concern
-
ఈ ‘శిక్ష’ణ మాకొద్దు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు ఉపాధ్యాయులకు ఇస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) రెసిడెన్షియల్ శిక్షణపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. తమకు స్థానికంగా శిక్షణ ఇవ్వాలని చెప్పినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బుధవారం ఆగిరిపల్లిలో శిక్షణ కోసం వచ్చిన ఉపా«ద్యాయుడు మృతి చెందడం, చీరాలలో మరో ఉపాధ్యాయుడు అస్వస్తతకు గురవడంతో ఈ శిక్షణను పూర్తిగా బహిష్కరించాలని భావిస్తున్నాయి.ఉపాధ్యాయులపై ఉన్న భారాన్ని తొలగిస్తామని, యాప్స్, శిక్షణ అంశాలను తొలగిస్తామని ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు హామీలు ఇచ్చారని, కానీ గతం కంటే ఇప్పుడు పని ఒత్తిడి అధికంగా పెంచారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రపంచ బ్యాంకు నిబంధనలను తమపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపిస్తున్నారు. 50 ఏళ్ల వయసు పైబడిన వారికి శిక్షణ నుంచి మినహాయించాలన్నా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని, దీనిపై ఒకటి రెండు రోజుల్లో పాఠశాల విద్య డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేసి తమకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే శిక్షణను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. విద్యా ప్రమాణాల పెంపునకు శిక్షణవిద్యాబోధనలో ప్రమాణాలు పెంచాలంటే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ ఉండాలని జాతీయ విద్యా విధానానికి, నిపుణ్ భారత్ ప్రోగ్రామ్‌కు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఎఫ్ఎల్ఎన్ శిక్షణను ప్రారంభించింది. ఈ శిక్షణ ద్వారా 1, 2 తరగతులపై దృష్టి సారించి, 3 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు నాణ్యమైన విద్యను అందచడమే లక్ష్యంగా కోర్సుకు రూపకల్పన చేశారు. మొత్తం 34 వేల మంది గ్రేడ్–1, 2 కేటగిరీ ఉపాధ్యాయులకు 14 విడతల్లో ఈ శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. గతేడాది కూడా ఇదే తరహా శిక్షణను రాష్ట్ర వ్యాప్తంగా 9 కేంద్రాల్లో దాదాపు 4 వేల మందికి, ఈ ఏడాది తొలివిడత 1,700 మందికి శిక్షణ ఇచ్చారు.అయితే, అప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. గతేడాది పిల్లలను బడిలో చేర్పించడం, బడి బయటి పిల్లలను సర్వే చేయడం, వారిని బడికి తీసుకొచ్చే బాధ్యతను వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది తీసుకున్నారు. అయితే, ఈ విద్యా సంవత్సరం విద్యార్థుల చేరికల కోసం ఇంటింటి సర్వే ఉపాధ్యాయులే చేయాల్సి వచ్చింది. దీంతోపాటు పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సిద్ధం చేయడం, కొత్తగా అపార్ ఐడీల నమోదు వంటి అదనపు భారం తమపై పడిందని, దీంతో తీవ్రమైన పని ఒత్తిడికి గురవుతున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. -
డీఎస్సీ పోస్టులు పెంచాలంటూ అభ్యర్థుల ఆందోళన
అనంతపురం అర్బన్: డీఎస్సీలో పోస్టుల సంఖ్య పెంచాలంటూ అనంతపురంలో అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. అనంతపురం జిల్లాలో దాదాపు 30 వేల మంది ఎస్జీటీ పోస్టులకు పోటీపడుతుండగా.. అత్యల్పంగా పోస్టులు కేటాయించి అన్యాయం చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. పోస్టుల సంఖ్య పెంచాలంటూ సోమవారం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు. కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. రాస్తారోకో విరమించాలని కోరిన పోలీసులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు.అధికారులే స్వయంగా వచ్చి తమ గోడు వింటేనే ఆందోళన విరమిస్తామని భీష్మించారు. పోలీసు అధికారుల అభ్యర్థన మేరకు డీఆర్ఓ వారి వద్దకు వచ్చారు. అభ్యర్థులు వారి సమస్యలను డీఆర్వోకు వివరించి, వినతిపత్రం ఇచ్చారు. తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆందోళన కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్‌కుమార్, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నూరుల్లా, డీఎస్సీ అభ్యర్థులు ముజీబ్, రాము తదితరులు మాట్లాడారు.అనంతపురం జిల్లాకు ఈ డీఎస్సీలో కేవలం 181 ఎస్జీటీ పోస్టులే కేటాయించి వేలమంది నిరుద్యోగ యువతకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కనీసం వెయ్యి ఎస్జీటీ పోస్టులు కేటాయించాలని డిమాండ్ చేశారు. జీఓ 117ను రద్దు చేయాలని కోరారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ద్వితీయ ఉపాధ్యాయుల నియామకం చేపట్టాలన్నారు. జిల్లా మొత్తానికి ఒకేరకమైన పరీక్ష పత్రంతో పరీక్ష నిర్వహించాలన్నారు. -
డిప్యూటీ సీఎం కార్యాలయం ఎదుట చిరుద్యోగుల ఆందోళన
సాక్షి, అమరావతి: ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్‌లలో పనిచేసే చిరుద్యోగులు శుక్రవారం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం ఎదుట మరో విడత ఆందోళన చేపట్టారు. 15–20 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని తొలగించి.. వారి స్థానంలో తాము చెప్పిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలంటూ కూటమి ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు తీసుకొస్తుండటంతో చిరుద్యోగులు ఇప్పటికే సెపె్టంబర్ 13, అక్టోబర్ 6 తేదీల్లో డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనలు నిర్వహించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. చిరుద్యోగుల ఆందోళన విషయాన్ని కార్యాలయ అధికారులు చిరుద్యోగుల సంఘ ప్రతినిధులను పిలిచి మాట్లాడారు. ఉద్యోగులెవరినీ తొలగించకుండా శాఖాపరంగా చర్యలు చేపడతామని పవన్‌కళ్యాణ్ తన కార్యాలయ అధికారుల ద్వారా హామీ ఇచ్చినట్టు ఏపీ ఆర్డబ్ల్యూఎస్ ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మోనిటరింగ్ లే»ొరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ చోట్ల తొలగించిన ఉద్యోగుల వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని.. రెండు మూడు రోజుల్లో ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలకు ఆదేశాలు ఇవ్వనున్నట్టు చెప్పారని ఆయన తెలిపారు. -
తొలగిస్తే సహించం.. ఉక్కు కార్మికుల హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. స్టీల్‌ప్లాంట్ బీసీ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మికులు అంటున్నారు.నిన్న(ఆదివారం) సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మహా పాదయాత్ర చేపట్టారు. స్టీల్‌ప్లాంట్ నుంచి వడ్లపూడి, కణితి, శ్రీనగర్, పాత గాజువాక, పెద గంట్యాడ వరకు పాదయాత్ర నిర్వహించారు.మరోవైపు, ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది. నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.ఇదీ చదవండి: ‘స్టీల్’ కాంట్రాక్ట్ కార్మికుల నెత్తిన పిడుగుదీని వెనక కూటమి ప్రభుత్వం కుయుక్తి ఉందని తెలుస్తోంది. ఒకే సారి తొలగిస్తే ఉద్యమాలు ఉధృతమవుతాయని.. విడతల వారీగా తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవైపు కార్మిక సంఘాలు, కార్మికులను మభ్యపెడుతూ.. మరోవైపు ప్రైవేటీకరణ చర్యలను ముమ్మరం చేసిన కేంద్ర ప్రభుత్వానికి అడ్డు చెప్పకూడదని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రస్తుత పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. -
విద్యార్థిని మృతిపై అనుమానాలు నివృత్తి చేయండి
తాడికొండ: రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న వీఐటీ–ఏపీ యూనివర్సిటీలో విద్యార్థిని సాయిశ్రేయ మృతిపై కుటుంబ సభ్యుల అనుమానాలను నివృత్తి చేయాలని విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులతో కలిసి యూనివర్సిటీ గేటు ఎదుట ఆందోళన చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి లోపలికి వెళ్లేందుకు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. సాయిశ్రేయ మృతికి కారణాలు తెలియజేయాలని రెండు రోజులుగా కోరుతున్నా వీసీని కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వడం లేదని మంజుల ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ వచ్చి సమాధానం చెప్పే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి గేటు ఎదుట బైఠాయించారు. విట్ వద్ద గొడవ గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ వచ్చి మంజులను లోపలికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ అడ్డుకున్నారు.దీంతో యూనివర్సిటీ యాజమాన్యంతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి సాయి శ్రేయ తల్లి మంజుల, కుటుంబ సభ్యులను లోపలికి తీసుకువెళ్లి వీసీ, ఇతర అధికారులను కలిశారు. ఈ నెల 17న తన కుమార్తె చనిపోయిందని, దానికి కారణాలు చెప్పాలని కోరుతున్నా పట్టించుకోకుండా యాజమాన్యం తమను ఇబ్బంది పెట్టిన తీరును వివరిస్తూ మంజుల కన్నీటిపర్యమంతమయ్యారు. ‘విద్యార్థిని చనిపోతే మాకేం సంబంధం లేదని వదిలేస్తారా...? ఆ కుటుంబ సభ్యులను పిలిచి మాట్లాడి న్యాయం చేయాలి. లేకపోతే నేను సహించను..’ అని విట్ వీసీ, సిబ్బందిని ఎమ్మెల్యే హెచ్చరించారు. -
Guidance for parents: మా అమ్మాయి సేఫ్‌గా ఉందా?
కోల్‌కతాలో హత్యాచార ఘటన జరిగాక స్కూలుకెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు... ఉద్యోగం కోసం, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లే ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లల క్షేమం గురించి ఆందోళన పెంచుకున్నారు. గంట గంటకూ ఫోన్ చేసి ‘ఎక్కడున్నావ్’ అంటున్నారు. సాయంత్రం ట్యూషన్లు మాన్పిస్తున్నారు. కాని అంత భయపడాల్సిన అవసరం భయపెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తలు ఏం తీసుకోవాలో చెప్తే చాలు.ఒక పెద్ద ఘటన జరిగినప్పుడు చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం గాయపడుతుంది. గాయం తీవ్రంగా ఉన్నప్పుడు అయోమయం, ఆందోళన, భయం, అభద్రత అన్నీ చుట్టుముడతాయి. ఇవన్నీ పిల్లల గురించి, ఆడపిల్లల గురించి అయినప్పుడు ఆ ఆందోళనకు అంతు ఉండదు. ఇప్పుడు కోల్‌కతాలోని స్కూళ్లు చైల్డ్ సైకాలజిస్ట్‌లు, కౌన్సెలర్లతో కిటకిటలాడుతున్నాయి.అక్కడ ఏం జరిగింది?పిల్లలకు సహజంగానే కుతూహలం అధికం. కోల్‌కతాలోని ఆర్.జి.కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్‌పై దారుణకాండ జరిగిన సంగతి దేశాన్ని కుదిపేస్తే కోల్‌కతా హోరెత్తింది. ఇంటా బయట ఆ సంఘటన గురించే చర్చలు. పిల్లల చెవుల్లో ఆ మాటలు పడనే పడతాయి. అదొక్కటే కాదు... వారికి ఆ సంఘటన గురించి దాచి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. స్కూళ్లు కొన్ని తన విద్యార్థులతో స్వచ్ఛందంగా నిరసనల్లో పాల్గొని ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్నాయి కూడా. వీటన్నింటి దరిమిలా పిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలు ప్రశ్నలతో ముంచెత్తసాగారు టీచర్లని, తల్లిదండ్రులను. డాక్టర్‌కు ఏం జరిగింది? ఆమె ఎలా చనిపోయింది? చేసిన వారిని పట్టుకున్నారా? అలాంటివి మాక్కూడా జరుగుతాయా?... ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక టీచర్లు అవస్థ పడి కౌన్సెలర్లను స్కూళ్లకు పిలుస్తున్నారు.రెండు విధాలా...ఇప్పుడు స్కూలు పిల్లలు, ఇంటర్ స్థాయి పిల్లలకు బయట దారుణమైన మనుషులు ఉంటారనే భయంతో వేగడం ఒక సమస్య అయితే అంత వరకూ కొద్దో గొ΄్పో స్వేచ్ఛ ఇస్తూ వచ్చిన తల్లిదండ్రులు స్కూల్ నుంచి లేట్‌గా వచ్చినా, ట్యూషన్‌కు వెళ్లినా, ఇంటి పనుల కోసం బయటకు వెళ్లినా పదే పదే ఫోన్లు చేసి వెంటపడటం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొందరు తల్లిదండ్రులు పెప్పర్ స్ప్రేలు కొనిస్తుండటంతో పిల్లలు మరింత బెంబేలు పడుతున్నారు.పిల్లలకు ధైర్యం చెప్పాలిఇప్పుడు జరగాల్సినది... పిల్లలకు ధైర్యం చెప్పడమే కాకుండా రక్షణ గురించి తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించుకోవాలి. నిర్లక్ష్యం అసలు పనికిరాదని కోల్‌కతా ఘటన తెలియచేస్తోంది. ఎవరూ లేని హాల్లో ఒంటరిగా నిద్రపోవడం ఎంత సురక్షితమో ఆ డాక్టర్ అంచనా వేసుకోలేకపోయింది. తల్లిదండ్రులు కూడా నైట్ డ్యూటీ సమయంలో వీడియో కాల్స్ చేసి ఆమె తిరుగాడక తప్పని పరిసరాలను గమనించి ఉంటే తగిన సూచనలు చేసి ఉండేవారు. అందుకే తల్లిదండ్రులు, పిల్లలు ఇద్దరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.⇒ పిల్లల రాకపోకల సమయాలను నిర్దిష్టంగా తల్లిదండ్రులు తెలుసుకుని ఉండాలి ⇒ స్కూల్‌కు వెళ్లే సమయం వచ్చే సమయం వారు వచ్చి వెళ్లే దారి, రవాణ వ్యవస్థ, ఎవరైనా కొత్త మనుషులు కలుస్తున్నారా... వంటివి ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి ⇒ ర్యాపిడో వంటి వాహనాలు ఎక్కి రావాల్సి ఉంటే ఎక్కే ముందు ఆ డ్రైవర్‌తో మాట కలిపించి, అతని నంబర్ తీసుకోవాలి లేదా తల్లిదండ్రులే ఫోన్‌పే చేస్తే అతని నంబర్ వచ్చేసినట్టే. ⇒ కొత్త ్రపాంతాలకు వెళ్లేటప్పుడు అవి ఏ మేరకు సురక్షితమో తెలుసుకుని పంపాలి. ⇒ పిల్లలు బయట ఉన్నప్పుడు తప్పకుండా ఫోన్ ఉండేలా చూసుకోవాలి. అది సైలెంట్ మోడ్‌లో లేకుండా పెట్టమని చెప్పాలి. ⇒ పిల్లలను ఊరికే కాల్ చేసి విసిగించకుండా ప్రతి గంటకూ ఒకసారి మెసేజ్ పెడితే చాలని చెప్పాలి. ⇒ పోలీసులకు కాల్ చేయడానికి భయపడకూడదని తెలియజేయాలి. ⇒ ఇంటి బయట, స్కూల్ దగ్గర, బంధువులుగాని, స్కూలు సిబ్బందిగాని ఎవరైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తుంటే వెంటనే తమకు చెప్పాలని భయపడకూడదని తెలియజేయాలి. ⇒ చట్టం చాలా శక్తిమంతమైనా, ఆపదలో చిక్కుకున్నప్పుడు దూసుకొచ్చే సాటి మనుషులు ఉంటారని, గట్టిగా సాయం కోరితే అందరూ కాపాడతారని పిల్లలకు చెబుతుండాలి. ⇒ అపరిచిత కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని ఊరికే భయపెట్టే విషయాలను ఆలోచిస్తూ కూచోవద్దని చెప్పాలి. ⇒ ధ్యాస మళ్లించే మంచి స్నేహాలలో ఉండేలా చూసుకోవాలి. -
మా పొట్ట కొట్టొద్దు
అమలాపురం టౌన్/తిరుపతి అర్బన్: కొత్త మద్యం పాలసీని రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించే ప్రయత్నంలో ఉందని తెలిసి ఆ దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్‌మెన్, నైట్ వాచ్మెన్, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీ బ్రూవరీస్ లిమిటెడ్ లిక్కర్ డిపో పరి«ధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆదివారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట మండల కేంద్రాల్లో నిరసనలకు దిగి తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డిపో పరిధిలో ఉన్న సుమారు వంద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 350 మంది వరకూ సేల్స్‌మెన్, సూపర్వైజర్లు, నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం, లంకతల్లమ్మ గుడి సెంటర్ నుంచి పోలమ్మ చెరువు వరకూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మలికిపురం గాంధీ సెంటర్, అంబాజీపేటల్లో ధర్నా చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక దర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించండి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం పాలసీ పద్ధతిలో 2019 నుంచి పనిచేస్తున్న కారి్మకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ఎస్వీ హైసూ్కల్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పలువురు కారి్మకులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలుస్తోందని చెప్పారు. తమను మద్యం షాపుల్లో అవకాశం లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో సెపె్టంబర్ 7 నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
PM Narendra Modi: కలిసి పనిచేద్దాం.. సవాళ్లను ఎదిరిద్దాం
న్యూఢిల్లీ/ఢాకా: ప్రపంచవ్యాప్తంగా అనిశి్చత పరిస్థితులు ఏర్పడుతుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార, ఇంధన భద్రత విషయంలో సంక్షోభాలను ఎదుర్కోవడానికి కలిసికట్టుగా పనిచేద్దామని గ్లోబల్ సౌత్ దేశాలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి శత్రువైన ఉగ్రవాదాన్ని అరికట్టడానికి చేతులు కలుపుదామని సూచించారు. శనివారం వర్చువల్‌గా నిర్వహించిన ‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సదస్సు’లో ప్రధాని మోదీ ప్రసంగించారు. గ్లోబల్ సౌత్ దేశాల్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం ‘సోషల్ ఇంపాక్ట్ ఫండ్’కు 25 మిలియన్ డాలర్లు అందజేయబోతున్నట్లు ప్రకటించారు. పరస్పర వాణిజ్యం, సమగ్రాభివృద్ధిని ప్రోత్సహించడంతోపాటు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడమే లక్ష్యంగా తమ శక్తిసామర్థ్యాలను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పునరుద్ఘాటించారు. ఐకమత్యంతోనే మన బలం కోవిడ్–19 మహమ్మారి ప్రభావం నుంచి ప్రపంచ దేశాలు ఇంకా పూర్తిగా బయటపడలేదని, ఇంతలో యుద్ధాలు ముంచుకొచ్చాయని మోదీ విచారం వ్యక్తంచేశారు. అబివృద్ధికి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని చెప్పారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత, ఇంధన భద్రత వంటి సవాళ్లు ఇప్పటికే ఉండగా, టెక్నాలజీకి సంబంధించి కొత్తగా ఆర్థిక, సామాజిక సవాళ్లు మొదలయ్యాయని తెలిపారు. గత శతాబ్దంలో ఏర్పాటైన పాలనా వ్యవస్థలు, ఆర్థిక వ్యవస్థలు ఈ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించలేకపోతున్నాయని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ ఒక్కటి కావాలన్నారు. ఒకే గళం వినిపించాలని, ఒకరికొకరు తోడుగా నిలవాలని సూచించారు. ఒకరి అనుభవాలను మరొకరు పాఠాలు నేర్చుకోవాలన్నారు. మన ఐకమత్యంలోనే మన బలం దాగి ఉందన్నారు. ఈ ఐకమత్య బలంతో నూతన దశలో ప్రయాణం సాగించాలని పిలుపునిచ్చారు. ‘గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్’ గ్లోబల్ సౌత్ దేశాల ప్రగతి కోసం మానవ కేంద్రీకృత ‘గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్’ ఏర్పాటు చేద్దామని ప్రధాని మోదీ ప్రతిపాదించారు. భారతదేశ అభివృద్ధి యాత్ర, అభివృద్ధి భాగస్వామ్య అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని వ్యాపారం–వాణిజ్యంతోపాటు సాంకేతికతను పంచుకోవడానికి, అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందించుకోవడానికి ఈ వేదిక దోహదపడుతుందని వెల్లడించారు. భాగస్వామ్య దేశాల సమతుల, సుస్థిరాభివృద్ధికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలపై మరింత అప్పుల భారం పడకుండా ఇలాంటి చర్యలు అవసరమని పేర్కొన్నారు. ట్రేడ్ ప్రమోషన్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి 2.5 మిలియన్ డాలర్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయబోతున్నామని నరేంద్ర మోదీ ప్రకటించారు. అంతర్జాతీయంగా నెలకొన్న పలు సంఘర్షణలు, ఉద్రిక్తతలకు పరిష్కార మార్గాలు సమగ్ర ప్రపంచాభివృద్ధి, సుస్థిర పాలనలోనే ఉన్నాయని తేలి్చచెప్పారు. -
అక్రమంగా తొలగిస్తున్నారు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఉపాధి హామీ పథకం అమలుకు క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లను రెండు నెలలుగా రాజకీయ కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తొలగిస్తోందంటూ ఫీల్డ్ అసిసెంట్లు ఆందోళన వ్యక్తం చేశారు. రెండు నెలలుగా 2,360 మందిని తొలగించినట్లు తెలిపారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు శుక్రవారం తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడుగంటల వరకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ గౌరవాధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, అధ్యక్షుడు ఎం.పరంధామయ్య, ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు, కోశాధికారి ఖాదర్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2,360 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం తొలగించిందని చెప్పారు. 17 సంవత్సరాలుగా కేవలం గౌరవ వేతనంతో పనిచేస్తున్నవారిని అక్రమంగా తొలగిస్తున్నారని పేర్కొన్నారు. అన్ని జిల్లాల్లో ఇంకా అనేకమందిని తొలగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు చెప్పారు. అక్రమ తొలగింపులు, రాజకీయ బెదిరింపుల కారణంగా రాష్ట్రంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు తీసుకోదని, ఉద్యోగాల నుంచి తొలగించదని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ చెబుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ బెదిరింపులు, అక్రమ తొలగింపులు కొనసాగడం విచారకరమని చెప్పారు. అక్రమంగా తొలగించిన వారందరినీ ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ బెదిరింపులతో ఆత్మహత్య చేసుకున్న నలుగురి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, ఆ కుటుంబాల్లో వారికి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగభద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం రూ.20 వేలకు పెంచాలని వారు కోరారు.డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళతా: డైరెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రతినిధులు కొందరిని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కృష్ణతేజ తన చాంబర్‌కు పిలిపించుకుని మాట్లాడారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రతినిధులు తమ సమస్యలకు సంబంధించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్ల అక్రమ తొలగింపులపై డ్వామా పీడీలతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించి వివరాలు తెప్పించుకుంటానని కృష్ణతేజ హామీ ఇచ్చారని ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.నరసింహులు తెలిపారు.ఫీల్డ్ అసిస్టెంట్లు తెలిపిన వివరాలను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, శాఖ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు చేపడతామన్నారని చెప్పారు. ఈ ఆందోళనలో శ్రామిక మహిళా కన్వీనర్ కె.ధనలక్ష్మి, ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ రాష్ట్ర నాయకులు వీరే‹Ùగౌడ్, మహే‹Ù, రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మన సభలకు జనం రారేంటి!
సాక్షి, అమరావతి: ఓ పక్క ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర అశేష ప్రజానీకంతో సాగుతోంది. అంతకు ముందు సీఎం జగన్ పాల్గొన్న సిద్ధం సభలూ ఘన విజయం సాధించాయి. మరి మన బాబు సభలేమిటి ఇంతగా తేలిపోతున్నాయి.. టీడీపీ నేతల్లో అంతర్మథనమిది. 14 ఏళ్లు సీఎంగా చేసిన బాబు నిర్వహిస్తున్న ప్రజాగళం సభలకు కనీస స్థాయిలో జనం రావడంలేదు. బాబు సభలకు ప్రజల నుంచి స్పందన లేదని పవన్ కళ్యాణ్‌ని తీసుకువచ్చినా ఫలితం సున్నా. నాలుగు రోజులక్రితం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన కూటమి సభలో చంద్రబాబు, పురందేశ్వరితోపాటు పవన్ కూడా పాల్గొన్నారు. అయినా ఈ సభకు నాలుగైదు వేల మంది కూడా రాలేదు. దీంతో ఏం చేయాలో పాలుపోక కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు. అంతకు ముందు తణుకు సభకూ జనం ఆశించిన స్థాయిలో రాలేదు. మూడు పార్టీల నేతలు వస్తుండడంతో జన సమీకరణ భారీగా చేయాలని ఆ జిల్లా నాయకులపై ఒత్తిడి తెచ్చారు. జిల్లా నాయకులు ఎంతగా ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. తమ పార్టీ సభలకి ప్రజల్ని తీసుకురావడం కష్టంగా మారిందని, ఎంత చెప్పినా, ప్రలోభపెట్టినా రావడంలేదని స్థానిక నేతలు వాపోతున్నారు. బాబు ఒక్కడే విడిగా పెడుతున్న సభల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉంటోందని చెబుతున్నారు. రోజుకి రెండు, మూడు సభలు పెడుతున్నా, ఒక్క చోట కూడా అనుకున్న స్థాయిలో ప్రజలు రావడంలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. పలుచగా ఉన్న సభల్ని చూసి మిగిలిన ప్రాంతాల్లోని కేడర్ నీరుగారిపోతుందనే ఉద్దేశంతో ఎక్కువ మంది వచ్చినట్లుగా కనిపించేందుకు చిన్న సెంటర్లు, చిన్న రోడ్లను ఎంచుకుని సభలు పెడుతున్నారు. అక్కడికి అతి కష్టం మీద కొద్దిపాటి జనాన్ని తీసుకువచ్చి ఫొటోలు, వీడియోలతో వాటినే గొప్పగా ఉన్నట్లు చూపిస్తున్నారు. బాబు స్పీచ్ మొదలైతే.. జనమూ జంపే... మరోవైపు సభలకు వచ్చిన కొద్దిపాటి జనం కూడా బాబు ప్రసంగం మొదలవగానే వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. బాబు ప్రసంగం అంటేనే గంటా గంటన్నరపాటు ఊకదంపుడు స్పీచ్ ఉంటుంది. అందులోనూ విషయం లేకపోవడంతో వినేందుకు ఎవరూ ఇష్టపడటంలేదు. వైఎస్ జగన్‌పై అదే పనిగా అక్కసు వెళ్లగక్కుతుండడంతో ప్రజలు పట్టించుకోవడంలేదు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జరిగిన నాలుగు సభలను చూస్తే బాబు మాట్లాడుతున్నప్పుడు వింటున్నవారి సంఖ్య చాలా స్వల్పం. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్‌ను తిట్టడం, ఈర‡్ష్య, ద్వేషాలను బయటపెట్టుకోవడం తప్ప బాబు ప్రసంగాల్లో కొత్తదనం కనిపించడంలేదని చెబుతున్నారు. దానివల్లే జనం ఏమీ పట్టించుకోవడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బాబు మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన కడుపు మంటనంతా వెళ్లగక్కి, కళ్లు మూసుకుని గంటల తరబడి అబద్ధాలను చెబుతూ వాటినే గొప్ప ప్రసంగాలుగా ఫీల్ అవుతున్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసారి ఎలాగైనా జనాన్ని తీసుకురండి.. నేతలకు హెచ్చరికలు గత నెలలో చిలకలూరిపేటలో ప్రధాని నరేంద్ర మోడీతో నిర్వహించిన సభను కూడా టీడీపీ విజయవంతం చేయలేకపోయింది. ఎన్నో ఆశలతో నిర్వహించిన ఆ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను మోదీ పెద్దగా పట్టించుకోకపోవడం, సభ కూడా అట్టర్‌ఫ్లాప్ అవడంతో బాబుకు షాక్ తగిలినట్లయింది. ఆ తర్వాత నుంచి ‘ప్రజా గళం’ పేరుతో నిర్వహించిన సభలేవీ జనాన్ని ఆకర్షించలేదు. అంతకుముందు ‘రా కదలిరా’ పేరుతో పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించిన సభలూ తేలిపోయాయి. దీంతో ఏం చేయాలనే దానిపై కూటమి అగ్ర నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. శుక్రవారం చంద్రబాబు నివాసంలో జరిగిన కూటమి నేతల సమావేశంలో సభలు విఫలమవడంపైనా చర్చించారు. ఈసారి ఎలాగైనా కొన్ని సభలకు జనాన్ని భారీగా తరలించాలని పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు చెప్పారు. రాబోయే వారం రోజుల్లో వరుసగా 13 సభలకు ప్రణాళిక రూపొందించి అక్కడి నేతలకు ముందుగానే హెచ్చరికలు చేశారు. జన సమీకరణ బాగా ఉండాలని, లేకపోతే బాబు గారు తిడతారని పరిశీలకులు అక్కడి ఇన్‌ఛార్జిలను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నియోజకవర్గాల నేతలు మాత్రం జనం రాకపోతే తామేం చేయలేమంటూ చేతులెత్తేస్తున్నారు. -
వ్యవసాయ మార్కెట్లలో రైతుల పడిగాపులు
తిరుమలగిరి (తుంగతుర్తి)/జనగామ: వానల్లేక, సాగునీరు అందక చాలా చోట్ల వరి పంట దెబ్బతి న్నది. మిగిలిన చోట రైతులు వరికోతలు పూర్తి చేసి.. వ్యవసాయ మార్కెట్లకు తెస్తున్నారు. కానీ మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోళ్లు చేస్తుండటం, అదీ సరిగా సాగకపోవడంతో.. పడిగాపులు పడుతున్నారు. శనివారం సూర్యాపేట జిల్లా తిరు మలగిరి, జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ఇదే పరిస్థితి కనిపించింది. భారీగా పోటెత్తిన ధాన్యం: శనివారం తిరుమ లగిరి వ్యవసాయ మార్కెట్ యార్డుకు 47,660 బస్తాల ధాన్యం వచ్చింది. యాసంగి సీజన్ మొదలై నప్పటి నుంచి ఇంత భారీగా ధాన్యం రావడం ఇదే మొదటిసారి. గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా.. వాతావరణంలో మార్పులతో రైతులు యార్డుకే ధాన్యాన్ని తీసుకొస్తున్నారని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే మార్కెట్లోకి ధాన్యం ట్రాక్టర్లను అనుమతించాల్సి ఉండగా.. శనివారం తెల్లవారు జాము వరకు పంపలేదు. దీనితో రోడ్డు పైనే వందలకొద్దీ ట్రాక్టర్లు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. కాగా ట్రేడర్లు ధాన్యానికి క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,700, గరిష్టంగా రూ.1,980 ధర చెల్లించారు. జనగామలో కొనుగోళ్లు నిలిపేసిన ట్రేడర్లు తక్కువ ధరకు ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళ న, ముగ్గురు ట్రేడర్లపై కేసుల నమోదు నేపథ్యంలో.. జనగామ వ్యవసాయ మార్కెట్లో ట్రేడర్లు కొనుగోళ్లు నిలిపివేశారు. దీనితో మార్కెట్‌కు వరి ధాన్యం, మక్కలు, చింతపండు, ఇతర వ్యవసాయ ఉత్పత్తు లను తీసుకువచ్చిన రైతులు వాటిని అమ్ముకో వడా నికి పడిగాపులు పడుతున్నారు. ఇక మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ రాజునా యక్ శనివారం జనగామ మార్కెట్ కార్యాలయంలో.. ట్రేడర్లు, అడ్తిదారులతో రెండు గంటల పాటు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రైవేట్ మార్కె ట్లోనూ మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేయాలని రాజునాయక్ కోరగా.. అది సాధ్యం కాదని ట్రేడర్లు స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లేని నిబంధనలను జనగామ మార్కెట్‌పై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నించారు. తమపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు. మరోవైపు ఈ మార్కెట్లో కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభమవుతాయా? అని రైతులు ఎదురు చూస్తున్నారు. -
మే ఆఖరుకి సాధారణ స్థితికి కార్యకలాపాలు
న్యూఢిల్లీ: పైలట్ల ఆందోళనలతో ఫ్లయిట్ సర్విసులకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో మే నెలాఖరుకల్లా అంతా సద్దుమణుగుతుందని, పరిస్థితులు సాధారణ స్థితికి తిరిగొస్తాయని విమానయాన సంస్థ విస్తార సీఈవో వినోద్ కణ్ణన్ తెలిపారు. పైలట్లు లేవనెత్తిన సమస్యలపై దృష్టి పెట్టామని, వాటి పరిష్కార మార్గాలపై చర్చిస్తున్నామని ఆయన వివరించారు. ఫ్లయిట్ల సంఖ్య తగ్గవచ్చు గానీ ఈ వారాంతం నుంచి ఫ్లయిట్లను అప్పటికప్పుడు రద్దు చేసే పరిస్థితి ఉండబోదని కణ్ణన్ పేర్కొన్నారు. కార్యకలాపాలను కుదించుకునే క్రమంలో 20–25 రోజువారీ ఫ్లయిట్స్‌ను తగ్గించినట్లు ఆయన వివరించారు. విమానాలు రద్దు కావడం వల్ల ఇబ్బందిపడిన ప్రయాణికులకు తమ సిబ్బంది తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు కణ్ణన్ తెలిపారు. విస్తారాలో 6,500 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 1,000 మంది పైలట్లు, 2,500 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు. -
ఎగిసిపడుతున్న నిరసన జ్వాలలు
తణుకు అర్బన్/ భీమవరం/ కాకినాడ క్రైం/ విజయవాడస్పోర్ట్స్/ కడప/ సాక్షి,నెట్వర్క్:గీతాంజలి మృతిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన జ్వాలలు తగ్గడం లేదు. బుధవారం నాడు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు టీడీపీ రాక్షస మూకలు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. సోషల్ మీడియా హంతకులు ఇద్దరు పిల్లల తల్లిని నిర్థాక్షిణ్యంగా చంపేశారని ధ్వజమెత్తారు. కక్షగట్టి ఆమె ప్రాణాలను బలిగొన్నారని, రాజకీయ లబ్ధే పరమావధిగా క్షోభకు గురిచేస్తూ పైశాచిక ఆనందాన్ని అనుభవించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చదొంగలే పొట్టన పెట్టుకున్నారు. గీతాంజలిని టీడీపీ పచ్చ దొంగలే పొట్టనపెట్టుకున్నారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన తణుకు వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీడీపీ దొంగలు తీవ్రవాదుల కంటే ప్రమాదకరంగా మారారని దుయ్యబట్టారు. మహిళలు, బాలికలను వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి వాటిల్లో వే«ధించే వారికి కఠిన శిక్షలు తప్పవని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణానికి చెందిన న్యాయవాది ఎం.చిత్రభాను స్పష్టంచేశారు. మహిళలు మానసికంగా ధైర్యంతో అన్ని సమస్యలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళల వేధింపుల పట్ల ధైర్యంగా 111పోలీసులకు ఫిర్యాదు చేయాలని భీమవరానికి చెందిన వైద్యురాలు మాదిరెడ్డి స్వరాజ్యలక్ష్మి అన్నారు. టీడీపీలో మహిళలకు గౌరవం ఎన్టీఆర్తోనే పోయింది టీడీపీపి స్థాపించిన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాంలోనే ఆ పార్టీలో మహిళలకు గౌరవం ఉండేదని డాక్టర్ నూరి పరి అన్నారు. ఆయన్ని వెన్ను పోటు పొడిచి ఈ లోకం నుంచి పంపించేసిన వ్యక్తులే ప్రస్తుతం ఆ పార్టీకి ఆధిపత్యం చెలాయిస్తూ ఆయన ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారన్నారు. పదో తరగతి విద్యార్ధిని మేఘనని, ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడుతున్న మరో విద్యార్ధినిని ఇదే విధంగా ట్రోల్ చేసి మానసిక హింసకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలికేసులో అజయ్ సత్య అనే టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తపై రాష్ట్రప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ముంబయి) కోస్తాంధ్ర అధ్యక్షుడు పల్నాటి నాగరాజు డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని శిక్షించాలని అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. గీతాంజలి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సతీమణి శిల్పా నాగినిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా కోరారు. వందలాది మంది మహిళలతో కలిసి ఆమె బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఎస్వీయూ విద్యార్థుల ఆధ్వర్యంలో బుధవారం అంబేడ్కర్ విగ్రహం వరకు విద్యార్థినులతో కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాక్షసుల వేధింపులకు బలైపోయిన ఆడబిడ్డ గీతాంజలి ఆత్మహత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. టీడీపీ, జనసేన సోషల్ మీడియా రాక్షసుల వేధింపులకు బలైపోయిన విశ్వబ్రాహ్మణ జాతి ఆడ బిడ్డ గీతాంజలిని బలి తీసుకున్న టీడీపీ, జనసేన పార్టీలకు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులందరూ తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. గీతాంజలికి పట్టిన దుర్గతి భవిష్యత్‌లో మరొకరికి జరగకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తనకు లబ్ది జరిగిన సంతోషాన్ని పంచుకుంటేనే టీడీపీ జనసేన నేతలు ఓర్వలేకపోయారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లెలో కొవ్వొత్తుల ప్రదర్శన టీడీపీ, జనసేన స్వార్థ రాజకీయాలకు, ఆయా పార్టీల సోషల్ మీడియా రాబందుల వికృతచేష్టలకు నిండుప్రాణం బలికావడం విచారకరమని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు. వుయ్ స్టాండ్ విత్ గీతాంజలి కార్యక్రమంలో ఆమెకు ఆత్మశాంతి కలగాలని కోరుతూ బెంగళూరు బస్టాండులో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలోని హెడ్‌పోస్టాఫీసు వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. తెనాలిలో స్వర్ణకార దుకాణాల బంద్ గీతాంజలి మృతికి సంతాపంగా బుధవారం తెనాలిలో స్వర్ణకారులు బంద్ పాటించారు. పట్టణ నడిబొడ్డులోని వెయ్యికి పైగా స్వర్ణకార దుకాణాలను మూసివేశారు. శ్రీకామాక్షీ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో వందలాది కార్మికులు మాజేటి నాగేశ్వరరావు వీధిలోని అసోసియేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. గీతాంజలి జోహార్ అంటూ నినాదాలు చేశారు. సోషల్ మీడియా దౌర్జన్యానికి బలైన గీతాంజలి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించటంపై హర్షం వ్యక్తంచేశారు. -
పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నాంపల్లి (హైదరాబాద్): సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్ బిల్లులపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షాలు నోరు మెదపకపోవడం బాధాకరమని తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సుర్వి యాదయ్య ధ్వజమెత్తారు. గురువారం నాంపల్లిలోని గన్‌పార్కు వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం జేఏసీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన తాజా మాజీ సర్పంచ్‌లు ముందుగా పబ్లిక్‌గార్డెన్స్‌కు చేరుకున్నా రు. అక్కడి నుంచి ర్యాలీగా గన్‌పార్కుకు వచ్చారు. నిరసన సభ ఉద్రిక్తతకు దారితీయకుండా పోలీసులు భారీగా మోహరించారు. గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచ్‌లు నిరసన వ్యక్తం చేసి ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడికక్కడే అరెస్టు చేసి, నాంపల్లి పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సుర్వి యాదయ్య విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం సర్పంచ్‌లను మోసం చేస్తే...అధికారంలోకి రాగానే సర్పంచ్‌లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని రెండు పర్యాయాలు కలిసి వినతిపత్రం అందజేశామని చెప్పా రు. పార్లమెంట్ ఎన్నికలలోపు సర్పంచ్‌లకు అందాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశా రు. లేకపోతే ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో వందకు పైగా నామినేషన్లు దాఖలు చేసి ప్రజాప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో సర్పంచ్ల సంఘం నేతలు కొలను శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
ఎర్ర సముద్ర ఘటనలపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్
న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల భద్రతపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అది చాలా ముఖ్యమైన నౌకామార్గం అయినందున ఎర్ర సముద్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి రన్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘మాకు వాణిజ్య స్వేచ్ఛ, రవాణా స్వేచ్ఛ రెండూ ముఖ్యమే. ఎర్ర సముద్రంలో జరుగుతున్న ఘటనలు కేవలం మమ్మల్నే కాదు. ప్రపంచంలోని చాలా దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’అని జైస్వాల్ అన్నారు. డ్రోన్ దాడి కారణంగా గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో చిక్కుకున్న భారత్‌కు చెందిన వాణిజ్య నౌకలోని సిబ్బందిని భారత నేవీకి చెందిన ఐఎన్ఎస్ విశాఖపట్నం బుధవారం రాత్రి కాపాడింది. ఈ నేపథ్యంలో ఎర్ర సముద్ర ఘటనలపై భారత్ స్పందించడం గమనార్హం. గాజాపై ఇజ్రాయెల్ దాడికి నిరసనగా గత కొద్ది రోజులుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న వాణిజ్య నౌకలపై హౌతీ మిలిటెంట్లు డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆసియా నుంచి యూరప్, ఆసియా వెళ్లే వాణిజ్య నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కంపెనీలకు షిప్పింగ్ ఖర్చు ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇదీచదవండి.. ట్రంప్ చేతిపై ఎర్రమచ్చలేంటి.. ఫ్యాన్స్‌లో జోరుగా చర్చ -
పత్తి రైతుల ఆందోళన
సాక్షి, ఆదిలాబాద్: సీసీఐ, వ్యాపారులు పత్తి కొనుగోళ్లు చేయకపోవడంతో కొన్ని గంటలపాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ స్తంభించింది. జిన్నింగ్ మిల్లుల్లో స్థలం లేకపోవడంతో తాము పత్తి కొనలేమంటూ వారు చేతులెత్తారు. దీనిపై రైతులకు ఏ సమాచారం లేకపోవడంతో శుక్రవారం మార్కెట్‌కు పెద్ద ఎత్తున రైతులు పత్తి బండ్లతో వచ్చారు. ఉదయం కొద్దిమంది నుంచి పత్తి కొనుగోలు చేసి, ఆపై నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులతో అధికారులు సమావేశమై సయోధ్య కుదర్చడంతో మధ్యాహ్నం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సమ్మెను సాకుగా చూపుతూ ఆదిలాబాద్‌లో ఇప్పటివరకు వ్యాపారులు 3 లక్షల క్వింటాళ్లకు పైగా, సీసీఐ 8 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేసింది. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా మార్చి భారీ వాహనాల ద్వారా తమిళనాడుకు తరలిస్తారు. అయితే ఆదిలాబాద్‌లో నాలుగు రోజులుగా ట్రాన్స్పోర్టర్లు పత్తి బేళ్లు లిఫ్ట్ చేయడం లేదని సీసీఐ, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ సమ్మెలో భాగంగా తాము ట్రాన్స్పోర్ట్ చేయడం లేదని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. దీంతో జిన్నింగ్ మిల్లుల్లో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకపోయాయి. ఈ పరిస్థితుల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడమే రైతుల ఆందోళనకు దారితీసింది. సయోధ్య కుదిర్చినా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులను చర్చలకు పిలిచారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పత్తి కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 14 నుంచి 17 వరకు పత్తి కొనుగోళ్లు చేయమని సీసీఐ ప్రకటించింది. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పేరుకుపోవడంతోనే తాము కొనుగోలు చేయలేమని మార్కెటింగ్ అధికారులకు వారు స్పష్టం చేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. -
న్యాయం చేయకపోతే ఆత్మహత్యలే!
లక్డీకాపూల్: వేలాది మంది అభ్యర్ధులకు అన్యాయం జరిగి, వారిలో కొందరి చావుకి కారణమైన పోలీస్ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో మూకుమ్మడి ఆత్మహత్యలే తమకు శరణ్యమని పోలీసు ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్‌లోని ‘ప్రజావాణి’లో నష్టపోయిన ఎస్.ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులు అర్జీలను సమర్పించారు. ఈ సందర్భంగా పోరాట సమితి ప్రతినిధి ఆకాష్ మాట్లాడుతూ.. తప్పుడు ప్రశ్నలను తొలగించి మళ్లీ ఫలితాలను ఇవ్వాలని, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరారు. యాసం ప్రదీప్ మాట్లాడుతూ పోలీస్ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేసి.. ప్రిలిమ్స్ నుంచి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అదనంగా 2 సంవత్సరాల వయోపరిమితిని పెంచి ఇప్పటివరకు మిగిలి ఉన్న పోస్టులన్నీ కలిపి ఒక మెగా రిక్రూట్మెంట్ని విడుదల చేయాలని కోరారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగిపాలిటెక్నిక్ కాలేజీలకే బదిలీ చేయాలి రేషనలైజేషన్ చేసి దూర ప్రాంతాలకు బదలీ చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను య«థావిధిగా పాత పాలిటెక్నికల్ కళాశాలలకే బదిలి చేయాలని తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నికల్ అండ్ కమిషనరేట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మారెపల్లి సుధాకర్ ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెం.317తో స్ధానికతను కోల్పోయి నష్టపోయిన ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని స్ధానికత సాధన సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి. శ్రీనివాసరావు, కె. శ్రీశైలం డిమాండ్ చేశారు. మల్లారెడ్డి నుంచి మా భూములు మాకిప్పించండి.. సూరారంలోని రూ.190 కోట్ల విలువైన సర్వే నెం.95, 96, 97, 98లకు చెందిన 9.1 గుంట పట్టా భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని.. అదేమంటే తమపై పోలీసు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కుద్బుల్లాపూర్‌కి చెందిన నర్సిమ్మ తనయుడు కృష్ణ ఆవేదన చెందారు. సర్వే నెం.107లోని ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసి తమ బినామీలు మహేంద్రరెడ్డి, సుధీర్‌రెడ్డి, ప్రవీణ్ కుమార్, చెన్నారెడ్డిల పేర్లపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయంలో సీఎం రేవంతన్న న్యాయం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పేద సినీ కళాకారులను పట్టించుకోవాలి తెలంగాణ సినీ కార్మికుల కష్టాలను ఆలకించి.. పేద కళాకారులను పట్టించుకోవాలని నటుడు నాని వెంకట్ జైరాజ్ కోరారు. ధరణి తప్పిదాల వల్ల తమ ఆడ పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని రంగారెడ్డి జిల్లాకి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆందోళన వ్యక్తం చేశారు. ముౖఫై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ పట్టా భూమికి అధికారులు సర్వే సర్టిఫైడ్ కాపీ ఇవ్వడం లేదని ములుగు జిల్లా నల్లగుంటకు చెందిన పబ్బ వెంకటరమణయ్య వాపోయారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం: ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని నోడల్ అధికారి హరిచందన తెలిపారు. ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల సమస్యలను తెలుసుకుని, దరఖాస్తులు స్వీకరించారు. 12 కౌంటర్ల ద్వారా 24 మంది అధికారులు అర్జీదారుల నుండి 2,445 దరఖాస్తులు స్వీకరించారు. -
కృత్రిమ మేధపై మథనం
సృష్టిలో నూతనత్వాన్ని ఆహ్వానించటం, హత్తుకోవటం, తలకెత్తుకోవటం మనిషి సహజ లక్షణం. అదే లేకుంటే ప్రపంచంలో ఇంత అభివృద్ధి సాధ్యమయ్యేది కాదు. కానీ కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) విషయంలో మొదటినుంచీ అనుమాన దృక్కులు తప్పడం లేదు. ఆరంభంలో టెక్ సిబ్బందిని మాత్రమే వణికించిన ఏఐ ఇప్పుడు సమస్త జీవన రంగాల్లోకి చొచ్చుకొస్తూ అందరినీ భయపెడుతోంది. ఈ వారం చోటుచేసుకున్న రెండు పరిణామాలు ఈ భయసందేహాలు కేవలం అపోహల పర్యవసానం మాత్రమే కాదనీ, చేదు వాస్తవమనీ రుజువు చేస్తున్నాయి. వ్యూహాత్మకమైన అణుబాంబుల వ్యవస్థలోకి కూడా అది చొరబడితే ఏమవుతుందన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఏఐకి కళ్లెం బిగించేందుకు ఉద్దేశించిన ఉత్తర్వులపై ఈ వారం మొదట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయగా, బ్రిటన్‌లో ఈ విషయమై అమెరికా, చైనా, భారత్ సహా 28 దేశాలు పాల్గొన్న రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు గురువారం ముగిసింది. ఇందులో ప్రభుత్వాల ప్రతినిధు లతోపాటు కంప్యూటర్ శాస్త్రవేత్తలు, టెక్ దిగ్గజాల ప్రతినిధులు కూడా పాల్గొనటం సమస్య తీవ్రతను తెలియజెబుతోంది. ఏఐతో ఏర్పడే అవకాశాలతోపాటు, అందులో చోటుచేసుకుంటున్న నూతన ఆవిష్కరణలు మానవాళికి పెనుముప్పు కలిగించే ఆస్కారం ఉందన్న అంశంలో అన్ని దేశాల మధ్యా ఏకాభిప్రాయం కుదిరింది. శిఖరాగ్ర సదస్సుకు ఎంచుకున్న బ్లెచ్లీ పార్క్ చరిత్రాత్మకమైనది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ రూపొందించి, దేశదేశాల్లోని తన సైనిక బలగాలకూ పంపే ‘నిగూఢ సంకేతాన్ని’ ఛేదించింది అక్కడే. అది పంపే సందేశాలేమిటో తెలియక కాకలు తీరిన నిపుణులే తలలు పట్టుకున్న తరుణంలో ఈ పరిణామం జర్మనీ కట్టడికి, రెండో ప్రపంచ యుద్ధ ముగింపునకు కారణమైంది. ‘ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి’ అన్న చందంగా ఏఐ తయారవటం వాస్తవం. అంతక్రితం మాటెలావున్నా ఏడెనిమిది నెలల క్రితం రంగంలోకొచ్చిన చాట్‌జీపీటీ అంద రినీ ఒక్కసారి దిగ్భ్రమపరిచింది. దాన్నుంచి తేరుకునే లోగానే చాట్‌జీపీటీ–4 కూడా అందుబాటు లోకొచ్చింది. దాని సాయంతో పాఠశాల, కళాశాలల విద్యార్థులు గణిత శాస్త్ర సమస్యలను క్షణాల్లో ఛేదిస్తున్నారనీ, మెదడుకు పదును పెట్టడం మానేశారనీ మొదట్లో వినగా... అమెరికావంటి దేశాల్లో ఏఐని ఉపయోగించి పరిశోధక పత్రాలు కూడా తయారు చేశారని తర్వాత బయటపడింది. లక్షల మంది బుర్రలు బద్దలుకొట్టుకునే జటిలమైన సమస్యకు ఏఐ క్షణంలో పరిష్కారం చూపుతుందనీ, దాని సాయంతో భారీ సొరంగాల తవ్వకాల్లో ఎదురయ్యే కష్టాలను అవలీలగా అధిగమించవచ్చనీ రుజువవుతూనే వుంది. ప్రయోజనాల సంగతి తేలినా పూర్తి స్థాయిలో వినియోగంలోకొస్తే ఏమవు తుందోనన్న బెంగ అందరిలోనూ గూడుకట్టుకుని వుంది. ఆ మధ్య స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను సర్వే చేయగా, వారిలో మూడోవంతుకు మించి ఏఐ వల్ల అనర్థాలున్నాయని అభిప్రాయపడ్డారు. మొన్న మార్చిలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్, యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ వాజ్నిక్ సహా 1,300 మంది ఏఐ పరిశోధనలను ఆర్నెల్లపాటు నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ఎవరు ఏం చెప్పినా వేలంవెర్రి ఆగదు. ఏఐ విషయంలో జరిగింది అదే. దానివల్ల కలిగే ముప్పేమిటో దాదాపు అన్ని దేశాల్లోనూ రుజువవుతూనే వుంది. క్షణాల్లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపి మాయ చేయటం ఏఐకి చాలా సులభమని తేలిపోయింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ్క రష్యా అధ్యక్షుడు పుతిన్ సేనలకు దాసోహమంటున్న వీడియో కొన్నాళ్లు హల్చల్ చేసింది. ‘నన్ను అడగకుండా, నా ప్రమేయం లేకుండా, నాకు అసలు తెలియకుండా ఏదో ఒకరోజు నన్ను ఏఐ ద్వారా దృశ్యబద్ధం చేసే ప్రమాదమున్నద’ని పేర్కొంటూ బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ న్యాయస్థానం తలుపుతట్టాడు. ఉత్తర్వులు కూడా పొందాడు. దేనికైనా అనుకూల, ప్రతికూల అంశాలు రెండూ వుంటాయి. సాంకేతికత అనేది ఎప్పుడూ రెండువైపులా పదునున్న కత్తి. ఏఐతో ఒక మనిషికి జీవం పోయొచ్చు. వేలాదిమంది కుత్తుకలు తెగ్గొట్టవచ్చు. తులనాత్మకంగా చూస్తే మొదటి అంశంలో ఏఐ పురోగతి నత్తనడకన వుండగా... ఉద్దేశపూర్వకంగా, సమాజానికి నష్టం కలిగించే రీతిలో దాన్ని ఉపయోగించుకునే ధోరణులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వాల నియంత్రణలు సృజనాత్మకతకు అవరోధమవుతాయని, కట్టడిలో మనుగడ సాగించే సమాజాలు ఎదగవని ఒకప్పుడు నమ్మేవారు. సామాజిక మాధ్యమాల రాకతో కాలం మారింది. ఇప్పుడు ప్రభుత్వాలే చడీచప్పుడూ లేకుండా వాటి సాయంతో జనంలో ఆమో దాన్ని సృష్టించుకుంటూ బతకనేరుస్తున్న వైనాన్ని చూస్తున్నాం. లాభార్జనే తప్ప మరేం పట్టని కార్పొ రేట్ సంస్థల తీరు కూడా కళ్లముందే వుంది. కనుక ఏఐ నియంత్రణలో పాటించాల్సిన ధర్మాలేమిటో, పౌరుల గోప్యత పరిరక్షణకు ఏం చేయాలో, స్వీయభద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త లేమిటో నిర్ణయించటం అంత సులభం కాదు. అమెరికా వరకూ తీసుకుంటే బైడెన్ ఉత్తర్వులిచ్చారు గానీ, వాటిని పెద్దగా బలంలేని ప్రతినిధుల సభలో ఆమోదింపజేసుకోవటం కష్టమే. బ్రిటన్ కూడా సొంతానికి ఒక నిబంధనావళి రూపొందించుకుంది. చైనా, యూరోపియన్ యూనియన్లు సైతం అంతే. మన దేశం ఇంకా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. ఏదేమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపం నుంచి బయటికొచ్చిన భూతాన్ని తెలివిగా వినియోగించుకోవటమెలాగో, అదుపు చేయటమెలాగో గ్రహించటం ప్రపంచానికి పెను సవాలే. దీన్ని మానవాళి ఎలా అధిగమిస్తుందో చూడాలి. ఇదీ చదవండి: అఫిడవిట్లతో జాగ్రత్త -
చైనా శాస్త్రవేత్తల కంటికి ఎనిమిది వైరస్లు.. మహమ్మారులుగా మారనున్నాయా?
ప్రపంచాన్ని 2019లో తాకిన కరోనా వైరస్ భయం అందరినీ నేటికీ వెంటాడుతూనే ఉంది. అ తరువాత కరోనా వైరస్ ఆల్పా, బీటా, ఓమిక్రాన్.. ఇలా పలు రూపాలను మార్చుకుని జనంపై దాడి చేస్తూనే వస్తోంది. కరోనా వైరస్ తొలిసారిగా చైనా నగరమైన ఊహాన్‌లో బయటపడింది. అనంతరం నెమ్మదిగా ప్రపంచం అంతటా విస్తరించింది. కోవిడ్-19కి వ్యాక్సిన్ కనుగొన్న తరువాత కూడా కరోనా ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇదిలావుండగా చైనా దక్షిణ తీరంలోని ఉష్ణమండల ద్వీపమైన హైనాన్‌లో గతంలో ఎన్నడూ చూడని ఎనిమిది రకాల వైరస్‌లను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఎలుకల్లో ఈ వైరస్‌లను గుర్తించారు. ఎప్పుడైనా ఈ వైరస్లు ఎలుకల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వైరస్లు మరో మహమ్మారి ముప్పుపై ఆందోళనను సూచిస్తున్నాయి. కాగా భవిష్యత్ మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ ప్రజలను సిద్ధం చేసే దిశగా పరిశోధకులు ఈ ఆవిష్కరణలు సాగిస్తున్నారు. శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో భాగంగా 700 ఎలుకల నమూనాలను సేకరించారు. వీటిలో ఎనిమిది కొత్త వైరస్ లను కనుగొన్నారు. ఇందులో ఒకటి సార్స్-కోవ్-2, కోవిడ్-19కి కారణమైన వైరస్ కుటుంబానికి చెందినదని గుర్తించారు. గబ్బిలాలపై పలు పరిశోధనలు చేసి ‘బ్యాట్ ఉమెన్’గా పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్త డాక్టర్ షి జెంగ్లీ నూతన వైరస్‌లకు సంబంధించి అందించిన వివరాలను వైరోలాజికా సినికా జర్నర్‌లో ప్రచురించారు. కాగా ఈ వైరస్ లు మనుషులపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకునేందుకు మరిన్ని పరిశోధనలు చేయాల్నిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. వైరోలాజికా సినికా అనేది చైనీస్ సొసైటీ ఫర్ మైక్రోబయాలజీ(సీఎస్ఎం)కి చెందిన ప్రచురణ విభాగం. ఇది చైనా ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఎఫైర్స్‌కి చెందినది. శాస్త్రవేత్తలు 201-2021 మధ్య కాలంలో హైనాన్ లో ఎలుకల గొంతు నుంచి 682 నమూనాలను సేకరించారు. ఈ నమూనాలను ఎలుకల జాతులు, అవి ఉంటే ద్వీపాల ఆధారంగా వర్గీకరణ చేశారు. ఈ నేపధ్యంలో జరిగిన పరిశోధనల్లో వాటిలోని వైరస్లు వెలుగు చూశాయి. వీటిలో కొన్ని మనిషి ఆరోగ్యానికి ముప్పు తెచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది కూడా చదవండి: యద్ధానికి ముందే హమాస్‌కు ఇరాన్ శిక్షణ: ఇజ్రాయెల్ ఆరోపణ -
తగ్గిన పప్పు ధాన్యాల సాగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్లో పప్పుధాన్యాల సాగు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. నేటి(శనివారం)తో వానాకాలం సీజన్ ముగియనుంది. ఆదివారం నుంచి యాసంగి సీజన్ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. వానాకాలం సీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.24 కోట్ల ఎకరాలు కాగా, గతేడాది ఇదే సీజన్లో 1.32 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈ ఏడాది మాత్రం 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అందులో అత్యధికంగా వరి సాగు విస్తీర్ణం ఆల్ టైం రికార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వరి సాధారణ సాగు విస్తీర్ణం 49.86 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 65 లక్షల ఎకరాల్లో (130.37 శాతం) సాగైంది. ఇక సోయాబీన్ సాధారణ సాగు విస్తీర్ణం 4.13 లక్షల ఎకరాలు కాగా, 4.67 లక్షల (113%) విస్తీర్ణంలో సాగైంది. వరి మినహా పెరగని ప్రధాన పంటల విస్తీర్ణం వరి, సోయాబీన్ మినహా ఇతర ముఖ్యమైన పంటల విస్తీర్ణం పెరగలేదు. పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 50.59 లక్షల ఎకరాలు కాగా, 44.77 లక్షల (88.51 శాతం) విస్తీర్ణంలోనే సాగైంది. ఇక పప్పు ధాన్యాల సాగు మాత్రం గణనీయంగా తగ్గిందని నివేదిక వెల్లడించింది. పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం ఈ వానాకాలం సీజన్లో 9.43 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 5.51 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అంటే 58.46 శాతానికే పరిమితమైంది. అందులో కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.69 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 4.74 లక్షల (61.62 శాతం) ఎకరాల్లోనే సాగైంది. జొన్న సాధారణ సాగు విస్తీర్ణం 81,389 ఎకరాలు కాగా, ఇప్పటివరకు కేవలం 31,107 ఎకరాల్లో (38.22 శాతం) సాగైంది. రాగులు దాని సాధారణ సాగు విస్తీర్ణంలో కేవలం 19.70 శాతం, కొర్రలు, సామలు, కోడో వంటి మిల్లెట్ల సాగు 16.15 శాతానికే పరిమితమైంది. -
గృహ లక్షలే లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముంగిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న గృహలక్ష్మి పథకానికి భారీపోటీ నెలకొంది. సొంత జాగాలో ఇల్లు కట్టుకోవటానికి పేదలకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందజేసేందుకు గృహలక్ష్మి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే జిల్లా కలెక్టర్లు ఆ పథకానికి దరఖాస్తులు ఆహ్వానించగా, దాదాపు 15.04 లక్షలు అందాయి. వాటిల్లో ప్రాథమిక స్రూ్కటినీతో 10.20 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు. గతంలో ప్రారంభించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో నెలకొన్న గందరగోళం, నిధుల సమస్య కారణంగా ప్రభుత్వం ఆ ఇళ్ల నిర్మాణంలో కొత్తవి చేపట్టడం లేదు. ఉన్నవి పూర్తి చేయటమే కష్టంగా మారిన తరుణంలో ‘గృహలక్ష్మి’అర్హులను ఎలా ఎంపిక చేస్తారా చూడాల్సిందే. ఎమ్మెల్యేలదే హవా.. గృహలక్ష్మి పథకాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో అధికార పక్షం ఉంది. ఇళ్లు కేటాయించేందుకు రూపొందించే జాబితా వారి కనుసన్నల్లోనే సిద్ధం కానుంది. కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం జాబితా సిద్ధం చేస్తున్నా, స్థానిక ఎమ్మెల్యే సూచించిన గ్రామాలు, ప్రజలకు ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే పారీ్టలకతీతంగా ఈ ఎంపిక జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అలాగే ఎంపికలు ఉంటాయని నేతలు చెబుతున్నారు. జాబితా రూపొందించిన తర్వాతగానీ అది ఎంతవరకు అమలైందో తెలుస్తుంది. ఎంపికలు ఎలా ఉన్నా.. పోటీ తీవ్రంగా ఉన్న తరుణంలో ఇళ్ల కేటాయింపు పెద్ద సవాల్‌గానే మారే అవకాశం కనిపిస్తోంది. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపులో తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో, గృహలక్ష్మి లబ్దిదారుల ఎంపికలోనూ వివాదాలు తప్పేలా లేవు. ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకుంటే వివాదాలు చెలరేగే ప్రమాదం నెలకొంది. ఇది నేతలకు కూడా ఇబ్బందిగా మారే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు అధికారులు పక్కన పెట్టిన దరఖాస్తుల్లోనూ అర్హులున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. వాటిని కూడా పద్ధతిగా పరిశీలిస్తే కనీసం మరో 2 లక్షల వరకు దరఖాస్తులు అర్హమైనవిగా తేలుతాయని అంటున్నారు. తహసీల్దార్ల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి ఎంపిక ప్రక్రియ జరపాలని, తూతూ మంత్రంగా గ్రామ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నవి 4 లక్షల ఇళ్లే.. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3 వేల ఇళ్లు మంజూరు చేసింది. ఈ లెక్కన 3.57 లక్షల ఇళ్లు కేటాయిస్తుంది. ముఖ్యమంత్రి పరిధిలో 43 వేల ఇళ్లు రిజర్వ్ చేశారు. వెరసి మొత్తంగా 4 లక్షల ఇళ్లు అర్హులకు కేటాయిస్తారు. ఇప్పుడు 10.20 లక్షల దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చటంతో, వీటిల్లో ఎవరికి ఇళ్లు దక్కుతాయోనన్న ప్రశ్న ఉదయిస్తోంది. దీంతో ఇళ్లు దక్కించుకునేందుకు ముమ్మరపోటీ నెలకొంది. ఇప్పటి నుంచి దరఖాస్తుదారులు తమకు అందేలా చూడాలంటూ నేతల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికలకు ఇంకా ఎక్కువగా సమయం లేనందున వీలైనంత తొందరలో పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. -
అశ్వాలు ఆందోళన తగ్గిస్తాయి
సాక్షి, హైదరాబాద్: ఆందోళన, ఒత్తిడి వంటి మానసిక సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయట పడేందుకు వివిధ రకాల చికిత్సా పద్ధతులను పాటించే ఉంటారు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఇప్పుడు మరో కొత్త తరహాలో సాంత్వన అందించవచ్చని సైకాలజిస్ట్ నిమ్రా మీర్జా చెబుతున్నారు. దాని పేరు ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’... అంటే గుర్రాలతో స్నేహం చేయడం, వాటితో సహవాసం వల్ల కూడా మానసిక సమస్యలకు చికిత్స అందించవచ్చు. యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీనికి గుర్తింపు ఉండగా, మన దేశంలో బెంగళూరు, చెన్నైల్లో ఈ పద్ధతి వచ్చేసింది. ఇక తెలంగాణలో తొలిసారి ఈ థెరపీని నిమ్రా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వృత్తిరీత్యా సైకాలజిస్ట్ అయిన నిమ్రా ఒక స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. ఈ థెరపీలోనూ లోతైన అధ్యయనం చేశారు. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ (ఈఎఫ్‌టీ)లో కూడా పట్టా పొందిన ఆమె హార్స్ రైడర్‌గా పలు పోటీల్లో పాల్గొన్నారు. తొలిసారి రానున్న ‘ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీ’పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం శనివారం నగరంలో జరిగింది. అజీజ్ నగర్‌లోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ (హెచ్పీఆర్సీ)లో నిమ్రా మీర్జా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హార్స్ రైడింగ్‌కు సంబంధించి ప్రాథమికాంశాలు, గుర్రాల మానసిక స్థితిని అర్థం చేసుకుంటూ మంచి రైడర్‌గా మారేందుకు అవసరమైన సూచనలతో పాటు థెరపీకి సంబంధించిన పలు అంశాలను నిమ్రా వివరించారు. ‘హార్స్ రైడింగ్ అంటే చాలా మంది ఒక ఆటగా మాత్రమే చూస్తారు. తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలను కరిగించి శారీరకంగా మంచి ఫలితాలు అందించడం రైడింగ్‌లో సహజంగా కనిపించే ప్రయోజనం. కానీ రైడింగ్‌తో పాటు గుర్రాలను మచ్చిక చేసుకోవడం ద్వారా మానసిక సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న వారిపై, కొన్ని రకాల మానసిక వ్యాధులతో బాధడుతున్నవారిపై కూడా ఈ థెరపీ బాగా పని చేస్తుంది. ఒకదశలో ఆత్మహత్య చేసుకోవాలని భావించిన వారు సైతం ఈ ఈక్వైన్ అసిస్టెడ్ థెరపీతో కోలుకున్న అనుభవం నా ముందుంది. కొత్తగా వచ్చిన ఈ చికిత్స ఎక్కువ మందికి చేరాలనేదే మా ప్రయత్నం’అని నిమ్రా వివరించారు. మున్ముందు కూడా హెచ్పీఆర్సీ కేంద్రంగా ఈ చికిత్స అందిస్తామని ఆమె వెల్లడించారు. -
మా భూములు మాకివ్వండి
ఆదిలాబాద్ రూరల్: సిమెంట్ ఫ్యాక్టరీ ప్రారంభమయ్యే వరకు తమ భూములు తిరిగి ఇవ్వాలంటూ భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా రూరల్ మండలంలోని రామాయి శివారులో గల రేణుకా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన స్థలం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సుహాసినీరెడ్డి ఆదివాసీలతో కలిసి భూముల వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను అరెస్టు చేయడంతో మిగతావారు పోలీసుల వాహనానికి అడ్డుతగిలారు. ఈ క్రమంలో ఓ మహిళ తమను అడ్డుకోవద్దని సీఐ కాళ్లు పట్టుకొని వేడుకుంది. అనంతరం వారందరినీ అరెస్టు చేస్తున్న క్రమంలో కొందరు మహిళలు పోలీసు వాహనంపైకి ఎక్కారు. పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో వారిని కిందకు దించి ఆదిలాబాద్ రూరల్, బేల, జైనథ్, భీంపూర్, తదితర స్టేషన్లకు తరలించారు. ఇంకొందరు మహిళలు పురుగుమందు డబ్బాలతో వచ్చారు. కొంతమంది రైతులు నాగలితో భూములు దున్నేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఉపాధికి దూరమయ్యాం... సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు కోసం 2018లో తమ పంట భూములు ఇస్తే ఇప్పటివరకు పరిశ్రమ ప్రారంభం కాలేదని, ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని భూనిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లలోనే పూర్తి చేస్తామని చెప్పి పరిశ్రమ యజమానులు మాట తప్పారని ఆరోపించారు. మొత్తం 107 ఎకరాల భూమి తీసుకుని ఐదేళ్లవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాము ఉపాధి కరువై కూలీలుగా మారామని, కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్ కోసం నిరసన చేపడుతున్న క్రమంలో పోలీసులు కనీసం మహిళలని కూడా చూడకుండా అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. నిర్వాసితుల ఆందోళన నేపథ్యంలో ఈ ప్రాంతంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రభుత్వ ఉద్యోగాలున్నయ్.. కానీ జీతాల్లేవ్!
కోరుట్ల: పేరుకి ప్రభుత్వోద్యోగమే అయినా ఆర్నెల్లుగా నయాపైసా జీతం లేక అల్లాడిపోతున్నారు కొత్త మండలాల్లోని రెవిన్యూ ఉద్యోగులు. గతేడాది సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ జీవో నంబరు 97 జారీచేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత తహసీల్దార్ కార్యాలయాలకు రూపునిచ్చారు. ఆయా జిల్లాల్లోని వివిధ మండలాల్లో పనిచేసే సిబ్బందికి వాటిలో పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉందికానీ.. కొత్త మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల మంజూరు కోసం సీసీఎల్ఏ నుంచి ’క్యాడర్ స్ట్రెంత్’సర్కులర్ జారీచేయాల్సి ఉంటుంది. ఈ జీవో జారీ ఆరు నెలలుగా జాప్యమవుతోంది. దీంతో సిబ్బందికి వేతనాలు అందడంలేదు. ♦ 13 మండలాలు.. 240 మంది సిబ్బంది.. ♦ కొత్త మండలాల జీవో జారీ కాగానే తహసీల్దార్ కార్యాయాలు ఏర్పాటు చేశారు. ♦ నిబంధనల ప్రకారం తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, ఇద్దరు గిర్దావర్లు(ఆర్ఐలు), ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, సర్వేయర్, అటెండర్, చైన్‌మన్‌తోపాటు గ్రామాల సంఖ్యను బట్టి 15–25 మంది వీఆర్ఏలను నియమించారు. ♦ జీవో 97 ప్రకారం ఇతర మండలాల్లోని సిబ్బందిని కొత్త మండలాల్లో నియమిస్తూ జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకున్నారు. ♦ ప్రస్తుతం కొత్తగా ఏర్పాటైన 13 మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో సుమారు 240 మంది ఉద్యోగులు వివిధ క్యాడర్లలో పనిచేస్తున్నారు. ఆర్నెల్లుగా అరిగోస.. విధులు నిర్వర్తిస్తున్నా.. తమకు జీతాలు రాకపోవడంపై సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్ స్ట్రెంత్ జీవో జారీకోసం కొందరు జిల్లా కలెక్టర్లు సీసీఎల్ఏకు మొరపెడుతూ లేఖలు రాసినా పట్టించుకునే వారులేరు. జీవో జారీ కాకపోవడంతో ఉద్యోగుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, వేతనాల విడుదల వంటి అంశాల వివరాలు జిల్లా ట్రెజరీ కార్యాలయాల్లో నమోదు కాలేదు. ఫలితంగా ఆరు నెలలుగా జీతాలు లేక కొత్త మండలాల్లో పనిచేస్తున్న సుమారు 240 మంది రెవెన్యూ ఉద్యోగులు నానాతిప్పలు పడుతున్నారు. ఏమిటీ క్యాడర్ స్ట్రెంత్? కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ కార్యాలయాల్లో హోదాల ప్రకారం ఉండాల్సిన సిబ్బంది, వేతన వివరాలు, ఆర్థికపరమైన అనుమతులను రెవెన్యూ పరిభాషలో క్యాడర్ స్ట్రెంత్ అంటారు. ఈ క్యాడర్ స్ట్రెంత్ జీవో విడుదల అయితేనే కొత్త మండలాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, వేతనాలు నేరుగా సంబంధిత జిల్లా ట్రెజరీ కార్యాలయాకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ జీవోను సీసీఎల్ఏ జారీ చేయాల్సి ఉంటుంది. -
మక్కలు ఇంకెప్పుడు కొంటరు?
సాక్షి, కామారెడ్డి: మక్కల కొనుగోలుపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దళారులు చెప్పిందే ధర అవుతోంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, మార్కెట్లో మక్కల ధర రోజురోజుకూ పతనం అవుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి సీజన్లో రాష్ట్రంలో 6,48,446 ఎకరాల్లో మక్క పంట సాగైంది. ఈసారి పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందని భావిస్తున్నారు. సగటున ఎకరాకు 29 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఈ లెక్కన మొత్తంగా దాదాపు 2 కోట్ల క్వింటాళ్ల మక్కల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. కాగా మక్కల కొనుగోలు వ్యవహారాన్ని మార్క్‌ఫెడ్ చూస్తుంది. అయితే ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు అవసరమైన బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తేనే మార్క్‌ఫెడ్ మక్కల కొనుగోలు ప్రక్రియ మొదలుపెడుతుంది. కానీ సర్కారు ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మక్కల కొనుగోలు వ్యవహారం ముందుకు సాగడం లేదు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మక్క పంట కోసి, జూళ్లు వేశారు. కొన్ని ప్రాంతాల్లో జూడు తీసి, మక్కలు ఒలిచి ఆరబెడుతున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మక్క కోయాల్సి ఉంది. తగ్గుతున్న ధర.. మక్క పంట చేతికి అందే సమయంలో తొలుత బహిరంగ మార్కెట్లో క్వింటాలుకు రూ.2,400 వరకు ధర పలికింది. కానీ పక్షం రోజులుగా ధర తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.1,800 మాత్రమే చెల్లిస్తున్నారు. గతంలో పౌల్ట్రీ పరిశ్రమలో కోళ్లకు దాణాగా మక్కలను వాడేవారు. ప్రస్తుతం మక్కల కన్నా బియ్యం నూకలు తక్కువ ధరకు లభిస్తుండటంతో పౌల్ట్రీ రంగం మక్కల కొనుగోలుపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో స్థానికంగా మక్కలకు డిమాండ్ పడిపోతోంది. మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తే తప్ప తమకు మద్దతు ధర లభించే అవకాశం లేదని రైతులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని వారు ఎదురుచూస్తున్నారు. మార్క్‌ఫెడ్ కొనాలి.. నేను మూడు ఎకరాల్లో మక్క పండించిన. ఈసారి పంట మంచిగనే వచ్చింది. అయితే మార్కెట్లో మద్దతు ధర లభించడం లేదు. మొదట్లో క్వింటాలుకు రూ. 2,400 ధర పలికింది. ఇప్పుడు అమ్ముదామనే సమయానికి రూ.1,800లకు పడిపోయింది. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. –గడ్డం బాల్‌రెడ్డి, రైతు, మోతె, లింగంపేట మండలం, కామారెడ్డి జిల్లా కేంద్రాలు తెరవకుంటే ఇబ్బందే ప్రభుత్వం మక్కల కొనుగోలుకు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే మాకు నాలుగు పైసలు మిగులుతయి. లేకుంటే ఏం లాభం ఉండదు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న ధరకు అమ్ముకుంటే అప్పులే మిగులుతయి. కేంద్రాల ఏర్పాటు ఇప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి. – బండారి లింగం, రైతు, తాడ్వాయి మండలం, కామారెడ్డి జిల్లా