
పాత జ్ఞాపకాలు వేధిస్తున్నాయా?
సెల్ఫ్ చెక్
గతానుభవాలు మిమ్మల్ని వేధిస్తున్నాయా లేక ఆనందంగానే గడుపుతున్నారా? ఈ సెల్ఫ్‌చెక్ ద్వారా గుర్తు చేసుకోండి.
1. గత అనుభవాలు గుర్తుకురాకుండా ఏదో పని చేస్తూ కాలం గడుపుతారు.
ఎ. అవును బి. కాదు
2. భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఒంటరిగా కూర్చుని పెద్దగా ఏడ్చి తర్వాత సాధారణæ స్థితికొచ్చేస్తారు.
ఎ. అవును బి. కాదు
3. చేదు జ్ఞాపకాలను పదేపదే గుర్తుచేసుకునే అలవాటుంది.
ఎ. కాదు బి. అవును
4. స్నేహితులతో ఎక్కువసేపు గడపటంతో పాటు కొత్త స్నేహితులను ఏర్పరుచుకోవటానికి ప్రయత్నిస్తారు.
ఎ. అవును బి. కాదు
5. గతం కన్నా భవిష్యత్ గురించిన ఆలోచనలే మనసులో మెదులుతుంటాయి.
ఎ. అవును బి. కాదు
6. పాటలు, డ్యాన్స్ వంటి వాటితో ఎక్కువసేపు కాలక్షేపం చే స్తుంటారు.
ఎ. అవును బి. కాదు
7. చిన్నచిన్న విషయాలకే కోపం తెచ్చుకోకుండా ఓర్పుగా ప్రవర్తిస్తారు.
ఎ. అవును బి. కాదు
8. గత రిలేషన్ ద్వారా లభించిన బహుమతులు, జ్ఞాపికలలాంటి వాటికి ఇంట్లో స్థానం లేకుండా చేస్తారు.
ఎ. అవును బి. కాదు
9. దుఃఖం పొంగిపొర్లే సమయంలో చిరునవ్వుతో మరో విషయంపై మనసును మరల్చుకుంటారు.
ఎ. అవును బి. కాదు
10. రాత్రిళ్లు నిద్ర రాకుంటే నిద్రమాత్రలు అలవాటు చేసుకోకుండా మంచి పుస్తకాలు చదవడం, టీవీ చూడటం ద్వారా ఎంటర్‌టైన్ అవుతారు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘బి’లు 7 దాటితే మీరు గతకాలపు చేదు అనుభవాల వల్ల ఇంకా ఆందోళన చెందుతున్నారనే చెప్పాలి. ఇది మీ ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. కాబట్టి వెంటనే ఇలాంటి ఆలోచనలను పక్కన పెట్టండి. ‘ఎ’లను సూచనలుగా భావించి అలా చేయటానికి ప్రయత్నించండి. ‘ఎ’లు 6 దాటితే మీకు జరిగిన చేదు జ్ఞాపకాలను వీలైనంత త్వరగా మర్చిపోవటానిక ప్రయత్నిస్తుంటారు. కొత్త జీవితానికి స్వాగతం పలకటానికి మీరు సిద్ధంగా ఉన్నారని అర్థం. ప్రాక్టికల్‌గా ఆలోచించే వారు ఎప్పుడూ ఆనందంగా ఉండగలరు.