కన్నీరే మిగిలింది! | crying trs leader MALLESH Yadav | Sakshi
Sakshi News home page

కన్నీరే మిగిలింది!

Published Mon, Jan 18 2016 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM

కన్నీరే మిగిలింది!

కన్నీరే మిగిలింది!

కూకట్‌పల్లి: ఉద్యమ కాలం నుంచి పార్టీని నమ్ముకొని పని చేస్తున్న తనను కాదని.. కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు మల్లేష్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు. టీఆర్‌ఎస్‌కు మూడుసార్లు నాయకత్వం మారినప్పటికీ తాను మాత్రం పార్టీని, ఉద్యమాన్ని నమ్ముకొని జెండాలను మోశానని ఆవేదన వ్యక్తం చేశా రు.

అంకిత భావంతో పనిచేసిన వారిని కాదని... డబ్బుతో రాజకీయాల్లోకి  వచ్చిన వారికి సీట్లను కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశా రు. కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ లో క్రియాశీలకంగా పని చేయడంతో ఉద్యమ సమయంతో తనపై ఎన్నో కేసులు నమోదయ్యాయని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి బి-ఫారం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement