఈ బంగారాన్ని విజయవాడలో దించి చెన్నైకు తరిచేందుకు స్మగ్లర్లు పథకం రచించారని సమాచారం. బెజవాడ బీసెంట్ రోడ్డులో వే బిల్లులు లేకుండా అక్రమంగా తరలించిన బంగారాన్ని టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. విశాఖలోని ముత్తూట్ ఫైనాన్స్ వేలంలో 3.70 కిలోల బంగారం కొనుగోలు చేసిన కొందరు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అమ్మకం పన్ను జమచేయలేదు. నగరంలోకి ఈ తరహా బంగారం దిగుమతి అయినట్టు వచ్చిన సమాచారంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడిచేసి పట్టుకున్నారు. విజయవాడ : ప్రధాన రవాణా కేంద్రంగా, ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న బెజవాడకు ముంబాయ్, చెన్నయ్ నుంచి నిత్యం బంగారం బిస్కెట్లు బిల్లులు లేకుండా దిగుమతవుతున్నాయి. రైళ్లు, విమానాలు, కొరియర్ సర్వీసుల ద్వారా బంగారం, వెండి, వజ్రాలు, ప్లాటినం టన్నుల్లో దిగుమతవుతోందని సమాచారం. విదేశీ వస్తువులు కూడా అడ్డూ అదుపు లేకుండా బిల్లులు లేకుండా రహస్యంగా చేరుకుంటున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్నుల ఎగనామం పడుతోంది. రైళ్లు, బస్సులు, కొరియర్స్, విమానాల్లో సైతం బిల్లులులేని బంగారం బిస్కెట్ల రూపంలో యథేచ్ఛగా నగరానికి చేరుతోంది. ఈ చీకటి వ్యాపారంలో కొందరు బంగారు నగల వ్యాపారులు, కొరియర్ సంస్థల నిర్వాహకులు భాగస్వామ్యులన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి విజయవాడ రైల్వే స్టేషన్‌కు దొంగతనంగా బంగారం రవాణా అవుతోందని కస్టమ్స్, పోలీసు, వాణిజ్యపన్నుల శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లే పినాకిని ఎక్స్‌ప్రెస్ వంటి సూపర్ ఫాస్ట్ రైళ్లలో ఈ తరహా దొంగ బంగారం రవాణా జరుగుతోందని భావిస్తున్నారు. అక్రమంగా దిగుమతి అయ్యే బంగారాన్ని కొందరు వ్యాపారులు లాకర్లలో భద్రపరుస్తున్నట్లు కూడా ఫిర్యాదులు వస్తున్నాయి. కిలోకు రూ.6 లక్షల లాభం విజయవాడలో 500 వరకూ బంగారు నగల దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల్లో సాధారణ రోజుల్లో సగటున రోజుకు రూ.25 కోట్ల వ్యాపారం జరగుతుంది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో రూ.50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా. ఈ లావాదేవీల్లో బిల్లులు లేకుండా రెండో అకౌంట్ ద్వారా జీరో వ్యాపారం చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు. విదేశాల నుంచి వచ్చే బంగారానికి కస్టమ్స్ సుంకం 5 శాతం, వాణిజ్య సుంకం ఒక శాతం ఎగనామం పెట్టడం వల్ల కిలో బంగారానికి రూ.6 లక్షల వరకూ వ్యాపారులకు లాభం వస్తుందని సమాచారం. -
వీల్‌చైర్‌లో.. పొట్టచుట్టూ బంగారంతో బామ్మ!
దుబాయ్ నుంచి రూ.1.27 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మహిళను బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ)లో అధికారులు అరెస్టుచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... కడపకు చెందిన 52 ఏళ్ల కమలమ్మ దుబాయ్ నుంచి తెల్లవారుజామున కేఐఏ చేరుకుంది. వీల్ చైర్లో కూర్చొని అనుమానాస్పదంగా తిరుగుతుండగా గమనించిన తనిఖీ అధికారులు ఆమె శరీరాన్ని స్కానింగ్ చేశారు. పొట్ట చుట్టూ కాటన్లో చుట్టిన 38 బంగారు బిస్కెట్ల ఉన్నట్లు గమనించారు. మొత్తం బిస్కెట్ల బరువు 4.4 కిలోలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ బంగారం విలువ మార్కెట్లో రూ.1.27 కోట్లుగా ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. అయితే ఈ బంగారానికి సంబంధించి సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో కమలమ్మను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెను ఈనెల 29 వరకూ జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం కమలమ్మ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరి అక్కడ ఓ వ్యక్తికి సదరు బంగారు బిస్కెట్లు అందజేయాల్సి ఉంది. చివరి క్షణంలో ప్రణాళికలో మార్పు రావడంతో నిందితురాలు బెంగళూరుకు చేరుకుని ఆ వ్యక్తి కోసం ఎదురుచూస్తూ అధికారులకు దొరికిపోయింది. ఆరునెలల క్రితం తాను ఉపాధి వెదుక్కొంటూ దుబాయ్ వెళ్లానని కమలమ్మ విచారణలో అధికారులకు తెలిపింది. సదరు బిస్కెట్లను ప్రణాళిక ప్రకారం ఆ వ్యక్తికి అందజేస్తే రూ.4.5 లక్షలు అందజేసేవారని కమలమ్మ విచారణలో వెల్లడించినట్లు అధికారులు తెలిపారు. -
గోల్డు స్మగ్లింగ్ పై కస్టమ్స్ కన్ను!
యువతపై ఏజెంట్ల ప్రలోభాల వల విదేశాల నుంచి బంగారం అక్రమంగా రాష్ట్రానికి చేరవేత కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా ఎత్తుగడ ఈ ఏడాది ఏడున్నర కిలోలు పట్టివేత సాక్షి, విజయవాడ బ్యూరో: విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారుల నిఘా పెరిగింది. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా విదేశాల నుంచి అక్రమంగా తీసుకొస్తున్న బంగారం బిస్కెట్లు, చేతి కడియాల వంటి ఆభరణాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుల నుంచి డొమెస్టిక్ ఫ్లైట్ల ద్వారా విశాఖపట్నం, గన్నవరం చేరుకుంటున్న ప్రయాణికులను చాకచక్యంగా గుర్తించి వారి ద్వారా రవాణా అవుతున్న విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ ఏడాది మొత్తం 7.7 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని అక్రమంగా తరలిలించే వారిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. కిలోకు రూ.5 లక్షలకుపైగా లాభం విజయవాడ మార్కెట్లో ఇటీవలి కాలంలో బంగారం కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయి. నూతన రాజధాని నేపథ్యంలో విపణి వీధి కళకళలాడుతోంది. ఇదే అదనుగా కొందరు బంగారం వర్తకులు ఫైనాన్సియర్లుగా మారి ప్రత్యేక ఏజెంట్ల ద్వారా విదేశీ బంగారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏజెంట్ల ప్రలోభాలకు లొంగుతున్న యువతీయువకులు దుబాయి, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు వెళ్లి అక్కడ బంగారం కొనుగోలు చేసి కస్టమ్స్ కళ్లు గప్పి రాష్ట్రానికి చేరవేస్తున్నారు. బంగారంతో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దిగుతున్న స్మగ్లర్లు అక్కడి నుంచి దేశీయ విమానాల్లో విశాఖపట్నం, గన్నవరం ఎయిర్‌పోర్టులకు చేరుతున్నారు. ఈ బంగారం ఫైనాన్సియర్లకు... అక్కడి నుంచి జువెల్లరీ షాపులకూ చేరుతోంది. అక్రమ రవాణా ద్వారా కిలో బంగారంపై రూ.5 లక్షలకు పైగా లాభాన్ని గడిస్తున్నారు. నిఘాను పటిష్టం చేశాం విజయవాడ కేంద్రంగా సాగుతున్న విదేశీ బంగారం, సిగరెట్ల రవాణాపై గట్టి నిఘా పెట్టాం. విమానాశ్రయాలతోపాటు మిగతా ప్రాంతాల్లోనూ నిఘాను ముమ్మరం చేశాం. కస్టమ్స్ డ్యూటీ 12.5 శాతం చెల్లించకుండా దుబాయి వంటి దేశాల నుంచి వస్తున్న బంగారాన్నిగుర్తిస్తున్నాం. ఈ ఏడాది సుమారు రూ.1.69 కోట్ల బంగారాన్ని సీజ్ చేశాం - ఎస్కే రెహమాన్, ఏపీ కస్టమ్స్ కమిషనర్ -
పాదరక్షల అడుగుభాగంలో బంగారు బిస్కెట్లు
రంగారెడ్డి (శంషాబాద్) : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి పాదరక్షల అడుగుభాగం నుండి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు దుబాయ్ నుంచి బయలుదేరి గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు. తనిఖీల్లో పాదరక్షల అడుగుభాగంలో దాచుకొని తీసుకొచ్చిన కిలో పది గ్రాముల బరువున్న నాలుగు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. -
విమానాశ్రయంలో కిలో బంగారం పట్టివేత
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణీకుడు అక్రమంగా తీసుకొచ్చిన కిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణీకుడి లగేజీని అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఎలక్ట్రికల్ స్టౌ కింది భాగంలో కిలో బరువు కలిగిన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. నిందితుడు ముంబైకి చెందిన రఫీక్‌గా గుర్తించారు. -
1.3 కేజీల బంగారు బిస్కెట్లు స్వాధీనం
శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల లగేజీని తనిఖీ చేయగా... అందులో 1.3 కేజీల బంగారు బిస్కెట్లు వెలుగు చూశాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టుబడిన ఇద్దరు మహారాష్ట్రలోని పుణేకు చెందిన వారిగా గుర్తించారు. -
బంగారం బిస్కెట్లు స్మగ్లర్ల అరెస్టు
విశాఖపట్నం: దుబాయ్ నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల నుంచి భారత మార్కెట్ ప్రకారం రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ జి.రాజేందిరన్ సోమవారం తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఎయిర్ ఇండియా ఫైలట్ ఏ1-952 దుబాయ్ నుంచి హైదరాబాద్ మీదుగా విశాఖ చేరుకుంది. దానిలో నుంచి దిగిన ఇద్దరు మహిళా ప్రయాణికుల వద్ద బంగారం ఉన్నట్లు భద్రతా తనిఖీల్లో బయటపడింది. దీంతో వారిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంత భారీ స్మగ్లింగ్ బంగారాన్ని పట్టుకోవడం విశాఖ విమానాశ్రయంలో అంతర్జాతీయ సేవలు ప్రారంభించాక మూడు రోజుల్లో ఇది రెండోసారి అని, అయితే మహిళలు స్మగ్లింగ్‌లో దొరకడం విశాఖలో ఇదే తొలిసారి అని రాజేందిరన్ వివరించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను హైదరాబాద్‌లోని ఆర్ధిక నేరాలు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా ఈ నెల 22 వరకూ వారిద్దరికీ రిమాండ్ విధించారని తెలిపారు. యథావిధిగా నిందితుల వివరాలు అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ నెల 2న దుబాయ్ నుంచి విశాఖకు బంగారం బిస్కెట్లు స్మగ్లింగ్ చేస్తున్న ఏడుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్న విషయం విధితమే. వారి నుంచి నుంచి రూ.1.14 కోట్ల విలువైన 4.20 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వెంటనే మరో స్మగ్లింగ్ ఉదంతం వెలుగుచూడటం సంచలనమైంది. -
ఎయిర్‌పోర్ట్‌లో 2.7 కేజీల బంగారం పట్టివేత
శంషాబాద్ : రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇద్దరు వేర్వేరు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 2.7 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అధికారుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి లగేజీ నుంచి 2.3 కిలోల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో కౌలాలంపూర్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడి లోదుస్తుల్లో 400 గ్రాముల బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
14.7 కిలోల బంగారు బిస్కెట్లు పట్టివేత
వీటి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అంచనా కాజీపేట: వరంగల్ జిల్లాలోని కాజీపేట జంక్షన్లో బిస్కెట్ల రూపంలో ఉన్న 14 కిలోల 700 గ్రాముల బంగారాన్ని గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) పట్టుకున్నారు. కాజీపేట జీఆర్పీ సీఐ ఎ.మధుసూదన్ విలేకరులకు వెల్లడించిన వివరాల ప్రకారం.. గురువారం ఉదయం రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాంపై క్రైం పోలీసులు, జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ హసీనాబేగం, వెంకటమల్లు, మధు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హన్మకొండలోని బజ్జూరి బులియన్ దుకాణానికి చెందిన గుమస్తాలు పట్టూరి వీరేశం, నాగబండి ఉపేందర్ సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ దిగి బయటికి వెళ్తున్నారు. రెండు బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. బ్యాగుల్లో ప్యాకింగ్‌లో ఉన్న 147 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఇవి ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున ఉన్నట్లు పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వీటి విలువ రూ.4 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ బంగారాన్ని హైదరాబాద్ బేగంపేటలోని బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బజ్జూరి బులియన్ నుంచి తీసుకువస్తున్నట్లు విచారణలో తేలింది. బ్రింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 16 కిలోల బంగారం డెలివరీ చలానాలో ఉందని, కానీ కాజీపేటలో పట్టుకున్న బంగారం 14.700 కిలోలు మాత్రమే ఉందన్నారు. మిగతా బంగారం హైదరాబాద్‌లో వేరే వారికి ఇచ్చామని దాన్ని తరలిస్తున్న వ్యక్తులు చెప్పినట్లు సీఐ వెల్లడించారు. పట్టుబడిన బంగారం, కాగితాలలో తేడా ఉండడంతో బజ్జూరి బులియన్ వారిని పిలిపించి, బంగారాన్ని సీజ్ చేసి పంచనామా చేసి కమర్షియల్ టాక్స్, ఐటీ వారికి అప్పగించనున్నట్లు తెలిపారు. కాగా, విలువైన బంగారం బిస్కెట్లను హైదరాబాద్ నుంచి రైల్లో తీసుకువస్తున్న వారు తప్పకుండా భద్రత పాటించాలని జీఆర్పీ సీఐ మధుసూదన్ తెలిపారు. -
టాయ్లెట్లో 3కిలోల బంగారు బిస్కెట్లు
చెన్నై : తిరుచినాపల్లి అంతర్జాతీయ విమానాశ్రయం మరుగుదొడ్డిలో మూడు కిలోల బంగారు బిస్కెట్లు పోలీసులకు లభించాయి. విదేశాల నుంచి విమానంలో వచ్చిన ప్రయాణికులందరినీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో విమానాశ్రయం లోపల ఉన్న మరుగుదొడ్డిలో గుర్తు తెలియని పార్సిల్ ఉన్నట్లు పారిశుద్ధ్య సిబ్బంది అధికారులకు తెలిపారు. వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి చూడగా అక్కడు మూడు పార్సిల్స్ పడి ఉన్నాయి. అధికారులు ఆ పార్సిళ్లను విప్పి చూడగా, అందులో బంగారు బిస్కెట్లు కనిపించాయి. ఒక్కొక్క బాక్స్‌లో ఒక్కొక్క కిలో బరువు గల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు, మూడు బాక్స్‌లలో మూడు కిలోల బంగారు బిస్కెట్లు ఉన్నట్లు తెలిసింది. వాటి విలువ రూ.75 లక్షలు ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 11.30 గంటల సమయంలో మలేషియా నుంచి విమానంలో తిరుచ్చికి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరైనా పోలీసుల తనిఖీలకు భయపడి తాము తెచ్చిన బంగారు బిస్కెట్లను టాయ్లెట్లో పడ వేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఆ విమానంలో వచ్చిన వారి పేర్లు, వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ** -
టాయ్లెట్లో రూ.75 లక్షల బంగారు బిస్కెట్లు
ప్యారిస్ : తిరుచ్చి విమానాశ్రయంలో విదేశాల నుంచి విమానంలో వచ్చిన ప్రయూణికులందరినీ అధికారులు మంగళవారం రాత్రి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రాత్రి 11.30 గంటల సమయంలో విమానాశ్రయంలోపల ఉన్న మరుగుదొడ్డిలో గుర్తు తెలియని పార్సిల్ ఉన్నట్టు పారిశుద్ధ్య సిబ్బంది అధికారులకు తెలిపారు. వెంటనే అధికారులు అక్కడికి వెళ్లి చూడగా అక్కడు మూడు పార్సిల్స్ పడి ఉన్నాయి. అధికారులు ఆ పార్సిళ్లను విప్పి చూడగా, అందులో బంగారు బిస్కెట్లు కనిపించాయి. ఒక్కొక్క బాక్స్లోను ఒక్కొక్క కిలో బరువు గల బంగారు బిస్కెట్లు ఉన్నాయని, మూడు బాక్స్‌లలో మూడు కిలోల బంగారు బిస్కెట్లు ఉన్నట్టు తెలిసింది. అవి రూ.75 లక్షల విలువ ఉంటాయని అధికారులు తెలిపారు. రాత్రి 11.30 గంటల సమయంలో మలేషియా నుంచి విమానంలో తిరుచ్చికి వచ్చిన ప్రయాణికుల్లో ఎవరైనా పోలీసుల తనిఖీలకు భయపడి తాము తెచ్చిన బంగారు బిస్కెట్లను టాయ్లెట్లో పడ వేసి ఉంటారని పోలీసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ విమానంలో వచ్చిన వారి పేర్లు, వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. -
బెల్ట్‌లో 1.3 కోట్ల బంగారం
తిరువొత్తియూరు: చెన్నై విమానాశ్రయంలో 4.2 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున సింగపూర్ నుంచి టైగర్ ఎయిర్‌లైన్స్ విమానంలో నగరానికి చేరుకున్న ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ప్రయాణికుల్లో ఒకరైన రాయపేటకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి తన నడుముకు కట్టుకున్న బెల్టులో 14 బంగారం బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఈ బంగారం విలువ రూ. 1.3 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. -
ఆటోలో అన్ని బంగారు బిస్కెట్లా!
బెంగళూరు : ఆటోలో తీసుకువెళుతున్న మూడు కిలోల బంగారు బిస్కట్లను హైగ్రౌండ్స్ పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరు సెంట్రల్ విభాగం డీసీపీ సందీప్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం అర్ధరాత్రి కంటోన్మెంట్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్న ఆటోను ఆనందరావు సర్కిల్ వద్ద నాకాబందీ నిర్వహిస్తున్న హైగ్రౌండ్స్ పోలీసులు అడ్డుకుని తనిఖీ చేశారు. బెంగళూరు నుంచి తమిళనాడులోని కోయంబత్తూరుకు బిస్కట్ల రూపంలో ఉన్న బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఆటోలో ప్రయాణిస్తున్న కోయంబత్తూరుకు చెందిన నటరాజ్, బాల, రాంకుమార్ల వద్ద ఉన్న సూట్‌కేసులో మూడు కిలోల బంగారు బిస్కట్లు, 42 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించారు. వాటికి సంబంధించి వారి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. వారి వద్ద ఉన్న బంగారం, నగదు స్వాధీనం చేసుకొని, వారిని పోలీసులు అదపులోకి తీసుకున్నారు. నిందితులను ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారిస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. -
పొట్టకోస్తే.. బంగారం బయటపడింది..!
సింగపూర్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన వ్యాపారి వ్యూహం బెడిసికొట్టడంతో ఆస్పత్రిపాలు న్యూఢిల్లీ: నీళ్ల సీసా మూత మింగానంటూ ఆస్పత్రికి వచ్చిన ఓ వ్యాపారికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే అతని పొట్టలో నీళ్ల సీసా మూతకు బదులుగా 12 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. ఒక్కో బిస్కెట్ బరువు 33 గ్రాములు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వివరాల్లోకెళ్తే... చాందినీచౌక్‌కు చెందిన ఓ వ్యాపారి ఏప్రిల్ 7న సర్ గంగారాం ఆస్పత్రికి వచ్చాడు. ప్రమాదవశాత్తు తాను నీళ్ల సీసా మూత మింగానని, శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీయాలంటూ బతిమాలాడు. పరిచయం ఉన్న వ్యక్తి కావడంతో సీనియర్ కన్సల్టింగ్ సర్జన్ డాక్టర్ సి.ఎస్ రామచంద్రన్ నేతృత్వంలోని ఓ బృందం మొదట ఎక్స్‌రే తీసింది. అందులో నీళ్ల సీసా మూత వంటి వస్తువేది కనిపించకపోగా లోహపు వస్తువులున్నట్లు గుర్తించారు. అయితే వాటిని బంగారంగా గుర్తించని వైద్యులు శస్త్రచికిత్స చేయడం ప్రారంభించారు. పొట్టలోనుంచి బంగారు బిస్కెట్లు బయటకు వస్తుండడంతో వైద్యుల బృందం ఆశ్చర్యపోయింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 బిస్కెట్లు అతని పొట్టలోనుంచి బయటపడ్డాయి. శస్త్రచికిత్స పూర్తిచేసిన వైద్యులు వెంటనే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు తెలియజేశారు. వ్యాపారిని ఈ విషయమై ప్రశ్నించగా అతని నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో పోలీసులకు, కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. ఈ విషయమై రామచంద్రన్ మాట్లాడుతూ... ‘తరచూ ఆస్పత్రికి వచ్చే