MALLESH Yadav
-
ఉత్సాహంగా సదర్
రాజేంద్రనగర్: ప్రేమావతిపేట శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంఘ సలహాదారులు మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఊరేగించారు. వీటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విన్యాసాలలో ప్రతిభ చూపిన దున్న పోతుల యజమానులకు లక్ష్మణ్ బహుమతులను అందజేశారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాలమూరు జానపద కళాకారులు ఆటాపాట ఆకట్టుకున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, అనంతయ్య యాదవ్, నర్సింగ్ యాదవ్, బండి ప్రతాప్‌రెడ్డి, శ్రీధర్, మల్లారెడ్డి, కొమరయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
సుడిగాలి దెయ్యమా?
‘సుడిగాలి’ అనగానే చాలామందిలో దెయ్యం అనే భావన ఉంది. మరి సుడిగాలి నిజంగా దెయ్యమా? కాదా? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సుడిగాలి’. వెంకటేష్ గౌడ్, మల్లేష్ యాదవ్, ప్రాచి అధికారి, కులకర్ణి మమత ప్రధాన పాత్రల్లో రమేశ్ అంకం దర్శకత్వంలో చెట్టిపల్లి వెంకటేష్ గౌడ్, బిరాధార్ మల్లేష్ యాదవ్ నిర్మిస్తున్న ఈ నూతన చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి లయన్ సాయి వెంకట్ కెమేరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్ క్లాప్ కొట్టారు. రంగ రవీందర్ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు.రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ-‘‘చాలామంచి కథ. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కిస్తారనే నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. ‘‘సుడిగాలిని కథాంశంగా తీసుకుని నిర్మిస్తున్న చిత్రమిది. హారర్‌తో పాటు వినోద అంశాలన్నీ ఉంటాయి. ఇప్పుడొస్తున్న చిత్రాలకు భిన్నంగా మా చిత్రం ఉంటుందని చెప్పగలను’’ అని దర్శకుడు తెలిపారు. నరసింహ వర్మ, సుహాసిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రాప్ రాక్ షకీల్, సమర్పణ: చెట్టిపల్లి లక్ష్మి. -
కన్నీరే మిగిలింది!
కూకట్పల్లి: ఉద్యమ కాలం నుంచి పార్టీని నమ్ముకొని పని చేస్తున్న తనను కాదని.. కొత్తగా వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మల్లేష్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు. టీఆర్ఎస్కు మూడుసార్లు నాయకత్వం మారినప్పటికీ తాను మాత్రం పార్టీని, ఉద్యమాన్ని నమ్ముకొని జెండాలను మోశానని ఆవేదన వ్యక్తం చేశా రు. అంకిత భావంతో పనిచేసిన వారిని కాదని... డబ్బుతో రాజకీయాల్లోకి వచ్చిన వారికి సీట్లను కేటాయించడంపై ఆందోళన వ్యక్తం చేశా రు. కూకట్పల్లి టీఆర్ఎస్ లో క్రియాశీలకంగా పని చేయడంతో ఉద్యమ సమయంతో తనపై ఎన్నో కేసులు నమోదయ్యాయని తెలిపారు. పార్టీ కోసం పని చేసిన వారిని గుర్తించి బి-ఫారం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు.