Cochin International Airport
-
కువైట్ నుంచి మృతదేహాలు.. కొచ్చిన్ చేరుకున్న ప్రత్యేక విమానం
Updates..👉కువైట్ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారికి సీఎం విజయన్, కేంద్ర మంత్రి కృతివర్ధన్ సింగ్, ఇతర మంత్రులు నివాళులు అర్పించారు. కొచ్చిన్ విమానాశ్రయంలో సంతాపం తెలిపారు. #WATCH | Ernakulam: Kerala CM Pinarayi Vijayan, MoS MEA Kirti Vardhan Singh and other ministers pay homage to the mortal remains of the victims of the fire incident in Kuwait, at Cochin International Airport. pic.twitter.com/LvcbBEmQm8— ANI (@ANI) June 14, 2024 👉 కువైట్‌లో మరణించిన వాళ్ల మృతదేహాలను కొచ్చిన్ ఎయిర్‌పోర్టు నుంచి స్వస్థలాలకు తరలిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది. #WATCH | Ernakulam, Kerala: The mortal remains of the 45 Indian victims in the fire incident in Kuwait arrive at Cochin International Airport. pic.twitter.com/nzl5vDNze4— ANI (@ANI) June 14, 2024 #WATCH | Ernakulam, Kerala: The mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait being taken out of the special Indian Air Force aircraft at Cochin International Airport.(Source: CIAL) pic.twitter.com/Dsn8hHhcqS— ANI (@ANI) June 14, 2024 కువైట్ మృతుల్లో తెలుగు వాళ్లు వీళ్లే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు 👉 కువైట్ నుంచి 45 మంది భారతీయుల మృతదేహాలు కొచ్చిన్ చేరుకున్నాయి. మృతుల్లో ఏపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. కాగా, మృతదేహాలకు ప్రభుత్వం డీఎన్ఏ టెస్టులు నిర్వహించనుంది. #WATCH | Ernakulam: Kerala CM Pinarayi Vijayan arrives at the Cochin International Airport where the special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait will reach shortly. pic.twitter.com/oKNVYE0lcG— ANI (@ANI) June 14, 2024 👉 కొచ్చిన్ విమానాశ్రయానికి చేరుకున్న కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేష్ గోపి. మృతదేహాలను బంధువులకు అప్పగించేందకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. అంబులెన్స్‌లు సిద్ధం చేసిన కేరళ ప్రభుత్వం. #WATCH | Ernakulam: Special IAF aircraft carrying the mortal remains of 45 Indian victims in the fire incident in Kuwait reaches Cochin International Airport. (Source: CIAL) pic.twitter.com/UKhlUROaP7— ANI (@ANI) June 14, 2024 👉ఇటీవల కువైట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన 45 మంది కార్మికులు మరణించారు. కాగా, వారి మృతదేహాలను భారత్‌కు తరలిస్తున్నారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J శుక్రవారం ఉదయం కువైట్ నుంచి కేరళకు బయలుదేరింది.👉కాగా, కువైట్‌లోని మంగాఫ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు విదేశాంగశాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం ఉదయం విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కువైట్ అధికారులతో మాట్లాడి మృతదేహాలను వెంటనే భారత్‌కు తరలించేలా కృషి చేశారు. ఇక, భారతీయుల మృతదేహాలతో ప్రత్యేక విమానం C-130J కువైట్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరింది. 🚨 India to repatriate remains of 45 nationals killed in Kuwait fire. Most victims are from Kerala (23), followed by Tamil Nadu (7), Andhra Pradesh (3), Uttar Pradesh (3), Odisha (2), and one each from Bihar, Punjab, Karnataka, Maharashtra, West Bengal, Jharkhand, and Haryana.… https://t.co/hLkfaxVnzl pic.twitter.com/mAxV5uzmXK— Dharmishtha (@Dharmishtha_D) June 14, 2024 అయితే, దక్షిణ కువైట్‌లోని విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 50 మంది మృతిచెందగా వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కేరళకు చెందినవారు ఉన్నారు. 24 మంది మలయాళీలు చనిపోయినట్టు సమాచారం. ఈ మేరకు ఓ అధికారి అనధికారికంగా ఓ ప్రకటన చేశారు. ప్రత్యేక విమానం కొచ్చి విమానాశ్రయానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. We have made all the required arrangements for receiving the bodies. We have coordinated with the family members of the victims: #Ernakulam Range DIG Putta Vimaladitya on mortal remains of #Kuwait fire incident pic.twitter.com/bw8u0YvO1F— DD News (@DDNewslive) June 14, 2024 -
ఎయిర్‌పోర్ట్‌లో శివమణి హల్చల్
-
షార్జా-కొచ్చివిమానంలో లోపం: సేఫ్ ల్యాండింగ్
కొచ్చి: జాతీయ, అంతర్జాతీయ, విమానాల్లో వరుసగా లోపాలు తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అవుతున్న ఘటనలు రోజుకొకటి చోటు చేసుకుంటున్నాయి. తాజాగా షార్జా నుంచి కొచ్చి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం(జి9-426) విమానం ల్యాండ్ అవుతుండగా సమస్య ఏర్పడింది. దీంతో విమానంలో ప్రయాణీకులు, సిబ్బంది గందర గోళానికి గురయ్యారు. కొచ్చికి వస్తున్న ఎయిర్ అరేబియా విమానం (జి9-426)లో లోపం తలెత్తింది. యుఎఇలోని షార్జా నుండి ఈరోజు సాయంత్రం కొచ్చి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్నప్పుడు సమస్య తలెత్తింది. అయితే అదృష్టవశాత్తూ విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో విమానంలో ఉన్న మొత్తం 222 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. హైడ్రాలిక్ వైఫల్యం కారణంగా విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారని కొచ్చిన్ విమానాశ్రయంలో కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యాయని డీజీసీఏ తెలిపింది. A Kochi-bound Air Arabia flight (G9- 426) departed from Sharjah in UAE and had a hydraulic failure while landing at Kochi airport, today evening. The aircraft landed safely. All 222 passengers and 7 crew members on board are safe: Cochin International Airport Authority pic.twitter.com/1bGS7xygTY — ANI (@ANI) July 15, 2022 -
క్యాప్యూల్స్ రూపంలో బంగారం.. ముగ్గురు మహిళలు అరెస్ట్
తిరువనంతపురం: కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని గురువారం కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన ముగ్గురు మహిళల వద్ద నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా బంగారాన్ని పేస్ట్‌గా మార్చి క్యాప్యూల్స్‌లో నింపిన సదరు మహిళలు ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించారు. అనుమానం వచ్చిన కస్టమ్స్ అధికారులు వారిని అడ్డుకొని పరిశీలించగా క్యాప్యూల్స్ రూపంలో ఉన్న బంగారం బయటపడింది. దీంతో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
29 నుంచి కొచ్చి విమానాశ్రయం పునరుద్ధరణ
తిరువనంతపురం : కేరళను వణికించిన వరదలతో మూతపడిన కొచ్చి విమానాశ్రయం ఈనెల 29 నుంచి మళ్లీ కార్యకలాపాలను ప్రారంభించనుంది. గతంలో ఈ నెల 26 నుంచి విమానాశ్రయంలో సర్వీసుల పునరుద్ధరణ చేపడతామని అధికారులు ప్రకటించగా దీన్ని మరో మూడు రోజులు పొడిగించారు. వరదలతో కొచ్చికి దూరంగా తరలివెళ్లిన ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరేందుకు సమయం అవసరమని అధికారులు భావించడంతో ఈనెల 29 నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించాలని బుధవారం జరిగిన కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (సీఐఏఎల్) సమావేశంలో నిర్ణయించారు. విమానాశ్రయానికి సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికీ మూతపడ్డాయని, ప్రయాణీకులకు ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయనే అంచనాతో మరో మూడు రోజుల పాటు ఎయిర్పోర్ట్ సేవల పునరుద్ధరణను పొడిగించామని, ఈనెల 29 నుంచి విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని సీఐఏఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. భారీ వరదలతో ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వే, ట్యాక్సీ వే, పార్కింగ్ ఏరియాల్లో నిలిచిన నీరు పూర్తిగా తగ్గుముఖం పట్టిందని, రన్‌వే పునరుద్ధరణకు రెండు మూడు రోజలు సమయం పడుతుందని తెలిపింది. కాగా కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దాదాపు రెండు వారాలుగా ఆపరేషన్స్ నిలిచిపోవడంతో విమానాశ్రయానికి రూ 22-27 కోట్ల నష్టం వాటిల్లిందని కేర్ రేటింగ్స్ సంస్థ అంచనా వేసింది. ఇతర ఆపరేషన్స్, సేవల కారణంగా మరో 10 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. -
పచ్చందనాల అద్భుతం...
తేయాకు తోటలతో పచ్చని కొండప్రాంతాలు, అరేబియా సముద్ర అందాలు గల కేరళను చూసే అవకాశం ఇటీవల మా వారికి సెమినార్ రూపంలో రాగానే వదలాలనిపించలేదు. హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయల్దేరిన మేము గంటన్నరలో ‘కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు’లో దిగాం. చుట్టూ చూస్తే ‘భూమికి పచ్చాని రంగేసినట్టు’ అన్న పాట గుర్తుకొచ్చింది. మేం దిగుతున్నప్పుడే సన్నని తుంపర పడుతోంది. ఆ తుంపరలో తడుస్తూనే ఫొటోలు తీసుకున్నాం. అక్కడ నుంచి ఒక టాక్సీ తీసుకొని ఐఎమ్ఎ హౌజ్‌కు వెళ్లాం. మాకిచ్చిన రూమూ, మా వారి కాన్ఫరెన్సూ అక్కడే. అది జవహర్లాల్ నెహ్రూ స్టేడియమ్‌కు వెనకవైపే ఉంది. కొచ్చిన్ చాలా శతాబ్దాలుగా మసాలా దినుసుల వ్యాపారానికి ప్రధాన కేంద్రం. కేరళకూ, లక్షద్వీప్‌కూ సంబంధించిన హైకోర్టు కొచ్చిన్లోనే ఉంది. త్రివేండ్రం కేరళకు రాజధాని అయినప్పటికీ కొచ్చినే పెద్దది. కొచ్చి ఫోర్టు నుండి కొలంబో, లక్షద్వీప్‌లకు ఓడలో వెళ్లే సౌకర్యం ఉంది. బీచ్‌లో సూర్యాస్తమయం... సెమినార్ పూర్తయ్యాక పోర్టుకు బయల్దేరాం. దూరంగా పెద్ద పెద్ద ఓడలు, వరసగా చైనీస్ ఫిషింగ్ నెట్స్.. సూర్యాస్తమయ సమయంలో ఎంతో అందంగా కనువిందు చేశాయి. బీచ్‌లో మామిడికాయ ముక్కలు, ఊరబెట్టిన ఉసిరికాయలు రుచి చూశాం. ఇక్కడ నుంచి అతిపెద్దదైన ‘మెరైన్ డ్రైవ్’కు వెళ్లాం. ఇక్కడ బోటింగ్ సదుపాయమూ ఉంది. ఇక్కడ కేరళ సందర్శన గుర్తుగా ఒక పడవ బొమ్మను కొనుక్కొని ‘డచ్ హౌస్’కు వెళ్లాం. హోటళ్లకు, బడులకు తెలుగు పేర్లు... ‘డచ్‌హౌస్’ఒక మ్యూజియం. గోడలకు మ్యూరల్ పెయింట్స్ చాలా ఉన్నాయి. నాటి రాజులు వాడిన వస్తువులు, ఆయుధాలూ, చెక్కతో, ఏనుగుదంతంతో, రోజ్‌వుడ్‌తో.. చేసిన మేనాలూ ఉన్నాయి. అంత పెద్ద మేనాలు అప్పటి బోయీలు ఎలా మోసేవారో.. అనిపించింది. ఎక్కువగా రామవర్మ, కేరళవర్మ అనే రాజులవి, వాళ్ల దివానులవి, రాణులవి, పిల్లలవి చిత్రపటాలు ఉన్నాయి. వాటిని బట్టి అప్పట్లో వాళ్లు వస్త్రధారణతో రాచరికం వలె దర్ఫంతో కాక సాధారణ ప్రజానీకంలాగా ఉన్నారని అర్థమైంది. స్త్రీలూ, పురుషులు అందరూ తెల్లని వస్త్రాలనే ధరించేవారని తెలిసింది. భారతదేశానికి స్వాతంత్య్రం లభించినప్పుడు రామవర్మ అనే రాజు వారి దేశ జెండాతో సహా భారతదేశ జెండాను ఎగరవేస్తూ ఉన్న చిత్రపటం ఉంది. భారత స్వాతంత్య్ర సమయంలో ఇండియన్ యూనియన్‌లో కలవడానికి కొచ్చిన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. ఇక చైత్రం ఫుడ్స్, శ్రావణ నిలయం.. అంటూ మన తెలుగు నెలల పేర్లు షాపులకు కనిపించాయి. ‘ఎలా ఉన్నారు?’ అని అడగడానికి ‘సుగమాణ’ అనాలని నేర్చుకున్నాం. దక్షిణ ద్వారక గురువాయూర్... ‘దక్షిణ భారత ద్వారక’గా పేరుగాంచిన ‘గురువాయూర్’కు వెళ్లేదారిలో ‘జూబిలీ మిషన్ మెడికల్ కాలేజీ’, ‘ఎలిఫెంట్ క్యాంప్’ చూశాం. ఇక్కడ దాదాపు అరవై డెబ్బై ఏనుగుల దాకా ఉన్నాయి. ఇవి దేవస్థానానికి సంబంధించిన ఏనుగులట. వీటన్నింటినీ ఒకే చోట చూడటం అబ్బురమనిపించింది. అక్కడే మావటి వాళ్లు వాటికి సపర్యలు చేస్తూ కనిపించారు. వాళ్లు చెప్పినట్టు ఏనుగులన్నీ బుద్దిగా నడుచుకోవడం భలే అనిపించింది. గురువాయూర్ ఆలయ ప్రవేశం చేయాలంటే పురుషులు ధోవతి, కండువా మాత్రమే ధరించాలి. స్త్రీలు చీరలు లేదా పంజాబీ డ్రెస్సులు ధరించాలి. గర్భగుడిలో కృష్ణుడి రూపం మనోహరం. ఇవన్నీ చూస్తూ కొచ్చి కొచ్చాక ‘లులూ’ అనే షాపింగ్ మాల్‌కు వెళ్లాం. ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్. సామాన్లు తీసుకెళ్లే ట్రాలీలు కార్ల ఆకారంలో ఉన్నాయి. కార్లలో పిల్లలు కూర్చుని స్టీరింగ్ తిప్పుతూ ఆడుకుంటుంటే, కార్లపైన సామాన్లు పెట్టుకుంటూ తీసుకెళుతున్నారు తల్లితండ్రులు. అందాల నగరిలో పచ్చందనాల అద్భుతాలు చూసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నాం. - కందేపి రాణీ ప్రసాద్, హైదరాబాద్