Sadar festival
-
హనుమకొండ : సంబురంగా సదర్ ఉత్సవం (ఫొటోలు)
-
నారాయణగూడలో ఘనంగా సదర్ పండుగ వేడుకలు (ఫోటోలు)
-
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ వేడుకలు (ఫోటోలు)
-
హైదరాబాద్ లో సదర్ ఉత్సవాలు
-
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ సదర్ సమ్మేళనం (ఫొటోలు)
-
Sadar Utsavalu 2023: భాగ్యనగరంలో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఘనంగా ‘సదర్’ ఉత్సవాలు (ఫొటోలు)
-
ఓట్ల పండ్గ ఎట్లైంది.. మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు
నారదుడు నెత్తి మీది కెల్లి తానం జేసిండు. కొప్పేసుకుండు. తంబూర తీస్కున్నడు. చిర్తలు గొట్టుకుంట, నారాయన నారాయన అన్కుంట గాయిన మొగులు మీదికెల్లి ఎల్లిండు. తెలంగాన దిక్కు రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు గాయినకు ఎదురైంది. ‘‘యాడికెల్లి వొస్తున్నవు?’’ అని నారదుడు దున్నుపోతు నడిగిండు. ‘‘తెలంగానకెల్లి’’ అని దున్నపోతు జెప్పింది. ‘‘గాడికెందుకు బోయినవ్?’’ ‘‘సదర్ పండ్గకు మా దున్నపోతులు రమ్మంటె బోయొస్తున్న’’ ‘‘పండ్గ మంచిగైందా?’’ ‘‘మునుగోడు ఎలచ్చన్లట. టీఆర్ఎస్ దున్నపోతులనుకుంట మాదాంట్ల కొన్నిటిని మోటర్ మీద గూసుండ బెట్టిండ్రు. కొన్నిటి మెడల తామర పూల దండేసి బీజేపీ దున్నపోతులన్నరు. ఇగ కొన్ని టిని కాంగ్రెస్ దున్నపోతులనుకుంట గవ్విటితోని పాదయాత్ర జేపిచ్చిండ్రు.’’ ‘‘సదర్ పండ్గ అయినంక గుడ్క తెలంగాన లెందుకున్నవ్? ‘‘పండ్గలన్నిట్ల పెద్ద పండ్గ ఓట్ల పండ్గ. గా పండ్గను మునుగోడుల ధూమ్‌దామ్గ జేస్కుండ్రు. గా బై ఎలచ్చన్ల ఓట్ల పండ్గ అయ్యె దాంక తెలంగానల ఉంటె బాగుంటదనుకున్న. అనుకోని ఇయ్యాల్టిదాంక మునుగోడులనే ఉన్న’’ ‘‘ఓట్ల పండ్గ ఎట్లైంది’’ ‘‘శాన మంచిగైంది. శాన్దార్గ అయ్యింది. నెల న్నర గాకుంట యాడాదంత గీ ఓట్ల పండ్గ ఉంటె బాగుండుననిపిచ్చింది’’ ‘‘గంత గనం బాగుందా?’’ ‘‘అవ్. ఇదువరదాంక ఏ బై ఎలచ్చన్ల ముక్యమంత్రి ప్రచారం జెయ్యలేదు. గని మునుగోడు బై ఎలచ్చన్ల రొండు పార్లు ప్రచారం జేసిండు. చండూరుల మాట్లాడుకుంట వడ్ల కొనుడు శాతగానోల్లు వందు కోట్లు సంచులల్ల బెట్టుకోని మా ఎమ్మెల్యేలను కొనెతంద్కు వొచ్చిండ్రు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఇంతకుముందే మేము గొన్నం. మేము గొన్న ఎమ్మెల్యేలను బీజేపోల్లు కొనెతంద్కువొచ్చు డేమన్న బాగుందా? పడ్తల్ బడక మా ఎమ్మెల్యేలు గోడదుంకలేదు. జెనం కోసమే నేను గాలి మోటార్ గొన్న. జెనం కోసమే యాద్గిరి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిన. సలికాలం తడి బట్టల తోని ఒట్టు తినెతంద్కు బండి సంజయ్ లెక్క నేనేమన్న అవులగాన్నా? అని కేసీఆర్ అన్నడు’’ ‘‘ముక్యమంత్రి నర్సిమ్మ సామికి కిలన్నర బంగారమిచ్చిండు. గంతేగాకుంట బంగారి గడ్డ మీద్కెల్లి స్పీచ్ గొట్టిండు. తలా తులం బంగార మేమన్న ఇస్తడా?’’ ‘‘మాంసం దినెటోల్లు యాడనన్న బొక్కలు మెడలేసుకుంటరా?’’ ‘‘బై ఎలచ్చన్లు జెయ్య బట్కె మాయబజార్ లెక్క మునుగోడు బదల్ గయా! తొవ్వలు లేని ఊర్లకు తొవ్వలు ఏసిండ్రు. సర్కార్ జీతగాల్లకు పదో తారీకున గాకుంట పహిలీ తారీక్కే జీతాలు బడ్డయి. అంబటాల్ల బువ్వకు 40 లక్షల రూపాయలు మంజూరైనయి. షాదీ ముబారక్, కల్యాన లచ్మిలకు టోల్ రూపాయలు ఇచ్చిండ్రు. డిండి ఎత్తిపోతలు జెయ్య బట్కె ఎవుసం బూములు పోడగొట్టుకొన్న రైతులకు 116 కోట్లు మంజూరు జేసిండ్రు. ముక్యమంత్రి, మంత్రులు ఎమ్మెల్యేలందరు మునుగోడు జెనం సుట్టూత చక్కర్లు గొట్టిండ్రు. నేను రాజినామ జేసి బీజేపీల దుంకబట్కె గిదంత అయిందని రాజగోపాల్ రెడ్డి అన్నడు. బీజేపీ ఏ ఎమ్మెల్యేను కొనలేదనుకుంట యాద్గిరి గుట్టల దేవుని ముంగట తడి బట్టల్తోని బండి సంజయ్ ఒట్టు దిన్నడు. గడీల కాడ కావలి గాసేటి కూసు కుంట్ల గావాల్నా? కేసీఆర్ గల్ల బట్టె రాజగోపాల్ రెడ్డి గావాల్నా? అని గాయిన అడిగిండు.’’ ‘‘కాంగ్రెస్ సంగ తేంది?’’ ‘‘కాంగ్రెస్ దిక్కుకెల్లి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి బిడ్డ పాల్వాయి స్రవంతి నిలవడ్డది. ఆడోల్ల ఓట్లన్ని గామెకే బడ్తయని కాంగ్రెస్ లీడర్లు అనుకున్నరు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొంపెల్లిల మాట్లాడుకుంట అందర్కి దండం బెట్టి అడ్గుతున్న ఆడిబిడ్డకు ఒక్క మోక ఇయ్యుండ్రి. మీ చేతులల్ల బెడ్తున్న గీ బిడ్డను సంపుకుంటరో, సాదుకుంటరో మీ ఇస్టం. ఎన్కకెల్లి కాంగ్రెస్‌ను బొడ్సి రాజగోపాల్ రెడ్డి కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కోసం బీజేపీల దుంకిండు అన్నాడు. మీరు టీడీపీని ఎన్కకెల్లి బొడ్సి కాంగ్రెస్‌లకు దుంకిన తీర్గనా?’’ అని ఎవడో లాసిగ అడిగిండు. ‘‘కేటీఆర్ ఎట్ల ప్రచారం జేసిండు?’’ ‘‘గా గట్టున మాయల మరాటి మోదీ. గీ గట్టున తెలంగాన. గీ గట్టున మోటర్ గుర్తు కూసు కుంట్ల. గా గట్టున బీజేపీ, కాంగ్రెస్ బేకార్ గాల్లు. గీ గట్టున దలిత బందు. గా గట్టున పీక్క తినేటి రాబందు. గీ గట్టున అంబేద్కరసువంటి కేసీఆర్. గా గట్టున మత పిచ్చి మోదీ. గా గట్టున ఉంటరా? గీ గట్టున పంటరా? అని సవాల్లు అడ్గుకుంట కేటీఆర్ ప్రచారం జేసిండు.’’ ‘‘గాయిన గా గట్టున ఉన్నా గీయిన గీ గట్టున ఉన్నా ఇద్దరు గల్సి జెనంను నీల్లల్ల నిండ ముంచుతరు’’ అని నారదుడన్నడు. ‘‘మల్ల గలుస్త’’ అనుకుంట యముని దున్నపోతు నర్కం దిక్కు బోయింది. నారదుడు పీచే ముడ్ అన్కుంట వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: సిత్రాలు సూడరో శివుడో శివుడా!) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
హైదరాబాద్ : నారాయణగూడ చౌరస్తాలో సదర్ వేడుకలు అదరహో (ఫొటోలు)
-
Sadar Festival 2022 :హైదరాబాద్ లో వైభవంగా సదర్ వేడుకలు (ఫొటోలు)
-
నార్సింగీలో ఘనంగా ప్రారంభమైన సదర్ ఉత్సవాలు
-
హైదరాబాద్ : సదర్ సంబురాలకు సిద్ధం (ఫొటోలు)
-
అదరహో సదర్ సందడి.. విన్యాసాల దున్నల హడావుడి
-
హైదరాబాద్ లో ఉత్సాహంగా సదర్ ఉత్సవాలు
-
హైదరాబాద్: సదర్ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: సదర్ ఉత్సవం సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు లా అండ్ ఆర్డర్ అడిషనల్ సీపీ, ట్రాఫిక్ విభాగం ఇంచార్జి అడిషనల్ సీపీ చౌహాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాచిగూడ ఎక్స్‌రోడ్స్, నారాయణగూడ వైఎంసీఏ మార్గాల్లో వచ్చే వాహనాలను కాచిగూడ టూరిస్ట్ హోటల్ వైపునకు మళ్లిస్తున్నారు. నారాయణగూడ విఠల్‌వాడీ ఎక్స్‌రోడ్స్ నుంచి వైఎంసీఏ నారాయణగూడ వైపు వచ్చే వాహనాలు రామ్‌కోఠి ఎక్స్‌రోడ్స్ వైపు వెళ్లాల్సి ఉంది. రాజమోహల్లా నుంచి నారాయణగూడ వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రామ్‌కోఠి సాబూ షాప్ పాయింట్ నుంచి డైవర్ట్ అవ్వాలి. రెడ్డి కాలేజీ నుంచి వచ్చే వాహనాలు బర్కత్‌పురా వైపునకు వెళ్లాలి. ఓల్డ్ బర్కత్‌పురా పోస్ట్ ఆఫీస్ నుంచి వైఎంసీఏ వచ్చే వాహనాలు క్రౌన్ కేఫ్ నుంచి వేరే మార్గం ద్వారా వెళ్లాలి. శనివారం రాత్రి 7 నుంచి ఆదివారం ఉదయం 5 గంటల వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు చౌహాన్ తెలిపారు. (సదర్ ఉత్సవాలు: స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు) -
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు..
-
సదర్ ఉత్సవానికి ఉత్సాహంగా ఏర్పాట్లు
-
హైదరాబాద్‌లో ఘనంగా సదర్ వేడుకలు
-
సందడిగా సదర్ సంబురాలు
-
సదర్..అదరహో
-
సదరోత్సాహం
-
సికింద్రాబాద్ తిరుమలగిరిలో ఘనంగా సదర్ ఉత్సవాలు
-
సదర్ సందడి
-
నేడు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి,సిటీబ్యూరో: నారాయణగూడలోని వైఎంసీఏ చౌరస్తాలో శుక్రవారం నిర్వహించనున్న సదర్ ఉత్సవ్ మేళా నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం రాత్రి 7గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 5గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. వాహనదారులు వీటిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. ♦ కాచిగూడ చౌరస్తా నుంచి వైఎంసీఏ వైపు వాహనాలను టూరిస్ట్ హోటల్ మీదుగా, విఠల్‌వాడీ చౌరస్తా నుంచి వైఎంసీఏ వైపు వచ్చే వాహనాలను రామ్‌కోఠి చౌరస్తా వైపు, రాజ్‌మొహల్లా వైపు నుంచి రామ్‌కోఠి వైపు వచ్చే వాహనాలను సబో షాప్ పాయింట్ మీదుగా, రెడ్డి కాలేజ్ వైపు నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పురా వైపు, ఓల్డ్ బర్కత్‌పురా పోస్టాఫీస్ నుంచి వచ్చే వాహనాలను క్రౌన్ కేఫ్ వైపు, పాత ఎక్సైజ్ కార్యాలయం వైపు నుంచి వచ్చే వాహనాలను విఠల్‌వాడీ వైపు, బర్కత్‌పురా చమన్ వైపు నుంచి వచ్చే వాహనాలను బర్కత్‌పురా చౌరస్తా లేదా టూరిస్ట్ హోటల్ వైపు, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ నుంచి రెడ్డి కాలేజ్ వైపు వచ్చే వాహనాలను నారాయణగూడ చౌరస్తా వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్: నగరంలో సదర్ ఉత్సవాలు గురువారం రాత్రి ఘనంగా జరిగాయి. దున్నపోతుల విన్యాసాలు అబ్బురపరిచాయి. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన ఉత్సవాలను వీక్షించేందుకు సిటీజనులు తరలొచ్చారు. ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, టీఆర్ఎస్ నేత దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ... పార్టీలకు అతీతంగా సదర్ ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మంగళారపు చౌదరి సత్తయ్య యాదవ్ అండ్ బ్రదర్స్, నవయుగ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉత్సవాల్లో ఎం.యాదయ్య, ఎం.లక్ష్మణ్, మహేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర పండగగా ప్రకటించాలి... జూబ్లీహిల్స్: ఎల్లారెడ్డిగూడ చౌరస్తాలో నిర్వహించిన వేడుకల్లో కమాండో (దున్నపోతు), గౌరీ (గుర్రం) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిర్వాహకులు గొంటి శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ... తెలంగాణ సంస్కృతిలో భాగమైన సదర్‌ను రాష్ట పండగగా ప్రకటించాలని కోరారు. సందీప్ యాదవ్, సాయినాథ్ యాదవ్, శివనాథ్ యాదవ్, శ్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. రూ.9 కోట్ల విరాట్... మారేడుపల్లి: మారేడుపల్లిలో నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో రూ.9కోట్ల విలువైన హర్యానా దున్నపోతు (విరాట్) సందడి చేసింది. విరాట్‌ను ప్రత్యేకంగా అలంకరించి వీధుల్లో ఊరేగించారు. వెస్ట్ మారేడుపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఉత్సవాలు నిర్వహించగా... దున్నపోతుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. యాదవ సంఘం నేతలు కిట్టు యాదవ్, అశోక్‌యాదవ్, సన్నీ యాదవ్, బద్రీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. -
రోడ్డుపై దున్నపోతుల డిష్యూం..
హైదరాబాద్: రాజధానిలో ఏటా జరిగే సదర్ ఉత్సవాల కోసం హర్యానా నుంచి తీసుకువచ్చిన దున్నపోతులు షహాన్‌షా, ధారాలు రోడ్డుపై చిన్నపాటి యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి. దున్నల మధ్య జరిగిన భీకర పోరు నగర వాసులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. దున్నలను చూసేందుకు అక్కడికి వచ్చిన మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ దున్నల పొట్లాటకు ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని సత్తర్భాగ్ వేదికైంది. అనంతరం ఓ దున్న ముషీరాబాద్ ప్రధాన రహదారిపై రాజా డీలక్స్ వరకు పరుగులు తీయడంతో దానిని పట్టుకునేందుకు నిర్వాహకులు చెమటోడ్చాల్సి వచ్చింది. ఘటనలో మహమూద్ అలీ కాన్వాయ్‌లోని వాహనాల అద్దాలు స్వల్పంగా పగిలిపోయాయి. శుక్రవారం (9వ తేదీ) జరిగే సదర్ ఉత్సవాల కోసం 2 భారీ దున్నపోతులు షహాన్‌షా, ధారాలను ముషీరాబాద్‌కు చెందిన అఖిల భారత యాదవ సంఘం ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ నగరానికి తీసుకువచ్చారు. ప్రదర్శన నిమిత్తం వీటిని గోల్కొండ చౌరస్తా సమీపంలోని సత్తార్‌బాగ్‌లో ఉంచారు. మహమూద్ అలీ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు సత్తార్‌బాగ్‌కు చేరుకుని దున్నలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ధారా, షహాన్షాలను ఒకే చోటకి చేర్చి ప్రేక్షకులు సెల్ఫీలు దిగుతున్నారు. అయితే ఈ రెండు కలిస్తే కొట్లాడుకుంటాయనే విషయం వారికి తెలియదు. ఒక్కసారిగా రెండు దున్నపోతులు బరిలోకి దిగినట్లు కొమ్ములతో బలంగా ఢీకొట్టుకోవడం ప్రారంభించాయి. సమాచారం తెలుసుకున్న దున్నపోతుల నిర్వాహకులు వెంటనే అక్కడికి చేరుకుని వాటిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దున్నపోతులు సత్తార్‌బాగ్ నుంచి రాజా డీలక్స్ వరకు పరుగులు తీశాయి. వాటి అరుపులు, దున్నపోతుల గాంభీర్యం చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు వాటి నిర్వాహకులు రాజా డీలక్స్ చౌరస్తా సమీపంలో ఒక దున్నపోతును పట్టుకోగా మరో దున్నపోతును స్థానిక మసీదు వీధిలో పట్టుకున్నారు. -
సదర్‌కు సై!
హైదరాబాద్ సంస్కృతిలో భాగమైన ‘సదర్’ ఉత్సవాలకు నగరం సన్నద్ధమైంది. ఏటా దీపావళి మరుసటి రోజు నిజాంల కాలం నుంచి ప్రతిష్టాత్మకంగా ఈ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీ. యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనంగా సాగే ఈ సంబరం గురువారం ఖైరతాబాద్‌లోను, శుక్రవారం నారాయణగూడ వైఎంసీఏ వద్ద వేడుకలు జరగనున్నాయి. వేడుకల్లో బలిష్టమైన, శక్తివంతమైన దున్నలను ప్రదర్శించనున్నారు. మరోవైపు నగర శివార్లలోనూ సదర్ ఘనంగా నిర్వహించేందుకు యాదవ సమాఖ్యలు ఏర్పాట్లు చేస్తున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: వైవిధ్యభరితమైన హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే సదర్ ఉత్సవాలకు నగరం సన్నద్ధమైంది. నిజాం నవాబుల కాలం నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల ఐక్యతకు, పాడిపంటలు, పశు సంపదకు నిదర్శనం. ఏటా దీపావళి మరుసటి రోజు సదర్ వేడుకలను నిర్వహిస్తారు. ఖైరతాబాద్‌లో ఈ నెల 8న, నారాయణగూడ వైఎంసీఏ ఈ నెల 9న వద్ద వేడుకలు జరుగనున్నాయి. అన్ని పార్టీల నాయకులు, ప్రముఖులు వేడుకల్లో పాల్గొంటారు. మరోవైపు నగర శివార్లలోనూ సదర్ ఘనంగా నిర్వహించేందుకు యాదవ సమాఖ్యలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ వేడుకల్లో బలిష్టమైన, శక్తివంతమైన దున్నలను ప్రదర్శించనున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా దేశంలోనే బాగా పేరొందిన దున్నలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు దేశంలో మరెక్కడా లేని విధంగా హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ ఉత్సవం ఇప్పుడు హైదరాబాద్‌తో పాటు రెండేళ్లుగా తెలంగాణ జిల్లాల్లో సైతం నిర్వహిస్తున్నారు.ఎంతో వైవిధ్యంతో, అబ్బురపరిచే దున్నల విన్యాసాలతో కనులపండువగా జరిగే ఈ వేడుకలు పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకట్టుకుంటాయి. యువత కేరింతలు, హోరెత్తించే నినాదాలు, ఆనందోత్సాహాల నడుమ తెల్లవారు జాము వరకు నిర్వహిస్తారు. సదర్ ఉత్సవాల నేపథ్యం... హైదరాబాద్‌లో ఎలాంటి ఐక్యత లేకుండా కేవలం పశుపోషణే జీవనాధారంగా చేసుకొని బతికే గొల్ల, కుర్మలను ఐక్యం చేసిన పండుగ ఇది. వారి మధ్య బంధుత్వాలను, స్నేహాన్ని పెంచింది. చౌదరి మల్లయ్య యాదవ్ ఈ ఉత్సవాలకు ఆద్యుడు. సుమారు 75 ఏళ్ల క్రితం నగరంలోని యాదవులందరినీ సంఘటితం చేసేందుకు ఈ ఉత్సవాలను ప్రారంభించినట్లు అఖిలభారత యాదవ సమాజం తెలిపింది. అత్యధికంగా పశువులను పెంచుతూ, వాటిని ఎంతో జాగ్రత్తగా పోషిస్తూ పేరు ప్రతిష్టలను తెచ్చుకున్న యాదవులను ‘సదర్’గా గౌరవించే సంప్రదాయం ఇది. సదర్ అంటే ప్రముఖులు. పెద్దవారు అని అర్థం. అలా ఏడున్నర దశాబ్దాల క్రితమే ఈ వేడుకలో బాగా ప్రాచుర్యం పొందినప్పటికీ నిజాం కాలంలోనూ ఏడాదికోసారి గొల్లలు కలుసుకొనేవారని, తమ పశుసంపదను గురించి చర్చించుకొనేవారని చెబుతారు. మరోవైపు పురాణాల్లోనూ సదర్‌కు ఒక స్థానం ఉంది. ద్వాపర యుగంలో శ్రీకష్ణుడు ఓ సారి ఇంద్రుడిని పరిహసిస్తాడు. కోపంతో ఇంద్రుడు యాదవులపై కుంభవృష్టి కురిపిస్తాడు. దీంతో యాదవులంతా ఆందోళన చెందుతారు. శ్రీకష్ణుడు తన లీలలను ప్రదర్శించి తన చిటికెన వేలితో గోవర్ధనగిరిని పైకెత్తి గోవులను, గోపబాలురను రక్షిస్తాడు. యాదవులకు శ్రీకష్ణుడు చేసిన సేవలను స్మరించుకుంటూ... ఆయనకు ఎంతో ఇష్టమైన గోవులను అందంగా అలంకరించి ఒక దగ్గరికి తెచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. దారా దున్నపోతు విన్యాసం ఎల్లారెడ్డిగూడలో... శ్రీనగర్‌కాలనీ: ఎల్లారెడ్డిగూడలో గురువారం రాత్రి నిర్వహించే సదర్ ఉత్సవాలకు దున్నపోతులను రెడీ చేస్తున్నారు. ఈ క్రమంలో సదర్ ఉత్సవాలకు మంగళవారం ఎల్లారెడ్డిగూడలో శక్తి, భీం అనే దున్నపోతులను ఎన్.మల్లేష్‌యాదవ్ సన్నద్ధం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దున్నపోతుకు రోజూ 10 లీటర్ల పాలు, యాపిల్స్, ఎండు కర్జూరాలు, ఉలవలలో పాటు పౌష్టికాహాన్ని తినిపిస్తున్నామని ఆయన తెలిపారు. పీఎస్ఆర్ క్షీరధార నుంచి రెండు దున్నపోతులను తెచ్చామన్నారు.దేశీయ మేలిరకం దున్నపోతులన్నారు సుమారు 1500 కిలోల బరువు ఉంటాయని చెప్పారు. గురువారం రాత్రి యాదవులతో పాటు అన్ని సామాజిక వర్గాలు సంఘటితమై సదర్‌ను వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. దశాబ్దాలుగా సదర్‌ను నిర్వహిస్తున్నామన్నారు. గోపూజతో పాటు డప్పులు, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. సదర్ ఉత్సవాలకు ప్రతిఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఉప్పరిగూడ సదర్‌కు ప్రాధాన్యం చంచల్‌గూడ: పాతబస్తీలోని కుర్మగూడ డివిజన్ ఉప్పరిగూడ, చావణి యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సదర్ ఉత్సవాలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ప్రాంతంలో నిజాం కాలం నుంచి సదర్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. పాతబస్తీ నుంచే కాక రంగారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన యాదవులు ఇక్కడి సదర్ ఉత్సవంలో తమ దున్నలతో పాల్గొంటారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో చంచల్‌గూడ మెయిన్ రోడ్డుపై వేదిక ఏర్పాటు చేసి సదర్‌లో పాల్గొన్న దున్నల యజమానులను సత్కరిస్తారు. సత్తర్‌బాగ్‌లో సందర్శకుల సందడి ముషీరాబాద్: హర్యాన రాష్ట్రం నుంచి తీసుకొచ్చిన దున్నపోతులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముషీరాబాద్ ప్రధాన రహదారిలోని స్పెన్సర్స్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న సత్తర్‌బాగ్‌లో సేదతీరుతున్న దున్నలను చూసేందుకు ముషీరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తున్నారు. దున్నల బలిష్టమైన దేహం, చూపు తిప్పుకోనివ్వని రూపు, కళ్లు చెదిరే విన్యాసాలు, చూడడానికి రెండు కళ్లు చాలవు అన్నట్లు ఉన్న ఈ దున్నలతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. బీబీసీ, ఎఎన్ఐ వంటి వార్తా చానళ్లతోపాటు జాతీయ, రాష్ట్ర మీడియా చానళ్లు వాటిని కెమెరాలలో బంధించేందుకు పోటీ పడుతున్నాయి. శరీరానికి తగ్గట్లే భారీగానే తిండి... దున్నల ఆలనాపాలన చూసేందుకు ముగ్గురు పని చేస్తున్నారు. గత ఏడాది వేడుకల్లో షహన్షా, యువరాజులు ఆకట్టుకుంటే ఈ సారి వాటితో పాటు యువరాజుకే పుట్టిన దారా ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నది. దారాతో పాటు మరో రెండేళ్ల దున్న కాలా కూడా బుధవారం నగరానికి రానుంది. సుమారు వేయి నుంచి 1200 కేజీల బరువు ఉండే ఈ దున్నపోతులు ఆరడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు ఉన్నాయి. నిత్యం వాటికి రూ. 6 వేలకుపైనే ఖర్చు అవుతుందంటున్నారు నిర్వాహకులు. రోజూ 4 నుంచి 5 కిలోమీటర్ల వాకింగ్ చేస్తుంటాయి. దున్న@: రూ. 7 కోట్లు రసూల్‌పురా: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం కంటోన్మెంట్ అన్నానగర్‌లో యాదవ సంఘం నాయకులు సదర్ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఇందుకు రూ. 7 కోట్ల విలువ చేసే దున్న (షహెన్షా)ను తీసుకొచ్చారు. ఆ దున్నను తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాదవ సంఘం నాయకుడు వెంకట్‌యాదవ్ మాట్లాడుతూ... అన్నానగర్‌లో మొట్టమొదటిసారి సదర్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు ఎస్.వెంకటేష్, జి.వెంకట్‌యాదవ్, సాయి యాదవ్, పి.రవియాదవ్, ఎన్.రాజుయాదవ్, ఎం.శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సందడిగా సదర్ సంబురాలు
-
షహర్ కీ ‘షెహన్షా’
యాదవుల ఐక్యత, పాడిపంటలు, పశు సంపదను ప్రతిబింబిస్తూ ప్రతి యేటా నిర్వహించే సదర్ పండుగలో ఈ సారి హైదరాబాద్‌కు చెందిన ‘షెహన్ షా’దున్న ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. సదర్ ఉత్సవాలను తొలిసారిగా అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. నారాయణగూడ వైఎంసీఏ వద్ద ఈ నెల 21న ప్రభుత్వం సదర్‌ను నిర్వహించనుంది. అంతకు ముందు రోజు 20న నగరంలోని వివిధ ప్రాంతాల్లో సదర్ వేడుకలు జరుగుతాయి. ప్రతి యేడాదిలాగే ఈ సారీ దేశంలోనే బాగా పేరుపొందిన దున్నలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కే పరిమితమైన సదర్ ఉత్సవం ఇప్పుడు జిల్లాల్లో సైతం నిర్వహించడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ మంత్రి తలసాని పర్యవేక్షణ.. ఈ నెల 21న అధికారికంగా నిర్వహించనున్న సదర్ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవాలను నిర్వహించనున్న నారాయణగూడ వైఎంసీఏ ప్రాంతాన్ని పరిశీలించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు చెందిన యాదవులు ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా పాటలు, కళా ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 21వ తేదీ రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సదర్ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. షెహన్షా ప్రత్యేకతలు పేరు: షెహన్షా వయస్సు: నాలుగున్నర ఏళ్లు (2013లో జన్మించింది) బరువు: 1,500 కిలోలు మార్కెట్ ధర: సుమారు రూ.25 కోట్లు షెహన్షా యజమాని: అహ్మద్ ఆలంఖాన్, సత్తర్బాగ్ డెయిరీఫామ్ ఆహారం: ఉదయం, సాయంత్రం 20 లీటర్ల చొప్పున పాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాదం, కాజు, పిస్తా, కర్జూరా వంటి 5 కిలోల మిశ్రమ డ్రైఫ్రూట్స్ ప్రతిరోజు 100 యాపిల్స్, ఒక కిలో నల్లబెల్లం ఇవికాకుండా దాణా, సరిపడా నీళ్లు రోజుకు మూడుసార్లు స్నానం, మూడుసార్లు ఆవనూనెతో మర్దన ఆకట్టుకోనున్న షెహన్షా... ఈ సారి సదర్ ఉత్సవాల్లో హైదరాబాద్‌కు చెందిన ‘షెహన్షా’కనువిందు చేయనుంది. రెండు, మూడేళ్లుగా హర్యానాకు చెందిన జాతీయస్థాయిలో విశేష గుర్తింపును పొందిన దున్నపోతు ‘యువరాజు’ను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కూడా హర్యానాకు చెందిన యువరాజుకే పుట్టిన ‘ధారా,’మరో దున్న ‘రాజు’తో పాటు రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ‘మహరాజ్’ను కూడా ప్రదర్శిస్తారు. అలాగే ‘షెహన్షా’సైతం హర్యానాకు చెందిన మరో దున్న ‘రుస్తుం’సంతతేనని అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ తెలిపారు. సోమవారం ముషీరాబాద్‌లోని సత్తర్‌బాగ్‌లో ఈ దున్నను ప్రదర్శించారు. ‘‘ప్రతి సంవత్సరం హర్యానా, పంజాబ్‌ల నుంచి దున్నలను తెప్పించేవాళ్లం. కానీ మొట్టమొదటిసారి హైదరాబాద్‌కే చెందిన ముర్రా జాతి దున్న షెహన్షా ఈ సారి ప్రదర్శనలో పాల్గొనబోతోంది’’అని చెప్పారు హరిబాబు. -
సదరోత్సాహం...
-
ఉత్సాహంగా సదర్
రాజేంద్రనగర్: ప్రేమావతిపేట శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంఘ సలహాదారులు మల్లేష్ యాదవ్, విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో యాదవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దున్నపోతులను అందంగా ముస్తాబు చేసి ఊరేగించారు. వీటి విన్యాసాలు ఆకట్టుకున్నాయి. విన్యాసాలలో ప్రతిభ చూపిన దున్న పోతుల యజమానులకు లక్ష్మణ్ బహుమతులను అందజేశారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని వివిధ ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాలమూరు జానపద కళాకారులు ఆటాపాట ఆకట్టుకున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, అనంతయ్య యాదవ్, నర్సింగ్ యాదవ్, బండి ప్రతాప్‌రెడ్డి, శ్రీధర్, మల్లారెడ్డి, కొమరయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు హైదరాబాద్‌లో సదర్ సందడి
-
సదర్ ఉత్సవాల్లో అపశ్రుతి
= దున్నపోతు దాడి.. యువకుడి మృతి సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సదర్ ఉత్సవాల్లో సోమవారం రాత్రి అపశ్రుతి దొర్లింది. ఊరేగింపు కోసం ఉంచిన దున్నపోతు వీరంగం సృష్టించడంతో ఒక యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మారేడుపల్లి, తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ సరిహద్దుల మధ్య జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. మారేడుపల్లికి చెందిన యాదవసంఘం ప్రతినిధి వెంకటేష్‌యాదవ్ ఆధ్వర్యంలో దున్నపోతులతో కూడిన సదర్ ర్యాలీ సోమవారం రాత్రి ఈస్ట్ మారేడుపల్లి నుంచి ప్రారంభమైంది. బాణసంచా పేళుల్లు, డప్పుచప్పుళ్లు, యువకుల నృత్యాల మధ్య షేనాయ్ నర్సింగ్ హోం సమీపంలోని ముత్యాలమ్మ దేవాలయం వద్దకు చేరింది. అక్కడ కాసేపు ర్యాలీని నిలిపి దున్నపోతులను ఆడించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో రెచ్చిపోయిన దున్నపోతు వీరంగం సృష్టించింది. ప్రజల మీదకు ఉరికింది. ఈ ఘటనలో ఈస్ట్మారేడుపల్లికి చెందిన ముత్యాలు యాదవ్ కుమారుడు అశోక్‌యాదవ్ (35) కడుపులోకి దున్నపోతు కొమ్ములు దూసుకెళ్లడంతో తీవ్రగాయాలయ్యాయి. ఉత్సవ నిర్వాహకులు బాధితుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు గాంధీ వైద్యులు ధృవీకరించారు. సంఘటనలో మరో ఇద్దరు యువకులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. అటు తుకారాంగేట్ పోలీసులు, ఇటు మారేడుపల్లి పోలీసులు ‘పరిధి’ల గొడవతో ఘటన జరిగిన రెండు గంటల వరకు సంఘటన స్థలానికి రాలేదు.