కువైట్‌ నుంచి మృతదేహాలు.. కొచ్చిన్‌ చేరుకున్న ప్రత్యేక విమానం | Sakshi
Sakshi News home page

కువైట్‌ నుంచి మృతదేహాలు.. కొచ్చిన్‌ చేరుకున్న ప్రత్యేక విమానం

Published Fri, Jun 14 2024 9:03 AM

Air Force Aircraft Taken Off From Kuwait Carrying Bodies Of 45 Indians Updates

 Updates..

👉కువైట్‌ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారికి సీఎం విజయన్‌, కేంద్ర మంత్రి కృతివర్ధన్‌ సింగ్‌, ఇతర మంత్రులు నివాళులు అర్పించారు. కొచ్చిన్‌ విమానాశ్రయంలో సంతాపం తెలిపారు. 

 

 

👉 కువైట్‌లో మరణించిన వాళ్ల మృతదేహాలను కొచ్చిన్‌ ఎయిర్‌పోర్టు నుంచి స్వస్థలాలకు తరలిస్తామని విదేశాంగ శాఖ ప్రకటించింది.

 

 

 

 

కువైట్‌ మృతుల్లో తెలుగు వాళ్లు వీళ్లే 

  • శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం (31), 
  • తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, 
  • అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు 

👉 కువైట్‌ నుంచి 45 మంది భారతీయుల మృతదేహాలు కొచ్చిన్‌ చేరుకున్నాయి. మృతుల్లో ఏపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. కాగా, మృతదేహాలకు ప్రభుత్వం డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించనుంది. 

 

👉 కొచ్చిన్‌ విమానాశ్రయానికి చేరుకున్న కేరళ సీఎం పినరయి విజయన్‌, కేంద్రమంత్రి సురేష్‌ గోపి. మృతదేహాలను బంధువులకు అప్పగించేందకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం. అంబులెన్స్‌లు సిద్ధం చేసిన కేరళ ప్రభుత్వం. 

 

 

👉ఇటీవల కువైట్‌లో జరిగిన అ‍గ్ని ప్రమాదంలో భారత్‌కు చెందిన 45 మంది కార్మికులు మరణించారు. కాగా, వారి మృతదేహాలను భారత్‌కు తరలిస్తున్నారు. భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం C-130J శుక్రవారం ఉదయం కువైట్‌ నుంచి కేరళకు బయలుదేరింది.

👉కాగా, కువైట్‌లోని మంగాఫ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందారు. ఈ నేపథ్యంలో వారి మృతదేహాలను భారత్‌కు తరలించేందుకు విదేశాంగశాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. శుక్రవారం ఉదయం విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ కువైట్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కువైట్‌ అధికారులతో మాట్లాడి మృతదేహాలను వెంటనే భారత్‌కు తరలించేలా కృషి చేశారు. ఇక, భారతీయుల మృతదేహాలతో ప్రత్యేక విమానం C-130J కువైట్‌ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరింది.

 

 

అయితే, దక్షిణ కువైట్‌లోని విదేశీ కార్మికులు నివసిస్తున్న భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 50 మంది మృతిచెందగా వారిలో 45 మంది భారతీయులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మరో 50 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది కేరళకు చెందినవారు ఉన్నారు. 24 మంది మలయాళీలు చనిపోయినట్టు సమాచారం. ఈ మేరకు ఓ అధికారి అనధికారికంగా ఓ ప్రకటన చేశారు. ప్రత్యేక విమానం కొచ్చి విమానాశ్రయానికి వస్తున్న నేపథ్యంలో అక్కడ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే, మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. 

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement