క్యాప్యూల్స్‌ రూపంలో బంగారం.. ముగ్గురు మహిళలు అరెస్ట్‌ | Customs Officials Arrest Three Women In Cochi Airport Smuggling Gold | Sakshi
Sakshi News home page

కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత.. ముగ్గురు మహిళలు అరెస్ట్‌

Jun 10 2021 11:08 AM | Updated on Jun 10 2021 11:15 AM

Customs Officials Arrest Three Women In Cochi Airport Smuggling Gold - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం: కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గురువారం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ముగ్గురు మహిళల వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా బంగారాన్ని పేస్ట్‌గా మార్చి క్యాప్యూల్స్‌లో నింపిన సదరు మహిళలు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన కస్టమ్స్‌ అధికారులు వారిని అడ్డుకొని పరిశీలించగా క్యాప్యూల్స్‌ రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దీంతో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement