Gold Smugglers
-
ఆ ఘటన షాక్‌కు గురిచేసింది: శశి థరూర్
ఢిల్లీ: తన మాజీ సిబ్బందిలో ఒకరిని గోల్డ్ స్మగ్లింగ్ విషయంలో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకోవటం షాక్‌కు గురిచేసిందని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. ఢిల్లీ ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టులో రూ. 35 లక్షల బంగారంతో శివ ప్రసాద్ అనే వ్యక్తి కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డారు. దీంతో అధికారులు అయన్ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత శిశి థరూర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో నేను ధర్మశాలలో ఉన్నా. నా వద్ద తాత్కాలికంగా పని చేసిన సిబ్బందిని బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయంలో ఇందిరా గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకోవటంపై షాక్‌కు గురయ్యాను. 72 ఏళ్ల వ్యక్తి తరచూ డయాలసీస్ చేయించుకుంటున్నారు. ఆ వ్యక్తిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న అధికారులకు నా పూర్తి మద్దతు తెలుపుతున్నా. చట్టం తన పని తాను చేస్తుంది’’ అని థరూర్ అన్నారు.While I am in Dharamshala for campaigning purposes, I was shocked to hear of an incident involving a former member of my staff who has been rendering part-time service to me in terms of airport facilitation assistance. He is a 72 year old retiree undergoing frequent dialysis and…— Shashi Tharoor (@ShashiTharoor) May 30, 2024 బుధవారం ఢిల్లీ ఎయిర్‌పోర్టు టెర్మినల్ 3 లో కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో 500 గ్రాములో బంగారంలో శవ ప్రసాద్ అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఆయన వద్ద ఉన్న బంగారంపై ప్రశ్నించగా సంబంధం లేని సమాధానం చెప్పటంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ నేత శశిథరూర్ సహాక సిబ్బంది అని అధికారులు గుర్తించారు. -
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
News about Hardeep Singh Nijjar, murder and S Jaishankarభారత్‌లోని అఫ్గనిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై వ్యక్తిగత దాడులు, నిరంతర పరువునష్టం తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని తనపై దాడులు జరిగాయని వార్దక్ అన్నారు.ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్‌గా ఉండటంతో పాటు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రాయబారి బాధ్యతలను కూడా జకియా వార్దక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె ముంబై విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ 18 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి భారత్‌కు తన వస్త్రాల్లో తరలించారని, ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ముంబయిలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్ శనివారం తెలిపారు.కాగా వార్ధక్ బంగారాన్నిఅక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెును తనిఖీలు చేయలేదు. అయితే, ఎయిర్‌పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ఆమె వాటిని తోసిపుచ్చారు. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా... ఆమె దుస్తుల్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. అయితే వార్ధక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదు.News about Hardeep Singh Nijjar, murder and S Jaishanka -
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. అఫ్గాన్ రాయబారి జకియా రాజీనామా
న్యూఢిల్లీ: రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన అఫ్గానిస్తాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తొలుత ముంబైలో అఫ్గాన్ కాన్సూల్ జనరల్‌గా రెండేళ్లు పనిచేశారు. గత ఏడాది ఇండియాలో అఫ్గాన్ రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. గత నెల 25వ తేదీన ముంబై ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు జకియా వార్దక్ నుంచి 25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆమె బంగారాన్ని దుబాయి నుంచి చట్టవిరుద్ధంగా తరలిస్తూ దొరికిపోయినట్లు వార్తలొచ్చాయి. దౌత్యవేత్త కావడంతో ఈ కేసులో అరెస్టు కాకుండా ఆమె మినహాయింపు పొందారు. అయితే, తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జకియా వార్దక్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తనపై వ్యక్తిగతంగా విమర్శల దాడి జరుగుతోందని, దీనివల్ల విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. -
కిలాడీ లేడీ గోల్డ్ స్మగ్లింగ్..
-
కేటుగాళ్ల కొత్త ప్లాన్.. 14కిలోల బంగారాన్ని మట్టిలో పాతిపెట్టి..
కోల్కత్తా: బంగారం తరలింపు కోసం కొందరు కేటుగాళ్లు వివిధ మార్గాలను ఎంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్టులో, కార్లలో బంగారం తరలిస్తున్న ఘటనలు చూసే ఉంటాం. కానీ.. కొందరు కేటుగాళ్లు ఏకంగా బంగారాన్ని అడవిలో దాచిపెట్టి.. తరలింపునకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో భద్రతా దళాలు భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దులోని ఓ గ్రామం సమీపంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 106 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే, గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 2న సోదాలు చేయగా.. ఓ గుంత తవ్వి మట్టికింద అక్రమంగా దాచి ఉంచిన 106 బంగారం బిస్కెట్లు, ముక్కలను సీజ్ చేశారు. BSF & DRI in a joint operation seized a total of 106 gold biscuits weighing 14.296 kg worth Rs 8.50 crore from a house in village Vijaypur and arrested 2 smugglers: BSF pic.twitter.com/HaldGUNMjs — ANI (@ANI) September 3, 2023 ఈ సందర్బంగా అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం బిస్కెట్ల బరువు దాదాపు 14.3 కిలోలు ఉంటుందని తెలిపార. ఈ బంగారం ధర రూ.8.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కాగా, బంగారం అక్రమ తరలింపులో వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తితో పాటు అతడికి సహాయకుడిగా ఉన్న మరొకరిని అరెస్టు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: ఎల్బీనగర్లో దారుణం.. -
శంషాబాద్: అండర్వేర్లో బంగారం పట్టివేత
సాక్షి, క్రైమ్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అండర్వేర్లో బంగారం తరలిస్తుండగా.. ఆ ముఠాను అధికారులు పట్టేసుకున్నారు. దాదాపు రూ. కోటి 37లక్షలు విలువ చేసే.. 2.279 కిలోలు బంగారం సీజ్ చేశారు అధికారులు. అలాగే.. లక్షకుపైగా విదేశీ సిగిరెట్లు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. మొదటి బంగారం కేసు.. 1196 గ్రాముల బంగారం 72 లక్షల బంగారాన్ని ఎయిర్ క్రాఫ్ట్ సీట్ వద్ద పేస్టు రూపంలో అమర్చి తీసుకొని హైదరాబాద్ వచ్చిన రసల్ కైమా ప్రయాణికుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. రెండో కేసులో 752 గ్రాముల బంగారాన్ని కట్ పీస్ గోల్డ్ బార్ గా పెట్టుకొని కువైట్ వయా దుబాయ్ మీదిగా హైదరాబాద్ వస్తూ పట్టుపడ్డాడు విలువ 45 లక్షలు. మూడో కేసులో 331 గ్రాముల స్మగ్ల్డ్ గోల్డ్ విలువ 20 లక్షలు ప్రయాణికుడు షార్జా వయా దుబాయ్ నుండి వస్తూ పట్టుబడ్డాడు మరో కేసులో 1,10,000 సిగరెట్ ప్యాక్స్ ని ముగ్గురు ప్రయాణికులు కంబోడియా బ్యాంకాక్ నుండి వస్తు పట్టుబడిన ముగ్గురు వద్ద విదేశీ సిగరెట్లు. ఇదీ చదవండి: బండ్లగూడ కారు ప్రమాదం.. పోలీసులే షాకయ్యారు -
చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. అయినా దొరికిపోయారు
-
ఇదేం తెలివిరా నాయనా.. చాక్లెట్లలో బంగారం అక్రమ రవాణా.. చివరికి!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి 269 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్ల లోపల రూ.16.5 లక్షల విలువైన బంగారాన్ని దాచిపెట్టి అక్రమంగా రవాణా చేస్తున్న నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన విమానంలో ఇద్దరు ప్రయాణికులను అధికారులు పరిశీలించగా.. 269 గ్రాముల బంగారాన్ని చాక్లెట్ కవర్లలో చుట్టి తీసుకొచ్చినట్లు గుర్తించారు అట్టపెట్టెలో ఉంచిన 13 చాక్లెట్లలో 13 చిన్న బంగారు ముక్కలను అమర్చి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల వద్ద 269 గ్రాముల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. చదవండి: ‘గీత కార్మికుల బీమా’పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం -
గోల్డ్ స్మగ్లింగ్: ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ అరెస్ట్
క్రైమ్: బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని బుధవారం అధికారులు కేరళలో అరెస్ట్ చేశారు. బహ్రైన్-కోజికోడ్-కోచి సర్వీస్‌లో సదరు సిబ్బంది పని చేస్తున్నాడు. నిందితుడిని వయనాడ్(కేరళ)కు చెందిన షఫీగా గుర్తించారు. షఫీ బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నాడనే పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. బుధవారం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగారాన్ని చేతులకు చుట్టి, చొక్కా స్లీవ్‌ను కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా వెళ్లాలని ప్లాన్ చేశాడు. ఈలోపే కస్టమ్స్ అధికారులు పట్టేసుకుని.. షఫీ నుంచి 1,487 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ. మూడున్నర కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. Kochi | Air India cabin crew Shafi, a native of Wayanad, was arrested at Kochi Airport for smuggling 1,487 gms of gold. The cabin crew was of Bahrain-Kozhikode-Kochi service. Further interrogation underway: Customs Preventive Commissionerate pic.twitter.com/1nxVzF2fA7 — ANI (@ANI) March 8, 2023 -
టన్నుల్లో దొంగ బంగారం
సాక్షి, అమరావతి: భారత్‌లో పసిడికి ఉన్న డిమాండ్ అంతాఇంతా కాదు. ఇదే స్మగ్లర్లకు కొంగుబంగారంగా మారింది. కోవిడ్ సమయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలతో 2020లో కొంత మేర బంగారం స్మగ్లింగ్ తక్కువగా ఉన్నప్పటికీ ఆ తరువాత 2021, 2022 సంవత్సరాల్లో స్మగ్లింగ్ బంగారం పరిమాణం పెరిగింది. దేశంలో 2020 నుంచి 2022 వరకు అలాగే ఈ ఏడాది జనవరి వరకు స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్ బంగారం పరిమాణాన్ని ఇటీవల పార్లమెంట్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి వెల్లడించారు. 2020 సంవత్సరంతో పోల్చి చూస్తే 2022లో స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్ బంగారం పరిమాణం 1,347.58 కేజీలు ఎక్కువగా ఉంది. 2020వ సంవత్సరం నుంచి ఈ ఏడాది జనవరి వరకు స్వాధీనం చేసుకున్న స్మగ్లింగ్ మొత్తం బంగారం ఏకంగా 8,424.78 కిలోలు. ఈ కాలంలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ 9,408 కేసుల్లో 4,635 మందిని అరెస్టు చేశారు. స్మగ్లర్లు ఉపయోగించే కొత్త కొత్త విధానాలు, పద్ధతులను ఎప్పటికప్పుడు కనిపెడుతూ అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లు పంకజ్ తెలిపారు. మాదకద్రవ్యాలదీ అదే రూటు దేశంలో డ్రగ్స్ స్మగ్లింగ్ కూడా పెరుగుతోంది. 2020 ఏడాదిలో 55,622 డ్రగ్స్ స్మగ్లింగ్ కేసుల్లో 73,841 మందిని అరెస్టు చేశారు. 2021లో 68,144 కేసుల్లో 93,538 మందిని, 2022 జనవరి నుంచి నవంబర్ వరకు 66,758 స్మగ్లింగ్ కేసుల్లో 80,374 మందిని అరెస్టు చేశారు. మూడేళ్లలో అత్యధికంగా 19.49 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో హెరాయిన్, కొకైన్ వంటివి కూడా ఉన్నాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వివిధ సంస్థల మధ్య సమర్థవంతమైన సమన్వయం కోసం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నార్కో కో–ఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేసిందని పంకజ్ తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రించేందుకు ప్రతీ రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. -
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 61కిలోల గోల్డ్ సీజ్.. కస్టమ్స్ చరిత్రలోనే రికార్డ్
ముంబై: విదేశాల నుంచి అక్రమంగా బంగారం తరలిస్తున్న ముఠాల గుట్టురట్టు చేశారు ముంబై కస్టమ్స్ అధికారులు. ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ స్థాయిలో బంగారం పట్టుకున్నారు. రెండు వేరు వేరు సంఘటనల్లో మొత్తం 61 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. దాని విలువ సుమారు రూ.32 కోట్లు ఉంటుందని తెలిపారు. ముంబై ఎయిర్పోర్ట్ కస్టమ్స్ విభాగం చరిత్రలో ఒక్కరోజులో సీజ్ చేసిన విలువలో ఇదే అత్యధికమని తెలిపారు. ఈ సంఘటన గత శుక్రవారం జరిగినట్లు అధికారులు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. మొదటి ఆపరేషన్‌లో టాంజానియా నుంచి వచ్చిన నలుగురు భారతీయులను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా తయారు చేసిన బెల్టుల్లో 1 కేజీ బంగారం బిస్కెట్లను దాచి తీసుకొచ్చారు. మొత్తం రూ.28.17 కోట్లు విలువైన యూఏఈ తయారీ గోల్డ్ బార్స్ 53 లభ్యమయ్యాయి. నలుగురిని అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. మరో ఆపరేషన్‌లో 8 కిలోలు సుమారు రూ.3.28 కోట్ల విలువైన బంగారం సీజ్ చేశారు. దుబాయ్ నుంచి వచ్చిన ముగ్గురు ప్రయాణికుల వద్ద తనిఖీలు చేయగా ఈ బంగారం బయటపడింది. ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి కలిసి బంగారాన్ని మైనం రూపంలో చేసి తీసుకొస్తున్నట్లు గుర్తించారు. దానిని జీన్స్‌లో పెట్టి తీసుకొస్తున్నారని తెలిపారు. ఇదీ చదవండి: Prashant Kishor: ఎన్నికల్లో పోటీపై ప్రశాంత్ కిషోర్ క్లారిటీ.. ఏమన్నారంటే? -
గోల్డ్ కేసులో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది
తిరువనంతపురం/న్యూఢిల్లీ : కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్, ఎల్డీఎఫ్ ప్రభుత్వం మధ్య మరోసారి దుమారం చెలరేగింది. గవర్నర్ ఖాన్ ఈసారి గోల్డ్ స్మగ్లింగ్ వివాదాన్ని లేవనెత్తారు. ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంలో తాను జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గవర్నర్ ఖాన్ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, యూనివర్సిటీల్లో ఆర్ఎస్ఎస్ ఎజెండాని అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆరోపించిన మర్నాడు గురువారం గవర్నర్ ఖాన్ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్ అజెండాపై సీఎం ఒక్క ఉదాహరణ అయినా చూపగలరాని ప్రశ్నించారు. యూనివర్సిటీల్లో ఆరెస్సెస్‌కి చెందిన వారిని నియమించడానికే ప్రస్తుతమున్న వైస్ ఛాన్సలర్లపై చర్యలు తీసుకుంటున్నానని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దానిని రుజువు చేస్తే గవర్నర్ పదవికి తాను రాజీనామా చేస్తానని, అలా రుజువు చెయ్యలేకపోతే సీఎం రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ‘‘కేరళ ప్రజలు ప్రస్తుతం గోల్డ్ స్మగ్లంగ్ గురించి, అందులో ముఖ్యమంత్రి కార్యాలయం ప్రమేయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ కేసులో శివశంకర్ పాత్ర ఏంటి ? ఎందుకు ఆయనని తొలగించారు ? ఈ కేసులో సీఎంఒ ప్రమేయం ఉందని తేలితే నేను ఇందులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది’’ అని గవర్నర్ హెచ్చరికలు జారీ చేశారు. -
Hyderabad: విజిటర్‌గా దుబాయ్‌కు వెళ్లి... జల్సాలకు డబ్బంతా ఖర్చు అవ్వడంతో
సాక్షి, హైదరాబాద్: పర్యాటక వీసాపై దుబాయ్ వెళ్లిన గోల్కొండ వాసి చేతిలో ఉన్న డబ్బంతా అక్కడ జల్సాలకు ఖర్చు చేశాడు. తిరిగి రావడానికి ఇతడి వద్ద డబ్బు లేదనే విషయం గమనించిన అక్కడి సూత్రధారులు గోల్డ్ స్మగ్లింగ్‌లో క్యారియర్‌గా మార్చారు. కేజీ బంగారం అక్రమ రవాణా చేస్తూ వచ్చిన ఇతడితో పాటు రిసీవర్‌ను, అతడి సహాయకులైన ఇద్దరినీ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు డీసీపీ చక్రవర్తి గుమ్మి మంగళవారం వెల్లడించారు. బడాబజార్‌కు చెందిన మహ్మద్ ఖాజా మొయినుద్దీన్ ఇటీవల దుబాయ్‌కు విజిట్ వీసాపై వెళ్లాడు. తన వద్ద ఉన్న నగదు మొత్తం అక్కడే ఖర్చు పెట్టేయడంతో తిరుగు ప్రయాణానికి టిక్కెట్టు, ఖర్చులకు డబ్బు లేని పరిస్థితి నెలకొంది. దీనిని గుర్తించిన ముస్తఖీమ్ అనే దుబాయ్ వాసి అతడికి వల వేశాడు. తాము చెప్పినట్లు కేజీ బంగారం స్మగ్లింగ్ చేస్తే విమాన టిక్కెట్లతో పాటు కొంత డబ్బు ఇస్తానని చెప్పాడు. అందుకు ఖాజా అంగీకరించడంతో మూడు గోళాలుగా నల్ల కవర్లలో ప్యాక్ చేసిన కేజీ బంగారం, టిక్కెట్టు, డబ్బు ముస్తఖీమ్ అందించాడు. ఆ బంగారాన్ని తీసుకుని విమానాశ్రయంలో దిగిన తర్వాత ఫోన్ ఆన్ చేయాలని, దుబాయ్ నెంబర్ నుంచి కాల్ చేసిన వ్యక్తికి సరుకు అందించాలని సూచించాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఖాజాకు కర్ణాటకలోని భత్కల్ ప్రాంతానికి చెందిన రయీస్ అహ్మద్ సయీద్ హుస్సేన్ లంక అనే వ్యక్తి ఫోన్ చేశాడు. తాను ఎయిర్‌పోర్టులోనే ఉన్నానంటూ రప్పించి తన కారులో ఎక్కించుకున్నాడు. ఆ సమయంలో లంకతో పాటు అదే ప్రాంతానికి చెందిన సరిమ్ హుస్సేన్, ఫౌజాన్ కూడా ఉన్నారు. దీనిపై దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఇన్స్పెక్టర్ ఎస్.రాఘవేంద్ర నేతృత్వంలో ఎస్సైలు ఎన్.శ్రీశైలం, వి.నరేందర్, షేక్ బుర్హాన్, కె.నర్సింహ్ములు తమ బృందంతో దాడి చేసి నలుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి స్వాదీనం చేసుకున్న బంగారంతో సహా కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఖాజా ఈ బంగారాన్ని రిక్టమ్ కన్సీల్మెంట్ విధానంలో తీసుకువచ్చాడు. ఇలా కేజీ బంగారం మలద్వారంలో దాచి తేవడం సాధారణ వ్యక్తులకు సాధ్యం కాదు. తరచు ఈ దందా చేసే స్మగ్లర్లు మాత్రమే ప్రత్యేక శస్త్ర చికిత్స ద్వారా ఇలా చేయగలరు. ఈ కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు. -
‘విజిట్’కు రప్పించి స్మగ్లింగ్ చేయిస్తున్నారు..
మోర్తాడ్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తక్కువ ధరకు లభించే బంగారాన్ని ఇక్కడికి అక్రమంగా తరలించడానికి స్మగ్లర్ల ముఠాలు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా స్థానిక ముఠాలు, గల్ఫ్ స్మగ్లర్లతో కలసి ఉపాధి పేరుతో నిరుద్యోగ యువతకు గాలం వేస్తున్నాయి. దుబాయ్, షార్జా తదితర ప్రాంతాల్లో ఉపాధి కల్పిస్తామని నిరుద్యోగులను నమ్మించి తమ దందాకు పావులుగా వాడుకుంటున్నాయి. విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన తర్వాత వర్క్ వీసాలు ఇప్పిస్తామని స్మగ్లర్లు నమ్మిస్తున్నారు. వారి మాటలు నమ్మి విజిట్ వీసాలపై యూఏఈ వెళ్లిన యువకులకు తమ పథకంలో భాగంగా ఎలాంటి పని చూపకుండా ఖాళీగా కూర్చోబెడుతున్నారు. పని కోసం వేచిచూసి విసిగిపోతున్న యువకులు తాము ఇంటికి వెళ్తామని చెప్పగానే అలాంటి వారికి బంగారం దాచి ఉంచిన సూట్‌కేసులు, బ్యాగులను ఇచ్చి పంపిస్తున్నారు. ఎయిర్‌పోర్టులలో పట్టుబడినప్పుడు ఈ స్మగ్లింగ్ వ్యవహారంపై అవగాహన లేని అమాయకులు కటకటాల పాలవుతున్నారు. స్మగ్లర్లు మాత్రం తప్పించుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ నుంచి వేరువేరు విమానాల్లో వచ్చిన ముగ్గురు యువకుల నుంచి రూ.4 కోట్ల విలువ చేసే బంగారం కడ్డీలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. అంతకు ముందు నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం పాలెంకు చెందిన అస్లాం అనే 19 ఏళ్ల యువకుడి నుంచి రూ.1.20 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ రెండు ఘటనలను పరిశీలిస్తే బంగారం స్మగ్లర్లు తమ దందా కోసం కొత్తగా గల్ఫ్‌కు వెళ్లాలనుకునే యువతను లక్ష్యంగా చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. కంపెనీ వీసాలుంటేనే రండి..: వర్క్ వీసా ఇస్తే కంపెనీలో పని చేసుకుంటారని.. అలా కాకుండా విజిట్ వీసాతో రప్పించి పని చూపకుండా ఖాళీగా ఉంచితే ఇంటికి వెళ్తామని ఆ యువకులే స్వచ్ఛందంగా చెబుతారని స్మగ్లర్లు ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు. కొన్ని సందర్భాల్లోనే బంగారం స్మగ్లింగ్ గుట్టు బయటపడుతుండగా అనేక సమయాల్లో బంగారం యథేచ్ఛగా అక్రమ రవాణా అవుతోందని తెలుస్తోంది. కాగా, యూఏఈలో విజిట్ వీసాలపై వచ్చిన వారికి పనులు సులభంగా దొరకడం లేదని, కంపెనీ వీసాలు ఉంటేనే రావాలని వలస కార్మికుల సంఘాల నాయకులు సూచిస్తున్నారు. స్మగ్లర్ల మాయమాటలు నమ్మి జైలు పాలుకావద్దని హెచ్చరిస్తున్నారు. -
వీడొక్కడే సినిమా తరహాలో గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా
సనత్‌నగర్: బంగారం స్మగ్లింగ్ చేసే ముఠా నలుగురిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలో సనత్‌నగర్ పోలీసులు ముగ్గురిపై కేసు నమోదు చేశారు. బాధితులు ఫిర్యాదు ఇవ్వడానికి భయపడి వెళ్లిపోవడంతో వారిని తీసుకువచ్చి శుక్రవారం సాయంత్రం ఫిర్యాదును స్వీకరించామని ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ తెలిపారు. ఈ ఘటనతో నగరంలో గోల్డ్ స్మగ్లింగ్ మాఫియా నడుస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడొక్కడే సినిమాను తలదన్నే రీతిలో... సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమాను తలదన్నేలా బంగారం స్మగ్లింగ్ వ్యవహారం కొనసాగింది. గుట్టుచప్పుడు కాకుండా దుబాయి నుంచి అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు అమాయకుల బలహీనతను ఆసరాగా చేసుకుంటున్నారు. పర్యాటక వీసాపై దుబాయ్‌కు వెళ్లేవారికి డబ్బులు ఎరగా వేసి అక్రమంగా బంగారాన్ని నగరానికి తరలిస్తున్నారు. పేస్ట్ రూపంలో ఉన్న బంగారానికి పలు రకాల రసాయనాలను అద్ది కాళ్లకు చుట్టుకుని ఎయిర్పోర్ట్ అధికారులను సైతం బురిడీ కొట్టించారు. పాతబస్తీకి చెందిన షహబాజ్ (21), శ్రీనగర్‌కాలనీకి చెందిన అయాజ్ (22), సనత్‌నగర్ అశోక్‌కాలనీకి చెందిన పహద్ (23)లను 15 రోజుల క్రితం స్మగ్లర్లు దుబాయికు పంపారు. నాలుగు రోజులపాటు దుబాయ్‌లో గడిపిన వీరికి అక్కడి స్మగ్లర్లు ఒక్కొక్కరికీ రెండు కిలోల చొప్పున పేస్టు రూపంలో ఉన్న బంగారాన్ని ఇచ్చి పంపారు. ఈ బంగారాన్ని నగరంలో ఉన్న స్మగ్లర్ల ముఠాకు అందజేసినందుకుగాను దుబాయికు వెళ్లి వచ్చేందుకు రవాణా ఖర్చులు, అక్కడ వసతి ఏర్పాట్లు, వీసా ఖర్చులతో పాటు మరో రూ.10 వేలను అందజేశారు. దుబాయికు వెళ్లిన ముగ్గురిలో అయాజ్, షహబాజ్లు తిరిగి నగరానికి వచ్చేశారు. పహాద్ మాత్రం కనిపించకుండాపోవడంతో అతని ఆచూకీ తెలపాలంటూ ఆయాజ్, షహబాజ్‌లతో పాటు కనిపించకుండాపోయిన పహద్ తండ్రి అహ్మద్ షరీఫ్, అతని బంధువు ఆసిమ్‌లను కిడ్నాప్ చేసి చిత్ర హింసలు పెట్టారు. బాధితులు సనత్‌నగర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కేసు నమోదుకు బాధితులు విముఖత వ్యక్తం చేయడంతో రెండు రోజులుగా కేసు ఏమాత్రం ముందుకుసాగలేదు. దీంతో సనత్‌నగర్ ఇన్స్పెక్టర్ ముత్తుయాదవ్ నేరుగా బాధితులను పిలిపించి వారి నుంచి ఫిర్యాదు స్వీకరించి స్మగ్లింగ్ ముఠాపై కేసు నమోదు చేశారు. స్మగ్లింగ్ ముఠాలోని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. (చదవండి: విల్లాలో విందు.. పేదింట విషాదం) -
హైవేపై ఆగని ‘జీరో’ దందా
కర్నూలు: కర్నూలు జిల్లా మీదుగా వెళ్తున్న 44వ నంబర్ జాతీయ రహదారిపై ‘జీరో’ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. పన్ను చెల్లించకుండా సంచులకొద్దీ డబ్బు, బంగారు, వెండి నగలు ఈ రహదారి గుండా బస్సుల్లో గుట్టు చప్పుడు కాకుండా రవాణా చేస్తున్నారు. గుమాస్తాల ముసుగులో బడా రియల్ఎస్టేట్ వ్యాపారులు యువకులను కొరియర్లుగా వినియోగిస్తున్నారు. చెక్‌పోస్టుల్లో కొన్నిసార్లు పోలీసులకు పట్టుబడుతున్నా వ్యాపారుల తీరులో మార్పు కనిపించడంలేదు. కర్నూలు శివారులోని పంచలింగాల అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద పట్టుబడుతున్న డబ్బు, నగలమూటలే ఇందుకు నిలువెత్తు సాక్ష్యం. ఐదు రాష్ట్రాలకు అక్రమ రవాణా నిబంధనల ప్రకారం ప్రతి ఆభరణానికి జీఎస్టీ ట్యాగ్ ఉండాలి. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఆభరణాలను తరలించేటప్పుడు జీఎస్టీ ట్యాగ్‌తో పాటు అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆదాయ పన్ను కూడా చెల్లించాల్సి ఉంటుంది. అలాంటివేమీ లేకుండా వ్యాపారులు బంగారు, వెండిపై ‘జీరో’ వ్యాపారం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి బెంగుళూరు, చెన్నై, ఛత్తీస్‌ఘడ్‌లోని పలు ప్రాంతాలకు ఆదాయపన్ను చెల్లించకుండానే గుట్టు చప్పుడు కాకుండా ప్రయాణీకుల మాటున బస్సుల్లో బంగారు వెండి ఆభరణాలతో పాటు డబ్బును తరలిస్తున్నారు. గతేడాది జూన్ నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో ఇలాంటి తరహా కేసులు దాదాపు 175కుపైగా నమోదు చేశారు. సుమారు రూ. 3.50 కోట్లు నగదు, 26 కిలోల బంగారు, 295 కిలోల వెండి, 83 సెల్ఫోన్లను తనిఖీ అధికారులు సీజ్ చేశారు. ఐదు రాష్ట్రాలకు జిల్లా మీదుగా అక్రమ రవాణా జరుగుతుందని స్పష్టమవుతోంది. జీఎస్టీ లేకుండా.. తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అక్కడి నుంచి తమిళనాడులోని సేలంకు నెలలో కనీసం రెండుసార్లు భారీ మొత్తంలో బంగారు, వెండి నగలు జీఎస్టీ లేకుండానే తరలిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. తమిళనాడుకు చెందిన విజయశర్మ, సురేష్ మునిస్వామి రూ. 2.30 కోట్ల విలువ చేసే 3.79 కిలోల బంగారు నగలు, 435 క్యారెట్ల వజ్రాలను కారులో తరలిస్తూ గత ఏడాది ఇదే చెక్‌పోస్టులోనే పట్టుబడటం అప్పట్లో సంచలనమైంది. అలాగే బెంగళూరుకు చెందిన చేతన్‌కుమార్ ఎస్ఆర్ఎస్ ట్రావెల్స్‌లో రెండు ట్రాలీ బ్యాగుల్లో రూ.3.05 కోట్లు నగదు తీసుకెళ్తూ గతేడాది ఏప్రిల్ నెలలో చెక్‌పోస్టు సిబ్బందికి చిక్కారు. భారీ మొత్తంలో ప్రభుత్వానికి ఆదాయపన్ను చెల్లించుకోవాల్సి వచ్చింది. గుమస్తాల ముసుగులో.. గుమస్తాల ముసుగులో కొందరు యువకులు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి కమీషన్ రూపంలో పనికి తగ్గట్టు వ్యాపారులు డబ్బు చెల్లిస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగుళూరు, తిరుపతి, రాయఘడ్ వంటి ముఖ్య నగరాలకు బస్సుల్లో గుట్టుచప్పుడు కాకుండా రవాణా జరుగుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం ఉండో లేక విధి నిర్వహణలో భాగంగా చెక్‌పోస్టు విధుల్లో ఉన్న సిబ్బంది తనిఖీలు చేస్తే పట్టుబడేది కొంతే. నిత్యం చెక్‌పోస్ట్ దాటిపోయేది ఎక్కువ. వరుసగా గత మూడు రోజుల్లో ఈ చెక్‌పోస్టులో రూ. 1.20 కోట్ల విలువ చేసే 167.425 కిలోల వెండి నగలు పట్టుబడటంతో తనిఖీ అధికారులే అవాక్కయ్యారు. పన్నులు చెల్లించకుండా నగలు, నగదును తరలిస్తున్న వ్యాపారుల ధైర్యం జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఆలోచనలోకి నెట్టింది. పన్ను చెల్లించాల్సిందే ప్రభుత్వానికి పన్ను చెల్లించిన తరువాతనే పట్టుబడిన నగలు, నగదు తిరిగి వారి యజమానులకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నాం. అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపేందుకు చెక్‌పోస్టులో మూడు షిఫ్టుల్లో నిరంతరం సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి ఆభరణానికి జీఎస్టీ ట్యాగ్ ఉండాలి. లేకపోతే వాటిని సీజ్ చేసి రవాణాదారులపైæ కేసు నమోదు చేస్తున్నాం. – తుహీన్ సిన్హా, సెబ్ జేడీ -
వామ్మో.. లోదుస్తుల్లో బంగారం..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): పాదరక్షల్లో బంగారం దాచి తీసుకొచ్చిన ఆరుగురిని మీనంబాక్కం విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి శ్రీలంక నుంచి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానం వచ్చింది. చెన్నైకి చెందిన ఆరుగురు ప్రయాణికులు ఒక బృందంగా వచ్చారు. అధికారులకు వారిపై అనుమానం రావడంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇద్దరు ప్రయాణికుల పాదరక్షల్లో బంగారం, నలుగురి లోదుస్తుల్లో 928 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: Tamilnadu: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి.. -
గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. నిర్వాహకుల అరెస్టు
సాక్షి, మల్లాపూర్ (హైదరాబాద్): గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరితో పాటు మరో వ్యక్తిని రిమాండ్‌కు తరలించిన ఘటన నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నాచారం సావర్కర్‌నగర్ అపార్టుమెంట్‌లోని ఓ ఇంట్లో మగ్దూం అలీఖాన్ (44), మల్లికార్జున్ (55) ఇద్దరు అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి ఎస్వోటీ, నాచారం పోలీసులు సోమవారం ఇంటిపై దాడి చేసి నిర్వాహకులతో పాటు ఓ విటుడిని రిమాండ్‌కు తరలించారు. చదవండి: పిచ్చోడి చేతికి ఫోన్.. మహిళా ఏఎస్సైకి అశ్లీల ఫోటోలు! ఏసీ ఓల్టేజీ కన్వర్టర్‌లో బంగారం స్మగ్లింగ్ శంషాబాద్: అక్రమంగా తరలించిన బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఎఫ్‌జెడ్–439 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అతడి వద్ద ఉన్న ఏసీ వోల్టేజీ కన్వర్టర్‌ను పరిశీలించగా అందులో 316 గ్రాముల బంగారం బయటపడింది. బంగారం విలువ రూ.15.71 లక్షలుంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మలద్వారంలో బంగారం స్మగ్లింగ్!
శంషాబాద్: మల ద్వారంలో బంగారం పెట్టుకుని దొంగ రవాణా (స్మగ్లింగ్) చేస్తున్న నలుగురు సూడాన్ దేశస్తులను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి ఏకంగా 7.3 కిలోల బరువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్‌కు వచ్చిన విమానంలోని ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల నడక తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వారిని వైద్యాధికారుల దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించారు. వారు మలద్వారంలో బంగారం పెట్టుకుని స్మగ్లింగ్ చేస్తున్నట్టు గుర్తించి, బయటికి తీయించారు. ఈ నలుగురు సూడాన్ దేశస్తులని, వారు స్మగ్లింగ్ చేస్తున్న బంగారం విలువ రూ.3.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారాన్ని ఎవరు ఎక్కడి నుంచి, ఎక్కడికి అక్రమ రవాణా చేస్తున్నరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. -
హైదరాబాద్: క్యాటరింగ్ ఉద్యోగి @ 2 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రెండ్రోజులుగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి రూ.1.09 కోట్ల విలువైన 2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ సంస్థలోని క్యాటరింగ్ సర్వీస్ ఉద్యోగి నుంచి ఈ బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ హైదరాబాద్ జోనల్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి స్మగ్లింగ్ అవుతున్న ఈ బంగారాన్ని ఆహార పదార్థాల లోడింగ్, అన్లోడింగ్ పద్ధతిలో హైదరాబాద్‌కు స్మగ్లింగ్ చేస్తున్నట్లు డీఆర్ఐ కనిపెట్టింది. ఇలా పార్శిల్లో వచ్చిన బంగారాన్ని క్యాటరింగ్ ఉద్యోగి బయటకు తీసుకొచ్చి స్మగ్లింగ్ గ్యాంగ్‌కు చేరవేస్తున్నట్లు గుర్తించింది. ఇతన్ని అరెస్టు చేసిన డీఆర్ఐ కోర్టులో ప్రవేశపెట్టగా.. కోర్టు రిమాండ్ విధించింది. అసలు ఈ మాఫియాలో హైదరాబాద్‌లో పనిచేస్తున్న వారు ఎవరు? ఏయే దేశాల నుంచి ఎంత బంగారం ఇప్పటివరకు వచ్చిందన్న పూర్తి అంశాలపై విచారణ జరుగుతోందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. చదవండి: పరిచయం ప్రేమగా మారింది, పెళ్లి చేసుకుంటానన్నాడు.. కానీ -
లంచం ఇవ్వకుంటే బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయి బెయిల్‌పై వచ్చిన ఓ నిందితుడి నుంచి డబ్బులు డిమాండ్ చేసి కస్టమ్స్ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. రూ.20 వేల కోసం దిగజారి ఊచలు లెక్కబెట్టాల్సిన స్థితి తెచ్చుకున్నారు. యాకత్‌పురాకు చెందిన మీర్ అస్గర్ అలీ గత ఏప్రిల్ 29న దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులకు బంగారం స్మగ్లింగ్‌లో దొరికిపోయాడు. అరెస్టయి జైలుకు పోయిన అస్గర్‌కు.. తండ్రి చనిపోవడంతో మే 30న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లరాదని, ప్రతీ పదిహేను రోజులకోసారి దర్యాప్తు అధికారి వద్ద సంతకం చేయాలని షరతు విధించింది. ఇలా కొద్దిరోజుల నుంచి కస్టమ్స్ కార్యాలయానికి వస్తూ సంతకం చేసి వెళ్తున్నాడు. రెండు నెలల క్రితం కస్టమ్స్ సూపరింటెండెంట్ కార్యాలయంలో పనిచేస్తున్న హవాల్దార్ సుందర్... అస్గర్‌ను ఇక రావద్దని, తాము పిలిచినప్పుడు వస్తే సరిపోతుందని చెప్పాడు. దీంతో అస్గర్ అప్పటి నుంచి కస్టమ్స్ కార్యాలయానికి రాలేదు. ఈనెల 7న కస్టమ్స్ ప్రివెంటివ్ విభాగం ఇన్స్పెక్టర్ కృషన్‌పాల్‌నుంచి అస్గర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. తాము ఇంటికి వస్తే ఎవరూ లేరని, ఎక్కడికి వెళ్లావని ప్రశ్నించారు. అయితే తాను కొద్దిరోజుల క్రితమే ఇల్లు మారానని, కొత్త ఇంటి అడ్రస్ పంపిస్తానని చెప్పాడు. బెయిల్ రద్దు చేయిస్తాం తర్వాతి రోజు అస్గర్ ఇల్లు ధ్రువీకరించుకున్న ఈ ముగ్గురు.. రూ.20వేలు డిమాండ్ చేశారు. చెప్పకుండా అడ్రస్ మారావని, ఇది కుట్రపూరితమని బెదిరించారు. అంతేకాకుండా కొత్త ఇంటిని పంచనామా చేయాలని, తెలిసిన ఇద్దరిని తీసుకురావాలని అస్గర్‌కు చెప్పారు. అయితే ఈ సమయంలో తనకు తెలిసిన వాళ్లు ఎవరూ ఇక్కడ లేరని చెప్పాడు. పంచానామా చేయకపోతే బెయిల్ రద్దు అవుతుందని, మళ్లీ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించారు. మరుసటి రోజు ఇద్దరు స్థానికులను తీసుకొని బషీర్‌బాగ్‌లోని కస్టమ్స్ జీఎస్టీ భవన్ రావాలని చెప్పారు. తర్వాతి రోజు అస్గర్.. సుందర్‌కు ఫోన్ చేసి ఇద్దరు స్థానికులు దొరకలేదని, రూ.20 వేలు కూడా ఇవ్వలేనని చెప్పాడు. 11వ తేదీన కస్టమ్స్ ఆఫీస్‌కు వస్తే బేరసారాలు చేసుకుందామని సుందర్ చెప్పాడు. దీంతో అస్గర్ సీబీఐకి ఫిర్యాదు చేశాడు. ఆడియో నిర్ధారణ.. ఈ నెల 11న అస్గర్ కస్టమ్స్ కార్యాలయానికి ఇద్దరిని తీసుకెళ్లాడు. రూ.20 వేలు ఇస్తే గానీ పంచానామా చేయమని, బెయిల్ రద్దుకు ప్రతిపాదన చేస్తామని బెదిరించారు. అయితే చివరకు రూ.10వేలకు డీల్ చేసుకున్నారు. సోమవారం డబ్బులు ఇస్తానని చెప్పిన అస్గర్ రికార్డు చేసిన ఫుటేజ్‌ను సీబీఐకి సమర్పించాడు. సోమవారం అస్గర్ కస్టమ్స్ సిబ్బందికి రూ.10వేలు ఇస్తుండగా సీబీఐ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆఫీసుతోపాటు వారి నివాసాల్లోనూ సోదాలు నిర్వహించి పలు ధ్రువపత్రాలు స్వాధీ నం చేసుకున్నారు. సురేష్‌కుమార్, కృషన్‌పాల్, సుందర్‌లను చేసి అరెస్ట్ చేసి మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. -
శంషాబాద్ ఎయిర్పోర్ట్: విమానంలో సీటుకింద కేజీకిపైగా బంగారం
శంషాబాద్: విమానాశ్రయంలో పకడ్బందీ తనిఖీలు నిర్వహించి బంగారం అక్రమ రవాణాను అడ్డుకుంటున్నా స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాల్లో విదేశాలనుంచి బంగారాన్ని రవాణా చేస్తూనే ఉన్నారు. మంగళవారం రాత్రి దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 025 విమానంలో సీటు కింద దాచిన 1,207 గ్రాముల బంగారాన్ని డీఆర్ఐ (డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్), కస్టమ్స్ అధికారులతో కలసి పట్టుకున్నారు. ఈ విమానంలో అక్రమ బంగారం రవాణా జరుగుతున్నట్లు డీఆర్ఐ, కస్టమ్స్ అధికారులకు ముందస్తు సమాచారం అందడంతో వచి్చన ప్రయాణికులను తనిఖీలు చేయగా ఎవరివద్దా బంగారం పట్టుబడలేదు. అయితే విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా సీటుకింద మూడువరుసలుగా ఉన్న ఈ అక్రమబంగారం బయటపడింది. దీని విలువ రూ.59.03లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. బంగారాన్ని సీటు కింద దాచిన ప్రయాణికుల వివరాలను ఆరా తీస్తున్నారు. -
ఎమర్జెన్సీ లాంతరులో ఆరు కిలోల బంగారం
శంషాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయి నుంచి ఈకే 524 విమానంలో మంగళవారం ఉదయం శంషాబాద్ వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలపై కస్టమ్స్ అధికారులకు అనుమానం కలిగింది. అతని వస్తువులను క్షుణ్ణంగా పరిశీలిం చగా ఎమర్జెన్సీ లాంతరు వెనుక భాగంలో బ్యాటరీల సైజులో నలుపు రంగు కవర్లో అమర్చిన బంగారు కడ్డీలు బయటపడ్డాయి. 6.06 కిలోల బరువున్న ఈ బంగారం విలువ 2.96 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ప్రయాణికుడిని కొరియర్‌గా ఉపయోగించుకుని బంగారాన్ని స్మగ్లర్లు అక్రమ రవాణా చేయించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బెజవాడలో గోల్డ్ మాఫియా!
-
బెజవాడలో గోల్డ్ మాఫియా!
-
బెజవాడలో గోల్డ్ మాఫియా!
సాక్షి,విజయవాడ : మన దేశంలో బంగారం కొనుగోళ్లు అధికం. పండుగలు, శుభకార్యాల వేళల్లో పసిడి అంగళ్లు కిక్కిరిసిపోతుంటాయి. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అక్రమ మార్గంలో బంగారు విక్రయాలు జరుపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పోలీసుల అదుపులో ముఠా.. విజయవాడలో కొంత కాలంగా గుట్టుచప్పుడు కాకుండా గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ముగ్గురు వ్యక్తులను విచారణ నిమిత్తం శనివారం సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. టాస్క్‌ఫోర్స్, విజలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నిందితులను విచారిస్తున్నట్లు సమాచారం. ►2018 నుంచి నగరంలో ఈ ముఠా బంగారాన్ని అనధికారికంగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ► విజయవాడ నగరానికి చెందిన వెంకటేశ్వరరావు, పీఎస్ నాగమణిలు ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులని, రైల్వే స్క్వాడ్ ఆకుల వెంకట రాఘవేంద్రరావు పైనా ఆరోపణలుండటంతో ముగ్గురినీ విచారిస్తున్నట్లు సమాచారం. ► 100 గ్రాముల బంగారం బిస్కెట్లను వాయు, జల మార్గాల ద్వారా నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. రూ.5 లక్షల ఖరీదు చేసే బిస్కెట్‌ను వీరు రూ.4 లక్షలకు విక్రయిస్తున్నారు. ► ఈ నేపథ్యంలో వీరి వ్యాపారం జోరందుకోవడంతో పలువురు బంగారం కోసం వీరికి నగదు చెల్లించారు. నగదు చెల్లించిన 20 నుంచి 30 రోజుల వ్యవధిలో వీరు బిస్కెట్లను ఇస్తారని సమాచారం. ఎలా బయటకొచ్చిందంటే.. అయితే నాలుగు నెలల క్రితం నగదు తీసుకుని ఇప్పటి వరకు బిస్కెట్లు ఇవ్వకపోవడంతో మూడు రోజుల క్రితం నాగమణితో కొందరు వాగ్వాదానికి దిగారు. ఈ వాగ్వాదాన్ని కిడ్నాప్‌గా మార్చుకుని నాగమణి పోలీసులకు ఫిర్యాదు చేయడం, పోలీసులు ఇద్దరు వ్యక్తులను పిలిచి విచారించడంతో బంగారం స్మగ్లింగ్ అంశం తెరమీదకొచ్చింది. సౌదీ టు విజయవాడ వయా సింగపూర్.. బంగారం ఉత్పత్తి కేంద్రమైన సౌదీలోని ఖతర్ నుంచే స్మగ్లింగ్ ముఠా బంగారాన్ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఖతర్ నుంచి సింగపూర్‌కు, అక్కడ నుంచి విజయవాడకు వాయు, జలమార్గాల ద్వారా బంగారం బిస్కెట్లు తీసుకొస్తున్నట్లు సమాచారం. 2018లోనే బీజం..! ► అయితే 2018లో సౌదీలోని ఖతార్‌లో జరిగిన ఏషియన్ గేమ్స్‌తోనే ఈ స్మగ్లింగ్‌కు పునాది పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ►రైల్వే స్క్వాడ్ విధులతో పాటు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీగా పని చేస్తున్న ఆకుల వెంకట రాఘవేంద్రరావు ఆ గేమ్స్‌కు ఇండియన్ టీమ్ మేనేజర్‌గా వెళ్లారు. ►అప్పట్లోనే అక్కడున్న కొందరు స్మగ్లర్లతో పరిచయాలు పెంచుకుని బంగారం బిస్కెట్ల అక్ర మ వ్యాపారాన్ని నగరంలో విస్తరించారని నగరంలోని పలు క్రీడా వర్గాలు చెప్పుకుంటున్నాయి. ► రాఘవేంద్రరావు గతంలో అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న వైనం క్రీడా సంఘాల నాయకుల మధ్య ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రైల్వే, దుర్గగుడి ఉద్యోగులే బాధితులు.. రైల్వే శాఖలో టికెట్ కలెక్టర్ల(టీసీలు)తో పాటు, బెజవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పని చేస్తున్న ఉద్యోగులే ఎక్కువమంది బంగారం బిస్కెట్ల కోసం ముఠా సభ్యులకు సొమ్ము చెల్లించినట్టు సమాచారం. సుమారు 20 మంది రైల్వే టీసీలు రైల్వే స్క్వాడ్ ఆకుల వెంకట రాఘవేంద్రరావు ద్వారా ముఠాకు సుమారు రూ.6 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. నగదు చెల్లించిన వారిలో ఇద్దరు టీసీలపై ముఠా సభ్యురాలు నాగమణి పోలీసులకు తనను కిడ్నాప్ చేశారని ఇటీవల ఫిర్యాదు చేసింది. దుర్గగుడిలో పని చేస్తున్న 12 మంది ఉద్యోగులు ముఠా సభ్యులకు సుమారు రూ.1.5 కోట్లు చెల్లించినట్లు చెబుతున్నారు. ముఠా సభ్యులకు చెల్లించిన నగదు బ్లాక్ మనీ కావడంతో లేనిపోని చిక్కులొస్తాయనే భావనతో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు ముందుకు రావడం లేదని సమాచారం. అయితే ఈ నెల 4న ఈ వ్యవహారంపై పత్రికల్లో వార్తలు రావడంతో పలువురు బాధితులు ఫోన్ చేసి వివరాలు చెబుతున్నారని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. -
దొంగ తెలివి.. కుక్కర్లో 8 కిలోల బంగారం
తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై విమానాశ్రయంలో కస్టమ్స్ సిబ్బంది ఎన్ని తనిఖీలు చేస్తున్నా బంగారం అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో కుక్కర్, మిక్సీలో 8.17 కిలోల బంగారాన్ని తీసుకొచ్చి దొరికిపోయారు. ఆదివారం రాత్రి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో 104 మంది ప్రయాణికులు వచ్చారు. కస్టమ్స్ సిబ్బంది వారిని తనిఖీ చేశారు. చెన్నై, రామనాథపురానికి చెందిన ఇద్దరిపై అనుమానం రావడంతో ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి వారి లగేజీలను పరిశీలించారు. ఎలక్ట్రానిక్ కుక్కర్, మిక్సీ తదితర గృహోపకరణాల్లో 8.17 కిలోల బంగారు బిస్కెట్లను గుర్తించారు. వాటి విలువ రూ.4.03 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
విమానాశ్రయంలో రూ.40లక్షల బంగారం స్వాధీనం
తిరువొత్తియూరు: చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద రూ.40.35 లక్షల విలువ చేసే 810 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి సౌదీ అరేబియా ప్రత్యేక విమానం చెన్నై విమానాశ్రయానికి బుధవారం ఉదయం వచ్చి చేరింది. ఇందులో వచ్చిన ప్రయాణికుల వద్ద తనిఖీ చేస్తుండగా విల్లుపురానికి చెందిన చంద్రు శక్తివేల్ (23) వద్ద 810 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
గోల్డు స్మగ్లింగ్ ఉగ్రవాద చర్యే, వారికి బెయిల్ ఇవ్వొద్దు
కొచ్చీ: బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేయడం దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ముప్పేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కేరళ హైకోర్టుకు తెలియజేసింది. 2019 నవంబర్ నుంచి 2020 జూన్ వరకు స్వప్నా సురేష్‌తోపాటు మరికొందరు యూఏఈ నుంచి 167 కిలోల బంగారాన్ని భారత్‌లోకి అక్రమంగా రవాణా చేశారని, వారిది ముమ్మాటికీ ఉగ్రవాద చర్యేనని తేల్చిచెప్పింది. గోల్డు స్మగ్లింగ్ కోసం ‘దౌత్య’ మార్గాలను ఉపయోగించుకున్నారని, ఈ వ్యవహారం భారత్–యూఏఈ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని తెలిసి కూడా తప్పుడు పనికి పాల్పడ్డారని ఆక్షేపించింది. ఈ నేరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) కిందకు వస్తుందని ఎన్ఏఐ స్పష్టం చేసింది. స్వప్నాసురేష్‌తోపాటు ఇతర నిందితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయొద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. స్వప్నా సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు గతంలోనే కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ స్వప్నాసురేష్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ శుక్రవారం కేరళ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. బంగారం స్మగ్లింగ్ కోసం నిందితురాలు పెద్ద కుట్ర పన్నారని, కొందరు వ్యక్తులను నియమించుకొని, ఉగ్రవాద ముఠాను తయారు చేశారని ఆక్షేపించింది. నిధులు సేకరించి మరీ 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని గుర్తుచేసింది. ఇందుకోసం తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ జనరల్ కార్యాలయ దౌత్యవేత్తల పేర్లను వాడుకున్నారని తెలిపింది. నిందితులను బెయిల్‌పై విడుదల చేస్తే దర్యాప్తుపై అది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వెల్లడించింది. గత ఏడాది జూలై 5న తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో 15 కిలోల బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. యూఏఈ కాన్సులేట్ చిరునామాతో వచ్చిన సంచిలో ఈ బంగారం దొరికింది. అధికారులు తీగ లాగడంతో స్వప్నా సురేష్‌తో సహా మొత్తం ఏడుగురు నిందితులు మొత్తం 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు తేలింది. -
చెన్నై ఎయిర్‌పోర్టులో భారీగా అక్రమ బంగారం పట్టివేత
-
పేస్ట్ రూపంలో బంగారం; కాళ్లకు వేసుకునే సాక్స్‌లో
చెన్నై: చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బుధవారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బహ్రయిన్ ప్రయాణికుడి వద్ద నుంచి రెండు కేజీలకు పైగా బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఆ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతన్ని అడ్డుకున్న అధికారులు విచారించగా బంగారం దాచిన విషయం బయటపడింది. బంగారాన్ని కరిగించి పేస్టు రూపంలో చేసి కాళ్లకు వేసుకునే సాక్స్‌లో దాచిన రెండు కేజీలు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు -
వామ్మో.. లోదుస్తుల్లో రూ.31 లక్షల విలువైన బంగారం..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): చెన్నై విమానాశ్రయంలో దుబాయ్ నుంచి లోదుస్తుల్లో తీసుకొచ్చిన రూ.31 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మీనంబాక్కం అంతర్జాతీయ విమానాశ్రయానికి దుబాయ్ నుంచి ప్రత్యేక విమానం బుధవారం ఉదయం చేరుకుంది. ఇందులో పెద్దమొత్తంలో బంగారం తరలిస్తున్నట్లు కస్టమ్స్‌శాఖ కమిషనర్ రాజన్‌కు సమాచారం అందింది. దీంతో సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో కడలూరుకు చెందిన బసూలుద్ధీన్ (26)ను పరిశీలించగా.. అతని లోదుస్తులలో రూ.31 లక్షల 50 వేల విలువైన 650 గ్రాముల బంగారం తీసుకొచ్చినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు బసూలుద్దీన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: లైంగిక ఆరోపణలు: జైలు నుంచి నటుడి విడుదల.. బాధితుల ఆక్రోదన -
క్యాప్యూల్స్ రూపంలో బంగారం.. ముగ్గురు మహిళలు అరెస్ట్
తిరువనంతపురం: కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ముగ్గురు మహిళల వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా బంగారాన్ని పేస్ట్‌గా మార్చి క్యాప్యూల్స్‌లో నింపిన సదరు మహిళలు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకొని పరిశీలించగా క్యాప్యూల్స్ రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దీంతో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
బంగారు టీషర్ట్! చూశారా..?
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులు వెతుకుతున్నారు. టీషర్ట్‌లో సైతం బంగారాన్ని తీసుకొచ్చి ఓ నిందితుడు బుధవారం పట్టుబడ్డాడు. దుబాయ్ నుంచి ఎఫ్‌జెడ్–8779 విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుడి కదలికలను అనుమానించిన కస్టమ్స్ అధికారులు అతన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అతడు ధరించిన టీషర్ట్‌కు పొర మాదిరిగా ఉన్న బంగారాన్ని గుర్తించారు. ఇందులోంచి 386 గ్రాముల బంగారం బయటపడింది. దీని విలువ రూ.19 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారం..స్మగ్లర్ల సింగారం
బంగారం.. ఈ పేరు వింటే చాలు మహిళల కళ్లు జిగేల్మంటాయి.. ఉన్నోళ్లు, పెద్దగా లేనోళ్లు.. ఎవరైనా సరే ఉన్నంతలో పండుగలు, పబ్బాలు, పెళ్లిళ్లకు నగలు ధరించడం అంటే అత్యంత ప్రీతిపాత్రం.. అమ్మాయిల పెళ్లిళ్ల కోసం ఏళ్లతరబడి కూడబెట్టిన సొమ్ముతో పలువురు నగలు కొంటుంటారు.. మరికొందరు ఏటా కొద్ది మొత్తంలో బంగారం కొని, దాచుకుంటుంటారు.. ఇది నగదుకు ప్రత్యామ్నాయం.. అందువల్లే ఎప్పుడైనా, ఎక్కడైనా సరే బంగారానికి యమా గిరాకీ. ఈ గిరాకీనే వ్యాపారుల పాలిట ‘బంగారం’గా మారింది. లాభాల కోసం ‘అడ్డ దారి’ రాజ మార్గం అయింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: బంగారం ధర దేశ దేశాలకూ మారుతుంది. రాష్ట్రంలోనూ ఒక్కో ఊళ్లో ఒక్కో ధర ఉంటుంది. ఇదే అదనుగా చెన్నైలోని బంగారం (గోల్డ్) స్మగ్లింగ్ ముఠా పేట్రేగి పోతోంది. ఎయిర్‌పోర్టు, షిప్పింగ్ పోర్టులను అడ్డాలగా మార్చుకుని విదేశీ బంగారాన్ని తక్కువ ధరకు అనధికారికంగా దిగుమతి చేసుకుంటోంది. తర్వాత ఆభరణాలుగా తయారు చేసి అధిక ధరకు విక్రయిస్తోంది. ఈ క్రమంలో చెన్నై నుంచి నెల్లూరు నగరానికి.. నెల్లూరు నుంచి లైన్ బిజినెస్ పేరుతో విశాఖపట్నం వరకు అన్ని ప్రాంతాలకు బంగారు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అతికొద్ది షాపులు మినహా ఎక్కడా పన్నులు చెల్లించిన దాఖలాలు లేవు. చెన్నై నగరం నుంచి కస్టమ్ డ్యూటీ, జీఎçస్టీ చెల్లించకుండా రోజూ నెల్లూరుతోపాటు రాష్ట్రమంతా వంద కిలోలకు పైగానే బంగారం బిస్కెట్లు, ఆభరణాలు సరఫరా అవుతున్నాయి. నెల్లూరు నగరంలోని బంగారం విక్రయ దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు (ఫైల్) , గత డిసెంబర్లో చెన్నై నుంచి బస్సులో అక్రమంగా తరలిస్తున్న బంగారు, వెండి ఆభరణాలు, నగదును పట్టుకున్న అధికారులు (ఫైల్) ఒక్క రూపాయి పన్ను చెల్లించకుండా.. నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారం మారిన క్రమంలో ధరలు నింగినంటుతున్నాయి. ప్రధానంగా శ్రీలంక, బంగ్లాదేశ్, దుబాయ్, ఇతర అరబ్ దేశాల నుంచి ప్రతి రోజూ రాష్ట్ర సరిహద్దులోని చెన్నై నగరానికి కిలోల కొద్దీ బంగారం దిగుమతి అవుతోంది. బంగారానికి గతంలో 12.5 శాతం కస్టమ్ డ్యూటీ ఉండేది. ఇప్పుడు దాన్ని 7.5 శాతానికి తగ్గించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర జీఎస్టీలు కలిపి 3 శాతం ఉంది. అంటే మొత్తంగా దిగుమతి అయి కొనుగోలు చేసే బంగారానికి 10.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ అవేవీ చెల్లించకుండానే వందల కిలోల బంగారం వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతోంది. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్‌కు ప్రత్యేక కొరియర్ సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటాం బంగారం వ్యాపారాలపై తరచూ తనిఖీలు నిర్వహిస్తుంటాం. ఫిర్యాదుల వస్తే తప్పకుండా తనిఖీలు చేపట్టి, ఫెనాల్టీతో పన్ను వసూలు చేస్తాం. రెండేళ్లలో 25 కేసులు నమోదు చేశాం. వారి నుంచి రూ.1.5 కోట్లకు పైగా పన్నుతో పాటు ఫెనాల్టీ విధించాం. – కల్పన, జాయింట్ కమిషనర్, వాణిజ్య పన్నుల శాఖ త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు బంగారం వ్యాపారులు జీఎస్టీ ఎగవేతపై పక్కా సమాచారంతో ఇటీవల నెల్లూరు కేంద్రంలో మూడు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాం. క్రయ, విక్రయాలు, జీఎస్టీకి సంబంధించిన రికార్డులు స్వాధీనం చేసుకున్నాం. త్వరలో జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తాం. – కె.రాజేశ్వరరెడ్డి, రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి, నెల్లూరు స్మగ్లర్లకు ఆదాయం ఇలా.. ► 24 క్యారెట్ల బంగారం కిలో ధర మద్రాసు బులియన్ మార్కెట్లో రూ.47.88 లక్షలు ఉండగా, హైదరాబాద్‌లో రూ.47.78 లక్షలుగా ఉంది. అదే దుబాయ్‌లో మన కరెన్సీ ప్రకారం రూ.42.59 లక్షలు, శ్రీలంకలో రూ.40.16 లక్షలు ఉంది. ► ఉదాహరణకు.. శ్రీలంక నుంచి కొనుగోలు చేస్తే, అక్కడి ధరకు 10.5 శాతం అంటే సుమారు రూ.4.20 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఇలా చేయకుండా కస్టమ్స్ కళ్లుగప్పి.. లేదా వారితో ఒప్పందం కుదుర్చుకుని, తెచ్చిన బంగారాన్ని మద్రాసు ధర ప్రకారం కిలో రూ.47.88 లక్షలకు విక్రయిస్తారు. ► ఈ లెక్కన కేజీకి రూ.7 లక్షలు, పన్నుల రూపంలో మరో రూ.4 లక్షలు మొత్తంగా రూ.11 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. ఇందులో సగటున 20 శాతం వరకు వివిధ శాఖలకు మామూళ్లు చెల్లించి వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. నెల్లూరు కేంద్రంగా భారీగా వ్యాపారం ► రాష్ట్రంలో బంగారు ఆభరణాల తయారీకి, ప్రత్యేకంగా స్టోన్ వర్క్ ఆభరణాల తయారీకి నెల్లూరు జిల్లా ప్రసిద్ధి. ఇక్కడ ధరలు తక్కువ. డిజైన్లు ఎక్కువ. రోజూ సగటున వంద కేజీల బంగారం నెల్లూరు జిల్లా వ్యాపారులే కొంటున్నట్లు అంచనా. ► వీటిలో సగం బిస్కెట్ల రూపంలో, మిగిలిన సగం ఆభరణాల రూపంలో రైళ్లలో తీసుకొస్తారు. రాష్ట్రంలోకి 70 శాతం బంగారం చెన్నై ద్వారానే వస్తుంది. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోనూ ఇదే తరహాలో వ్యాపారం సాగుతోంది. -
మహిళ తెలివి: లో దుస్తుల్లో బంగారం పేస్ట్..
సాక్షి, శంషాబాద్: షార్జా నుంచి వచ్చిన ఓ మహిళ అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ అరేబియా విమానం జీ–9458లో షార్జా నుంచి శుక్రవారం మధ్యాహ్నం ఓ మహిళ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఆమె కదలికలపై అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. లో దుస్తుల్లో బంగారం పేస్టును రెండు ఉండలను గుర్తించారు. 548 గ్రాముల బరువు గల బంగారం విలువ రూ.25.4 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన విదేశీ కరెన్సీ విదేశీ కరెన్సీ పట్టివేత హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు అక్రమంగా విదేశీ కరెన్సీ తీసుకెళుతూ పట్టుబడ్డాడు. శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి జి–9541 విమానంలో షార్జా వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు తనిఖీ చేశారు. అతడి బ్యాగేజీలో భారత కరెన్సీలో రూ.8.4 లక్షల విలువ చేసే యూఎస్, ఒమన్, యుఏఈ దేశాలకు చెందిన కరెన్సీ బయటపడింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్‌లో బంగారం -
మిక్సీ గ్రైండర్, కటింగ్ ప్లేర్‌లో బంగారం
శంషాబాద్: విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి అక్రమార్కులు కొత్తకొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కస్టమ్స్ అధికారులు ఓ వైపు కట్టడి చేస్తున్నా స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రి ఫ్లైదుబాయ్ ఎయిర్‌లైన్స్ –8779 విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఐదుగురు ప్రయాణికుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కస్టమ్స్ అధికారులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి లగేజీలో ఉన్న కటింగ్ ప్లేర్లు, మిక్సీగ్రైండర్లను పరిశీలించగా.. బంగారంతో తయారు చేసిన కటింగ్ ప్లేర్‌లకు ఇనుప పూత వేశారు. అలాగే మిక్సీ గ్రైండర్ లోపల ఉండే మోటార్ యంత్రాల్లో కూడా బంగారు ప్లేట్లను అమర్చారు. అనుమానం రాకుండా సిల్వర్ కోటింగ్ వేశారు. మొత్తం ఐదుగురి నుంచి రూ. 1.15 కోట్ల విలువైన 2.5 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. బంగారంతో పట్టుబడిన ప్రయాణికులు క్యారియర్లుగా పనిచేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విదేశీ కరెన్సీ పట్టివేత దుబాయ్ వెళుతున్న ఓ ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రయాణికుడు మంగళవారం అర్ధరాత్రి ఎఫ్‌జెడ్–8776 విమానంలో దుబాయ్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. అధికారుల తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 30,000 అమెరికన్ డాలర్లు బయటపడ్డాయి. వీటి విలువ భారత కరెన్సీలో రూ.21,48,000 ఉంటుం దని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఫెమా చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్: కారులో కిలోల కొద్ది బంగారం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. చౌటప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ దాదాపు 12 కోట్లు ఉంటుందని అంచనా. బంగారాన్ని చెన్నైలో డెలివరీ చేయాలని కోల్‌కతా గోల్డ్ మాఫియా ముఠాకు అప్పగించినట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. దీంతో ముందస్తు సమచారం మేరకు అక్కడికి చేరుకున్న అధికారులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారు బానెట్ భాగంలో కింది భాగంలో బంగారం అమర్చి తరలిస్తున్న ముగ్గురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. చదవండి : బంజారాహిల్స్‌లో పని మనిషి అరెస్టు ప్రియురాలికి వేధింపులు.. ప్రియుడి అనుమానాస్పద మృతి -
చూయింగ్‌గమ్, చెప్పుల్లో బంగారం స్మగ్లింగ్
సాక్షి, శంషాబాద్: ఎయిర్‌పోర్టులో నలుగురు ప్రయాణికుల నుంచి కస్టమ్స్ అధికారులు 471 గ్రాముల బంగారం, ఒక ఉంగరం స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి షార్జా నుంచి 6ఈ–1406 విమానంలో వచ్చిన నలుగురు ప్రయాణికుల లగేజీలను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా ఏమీ దొరకలేదు. అయితే వారి కదలికలు, మాటల తీరు అనుమానించిన అధికారులు నోట్లో తనిఖీ చేశారు. నలుగురి నోట్లో ఉన్న చూయింగ్ గమ్‌ను బయటకు తీయించగా, అందులో 471 గ్రాముల చిన్న చిన్న ముక్కలుగా ఉన్న బంగారంతో పాటు ఒక ఉంగరం బయటపడింది. ఈ బంగారం విలువ సుమారు రూ.20.67 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. అలాగే షార్జా నుంచి ఎయిర్ అరేబియా జి–9458 విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి చెప్పుల్లో 694 గ్రాముల బంగారం బయటపడింది. ఈ చెప్పులను కవర్లు, కార్బన్ పేపర్లతో ప్రత్యేకంగా తయారు చేయించినట్లు అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ రూ.27.04 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. -
250 కిలోల బంగారం స్మగ్లింగ్: ప్రీత్ అగర్వాల్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లింగ్ కేసులో నగరానికి చెందిన ఘన శ్యామ్ జ్యువెల్లర్స్ యజమాని కుమారుడు ప్రీత్ కుమార్ అగర్వాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఎగుమతి చేసే బంగారాన్ని దేశీయంగా అమ్మి సొమ్ము చేసుకున్నట్టు అభియోగం ఉన్నట్లు తెలిపారు. కోల్‌కతా విమానాశ్రయంలో2018లో బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ కేసు ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రీత్ కుమార్ అగర్వాల్ సుమారు 250 కిలోల బంగారం అక్రమాలకు పాల్పడినట్టు ఈడీ తేల్చింది. హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లోఈడీ సోదాలు నిర్వహించగా పెద్ద ఎత్తున హవాలా లావాదేవీలు జరిగినట్టు ఈడీ అధికారులు గుర్తించారు. చదవండి: వీడియో కాల్ చేసి ప్రియురాలి ఆత్మహత్య -
అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళ సీఎంపై సంచలన ఆరోపణలు
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు భారీ షాక్ తగిలింది. కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో పినిరయి విజయన్‌కు చాలా సన్నిహిత సంబంధం ఉందనే ఆరోపణలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్పప్న సురేష్ కస్టమ్స్ అధికారుల విచారణలో సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలిసింది. గోల్డ్, డాలర్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాత్ర ఎంతో ఉందని.. ఆయన స్వయంగా కాన్సులేట్ జనరల్‌తో మాట్లాడారని ఆమె కస్టమ్స్ అధికారులకు తెలిపారు. విజయన్‌తో పాటు మరో ముగ్గురు కేబినెట్ మంత్రులపై ఆమె ఆరోపణలు చేశారు. ఈ విషయాలను కస్టమ్స్ డిపార్ట్మెంట్ అధికారులు కేరళ హై కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘‘విజయన్‌కు అరబిక్ భాష రాదు. అందువల్ల స్వప్న సురేష్ ముఖ్యమంత్రికి, కాన్సులేట్ జనరల్‌కి మధ్య మధ్యవర్తిగా వ్యవహించారు. ఈ డీల్‌లో సీఎం, మిగతా ముగ్గురు మంత్రులు కోట్ల రూపాయలను కమిషన్‌గా పొందినట్లు స్వప్న సురేష్ తెలిపారు’’ అన్నారు. ఈ సందర్భంగా కేరళ ప్రతిపక్ష నాయుకుడు రమేశ్ చెన్నితాలా మాట్లాడుతూ.. ‘‘గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మొదటి నుంచి మేం ఏం ఊహించామో అదే జరిగింది. ఈ కేసులో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని మేం ముందే గుర్తించాం. దీనికి ముఖ్యమంత్రి ఏం సమాధానం చెప్తారు’’ అన్నారు. చదవండి: గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీఎం రాజీనామా చేయాలి -
మొత్తం కేసులు 536, బంగారం 312 కిలోలు
సాక్షి, హైదరాబాద్: ‘పలుకే బంగారమ య్యేనా..’‘నీ ఇల్లు బంగారం కానూ..’‘మా ఆయన బంగారం..’ఇలాంటి మాటలను బట్టి చూస్తే తెలియడంలేదూ.. బంగారమంటే ఎవరికైనా ఎంతిష్టమో! ఒంటిపై బంగారు నగలుంటే ఆ దర్జానే వేరు. సామాజిక, ఆర్థిక అంతరాలకు అతీతంగా అంద రూ పసిడిని అమితంగా ఇష్టపడుతుంటారు. మగువల సంగతి సరేసరి. ఈ ఇష్టం ఈనాటిది కాదు. వేల ఏళ్లనాటిది. బంగారానికి ఆదరణ అధికంగా ఉన్నచోట పలు అక్రమాలు వెలుగుచూడటం మరోకోణం. కొందరు సుంకాన్ని ఎగ్గొట్టేందుకు బంగారాన్ని అక్రమరవాణా చేస్తుంటారు. విదేశాల్లో తక్కువకు కొని, మనదేశంలో పన్ను ఎగ్గొట్టి రహస్యంగా తరలిస్తుంటారు. కస్టమ్ లేకుండా వచ్చి.. ఇక్కడ చిక్కుతున్నారు. పన్ను ఎగ్గొట్టేందుకే..! మనరాష్ట్రంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సింహద్వారం శంషాబాద్ విమానాశ్రయం. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల విదేశీయానానికి ఇదే ముఖద్వారం. అందుకే, ఈ విమానాశ్రయం ద్వారా విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేవారు తరచూ కస్టమ్స్ అధికారులకు చిక్కుతుంటారు. వాస్తవానికి వీరు అక్కడ బంగారాన్ని కొనుక్కునే వస్తారు. దానికి కస్టమ్స్ డ్యూటీ చెల్లిస్తే ఏ సమస్యా ఉండదు. కానీ, చాలామంది కస్టమ్స్ డ్యూటీ చెల్లించేందుకు ఇష్టపడక.. పలు అడ్డదారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, నిఘావ్యవస్థలు అక్రమ బంగారం రవాణాను ఇట్టే పట్టేస్తున్నాయి. కిలో వరకు చాన్స్ వాస్తవానికి విదేశాలకు వివిధ వేడుకలు, విహారయాత్రలు, వ్యాపారాల పనిమీద వెళ్లేవారికి ఒక కిలో వరకు బంగారం కొనుగోలు చేసి తీసుకువచ్చేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. ఈ సదుపాయం కేవలం భారత పౌరులకు మాత్రమే. వీరు తీసుకువచ్చిన కిలో బంగారం మొత్తం విలువలో 38.5 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తీసుకువెళ్లవచ్చు. ఒకవేళ సంవత్సరంపాటు భారతీయులు విదేశాల్లో ఉండి ఇండియాకు వచ్చినట్లయితే వారు తీసుకువచ్చిన మొత్తం బంగారం విలువలో 13.5 శాతం కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. అక్రమమార్గంలో ఎంతంటే.? గత ఐదేళ్లలో కస్టమ్స్ అధికారులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంత బంగారాన్ని పట్టుకున్నారన్న విషయం తెలుసుకునేందుకు నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద దరఖాస్తు చేసుకున్నారు. 2015 నుంచి 2020 డిసెంబర్ వరకు 536 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం రూ.96.15 కోట్ల విలువైన 312.87 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈ దేశాల నుంచే అధికంగా.. విదేశాల నుంచి శంషాబాద్‌కు వచ్చే బంగారంలో అధికశాతం గల్ఫ్ దేశాలదే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఖతార్, సౌదీ అరేబియా, జెడ్డా, మలేసియా, బెహ్రా యిన్, థాయ్‌లాండ్, సింగపూర్ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల వద్దే పైన పేర్కొన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్ అధికారులు ప్రకటించారు. ఆయా దేశాల్లో బంగారం విక్రయాలపై పెద్దగా ఆంక్షలు లేవు. అందుకే, చాలామంది బంగారం కొనేసి విమానమెక్కుతారు. తీరా ఇండియాకు వచ్చేసరికి విధించే 38.5 శాతం కస్టమ్స్ ట్యాక్స్ చూసి కళ్లు తేలేస్తుంటారు. కానీ, బంగారం విక్రయాల్లో ఆరితేరిన వారు అక్రమమార్గాల్లో తీసుకువస్తుంటారు. ఈ రెండు మార్గాల్లో కాకుండా విదేశాల్లో స్థిరపడి ఏడాదికి ఒకసారి వచ్చేవారిని కొందరు ఆశ్రయిస్తారు. ఇక్కడ నుంచి డబ్బులు పంపి బంగారం కొనిపించి మరీ తెప్పిస్తారు. 13.5 శాతం ట్యాక్స్ కూడా వీరే కడతారు. ఇలా బంగారం తెచ్చిచ్చినందుకు వారికి టికెట్ ఖర్చులో, ఇతర బహుమానాలో ఇస్తుంటారు. -
కడుపులో 4.15 కిలోల బంగారం
సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగారాన్ని మాత్రల రూపంలో మింగేసి అక్రమరవాణాకు పాల్పడిన 8 మందిని చెన్నై విమానాశ్రయ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వీరి కడుపులో నుంచి రూ. 2.17 కోట్ల విలువైన 4.15 కిలోల బంగారాన్ని బయటకు తీశారు. వందేభారత్ ఎయిర్ ఇండియా విమానం జనవరి 30న దుబాయ్ నుంచి చెన్నైకి చేరుకుంది. అందులో వచ్చిన ప్రయాణికుల్లో 8 మందిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం రావడంతో తనిఖీ చేశారు. ఏమీ దొరకలేదు. అయినా అనుమానం తీరకపోవడంతో విమానాశ్రయంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి కడుపు భాగాన్ని ఎక్స్‌రే తీయగా బంగారు ఉండలు మాత్రల రూపంలో కనపడ్డాయి. (చదవండి: నువ్వు గ్రేట్ బంగారం!) మంచినీళ్లు తాగుతూ మాత్రల రూపంలో బంగారాన్ని మింగినట్లు పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ 8 మందిని చెన్నైలోని స్టాన్లీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి బంగారు మాత్రలను బయటకు తీశారు. వారి కడుపులో నుంచి వచ్చిన రూ.2.17 కోట్ల విలువైన 4.15 కిలోల 161 బంగారు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. కనకవల్లి, నిషాంతి, కళా, ఫాతిమా, పుదుకోటైకి చెందిన జయరాజ్, జగదీష్, కబర్‌ఖాన్, రామనాథపురానికి చెందిన హకీంలను చెన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. -
బంగారాన్ని ట్యాబ్లెట్లుగా చేసి స్మగ్లింగ్
కోజికోడ్: బంగారం అక్రమ మార్గాల్లో రవాణా చేస్తూ పట్టుబడుతున్న కేసులు అధికంగా నమోదవుతున్నాయి. బంగారాన్ని రహాస్యంగా తరలించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ చివరకు పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా కేరళలో బంగారు స్మగ్లింగ్ కేసు పోలీసులను ఆశ్చర్ల్యంలో ముంచెత్తింది. బంగారాన్ని ట్యాబ్లెట్లు మాదిరిగా తయారు చేసి అక్రమంగా తరలించే ప్రయత్నం చేశాడు. తీరా విమానాశ్రయంలో తనిఖీల వద్ద వచ్చేసరికి అధికారులు గుర్తించారు. ఈ ఘటన కోజికోడ్ విమానాశ్రయంలో జరిగింది. ఒకరు షార్జా నుంచి రాగా, మరో వ్యక్తి దుబాయ్ నుంచి వచ్చారు. వారు విమానాశ్రయంలోకి దిగగా వారి ప్రవర్తన అనుమానంగా కనిపించడంతో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పరిశీలించగా షార్జా నుంచి వచ్చిన వ్యక్తి సాక్షుల్లో ట్యాబ్లెట్లు కనిపించాయి. వాటిని పరీక్షించగా 478 గ్రాముల బంగారం కనిపించింది. మరో వ్యక్తి వద్ద నుంచి 765 గ్రాముల బంగారం సీజ్ చేశారు. వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం బంగారం 1.24 కిలో గ్రాములు. దాని విలువ రూ.53 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. -
పట్టుకున్న బంగారం ఏం చేస్తారు?
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, వజ్రాలు, విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు అక్రమంగా తరలిస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడడం తెలిసిందే. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే ఇలా కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న పసిడి, వెండి, వజ్రాలు తదితర విలువైన వస్తువులను తర్వాత ఏం చేస్తారు? అనేది తెలుకోవాలనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. దీనితోపాటు మరికొన్ని ప్రశ్నలను నగరానికి చెందిన ఓ సమాచార హక్కు కార్యకర్త ఆర్టీఐ దరఖాస్తు ద్వారా అడిగితే ఏం సమాధానం వచ్చిందో తెలుసా? ‘‘మా వద్ద సమాచారం లేదు’’అని!! అది చదివి అవాక్కవడం అతని వంతైంది. పన్ను ఎగ్గొట్టే యత్నంలో.. యూఏఈ, సౌదీ అరేబియా తదితర గల్ఫ్ దేశాల నుంచి బంగారం, ఇతర దేశాల నుంచి పలు ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ కరెన్సీని కొందరు విమానాల ద్వారా అక్రమంగా హైదరాబాద్‌కు తెస్తుంటారు. పన్ను ఎగ్గొట్టే ఉద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా వీటిని తీసుకొస్తుంటారు. అత్యంత ఆధునిక విధానాల్లో వీటిని తెస్తూ కస్టమ్స్ అధికారుల కంట పడకుండా బురిడీ కొట్టిస్తుంటారు. అయితే, బాడీ స్కానింగ్ తదితర అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చాక.. స్మగ్లర్ల పప్పులు ఉడకడం లేదు. ఇలా పట్టుబడిన బంగారం, వెండి, వజ్రాలు, కరెన్సీ, విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను కస్టమ్స్ అధికారులు ఏం చేస్తారు? వీటిని వేలం వేస్తారా? లేక ఇతర శాఖలకు పంపుతారా? కోర్టుకు స్వాధీనం చేస్తారా? అనే సందేహాలు తలెత్తుతుంటాయి. ఇవే ప్రశ్నలను సంధిస్తూ నగరానికి చెందిన రాబిన్ అనే సామాజిక ఉద్యమకారుడు శంషాబాద్‌లోని హైదరాబాద్ కస్టమ్స్ ఆఫీసుకు, సనత్‌నగర్‌లోని కస్టమ్స్ డిప్యూటీ కమిషనర్‌కు సమాచార హక్కు ద్వారా దరఖాస్తు చేశాడు. చెన్నై సీబీఐ లాకర్లా అయితే ఎలా?: రాబిన్ తన ప్రశ్నలకు కస్టమ్స్ అధికారులు ఎలాంటి సమాచారం లేదని చెప్పడంపై ఆర్టీఐ దరఖాస్తుదారుడు రాబిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. నిత్యం కస్టమ్స్ వాళ్లు పట్టుకుంటున్న బంగారం, వెండి, విదేశీ కరెన్సీ వివరాల గురించి ప్రసార మాధ్యమాల్లో వార్తలు వస్తుంటాయని, స్వాధీనం చేసుకున్న వాటిన ఏంచేస్తారో ప్రజలకు చెప్పకపోవడం ఏంటని వాపోయాడు. అసలు ఈ వస్తువుల రికార్డు నిర్వహణ సరిగా ఉందా? అని నిలదీశాడు. నిర్వహణ సరిగా లేకపోతే ఇటీవల చెన్నైలోని సీబీఐ కస్టడీ నుంచి దాదాపు 100 కిలోల బంగారం మాయమైన తరహాలో జరిగితే ఏమేం మాయమయ్యాయనే సంగతి ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నాడు. ఈ తొమ్మిది ప్రశ్నలు సంధించాడు! (1) 2015 నుంచి 2020 వరకు కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల వివరాలు (2) స్వాధీనం చేసుకున్న వస్తువులు ఏయే దేశాలవి? (3) 2015–2020 వరకు నమోదు చేసిన కేసులు (4) స్వాధీనం చేసుకున్న బంగారం, వెండి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు ఏం చేస్తారు? (5) ప్రస్తుతం హైదరాబాద్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వద్ద ఉన్న వస్తువుల విలువ ఎంత? (6) సీజ్ చేసిన వçస్తువులను హైదరాబాద్ కస్టమ్స్ వేలం వేస్తుందా? (7) మీరు నిర్వహించిన వేలంలో విక్రయించిన పది వస్తువులు, వాటిని కొనుగోలు చేసిన వ్యక్తుల వివరాలు (8) వేలం సమాచారం ప్రజలకు ఎలా తెలియజేస్తారు? గత పది వేలంల గురించిన వివరాలు (9) హైదరాబాద్ కస్టమ్స్ శాఖ సీజ్ చేసిన వస్తువుల్లో ఎన్ని కస్టడీలో ఉన్నాయి? ఇతర విభాగాలు, కోర్టుకు ఎన్నింటిని అప్పగించారు? -
ఓవర్ హెడ్ బిన్లో బంగారం దాచి..
న్యూఢిల్లీ : 70 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఓ ఎయిర్ ఇండియా సిబ్బంది, క్యాటరింగ్ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. ఈ సంఘటన ఆదివారం న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆదివారం ఎయిర్ ఇండియా సిబ్బంది ఒకరు విమానంలో 70 లక్షల రూపాయలు విలువ చేసే బంగారాన్ని లండన్ నుంచి ఇండియాకు తెచ్చాడు. కస్టమ్స్ అధికారులనుంచి తప్పించుకోవటానికి బంగారాన్ని ఓవర్ హెడ్ బిన్( వస్తువులు భద్రపరిచే సీట్లపై భాగం)లో దాచేశాడు. ( ప్రసాదంపాడులో గ్యాస్ సిలిండర్ పేలుడు ) అనంతరం దాచిన బంగారం గురించి స్మగ్లింగ్‌లో భాగస్తుడైన క్యాటరింగ్ సిబ్బంది ఒకరితో చర్చించాడు. వీరి మాటలను విన్న అధికారులు ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించారు. వారి వద్దనుంచి 1.667 కేజీల దాచిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన 1.5 కేజీల బంగారం స్మగ్లింగ్‌లోనూ తమ పాత్ర ఉన్నట్లు నిందితులు తెలిపారు. -
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సంచలన ఆరోపణలు
తిరువనంతపురం: కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో సస్పెండైన ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రిన్స్‌పల్ సెక్రటరీ ఎం శివశంకర్ తరపు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాజకీయ నాయకులు పేర్లు చెప్పడానికి నిరాకరించడంతోనే తనని అరెస్ట్ చేశారని శివశంకర్ తన తరపు న్యాయవాది ద్వారా హై కోర్టుకు తెలిపారు. ఈ ఏడాది జూలైలో యూఏఈ నుంచి వచ్చిన ఓ కార్గోలో 30 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ.. అడ్డంగా బుక్కయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన స్పప్నసురేష్‌కి శివ శంకర్ సాయం చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఆయనని అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో శివశంకర్ న్యాయవాది మాట్లాడుతూ.. "ఈడీ స్పష్టమైన వైరుధ్యాలను సృష్టించింది. శివశంకర్ అరెస్టుకు, కస్టడీకి తగినట్లుగా వారు తమకు నచ్చినట్లు ఒక కథనాన్ని రూపొందించారు. ఇది చాలా అనుమానాస్పదంగా ఉంది. కోర్టు ముందు వాస్తవాలను సక్రమంగా సమర్పించడానికి సంకోచిస్తుంది. ఈ విషయంలో ఈడీ ఆరోపణలని నమ్మలేం" అని తెలిపారు. అంతేకకాక "సీనియర్ కస్టమ్స్ అధికారితో మాట్లాడానని, స్వప్న సురేష్ కోరిక మేరకు ఒక అభ్యర్థన చేశానని శివశంకర్ తన ప్రకటనలో అంగీకరించారని ఈడీ పేర్కొంది. అయితే శివశంకర్ జరిపిన సంభాషణ స్వభావానికి సంబంధించి గానీ.. శివశంకర్ ఎవరితో మాట్లాడారనే దానికి సంబంధించి గానీ నేటి వరకు ఈడీ ఎలాంటి ప్రకటన, దావా చేయలేదు. కోర్టు వాస్తవాలను అర్థం చేసుకోకుండా ఉండేందుకు గాను ఉద్దేశపూర్వకంగానే ఈడీ ఈ అస్పష్టతను సృష్టించింది" అని శివశంకర్ తరపు న్యాయవాది ఆరోపించారు. అంతేకాక శివశంకర్ అరెస్ట్ ఆర్డర్లో ఈడీ ఆయన ఇతర డిప్లొమాటిక్ కార్గోలను క్లియర్ చేయాలని తెలిపారని పేర్కొంది. దీన్నిబట్టి తన ఆరోపణలకు సంబంధించి ఈడీకే స్పష్టత లేదని తెలుస్తుంది అన్నారు. (చదవండి: శివశంకర్‌ను లోతుగా విచారించాలి) న్యాయవాది మాట్లాడుతూ.. ‘ఇక తన వాట్సాప్ చాట్లలో శివ శంకర్ లాక్ర్ గురించి గానీ.. అందులో ఉంచిన డబ్బుతో గానీ తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తాను కేవలం స్పప్న సురేష్‌ని అకౌంటెంట్‌కి పరిచయం చేశానని మెసేజ్‌లో తెలిపారు. అయితే ఈ విషయంలో తప్పుదోవ పట్టించేందుకు ఈడీ వాట్సాప్ చాట్ మొత్తాన్ని ఇవ్వలేదని.. ఒక నిర్దిష్ట మెసేజ్‌ని మాత్రమే చూపించిందని.. దానికి ముందు మెసేజ్‌లు.. దాని తర్వాత సందేశాలను కోర్టుకు సమర్పించలేదని’ ఆయన తెలిపారు. అందువల్లే ఈ ఆరోపణలు, అనుమానాలు తలెత్తాయని శివ శంకర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అలానే లైఫ్ మిషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా శివశంకర్‌కు ముడుపులు దక్కాయనే ఆరోపణల్ని కూడా ఆయన ఖండించారు. ఆ ప్రాజెక్ట్‌కు శివశంకర్ 2018, 2019లో కొద్ది కాలం మాత్రమే సీఈఓగా పని చేశారని.. ఆయన పదివి కాలం కంటే ముందే కాంట్రాక్ట్ జరిగిపోయిందని తెలిపారు. -
ఐడియా సూపర్.. కానీ బుక్కయ్యావ్‌గా!
సాక్షి, హైదరాబాద్: బంగారం అక్రమ రవాణా నిరోధం కోసం ప్రభుత్వం ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికి జనాల మైండ్ సెట్ పెద్దగా మారడం లేదు. ఏదో విధంగా అధికారుల కళ్లు కప్పి బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కొన్ని సార్లు అడ్డంగా బుక్కవుతున్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. నిఘా పెరుగుతున్న కొద్ది జనాల ఆలోచనలు కూడా మారుతున్నాయి. కనీవిని ఎరుగని రీతిలో, రూపాల్లో.. దారుల్లో బంగారాన్ని తరలించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ వ్యక్తిని చూస్తే.. ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే సదరు వ్యక్తి అధికారుల కళ్లుగప్పి బంగారాన్ని తరలించడానికి ప్యాంటుకు ప్రత్యేకంగా ఓ జేబు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఏం లాభం దొరికిపోయాడు. వివరాలు.. దుబాయ్ నుంచి నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అధికారుల కన్ను గప్పి బంగారాన్ని తరలించాలని చూశాడు . అందుకు గాను తన ప్యాంటుకు లోపల ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకున్నాడు. దానిలో 71.47 గ్రాములు బంగారాన్ని ముక్కలుగా కట్ చేసి అందులో పెట్టాడు. కానీ కస్టమ్స్ అధికారుల తనిఖీలో ఈ జేబు, దానిలోని బంగారం బయటపడింది. ఇక బహిరంగ మార్కెట్ లో ఈ బంగారం విలువ 3,67,570 రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. -
డ్రగ్స్ దందాకు కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌కు లింక్!
సాక్షి బెంగళూరు: కన్నడనాట డ్రగ్స్ మాఫియా వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ డ్రగ్ దందాకు కేరళ గోల్డ్ స్మగ్లింగ్‌కి లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) లోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. బెంగుళూరు మాదకద్రవ్యాల కేసులో కీలక నిందితుడు డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్, కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో నిందితుడు కె టి రమీస్తో మధ్య జరిగిన సంభాషణలే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. ఇద్దరి మధ్య నిత్యం సంప్రదింపులు జరిగాయని అధికారి పేర్కొన్నారు. మొదటినుంచి ఈ రెండు కేసులకి మధ్య సంబంధాలున్నాయనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా నిందితుల మధ్య జరిగిన సంభాషణలు అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. ఇప్పటికే ఎన్‌సిబి అధికారులు మహ్మద్ అనూప్ సహా మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. (‘దోషిగా తేలితే నా కొడుక్కి ఉరిశిక్ష వేయండి’) తాజాగా కేరళ సీపీఎం కార్యదర్శి కుమారుడు, నటుడు బినీష్ కొడియేరి పేరు సాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో తాజాగా బయటపడింది. డ్రగ్ పెడ్లర్ మహ్మద్ అనూప్‌ను ఎన్సీబీ అధికారులు విచారించగా బినీష్ పేరు బయటికొచ్చింది. అంతేకాకుండా కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు నిందితురాలు స్వప్న సురేశ్‌ను బెంగుళూరులో అరెస్టు చేసిన రోజే డ్రగ్స్ పెడ్లర్ మహ్మద్ అనూప్‌ని బినీష్ బెంగుళూరులో కలుసుకున్నాడు. దాంతో రెండు కేసులకు సంబంధముందా అనే కోణంలో ఎన్సీబీ విచారణను వేగవంతం చేసింది. కాగా తన వ్యాపార కార్యకలాపాలకు సహాయం చేశాడని అనూప్ చేసిన వ్యాఖ్యలను బినీష్ కొట్టిపరేశాడు. తనకు ఒక స్నేహితుడిగా మాత్రమే మహ్మద్ అనూప్ తెలుసునని, డ్రగ్ వ్యవహారం గురించి తానకేం తెలియదని, ఇదంతా రాజకీయ కుట్రేనని ఆరోపించాడు. ఇప్పటికే కన్నడనాట డ్రగ్స్ మాఫియా వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. హీరోయిన్ రాగిణి ద్వివేది అరెస్టుతో శాండల్‌వుడ్‌లోని మరికొంతమంది నటులు, దర్శకులు, నిర్మాతల పేర్లు ఒక్కటొక్కటిగా బయటకు వస్తున్నాయి. (శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కలకలం) -
కస్టమ్స్ ఎదుట సీఎం మాజీ ఐటీ అధికారి
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్కామ్ కేసు విచారణ మరో అడుగు ముందుకు పడింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మాజీ ఐటీ అధికారి అరుణ్ బాలచంద్రన్ శుక్రవారం కొచ్చిలో కస్టమ్స్ అధికారుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్మగ్లింగ్ నిందితులకు చేసిన సహాయంపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా అరుణ్ ఈ కేసులో కీలక పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. ఇతను ఈ కేసులో నిందితుడైన సీఎం మాజీ సలహాదారు ఎం శివశంకర్‌కు అత్యంత సన్నిహితుడుగా అధికారులు పేర్కొంటున్నారు. (చదవండి: కేరళ గోల్డ్ స్కామ్ : మరో కీలక అప్ డేట్) శివశంకర్.. మరో నిందితురాలైన స్వప్న సురేశ్ కోసం సచివాలయం సమీపంలో మంచి ఫ్లాట్ చూసి పెట్టాలని బాలచంద్రన్‌ను కోరినట్లు తెలిపారు. అక్కడైతే ఎవరికీ ఏ అనుమానం రాకుండా బంగారం అక్రమ రవాణాను సులభంగా చేసుకోవాలనుకున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకు 20 మందిని అరెస్ట్ చేయగా మరో ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు. కాగా జూలై 5న కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో యూఏఈ కాన్సులేట్‌కు బంగారంతో వచ్చిన పార్శిల్ గుట్టు ఆ రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. (చదవండి: తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు) -
కేరళ సచివాలయం: రాజకీయ దుమారం
తిరువనంతపురం: కేరళ సచివాలయ భవనంలో మంగళవారం స్వల్ప అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కొన్ని కీలక పత్రాలు కాలి బూడిదైనట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. సెక్రటేరియట్ రెండో అంతస్తులోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జీఏడీ) పొలిటికల్ సెక్షన్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. మంటలను అదుపుచేసి కొన్ని పత్రాలను బయటకు తీశారు. కానీ, అప్పటికే కొన్ని మంటల్లో కాలిపోయినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. అక్రమ బంగారం రవాణా కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను నాశనం చేయడానికే ప్రభుత్వం ఈ అగ్నిప్రమాదం డ్రామాకు తెరతీసిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అక్రమ బంగారం కేసు ప్రసుత్తం ముఖ్యమంత్రి పినరయి విజయన్ కార్యాలయ పరిశీలనలో ఉంది. (చదవండి: తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు) ఈ ప్రమాదంపై లోతుగా దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కేరళ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల గవర్నర్ అరిఫ్ మొహమూద్ ఖాన్‌ను కలిసి.. ఇందులో జోక్యం చోసుకోవాలని కోరారు. బంగారు అక్రమ రవాణా కేసులోని అన్ని ఆధారాలను నాశనం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ అగ్ని ప్రమాదం సంఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా త్వరలోనే ఎన్ఐఏ, ఈడీ సీఎంఓకు చేరుకుంటాయని తెలిసినందున ఫైళ్లు ధ్వంసమయ్యాయి అని విమర్శించారు. మరోవైపు సెక్రటేరియట్ ఎదుట బీజేపీ నేతలు ధర్నాకు దిగడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. అయితే గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించిన ఫైల్స్‌ను ఇప్పటికే డిజిటలైజేషన్ చేశామని, పత్రాలను నాశనం చేశామనడం అర్ధరహితమని ప్రభుత్వ అధికారులు వ్యాఖ్యానించారు. -
క్వారంటైన్ సెంటర్ నుంచి కిడ్నాప్‌కు యత్నం
తిరువనంతపురం : క్వారంటైన్ సెంటర్ నుంచి యువకుడి కిడ్నాప్‌కు ప్రయత్నించిన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కేరళలోని కన్నూర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం బిన్‌షాద్ అనే యువకుడు కొన్ని రోజులు క్రితం దుబాయ్ నుంచి కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో కూతుపరంబులోని క్వారంటైన్ కేంద్రంలో వైద్యుల సంరక్షణలో ఉన్నాడు. ఇటీవలె క్వారంటైన్ పీరియడ్ పూర్తైన నేపథ్యంలో అక్కడి నుంచి బయలుదేరేందుకు ప్రయత్నించగా ఓ బృందం సభ్యులు వచ్చి అతన్ని బలవంతంగా బయటకి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అతని స్నేహితులకు వారికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీఎంపై ప్రతిపక్షాల దాడి) విషయం తెలుసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అదపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే వీరికి గోల్డ్ స్మగ్లింగ్ కేసుతో లింక్ ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బిన్‌షాద్ సరైన సమయానికి బంగారాన్ని డెలివరీ చేయనందుకే ఇరు వర్గాల మధ్య గొడవకు కారణమైనట్లు అంచనా వేస్తున్నారు. రెండు గ్రూపులకు చెందిన ఆరుగురు నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టారు. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్? ) -
కేరళ గోల్డ్ స్కామ్ : మరో కీలక అప్ డేట్
సాక్షి, కొచ్చి: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలు స్వప్నసురేష్‌తో పాటు సస్పెండ్ అయిన ఐఎఎస్ అధికారి ఎం శివశంకర్ మూడు సార్లు గల్ఫ్ దేశాలు వెళ్లినట్టు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పీఎంఎల్ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) ప్రత్యేక కోర్టు ముందు ఈడీకి దీనికి సంబంధించిన వివరాలను సమర్పించింది. (కేరళ గోల్డ్ స్కామ్: కీలక విషయాలు వెలుగులోకి) కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ను ప్రశ్నించడాన్ని ప్రస్తావించిన ఈడీ 2017- 2018 మధ్య నిందితులు మూడుసార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లారని ఈడీ తెలిపింది. ఏప్రిల్ 2017లో, ఏప్రిల్ 2018 లో, స్వప్న ఓమన్ వెళ్లి దుబాయ్ పర్యటనలో ఉన్న శివశంకర్ ను కలిసిందని, వారిద్దరూ కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారని ఈడీ వాదించింది. తిరిగి వరద బాధితుల సహాయార్ధం వెళ్లినపుడు కూడా మరోసారి (అక్టోబర్ 2018లో) సురేష్, శివశంకర్ కలిసి యుఏఈకి వెళ్లి, తిరిగి వచ్చారని తమ విచారణలో తెలిందని చెప్పింది. అలాగే శివశంకర్ సూచనల మేరకు జాయింట్ బ్యాంక్ లాకర్లో దీనికి సంబంధించిన డబ్బులను స్వప్న సురేష్ దాచిపెట్టినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి ఈ అంశాలపై లోతైన దర్యాప్తు జరపాలని కోరింది. స్వప్న, సరిత్, సందీప్ నాయర్ల జ్యుడీషియల్ రిమాండ్ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆగస్టు 26 వరకు కోర్టు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది.. కాగా బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్‌ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జూలై 11న అరెస్టు చేసింది. గత వారం, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు , అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ఈ ముగ్గురి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఎన్ఐఏ అదుపులో ఉన్నప్పుడు అధికారికంగా అరెస్టు చేసిన ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. అలాగే శివశంకర్‌ను రెండోసారి శనివారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. -
తిరుచ్చిలో ఎన్ఐఏ దూకుడు
సాక్షి, చెన్నై: కేరళ బంగారం స్మగ్లింగ్ విచారణ తిరుచ్చికి చేరింది. ఎన్ఐఏ అధికారులు మంగళవారం తిరుచ్చిలో తిష్ట వేశారు. ఈ కేసుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురం యూఏఈ కాన్సులేట్‌కు బంగారంతో వచ్చిన పార్శిల్ గుట్టు ఆ రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. అక్కడి అధికారి స్వప్న సురేష్‌తో పాటు మరెందరో అరెస్టయ్యారు. ప్రజా ప్రతినిధులు, ఐఏఎస్ అధికారులను ఎన్ఐఏ వర్గాలు విచారణ చేశాయి. ఈ కేసు ప్రస్తుతం తమిళనాడు వైపుగా మరలడం చర్చకు దారితీసింది. ప్రధానంగా ఎన్ఐఏ వర్గాల దృష్టి తిరుచ్చిపై పడింది. ఈ స్మగ్లింగ్ రాకెట్లో ఏజెంట్లుగా వ్యవహరించిన వారందరూ తిరుచ్చికి చెందిన వారుగా ఎన్ఐఏ గుర్తించింది. దీంతో ఇక్కడి పోలీసులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎన్ఐఏ వర్గాలు ఉదయాన్నే దూకుడు పెంచాయి. తిరుచ్చిలోని అండగుండం, జాఫర్ ఖాన్ వీధుల్లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, అక్బర్ అలీ అనే వ్యక్తిని ప్రత్యేక ప్రాంతంలో ఉంచి విచారిస్తున్నారు. వీరంతా ముంబై, కోల్‌కతాలకు బంగారం స్మగ్లింగ్ ఏజెంట్లుగా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. వీరితో పాటు తిరుచ్చిలోని ఓ ప్రముఖ నగల వ్యాపారికి సైతం సంబంధాలు ఉన్నట్టు విచారణలో తేలినట్టు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిని ఆగమేఘాలపై తిరువనంతపురానికి తరలించారు. ఇక ఇటీవల కాలంగా తిరుచ్చి విమానాశ్రయంలో బంగారం పెద్ద ఎత్తున పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ బంగారంతో ఈ కేసుకు సంబంధాలు ఉండవచ్చన్న కోణంలోనూ ఎన్ఐఏ విచారణ వేగం పెరిగింది. -
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సంచలన వాస్తవాలు
-
కేరళ గోల్డ్ స్కామ్: కీలక విషయాలు వెలుగులోకి
తిరువనంతపురం: కేరళలో వెలుగు చూసిన 30 కేజీల బంగారం స్మగ్లింగ్ కేసులో కొత్త విషయాలు బయట పడుతున్నాయి. హవాలా రూపంలో గత ఏడాది నుంచి ఇప్పటిదాకా దాదాపు 180 కేజీల బంగారం అక్రమ రవాణా జరిగినట్లు ఎన్ఐఏ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దాదాపు 13 సార్లు విమానాల ద్వారా బంగారాన్ని స్మగ్లింగ్ చేశారని ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న కస్టమ్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ అధికారులు భావిస్తున్నారు. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేసిన కేసులో సరిత్, స్వప్న సురేష్, ఫాజిల్ ఫరీద్, సందీప్ నాయర్లను ఎన్ఐఏ నిందితులుగా గుర్తించింది. ఈ కేసులో పట్టుబడిన స్వప్న సురేష్, సందీప్ నాయర్లను ఎన్ఐఏ ఇప్పటికే కస్టడీలోకి తీసుకుంది. చదవండి: కేరళ గోల్డ్ స్కామ్‌కు హైదరాబాద్‌కు లింకు? దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించడానికి వీరివురిని శనివారం నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. దర్యాప్తులో భాగంగా స్వప్నా సురేష్, సరిత్లను వారి ఇళ్లకు, కార్యాలయాలకు కూడా తీసుకెళ్లారు. కీలక నిందితడు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫాజిల్ ఫరీద్ కోసం బ్లూ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్‌ని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ కోరింది. కేసులో మరో నిందితుడైన సరిత్ని కూడా తమ కస్టడీకి ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కస్టమ్స్ శాఖను కోరారు. కాగా బంగారం స్మగ్లింగ్ ద్వారా వఛ్చిన సొమ్మును హవాలా మార్గాల ద్వారా దుబాయ్‌కి తరలించారని.. ఈ వ్యవహారమంతా ఫాజిల్ ఫరీద్ అధ్వర్యంలో జరిగిందని అనుమానిస్తున్నారు. చదవండి: గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ఎన్ఐఏ కస్టడీకి కీలక నిందితులు కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్లో 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్నా సురేష్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్నా సురేష్‌తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలపడంతో కేంద్రం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పజెప్పింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ గోల్డ్ స్మగ్లింగ్ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని, త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది -
కేరళ గోల్డ్ స్కామ్‌కు హైదరాబాద్‌కు లింకు?
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న కేరళ బంగారం స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసుకు హైదరాబాద్‌తో లింకులు ఉన్నట్లు కస్టమ్స్ విభాగం గుర్తించిందని సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ కేసులో అత్యంత కీలకమైన నగదు చెల్లింపులు హైదరాబాద్ నుంచే జరిగాయని అధికారులు అనుమానిస్తున్నారు. రూ. కోట్లాది విలువ చేసే బంగారం కొనేందుకు నిందితులు అడ్డదారుల్లో హవాలా మార్గాల్లో చెల్లిస్తారన్న విషయం తెలిసిందే. ఈ కేసులో రూ. కోట్లు హైదరాబాద్ నుంచి హవాలా రూపంలో దుబాయ్‌కి చెల్లింపులు చేశారన్న సమాచారంపై కస్టమ్స్ శాఖ కూడా కూపీ లాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు స్వప్నా సురేశ్, సందీప్ నాయర్‌ను అరెస్ట్ చేసింది. కాగా గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. ఏకంగా సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడిన వెంటనే శివకంర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. ఈ నెల 6వ తేదీన దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్సైన్మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో రాష్ట్ర ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్ పార్క్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఉన్న స్వప్న బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ఎన్ఐఏ కస్టడీకి కీలక నిందితులు
తిరువనంతపురం : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు కీలక నిందితులను ప్రత్యేక న్యాయస్ధానం సోమవారం 8 రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీకి తరలించింది. ఈ కేసులో శనివారం బెంగళూర్‌లో అరెస్ట్ అయిన స్వప్నా సురేష్, సందీప్ నాయర్లను దర్యాప్తు ఏజెన్సీ అభ్యర్థన మేరకు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించింది. కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్లో 15 వేల కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ నిర్వాకం సాగిందని, తక్షణమే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. సీఎం కార్యాలయం నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల ఆరోపించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై సీబీఐచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి : గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్? -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీఎం రాజీనామా చేయాలి
తిరువనంతపురం : కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం మీద ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి. శుక్రవారం కోజికోడ్‌లో యూత్ లీగ్ కార్మికులు ఆందోళన చేపట్టడంతో వారిపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘర్షణలో చాలా మంది నిరసనకారులకు గాయలయ్యాయి. కొచ్చిలో కూడా యువకుల నిరసన హింసాత్మకంగా మారింది. కన్నూర్‌లో పోలీసులు ఆందోళనకారులను నియంత్రించడానికి టియర్‌గ్యాస్ షెల్స్‌ను ఉపయోగించారు. కన్నూర్‌లోని సీఎం విజయన్ పూర్వీకుల ఇంటి ముందు కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. (గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్) కాగా తిరువనంతపురంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్‌కు చెందిన పార్మిల్లో 15 వేల కోట్ల రూపాయల విలువైన 30 కిలోల బంగారాన్ని జూలై 4న విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాన్సులేట్‌కు సంబంధించిన పార్శిల్లో భారీగా బంగారం పట్టుబడటం కేరళలో కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో యూఏఈ కాన్సులేట్ ఉద్యోగితో పాటు కేరళ ప్రభుత్వ ఐటీ శాఖలో పనిచేస్తున్న స్వప్న సురేశ్ ఆరోపణలు ఎదుర్కోవడంతో వీరిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో స్వప్న సురేశ్‌తో సన్నిహితంగా ఉన్న ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను బదిలీ చేశారు. ఈ వ్యవహారంపై కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర సీఎం పినరయి విజయన్ తెలపడంతో గురువారం కేంద్రం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పజెప్పింది. ఇక దీనిపై విచారణ చేపట్టిన ఎన్ఐఏ ల్డ్ స్మగ్లింగ్ ఉగ్రవాద కార్యకలాపం లాంటిదేనని తెలిపింది. త్వరితగతిన కేసు విచారణ పూర్తి చేస్తామని పేర్కొంది. (కేరళ రాజకీయాల్లో గోల్డ్ స్మగ్లింగ్ ప్రకంపనలు) -
కేరళ రాజకీయాల్లో గోల్డ్ స్మగ్లింగ్ ప్రకంపనలు
-
గోల్డ్ స్మగ్లింగ్: ఎవరీ స్వప్న సురేశ్?
తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం శివశంకర్‌ను తొలగించారు. మరోవైపు ఈ కేసులో స్వప్న సురేశ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. కేరళ సీఎం కార్యాలయం వ్యవహారాలు తెలిసినవారికి స్వప్న సురేశ్ పేరు సుపరిచతమే. రాష్ట్ర ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ పరిధిలోని స్పేస్ పార్క్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా ఉన్న స్వప్న బంగారం తరలింపులో కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. విజయన్‌తో కలిసి స్వప్న దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో స్వప్న ఎవరనేది ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారింది. కేరళకు చెందిన స్వప్న తండ్రి అబుదాబిలో స్థిరపడ్డారు. దీంతో అక్కడే జన్మించిన స్వప్న చిన్నప్పటి నుంచి విషయ పరిజ్ఞానం పెంచుకోవడంలో చురుకుగా ఉండేవారు. అబుదాబిలోనే చదువుకున్న స్వప్న.. అక్కడే విమానాశ్రయంలో ఉద్యోగం సంపాదించారు. అక్కడ ప్రయాణికుల సేవా విభాగం గురించి క్లుప్తంగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఇండియా వచ్చిన స్వప్న.. రెండేళ్లపాటు ఒక ట్రావెల్ ఏజెన్సీలో పనిచేశారు. ఆ తర్వాత 2013లో తిరునంతపురం ఎయిర్‌పోర్ట్‌లోని ఎయిర్ ఇండియా సాట్స్‌లో ఉద్యోగం పొందారు. అయితే అక్కడ ఒక అధికారిని తప్పుడు కేసులో ఇరికించడం కోసం నకిలీ పత్రాలు సమర్పించడంతో స్వప్నపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణకు కూడా స్వప్న సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు స్వప్నను పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆమెను విడుదల చేయాలని పైనుంచి పెద్ద ఎత్తున ఒత్తిడిలు వచ్చినట్టు చెబుతారు. (చదవండి : కేరళ రాజకీయాల్లో గోల్డ్ స్మగ్లింగ్ ప్రకంపనలు) ఎయిర్ ఇండియా ఉద్యోగం మానేసిన తర్వాత.. యూఏఈ కాన్సులేట్‌లో ఒక కీలక పదవిలో నియమితులయ్యారు. అక్కడే ఆమె పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, కేరళ దౌత్య వేత్తలతో పరిచయాలు పెంచుకున్నారు. అరబిక్‌తో పాటు పలు భాషలపై పట్టున్న స్వప్నకు ఇది చాలా సులువుగా సాధ్యమైంది. అయితే స్వప్న అనేక అవకతవకలకు పాల్పడటంతో ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పడిన పరిచయాలతో స్వప్న కేరళ ఐటీ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. అలా సీఎంఓలోని కొందరితో పరిచయాలు పెంచుకున్నారు. ఈ క్రమంలోనే తనకున్న పరిచయాలను అసరాగా చేసుకుని బంగారం అక్రమ తరలింపుకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో నిందితుడైన శివశంకర్‌కు స్వప్నతో సత్సంబంధాలు ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ప్రస్తుతం స్వప్న మాత్రం పరారీలో ఉన్నారు. ఆమెను విచారిస్తే తప్ప ఈ గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదని అధికారులు అంటున్నారు. (చదవండి : గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ప్రిన్సిపల్ కార్యదర్శిపై వేటు) అసలేం జరిగింది.. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో సోమవారం పెద్ద మొత్తంలో బంగారం పట్టుపడింది. దౌత్య మార్గంలో తరలిన రూ. 15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా.. ఇందులో ఐటీ విభాగంలో పనిచేసే స్వప్న సురేశ్ హస్తం ఉన్నట్టు వెల్లడించాడు. దీంతో గోల్డ్ స్మగ్లింగ్‌కు సంబంధించి స్వప్న పాత్రపై అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఈ ఘటనకు రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు. ఇక, ఫ్యామిలీ విషయానికి వస్తే.. భర్త నుంచి విడాకులు తీసుకున్న స్వప్నకు ఒక కుతూరు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు: కీలకాంశాలు
తిరువనంతపురం: కేరళలో వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ఇందులో సీఎం కార్యాలయం ఉద్యోగుల ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ నడుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు యూఏఈ రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘భారతదేశంలో యూఏఈ మిషన్ ప్రతిష్టని దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని హెచ్చరించింది. ఇదే కాక ఈ కేసు గురించి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను విధుల నుంచి తొలగించారు. (గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ప్రిన్సిపల్ కార్యదర్శిపై వేటు) గత వారం వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగిని స్వప్న సురేష్‌కు, శివశంకర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రతిపక్ష నాయకుడు రమేష్ చెన్నితాలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యాలయానికి రాసిన లేఖలో ఆరోపించారు. అంతేకాక సీఎం రాజీనామా చేయాల్సిందిగా ఆయన డిమాండ్ చేశారు. అయితే కేరళ సీఎం కార్యాలయం ఈ ఆరోపణలను కొట్టి పారేసింది. ఈ కేసుకు సంబంధించిన పలు కీలక అంశాలు.. 1. ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్సైన్మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన 30కిలోల బంగారం ఎయిర్ పోర్టులో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగి అయిన సరిత్ కుమార్‌ను సోమవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. 2. ఈ కేసులో మరో మహిళకు కూడా సంబంధం ఉన్నట్లు అధికారులకు తెలిసింది. యూఏఈ కాన్సులేట్ మాజీ ఉద్యోగిని అయిన స్వప్న సురేష్ పాత్రపై అధికారులు ఆరా తీశారు. ఈ క్రమంలో ప్రస్తుతం కేరళ ఐటీ శాఖలో ఉద్యోగినిగా పని చేస్తున్న స్వప్న సురేష్‌ను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ.15కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కస్టమ్స్ అధికారులు స్వప్నను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల కిందటే ఆమెను ఐటీ శాఖ నుంచి తొలగించారు. 3. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు యూఏఈ రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. యూఏఈ కాన్సులేట్ చిరునామాకు బంగారం ఉన్న కార్గో ఎవరు పంపిచారో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. అంతేకాక ‘నేరస్థులు పెద్ద నేరానికి పాల్పడటమే కాక భారతదేశంలో యూఏఈ మిషన్ ప్రతిష్టని దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. వారిని కఠినంగా శిక్షిస్తాం. ఈ కేసు దర్యాప్తులో భాగంగా భారతీయ అధికారులకు అన్ని విధాలుగా సహకరిస్తాం’ అంటూ యూఏఈ రాయబార కార్యాలయం వరుస ట్వీట్లు చేసింది. 4. ఈ కేసుతో ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధం ఉన్నట్లు ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణలను సీఎం పినరయి విజయన్ ఖండించారు. కేసు దర్యాప్తుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ‘తిరువనంతపురం బంగారం స్మగ్లింగ్ కేసుతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి? ఆ పార్శల్ ప్రభుత్వ శాఖల నుంచి రాలేదు. అది యూఏఈ కాన్సులేట్ నుంచి వచ్చింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా బాధ్యత వహిస్తుంది’ అంటూ పినరయి విజయన్ ప్రశ్నించారు. 5. బంగారం స్మగ్లింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాల కోరారు. యూఏఈ కాన్సులేట్ దౌత్యపరమైన అధికారాలను దుర్వినియోగం చేశారంటూ ఆరోపిస్తూ ప్రధాని కార్యాలయానికి ఆయన లేఖ రాశారు. 6. ‘ఈ స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలైన శ్రీమతి స్వప్నా సురేష్‌ను కేరళ ప్రభుత్వం నియమించింది. ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన ఇంటిలిజెన్స్ నివేదికలను ప్రభుత్వం పట్టించుకోలేదు. కేరళ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెపై దర్యాప్తు చేయలేదు’ అని రమేష్ తన లేఖలో పేర్కొన్నారు. వీటన్నింటిని పరిశీలిస్తే.. ఆమెకు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయంతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతుంది అన్నారు రమేష్. 7. ఈ అంశం గురించి మొదట మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ కేరళ ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపించారు. అంతేకాక సదరు మహిళను కాపాడటానికి సీఎంఓ కార్యాలయం నుంచి ఎందుకు ఫోన్లు వెళ్లాయి. గతంలో ఆమె మీద ఉన్న కేసులను పట్టించుకోకుండా ఆమెను ఎందుకు ఐటీశాఖలో నియమించారు అని సురేంద్రన్ ప్రశ్నించారు. అంతేకాక కేరళ సీఎం ఐటీ సెక్రటరీ కాల్ లిస్ట్‌ను పరిశీలిస్తే.. అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. 8. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రతిపక్షాల ఆరోపణలను ఖండించారు. ఈ కేసుకు సంబంధించి తమ ప్రభుత్వం ఎవరిని రక్షించడానికి ప్రయత్నించడం లేదని తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎలా పని చేస్తుందో ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు. 9. ఎం. శివశంకర్ని ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ పదవి నుంచి తొలగించి సుదీర్ఘ సెలవు మీద పంపారు. ఆయన స్థానంలో ప్రభుత్వం నూతన ఐటీ సెక్రటరీని నియమించింది. 10. అసలే కరోనాతో సతమతమవుతోన్న సమయంలో ఈ కేసు రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని లేవదీసింది. -
గోల్డ్ స్మగ్లింగ్ కేసు : ప్రిన్సిపల్ కార్యదర్శిపై వేటు
తిరువనంతపురం : గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళలో పెనుప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ బాగోతంలో సీఎం కార్యాలయం ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రిన్సిపల్ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ సెక్రటరీ ఎం. శివశంకర్‌ను తొలగించారు. గత వారం వెలుగుచూసిన గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి పాత్రపై ఆరోపణలు బయటపడిన మరుసటి రోజే శివకంర్‌పై రాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది. శివశంకర్ స్ధానంలో మరో ఐఏఎస్ అధికారి మిర్ మహ్మద్‌ను నియమించినట్టు సీఎంఓ కార్యాలయం మంగళవారం వెల్లడించింది. ఇటీవల దుబాయ్ నుంచి చార్టర్డ్ విమానంలో వచ్చిన కన్సైన్మెంట్ ద్వారా దాదాపు 30 కిలోల బంగారాన్ని తిరువనంతపురం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దౌత్య మార్గంలో తరలిన 30 కిలోల బంగారం విమానాశ్రయంలో పట్టుబడటం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి కేరళలో యూఏఈ కాన్సులేట్‌లో పనిచేసే ఓ మాజీ ఉద్యోగిని సోమవారం కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. రూ 15 కోట్ల విలువైన గోల్డ్ స్మగ్లింగ్స్ కేసుకు సంబంధించి కస్టమ్స్ అధికారులు ఉద్యోగిని ప్రశ్నిస్తున్నారు.మరోవైపు ఈ వ్యవహారంలో మాజీ యూఏఈ కాన్సులేట్ అధికారి స్వప్న సురేష్ పాత్రపైనా ఆరా తీస్తున్నారు.రెండు రోజుల కిందటే ఆమెను కేరళ ఐటీ శాఖ నుంచి తొలగించారు. విజయన్‌పై విమర్శల వెల్లువ గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ రాజకీయాల్లో దుమారం రేపుతుండగా విపక్షాలు సీఎం విజయన్‌పై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ ఉద్యోగి ప్రమేయం వెనుక విజయన్ హస్తం ఉందని కాంగ్రెస్, బీజేపీలు ఆరోపించాయి. సీఎం కార్యాలయం నేర కార్యకలాపాలకు అడ్డాగా మారిందని సీనియర్ కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితల ఆరోపించారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసుపై సీబీఐచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి : కోవిడ్-19 : కేరళ కీలక నిర్ణయం -
గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
సాక్షి,విజయవాడ : విజయవాడలోని గన్నవరం విమానాశ్రయంలో 20కేజీల విలువైన బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న నలుగురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఎటువంటి బిల్లులు లేకుండానే కార్గో కొరియర్ ద్వారా బంగారు, వెండి ఆభరణాలను విజయవాడకు తరలిస్తున్నట్లు తెలిపారు. పన్నులు ఎగ్గొట్టి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారని, నగరంలోని పలు బంగారు దుకాణాల్లో సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా పట్టుబడ్డ బంగారం విలువ సుమారు రూ.17 కోట్లుగా ఉంటుందని, అలాగే వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు. -
మిక్సీలో బంగారం దాచి అడ్డంగా దొరికిపోయాడు..!
సాక్షి, శంషాబాద్: మిక్సీలో 1,725 గ్రాముల బంగారాన్ని దాచి దుబాయ్ నుంచి తీసుకొచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు మిక్సీని తెచ్చాడు. అనుమానం వచ్చిన అధికారులు మిక్సీ విడి భాగాలను వేరుచేసి పరిశీలించగా 1,725 గ్రాములు బంగారం బయటపడింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
‘గోల్డెన్’ లేడీస్.. బంగారాన్ని లోదుస్తుల్లో దాచి!
సాక్షి, రంగారెడ్డి: అతివలు స్మగ్లర్లకూ టార్గెట్ అవుతున్నారు. ఎన్నో విధాలుగా ఆశలు చూపి వీరిని క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. ఒక్క ఆదివారమే జిద్దా నుంచి 2.5 కేజీల బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తీసుకువస్తూ నగరానికి చెందిన నలుగురు మహిళలు చిక్కారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పడానికే.. సాధారణంగా స్మగ్లర్లు వీరి కోసం బంగారాన్ని తీసుకుని వచ్చే క్యారియర్లు అనగానే అందరూ పురుషులు అనే భావిస్తుంటారు. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భంతో, చంకలో పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు అనుమానించం చాలా తక్కువ. ఈ కారణంగానే దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తిస్తున్న స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ.. వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో ఒంటిపై ఏర్పాటు చేసుకుని బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్‌లు (డీఎఫ్ఎండీ) కూడా కొంత వరకు పసిగట్టలేకపోతున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. తప్పించుకుంటున్న కీలక వ్యక్తులు.. ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా.. ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల ముమ్మర కసరత్తు.. బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్ణంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఆఖరిసారిగా ఎప్పుడు వచ్చారు.. ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఇవిగో ఉదాహరణలు.. దుబాయ్ నుంచి ‘గర్భవతిగా’ వచి్చన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచి్చన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వా«దీనం చేసుకున్నారు. సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
దుబాయ్ నుంచి ‘గర్భవతిగా’ వచ్చి..
సాక్షి, సిటీబ్యూరో: అతివలు స్మగ్లర్లకూ టార్గెట్ అవుతున్నారు. ఎన్నో విధాలుగా ఆశలు చూపి వీరిని క్యారియర్లుగా వినియోగిస్తున్నారు. కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల కన్ను మహిళలపై ఎక్కువగా ఉండదనే ఉద్దేశంతోనే ఈ పంథా అనుసరిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ ఏడుగురు మహిళలు పట్టుబడ్డారు. ఒక్క ఆదివారమే జిద్దా నుంచి 2.5 కేజీల బంగారాన్ని లోదుస్తుల్లో దాచి తీసుకువస్తూ నగరానికి చెందిన నలుగురు మహిళలు చిక్కారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కస్టమ్స్ అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. కస్టమ్స్ అధికారుల కళ్ళుగప్పడానికే.. సాధారణంగా స్మగ్లర్లు వీరి కోసం బంగారాన్ని తీసుకుని వచ్చే క్యారియర్లు అనగానే అందరూ పురుషులు అనే భావిస్తుంటారు. దీనికి తోడు మహిళలూ.. అందునా నిండు గర్భంతో, చంకలో పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు అనుమానించం చాలా తక్కువ. ఈ కారణంగానే దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే.. పసిడి తీసుకువచ్చే ఉమెన్ క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే గుర్తిస్తున్న స్మగ్లర్లు వారికి ఇచ్చి పంపిస్తున్నారు. మాదకద్రవ్యాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి బంగారం తదితరాలను అప్పగించి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎమ్‌డీల వద్దా బురిడీ.. వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో ఒంటిపై ఏర్పాటు చేసుకుని బంగారం అక్రమంగా తీసుకువస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్‌లు (డీఎఫ్ఎండీ) కూడా కొంత వరకు పసిగట్టలేకపోతున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకరిస్తున్నాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన మెటల్ కారణంగా డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంత వరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం సైతం ఉంటుందనే బడా స్మగ్లర్లు మహిళల్ని వినియోగించుకుంటున్నారు. తప్పించుకుంటున్న కీలక వ్యక్తులు.. ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా.. ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. కేవలం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండమనో, ఫలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల ముమ్మర కసరత్తు.. బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమ రవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్ణంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఆఖరిసారిగా ఎప్పుడు వచ్చారు.. ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏమిటి? తదితరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేవలం అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఇవిగో ఉదాహరణలు.. ♦ దుబాయ్ నుంచి ‘గర్భవతిగా’ వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. ♦ సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలిసి వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. ♦ బ్యాంకాక్, దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి నాలుగు కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ♦ సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ♦ యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల్ని పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
ఎగిరొస్తున్న బంగారం!
సాక్షి, హైదరాబాద్: దేశంలోకి ఏటా భారీ స్థాయిలో బంగారం అక్రమంగా ‘ఎగిరొస్తోంది’! పుత్తడి డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు అడ్డదారుల్లో దాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. దుబాయ్‌లో కొన్న బంగారాన్ని విమానాల్లో తమ మనుషుల ద్వారా అక్రమంగా దేశంలోకి తెప్పిస్తున్నారు. దుబాయ్‌లో అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్న ఈ వ్యాపారులు.. మన దేశంలో మాత్రం దిగుమతి సుంకం ఎగ్గొడుతున్నారు. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, కొచ్చి, హైదరాబాద్ విమానాశ్రయాల ద్వారా ఏటా టన్నులకొద్దీ బంగారాన్ని వక్రమార్గాల్లో తెప్పించుకుంటున్నారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) గణాంకాల ప్రకారం ఏటా 150 నుంచి 200 టన్నుల బంగారం దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తోంది. ఇటీవల శంషాబాద్ విమానాశ్రయంలో సీటు పైపుల్లో దాచిన 14 కిలోల బంగారం పట్టుబడిన కేసులో అక్రమార్కులు ఎగ్గొట్టజూసిన సుంకం విలువ సుమారు రూ. 70 లక్షలు కావడం గమనార్హం. హైదరాబాదే ఎందుకు..? వాస్తవానికి దేశంలోని మిగిలిన విమానాశ్రయాలతో పోలిస్తే హైదరాబాద్ విమానాశ్రయం ద్వారా జరుగుతున్న బంగారం అక్రమ రవాణా చాలా తక్కువ. కొచ్చి, చెన్నై, బెంగళూరు విమానాశ్రయాల్లో నిఘా అధికమైనప్పుడు మాత్రమే స్మగ్లర్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్టును ఎన్నుకుంటున్నారు. డీఆర్ఐ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) అధికారుల కళ్లుగప్పేందుకే వారు హైదరాబాద్‌ను వాడుకుంటున్నారు. అయితే చాలా కేసుల్లో హైదరాబాద్ విమానాశ్రయంలో పట్టుబడుతున్న వారెవరూ హైదరాబాదీలు కాదు. స్థానిక డీఆర్ఐ అధికారులకు బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిలో భారతీయులతోపాటు విదేశీయులు కూడా పట్టుబడుతున్నా వారి వెనుక ఉన్న వ్యాపారులు మాత్రం తమ దందా సాగిస్తుండటం గమనార్హం. అయితే కొచ్చి, చెన్నై, హైదరాబాద్‌లకు ఏ రూపాల్లో బంగారం ఎలా వచి్చనా అంతా చేరుతున్నది మాత్రం ముంబైకే. రూపుమార్చి... ఏమార్చి డీఆర్ఐ అధికారులను బోల్తా కొట్టించి విమానాశ్రయం నుంచి బంగారాన్ని బయటకు తీసుకురావడం మాటలు కాదు. పుత్తడిని రహస్యంగా తరలించేందుకు కొందరు తమ శరీరాన్నే వాడుతున్నారు. కడుపులో, విగ్గుల్లో ఎవరికీ అనుమానం రాకుండా బంగారం తీసుకువస్తున్నారు. ఇంకొందరు బంగారాన్ని పౌడరులా మార్చి షాంపూలు, పేస్టుల్లో నింపి పట్టుకొస్తున్నారు. ఇంకొందరు బంగారం బిస్కెట్ల ఆచూకీని స్కానర్లు పట్టుకోకుండా వాటికి కార్బన్ ఫిలింలను అంటిస్తున్నారు. ఇంకొందరు విమానం సీట్ల పైపుల్లో, స్వీటు బాక్సుల్లో, లగేజీ హ్యాండిళ్లలోనూ తరలిస్తున్నారు. అయితే పెరుగుతున్న టెక్నాలజీ, ఆధునిక స్కానర్ల కారణంగా ఎక్కువశాతం కేసుల్లో పట్టుబడుతున్నారు. ధరల్లో భారీ తేడా... దుబాయ్‌లో 10 గ్రాముల బంగారం (24 క్యారెట్లు) ధర రూ. 34 వేలు పలుకుతుండగా మన దేశంలో మాత్రం రూ. 39 వేలు పలుకుతోంది. అంటే 10 గ్రాముల ధరలో ఏకంగా రూ. 5 వేల వరకు వ్యత్యాసం ఉంటోంది. అదే కిలో బంగారానికి దాదాపు రూ. 5 లక్షల వరకు, ఒకేసారి పదుల కిలోల్లో తెచ్చుకుంటే రూ. కోట్లలో తేడా ఉంటుంది. దీంతో కొందరు వ్యాపారులు అక్కడ భారీగా కొనుగోళ్లు జరిపి అక్రమంగా దేశంలోకి బంగారాన్ని తరలిస్తున్నారు. గణనీయంగా తగ్గిన కేసులు శంషాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో క్రమంగా బంగారం స్మగ్లింగ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. 2017–18లో అత్యధికంగా 151 కేసులు నమోదవగా ఆ తరువాత ఏడాది 97, ఈ ఏడాది 21 నమోదయ్యాయి. ఆధునిక బాడీ స్కానర్లు, డీఆర్ఐ, కస్టమ్స్ నిఘా, వేగుల సమాచారం ఆధారంగా శంషాబాద్ ద్వారా జరుగుతున్న బంగారం అక్రమ రవాణాకు అధికారులు చెప్పుకోదగ్గ స్థాయిలో ముకుతాడు వేయగలిగారు. ఈ ఏడాది గణనీయంగా తగ్గిన కేసులే ఇందుకు నిదర్శనం. అయితే పట్టుబడ్డ బంగారం మాత్రం భారీగా పెరిగింది. -
'మహానగరాల కంటే ఇక్కడ బంగారం ధర తక్కువ'
సాక్షి, ప్రొద్దుటూరు క్రైం : బెంగళూరుకు చెందిన రతన్‌సింగ్ అనే బంగారు వ్యాపారి సూట్‌కేసులో సుమారు 2.2 కిలోల బంగారు నగలను ప్రొద్దుటూరుకు తీసుకొని వచ్చాడు. మైదుకూరు రోడ్డులో వెళ్తూ పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేయగా వెంటపడి పట్టుకున్నారు. పోలీసు అధికారులు ప్రశ్నించగా తన పేరు రతన్‌సింగ్ అని, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చినట్లు తెలిపాడు. తరచూ ప్రొద్దుటూరు, కడపలోని దుకాణాల్లో బంగారు నగలను విక్రయిస్తున్నానని చెప్పాడు. బిల్లులు చూపించమని అడగ్గా తెల్లముఖం వేశాడు. పోలీసులు నగలను స్వాధీనం చేసుకున్నారు. నగలను పోలీసులు కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. బంగారం కేసు ఐటీకి అప్పగింత కడప అర్బన్: కడపలో ఈనెల 21న కారులో బయట పడిన బంగారు ఆభరణాల కేసును పోలీసులు ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. కడప అర్బన్ సీఐ ఎస్‌కెఎం ఆలీ శుక్రవారం ఈ విషయం తెలిపారు. కడప నగరంలో టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కారు వెనుకసీటులో రహస్యంగా బాక్స్‌ను ఏర్పాటు చేసుకుని రూ.3 కోట్ల విలువైన ఏడు కిలోల బంగారు ఆభరణాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. నెల్లూరు పట్టణంలోని మౌనిక జ్యుయెలర్స్ పేరుతో ఉన్న బిల్లులను మాత్రం కారులోని ముగ్గురు వ్యక్తులు చూపించారు. ఆదాయపన్నుకు సంబంధించిన వ్యవహారం కావడంతో బంగారాన్ని పోలీసులు సీజ్ చేసి కేసు విచారణ బాధ్యతలను తిరుపతిలోని ఆదాయపన్ను శాఖ ఏడీ రాజారావుకు అప్పగించారు. ►కొన్ని రోజుల క్రితం చెన్నై నుంచి సుమారు 3 కిలోల బంగారు నగలను తీసుకు వస్తున్న వారిని ఎర్రగుంట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిల్లులు లేకపోవడంతో కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. ►కొన్ని రోజుల క్రితం కోయంబత్తూరుకు చెందిన ముకుందరాజన్ అనే వ్యాపారి నుంచి నలుగురు వ్యక్తులు పోలీసు వేషంలో వచ్చి టోకరా వేశారు. రూ.21 లక్షల విలువైన బంగారం దోపిడీ చేశారు. వ్యాపారి కోయంబత్తూరు నుంచి జయంతి ఎక్స్‌ప్రెస్‌లో ప్రొద్దుటూరుకు బయలుదేరగా పోలీసు దుస్తుల్లో రైలు ఎక్కి వ్యాపారి బ్యాగులను తనిఖీ చేశారు. బంగారు అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని రెండు మొబైల్ ఫోన్లు, చేతిలో బంగారు నగల బ్యాగును లాక్కొని వెళ్లారు.. ఇలాంటి ఉదంతాలు ప్రొద్దుటూరు బంగారు వ్యాపారంలో చాలా ఉన్నాయి. ప్రొద్దుటూరు పసిడి వ్యాపారానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరుంది. రాష్ట్రంలో ఎక్కడ బంగారం పట్టుబడ్డా ప్రొద్దుటూరుకు ముడిపడి ఉంటుంది. తులం, రెండు తులాలు కాదు ఎక్కడ బంగారం పట్టుబడ్డా కేజీల్లోనే ఉంటుంది. కడపలో స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు(ఫైల్) చెన్నై, కోయంబత్తూరు నుంచి.. గతంలో ప్రొద్దుటూరులోని బంగారు వ్యాపారులు నగలను తయారు చేయాలంటే స్థానికంగా ఉన్న స్వర్ణకారులకు ఇచ్చేవారు. నగలకు కావలసినంత బంగారు వ్యాపారులే ఇచ్చి కోరిన డిజైన్లు చేయించుకునే వారు. స్థానికంగా వ్యాపారాలు బాగుండటంతో స్వర్ణకారులు కూడా పెద్ద ఎత్తున వెలిశారు. 10 ఏళ్ల నుంచి పరిస్థితి మారిపోయింది. ప్రొద్దుటూరు మార్కెట్లోకి చెన్నై, సేలం, కోయంబత్తూరు, ముంబైకి చెందిన వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. ఇక్కడి వ్యాపారులతో సంబంధాలు ఏర్పరచుకొని నగల తయారీకి ఆర్డర్లు తీసుకెళ్లడం ప్రారంభించారు. దీంతో స్థానికంగా స్వర్ణకారులకు పూర్తిగా పని తగ్గిపోయింది. బంగారు వ్యాపారులకు కావలసిన నగల మోడళ్లను వాట్సప్ ద్వారా పంపించి కిలోల్లో నగలను తెప్పించుకుంటున్నారు. వీళ్లు తెచ్చే బంగారానికి బిల్లులు లేకపోవడంతో ఆన్లైన్ ధర కంటే తక్కువకే ప్రొద్దుటూరులో విక్రయిస్తుంటారు. కొంత సరుక్కే బిల్లులు ఇతర రాష్ట్రాల నుంచి ప్రొద్దుటూరు, కడపకు వారంలో రెండు రోజులు బంగారు వస్తుంటుంది. వీరు నిత్యం ఒకే మార్గంలో కాకుండా రైలు, బస్సుల్లో, కార్లలో వస్తుంటారు. వ్యాపారులు ఎప్పుడు జిల్లాకు వచ్చినా మూడు నాలుగు కిలోలకు మించి బంగారంతో వస్తారు. మరీ ఆర్డర్లు ఎక్కువైతే ఇద్దరు వ్యాపారులు కలిసి వేరు వేరుగా వస్తారు. వీరి వద్ద సగం బంగారానికి సరిపడా బిల్లులు మాత్రమే ఉంటాయి. పోలీసులకు పట్టుబడితే సురక్షితంగా బయట పడేందుకు ముందుగానే స్థానిక వ్యాపారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. పట్టుబడిన వెంటనే ఆలస్యం కాకుండా సేల్స్ ట్యాక్స్ అధికారులకు బంగారాన్ని అప్పగించేలా వ్యవహారం నడిపిస్తారు. ఉన్న బిల్లులతో పాటు స్థానికంగా ఉన్న వ్యాపారుల నుంచి మిగతా బంగారానికి సరిపడా బిల్లులు తెప్పించుకుంటారు. ఇలా పట్టుబడినప్పుడు ఆ బంగారం తమదే అని ..ఇక్కడి ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే కొందరు వ్యాపారాలు ఆ భారాన్ని తమపై వేసుకుంటారు. ఇలా బయటి రాష్ట్రాల వ్యాపారులు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా సురక్షితంగా తప్పించుకుంటున్నారు. అధికారులకూ తెలుసు! పెద్ద ఎత్తున బంగారం పట్టుబడినప్పుడు ఎలా బయట పడాలనే చిట్కాలను కొందరు అధికారులు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సోమ, గురువారాల్లో ఎక్కువగా బయటి రాష్ట్రాల వ్యాపారులు ప్రొద్దుటూరుకు వస్తుంటారు. నగలను డెలివరీ చేసి, ఒకటి, రెండు రోజుల పాటు జిల్లాలోనే మకాం వేసి తిరిగి ఆర్డర్లు తీసుకొని వెళ్తుంటారు. బిల్లులు లేకుండా విక్రయాలు చేస్తుండటంతో ముంబై, హైదరాబాద్ తదితర మహానగరాల కంటే ప్రొద్దుటూరులో బంగారం తక్కువ ధరకు దొరుకుతుంది. ప్రొద్దుటూరు, కడపలో అన్ని రకాలుగా అనుమతులు పొంది దుకాణాలు నిర్వహించుకునే వ్యాపారులు చాలా మంది ఉన్నారు. కొందరు పెద్ద మొత్తంలో బంగారు కొనుగోలు చేస్తున్న ప్రజలు పాన్, ఆధార్ కార్డులు లేకుండా కావాలని అడుగుతుండటంతో బిల్లుల్లో చూపని బంగారును వారికి విక్రయిస్తున్నారు. బిల్లులు లేకుంటే రేటు తగ్గుతుందనే ఉద్దేశంతో చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని వల్ల సకాలంలో ట్యాక్స్ చెల్లించే వ్యాపారులు ధరలు తగ్గించలేక ఇబ్బందులు పడుతున్నారు. సౌదీ అరేబియా, కువైట్ నుంచి కూడా.. సౌదీ అరేబియా, కువైట్ల నుంచి ప్రొద్దుటూరుకు బంగారు బిస్కెట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా కొందరు వ్యాపారులకు అక్కడి వారితో సంబంధాలు ఉన్నాయి. వీరు తరచు బంగారు బిస్కెట్లను పంపుతున్నట్లు సమాచారం. పెద్ద పెద్ద విమానాశ్రయాల్లో తనిఖీలు ఎక్కువగా ఉంటాయని చెన్నై లాంటి ఎయిర్‌పోర్టుల ద్వారా పంపిస్తున్నారు. జీవనోపాధి కోసం వెళ్లి ఇండియాకు వస్తున్న జిల్లా వాసుల ద్వారా కూడా బంగారాన్ని పంపిస్తున్నారు. వారు చెన్నై విమానాశ్రయాల్లో దిగగానే అక్కడే ఉన్న వ్యాపారులు బంగారం తీసుకుంటున్నారు. ఇందుకు గాను వారికి కమీషన్ కూడా ఇస్తున్నారు. ఇలా కూడా ప్రొద్దుటూరుకు పెద్ద ఎత్తున బంగారు వస్తోంది. -
మలద్వారంలో బంగారం స్మగ్లింగ్
శంషాబాద్: అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న నలుగురు ప్రయాణికులను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు పెద్దమొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా అతను 832 గ్రాముల బంగారాన్ని పేస్ట్‌గా మార్చి మలద్వారంలో ఉంచుకొని తీసుకొచ్చినట్లు గుర్తించారు. విదేశాల నుంచి ముంబై వచ్చిన అతను అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు తెలిపారు. ఆపరేషన్ ద్వారా అతడి నుంచి బంగారాన్ని వెలికి తీశారు. దీని విలువ రూ. 27,87,400 ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీంతోపాటు స్పైస్ జెట్ విమానంలో శనివారం రాత్రి జెడ్డా నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు ప్రయాణికుల నుంచి 915 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.35,50,858 ఉంటుందని నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
బంగారు ఇస్త్రీపెట్టెలు
శంషాబాద్: బంగారం అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నా.. అక్రమార్కులు మాత్రం కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. తాజాగా దుబాయి నుంచి భారీఎత్తున బంగారాన్ని తీసుకు వచి్చన ఓ ప్రయాణికుడిని ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి కదలికలను కస్టమ్స్ అధికారులు అనుమానించారు. అతడి వద్ద ఉన్న బ్యాగుల్లోని 4 ఇస్త్రీ పెట్టెలను విప్పిచూడగా అందులో కాయిల్స్ రూపంలో 9.2 కేజీల బంగారం బయటపడింది. బహి రంగ మార్కెట్లో ఈ బంగారం విలువ రూ.3.46 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. నిందితుడిని అదు పులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఐరన్ బాక్సుల్లో 9 కిలోల బంగారం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 9.2 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 3.46 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. నాలుగు ఇస్త్రీ పెట్టెల్లో బంగారాన్ని తరలిస్తుండగా అనుమానం వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించగా వీ-ఆకారంలో ఉన్న బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
6.46 కిలోల బంగారం పట్టివేత!
సాక్షి, హైదరాబాద్: బంగారం స్మగ్లర్లు అక్రమ రవాణా కోసం పేదలను ఎంచుకుని నామమాత్రపు చార్జీలతో/ఉచిత ఉమ్రా యాత్ర పేర ఎర వేశారు. అలా వెళ్లిన వారిని భయపెట్టి జిద్దా నుంచి 6.46 కేజీల పసిడిని పంపారు. పక్కా సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులతో కలసి శంషాబాద్ విమానాశ్రయంలో ఆపరేషన్ చేపట్టగా 14 మంది చిక్కారు. ఈ వివరాలను నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ బుధవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్ కేంద్రంగా వ్యవస్థీకృతంగా బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న సూత్రధారులు అంతర్జాతీయ స్థాయిలోనూ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. వీరికి సంబంధించిన కొందరు ఏజెంట్ల ద్వారా కొత్త పంథాలో పసిడి అక్రమ రవాణాకు ప్రయత్నించారు. నగరంలోని పాతబస్తీ ప్రాంతంలో కొందరు ఏజెంట్లను నియమించుకున్న సూత్రధారులు వీరి సాయంతో నిరుపేదలైన మైనార్టీలను ఆకర్షించారు. ఉచితంగా లేదా నామమాత్రపు చార్జీలతో ఉమ్రా యాత్రకు తీసుకువెళ్తామంటూ వారికి ఎర వేశారు. వీరి వలలో పడిన 14 మంది స్త్రీ, పురుషులు గత నెలలో యాత్రకు వెళ్లారు. క్యారియర్లుగా మారాలని ఒత్తిడి... యాత్ర పూర్తయిన తర్వాత వీరందరిని స్మగ్లర్లు జిద్దా తీసుకువెళ్లారు. అక్కడ ఓ ప్రాంతంలో నిర్భంధించి బంగారం స్మగ్లింగ్‌కు తమకు సహకరించాలని ఆదేశించారు. ఈ పని చేయడానికి యాత్రికులు విముఖత చూపగా... తమ మాట వినకపోతే జిద్దాలో అరెస్టు చేయిస్తామని, యాత్రకయ్యే మొత్తం ఖర్చులు చెల్లించాలని భయపెట్టారు. చివరకు ఎటూపాలుపోని స్థితిలో యాత్రికులు క్యారియర్లుగా మారడానికి అంగీకరించారు. దీంతో మొత్తం 6.46 కేజీల బంగారాన్ని చిన్న చిన్న ముక్కలు, 24 క్యారెట్ల కడ్డీలు, చైన్ల రూపంలోకి మార్చారు. వీటిని ఆ 14 మందికి అప్పగించి లోదుస్తుల్లో దాచుకునేలా ఆదేశించారు. మంగళవారం జిద్దా నుంచి సౌదీ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో వీరిని హైదరాబాద్‌కు పంపారు. ఇలా వచ్చే వీరి ఫొటోలు, వివరాలను జిద్దాలో ఉండే ఏజెంట్లు వాట్సాప్ ద్వారా నగరంలోని ఏజెంట్లకు పంపారు. వీరి వివరాలను క్యారియర్లకు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. వీళ్లు చిక్కినా సూత్రధారులు వ్యవహారం బయటకు రాకూడదనే ఇలాంటి చర్యలు తీసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి బయటకు వచ్చిన తర్వాత పార్కింగ్ వద్ద వీళ్లకు స్థానిక ఏజెంట్లు కలుస్తారు. అక్కడ నుంచి వీరిని ఓ రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లి బంగారం స్వాధీనం చేసుకుంటారు. ఈ పసిడిని చేరాల్సిన వ్యాపారులకు చేర్చి క్యాష్ చేసుకుంటారు. పక్కా సమాచారంతో.. నిరుపేదలకు పవిత్ర యాత్ర పేరుతో ఎర వేసి క్యారియర్లుగా మార్చుకునే ముఠా వ్యవహారంపై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందడంతో ఈ స్మగ్లింగ్‌కు చెక్ పడింది. మరికాస్త లోతుగా ఆరా తీసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు గ్రూప్ బుకింగ్ ద్వారా వెళ్లిన వీరందరికీ విమానం టికెట్లు ఒకే పీఎన్ఆర్ నంబర్‌తో బుక్ అయినట్లు తెలుసుకున్నారు. దీంతో అదనపు డీసీపీ చైతన్య ఆదేశాలతో రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ మధుమోహన్‌రెడ్డి ఆ పీఎన్ఆర్ నంబర్, ఓ ప్రయాణికుడి పేరు సేకరించారు. వీళ్లు విమానం దిగి బయటకొస్తే పట్టుకోవడం కష్టమని, కొందరైనా పారిపోయే ప్రమాదముందని భావించా రు. విమానాశ్రయంలోకి వెళ్లి ఆపరేషన్ చేపట్టే అవకాశం టాస్క్‌ఫోర్స్‌కు లేకపోవడంతో విషయాన్ని మంగళవారం రాత్రి డీఆర్ఐకి అందించారు. అప్రమత్తమైన ప్రత్యేక టీమ్స్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి. సదరు పీఎన్ఆర్ నంబర్‌ను తనిఖీ చేయగా మొత్తం 14 మంది యాత్రికుల పేర్లు బయటపడ్డాయి. దీంతో విమానాశ్రయం లోపల డీఆర్ఐ, బయట టాస్క్‌ఫోర్స్ అధికారులు వలపన్నారు. విమా నం దిగి ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చే ప్రయత్నం చేసిన 14 మందిని అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ.. తనిఖీ చేయగా వివిధ రూపా ల్లో ఉన్న 6.46 కేజీల బంగారం బయటపడింది. దీని విలువ మార్కెట్లో రూ.2.17 కోట్లు ఉంటుందని నిర్ధారించారు. దీనికి సంబంధించి వీరివద్ద ఎలాంటి రసీదులు లేకపోవడంతో అక్రమ రవాణాగా తేల్చారు. -
దాని కోసం పేద, మధ్య తరగతి మహిళలే టార్గెట్
సాక్షి, సిటీబ్యూరో: స్మగ్లింగ్ చేసేందుకు ప్రధాన సూత్రధారులు మహిళలను క్యారియర్లుగా నియమించుకుంటున్నారు. కస్టమ్స్ అధికారులు మహిళలపై ఎక్కువగా దృష్టిసారించరనే ఉద్దేశంతోనే వారిని వినియోగించుకుంటున్నారని అధికారులు అనుమానిస్తున్నారు. దుబాయ్ నుంచి రూ.3.62 కోట్ల విలువైన బంగారంతో వస్తూ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవల చిక్కిన జియా ఉన్నిసా ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి ప్రధాన సూత్రధారులైన స్మగ్లర్ల తరఫున ఈమె క్యారియర్‌గా పని చేస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లలో ఈ తరహాలో బంగారం, మాదకద్రవ్యాలు స్మగ్లింగ్ చేస్తూ 9 మంది మహిళలు పట్టుబడ్డారు. సాధారణంగా స్మగ్లర్లు అనగానే అందరి మదిలో మెదిలేది పురుషులే. దీనికి తోడు మహిళలూ.. అందునా గర్భంతో, పసి పిల్లలతో వచ్చే వారిని అధికారులు తక్కువగా అనుమానిస్తారు. దీంతో దుబాయ్ తదితర దేశాల నుంచి వచ్చే పేద, మధ్య తరగతి మహిళలకు కమీషన్ ఆశ చూపుతున్న బడా స్మగ్లర్లు వారికి బంగారం, మాదకద్రవ్యాలు అప్పగిస్తున్నారు. డ్రగ్స్ మాట అటుంచితే మహిళా క్యారియర్లను ఎక్కువగా ఆయా దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే పసిడి ఇచ్చి పంపుతున్నారు. మాదకద్యవాలను కడుపులో దాచి గర్భవతులుగా, చంటి బిడ్డలతో వస్తున్న వారికి ఇచ్చి పంపిస్తున్నారు. డీఎఫ్‌ఎండీల వద్దా బురిడీ.. వివిధ రూపాల్లో, వివిధ పంథాల్లో దుస్తుల్లో దాచుకుని బంగారం తీసుకొస్తున్న మహిళలను విమానాశ్రయాల్లోని డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్స్ (డీఎఫ్ఎండీ)లు కూడా కొంత వరకు సహకరిస్తున్నాయి. ఏదైనా అక్రమరవాణా విషయం కస్టమ్స్ అధికారులు గుర్తించాలంటే పక్కా సమాచారం, ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) నిఘాల కంటే డీఎఫ్‌ఎండీఏ ఎక్కువగా ఉపకారం చేస్తాయి. క్యారియర్లు దాటుతున్న సమయంలో లోపల దాచి ఉంచిన లోహాలను గుర్తించి డీఎఫ్ఎండీలు శబ్దం చేస్తాయి. మహిళలు సాధారణంగానే కొంతవరకు నగలు ధరించి ఉంటారు. వీటి వల్లే శబ్దం వచ్చి ఉంటుందని అధికారులు భావించే ఆస్కారం ఉంటుంది. అందుకే బడా స్మగ్లర్లు మహిళల్ని క్యారియర్లుగా వాడుకుంటున్నారు. ముమ్మర కసరత్తు బడా స్మగ్లర్లు మహిళల్ని అక్రమరవాణాకు వినియోగించుకుంటున్నారనే ఉద్దేశంతో ప్రతి మహిళలను ఆపడం, క్షుణ్నంగా తనిఖీ చేయడం సాధ్యం కాదు. అలా చేస్తే అమాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కస్టమ్స్ సహా ఇతర ఏజెన్సీల అధికారులు మహిళా ప్రయాణికుల జాబితాను ముందే సేకరిస్తున్నారు. వారు విదేశాలకు ఎప్పుడు వెళ్లారు.. ఆఖరిసారి ఎప్పుడు వచ్చారు? ఏ వీసాపై వెళ్లారు.. వారి నేపథ్యం ఏంటి.. తదితరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదమైన వారిని మాత్రమే అదుపులోకి తీసుకుంటూ ఫలితాలు సాధిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొందరు మహిళా క్యారియర్లు కస్టమ్స్ కన్నుగప్పి తప్పించుకుంటున్నారు. జియా ఉన్నిసా సైతం ఎగ్జిట్ గేటు వరకు వచ్చేశాక ముందే సమాచారం ఉన్న డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. కీలక వ్యక్తులు చిక్కడం కష్టమే ఈ తరహాలో అక్రమ రవాణా చేస్తూ చిక్కుతున్న మహిళల్ని ఎంత విచారించినా... ముఠా వెనుక ఉన్న సూత్రధారుల్ని కనిపెట్టడం కష్టసాధ్యంగా మారుతోందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. ఆయా దేశాల్లోని విమానాశ్రయాల్లో వీరికి బంగారం అప్పగించే ముఠా సభ్యులు దాన్ని ఎవరికి డెలివరీ చేయాలో మాత్రం మహిళలకు చెప్పట్లేదు. విమానాశ్రయం నుంచి బయటకు వచ్చాక ఓ ప్రాంతంలో వేచి ఉండాలనో.. పలానా హోటల్/లాడ్జిలో బస చేయాలనో సూచిస్తున్నారు. ముఠాకు చెందిన రిసీవర్లు అక్కడికే వెళ్లి బంగారం తీసుకుని కమీషన్లు చెల్లిస్తున్నారు. ఈ కారణంగానే విమానాశ్రయాల్లో పట్టుబడుతున్న క్యారియర్ల కేసుల్లో పురోగతి ఉండట్లేదని వివరిస్తున్నారు. అయితే జియా ఉన్నిసా వ్యవహారాన్ని మాత్రం అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెను ఓ స్టార్ హోటల్లో ఉంచి మరీ ఈ వ్యవహారం సాగిస్తుండటంతో సూత్రధారుల్ని గుర్తించే పనిలో పడ్డారు. 4కేజీలుబ్యాంకాక్,దుబాయ్ నుంచి వచ్చిన నలుగురు మహిళల్ని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు వారి నుంచి 4 కేజీలబంగారం స్వాధీనం చేసుకున్నారు. 793గ్రాముల కొకైన్దుబాయ్ నుంచి గర్భవతిగా వచ్చిన సౌతాఫ్రికా మహిళ మూసా తన కడుపులో 793 గ్రాముల కొకైన్‌తో చిక్కింది. ఉదాహరణలు ఎన్నో..ళీ సౌదీ నుంచి తన భర్త, ఏడాదిన్నర కుమారుడితో కలసి వచ్చిన మహిళ 1.75 కేజీల బంగారంతో పట్టుబడింది. ♦ సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళల్ని తనిఖీ చేసిన అధికారులు 5.1 కేజీల బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ♦ యూఏఈ నుంచి వచ్చిన ఇద్దరు మహిళల వద్ద నుంచి 1.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
-
శంషాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుండి ఇండిగో విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ. కోటి 10 లక్షల విలువ చేసే 3 కిలోల 951 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణీకుడు తన లోదుస్తులకు ప్రత్యేకంగా జేబును కుట్టుకొని అందులో బంగారు బిస్కెట్లు తేవడానికి ప్రయత్నించగా, కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డారు. బుధవారం కూడా శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరిలో ఒకరు రెక్టమ్ కన్సీల్మెంట్ రూపంలో, మరొకరు పౌడర్‌గా మార్చి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరిద్దరి నుంచి 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు సూత్రధారుల కోసం లోతుగా విచారిస్తున్నారు. కాగా, బంగారం అక్రమ రవాణాలో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్ విభాగం కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40 కేజీల పసిడి స్వాధీనం చేసుకోగా.. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 10 కేజీలు చిక్కినట్లు తెలిపారు. నిరుపేదల్ని పావులుగా మార్చుకుని యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగిస్తున్నారని, మరికొందరు కమీషన్ కోసం క్యారియర్లుగా మారుతున్నారని అన్నారు. అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కల్యాణ్ రేవెళ్లతో కలసి శంషాబాద్‌లోని కస్టమ్స్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎంఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొందరు స్మగ్లర్లు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. హైదరాబాద్–దుబాయ్‌ల్లో బంగారం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం నేపథ్యంలో ఈ దందాకు దిగుతున్నారు. నేరుగా దిగుమతి చేసుకుంటే 38.5 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉండటంతో స్మగ్లింగ్‌కు తెగబడుతున్నారు. అయితే ఎక్కడా వీళ్లు నేరుగా సీన్లోకి రావట్లేదు. ఆయా దేశాల నుంచి వస్తున్న కొందరు యువతను కమీషన్ పేరుతో ఆకర్షిస్తున్న స్మగ్లర్లు తమ తరఫున పనిచేసేలా చేసుకుంటున్నారు. అలాగే దుబాయ్ తదితర దేశాల్లో స్థిరపడిన వారితోనూ ఒప్పందాలు చేసుకుని వారినీ ఈ రొంపిలోకి దింపుతున్నారు. దుబాయ్‌లో ఉంటున్న స్మగ్లింగ్ గ్యాంగ్‌ల సభ్యులు అక్కడి ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న పేద, మధ్య తరగతి వారిని గుర్తిస్తున్నారు. ఆయా ప్రయాణికుల్ని సంప్రదిస్తున్న ముఠా సభ్యులు తాము అప్పగించిన వస్తువులు తీసుకువెళ్లేలా వారిని ఒప్పిస్తున్నారు. దీనికోసం కొందరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు కమీషన్ ఇస్తుండగా.. మరికొందరికి టికెట్ కొనిస్తున్నారు. సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలిచే వీరిలో అత్యధికులకు తాము పసిడి తీసుకువస్తున్నామని తెలియట్లేదు. అలా ఉండేందుకు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చేసి వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక వీరిని రిసీవ్ చేసుకునేది ఎవరో, వారి కాంటాక్ట్ నంబర్లు ఏమిటో చెప్పరు. అలా చేస్తే కస్టమ్స్ తనిఖీల్లో వీరు చిక్కితే ముఠా గుట్టురట్టవుతుందని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి ఫొటోలను మాత్రం వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉంటున్న రిసీవర్లకు పంపుతున్నారు’ అని అన్నారు. -
ఒకేరోజు ఇద్దరు స్మగ్లర్లు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం కస్టమ్స్ అధీనంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) అధికారులు బుధవారం ఒక్క రోజే ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. వీరిలో ఒకరు రెక్టమ్ కన్సీల్మెంట్ రూపంలో, మరొకరు పౌడర్‌గా మార్చి బంగారాన్ని అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. వీరిద్దరి నుంచి 4 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్న అధికారులు సూత్రధారుల కోసం లోతుగా విచారిస్తున్నారు. ప్రత్యేక శస్త్రచికిత్సలు.. ఈ స్మగ్లింగ్ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న వారి వద్ద పనిచేస్తూ లేదా కమీషన్ తీసుకుంటూ పసిడిని దేశంలోకి తీసుకువచ్చే వారిని క్యారియర్లు అంటారు. ఈ కీలక వ్యక్తులు సుదీర్ఘకాలం తమ వద్ద పనిచేసే క్యారియర్లకు ముంబై, కేరళల్లో ప్రత్యేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా వారి మలద్వారాన్ని అవసరమైన మేర వెడల్పు చేయిస్తున్నారు. ఇందులో గరిష్టంగా రెండు కేజీల వరకు బంగారాన్ని చిన్న బిస్కెట్ల రూపంలో పెట్టేలా ఏర్పాటు చేస్తున్నారు. బంగారానికి నల్ల కార్బన్ పేపర్ చుట్టడం ద్వారా స్కానర్‌కు చిక్కకుండా మలద్వారంలో పెట్టుకుంటున్న క్యారియర్లు అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. బుధవారం చిక్కిన ఇద్దరిలో ఒకరు ఈ రూపంలోనే పసిడిని తీసుకువచ్చారు. హెన్నాలో బంగారం పొడి.. ఇతడు పట్టుబడిన కాసేపటికే మరో క్యారియర్ సైతం పట్టుబడ్డాడు. ఇతగాడు బంగారాన్ని పొడి చేసి.. హెన్నాతో (మెహెందీ పొడి) కలిపి.. పేస్ట్‌లా మార్చి ఎవరికీ అనుమానం రాకుండా అక్రమ రవాణా చేస్తున్నాడు. ఇలా పసిడిని పొడి రూపంలో తీసుకువచ్చి చిక్కిన కేసులూ అనేక ఉంటున్నాయి. ఆ పొడి కూడా బంగారం రంగులోనే ఉండటంతో పట్టుబడే అవకాశాలు ఎక్కువ. దీంతో మరో అడుగు ముందుకు వేసిన స్మగ్లర్లు బంగారం పొడిని గోధుమ రంగులో ఉన్న హెన్నాలో కలిపేస్తున్నారు. ఇలా తన రంగును కోల్పోయి, పౌడర్ రూపంలోకి మారిన బంగారం, హెన్నా మిక్స్‌ను పేస్ట్‌గా మార్చడానికి చాక్లెట్ తయారీకి వినియోగించే లిక్విడ్స్ వాడుతున్నారు. ఇతర కెమికల్స్ వాడితే విమానంలో తరలించడం కష్టమనే భావంతో ఈ లిక్విడ్స్ వినియోగించి ఆ మిక్స్‌ను పేస్ట్‌గా మారుస్తున్నారు. ఇలా తయారైన గోధుమ రంగు పేస్ట్‌ను ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన స్మగ్లర్లు దాన్ని బ్రౌన్ కవర్లలో ఉంచి పైన ప్లాస్టర్లు వేస్తున్నారు. ఇలా తీసుకువచ్చిన వ్యక్తినీ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. -
గోల్డ్ స్మగ్లింగ్‌లో ఐదో స్థానం
సాక్షి, హైదరాబాద్: బంగారం అక్రమ రవాణాలో హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిందని కస్టమ్స్ విభాగం కమిషనర్ ఎంఆర్ఆర్ రెడ్డి వెల్లడించారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40 కేజీల పసిడి స్వాధీనం చేసుకోగా.. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 10 కేజీలు చిక్కినట్లు తెలిపారు. నిరుపేదల్ని పావులుగా మార్చుకుని యథేచ్ఛగా ఈ వ్యవహారం సాగిస్తున్నారని, మరికొందరు కమీషన్ కోసం క్యారియర్లుగా మారుతున్నారని అన్నారు. అదనపు కమిషనర్ మంజుల హోస్మానీ, డిప్యూటీ కమిషనర్ కల్యాణ్ రేవెళ్లతో కలసి శంషాబాద్‌లోని కస్టమ్స్ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎంఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కొందరు స్మగ్లర్లు వ్యవస్థీకృతంగా వ్యవహరిస్తూ భారీ స్థాయిలో బంగారం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. హైదరాబాద్–దుబాయ్‌ల్లో బంగారం ధరల్లో ఉన్న భారీ వ్యత్యాసం నేపథ్యంలో ఈ దందాకు దిగుతున్నారు. నేరుగా దిగుమతి చేసుకుంటే 38.5 శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి ఉండటంతో స్మగ్లింగ్‌కు తెగబడుతున్నారు. అయితే ఎక్కడా వీళ్లు నేరుగా సీన్లోకి రావట్లేదు. ఆయా దేశాల నుంచి వస్తున్న కొందరు యువతను కమీషన్ పేరుతో ఆకర్షిస్తున్న స్మగ్లర్లు తమ తరఫున పనిచేసేలా చేసుకుంటున్నారు. అలాగే దుబాయ్ తదితర దేశాల్లో స్థిరపడిన వారితోనూ ఒప్పందాలు చేసుకుని వారినీ ఈ రొంపిలోకి దింపుతున్నారు. దుబాయ్‌లో ఉంటున్న స్మగ్లింగ్ గ్యాంగ్‌ల సభ్యులు అక్కడి ట్రావెల్ ఏజెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వారి ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్న పేద, మధ్య తరగతి వారిని గుర్తిస్తున్నారు. ఆయా ప్రయాణికుల్ని సంప్రదిస్తున్న ముఠా సభ్యులు తాము అప్పగించిన వస్తువులు తీసుకువెళ్లేలా వారిని ఒప్పిస్తున్నారు. దీనికోసం కొందరికి రూ.10 వేల నుంచి రూ.15 వేలు కమీషన్ ఇస్తుండగా.. మరికొందరికి టికెట్ కొనిస్తున్నారు. సాంకేతిక పరిభాషలో క్యారియర్లుగా పిలిచే వీరిలో అత్యధికులకు తాము పసిడి తీసుకువస్తున్నామని తెలియట్లేదు. అలా ఉండేందుకు బంగారాన్ని వివిధ రూపాల్లోకి మార్చేసి వీరికి అప్పగిస్తున్నారు. ఇక్కడికి వచ్చాక వీరిని రిసీవ్ చేసుకునేది ఎవరో, వారి కాంటాక్ట్ నంబర్లు ఏమిటో చెప్పరు. అలా చేస్తే కస్టమ్స్ తనిఖీల్లో వీరు చిక్కితే ముఠా గుట్టురట్టవుతుందని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీరి ఫొటోలను మాత్రం వాట్సాప్ ద్వారా ఇక్కడ ఉంటున్న రిసీవర్లకు పంపుతున్నారు’ అని అన్నారు. ఇవీ గణాంకాలు: 2018–19 ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ అధికారులు 86 స్మగ్లింగ్ కేసుల్ని గుట్టురట్టు చేశారు. వీరి నుంచి రూ.12 కోట్లకు పైగా విలువైన 40 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అరె స్టు అయిన వారిలో 20 మంది భారతీయులు, ఒక విదేశీయుడు ఉన్నారు. గత నెల 1 నుంచి మంగళవారం వరకు 14 కేసులు నమోదయ్యాయి. ఐదుగురిని అరెస్టు చేసిన కస్టమ్స్ అధికారులు వీరి నుంచి రూ.3 కోట్ల విలువైన 10 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పురుషులు 20, మహిళలు 40 గ్రాములు విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం విషయంలో తప్పక రూల్స్ పాటించాలని ఎంఆర్ఆర్ రెడ్డి తెలిపారు. విదేశాల నుంచి వచ్చే పురుషులు 20 గ్రాములు, మహిళలు 40 గ్రాముల బంగారాన్ని తమ వెంట తీసుకురావచ్చని అన్నారు. ఎక్కువ మోతాదులో బంగారం తెస్తుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లోని కస్టమ్స్ విభాగానికి చెందిన రెడ్ చానల్లో డిక్లేర్ చేసి పన్ను చెల్లించాలని చెప్పారు. రూ.20 లక్షలకు మించి విలువైన బంగారంతో పట్టుబడితే అరెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. -
ఒక వ్యక్తి ఎంత బంగారం తేవొచ్చంటే..
సాక్షి, హైదరాబాద్ : గోల్డ్ స్మగ్లింగ్‌లో హైదరాబాద్ టాప్ 5లో ఉందని కస్టమ్స్ కమిషనర్ ఎమ్ఆర్ఆర్ రెడ్డి పేర్కొన్నారు. రెండురోజుల క్రితమే 3.3 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నామని తెలిపారు. ఓ వ్యక్తి బెల్ట్ రూపంలో బంగారాన్ని తరలిస్తుండగా గ్రీన్ ఛానల్ వద్ద పట్టుకున్నామని.. దీని విలువ దాదాపు కోటి రూపాయల కంటే ఎక్కువగానే ఉంటుందన్నారు. ఈ మధ్యకాలంలో ఇదే అతిపెద్ద కేసుగా చెప్పవచ్చని పేర్కొన్నారు. గతేడాది రూ. 12 కోట్ల విలువైన బంగరాన్ని పట్టుకోగా...ఈ ఏడాది రూ. 4 కోట్ల విలువ గల బంగారాన్ని సీజ్ చేశామన్నారు. ‘నిందితులు రకరకాల మార్గాల్లో బంగారాన్ని స్మగ్లింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బంగారాన్ని పొడి చేసి..ఇన్నర్ పార్ట్స్ లో తరలిస్తున్న కేసులు కూడా ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉన్న కొందరు వ్యక్తులు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రయాణికులకు ఆశ చూపి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు సమాచారం. మరికొందరు టాక్స్ ఎగ్గొట్టేందుకు బంగారం తరలిస్తూ పట్టుబడుతున్నారు. బంగారం తరలిస్తున్న దాని వెనుక ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠా ఉందా అనే దానిపై విచారణ జరుగుతోంది’ అని వెల్లడించారు. రూల్స్ పాటించాలి.. ‘విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు బంగారం విషయంలో తప్పక రూల్స్ పాటించాలి. కస్టమ్స్ బ్యాగేజ్ రూల్స్ ప్రకారం మగవారు 20 గ్రాములు, ఆడవారు 40 గ్రాముల బంగారాన్ని తీసుకురావచ్చు. ఎక్కువ మోతాదులో బంగారం తెస్తుంటే రెడ్ ఛానల్లో డిక్లేర్ చేసి.. 38 శాతం టాక్స్ కట్టి తీసుకువెళ్లొచ్చు. ఎయిర్ పోర్ట్‌లో స్మగ్లింగ్ చేస్తూ దొరికిన బంగారాన్ని సీజ్ చేస్తాము. రూ. 20 లక్షలకు మించి విలువైన బంగారంతో పట్టుబడితే అరెస్ట్ చేస్తాము’ అని ఎమ్ఆర్ఆర్ రెడ్డి పేర్కొన్నారు. -
బెజవాడలో హవాలా గోల్డ్ బిజినెస్