రాజేంద్రనగర్: ప్రేమావతిపేట శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంఘ సలహాదారులు మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్‌ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఊరేగించారు. వీటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విన్యాసాలలో ప్రతిభ చూపిన దున్న పోతుల యజమానులకు లక్ష్మణ్ బహుమతులను అందజేశారు. రాజేంద్రనగర్ సర్కిల్‌లోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాలమూరు జానపద కళాకారులు ఆటాపాట ఆకట్టుకున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, అనంతయ్య యాదవ్, నర్సింగ్ యాదవ్, బండి ప్రతాప్‌రెడ్డి, శ్రీధర్, మల్లారెడ్డి, కొమరయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.