వ్యక్తి కావడంతో ముం దుగా మాకు ఎటువంటి అనుమానం రాలేదు. అప్పటికే అతనికి మూడు శస్త్రచికిత్సలు చేశాం. మొదటిసారి పిత్తకోశాన్ని తొలగించేందుకు, రెండోసారి అపెండిసైటిస్, మూడోసారి హెర్నియాకు సంబంధించి శస్త్రచికిత్సలు చేశాం. పైగా అతనికి మధుమేహం కూడా ఉంది. రోగి చరిత్ర ముందుగా తెలియడంతో ఉదరంలో ఏదైనా సమస్య కారణంగా ఆస్పత్రికి వచ్చాడని భావించాం. ఇక బంగారం ఎక్కడిది? అనే విషయాన్ని పక్కనబెడితే మొత్తానికి అతని ప్రాణాలను కాపాడినందుకు సంతోషంగా ఉంద’న్నారు. ఇదిలాఉండగా చాందినీచౌక్‌కు చెందిన సదరు వ్యాపారి పదిరోజుల క్రితమే సింగపూర్ నుంచి ఢిల్లీకి వచ్చాడని, బంగారాన్ని అక్రమంగా తీసుకువచ్చేందుకే బిస్కెట్ల రూపంలోకి మార్చి మింగాడని, మలద్వారం ద్వారా బయటకు వెళ్తాయనుకుని భావించినా అనుకున్న విధంగా జరగకపోవడంతో ఆందోళన చెందిన అతను వైద్యులను సంప్రదించాడని, అసలు విషయం దాచి. నీళ్ల సీసా మూత మింగానంటూ అబద్ధం చెప్పి ప్రాణాలను కాపాడుకున్నాడని కస్టమ్స్ అధికారి ఒకరు తెలిపారు.పొట్టలో బంగారు బిస్కెట్లు ఉన్నాయని ముందుగానే చెబితే వైద్యులు శస్త్ర చికిత్స చేయరేమోనని భావించినందునే అలా అబద్ధం చెప్పి ఉంటాడన్నారు. అతనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
షూ సాక్సుల్లో అర కిలో బంగారం
శంషాబాద్, న్యూస్‌లైన్: షూ సాక్సుల్లో అరకిలో బంగారు బిస్కెట్లను దుబాయ్ నుంచి అక్రమంగా తీసుకొచ్చిన ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి ఫ్లై దుబాయ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన వరంగల్ జిల్లాకు చెందిన ఖాజా(30)ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి షూ సాక్సుల్లో నాలుగు బంగారు బిస్కెట్లు, ఓ రింగ్ ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 565 గ్రాముల బరువు ఉన్న వీటి విలువ రూ. 17.56 లక్షల వరకు ఉంటుందని అంచనా. -
సెల్ఫోన్లలో బంగారం స్మగ్లింగ్
చెన్నై, సాక్షి: బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు సెల్ఫోన్లను ఆయుధంగా మార్చుకున్నారు స్మగ్లర్లు. సెల్ఫోన్లలో భద్రపరచి హాంకాంగ్ నుంచి చెన్నైకు తీసుకొచ్చిన 27 కిలోల బంగారు బిస్కెట్లను విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. హాంకాంగ్‌కు చెందిన రవాణా విమానం ద్వారా పెద్దమొత్తంలో బంగారం చేరవేస్తున్నట్లు సమాచారం అందడంతో అప్రమత్తమైన చెన్నై విమానాశ్రయ అధికారులు మంగళవారం గోదాములకు వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ఉన్న సెల్‌ఫోన్ కంటెయినర్లను అధికారులు తెరచిచూడగా బ్లాక్‌బెర్రీ సెల్ఫోన్లు కనిపించాయి. అయితే సెల్‌ఫోన్ కవర్ విప్పిచూడగా బ్యాటరీ ఉండాల్సిన చోట బంగారు బిస్కెట్ ఉంది. ఇలా 54 సెల్ఫోన్ల నుంచి మొత్తం 27 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరో 90 సెల్‌ఫోన్ కంటెయినర్లు ఉన్నాయని, వాటిని కూడా తెరిస్తే మరింత బంగారం దొరికే అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు.