సాక్షి, హైదరాబాద్: బంగారం అక్రమ రవాణా నిరోధం కోసం ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి జనాల మైండ్ సెట్ పెద్దగా మారడం లేదు. ఏదో విధంగా అధికారుల కళ్లు కప్పి బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కొన్ని సార్లు అడ్డంగా బుక్కవుతున్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. నిఘా పెరుగుతున్న కొద్ది జనాల ఆలోచనలు కూడా మారుతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో, రూపాల్లో.. దారుల్లో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ వ్యక్తిని చూస్తే.. ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే సదరు వ్యక్తి అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించడానికి ప్యాంటుకు ప్రత్యేకంగా ఓ జేబు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏం లాభం దొరికిపోయాడు.
వివరాలు.. దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అధికారుల కన్ను గప్పి బంగారాన్ని తరలించాలని చూశాడు . అందుకు గాను తన ప్యాంటుకు లోపల ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకున్నాడు. దానిలో 71.47 గ్రాములు బంగారాన్ని ముక్కలుగా కట్ చేసి అందులో పెట్టాడు. కానీ కస్టమ్స్ అధికారుల తనిఖీలో ఈ జేబు, దానిలోని బంగారం బయటపడింది. ఇక బహిరంగ మార్కెట్ లో ఈ బంగారం విలువ 3,67,570 రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment