మహిళ నుంచి అరకేజీ బంగారం స్వాధీనం | Gold Was Recovered By Police At Shamshabad Airport | Sakshi
Sakshi News home page

Nov 19 2018 1:42 AM | Updated on Nov 19 2018 1:42 AM

Gold Was Recovered By Police At Shamshabad Airport - Sakshi

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి అధికారులు 500 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అమెరికాలో నివసించే రోషిని కొతాడియా ముంబై వెళ్లడానికి ఆదివారం ఉదయం శంషాబాద్‌ చేరుకుంది. ఈ క్రమంలో సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఆమె వద్ద 100 గ్రా. బరువున్న 5 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అమెరికాలో ఉండే తన మామ ఆ బంగారాన్ని బహుమతిగా ఇచ్చినట్లు ఆమె విచారణలో వెల్లడించినప్పటికీ.. అందుకు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement