సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లింగ్ కేసులో నగరానికి చెందిన ఘన శ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారాన్ని దేశీయంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టు అభియోగం ఉన్నట్లు తెలిపారు.
కోల్‌కతా విమానాశ్రయంలో2018లో బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రీత్ కుమార్ అగర్వాల్ సుమారు 250 కిలోల బంగారం అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ తేల్చింది. హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లోఈడీ సోదాలు నిర్వహించగా పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment