ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నమహిళ తనను కాపాడ్సాలిందిగా వేడుకుంటున్న సెల్ఫీ వీడియో ఒకటి ఆందోళన రేపుతోంది. తిరుపతి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ చెందిన ఎల్లంపల్లి లక్ష్మి తన కుమార్తెను ఉద్దేశించి ఈ వీడియో చేసింది. కువైట్ లో తనను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
మతిస్థిమితం లేని పిల్లవాడి సంరక్షణ కోసం కువైట్ వచ్చిన తనకు కనీసం కడుపు నిండి తిండి పెట్టకుండా, వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. పిల్లవాణ్ని సరిగ్గా చూడటం లేదని ఆరోపిస్తూ తనను బాగా కొట్టిన యజమానులు గదిలో నిర్బంధించారని కన్నీళ్లు పెట్టుకుంది. తిండీ, తిప్పలు లేక, అనారోగ్యంతో బాధలు పడుతున్నట్టు వెల్లడించింది.
అంతేకాదు రక్షించాలని ఎజెంటుకు విన్నవించుకుంటే 2.50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నానని దయచేసిన తనను ఈ నరకంనుంచి రక్షించాలని సెల్ఫీ వీడియోలో కుమార్తెను వేడుకుంది. దీంతో లక్ష్మి కుమార్తె సుచిత్ర ఆందోళనలో మునిగిపోయింది. తల్లిని కాపాడాలని కోరుతూ స్టానిక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు విజ్ఞపి చేసింది. కువైట్ నుండి తన తల్లిని త్వరగా ఇండియాకు తీసుకురావాలని కోరూతూ ఏమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కుమార్తె సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంది.
Comments
Please login to add a commentAdd a comment